నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి | India is projected to increase workforce to 457.62 million by 2028 | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి

Published Wed, Nov 13 2024 4:01 PM | Last Updated on Wed, Nov 13 2024 4:47 PM

India is projected to increase workforce to 457.62 million by 2028

ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్‌నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్‌ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.

  • దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.

  • 2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.

  • వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.

  • ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

  • వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్‌ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.

  • తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.

  • టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.

  • 48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.

  • వెబ్ డెవలపర్‌లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.

  • అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్‌లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.

ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్‌ ట్రైన్‌.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..

అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్‌ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement