retail
-
రిటైల్‌లోకి డి బీర్స్
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారంలో ఉన్న దిగ్గజ సంస్థ డి బీర్స్ భారత్‌లో రిటైల్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ ఏడాది 15 ఫరెవర్‌మార్క్ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు బుధవారం తెలిపింది. 2030 నాటికి 100 రిటైల్ స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నామని డి బీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి వెల్లడించారు. ‘తద్వారా ఆ సమయానికి ఒక మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫరెవర్‌మార్క్ జ్యువెలరీ బ్రాండ్ ద్వారా రిటైల్‌లో పెట్టుబడి పెడుతున్నాం. ఈ ఏడాది ఢిల్లీలో ఎనిమిది, ముంబైలో 15 స్టోర్లను ప్రారంభిస్తాం. జూన్–జూలైలో తొలి కేంద్రం రానుంది. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి సొంతంగా, లేదా ఫ్రాంఛైజీ విధానంలో ప్రత్యేక స్టోర్ల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెడతాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రాభరణాల మార్కెట్‌గా భారత్ నిలిచింది. ఈ పరిశ్రమ ఇక్కడ 10 శాతం మాత్రమే వ్యాప్తి చెందింది.విస్తరణకు భారీ అవకాశం ఉంది’ అని తెలిపారు. డైమండ్ వెరిఫికేషన్ టెక్నాలజీతో కూడిన చిన్న పరికరాన్ని కంపెనీ విడుదల చేసిందని, దీనిని భారత్‌లో వాణిజ్యీకరిస్తామని చెప్పారు. వజ్రం సహజమైనదా లేదా కృత్రిమమైనదా అని ఈ పరికరం గుర్తిస్తుందని వివరించారు. సింథటిక్ డైమండ్స్ వల్ల సహజ వజ్రాల పరిశ్రమకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రెండింటినీ వేరు చేయడానికి నాణ్యత ధృవీకరణ అవసరం ఉందని చెప్పారు. -
మంచు పులులు
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి పరీక్ష పెట్టే వాతావరణంకాని తప్పని బతుకుపోరు...కశ్మీర్లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.శ్రీనగర్‌లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్‌లో జీవించే వారికి హౌస్బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.8 నుంచి 13 గంటలు...కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్‌లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు. ‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.టార్పాలిన్ కట్టకూడదు!దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి. ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్‌లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? -
హైదరాబాద్‌లో రిటైల్ స్పేస్‌కు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ మాల్స్, ప్రముఖ హై స్ట్రీట్లలో రిటైల్ స్థలం లీజుకు ఇవ్వడం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 5 శాతం పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో టాప్–8 నగరాల్లోని గ్రేడ్–ఏ మాల్స్, ప్రధాన హై స్ట్రీట్లలో లీజుకు తీసుకున్న రిటైల్ స్థలం 5.53 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నమోదైంది.ఈ నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. హై స్ట్రీట్లలో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం గతేడాదితో పోలిస్తే 3.44 మిలియన్ చదరపు అడుగుల నుండి 3.82 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. మరోవైపు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.72 మిలియన్ చదరపు అడుగులకు వచ్చి చేరింది.హైదరాబాద్‌లోని ప్రముఖ హై–స్ట్రీట్ కేంద్రాలు రిటైల్ స్థలానికి బలమైన డిమాండ్‌ను నమోదు చేశాయి. ఈ నగరంలో వివిధ బ్రాండ్లు 2024 జనవరి–సెప్టెంబర్ కాలంలో 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 1.60 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఈ వృద్ధి రిటైల్ రంగం బలంగా పుంజుకోవడం, నూతన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి తదనంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారు ప్రవర్తనతో, ఆకర్షణీయ, అనుభవపూర్వక స్థలాలకు స్పష్టమైన డిమాండ్ ఉందని నివేదిక వివరించింది.ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్..ప్రధాన నగరాల్లో మాల్ లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా పెరగడం రిటైల్ రంగం యొక్క బలమైన పునరుద్ధరణ, విస్తరణను నొక్కి చెబుతోందని లులు మాల్స్ తెలిపింది. ఈ సానుకూల ధోరణి రిటైల్ భాగస్వాముల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే ప్రపంచ–స్థాయి రిటైల్ అనుభవాలను సృష్టించే తమ కంపెనీ దృష్టికి అనుగుణంగా ఉంటుందని వివరించింది.మాల్స్, ప్రధాన వీధుల్లో బలమైన లీజింగ్ కారణంగా భారత రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, రిటైల్–ఇండియా హెడ్ సౌరభ్ షట్డాల్ తెలిపారు. విచక్షణతో కూడిన వ్యయాలు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత.. వెరశి ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. ‘భారత్ మరింత ఎక్కువ లావాదేవీల పరిమణాలను చవిచూడాలంటే ప్రధాన నగరాల్లో నాణ్యమైన రిటైల్ స్పేస్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇది తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ప్రపంచ రిటైలర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది’ అని అన్నారు. -
రిఫైనింగ్ మార్జిన్లు పెరిగినా.. రిటైల్‌పై అనిశ్చితి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పిరిలయన్స్లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం. -
నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్‌నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. -
రిలయన్స్‌కు జియో దన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్‌లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి. రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. టెలికం జోరుఈ ఏడాది క్యూ2లో ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్‌చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్‌ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఆవిర్భవించింది. సబ్్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది. రిటైల్ ఓకేరిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.డైవర్సిఫైడ్ బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ -
రిటైల్ షాపింగ్ మాల్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో 2024–27 మధ్య కాలంలో 18 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ రిటైల్ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం (స్పేస్/వసతి) అందుబాటులోకి వస్తుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ అంచనా వేసింది. ఈ కాలంలో తాజా డిమాండ్‌లో ఇది మూడింట ఒక వంతుగా తెలిపింది. భారత్‌లో తలసరి రిటైల్ స్పేస్ ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయిల్యాండ్, వియత్నాం తదితర దక్షిణాసియా దేశాల కంటే తక్కువగా ఉందని.. రిటైల్ స్పేస్ భారీ వృద్ధి అవకాశాలను ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం టాప్–8 పట్టణాల్లో రిటైల్ స్పేస్ 60 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు తెలిపింది. అంటే 2027 నాటికి మొత్తం రిటైల్ మాల్స్ విస్తీర్ణం 78 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోన్నట్టు అంచనా వేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కొత్తగా ఒక్క మాల్ కూడా నిర్వహణలోకి రాలేదని తెలిపింది. భారత్ మాదిరే తలసరి ఆదాయం కలిగిన ఇండోనేíÙయాతో పోల్చి చూస్తే.. 2027 నాటికి తలసరి రిటైల్ స్పేస్ 1.0కు చేరుకునేందుకు గాను భారత్‌లో 55 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర అదనంగా రిటైల్ మాల్స్ నిరి్మంచాల్సిన అవసరం ఉంటుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. సరఫరా పెరిగేలా చర్యలు అవసరం.. ‘‘భారత రిటైల్ రంగం కీలక దశలో ఉంది. వినియోగదారుల విశ్వాసం, విచక్షణారహిత వినియోగం పెరుగుతుండడం ఈ రంగం సామర్థ్యాలను తెలియజేస్తోంది. ఈ వృద్ధి అవకాశాలను సది్వనియోగం చేసుకునేందుకు సరఫరా వైపు సవాళ్లను పరిష్కరించడం ఎంతో అవసరం. నాణ్యమైన రిటైల్ వసతులు లభించేలా చర్యలు తీసుకోవాలి. చురుకైన భారత రిటైల్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు 55 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ వసతి అదనంగా అవసరం. ఈ దిశగా స్థిరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు పరిశ్రమ భాగస్వాముల సమిష్టి కృషి అవసరం. తద్వారా భారత రిటైల్ రంగం పూర్తి సామర్థ్యాలను అందుకోగలుగుతుంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ సౌరభ్ శట్దాల్ వివరించారు. గురుగ్రామ్ తదితర పట్టణాల్లో నాణ్యమైన రిటైల్ మాల్ వసతులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నట్టు సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ సైతం తెలిపారు. మెరుగైన షాపింగ్, వినోదం అన్నింటినీ ఒకే చోట వినియోగదారులు కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రీమియం షాపింగ్ డిమాండ్ ప్రస్తుత సరఫరా మించి ఉన్నట్టు ఎలారా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వినీత్ దావర్ తెలిపారు. టైర్–2, 3 నగరాల్లో మాల్స్ విస్తరణ వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. -
రిటైల్ డిజిటల్ చెల్లింపులు: 2030 నాటికి రూ.584 లక్షల కోట్లు!
భారతదేశంలో డిజిటల్ ట్రాన్సక్షన్స్ వేగంగా సాగుతోంది. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి డిజిటల్ రిటైల్ చెల్లింపులు ఏకంగా 7 ట్రిలియన్ డాలర్లు లేదా రూ. 584.6 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని.. 'హౌ అర్బన్ ఇండియా పేస్' నివేదికలో వెల్లడించింది.డిజిటల్ పెరుగుదలకు ప్రధాన కారణం ఈ కామర్స్ రంగం అని తెలుస్తోంది. 2022లో ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీల వాల్యూమ్లలో భారతదేశం 46 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. కార్డ్‌లు, డిజిటల్ వాలెట్లు డిజిటల్ లావాదేవీ విలువలో 10 శాతం మాత్రమే.దేశంలోని 120 ప్రధాన నగరాల్లోని 6000 మంది ఆన్లైన్ సర్వేలో 90 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఇష్టపడుతున్నారు. సంపన్న కస్టమర్లు తమ లావాదేవీలలో 80 శాతం వరకు డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారు. మిలినీయర్లలో 72 శాతం మంది డిజిటల్ లావాదేవీలను ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.సుమారు 1000 మంది భారతీయ వ్యాపారుల లావాదేవీల వాల్యూమ్లలో 69 శాతం డిజిటల్ చెల్లింపు విధానాలు ఉన్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరానా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. ఇలా మొత్తం మీద రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఉద్యోగాలు పెరిగే రంగాలివే..జీఐ గ్రూప్ నివేదిక
రిటైల్, ఈ-కామర్స్ రంగంలో సమీప భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు రాబోతున్నాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో ఫ్రెషర్లు, అనుభవజ్ఞులు పెద్దమొత్తంలో అవసరమవుతారని రిపోర్ట్ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో రిటైల్ రంగంలో 8శాతం ఉద్యోగులు పెరిగారని నివేదించింది. 87శాతం 18-30 ఏళ్ల వయసు ఉన్నవారే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారని చెప్పింది.నివేదికలోని వివరాల ప్రకారం..ఈకామర్స్, రిటైల్ రంగాలు భారీగా అభివృద్ధి చెందుతున్నాయి. వస్తువులు, ఇతర సేవల డెలివరీని అందించే లాజిస్టిక్స్ రంగం దూసుకుపోతోంది. టైర్ 1 నగరాల్లోని చాలామంది కస్టమర్లు ఈకామర్స్, రిటైల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఆయా రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. 52% రిటైలర్లు ఈ ఏడాది ఫ్రెషర్లను నియమించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 42% ఈ-కామర్స్ కంపెనీలు అనుభవజ్ఞులైన నిపుణుల కోసం చూస్తున్నాయి. 30% రిటైలర్లు మహిళా అభ్యర్థులను ఎంచుకుంటున్నారు. 2024 ప్రారంభంలో లాజిస్టిక్స్ రంగలో 10.2% ఉద్యోగాలు పెరిగాయి.ఇదీ చదవండి: స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థజీఐ గ్రూప్ హోల్డింగ్ ఇండియా కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా మాట్లాడుతూ..‘భారత్ ఆర్థిక వృద్ధిలో రిటైల్, ఈకామర్స్ రంగాల వాటా పెరిగింది. ఏటా భారత్ వర్క్‌ఫోర్స్‌లో చేరే దాదాపు 20 మిలియన్ల యువతలో అధికంగా రిటైల్, ఈకామర్స్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. సప్లై చైన్ కార్యకలాపాలను నిర్వహించడంలో అర్హత కలిగిన అనుభవజ్ఞులకు డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలు నిర్దిష్ట ఉద్యోగస్థానాల కోసం మహిళలనే నియమించుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రాణించాలంటే మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా అవసరం. ఈ-కామర్స్ వ్యాపారం డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, కస్టమర్ ఎంగేజ్మెంట్ వంటి అంశాలపై ఆధారపడుతోంది. వీటిపై నైపుణ్యాలు కలిగిఉన్నవారికి సులువుగా కొలువు దొరుకుతోంది’ అని చెప్పారు. -
భారత్‌లో ఐకియా విస్తరణ.. కొత్త స్టోర్ నిర్మాణం.. ఎక్కడంటే..
భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని స్వీడన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఐకియా యోచిస్తోంది. తాజాగా ఇండియాలో పెట్టుబడులు పెంచాలని భావిస్తోంది. పదేళ్ల క్రితం భారత్‌లో వ్యాపారం ప్రారంభించిన సమయంలో ప్రకటించిన రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఐకియా ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ పేర్కొన్నారు. 2018 ఆగస్టులో కంపెనీ హైదరాబాద్‌లో మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దిల్లీ-ఎన్సీఆర్లో కొత్త స్టోర్ నిర్మాణంలో ఉండగా, 2025లో దీన్ని ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ మాట్లాడుతూ.. ఎన్సీఆర్తో కలిపి రూ.10,500 కోట్ల పెట్టుబడులు పూర్తవుతాయన్నారు. భారత్‌లో ఐకియా విస్తరణ కోసం మరిన్ని నిధులు వెచ్చించనున్నామని చెప్పారు. అమ్మకాలను మరింత పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. సరైన సమయంలో ఏమేరకు నిధులు పెట్టుబడి పెట్టనున్నామో ప్రకటిస్తామన్నారు. ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత.. 2013లో 10 ఏళ్లలో 10 స్టోర్లు ఏర్పాటు చేసేందుకు ఐకియా రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, బెంగళూరుల్లో కంపెనీ స్టోర్లు ఉన్నాయి. గురుగ్రామ్, నోయిడాల్లో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. -
రూ.800 కోట్ల అమ్మకాలే లక్ష్యం.. బ్యాగ్‌జోన్ ప్రణాళికలు ఇలా..
BRAND SUTRA: ప్రముఖ సంస్థ లావి ప్యారెంట్ బ్రాండ్ 'బ్యాగ్‌జోన్' (Bagzone) మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారంగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ సీఈఓ 'ఆయుష్ తైన్వాలా' వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్రాండ్ ఇటీవల వాచ్‌ల విభాగంలోకి కూడా ప్రవేశించింది. ఈ సంస్థ 2023 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ. 500 కోట్ల అమ్మకాలను సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని, రానున్న రోజుల్లో కంపెనీ రూ. 800 కోట్లకు చేరటానికి సన్నద్ధమవుతోందని తెలిపాడు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 10 రెట్లు వృద్ధి సాధించడానికి.. మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సంస్థ 300 బ్రాండ్ అవుట్లెట్లను ప్రారంభించడం ద్వారా 70 శాతం స్థానిక సోర్సింగ్ లక్ష్యాన్ని సాధించడం, ఆఫ్‌లైన్ విధానం పెంచడానికి ఆలోచిస్తోంది. అనుకున్న విధంగా అన్ని సజావుగా జరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. నిధుల ప్రకటన సమయంలో, కంపెనీ తయారీ సామర్థ్యాలను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఇగత్పురి జిల్లాలోని నాసిక్ వెలుపల, ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీకి సమీపంలో రెండవ ఫ్యాక్టరీని నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభమవుతుందని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 5 లక్షలకు పెరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు నాసిక్ ప్లాంట్‌లో నెలకు సుమారుగా 2 లక్షల బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నట్లు తైన్వాలా తెలిపారు. కంపెనీ హ్యాండ్‌బ్యాగ్‌లు, స్లింగ్ బ్యాగ్‌లు, టోట్ బ్యాగ్‌లు, మహిళల పర్సులు, ల్యాప్‌టాప్ హ్యాండ్‌బ్యాగ్‌లు, ఫ్యాషన్ బ్యాక్‌ప్యాక్‌లు, బాక్స్ బ్యాగ్‌లు వంటివి తయారు చేస్తోంది. కంపెనీ 2020లో తన బ్రాండ్ ఎక్స్టెన్షన్ లావి స్పోర్ట్ కింద యునిసెక్స్ బ్యాక్‌ప్యాక్‌లను ప్రారంభించింది. ఇప్పుడు డఫిల్ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేస్‌లు, వాలెట్లు, స్లింగ్ల వంటి యాక్సెసరీస్ కూడా తయారు చేస్తుంది. కాగా ఏడాది ప్రారంభంలో రీజనబుల్ ధరల వద్ద బ్రాండ్ బ్యాగులను అందించడానికి లావి లక్స్‌ను సృష్టించింది. వీటి ధర రూ. 3000 నుంచి రూ. 7000 మధ్య ఉంటుంది. మహిళల వాచ్‌ల ధరలు రూ. 5999 నుంచి ఉన్నాయి. బ్రాండ్ వాచ్‌లు లావి అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న లావి రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఈ ఉత్పత్తుల మీద ఏకంగా ఒక సంవత్సరం వారంటీ కూడా అందిస్తోంది. సర్వీస్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కంపెనీ రిటైల్ విస్తరణకు కూడా ప్రణాళికలు ఉన్నాయని, దక్షిణాదిలో రిటైల్ ఉనికిని పెంచడానికి దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయుష్ తైన్వాలా తెలిపాడు. ఇందులో మెట్రో నగరాలు, చిన్న నగరాలు వంటి వాటితో పాటు టైర్ 1 నగరాల్లో బ్రాండ్ విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. టైర్ 2, టైర్ 3 నగరాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. టైర్ 1 నగరాలే ప్రధానమని తైన్వాలా వెల్లడిస్తూ.. పశ్చిమ దేశాలలో మా ఉనికి బలంగా ఉందని, దక్షిణాదిలో కొంచెం బలహీనంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ నగరాలను వృద్ధి చేసుకోవాలంటే రిటైల్ స్టోర్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆలోచనను వ్యక్తం చేశారు. మొత్తం విక్రయాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో సాగుతున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు, అయితే ఆన్లైన్ కొనుగోలు కోసం 'లావీవరల్డ్.కమ్'లో మాత్రమే కాకుండా అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటివాటిని ఉపయోగించుకోవచ్చు. -
జీఆర్టీ జ్యువెలర్స్‌కి ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ఎఫ్‌యూఆర్‌ఏ(ఫురా) రిటైల్ జ్యువెలర్ ఇండియా అవార్డ్స్ 2023 కార్యక్రమంలో ‘‘బ్రైడల్ స్టేట్మెంట్ జ్యువెలరీ ఆఫ్ ది ఇయర్’’ అవార్డు సొంతం చేసుకుంది. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, సాలిటైర్ జెమోలాజికల్ లేబరేటరీస్ సహకారంతో 18 ఎడిషన్ అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. అద్భుతమైన డిజైన్లు మాత్రమే కాకుండా భావోద్వేగాలు ప్రతిఫలించేలా ఆభరణాలను రూపొందించడంలో నిబద్ధతను ఈ అవార్డు ప్రనరుద్ఘటిస్తోందని సంస్థ ఎండీ శ్రీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. భారతీ సంస్కృతిలో వివాహాల వైభవం, ప్రాముఖ్యతను తెలియజేసే కళాఖండాలను తీర్చిదిద్దడంలో జీఆర్టీ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శిస్తుందని మరో ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
మాల్స్ అదుర్స్.. పుంజుకుంటున్న రిటైల్ రంగం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రభావం రిటైల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో షాపింగ్ మాల్స్ విలవిల్లాడిపోయాయి. ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి చూశాక ఇక ఆఫ్లైన్లోని రిటైల్ రంగం కోలుకోవడం కష్టమేమో అనిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం నుంచి షాపింగ్ మాల్స్ శరవేగంగా కోలుకున్నాయి. మాల్స్‌లోని రిటైల్ దుకాణాలలో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్‌లలో వీక్షకుల తాకిడి పెరగడంతో మాల్స్ నిర్వాహకులలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ►షాపింగ్ మాల్స్, హైస్ట్రీట్లలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో రిటైల్ లీజులు 137 శాతం పెరిగాయని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. అయితే రిటైల్ మార్కెట్ పరిమాణం ఇంకా పెరగాల్సి ఉందని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రిటైల్ రంగం చాలా వెనకబడి ఉంది. ►ఫ్యాషన్, హోమ్‌వేర్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ వంటి రిటైలర్ల డిమాండ్‌ను బట్టి షాపింగ్ మాల్స్‌లో లీజు లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో రిౖ టెల్ లీజులు 17–28 శాతం మేర పెరిగి 55–60 లక్షల చ.అ.లకు చేరుతుందని అంచనా వేసింది. 20 19లో అత్యధికంగా 68 లక్షల చ.అ. లీజు లావాదేవీ లు జరిగాయి. 2021లో 39 లక్షలు, 2022లో 47 లక్షల చ.అ. రిటైల్ లీజు కార్యకలాపాలు పూర్తయ్యాయి. ►హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. డిమాండ్ ఉన్న ప్రాంతాలలో నిర్మాణం పూర్తికాకముందే లీజులు జరుగుతున్నాయి. గత ఏడాది డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటంతో పూర్తయ్యే దశకు చేరినా లీజు లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయితే ఈ ఏడాది కొంత సానుకూల వాతావరణం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నగరంలో 2.5 లక్షల చ.అ. రిటైల్ స్థల లీజు లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం లక్ష చ.అ. స్థలం మాత్రమే లీజుకు పోయింది. రిటైల్ లీజులలో స్టోర్ల వాటా 33 శాతం ఉండగా.. ఫ్యాషన్, అపరెల్స్ షో రూమ్‌ల వాటా 30 శాతం, ఫుడ్ కోర్టుల వాటా 11 శాతంగా ఉంది. -
రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇందుకుగాను కేకేఆర్‌కు 1,71,58,752 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ వాటా 1.17 శాతం నుంచి 1.42 శాతానికి బలపడింది. ఈ నెల మొదట్లో అనుబంధ రిటైల్ సంస్థలో కేకేఆర్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొన్న సంగతి తెలిసిందే. 1976లో ఏర్పాటైన కేకేఆర్ 2023 జూన్‌కల్లా 519 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఈ నెల మొదట్లోనే ఆర్ఐఎల్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి రూ. 8,278 కోట్ల పెట్టుబడులను అందుకుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 1 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక 2020లో వివిధ గ్లోబల్ పీఈ సంస్థలకు 10.09 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 47,265 కోట్లను సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ విషయం! -
ఏటీఎఫ్ రేటు 14 శాతం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు వరుసగా మూడోసారి పెంచాయి. కంపెనీలు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు ఏకంగా 14 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 13,911 మేర పెరిగి రూ. 1,12,419కి చేరింది. స్థానిక పన్నులను బట్టి ఈ రేటు ఒకో రాష్ట్రంలో ఒకో రకంగా ఉంటుంది. చమురు కంపెనీలు జులై 1న 1.65 శాతం, ఆగస్టు 1న 8.5 శాతం మేర ధరను పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం మీద ఏటీఎఫ్ రేట్లు ఈ మధ్య కాలంలో కిలోలీటరుకు రూ. 23,116 మేర పెరిగినట్లయింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండరు ధర రూ. 157.50 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండరు రేటు ఢిల్లీలో రూ. 1,522.50కి పరిమితమవుతుంది. ఆగస్టు 1నే కమర్షియల్ ఎల్పీజీ సిలిండరు రేటు రూ. 100 మేర తగ్గింది. చమురు కంపెనీలు వరుసగా 17వ నెల కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లలేదు. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతి నెలా 1వ తేదీన, క్రితం నెల అంతర్జాతీయ రేట్ల సగటు ప్రకారం దేశీయంగా వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తాయి. అయితే, గతేడాది మే నుంచి వీటి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. -
పెరిగిన నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు నియామకాలు 23 శాతం పెరిగినట్టు క్వెస్‌కార్ప్ సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు ఈ మేరకు వృద్ధి నమోదైనట్టు నియామక సేవలు అందించే ఈ సంస్థ తెలిపింది. రిటైల్, టెలికం రంగాలు నియామకాల్లో ముందున్నాయి. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య మొత్తం 32,000 జాబ్లకు పోస్టింగ్‌లు పడినట్టు పేర్కొంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, టెలికం రంగాలు జోరును చూపించాయి. ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ నోటిఫికేషన్లు నమోదయ్యాయి. ‘‘పండుగల సీజన్‌కు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైరింగ్‌కు సానుకూల ధోరణి నెలకొంది. ద్రవ్యోల్బణం, లాభదాయకతపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో చెప్పుకోతగ్గ మేర నియామకాల్లో వృద్ధి నమోదైంది’’అని క్వెస్‌కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. రిటైల్ పరిశ్రమలో తాత్కాలిక కారి్మకులకు డిమాండ్ 9 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా క్వెస్ కార్ప్ ఈ వివరాలు వెల్లడించింది. -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్‌కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్‌లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్‌లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
ధర దడ
న్యూఢిల్లీ: ఆహార ధరలు ఇటు రిటైల్‌గానూ, అటు టోకుగానూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం జూలైకి సంబంధించి సోమవారం వెలువరించిన గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44%గా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4% వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6% అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్స్‌గా పరిగణించాల్సి ఉంటుంది. తాజా సమీక్షా నెలలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71% ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. 2022 ఏప్రిల్‌లో 7.79% రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆ స్థాయికి మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఫుడ్ బాస్కెట్ 11.51 శాతం అప్ వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51 %గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55 శాతం. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలైలో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13% పెరిగినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది. టోకు సూచీ మైనస్ 1.36 శాతం... టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో వరుసగా నాల్గవనెల మైనస్‌లోనే కొనసాగింది. టోకు సూచీ బాస్కెట్ మొత్తంగా చూస్తే జూలై ధరలు అసలు పెరగకపోగా మైనస్ 1.36 శాతంగా నమోదయ్యింది. ఈ ధోరణిని ప్రతి ద్రవ్యోల్బణంగా పరిగణిస్తారు. కాగా, సూచీలో కీలక విభాగమైన ఫుడ్ బాస్కెట్లో ధరల స్పీడ్ మాత్రం ఏకంగా 14.25% ఎగసింది (గత ఏడాది జూలై ధరలతో పోలి్చ). ఒక్క కూరగాయల ధరలు భారీగా 62.12% ఎగశాయి. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల ధరలు వరుసగా 8.31%, 9.59% చొప్పున పెరిగాయి. ఇక మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, కెమికల్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, జౌళి ధరలు మాత్రం తగ్గాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదే ధోరణిలో ఆహార ధరలు పెరిగితే, టోకున ధరలు ప్రతి ద్రవ్యోల్బణం నుంచి ద్రవ్యోల్బణం బాటకు మారతాయని కేర్ఎడ్జ్ చీఫ్ ఎకనమిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు. -
మూడోసారీ మార్పులేదు
ముంబై: ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఆహార ధరలు పెరుగుతుంటే దీని కట్టడికి అవసరమైతే రేటు పెంపే ఉంటుందని ఉద్ఘాటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రితం 5.1 శాతం అంచనాలను 5.4 శాతానికి పెంచుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో సమావేశమైన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత 6.5 శాతంగానే కొనసాగించాలని మూడురోజులపాటు సమావేశమైన కమిటీ నిర్ణయించింది. మంగళ, బుధ, గురు వారాల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ గడచిన మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు.. వృద్ధి ధోరణి: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. ద్రవ్యోల్బణం దాదాపు 6% లోపే: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2%. కొత్త ఉత్పత్తులతో ఊరట: భారీగా ధర పెరుగుతున్న టమాటా సహా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో సమీప భవిష్యత్తులో ధరల తీవ్రత ఒత్తిడి ఉంటుంది. అయితే కొత్త పంట వస్తుండడంతో కూరగాయల ధరలు తగ్గవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల చెల్లింపుల పెంపు లక్ష్యం: యూపీఐ చెల్లింపుల్లో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించే అంశాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది. యూపీఐ–లైట్లో ఆఫ్‌లైన్ చెల్లింపులలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీ వినియోగాన్ని ప్రస్తావించింది. అలాగే యూపీఐ లైట్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితిని రూ. 200 నుండి రూ. 500కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇందుకు సంబంధించి రూ.2,000 రోజూవారీ పరిమితిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయా ఇన్స్ట్రుమెంట్ల వినియోగం, ధ్రువీకరణల విషయంలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోకుండా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. సీఆర్ఆర్లో లేని మార్పు: బ్యాంక్ మొత్తం డిపాజిట్లో లిక్విడ్ క్యాష్ రూపంలో ఆ బ్యాంక్ నిర్వహించాల్సిన నగదుకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను యథాతథంగా 4.5% వద్ద కొనసాగింపు. దీనివల్ల ప్రస్తుత బ్యాంకింగ్ ద్రవ్య లభ్యత విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు. అధిక ద్రవ్య లభ్యతపై చర్యలు: రూ.2,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రావడం, ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి అందిన డివిడెండ్ వంటి చర్యల వల్ల వ్యవస్థలో ఏర్పడిన అధిక ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) తగినంత వరకూ వెనక్కు తీసుకో వడానికి చర్యలు కొనసాగుతాయి. పెరుగుతున్న ఎన్‌డీటీఎల్ (నెట్ డిమాండ్, టైమ్ లయబిలిటీ)పై గత మూడు నెలలుగా ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐ–సీఆర్ఆర్) 10 శాతానికి పెంపు. దీనివల్ల వ్యవస్థ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లు వెనక్కు మళ్లుతున్నట్లు అంచనా. ద్రవ్యోల్బణం కట్టడి చర్యలో ఇదొక కీలక చర్య. తదుపరి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4–6 మధ్య జరుగుతుంది. రుణ గ్రహీతలకు ఊరట ఫ్లోటింగ్ నుంచి ఫిక్సిడ్కు..! పెరుగుతున్న వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి ఊరట నిచ్చేందుకు ఆర్బీఐ పాలసీ సమీక్ష కీలక నిర్ణయం తీసుకుంది. గృహ, ఆటో ఇతర రుణాలు సంబంధించి రుణగ్రహీతలు ఫ్లోటింగ్ రేటు నుంచి ఫిక్సిడ్ రేట్ విధానానికి మారే వెసులుబాటును కలి్పంచనుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి స్థిర వడ్డీ రేటుకు మారడానికి అనుమతించే ఫ్రేమ్‌వర్క్‌ను త్వరలో ప్రకటించనుంది. ఈ విధానం కింద బ్యాంకులు... రుణ కాల వ్యవధి, ఈఎంఐల గురించి రుణ గ్రహీతకు తగిన వివరాలు అన్నింటినీ అందజేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆధారిత ఫ్లోటింగ్ వడ్డీ రుణాల వడ్డీ రేటు నిర్దేశంలో మరింత పారదర్శకత తీసుకునిరావడం, రుణగ్రహీతలు ఫిక్సిడ్ రేట్ రుణాలకు మారడం లేదా రుణాలను ముందుగానే చెల్లించడం వంటి పలు అంశాలు త్వరలో విడుదల కానున్న ఆర్బీఐ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండనున్నాయి. కాగా, రుణ జారీల విషయంలో బ్యాంకులు ‘‘మభ్యపెట్టే విధానాలను’’ విడనాడాలని, రుణ గ్రహీత వయస్సు, తిరిగి చెల్లింపుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన కాల వ్యవధిలో రుణం తీర్చగలిగేలా రుణాలు మంజూరు చేయాలని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఆయా విషయంలో మభ్యపెట్టే విధానాలు విడనాడి, రుణగ్రహీతకు పూర్తి పారదర్శక విధానాలను పాటించాలని సూచించారు. జాగరూకతతో నిర్ణయాలు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతూ వృద్ధి పటిష్టతకు దోహదపడే పాలసీ ఇది. ఆర్థిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు ఉన్నాయి. లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రుణ సామర్థ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవు. – దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ గృహ డిమాండ్‌కు ఢోకాలేదు ఆర్బీఐ యథాతథ రేటు విధానం వల్ల గృహ డిమాండ్‌కు తక్షణం వచ్చిన సమస్య ఏదీ లేదు. అయితే తదుపరి సమీక్షా సమావేశంలో రేటు కోత ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ విధానం కొనసాగినట్లు స్పష్టమవుతోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ త్వరలో..
న్యూఢిల్లీ: రిటైల్, టెలికం రంగాల్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆర్థిక రంగంలోనూ అదే తీరును కొనసాగించడంపై దృష్టి పెడుతోంది. త్వరలోనే జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్‌ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా సంస్థ పూర్తి విలువను, సామర్థ్యాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఇంధనాలపైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లడమనేది చరిత్రలోనే కీలక మైలురాయిగా నిలవగలదని అంబానీ తెలిపారు. అటు మరో అయిదేళ్ల పాటు అంబానీని సీఎండీగా కొనసాగించాలన్న ప్రత్యేక తీర్మానానికి షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని కంపెనీ కోరింది. ప్రస్తుతం 66 ఏళ్లున్న అంబానీ.. సంస్థ నిబంధనల ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ కావాలి. అంతకు మించిన కాలవ్యవధికి కొనసాగించదల్చుకుంటే దానికి ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. -
రూ.16,499కే జియో ల్యాప్‌టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తాజాగా దేశీయ మార్కెట్లో 4జీ సిమ్ ఆధారిత ల్యాప్‌టాప్ ‘జియోబుక్’ పరిచయం చేసింది. ధర రూ.16,499. బరువు 990 గ్రాములు. జియో ఓఎస్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2 గిగాహెట్జ్ ఆక్టా కోర్ చిప్సెట్, 4 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 11.6 అంగుళాల యాంటీ–గ్లేర్ హెచ్డీ డిస్ప్లే, ఇన్ఫినిటీ కీబోర్డ్, లార్జ్ మల్టీ గెస్చర్ ట్రాక్‌ప్యాడ్‌తో తయారైంది. హెచ్డీ వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్స్, వైర్లెస్ ప్రింటింగ్, ఇంటిగ్రేటెడ్ చాట్‌బాట్, స్క్రీన్ ఎక్స్టెన్షన్, ఇన్‌బిల్ట్ యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్ట్స్ వంటి హంగులు ఉన్నాయి. 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉందని కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 5 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు అమెజాన్‌లో లభిస్తుంది. -
రిటైల్ స్పేస్ లీజింగ్‌లో జోరు! హైదరాబాద్ వాటా..
ముంబై: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో మంచి పనితీరు చూపించింది. లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 24 శాతం పెరిగి 2.87 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో రిటైల్ లీజ్ పరిమాణం 2.31 చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధి 15 శాతంతో పోలి్చనా, ఈ ఏడాది ప్రథమార్ధంలో మంచి పురోగతి కనిపించింది. రిటైల్ స్పేస్ సరఫరా మాత్రం ఈ ఎనిమిది పట్టణాల్లో 148 శాతం పెరిగి 1.09 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సరఫరా 0.44 చదరపు అడుగులుగా ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సలి్టంగ్ కంపెనీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢీల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ కొత్త రిటైల్ లీజింగ్‌లో 65 శాతం వాటా ఆక్రమించాయి. 2023 జనవరి – జూన్ కాలంలో బెంగళూరు అత్యధికంగా 0.8 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ 0.7 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై, అహ్మదాబాద్ 0.4 చదరపు అడుగుల చొప్పున, ముంబై, హైదరాబాద్ మార్కెట్లు 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతా 0.06 చదరపు అడుగులు, పుణె 0.12 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేశాయి. డిమాండ్‌లో వృద్ధి షాపర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పట్టణాల్లో మాల్స్ నిర్మాణంలో 8 శాతం వృద్ధి కనిపించింది. రిటైల్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ల వాటా 59 శాతంగా ఉంది. విడిగా చూస్తే బెంగళూరు 35 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ మార్కెట్ 24 శాతం, చెన్నై 14 శాతం, హైదరాబాద్ మార్కెట్ వాటా 11 శాతం చొప్పున నమోదైంది. ఫ్యాషన్, వ్రస్తాల విభాగం నుంచి 38 శాతం, ఫుడ్, బెవరేజెస్ నుంచి 18 శాతం, లగ్జరీ, హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్ విభాగాల నుంచి 11 శాతం డిమాండ్ కనిపించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్ లీజులో 7 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఎనిమిది మార్కెట్లలో రిటైల్ లీజ్ పరిమాణంలో దేశీయ సంస్థల వాటా 75 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికాలకు సంబంధించి రిటైల్ లీజింగ్ ఆశావహంగా కనిపిస్తున్నట్టు సీబీఆర్ఈ సౌత్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. సెకండరీ లీజింగ్ మరింత జోరుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
మెరుగైన వ్యవసాయానికి కొత్త ఉత్పత్తులు - నర్చర్ రిటైల్
బెంగళూరు: బెంగళూరు కేంద్రంగా పనిచేసే బీటూబీ వ్యవసాయ ముడి సరుకుల ఈ–ప్లాట్‌ఫామ్ నర్చర్ పలు సస్యరక్షణ ఉత్పత్తులను విడుదల చేసింది. సంస్థ మొబైల్ యాప్ ద్వారానే వీటిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, బయో స్టిమ్యులంట్స్ను యూనిక్వాట్, టర్ఫ్, లాన్సర్, ఈల్డ్విన్, మంజేట్, అమెరెక్స్, రైస్బ్యాక్, ఇమిడిస్టార్, లంబ్డా స్టార్ పేర్లతో విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్లో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చింది. వీటిని యూపీఎల్ ఎస్ఏఎస్ సీఈవో ఆశిష్ దోబాల్ సమక్షంలో విడుదల చేసింది. దేశంలో వ్యవసాయ ముడి సరుకులు అధిక శాతం సంప్రదాయ పంపిణీ చానళ్ల ద్వారానే సరఫరా అవుతుంటాయని, నర్చర్.రిటైల్‌తో భాగస్వామ్యం ద్వారా డిజి టల్ రూపంలో మరింత మంది కస్టమర్లను చేరుకుంటామని దోబాల్ పేర్కొన్నారు. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్ బిజినెస్ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్‌ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్ఐఎల్ ఇబిటా 22 శాతం జంప్‌చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది. ఆర్ఐఎల్ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ భళా గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్ రిటైల్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్ బిజినెస్ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది. సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో భాగం డిజిటల్ కనెక్టివిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో లిస్ట్ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్క్లస్టర్ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది. –ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ -
కోర్టులో భర్త చేసిన పనికి బిత్తర పోయిన భార్య.. అసలేం జరిగిందంటే?
సేలం(తమిళనాడు): అభిప్రాయబేధాల కారణంగా విడిపోయిన భార్యకు ఇవ్వాల్సిన భరణాన్ని చిల్లర నాణేలుగా భర్త తీసుకువచ్చిన సంఘటన తమిళనాడులోని సేలం కోర్టులో జరిగింది. సేలం జిల్లా దేవన్నక వుండనూరు కిడయూరు మెట్టూరుకి చెందిన రాజీ (57) ఓ ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శాంతి. వీరు అభిప్రాయభేదాల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితిలో భరణం కోసం శాంతి సంగగిరి 2వ క్రిమినల్ కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతి నెలా రూ.73,000 జీవన భృతిగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఆ మొత్తాన్ని రాజీ సరిగ్గా చెల్లించకపోవడంతో శాంతి సంగగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని (రూ.2.18 లక్షలు) వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు. చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి.. దీంతో బుధవారం ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన భరణం సొమ్ము రూ.2.18 లక్షలను రూ.10 నాణేలుగా 11 బస్తాల్లో కోర్టుకు తీసుకువచ్చాడు. దీంతో కోర్టు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా, భార్యకు భరణం సొమ్మును చిల్లర రూపంలో ఇచ్చి ఆమెను భర్త అవమానించాడని కోర్టు సిబ్బంది మండిపడ్డారు. -
ఇదెక్కడి ‘చిల్లర’ నామినేషన్!.. 4 గంటలపాటు హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం: ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి.. చిల్లర లెక్కిస్తూ కొందరు కనిపిస్తున్నారు కదా..! ఇదేదో దేవాలయంలో హుండీ లెక్కింపునకు సంబంధించిన చిత్రం అనుకుంటే పొరపాటే. ఇది విశాఖపట్నం కలెక్టరేట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ కేంద్రం. అయితే ఇక్కడ చిల్లర ఏంటి అని అనుకుంటున్నారా?.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి పేరు.. ఎన్.రాజశేఖర్. ఈయన పట్టభద్రుడు. ప్రస్తుతం శ్రీముఖలింగం దేవాలయ ప్రధానార్చకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి తన వద్ద ఉన్న చిల్లర మొత్తాన్ని డిపాజిట్‌గా కట్టేందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిల్లరని అధికారులకు రూ.10 వేలు అని చెప్పి అందించారు. ఆ చిల్లర మొత్తం చూసి సిబ్బంది మొత్తం షాక్ అయ్యారు. చిల్లరంతా పోగేసి నలుగురైదుగురు సిబ్బంది లెక్కపెట్టారు ఇందుకు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రూపాయి, రూ.2, రూ.5 నాణేల్ని లెక్కించగా మొత్తం రూ.6 వేలే ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కాసేపు రాద్ధాంతం కూడా జరిగింది. మిగిలిన మొత్తాన్ని నోట్ల రూపంలో చెల్లించి.. చివరికి నాలుగు గంటల హైడ్రామా అనంతరం రాజశేఖర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఏదేమైనా.. ఈ చిల్లర మొత్తం లెక్కపెట్టి.. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి తలప్రాణం తోకకొచ్చిందని ఎన్నికల సిబ్బంది వాపోయారు. చదవండి: కావలిలో దారుణం.. చిన్నారి గొంతు కోసిన సైకో -
దారి దోపిడీ ముఠా అరెస్ట్
పెనుకొండ: చిల్లర ఖర్చులకు దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను గురువారం అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. గురువారం పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆమె వెల్లడించారు. రొద్దం మండలానికి చెందిన కురుబ శబరీష్ ప్రస్తుతం పరిగిలో ఉంటున్నాడు. హిందూపురం రూరల్ కొట్నూరుకు చెందిన భరత సింహారెడ్డి, మరో మైనర్ బాలునితో కలసి రాత్రి వేళ, తెల్లవారుజాము సమయాల్లో 44వ జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహనాల డ్రైవర్లను కత్తితో బెదిరించి, సెల్ఫోన్లు, నగదు అపహరించుకెళ్లేవారు. ఈ ఏడాది జూలై 8న అనంతపురం జిల్లా రాప్తాడు, కియా, సోమందేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దోపిడీలు సాగించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐ కరుణాకర్, కియా ఎస్ఐ వెంకటరమణ, సోమందేపల్లి ఎస్ఐ విజయకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కురుబ శబరీష్, భరతసింహారెడ్డి, మరో మైనర్ బాలుడు చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించి, గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు సెల్ఫోన్లు, పల్సర్‌బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. శబరీష్, భరతసింహారెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్ఐలు రమే‹Ùబాబు, వెంకటరమణ, విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: పరిటాల శ్రీరామ్ మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?) -
‘మీరు వెళ్లండి, కానీ మేం నష్టపోనివ్వకుండా చూడండి’
న్యూఢిల్లీ: విదేశీ ఆటోమొబైల్ సంస్థలు (ఓఈఎం) అకస్మాత్తుగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తుండటం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆటోమొబైల్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిష్క్రమణల వల్ల తమను నష్టపోనివ్వకుండా తగు పరిహారం అందేలా చూడాలని కోరారు. రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉండాలని ఆటోమోటివ్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆటో రిటైల్ సదస్సులో నమూనా డీలర్ ఒప్పందాన్ని (ఎండీఏ) ఆవిష్కరించింది. ‘ఓఈఎం (వాహనాల తయారీ సంస్థలు)లకు, డీలర్లకు మధ్య ప్రస్తుతం ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి ఓఈఎంల కోణంలోనే ఉంటున్నాయి. అలాకాకుండా వ్యాపార నిర్వహణలో మా మాటకు కూడా విలువ ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నది డీలర్ల అభిప్రాయం‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఎండీఏతో ఇటు ఓఈఎంలు, అటు డీలర్లకు సమాన స్థాయి లభించగలదని పేర్కొన్నారు. ఒప్పందాలనేవి ఆటో పరిశ్రమ లేదా వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా ఇరు పక్షాలకు తగు పరిహారం లేదా తగిన సెటిల్మెంట్ లభించేలా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండకూడదని సింఘానియా చెప్పారు. విదేశీ ఓఈఎంలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కోసం అయిదేళ్ల పైగా కూడా అధ్యయనాలు చేస్తుంటాయని, కానీ తప్పుకోవాల్సి వస్తే హఠాత్తుగా నిష్క్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘దీంతో డీలర్ల దగ్గర వాహనాలు, స్పేర్ పార్టుల స్టాక్‌లు పేరుకుపోతుంటాయి. వ్యాపారం కోసం మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. విదేశీ ఓఈఎం అకస్మాత్తుగా నిష్క్రమించడం వల్ల ఆ డబ్బంతా ఇరుక్కుపోతుంది. అలా కాకుండా ఒకవేళ నిష్క్రమించాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరిగితే, డీలర్లు కూడా తమ దగ్గరున్న నిల్వలను విక్రయించి, బ్యాంకు రుణాలను తీర్చుకునేందుకు వీలవుతుంది‘ అని సింఘానియా చెప్పారు. 2017లో జనరల్ మోటర్స్, 2021లో ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన సందర్భాల్లో డీలర్లు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
పెరగనున్న మాల్స్ ఆదాయం..ఎందుకంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఏడాదితో పోలిస్తే 2022–23లో మాల్స్ అద్దె ఆదాయం 30 శాతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ప్రధానంగా డిమాండ్ పెరగడం, కోవిడ్–19 వ్యాక్సిన్లు అత్యధికులకు ఇవ్వడం, మల్టీఫ్లెక్స్‌లు పునఃప్రారంభం ఇందుకు కారణం. 2021 ఆగస్ట్ నుంచి రిటైల్ మాల్స్ కార్యకలాపాల రికవరీ ప్రారంభమైంది. ఒమిక్రాన్ కారణంగా క్లుప్త విరామం మినహా 2021–22 అర్ధ భాగం మెరుగ్గా కొనసాగింది. మూడవ త్రైమాసికంలో రిటైల్ వ్యాపారం విలువ పరంగా కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. నాల్గవ త్రైమాసికంలో ఈ వ్యాపార విలువను మించిపోయింది. 2022–23 మూడవ త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయిలో వినియోగదార్ల రాక ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్స్‌కు 2019–20 స్థాయి కంటే 4–6 శాతం అధిక అద్దె ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ మరింత మెరుగు అవుతుంది’ అని ఇక్రా వివరించింది. -
రూ.150 లక్షల కోట్లకు రిటైల్ పరిశ్రమ!
ముంబై: రిటైల్ పరిశ్రమ తిరిగి వృద్ధి క్రమంలోకి ప్రవేశించిందని, ఏటా 10 శాతం చొప్పున ప్రగతి సాధిస్తూ 2032 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.150 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని తాజా నివేదిక ఒకటి అంచనా వేసింది. ‘భారత్‌లో రిటైల్ పరిశ్రమ తదుపరి దశ’ పేరుతో బీసీజీ–రాయ్ (రిటైల్ అసోసియేషన్) బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫుడ్, గ్రోసరీ, రెస్టారెంట్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్), కన్జ్యూమర్ డ్యురబుల్స్ విక్రయాలు కరోనా ముందు నాటి స్థాయికి కోలుకున్నట్టు.. జ్యుయలరీ, యాక్సెసరీ, వస్త్రాలు, పాదరక్షలు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకునే క్రమంలో ఉన్నాయని వివరించింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ వినియోగం ఆధారితంగా నడుస్తుంది. రెండేళ్ల తర్వాత వినియోగంలో వృద్ధి తిరిగి సానుకూల స్థాయికి చేరింది’’ అని బీసీజీ ఎండీ అభీక్ సింఘి తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో సంఘటిత రిటైల్ రంగం.. వృద్ధి కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్, అన్ని ఫార్మాట్లలోనూ మరింత విస్తరణపై దృష్టి సారిస్తుందని అంచనా వేసింది. దేశంలో వినియోగం కరోనాకు ముందు ఏటా 12 శాతం చొప్పున వృద్ధి చెందగా, మహమ్మారి సమయంలో మైనస్‌లోకి జారిపోయిందని, ఇప్పుడు కోలుకుని కరోనా ముందు నాటి స్థాయిని దాటినట్టు వివరించింది. ఈ కామర్స్ విభాగం 2021 నాటికి 45 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2026 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. 2022–23లో రెండంకెల వృద్ధి ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ పరిశ్రమలో వృద్ధి దిగువ రెండంకెల స్థాయిలో ఉండొచ్చని షాపర్స్‌స్టాప్ ఎండీ, సీఈవో వేణు నాయర్ అంచనా వేశారు. కరోనా మహమ్మారికి సంబంధించిన ఆంక్షలను సడలించేయడంతో కస్టమర్లు తిరిగి ఆఫ్‌లైన్ స్టోర్లకు రావడం పెరుగుతున్నట్టు చెప్పారు. ‘‘కస్టమర్ల రాక కరోనా ముందుస్తు స్థాయికి చేరింది. గడిచిన రెండు నెలలుగా ఇది బలంగా ఉంది. రిటైల్ వ్యాపారంలో అధిక స్థాయి ఒక అంకె (8–9శాతం) లేదంటే దిగువ స్థాయి రెండంకెల్లో (11–13శాతం) వృద్ధి నమోదు కావచ్చు’’అని నాయర్ తెలిపారు. భవిష్యత్తు రిటైల్ అంతా ఓమ్నిచానల్ రూపంలోనే ఉంటుందని (ఆన్లైన్, ఆఫ్‌లైన్), అదే సమయంలో ఆన్లైన్ ఇక ముందూ కీలకంగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 డిపార్ట్మెంట్ స్టోర్లు, 20 బ్యూటీస్టోర్లు ప్రారంభించనున్నట్టు వేణు నాయర్ వెల్లడించారు. వృద్ధి కోసం స్టోర్ల విస్తరణ అన్నది తమకు కీలకమని, దానిపై దృష్టి కొనసాగిస్తామని చెప్పారు. భాగస్వామ్యాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లతో టైఅప్ అవుతున్నాం. ఎన్నో కొత్త బ్రాండ్లు మా నిర్వహణలో ఉన్నాయి. మరిన్ని నూతన బ్రాండ్లు కూడా రానున్నాయి. మాకు సరిపోతాయని భావిస్తే కచ్చితంగా మా స్టోర్లలో వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం’’అని వేణు నాయర్ వివరించారు. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్లైన్లోనే ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. భౌతికంగా స్టోర్లకు స్థలాల విషయంలో పరిమితి ఉంటుందని.. ఆన్లైన్లో ఈ ఇబ్బంది ఉండదు కనుక కొత్త బ్రాండ్లను ముందగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది. -
గో ఫ్యాషన్ ఐపీవోకు భారీ స్పందన
న్యూఢిల్లీ: మహిళల దుస్తుల బ్రాండ్ గో కలర్స్ మాతృ సంస్థ గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 2.46 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) డేటా ప్రకారం 80.79 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.99 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగంలో భారీ డిమాండ్ కనిపించింది. ఇది 12.14 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవో ద్వారా గో ఫ్యాషన్ రూ. 1,013.6 కోట్లు సమీకరిస్తోంది. ఇష్యూకి షేరు ధర శ్రేణి రూ. 655–690గా ఉంది. సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని 120 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ల ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వాటి కోసం కంపెనీ వినియోగించుకోనుంది. గో కలర్స్ బ్రాండ్ కింద మహిళలకు సంబంధించిన చుడీదార్లు, లెగ్గింగ్‌లు మొదలైన వాటిని గో ఫ్యాషన్ విక్రయిస్తోంది. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
రిటైల్ డిపాజిట్లపై నెగటివ్ రిటర్న్స్!
ముంబై: ధరల పెరుగుదల స్పీడ్ (ద్రవ్యోల్బణాన్ని) పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ డిపాజిటర్లకు తమ డిపాజిట్లపై ప్రస్తుతం నెగటివ్ రిటర్న్స్ అందుతున్నాయని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థికవేత్తల నివేదిక ఒకటి పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీ ఆర్జనలపై పన్ను అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తన తాజా నివేదికలో సూచించింది. ఈ మేరకు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సమర్పించిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►డిపాజిటర్ల అందరి గురించీ ఆలోచించక పోయినా, కనీసం సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై పన్ను భారాన్ని తగ్గించే అంశాన్ని అయినా సమీక్షించాలి. వారి రోజూవారీ అవసరాలు, వ్యయాలు ఈ వడ్డీపైనే ఆధారపడే సంగతి తెలిసిందే. మొత్తం డిపాజిట్లు దాదాపు రూ. 156 లక్షల కోట్లు. ఇందులో రిటైల్ డిపాజిట్ల వాటా దాదాపు రూ.102 లక్షల కోట్లు. ►ప్రస్తుతం,డిపాజిటర్లందరికీ సంవత్సరానికి రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని జమ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును మినహాయించుకుంటాయి, అయితే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి ఆదాయం రూ .50,000 దాటితే పన్ను భారం పడుతుంది. ►వృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశం ప్రస్తుతం సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభిస్తోంది. దీనితో డిపాజిట్ రేట్ల కనీస స్థాయికి పడిపోయి, కేవలం దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. రెపో వరుసగా ఏడు త్రైమాసికాల నుంచి 4 శాతంగా కొనసాగుతోంది. ►వడ్డీరేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) భారీగా కొనసాగుతుండడం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ►ప్రస్తుతం ఫైనాన్షియల్ మార్కెట్లో బుల్‌రన్ నడుస్తోంది. ఇది డిపాజిటర్ల ఆలోచనా ధోరణిని మార్చే అవకాశం ఉంది. తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ సంపాదించడానికి వారు మార్కెట్‌వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ►వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత, వడ్డీరేట్ల విషయంలో పోటీతత్వం, నిధుల సమీకరణ వ్యయాల సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంకులు ప్రస్తుతం మార్జిన్ల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. -
SBI: కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు
ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్ కస్టమర్లకు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ముఖ్య ఆఫర్లను పరిశీలిస్తే... కారు రుణాలపై 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు; 90 శాతం వరకూ ఆన్–రోడ్ ఫైనాన్సింగ్ కారు రుణం డిజిటల్‌గా యోనో ద్వారా దరఖాస్తు చేస్తే 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు)మేర ప్రత్యేక వడ్డీ రాయితీ. వార్షిక వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటు నుంచి లభ్యత బంగారంపై రుణాల విషయంలో 75 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వడ్డీరేట్ల తగ్గింపు. 7.5 శాతానికే రుణ లభ్యత. యోనో ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజు రద్దు చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యక్తిగత, పెన్షన్ రుణ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్ వంటివారికి) వ్యక్తిగత రుణాలపై 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీ. కారు, బంగారం రుణాలకు సంబంధించి దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది. రిటైల్ డిపాజిటర్లకు ‘‘ప్లాటినం టర్మ్ డిపాజిట్ల’ పథకాన్ని కూడా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితితో టర్మ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభ్యత. ఆగస్టు 31 వరకూ వర్తించేట్లు గృహ రుణంపై 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు. 6.7 శాతం నుంచి గృహ రుణం లభిస్తోంది. -
పెట్టుబడుల్లో రిటైలర్ల జోరు
న్యూఢిల్లీ: సరికొత్త బుల్ట్రెండ్లో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు దూకుడు చూపుతున్నారు. ఓవైపు సెకండరీ మార్కెట్లో నెలకొన్న రికార్డులకుతోడు.. మరోపక్క ప్రైమరీ మార్కెట్ స్పీడ్ పలువురు చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో తాజాగా రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతాన్ని తాకింది. ఇది మార్కెట్ చరిత్రలోనే అత్యధికంకాగా.. మార్చి చివరికల్లా ఎన్ఎస్ఈ కంపెనీలలో 6.96 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ప్రైమ్‌ఇన్ఫోబేస్.కామ్ అందించిన వివరాల ప్రకారం విలువరీత్యా రిటైల్ ఇన్వెస్టర్ల వాటాల విలువ 16 శాతం వృద్ధితో రూ. 16.18 లక్షల కోట్లకు చేరింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఈ విలువ రూ. 13.94 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్(బీఎస్ఈ) 6 శాతం, నిఫ్టీ(ఎన్ఎస్ఈ) 7 శాతం చొప్పున మాత్రమే పురోగమించడం గమనార్హం! డీఐఐలు డీలా.. క్యూ1లో దశీ మ్యూచువల్ ఫండ్స్ వాటా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో నామమాత్రంగా తగ్గి 7.25 శాతానికి పరిమితమైంది. మార్చి క్వార్టర్(క్యూ4)లో 7.26 శాతంగా నమోదైంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,699 కంపెనీలకుగాను 1,666 కంపెనీలలో వెలువడిన వాటాల వివరాల ప్రకారం రూపొందిన గణాంకాలివి. వెరసి రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ మార్గంకంటే షేర్లలో ప్రత్యక్ష పెట్టుబడులకే ఇటీవల మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 295 కంపెనీలలో గల వాటా జూన్‌కల్లా 3.74 శాతానికి నీరసించింది. 2021 మార్చి చివరికల్లా 3.83 శాతంగా నమోదైంది. ఎల్ఐసీకి 1 శాతానికంటే అధికంగా వాటా గల కంపెనీల వివరాలివి! ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు తదితరాలతో కూడిన డీఐఐల వాటా జూన్‌కల్లా 13.19 శాతానికి నీరసించింది. మార్చిలో ఈ వాటా 13.42 శాతంగా నమోదైంది. ఇక ఇదే సమయంలో ఎఫ్‌పీఐల వాటా 22.46 శాతం నుంచి 21.66 శాతానికి తగ్గడం ప్రస్తావించదగ్గ విషయం! -
రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం రిటైల్ పార్క్స్ పాలసీ 2021-2026 ను ప్రకటించింది. రిటైల్ పార్క్ పాలసీ విదివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది. 2026 నాటికి 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా పాలసీ రూపకల్పన చేశారు. 50 వేల ఉద్యోగాలను రిటైల్ రంగంలో కల్పించాలని టార్గెట్‌గా పెట్టుకుని పాలసీ రూపొందించారు. -
రికార్డు స్థాయికి బియ్యం ధరలు.. తినలేం, కొనలేం!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం గత ఏడాది కిలోకు రూ.40 నుంచి రూ.45 పలికితే ప్రస్తుతం రూ.48 నుంచి రూ.55కు చేరాయి. డిమాండ్ కంటే ఎక్కువగా మార్కెట్‌కు బియ్యం నిల్వలు వస్తున్నా ధరలు మాత్రం తగ్గడంలేదు. వ్యవసాయాధారిత ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. వ్యాపారులు పన్నులు చెల్లించిన సమయంలో బియ్యం ధరలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పన్నులు రద్దయినా ధరలు పెరగడంపై వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇష్టారీతిన రిటైల్ వ్యాపారులు ► జంట నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలో బియ్యం ధరలకు, రిటైల్ ధరలకు పొంతన కుదరడంలేదు. ►గ్రేటర్ పరిధిలో దాదాపు 240 రైస్‌మిల్లర్లు ఉన్నారు. వీరి నుంచి రిటైల్ వ్యాపారులు తక్కువ ధరకే బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ► ప్రస్తుతం మిల్లర్ ధర క్వింటాలు బియ్యానికి రూ.3,200 నుంచి రూ.3,600 పలుకుతున్నాయి. కానీ మార్కెట్‌కు చేరిన తర్వాత రిటైల్ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ► ప్రస్తుతం సన్నబియ్యం ఫైన్ క్వాలిటీ క్వింటాలుకు రూ.4,800 నుంచి రూ.5,500 చేరింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు 2,500 మంది రిటైల్ వ్యాపారులు బియ్యం ధరలను శాసిస్తున్నారు. చిన్నాచితకా కిరాణా వ్యాపారులు సైతం ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతున్నారు. ►గత ఏడాది క్వింటాలు సన్న బియ్యం రూ.4,200 నుంచి రూ.4,500 పలకగా ప్రస్తుతం సుమారు రూ.వెయ్యి వరకు పెంచి అమ్ముతున్నారు. దిగుబడులు పెరిగినా.. ► రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరి ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి ప్రభుత్వం మిల్లర్లకు అందజేసింది. గ్రేటర్ పరిధిలోని మిల్లర్ల వద్ద లక్షన్నర మెట్రిక్ టన్నులకుపైగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ►జంటనగరాల్లో బియ్యం వినియోగం పెరుగుతోంది. రోజుకు 32 నుంచి 35 వేల క్వింటాళ్ల బియ్యం వినియోగిస్తున్నట్లు అంచనా. -
అదరగొట్టిన రిలయన్స్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ. 13,101 కోట్లు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది రూ. 11,640 కోట్లు. తాజా మూడో త్రైమాసికంలో నికర లాభం సుమారు రూ. 11,420 కోట్లు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కంపెనీ ఆదాయంలో గణనీయ వాటా ఉండే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం తగ్గినప్పటికీ.. టెలికం, రిటైల్ విభాగాలు రాణించడంతో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. ఏడాది క్రితం దాకా కంపెనీ ఆదాయంలో 37 శాతంగా ఉన్న ఈ రెండు విభాగాల వాటా ప్రస్తుతం 51%కి పెరిగింది. పన్నులకు ముందస్తు లాభంలో దాదాపు 56 శాతం వాటా జియో, రిలయన్స్ రిటైల్‌దే ఉంది. సమీక్షాకాలంలో ఆర్ఐఎల్ ఆదాయం సుమారు 19% క్షీణించి రూ. 1,37,829 కోట్లకు పరిమితమైంది. చమురు, రసాయనాల వ్యాపారం (ఓ2సీ) త్రైమాసికాలవారీగా మెరుగుపడినప్పటికీ.. వార్షికంగా మాత్రం తగ్గింది. ఓ2సీ విభాగం పునర్వ్యవస్థీకరణ.. ‘ఓ2సీ (చమురు, రసాయనాలు తదితర విభాగాలు), రిటైల్ విభాగాలు కాస్త కోలుకోవడంతో పాటు డిజిటల్ సేవల విభాగం నిలకడగా వృద్ధి సాధిస్తుండటంతో మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించగలిగాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో పరిశుభ్రమైన, పర్యావరణహిత అభివృద్ధి సాధన దిశగా కొత్త ఇంధన, మెటీరియల్స్ వ్యాపారాలను విస్తరించేందుకు ఇది సరైన తరుణం. దీనికి అనుగుణంగానే ఓ2సీ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి కస్టమర్లకు మరింత చేరువలోకి తెస్తున్నాం. దేశ ఎకానమీలోని ప్రతీ రంగానికి అవసరమైన ఇంధన, మెటీరియల్స్ సొల్యూషన్స్‌ను దీని ద్వారా అందుబాటు ధరల్లో అందించవచ్చు‘ అని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. ఓ2సీ ప్లాట్‌ఫామ్ పునర్వ్యవస్థీకరణతో ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్ ఆదాయాలను ఒకే పద్దు కింద రిలయన్స్ చూపించింది. దీనితో రిఫైనింగ్ మార్జిన్లను ప్రత్యేకంగా ప్రకటించలేదు. జియో జోష్..: త్రైమాసికాలవారీగా చూస్తే.. డిజిటల్, టెలికం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్ లాభం 15 శాతం వృద్ధితో రూ. 3,489 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 31 నాటికి జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41 కోట్లుగా ఉంది. ప్రతీ యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 145 నుంచి రూ. 151కి పెరిగింది. రిటైల్‌కు ఫ్యాషన్ ఊతం..: ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ విభాగాలు గణనీయంగా కోలుకోవడంతో రిలయన్స్ రిటైల్ మెరుగైన పనితీరు కనపర్చింది. పన్నుకు ముందస్తు లాభం సుమారు 12 శాతం పెరిగి రూ. 3,102 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 2,736 కోట్లు. అయితే, ఆదాయం మాత్రం రూ. 45,348 కోట్ల నుంచి దాదాపు 23 శాతం క్షీణించి రూ. 36,887 కోట్లకు పడిపోయింది. మరిన్ని విశేషాలు.. ► కరోనా మహమ్మారి, రేట్లు పడిపోవడం వంటి అంశాలు ఇంధన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో ఓ2సీ వ్యాపారం ఆదాయం రూ. 1,19,121 కోట్ల నుంచి రూ. 83,838 కోట్లకు తగ్గింది. ► త్రైమాసికాల వారీగా చూస్తే వడ్డీ వ్యయాలు 29 శాతం తగ్గి రూ. 4,326 కోట్లకు పరిమితమయ్యాయి. ► జియోలో వాటాల విక్రయం ద్వారా రూ. 1,52,056 కోట్లు, రిటైల్‌లో వాటాల విక్రయంతో రూ. 47,265 కోట్లు రిలయన్స్ సమీకరించింది. ► స్థూల రుణ భారం డిసెంబర్ ఆఖరు నాటికి రూ. 2,57,413 కోట్లకు తగ్గింది. 2020 మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక చేతిలో ఉన్న నగదు రూ. 1,75,259 కోట్ల నుంచి రూ. 2,20,524 కోట్లకు పెరిగింది. కంపెనీ చేతిలో పుష్కలంగా నిధులు ఉండటంతో నికర రుణం మైనస్ రూ. 2,954 కోట్లుగా ఉంది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 2,050 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. -
భారత్‌లో బీపీ గ్రూప్ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్‌లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో విస్తరించనుంది. భారత్‌ను అసాధారణ మార్కెట్‌గా అభివర్ణించడమేగాక, నమ్మశక్యం కాని రీతిలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది. అయితే సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ కోరారు. సెరావీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో 5,500 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా వీటిలో ఉంటుంది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో..: నెట్వర్క్ విస్తరణలో భాగంగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తాం అని లూనీ వివరించారు. ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీతో బీపీకి లోతైన, విశ్వసనీయ బంధం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్ఐఎల్కు 1,400 పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి. ఆర్ఐఎల్–బీపీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ వీటిని చేజిక్కించుకుని విస్తరించనుంది. ఐదేళ్లలో విమాన ఇంధన కేంద్రాలు మరో 14 రానున్నాయి. జేవీలో ఆర్ఐఎల్కు 51% వాటా ఉంది. 49% వాటాకు బీపీ గ్రూప్ రూ.7,000 కోట్లదాకా వెచ్చించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో చమురు వెలికితీతకై ఇరు సంస్థలు రూ.37,000 కోట్లు పెట్టుబడి చేయనున్నాయి. ఇదిలావుంటే టోటల్ సీఈవో పాట్రిక్ పౌయన్నె మాట్లాడుతూ ఇంధన వినియోగంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 30 శాతమే ఉందన్నారు. ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్, సిటీ గ్యాస్, రెనివేబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు చేస్తున్నట్టు వెల్లడించారు. -
ఆహార రిటైల్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు నో ఎంట్రీ!
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల రిటైల్ వ్యాపార విభాగంలో ప్రవేశించాలనుకున్న ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తిరస్కరించింది. నియంత్రణపరమైన అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్మిట్ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ‘టెక్నాలజీ, నవకల్పనల ఆధారిత మార్కెట్ విధానాలతో దేశీయంగా రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మరింత విలువ చేకూరుతుందని, సమర్థత, పారదర్శకత పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. చిన్న వ్యాపార సంస్థలకు ఊతమిచ్చే విధంగా పర్మిట్ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నాం‘ అని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ గతేడాది దేశీయంగా ఆహార రిటైల్ విక్రయాల కోసం ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ పేరిట కొత్తగా విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లైసెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. -
అదుపులోనే రిటైల్ ధరల స్పీడ్
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో వినియోగ ధరల సూచీలో పేర్కొన్న వస్తువులు, ఉత్పత్తుల బాస్కెట్ ధర మొత్తం కేవలం 3.15 శాతమే పెరిగిందన్నమాట. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. 2 శాతానికి ప్లస్ 2 శాతం లేదా మైనస్ 2 శాతంగా ఉండేలా చూడాలని ఆర్బీఐకి కేంద్రం సూచిస్తోంది. అంటే 4 శాతం దాటితే ధరల తీవ్రతను మైనస్‌లోకి వెళితే వ్యవస్థలోని మందగమన పరిస్థితులకు ఇది సంకేతంగా ఉంటుంది. తాజా సమీక్షా నెల జూలైలో ఆహార ధరల సూచీ పెరిగినప్పటికీ ఇంధనం, లైట్ ధరలు అదుపులో ఉన్నాయి. 2018 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.17 శాతం. 2019 జూన్‌లో 3.18 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమ లు శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ప్రధాన సూచీలను పరిశీలిస్తే... కేవలం ఆహార విభాగాన్ని చూస్తే, వినియోగ ఆహార ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) 2.36 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఇది 2.25 శాతం. అయితే జూన్‌లో 4.66 శాతంగా ఉన్న కూరగాయల ధరలు జూలైలో 2.82 శాతంగా నమోదయ్యాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 5.68 శాతం నుంచి 6.82 శాతానికి పెరిగాయి. పండ్ల ధరలు పెరక్కపోగా మైనస్‌లోనే ఉన్నాయి. –0.86 శాతంగా నమోదయ్యాయి. జూన్‌లో ఈ తగ్గుదల (మైనస్) 4.18 శాతం. ప్రొటీన్ ఆధారిత మాంసం, చేపల ధరల పెరుగుదల జూన్ (9.01 శాతం తరహాలోనే కేవలం 9.05 శాతంగా ఉంది. అయితే గుడ్ల ధరలు 1.62 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గాయి. ♦ ఇంధనం, లైట్ కేటగిరీలో ధర జూలై క్షీణించి – 0.36 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 2.32 శాతంగా ఉంది. ♦ ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రమాణంగా ఉండే విషయం తెలిసిందే. -
స్పెన్సర్స్ గూటికి గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్
న్యూఢిల్లీ: సంజీవ్ గోయంకా గ్రూపులో భాగమైన స్పెన్సర్స్ రిటైల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ గ్రోసరీ సంస్థ నేచర్స్ బాస్కెట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.300 కోట్లు. ఈ కొనుగోలు ద్వారా స్పెన్సర్స్ రిటైల్ దేశవ్యాప్త కార్యకలాపాలు కలిగిన సంస్థగా మారుతుంది. ముంబై, పుణే, బెంగళూరులోని ప్రధాన ప్రాంతాల్లో 36 స్టోర్లతోపాటు పశ్చిమాదిన స్పెన్సర్స్‌కు నెట్వర్క్ లభిస్తుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్లో నూరు శాతం వాటాను (44,58,30,000 షేర్లు) కొనుగోలు చేసే ప్రతిపాదనకు స్పెన్సర్స్ రిటైల్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. వాటాదారులు, నియంత్రణ సంస్థల ఆమోదంపై ఇది ఆధారపడి ఉంటుందని స్పెన్సర్స్ రిటైల్ తెలిపింది. నేచర్స్ బాస్కెట్ 2018–19 సంవత్సరంలో రూ.338 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆహార, పానీయాలు, గ్రోసరీ వస్తువులను విక్రయిస్తుంటుంది. -
క్యూ4 ఫలితాలతో దిశానిర్దేశం
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న (మంగళవారం) 3వ దశ పోలింగ్ జరగనుంది. కొనసాగుతున్న సాధారణ ఎన్నికల వేడి, కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 (జనవరి–మార్చి) ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఎర్నింగ్స్ సీజన్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ఫలితాలను ప్రకటించగా.. ఆరోజు గుడ్‌ఫ్రైడే కారణంగా మార్కెట్‌కు సెలవు అయినందున ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై స్పష్టంగా కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ.. రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా ఆర్ఐఎల్ రికార్డ్ స్థాయి లాభాలను ఆర్జించగా.. గత ఏడాది క్యూ4తో పోలిస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభాల్లో 22.63 శాతం వృద్ధి కనబర్చింది. ఈ దిగ్గజాల ఫలితాల ప్రభావంతో పాటు.. ఇక నుంచి వెల్లడికానున్న ఎర్నింగ్స్ ప్రస్తుత వారంలో మార్కెట్‌కు కీలకంకానున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ‘స్వల్పకాలానికి ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలపై దృష్టిసారించారు. నిఫ్టీ 50 కంపెనీల ఎర్నింగ్స్ ఏడాది ప్రాతిపదికన 20 శాతం మేర వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంకింగ్ రంగ లోబేస్ కారణంగా ఈ అంచనాను తీసుకున్నాం. ఇక ఈవారంలో కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాన్ని కలుపుకుని ఇండెక్స్ హెవీవెయిట్స్ ఫలితాల సీజన్ ట్రెండ్‌కు అద్దంపట్టనున్నాయి.’ అని విశ్లేషించారు. ఎన్నికల వేడి నేపథ్యంలో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందన్నారు. ఆర్థిక సేవల రంగంపై దృష్టి అధిక శాతం ఆర్థిక సేవల కంపెనీలు ఈవారంలోనే నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (సోమవారం).. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ (బుధవారం) ఫలితాలను వెల్లడించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ (గురువారం).. యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. వాహన దిగ్గజాల్లో మారుతీ(గురువారం), హీరో మోటోకార్ప్(శుక్రవారం) ఫలితాలను ప్రకటించనుండగా.. ఇతర రంగాల దిగ్గజాల్లో ఏసీసీ (మంగళవారం), ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్(బుధవారం) టాటా స్టీల్ (గురువారం) వెల్లడించనున్నాయి. అమెరికా–చైనా వాణిజ్య చర్చలు సైతం సూచీలకు సంకేతాలను ఇవ్వనున్నాయని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ఏప్రిల్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈవారంలోనే ఉన్నందున లార్జ్‌క్యాప్ షేర్ల కదలికలు ఈ అంశంపైనే ఆధారపడి ఉన్నట్లు ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మరింత పెరిగి 72 డాలర్ల స్థాయికి చేరింది. శుక్రవారం 71.95 వద్ద ముగిసింది. ఈ ప్రధాన అంశం ఆధారంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.90–69.80 శ్రేణిలో కదలాడవచ్చని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. మరోవైపు ఏప్రిల్ 19తో అంతమయ్యే వారానికి విదేశీ మారక నిల్వల డేటాతో పాటు ఏప్రిల్ 12 నాటికి డిపాజిట్లు, బ్యాంకు రుణ పెరుగుదల గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ దేశీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు ఏప్రిల్‌లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు.. ఈ నెలలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1–16 కాలంలో) నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో మొత్తంగా రూ.14,300 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు.. డెట్ మార్కెట్ నుంచి రూ.3,288 కోట్లను ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు నమోదైంది. సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన దృక్పథంమారడం, అంతర్జాతీయంగా ద్రవ్య లభ్యత మెరుగుదలతో ఫిబ్రవరి నుంచి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘భారత్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న సానుకూలత కారణంగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి’ అని గ్రో సీఈఓ హర్‡్ష జైన్ అన్నారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే భారత్ మరింత ఆకర్షణీయంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంషు శ్రీవాత్సవ వివరించారు. -
రిలయన్స్ రిటైల్ చేతికి ఐటీసీ ‘జాన్ ప్లేయర్స్’
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మగవాళ్ల దుస్తుల బ్రాండ్, జాన్ ప్లేయర్స్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించింది. డీల్‌లో భాగంగా ట్రేడ్‌మార్క్, మేధోపరమైన హక్కులనూ రిలయన్స్ రిటైల్‌కు బదిలీ చేసింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా జాన్ ప్లేయర్స్‌ను బ్రాండ్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించామని ఐటీసీ తెలిపింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ రూ.150 కోట్ల మేర ఉండొచ్చని సమాచారం. ఈ బ్రాండ్ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్, ఈ సంస్థ ఆన్లైన్ప్లాట్ఫామ్, అజియోడాట్కామ్లు మరింత పటిష్టమవుతాయని నిపుణుల అంచనా. 2002లో ఆరంభమైన జాన్ ప్లేయర్స్ బ్రాండ్...యూత్ ఫ్యాషన్ అప్పారెల్ బ్రాండ్‌గా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం 557గా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ స్టోర్స్‌ను ఐదేళ్లలో 2,500కు పెంచాలని రిలయన్స్ రిటైల్ యోచిస్తోంది. -
రీటైల్ రంగంలోకి అమెజాన్ : భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను భారీగా వేస్తోంది. ఈ కామర్స్‌వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ తాజాగా భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్ రంగంపై కన్నేసింది. దేశంలోని పలు చైన్ సూపర్ మార్కెట్ల కంపెనీల్లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ (FPI)గా భారీ ఎత్తున నిధులను కుమ్మరించేందుకు అమెజాన్ యోచిస్తోంది.ఇందుకు సంబంధించిన డీల్‌ను ఈ నెలలోనే పూర్తి చేయనుంది. ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుంది. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫ్యూచర్స్ రిటైల్ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయి.దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. ఈ నవంబర్ 14 నాటికి ఈ డీల్ సాకారం కానున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే అమెజాన్ షాపర్స్ స్టాప్‌లో 5శాతం వాటాలనుసొంతం చేసుకుంది. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సమారా క్యాపిటల్ సంస్థలతో కలిసి పెట్టుబడులను సమకూర్చింది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్యాంట్రీ, అమెజాన్ నౌ ఇన్నోవేటివ్స్ పేరిట త్వరలోనే తన కార్యకలాపాలను ప్రారంభిచనుంది. కాగా మన దేశంలోని చట్టాల ప్రకారం దేశీయ సంస్థల్లో విదేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా 51శాతం పెట్టుబడులు పెట్టొచ్చు. అదీ ఎఫ్‌పీఐగా రిజిస్టర్డ్ చేసుకుని ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బహుళజాతి పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆన్లైన్ ఫుడ్ అండ్ కిరాణా రిటైల్ మార్కెట్ 2020 నాటికి 141శాతం వార్షిక వృద్ధిరేటును సాధించనుంది. -
అమెజాన్ చేతికి మోర్!!
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన మోర్ సూపర్ మార్కెట్ చెయిన్ (ఆదిత్య బిర్లా రిటైల్ –ఏబీఆర్ఎల్) ఇక అంతర్జాతీయ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ చేతికి చేరనుంది. ఇందుకు సంబంధించి సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో మోర్ బ్రాండ్ మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 4,200 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆదిత్య బిర్లా రిటైల్ (ఏబీఆర్ఎల్)కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోర్ బ్రాండ్ కింద 509 మోర్ బ్రాండెడ్ సూపర్మార్కెట్లు, 20 హైపర్మార్కెట్లు ఉన్నాయి. సగభాగం పైగా స్టోర్స్ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోనే ఉన్నాయి. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్, డీమార్ట్ తర్వాత మోర్ నాలుగో స్థానంలో ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి ఏబీఆర్ఎల్ నికర రుణం రూ. 6,456 కోట్లుగా ఉంది. 2016 నుంచి స్టోర్స్ సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ.. కంపెనీ వ్యయాలను నియంత్రించుకుంటూ వస్తోంది. నిర్వహణపరమైన నష్టాల నేపథ్యంలో స్టోర్స్ పరిమాణం, అద్దెలు తగ్గించుకుంటోంది. గతంలో త్రినేత్ర సూపర్‌మార్కెట్‌గా తెలుగురాష్ట్రాల్లో పేరొందిన బ్రాండ్‌నే ఆదిత్య బిర్లా గ్రూప్ 2007లో కొనుగోలు చేసి మోర్గా పేరు మార్చింది. ఒప్పందం ఇలా.. ఏబీఆర్‌ఎల్‌లో కుమార మంగళం బిర్లా.. ఆయన కుటుంబానికి చెందిన ఆర్కేఎన్ రిటైల్‌కి 62 శాతం, కనిష్ట ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి 37 శాతం వాటాలు ఉన్నాయి. రెండు హోల్డింగ్ కంపెనీలు .. ఏబీఆర్‌ఎల్‌లోని తమ తమ వాటాలను సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి చెందిన విట్‌జీగ్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించనున్నట్లు ఆర్కేఎన్ రిటైల్ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి సమర ఈ ఏడాది జూన్‌లోనే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోల్డ్‌మన్ శాక్స్, అమెజాన్‌ని కూడా ఇందులో భాగం చేసింది. ఈ డీల్ కోసం మూడు సంస్థలు ప్రత్యేక సంస్థను లేదా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామిగా అమెజాన్ 49 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఏబీఆర్‌ఎల్‌లో వాటాలు కొంటున్న విట్‌జీగ్ అడ్వైజరీలో కూడా అమెజాన్‌కు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా మొత్తం మీద చూస్తే అమెజాన్ చేతికి మోర్ చేరినట్లు కానుంది. భారత విదేశీ ఇన్వెస్ట్మెంట్ చట్టాల ప్రకారం మోర్ లాంటి మల్టీ బ్రాండ్ రిటైలర్స్‌లో విదేశీ కంపెనీలు 49% వరకే ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. దీంతో అవి దేశీ సంస్థలతో జట్టు కట్టి ఇలాంటి కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఇటీవలే ఇదే తరహా డీల్‌లో టీపీజీ, శ్రీరామ్ గ్రూప్‌ల నుంచి విశాల్ రిటైల్‌ను రూ.5,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పార్ట్నర్స్ గ్రూప్.. దేశీ ఫండ్ హౌస్ కేదార క్యాపిటల్‌తో జట్టు కట్టింది. 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్.. ఇప్పటిదాకా ఆన్లైన్ వ్యాపారానికే పరిమితమైన అమెజాన్..ఆఫ్‌లైన్ స్టోర్స్‌పైనా దృష్టి పెడుతోంది. భారత రిటైల్ మార్కెట్ ప్రస్తుతం 672 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవలే దేశీ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాలను అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ 16.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీని కోసం అమెజాన్ కూడా పోటీపడినప్పటికీ కుదరలేదు. అయితే, గతేడాది షాపర్స్ స్టాప్‌లో రూ. 179 కోట్లు పెట్టి 5% వాటాలు కొనుగోలు చేసింది.ఇక ఇప్పుడు మోర్లో కూడా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో దేశీ రిటైల్ రంగంలో అమెజాన్‌కి ఇది రెండో పెట్టుబడి కానుంది. స్థానికంగా తయారయిన ఆహారోత్పత్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించే అనుబంధ సంస్థను 500 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు వచ్చినప్పటికీ.. విధానాల్లో అస్పష్టత కారణంగా అమెజాన్ రంగంలోకి దిగలేదు. అయితే, ఆహార, నిత్యావసరాల విభాగంలో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న అమెజాన్‌కి.. మోర్లో ఇన్వెస్ట్ చేయడం లాభించనుంది. -
ఎఫ్‌డీఐలపై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీఐ పాలసీ సరళీకరణకు కేంద్రక్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా సింగిల్ బ్రాండ్ రీటైల్, నిర్మాణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు బార్ల తెరుస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ఈ విధానాన్ని సడలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ఉద్యోగాలను సృష్టించడం, మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం పలు సవరణలకు ఆమోదం తెలిపింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వర్తకం, నిర్మాణరంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర క్యాబినెట్ అనుమతినిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించింది. దీంతోపాటు ఎయిర్ ఇండియాలో విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతం వరకు పెట్టుబడి పెట్టేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. తద్వారా భారీగా పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగాలు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎఫ్‌డీఐ 17 శాతం పెరిగి 25.35 బిలియన్ డాలర్లకు చేరింది. -
వచ్చేస్తోంది జీఎస్టీ
► మరో రెండ్రోజుల్లో అమల్లోకి.. ♦ తయారీదారుల నుంచి రిటైల్ వ్యాపారుల వరకు అందరిపై పన్ను ♦ సాధారణ చెల్లింపుదారులు నెలనెలా.. ♦ కాంపోజిషన్ ట్రేడర్లు మూడు నెలలకోసారి.. ♦ వసూలు చేసే పన్నులో కేంద్రం–రాష్ట్రానికి చెరిసగం ♦ సేవా పన్నుతో రాబడి పెరిగే అవకాశం హైదరాబాద్: హరియాణాలో ఓ కారు తయారైంది. తయారీదారుడి వద్ద ఆ కారు విలువ రూ.10 లక్షలు. జూలై 1 నుంచి అమ ల్లోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రకారం కారు విలువలో 28 శాతం అంటే రూ.2.80 లక్షలు తయారీదారుడు హరియాణా ప్రభుత్వా నికి పన్ను చెల్లించాలి. అయితే కారు ఆ రాష్ట్రం లో అమ్ముకుంటేనే పన్ను హరియాణా ప్రభు త్వానికి వెళ్తుంది. అదే కారును తెలంగాణలో విక్రయిస్తే మాత్రం ఆ పన్ను మొత్తం తెలం గాణ ఖజానాకు చేరుతుంది. వినియోగదారు డికి కారును అమ్మే ఇక్కడి డీలర్లు చెల్లించే పన్ను కూడా తెలంగాణకే చెందుతుంది. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోనూ అమల్లోకి రానున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించిన మరికొన్ని అంశాలను ఓసారి చూద్దాం.. ♦ జీఎస్టీ పరిధిలోనికి వచ్చే ప్రతి వస్తువుపై విధించే పన్నులో 50 శాతం కేంద్రానికి వెళ్తుంది. ఇది కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ). మరో 50 శాతం రాష్ట్రానికి చెందుతుంది. అది రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ). ♦ ఏదైనా వస్తువు.. తయారైన రాష్ట్రంలోనే వినియోగించినప్పుడే ఈ రెండు పన్నులుంటాయి. అలాకాకుండా వస్తువు ఒక రాష్ట్రంలో తయారై, మరో రాష్ట్రంలో వినియోగిస్తే మాత్రం ఆ పన్ను కేంద్రానికి వెళ్తుంది. దీన్ని ఐజీఎస్టీగా వ్యవహరిస్తారు. అయితే ఆ పన్నును వస్తువు వినియోగం జరిగిన రాష్ట్రానికి కేంద్రం పంపిస్తుంది. ♦ పన్ను చెల్లింపుదారులను రెండు రకాలుగా విభజించారు. మొదటిది.. కాంపోజిషన్ ట్రేడర్లు. రెండవది సాధారణ చెల్లింపుదారులు. కాంపోజిషన్ ట్రేడర్ల వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది. వీరు ప్రతి మూడు నెలలకోసారివారి టర్నోవర్‌లో 1 శాతం మొత్తాన్ని జీఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. అదే తయారీదారులయితే 2 శాతం కట్టాలి. ♦ ఏడాదికి రూ.75 లక్షలకు పైగా టర్నోవర్ ఉంటే సాధారణ చెల్లింపుదారులుగా గుర్తిస్తారు. వీరు జీఎస్టీ కింద ప్రతినెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ♦ తయారీదారుడి నుంచి హోల్‌సేల్ డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైల్ డీలర్ వరకు అందరూ జీఎస్టీ కింద పన్ను చెల్లించాల్సిందే. వీరి నుంచి జీఎస్టీ వసూలు చేసే బాధ్యత సెంట్రల్ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలపై ఉంటుంది. ♦ పరోక్ష పన్నులన్నింటినీ కలిపి జీఎస్టీ ప్రతిపాదించినందున సర్వీస్ ట్యాక్స్ కింద ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ దుకాణం యజమాని తాను అమ్మే ఆభరణాలకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నాడు. అయితే ఆ దుకాణం ఉన్న భవనానికి నెలకు లక్షల్లో అద్దె చెల్లిస్తుంటే.. ఇకపై ఈ అద్దెకు కూడా సర్వీసు ట్యాక్స్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ ద్వారానే హైదరాబాద్‌లోని వాణిజ్య సముదాయాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. -
ఉద్యోగ కల్పవృక్షాలు... ఈరంగాలు
రియల్టీ, రిటైల్, లాజిస్టిక్స్.. న్యూఢిల్లీ: నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్, రిటైల్, రవాణా, లాజిస్టిక్స్ రంగాలు సమీప భవిష్యత్తులో అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో 2013 నాటికి 4.5 కోట్ల ఉద్యోగాలు ఉండగా, మరో 3.1 కోట్ల మంది అవసరం ఉన్నట్టు అసోచామ్ నివేదిక పేర్కొంది. వ్యవస్థీకృత రిటైల్ రంగం కోటికి పైగా ఉద్యోగావకాశాలను రానున్న ఐదేళ్లలో అందించనుందని, టెక్స్టైల్స్ రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పేర్కొంది. ‘‘ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. ఉద్యోగ కల్పన నిదానంగా ఉండనుంది. 2022 నాటికి ఈ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు అవసరమని నివేదిక వివరించింది. -
షాప్‌లో అన్ని వస్తువులూ డిస్ప్లేలో..
చిన్న వర్తకులకు స్నాప్‌బిజ్ టెక్నాలజీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తువుల ప్రదర్శన రిటైల్ రంగంలో అత్యంత కీలక అంశం. అన్ని వస్తువులూ కనపడేలా డిస్ప్లే ఉంటేనే అమ్మకాలు పెరుగుతాయి. చిన్న దుకాణాలకు ఇది అతిపెద్ద అడ్డంకి. స్థలాభావంతో అన్ని ప్రొడక్టులను డిస్ప్లే చేయలేరు. ఇటువంటి సమస్యకు చెక్ పెడుతూ రిటైల్ టెక్నాలజీ కంపెనీ స్నాప్‌బిజ్ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ప్రతి దుకాణంలో 24 అంగుళాల స్మార్ట్ హెచ్డీ ఎల్ఈడీ డిస్ప్లేను అమర్చుతారు. బిల్లింగ్ కౌంటర్ వద్ద స్నాప్‌బిజ్ టర్బో పేరుతో కంప్యూటర్ తెర వంటి 15.6 అంగుళాల టచ్ స్క్రీన్‌ను వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రింటర్, బార్కోడ్ స్కానర్‌ను దీనికి అనుసంధానిస్తారు. ఈ స్క్రీన్ ద్వారా ఎల్ఈడీ డిస్ప్లేను దుకాణదారు ఆపరేట్ చేయవచ్చు. షాప్‌లో ఉన్న వస్తువులతోపాటు డిస్కౌంట్లు, ప్రమోషన్ ఆఫర్లను ఎల్ఈడీ డిస్ప్లేలో ప్రదర్శించవచ్చు. 4 బిల్లులు ఒకేసారి పూర్తి చేయవచ్చు. ఇక కస్టమర్లు స్నాప్ ఆర్డర్ యాప్ ద్వారా సమీప దుకాణంలో లభించే వస్తువుల జాబితాను చూడొచ్చు. ఆర్డరు ఇవ్వొచ్చు. వ్యాపారం పెరుగుతుంది డిస్ప్లే ఆకర్షణీయంగా ఉంటే అమ్మకాలు పెరుగుతాయని స్నాప్‌బిజ్ సహ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ముంబై, పుణేలో 3,000 దుకాణాల్లో స్నాప్‌బిజ్ టర్బో ఏర్పాటు చేశాం. గతంతో పోలిస్తే వీరి వ్యాపారాల్లో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాం. కిరాణా దుకాణాలను డిజిటైజ్ చేస్తాం. వర్తకులు రూ.40,000 చెల్లిస్తే చాలు. నిర్వహణ చార్జీలు లేవు. ఇంటర్నెట్ చార్జీలు మేమే భరిస్తాం. ప్రస్తుతం 25 దిగ్గజ రిటైల్ కంపెనీలు మాతో చేతులు కలిపాయి. ఈ కంపెనీల ఉత్పత్తులు ఎల్ఈడీ డిస్ప్లేలో ప్రదర్శితమవుతాయి. విక్రయాలను బట్టి కంపెనీలు వర్తకులకు ఇన్సెంటివ్ ప్రకటిస్తాయి. స్నాప్ ఆర్డర్ యాప్‌లో కంపెనీతో భాగస్వామ్యం ఉన్న ఎన్ని దుకాణాలనైనా జోడించొచ్చు. స్నాప్‌బిజ్ టర్బోకై 7 పేటెంట్లకు దరఖాస్తు చేశాం’ అని తెలిపారు. -
ప్రింట్, నిర్మాణం, రిటైల్ రంగంలో మరిన్ని ఎఫ్‌డీఐలు
న్యూడిల్లీ: ప్రింట్ మీడియా, నిర్మాణం, రిటైల్ రంగాల్లో మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అంశంపై బుధవారం ఆర్థిక మంత్రిత్వశాఖలో వివరణాత్మక చర్చలు జరిగాయి. ఈ ప్రతిపాదనలపై తుది ఆమోదం పొందేందుకు కేంద్ర, వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర కేబినెట్‌ను సంప్రదించనుంది. ప్రస్తుతం ఎఫ్‌డీఐ నిబంధనలను మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్ధిక వృద్ధికి ఉద్యోగాలను సృష్టించేందుకు పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణంలో మరిన్ని ఎఫ్‌డిఐలను ఆకర్షించనుందని తెలిపాయి. 2017-18 సంవత్సర ఆర్థిక బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మేరకు ఈ కసరత్తు చేస్తోంది. విదేశీ పెట్టుబడులు కీలకంగా భావిస్తున్న ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులపై దృష్టిపెట్టింది. సింగిల్ బ్రాండు, బహుళ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌లో పాలసీని సులభతరం చేస్తుంది. ఒకే బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐని కొన్ని పరిస్థితులతో ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం, 49 శాతం వరకు ఆటోమాటిక్ మార్గంలో అనుమతి ఉంది కానీ ఆ పరిమితి దాటితే ప్రభుత్వం ఆమోదం అవసరం. అంతేకాదు, విదేశీ కంపెనీలకు 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను అమ్మడం కోసం దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలు, పరిమితులతో, వార్తాపత్రికలు, శాస్త్రీయ మ్యాగజైన్ల ప్రచురణ లాంటి విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం అనుమతిస్తోంది. అలాగే వివిధ కండిషన్లతో నిర్మాణ రంగ ప్రాజెక్టులలో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఈ విధానాన్ని కూడా మరింత సరళతరం చేసే ప్రతిపాదన సిద్ధం చేసింది. పూర్తికాని ప్లాట్లు, ఇతర ప్రాజెక్టులలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఒక భారతీయకంపెనీ అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఇండియన్ ఇన్వస్టీ కంపెనీకి అభివృద్ధి చెందిన ప్లాట్లను విక్రయించటానికి అనుమతి ఉంది. రహదారులు, నీటి సరఫరా, వీధి దీపాలు, నీటి పారుదల , మురికినీరు తదితర మౌలిక సదుపాయాలు ఉన్న ప్లాట్ల విక్రయానికి మాత్రమే అనుమతి. కాగా విదేశీ పెట్టుబడులు దేశం చెల్లింపుల సమతుల్యతను మెరుగుపర్చడంతో పాటు, ఇతర ప్రపంచ కరెన్సీలకు, ప్రత్యేకంగా అమెరికా డాలర్ వ్యతిరేకంగా రూపాయి విలువను మరింత బలోపేతం చేస్తుందనేది అంచనా. ఈ నేపథ్యంలోనే గత ఏడాది రక్షణ, పౌర విమానయాన, నిర్మాణం, అభివృద్ధి, ప్రైవేటు భద్రతా సంస్థలు, రియల్ ఎస్టేట్, న్యూస్ ప్రసారాలు సహా దాదాపు 12 సెక్టార్లలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. -
టోకు, రిటైల్ ధరల మంట..
⇒ ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతం ⇒ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం ⇒ వేగంగా పెరిగిన నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలు న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత ప్రభావం ఫిబ్రవరిలో అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండింటిపై ప్రభావం చూపించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతంగా నమోదుకాగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదయ్యింది (2016 ఫిబ్రవరితో పోల్చిచూస్తే). 2017 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం రేటు 5.25%గా ఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా ఉంది. సూచీలనూ వేర్వేరుగా చూస్తే... టోకు ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్టం.. ⇔ ఆహార, ఇంధన ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 2017 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతంగా ఉంది. ఆహార ధరలు ఫిబ్రవరిలో వార్షికంగా 2.69 శాతం పెరిగితే, జనవరిలో ఈ రేటు 0.56 శాతంగా ఉంది. తృణధాన్యాలు, బియ్యం, పండ్ల ధరలు పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 8.05 శాతం పెరిగాయి. ⇔ ఇంధన ధరల బాస్కెట్ –7.07 శాతం క్షీణత నుంచి 21.02 శాతానికి పెరిగింది. ⇔ సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం వార్షికంగా క్షీణత –0.52 శాతం నుంచి 3.66 శాతానికి ఎగసింది. రిటైల్ నాలుగు నెలల గరిష్టానికి... జనవరిలో 3.17 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, తరువాతి నెల ఫిబ్రవరిలో నాలుగు నెలల గరిష్ట స్థాయి 3.65 శాతానికి చేరింది. రిటైల్‌గా చూస్తే– ఆహార ఉత్పత్తుల ద్రవ్యో ల్బణం 2.01 శాతంగా నమోదయ్యింది. (జనవరిలో 0.61 శాతం) పండ్ల ధరలు భారీగా 8.33 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్ విభాగంలో రేటు 3.9 శాతంగా ఉంది. మాంసం, చేపల ధరలు 3.5 శాతానికి ఎగశాయి. చక్కెర, తీపి పదార్థాల ధరలు 18.83 శాతం పైకి లేచాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4.22 శాతం పెరిగాయి. గృహోపకరణాలు, సేవల విభాగంలో రేటు 4.09 శాతంగా ఉంది. ఆరోగ్య విభాగంలో ద్రవ్యోల్బణం 4 శాతం ఉంది. రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ద్రవ్యోల్బణం 5.39 శాతం ఎగసింది. కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం –8.29 శాతం, –9.02 శాతం చొప్పున తగ్గాయి.దుస్తులు, పాదరక్ష విభాగంలో రేటు 4.38 శాతంగా ఉంది. హౌసింగ్ సెగ్మెంట్లో ఈ రేటు 4.9 శాతంగా ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం నెలవారీగా ఫిబ్రవరిలో 3.36 శాతం నుంచి 3.67 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 2.9 శాతం నుంచి 3.55 శాతానికి చేరింది. కాగా ధరల పెరుగుదల కారణంగా 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతంపైకి ఎగసే అవకాశం ఉందని ఇక్రా ప్రిన్షిపల్ ఎకనమిస్ట్ ఆదితి నయ్యర్ అభిప్రాయపడ్డారు. రేట్లు ఇక యథాతథమే..! బ్యాంకులకు తానిచ్చే రుణరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) ఇక తగ్గించడం కష్టమేనని గత పాలసీ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. తాజా ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇదే విధంగా ఆర్బీఐ ఇకముందూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 6న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. -
లెక్కపెట్టగలవా.. చిల్లర లెక్కపెట్టగలవా!
మంచిర్యాల అగ్రికల్చర్: దగ్గర ఉన్న పెద్ద నోట్లను ఖాతాలో వేసుకొని చిన్న నోట్లను తీసుకుందామని బ్యాంకుకు వెళ్తే బ్యాంకు వారు ఇచ్చే చిల్లరను చూసి జనం అశ్చర్యపోవాల్సి వస్తోంది. తీసుకున్న చిల్లరను జేబులో పెట్టుకొని వస్తామనుకుంటే పొరపడినట్లే..! ఏ వంద నోటో.. యాభై నోటో.. ఇస్తారనుకుని బ్యాంకుకు వెళ్తే గతంలో ఎన్నడూ లేని విధంగా పది రూపాయల కాయిన్స ఖాతాదారులకు అందిస్తున్నారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు సరిపడా నగదు రాకపోవడంతో చిల్లర అందిస్తున్నారు. వెయి నుంచి మొదలుకుని ఆరు వేల రూపాయల వరకు చిల్లర ఇస్తున్నారు. కాగా.. మూట కట్టించి ఇచ్చిన కాటన్ సంచి బ్యాంకు వారికి తిరిగి ఇవ్వకుంటే బ్యాంక్ పాస్ బుక్ ఇవ్వడం లేదు. దీంతో ఖాతాదారులు బ్యాంకుల వద్దే గంటల తరబడి ఉండి బిల్లలు లెక్కించారు. -
చిల్లర చిక్కులకు స్వస్తి
► రూ.1,500 కోట్ల విలువైన రూ.500 నోట్లు వచ్చేశాయి ► 25వ తేదీ నుండి పంపిణీ? ► కొనసాగుతున్న కరెన్సీ పాట్లు నల్లధనం వెలికితీసేందుకు పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేయడం ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది. నల్లకుబేరుల మాటెలా ఉన్నా పేద, మధ్య తరగతి కుటుంబాలవారు కొత్త కరెన్సీని మార్చుకోలేక కుదేలైపోతున్నారు. చిల్లర చిక్కులకు స్వస్తి పలికే విధంగా రూ.1,500 కోట్ల విలువైన రూ.500 నోట్లు చెన్నైకి వచ్చినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ నెల 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 10వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీని ప్రారంభించింది. తొలిదినాల్లో బ్యాంకులకు వచ్చిన వారందరూ రూ.4 వేలు వరకు కరెన్సీ మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. బ్యాంకుల్లో జనం రద్దీని నివారించేందుకు క్రమేణా అనేక సంస్కరణలు చేయడం ప్రారంభించారుు. కరెన్సీ పరిమితిని రూ.4,500గా పెంచింది. ఆ తరువాత కరెన్సీ అయిపోయిందంటూ మార్పిడి లేదు కేవలం డిపాజిట్లు మాత్రమేనని ప్రకటించింది. ఆ తరువాత వేలిపై ఇంకు గుర్తు పెట్టి రెండోసారి రాకుండా కట్టడి చేసింది. డబ్బు డ్రా చేసేవారు, చిల్లర నోట్లు కావాల్సిన వారు ఏటీఎంలకు వెళ్లమని సలహాలిచ్చింది. అరుుతే ఏటీఎంల వద్ద చాం తాడంత క్యూలు, అనేక ఏటీఎంలు పనిచేయక పోవడం ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారుు. తాజాగా ఖాతాలున్నవారు మాత్ర మే క్యూలో రండి అంటూ మిగిలిన వారిని పంపేస్తోంది. మరి బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు తమ పాత నోట్లను కొత్త నోట్లుగా ఎలా మార్చుకోవాలో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. పాత కరెన్సీ మార్పిడిపై రూపొందించిన నిబంధనల్లో తరచూ మార్పులు చోటుచేసుకోవడంతో జనం తమవైపు రాకూడదనేలా బ్యాంకుల వారు ఆశించిన ఫలితాలను ఇచ్చింది. బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు ఉన్నా కేవలం రూ.24 వేలు మాత్రమే డ్రా చేసుకోవచ్చని షరతు విధించింది. అరుుతే కొత్త కరెన్సీ, పాత కరెన్సీ రెండూ స్టాకు లేకపోవడంతో రూ.24వేలు కూడా దక్కడం లేదు. కొన్ని చోట్ల సీనియర్ సిటిజన్లకు మాత్రమే కొత్త కరెన్సీ ఇచ్చి పంపుతున్నారు. తాజాగా కరెన్సీ మార్పిడి అవకాశం ఖాతాలున్నవారికే బ్యాంకులు పరిమితం చేయడం ప్రజలను మరోసారి కరెన్సీ కష్టాల్లోకి నెట్టివేసింది. ఖాతాదారులు మాత్రమే డబ్బు డ్రాచేసుకునే నిబంధన వల్ల కొందరు మహిళలు తమ చిన్న పిల్లలను, చివరకు పొత్తిళ్లలోని పసిబిడ్డలను తీసుకుని బాలింతలు క్యూలో నిలబడుతున్నారు. కరెన్సీ కొరత తీవ్రరూపం దాల్చడంతో ప్రజల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నారుు. పాత నోట్లను తీసుకోనందున రేషన్ దుకాణాల్లో సరుకులు పొందలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రేషన్‌షాపు డీలర్లకు, ప్రజలకు మద్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పోలీస్ బందోబస్తు అవసరం అవుతోంది. ఇదిలా ఉండగా రూ.1,500 కోట్ల విలువైన రూ.500 నోట్లు ఒక ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి చెన్నైకి చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అరుుతే దీనిపై సోమవారం రాత్రి వరకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడ లేదు. రూ.500 నోట్ల కరెన్సీని త్వరలో ప్రజా పంపిణీకి ప్రవేశపెడుతారని చెబుతున్నారు. గతంలో పొందిన సమాచారం ప్రకారం 25వ తేదీ నుంచి రూ.500 నోట్లు వినియోగంలోకి రావచ్చు. పెట్రో బంకుల్లోనూ రూ.2000 నోట్లు బ్యాంకుల వద్ద రద్దీని తగ్గించుకునేందుకు పెట్రో బంకుల్లో మార్పిడి వసతి ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్రం మొత్తం మీద 59 పెట్రోలు బంకుల ద్వారా కొత్త కరెన్సీ పొందే సదుపాయాన్ని కల్పించారు. అరుుతే పెట్రోలు బంకుల వారు సైతం కేవలం రూ.2000 నోట్లు మాత్రమే ఇవ్వడంతో చిల్లర సమస్య తీవ్రరూపం దాల్చింది. అంతేగాక పాత రూ.500, రూ.1000 నోట్లను అనుమతించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పెట్రోలు బంకులు ఖాతరు చేయడం లేదు. తమిళనాడు పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ, ఒక రోజుకు ఒక ఏజెన్సీ తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి రూ.1లక్షలు పొంది 50 మందికి తలా రూ.2000 ఇస్తున్నామని తెలిపారు. అరుుతే కొత్త నోటు వద్దు చిల్లర కావాలని ప్రజలు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. రూ.100, 50, 20, 10 నోట్లు ఇస్తేనే ఉపయోగమని అన్నారు. నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం అనేక ఆందోళనా కార్యక్రమాలు జరిగారుు. కాంగ్రెస్ నేతలు చెన్నైలో పలుచోట్ల రాస్తారోకో నిర్వహించారు. -
క్యూలోనే కామన్‌మ్యాన్
నగదు మార్పిడి, కొత్త నోట్లు, చిల్లర కోసం సామాన్యుల తిప్పలు - ఏటీఎంలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద భారీగా క్యూలైన్లు - ఇంకా అందుబాటులోకి రాని కొత్త రూ.500 నోట్లు - రూ.2 వేల నోటుకు ‘చిల్లర’ కష్టాలు సాక్షి నెట్వర్క్: సామాన్యుడికి ఇంకా పడిగాపులు తప్పడం లేదు. నగదు మార్పిడి, కొత్త నోట్లు, చిల్లర కోసం బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఇళ్లలో శుభకార్యాలున్నవారు సైతం ఆ పనులు వదిలి క్యూలైన్లలో నిలబడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. ఇంకా కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలకు చిల్లర కోసం కష్టాలు తప్పడం లేదు. దీంతో అన్ని రకాల వ్యాపారాలూ దాదాపుగా స్తంభించిపోయాయి. చెక్కులతో వారానికి రూ.24 వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చన్న నిబంధన ఉన్నా.. నగదు అందుబాటులో లేక చాలా బ్యాంకులు రూ.10 వేల వరకు మాత్రమే ఇస్తున్నాయి. అది కూడా అన్నీ రూ.2 వేల నోట్లనే ఇస్తుండడంతో చిల్లర కోసం ఇబ్బందులు తప్పడం లేదు. రూ.2 వేల నోటుతో తప్పని తిప్పలు: శుక్రవారం నుంచి కొన్ని ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు మాత్రమే వస్తుండడంతో.. వాటికి చిల్లర మార్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిరు వ్యాపారులెవరూ ఆ నోట్లకు చిల్లర ఇచ్చే పరిస్థితి ఉండదు. పూర్తిగా రూ.2 వేలకు సామగ్రి కొనుగోలు చేయాల్సిన అవసరం అసలే ఉండదు. దీంతో ఏటీఎంలలో వెంటనే కొత్త రూ.500 నోట్లను పెట్టేలా మార్పులు చేసి, అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జోరుగా కమీషన్ల దందా.. పాత నోట్ల మార్పిడిపై భారీ ఎత్తున్న కమీషన్ల దందా నడుస్తోంది. పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను మార్చేందుకు దళారులు 20 నుంచి 35 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు బ్యాంకు అధికారులు దళారులకు సహకరించి కొత్త నోట్లు ఇస్తున్నారు. పోలీసులు ఇప్పటికే పలువురు దళారులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారని సమాచారం. బంగారం వ్యాపారులు ఐటీ నోటీసుల భయంతో తమ జ్యుయెలరీ దుకాణాలను మూసివేసి.. ఇళ్ల నుంచే జీరో వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శుభకార్యాలు వదిలి క్యూలైన్లలో.. పెళ్లి కార్డు, తగిన ఆధారాలు చూపిస్తే రూ.2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసినప్పటికీ.. ఆచరణలో అమలు కావడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం అంబర్‌పేట్‌కు చెందిన వినోద్‌యాదవ్ అనే యువకుడి వివాహం ఈనెల 24న జరుగనుంది. ఆయన పెళ్లి పనులు పక్కనపెట్టి మరీ నగదు కోసం స్థానిక ఆంధ్రా బ్యాంకు వద్ద రెండు రోజులుగా క్యూలైన్లో నిల్చున్నా నగదు ఇవ్వడం లేదు. మేనేజర్ లేరంటూ బ్యాంకు అధికారులు తనను తిప్పి పంపుతున్నారని వినోద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా పలువురు ఖాతాదారులు సైతం తమ ఇళ్లలో శుభకార్యాలున్నా.. ఆ పనులను పక్కనబెట్టి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. రూ.14 వేలు.. చిల్లర నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన చాణక్య శనివారం ఉదయం తన ఖాతాలోని సొమ్ము విత్‌డ్రా చేసుకోవడానికి స్థానిక ఎస్బీహెచ్ బ్రాంచీకి వచ్చాడు. మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చొన్నాడు. కానీ బ్యాంకులో డబ్బులు అరుుపోయాయి. అరుునా చాణక్య తనకు డబ్బులు అత్యవసరం కావడంతో.. రూ.14 వేలకు మొత్తం పది రూపాయల నాణేలను తీసుకుని వెళ్లాడు. అదే ఈ చిత్రం. ఇక పీపీపీ.. డుండుంనే.. ఈ ఫొటోలో ఉన్న తండ్రి, కుమార్తెల పేర్లు మైలారం వెంకటయ్య, కల్యాణి. వారిది జనగామ మండలం లింగాల ఘణ పురం మండలం జీడికల్. ఈనెల 24న కల్యాణికి వివాహం జరుగ నుంది. వెంకటయ్య కొంత డబ్బు బ్యాంకులో దాచుకున్నాడు. పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. పెద్ద నోట్లరద్దు నిర్ణయం వెలువడింది. దీంతో వెంకటయ్య ఆందోళనలో మునిగిపోయాడు. పెళ్లి కార్డుల నుంచి కొన్ని ఏర్పాట్ల వరకు బాకీపై సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. పెళ్లి కోసం రూ.2.5 లక్షలు తీసుకోవచ్చన్న తాజా నిబంధనతో... శుక్రవారం తన కుమార్తె కల్యాణితో కలసి జనగామ ఎస్బీఐకి వచ్చి రూ.2.5 లక్షలు డ్రా చేసుకుని వెళ్లారు. ఖాతాదారులూ.. ‘కూల్’.. నోట్ల మార్పిడి, డిపాజిట్ల కోసం వచ్చే జనానికి ఉపశమనం కలిగించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఎస్బీహెచ్ అధికారులు శుక్రవారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు, ఏటీఎం వినియోగదారులకు చీఫ్ మేనేజర్ డి.సురేష్‌బాబు స్వయంగా వెళ్లి కూల్‌డ్రింక్స్ అందించారు. పెద్ద సంఖ్యలో వస్తూ, క్యూలలో నిలబడుతున్న ఖాతాదారులకు మజ్జిగ, తాగునీరు, కూల్‌డ్రింక్స్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులు ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండకుండా బ్యాంకులో ప్రత్యేకంగా ఏటీఎం కార్డుదారులకు కౌంటర్ ఏర్పాటు చేరుుంచామన్నారు. నోట్లు చెల్లక.. పెద్దనోట్లు చెల్లక, వైద్యం అందక మెదక్ జిల్లా వెల్దుర్తి మండ లం అచ్చం పేటకు చెందిన జూలూరి నర్స య్య (65) అనే వృద్ధుడు మృతి చెందాడు. 5 రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధపడుతున్న నర్స య్యను.. వెల్దుర్తిలోని పలు ప్రైవేటు ఆస్ప త్రులకు తీసుకెళ్తే పాత నోట్లు చెల్లవంటూ వైద్యం చేయలేదు. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడా పెద్ద నోట్లు చెల్లక, వైద్యులు రాసిన టెస్టులు చేరుుంచుకోలేక గురువారం ఇంటికి తిరిగి వచ్చేశారు. కొంత సేపటికే నర్సయ్య మృతి చెందాడు. ‘‘పెద్ద నోట్లు చెల్లకనే నర్సయ్య ప్రాణం పోరుుంది. చుట్టా లు ఇచ్చిన నోట్లు తీసుకుని ఆస్పత్రులకు పోతే.. చెల్లవంటూ డాక్టర్లు చూడలేదు. మందుల దుకాణానికి పోతే మందులు ఇవ్వలేదు. ఈ చెల్లని నోట్లు మా ప్రాణాలు మింగుతున్నారుు..’’ అని నర్సయ్య భార్య దుర్గమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. -
సంత.. నోట్ల చింత
• దేవరకద్ర మార్కెట్లో తగ్గిన వ్యాపారాలు • చిల్లర ఉంటేనే సరుకులంటున్న వ్యాపారులు దేవరకద్ర : దేవరకద్రలో బుధవారం జరిగిన సంతలో నోట్ల చింతతో వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగారుు. వారాంతపు సంత కావడం వల్ల చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు వారానికి సరిపడా కొనుగోలు చేస్తుంటారు. అరుుతే రూ.వేరుు, రూ. 500 నోట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పాత నోట్లను వ్యాపారుల తీసుకోక పోవడంతో ఇబ్బందుల పాలయ్యారు. బ్యాంకుల వద్ద గంటల తరబడి నిలబడి కొత్త నోట్లను తీసుకున్న ఫలితం లేకుండాపోరుుంది. ఎక్కడికి వెళ్లిన రూ. 2వేల నోటుకు చిల్లర లేదని చెప్పడంతో ఏమి కొనలేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు. సగానికి తగ్గిన వ్యాపారాలు నిత్యావసర సరుకుల దుకాణాలలో సగానికి సగం వ్యాపారాలు తగ్గిపోయారుు. కూరగాయల వ్యాపారం మందకొడిగా సాగింది. గతంలో సంతరోజు ఒక్కో దుకాణం రూ.5వేల వ్యా పారం నడవగా.. ప్రస్తుతం రూ.2వేలకు కూడా మించడం లేదు. ఇక కిరాణా షాపుల్లో సరుకులు కొనే వారు తక్కువగా వచ్చారు. చాలామంది బ్యాంకుల వద్దనే పడిగాపులు పడడం వల్ల సంత అంతా ఖాళీగా కనిపిం చింది. ఎక్కడ చూసిన పాత నోట్లు చెల్లవని చెప్పడంతో డబ్బులు ఉన్నా ఏమి తినలేము, ఏమి కొనలేమని పలువురు నిరాశకు గురయ్యారు. చాలాచోట్ల ఏమైనా సరుకులు అడిగితే ముందుగా చిల్లర ఉందా అని అడుగుతున్నారు. లేదని వినియోగదారులు చెప్పడంతో సరుకులుకూడా లేవని చెబుతున్నారు. -
జనజీవనం.. చిల్లర వందర
- పెద్దనోట్ల రద్దుతో గ్రామాల్లో ఆర్థిక సంక్షోభం - రూ. వంద నోట్ల కరువుతో జనం విలవిల - మూడు వారాల తర్వాతే అందుబాటులోకి ఏటీఎంలు - రూ. 100 నోట్లు కరువు - జిల్లాకు ఇంకా రాని రూ. 500 నోట్లు డబ్బుకు ఉన్నోడు.. లేనోడు అనే తేడా లేనట్లు నోట్ల మార్పిడితో ఎదురవుతున్న కష్టాలకు అందరూ బాధితులయ్యారు. కష్టపడి సంపాదించిన నోట్లు మార్చుకునేందుకు కూలీలు, వ్యాపారులు, కుటుంబ అవసరాలకు దాచుకున్న సొమ్మును డిపాజిట్ చేసేందుకు ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబీకులు బ్యాంకులు తెరవక ముందే గేట్ల ముందర వాలిపోతున్నారు. గంటల తరబడి నిలబడి నోట్లు మార్చుకుంటున్నారు. మరో వైపు పనులు లేక.. వ్యాపారు లేక.. అవసరాలకు డబ్బులందక.. జీనజీవనం చిందర వందర అవుతోంది. నోట్ల పాట్లు అంచనాకు అందడం లేదు. - కర్నూలు (అగ్రికల్చర్) పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. పెద్దనోట్లు రద్దు చేసి వారం రోజులు అవుతున్నా ఽనగదు కొరత తీరకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మరిన్ని రోజులు ఆర్థిక సంక్షోభం తప్పదని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. నగదు కొరతతో పంట ఉత్పత్తులను అమ్ముకునే వ్యవసాయ మార్కెట్ కమిటీలు మూతపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సమస్య తీవ్ర రూపం దాల్చిందనేందుకు 20 శాతం కమీషన్ ఇచ్చి నోట్లు మార్చుకోవడమే నిదర్శనం. జిల్లాలో 403 ఏటీఎంలు ఉన్నా ఇందులో 50 కూడా పనిచేయడం లేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మరో మూడు వారాలు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన రూ.2000 నోట్ల సైజు తగ్గిపోయింది. త్వరలో జిల్లాలోకి రానున్న 500 నోట్ల సైజు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. రూ.2000, 500 నోట్లను ఏటీఎంలలో పెట్టాలంటే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు అవసరమయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు వారాలు పట్టే అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అంతవరకు రూ.100, 50 నోట్ల మాత్రమే ఏటీఎంలలో పెట్టుకోవాలని ఉన్నత స్థాయి బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. రూ. వంద, 50 నోట్లకు తీవ్రమైన కొరత ఉండటంతో ఏటీఎంలు అందుబాటులోకి రావడం లేదు. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, విజయబ్యాంకులకు మాత్రమే ఆర్బీఐ కరెన్సీ చస్ట్‌లు ఉన్నాయి. రూ. వంద, 50 నోట్ల ఈ బ్యాంకులకు మాత్రమే వస్తున్నందున వీటికి సంబంధించిన ఏటీఎంలు కొద్దిమేర పనిచేస్తున్నాయి. మిగతా ఏటీఎంలు పనిచేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులకు పోటెత్తుతున్నారు. డిపాజిట్లు 1800 కోట్లు... మార్పిడి రూ. 60కోట్లు పెద్దనోట్ల రద్దు నేపథ్యంతో బ్యాంకులకు డిపాజిట్లు పోటెత్తుతున్నాయి. అదే సమయంలో నోట్ల మార్పిడికి ప్రజలు క్యూ కడుతున్నా ఇప్పటి వరకు జరిగిన మార్పిడి అంతంత మాత్రమే. కొన్ని బ్యాంకులకు పెద్దనోట్ల రద్దుకు ముందు ఎస్బీఐ ఖాతాల్లో ఉన్న మొత్తంతో పోలిస్తే అయిదారు రోజుల వ్యవధిలోనే అంతకంటే ఎక్కువ మొత్తం జమ అయినట్లు సమాచారం. రోజుకు సగటున రూ. 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు డిపాజిట్లు వస్తున్నాయి. రద్దు అయిన పెద్దనోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని(ఎక్చేంజ్) కేంద్రం ప్రకటించింది. నోట్లను మార్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు బ్యాంకుల ఎదుట క్యూ కడుతున్నా...ఇప్పటి వరకు కేవలం రూ. 60 కోట్లు విలువ నోట్ల మార్పిడి జరిగింది. చిల్లర కష్టాలు రూ. వందనోట్ల కొరత ఎప్పటికి తీరుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లా అవసరాలకు రోజుకు రూ. 100 కోట్ల విలువ చేసే వందనోట్లు అవసరం ఉంది. కాని మార్కెట్లో కేవలం రెండు, మూడు కోట్ల విలువ చేసే వందనోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నగదు కొరత తీవ్రమైంది. అన్ని వర్గాల వారికి వందనోట్లు ప్రాణాధారం కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. రిజర్వుబ్యాంకు రూ.500 నోట్లు ముద్రించినప్పటికి జిల్లాకు చేరలేదు. జిల్లాకు రావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వంద, 500 నోట్లు పూర్తిగా మార్కెట్లోకి వస్తేనే నగదు కొరత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రూ. 50నోట్ల కొరత కూడ ఎక్కువగానే ఉంది. బ్యాంకులకు తగ్గని జనాలు.... బ్యాంకులకు జనాల రద్దీ తగ్గడం లేదు. జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా 445 బ్రాంచీలు ఉన్నాయి. డిపాజిట్లు, నోట్ల మార్పిడి, విత్‌డ్రా కోసం అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు. సగటును ప్రతి బ్యాంకుకు రోజుకు 800 నుంచి 1000 మంది వరకు వస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకారం రోజుకు బ్యాంకులకు 4 లక్షలకు పైగా మంది వస్తున్నట్లు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందున్న పరిస్థితితో పోలిస్తే బ్యాంకులకు ప్రజల తాకిడి ఏడెనిమిది రెట్లు పెరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రజలు అన్ని పనులు వదులు కొని నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. నోట్లు లభ్యం కాక వెనుదిరుగుతున్న వారు 40 శాతం వరకు ఉంటున్నారు. ఆచరణలోకి రాని మజ్జిగ పంపిణీ బ్యాంకుల వద్ద క్యూలో గంటల తరబడి నిల్చునే వారికి మంగళవారం నుంచి మజ్జిగ పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. బుధవారం నుంచి అమలులోకి తీసుకవచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకులకు వచ్చే వారికి విజయడెయిరీ మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా ఇస్తుండగా ప్రభుత్వం డెయిరీకి రూ.3 ప్రకారం చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 250 ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లో 400 ప్యాకెట్ల ప్రకారం అన్ని బ్రాంచిల్లో పంపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
రిటైల్‌లో రూ.3,350 కోట్లు
హెచ్1 2016లో రికార్డు స్థాయిలో పీఈ నిధుల వెల్లువ సాక్షి, హైదరాబాద్: దేశీయ చిల్లర వర్తకం (రిటైల్ రంగం)లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఏనాడు రాని స్థాయిలో 2016 హెచ్1లో రికార్డు స్థాయిలో పెట్టుబడులొచ్చాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. 2015 హెచ్1లో రిటైల్ రంగంలో రూ.250 కోట్ల పీఈ పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది హెచ్1లో రూ.3,350 కోట్లు వచ్చాయని పేర్కొంది. రిటైల్ రంగంలో లీజు కార్యకలాపాలు పెరగడం, రీట్స్ వంటి పెట్టుబడి విధానాల్లో ప్రభుత్వం సడలింపునివ్వటం వంటివి ఈ వృద్ధికి కారణమని నివేదిక వెల్లడించింది. గతేడాది కాలంగా కస్టమర్ల జీవన వృద్ధి కూడా 10 శాతం పెరిగిందని, ఈ-కామర్స్ రంగం అభివృద్ధి కూడా పీఈ పెట్టుబడులకు కలిసొచ్చాయని సంస్థ ఎండీ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు హైదరాబాద్, బెంగళూరుల్లో గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని 8 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, పుణె, కోల్కత్తా, ముంబైల్లో 2015 హెచ్1లో 0.2 మిలియన్ చ.అ.ల్లో మాల్స్ రాగా.. ఈ ఏడాది హెచ్1లో 4.8 మిలియన్ చ.అ.ల్లో కొత్త మాల్స్ వచ్చాయి. కొత్త మాల్స్ సరఫరాలో 64 శాతంతో ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే మాల్ వెకన్సీలో మాత్రం 33 శాతంతో అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ-ఎన్సీఆర్, పుణెల్లో 20 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబైలో 16 శాతం, బెంగళూరులో 12 శాతం వెకన్సీ ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
కొత్త ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు!
► 10-30% వేతనాల వృద్ధి ► నియామక ప్రణాళికల ► రూపకల్పనలో కంపెనీలు ► ఆర్థిక వృద్ధి అంచనాలు, ప్రభుత్వ చర్యలే కారణం న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో జాబ్ మార్కెట్ కళకళలాడనున్నది. అటు నిరుద్యోగులకు, ఇటు ఉద్యోగులకు ఇద్దరికీ కొత్త సంవత్సరం కలసిరానుంది. 2016లో కంపెనీలు దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అలాగే ఉద్యోగ వేతనాలు కూడా 10-30 శాతం పెరగనున్నాయి. 2015లో జాబ్ మార్కెట్ బుల్లిష్‌గానే ఉందని, అదే ట్రెండ్ కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతుందని హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు అనుకూలముగా ఉండటం, ఫైనాన్స్, రిటైల్, టెక్నాలజీ రంగాల్లో స్టార్టప్ అనుకూల పరిస్థితుల కల్పన వంటి అంశాలు కారణాలుగా నిలువనున్నాయి. ఉద్యోగాల సృష్టి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు దేశంలో ఉద్యోగాల సృష్టికి దోహదపడనున్నాయి.అంతర్జాతీయ కంపెనీలు భారత తయారీ రంగం సహా ఇతర ఎఫ్‌డీఐ అనుకూల రంగాల్లోకి ప్రవేశించడం జాబ్ మార్కెట్ వృద్ధికి ఊతమిచ్చే అంశం. ప్రభుత్వపు డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలు వల్ల టెక్నాలజీ, తయారీ రంగాల్లో ఉద్యోగ సిబ్బంది డిమాండ్ పెరుగుతుందని టైమ్స్‌జాబ్స్.కామ్ సీవోవో వివేక్ మధుకర్ తెలిపారు. జాబ్ మార్కెట్ వృద్ధిలో ఈ-కామర్స్, స్టార్టప్స్ కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తాయని చెప్పారు. భారత వ్యవస్థీకృత రంగంలో ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరగవచ్చని మైహైరింగ్‌క్లబ్.కామ్, జాబ్‌పోర్టల్.కో.ఇన్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. ఇక టైమ్స్‌జాబ్స్.కామ్ నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 60 శాతం కంపెనీలు నియామక ప్రక్రియకు సానుకూలంగా ఉన్నట్లు తేలింది. కొత్త ఏడాది అన్ని రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ పేర్కొన్నారు. వేతనాలు పెరుగుతాయ్.. ప్రస్తుత ఏడాదిలో ఉద్యోగుల వేతనాల వృద్ధి సగటున 12-14 శాతంగా ఉండొచ్చని, అదే అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగుల వేతనాలు 25-30 శాతంమేర పెరగవచ్చని గ్లోబల్హాంట్ మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ గోయెల్ తెలిపారు. కన్సూమర్ వ్యయ సామర్థ్యం పెరగడం, అనుకూల ఆర్థిక వృద్ధి అంచనాలు వంటి పలు అంశాల కారణంగా కొత్త ఏడాదిలో ఉద్యోగుల వేతనాల్లో 10-12 శాతం వృద్ధి నమోదుకావచ్చని టీమ్‌లీజ్ మేనేజింగ్ డెరైక్టర్ విశ్వాసం వ్యక్తంచేశారు. 7వ వేతన సంఘం సిఫార్సులు కూడా వేతనాలు పెంపు అంశాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడ్డారు. త్రైమాసిక సర్వేలు అదే చెబుతున్నాయి.. త్రైమాసిక ఉద్యోగ నియామక సర్వేలు కూడా కొత్త ఏడాదిలో జాబ్ మార్కెట్ బాగుంటుందని పేర్కొం టున్నాయి. 2016లో 88 శాతం భారతీయ కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలను కలిగి ఉన్నాయని గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ సంస్థ స్నాప్‌షాట్ వెల్లడించింది. కొత్త ఏడాది తొలి 3 మాసాలకు సంబంధించి 42 దేశాల కన్నా భారత్ లో పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయని మ్యాన్‌పవర్ త్రైమాసిక ఎంప్లాయ్మెంట్ సర్వే పేర్కొంది. స్టార్టప్స్ కూడా కారణం స్టార్టప్స్‌లోకి నిధుల ప్రవాహం వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కోక్యూబ్స్ టెక్నాలజీస్ సీఈవో హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. దేశంలో వంద స్మార్ట్ సిటీల ఏర్పాటు, మేకిన్ ఇండియా వల్ల తయారీ, వాహన పరిశ్రమ రంగాల్లో నియామకాలు పెరుగుతాయని మ్యాన్సర్ కన్సల్టింగ్ సంస్థ సీఈవో సత్య డి సిన్హా పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో టెక్నాలజీ సంబంధిత రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని స్పెక్ట్రమ్ టాలెంట్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు విదూర్ గుప్తా చెప్పారు. కొత్త ఏడాదిలో బయో-సెన్సైస్ విభాగంలో కూడా నియామకాల జోరు ఉండొచ్చని జీహెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ త్రిపాఠి అన్నారు. ఐటీ రంగం దాదాపు 2.7 లక్షల మందికి, ఈ-కామర్స్ రంగం 1.5 లక్షల మందికి, డిజిటల్ మార్కెటింగ్ 1.5 లక్షల మందికి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సింగ్ రంగం 3 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రీతూపర్ణ చక్రవర్తి తెలిపారు. అన్ని రంగాల్లోని పరిశ్రమల్లోనూ వృద్ధి నమోదు అవుతుండటంతో నియామకాల జోరు పెరుగుతుందని క్లిక్జాబ్స్. కామ్ డెరైక్టర్ సౌరభ్ గుప్తా చెప్పారు. -
కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
-
పడిలేస్తున్న టమాట
జిల్లాలో టమాట ధరలు నిలకడగా ఉండడం లేదు. ఒకసారి పూర్తిగా పడిపోతే మరోసారి భారీగా పెరుగుతోంది. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. రైతు తను పండించిన టమాటాను మార్కెట్లో కిలో రూ.14కు (ప్రస్తుత ధర ప్రకారం) అమ్మి, రిటైల్ మార్కెట్లో రూ.24కు కొనాల్సి వస్తోంది. టమాట విస్తీర్ణం భారీగా పెరగడంతో ధరలు తగ్గాయన్న వాదన ఉంది. - పలమనేరు - మార్కెట్లో నిలకడ లేని ధరలు - హోల్‌సేల్‌కు, రిటైల్‌కు మధ్య వ్యత్యాసం - మూడేళ్లుగా భారీగా పెరిగిన సప్లయ్ రైతుకు మిగిలేది సున్నే.. గంగవరం మండలం కూర్నిపల్లెకు చెందిన వెంకటేష్ తన ఎకరా పొలంలో టమాట సాగు చేశాడు. దానికి సంబంధించి ఖర్చు లు ఇలా ఉన్నాయి. - భూమి దున్నకం, నర్సరీ నుంచి మొక్కల కొనుగోలు(ఎకరాకు 8వేల మొలకలు. మొలక రూ.50 పైసలు)కు రూ.5వేలు. - టమాటకు స్టిక్‌లు ఎకరాకు 1200. ఒకటి రూ.20 చొప్పున రూ.24వేలు - సేంద్రియ ఎరువు పదిలోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు రూ.27వేలు - క్రీమి సంహారక మందులు రూ.10 వేలు - కూలీల ఖర్చు రూ.15 వేలు. ఆ లెక్కన ఎకరాలో పంటసాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.81 వేలు. - ఎకరాకు మంచి దిగుబడి వస్తే వెయ్యి బాక్సులు (బాక్సు 14 కేజీ లు). ఈ ఏడాది సగటు ధర రూ.200. ఆ లెక్కన రూ.2 లక్షలు. - 20 కిలోమీటర్ల నుంచి టమాట బాక్సును మార్కెట్‌కు తరలిం చేందుకు రూ.5 నుంచి 10 - టమాట మండీలు రైతు నుంచి 10 శాతం కమీషన్ (రూ.20) వసూలు చేస్తున్నాయి. కోతకు రైతు వ్యక్తిగత ఖర్చు రూ.50. - ఓ బాక్సు కాయలు కోసేందుకు కూలీ ఖర్చు రూ.15. ఆ లెక్కన ఓ బాక్సు టమాట రవాణా, తదితరాల ఖర్చు ప్రస్తుత ధర ప్రకారం రూ.100. - వెయ్యి బాక్సులకు రూ.100 చొప్పున రూ.లక్ష ఖర్చు - పంట సాగుకు పెట్టిన ఖర్చు రూ.81వేలు, మార్కెటింగ్ తదితర ఖర్చులు రూ.లక్ష మొత్తం 1.81 లక్షలు. రైతు రాబడి రూ.2లక్షలు. రైతుకు మిగిలేది కేవలం 19వేలు మాత్రమే. దీనికోసం రైతు కుటుంబ సభ్యులంతా కష్టపడాల్సి ఉంటుంది. భారీగా పెరిగిన సప్లయ్.. ఐదేళ్ల క్రితం జిల్లాలో ఆరువేల హెక్టార్లలో టమాట సాగయ్యేది. మూడేళ్లుగా పెరిగిన నర్సరీలు, పంట విస్తీర్ణంతో ప్రస్తుతం జిల్లాలో 12వేల హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఏడాదికి ఇక్కడ 4.80 లక్షల మెట్రిక్ టన్నుల టమాట ఉత్పత్తి అవుతోంది. సప్లయ్‌కు సరిపడా డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గుముఖం పడుతోంది. పైగా కర్ణాటక, అనంతపురం జిల్లాల నుంచి సరుకు భారీగా ఇక్కడికొస్తోంది. దీని ప్రభావం ధర మీద పడుతోంది. ఆంధ్రలోని పలు జిల్లాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడులోని చెన్నై, రాణిపేట్, ఆర్కాడ్, నైవేలి, విరుదాచలం, కారైకూడి నుంచి వ్యాపారులొస్తున్నారు. ఆ ప్రాంతాల్లో లోకల్ టమాట ఉన్నపుడు వీరు ఇక్కడికి రాక ధరలు అమాంతం తగ్గుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలే దిక్కు.. - డిమాండ్‌ను బట్టి టమాట సాగుచేసేలా చర్యలు - కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు - దళారులతో పనిలేకుండా డెరైక్ట్ మార్కెటింగ్ - రైతు బజార్ల పెంపు - మండల స్థాయిలో రైతుల కమిటీలు, నర్సరీల నియంత్రణ - టమాట పల్ప్, పికెల్, పౌడర్ యూనిట్ల ఏర్పాటు -
షియోమి నుంచి మూడో మొబైల్
న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన షియోమి తాజాగా భారత్‌లో తన మూడో మొబైల్, రెడ్మి నోట్‌ను ఆవిష్కరించింది. ఈ మొబైల్‌ను ఈ కంపెనీ రెండు వేరియంట్లలో- 3జీ మోడల్(డ్యుయల్ సిమ్-ధర రూ.8,999). 4జీ మోడల్(సింగిల్ సిమ్-ధర రూ.9,999) అందించనున్నది. రెడ్ మి నోట్ 3జీలో 5.5 అంగుళాల స్క్రీన్, 1.7 గిగా హెర్ట్జ్ ఆక్ట-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 లిథియమ్- పాలిమర్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని షియోమి వివరించింది. ఈ ఫోన్‌కు రిజిస్ట్రేషన్లు ఈ నెల 25 (నేడు-మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి, విక్రయాలు వచ్చే నెల మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. 1.6 గిగా ెహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రూపొందిన 4జీ వేరి యంట్‌ను ఎయిర్టెల్ భాగస్వామ్యంతో అందిస్తున్నామని తెలిపింది. ఈ మొబైల్‌ను ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, అంతేకాకుండా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఉన్న వంద ఎయిర్టెల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ మొబైల్‌ను వచ్చే నెలలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. -
బ్యాంకులకు ‘కొసరు’ లాభం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు ఇంకా బ్యాంకింగ్ ఫలితాల్లో ప్రతిబింబించడం లేదు. ఇప్పటికీ కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుంజుకోకపోవడంతో బ్యాంకులు చిన్న రుణాలపై దృష్టిసారిస్తున్నాయి. ఇదే సమయంలో మొండి బకాయిలు కొండలాగా పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ రుణాలకు డిమాండ్ లేదని, బ్యాంకింగ్ వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉందని ఇప్పటివరకూ ప్రకటించిన బ్యాంకుల ఫలితాల విశ్లేషణలో వెల్లడవుతున్నది. చాలా బ్యాంకుల వృద్ధి 15 శాతం లోపునకే పరిమితమయ్యింది. రుణ వితరణ పెరగకపోవడంతో ఎన్పీఏలు ఎగబాకాయి. బ్యాంకింగ్ వ్యాపారానికి ప్రధానమైన వడ్డీ ఆదాయం వృద్ధి అంతంతమాత్రమే వుండగా, వివిధ ఫీజుల ద్వారా ఆర్జించే ఇతర ఆదాయాలు బాగా పెరగడంతో బ్యాంకులు లాభాల్ని ప్రదర్శించగలిగినట్లు ఫలితాలు చెపుతున్నాయి. ఆదుకున్న ఇతరాదాయాలు ఒకట్రెండు బ్యాంకులను మినహాయిస్తే చాలా బ్యాంకులను ఇతరాదాయాలే ఆదుకున్నాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సమీక్షా కాలంలో పీఎన్బీ నికర వడ్డీ ఆదాయంలో కేవలం 3% వృద్ధి నమోదైతే ఇతర ఆదాయంలో మాత్రం ఏకంగా 73% పెరిగింది. అలాగే కెనరా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 8% పెరిగితే, ఇతర ఆదాయంలో 32% వృద్ధి నమోదయ్యింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో 23% వృద్ధి నమోదైతే, ఇతర ఆదాయంలో 11% పెరుగుదలే కనిపించింది. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ ఆదాయంలో 20%, ఇతర ఆదాయంలో 10% వృద్ధి నమోదయ్యింది. ఇక మిగిలిన బ్యాంకులను పరిశీలిస్తే మాత్రం లాభాల్లో ఇతర ఆదాయాలే కీలకపాత్ర పోషించాయి. కార్పొరేట్స్‌కు దూరం.. ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతున్నా... రుణాలు తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం లేదు. కానీ కార్పొరేట్ రుణాల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రైవేటు బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ కార్పొరేట్ రుణాల్లో రెండంకెలపైన వృద్ధి నమోదైతే, ఐసీఐసీఐ బ్యాంక్‌లో మాత్రం ఈ వృద్ధి 4.5 శాతంగా ఉంది. హెచ్డీఎఫ్సీ నాన్ రిటైల్ రుణాల్లో 36 శాతం వృద్ధి నమోదైతే, యాక్సిస్ బ్యాంక్‌లో 13% వృద్ధి నమోదయ్యింది. ప్రభుత్వరంగ బ్యాంకులైతే కార్పొరేట్ రుణాల జోలికి వెళ్లకుండా ఆటోమొబైల్, పర్సనల్ లోన్స్, వ్యవసాయం, హోమ్లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాల కేసి చూస్తున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్ పీఎన్బీ కార్పొరేట్ రుణాల్లో 3.1% వృద్ధి మాత్రమే సాధించింది. పెరుగుతున్న ఎన్పీఏలు...: బ్యాంకింగ్ రంగాన్ని ఎన్పీఏలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో పరిస్థితి ఒకే విధంగా ఉంది. వీటిని తగ్గించుకోవడానికి బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలితమివ్వడం లేదు. వచ్చే ఐదు నెలల్లో మరో రూ. 60 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు రుణాలు పునర్ వ్యవస్థీకరించాల్సి రావచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కలిసి 3.45 లక్షల కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించగా, మరో 2.55 లక్షల కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ప్రస్తుత ఫలితాలను పరిశీలిస్తే గతేడాదితో పోలిస్తే ఎన్పీఏలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా... తొలి త్రైమాసికంతో పోలిస్తే వీటి పెరుగుదల ఉధృతి తగ్గడం కొద్దిగా ఊరటనిచ్చే అంశం. ఎన్పీఏల బెడద ఇంకా ఉన్నప్పటికీ గత మూడేళ్లతో పోలిస్తే కొత్తగా ఏర్పడుతున్న ఎన్‌పీఏల్లో తగ్గుదల కనిపిస్తోందని మరో రేటింగ్ సంస్థ మూడీస్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్పీఏలు విలువ పరంగా పెరిగినట్లు కనిపించినప్పటికీ శాతాల్లో చూస్తే ఏడు బేసిస్ పాయింట్లు తగ్గడం విశేషం. అలాగే యాక్సిస్ బ్యాంక్‌లో గతేడాదితో పోలిస్తే ఎన్‌పీఏల్లో 32 శాతం వృద్ధి నమోదైనట్లు కనిపించినా, తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ వృద్ధి కేవలం 4 శాతం మాత్రమే. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటంతో ఇక ఎన్పీఏలు తగ్గడమే కాని పెరగడం ఉండదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాలెన్స్‌షీట్‌పై దృష్టి... గత కొన్నేళ్లుగా దెబ్బతిన్న బ్యాలెన్స్ షీట్‌ను చక్కదిద్దడంపై బ్యాంకులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయి. రుణాలకు డిమాండ్ లేకపోవడంతో డిపాజిట్ల సేకరణను తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా అధిక వడ్డీరేటుకు వసూలు చేసే బల్క్ డిపాజిట్లను వదలించుకోవడంతో పాటు, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి. రుణాలకు డిమాండ్ పెరిగే వరకు డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టిసారిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ తెలిపారు. అధిక వడ్డీరేటు ఉన్న బల్క్ డిపాజిట్లను వదిలించుకోవడంతో పాటు, అధిక వడ్డీరేటు ఉన్న రుణాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ వెల్లడించారు. అలాగే కొన్ని బ్యాంకులు ఎన్పీఏలను అసెట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపర్చుకుంటున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 290 కోట్లు, బీవోఐ రూ. 106 కోట్లు, ఎస్బీహెచ్ రూ. 200 కోట్ల ఎన్పీఏలను విక్రయించాయి. పరుగులు తీస్తున్న బ్యాంక్ షేర్లు రెండో త్రైమాసిక ఫలితాలు మొదలైనప్పటి నుంచి బ్యాంక్ షేర్లు పరుగులు తీస్తున్నాయి. గత నెల రోజుల్లో నిఫ్టీ 5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 13%పైగా ఎగసింది. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్న సంకేతాలకు తోడు, ఎన్పీఏల వృద్ధిరేటు తగ్గడం బ్యాంక్ షేర్లు పెరగడానికి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు రంగ బ్యాంక్ షేర్లు పెరుగుతున్నా, రానున్న కాలంలో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లూ పరుగులు తీయొచ్చని జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి చెప్పారు. చాలా పీఎస్‌యూ బ్యాంకులు బాండ్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయని, ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గితే ఈ బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయని, ఆ మేరకు బ్యాంకుల ఇతరాదాయాలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం మీద బాంకింగ్ రంగంలో ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గితే ఎన్పీఏలు తగ్గుముఖం పడతాయంటున్నారు. మొండి బకాయిల తీరు ఇదీ... బ్యాంకు పేరు జీఎన్‌పీఏ(క్యూ2-15) జీఎన్‌పీఏ(క్యూ2-14) ఐసీఐసీఐ 11,547 కోట్లు (3.12%) 10,028 కోట్లు (3.08%) హెచ్డీఎఫ్సీ 3,362 కోట్లు (1.02%) 2,942 కోట్లు (1.1%) యాక్సిస్ 3,613 కోట్లు (1.3%) 2,734 కోట్లు (1.2%) పీఎన్బీ 20,752 కోట్లు(5.65%) 16,526 కోట్లు (5.1%) బీవోఐ 14,127 కోట్లు ( 3.54%) 9,880 కోట్లు (2.93%) ఆంధ్రా బ్యాంక్ 6,884 కోట్లు (5.99%) 5,187 కోట్లు (5.15%) కెనరా బ్యాంక్ 9,164 కోట్లు (2.92%) 7,475 కోట్లు (2.64%) ఇండియన్ బ్యాంక్ 5,003 కోట్లు (4.21%) 4,179 కోట్లు (3.76%) స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) రూ. కోట్లలో, బ్రాకెట్లో స్థూల నిరర్థక ఆస్తులు శాతాల్లో ఇవ్వడం జరిగింది -
అమెరికా మార్కెట్ల పతనం
అదే బాటలో యూరో సూచీలు న్యూయార్క్: బ్యాంకింగ్, రిటైల్, టెక్నాలజీ దిగ్గజాల ఫలితాలపై అనుమానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు, ముడిచమురు ధరల పతనం వంటి అంశాలు మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లకు షాకిచ్చాయి. ఇవిచాలవన్నట్లు తాజాగా ఎబోలా వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతోఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. వెరసి గత మూడేళ్లలోలేని విధంగా అమెరికా స్టాక్ సూచీలు బుధవారం 2.5%పైగా పతనమయ్యాయి. కడపటి వార్తలందేసరికి డోజోన్స్ 426 పాయింట్లు పతనమై 15,889కు చేరగా, నాస్డాక్ 100 పాయింట్లు పడిపోయి 4,127 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎస్అండ్పీ-500 సూచీ సైతం 49 పాయింట్లు దిగజారి 1,828 వద్ద నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే యూరోజోన్‌లో ప్రధాన ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారుకోవడం యూరప్‌లోనూ సెంటిమెంట్‌కు దెబ్బతగిలింది. దీంతో అటు యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. జర్మనీ ఇండెక్స్ డాక్స్ 253 పాయింట్లు జారి 8,572కు చేరగా, యూకే ఇండెక్స్ ఎఫ్టీఎస్ఈ 181 పాయింట్లు క్షీణించి 6,212ను తాకింది. ఇక ఫ్రాన్స్ ఇండెక్స్ సీఏసీ 149 పాయింట్లు నష్టపోయి 3,940 వద్ద నిలిచింది. కాగా, ఈ ప్రభావం గురువారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చునని నిపుణులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రతిబింబిస్తూ సింగపూర్‌లో ట్రేడయ్యే నిఫ్టీ 120 పాయింట్లు పతనంకావడం గమనార్హం. -
క్యూ2 ఫలితాలు కీలకం..
రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలకూ ప్రాధాన్యత * ఐఐపీ ఎఫెక్ట్ ఉంటుంది * ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం * ఈ వారం మార్కెట్ల తీరుపై నిపుణుల అంచనా న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి దేశీ కార్పొరేట్ దిగ్గజాల పనితీరుపై మార్కెట్లు దృష్టిపెడతాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. పెట్రోకెమికల్స్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఈ వారం క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇవికాకుండా రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సోమవారం(13న), టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు మంగళవారం(14న) వెలువడనున్నాయి. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, గడిచిన శుక్రవారం(10న) మార్కెట్లు ముగిశాక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడ్డాయి. పలు మీడియా సంస్థలు, ఆర్థికవేత్తలు 2% స్థాయిలో పారిశ్రామిక వృద్ధిని అంచనా వేయగా, 0.4%కు పరిమితమైంది. ఈ ప్రభావం సోమవారం(13న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు. చమురు ధరల ప్రభావం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపట్ల చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనమవుతూ వస్తున్నాయి. మరోవైపు డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలహీనపడుతూ వస్తోంది. ఈ రెండు అంశాలు మార్కెట్ల దిశను నిర్ధారించే అవకాశముందని అత్యధిక శాతం మంది నిపుణులు విశ్లేషించారు. ఎఫ్ఐఐల పెట్టుబడులపై దృష్టి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) లావాదేవీలపైనా ప్రధానంగా ట్రేడర్లు దృష్టిసారిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది నెలల ట్రెండ్‌కు విరుద్ధంగా రెండు వారాల నుంచి దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశముందని స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం ట్రెండ్‌పై తొలుత ఐఐపీ ప్రభావం ఉంటుందని, ఆపై సీపీఐ వివరాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ప్రధానంగా వినియోగ వస్తువులకు డిమాండ్ తగ్గడం, తయారీ రంగం మందగించడం వంటి అంశాల కారణంగా ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి ఐదు నెలల కనిష్టానికి చేరిందని జయంత్ విశ్లేషించారు. ఫలితాల బాటలో దిగ్గజాలు ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి దిగ్గజాలతోపాటు, ఆటో రంగ దిగ్గజాలు బజాజ్ ఆటో, హీరోమోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి. వెరసి ఈ వారం ట్రేడింగ్‌ను దిగ్గజాల ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు నడిపించనున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. అంతర్జాతీయ బలహీనతల కారణంగా గత వారం సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 26,297 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐల అమ్మకాలు ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈక్విటీలలో నికరంగా రూ.800 కోట్ల అమ్మకాలను చేపట్టారు. అయితే ఇదే సమయంలో మరోపక్క రుణ సెక్యూరిటీలలో రూ. 6,300 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. 7 నెలల తరువాత మళ్లీ సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐల పెట్టుబడులు కనిష్టానికి చేరిన నేపథ్యంలో తాజా అమ్మకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలకంటే ముందుగానే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించవచ్చునన్న అంచనాలు ఇందుకు కొంతమేర కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీ మార్కెట్లు స్థిరీకరణ(కన్సాలిడేషన్)లో ఉన్నాయని, దీంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నారని సీఎన్ఐ రీసెర్చ్ హెడ్ కిషోర్ ఓస్త్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 82,561 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, సెప్టెంబర్‌లో ఇవి రూ. 5,100 కోట్లు. -
ఉల్లి దిగొచ్చింది..
హోల్‌సేల్‌గా కేజీ రూ.17 రిటైల్‌గా కేజీ రూ.20-25 కొత్తపంట రాకతో తగ్గుముఖం సాక్షి, సిటీబ్యూరో: నిన్నటి వరకూ ఘాటెక్కిన ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కొత్తపంట దిగుబడి మొదలు కావడంతో సామాన్యుడికి ఉల్లి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో నాణ్యమైన గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.17లకు, గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.10లకు లభిస్తోంది. అయితే... రిటైల్ మార్కెట్లో మాత్రం మొదటి ఉల్లి కేజీకి రూ.25లు, రెండో రకం రూ.20ల కు విక్రయిస్తున్నారు. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కొత్త పంట దిగుబడి మొదలైంది. దీనికితోడు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద మొత్తంలో సరుకు దిగుమతి అవుతుండడంతో నగర మార్కెట్‌ను ఉల్లి ముంచెత్తుతోంది. నగరంలోని హహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు నిత్యం 8 నుంచి10వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతవుతోంది. గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1700లు, రెండో రకం రూ.1000లు ధర పలికింది. ఈ ప్రకారం గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.17లు, గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.10ల ధర నిర్ణయమైందన్న మాట. హోల్‌సేల్ మార్కెట్‌కు వస్తోన్న సరుకులో 50శాతానికి పైగా స్థానికంగానే అమ్ముడుపోయాయి. ప్రస్తుతం జంటనగరాల్లో ఎక్కడా కూడా ఉల్లి కొరత లేదని, ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ధర లు తగ్గించేందుకు వ్యాపారులు ఇష్టపడడంలేదు. ఇప్పటికీ గ్రేడ్ టు ఉల్లిని గ్రేడ్‌వన్‌గా చూపించి రూ . 25కు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పదిరోజులుగా హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినా రిటైల్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే తగ్గడం గమనార్హం. పెరిగిన విక్రయాలు రిటైల్ మార్కెట్ ధ రలతో పోలిస్తే రైతుబజార్లలో కాస్త తక్కువ ధర ఉడడంతో వినియోగదారులు ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి వంటి రద్దీ రైతుబజార్లలో సాధారణ రోజుల్లో 50-60 క్వింటాళ్లు అమ్ముడుపోయే ఉల్లి ఆదివారం 90 క్వింటాళ్ల మేర విక్రయించారు. అల్వాల్, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా, మీర్‌పేట ైరె తుబజార్లలో సైతం ఉల్లి విక్రయాలు జోరుగా సాగాయి. -
భలే గిరాఖీలు
సిద్దిపేట అర్బన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. ఆత్మీయ, అనుబంధాలకు ప్రతీతి.. రాఖీ. ఈ పండుగ రోజున ఆనందం అంబరమవుతుంది. ప్రతి ఇళ్లూ సంబరాలకు వేదికగా మారుతుంది. అందువల్లే పండుగకు రానురానూ ప్రాముఖ్యం ఏర్పడింది. అలాగే రాఖీలకూ డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు చిన్న స్పాంజితో పాటు బంగారు రంగు కవర్‌పై ఓ ప్లాస్టిక్ బొమ్మ ఉండే రాఖీలు అందుబాటులో ఉండేవి. కానీ మారుతున్న కాలానుగుణంగా రాఖీల్లోనూ ఎన్నో వెరైటీలు వచ్చేశాయి. మరెన్నో రకరకాల డిజైన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. దారం, దూది రాఖీలు మొదలుకొని వెండి, బంగారు కోటింగ్ రాఖీల వరకు వచ్చేశాయి. సమారు ఆరువేల రకాల డిజైన్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కొనుగోలు దారుల ఆసక్తి మేరకు సిద్దిపేట పట్టణ వ్యాపారులు సుమారు ఎనిమిది రాష్ట్రాల నుంచి రాఖీలను దిగుమతి చేసి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తున్నారు. రాఖీ డిజైన్లలోనూ మార్పులు గతంలో నెమలి ఈకలు, పైసల, నోట్ల, దూది, స్వస్తి, హంస బిల్లలు, పొట్టి బొమ్మలు, కవర్ రాఖీలు తదితర వెరైటీలు ఉండేవి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వెరైటీ రాఖీలు అమ్ముడుపోయేవి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ అంతంత మాత్రంగా ఉండడం వల్ల వెరైటీ రాఖీలు ఖరీదు చేసేవారు కాదు. ఈ క్రమంలోనే 15 సంవత్సరాల క్రితం వెండికోటింగ్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారుల్లో ఆసక్తి మేరకు వ్యాపారులు ఐదు సంవత్సరాల నుంచి పలు డిజైన్లలో రాఖీలను మార్కెట్లోకి తీసుకువచ్చారు. సిద్దిపేట కేంద్రంగా... జిల్లాలో రాఖీల వ్యాపారం ఎక్కువగా సిద్దిపేట కేంద్రంగా సాగుతోంది. ప్రస్తుతం పట్టణంలో సుమారు ఆరు వేల రకాల డిజైన్లు అందుబాటులో ఉండి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. హోల్ సెల్ షాపులతో పాటు పట్టణంలో ప్రతి గల్లీలో రాఖీ విక్రయ కేంద్రాలు వెలిశాయి. రాఖీలతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భాల్లో అవసరమయ్యే బ్యాండ్లను కూడా దుకాణాల్లో అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం రాఖీ డిజైన్లలో స్టోన్స్ ఐటెమ్స్‌కు ఆదరణ పెరిగింది. రకరకాల స్టోన్లతో పొందుపర్చిన రాఖీలు, వాటి అల్లికలు ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, రాజ్‌కోట్, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్, బరోడా, ముంబై, రాజ్‌పుర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పలు రకాల వెరైటీలను దిగుమతి చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వాటి ధరల్లో మార్పు అంతగా లేకపోవడంతో రాఖీలకు భలే గిరాకీ ఏర్పడింది. పట్టణం నుంచి కరీంనగర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక, నిజమాబాద్ తదితర ప్రాంతాలకు రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. రూ.1 మొదలు రూ.1000 వరకు వివిధ రకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్నారుల కోసం తయారు చేసిన చోటాభీమ్ రాఖీలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. -
ఐదేళ్లలో 50 హోల్‌సేల్ స్టోర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో సొంతంగా కార్యకలాపాల విస్తరణకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంపై దృష్టిసారించిన ఈ సంస్థ... వచ్చే 4-5 ఏళ్లలో 50 వరకూ ఈ తరహా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారతీ గ్రూప్‌తో భాగస్వామ్యంతో దేశంలోకి ప్రవేశించిన వాల్‌మార్ట్.. బెస్ట్‌ప్రైస్ మోడల్ హోల్‌సేల్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల క్రితం భారతీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. భారత్‌లో కార్యకలాపాల కోసం ముడుపులు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ వ్యాపార విధానాల నిబద్ధతను మరింత పటిష్టం చేయనున్నట్లు కూడా పేర్కొంది. ఆరేళ్లపాటు భారతీతో కలిసి దాదాపు 20 స్టోర్లను నిర్వహించిన వాల్‌మార్ట్... ఆ సంస్థతో విడిపోయాక ప్రకటించిన కీలక వ్యాపార వృద్ధి ప్రణాళికలు ఇవే కావడం గమనార్హం. మల్టీబ్రాండ్ రిటైల్ ప్రణాళికలపై మౌనం... ‘భారత్‌లో పెట్టుబడులకు మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ వ్యాపార వృద్ధి ప్రణాళికల విషయంలోనూ చాలా ఉత్సుకతతో ముందుకెళ్తున్నాం. ప్రధానంగా క్యాష్ అండ్ క్యారీ విభాగంలో మా ప్రస్థానం కొనసాగుతుంది. గడిచిన కొన్నేళ్లలో ఇక్కడ రిటైల్ రంగంలో వచ్చిన మార్పుల పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విభాగంలో మరింత భారీ వృద్ధికి అవకాశాలున్నాయి. అందుకే రానున్న 4-5 ఏళ్లలో కొత్తగా 50 క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. మా కస్టమర్లకు మరింత చేరువయ్యేలా... వర్చువల్ షాపింగ్ అవకాశాన్ని కల్పించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను కూడా విస్తరించనున్నాం’ అని వాల్‌మార్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ స్కాట్ ప్రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరఫరా మౌలికవసతులు, సరఫరాదారుల అభివృద్ధికి సంబంధించి కూడా పెట్టుబడులపైనా కంపెనీ దృష్టిసారిస్తోంది. అయితే, భారత్‌లో మల్టీబ్రాండ్ రిటైల్ విభాగంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై వివరాలను మాత్రం వాల్‌మార్ట్ వెల్లడించలేదు. -
టెస్కో, వొడాఫోన్లకు ఎఫ్ఐపీబీ ఓకే
న్యూఢిల్లీ: దేశీయ మల్టీబ్రాండ్ రిటైలింగ్‌లో ప్రవేశించేందుకు యూకే రిటైలింగ్ దిగ్గజం టెస్కోకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతి లభించింది. దీంతోపాటు దేశీయ మొబైల్ దిగ్గజంలో మైనారిటీ వాటాదారుల వాటాను కొనుగోలు చేసేందుకు వొడాఫోన్‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిమితిని పెంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆర్థికశాఖ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. తొలి దశలో భాగంగా టెస్కో 11 కోట్ల డాలర్లను(రూ. 7,500 కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్ హైపర్‌మార్కెట్స్‌లో 50% వాటాను కొనుగోలు చేయనుంది. ఇక మరోవైపు వొడాఫోన్ ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనల్జిత్ సింగ్‌కు గల 24.65% వాటాతోపాటు అజయ్ పిరమల్‌కు చెందిన 10.97% వాటాను బ్రిటిష్ సంస్థ వొడాఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు రూ. 10,141 కోట్లను వెచ్చించనున్నట్లు అంచనా. -
ఇక టెస్కో మాల్స్..
న్యూఢిల్లీ: భారత మల్టీ బ్రాండ్ రిటైల్ మార్కెట్లో ప్రవేశించే దిశగా బ్రిటన్ రిటైల్ దిగ్గజం టెస్కో సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 110 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 680 కోట్లు) పెట్టుబడితో దేశవ్యాప్తంగా స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. స్టోర్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా గ్రూప్‌లో భాగమైన ట్రెంట్‌తో టెస్కో జతకడుతోంది. ట్రెంట్ హైపర్మార్కెట్లో 50 శాతం వాటాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. స్టార్ బజార్, స్టార్ డెయిలీ, స్టార్ మార్కెట్ వంటి బ్రాండ్ పేర్లతో స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టెస్కో తన దరఖాస్తులో పేర్కొంది. ముందుగా బెంగళూరులోనూ, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోనూ టెస్కో రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం టెస్కో దరఖాస్తును పరిశీలించనుంది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతుల కోసం పంపుతుంది. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలించిన తర్వాత స్టోర్స్ ఏర్పాటుకు దరఖాస్తు చేసిన తొలి విదేశీ దిగ్గజం టెస్కోనే. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన టెస్కో.. ఇప్పటికే ట్రెంట్ భాగస్వామ్యంతో భారత్‌లో స్వల్ప స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పశ్చిమ, ద క్షిణాది రాష్ట్రాల్లో 16 అవుట్లెట్లను నిర్వహిస్తున్న ట్రెంట్ హైపర్మార్కెట్కి టెస్కో బ్యాక్ఎండ్ సహకారం అందిస్తోంది. ఏటా 3-5 స్టోర్ల ఏర్పాటు.. ప్రతి ఆర్థిక సంవత్సరం సుమారు మూడు నుంచి అయిదు స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టెస్కో తన దరఖాస్తులో పేర్కొంది. అలాగే 14 రకాల ఉత్పత్తులను విక్రయించనున్నట్లు వివరించింది. ఇందులో టీ, కాఫీ, కూరగాయలు, ఫలాలు, మాంసం, చేపలు, డెయిరీ ఉత్పత్తులు, వైన్, మద్యం, టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, పుస్తకాలు ఉంటాయి. టెస్కోకి ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలే సియా, పోలాండ్, టర్కీ తదితర దేశాల్లో టెస్కో కార్యకలాపాలు ఉన్నాయి. వివిధ వర్గాల అభ్యంతరాలను పక్కన పెడుతూ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో 51% మేర ఎఫ్‌డీఐలను అనుమతించాలని కేంద్రం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐ నిబంధనలపై స్పష్టత కోరుతూ టెస్కో సీఈవో ఫిలిప్ క్లార్క్, ట్రెంట్ వైస్ చైర్మన్ నోయల్ టాటా ఈ ఏడాది మే లే ఆనంద్ శర్మతో భేటీ అయ్యారు. వివాదాస్పదమైన సోర్సింగ్ నిబంధనల గురించి ఇందులో చర్చించారు. ఆ తర్వాత ఆగస్టులో కేంద్రం సదరు నిబంధలను సడలించింది. స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి 30% మేర ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న నిబంధనను వ్యాపార ప్రారంభ దశకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే, పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో కూడా మల్టీ బ్రాండ్ స్టోర్స్ ఏర్పాటునకు అనుమతించింది. వేగంగా అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తాం: ఆనంద్ శర్మ భారత మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న టెస్కో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రయత్నించడం ద్వారా తమ వంతు తోడ్పాటు అందించగలమని ఆయన చెప్పారు. ‘దేశీ రిటైల్ పరిశ్రమ రూపాంతరం చెందడానికి ఇది నాంది కాగలదు. ఈ పరిణామంతో మరిన్ని అంతర్జాతీయ దిగ్గజాలు కూడా భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాగలవు’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించడానికి వెనుక ముఖ్యోద్దేశం వ్యవసాయోత్పత్తులు వృధా కాకుండా చూడటమేనని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు. మరోవైపు, భారత మార్కెట్‌పై తమకి ఉన్న అవగాహన, అంతర్జాతీయంగా రిటైల్‌లో టెస్కోకి ఉన్న అపార అనుభవం ఒకదానికి మరొకటి తోడు కాగలవని ట్రెంట్ వైస్ చైర్మన్ నోయల్ టాటా పేర్కొన్నారు. తద్వారా దేశీ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోగలమని చెప్పారు. -
చిల్లర వ్యాపారానికి చిల్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి... రిటైల్ రంగాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తోంది. ఉత్పత్తిదారులకు పంపిణీదారుల నుంచి డిమాండ్ లేకపోవటం నుంచి మొదలుపెడితే... పంపిణీదార్లకు డీలర్ల నుంచి సరైన సమయంలో డబ్బు రాకపోవటం... ఖర్చుకు వెనకాడుతున్న వినియోగదారులు... ఇలా వ్యాపార చక్రం అన్ని దశల్లోనూ తీవ్రంగా దెబ్బతింటోంది. మూడు నాలుగేళ్లుగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతూ ఉండటంతో వ్యాపారం ఏకంగా 50 శాతం వరకూ పడిపోయిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిపై ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనమిది... రాష్ట్రంలో రిటైల్ రంగానికి ప్రధాన మార్కెట్ హైదరాబాదే. అందుకని రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికే వచ్చి షాపింగ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయని క్లాసిక్ పోలో బ్రాండ్ దుస్తుల పంపిణీదారు జి.శ్రీకాంత్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కస్టమర్లు హైదరాబాద్‌కు రావడం బాగా తగ్గింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం తన ప్రాభవాన్ని కోల్పోతుండడంతో ఆ ప్రభావం రిటైల్‌పై కూడా పడుతోంది’’ అన్నారాయన. భాగ్యనగరంలో పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు సైతం వెనకాడుతున్నారని ప్రముఖ రిటైల్ చైన్ యజమాని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘జనం దగ్గర ఖర్చు చేసే శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఏడాదికి రూ.300 కోట్ల వ్యాపారం చేశాం. ఈ ఏడాది రూ.120 కోట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించటం లేదు’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెద్ద పెద్ద ఔట్‌లెట్లలోనే 40% వ్యాపారం పడిందంటే, చిన్న దుకాణాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అద్దెలు, జీతాలు, విద్యుత్తు తదితర ఖర్చులు పెరిగిపోవటంతో చిన్న వ్యాపారులు ఇతర ఆదాయ మార్గాలకు మళ్లుతున్నారని ఆయన చెప్పారు. ‘‘రోజువారీ ఇంటి ఖర్చులు పెరిగాయి. ఆ స్థాయిలో ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. అందుకనే వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది’’ అని సీఎంఆర్ గ్రూప్ ఎండీ మావూరి వెంకట రమణ చెప్పారు. గతంలో ఎక్కువగా ఖర్చు చేసినవారిలో తొలిస్థానం సాఫ్ట్వేర్ ఉద్యోగులదే. ఇప్పుడు సాఫ్ట్వేర్ బూమ్ లేకపోవడం రిటైల్ కష్టాలను మరింత ఎగదోస్తోంది. చేతులెత్తేస్తున్నారు... ప్రధానంగా వస్త్ర వ్యాపారం దెబ్బతింటోంది. ఎందుకంటే గిరాకీ లేక వస్త్ర డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ‘‘గతంలో డీలర్లు 45 రోజుల్లోపే బాకీ చెల్లించేవారు. ఇప్పుడు కనీసం 90 రోజుల గడువు తీసుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఆరు నెలల సమయం అడుగుతున్నారు. మరోవంక సమయానికి బాకీ చెల్లించాలంటూ కంపెనీల నుంచి మాపై ఒత్తిడి పెరుగుతోంది’’ అని పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు పంపిణీదారుగా వ్యవహరిస్తున్న తొడుపునూరి నాగేష్ చెప్పారు. వ్యాపారం లేక ఎగవేతదారుల సంఖ్య పెరుగుతోందని మరో వ్యాపారి చెప్పారు. ఎగవేతదారుల సంఖ్య గతంలో 1 శాతముంటే, ఇప్పుడు 10 శాతానికి చేరిందని తెలియజేశారాయన. 2008-09 సంవత్సరంలో 480 మంది డీలర్లతో వ్యాపారం చేసిన ఒక పంపిణీదారు ప్రస్తుతం డీలర్ల సంఖ్యను 260కు కుదించారు. దీనికి కారణం వారి వద్ద నుంచి బాకీలు సక్రమంగా రాకపోవడమే. భాగ్యనగరంలో మధ్యతరగతికి అనువైన వస్త్ర దుకాణంగా పేరొందిన ఒక రిటైల్ చైన్ నుంచి నెలకు రూ.45 లక్షల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఇది రూ.8 లక్షలకు చేరిందని అంతర్జాతీయ బ్రాండ్ పంపిణీదారు ఒకరు తెలిపారు. లాభాలు కుచించుకుపోయాయన్నారు. గతంలో 10 శాతం లాభం ఉంటే, ఇప్పుడు 4 శాతంతోనే సర్దుకుపోతున్నట్టు చెప్పారాయన. దుస్తులు అమ్ముడవ్వాలంటే డీలరుకు ఎక్కువ మార్జిన్ ఆఫర్ చేస్తున్నామని, దానివల్ల తమ లాభం తగ్గుతోందని తెలిపారు. -
యాక్సిస్ బ్యాంక్
ఎందుకు కొనొచ్చంటే: బ్రాంచీల విస్తరణ, పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండడం తదితర కారణాల వల్ల రిటైల్, ఎస్ఎంఈ రంగ రుణాలు బాగా అభివృద్ధి చెందాయి. కార్పొరేట్ రుణాలు కూడా ఓ మోస్తరుగా వృద్ధి చెందాయి. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రుణ వృద్ధి 17 శాతంగా ఉంది. ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ధి 15-16 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన రూ.5,500 కోట్ల నిధుల్లో కొంత భాగాన్ని రుణ విస్తరణకు వినియోగించింది. రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 17 శాతం, సేవింగ్స్ డిపాజిట్లు 18% చొప్పున వృద్ధి చెందాయి. వేగవంతమైన నెట్వర్క్ విస్తరణ కారణంగా కాసా నిష్పత్తి మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్లు మరింతగా పెరుగుతాయని బ్యాంక్ అంచనా వేస్తోంది. వడ్డీయేతర ఆదాయం అధికంగా ఉండడం, మార్జిన్లు జోరుగా ఉండడం, తదితర కారణాల వల్ల అధిక కేటాయింపుల అవసరాలను బ్యాంక్ తట్టుకోగలదని భావిస్తున్నాం. రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1.6-1.7 శాతంగా ఉండొచ్చని అంచనా. 9 నెలల కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం.