మరింత తగ్గిన రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యించిన దానిలో 9 శాతానికి తగ్గిపోయింది. 2013–15లో 31,793 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌సీఎం) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. అందులో 16% ఉత్పత్తి చేసినట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటుకు తెలిపారు. ఈ ఏడాది(2016–17)లో 29,317 ఎంఎస్‌సీఎం ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. కేవలం 2,642 ఎంఎస్‌సీఎం మాత్రమే ఉత్పత్తయింది.
దీంతో దాదాపు 2.75 బిలియన్ డాలర్ల మేర వ్యయాల రికవరీని ప్రభుత్వం అనుమతించలేదని ప్రధాన్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకి 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేసినప్పటికీ .. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక అమల్లో విఫలమైందని ప్రధాన్ చెప్పారు.