Tech companies
-
'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates).. 1975లో హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినందుకు చాలా బాధపడినట్లు, ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కాలేజీ రోజులు చాలా అద్భుతంగా గడిచాయని పేర్కొంటూ.. 'సోర్స్ కోడ్: మై బిగినింగ్' (Source Code: My Beginnings) అనే పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రకు సంబంధించిన తరగతులను హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంతగానో ఆస్వాదించాను. తెలివైన వ్యక్తులతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. రాత్రి సమయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకునే వాళ్ళం. 1975లో సాఫ్ట్వేర్ కంపెనీ మొదటి సీఈఓగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. యూనివర్సిటీలో చదువు మానేయాల్సి వచ్చింది. ఆ నిర్ణయం నన్ను బాధించిందని బిల్ గేట్స్ అన్నారు. అయితే డిగ్రీ పూర్తి చేయడానికి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్లాలనిపించినా.. అది సాధ్యం కాలేదు.బిల్ గేట్స్.. తన మిత్రుడు 'పాల్ అలెన్'తో కలిసి కంప్యూటర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలిగితే, ఆ రంగంలో ముందంజలో ఉండవచ్చని భావించి.. రెండేళ్లు కృషి చేశారు. ఆ సమయంలో చదువును బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. చదువు మానేయాల్సి వచ్చింది. అయితే టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగారు.ఇదీ చదవండి: ఇలాంటి జాబ్ చేయడం సాధ్యమేనా?.. కంపెనీ ఆఫర్‌పై నెటిజన్లు ఫైర్!సోర్స్ కోడ్: మై బిగినింగ్ పుస్తకం విషయానికి వస్తే.. ఇది మొత్తం మూడు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ బుక్ మొదటి భాగంలో బిల్ గేట్స్ చిన్న నాటి విషయాలు, యూనివర్సిటీలో చదువు, ప్రయోగాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన విషయాలతో పాటు.. మెలిందా గేట్స్‌తో వివాహం వంటి మరిన్ని విషయాలు.. ఆ తరువాత వచ్చే పుస్తకాల్లో ఉండే అవకాశం ఉంది.బిల్ గేట్స్ 2000లో పదవీవిరమణ చేసే వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థను ముందుకు నడియాపారు. ఆ సమయంలో కంప్యూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇదే బిల్ గేట్స్‌ను ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా నిలబడేలా చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ మూడు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత
-
బాబూ.. బయటకు దయచెయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా టెక్ కంపెనీల్లో(US tech companies) ఉద్యోగుల కోత(Layoffs) కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, వాల్‌మార్ట్, స్ట్రైప్ తదితర సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో, యూఎస్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది బలహీనపడవచ్చని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్‌కు చెందిన కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో యూఎస్‌లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి.జనవరిలో 49,795 ఉద్యోగాల కోత పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38,792తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. 2024 జనవరిలో ప్రకటించిన 82,307 లేఆఫ్స్ కంటే ఈ సంఖ్య 40 శాతం తక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కంజ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కనీసం 25 కంపెనీలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. జనవరిలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ 3,53,000 కొత్త ఉద్యోగాలను జోడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేశాయి. యూఎస్‌లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3,600 మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు. వరుస కట్టిన సంస్థలు.. సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్‌డే 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వాల్‌మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, ఆకన్సవ్లలోని కన్సాలిడేషన్‌లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది. ఈ టెరి్మనేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజీ ఉండదు. గూగుల్‌లో స్వచ్ఛందంగా.. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ ఆర్గనైజేషన్‌లోని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేసింది. వీరికి పరిహారం అందించనుంది. 1,000 మందిని తగ్గించాలని సేల్స్‌ఫోర్స్ యోచిస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. జనవరి 20 నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్ట్రైప్ ప్రకటించింది. అయితే, కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2025 చివరినాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో 4 శాతం లేదా 100 కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు జనవరిలో పేర్కొంది. -
టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!
ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్లను తొలగించిన వార్తలు ఇంకా మార్చచిపోక ముందే.. టెక్ దిగ్గజం మెటా (Meta) భారీగా ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ మెటా ఎందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది? ఎంతమందిని తొలగించనుంది? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీల మాతృ సంస్థ మెటా, ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రపంచవ్యాప్తంగా తొలగింపులను నిర్వహించనున్నట్లు సమాచారం. అదే రోజు అమెరికాతో సహా చాలా దేశాలలో సోమవారం స్థానిక సమయం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది..జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్‌లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా కోతల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియ కింది సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు చెప్పినట్లుగానే తొలగింపులకు శ్రీకారం చుట్టింది. అయితే కంపెనీ ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనుంది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు: ఎక్కడో తెలుసా?సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఉద్యోగుల తొలగింపు మొదలు పెడితే ఆ ప్రభావము 5 శాతం లేదా సుమారు 3600 మంది మీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేఆఫ్స్ కారణంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని జూకర్ బర్గ్ ఇప్పటికే హామీ ఇచ్చారు. -
ఇన్ఫోసిస్ లేఆఫ్స్: వందలాది ఫ్రెషర్స్ బయటకు
ఇప్పుడిప్పుడే ఐటీ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయని సంబరపడుతున్న వేళ 'ఇన్ఫోసిస్' (Infosys) మరోమారు లేఆఫ్స్ బాంబ్ పేల్చింది. ఒక్కసారిగా 700 మంది ఫ్రెషర్లను ఇంటికి పంపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా అన్యాయమని లేఆఫ్‌కు గురైన ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీలో చేర్చుకున్న ఫ్రెషర్లలో 700 మంది.. మూడు సార్లు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఈ కారణంగానే వారిని బయటకు పంపుతున్నట్లు సమాచారం. వీరందరూ కూడా కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్‌కు చెందిన వారని తెలుస్తోంది.కంపెనీలో ట్రైనింగ్ తీసుకునే ఫ్రెషర్స్ కచ్చితంగా.. సంస్థ నిర్వహించే అసెస్మెంట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే కంపనీలో కొనసాగలేరు. ఈ విషయాన్ని ఆఫర్ లేటర్లలో కూడా స్పష్టం చేశామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ విధానం ఇప్పుడు ప్రారంభించింది కాదు. గత రెండు దశాబ్దాలుగా కంపెనీ ఈ పద్దతిలోనే ఉద్యోగులను ఎంపిక చేస్తోందని పేర్కొంది.లేఆఫ్‌లకు ప్రభావితమైన ఉద్యోగులలో చాలామంది 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందినవారు. వీరందరూ కంపెనీ మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందారు. వీరి ఇంటర్వ్యూలో పూర్తయిన తరువాత ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి కూడా కంపెనీ చాలా సమయం తీసుకుందని గతంలోనే వెల్లడైంది. ఆ తరువాత ఆఫర్ లెటర్స్ అందిస్తూ.. సిస్టమ్ ఇంజనీర్ ఉద్యోగులకు రూ. 3.2 లక్షల నుంచి రూ. 3.7 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుందని హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: రీఛార్జ్ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..ఇన్ఫోసిస్ కంపెనీ ఒక్కసారిగా ఫ్రెషర్లను తొలగించడంతో.. బాధితులు కంటతడి పెట్టుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తొలగించిన ఫ్రెషర్స్ 700 మందా? 400 మందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమిటనేదే ప్రశ్న. అయితే కంపెనీ లేఆఫ్‌లను నాసెంట్ ఐటీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) విమర్శించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి.. ట్రైనింగ్ సమయంలోనే బయటకు పంపించడం అనేది సమంజసం కాదని పేర్కొంది. -
టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకు
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. ఇందులో 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏకంగా 5,370 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.మొదటి రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న టీసీఎస్.. మూడో త్రైమాసికంలో మాత్రం వేలాదిమందిని బయటకు పంపిది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మొత్తం 6,07,354కు చేరింది. కరోనా మహమ్మారి తరువాత దాదాపు అన్ని కంపెనీలు కోలుకున్నాయి. దీంతో కొన్ని సంస్థలు కొత్త ఉద్యోగులను కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి.ఈ త్రైమాసికంలో 25,000 మంది అసోసియేట్లను ప్రమోట్ చేసినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రమోషన్ల సంఖ్య 1,10,000 కంటే ఎక్కువకు చేరిందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు. అంతే కాకుండా.. మేము ఉద్యోగి నైపుణ్యం, శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తామని.. వచ్చే ఏడాది అధిక సంఖ్యలో క్యాంపస్ నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.వచ్చే ఏడాది 40,000 ఉద్యోగాలు2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని.. వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ (Milind Lakkad) అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం.19 ఏళ్లలో ఇదే మొదటిసారిడిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల వలసలు 13 శాతం పెరిగింది. అంతకు ముందు ఇది 12.3 శాతంగా ఉంది. ముంబై (Mumbai) కేంద్రంగా సేవలందిస్తున్న టీసీఎస్ కంపెనీ 2004లో మార్కెట్లోకి లిస్ట్ అయింది. అప్పటి నుంచి (19 సంవత్సరాల్లో) సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 22,600 పెంచుకుంది. అంతకు ముందు 2022లో 1.03 లక్షల ఉద్యోగులను చేర్చుకుంది.టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లుప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ.. భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ (K Krithivasan) పేర్కొన్నారు. -
చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఆఫర్ ..!
న్యూ ఈయర్ సంబరాల వేళ కూడా ఆఫీన్ అంటే ప్చ్..! ఏంటిదీ అనే ఫీల్ వచ్చేస్తుంది. డిసెంబర్ 31తో ఈ ఏడాదికి ముగింపు పలికే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పే సందడి టైంలో మనవాళ్లతో ఉంటే ఆ ఫీల్ వేరుకదూ..!. కానీ ఉద్యోగ బాధ్యతల రీత్యా వెళ్లాల్సిందే. కానీ చిరుత ఎంట్రీతో జాక్‌పాట్ లాంటి అవకాశం కొట్టేశారు టెక్కీ ట్రైనీ ఉద్యోగులు. ఎక్కడంటే..మైసూర్‌లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఈ ఆఫర్‌ని ఇచ్చింది. డిసెంబర్ 31న ట్రైనీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేసేలా వర్క్ ఫ్రమ్ హోం(Work From Home)ని అమలు చేసింది. మైసూర్(Mysuru) ఇన్ఫోసిస్ క్యాపస్‌లో చిరుత(leopard) ప్రవేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది టెక్కంపెనీ. ఈ నేపథ్యంలోనే క్యాంపస్ లోపలికి ఎవరినీ అనుమతించవద్దని భద్రతా బృందాన్ని కూడా ఆదేశించినట్లు తెలిపింది. అలాగే తన కంపెనీ ట్రైనీ ఉద్యోగులను ఈ రోజు(డిసెంబర్ 31న) ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరినట్లు పేర్కొంది టెక్ కంపెనీ. ఇదిలా ఉండగా, మంగళవారం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ చిరుతను పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ తెల్లవారుజామున 4 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఫారెస్ట్ అధికారి ఐబీ ప్రభుగౌడ్ తెలిపారు. కాగా, ఇలా టెక్ కంపెనీ ఆవరణలో చిరుత ప్రవేశించడం తొలిసారి కాదు. గతంలో 2011లో ఇలానే చిరుత క్యాంపస్‌లోకి ప్రవేశించి కలకలం సృషించింది. (చదవండి: ట్రా'వెల్నెస్' టిప్స్..! ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..
జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్‌కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్‌లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్‌లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్.. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.స్నేహితుల స్ఫూర్తితో..పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్‌లోని జసిదిహ్లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.రూ.39 లక్షల ప్యాకేజీగూగుల్లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్‌లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్‌లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. -
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకువారానికి ఐదు రోజులుకరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది. -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకు
గత కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న టెక్ రంగంలో మళ్ళీ లేఆప్స్ అలజడి మొదలైంది. గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులపైన, డైరెక్టర్లపైన, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది.గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఇప్పుడు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు.. సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?గూగుల్ కంపెనీ 20 శాతం మరింత శక్తివంతంగా మారాలని సుందర్ పిచాయ్ 2022లోనే ఆకాక్షించారు. ఆ తరువాత ఏడాది 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించారు. కాగా ఇప్పుడు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్‌రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం: ఉద్యోగులకు 85 శాతం బోనస్
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఉద్యోగులకు పర్ఫామెన్స్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన వారికి 85 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ కూడా ఉద్యోగులకు పంపించింది. కాబట్టి నవంబర్ జీతంతో పాటు ఈ బోనస్ కూడా పొందనున్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం.. డెలివరీ, సేల్స్ వర్టికల్లో జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలను పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. బోనస్ అనేది కేటగిరి వారీగా చెల్లించే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరి ఉద్యోగులకు ఎంత శాతం బోనస్ ఇస్తుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..సెప్టెంబరుతో ముగిసిన Q2FY25లో.. ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 4.7 శాతం పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రాబడి 5.1 శాతం పెరిగి రూ. 40,986 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ ఆర్ధిక సంవత్సరంలో టెక్ దిగ్గజం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది. -
ఇన్సూర్టెక్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
న్యూఢిల్లీ: భారత ఇన్సూర్టెక్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.‘‘ప్రస్తుతం భారత్‌లో 150 ఇన్సూర్టెక్ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్‌లు, సూనికార్న్లు, 45కు పైగా మినీకార్న్లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ విలువ 13.6 బిలియన్ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్టెక్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్ రైటింగ్ (రిస్క్‌ల మదింపు), క్లెయిమ్‌లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. అపార అవకాశాలు.. గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్టెక్ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్ రైటింగ్, క్లెయిమ్‌లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్టెక్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్టీస్ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఇన్సూరెన్స్ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్టెక్ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది. -
ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్‌లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.‘భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది’ అని పేర్కొంది. ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓనివేదిక ప్రకారం.. 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్అండ్డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. -
నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్‌నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. -
‘డిజిటల్ ఆవిష్కరణల్లో రాష్ట్రం అగ్రగామి’
డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ దూసుకుపోతోందని తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హిటాచీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే గ్లోబల్‌లాజిక్ హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు.‘గ్లోబల్‌లాజిక్ కొత్త డెలివరీ సెంటర్ ప్రారంభోత్సవం తెలంగాణ వృద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే 220కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు తెలంగాణలో ఉన్నాయి. డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విభాగంలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 1.5 లక్షల మంది ఇంజినీర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దానివల్ల భవిష్యత్తులో మరింత మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వాటి కార్యకలాపాలను పెంపొందించడానికి గ్లోబల్‌లాజిక్ వంటి కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ ఝా మాట్లాడుతూ..‘వివిధ రంగాల్లో ఇంజినీరింగ్ సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కంపెనీకి గ్లోబల్ క్లయింట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారి డిమాండ్లు తీర్చడానికి కొత్త కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి న్యూఏజ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. హైదరాబాద్ వంటి నగరంలో ప్రతిభకు కొరతలేదు. స్థానికంగా జీసీసీను ఏర్పాటు చేయడం వల్ల మా క్లయింట్లకు మెరుగైన సేవలందుతాయని భావిస్తున్నాం’ అన్నారు. -
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్‌జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్‌జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్‌జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్‌జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్‌ను నా మేనేజర్‌కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
రూ.55 కోట్లు సమీకరించిన హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ మారుత్ డ్రోన్‌టెక్ నిధులు సమీకరించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తాజాగా 6.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.55 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. లోక్ క్యాపిటల్ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలిపింది. వార్షికంగా 3,000 డ్రోన్ల స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యకలాపాలు పటిష్టం చేస్తున్నట్లు మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విశ్లావత్ పేర్కొన్నారు.అధునాతన వ్యవసాయ డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు, ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోకి చానల్ పార్ట్నర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ప్రేమ్ వివరించారు. దేశీయంగా కేంద్రం నమోదీదీ పేరుతో స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ కంపెనీల ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ ఏర్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మహిళలకు ఉపాధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: మార్కెట్.. ‘ట్రంపె’ట్!మారుత్ డ్రోన్‌టెక్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కార్పొరేట్ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తన డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్టు, 2028 నాటికి డీలర్ల సంఖ్యను 500కు పెంచుకోనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు, సహకారం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపింది. ఐదేళ్లలో 30,000 డ్రోన్ల విక్రయాల లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు ప్రకటించింది. -
బెంగళూరులో మరో ఆఫీస్: 300 మంది ఉద్యోగులకు అవకాశం
కరోనా సమయంలో భారీ నష్టాలను చవి చూసిన దిగ్గజ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఐటీ కంపెనీ 'యూఎస్టీ' తన కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా.. బెంగళూరులో రెండవ ఆఫీస్ ప్రారంభించింది. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న యూఎస్టీ కొత్త కార్యలయం 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంది.కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగానే.. ఈ కొత్త ఆఫీస్ ప్రారంభించినట్లు సమాచారం. యూఎస్టీ తన కొచ్చి ప్రధాన కేంద్రంలో వచ్చే ఐదేళ్ల నాటికి సుమారు 6,000 మందికి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా కేరళలోని తిరువనంతపురం కేంద్రంలో సుమారు 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్2012లో తన కార్యకలాపాలను ప్రారంభించిన యూఎస్టీ.. బెంగళూరులో ప్రస్తుతం 6000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ సెమీకండక్టర్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, హైటెక్, రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ భారతదేశం అంతటా 20000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 30000 కంటే ఎక్కువ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. -
గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?
ఓ చిన్న వెబ్సైట్ మీద గూగుల్ కంపెనీ చూపిన నిర్లక్ష్యం భారీ జరిమానా చెల్లించేలా చేసింది. 2006లో యూకేకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు ప్రైస్ కంపారిజన్ వెబ్సైట్ 'ఫౌండమ్' ప్రారంభించారు. కానీ దీనిని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్‌లో విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు కీ వర్డ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పటికీ.. వెబ్సైట్ కనిపించకపోవడాన్ని ఫౌండర్స్ కనిపెట్టారు.తమ వెబ్సైట్ గూగుల్‌కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా పడిపోతుండటం గమనించిన.. ఆ వ్యవస్థాపకులు గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గూగుల్ రెండేళ్ళైనా పెనాల్టీ తొలగించలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దంపతులు యూరోపియన్ కమిషన్‌ను 2010లో సంప్రదించారు.ఫౌండమ్ వ్యవస్థాపకులు ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. గూగుల్ చేసిన ఈ అన్యాయానికి 2.4 బిలియన్ ఫౌండ్స్ (సుమారు రూ. 26వేల కోట్లు) జరిమానా విధిస్తూ కమిషన్ 2017లో తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..యూరోపియన్ కమిషన్ తీర్పు ఇచ్చిన తరువాత గూగుల్ అప్పీల్‌కు వెళ్ళింది. సుమారు ఏడేళ్ల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైందని శివన్, ఆడమ్ రాఫ్ స్పందించారు. ఆలస్యమైనా.. పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు. -
మూడు నెలల్లో రూ.5,330 కోట్ల ఒప్పందాలు
భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్ కాలంలో 635 మిలియన్ డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్ కంపెనీ ‘గ్రాంట్ థ్రాంటన్ భారత్’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్ ఫెడ్ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్‌కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!భారత్‌పట్ల బుల్లిష్‌గా..‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది. -
వారం రోజుల్లో ఒకే వేదికపైకి 900 స్టార్టప్‌లు
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024 ‘ఆస్పైర్’ స్టార్టప్ ప్రోగ్రామ్ రెండో ఎడిషన్‌ను ప్రారంభించబోతున్నట్లు సంస్థ సీఈఓ పి.రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 18 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న దాదాపు 900లకు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులు పాల్గొంటాయని పేర్కొన్నారు.గతేడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ ‘ఆస్పైర్’ స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మొదటి ఎడిషన్‌లో దాదాపు 400కు పైగా స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈసారి జరగబోయే ఆస్పైర్ ఈవెంట్ రెండో ఎడిషన్. అయితే ఐఎంసీకు మాత్రం ఇది ఎనిమిదో ఎడిషన్ కావడం విశేషం. ఐఎంసీ 2024ను భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.ఆస్పైర్ స్టార్టప్ ప్రోగ్రామ్ నిర్వహణలో టెలికాం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియా, టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (టీఈపీసీ), ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఢిల్లీ వంటి సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ కార్యక్రమంలో 5జీ వినియోగం, ఏఐ, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎంటర్ప్రైజ్, గ్రీన్ టెక్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, స్మార్ట్ మొబిలిటీ, సస్టైనబిలిటీ, టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ వంటి విభాగాల్లో వివిధ సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. దాంతోపాటు ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఈ సందర్భంగా ఐఎంసీ సీఈఓ పి.రామకృష్ణ మాట్లాడుతూ..‘భారత స్టార్టప్ ఎకోసిస్టమ్, భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది. ఇది విభిన్న రంగాల్లో స్టార్టప్ కంపెనీలు చేసే ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు దోహదం చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో 1.28 లక్షలకుపైగా స్టార్టప్ కంపెనీలున్నాయి. దాంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. స్టార్టప్ ఎకోసిస్టమ్, సుస్థిర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ సదస్సు తన వంతు కృషి చేస్తోంది’ అన్నారు. -
స్థానిక భాషలో సమాచారం కోసం సంస్థల సహకారం
ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా సమాచారం అందించే వికీమీడియా ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2024’ను నిర్వహించింది. ఇటీవల మూడు రోజుల పాటు సాగిన ఈ సమ్మిట్‌లో స్థానిక భాషలోని సమాచారాన్ని ఇతర భాషలో అందించేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు విద్యార్థులు ప్రధానపాత్ర పోషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గనడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 130 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.దేశంలో వివిధ భాషలు మాట్లాడుతున్న వారికి ఈ సమ్మిట్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందని ఐఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాధికా మామిడి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐ4భారత్, బిట్స్ పిలానీ, సీఐఎస్, ఐఐఐటీ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ నిపుణులు కలిసి దేశీయ భాషల్లో కంటెంట్ అభివృద్ధిపై మాట్లాడారు. రియల్‌టైమ్ కంటెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమయ్యే సాంకేతికతపై చర్చించారు. వికీమీడియా ఫౌండేషన్ అనుసరిస్తున్న కొన్ని ఫీచర్లు, సాధనాలపై మాట్లాడారు. మొబైల్ ఎడిటింగ్, వాయిస్, ఇమేజ్ ఆధారిత స్క్రిప్ట్‌లు, వికీమీడియా కమ్యూనిటీలు, వర్క్‌షాప్‌లతో వివిధ అంశాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: 100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్భారతీయ భాషల్లో వివిధ విభాగాలకు చెందిన సమగ్ర కంటెంట్‌ను అందించాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనువుగా ఆన్లైన్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అందులో వికీమీడియా, వికీపీడియా వంటి సంస్థలు విద్యార్థుల సాయం తీసుకుంటున్నాయి. ఫలితంగా ఓపెన్స్సోర్స్ టూల్స్ ద్వారా నేరుగా కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు వారి సహకారాన్ని కోరుతున్నాయి. -
ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధాని
ప్రముఖ కంపెనీల సీఈఓలు, అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో సమావేశం అయ్యారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే అమెరికా(ఏ), ఇండియా(ఐ) అని చెప్పారు. మూడు రోజుల యూఎస్ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం రాత్రి సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన ప్రముఖులను కలిసి మాట్లాడారు. భారతదేశంలోని అవకాశాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ విధానాలు పాటిస్తున్నాం. ఏదైనా ఒక దేశం విధించిన నియమాలను అనుసరించి డిజిటల్ ప్రపంచం నడవదు. నిత్యం అది మారుతూ ఉంటుంది. భారత్, అమెరికా కలిసి సాంకేతిక అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఏఐ అంటే అమెరికా, ఇండియా’ అని తెలిపారు.Had a fruitful roundtable with tech CEOs in New York, discussing aspects relating to technology, innovation and more. Also highlighted the strides made by India in this field. I am glad to see immense optimism towards India. pic.twitter.com/qW3sZ4fv3t— Narendra Modi (@narendramodi) September 23, 2024వైట్ హౌస్ విడుదల చేసిన ఉమ్మడి ఫాక్ట్ షీట్ ప్రకారం..ఐబీఎం సంస్థ ఇండియాకు చెందిన ఐరావత్ సూపర్ కంప్యూటర్‌కు మద్దతుగా ఏఐ సేవలిందిచేలా ఒప్పందం చేసుకుంది. అధునాతన సెమీకండక్టర్ ప్రాసెసర్లకు సంబంధించిన రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారాన్ని మెరుగుపరిచేలా ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత క్వాంటం మిషన్‌కు ఎంతో ఉపయోగపడుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో శనివారం సెమీకండక్టర్లకు సంబంధించి ఆర్ అండ్ డీ విభాగాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీన్ని గ్లోబల్ ఫౌండరీస్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!అమెరికా, ఇండియా మధ్య నవంబర్ 2023లో ‘ఇన్నోవేషన్ హ్యాండ్‌షేక్’ కార్యక్రమంలో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాల్లోని అభివృద్ధి అంశాలపై ఇరు దేశాలకు చెందిన నాయకులు చర్చించారు. సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఏఎండీ సీఈఓ లిసా సు చైర్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ టెక్ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు!
టెక్ దిగ్గజం సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం అంటే సుమారు 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది.సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను గత ఆగస్ట్ లోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. స్పష్టత లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబరు మధ్యలోనే సమాచారం అందింది.టెక్ క్రంచ్ నుండి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలోస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్‌స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024 "రికార్డులో రెండవ బలమైన సంవత్సరం" అని కంపెనీ నివేదించింది. లేఆఫ్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
ప్రపంచంలోనే బెస్ట్ కంపెనీలు!
కంపెనీలతోపాటు ఉద్యోగుల ఎదుగుదలను ప్రామాణికంగా తీసుకుని టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలోని వివిధ కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ‘టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 1000 కంపెనీలు ఉండగా అందులో 22 భారత కంపెనీలకు చోటు దక్కింది.ప్రపంచంలోని బెస్ట్ టాప్ 10 కంపెనీలుయాపిల్యాక్సెంచర్మైక్రోసాఫ్ట్బీఎండబ్ల్యూ గ్రూప్అమెజాన్ఎలక్ట్రిసైట్ డి ఫ్రాన్స్అమెరికన్ ఎక్స్ప్రెస్మెటా ప్లాట్ఫామ్స్సీమెన్స్జేపీ మోర్గాన్చేజ్ఇదీ చదవండి: లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!ఈ జాబితాలోని భారత కంపెనీలు(గ్లోబల్ ర్యాంక్)హెచ్‌సీఎల్ టెక్ 112ఇన్ఫోసిస్ 119విప్రో 134మహీంద్రా గ్రూప్ 187యాక్సిస్ బ్యాంక్ 504ఎస్బీఐ 518ఐసీఐసీఐ బ్యాంక్ 525ఎల్ అండ్ టీ 549ఐటీసీ లిమిటెడ్ 586హీరో మోటోకార్ప్ 597రిలయన్స్ ఇండస్ట్రీస్ 646మదర్సన్ గ్రూప్ 697అదానీ గ్రూప్ 736ఎన్టీపీసీ లిమిటెడ్ 752యెస్ బ్యాంక్ 783 -
రూ.83 లక్షల కోట్ల విలువైన తొలి నాన్‌టెక్ కంపెనీ
బెర్క్‌షైర్ హాత్వే మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరింది. ఆ మార్కును చేరిన మొదటి నాన్‌టెక్ కంపెనీగా ఈ సంస్థ ఘనత సాధించింది. వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ షేర్ విలువ బుధవారం యూఎస్ మార్కెట్లో 0.8 శాతం పెరిగి 464.59 డాలర్లకు చేరడంతో ఈ రికార్డు నెలకొంది.ఇప్పటివరకు ఒక ట్రిలియన్ డాలర్ల మార్కు చేరిన కంపెనీలు టెక్ సంస్థలే కావడం విశేషం. అలాంటిది నాన్ టెక్ సర్వీసులు అందిస్తున్న కంపెనీ ఈ మార్కు చేరడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన వార్తలు మార్కెట్లో వైరల్‌గా మారాయి. ఆల్ఫాబెట్ ఇంక్, మెటా, యాపిల్, ఎన్విడియా కార్ప్ వంటి టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే ఈ మార్కును చేరాయి.చెక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ స్టీవ్ చెక్ మాట్లాడుతూ..‘బెర్క్‌షైర్ సుమారు రెండు బిలియన్ డాలర్ల(రూ.16.7 వేలకోట్లు) విలువైన ఆస్తులను కలిగి ఉంది. ఈ సంవత్సరం సంస్థ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ కంటే అధికంగా లాభాలు అందించింది. దాదాపు పదేళ్ల నుంచి కంపెనీ ప్రాఫిట్‌లోనే ఉంది. 2024లో సంస్థ తన మదుపరులకు 30 శాతం లాభాలు తీసుకొచ్చింది. దాంతో మార్కెట్ బెంచ్‌మార్క్ 18% పెరిగింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: 12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. తెలంగాణ, ఏపీలో ఇవే..వారెన్‌బఫెట్ మొదట బెర్క్‌షైర్ హాత్వేను వస్త్ర తయారీ కంపెనీగా స్థాపించారు. క్రమంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా తీర్చిదిద్దారు. బఫెట్ నవంబర్‌లో మరణించిన తన వ్యాపార భాగస్వామి చార్లీ ముంగర్(99)తో కలిసి కంపెనీను ఎంతో అభివృద్ధి చేశారు. బెర్క్‌షైర్ స్థిరంగా 1965 నుంచి ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. -
కాలగర్భంలో కలల ఉద్యోగం..!
చిన్నపుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?’ అని అడిగితే చాలామంది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీరో లేదా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు. అదే డ్రీమ్ జాబ్‌గా ఊహించుకుని కష్టపడి చదివి ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీలో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ‘జెన్ జీ’(1997-2005 మధ్య జన్మించిన వారు) యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జీతాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంతో కరోనా కాలంలో అదే అదనుగా లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్లేటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు.సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువసేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్’కు స్వస్తి పలుకుతున్నారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలుఇప్పటికే టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 51 శాతం ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు, పిల్లల చదువుల కోసం, వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా 19 శాతం జెన్ జీ ఉద్యోగులు తన ‘డ్రీమ్‌జాబ్’ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఏదేమైనా సరైన నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలోనైనా కొలువు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు నెర్చుకుని అందులో అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం. వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పాటించాలి. -
ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలు
ఒకప్పుడు వేలు, లక్షల్లో పెట్టుబడిపెట్టి ప్రారంభించిన కంపెనీలు ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలుగా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. నిత్యం టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, యువతలో పెంపొందుతున్న నైపుణ్యాలు, కొత్త ఆవిష్కరణలు..వంటి ఎన్నో కారణాల వల్ల గ్లోబల్ ఎకానమీ దూసుకుపోతోంది. వివిధ రంగాలు వృద్ధిపథంలోకి వెళుతున్నాయి. దాంతో ఆయా రంగాల వార్షిక ఆదాయం క్రమంగా హెచ్చవుతోంది. అందులో ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని రంగాల గురించి తెలుసుకుందాం.ఇంటర్నెట్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్వార్షిక ఆదాయం: రూ.377 లక్షల కోట్లు.ఇంటర్నెట్, ఇ-కామర్స్, క్లౌడ్ సేవలు, డిజిటల్ ప్రకటనలు..వంటి సర్వీసులతో ఈ ఆదాయం సమకూరుతోంది. ఈ రంగంలో గూగుల్(ఆల్ఫాబెట్), ఫేస్బుక్(మెటా), అమెజాన్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి.ఈ-కామర్స్వార్షిక ఆదాయం: రూ.419 లక్షల కోట్లు.అమెజాన్, అలిబాబా, ఈబే, ఫ్లిప్‌కార్ట్..వంటి కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన రంగాలలో ఇది ఒకటి.ఆటోమొబైల్వార్షిక ఆదాయం: రూ.226 లక్షల కోట్లు.కార్ల తయారీ, విడిభాగాల తయారీ, సర్వీసు విభాగాల్లో ఈ రంగం వృద్ధి చెందుతోంది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఫార్మాస్యూటికల్స్ అండ్ మోడ్రన్ మెడిసిన్వార్షిక ఆదాయం: రూ.117 లక్షల కోట్లు.ఔషధ పరిశ్రమ, మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాల అభివృద్ధి, విక్రయాలు ఈ రంగాన్ని వృద్ధిబాటలు వేస్తున్నాయి. దేశీయంగా హైదరాబాద్ వంటి నగరాలు ఫార్మా తయారీకి ప్రధాన వనరుగా మారుతున్నాయి.స్మార్ట్ఫోన్లు, మొబైల్ టెక్నాలజీవార్షిక ఆదాయం: రూ.125 లక్షల కోట్లు.ప్రస్తుతం దాదాపు అందరివద్ద స్మార్ట్పోన్లున్నాయి. 3జీ టెక్నాలజీ వచ్చినపుడు అందుకు తగిన ఫోన్లు వాడారు. 4జీ ప్రారంభంలో తిరిగి ఆ టెక్నాలజీకి అనువైన ఫోన్లు వినియోగించారు. ఇప్పుడు 5జీ ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో యాపిల్, సామ్సంగ్, మోటోరోలా..వంటి కంపెనీలు సర్వీసులిస్తున్నాయి.విద్యుత్వార్షిక ఆదాయం: రూ.251 లక్షల కోట్లు.పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్న కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కరెంట్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. సంప్రదాయంగా దీని ఉత్పత్తికి బొగ్గు వాడుతున్నారు. కానీ వాతావరణ కాలుష్యం వల్ల క్రమంగా బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనిస్థానే పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తున్నారు.క్లౌడ్ కంప్యూటింగ్వార్షిక ఆదాయం: రూ.33 లక్షల కోట్లు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అందుకోసం కంపెనీలు నిత్యం వాటి కౌడ్ సర్వీసులను అప్డేట్ చేస్తూంటాయి. ఈ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటివి సేవలందిస్తున్నాయి.టెలికమ్యూనికేషన్స్వార్షిక ఆదాయం: రూ.142 లక్షల కోట్లు.మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు ఈ రంగం పరిధిలోకి వస్తాయి. టెలికమ్యూనికేషన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది.పర్సనల్ కంప్యూటింగ్వార్షిక ఆదాయం: రూ.41 లక్షల కోట్లు.ఇంట్లో ఉపయోగించే కంపూటర్లు, వాటి సర్వీసులు, ల్యాప్‌టాప్‌లు, అనుబంధ సాఫ్ట్వేర్ విక్రయాలు పర్సనల్ కంప్యూటింగ్ మార్కెట్ కిందకు వస్తాయి. ఈ రంగంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌పీ..వంటి కంపెనీలు దూసుకుపోతున్నాయి.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లువార్షిక ఆదాయం: రూ.12 లక్షల కోట్లు.ఈ రంగంలో పేస్బుక్(మెటా), ట్విటర్, టిక్‌టాక్..వంటి కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ల్లో ప్రకటనలు, డేటా మానిటైజేషన్ ద్వారా ఆదాయం వస్తోంది.ఇదీ చదవండి: ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంస్ట్రీమింగ్ సేవలువార్షిక ఆదాయం: రూ.8.3 లక్షల కోట్లు.ఈ విభాగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, స్పాటిఫై, ఆహా, అమెజాన్, జియో సినిమా వంటి స్ట్రీమింగ్ కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. సబ్స్క్రిప్షన్లు, ప్రకటనల ద్వారా ఇవి ఆదాయం పొందుతున్నాయి. -
భారీ ఉద్యోగాల కోత!.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
2024లో కూడా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ తయారీ సంస్థ 'ఇంటెల్' (Intel) కూడా చేరింది.ఇంటెల్ లాభాలు గణనీయంగా తగ్గడం.. మార్కెట్ వాటాను కోల్పోయిన తర్వాత, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ వారంలోనే వేలాదిమంది ఉద్యోగులను తొలగించున్నట్లు సమాచారం. అయితే ఎంతమందిని తొలగిస్తుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. ఉద్యోగుల తొలగింపులు ఈ వారంలోనే ఉండొచ్చని సమాచారం.ఇంటెల్ కంపెనీ సుమారు లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ఇది అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?చిప్ తయారీ రంగంలో ఖర్చులను తగ్గించి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఇంటెల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈఓ పాట్రిక్ పీ గెల్సింగర్ వెల్లడించారు. కంపెనీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కోసం చిప్‌లను తయారుబ్ చేస్తోంది. ఇతర కంపెనీల కోసం కూడా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలను నిర్మించడంపై దృష్టి సారించింది. సంస్థ ఇటీవల తన తయారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నాగ చంద్రశేఖరన్‌ను నియమించుకుంది. -
'నో ఆఫీస్.. నో లీవ్స్'.. టెక్ దిగ్గజం కొత్త మంత్రం!
కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. అయితే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీఎల్‌టెక్ కొత్త పాలసీని అందుబాటులో తీసుకురానుంది.ఆఫీసులకు వచ్చినవారికి మాత్రమే లీవ్స్ అందింస్తామని, ఆఫీసులకు రాకుండా లీవ్ తీసుకుంటే శాలరీలో కోతలు ఉంటాయని హెచ్‌సీఎల్‌టెక్ వెల్లడించింది. మహమ్మారి తర్వాత ఉద్యోగులను తిరిగి క్యాంపస్‌కు తీసుకురావడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగులు వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసులో ఉండాలి. హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత హెచ్‌సీఎల్‌టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులకు ఈ మెయిల్స్ ద్వారా వెల్లడించాయి. -
కంపెనీలు వెళ్లిపోతాయ్..!
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తెచ్చిన బిల్లుపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీని వల్ల కంపెనీలు రాష్ట్రాన్ని విడిచివెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.నాస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎంతో వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతంగా ఉంది. భారతదేశ డిజిటల్ టాలెంట్‌లో నాలుగింట ఒక వంతు ఇక్కడి నుంచే సమకూరుతుంది. 1,100 స్టార్టప్‌లు స్థానికంగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. మొత్తం గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)లో 30 శాతం కర్ణాటకలోనే కొలువు తీరాయి. ప్రభుత్వం తాజాగా స్థానికులకే ఉద్యోగాలు కేటాయించేలా బిల్లు తీసుకొచ్చింది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వేరే దేశాలకు చెందినవారు కర్ణాటకలో పనిచేసే పరిస్థితులుండవు. టెక్ కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. భారీగా టెక్నాలజీ ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంలో ఈ బిల్లు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విస్తృతంగా సమీక్ష జరిపే విరమించుకోవాలి.కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024 ప్రకారం..రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు యాజమాన్య స్థాయిలో 50 శాతం, ఇతర పొజిషన్లలో 75 శాతం రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూల వాతావరణంపై, ప్రతికూల ప్రభావం ఉంటుందని, పరిశ్రమ తిరోగమన బాట పడుతుందన్న పలువురు నిపుణుల హెచ్చరికలకు నాస్కామ్ కూడా గొంతు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఉందని పలు నివేదికలు వెలువడుతున్న తరుణంలో ఇలాంటి బిల్లు విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?ప్రైవేట్ టెక్ కంపెనీల్లో గ్రేడ్ సీ, డీ ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వ్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వేలకోట్ల డీల్
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్.. సిన్సినాటి, ఒహియోకు చెందిన ఇంజినీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ER&D) సర్వీస్ ప్రొవైడర్ 'బెల్కాన్'ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..కాగ్నిజెంట్ కంపెనీ ఇప్పుడు బెల్కాన్ను 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 10800 కోట్లు. కాగ్నిజెంట్ ఈ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత తన పరిధిని మరింత విస్తరించనుంది.ఇక బెల్కాన్ విషయానికి వస్తే.. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 కంటే ఎక్కువ దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో ఏకంగా 10000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, బోయింగ్, అమెరికా నేవీ, నాసా వంటి సంస్థలకు ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. కంపెనీ విక్రయానికి సంబంధించిన అధికారిక ప్రకటనను బెల్కాన్ అధికారికంగా ప్రకటించలేదు.ఒప్పందంలో భాగంగా, బెల్కాన్ సీఈఓ లాన్స్ క్వానీవ్స్కీ నేతృత్వంలో కంపెనీ కొనసాగుతుందని, కాగ్నిజెంట్ యూనిట్‌గా పనిచేస్తుందని కాగ్నిజెంట్ తెలిపింది. బెల్కాన్ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 66 వేలకోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ కొనుగోలుతో కాగ్నిజెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.Cognizant has agreed to acquire Belcan, expanding access to the high-growth Engineering Research & Development services market and establishing leadership in aerospace & defense. See the release here: https://t.co/2HS9UKKR5V pic.twitter.com/XoZqEHelEr— Cognizant (@Cognizant) June 10, 2024 -
ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!
ప్రస్తుతం అందర్నీ బాగా వేదించే సమస్య అధిక బరువు. నేటి జీవన విధానం, శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో కంప్యూటర్ల మందు గంటగంటలు కూర్చొని చేసే ఉద్యోగాలతో చిన్న, పెద్దా అంతా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఒకవేళ వ్యాయామాలు చేద్దామనుకున్నా..కొన్ని రోజులు చేసి బద్ధకంతో స్కిప్ చేస్తూ పోతుండటంతో బరువులో పెద్ద మార్పు ఉండదు. దీంతో అధిక బరువు అన్నది భారమైన సమస్యగా మిగిలిపోతోంది చాలామందికి. తాజగా ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఓ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగులు ఆరోగ్యకరంగా మంచి సామర్థ్యంతో పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్‌ని పెట్టిందట. ఆ ఆఫర్ వింటే ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా?.. అని విస్తుపోతారు. ఎక్కడంటే..చైనాలో షెన్జెన్లోని ఇన్‌స్టా360 అనే టెక్ కంపెనీ తన ఉద్యోగులకు మంచి ఆరోగ్యంతో హాయిగా పనిచేసుకోండి అంటూ ఓ గొప్ప ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే హాయిగా బరువు తగ్గండి దగ్గర దగ్గర కోటి రూపాయాల వరకు బోనస్‌లు పొందండి అని ఆఫర్ ఇచ్చింది. ఈ టెక్ కంపెనీ తన ఉద్యోగులు ఊబకాయ సమస్య నుంచి బయటపడేలా బరువు తగ్గించే బ్యూట్ క్యాంప్ అనే కార్యక్రమాన్ని ప్రారండించింది. ఈ కార్యక్రమంలో మూడు నెలల పాటు సాగుతుంది. ప్రతి సెషన్లో సుమారు 30 మంది ఉద్యోగుల వరకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ కార్యక్రమంలో ఊబకాయం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు.ప్రతి సెషన్ మూడు గ్రూపులుగా విభజించి, వారంలో సముహం మొత్తం బరువు సగటు ఆధారంగా బోనస్‌లు అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ విజయాన్ని ఆయా సముహాలకే ఇస్తుంది. ఎందుకంటే గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా తగ్గితేనే కదా డబ్బులు వస్తాయి. కాబట్టి బరువు తగ్గాలన్న సంకల్పం వారిలో అనుకోకుండా రావడమే గాక పక్కవారిని మోటీవేట్ చేస్తారు. దీంతో సమిష్టిగా బరువు తగ్గే ప్రయత్నం తోపాటు వారి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఈ కార్యక్రమాన్ని ఆ కంపెనీ 2023లో ప్రారంభించింది. ఆ కంపెనీ అనుకున్నట్లు తమ ఉద్యోగలు సత్వరమే బరువు తగ్గేలా చేయడంలో అద్భుతమైన ఫలితాలు కూడా సాధించింది. ఇలా ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 150 మంది ఉద్యోగులు దాక ఏకంగా 800 కిలోలు బరువు తగ్గి దాదాపు రూ. 83 లక్షల దాక రివార్డులు సంపాదించుకున్నారు. ఈ మేరకు ఆ కంపెనీలో పనిచేసే లి అనే వ్యక్తి మాట్లాడుతూ..తాను ఈ కార్యక్రమంలో నవంబర్ 2023లో చేరానని చెప్పాడు. ఆ శిక్షణ కార్యక్రమంలో రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ వంటివి చేసి సుమారు 17.5 కిలోల మేర బరువు తగ్గి రూ. 80 వేలు బోనస్‌గా పొందానని తెలిపాడు. ఈ ప్రోగ్రాం తన ఆరోగ్యాన్ని, ఆర్థికస్థితిని మెరుగుపరిచిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ కంపెనీలో వెంటనే జాయిన్ అవుతానని ఒకరూ, మరోకరూ తాను ఏకంగా 10 కి.మీ వరుకు పరుగెత్తగలనని, తనలాంటి సిబ్బందితో తొందరగా ఆ కంపెనీ దివాలా తీసేస్తుందని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్) -
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
ఫేమస్ కంపెనీల మొదటిరోజు లాభాలు..(ఫొటోలు)
-
ఆఫీస్‌కు రాకపోతే ప్రమోషన్ కట్.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెక్ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. తాజాగా డెల్ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్, రిమోట్ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్ రోల్లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది. -
కేంద్రం దెబ్బకు దిగొచ్చిన గూగుల్
సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన గూగుల్ అప్పుడే యాప్‌లను పునరుద్ధరించే (Restore) ప్రక్రియను ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్'తో కంపెనీ అధికారులు సమావేశం జరగకముందే టెక్ దిగ్గజం ఈ చర్యకు పూనుకుంది. గత శుక్రవారం గూగుల్ భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను తొలగించి.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వివాదానికి కారణమైంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ ప్రముఖ యాప్‌లను తొలగించింది. తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఈయనే లేకుంటే భారత్‌లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని.. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఉక్రెయిన్‌కు మరోసారి గూగుల్ సపోర్ట్ ఫండ్.. ఈసారి ఎంతంటే?
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ భారీగా దెబ్బతినింది. ఉక్రెయిన్ను ఆదుకోవడానికి టెక్ దిగ్గజం గూగుల్ 10 మిలియన్ డాలర్ల (రూ. 83 కోట్ల కంటే ఎక్కువ) విలువైన స్టార్టప్ సపోర్ట్ ఫండ్‌ను ప్రకటించింది. చాలా మంది ప్రజలు దేశాన్ని దాటి వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోని వ్యాపారాలను నిర్వహించుకోవడానికి గూగుల్ ఈ సపోర్ట్ ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలో పెద్దపెద్ద భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటివి కూడా బాగా దెబ్బతిన్నాయి. నిత్యావరాలకే కష్టమైన ఉక్రెయిన్ను ఆదుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ 2022 మార్చిలో ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ను గూగుల్ ఇప్పటికి కూడా తన మద్దతు అందిస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సహాయక చర్యలకు మద్దతుగా 45 మిలియన్ డాలర్ల నగదు అందించినట్లు సమాచారం. గూగుల్ ఫండింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ ఫండ్ సపోర్ట్‌తో స్టార్టప్‌లు 15.8 మిలియన్ ఫాలో ఆన్ ఫండింగ్‌ను పొందాయి. దీంతో ఆ దేశంలో ఉపాధి గణనీయంగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదీ చదవండి: విల్లాగా మారిన విమానం.. ఫిదా అవుతున్న జనం - వీడియో -
అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు..
సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు చెప్పినట్లుగానే.. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది. 2023లో కంపెనీలోని మొత్తం పనిచేసే ఉద్యోగుల సంఖ్య 85000. ఇందులో ఈ ఏడాది ఏకంగా 4000 మందిని ఇంటికి పంపేసింది. ఉద్యోగుల తొలగింపులపైన కూడా కంపెనీ 800 మిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఉద్యోగుల తొలగింపు చెల్లింపులు, ఇతర సంబంధిత ఖర్చులకు నిధులుగా సమకూర్చుతుంది. ఇదీ చదవండి: టీసీఎస్ బాటలో హెచ్‌సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు.. సిస్కో కంపెనీ ఇతర కంపెనీల మాదిరిగానే అనేక ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండవ త్రైమాసికంలో ఆదాయం 52.5 బిలియన్ డాలర్ల నుంచి 51.5 బిలియన్ల డాలర్లకు తగ్గింది. దీంతో కంపెనీ షేర్స్ కూడా 5 శాతానికిపైగా పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగానే.. తాజాగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది. -
టీసీఎస్ బాటలో హెచ్‌సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు..
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా చాలామందికి ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి సుముఖత చూపుతూ.. ఆఫీసులకు రావడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్ణింగ్ ఇచ్చేసింది. ఈ బాటలో ఇప్పుడు హెచ్‌సీఎల్ అడుగులు వేస్తోంది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ ఇప్పుడు తమ ఉద్యోగులను తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. హెచ్‌సీఎల్ ఉద్యోగి ఎవరైనా వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. కొత్త నిబంధనలు 2024 ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టంగా చేసింది. దీంతో ఉద్యోగులు 19వ తేదీ నుంచి తప్పకుండా వారానికి మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయాలని ఆదేశించాయి. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా ఆఫీసుకు రావాలని హెచ్‌సీఎల్ టెక్ పీపుల్స్ ఫంక్షన్స్ గ్లోబల్ హెడ్ వికాస్ శర్మ ఆదేశిస్తూ.. ఈ నెల 14న మెయిల్స్ పంపినట్లు సమాచారం. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాకుంటే జీతం లేకుండా సెలవు తీసుకున్నట్లు (లాస్ ఆఫ్ పే) ప్రకటించే అవకాశం ఉన్నట్లు మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! ఆఫీసులకు రావడమే కాకుండా ఉత్పాదక కూడా పెంచాలని యాజమాన్యం ఆదేశిస్తున్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులు రోజుకు సగటున కనీసం 8 గంటలు పనిచేయాలని చెబుతున్నారు. 8 గంటలపాటు ల్యాప్‌టాప్ యాక్టివిటీ నమోదు కాని సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి..
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దిగ్గజ కంపెనీలు 2024లో కూడా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'సిస్కో' కంపెనీ ఇప్పుడు వేలాదిమందిని ఇంటికి పంపే యోచనలో ఉంది. లేఆఫ్‌ల వల్ల ప్రభావితం అయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్యపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది. 2023లో కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 84900. ఇందులో ఈ ఏడాది ఎంతమందిని తీసేయాలని విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 14న కంపెనీ తన ఫలితాలను వెల్లడించనుంది, ఆ సమయంలో ఎంతమందిని కంపెనీ నుంచి ఇంటికి పంపిందనే విషయం తెలుస్తుంది. ఇదీ చదవండి: 'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్సైట్ ఇదే.. ప్రస్తుతం కంపెనీలోని ఉద్యోగులలో కనీసం 5 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని అంచనా. గతంలో నోకియా, ఎరిక్సన్ వంటి టెలికామ్ దిగ్గజాలు కూడా నష్టాల్లో ఉన్నప్పుడు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ కూడా తన మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. -
ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
గతంలో ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులలో ఒకరు ఇప్పుడు ఓ సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా రూ.27 కోట్లు సంపాదిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఉద్యోగం కోల్పోయిన తరువాత ఏ కంపెనీ స్టార్ట్ చేసాడనే వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 2005లో ఫేస్బుక్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసిన 'నోహ్ కాగన్'.. టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని కలలు కన్నారు. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారనే ఆరోపణల కారణంగా ఫేస్బుక్ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తరువాత బాగా అలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఫేస్బుక్, ఇంటెల్, మింట్.కామ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ 'యాప్‌సుమో' (AppSumo) ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాకపోయినప్పటికీ పట్టు వదలకుండా కృషి చేసారు. అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. గత సంవత్సరం యాప్‌సుమో 80 మిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇందులో లాభమే 7 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 కోట్లు. ఇదీ చదవండి: సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం ఇజ్రాయల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన కగన్ టెక్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నారు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలన్నట్లు 'నోహ్ కాగన్' వెల్లడించారు. అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని.. ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవడం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్లు తెలిపారు. -
లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది?
2024లో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు Layoffs.fyi డేటాలో వెల్లడించింది. తాజాగా Snap Inc కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540 మంది) తగ్గించినట్లు ప్రకటించింది. దీనితో పాటు Okta Inc సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే.. ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 మంది) తగ్గించింది. అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం 2024లో ప్రారంభం నుంచి సిబ్బందిని తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు, ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడానికి కూడా.. అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఉపయోగించుకోవడానికి.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానే సుముఖత చూపుతున్నాయి. దీంతో కొత్త నియమాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా ఇంటికి పంపిస్తోంది. ఇదీ చదవండి: ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..! ఊదుతున్న ఉద్యోగాల సంగతి పక్కన పెదిర్తే.. ఏఐ టెక్నాలజీలో నైపుణ్య కలిగిన లేదా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలలో నైపుణ్యాని కలిగిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ కారణంగానే గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17479కి చేరినట్లు తెలుస్తోంది. -
విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!
2024 ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. టెక్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం విప్రో వందలాదిమందిని తొలగించడానికి సిద్ధమైంది. సంస్థ లాభాల మార్జిన్లను మెరుగుపరచుకోవాలనుకుంటున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విప్రో కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపడుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఖర్చులను ఆదా చేయడానికి లేఆప్స్ ప్రక్రియను మొదలుపెట్టాయి. విప్రో కంపెనీ కూడా ఈ సంస్థలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల వెల్లడైన క్యూ3 ఫలితాలలో విప్రో ఆశించిన లాభాలను పొందలేకపోయింది. ఫలితాల ప్రకారం విప్రో లాభం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ. కాబట్టి కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించడానికి సంకల్పించింది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా.. ప్రస్తుతం విప్రో కంపెనీ లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తోంది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'అపర్ణ అయ్యర్' రాబోయే త్రైమాసికంలో కంపెనీ లాభాల మార్జిన్లను మెరుగుపరిచే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ తొలగించనున్న ఉద్యోగులలో ఆన్సైట్లో పని చేసే మధ్య స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. -
Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?
సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్‌ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..! రూ.17 వేల కోట్లు గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు సీవెరన్స్ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల కింద గూగుల్ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్‌లకు అయిన ఖర్చు మాత్రమే. గూగుల్ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు. 2024లోనూ.. గూగుల్ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు. -
మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..
నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే.. ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన 'ఇన్ఫోసిస్' (Infosys). ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. ఈ రోజు 83.92 బిలియన్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి చెబుతూ.. తమ కుమార్తె అక్షతా మూర్తిని 90 రోజుల వయసున్నప్పుడు తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. టెక్ కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సుధామూర్తి, నారాయణ మూర్తి ముంబైకి మారారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు ఎలా మారతాయో ఊహకందని సమయంలో.. నా బిడ్డ అక్షతా మూర్తి తన తాతయ్యల వద్ద పెరగడం మంచిదని భావించిన సుధామూర్తి.. చిన్నారిని ముంబై నుంచి కర్ణాటకలోని తన తల్లిదండ్రులు, సోదరి వద్ద వదిలి పెట్టింది. ఎంతో గారాబంగా పెంచుకోవాల్సిన చిన్నారిని విడిచిపెట్టడం చాలా కష్టమైన నిర్ణయమని సుధామూర్తి చెబుతూ.. ఆ రోజు నుంచి అక్షతకు నా తల్లి, సోదరి తల్లులుగా మారారని తెలిపింది. ఈ రోజు ఇన్ఫోసిస్ ఇంత పెద్ద సంస్థగా అవతరించినదంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు. ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి మీరు ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు. ఈ రోజు యూకే ప్రధాని భార్యగా.. వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఎదిగిన 'అక్షతా' కర్ణాటకలోని హుబ్లీలో తన తాతయ్యలతో కలిసి పెరిగింది. ఏదైనా విలువైనది చేయాలని ఆకాంక్షించినప్పుడు త్యాగాలు అనివార్యమని మూర్తి దంపతులు స్పష్టం చేశారు. -
ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ..
ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రముఖ ఎడ్టెక్ సంస్థ 90 శాతం తన విలువను కోల్పోయింది. బైజూస్ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన విలువను భారీగా నష్టపోయింది. ఈమేరకు ‘టెక్‌క్రంచ్’ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు అందులో పేర్కొంది. ఫిబ్రవరిలో షేర్లను జారీ చేసి ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కించి ఇన్వెస్టర్లకు షాక్ఇచ్చింది. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గింది. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో అప్పు ఇచ్చినవారికి చెల్లింపులు చేయనుందని తెలిసింది. బైజూస్ అనుబంధ సంస్థలు వైట్ హాట్ జూనియర్, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ వ్యయం రూ.6,679 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్, గ్రేట్ లెర్నింగ్ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్‌లెర్నింగ్ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! బైజూస్ తన వాల్యుయేషన్‌ను తగ్గించడానికి సుముఖత చూపడంపై స్టార్టప్ కంపెనీలు భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. 2021-22లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ఈ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది. ఒకానొక సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు సంస్థకు 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను ఇచ్చినట్లు టెక్ క్రంచ్ గతంలో నివేదించింది. -
టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ అండ్ ఎండీ కె కృతివాసన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయం గురించి మాట్లాడుతూ.. రిటర్న్ టు ఆఫీస్ పాలసీ చాలా బాగా పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తారని వెల్లడించారు. ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి 3 నుంచి 5 రోజులు ఆఫీసుకు వస్తున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) పర్యటనలో ఉన్న కృతివాసన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేము రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రకటించిన కొంత కాలానికి ప్రత్యర్థి కంపెనీలు కూడా దీన్నే అనుసరించడం మొదలుపెట్టేశాయి. రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలు చేయడం కంపెనీకి బాగా కలిసొచ్చిందని, దీంతో సిబ్బందిని మరింత మోటివేట్ చేయడానికి అవకాశం లభించిందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత భారీగా పెరిగిన సమయంలో TCSతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థలు రొటేషన్ పద్దతిలో ఉద్యోగులు మళ్ళీ ఆఫీసులకు రావడానికి సన్నాహాలు చేశాయి. ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! అప్పటి సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చే అవకాశం ఉందని భావించారు, కానీ ఇప్పటికే 65 శాతం మంది ఆఫీసుకు వస్తున్నారు. కంపెనీ గత ఏడాది వందల మంది ఉద్యోగులను తొలగించింది కూడా. గతంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. రానున్న రోజుల్లో అవసరానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, వచ్చే త్రైమాసికం నాటికి 5 వేల నుంచి 6 వేల మందిని నియమించుకుంటే కంపెనీ తొలగించిన ఉద్యోగులకు సమానమవుతుందని కృతివాసన్ అన్నారు. -
2024 ప్రారంభంలోనే పరేషాన్.. ఐటీ ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన కలవరం!
2023 ముగిసింది, కొత్త సంవత్సరం 2024 అయినా కలిసొస్తుందేమో అనుకున్న ఐటీ ఉద్యోగులకు మొదటి రెండు వారాల్లోనే చుక్కెదురైంది. ఇప్పటికి 46 ఐటీ అండ్ టెక్ కంపెనీలు సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. గత ఏడాది చివరి వరకు ఉద్యోగాల తొలగింపులను చేపట్టిన చాలా కంపెనీలు.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అదే ఫాలో అవుతున్నాయి. ఇందులో భాగంగానే 46 కంపెనీలు జనవరి 14 వరకు 7,528 మంది ఉద్యోగాల ఉద్యోగాలను తొలగించినట్లు layoff.fyi అందించిన లేటెస్ట్ డేటాలో తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ గత వారం ధృవీకరించింది. అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తొలగించింది. డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్ స్టూడియో పిక్సర్ కూడా ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. -
టెక్ దిగ్గజాల్లో అలజడి.. నాలుగు కంపెనీలలో 50000 మంది
కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి కూడా ఐటీ కంపెనీలు ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే 2023లో వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఉద్యోగుల సంఖ్య కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల వెల్లడైన 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థలు స్వల్ప లాభాలను పొందగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మాత్రం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద కూడా పడే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. 2023-24 మూడవ త్రైమాసికం నాటికి భారతదేశంలోని టాప్ 4 కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య 50,875 తగ్గినట్లు సమాచారం. ఇందులో 10,669 మంది టీసీఎస్, 24182 మంది ఇన్ఫోసిస్, 18510 మంది విప్రో, 2486 మంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు ఉన్నారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన ఒక్క ఆలోచన - ఎవరీ నీరజ్ కక్కర్! ఇప్పటి వరకు చాలా ఐటీ కంపెనీలు కొత్త నియామకాలను చేపట్టలేదు. రాబోయే రోజుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లను ప్రారంభించే దిశగా టీసీఎస్ యోచిస్తోంది. ఇన్ఫోసిస్ మాత్రం ఇప్పట్లో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ కంపెనీ మాత్రం ఫ్రెషర్లను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
TCS Q3 Results: క్యూ3 ఫలితాల్లో టీసీఎస్ గుడ్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 8.2 శాతం పుంజుకుని రూ. 11,735 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వృద్ధితో రూ. 60,583 కోట్లకు చేరింది. భారత్(23.4 శాతం)సహా వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పుంజుకోవడం ఇందుకు సహకరించింది. ఈ బాటలో ప్రధాన మార్కెట్లలో యూకే 8.1 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 16 శాతం, లాటిన్ అమెరికా 13.2 శాతం చొప్పున వృద్ధి సాధించగా.. ఉత్తర అమెరికా నుంచి 3 శాతం క్షీణత నమోదైంది. ఇక విభాగాలవారీగా చూస్తే ఎనర్జీ, రిసోర్సెస్ – యుటిలిటీస్(11.8 శాతం), తయారీ(7 శాతం), లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్(3.1 శాతం) ఆదాయానికి దన్నుగా నిలిచినట్లు కంపెనీ పేర్కొంది. అయితే కీలకమైన బీఎఫ్ఎస్ఐ విభాగంలో 3 శాతం, మీడియా, టెక్నాలజీలలో 5 శాతం చొప్పున ప్రతికూల వృద్ధి నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 27 చొప్పున డివిడెండును ప్రకటించింది. దీనిలో రూ. 18 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ఇందుకు రికార్డ్ డేట్ ఈ నెల19కాగా.. ఫిబ్రవరి 5నుంచి చెల్లించనుంది. పలు ఒప్పందాలు క్యూ3లో దిగ్గజ యూకే బ్యాంక్ మోటార్ ఫైనాన్స్, లీజింగ్ బిజినెస్‌లకు ఎండ్టు ఎండ్ ట్రాన్స్ఫార్మేషన్ భాగస్వామిగా టీసీఎస్‌ను ఎంపిక చేసుకుంది. ఈ బాటలో ఆస్ట్రేలియా ప్రధాన ఎక్సే్ఛంజీ ఏఎస్ఎక్స్ అధునాతన క్లయరింగ్, సెటిల్మెంట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఎస్ హెల్త్‌కేర్ కంపెనీ ప్రస్తుత నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు క్లౌడ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ కోసం టీసీఎస్‌తో చేతులు కలిపింది. సాఫ్ట్వేర్ సేవలకు సీజనల్‌గా బలహీన త్రైమాసికంగా పేర్కొనే అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లోనూ కంపెనీ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించింది. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, కస్టమర్ కేంద్రంగా అమలు చేసే వ్యూహాలతోపాటు.. పటిష్ట బిజినెస్ మోడల్‌ను ఇది ప్రతిబింబిస్తోంది. వివిధ మార్కెట్ల నుంచి కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భారీ ఆర్డర్ బుక్కు కారణమవుతోంది. - కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ ఇతర విశేషాలు... నిర్వహణ మార్జిన్లు 0.5 శాతం మెరుగుపడి 25 శాతానికి చేరాయి. నికర మార్జిన్లు 19.4 శాతంగా నమోదయ్యాయి. ఆర్డర్ బుక్ 8.1 బిలియన్ డాలర్లను తాకింది. డిసెంబర్ కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 10,669 మంది తగ్గి 6,03,305కు చేరింది. వీరిలో మహిళల సంఖ్య 35.7%. కార్యకలాపాల ద్వారా రూ. 11,276 కోట్ల నగదును జమ చేసుకుంది. గత 12 నెలల్లో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 13.3 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 3,736 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో కంపెనీ రూ. 6,106 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.6,586 కోట్లతో పోలిస్తే 7.3% తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1.3% పెరుగుదలతో రూ. 38,821 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో ఆదాయం రూ. 38,318 కోట్లుగా నమోదైంది. క్లయింట్ల నుండి డిమాండ్ మందగించడం ఫలితాలపై ప్రభావం చూపింది. గైడెన్స్ కట్.. 2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిన్ ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) కుదించింది. 1.5–2 శాతానికి తగ్గించింది. గత ఫలితాల సందర్భంగా ఆదాయ వృద్ధిని 1–2.5 శాతంగా అంచనా వేసింది. ‘ఇన్‌సెమీ’ కొనుగోలు.. బెంగళూరుకు చెందిన సెమీకండక్టర్ డిజైన్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్‌సెమీ కొనుగోలు ప్రతిపాదనకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.280 కోట్లకు దీన్ని దక్కించుకోనుంది. 2024 మార్చిలోపు ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో మా పనితీరు నిలకడగానే ఉంది. బడా డీల్స్ దన్నుతో 3.2 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నాం. జెనరేటివ్ ఏఐ, డిజిటల్, క్లౌడ్ తదితర విభాగాల్లో మా పోర్ట్‌ఫోలియో పటిష్టతకు ఇది నిదర్శనం. స్థూల ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఫైనాన్షియల్ సర్వీసులు, టెల్కోలు, హైటెక్ రంగాల్లో ప్రభావం కొనసాగవచ్చని భావిస్తున్నాం. - సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ ఇతర ముఖ్యాంశాలు.. క్యూ3లో ఇన్ఫీ 3.2 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో నికరంగా 71% కొత్త డీల్స్ ఉన్నాయి. డిసెంబర్ 31 నాటికి కంపెనీలో 3,22,663 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. క్యూ2తో పోలిస్తే (3,28,764) నికరంగా 6,101 మంది (1.8 శాతం) సిబ్బంది తగ్గారు. క్రితం ఏడాది డిసెంబర్ క్వార్టర్ నాటికి ఉన్న 3,46,845 మందితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7% తగ్గింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 12.9%గా ఉంది. కాగా, ఉద్యోగుల వినియోగాన్ని నిశితంగా పరిశీలిస్తామని సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ చెప్పారు. క్యాంపస్ హైరింగ్ అనేది క్లయింట్ల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి దీని అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో షేరు ధర 1.62% నష్టంతో రూ.1,495 వద్ద ముగిసింది. -
భారతీయ ఐటీ కంపెనీ సంచలనం.. ఓనర్లుగా ఉద్యోగులు!
నెలకోసారి జీతమిచ్చే కంపెనీలే కానీ ఆదాయంలో వాటా ఇచ్చే సంస్థల గురించి అరుదుగా వింటుంటాం. అలాంటిదే ఈ భారతీయ ఐటీ కంపెనీ. తమ ఉద్యోగులకు కంపెనీలో ఏకంగా 33 శాతం వాటాను ఇచ్చేస్తోంది. అంతేకాదు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన కార్లు అందించింది. కంపెనీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులనైతే ‘కో ఫౌండర్లు’గా ప్రకటించేసింది. 33 శాతం ఉద్యోగులకే.. ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకున్న ఈ ఐటీ కంపెనీ పేరు ‘ఐడియాస్2ఐటీ’ (Ideas2IT) భారత్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ టెక్ సంస్థ తమ 100 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.832 కోట్లు) కంపెనీ యాజమాన్యంలో 33 శాతాన్ని ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 5 శాతాన్ని 2009లో కంపెనీ పెట్టినప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న 40 ఉద్యోగులకు, మిగిలినదాన్ని మిగతా 700 మంది సిబ్బందికి పంచనున్నట్లు పేర్కొంది. 150 మందికి కార్లు కంపెనీలో వాటాతో పాటు తమ వద్ద ఐదేళ్లకు పైగా సేవలందించిన 50 మంది ఉద్యోగులకు 50 కార్లను కంపెనీ వ్యవస్థాపకులు మురళీ వివేకానందన్, భవాని రామన్ అందజేశారు. ఉద్యోగులు రూ. 8-15 లక్షల ధర రేంజ్లో మారుతీ సుజుకి లైనప్ నుంచి తమకు నచ్చిన వాహనాలను ఎంచుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఉద్యోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా వీటిని వారి సొంత పేర్లతో రిజిస్టర్ చేసి మరీ ఇచ్చింది. కాగా ఇదివరకే 2022లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇలాగే 100 కార్లను అందించింది. Ideas2IT, #tech firm valued at $100mn, announces transfer of 1/3rd of company ownership to its most-trusted employees They've just given away 50cars(₹8-15lakh range) to those that have served 5+yrs..In 2022, 100 staff got cars(regd in own name)#chennai #india #business… pic.twitter.com/yYXA7Isddm — Sidharth.M.P (@sdhrthmp) January 2, 2024 సామాన్య యువతకు అవకాశం 2009లో ప్రారంభించి 100 మిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగామని, దీని ఫలాలను తమ ఉద్యోగులతో పంచుకోవాలకోవాలనుకుంటున్నట్లు ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ వెల్లడించినట్లుగా వార్తాసంస్థ వియాన్ పేర్కొంది. ఎంప్లాయీ ఓనర్షిప్ ప్రోగ్రామ్ చొరవలో భాగంగా కంపెనీ దీన్ని చేపట్టింది. ఈ కంపెనీకి భారత్‌తోపాటు యూఎస్, మెక్సికో దేశాల్లో మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు. మరో విశేషం ఏటంటే ఈ కంపెనీ ఉద్యోగుల కోసం ఐఐటీల వెంట పడదు. చిన్న చిన్న పట్టణాలకు చెందిన సామాన్య యువతనే నియమించుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ విలువను నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు రెట్లు పెంచే వ్యూహంతో ఉన్న చెప్పిన మురళీ వివేకానందన్ కంపెనీ ప్రారంభించడదానికి ముందు సన్, ఒరాకిల్, గూగుల్ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం యూఎస్ ఉంటున్న ఆయన భారత్‌లోని చెన్నై, మెక్సికో మధ్య తిరుగుతూ ఉంటారు. -
ఆసక్తి... అధ్యయనం... నైపుణ్యం
‘నేటి ఆసక్తి రేపటి నైపుణ్యం’ అంటారు. కాలేజి చదువుతో సంబంధం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్(ఏఐ)కి సంబంధించిన ప్రాథమిక విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది యువతరం. గూగుల్, మైక్రోస్టాప్ట్, అమెజాన్... మొదలైన దిగ్గజ సంస్థలు అందించే షార్ట్ టైమ్ ఉచిత కోర్సులలోప్రావీణ్యం సంపాదించి తొలి అడుగు వేస్తున్నారు... సంప్రదాయ హద్దులను చెరిపేస్తూ, ఆలోచనలను పునర్నిర్వచిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవెల్యూషనరీ ఫోర్స్‌గా ఎదుగుతోంది. విద్యారంగానికి సంబంధించి ‘ఏఐ’ అనేది గేమ్–చేంజర్ అయింది. ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్‌లో ఆటలను పోలిన ఎలిమెంట్స్‌ను ΄÷ందుపరిచి, నేర్చుకునే విధానాన్ని ఆసక్తికరం చేసే ‘గేమిఫికేషన్’ ప్రక్రియ ఊపందుకుంటుంది. తాము ఏ కోర్సు చదువుతున్నాం అనేదానితో సంబంధం లేకుండా ‘ఏఐ’కి సంబంధించినప్రాథమిక విషయాలపై ఆసక్తి చూపుతున్న వారికి దిగ్గజ సంస్థల ఏఐ ఉచిత కోర్సులు వరంగా మారాయి. 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది అమెజాన్. దీనికి ‘ఏఐ రెడీ’ అని పేరు పెట్టారు. నెక్ట్స్–జెన్ ఏఐ టెక్నాలజీని పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఫౌండేషనల్ ఏఐ కాన్సెప్ట్స్,ప్రాక్టికల్ అప్లికేషన్ డెవలప్మెంట్కు సంబంధించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఎనిమిది ఉచిత ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఐకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక దిగ్గజం గూగుల్ పదిహేను భాషల్లో అందుబాటులో ఉండే ఉచిత ‘ఏఐ సర్టిఫికేషన్’ కోర్సులకు రూపకల్పన చేసింది. ఏఐకి సంబంధించినప్రాథమిక విషయాలను అవగాహన పరిచే లక్ష్యంతో దీన్నిరూపొందించారు. బిగినర్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. లెసన్స్‌ను ఆరు మాడ్యూల్స్‌గా విభజించారు. వాటిజ్ ఏఐ; ఏఐప్రాబ్లం సాల్వింగ్, రియల్ వరల్డ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, న్యూట్రల్ నెట్వర్క్స్, ఇంప్లికేషన్స్లాంటి ఆరు చాప్టర్లు ఉంటాయి. రకరకాల ఎక్సర్సైజ్లు ఉండే ఈ ఉచిత కోర్సులలో స్టూడెంట్స్ 50 శాతం ఎక్సర్‌సైజ్‌లను కరెక్ట్‌గా చేయాల్సి ఉంటుంది. ‘రెస్సాన్సిబుల్ ఏఐ’ అనే కోర్స్‌ను కూడారూపొందించింది గూగుల్. ఏఐ ఎక్స్పర్ట్ డాక్టర్ ఆండ్రూ ఎన్జీ దీన్నిరూపొందించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం రోజువారీ పనుల్లో ఎలా సహాయ పడుతుంది, ఏఐ ఆధునాతన ఉపయోగాలు ఏమిటి... మొదలైనవి ఇందులో ఉంటాయి. ‘ఏఐ’కి సంబంధించిప్రాథమిక విషయాలను అవగాహన పరిచే కోర్సునురూపొందించింది మైక్రోసాఫ్ట్. 24 లెసన్స్కు సంబంధించి పన్నెండు వారాల కరికులమ్ ఇది. జెనరేటివ్ ఇంటెలిజెన్స్ పరిచయం, అది పని చేసే విధానం, కంటెంట్‌ను క్రియేట్ చేసే పద్ధతులు, వివిధ రకాల మోడల్స్...మొదలైనవి దీనిలో ఉన్నాయి. ఈ కోర్సును ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ పినార్ సెనార్రూపొందించారు... యువతరం ఆసక్తి చూపుతున్న ఎన్నో కోర్సులలో ఇవి కొన్ని మాత్రమే. ‘నేటి ఆసక్తి... రేపటి నైపుణ్యం’ అనే మాట అక్షరాలా నిజమనిప్రాంజలి సక్సెస్ స్టోరీ చెప్పకనే చెబుతుంది.పదహారు సంవత్సరాల వయసులో ఏఐ స్టార్టప్ ‘డెల్వ్.ఏఐ’ ఫౌండర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందిప్రాంజలి అసస్తీ. ఏడు సంవత్సరాల వయసులో కోడింగ్‌పై ఆసక్తి మొదలైంది. తండ్రి సహాయంతో రకరకాల సాంకేతిక విషయాలపై అవగాహన పెంచుకుంది. మన దేశంలో పుట్టినప్రాంజలి పదిసంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లింది. హైస్కూల్ రోజుల్లో చాలెంజింగ్ కంప్యూటర్ సైన్స్ప్రాజెక్ట్లపై పనిచేసేది. చిన్నప్పటి నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి స్ఫూర్తితో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోందిప్రాంజలి అసస్తీ. ఇంపోస్టర్ సిండ్రోమ్ నుంచి బయటపడాలి సెల్ఫ్–ఇంప్రూమెంట్ అనేది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరోవైపు నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించాలి. వాటిద్వారా తప్పులు సరిదిద్దుకోవాలి. బిజినెస్ప్రారంభించిన కొత్తలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ ఉత్సాహం మనకు ఎంతో శక్తిని ఇస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఎప్పుడూ భయపడవద్దు. రకరకాల రంగాలలో విజేతలైన ఎంతోమందిని కలుసుకొని మాట్లాడాను. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. ఇంపోస్టర్ సిండ్రోమ్(సెల్ఫ్–డౌట్)తో సతమతమయ్యేవారికి నేను చెప్పేది ఏమిటంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. లేకపోతే మనలోని నైపుణ్యం, ప్రతిభ వృథా అవుతాయి. –ప్రాంజలి అవస్తీ, డెల్వ్.ఏఐ, ఫౌండర్ ఏఐ ఇన్నోవేటర్ ఏఐ పరిశోధనలలో చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది కేరళకు చెందిన శ్రేయా ఫ్రాన్సిస్. తాజాగా ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్‌కు సంబంధించిన ‘ఏఐకానిక్స్ సొల్యూషన్స్ ఇంప్లిమెంటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. ఏఐ అండ్ రోబోటిక్స్‌కు సంబంధించి ఎన్నోప్రాజెక్ట్లకు నాయకత్వం వహించింది. ఏఐ టాపిక్కు సంబంధించి ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన మైక్రోసాఫ్ట్ రిసెర్చి డైవర్సిటీ అవార్డ్‌ను రెండుసార్లు గెలుచుకుంది. -శ్రేయా ఫ్రాన్సిస్ -
టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే..
కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, అమెరికాలో ఫెడ్ వడ్డీరేట్లు పెంచడం.. వంటి వాటితో అంతర్జాతీయ సంస్థలు వాటి సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొత్త ఫీచర్లపై చేసే ఖర్చు తగ్గిస్తున్నాయి. దాంతో ఐటీ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. ఆ రంగంలో చదువు పూర్తి చేసుకున్న యువతకు, వారికి వివిధ కంపెనీల్లో ఉంటున్న ఖాళీలకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. కొన్ని కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దేశంలోని అనేక టెక్ కంపెనీలకు ప్రస్తుతం ఆదాయాలు తగ్గటంతో ఖర్చులు తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీలో పూర్తి సమయం ఉద్యోగులకు బదులు ఎక్కువ మంది అప్రెంటీస్లను నియమించుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్రెంటీస్ స్కిల్ ట్రెండ్స్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. ఐటీ/ ఐటీఈఎస్ కంపెనీలు ఫుల్‌టైమ్ ఉద్యోగుల బదులుగా అప్రెంటిస్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. అప్రెంటిస్ ఉద్యోగుల సంఖ్య వార్షికంగా 250 శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఐటీ/ ఐటీఈఎస్ పరిశ్రమల్లోని దాదాపు 79 శాతం కంపెనీల మేనేజ్మెంట్ రాబోయే రోజుల్లో అప్రెంటిస్‌ల సంఖ్య పెంచనుందని అంచనా. అప్పుడే చదువు పూర్తై ఉద్యోగ వేటలో పడిన ప్రతిభావంతులైన ఉద్యోగార్థులకు అవకాశం కల్పించాలని కంపెనీలు భావిస్తున్నాయి. వారు ప్రారంభంలో కొంత తక్కువ జీతానికి పనిచేస్తారు. ఎలాగూ శిక్షణ ఇస్తారు కాబట్టి కొంత ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనిపిస్తే ఎక్కువ సేపు పనిచేసేలా ప్రోత్సహిస్తారు. గత సంవత్సర కాలంలో ఈ ట్రెండ్ మెట్రో, టైర్-2 నగరాల్లో ఈ నియామకాలు గణనీయంగా పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీలు అప్రెంటిస్ పూర్తైన వారిలో 75 శాతం మందిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా మార్చాయి. 2023లో కోయంబత్తూర్, హైదరాబాద్, పుణె వంటి నగరాలు అప్రెంటిస్ నియామకానికి మార్గం సుగమం చేశాయి. టైర్-2 నగరంగా ఉన్న కోయంబత్తూర్ అంతటా అప్రెంటిస్‌షిప్ విధానం అధికం అవుతోంది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మెట్రో నగరాలు అప్రెంటిస్ నియామకంలో దూకుడు పెంచాయి. రాష్ట్రాల పరంగా గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్మెంట్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం.. ప్రస్తుతం అప్రెంటిస్‌లుగా ఉన్న 9 లక్షల మందికి పైగా యువత 23-26 ఏళ్ల మధ్య వయసు వారే. వీరికి రూ.11 వేలు నుంచి రూ.75 వేల వరకు చెల్లిస్తున్నారు. విద్యార్హతలను బట్టి ఇతర రంగాల్లో చెల్లించే స్టైపెండ్‌లో మార్పులు ఉన్నాయి. -
‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
టెక్ కంపెనీల మధ్య నిత్యం పోటీ ఉంటుంది. వినియోగదారులకు అందించే సేవలతో పాటు ఇతర విషయాల్లో ఆ సంస్థల యజమానుల్లో ఆ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా వికీపిడియా సహవ్యవస్థాపకుడు జిమ్మీవేల్స్ ఎలాన్‌మస్క్ సారధ్యంలోని ఎక్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి చాట్‌బాట్స్ ఆధారిత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) వికీపిడియా డేటాను ఉపయోగిస్తున్నాయని, మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ డేటాను కాదని జిమ్మీ వేల్స్ అన్నారు. పోర్చుగల్‌లోని లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్‌లో జిమ్మీ వేల్స్ మాట్లాడారు. ఎలాన్‌మస్క్, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. సరైన సమాచారానికి ఎక్స్ నమ్మదగిన వేదిక కాదన్నారు. ట్విట్టర్‌కు (ఎక్స్) బదులు ఎల్ఎల్ఎంలు వికీపిడియా డేటాను వినియోగించడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా మస్క్ ఆఫర్ చేస్తున్న ఏఐ చాట్‌బాట్ గ్రోక్ గురించి తానిప్పటివరకూ వినలేదని వేల్స్ చెప్పారు. మరోవైపు ఎలన్ మస్క్ ఇటీవల వికీపిడియాపై చేసిన వ్యాఖ్యలపై డిబేట్ సాగింది. వికీపీడియా తన వెబ్సైట్ పేరును డికీపీడియాగా మార్చుకోవాలని మస్క్ సూచించారు. తన సూచనకు అనుగుణంగా వారు పేరు మారిస్తే ఆ వెబ్‌సైట్‌కు మిలియన్ డాలర్లు ఇస్తానని మస్క్ వ్యాఖ్యానించారు. -
వర్క్ ఫ్రం హోమ్ శకం ముగిసినట్టే..నా? కంపెనీలు ఏమంటున్నాయి?
కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం అన్ని కంపెనీలకూ, ముఖ్యంగా టెక్ సంస్థలకు అనివార్యంగా మారింది. ఆ తర్వాత కోవిడ్ పరిమితులు సడలించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే క్రమంలో వారిని ఆఫీస్‌లకు రప్పించే హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు, రిమోట్ వర్కింగ్ యుగానికి ముగింపు పలుకుతూ ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయడాన్ని (WFO) తప్పనిసరి చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు నవంబర్ 20వ తేదీ నుంచి తిరిగి ఆఫీస్ బాట పట్టనున్నారు. వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచే వారు పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఇక టీసీఎస్ (TCS) అయితే గత నెలలో తమ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పాటు ఆఫీస్ నుంచి వర్క్‌ను తప్పనిసరి చేసింది. ఇక విప్రో తమ ఉద్యోగులను వారంలో తమకు నచ్చిన మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేసేందుకు మే నెల నుంచి అవకాశం కల్పించింది. హెచ్‌సీఎల్‌టెక్ కూడా తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలని కోరింది. ఇదీ చదవండి: ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు.. కీలక రిపోర్ట్ వెల్లడి సొనాటా సాఫ్ట్‌వేర్‌లో దశలవారీగా రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలుపై కసరత్తు చేస్తున్నారు. మిడ్-మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, లీడర్షిప్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి మిగిలిన వారు కూడా హైబ్రిడ్ మోడ్‌లో వారానికి కనీసం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తారని సొనాటా సాఫ్ట్వేర్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ బాలాజీ కుమార్ చెప్పారు. పూర్తి వర్క్ ఫ్రం హోమ్ విధానం నుంచి ఉద్యోగులను కంపెనీలు ఇప్పుడిప్పుడే హైబ్రిడ్ మోడల్‌కు తీసుకొచ్చి వారానికి కొన్ని రోజులైనా ఆఫీస్‌ల నుంచి పని చేయించుకుంటున్నాయి. అయితే ఈ హైబ్రిడ్ విధానమైనా కొనసాగుతుందా లేదా టీసీఎస్ లాగా అన్ని కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్‌ను తప్పనిసరి చేసి వర్క్ ఫ్రం హోమ్ శకానికి ముగింపు పలుకుతాయా? అన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. రిమోట్ వర్క్ క్షీణిస్తోంది వంద శాతం రిమోట్ జాబ్స్ అనే భావన క్రమంగా మసకబారుతోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ అంజలి రఘువంశీ చెబుతున్నారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి భారతీయ ఉద్యోగులు క్రమంగా అలవాటు పడుతున్నారని, వారి అవసరాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. వారానికి నాలుగు రోజులైతే ఓకే రాండ్‌స్టాడ్ ఇన్సైట్స్ 4-డే వర్క్‌వీక్ క్యాండిడేట్ పల్స్ సర్వే 2023 ప్రకారం, 35 శాతం మంది ఉద్యోగులకు తమ కంపెనీ 4-రోజుల వర్క్‌వీక్‌కి మారితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి అభ్యంతరం లేదు. 43 శాతం మంది ఒక రోజు అదనపు సెలవు వస్తే మిగిలిన రోజుల్లో పని గంటలు కాస్త ఎక్కువైనా పర్వాలేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అభిప్రాయాలను అదే సమయంలో తమ వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ అనువైన విధానాన్ని కంపెనీలు ఆలోచించాలని అంజలీ రఘువంశీ సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి వర్క్ ఫ్రం ఆఫీస్ మోడల్‌కు ఉద్యోగులు వచ్చినప్పటికీ ఒక్కసారి జాబ్ మార్కెట్ అనుకూలంగా మారిందంటే ఉద్యోగులు తమకు మరింత సౌలభ్యాన్ని అందించే ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల కంపెనీలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు. దశలవారీగా ఆఫీస్‌లకు.. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత నేర్చుకునేందుకు, అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు నమ్ముతున్నారు. “హైబ్రిడ్ విధానం ఐటీ రంగంలోని ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ రావడానికి ఇష్టపడవచ్చు. ప్రయాణ ఇబ్బందుల నేపథ్యంలో మరికొంత మంది ఆఫీస్‌లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు” అని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ మంచి ఆలోచన కాదని ఐటీ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దశలవారీగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉన్న రిమోట్ వర్క్ విధానం తగ్గుతూ వస్తోంది. రిమోట్ వర్క్ క్రమంగా తగ్గుముఖం పట్టడం కూడా ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించడానికి కంపెనీల్లో కొనసాగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని బిజ్ స్టాఫింగ్ కామ్రేడ్ మేనేజింగ్ పార్టనర్ పునీత్ అరోరా పేర్కొన్నారు. -
డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కాసారంలో చిక్కి విలవిల్లాడుతోంది. మితిమీరిన కాలుష్యంతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 151కి చేరింది. ఇది చాలా అనారోగ్యకరమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితి కంటే 6.3 రెట్లు ఎక్కువ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నగరాన్ని పొగమంచు కప్పేయడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సందర్బంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. దట్టమైన విషపూరిత పొగమంచు కప్పివేయడంతో శ్వాసకోశ , హృదయ సంబంధిత సమస్యలకు కారణమ వుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఇంటి నుండి పని చేయడం, ప్రాంగణంలో ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఆన్లైన్లో వైద్య సలహాలు లాంటి అనేక చర్యలు చేపట్టినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. డెలాయిట్, కేపీఎంజీ, పానసోనిక్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, Zepto , CIEL HR సర్వీసెస్‌తో సహా డజనుకు పైగా కంపెనీలు ఈ మేరకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవచ్చని డెలాయిట్ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు వెల్ బీయింగ్ డే ఆఫ్ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. రైడ్-షేరింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేలా ఉద్యోగులకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే ఉద్యోగులు ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే రిమోట్‌గా పని చేయవచ్చని పానసోనిక్ తన సిబ్బందికి తెలిపింది. దీంతోపాటు మాస్క్‌లు ధరించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సేల్స్ టీమ్‌కు సూచించినట్లు నివేదిక తెలిపింది. క్విక్ కామర్స్ స్టార్టప్ Zepto తన రైడర్లకు N95 మాస్క్‌లను అందించింది. ఆన్-కాల్ మెడికల్ సపోర్టును అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితికి సంస్థ నిర్దిష్ట చర్యలను అమలు చేయలేదని, అవసరమైతే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు మేక్మైట్రిప్ చీఫ్ హెచ్ఆర్ శివరాజ్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 మార్కును అధిగమించడంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అత్యసరం సమావేశాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. -
Microsoft-Amazon Deal: రెండు టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి.. భారీ ఒప్పందం!
రెండు బలమైన టెక్ దిగ్గజాలు పోటీని పక్కన పెట్టి పరస్పరం సహకరించుకునేందకు సిద్ధమయ్యాయి. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ (Microsoft) దాని క్లౌడ్ ఆధారిత 365 ఉత్పాదకత సూట్ కోసం అమెజాన్ (Amazon.com)ని ముఖ్యమైన క్లయింట్‌గా స్వాగతించడానికి సిద్ధమైంది. 1 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లకు పైగా ) కంటే ఎక్కువ విలువైన ఈ ఒప్పందం ఇద్దరు టెక్ దిగ్గజాలకు ఒక మైలురాయిని సూచిస్తోంది. సాధారణంగా బలమైన పోటీదారులుగా ఉండే ఈ రెండు కంపెనీలు ఇలా సహకరించుకోవడం టెక్నాలజీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది. ఐదేళ్లకు మించి ఉండే ఈ ఒప్పందం కోసం అమెజాన్.. మైక్రోసాఫ్ట్‌కు భారీ మొత్తాన్ని కట్టబెట్టనుందని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ 365 కోసం అమెజాన్ పది లక్షలకు పైగా లైసెన్స్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ షేర్ ధర 1 శాతం మేర పెరిగింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. మరో వైపు అమెజాన్ కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నివేదిక ప్రకారం, నవంబర్ ప్రారంభంలో ఈ కొత్త సిస్టమ్‌లను ఏకీకృతం చేయడం ప్రారంభించాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (Microsoft Office) ఉత్పత్తుల స్థానిక, ఆన్-సైట్ వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. అమెజాన్ కొత్త సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను నవంబర్‌లో ప్రారంభించలనుకుంటుండగా ఏఐ సామర్థ్యాలతో అప్‌గ్రేడ్ చేసిన మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365) సూట్‌ను కూడా ఇదే నెలలో ప్రారంభించనుండటం గమనార్హం. -
భారత్‌వైపు పడిన దిగ్గజ కంపెనీల చూపు.. ఇదే జరిగితే..
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. మరి కొన్ని కంపెనీలు తమ కార్య కలాపాలను ఇతర దేశాలకు తరలించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం ఐటీ రంగం ద్వారా బాగా లాభాలను ఆర్జిస్తున్న ఇజ్రాయెల్ పరిస్థితి నేడు ఆందోళనకరంగా ఉంది. ఈ దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందులో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన కీలకమైన ప్రాజెక్టులను ఇజ్రాయెల్‌లోని కంపెనీలు నిర్వహిస్తున్నాయి. యుద్ధ వాతావరణంలో ఉన్న ఈ దేశంలో నిర్వహణ సజావుగా ముందుకు సాగే సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదు. కావున ఈ కంపెనీల చూపు ఇండియా వంటి దేశాలమీద పడింది. ఇదీ చదవండి: I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! కేవలం పరిస్థితుల ప్రభావం మాత్రమే కాకుండా.. ఐటీ కంపెనీలలో పనిచేసేవారిలో కొందరు సైన్యంలో విధులు నిర్వహించడానికి వెళ్లినట్లు సమాచారం. కావున ఉద్యోగుల కొరత కూడా ఏర్పడింది. దీంతో అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మనదేశంలో ఉండటం వల్ల చాలా కంపెనీలు భారతదేశంవైపు మొగ్గు చూపుతున్నాయి. ఇదే జరిగితే మనదేశంలో మరిన్ని ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. -
భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి?
ఇండియా & కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియన్ ఐటీ పరిశ్రమ మీద ప్రభావం చూపుతాయా అని చాలామంది కంగారుపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?, నిజంగానే ప్రభావం ఉంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్, కెనడా మధ్య వివాదం ఫలితంగా భారతీయ ఐటీ సంస్థలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావానికి లోనయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్షణం ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. కెనడా ప్రాంతం నుంచి ఐటీ కంపెనీల ఆదాయం 5 - 6 శాతం వరకు ఉంది. టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా & కెనడా టెక్ నెట్వర్క్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 15,000 కంటే ఎక్కువ మంది కెనడాలో ఉద్యోగాల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అమెరికాలో వీసా సమస్యల కారణంగా ఎక్కువమంది కెనడాకు పయనమయ్యారు. ఈ ఏడాది జులైలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీని ప్రారంభించింది. దీని ద్వారా 2024 నాటికి కెనడాలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ జనవరిలో, TCS తన డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి.. అదే విధంగా ఆవిష్కరణను పెంచడానికి కెనడియన్ జెట్ తయారీదారు బొంబార్డియర్ ద్వారా వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికైంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు! ఇక విప్రో విషయానికి వస్తే.. జనవరిలో కెనడాలోని టొరంటోలో తన సరికొత్త Wipro-AWS లాంచ్ ప్యాడ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది. -
ఐఐటీ బాంబే విద్యార్థికి జాక్ పాట్: కళ్లు చెదిరే ప్యాకేజీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (IIT-బాంబే) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో తమ విద్యార్థి ఏకంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతనం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీ తమ విద్యార్థికి ఈ ఆఫర్ ఇచ్చిందని ఐఐటీ బాంబే తన ప్రకటనలో తెలిపింది. అయితే ఆ విద్యార్థుల పేర్లు, ఆఫర్ ఇచ్చిన కంపెనీల వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. మరో విద్యార్థికి రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నట్టు తెలిపింది. గత సంవత్సరం అంతర్జాతీయ ఆఫర్ రూ. 2.1 కోట్లతో పోల్చితే ఇది గణనీయమైన పెరుగుదల అని పేర్కొంది. అయితే అంతకుముందు సంవత్సరం దేశీయ ఆఫర్ వార్షికంగా రూ. 1.8 కోట్లుగా ఉంది. 2022-23 ప్లేస్మెంట్ల వివరాల ప్రకారం 300 ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లలో 194 మంది విద్యార్ధులు జాబ్స్ అంగీకరించారు. ఇందులో వార్షిక వేతనం రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్న ఆఫర్లు 16. IIT-బాంబేలోని విద్యార్థులు అమెరికా జపాన్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, హాంకాంగ్ , తైవాన్లలో సంస్థల నుండి ఈ సంవత్సరం 65 విదేశీ ఉద్యోగ ఆఫర్లను అందుకున్నారు. మొత్తంగా, 2022-23 ప్లేస్మెంట్ డ్రైవ్‌లో 82 శాతం మంది విద్యార్థులు సక్సెస్ అయ్యారని, బిటెక్, డ్యూయల్ డిగ్రీ , ఎంటెక్ ప్రోగ్రామ్‌ల నుండి దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారనీ తెలిపింది. ఈ ఏడాది ఇంతమంది భారీ వేతనంతో తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందడంపై ఐఐటీ బాంబే సంతోషం వ్యక్తం చేసింది. -
చిన్న నగరాల్లోకి టెక్ విస్తరణ - కొత్త హబ్‌లుగా 26 సిటీలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా హైదరాబాద్, బెంగళూరు వంటి ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన దేశీ టెక్నాలజీ రంగంలో క్రమంగా వికేంద్రీకరణ జరుగుతోంది. చిన్న నగరాలకూ పరిశ్రమ విస్తరిస్తోంది. చండీగఢ్, నాగ్‌పూర్, కాన్పూర్ వంటి 26 సిటీలు ఈ జాబితాలో ఉన్నాయి. టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11–15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండటం కూడా ఇందుకు కారణం. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కలిసి ’భారత్‌లో వర్ధమాన టెక్నాలజీ హబ్‌లు’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ పరిశ్రమలో 54 లక్షల మంది పైచిలుకు సిబ్బంది ఉండగా .. వీరిలో అత్యధిక శాతం ఉద్యోగులు ఏడు ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, పుణె) ఉంటున్నారు. ‘టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ .. కరోనా మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా చెప్పుకోతగ్గ స్థాయిలో పని వికేంద్రీకరణ జరిగింది‘ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుమీత్ సల్వాన్ తెలిపారు. ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకునే మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మరింత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెక్నాలజీ హబ్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం పెరుగుతోందని నాస్కామ్ హెడ్ (జీసీసీ, బీపీఎం విభాగం) సుకన్య రాయ్ వివరించారు. వ్యయాల తగ్గుదల.. రాబోయే రోజుల్లో చండీగఢ్, కాన్పూర్, అహ్మదాబాద్, మంగళూరు, నాగ్‌పూర్ వంటి సిటీలు కొత్త తరం టెక్నాలజీ హబ్‌లుగా ఎదగగలవని నివేదిక తెలిపింది. కార్యకలాపాల నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటం, అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) తక్కువగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాలు, విధానాలపరంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తదితర అంశాలు ఇందుకు సానుకూలంగా ఉండనున్నాయి. ఈ తరహా పలు వర్ధమాన హబ్‌లలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, డబ్ల్యూఎన్ఎస్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి వర్ధమాన నగరాల్లో 7,000 పైచిలుకు అంకుర సంస్థలు డీప్‌టెక్ మొదలుకుని బీపీఎం వరకు వివిధ టెక్ సేవలు అందిస్తున్నాయి. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఈ వర్ధమాన కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నాయి. ఇన్వెస్టర్లు కూ డా ప్రస్తుతం పెద్ద నగరాలే కాకుండా చిన్న పట్టణాల్లోని అంకుర సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది అంకుర సంస్థల్లోకి వచ్చిన నిధుల్లో 13 శాతం వాటా ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టార్టప్‌లకు దక్కడం ఇందుకు నిదర్శనం. -
ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' కంపెనీ ఇలా మొదలైంది..!
ఈ రోజు సుధామూర్తి గురించి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా మాత్రమే కాకుండా.. సమాజసేవలో తమవంతు కృషి చేస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే నేడు లక్షల కోట్ల ఐటీ కంపెనీగా అవతరించిన సంస్థ ఒక చిన్న గదితో ప్రారంభమైనట్లు, కేవలం రూ. 10,000 పెట్టుబడితో ముందుకు కదిలినట్లు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగిన నారాయణ మూర్తి విజయం వెనుక సుధామూర్తి ఉందని అందరికి తెలుసు. కంపెనీ ప్రారంభించాలని కలలు కన్న రోజుల్లోనే ఆమె వద్ద రూ. 10,000 అప్పుగా తీసుకుని స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడే భారత్ ఐటీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో భవిష్యత్తుని చూసి కంపెనీ ప్రారంభించారు. నేడు లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆ రోజు చిన్న గదిలో ప్రారంభమైనట్లు చెబుతారు. అదే ఈ రోజు వేలమందికి ఉద్యోగాలు కల్పించి ముందడుగు వేస్తోంది. 1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ఈ రోజు ప్రపంచంలో పేరుగాంచిన పెద్ద ఐటీ కంపెనీగా రూ. 5 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైనదిగా నిలబడింది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! ఇంజినీర్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు.. అయితే స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని టెల్కో కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ ఉద్యోగంలో చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. నేడు టాటా కంపెనీలో మహిళలు కూడా పనిచేస్తున్నారంటే అది సుధామూర్తి చలవే. -
సమతూకపు నియంత్రణ!
అసలేమీ చేయకుండా ఉండే కన్నా, ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఆచరణలోకి దిగడం మంచిదే! కృత్రిమమేధ (ఏఐ)ను నియంత్రించడానికి చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అలాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అథారిటీ ఆఫ్ ఇండియా పేర ఒక సంస్థను నెలకొల్పాలంటూ భారత టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చేసిన తాజా సిఫార్సు స్వాగతించాల్సిన అంశం. టెలికామే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, రవాణా, విద్య, వ్యవసాయం లాంటి అనేక రంగాలపై ఏఐ అమితమైన ప్రభావం చూపుతున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి, సమగ్రమైన నియంత్రణకు సమకట్టడం సరైన చర్య. ట్రాయ్ ప్రతిపాదించిన నియంత్రణ సంస్థ ఏఐ సంబంధిత రంగాలన్నిటికీ సలహా దారుగా, నియంత్రణకర్తగా వ్యవహరి స్తుంది. సాంకేతిక సంస్థలు మాత్రం తమ నియంత్రణకు మరిన్ని చట్టాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐ కోసం స్వతంత్ర చట్టబద్ధ సంస్థను పెట్టాలన్న ట్రాయ్ సిఫార్సుపై తీవ్రంగా స్పందిస్తు న్నాయి. అయితే, సాంకేతికతతో వచ్చే లాభాలను స్వీకరిస్తూనే, జరిగే హానిని కూడా గుర్తించి, సమతూకం సాధించడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా పాల కుల ముందున్న సవాలు ఇది. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) లాంటి సాంకేతికతలు ఏఐతో ముడిపడ్డాయి. వీటికి విడివిడి విధానాలతో లాభం లేదు. అన్నిటినీ సమన్వయపరిచే సమగ్రమైనది అవసరం. ట్రాయ్ తన 141 పేజీల నివేదికలో ఆ మాటే ప్రస్తావించి, తాజా సిఫార్సు చేసింది. నూతన సాంకేతిక ఆవిష్కరణలు శరవేగంతో వస్తుంటే, మన విధాన నిర్ణేతలు ఎంతో వెనుకబడి ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఆన్లైన్ వేదికలకు సైతం నేటికీ సరైన నియంత్రణ వ్యవస్థ లేని దేశం మనది. 1998లో వచ్చిన గూగుల్, 2004లో ఆరంభమైన ఫేస్బుక్ లాంటివి ఇప్పటికీ వినియోగదారుల డేటాను యథేచ్ఛగా వాడుకుంటూ, లాభాలు మూట గట్టుకుంటున్నాయి. దాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు వగైరాలను దేశం దీర్ఘకాలంగా చర్చిస్తూనే ఉంది. సరైన నియంత్రణ లేక సామాజిక మాధ్యమ వేదికలు యూజర్ల డేటాను తస్కరిస్తూనే ఉన్నాయి. కొన్ని వేదికలు వేధింపులనూ, విద్వేషాలనూ రాజేస్తున్నాయి. ఏఐ ఆవిర్భావంతో డేటా దుర్విని యోగం ఎల్లలు దాటిందనే అనుమానం తలెత్తింది. వ్యక్తిగత గోప్యతే కాదు... ఆర్థికవ్యవస్థ పైనా ప్రభావం చూపే పరిస్థితి. ఏఐ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ ఆలోచనను ఈ నేపథ్యం నుంచి చూడాలి. గత నవంబర్‌లో ఓపెన్ ఏఐ సంస్థ తన ఛాట్‌బాట్ అయిన ‘ఛాట్ జీపీటీ’ని విడుదల చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఉత్సాహం ఎంత ఉందో, ఆందోళనా అంతే ఉంది. ఛాట్ జీపీటీ లాంటి నమూనాల రూపకల్పనపై 6 నెలల మారటోరియం విధించాలని ఎలాన్ మస్క్ లాంటి నిపుణులు సైతం అనడం గమనార్హం. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, మానవకృషికి కొత్త మార్గాలు తెరిచి, మామూలు పనుల్ని సైతం సృజనాత్మకంగా చేయడానికి ఏఐ ఉపయుక్తమే. కానీ మనుషుల కృత్రిమ రూపాల తయారీ, తప్పుడు సమాచార వ్యాప్తి సహా ప్రమాదాలున్నాయి. ఏఐని అణ్వస్త్రపోరుతో పోలుస్తూ, మానవజాతి మనుగడకే ప్రమాదకారి అంటున్న శాస్త్రవేత్తలూ లేకపోలేదు. అందుకే, ఏఐని విశృంఖలంగా వదిలేయరాదన్నది నిపుణులు, పాలకుల ఏకాభిప్రాయం. నవీన ఆవిష్కరణల్ని ఆహ్వానిస్తూనే, వాటిని నైతికబద్ధంగా వాడేలా సమతౌల్య సాధన కీలకమనేది ప్రధాన సూత్రం. ఏఐ ప్రతికూల ప్రభావాన్ని కట్టడి చేయడానికి విశ్వవ్యాప్తంగా అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. విదేశాలు చట్టాలు చేస్తున్నాయి. కెనడా ముసాయిదా చట్టం చేసింది. అమెరికా ఏఐ బిల్లు తెచ్చింది. సురక్షితంగా, పారదర్శకంగా ఏఐ అభివృద్ధి సాగేలా చూస్తామంటూ అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ తదితర 7 ప్రధాన ఏఐ సంస్థల నుంచి ఈ నెల 21నే అమెరికా ప్రభుత్వం స్వచ్ఛంద వాగ్దానాలు తీసుకుంది. చైనా సైతం పాలనా చర్యలపై ఒక ముసాయిదా సిద్ధం చేసి, ప్రజాస్పందన కోసం ఉంచింది. బ్రెజిల్, జపాన్‌లు ఏఐ నియమావళి సిద్ధం చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ’ సంస్థాపక సభ్యదేశమైన భారత్ వంతు ఇప్పుడు ట్రాయ్ సిఫార్సుతో వచ్చిందనుకోవాలి. ఏఐ అభివృద్ధిలో భాగస్థులు పాటించాల్సిన బాధ్యతల్ని నాస్కామ్ ఇప్పటికే వెల్లడించింది. కానీ ఏఐపై మోజులో ప్రమాణాలు, నైతికత, జవాబుదారీతనం గాలికి పోవచ్చు. కాబట్టి నియంత్రణ సంస్థ పెట్టాలన్న మాట బంగారు బాట. నిజానికి, పార్లమెంట్లో ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. 2000 నాటి ఐటీ చట్టం స్థానంలో వచ్చే డిజిటల్ ఇండియా చట్టం కొంతవరకు ఏఐని నియంత్రిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఏఐకి ప్రత్యేక చట్టం యత్నాలేవీ ఇప్పటికీ లేవు. ఇది ఆలోచించాల్సిన విషయం. యూజర్లకు హాని ఏ మేరకు కలుగుతుందనే కోణం నుంచి ఏఐపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వైఖరి ఉంటుందనీ, ఇప్పటికిప్పుడు తీవ్రమైన చర్యలేమీ అవసరం లేదనీ సంబంధిత కేంద్ర మంత్రివర్యుల ఉవాచ. ముందుగానే ఏఐపై కఠిన నిబంధనలు పెట్టి, నవీన సాంకేతికకు ఉరితాళ్ళు బిగించరాదన్న మాట నిజమే! అదే సమయంలో రాబోయే కష్టనష్టాలను కూడా ముందుగా ఆలోచించడం, అవసరమైన చట్టాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండడం వివేకం. ఏఐకి సంబంధించి చట్టబద్ధ మైన స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచన అందుకు తొలి అడుగు కావాలి. ఏఐపై ప్రాథమిక నిబంధనలు, హద్దు మీరితే జుల్మానాలు, దోషులపై పట్టు బిగించే అధికారాలతో సంస్థ ఏర్పాటు కావాలి. -
లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి..
కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ ఏడాది (2023) ప్రథమార్థంలో గ్లోబల్ టెక్ సెక్టార్లో పెద్ద కంపెనీలు మొదలుకుని స్టార్టప్‌ల వరకు 2.12 లక్షల మందికిగా ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం.. జూన్ 30 వరకు 819 టెక్ కంపెనీలు 212,221 మంది ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపాయి. ఏడాదిన్నరలో 3.8 లక్షల మంది.. గతేడాది (2022) 1,046 టెక్ కంపెనీలు 1.61 లక్షల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. 2022 సంవత్సరంతోపాటు 2023 జూన్ వరకు మొత్తంగా దాదాపు 3.8 లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. ఇదిలా ఉంటే మరికొన్ని పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగింపును కొనసాగిస్తున్నాయి. గతంలో లెక్కకు మించి చేపట్టిన నియామకాలు, ప్రపంపవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ సంక్షోభం నుంచి తగిలిన బలమైన దెబ్బలను ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు కారణాలుగా చెబుతున్నాయి. భారత్‌లోనూ దారుణంగానే పరిస్థితి భారతీయ టెక్ పరిశ్రమలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ సంవత్సరం (2023) జూన్ చివరినాటి వరకు 11,000 మందికి పైగా భారతీయ స్టార్టప్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. 2022 ఇదే కాలంలో పోల్చితే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల తొలగింపులలో 5 శాతం భారత్‌లోనే జరిగాయి. Inc42 డేటా ప్రకారం.. 2022లో ఫండింగ్ మందగమనం స్థిరపడినప్పటి నుంచి ఇప్పటి వరకు 102 భారతీయ స్టార్టప్‌లు 27,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఐదు ఎడ్టెక్ యునికార్న్‌లు సహా దాదాపు 22 ఎడ్టెక్ స్టార్టప్‌లు ఇప్పటివరకు దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు -
ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న లేఆప్స్ విషయంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ట్విటర్లో వేలాది ఉద్యోగులను తొలగించిన సీఈఓ మస్క్ సిబ్బంది తొలగింపుల విషయంలో తన విధానాన్నేఅనుసరించాలంటూ సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలకు సలహా ఇచ్చారు. ఫలితంగా ఉత్పాదకత మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగాల కోతతో ఫలితాలు బావున్నాయి. ఇదే నిజం. ఉత్పాదకతను ప్రభావితం చేయకుండా ఇతర కంపెనీలు కూడా ఇలాగే చేయాలి’ అంటూ సలహా ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. AKA, don’t pull out. @elonmusk pic.twitter.com/JlqUmL1eyp — Teslaconomics (@Teslaconomics) May 25, 2023 (విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్) లండన్‌లోని సీఈవోల కౌన్సెల్ సమ్మిట్‌లో వాల్ స్ట్రీట్ జర్నల్‌తో వర్చువల్ ఇంటరాక్షన్‌లో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కంపెనీని టేకోవర్ చేయడానికి ముందు చాలా మంది పెద్దగా విలువలేనివారుగా కనిపించారన్నారు. అందుకే ఉద్యోగాల కోతలకు నిర్ణయించాననీ, ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్యే సహేతుకమైన సంఖ్య అని ప్రకటించారు. అంతేకాదు గత ఆరేళ్లలో రానీ ఫీచర్లు ట్విటర్ ఆరు నెలల్లో ట్విటర్లో పెరిగాయని చెప్పుకొచ్చారు. కాగా గత ఏడాది (అక్టోబర్ 2022లో) 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను టేకోవర్ చేసిన వెంటనే అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ సహా, కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. ఆ తరువాత నెల వ్యవధిలోనే 60 శాతానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 7500గా ఉన్న ఉద్యోగుల సంఖ్య ల కేవలం 1,500 మంది ఉద్యోగులే మిగిలారు. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day. Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required. — Elon Musk (@elonmusk) November 4, 2022 -
రాజీనామా చేస్తే సంవత్సరం శాలరీ ఫ్రీ.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని భారీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తూనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, మెటా వంటి దాదాపు సుమారు 570 టెక్ కంపెనీలు 2023లో మాత్రమే 1,60,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. లెక్కకు మించిన సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగుల్లో కొత్త భయం ఏర్పడింది. నివేదికల ప్రకారం.. గూగుల్, అమెజాన్ కంపెనీలు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చాలా మంది ఉద్యోగులను తొలగించాయి, కానీ యూరోపియన్ దేశాలలోని ఉద్యోగులను తొలగించడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ దేశాల్లో ఉన్న కఠినమైన కార్మిక రక్షణ చట్టాల కారణంగా ఈ కంపెనీలు వెంటనే ఉద్యోగులను తొలగించలేకపోతున్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో, టెక్ కంపెనీలు ఉద్యోగులతో చర్చించకుండా ప్రజలను తొలగించకూడదు. కావున ఈ చర్చల వల్ల తొలగింపులు కొంత ఆలస్యం అవుతున్నాయి. కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేయడానికి ముందు చట్టబద్ధంగా ఈ కౌన్సిల్లతో సంప్రదించవలసి ఉంటుంది. (ఇదీ చదవండి: Mercedes AMG GT 63 S E Performance: భారత్‌లో విడుదలైన కొత్త కారు - పూర్తి వివరాలు) ఫ్రాన్స్‌లో, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, దానికి తగిన ప్రతిఫలంగా పొందాలని కోరించి. అయితే ఐదు నుంచి ఎనిమిదేళ్లు అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వారికి ఒక సంవత్సరం వేతనంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీని అమెజాన్ అందించనున్నట్లు కూడా తెలుస్తోంది. జర్మనీలో అమెజాన్ వారి ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించి, స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా, గూగుల్ తన 8,000 మంది ఉద్యోగులలో యూకేలో 500 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఈ ఉద్యోగులకు విభజన ప్యాకేజీలు కూడా అందించనున్నట్లు వెల్లడించింది. డబ్లిన్, జ్యూరిచ్లలో గూగుల్ తన ఉద్యోగులలో 200 మందికి పైగా తొలగించాలని యోచిస్తోంది. -
లేఆఫ్స్ దారుణం.. ఒకటీ రెండు కాదు.. నాలుగు సార్లు పీకేశారు!
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. కొన్నేళ్ల క్రితమే మొదలైన తొలగింపులు ఇటీవల ఎక్కువయ్యాయి. కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి లేఆఫ్‌కు గురై ఉద్యోగం కోల్పోతేనే జీవనం దుర్భరంగా మారుతుంది. మరి చేరిన ప్రతి కంపెనీ ఉద్యోగం పీకేస్తే.. ఒకటీ, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు..(ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!)బిజినెస్ ఇన్సైడర్ కథనంప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 33 ఏళ్ల జానెట్ అన్నే పనెన్ తన టెక్ కెరీర్లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్‌కు గురై ఉద్యోగాలు కోల్పోయారు. ఆమె మొదటి ఉద్యోగం రెడ్డిట్‌లో రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్‌గా చేశారు. ఆ కంపెనీ ఆమెతో పాటు మొత్తం బృందాన్ని తొలగించింది. ఆ తర్వాత ఆమె ఉబర్ హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించగలిగింది. అయితే అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత కంపెనీ ఆమెకు పింక్ స్లిప్ అందజేసింది. ఆ తర్వాత ఆమె డ్రాప్‌బాక్స్ కంపెనీలో సపోర్ట్ ఇంజనీర్‌గా చేరారు. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ ఆమెను తొలగించింది. గత వారమే స్నాప్డాక్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరింది. ఇంతలోనే నాలుగో ఉద్యోగం కూడా పోయింది.(త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!)తన లేఆఫ్స్ గురించి పనెన్ భావోద్వేగంతో పేర్కొన్నారు. మొదటిసారి తనను తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన ఆమె మూడో సారి అయితే తనతో పనిచేసిన బృందాన్ని వీడుతున్నందుకు మనసుకు చాలా కష్టంగా ఉండిందని వివరించారు. ఇక తాజాగా నాలుగో సారి లే ఆఫ్‌తో తన ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.టెక్ దిగ్గజాలు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఒక్క మెటా, అమెజాన్, గూగుల్ కంపెనీలు మాత్రమే 60,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 11,000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన మెటా ఇటీవల మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్ కూడా రెండు రౌండ్లలో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్ 12,000 మందిని తప్పుకోవాలని ఆదేశించింది.(జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) -
గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తూ వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించినట్లు సీఎన్‌బీసీ కథనం పేర్కొంది. ప్రమోషన్లు కొందరికే... ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. కంపెనీలో మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం.. ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. -
కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్!
టెక్ దిగ్గజాలు తమ సిబ్బందిని భారీగా ఇంటికి సాగనంపడం, పింక్ స్లిప్పుల కలకలంతో ఉద్యోగుల్లో భయాందోళనల నడుమ వారికి వేతన పెంపుపై శుభవార్త వెలువడింది. భారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే సర్వే వెల్లడించింది. "మాంద్యం, ఆర్థిక మందగమనమంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగా ఉందని కార్న్ ఫెర్రీ ఛైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనిత్ సింగ్ సర్వేలో పేర్కొన్నారు. 818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో, భారతీయ కార్పొరేట్ ఉద్యోగులు 2023లో సగటున 9.8 శాతం సాలరీ పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది. అత్యుత్తమ నైపుణ్యాలను కనబరిచే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వరకూ వేతన పెంపు వర్తింపచేయవచ్చని తెలిపింది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌తో సహా రంగాలు ఈ ఏడాది జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ పెంపు వివిధ రంగాల పరంగా చూస్తే.. టెక్నాలజీలో 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్ 10 శాతం. అదనంగా, కొన్ని ఇతర రంగాల జీతాల పెంపు అంచనాలలో సేవా రంగం 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, రసాయనం 9.6 శాతం, వినియోగ వస్తువులు 9.8 శాతం, రిటైల్ 9 శాతం ఉన్నాయి. అదనంగా, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా చాలా వ్యాపారాలు తమ శ్రామిక శక్తిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం సంస్థలు తాము ఒక రకమైన హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించినట్లు సూచించాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
మైక్రోసాఫ్ట్‌లో 10 వేల ఉద్యోగాల కోత
న్యూయార్క్: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ 10,000 మంది సిబ్బందిని తొలగించనుంది. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు అయిదు శాతం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బుధవారం ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ ముందుకు సాగాలంటే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం చేపడుతున్న మార్పుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మొత్తం మీద 10,000 ఉద్యోగాలు తగ్గనున్నాయి. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం లోపే ఉంటుంది‘ అని సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సత్య నాదెళ్ల వివరించారు. తొలగించే ఉద్యోగులకు చెల్లించే పరిహారాలు మొదలైన వాటికి సంబంధించి 1.2 బిలియన్ డాలర్ల వ్యయాలను రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ చూపనుంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహారం, ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ కవరేజీ మొదలైనవి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే మాంద్యం నెలకొనగా, మరికొన్నింటిలో మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలుండటంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సంస్థలు 11,000 పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెజాన్ కూడా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. -
బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బడా టెక్నాలజీ కంపెనీల ఆవిష్కరణలకు సంబంధించి సరైన నియంత్రణల రూప కల్పనలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఫలితంగా సమాజానికి నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఫిక్కీ నిర్వహించిన ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్) కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. మంచి కోసం ఆవిష్కృతమైన ఇంటర్నెట్.. ఇప్పుడు రిస్క్‌గా మారిందని, యూజర్లకు హాని కలిగించడంతోపాటు, నేరాలకు నిలయమైనట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఐజీఎఫ్, పేరొందిన వేదికలు.. ఈ పెద్ద టెక్నాలజీ సంస్థలు చేయాల్సిన, చేయకూడని వాటి విషయంలో, అవసరమైన నిబంధనలు తీసుకురావడంలో వెనుకబడినట్టు చెప్పారు. ‘‘మనం చాలా కాలంగా వీటిని ఆవిష్కర్తలుగా, ఆవిష్కరణలుగా చూశాం. అంతేకానీ, ఆ ఆవిష్కరణలు హాని కలిగించొచ్చని, సమాజంలో, ప్రజల్లో ఇతర నష్టాలకు దారితీయగలవని గుర్తించలేకపోయాం’’అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నందున భద్రత, విశ్వసనీయ అన్నవి ప్రభుత్వానికి ముఖ్యమైన పరిష్కరించాల్సిన అంశాలుగా చెప్పారు. ‘‘పెద్దలు, విద్యార్థులు, పిల్లలు, మహిళలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. కనుక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఆన్లైన్లో భద్రత, విశ్వసనీయత, జవాబుదారీ అన్నవి ఎంతో ముఖ్యమైన విధానపరమైన అంశాలు’’అని పేర్కొన్నారు. -
ఈ ఉద్యోగాలకు ఏమైంది?
మొన్న మైక్రోసాఫ్ట్, ట్విట్టర్... నిన్న వాట్సప్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటావర్స్... నేడు అమెజాన్... హెచ్‌పీ! వరుసగా ఉద్యోగాల్లో కోతల వార్తలే. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగస్థుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలమంది వీధిన పడనున్నారు. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్ళ మీదా అనివార్యంగా ఆ ప్రభావం ఉండనుంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారింది. లాభాలు పడిపోతూ, ప్రపంచమంతటా మాంద్యం తప్పదనే భయం నెలకొంది. అమెజాన్ నుంచి డిస్నీ దాకా దిగ్గజ టెక్ సంస్థలు శ్రామికశక్తిని పునర్వ్యవస్థీకరించు కుంటున్నదీ అందుకే. ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియని ఈ పరిస్థితి భారత్ సైతం అప్రమత్తం కావాలని గుర్తుచేస్తోంది. శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెట్‌ఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా అనేక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2021 ఫిబ్రవరి నుంచి గత నెల వరకు చూస్తే – ఒకే నెలలో ఇన్ని ఉద్యోగాలపై వేటు పడడం ఇదే అత్యధికం. పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఈ వారం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ 10 వేల మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతోందని ప్రాథమిక వార్త. ఆ సంస్థకు అననుకూలమైన మార్కెట్ పరిస్థితులు నెలకొన్నాయి. పైపెచ్చు సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. అలా 6 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకొనే పనిలోకి దిగింది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగూల్ చెబుతున్న మాట. దానికి సమర్థమైన ర్యాంకింగ్ విధానం ఉందంటున్నా, అది ఏ మేరకు లోపరహితమో చెప్పలేం. ప్రస్తుత కోతల పరిస్థితి గూగుల్ స్వయంకృతమని నిపుణుల మాట. అవసరానికి మించి శ్రామిక శక్తి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టి గత త్రైమాసికంలో ఆ సంస్థ ఎడాపెడా కొత్త ఉద్యోగస్థుల్ని తీసుకుంది. అదీ భారీ వేతనాలకు తీసుకోవడం మెడకు గుదిబండైంది. లాక్డౌన్లలో పని నడపడానికి అమెరికా లాంటి చోట్ల తీసుకున్న ఉద్యోగాలు ఇప్పుడు వాటికి ఎక్కువయ్యాయి. ఉద్యోగస్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా అనంతర విక్రయాలు తగ్గాయి. ఫలితంగా పదేళ్ళుగా వీర విజృంభణలో ఉన్న టెక్‌సంస్థలు కొత్త వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ హెచ్‌పీ వచ్చే 2025 చివరికి 6 వేల ఉద్యోగాలను తగ్గించుకుంటామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 10 వేల మందికి పింక్ స్లిప్పులు ఇస్తామనేసరికి, మన దేశంలోని దాని శాఖలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మీ అంతట మీరు ఉద్యోగాలు వదిలేయం’డంటూ అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ‘స్వచ్ఛంద వీడ్కోలు పథకం’ (వీఎస్పీ) ప్రకటించడం చర్చ రేపుతోంది. మూకుమ్మడిగా ఇంటికి సాగనంపడాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మిక శాఖకు ఫిర్యాదులు రావడం, వీఎస్పీ వివరాలను అందించాలంటూ మన ప్రభుత్వం ఇక్కడి శాఖను అడగడం చకచకా జరిగాయి. నిజానికి, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, ఐరోపాలు మూడూ బాగా మందగించాయి. అందుకే, వచ్చే 2023లో ప్రపంచానికి మాంద్యం తప్పదని వరల్డ్ బ్యాంక్ అధ్యయనం. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నిదానించి, మరిన్ని దేశాలు మాంద్యం లోకి జారితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజానీకం దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. ప్రపంచానికి మెడ మీద కత్తిలా మాంద్యం భయపెడుతున్న వేళ, మనమూ అప్రమత్తం కావాలి. ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణికి మనం ముడిపడి ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలకు దిగాలంటున్నది అందుకే. రానున్న పరిణామాల్ని దీటుగా ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నామన్నది కీలకం. ప్రపంచశ్రేణి టెక్ సంస్థల కార్యకలాపాల్లో మన ఐటీ సంస్థల ప్రమేయముంది గనక ఉద్యోగ విపణిలో సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఐటీ రంగంలో మొదలైన కోతలు ఇతర రంగాలకూ పాకే ముప్పుంది. సత్వరం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్గాలు వెతకాలి. అదనపు పెట్టుబడులు వచ్చేలా, ఉత్పాదకత పెరిగేలా విధానాలు నిర్ణయించడం దారిద్య్ర నిర్మూలనకూ, వృద్ధికీ కీలకం. కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత కల్పించడం ఏ రంగానికైనా మంచివి కావు. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మెరుగ్గా ఉందంటున్న పాలకులు మేకిన్ ఇండియా స్వప్నాలను చూపడమే కాక, ఉద్యోగక్షేత్రంలోనూ దాని ఫలాలు అందించగలిగితే మంచిది. కిందపడ్డా మళ్ళీ పైకి లేస్తాం! -
2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం?
► (కంచర్ల యాదగిరిరెడ్డి) క్రికెట్ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. కోవిడ్ కష్టాలు ముగిసి మార్కెట్ పట్టాలెక్కుతోందని అందరూ అనుకుంటున్న సమయంలో మాంద్యం వార్తలు, ఐటీ కంపెనీల భారీ లేఆఫ్‌లు, కేవలం రెండు మాసాల్లో 1.25 లక్షలకు పైగా ఉద్యోగాలు పోవడం.. టెకీలకు, వారి కుటుంబసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాంద్యంపై సర్వత్రా చర్చ పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఉద్యోగులు ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు కొనుగోలు చేయవద్దని అమెజాన్ సీఈఓ చెప్పారంటే భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ మాంద్యం ఎప్పటిదాకా ఉంటుందన్న దానిపై ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. మాంద్యం వస్తుందని ప్రచారం ఊపందుకునే లోపే ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మాంద్యం ఛాయలు అప్పుడే మొదలయ్యాయంటూ వెల్లడించింది. మెటాతో పాటు ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగులను ఫైర్ చేయడం (తొలగించడం) మొదలుపెట్టాయి. మెటా, అమెజాన్, తాజాగా ట్విట్టర్ పింక్ స్లిప్‌ల (ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ ఇచ్చే నోటీసులు) జారీ ప్రారంభించాయి. లేఆఫ్స్ఎఫ్వైఐ వెబ్సైట్ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 టెక్ కంపెనీలు 1.4 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో దాదాపు 90 శాతం (1.25 లక్షలకు పైగా) తొలగింపులు జరిగింది అక్టోబర్, నవంబర్ నెలల్లోనే. ఎక్కువగా భారతీయులే బాధితులు సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పింది. వీరిలో దాదాపు 80 శాతం అంటే 8,800 పై చిలుకు ఉద్యోగులు భారతీయులే. ‘ఖర్చులు తగ్గించుకునేందుకు నాకు ఇంకో దారి కనపడలేదు’అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు పంపిన వీడియో సందేశంలోనే చెప్పుకున్నాడంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. మెటాలో తొలగింపులు మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం వరకూ ఉంటే, ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇది మూడు శాతం మాత్రమే. అంటే ఈ మూడు శాతంలో పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలోనూ దాదాపు 70 శాతం అంటే అంటే 7 వేల మంది భారతీయులే కావడం గమనార్హం. ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, బుకింగ్.కామ్, సిస్కో, బైజూస్, ఎయిర్ బీఎన్బీ, ఇన్‌స్టాకార్ట్ వంటి కంపెనీల్లోనూ రెండు వేల నుంచి దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఉబర్ వేర్వేరు విభాగాలకు చెందిన సుమారు ఆరు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మాంద్యం భయమే కారణమా? టెక్నాలజీ కంపెనీల్లో హైర్ అండ్ ఫైర్ పాలసీ కొత్తదేమీ కాదు. డాట్ కామ్ కంపెనీలు దివాలా తీసినప్పుడు, 2008 నాటి సబ్ ప్రైమ్ క్రైసిస్ సమయంలోనూ పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. అయితే కోవిడ్ కష్టకాలంలో బోలెడన్ని లాభాలు ఆర్జించిన తరువాత కంపెనీలు ఎందుకీ లే–ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో మాంద్యం ముంచొకొస్తోందన్న ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు నేల చూపు చూస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో మెటా ఒక్కో షేరు ధర 340 డాలర్లు కాగా గడచిన సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ఆ షేర్ ధర 109.86 డాలర్లు కావడం గమనార్హం. ఆదాయం తగ్గుతుందన్న అంచనాలతో.. అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో అనేకం ప్రకటనలపై ఆధారçపడేవి. అయితే, ద్రవ్యోల్బణం నేపథ్యంలో కంపెనీలు ప్రకటనల ఖర్చులను తగ్గించుకున్నాయి. ఉద్యోగులకు రాసిన లేఖలో జూకర్బర్గ్ అదే చెప్పారు. భవిష్యత్తులో ఆదాయం తగ్గిపోతుందన్న అంచనాలు బలపడటంతోనే ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. మెటా లాంటి సంస్థలకు స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ కారణంగానే 18 ఏళ్ల కంపెనీ చరిత్రలోనే మొదటి సారిగా ఫేస్బుక్ రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గిపోయింది. పైగా మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లోనూ ఆదాయం తగ్గినట్లు ప్రకటించింది. అంతేకాదు మెటావర్స్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం సుమారు వెయ్యి కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉండటం కూడా ఖర్చులు తగ్గించుకోవాలని మెటా సంస్థ అనుకునేందుకు మరో కారణమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇతర రంగాలపైనా ప్రభావం! అమెరికాలో గత నెలలో 2.61 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి చేరాయి. అయినప్పటికీ టెక్ కంపెనీల లేఆఫ్‌లపై ఆర్థిక వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. సాధారణంగా ఆర్థిక రంగంలో ఏం జరుగుతోందన్న దానికి టెక్ కంపెనీల పనితీరు ఓ కొలమానంగా ఉంటుందని, ఈసారి అక్కడి పరిస్థితుల ప్రభావం ఇతర రంగాలపై కూడా పడనుందని వారు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా పెంచే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరిన్ని దెబ్బలు తప్పవని అంచనా. అయితే లేఆఫ్‌లు లేకున్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లోనూ ఆదాయాలు తగ్గిపోతుండటం గమనార్హం. క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకుంటే అమెరికాలో ఆర్థిక లావాదేవీలు చాలా చురుకుగా జరగాల్సిన సమయమిది. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. మన టెకీల్లో ధీమా అమెరికన్ టెక్ కంపెలల్లో అత్యధికులు భారతీయులేనన్నది, అందులోనూ తెలుగు రాష్ట్రాల వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. అయితే పెద్ద పెద్ద కంపెనీల లేఆఫ్‌ల ప్రభావం మనవాళ్లపై ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది హెచ్–1బీ వీసాదారులు తమ ఉద్యోగాలు కోల్పోయారు కూడా. కొత్త ఉద్యోగం దొరక్కపోతే ఆరు నెలల కాలంలో వారు భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ, మన టెకీలు తక్కువ వేతనాలు తీసుకునేందుకు అలవాటు పడిన నేపథ్యంలో వారు తేలిగ్గానే ఉద్యోగాలు సంపాదించుకోగలరనే ధీమాతో ఉన్నారు. అవసరానికి మించి ఉద్యోగులు! గత కొన్నేళ్లుగా ఐటీ కంపెనీల్లో నియామకాలకు చిత్ర విచిత్రమైన ప్రాతిపదికలు కనిపించాయి. భవిష్యత్తులో వచ్చే అవకాశమున్నప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోవడం, ప్రాజెక్టు రాకపోతే వారిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం వంటి చర్యలు చేపట్టాయి. ఫలితంగా చాలా కంపెనీల్లో అవసరానికి మించి ఉద్యోగులు చేరిపోయారు. ఫలితంగా ఖర్చులు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయంపై నిలకడ లేకుండా పోయిందని నిపుణులు అంటున్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు గత నాలుగు త్రైమాసికాలు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ పోవడం కూడా టెక్ కంపెనీలకు శాపంగా మారింది. రియల్ ఎస్టేట్, కార్లు అమ్ముకునే కంపెనీలపై ఇది తీవ్రమైన దు్రష్పభావం చూపింది. నిరుద్యోగంపై లేఆఫ్‌ల ప్రభావం తక్కువే.. టెక్ కంపెనీల భారీ లేఆఫ్‌లు ఆర్థిక మాంద్య పరిస్థితులకు సూచికలా? కావచ్చు, కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే టెక్ కంపెనీలు, వాటిల్లో ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువని, ఫలితంగా లేఆఫ్‌ల ప్రభావం నిరుద్యోగంపై పెద్దగా పడదని అంతర్జాతీయ సంస్థ గోల్డ్‌మ్యాన్ శ్యాక్స్ అంచనా వేస్తోంది. టెక్ కంపెనీలు తొలగించిన ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఇతర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని చెబుతోంది. గతంలోనూ టెక్ కంపెనీల భారీ లేఆఫ్‌లు ఇతర రంగాల్లో ఉద్యోగాల కోతకు దారితీయలేదని ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మాంద్యం అవకాశాలు తక్కువేనని విశ్లేషించింది. లేఆఫ్‌లు తాత్కాలిక పరిణామమే.. ఐటీ కంపెనీల లేఆఫ్‌లు తాత్కాలిక పరిణామమే. ఆర్థిక వ్యవస్థ తాలూ కూ సహజసిద్ధ హెచ్చుతగ్గుల్లో భాగం. భారత ఐటీ రంగం ఏడాదికి 10% చొప్పున పెరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇది ఇలాగే కొనసాగే చాన్స్ ఉంది. సమీప భవిష్యత్తులో ఐటీ రంగంలో సుమారు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఏఐ/ఎంఎల్, వెబ్ 3.0 వంటి టెక్నాలజీల ఆధారంగా ఐటీ రంగం వృద్ధి చెందనుంది. -క్రిస్ గోపాలకృష్ణన్ ఇన్ఫోసిస్వ్యవస్థాపకులు అనివార్యంగానే లేఆఫ్‌లు ఒక రకంగా చూస్తే టెక్ కంపెనీల లేఆఫ్‌లు అనివార్యమైనవనే చెప్పాలి. ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి కోవిడ్ సమయంలో ప్రతి టెక్నాలజీని రిమోట్ ఫ్రెండ్రీగా, మొబైల్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఫలితంగా ఐటీ నిపుణులతోపాటు సహాయక సిబ్బందికీ డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా నియామకాలూ జరిగాయి. ఇప్పుడా పరిస్థితులు లేవు. రెండో కారణం.. ఉత్పాదకత విషయంలో కంపెనీల ఆలోచనలు మారడం. ఇక మూడో కారణం.. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు వెంచర్ క్యాపిటలిస్టులు, ఎంజిల్ ఇన్వెస్టర్ల నుంచి అంత సులువుగా నిధులు రాకపోవడం! -మురళి బుక్కపట్నం వైస్ చైర్మన్, ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (గ్లోబల్) -
మూన్‌లైటింగ్ ఆదాయాన్ని దాచిపెడితే: లేటెస్ట్ వార్నింగ్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో ప్రకంపనలు రేపిన మూన్‌లైటింగ్‌పై తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చే అసైన్మెంట్లు లేదా ఉద్యోగాలపై ఆదాయపు పన్ను అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఆదాయంపై కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుందని మూన్లైట్ ఉద్యోగులను హెచ్చరించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రూ. 30 వేలు దాటితే టీడీఎస్ తాజాగా, ఈ ‘మూన్ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టిసారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. పన్ను నిబంధనలు రెండో ఉద్యోగానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గానీ, ప్రొఫెషనల్ ఉద్యోగులకు కానీ ఏ కంపెనీ అయినా ఇచ్చే వ్యక్తిగత చెల్లింపులుసహా రూ. 30 వేలు దాటితే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్) వర్తిస్తుందని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రిన్సిపల్ చీఫ్ ఐటీ కమిషనర్ ఆర్.రవిచంద్రన్ స్పష్టం చేశారు. (Apple సత్తా: ఆ మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!) మూన్‌లైటింగ్ ఉద్యోగులు తమ ఆదాయ పన్ను రిటర్న్‌లలో ఏదైనా అదనపు ఆదాయాన్ని ప్రకటించి, వర్తించే పన్ను చెల్లించాలని ఉద్యోగులను కోరారు. అలా చేయకపోతే జరిమానా లాంటి చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది. విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించిందిఏదైనా కంపెనీ లేదా వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా సంపాదించే రూ 30వేల రూపాయల లోపు ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని పరిమితి దాటితే టీడీఎస్ చెల్లించాలని రవిచంద్రన్ స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాలి. ఏదైనా సంస్థ, ట్రస్ట్ కానీ, కంపెనీ, స్థానిక యంత్రాంగం వంటివి దీని కిందికి వస్తాయి. నగదు చెల్లింపులు, చెక్, డ్రాఫ్ట్ ఎలా చెల్లించినా సరే టీడీఎస్ మినహాయింపు తప్పనిసరి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194జె ప్రకారం రూ. 30 వేలు దాటిన తర్వాత 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించాలి. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినప్పుడు కూడా టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది. -
ఉద్యోగాల కోత నిజమే ..కానీ: మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగుల తొలగింపు వార్తలపై స్పందించింది. సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు వస్తున్న వార్తలను తాజాగా కంపెనీ ధృవీకరించింది. అన్ని ఇతర కంపెనీల మాదిరిగానే, తాము కూడా వ్యాపార ప్రాధాన్యతలను సమీక్షిస్తూ, దానికనునుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేయనున్నామని తెలిపింది. అలాగే తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తూనే, కీలక వృద్ధి రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. మైక్రోసాఫ్ట్ అనేక విభాగాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించిందని ఈ వారం యాక్సియోస్ నివేదిక ఇటీవల పేర్కొంది. అంతేకాదు సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదని కూడా తెలిపింది. దీనిపై స్పందించిన సంస్థ ఈ వివరాలను అందించింది. కేవలం తక్కువ సంఖ్యలో ఉద్యోగులను మాత్రమే తొలగించామని, ఇది మా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో కేవలం 1 శాతం కంటే తక్కువ అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వెల్లడించారు. జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 221,000 మంది ప్రస్తుత తొలగింపులు 1శాతం కంటే తక్కువేనని వ్యాఖ్యానించారు. కాగా పీసీ అమ్మకాలు మందగించిన నేపథ్యంలో ఇంటెల్ కార్ప్ వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలను యోచిస్తున్నట్లు వార్తల అనంతరం తాజా పరిణామం చోటు చేసుకుంది. మహమ్మారి సమయంలో టెక్ పరిశ్రమ చాలా లాభాలను పొందింది. జూమ్ వీడియో, స్లాక్ టెక్నాలజీస్ ,నెట్‌ఫ్లిక్స్ లాంటికి ఆదరణ బాగా పెరిగింది. సోషల్ మీడియా ,ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో నియామకాలు జోరందుకున్నాయి. వేలకొద్దీ స్టార్టప్‌లు కొత్త వెంచర్ క్యాపిటల్‌తో లబ్ది పొందాయి. కానీ ప్రపంచ ఆర్థిక మందగమనం , అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణాల రీత్యా అనేక టెక్నాలజీ కంపెనీలు ఖర్చులను తగ్గంచుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేవారం వెలువడనున్న యాపిల్, మెటా, గూగుల్ ఫలితాలు, ఆదాయాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. -
విప్లవాత్మక విధానాలతోనే వెల్లువలా పెట్టుబడులు
గచ్చిబౌలి: వరల్డ్ టాప్ 5 టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనలో తెలంగాణ ప్రభుత్వ అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా మార్చాయన్నారు. గచ్చిబౌలిలో ఎస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు. నీతి ఆయోగ్ ఆవిష్కరణల ర్యాంకింగ్‌లో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలవగా, డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాలు చాలా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ మొదటి, రెండు స్థానాల్లో ఉంటే గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయన్నారు. ఫ్లోరిడా, యూఎస్ఏ ఆధారిత సాంకేతిక సేవల సంస్థ అయిన ఫోనిక్స్ టెక్నాలజీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఎస్పైర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలుగు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మూడేళ్లలో 3 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండేలా కంపెనీని విస్తరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువతకు ఎంతో నైపుణ్యం ఉందని, నూతన అవకాశాలు కూడా అనేకం ఉన్నాయని మంత్రి అన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ విధానానికి తోడు అద్భుతమైన ప్రభుత్వ విధానాలు శాంతిభద్రతల నిర్వహణ, రాజకీయ సుస్థిరత, ఇక్కడి భౌగోళిక వాతావరణం వల్లే సాధ్యమమైందని చెప్పారు. పనిలో నిబద్ధత, లక్ష్యంపై స్పష్టత ఉంటే అత్యున్నత శిఖరాలకు ఎదగవచ్చని యువతకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, వోడితెల సతీశ్‌కుమార్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, ఎస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.