సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన గూగుల్ అప్పుడే యాప్‌లను పునరుద్ధరించే (Restore) ప్రక్రియను ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్'తో కంపెనీ అధికారులు సమావేశం జరగకముందే టెక్ దిగ్గజం ఈ చర్యకు పూనుకుంది.
గత శుక్రవారం గూగుల్ భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను తొలగించి.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో వివాదానికి కారణమైంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్‌లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ ప్రముఖ యాప్‌లను తొలగించింది.
తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్‌అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: ఈయనే లేకుంటే భారత్‌లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని..
మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్‌కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment