
PC: BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు శుభసూచకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. గత మ్యాచ్‌ల మాదిరి ఆదిలోనే వికెట్ పారేసుకోకుండా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన తీరును ప్రశంసించాడు. అయితే, ఓ ఓపెనింగ్ బ్యాటర్‌గా అతడి ప్రదర్శన ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదని విమర్శించాడు.
రూ. 16.30 కోట్లకు
కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ రోహిత్ శర్మను రూ. 16.30 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్ ఆరంభం నుంచి అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో మొత్తం కలిపి 82 పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు.
వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు,. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొని.. 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా హిట్‌మ్యాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన
‘‘అందరి ముఖాల్లో సంతోషం. కానీ అదే సమయంలో ఎన్నో ప్రశ్నలు. ఒకవేళ రోహిత్ శర్మ కనీసం 20 పరుగుల మార్కు దాటేందుకు ఇంకొన్ని ఇన్నింగ్స్ తీసుకుని ఉంటే.. విమర్శలు మరింత ఎక్కువయ్యేవి.
అయితే, ప్రతి ఇన్నింగ్స్‌లోనూ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే, ఆఖర్లో 26 అతడి అత్యధిక స్కోరుగా ఉండేది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.
ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చినా.. అతడి స్థాయికి ఇది అతి సాధారణ ప్రదర్శన మాత్రమే. జట్టు ఓపెనర్‌గా ఇలాంటి ఆట తీరు ఎంతమాత్రం సరికాదు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ పరుగులు చేయడం జట్టుకు సానుకూల పరిణామం.
మెరుగ్గా ఇన్నింగ్స్ ఆరంభించి.. ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే, అతడు ఈరోజు వికెట్ పారేసుకోకుండా ఉండటమే నాకు నచ్చిన అత్యంత గొప్ప విషయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. ఏదేమైనా సూపర్‌స్టార్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. ఇక ముందు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.
చెన్నైని ఓడించిన ముంబై
కాగా వాంఖడేలో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాదించింది. ఇక ముంబై ఈ నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఊదేసింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు-76 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు- 68 రన్స్) కలిసి ముంబైని గెలుపు తీరాలకు చేర్చారు.
చదవండి: RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్ అయ్యర్!.. వీడియో
A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳
Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025