రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార కార్యకలాపాల‍్నీ దేశ విదేశాలకు విస్తరిస్తున్నారు. ఇటీవల లండన్ స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను కొనుగోలు చేసిన ఆయన తాజాగా అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రముఖ ఐకానిక్ లగ్జరీ హోటల్ 'మాండరీయన్ ఓరియంటల్'ను కొనుగోలు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
దక్షిణాసియా దేశాల్లోనే అపరకుబేరుల జాబితాల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ నగరంలోని 80 కొలంబస్ సర్కిల్ ప్రాంతంలో కేపిటల్ ఆఫ్ కొలంబస్ సెంటర్ కార‍్పొరేషన్‌కు చెందిన ఐకానిక్ లగ్జరీ హోటల్ మాండరీయన్ ఓరియంటల్ 73.37శాతం స్టేక్‌తో 98.15మిలియన్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ భారీ మొత్తాన్ని విలాసవంతమైన హోటల్‌లో పరోక్షంగా వాటాను కలిగి ఉన్న కేమాన్ ఐలాండ్స్ షేర్ ను కొనుగోలు చేయడంతో.. హోటల్ ముఖేష్ అంబానీ సొంతమైంది.
హోటల్ ప్రత్యేకతలు
2003లో స్థాపించిన మాండరిన్ ఓరియంటల్ 80 కొలంబస్ సర్కిల్‌లో ఉన్న ఐకానిక్ లగ్జరీ హోటల్. ఇది నేచురల్ సెంట్రల్ పార్క్, కొలంబస్ సర్కిల్‌కు నేరుగా ఆనుకుని ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలో ప్రసిద్దికెక్కిన హోటల్స్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అందుకుగాను ఆ హోటల్‌కు ఏఏఏ ఫైవ్ డైమ్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్ స్టార్ హోటల్, ఫోర్బ్స్ ఫైవ్‌స్టార్ స్పా అవార్డ్‌లను గెలుచుంది. కాగా ఈ హోటల్ 2018లో ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8,54,19,12,500.00, 2019లో రూ.8,39,33,57,500.00, 2020లో రూ.1,11,41,62,500.00 ఆదాయాల్ని గడించింది. ఇప్పుడు ఇదే హోటల్ ఎక్కువ వాటాను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయడంతో రిలయన్స్ ఆస్తులు రెట్టింపు అయినట్లు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి.
మొన్నిటిక మొన్న స్టోక్ పార్క్ ఎస్టేట్
రిలయన్స్ సంస్థ ఇప్పటికే ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్), ముంబైలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్, హోటల్, ఇళ్లను భారీ ఎత్తున కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం లండన్ బకింగ్ హామ్ స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లను వెచ్చించింది. కాగా, ఈ స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను హెరిటేజ్ ప్రాపర్టీకింద వినియోగిస్తున్నట్లు రిలయన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment