
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మగవాళ్ల దుస్తుల బ్రాండ్, జాన్ ప్లేయర్స్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. డీల్‌లో భాగంగా ట్రేడ్‌మార్క్, మేధోపరమైన హక్కులనూ రిలయన్స్ రిటైల్‌కు బదిలీ చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా జాన్ ప్లేయర్స్‌ను బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించామని ఐటీసీ తెలిపింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ రూ.150 కోట్ల మేర ఉండొచ్చని సమాచారం.
ఈ బ్రాండ్ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్, ఈ సంస్థ ఆన్‌లైన్‌ప్లాట్‌ఫామ్, అజియోడాట్‌కామ్‌లు మరింత పటిష్టమవుతాయని నిపుణుల అంచనా. 2002లో ఆరంభమైన జాన్ ప్లేయర్స్ బ్రాండ్...యూత్ ఫ్యాషన్ అప్పారెల్ బ్రాండ్‌గా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం 557గా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ స్టోర్స్‌ను ఐదేళ్లలో 2,500కు పెంచాలని రిలయన్స్ రిటైల్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment