Aakash Chopra
-
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగనుంది. తాజా సీజన్లో తొలి మ్యాచ్‌లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. కోల్‌కతా స్టార్ సునిల్ నరైన్ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో అందరి కళ్లు నరైన్‌పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్ ఆటగాడు మరోసారి కోల్‌కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్తోకాగా గతేడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో సునిల్ నరైన్‌ది కీలక పాత్ర. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి కేకేఆర్ విజయాలకు బాట వేశాడు. గత సీజన్లో పద్నాలుగు ఇన్నింగ్స్‌లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. 180.74 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ సునిల్ నరైన్. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్‌తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.అతడిని ఆపటం ఎవరితరం కాలేదుగతేడాది కేకేఆర్ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్ రాత మారిపోయింది. నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.టీ20 క్రికెట్‌కు ఏం కావాలో నరైన్ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్‌ను కట్టడి చేయలేకపోయారు. సునిల్ నరైన్ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ స్పిన్నర్లే కీలకంఇక తొలి మ్యాచ్‌లో కేకేఆర్- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మలతో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.ఇక కేకేఆర్‌కు ఈసారి మిచెల్ స్టార్క్ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్ లేదంటే అన్రిచ్ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్‌లను కేకేఆర్ కోల్పోయింది. నరైన్.. క్వింటన్ డికాక్ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్ -
'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి'
ఐపీఎల్-2025కు సమయం అసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈ టైటిల్ వేటలో మొత్తం పది జట్లు మరోసారి తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్లో అందరి దృష్టి ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది.గతేడాది సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి మరి హార్దిక్‌కు ముంబై యాజమాన్యం తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అప్పటిలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిచిన పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 18వ సీజన్లో హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. "కెప్టెన్‌గా తనను తను నిరూపించుకోవడానికి హార్దిక్ పాండ్యాకు ఇదొక అద్భుత అవకాశం. ఒకప్పుడు అతడు రోహిత్ శర్మ వారుసుడిగా కొనసాగాడు. రోహిత్ శర్మ గైర్హజారీలో భారత జట్టు కెప్టెన్‌గా అతడు వ్యవహరించేవాడు. వైట్‌బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని అంతా ఊహించారు.కానీ సడన్‌గా కెప్టెన్సీ జాబితా నుంచి పాండ్యాను తప్పించారు. హార్దిక్ గురించి ప్రస్తుతం ఎవరూ చర్చించడం లేదు. అతడిని కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా అద్బుతమైన ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తను ముందుకు వచ్చి అదుకునేవాడు. కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. వరుసగా రెండోసారి ఫైనల్‌కు కూడా చేర్చాడు.ఈ సీజన్లో హార్దిక్ కెప్టెన్‌గా తన తను నిరూపించుకుంటే మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించే అవకాశముంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్ -
అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మొదలు.. తాజాగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు టీమిండియా స్టార్‌గా వెలిగి.. ఇప్పుడు జట్టులో చోటే కరువైన ప్లేయర్ ఇషాన్ కిషన్(Ishan Kishan).సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదుజాతీయ జట్టు ఓపెనర్‌గా చిన్న వయసులోనే ఓ వెలుగు వెలిగిన 26 ఏళ్ల ఇషాన్.. క్రమశిక్షణా రాహిత్యం వల్ల బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానంతో పాటు వికెట్ కీపర్‌గానూ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు.కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ కీపర్ల కోటాలో పాతుకుపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆయా ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అయితే, ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్-2025 రూపంలో సువర్ణావకాశం వచ్చిందంటున్నాడు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. రూ. 11.25 కోట్లకు కొనుగోలుక్యాష్ రిచ్ లీగ్ పద్దెమినిదవ ఎడిషన్‌లో సత్తా చాటితే మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని పేర్కొన్నాడు. కాగా గతేడాది వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్‌ను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని ఏకంగా రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.అయితే, రైజర్స్ జట్టులో ఇప్పటికే విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మ తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది జట్టు ఫైనల్ వరకు చేరడంలో ఈ ఇద్దరిది కీలక పాత్ర. కాబట్టి ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ రాదు. టాపార్డర్‌లోనే ఉండాలంటే.. అతడు మూడో స్థానంలో ఆడాల్సిన పరిస్థితి.ఎవరూ కనీసం మాట్లాడటం లేదుఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్‌కు మరోసారి గొప్ప అవకాశం వచ్చింది. కారణమేదైనా టీమిండియా సెలక్టర్లు అతడిని అస్సలు పట్టించుకోవడం లేదు. రంజీల్లో ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. పరుగులు చేశాడు.అయినా సరే అతడి ప్రాధాన్యాన్ని సెలక్టర్లు గుర్తించడం లేదు. అతడి గురించి ఎవరూ కనీసం మాట్లాడటం లేదు. జాతీయ జట్టులో స్థానం కోసం చేయాల్సిందంతా చేస్తున్నాడు. కానీ.. అసలు అతడి పేరు కూడా తెరమీదకు రావడం లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదు.కానీ ఇషాన్ ఆ పని చేసి చూపించాడు. భారీ సిక్సర్లు బాదగల సమర్థత, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా అతడికి ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ అతడిని మూడో స్థానంలో ఆడించేందుకు తీసుకుందని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.సద్వినియోగం చేసుకుంటేఓపెనర్ల కోటా ఖాళీ లేదు కాబట్టి వాళ్లకూ వేరే ఆప్షన్ లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో వేరే స్థానంలో ఆడి పరుగులు రాబట్టడం అంత తేలికేమీ కాదు. అయితే, ఇషాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అతడికి తిరుగు ఉండదు.ప్రస్తుతం టీమిండియలో బ్యాటర్ల స్థానాలు ఫిక్స్‌డ్‌గా ఏమీ లేవు. ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడు. కాబట్టి ఇషాన్ ఐపీఎల్-2025లో సత్తా చాటితే కచ్చితంగా టీమిండియాలోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా.. సన్‌రైజర్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది.చదవండి: టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం! -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్‌మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్‌పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో ఆటంటే శ్రేయస్‌కు మజాకాగా న్యూజిలాండ్‌తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్‌పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్‌పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్‌పై గిల్‌కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్‌పై పదకొండు ఇన్నింగ్స్‌లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్‌లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్‌పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు -
‘చరిత్ర’లో శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు: మాజీ క్రికెటర్ ప్రశ్న
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఎక్స్ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్ ఖాతాలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.ఆకాశ్ చోప్రా ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్ ట్వీట్‌ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్’ అని మరో నెటిన్ కామెంట్ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్‌ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్ రిప్లై ఇచ్చాడు. Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty. Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!! We did learn though how Akbar was a great and fair emperor, and…— Aakash Chopra (@cricketaakash) February 17, 2025 -
ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్‌తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్‌కు చేరలేదు కాబట్టి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.కారణం ఇదేఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే మాత్రంఅయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్‌గా ఉండటంతో పాటు ఫామ్ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్‌పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్‌పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్‌తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్‌పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్‌నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్‌లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్‌ను ఆడించే క్రమంలో అయ్యర్‌ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నాగ్‌పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్‌లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్‌గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్‌బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్‌లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్‌లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్‌రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా.. హర్షిత్ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్‌లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ సంజూ శాంసన్(1), వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.దూబే, హార్దిక్ అదరగొట్టారుఈ క్రమంలో అభిషేక్ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా రాకతో సీన్ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.హర్షిత్ రాణా రాకతో..అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ మైదానంలోకి పంపింది.ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్(3/33)తో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్‌రౌండర్ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్బౌలర్ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా పంపడం విమర్శలకు దారితీసింది.నిబంధనలకు విరుద్ధంఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ స్థానంలో బౌలర్.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్(like-for-like replacement) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావాలి. రూల్ బుక్‌లో ఇది స్పష్టంగా రాసి ఉంది.ఉదాహరణకు.. బెక్ డకెట్ తలకు గాయమైతే.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్‌నే పంపాలి. కానీ బౌలర్‌ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్ చేయలేడు .ఒకవేళ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్‌నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను రప్పించారు. హర్షిత్‌కు బదులు మహ్మద్ షమీని రప్పించవచ్చు కదా.12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాంఎందుకంటే.. హర్షిత్ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్‌కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తాడు. కానీ.. హర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్ బౌలర్. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందిదూబే బ్యాటింగ్ చేశాడు.. హర్షిత్ బౌలింగ్ చేశాడు’’ అని ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్‌తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్‌లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్‌ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్‌లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సంజూ- జురెల్‌లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్‌లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్‌లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్‌లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్‌గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్‌దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్‌లైన్ పేసర్‌ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్‌లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్‌కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్‌తో వన్డేల్లో శుబ్‌మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్‌లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
అతడి కెరీర్‌ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్‌తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్‌ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్‌గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్‌కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లుఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.డెడ్‌లైన్ ఆరోజేగ్రూపు-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్‌ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా ఉండబోతుఉన్నాడు.వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్‌మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్‌లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్‌పై కూడా మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.సూర్య, సంజూలకు నో ఛాన్స్అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్‌కప్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు. వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్‌ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్‌ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్‌ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్‌మన్ గిల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్‌లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్‌ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
'ఛాంపియన్స్ ట్రోఫీ.. అతడికి భారత జట్టులో నో ఛాన్స్'
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2024-25 కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం కేరళ క్రికెట్ ఆసోషియేషన్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందున అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి స్ధానంలో తమ జట్టు పగ్గాలను సల్మాన్ నజీర్‌కు కేసీఎ అప్పగించింది. ఈ నేపథ్యంలో శాంసన్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశవాళీ టోర్నీలో సంజూ భాగం కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే భారత జట్టులో ఛాన్స్ దక్కపోవచ్చు అని సంజూ అభిప్రాయపడ్డాడు."విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనే కేరళ జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు ఆర్ధం కావడం లేదు. వాయనాడ్‌లో నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంపులో సంజూ పాల్గోలేదని, అందుకే కెసీఎ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని కొంత మంది చెబుతున్నారు.కాలి గాయం కారణంగా శిక్షణా శిబిరానికి ఎంపిక కాలేనని సంజూ కెసీఎకు ముందే తెలియజేసినట్లు మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదమైనప్పటకి విజయ్ హజారే ట్రోఫీలో సంజూ భాగం కాలేకపోయాడు.ఈ టోర్నీని సంజూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే టీ20ల్లో అతడు అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అటువంటిప్పుడు వన్డే క్రికెట్‌ను కూడా శాంసన్ దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇంకా వన్డేల్లో పూర్తి స్ధాయిలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైన విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడాల్సింది. బహుశా శాంసన్‌ను ఛాంపియన్స్ కోసం భారత సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు" అనిచోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం!? -
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్‌రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్‌సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్‌బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!? -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్‌బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్‌పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్‌గా 46 రన్స్‌తో 187కు పైగా స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్‌లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్‌బర్గ్ మ్యాచ్‌లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్‌లో మూడో మ్యాచ్‌లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు ముందు రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్‌పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్‌లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్‌లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్‌లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్‌తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో సఫారీలను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు ఢీకొట్టనుంది.ప్రోటీస్ సిరీస్‌కు యశస్వీ జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు రమణ్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశ్యాఖ్, యశ్ దయాల్ వంటి కొత్త ముఖాలకు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై వంటిది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా జింబాబ్వే సిరీస్‌తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్.. జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.జైశ్వాల్ గైర్హాజరీ సిరీస్‌లలో అభిషేక్‌కు సెలక్టర్లు చోటిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్.. 22.71 సగటుతో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు."అభిషేక్ శర్మ ఈ సిరీస్‌లో చావోరెవో తెల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్‌లో అభిషేక్ రాణించికపోతే వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని కచ్చితంగా పక్కనపెట్టేస్తారు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND-A vs AUS-A: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్‌కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్‌ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్‌పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్‌గా రాణించాడు. వికెట్ కీపర్‌గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
రోహిత్ అసలేం చేశావు.. అతడితో ఎందుకు బౌలింగ్ చేయించలేదు?
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ ఓటమితో ఆరంభించిన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. టాస్ దగ్గర నుంచి బౌలర్ల ఎంపిక వరకు రోహిత్ నిర్ణయాలు బెడిసి కొట్టాయి. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కంటే ముందు కోహ్లిని బ్యాటింగ్‌కు పంపడం, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం, కివీస్ టెయిలాండర్ టిమ్ సౌథీ భారత స్పిన్నర్లపై విరుచుకుపడుతున్నప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేయించకపోవడం వంటివి రోహిత్ చేసిన తప్పిదాలగా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆలస్యంగా ఎటాక్‌లోకి తీసుకురావడాన్ని చోప్రా తప్పు బట్టాడు."అంత తక్కువ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవడం అంత సులభం కాదు. ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ అశ్విన్‌తో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడం నన్ను ఆశ్చర్యపరిచింది. అశ్విన్ బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ మనదే అని నేను చెప్పడం లేదు. కానీ అతడు వరల్డ్‌లోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. టీమ్‌లో కూడా అశ్విన్ మించినవారే లేరు. టెస్టుల్లో అతని కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేదు. లెఫ్ట్ హ్యాండర్లపై కూడా అశూకు మంచి రికార్డు ఉంది. ఎడమచేతి వాటం ఆటగాళ్ళు క్రీజులో ఉన్నప్పుడు కూడా అతడిని ఎటాక్‌లోకి తీసుకు రాలేదు. అస్సలు ఎందుకు అలా చేయలేకపోయారో ఎవరికీ ఆర్ధం కావడం లేదంటూ" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు డేంజరస్ ప్లేయర్ దూరం!? -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్‌ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. -
IPL 2025: ‘కమిన్స్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్! కారణం ఇదే’
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్‌రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగాఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్‌కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్‌గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్‌గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు. ఫ్రాంఛైజీ సైతం కమిన్స్‌నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్‌రైజర్స్ కమిన్స్‌ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్‌కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.ఒకవేళ ఆసీస్ షెడ్యూల్‌కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదువేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.ఎందుకంటే.. మొదటి ప్లేయర్‌గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్లో కమిన్స్ బౌలర్‌గా.. కెప్టెన్‌గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.నిబంధనలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు -
‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్‌లు డ్రాప్ చేయలేదు’
మహిళల టీ20 ప్రపంచకప్-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తేనే హర్మన్‌ప్రీత్ సేన టాప్-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.కానీ.. ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో రాణించినా.. ఫీల్డింగ్‌లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్‌లు జారవిడిచింది.లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్) నమోదు చేసింది. కివీస్ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్ మహిళా టీమ్.ఇంత చెత్త ఆట చూడలేదుఈ నేపథ్యంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శనపై స్పందించాడు.మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయలేదు‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్‌లు ‘డ్రాప్’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్‌ల జట్టు నుంచి బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్ ఇచ్చామని కోచ్‌లు చెప్పిన విషయం తెలిసిందే.అదే ప్రభావం చూపిందిఈ నేపథ్యంలో పాక్ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా ఇలా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత పాక్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్ చేశాం. కానీ.. బ్యాటింగ్.. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సింది.మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్‌లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్‌లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఆ ఎనిమిది క్యాచ్‌లు ఏదేమైనా.. పాకిస్తాన్ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్‌లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్ చేరాలన్న హర్మన్‌సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్ వంటి జట్టుతో మ్యాచ్ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లువేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ స్కోరు: 110/6 (20)పాకిస్తాన్ స్కోరు: 56 (11.4)ఫలితం: పాక్‌పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్‌లో అడుగుమహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి పాకిస్తాన్‌తో పాటు భారత్ కూడా అవుట్.చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024 -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్‌లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్‌లో లంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్‌వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో బంగ్లా బౌలింగ్‌ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్‌గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
Ind vs Ban 2nd Test: భారత తుదిజట్టు నుంచి అతడు అవుట్!
బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీటఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లకు తుదిజట్టులో చోటిచ్చింది.అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్‌లోని నల్లమట్టి పిచ్‌పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన‘‘నల్లమట్టి పిచ్‌పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు. రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII— BCCI (@BCCI) September 26, 2024 -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్‌కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. దీంతో పాంటింగ్‌తో పాటు పంత్ కూడా పంజాబ్‌తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్‌తో కలిసి పంజాబ్ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్‌బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.ఐదుసార్లు ట్రోఫీ అందించిఐపీఎల్లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలుఅయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్‌ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్‌ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.దారుణ ఫలితంఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసిందిఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.అతడేమీ ధోని కాదుఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ధోని-చెన్నై అనుబంధం వేరుకాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
టెస్టు కెప్టెన్‌గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్‌గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్‌గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్‌ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్‌కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్‌గా భావిస్తున్న పంత్‌ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్‌ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్‌గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్‌గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే! -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్‌కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌తో టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని భారత్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్‌నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
Ind vs Zim: వికెట్ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ టీమిండియా తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ స్టార్ బ్యాటర్ల నిష్క్రమణ తర్వాత శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో తలపడేందుకు హరారేకు వెళ్లింది.ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన తుది జట్టును ఎంచుకున్నాడు.ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘టాపార్డర్‌లో శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురి ఆర్డర్ మారొచ్చు కానీ.. టాప్-3లో మాత్రం వీరే ఉండాలి.ఆ తర్వాతి స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్‌కు రావాలి. ఇక వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను ఆడించాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానం అతడిదే.ఆరో బ్యాటర్‌గా రింకూ సింగ్ బరిలోకి దిగాలి. లేదంటే జురెల్ కంటే ముందుగానే వచ్చినా పర్లేదు. జురెల్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ఈసారి జితేశ్ శర్మకు నేనైతే అవకాశం ఇవ్వను.ఇక ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలి. ఆల్‌రౌండర్‌గా జట్టుకు తన సేవలు అవసరం. నలుగురు బౌలర్లను తీసుకోవాలి కాబట్టి స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయితో పాటు.. వాషింగ్టన్ కూడా అందుబాటులో ఉండటం కలిసి వస్తుంది.అభిషేక్ శర్మ కూడా పార్ట్‌టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ప్రభావం చూపగలడు. ఇక పేస్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరు.నిజానికి హర్షిత్ రాణాను చోటివ్వాల్సింది. అయితే, బెంగాల్ ప్రొ టీ20 లీగ్‌లో ముకేశ్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ వరల్డ్‌కప్ ట్రావెలింగ్ టీమ్‌లో భాగం కాబట్టి.. ఈ ముగ్గురిని ఆడించవచ్చు. అందుకే హర్షిత్ రాణాకు ఈసారికి మొండిచేయి తప్పదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. టీ20 ప్రపంచకప్-2024 విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వీరు భారత్‌కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.Watch out for those moves 🕺🏻 Wankhede was a vibe last night 🥳#T20WorldCup | #TeamIndia | #Champions pic.twitter.com/hRBTcu9bXc— BCCI (@BCCI) July 5, 2024 జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా.తొలి టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు:శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
టీ20 వరల్డ్‌కప్ బెస్ట్ టీమ్ ఇదే.. కోహ్లి, పంత్‌లకు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంఫియన్స్‌గా భారత్ నిలిచిన విషయం విధితమే. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయల హృదయాలు విజయ గర్వంతో ఉప్పొంగిపోయాయి. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు గురువారం ప్రత్యేక విమానంలో బార్బోడస్ నుంచి స్వదేశానికి చేరుకోనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024 ముగియడంతో టీమ్ ఆఫ్‌ది టోర్నమెంట్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు.ఈ జట్టులో వరల్డ్‌కప్ ఫైనల్ హీరోలు విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్‌కు చోప్రా చోటివ్వలేదు. అదే విధంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు సైతం చోటుదక్కలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్‌కు కూడా చోప్రా ఎంపిక చేయలేదు.కాగా ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా అతడు ఎంపిక చేశాడు. ఇక చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ(భారత్), రెహ్మతుల్లా గుర్భాజ్(అఫ్గానిస్తాన్) అవకాశమిచ్చాడు. ఫస్ట్‌డౌన్‌లో నికోలస్ పూరన్(వెస్టిండీస్)కు చోప్రా చోటిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్(భారత్), హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా)లకు వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో చాన్స్ దక్కింది. ఆల్‌రౌండర్ల కోటాలో హార్ధిక్ పాండ్యా(భారత్), రషీద్ ఖాన్‌లను అతడు ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్లగా ఫజాలక్ ఫరూఖీ(అఫ్గానిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా(భారత్), అర్ష్‌దీప్ సింగ్(భారత్)లను చోప్రా ఎంచుకున్నాడు.ఆకాష్ చోప్రా ఎంచుకున్న జట్టు ఇదేరోహిత్ శర్మ(కెప్టెన్), గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్, ఫజాలక్ ఫరూఖీ,హార్ధిక్ పాండ్యా,రషీద్ ఖాన్,ఫజాలక్ ఫరూఖీ,జస్ప్రీత్ బుమ్రా,అర్ష్‌దీప్ సింగ్ -
రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్: చోప్రా
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. రెండో సారి టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఎట్టకేలకు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతమైంది.2011లో ధోని సారథ్యంలో ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న భారత్.. మళ్లీ ఇప్పుడు రోహిత్ నాయకత్వంలోనే వరల్డ్‌కప్ కల సాధ్యమైంది. భారత్‌కు వరల్డ్‌కప్‌కు అందించిన రోహిత్ శర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. ప్రపంచకప్ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌ని యావత్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటందని చోప్రా కొనియాడాడు. కాగా వరల్డ్‌కప్ విజయానంతరం రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు."రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. అతడి కెప్టెన్సీ కెరీర్లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. అతడు ఛాంపియన్స్ లీగ్‌లో సైతం ముంబైకు టైటిల్‌ను అందించాడు. ఇప్పుడు టీ20 ప్రంపచకప్‌ను సైతం భారత్‌కు అందించి.. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ముగించాడు.ఒక లీడర్‌కు ఇంతకుమించి ఇంకేమి కావాలి. కేవలం ముగ్గురు భారత కెప్టెన్లు మాత్రమే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోగలిగారు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన హిట్‌మ్యాన్ చేరాడు. రోహిత్ సాధించిన ఈ వరల్డ్‌కప్ విజయం కొన్ని తాబ్దాల పాటు గుర్తుండిపోతుంది.రోహిత్ కెప్టెన్సీ అత్యుత్తమంగా ఉంటుంది. అతడు ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఎవరికి అడిగినా రోహిత్ భయ్యా చాలా మంచి కెప్టెన్ చెబుతారు. రోహిత్ మంచివాడు కాదని చెప్పే ఒక్క వ్యక్తి కూడా ఉండడు. రోహిత్ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమని" తన యూట్యూబ్ ఛానలో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
Ind vs Pak: ప్రతిసారీ ఇంతే.. టీ20 మేటి బ్యాటర్‌కు ఏమైంది?
టీమిండియా స్టార్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఇంత వరకూ బ్యాట్ ఝులిపించనే లేదు. వరల్డ్‌కప్-2024లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీమిండియా తలపడగా.. సూర్య నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేశాడు.ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ మిస్టర్ 360 చేతులెత్తేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య.. 8 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆమిర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా సూర్య ఫామ్ మాత్రం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇలాంటి కీలక మ్యాచ్‌లలో సూర్య తేలిపోవడం విమర్శలకు దారితీసింది.ప్రపంచకప్-2022 సమయంలోనూ పాక్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఇక గతేడాది వన్డే వరల్డ్‌కప్ సమయంలోనూ ఒత్తిడిలో చిత్తయ్యాడు ఈ ముంబైకర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధానమైన మ్యాచ్‌లలో చేతులెత్తేయడం సూర్యకు పరిపాటిగా మారిందని పేర్కొన్నాడు.బిగ్ మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకోలేకపాకిస్తాన్తో తాజా మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ టాస్ గెలిచి ఇండియాను తొలుత బ్యాటింగ్ చేయమని అడిగింది. విరాట్ కోహ్లి.. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుటయ్యారు.ఆ సమయంలో రిషభ్ పంత్ బాధ్యతగా ఆడాడు. అతడికి తోడైన సూర్యకుమార్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అదే ఇక్కడ పెద్ద ప్రశ్న.మామూలుగా అయితే సూర్య బాగానే ఆడతాడు. కానీ బిగ్ మ్యాచ్‌లలో మాత్రం రాణింలేకపోతున్నాడు. గతంలో మెల్బోర్న్లో.. 2023 వరల్డ్‌కప్ సమయంలోనూ ఇలాగే జరిగింది. బిగ్ మ్యాచ్‌లలో అతడు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అని ఆకాశ్ చోప్రా సూర్య ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు. చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు మరి కొన్ని తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టైటిల్ విజేతను ఎంచుకున్నాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని చోప్రా జోస్యం చెప్పాడు. అయితే ఎస్ఆర్హెచ్ను తక్కువ అంచనా వేయద్దని, ఆ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లలేదని చోప్రా చెప్పుకొచ్చాడు."ఎస్ఆర్హెచ్-కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ వన్‌సైడ్ గేమ్ అయితే కాదు. కేకేఆర్‌కు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ గట్టీ పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ సన్‌రైజర్స్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఎస్ఆర్హెచ్కు ఇది మూడో ఫైనల్ కాగా.. కేకేఆర్‌కు నాలుగో ఫైనల్. ఇరు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో హెడ్ కంటే అభిషేక్ శర్మ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టులో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉండడంతో హెడ్‌కు మరోసారి కష్టాలు తప్పవు.బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ చెలరేగితే కేకేఆర్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ఫామ్‌ల ఉండడం సన్‌రైజర్స్ కలిసొచ్చే ఆంశం. కానీ అతడు రిస్క్‌తో కూడిన షాట్లు ఆడుతున్నాడు. అది అన్ని సమయాల్లో జట్టుకు మంచిది కాదు. ఎస్ఆర్హెచ్ సమిష్టిగా రాణిస్తే మరోటైటిల్ను తమ ఖాతాలో వేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు -
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్‌పై రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా తన రిటైర్మెంట్ యూ టర్న్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. ప్రస్తుతం ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు రైనా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.కోల్‌కతా బ్యాటింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు తన రిటైర్మెంట్ యూ టర్న్‌కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. రిటైర్మెంట్ను ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నవా అంటూ రైనాను చోప్రా ప్రశ్నించాడు. అందుకు బదులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.చదవండి: Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా.. -
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్‌ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(14 బంతుల్లో 32), సునిల్ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్ రాణా(3/24, రసెల్(2/17), మిచెల్ స్టార్క్(1/22).. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/30), సునిల్ నరైన్(1/22) లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్ఆర్హెచ్ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్ చోప్రా శ్రేయస్ అయ్యర్ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్‌కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్ టాపర్‌ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ ఈ ఎడిషన్ సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024 -
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ. -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్‌గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో యశస్వి జైస్వాల్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్‌లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్‌కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్‌కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Pandya: ఆ చెత్త షాట్ అవసరమా హార్దిక్?
IPL 2024- MI Vs RR- #Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి హేళనలు.. చెత్త కెప్టెన్సీ కారణంగానే ముంబైకి వరుస ఓటములంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి విమర్శలు. ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కూడా ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ పేస్ ఆల్‌రౌండర్ 69 పరుగులు చేశాడు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇంత వరకు కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అవుటైన తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో స్థానంలో వచ్చిన తిలక్ 29 బంతుల్లో 32 పరుగులు చేయగా.. పాండ్యా 21 బంతుల్లోనే 34 రన్స్ సాధించాడు. అయితే, అప్పటికి ఇంకా పది ఓవర్లు మిగిలి ఉన్నా పాండ్యా అనవసరపు షాట్‌తో యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో వికెట్ పారేసుకున్నాడు. రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. Chahal strikes, Hardik departs ⚡#IPLonJioCinema #TATAIPL #MIvRR pic.twitter.com/oM7EOvnxvm — JioCinema (@JioCinema) April 1, 2024 ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు కృషి చేశారు. కానీ.. వీరిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. వాంఖడే పిచ్ 210 పరుగులు స్కోరు చేసేదిగా లేకపోవచ్చు. కానీ 160- 170 పరుగులు సాధించేందుకు ఆస్కారం ఉంది. అయినా.. పదో ఓవర్లో మూడో బంతికి యుజీ బౌలింగ్‌లో పాండ్యా సిక్సర్ కొట్టేందుకు యత్నించాడు. నిజానికి తను బంతిని సరిగ్గా అంచనా వేస్తే ఫలితం వేరేలా ఉండేది. ఆ షాట్ ఆడి తను అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరి నిష్క్రమణ తీవ్ర ప్రభావం చూపింది’’ అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోరు ►వేదిక: ముంబై.. వాంఖడే స్టేడియం ►టాస్: రాజస్తాన్ రాయల్స్.. బౌలింగ్ ►ముంబై స్కోరు: 125/9 (20) ►రాజస్తాన్ స్కోరు: 127/4 (15.3) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రెంట్ బౌల్ట్(రాజస్తాన్- 3/22). చదవండి: IPL 2024: గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేది! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వెంటనే ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ను తీసేయండి'.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యూహాలను అమల చేయడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో పాండ్యా చేతులేత్తేశాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడు. తొలి 10 ఓవర్లలో బుమ్రాతో హార్దిక్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్ వేసిన బుమ్రా.. మళ్లీ 13 ఓవర్లో ఎటాక్‌లోకి వచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం హార్దిక్ పాండ్యాపై సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. "ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి చెత్త కెప్టెన్సీని నేను చూడలేదు. హార్దిక్ పాండ్యా తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబై ఫ్రాంచైజీ అయినా అతడి తొలగించాలి’ అంటూ జియో సినిమా షోలో చోప్రా పేర్కొన్నట్లు ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. తాజాగా ఇదే విషయంపై చోప్రా క్లారిటీ ఇచ్చాడు. తను అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, అవన్నీ రూమర్సే అని చోప్రా చెప్పుకొచ్చాడు. "అసలు ఏమి జరుగుతుందో నాకు అర్దం కావడం లేదు. మీకేం అయింది? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి" అంటూ ఓ యూజర్ ట్వీట్‌కు చోప్రా రిప్లే ఇచ్చాడు. -
'సీఎస్కే ఓపెనర్‌గా యువ సంచలనం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే'
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ 17వ సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి పోరులో ఎలాగైనా విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కే కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ల ఫొటో సెషన్‌కు ముందు ఎంఎస్ ధోనీ తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించేశాడు. కాగా మొదటి మ్యాచ్ నేపథ్యంలో సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో చర్చించాడు. కివీ స్టార్ రచిన్ రవీంద్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొన్న యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశముందని చోప్రా అభిప్రాయపడ్డాడు. రచిన్ రవీంద్ర.. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. అజింక్యా రహానే, డార్లీ మిచెల్ వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐదో స్ధానంలో శివమ్ దూబే బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వస్తారు. ఆపై శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆల్‌రౌండర్లు క్రీజులోకి రానున్నారు. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో పతిరానా అందులో బాటులో లేడు కాబట్టి నాలుగో ఆటగాడిగా మొయిన్ అలీ లేదా ముస్తిఫిజర్ రెహ్మన్‌కు చోటు దక్కే అవకాశముంది. అదేవిధంగా యువ ఆటగాడు సమీర్ రిజ్వీని సీఎస్కే ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. -
భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్!
IPL 2024- T20 WC 2024: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటితేనే తిరిగి భారత టీ20 జట్టులో స్థానం పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు ఫర్వాలేదనిపించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ సత్తా చాటాడు. అయితే, గత కొన్ని రోజులుగా కెరీర్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అయ్యర్. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జూన్‌లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి చోటు దక్కుతుందా లేదా అన్న అంశంపై ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్! ‘‘శ్రేయస్ అయ్యర్... ప్రస్తుతం నీ పేరు భారత టీ20 జట్టులో లేదు. ఒకవేళ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో నువ్వు సత్తా చాటితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 550కి పైగా పరుగులు సాధిస్తే సెలక్టర్లు కచ్చితంగా ఈ పేరును పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్లో అదరగొడితేనే కీలక సభ్యుడిగా జట్టులో చోటిస్తారు. కానీ ప్రస్తుతం అతడి పేరు పరిశీలనలో లేదన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్‌ను ముందుకు నడిపించాడు. కానీ కనీసం ప్లే ఆఫ్స్‌నకు కూడా చేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణిస్తేనే వరల్డ్‌కప్ అవకాశాలను సజీవం చేసుకోగలడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ప్రదర్శనపైనే అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు!! ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024కు తెరలేవనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెపాక్‌లో ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇక కేకేఆర్ మార్చి 23న సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదారాబాద్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: # RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు! -
IPL 2024: సన్‌రైజర్స్ తుదిజట్టు ఇదే.. మార్క్రమ్కు నో ఛాన్స్?
ఐపీఎల్-2024 ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్‌కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మరుసటి రోజే అంటే మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్‌రైజర్స్ ఈసారి మరో కొత్త కెప్టెన్‌తో ముందుకు రానుంది. ఆస్ట్రేలియా సారథి, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్‌పై కోట్లు కుమ్మరించి తన నాయకుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్పై వేటు వేసింది. ఇక జట్టులో వీరిద్దరితో పాటు మరో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం తుదిజట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందా అన్న చర్చల నడుమ.. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు.. ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్‌లకు తన టీమ్‌లో చోటిచ్చాడు. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్.. ఇద్దరు లెఫ్టాండర్లతో ఓపెనింగ్ చేయించాలనుకుంటే వీరికి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇవ్వాలి. లేదంటే అభిషేక్‌ను వన్‌డౌన్‌లో ఆడించి.. మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపాలి. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్‌లను పంపించాలి’’అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ స్పిన్ పిచ్‌లపై ఆడాల్సి వస్తే.. మార్కో జాన్సెన్ స్థానంలో వనిందు హసరంగను తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. షాబాజ్ అహ్మద్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా ఆకాశ్ చోప్రా తన తుదిజట్టులో ఐడెన్ మార్క్రమ్కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. గత సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ ఆడి సగటు 22.55తో 248 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024- సన్‌రైజర్స్ హైదరాబాద్- ఆకాశ్ చోప్రా తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్. ఐపీఎల్-2024- సన్‌రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ ఐడెన్ మార్క్రమ్* రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్* హెన్రిచ్ క్లాసెన్* మయాంక్ అగర్వాల్.. అన్మోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ మార్కో జాన్సెన్* వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి.నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్హక్ ఫరూఖీ* షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) ట్రావిస్ హెడ్ * (వేలం - 6.80 కోట్లు) వనిందు హసరంగ* (వేలం - 1.50 కోట్లు) ప్యాట్ కమిన్స్* (వేలం - 20.50 కోట్లు) జయదేవ్ ఉనాద్కట్ (వేలం - 1.60 కోట్లు) ఆకాశ్ సింగ్ (వేలం - 20 లక్షలు) ఝతావేద్ సుబ్రమణియన్ (వేలం - 20 లక్షలు) *- విదేశీ ఆటగాళ్లు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే!
"It's a shame if this team..: ఐపీఎల్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్‌కు చెన్నైలో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్.. వీరితో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక రోవ్‌మన్ పావెల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, ఆడం జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా ఉండనే ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో చాలా మందికి తుదిజట్టులో ఆడే అవకాశం రాదన్న మాట నిజమే. అయితే, జట్టుకు అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోసారైనా ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడిక ఆవేశ్ ఖాన్ కూడా రాయల్స్‌తో చేరాడు. వీళ్లందరినీ చూస్తుంటే ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తుందని అనుకోవచ్చా? అంటే కచ్చితంగా అవుననే అంటాను. అయితే, గత సీజన్లో తాము ఇంపాక్ట్ ప్లేయర్‌ను వాడదలచుకోలేదని రాయల్స్ చెప్పింది. ఈసారి మాత్రం వాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎలా ఉపయెగించుకుంటుందన్న అంశం మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇంత మంచి జట్టు ఉన్నా.. ఒకవేళ రాయల్స్ గనుక ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటే నిజంగా అది సిగ్గుచేటే’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన రాజస్తాన్ రాయల్స్ ఆఖరి మెట్టుపై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది ప్లే ఆఫ్స్(టాప్-4) కూడా చేరలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ 2024 జట్టు సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్మెయిర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్ కాడ్మోర్, నండ్రే బర్గర్, అబిద్ ముస్తాక్, అవేశ్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్ నుంచి స్వాపింగ్). చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్‌గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్‌లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్‌కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్‌లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్‌ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
Ind vs Eng 3rd Test: భరత్‌నే ఆడించండి.. అతడు వద్దు!
India vs England, 3rd Test: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో శ్రీకర్ భరత్‌నే టీమిండియా వికెట్ కీపర్‌గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్‌గా భరత్ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పిచ్‌లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడిస్తున్నారన్న ఆకాశ్ చోప్రా.. కాబట్టి భరత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్ టీమిండియాలో భాగమయ్యాడు. ప్రొటిస్‌తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లోనూ కీపర్‌గా భరత్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అరంగేట్రానికి మేనేజ్మెంట్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా అతడికి ఛాన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాత్రం భరత్‌నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్ జురెల్ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్‌నే కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్‌లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్‌ను ప్యూర్ బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దించారు కదా. మరి భరత్‌ను స్పెషలిస్టు కీపర్‌గానే చూడాలి కదా. హైదరాబాద్ టెస్టులో అతడు బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్‌గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
భరత్‌కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ప్రస్తుతం కేఎస్ భరత్‌కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్‌కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్‌కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్‌ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్‌కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
అతడిని చూస్తే యువీ గుర్తుకొస్తున్నాడు.. హార్దిక్‌ను వదిలేసి!
India Potential Selection Dilemma For T20 World Cup 2024: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబేపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దూబే ఆట తీరు చూస్తుంటే తనకు యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు కచ్చితంగా చోటివ్వాలని ఆకాశ్ చోప్రా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన శివం దూబే.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. రెండు వికెట్లు తీశాడు. పాండ్యా గైర్హాజరీలో చోటు సంపాదించి.. సత్తా చాటి తద్వారా టీమిండియా 3-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన అవకాశాన్ని ఇలా పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దూబే.. ప్రపంచకప్-2024 రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు గట్టి సందేశమే పంపాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘శివం అతి సుందరం.. పవర్ హిట్టర్.. మూడో టీ20లో అతడిని ఇంకాస్త లేట్‌గా బ్యాటింగ్‌కు పంపాల్సింది. శివం కంటే ముందుగా సంజూ శాంసన్ లేదంటే.. రింకూ సింగ్‌ను బరిలోకి దించితే బాగుండేది. ఎందుకంటే శివం.. ఆచితూచి ఆడే ప్లేయర్ కాదు.. అటాకర్. అటాకర్.. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడు. నాకు అతడిని చూస్తే యువీ గుర్తుకువస్తాడు. శివంను లోయర్ ఆర్డర్లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ జట్టులో ఉండాలి అదే విధంగా.. ‘‘తొలి రెండు మ్యాచ్‌లలో శివం దూబే ఎంత శక్తిమంతంగా సిక్సర్లు బాదాడో చూశాం. అతడి ఆట తీరుకు ముచ్చటపడి కొందరైతే హార్దిక్‌ను వదిలేసి.. దూబేను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. నా వరకైతే ఈ ఇద్దరూ జట్టులో ఉంటే బాగుంటుంది. అఫ్గన్‌తో మూడు మ్యాచ్‌లలో అదరగొట్టి తాను ప్రపంచకప్ రేసులో ఎవరి కంటే తక్కువ కాదని దూబే నిరూపించాడు. అసలైన పోటీదారు అనిపించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ దూబే ఇలాగే రాణిస్తే.. టీమిండియాలోకి రాకుండా అతడిని ఎవరూ ఆపలేరు’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ Ranji Trophy 2024: బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
Ind Vs Eng: వాళ్లిద్దరి అధ్యాయం ఇక ముగిసినట్లే!
అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా టెస్టు కెరీర్ అధ్యాయం ముగిసిపోయినట్లేనని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టుతో ఈ విషయం నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇక ముందు ఈ వెటరన్ బ్యాటర్లు టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదన్నాడు. కాగా ఒకప్పుడు టెస్టు స్పెషలిస్టులుగా టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు రహానే, పుజారా. వైస్ కెప్టెన్‌గా రహానే.. నయావాల్‌గా పుజారా తమ వంతు పాత్రలను చక్కగా పోషించారు. కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరిని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. అడపాదడపా వచ్చిన అవకాశాలను రహానే, పుజారా సద్వినియోగం చేసుకోకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు.. యంగ్ క్రికెటర్ల నుంచి ఎదురవుతున్న పోటీలోనూ వీరు వెనుకబడిపోయారు. దీంతో ఇటీవల సౌతాఫ్రికా పర్యటన రూపంలో బిగ్ సిరీస్ నేపథ్యంలో రహానే, పుజారాలను సెలక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన రెండు మ్యాచ్‌ల జట్టులోనూ చోటివ్వలేదు. వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. "ఊహించిన విధంగానే జట్టు ప్రకటన ఉంది. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను ఎంపిక చేయలేదు. ఇక వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం. ఎప్పుడైతే సౌతాఫ్రికాతో ఆడే జట్టులో వారికి స్థానం ఇవ్వలేదో అప్పుడే ఇక ముందు కూడా వాళ్లకు ఆడే అవకాశం రాదని ఊహించాను. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి టీమిండియా దారులు మూసుకుపోయినా రహానేకు మాత్రం ఐపీఎల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు గత సీజన్లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మరికొన్నాళ్లపాటు కొనసాగగలడు. నిజానికి చెన్నైకి ఆడటం ముఖ్యం కాదు.. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి ఆ జట్టుకు ఆడి నిరూపించుకుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత రహానే వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో చెన్నైకి ఆడిన అతడు ఫుల్‌ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది. మిగతా వాళ్లంతా విఫలమైనా ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మిగతా వాళ్లంతా విఫలమైనా రహానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, పుజారా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఈక్రమంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టులో రహానేకు చోటు దక్కినా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది. పుజారా డబుల్ సెంచరీ అయితే, కరేబియన్ గడ్డపై పాత కథను రిపీట్ చేసిన రహానే మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక పుజారా సంగతి సరేసరి. ఇంగ్లండ్ కౌంటీల్లో రాణిస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. తాజాగా రంజీ ట్రోఫీ-2024లో ఆరంభ మ్యాచ్‌లో పుజారా డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర తరఫున సత్తా చాటగా.. ముంబై కెప్టెన్ రహానే మాత్రం డకౌట్ అయ్యాడు. -
ఈసారి తప్పు ముమ్మాటికీ రోహిత్‌దే.. చెత్త సెలక్షన్: మాజీ బ్యాటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదన్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో రోహిత్ వికెట్ పారేసుకున్న విధానం విస్మయపరిచిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రీఎంట్రీలో రనౌట్ సుమారు పద్నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అఫ్గన్‌తో తొలి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. రనౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇండోర్‌లో డకౌట్ మొహాలీ మ్యాచ్‌లో ఈ మేరకు.. శుబ్‌మన్ గిల్‌తో సమన్వయలోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు రోహిత్. ఈ నేపథ్యంలో కనీసం రెండో టీ20లోనైనా హిట్‌మ్యాన్ మెరుపులు చూడాలని ఆశించిన వాళ్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండోర్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్.. డకౌట్ అయ్యాడు. తప్పుడు షాట్ సెలక్షన్ అఫ్గన్ బౌలర్ ఫజల్హక్ ఫారూకీ సంధించిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను విశ్లేషిస్తూ.. "రోహిత్ అవుటైన తీరు ఆశ్చర్యపరిచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఇలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. బంతి నేరుగా స్టంప్స్ ను హిట్ చేసింది. సాధారణంగా రోహిత్ అలాంటి షాట్లు ఆడడు. తొలి టీ20లో సున్నాకే రనౌట్ అయ్యాడు. అందులో అతడి తప్పేమీ లేదు. కానీ రెండో టీ20లో తప్పుడు షాట్ సెలక్షన్‌తో మూల్యం చెల్లించాడు. ఈసారి తప్పు ముమ్మాటికీ అతడిదే. ఆ రోహిత్ కావాలి రోహిత్ శర్మ టీ20 ఆట తీరు, సామర్థ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. ఐపీఎల్ ద్వారానైనా రోహిత్ ఫామ్‌లోకి రావాలి. వన్డే వరల్డ్ కప్‌లో దంచికొట్టిన రోహిత్ శర్మ మనకి కావాలి" అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్-2024లో రోహిత్ బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్‌లో సానుకూలంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా.. అఫ్గనిస్తాన్‌తో రెండో టీ20లో రోహిత్ శర్మ విఫలం కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి కారణంగా రెండో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. -
వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్‌కు ఎంపికైన ఆ ప్లేయర్‌కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్‌బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్‌బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్‌లు ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్‌కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్‌లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్‌లో బీచ్‌లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హవెలాక్‌తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్‌లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్‌లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
ఆసియాలో పులి.. అక్కడ మాత్రం జీరో! కింగ్ అవ్వాలంటే అదొక్కటే
వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. టెస్టుల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 2023 ఏడాదిలో మొత్తంగా 45 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గిల్ 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీల సాయంతో 2,118 పరుగులు చేశాడు. అయితే ఏడాది టెస్టుల్లో మాత్రం గిల్ 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక సెంచరీ ఉంది. మిగితా ఆరు సెంచరీలు వన్డేలు, టీ20లో చేసినవే. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా గిల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో కాకుండా విదేశీ పిచ్‌లపై కూడా రాణిస్తానే అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా పరిగిణించబడతారని చోప్రా తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్‌మన్ గిల్ ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. గిల్‌ను అభిమానులు ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలుచుకుంటారు. ప్రిన్స్ నుంచి రాజుగా మారాలంటే అతడు రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడగా రాణించాలి. ముఖ్యంగా సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్,న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి గణంకాలను మెరుగుపరుచుకోవాలి. ఆసియాలో అతడి రికార్డులు అద్బుతంగా ఉన్నాయి. అదే సేనా దేశాల్లో అతడి రికార్డులు ఆసియాకు భిన్నంగా ఉన్నాయి. గిల్‌కు ఇంకా చాలా కెరీర్ ఉంది. అతడు రాబోయో రోజుల్లో సేనా దేశాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్ -
విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. అతడితో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ మొత్తం దక్కించుకున్నాడు. రూ.20.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగొలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలు వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి టీమిండియా స్టార్లు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువ తీసుకుంటున్నారని అతడు అన్నాడు. అదే విధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం వేలంలోకి వస్తే రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. అయితే అందుకు ఐపీఎల్ రూల్స్ సవరించాల్సి ఉంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. "ఐపీఎల్ రూల్స్‌లో కొన్ని మార్పులు చేయాలి. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్‌ను రూ.200 కోట్లకు పెంచాలి. అందులో భారత ఆటగాళ్ల కోసం రూ.150 కోట్లు వెచ్చించేలా కండీషన్ పెట్టాలి. మిగిలిన 50 కోట్ల రూపాయలను విదేశీ క్రికెటర్ల కోసం ఉంచాలి. అప్పుడు కోహ్లి వేలంలో వస్తే 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడని" జియో సినిమాతో చోప్రా పేర్కొన్నాడు. రైనా మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత స్టార్లు జస్ప్రీత్ బుమ్రాకు రూ.12 కోట్లు, మహ్మద్ షమీకి రూ.5 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ధోని కూడా కేవలం రూ.12 కోట్లకే సీఎస్కే ఆడుతున్నాడు. 8 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడని ఆటగాడికి దాదాపు రూ.25 కోట్లు ఇచ్చారు. అది సరైన నిర్ణయం కాదని అన్నాడు. చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం -
పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంలో హెడ్‌ది కీలక పాత్ర. . భారత్‌తో జరిగిన ఫైనల్లో 137 పరుగులతో హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా మెగా టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హెడ్.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు. కాగా ఈ వరల్డ్‌కప్ హీరో ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.2 కోట్ల కనీస తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడి కోసం ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రయత్నించాలని అకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "మిని వేలంలో పంజాబ్ కింగ్స్ అఫ్గాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కోసం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. సామ్ కుర్రాన్ స్ధానంలో అతడిని ఆడించే ఛాన్స్ ఉంది. నా వరకు అయితే కుర్రాన్ కంటే ఒమర్జాయ్ బాగా రాణిస్తాడని అనుకుంటున్నాను. అయితే ఒమర్జాయ్తో పాటు ట్రావిడ్ హెడ్ కోసం కూడా పంజాబ్ ట్రై చేయాలి. అతడు జానీ బెయిర్‌స్టోకు హెడ్ ప్రత్యామ్నయంగా ఉంటాడు. అతడికి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసే స్కిల్ కూడా ఉంది. అదే విధంగా భారత బౌలర్ కావాలనుకుంటే లార్డ్ శార్ధూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉన్నాడు" అని తన యూట్యాబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: World Cup 2023: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే? -
ఆడేది 3 మ్యాచ్‌లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా టూర్లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు మూడు వేర్వేరు జట్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మూడు ఫార్మాట్లలో ముగ్గురు వెర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో రాహుల్.. టెస్టుల్లో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించారు. అయితే ప్రోటీస్‌తో వైట్ బాల్ సిరీస్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దూరమయ్యారు. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 17 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20లకు 17 మంది సభ్యులను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని చోప్రా అన్నాడు. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌చ కుల్దీప్ యాదవ్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇది సరైన నిర్ణయమే. రవీంద్ర జడేజాను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇది కాస్త ఆసక్తికర నిర్ణయం. కానీ కేవలం మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు 17 మంది ఆటగాళ్లు ఎందుకు? ఇప్పుడు తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం కూడా చాలా కష్టతరమవుతోంది. కనీసం నలుగురు ఆటగాళ్లు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమవుతారు. అటువంటి అంతమంది ఆటగాళ్లను దక్షిణాఫ్రికాకు పంపడం ఎందుకు "అని ప్రశ్నల వర్షం కురిపించాడు. దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. -
అంతా సాఫీగా సాగుతున్నప్పుడు హార్దిక్ ఫ్రాంచైజీ మారడం ఎందుకు..?
ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసింది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హార్దిక్ ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని, ట్రేడింగ్ అంటూ అతన్ని ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హార్ధిక్ ముంబై ఇండియన్స్‌కు వచ్చేస్తున్నాడని కొద్దిరోజుల ముందు నుంచే ప్రచారం జరిగినప్పటికీ ఆఖర్లో ప్రాంచైజీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఇందుకు నో చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అందుకే గుజరాత్ హార్దిక్‌ను రిటైన్ చేసుకుందని, ఈ లోపే ముంబై యాజమాన్యం జోక్యం చేసుకుని హార్దిక్‌ను సొంతగూటికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతుంది. అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారడమెందుకు..? ట్రేడింగ్ అనే టాపిక్కు ముందు అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారేందుకు ఎందుకు పచ్చ జెండా ఊపాడనే విషయం చర్చయనీయాంశంగా మారింది. టైటాన్స్‌ను అరంగేట్రం ఎడిషన్‌లోనే ఛాంపియన్‌గా, రెండో దఫా రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్.. అంతా సాఫీగా సాగుతుండగా ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడన్న విషయం అభిమానులకు అంతుపట్టడం లేదు. సోషల్‌మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం హార్దిక్‌కు-టైటాన్స్ మేనేజ్మెంట్కు రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ విషయమే హార్దిక్ ఫ్రాంచైజీ మార్పుకు ప్రధాన కారణమని సమాచారం. Once in a while life would give you an opportunity to choose between money and legacy. Whatever you choose will define you for the rest of your life. — Aakash Chopra (@cricketaakash) November 27, 2023 ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. హార్దిక్ రెమ్యూనరేషన్ కోసం ఫ్రాంచైజీ మారాడని పరోక్షంగా ఆరోపిస్తూ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కోసారి జీవితంలో డబ్బు, విలువల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎంచుకున్నదే మీ జీవితాంతం మిమ్మల్ని నిర్వచిస్తూ ఉంటుందని హార్దిక్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను పక్కన పెడితే అసలు హార్దిక్ ఫ్రాంచైజీ ఎందుకు మారాడన్న విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు చర్చనీయాంశంగా మారింది. -
వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించండి: టీమిండియా మాజీ ఓపెనర్
Ind Vs Aus 1st T20- Suryakumar Yadav: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో ‘స్కై’కి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ధాటికి ప్రత్యర్థి జట్టు తమ ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుందంటూ ఆకాశానికెత్తాడు. తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా కాగా రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సూర్య టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తొలిసారిగా భారత జట్టు పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్ గురువారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆదిలోనే జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 58 పరుగులతో అదరగొట్టగా... నాలుగో స్థానంలో దిగిన సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. నో బాల్‌తో విజయం ఖరారు మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 190కి పైగా స్ట్రైక్‌రేటుతో 80 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ ఆఖరి బంతికి షాట్ బాది(నో బాల్ వల్ల.. ఆ సిక్సర్ కౌంట్ కాలేదు) టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. సూర్య వచ్చాడంటే వ్యూహాలు మార్చాల్సిందే ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేలా ఉంటుంది. నార్మల్ బాల్ వేస్తే కచ్చితంగా షాట్ బాదుతాడు. మిడిలార్డర్లో తను బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే ప్రత్యర్థి ఫీల్డింగ్ మార్పులు చేసుకోవాల్సిందే. డీప్ ఫైన్ లెగ్.. మిడాన్ దిశగా థర్డ్‌మ్యాన్‌ను పెట్టాలి. సూర్య క్రీజులోకి వచ్చాడంటే తనకు తగ్గట్లు అప్పోజిషన్ టీమ్ అప్పటికప్పుడు తమ వ్యూహాలు మారుస్తూ పోవాలి. ఈ విషయంలో మిగతా బ్యాటర్లతో పోలిస్తే సూర్య మరింత ప్రత్యేకం’’ అని సూర్య ఆట తీరును ప్రశంసించాడు. వచ్చే ఆరునెలలు కేవలం టీ20లే ఆడించండి ఇక అంతకు ముందు జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా.. ప్రతి ఆటగాడిని మూడు ఫార్మాట్లు ఆడేలా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. సూర్యుకుమార్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను వారికి ప్రావీణ్యం ఉన్న ఫార్మాట్లకు పరిమితం చేయడం ద్వారా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. టెస్టు, వన్డే, టీ20లలంటూ అటూ ఇటూ తిప్పకుండా.. సూర్యను వచ్చే ఆర్నెళ్ల పాటు పొట్టి ఫార్మాట్లోనే వీలైనంత ఎక్కువగా ఆడించాలని ఆకాశ్ చోప్రా మేనేజ్మెంట్కు సూచించాడు. టీ20 స్పెషలిస్టుగా తన సేవలను విరివిగా వినియోగించుకుంటూ అతడి నైపుణ్యాలు మరింత మెరుగుపడేలా తీర్చిదిద్దాలని సలహా ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలైన సూర్య.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్లో తిరిగి బ్యాట్ పట్టగానే సునామీ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. చదవండి: రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా Captain Suryakumar Yadav's first match as #TeamIndia Captain presented an additional challenge 😉 How well does SKY remember his match-winning knock? 🤔 WATCH 🎥#TeamIndia | #INDvAUS pic.twitter.com/X9fLNQEqjw — BCCI (@BCCI) November 24, 2023 -
అశ్విన్‌ను ఆడించి తప్పు చేయకండి! సిరాజ్ కూడా వద్దు.. ఎందుకంటే?
ICC WC 2023- Ind Vs Eng: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ను ఆడించి తప్పుచేయొద్దని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. లక్నో పిచ్‌ను పొరపాటుగా అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి తెచ్చుకోకూడదని విజ్జప్తి చేశాడు. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్‌తో ఆదివారం పోటీపడనుంది. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పు.. ముఖ్యంగా అదనపు స్పిన్నర్‌ను ఆడించాలా లేదా అన్న అంశంపై మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలన్న నిర్ణయం సరైందే.. కానీ ‘‘ఇంగ్లండ్ వంటి జట్టుతో ఆడుతున్నపుడు.. ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలనుకోవడం సరైన నిర్ణయమే. లక్నో వంటి పెద్ద మైదానం.. కాబట్టి ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలనే అభిప్రాయాలు ఉండటమూ సహజమే. ఐపీఎల్లో ఇక్కడ బంతి టర్న్ అయింది కాబట్టి ఆఫ్ స్పిన్నర్‌ను ఆడిస్తే బాగుంటుందనుకోవడం మాత్రం సబబు కాదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ మాదిరి వికెట్ ఉండబోదు. అపుడు నల్లరేగడి మట్టితో పిచ్ రూపొందించారు. ఇది ఎర్రమట్టి పిచ్.. కాబట్టి కానీ ఇప్పుడు ఇది ఎర్రమట్టితో చేసిన పిచ్. దీని మీద బంతి బౌన్స్ అవుతుంది. పేస్ రాబట్టవచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పరిస్థితి మరింత మారిపోతుంది. ఒకవేళ మనం ముగ్గురు స్పిన్నర్ల సెకండ్ ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. మనకు తెలియకుండానే ప్రత్యర్థికి మంచి చేసిన వాళ్లం అవుతాం. లేదు కచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని భావిస్తే.. అశ్విన్ జట్టులోకి వస్తాడు. అలాంటపుడు పేసర్లు సిరాజ్.. షమీలలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నా ఓటు మాత్రం షమీకే. గత మ్యాచ్‌లో సిరాజ్ బాగానే బౌలింగ్ చేశాడు. సిరాజ్ వద్దు.. ఎందుకంటే అయితే, షమీ ఐదు వికెట్ల హాల్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్ దృష్ట్యా సిరాజ్ కంటే ముందున్న షమీని తుదిజట్టులోకి తీసుకోవాలి’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా తలపడిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ధర్మశాలలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రపంచకప్-2023లో షమీకి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తుది జట్ల అంచనా టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), బెయిర్‌స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్. చదవండి: హార్దిక్ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్ డేంజరస్ టీమ్! కాబట్టి మేము.. WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా? టెయిలెండర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్ ముగించాల్సింది. ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్స్‌కు అనుమతించేలా ఫీల్డింగ్ సెట్ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నలుగురైదుగురు సర్కిల్ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్ సెట్ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను కాపాడుకుందామని భావించావా? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్ పెట్టాలి.. సర్కిల్ లోపల ఎక్స్ట్రా ఫీల్డర్లను సెట్ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు. చెత్త కెప్టెన్సీ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సారథిగా బాబర్ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాక్‌పై సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కి టేబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. నీ వల్లే ఓటమి! ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్‌లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్ ఓటమికి బాబర్ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అతడి రాతే అంత ఈ సందర్భంగా పాకిస్తాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్ రాతే అంత. దుబాయ్ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా.. మెల్బోర్న్లో రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్లో కేశవ్ మహరాజ్.. అతడి బౌలింగ్‌లో అద్భుతం చేశారు. పాపం ప్రతిసారి నవాజ్ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్, మహ్మద్ నవాజ్లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్ ఆజం నవాజ్ వైపు మొగ్గు చూపాడు. ఊహించని షాకిచ్చిన కేశవ్ మహరాజ్ అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్ బౌలింగ్‌లో మొదటి బంతికి తబ్రేజ్ షంసీ సింగిల్ తీసి కేశవ్ మహరాజ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే.. రెండో బంతిని ఫోర్‌గా మలిచిన కేశవ్ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నవాజ్ మరోసారి బలిపశువు అయ్యాడు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి! అంతేతప్ప... అవతలి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడంలో అర్థం ఉండదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంచుమించు ఇదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాక్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. జరిగిన దాయాదుల సమరంలో రోహిత్ సేన సమిష్టి ప్రదర్శనతో బాబం ఆజం బృందాన్ని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అతడు కాస్త భిన్నం నీలి వర్ణంతో నిండిపోయిన స్టేడియంలో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానులకు సంతోషం పంచింది. ఇదిలా ఉంటే.. పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మిగతా ఆటగాళ్లకు కాస్త భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఉద్దేశించి కొంతమంది టీమిండియా ఫ్యాన్స్.. రిజ్వాన్ రీతిలోనే అతడికి కౌంటర్లు ఇచ్చారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో రిజ్వాన్‌ను ట్రోల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌కాగా భారత జట్టు అభిమానులపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. భారత్- పాక్ మ్యాచ్ అంటే వినోదం మాత్రమే కాదు ఇందుకు బదులుగా.. భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం.. కాబట్టి పరస్పరం కౌంటర్లు విసురుకోవడం సహజమే అని మరికొందరు దీనిని చిన్న విషయంగా కొట్టిపారేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ షమీని పాక్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ల వల్లే ఓడిపోయాం.. అది కూడా ఓ కారణమే అభిమానుల సంగతి ఇలా ఉంటే.. పాక్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలిపై బురదజల్లే ప్రయత్నం చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టుకైనా ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి.. ఇది ఐసీసీ ఈవెంట్‌లా కాదు బీసీసీఐ ఈవెంట్‌లా అనిపిస్తోందని విమర్శించాడు. ఇండియా- పాక్ మ్యాచ్ సందర్భంగా తాను ఒక్కసారి కూడా దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఓటమికి ఒక విధంగా టీమిండియాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతే కారణమని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. పాక్ ఆటగాళ్లు స్పందించనే లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా అభిమానులను ట్రోల్ చేస్తున్నవాళ్లు, మిక్కీ ఆర్థర్‌కు తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘మిక్కీ ఆర్థర్ తప్ప పాకిస్తాన్ ఆటగాళ్లెవరూ స్పందించలేదు. అయినా, కేవలం ఒక్క ఆటగాడి(రిజ్వాన్) విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందని అతడు ఆలోచించలేకపోయాడా? మిగతా వాళ్లు చక్కగా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు కదా! కొంతమంది 20-30 సెకన్ల వీడియోను ఆధారంగా చూపి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్ ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉన్న వాళ్లు. శ్రీలంక విషయంలో ఎందుకిలా? సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు.. సగం సగం వీడియోలతో అసలు నిజాన్ని దాచేసే ప్రయత్నాలు జరుగుతాయి. దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినిపించనేలేదని మిక్కీ ఆర్థర్ అంటున్నాడు. కొంతమందేమో ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతుగా నిలవాలని సూక్తులు చెబుతున్నారు. మరి శ్రీలంక విషయంలో ఎందుకలా మాట్లాడలేదు? హైదరాబాద్‌లో జరిగిన దానికి లంక జట్టు కూడా పాక్లాగ ఫిర్యాదులు చేయవచ్చు కదా! హైదరాబాద్‌లో జీతేగా భాయ్ జీతేగా అని డీజే పెట్టినపుడు.. ప్రేక్షకులంతా పాకిస్తాన్ జీతేగా అని పాక్ టీమ్‌కు మద్దతు పలికారు. శ్రీలంకకు అసలు సపోర్టు లేదు. అఫ్గనిస్తాన్‌కు ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు అదే విధంగా ఢిల్లీలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా చాలా మంది అఫ్గనిస్తాన్‌కు మద్దతుగా నిలిచారు. మరి అఫ్గన్ జలేబి గురించి ఇంగ్లండ్ కంప్లైట్ చేయొచ్చా’’ అంటూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు. కొంతమంది చర్యను మొత్తంగా భారత జట్టు అభిమానులకు ఆపాదించడం సరికాదని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘నిజం చెప్పారు.. టీమిండియా వరకు వచ్చే సరికే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు ఎందుకో? అందరిని సమానంగా చూడాలన్న వారు అందరి పట్ల ఒకే రీతిలో ఆలోచించాలి’’ అని ఆకాశ్ చోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరేమో ఇలాంటి సున్నిత అంశాల పట్ల ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరుతున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దూరం.. రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్!
ICC Cricket World Cup 2023- Ind Vs Aus: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలను బట్టి ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడని అర్ధం చేసుకోవచ్చన్నాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత భారత జట్టు ఐసీసీ ఈవెంట్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. చెన్నై వేదికగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో వరల్డ్‌కప్ జర్నీ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడటం ఆందోళనకరంగా మారింది. రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే! ఆసీస్‌తో మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్న గిల్ ఇప్పుడే జట్టుకు దూరమయ్యాడని చెప్పలేమని పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘శుబ్‌మన్ గిల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాహుల్ ద్రవిడ్ మాత్రం.. గిల్ పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదని.. అతడు జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్ నిజానికి రాహుల్ ద్రవిడ్ ఎప్పుడైతే ఇలా చెప్తాడో.. అలాంటి సందర్భాల్లో సదరు ఆటగాళ్లు దూరమవడం దాదాపు ఖాయమైపోయినట్లే లెక్క! నాకు తెలిసి రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిప్రాయపడ్డాడు. చేదువార్తే కదా! ఏదేమైనా రోహిత్‌తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పగల గిల్ దూరం కావడం భారత జట్టుకు బ్యాడ్ న్యూసే అవుతుందని ఈ మాజీ ఓపెనర్ విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో అటాకింగ్ మోడ్‌లో ఉన్న గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉండేదని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్‌నకు ముందు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో శుబ్ మన్ గిల్ వరుసగా 74, 104 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. చదవండి: అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ -
టెస్టుల్లో స్టోక్స్ కంటే బెస్ట్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్! కానీ..
Ben Stokes- Ravindra Jadeja: ‘‘రవీంద జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. అంతేనా.. 10 ఓవర్ల పాటు(వన్డేలో) బౌలింగ్ చేయడం కూడా గ్యారెంటీ. ఇక టెస్టుల్లో కేవలం టీమిండియా తరఫున మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తంలో ప్రస్తుతం అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్.. బెన్ స్టోక్స్ కంటే కూడా జడేజా బెస్ట్. ఎందుకంటే స్టోక్స్ ఎక్కువగా బౌలింగ్ చేయలేడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా జడేజాకు సొంతం. కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు కానీ అనుకున్నంత స్థాయిలో అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఏదేమైనా టెస్టుల్లో జడేజా బెస్ట్ ఆల్‌రౌండర్ అని కచ్చితంగా చెప్పగలను’’ అంటూ టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో ఇద్దరూ.. కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్ జడేజా, ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్.. ఇద్దరూ టెస్టుల్లో అత్యుత్తమ ఆల్రౌండర్లుగా కొనసాగుతున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జడ్డూ గత కొంతకాలంగా నంబర్ 1లో కొనసాగుతుండగా.. స్టోక్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. జడ్డూ, స్టోక్స్ గణాంకాలు ఇలా ఇక ఇప్పటి వరకు 67 అంతర్జాతీయ టెస్టులాడిన జడేజా.. 2804 పరుగులు చేయడంతో పాటు.. 275 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ 97 టెస్టుల్లో 6117 పరుగులు సాధించడంతో పాటు 197 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో బెస్ట్ ఎవరంటే తాను జడ్డూ వైపే మొగ్గు చూపుతానని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ పైవిధంగా స్పందించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సైకిల్లో జడ్డూ 13 టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 5- వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ అత్యుత్తమ గణాంకాలు 7/42. అదే విధంగా.. రెండు సెంచరీలు.. మూడు ఫిఫ్టీలతో 721 పరుగులు రాబట్టాడు. వన్డేల్లో రీఎంట్రీ.. రికార్డు సృష్టించి ఇక స్టోక్స్ విషయానికొస్తే.. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 18 మ్యాచ్‌లలో.. రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 971 పరుగులు సాధించాడు. అదే విధంగా 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ వన్డేల్లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. మూడో వన్డేలో ఏకంగా 182 పరుగులతో చెలరేగి ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు.. జడ్డూ ఆసియా వన్డే కప్-2023 ఆడాడు. వీరిద్దరు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఎలా ఆడాతారో చూడాలిక! చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి. అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్‌తో తొలి మ్యాచ్‌లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెంటికీ చెడ్డ రేవడి ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సంజూ శాంసన్ ఆసియా కప్‌లో అలా.. వరల్డ్కప్జట్టులో ఇలా కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్లో అతడిని దురదృష్టం వెక్కిరించింది. కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా? ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్‌లో రిజర్వ్‌గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇషాన్‌కు వరుస అవకాశాలు ఇషాన్ మిడిలార్డర్లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్‌కప్ టీమ్‌లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్‌లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ -
పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..
Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పాక్ పేసర్ల ధాటికి పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో నేపాల్‌పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంటే ఇందులో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు. షమీ- శార్దూల్ (PC: BCCI) ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్‌లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు. పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే ‘‘బౌలింగ్ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలి. గత మ్యాచ్ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి. అలా కాకుండా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్‌ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్‌బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్‌లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు. రిజర్వ్ డే కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డేను కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్‌లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? -
మేటి బ్యాటర్లను సైతం వణికించాడు.. కానీ ఇలా: టీమిండియా మాజీ ఓపెనర్
Aakash Chopra pays tribute to Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, దివంగత హీత్ స్ట్రీక్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. స్ట్రీక్ బౌలింగ్ చేస్తుంటే మేటి బ్యాటర్లు సైతం వణికిపోయేవారని గుర్తుచేసుకున్నాడు. జింబాబ్వేకు దొరికిన క్రికెట్ ఆణిముత్యం ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోక తప్పదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడంటూ కొన్ని రోజుల క్రితం నకిలీ వార్త చక్కర్లు కొట్టిన విషయం విదితమే. స్ట్రీక్ సహచర క్రికెటర్ ఒలంగో చేసిన ట్వీట్ గందరగోళానికి దారితీయడంతో.. తాను బతికే ఉన్నానంటూ స్వయంగా అతడు మీడియాకు వెల్లడించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 49 ఏళ్ల వయసులోనే లోకాన్ని వీడాడు కానీ.. రోజుల వ్యవధిలోనే హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని అతడి భార్య బయటపెట్టడంతో మళ్లీ కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. తన బౌలింగ్ నైపుణ్యాలతో దిగ్గజ బ్యాటర్లను హడలెత్తించిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ క్యాన్సర్‌తో పోరాడి ఓడి.. 49 ఏళ్ల వయసులోనే కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే లెజెండ్ ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. హీత్ స్ట్రీక్‌కు నివాళి అర్పిస్తూ.. ‘‘హీత్ స్ట్రీక్ ఇకలేడు. గతంలో ఓసారి ఇలాంటి వార్త నకిలీదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈసారి నిజంగానే తను లేడు. గొప్ప ఆటగాడు. ఏమాత్రం సందేహం లేకుండా.. అతడిని మనం జింబాబ్వే లెజెండ్ అని పిలవవచ్చు. ఈ మాట నేను అంటున్నది కాదు.. అతడు నిజంగానే ఓ దిగ్గజం. జింబాబ్వే క్రికెట్‌కు దొరికిన అత్యంత గొప్ప క్రికెటర్లతో ఒకడు. మేటి బ్యాటర్లను సైతం హడలెత్తించాడు బౌలింగ్‌లో తనకు తానే సాటి. హరారేలో అతడు బౌలింగ్ చేస్తున్నాడంటే హడలెత్తిపోని బ్యాటర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. మేము జింబాబ్వే పర్యటనకు వెళ్లినపుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. హీత్ స్ట్రీక్ బ్యాటింగ్ కూడా గొప్పగా ఉండేది. అందుకే అభిమానులతో పాటు అతడి సమకాలీన క్రికెటర్లు కూడా ఆరాధ్యభావంతో చూసేవారు. కానీ ఇలా చిన్న వయసులోనే స్ట్రీక్ వెళ్లిపోవడం బాధాకరం. ఓడిపోయాడు.. మై ఫ్రెండ్ రెస్ట్ ఇన్ పీస్ క్యాన్సర్‌తో పోరులో అతడు ఓడిపోవడం నిజంగా దురదృష్టకరం. మై ఫ్రెండ్.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి హీత్. నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని విచారం వ్యక్తం చేశాడు. పదమూడేళ్లపాటు దిగ్విజయంగా కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. 89 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. టీమిండియాను ఓడించి టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి ఈనాటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పలు మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన హీత్ స్ట్రీక్ 4 వేల పరుగులు చేయడం విశేషం. ఇక 2001లో స్ట్రీక్ కెప్టెన్సీలో జింబాబ్వే.. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా సెప్టెంబరు 3న హీత్ స్ట్రీక్ కన్నుమూసిన విషయం విదితమే. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
బ్యాటింగ్ ఆధారంగా బౌలర్లను సెలక్ట్ చేస్తారా.. నిజమా?: మాజీ బ్యాటర్
India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు. కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కాదని.. ఆల్‌రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. చహల్‌కు నో ఛాన్స్ కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్‌లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా! అదే విధంగా.. ‘‘బ్యాటింగ్‌లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్‌రౌండర్‌ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు. టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు. లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అగార్కర్ రీజన్ ఇదీ కాగా చహల్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. -
WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?
Former Cricketer Comments On India's provisional World Cup squad Reports: టీమిండియా సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్‌కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్ట్ చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కాలేదని వాపోయాడు. యువ సంచలనం తిలక్ టీమిండియా యువ సంచలనం తిలక్.. వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 173 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్. ఇక దేశవాళీ వన్డేల్లోనూ తిలక్ రికార్డు మెరుగ్గా ఉంది. దేశవాళీ వన్డేల్లో హిట్ ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. మొత్తంగా ఐదు సెంచరీలు, 5 అర్ధ శతకాల సాయంతో 101.64తో 1236 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎడమచేతి వాటం తిలక్ వర్మకు ఉన్న అదనపు అర్హతగా పేర్కొంటూ ఆసియా వన్డే కప్ టోర్నీకి అతడిని ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అయితే, ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన భారత జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కలేదు. అదే విధంగా.. నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ ఆడించే పరిస్థితి కనబడటం లేదు. మరోవైపు.. వరల్డ్‌కప్-2023కి ఇదే ప్రొవిజినల్ జట్టు అన్న బీసీసీఐ.. 15 మంది సభ్యుల టీమ్ నుంచి తిలక్ వర్మతో పాటు యువ పేసర్ ప్రసిద్ కృష్ణను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌తో తిలక్ వర్మ సూర్యకుమార్ వన్డే జట్టులో అవసరమా? ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘సూర్యకుమార్ ఆటంటే నాకూ ఇష్టమే. కానీ అతడిని వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. ఒకవేళ పార్ట్‌టైమ్ స్పిన్నర్లు కావాలనుకుంటే.. అతడు బౌలింగ్ చేయలేడు కదా! తిలక్‌ను ఎందుకు సెలక్ట్ చేశారు? వన్డేల్లో అతడి రికార్డు కూడా ఏమాత్రం బాగోలేదు. ఆసియా కప్ జట్టులో తిలక్ వర్మకు చోటిచ్చారు. అసలు అప్పుడు అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు? పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించలేదు. నేపాల్‌తో ఆడే జట్టులోనూ అతడికి చోటు దక్కకపోవచ్చు. తిలక్‌కు వన్డే ప్రపంచకప్ ప్రొవిజినల్ జట్టులో స్థానం ఇవ్వనపుడు ఆసియా కప్‌కు ఎంపిక చేసి ఉపయోగం ఏమిటి?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై టీమిండియా.. అదే విధంగా.. శార్దూల్ ఠాకూర్‌ను నంబర్ 8 బ్యాటర్‌గా దింపే క్రమంలో ప్రసిద్ కృష్ణకు కూడా ఉద్వాసన పలికి ఉంటారని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆసియా వన్డే కప్-2023కి భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: ఆసియాకప్ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! -
అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్‌ను ఎవరూ ఆపలేరు! ప్రత్యర్థికి చుక్కలే!
Asia Cup 2023: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్ ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా... గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీతో పాటు నూర్ అహ్మద్‌కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ దొరికితే ఇక అంతే సంగతులు. ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్ అహ్మద్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు అహ్మద్‌ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్, నబీ, ముజీబ్ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్ స్పిన్ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్‌కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురి రికార్డు ఇలా కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్ ఉర్ రహ్మాన్ 64 మ్యాచ్‌లలో 91, మహ్మద్ నబీ 145 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్‌తో లాహోర్‌లో అఫ్గన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023 అఫ్గనిస్తాన్ జట్టు ఇదే హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం!
Asia Cup- ICC ODI World Cup 2023: ‘‘వాషింగ్టన్ సుందర్.. అతడి పేరునే పరిగణనలోకి తీసుకోలేదు. ఆసియా కప్ జట్టులో అతడికి చోటు ఇవ్వలేదు. నిజానికి జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి సుందర్ గురించి చర్చ జరగడం సబబే. జట్టులో ఒకటీ అరా మార్పులు ఉండవచ్చు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించవచ్చని జోస్యం చెప్పాడు. ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉన్న వేళ మెగా ఈవెంట్ సమయానికి సుందర్‌కు పిలుపు రావొచ్చని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం.. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో లెఫ్టాండర్లను ఎదుర్కొనేందుకు టీమిండియాకు తప్పక ఆఫ్ స్పిన్నర్ల అవసరం ఉంటుందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. కాగా 2017లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తమిళనాడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన వాషీ.. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 4 టెస్టులు(6 వికెట్లు), 16 వన్డేలు(16 వికెట్లు), 37 టీ20 మ్యాచ్‌లు(29 వికెట్లు) ఆడాడు. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో రాణించడం అతడికి ఉన్న అదనపు అర్హత. వాళ్లంతా ఆసియా కప్ జట్టులో అయితే, ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్‌కు ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. 17 మంది సభ్యుల జట్టులో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేశారు. రోహిత్ శర్మ చెప్పాడు కదా! ఇక ఆసియా కప్ జాబితా నుంచే వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌లకు దారులు మూసుకుపోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు రాబట్టడం అతడికి ఉన్న ప్లస్ పాయింట్. ఒకవేళ సుందర్ గనుక మెగా ఈవెంట్‌కు ముందు ఆడే మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్‌గా తనను తాను నిరూపించుకుంటే తప్పక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న టెంప్టింగ్ ఆప్షన్ తనే’’ అని పేర్కొన్నాడు. ఐర్లాండ్ పర్యటనలో కాగా ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న 23 ఏళ్ల వాషింగ్టన్ సుందర్.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. డబ్లిన్‌లో బుధవారం జరిగే ఆఖరి టీ20లో గనుక సత్తా చాటితేనే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకుని మెరుగ్గా రాణిస్తేనే సుందర్ వరల్డ్‌కప్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. కోహ్లి తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. అతడి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ -
ఇప్పుడు హసరంగా.. మొన్న హేల్స్! ప్రపంచ క్రికెట్లో అసలేం జరుగుతోంది?
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా ఇటీవల టెస్టుక్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. వైట్ బాల్ ఫార్మాట్లపై దృష్టి సారించేందుకు హసరంగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయితే హసరంగా నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. హసరంగాపై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ ఆడడం తనకుకు ఇష్టం లేదని హసరంగా బహిరంగంగా చెప్పాడు. అతడికి కేవలం 26 ఏళ్ల మాత్రమే. ఈ వయస్సులో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమా? అలెక్స్ హేల్స్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏం జరుగుతోంది? అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించాడు. ఇక హసరంగా వైట్‌బాల్ కెరీర్ గురించి చోప్రా మాట్లాడుతూ.. అతడు టీ20 క్రికెట్లో అద్బుతమైన అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంకకు అతడు కీలకం. అయితే టెస్టు క్రికెట్లో ఆడకుండా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టిపెడతనడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఇక 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. చదవండి: CPL 2023: విండీస్ బ్యాటర్ భారీ సిక్సర్.. దెబ్బకు పాక్ బౌలర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్
Hardik Pandya underwhelming all-round performances: టీమిండియా ‘స్టార్’ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. ఇటీవలి కాలంలో వన్డేల్లో అతడి ప్రదర్శన ఆశించదగ్గ రీతిలో లేదని విమర్శించాడు. వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్‌కు ముందు కీలక ఆటగాడు ఇలా విఫలం కావడం ఆందోళనకు గురిచేసే అంశం అన్నాడు. తాత్కాలిక కెప్టెన్‌గా కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యా భారత జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు వన్డేలు, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాండ్యా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలం అయితే, ఆల్‌రౌండర్‌గా.. కెప్టెన్‌గానూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచినప్పటికీ.. పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్‌లో మాత్రం విండీస్ చేతిలో 3-2తో పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వెస్టిండీస్ టూర్ తర్వాత హార్దిక్ ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అటుపై భారత్ వేదికగా ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యట్యూబ్ చానెల్ వేదికగా హార్దిక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ ‘‘దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గా అదరగొట్టగలిగిన వాడు. బౌలింగ్.. బ్యాటింగ్.. అదో ప్యాకేజ్! అయితే.. హార్దిక్ ఈ రెండింటిలోనూ ఇంకా మెరుగ్గా రాణించగలడు. నిజానికి వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడినపుడు అందరూ యువ ఆటగాళ్ల గురించే మాట్లాడారు. కానీ పాండ్యా గురించి ఇంతవరకు పెద్దగా చర్చించడమే లేదు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాడిపైనే ఎక్కువ ఫోకస్ ఉండాలి. గత 10 వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగినదిగా లేదు. స్ట్రైక్‌రేటు గురించి కూడా మాట్లాడాలి వెస్టిండీస్‌తో మూడో వన్డేలో 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా ఆరంభమైందో తెలిసిందే! అయితే, ఆఖర్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. ఇక మరో మ్యాచ్‌లో 12 బంతుల్లో 14 పరుగులు.. కేవలం రెండు ఇన్నింగ్స్‌లో మాత్రమే అతడు ఎదుర్కొన్న బంతుల కంటే పరుగులు ఎక్కువగా ఉన్నాయి. ఫినిషర్‌గానే కీలక పాత్ర వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించాలి. కాబట్టి స్ట్రైక్‌రేటు గురించి చర్చించక తప్పదు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషర్‌గా తన నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గత 10 వన్డే ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 97.22 స్ట్రైక్‌రేటుతో 280 పరుగులు చేయగలిగాడు. గత నాలుగేళ్లుగా 100కు స్ట్రైక్‌రేటు మెయింటెన్ చేస్తున్న అతడి ప్రస్తుత గణాంకాలు ఆశించిన రీతిలో లేవన్నది వాస్తవం. ఇదిలా ఉంటే... ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
ఐపీఎల్లో ఆడితే.. వరల్డ్‌కప్ గెలిచినట్లా? వాళ్లిద్దరికి రెస్ట్ అవసరమా?
India tour of West Indies, 2023: ‘‘మన వాళ్లు అంతర్జాతీయ టీ20లను సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఐర్లాండ్‌కు వెళ్లడం లేదన్నది వాస్తవం. ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమే. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు మనం 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో ఆడితే.. వరల్డ్‌కప్ గెలిచినట్లా? ఐపీఎల్ గురించి మనకు అనవసరం. లీగ్ క్రికెట్లో మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచినంత మాత్రాన వరల్డ్‌కప్ గెలిచినట్లు కాదు కదా! మనం ఇంతవరకు కేవలం ఒక్కసారి మాత్రమే పొట్టి ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచాం. అది కూడా ఐపీఎల్ లేనప్పుడు మాత్రమే!’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా మేజర్ ఈవెంట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసే పరిస్థితి లేదన్నాడు. యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్‌లను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. సమయం ఉంది కదా! రెస్ట్ ఎందుకు? కాగా వెస్టిండీస్ టూర్లో 3-2తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా తదుపరి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగష్టు 18- 23 వరకు మూడు టీ20లు ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు అక్కడికి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం మనకు ముఖ్యం. ఐర్లాండ్ వంటి జట్టుతో మూడు టీ20లు ఆడుతున్నారంటే.. ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఎందుకు? విండీస్‌తో మూడో టీ20 నుంచే అతడికి రెస్ట్ ఇచ్చారు. నాకైతే అర్థం కావడం లేదు ఐర్లాండ్‌కు కూడా పంపడం లేదు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆసియా వన్డే కప్ ఆరంభం నాటికి తిరిగి వస్తే ఇషాన్ పరిస్థితి ఏంటి? ఐర్లాండ్ సిరీస్ ఆగష్టులోనే ముగుస్తుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబరులో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ అతడిని బ్యాకప్ వికెట్ కీపర్‌గా భావించినా.. ఆసియా కప్ నాటికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఫిట్‌గా ఉన్న యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని విస్మయం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో టీమిండియా నాలుగో టీ20 ముగిసిన తర్వాత ఈ మేరకు ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో హార్దిక్ సేనపై ఘన విజయం సాధించిన కరేబియన్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతకు ముందు టీమిండియా 1-0తో టెస్టు, 2-1తో వన్డే సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్.. ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? -
Asia Cup 2023: భారత మాజీ ఓపెనర్‌కు బిగ్‌షాక్
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2023కు సమయం అసన్నమవుతోంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తమ జట్లను కూడా ప్రకటించాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో భాగమయ్యే కామేంటేటర్ల జాబితాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఈవెంట్లో పాల్గోనే మొత్తం 5 దేశాల నుంచి 12 మంది వ్యాఖ్యాతలను ఏసీసీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వాఖ్యత ఆకాశ్ చోప్రాకు చోటుదక్కకపోవడం గమానార్హం. ఈ కామేంటరీ ప్యానల్లో భారత నుంచి గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ , దీప్ దాస్‌గుప్తాకు చోటు దక్కగా.. పాకిస్తాన్ నుంచి వసీం అక్రమ్, వకార్ యూనిస్, బాజిద్ ఖాన్, రమీజ్ రాజాలకు అవకాశం లభించింది. అదే విధంగా బంగ్లాదేశ్ నుంచి అథర్ అలీ ఖాన్, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్ కూడా కామేంటరీ ప్యానల్లో భాగమయ్యారు. మరోవైపు స్కాట్ స్టైరిస్ తటస్థ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక సెప్టెంబర్ 2న యావత్తు క్రికెట్ ప్రపంచం ఎదురుచూసే దాయాదుల పోరు పల్లెకెలె వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వాల్సిన అవసరం లేదు! ఇక ఆపేయండి -
ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వాల్సిన అవసరం లేదు! ఇక ఆపేయండి
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా సారథిగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా గయానా వేదికగా జరిగిన మూడో టీ20 అనంతరం భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయనీవ్వకుండా హార్దిక్ మ్యాచ్ ఫినిష్ చేయడమే ఇందుకు కారణం. తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్‌గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్‌ను దారుణంగా ట్రోలు చేశారు. అయితే విషయంలో హార్దిక్ తీరును కొంతమంది తప్పుబడతుంటే, మరి కొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీడీ డివిలియర్స్ వంటి వారు హార్దిక్‌కు సపోర్ట్‌గా నిలిచారు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. దీనిపై ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "దీనిపై హార్దిక్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దారుణంగా ట్రోలు చేయబడ్డాడు.అయితే కొంతమంది మధ్యలో టీ20 క్రికెట్లో మైలురాళ్ల గురించి మాట్లాడుతున్నారు. అస్సలు అది అవసరం లేని చర్చ. రికార్డులకంటే యువ ఆటగాడిలో స్పూర్తి నింపడం మన బాధ్యత. నాకు బాగా గుర్తుంది. 2014 టీ20 ప్రపంచకప్‌లో ధోనికి ఇదో పరిస్ధితి ఎదురైంది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్‌తో అవతలి ఎండ్‌లో ఉన్నాడు. అయితే ధోని మాత్రం విరాట్‌ను హీరోను చేయాలని భావించాడు. అందుకే అతడికి మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం వచ్చినప్పటికీ..ఫార్వర్డ్ డిఫెన్సివ్ షాట్ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చాడు. కోహ్లి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ధోనినే తనకు ఆదర్శమని హార్దిక్ చాలా సందర్బాల్లో చెప్పాడు. ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వల్సిన అవసరం లేదు . ఎందుకు ఈ అనవసర చర్చలు అపేయండి అంటూ తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా మూడో టీ20 అనంతరం కూడా హార్దిక్‌ను ఉద్దేశించి చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. తిలక్ వర్మకు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసే అవకాశం హార్దిక్ ఇచ్చి ఉంటే బాగుండేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. యువ సంచలనం ఎంట్రీ! స్టార్ ఆటగాడిపై వేటు -
అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే!
Sanju Samson's career- ODI World Cup: కేఎల్ రాహుల్ పునరాగమనం చేస్తే సంజూ శాంసన్‌కు మెగా ఈవెంట్లలో దారులు మూసుకుపోతాయని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టిన రాహుల్.. ఒకవేళ ఆసియా కప్ ఆరంభం నాటికి తిరిగిరాకపోతే మాత్రం ఈ కేరళ బ్యాటర్‌కు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023లో మాత్రం సంజూను ఆడించే పరిస్థితి లేదని స్పష్టం చేశాడు. పంత్ దూరం కావడంతో వాళ్లకు ఛాన్స్ కాగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో టెస్టుల్లో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేస్తున్నారు. ఇక రాహుల్ కూడా గాయపడిన తరుణంలో ఇషాన్ కిషన్‌తో పాటు సంజూ శాంసన్‌కు కూడా వికెట్ కీపర్ కోటాలో జట్టులోకి వస్తున్నారు. అయితే, కేఎల్ రాహుల్ సర్జరీ అనంతరం కోలుకుని ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆసియా వన్డే కప్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే వార్తలు వినిపిస్తున్నా.. వరల్డ్‌కప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ వస్తే సంజూకు మెగా ఈవెంట్లలో అవకాశం రాకపోవచ్చు. సంజూ శాంసన్ రాహుల్ తిరిగి వస్తే అంతే ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాదిరే సంజూ శాంసన్ కెరీర్ కూడా అర్ధాంతరంగా ముగిసిపోనుందా? అంటూ ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఆకాశ్ చోప్రాకు ప్రశ్న ఎదురైంది. అందుకు బదులిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే మాత్రం వరల్డ్‌కప్ జట్టులో సంజూ శాంసన్‌కు చోటు ఉండే ప్రసక్తే లేదు. ఆసియా కప్ టోర్నీలో ఆడే అవకాశాలు కూడా తక్కువే. ఒకవేళ రాహుల్ పూర్తిగా కోలుకోకుంటే అప్పుడు సంజూకు ఛాన్స్ ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ రాకపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ అయితే, సంజూకు ఇప్పుడు కేవలం 28 ఏళ్లేనన్న ఈ మాజీ ఓపెనర్.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024, ఆ తర్వాత కూడా అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. త్రీడీ ప్లేయర్ అంటూ ఛాన్స్.. నాడు రాయుడికి అన్యాయం కాగా 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో టీమిండియా స్టార్ అంబటి రాయుడికి జట్టులో చోటిస్తారని అంతా భావించారు.. కానీ అనూహ్యంగా 3డీ ప్లేయర్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్)గా ఉపయోగపడతాడంటూ అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తీవ్ర విమర్శల పాలయ్యారు. విజయ్ శంకర్ ఇక ప్రతిభా ఉన్న ప్రపంచకప్ జట్టులో ఆడే ఛాన్స్ రాకపోవడంతో అంబటి రాయుడు కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయిందని అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన అంబటి రాయుడు.. ఇటీవలే ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు. చదవండి: తిలక్ వద్దు!? వరల్డ్‌కప్ టోర్నీలో నంబర్ 4లో సూర్య సరైనోడు! అతడిని ఆడిస్తే.. -
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇషాన్, సంజూలను దాటి అతడు దూసుకొస్తాడు!
West Indies vs India, 3rd T20I: వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే.. తర్వాత బాధపడాల్సి వస్తుందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సంజూ శాంసన్.. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుని జాగ్రత్తపడకపోతే జితేశ్ శర్మ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లు అతడి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని హెచ్చరించాడు. కాగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అదరగొడుతున్న కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా తరఫున మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. సంజూకు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేసిన అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సంజూ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నేపథ్యంలో సెలక్టర్లు అతడికి జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో సంజూకు తొలి వన్డేలో ఆడే అవకాశం రాకపోగా.. తదుపరి మ్యాచ్‌లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో మిగతా బ్యాటర్లు కూడా చెలరేగిన పిచ్‌పై 51 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి మళ్లీ పాత కథే పునరావృతమైంది. తొలి టీ20లో 12 పరుగులకే పెవిలియన్ చేరిన సంజూ శాంసన్.. రెండో మ్యాచ్‌లో 7 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. సంజూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సంజూ శాంసన్.. నీకిచ్చిన అవకాశాలను అనవసరంగా వృథా చేసుకోకు. మళ్లీ విఫలమయ్యావంటే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్‌తో మాత్రమే పోటీ అనుకోవద్దు.. ఇషాన్ ఎక్కువా.. సంజూ తక్కువా అని కాదు. వీరిద్దరిని దాటి జితేశ్ శర్మ కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా సంజూకు వార్నింగ్ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే తొలి రెండు టీ20లలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో గయానా వేదికగా సాగనున్న మూడో టీ20లో విజయం సాధిస్తేనే హార్దిక్ సేన సిరీస్‌ను కాపాడుకోగలిగే స్థితిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూపై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ -
'నువ్వు ధోనివి కాదు'.. ఇషాన్ కిషన్ అదిరిపోయే రిప్లై
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో అర్థసెంచరీలు బాదిన ఇషాన్ అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు వన్డేలు కలిపి 184 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. ఇషాన్ కిషన్ కీపింగ్‌ను ఎంఎస్ ధోనితో పోల్చాడు. "స్టంపింగ్, రనౌట్ లను రివ్యూ చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకైతే అతని పాదం గ్రౌండ్ పైనే ఉంది. ఇషాన్ నువ్వు కూడా రాంచీ నుంచే వచ్చి ఉండొచ్చు కానీ.. నీ పేరు ఎమ్మెస్ ధోనీ కాదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆ వెంటనే స్పందించిన ఇషాన్.. హా, ఫిర్ ఠీక్ హై (హా సరే అయితే) అని అనడం'' స్టంప్ మైక్ లో వినిపించింది. అది విని పక్కనే ఉన్న మరో ఇద్దరు కామెంటేటర్లు నవ్వారు. ఆకాశ్ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత "ఇషాన్ ఆన్సర్ కూడా ఇచ్చేశాడు.. హౌ స్వీట్ ఇషాన్. వీ లవ్ యూ" అని ఆకాశ్ అన్నాడు. దానికి కూడా ఇషాన్ స్పందిస్తూ.. హా సరే అయితే అని మళ్లీ అన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. We love you, Ishan 🤗 @JioCinema #WIvsIND #CricketTwitter pic.twitter.com/UnzHz1pth1 — Aakash Chopra (@cricketaakash) August 1, 2023 చదవండి: Australian Open 2023: క్వార్టర్స్‌లో పీవీ సింధు.. ఫామ్‌లోకి వచ్చినట్లేనా!, శ్రీకాంత్, ప్రణయ్ కూడా Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు -
టీ20 వరల్డ్‌కప్ మాదిరే ఈసారి కూడా! ఇషాన్‌ను ఆడిస్తే రోహిత్ ‘డ్రాప్’.. మరి కోహ్లి?
India's decision-making ahead of the WC 2023 Big Worry Is: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి టీమిండియా సన్నద్ధత సరిగా లేదంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. మెగా ఈవెంట్‌కు ముందు అనవసర ప్రయోగాలతో సమయం వృథా చేస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో అత్యుత్తమ తుదిజట్టు కూర్పు.. ముఖ్యంగా టాపార్డర్ విషయంలో తడబాటుకు లోనుకావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నాడు. పిచ్చి ప్రయోగాలతో భారీ మూల్యం కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఈ క్రమంలో మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో మరో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, విండీస్‌లో పిచ్చి ప్రయోగాలకు పోయి టీమిండియా భారీ మూల్యం చెల్లించిన సంగతి తెలిసిందే. తొలి వన్డే లోస్కోరింగ్ మ్యాచ్‌లో ఎలాగోలా గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి.. వన్డే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించని విండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆగష్టు 1 నాటి నిర్ణయాత్మక మూడో వన్డేలో గనుక తేడా జరిగితే.. ఘోర పరాభవం తప్పదు. టీ20 వరల్డ్‌కప్ మాదిరే జరగదు కదా! ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 వరల్డ్‌కప్-2022లో భారత జట్టు కుప్పకూలిన విధానం గుర్తుకువస్తోంది. మళ్లీ అదే పునరావృతం కాబోతోందా అన్న సందేహం నన్ను ఆందోళనకు గురి చేస్తోంది’’ అని పేర్కొన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో సెమీస్‌లోనే రోహిత్ సేన ఇంటిబాట పట్టిన తీరును ప్రస్తావించాడు. రోహిత్‌ను డ్రాప్ చేస్తే.. మరి కోహ్లి? ఇక.. బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు సరికావన్న ఆకాశ్ చోప్రా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదిరే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఆశ్చర్యకర విషయం మరొకటి ఉండదు. కిషన్- శుబ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేస్తే రోహిత్‌ను మిడిలార్డర్‌కు డ్రాప్ చేస్తారా? ఇలాంటి నిర్ణయాలతో నేనైతే అస్సలు ఏకీభవించను. అలా జరగడానికి వీల్లేదు ఒకవేళ ఇదే జరిగితే.. విరాట్ కోహ్లిని నంబర్ 3 నుంచి తప్పించి తనను కూడా మిడిలార్డర్‌కు పంపించాల్సి వసుంది. ఇది అస్సలు సాధ్యమయ్యే పనే కాదు’’ అని ఆకాశ్ చోప్రా.. మేనేజ్మెంట్ తీరును ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్- కిషాన్లతో లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఇషాన్‌ను నాలుగో స్థానంలో ఆడించాలనుకున్నా.. అతడి నంబర్ 4 గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్నాయంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! అసలు బుమ్రాకు ఏమైందని? పంత్ ఇన్నాళ్లుగా! డబ్బుంటే సరిపోదు: టీమిండియా దిగ్గజం -
ఇషాన్‌ను ఎందుకు తీసుకున్నట్లు? ఫిఫ్టీ సాధించడం గొప్పేమీ కాదు: మాజీ క్రికెటర్
India tour of West Indies, 2023: ‘‘నిజానికి ఇషాన్ కిషన్ నంబర్ 4లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే అతడికి వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కింది. రెండో ప్రధాన కీపర్‌గా అతడికి ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి మిడిలార్డర్లో ఆడిస్తే బాగుండేది. తొలి వన్డేలో అతడిని ఓపెనర్‌గా దింపారు. ఫిఫ్టీ చేయడం గొప్పేమీ కాదు హాఫ్ సెంచరీ సాధించాడు. బాగానే ఉంది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన వాడు ఈ మాత్రం స్కోర్ చేయడం గొప్పేం కాదు. వాస్తవానికి.. సంజూ శాంసన్ లేదంటే ఇషాన్ కిషన్.. ఈ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఎవరికి అవకాశం ఇస్తారన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సూర్య ఇలా వచ్చి అలా! కాబట్టి వికెట్ కీపర్‌గా ఇషాన్‌ను ఆడించినపుడు ఓపెనర్‌గా పంపడమెందుకో అర్థం కాలేదు. ఓపెనింగ్ స్థానంలో అతడు 50 చేసినా అదేమంత గొప్ప విషయం కానేకాదు. ఎందుకంటే ఇప్పటికే ఓపెనర్‌గా ఇషాన్ తనను తాను నిరూపించుకున్నాడు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో సంజూ శాంసన్‌ను కాదని ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల కొత్తగా ఒరిగిందేమీ లేదన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌ను వన్‌డౌన్‌లో ఆడించడంపై ఈ మాజీ ఓపెనర్ స్పందిస్తూ.. ‘‘పర్లేదు.. తన బ్యాటింగ్ బాగానే ఉంది. కానీ అతడు అవుటైన విధానం అస్సలు నచ్చలేదు. తొలుత స్వీప్ షాట్‌తో ఫోర్.. మళ్లీ స్వీప్ షాట్.. ఆపై మరో స్వీప్.. తర్వాత కూడా అదే తీరు.. ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు! ఒకే తరహాలో నాలుగు షాట్లు ఆడి అలా వెళ్లిపోయాడు’’ అంటూ పెదవి విరిచాడు. కాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బార్బడోస్‌లో టీమిండియా జయభేరి మోగించిన విషయం తెలిసిందే. గిల్ మరోసారి విఫలం ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించాడు. టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచి 5 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ రాకతో కేరళ బ్యాటర్ సంజూకు జట్టులో చోటు కరువు కాగా.. రెగ్యులర్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా మేనేజ్మెంట్ ప్రయోగం చేసిన తీరుపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టుల్లో విఫలమైన గిల్ ఈ మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచాడు. 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక సూర్య 19, హార్దిక్ పాండ్యా 5, రవీంద్ర జడేజా 16(నాటౌట్), శార్దూల్ ఠాకూర్(1), రోహిత్ శర్మ 12(నాటౌట్) పరుగులు సాధించారు. ఇక విండీస్- భారత్ మధ్య శనివారం రెండో వన్డే బార్బడోస్‌లో జరుగనుంది. చదవండి: యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే.. అస్సలు ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. కిషన్‌కు నో ఛాన్స్! శాంసన్ వైపే మొగ్గు
బార్బోడస్ వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఇవాళ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అదే జోరును వన్డేల్లో కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు హెట్‌మైర్, థామస్ వంటి సీనియర్ల రాకతో కలకలాడుతున్న విండీస్.. టెస్టు సిరీస్ ఓటమికు బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో విండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టులో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చాడు. "నా వరకు అయితే టీమిండియా ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ప్రారంభిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొంతమంది కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలని భావిస్తున్నారు. కానీ అలా జరగదు. ఎందుకంటే అతడికి పూర్తిగా జట్టులోనే చోటు దక్కదు. ఇక మూడో స్ధానంలో విరాట్ కోహ్లి ఎలాగూ ఉంటాడు. వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ బ్యాటింగ్ రావాలి. అదే విధంగా ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో ఉండాలి. అక్షర్ పటేల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. జడ్డూ, అక్షర్‌కు తోడుగా కుల్దీప్ను మరోస్పిన్నర్గా జట్టులోకి తీసుకోవాలి. ఈ మ్యాచ్‌కు శార్ధూల్ ఠాకూర్ అవసరం లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉంటాడు. మరోవైపు సిరాజ్ అందుబాటులో లేడు కాబట్టి జయదేవ్ ఉనద్కట్‌ను ఆడించాలి. మరోవైపు స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులో చోటువ్వాలి. కచ్చితంగా అతడు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని" ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ -
Ind vs WI: వాళ్లిద్దరు ఉంటే అంతే! మ్యాచ్ డ్రా అయినా చాలనుకుంటే మాత్రం..
West Indies vs India, 2nd Test: ‘‘అశ్విన్ ఇప్పటికే రెండు వికెట్లు తీశాడు. ఆఖరి రోజు ఆటలో జడేజా కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఐదో రోజు వీరిద్దరికి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నా అభిప్రాయం. రెండు లేదంటే మూడో సెషన్లో అశ్విన్, జడేజా కీలకం కానున్నారు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రతిఘటిస్తున్న ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌తో రెండో టెస్టు చివరి అంకానికి చేరుకున్న తరుణంలో భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా విండీస్- టీమిండియా మధ్య ట్రినిడాడ్ వేదికగా జూలై 20న మొదలైన మలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. అశ్విన్ రెండు వికెట్లతో ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్ (28), తగ్‌నరైన్ చందర్‌పాల్ (24)ల వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్టులో టీమిండియా విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. డొమినికా మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించి జయకేతనం ఎగురవేసిన భారత జట్టు.. ఆఖరి టెస్టులోనూ అలాంటి ఫలితమే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. వాళ్లిద్దరు ఉంటే అంతే ఇదిలా ఉంటే.. విండీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే ఐదో రోజు 289 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘తమకు ఎన్ని ఓవర్లు మిగిలి ఉన్నాయన్న అంశాన్ని కూడా టీమిండియా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకు అనుగుణంగా బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. వాళ్ల నుంచి కచ్చితంగా వికెట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ వాళ్లు గెలవాలనుకుంటే దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. డ్రా అయినా చాలనుకుంటే మాత్రం అలా కాకుండా.. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా చాలు దానినే విజయంగా భావిస్తామనుకుంటే ఆచితూచి ఆడాలి. అయితే, చెత్త బంతుల కోసం ఓపికగా ఎదురుచూసి అత్యధిక పరుగులు రాబట్టాలి. ఇదేమీ గొప్ప వ్యూహం కాదు. కానీ వెస్టిండీస్ ముందు ఇంతకంటే మంచి ఆప్షన్ ఏదీలేదు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా తొలి టెస్టులో అశ్విన్ 12 వికెట్లతో చెలరేగగా.. జడ్డూ 5 వికెట్లు కూల్చిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో మెరిశాడు.అశ్విన్ ఒకటి, జడ్డూ రెండు, అరంగేట్ర పేసర్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చారు. చదవండి: తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ -
'అతడు సెంచరీ చేస్తాడనుకున్నా.. అది నన్ను ఆశ్చర్యపరిచింది'
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుతున్న రెండో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కోహ్లి(121) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(80), జడేజా(61) పరుగులతో రాణించారు. ఇక మెుదటి టెస్టులో భారత బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిన విండీస్.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి 86/1 స్కోరుతో ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా సెంచరీ సాధించకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని భారత మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వరుస క్రమంలో రోహిత్ శర్మ, అజింక్యా రహానే వికెట్ల కోల్పోయిన అనంతరం జడేజా క్రీజలోకి వచ్చాడు. ఈ సమయంలో కోహ్లితో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఐదో వికెట్‌కు కోహ్లితో కలిసి 159 పరుగుల కీలక బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక ఓవరాల్‌గా 152 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. 5 ఫోర్లతో 61 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Virat Kohli: కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ క్రికెటర్ తల్లి.. వీడియో వైరల్ ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లితో పాటు రవీంద్ర జడేజా చాలా సమయం పాటు క్రీజులో ఉన్నాడు. అటువంటింది జడేజా సెంచరీ చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు కచ్చితంగా సెంచరీ చేస్తాడని నేను భావించాను. గత రెండేళ్ల నుంచి ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. 6 లేదా అంతకంటే తక్కువ స్ధానాల్లో బ్యాటింగ్ వచ్చి అద్భుతంగా ఆడుతున్న జాబితాలో అతడు రెండో స్ధానంలో ఉన్నాడు. జడ్డూ తన కెరీర్లో 2500 పైగా పరుగులు,250 పైగా వికెట్లు సాధించాడు. అతడు భారత జట్టు ఎక్స్ ఫ్యాక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు" అని పేర్కొన్నాడు. చదవండి: Chahal: అందమైన ఫోటోలు షేర్ చేసిన ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ ఫిదా! -
'500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం దిగ్గజం సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్‌లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్నెస్ మెయింటేన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్‌కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్'' అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ''500వ అంతర్జాతీయ మ్యాచ్.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు. ''క్రికెట్లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్ వచ్చింది. బ్యాటర్‌గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్నెస్ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్ తెలిపాడు. చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం -
భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది
చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. రింకూ సింగ్ తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు వంటి ఐపీఎల్ హీరోలకు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జట్టుకు యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టుపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. ఈ జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన అతిపెద్ద తప్పిదమని చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఆసియాక్రీడలకు భారత సెలక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపికచేశారు. రింకూ, జైశ్వాల్, ప్రభుసిమ్రాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మాత్రం సెలెక్టర్లు మాత్రం పెద్ద తప్పు చేశారు. అతడు ప్రపంచంలోనే అత్యుతమ స్పిన్నర్లలో ఒకడు. అతడికి టీ20 ప్రపంచకప్-2021 జట్టులో అవకాశం ఇచ్చారు. అక్కడ విఫలమకావడంతో పూర్తిగా అతడిని పక్కన పెట్టేశారు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా రాణించాడు. కాబట్టి అతడు చైనాకు వెళ్లే భారత జట్టులో ఉండాల్సింది" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: Duleep Trophy: ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్ -
Ind Vs WI: మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది.. ఇకనైనా..
West Indies vs India Test Series: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఏకపక్ష విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పర్యాటక భారత జట్టు 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ విజయంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. 12 వికెట్లు పడగొట్టి డొమినికా పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన అశ్విన్ విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటి పలు రికార్డులు సృష్టించాడు. ఇక మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా సైతం 5 వికెట్లతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ వీరిద్దరి ధాటికి 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించిన వెస్టిండీస్... రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు రెండో టెస్టుకు కూడా విండీస్ ఇలాంటి టర్నింగ్ పిచ్‌ను తయారు చేయిస్తే తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు అవుతుందని పేర్కొన్నాడు. ‘‘పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పిచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయాలి. డొమినికా మాదిరి పిచ్‌ను తయారు చేయించుకుంటే మాత్రం మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మీకు టీమిండియాను ఓడించే అవకాశమే ఉండదు’’ అని ఈ మాజీ ఓపెనర్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి కీలక సూచన చేశాడు. ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసేలా చేశాడు అదే విధంగా.. విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన అశ్విన్‌పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడని కొనియాడాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో లెఫ్టాండర్ అలిక్ అథనాజ్ను అవుట్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసించాడు. తన స్పిన్ మాయాజాలంతో విండీస్ చేసిన తప్పేంటో వారికి మరోసారి గుర్తుచేశాడని ఆకాశ్ చోప్రా అశూను ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య జూలై 20 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: విరాట్ కోహ్లి అరుదైన ఫీట్.. దెబ్బకు ద్రవిడ్ రికార్డు బద్దలు! జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ -
ఇంతవరకు ఎవరూ అలా అడుగలేదు! మేనేజ్మెంట్ కూడా అతడి పట్ల..
West Indies vs India, 1st Test: ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో తాను మూడో స్థానంలో ఆడాలనకుంటున్నట్లు శుబ్‌మన్ గిల్ జట్టు మేనేజ్మెంట్తో చెప్పాడు. ఈ విషయం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే భారత క్రికెట్లో సాధారణంగా ఇలాంటివి ఎప్పుడూ జరుగవు. బ్యాటింగ్ పొజిషిన్ గురించి ఓ ఆటగాడు ఇలా యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం.. వాళ్లు అందుకు ఒప్పుకోవడం అరుదు. నాకు తెలిసి గతంలో ఎవరూ ఇలా అడుగలేదు.. ఇలాంటి సౌలభ్యం పొందనూ లేదు. అయితే, గిల్ ఇలా అడగడం వల్ల ఓ మేలు జరిగింది. యశస్వి జైశ్వాల్‌కు టీమిండియా ఓపెనర్‌గా అవకాశం వచ్చింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఓపెనర్‌గా రాలేనంటూ శుబ్‌మన్ గిల్ తమతో చెప్పినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించిన విషయం తెలిసిందే. నాకు, ద్రవిడ్‌కు చెప్పాడు తన కెరీర్లో ఎక్కువగా మూడు, నాలుగు స్థానాల్లోనే బ్యాటింగ్ చేశానని గిల్.. తనతో, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చెప్పాడని.. అతడి అభ్యర్థనకు తాము సానుకూలంగా స్పందించినట్లు తెలిపాడు. ఈ క్రమంలో డొమినికా వేదికగా విండీస్‌తో బుధవారం ఆరంభమైన టెస్టులో ముంబై యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేసి.. రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగాడు. విదేశీ గడ్డ మీద కష్టమే ఈ పరిణామాలపై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గిల్ విషయంలో యాజమాన్యం వ్యవహరించిన తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఏదేమైనా యశస్వికి మంచి జరిగిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘టెస్టుల్లో ముఖ్యంగా విదేశీ గడ్డ మీద ఓపెనర్‌గా ఆడటం అత్యంత సవాలుతో కూడుకున్న విషయం. నంబర్ 3 కూడా చాలెంజింగ్గానే ఉంటుంది. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే పిచ్ పరిస్థితులు అంచనా వేసి కాస్త నిలదొక్కుకునే సమయం ఉంటుంది’’ అని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్‌తో తొలి రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. యశస్వి శుభారంభం ఈ నేపథ్యంలో ఆతిథ్య కరేబియన్ జట్టు 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి, రోహిత్ శుభారంభం అందించారు. మొదటి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 80 పరుగులు చేయగలిగింది. యశస్వి 40, రోహిత్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే -
Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
West Indies vs India, 1st Test Day 1: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్ములేపుతున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఏకంగా 5 వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ముందుగా ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్(20), తగెనరైన్ చందర్‌పాల్(12)లను పెవిలియన్‌కు పంపిన అశూ.. నిలకడ ప్రదర్శించిన అరంగేట్ర బ్యాటర్ అలిక్ అథనాజ్(47)తో పాటు టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించగా.. పేసర్లు సిరాజ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అశ్విన్ అద్భుత ప్రదర్శన(5/60)ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మనం తప్పు చేశామా? ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో తనను ఆడించకుండా మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పుచేసిందో తెలిసొచ్చేలా చేశాడన్నాడు ఆకాశ్ చోప్రా. భారత్- వెస్టిండీస్ తొలి రోజు ఆటను విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు తొలిరోజే 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ ఆడించకుండా మనం తప్పు చేశామా అనే ఫీలింగ్ కలిగించాడు. విండీస్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటాయని, వెస్టిండీస్‌తో సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలుస్తాడని నేను ముందుగానే అంచనా వేశాను." అన్నాడు ఆకాశ్ చోప్రా. అశూ మాదిరే వాళ్లు కూడా తొలిరోజు మాదిరే అశ్విన్ చెలరేగితే నా మాటలు నిజమవుతాయి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఒకే చోట బంతిని విసురుతూ అశూ మంచి ఫలితాలు రాబడుతున్నాడన్న ఈ కామెంటేటర్.. నాథన్ లియోన్, జడేజా కూడా అతడి మాదిరే బౌలింగ్ చేసే సత్తా కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. కాగా మొదటి రోజు ఆటలో విండీస్‌పై పైచేయి సాధించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. నంబర్ 1 అశ్విన్ ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్-2023 సందర్భంగా తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అశూను కాదని.. జడ్డూకు అవకాశమిచ్చారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. అశ్విన్ గత కొంతకాలంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్1గా కొనసాగుతున్నాడు. చదవండి: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు -
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే?
ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్బతమైన ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. కాగా బంగ్లాదేశ్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఛటోగ్రామ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అయితే బంగ్లాను ఏకంగా 142 పరుగుల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో ఆఖరి వన్డే ఛటోగ్రామ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఇక బంగ్లాదేశ్‌ను వారి సొంత గడ్డపై చిత్తు చేసిన ఆఫ్గాన్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియాపై చోప్రా విమర్శలు గుప్పించాడు. కాగా గత డిసెంబర్లో జరిగిన వన్డే సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆ సమయంలో భారత జట్టుపై విమర్శల వర్షం కురిసింది. ఇక తాజాగా ఇదే విషయాన్ని చోప్రా మరోసారి తన యూట్యూబ్‌లో ఛానల్లో చర్చించాడు. "బంగ్లాదేశ్‌కు వారి స్వదేశంలోనే ఆఫ్ఘనిస్థాన్ చుక్కలు చూపిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ఎగరేసుకుపోయింది. ఆఫ్గాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా వారి స్పిన్నర్లు గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. స్పిన్నర్లు నిలకడగా రాణిస్తారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతున్నారు. ఆఫ్గాన్ తమ ఉపఖండ పరిస్ధితులకు బాగా అలవాటు పడింది. కాబట్టి ఈ ఏడాది భారత్ వేదికగా ప్రపంచకప్‌లో కూడా ఆఫ్గాన్ జట్టు నుంచి ఇతర జట్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఆఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేస్తే.. అది వారికే ప్రమాదం" అని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక టీమిండియా గురించి మాట్లాడుతూ.. "ఇదే బంగ్లాదేశ్‌లో భారత జట్టు మాత్రం సిరీస్‌ను కోల్పోయింది. అయితే కీలక మ్యాచ్‌లో రోహిత్ గాయ పడటంతో సిరీస్ కోల్పోయిందన్న విషయం మర్చిపోకూడదు. కానీ మూడో వన్డేలో మాత్రం ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. అయితే గెలవాల్సిన సిరీస్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది అని చోప్రా చెప్పుకొచ్చాడు. చదవండి: ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే? -
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. అతడిని పట్టించుకోలేదు ‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్‌కప్ జట్టులో ఉమ్రాన్‌కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు. ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు. అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్‌గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్‌గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
ఇకపై కోహ్లిని అలా పిలువకండి.. 'కింగ్' ఆ ముగ్గురి సరసన నిలిచే అర్హత కోల్పోయాడు..!
రన్ మెషీన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇకపై ఎంతమాత్రం ఫాబ్-4లో భాగంగా కాదని, టెస్ట్‌ల్లో తరుచూ విఫలమవుతున్న కోహ్లి ఫాబ్-4లో నిలిచే అర్ఘత కోల్పోయాడని, ఇకపై ఎవ్వరూ కోహ్లిని ఫాబ్-4లో ఒకడిగా పిలవకండని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు తమకిచ్చిన బిరుదుకు న్యాయం చేస్తున్నారని.. కోహ్లి ఒక్కడే వరుసగా విఫలమవుతూ, అందుకు న్యాయం చేయలేకపోతున్నాడని అన్నాడు. కెరీర్లో (యాషెస్ మూడో టెస్ట్) వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్.. ఇటీవలే 32వ టెస్ట్ శతకాన్ని నమోదు చేయగా.. రూట్ సైతం ఇదే యాషెస్ సిరీస్‌లో సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ విషయానికొస్తే.. ఇతను గత మూడేళ్లలో కేవలం ఒక టెస్ట్ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో అతన్ని ఫాబ్-4లో ఒకడిగా సంబోధించడంపై చాలా మంది ప్రశ్నించారు. ఈ విషయంలో ఆకాశ్ చోప్రా ఓ అడుగు ముందుకేసి, ఎవరూ చేయలేని సాహసం (కోహ్లిని బహిరంగంగా విమర్శించడం) చేశాడు. ఇకపై విరాట్ ఫ్యాబ్ 4లో ఒకడిగా పిలుపించుకోవడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లతో ఫ్యాబ్-3 మాత్రమే ఉందని అన్నాడు. ఆకాశ్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉన్నా, ఇందులో నిజం లేకపోలేదు. 2014-2019 వరకు అద్భతంగా ఆడి (58.71 సగటుతో 5695 పరుగులు, 22 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు) ఫాబ్-4లో చోటు దక్కించుకున్న విరాట్.. ఆ తర్వాత మూడేళ్లలో 25 మ్యాచ్‌లు ఆడి కేవలం 1277 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవగం 29.69గా ఉంది. -
అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ఎంపిక చేసింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్లు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్, యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌లకు చోటు దక్కలేదు. వీరిద్దరికి టీ20 జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ముఖ్యంగా అద్బుతమైన ఫామ్‌లో ఉన్న రుత్‌రాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. అదే విధంగా టీ20 జట్టులో కూడా చోటు దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. "ప్రతీ సిరీస్‌కు జట్టు ఎంపిక చేసినప్పుడు ఎవరో ఒక ఆటగాడికి అన్యాయం జరుగుతోంది. దాని గురించి కొన్ని రోజులు పాటు చర్చనడుస్తోంది. ఇప్పుడు విండీస్ సిరీస్ వంతు వచ్చింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు ముగ్గురు ఓపెనర్లు ఎంపిక చేశారు. కానీ రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం చోటు దక్కలేదు. సెలక్టర్లు నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి కిషన్ స్ధానంలో రుత్‌రాజ్‌ను ఎంపిక చేయాల్సింది. కిషన్ గత కొంత కాలంగా టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్లో కూడా విఫలమయ్యాడు. ఇక యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భారత క్రికెట్లో ఒక సంచలనం. అతడు ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణించాడు. అదే జోరును విండీస్ టూర్లో కూడా కొనసాగిస్తాడని భావిస్తున్నాను. డొమినికా టెస్టుతో జైశ్వాల్ డెబ్యూ చేసే అవకాశం ఉందని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: IND vs WI: బౌండరీల వర్షం కురిపించిన రోహిత్, జైశ్వాల్.. వీడియో వైరల్ -
Ind Vs WI: అందుకే జడ్డూను కాదని అతడికి జట్టులో చోటు! అంతేతప్ప..
Ind Vs WI 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టులో నలుగురు స్పిన్ బౌలర్లకు చోటు దక్కింది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి.. ఇద్దరు లెఫార్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ టీ20 జట్టులో స్థానం సంపాదించారు. విండీస్ గడ్డపై మ్యాచ్‌కు సెలక్టర్లు ఈ మేరకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సమర్థించాడు. కరేబియన్ దీవిలో ప్రస్తుతం స్లో, టర్నింగ్ పిచ్‌లు ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డాడు. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాకు చోటు ఇవ్వకపోవడంపై కూడా ఆకాశ్ చోప్రా స్పందించాడు. అందుకే జడ్డూ జట్టులో లేడు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్‌తో టీ20 జట్టులో నలుగురు స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజీ చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయికి సెలక్టర్లు చోటిచ్చారు. రవీంద్ర జడేజా లేడు కాబట్టి ఆల్‌రౌండర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు తప్ప మరొకరికి స్థానం లేదు. నా అభిప్రాయం ప్రకారం.. కేవలం జడ్డూపై పని ఒత్తిడి తగ్గించడానికి మాత్రమే అతడిని పక్కన పెట్టి ఉంటారు. నిజానికి టీ20 ఫార్మాట్లో రవీంద్ర జడేజా ప్రదర్శనపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, అతడు కరేబియన్ గడ్డపై టెస్టులు, వన్డేలు ఆడాల్సి ఉంది. పాండ్యా సారథ్యంలో కాబట్టి జడ్డూకు విశ్రాంతినిచ్చే క్రమంలో మాత్రమే అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. అంతేతప్ప జడ్డూను జట్టు నుంచి తప్పించినట్లు కాదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఆగష్టు 3- 13 వరకు టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ రింకూ సింగ్‌కు గుడ్ న్యూస్.. భారత జట్టులో చోటు! వాళ్లకు కూడా -
'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్ అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్‌పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్ అభిమానులు పాత వీడియోలను షేర్ చేశారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ నికోల్స్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు. అభిమాని షేర్ చేసిన వీడియోపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్ చీటింగ్ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. Ouch. You can even see the torchbearer of ‘The Spirit of the Game’ shrugging his shoulders instead of initiating the process to withdraw the appeal. After all, you wouldn’t want to be remembered for things like these 🤣🫣🤪 Also, there are multiple videos circulating calling out… https://t.co/yR8Nq2UeVd — Aakash Chopra (@cricketaakash) July 4, 2023 చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు -
నువ్వెందుకు బౌలింగ్ చేస్తున్నావు? కావాలంటే మీకు కూడా.. అంతేగానీ! ధోని ఆ ఒక్క మాటతో
‘‘2004లో.. ఇండియా- ఏ జట్టు కెన్యా, జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని రిజర్వ్ కీపర్‌గా ఉండగా.. దినేశ్ కార్తిక్ తుది జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అయితే, ఓసారి నెట్స్‌లో ధోని.. కార్తిక్‌కు బౌలింగ్ చేయడం చూశాను. వెంటనే ధోని దగ్గరకు వెళ్లి.. ‘‘నువ్వెందుకు అతడికి బౌలింగ్ చేస్తున్నావు? అతడు నీకు ప్రధాన పోటీదారు అన్న విషయం తెలుసు కదా! ఒకవేళ అతడు బాగా ప్రాక్టీస్ చేసి మెరుగైన ప్రదర్శన ఇస్తే నీకు తుది జట్టులో ఆడే అవకాశం రాదు. కాబట్టి నువ్వు కూడా బ్యాటింగ్ లేదంటే కీపింగ్ ప్రాక్టీస్ చేయాలి కానీ ఇదేంటి? అసలు నువ్వెందుకు అతడికి బౌలింగ్ చేస్తున్నావు? అని అడిగాను. వెంటనే ధోని స్పందిస్తూ.. ‘‘దయచేసి నన్ను ఆపకండి. నాకు బౌలింగ్ చేయాలని ఉంది. ఒకవేళ మీకు బ్యాటింగ్ చేయాలని ఉంటే చేయండి. కావాలంటే మీకు కూడా నేను బౌలింగ్ చేస్తాను’’ అని బదులిచ్చాడు. ఈ విషయాన్ని తలచుకున్నపుడల్లా.. ధోని తాను సాధించాలనుకున్నవి ఎలా సాధించగలిగాడో నాకు అర్థమవుతుంది. ధోనికి దినేశ్ కార్తికో.. మరెవరో పోటీకానే కాదు. తనకు తానే పోటీ. ఆరోజు తన మాటలతో నాకు కనువిప్పు కలిగించాడు. ఎవరైనా సరే ఇతరులతో కాకుండా తమకు తాము పోటీ అని భావిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ధోనిలా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని పేర్కొన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి కాగా వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ధోని 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మిస్టర్ కూల్.. 2006లో టీ20లలో అడుగుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ఇక సారథిగా భారత్‌కు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోని.. మూడు ఐసీసీ టైటిళ్లు బహుమతిగా ఇచ్చాడు. అదే విధంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ ఐదుసార్లు చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపి.. లీగ్ క్రికెట్లోనూ తనదైన ముద్ర వేశాడు. విరాట్ కోహ్లి వంటి ఎంతోమంది స్టార్లను తయారు చేసిన ధోని ఎంతో నిరాడంబరంగా ఉంటాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్దంలో మాత్రమే చూడగలడు ఈ నేపథ్యంలో ఒకప్పుడు తనకు పోటీదారు అయిన దినేశ్ కార్తిక్ విషయంలో ధోని ఆలోచనా ధోరణిని ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆకర్షిస్తున్నాయి. ‘‘తనకు తానే సాటి. గ్రేట్‌నెస్ అనే పదానికి నిర్వచనం ఎంఎస్ ధోని. తనకు పోటీ అయిన వ్యక్తిని అతడు కేవలం అద్దంలో మాత్రమే చూడగలడు’’ అంటూ ఆకాశ్ ట్విటర్లో వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: IPL 2023: నిజంగానే ఆరోజు ఓవరాక్షన్ చేశాను! నా ప్రవర్తన వల్ల.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే.. Master of his own game, MS Dhoni continues to redefine greatness. The only competition he faces is the one in the mirror. 🏏💪 #DhoniLegacy #Aakashvani pic.twitter.com/auGcAv81nt — Aakash Chopra (@cricketaakash) June 19, 2023 -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్‌లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్‌గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్‌మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్‌లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్‌గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..?
ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు (రూ. 18.5 కోట్లు) సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ వదిలించుకోనుందా.. ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఐపీఎల్-2023లో సామ్ కర్రన్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పంజాబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం పరోక్షంగా సమర్ధించాడు. ఐపీఎల్ 2024 వేలానికి ముందు పంజాబ్.. కర్రన్‌ను తప్పక వదించుకోవాలని భావిస్తుంటుందని అన్నాడు. కర్రన్.. సీఎస్కే తరఫున అడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు పంజాబ్ తరఫున ఆడలేదని, అతనిపై పెట్టిన పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేదని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో కర్రన్ ప్రదర్శన చూసి పంజాబ్ యాజమాన్యం తొందరపడిందని , అతనిపై వెచ్చించిన సొమ్ముతో నలుగురు నిఖార్సైన ఆల్రౌండర్లను సొంతం చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. కర్రన్‌పై వెచ్చించిన సొమ్ములో పంజాబ్ కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోయిందని, అతనిపై భారీ అంచనాలే పంజాబ్‌ను వరుసగా తొమ్మిదో సారి ప్లే ఆఫ్స్‌కు చేరనీయకుండా చేశాయని తెలిపాడు. గత సీజన్లో కర్రన్‌కు కొత్త బాల్ అప్పజెప్పిన పంజాబ్.. అర్షదీప్‌కు అన్యాయం చేసిందని, అర్షదీప్ ఫెయిల్యూర్‌కు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. కొత్త బంతితో కర్రన్ అద్భుతంగా చేయగలిగినప్పటికీ... భారత పిచ్‌లు అందుకు సహకరించవని అన్నాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్లో కర్రన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.96 స్ట్రయిక్ రేట్‌తో 276 పరుగులు చేసి, 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. -
ధోని.. అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు! ఫైనల్ మాత్రం తనదే!
IPL 2023 Final- CSK vs GT: ‘‘కెప్టెన్ ధోని అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. నాకు తెలిసి అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి ఉంటాడు. ఈరోజు అతడిదే అవుతుందనుకుంటున్నా’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కాగా ఐపీఎల్-2023లో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జట్టులో సీనియర్ అయిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు ఈ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు 10 ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 23. ఇక బౌలింగ్‌పరంగా చూస్తే.. 7.50 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 28) డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మొయిన్ అలీ- ఎంఎస్ ధోని (PC: IPL) జడ్డూ బ్యాట్‌తో మెరుస్తాడు ‘‘ధోని ఎందుకో మొయిన్ అలీ సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఇక జడేజా ఈరోజు బ్యాట్‌తో మెరుస్తాడనుకుంటున్నా. ఎందుకంటే.. అహ్మదాబాద్ పిచ్‌పై అతడి బౌలింగ్ వర్కౌట్ కాకపోవచ్చు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండబోతోందనపిస్తోంది. దూబేను అలా ట్రాప్ చేస్తారు ఇక శివం దూబే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా అతడిని ఫాస్ట్ బౌలింగ్‌తో కాకుండా స్పిన్నర్లతో ట్రాప్ చేయడం పక్కా. రహానే నంబర్ 3 మరోవైపు.. అజింక్య రహానే.. చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై వెలుపలే అతడు ఎక్కువగా పరుగులు రాబట్టాడు. రహానే ఇక్కడ కచ్చితంగా రన్స్ సాధిస్తాడనే అనుకుంటున్నా. రహానే మూడో స్థానంలో దిగితే బాగుంటుంది. నిజానికి సీఎస్కే వారి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేపై ఎక్కువగా ఆధారపడుతోంది. రుతు, కాన్వే అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మహ్మద్ షమీ వీరిద్దరని కచ్చితంగా టార్గెట్ చేస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో కాన్వే ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లో 625 పరుగులు, రుతురాజ్ 14 ఇన్నింగ్స్ ఆడి 564 పరుగులు సాధించారు. ఇక గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు సీఎస్కే- గుజరాత్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్ సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! Wait till you see Cherry’s POV 💛📹#WhistlePodu #Yellove 🦁 @deepak_chahar9 pic.twitter.com/aLsrU6ALxl — Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2023 -
IPL 2023: ఎక్కడ, ఎలా మొదలైందో చివరకు అక్కడే, అలాగే..!
ఐపీఎల్ 2023 సీజన్ చివరి అంకానికి చేరింది. రేపు (మే 28) జరుగబోయే ఫైనల్లో గుజరాత్, చెన్నై అమీతుమీ తేల్చుకోనున్నాయి. తుది సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఐపీఎల్ 2023 ఎక్కడ, ఎలా మొదలైందో చివరకు అక్కడే, అలాగే ముగియనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 31న నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-సీఎస్కే జట్ల మధ్య జరగగా.. 57 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత అదే వేదికపై, అవే జట్ల మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ సీజన్ 16 ముగియనుంది. 31.03.2023 — Narendra Modi Stadium— GT v CSK 28.05.2023. Nearly two months later. After 73 games. We are back to where it started…and how it started. It’s a GT v CSK again… So, why exactly did we play this season?? 🫣🤪 #TataIPL — Aakash Chopra (@cricketaakash) May 26, 2023 ఫలితం కూడా ఒకేలా ఉంటుందా అన్న విషయాన్ని పక్కన పెడితే, యాధృచ్చికంగా జరిగిన ఈ ఆసక్తికర పరిణామం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. ఇందుకు ఈ ఐపీఎల్ సీజన్ ఎందుకు ఆడాము అంటూ వ్యంగ్యంగా కామెంట్ జోడించాడు. ఈ ఆసక్తికర పరిణామంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కడ మొదలైందో అక్కడే, అలాగే ముగుస్తుందని కొందరు (గుజరాత్ గెలుస్తుందని).. ఎక్కడ, ఎలా మొదలైనా గెలిచేది తామేనని (సీఎస్కే గెలుస్తుందని) మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి సీజన్ తొలి మ్యాచ్‌లోలా గుజరాత్ గెలుస్తుందా.. లేక సీన్ రివర్స్ అయ్యి చెన్నై గెలుస్తుందా అనేది తెలియాలంటే రేపు అర్ధ రాత్రి వరకు వేచి చూడాలి. కాగా, నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61), తిలక్ వర్మ (14 బంతుల్లో 43) మెరుపులు వృధా అయ్యాయి. చదవండి: గెలవదగిన ఆట ఆడలేదు.. శుభ్‌మన్ సూపర్, అదే మా ఓటమికి కారణం: రోహిత్ శర్మ -
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే!
IPL 2023 GT vs SRH: ‘‘భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీశాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించాడు. భువీ నుంచి ఇలాంటి ప్రదర్శన చూసిన తర్వాత మీ, నా మదిలో ఓ ప్రశ్న మెదలడం ఖాయం కదా! అదేంటంటే.. సర్రే ఓవల్‌లో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే జట్టును ఫైనల్ చేసేటపుడు భువీని పరిగణనలోకి తీసుకుంటారా? ఇంగ్లండ్‌లో వేసవి తొలి అర్ధ భాగంలో ఆడే మ్యాచ్‌లలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే స్వింగ్ రాబట్టాల్సిందే. ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సగం సగమే అనిపిస్తున్నాడు. జయదేవ్ ఉనాద్కట్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి భువనేశ్వర్ కుమార్‌ను జట్టుకు ఎంపిక చేస్తారా? చేస్తే బాగుండు. కానీ అలా జరుగకపోవచ్చు.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 5 వికెట్లతో చెలరేగిన భువీ! స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆకాశ్.. కానీ అది సాధ్యం కాకపోవచ్చని నిట్టూర్చాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో భువీ ఐదు వికెట్లతో చెలరేగాడు. టైటాన్స్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (0), శుబ్‌మన్ గిల్(101), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8), టెయిలెండర్లు నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ(0) వికెట్లు కూల్చాడు. 4 ఓవర్ల బౌలింగ్‌లో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిస్తే! ఈ మ్యాచ్‌లో రైజర్స్ ఓడినప్పటికీ భువీ ప్రదర్శన మాత్రం సానుకూలాంశంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. భువీని కొనియాడుతూనే డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడికి ఆడే అవకాశం వస్తే బాగుండని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై భువీ లాంటి స్వింగ్ మాస్టర్ అద్భుతాలు చేయగలడని పేర్కొన్నాడు. అయితే, సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జూన్ 7- 11 వరకు ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో బీసీసీఐ భువీకి చోటివ్వని సంగతి తెలిసిందే. చదవండి: కుక్క కరిచిందన్న అర్జున్ టెండుల్కర్.. వీడియో వైరల్! తుది జట్టులో.. A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass! #GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea — JioCinema (@JioCinema) May 15, 2023 -
సూర్యకుమార్ కంటే రషీద్‌ఖాన్ బెటర్
-
సీఎస్కేను ఓడించే సత్తా ఆ ఒక్క జట్టుకే ఉంది: ఆకాష్ చోప్రా
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని సీఎస్కే భావిస్తోంది. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సీఎస్కేను తన హోం గ్రౌండ్ చెపాక్‌లో ఓడించే సత్తా ఉన్న ఏకైక జట్టు కోల్‌కతా అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "చెపాక్ పిచ్‌లో సీఎస్కే తిరిగిండదని మనకు తెలుసు. కానీ వారి సొంతం మైదానంలో పోటీ ఇచ్చే ఏకైక జట్టు ఒకటి ఉంది. అదే కోల్‌కతా నైట్‌రైడర్స్. కేకేఆర్‌లో సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి కేకేఆర్ కూడా చెపాక్ స్పిన్ పిచ్‌పై రాణించగలదు. ఇక బ్యాటింగ్‌లో రాయ్, గుర్బాజ్ ఇద్దరు ఓవర్సీస్ ఓపెనర్లు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా అనుకుల్ రాయ్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చి రాణిస్తున్నాడు. కాబట్టి కోల్‌కతా జట్టును అంత తేలికగా తీసుకోకూడదు" అని జియోసినిమా 'ఆకాశవాణి' షోలో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! -
అభిషేక్ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు
IPL 2023- SRH Vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి అభిషేక్ శర్మను బాధ్యుడిని చేయడం సరికాదని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. తప్పంతా కెప్టెన్, మేనేజ్మెంట్దేనంటూ ఘాటు విమర్శలు చేశాడు. చెత్త నిర్ణయాలే రైజర్స్ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం తలపడింది సన్‌రైజర్స్. ఆరంభంలో పర్లేదు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రైజర్స్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆదిలోనే హిట్టర్ కైలీ మేయర్స్(2) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(29) తక్కువ స్కోరుకే పరిమితం కావడం రైజర్స్‌కు కలిసివచ్చింది. అయితే, 16వ ఓవర్లో కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతిని అభిషేక్ శర్మకు ఇవ్వడం.. అతడి ఓవర్లో స్టొయినిస్, పూరన్ కలిసి ఏకంగా ఐదు సిక్సర్లు బాదడం తీవ్ర ప్రభావం చూపింది. ఒక్క ఓవర్ మ్యాచ్‌ను తిప్పేసింది! ఒక్క ఓవర్లోనే ఈ మేరకు 31 పరుగులు రాబట్టిన లక్నో.. నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 15 ఓవర్ల దాకా మ్యాచ్ తమ చేతిలోనే ఉందని మురిసిపోయిన సన్‌రైజర్స్ భారీ ఓటమి కారణంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. అభిషేక్ శర్మను బౌలింగ్‌కు ఎందుకు పంపించారు? ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా వస్తున్న అభిషేక్ శర్మపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆకాశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జియో సినిమా షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘అసలు అభిషేక్ శర్మను బౌలింగ్‌కు ఎందుకు పంపించారు? మయాంక్ మార్కండే అందుబాటులో ఉన్నా కూడా అభిషేక్ శర్మతో ఆ ఓవర్ వేయించడంలో మర్మమేమిటో నాకైతే అర్థం కాలేదు. అభిషేక్ తొలి రెండు బంతులను ప్రత్యర్థి బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత అవుటయ్యాడు. వారిని నిందించడం సరికాదు అయితే.. నికోలస్ పూరన్ రాగానే మూడు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. ఆటలో ఇవన్నీ సహజమే. నిజానికి ఇందులో అభిషేక్ తప్పు లేదు. ఒక బౌలర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కెప్టెన్‌కు, మేనేజ్మెంట్కు తెలిసి ఉండాలి. అంతేగానీ.. ఇలాంటి వాటికి సదరు బౌలర్‌నో.. ప్లేయర్‌నో బాధ్యులను చేయడం, వారిని నిందించడం సరికాదు’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్, లక్నో క్రికెటర్ ప్రేరక్ మన్కడ్ అర్ధ శతకం సాధించడం అత్యంత సానుకూల అంశమని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చాడు లక్నో బ్యాటర్ ప్రేరక్. 45 బంతుల్లో 64 పరుగులు రాబట్టి.. పూరన్(13 బంతుల్లో 44 పరుగులు)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ శర్మ 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. Of playing a match-winning knock, rewarding hard work & discipline and leading from the front with the ball 🙌 Hyderabad Heroes @krunalpandya24 & @PrerakMankad46 relive @LucknowIPL's epic chase 👌🏻 - By @28anand Full Interview 🔽 #TATAIPL | #SRHvLSG https://t.co/fIb75PuQQI pic.twitter.com/XLiIWASn6a — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
IPL 2023 GT vs MI: మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ సూర్యకుమార్ కాదు.. అతడే!
ఐపీఎల్-2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదిగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో గుజరాత్‌కు భారీ ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. 8 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రషీద్ 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు ముంబై ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కాగా సూర్యకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌పై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ కంటే రషీద్‌ను అత్యంత విలువైన ఆటగాడిగా(మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్) చోప్రా ఎంచుకున్నాడు. టైటాన్స్ టాప్-ఆర్డర్ బ్యాటర్లు రాణించే ఉంటే రషీద్ కచ్చితంగా తన జట్టును గెలిపించేవాడు అని ఆకాష్ చోప్రా తెలిపాడు. "నా వరకు అయితే ఈ మ్యాచ్‌లో అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కాదు. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ రషీద్ ఖాన్. టాపర్డర్ బ్యాటర్లు కాస్త రాణించే ఉంటే, రషీద్ ఖాన్ ఒంటరిగా మ్యాచ్‌ను గెలిపించేవాడు. గుజరాత్ ఐదు వికెట్లు సాధిస్తే.. అందులో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందుతో ఓపెనర్లతో పాటు నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్ వికెట్లు కూడా ఉన్నాయి" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా చెప్పుకొచ్చాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
జైస్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్.. ఏకి పారేసిన ఆకాశ్
కేకేఆర్‌తో నిన్న (మే 11) జరిగిన ఎలెక్ట్రిఫైయింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి తన జట్టుకు బంతుల పరంగా (41) అతి పెద్ద విజయాన్ని అందించాడు. అయితే యశస్వి 2 పరుగుల తేడాతో సీజన్లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడం అందరినీ బాధించింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రత్యేకంగా స్పందించాడు. కేకేఆర్ బౌలర్ సుయాశ్ శర్మ ఉద్దేశపూర్వకంగా జైస్వాల్‌ను సెంచరీ చేయనీయకుండా అడ్డుకున్నాడని మండిపడ్డాడు. సుయాశ్ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన ఆకాశ్.. పాక్ బౌలర్, కోహ్లిని సెంచరీ చేయనీకుండా అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని అన్నాడు. సుయాశ్, సొంత దేశ ఆటగాడి విషయంలో ఇలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు అన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. సుయాశ్ చర్యను పూర్ టేస్ట్‌గా అభివర్ణించాడు. ఆకాశ్ తన ట్వీట్లో సుయాశ్ చర్యను సమర్ధించిన వారిని కూడా ఏకి పారేశాడు. కాగా, రాజస్థాన్ గెలుపుకు నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో, జైస్వాల్ 94 పరుగుల స్కోర్ వద్ద ఉండగా సుయాశ్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న సంజూ శాంసన్ దాన్ని డిఫెండ్ చేసి జైస్వాల్‌కు స్ట్రయిక్ రొటేట్ చేశాడు. అయితే జైస్వాల్ విన్నింగ్ షాట్‌ను సిక్సర్‌గా మలచలేకపోవడంతో 98 పరుగుల వద్దే ఆగిపోయి, సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చదవండి: నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్ శర్మ -
గొప్ప క్రికెటర్లే కావొచ్చు.. కానీ మరీ ఎక్కువైంది! కోహ్లిని చూసి ఏం నేర్చుకుంటారు?
IPL 2023- LSG Vs RCB- Kohli Vs Gambhir: ‘‘అసలు కోహ్లికి అంత కోపమెందుకొచ్చింది? గౌతం అంత సీరియస్ ఎందుకయ్యాడు? మ్యాచ్ జరుగుతున్నపుడు.. ఏం జరిగిందన్నది కాదు.. మ్యాచ్ తర్వాత అసలైన గందరగోళం చోటుచేసుకుంది. నా దృష్టిలో ఇలాంటి ప్రవర్తన అస్సలు సరికాదు. నిజమే.. లక్నోపై ప్రతీకారం తీర్చుకునే సమయం. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ తేడాతో ఓడిన ఆర్సీబీ ఈసారి 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదంతా బాగుంది. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం అవాంఛనీయం. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకే కాదు చాలా మందికి ఇలాగే అనిపించి ఉంటుంది. గొడవపడ్డ వాళ్లిద్దరూ గొప్ప క్రికెటర్లు. విరాట్ కోహ్లి.. అతడు యూత్ ఐకాన్. చాలా మంది అతడిని చూసి.. అతడి లాగే ఎదగాలని కోరుకుంటారు. కానీ ప్రతిసారి ఇలా గొడవపడితే... వాళ్లు కోహ్లి నుంచి ఏం నేర్చుకుంటారు. నేను కోహ్లిలాంటి ఆటగాడిని కావాలి గానీ.. అలాంటి **** అవకూడదు అని అనుకుంటున్నారు. నేను పూర్తి చేయలేకపోయిన ఆ మాటలేంటో మీకు తెలుసనే అనుకుంటున్నా. కోహ్లి ఇలా.. గంభీరేమో అలా ఇక గౌతం విషయానికొస్తే.. చిన్నస్వామి స్టేడియంలో అతడు అలా చేయకుండా ఉండాల్సింది. ఇద్దరూ గతంలో ఇలా దూకుడుగా ప్రవర్తించిన వాళ్లే. కానీ ఈసారైనా కనీసం సంయమనం పాటించాల్సింది. ఎందుకో నాకైతే వాళ్లు మరీ శ్రుతిమించినట్లు అనిపించింది’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. కోహ్లి- గంభీర్ తీరును విమర్శించారు. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు సొంత మైదానంలో అన్నీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కెప్టెన్ రాహుల్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 19.5 ఓవర్లలో 108 పరుగులకే సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. 18 పరుగుల తేడాతో ఆర్సీబీని విజయం వరించింది. చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. భావోద్వేగాలు నియంత్రించుకోలేక పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయారు. ఇక ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్ గౌతం గంభీర్- కోహ్లి, కోహ్లి- నవీన్ ఉల్ హక్ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కోహ్లి- గంభీర్ గొడవకు కారణమేంటో వాళ్లు చెప్తే తప్ప తెలియదని.. ఏదేమైనా ఇద్దరూ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని పేర్కొన్నాడు. ఇలా గొడవలకు దిగే వాళ్లను చూసి యువ క్రికెటర్లు ఏం నేర్చుకుంటారంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఈ ఘటనలో ఇద్దరిదీ తప్పేనని అభిప్రాయపడ్డాడు. చదవండి: LSG Vs RCB: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్ సంజూ చీట్ చేయలేదు.. కొంచెం చూసి మాట్లాడండి! రోహిత్‌ది క్లియర్ ఔట్ The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49 — Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
IPL 2023- MI Vs RR: రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడీ టీ20 నంబర్ 1 బ్యాటర్. ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలిసారి అర్ధ శతకం సాధించిన ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి అభిమానులకు కనువిందు చేశాడు. అదరగొట్టేశాడు వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్య 29 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫామ్‌లోకి వచ్చిన సూర్య ఆటతీరును ఇలాగే కొనసాగిస్తే జట్టుకు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. అదే విధంగా ముంబై- రాజస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య గ్రహణం వీడింది.. ‘‘ముంబై లక్ష్య ఛేదన అంత సులువుగా ఏమీ జరిగిపోలేదు. సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. మునుపటి లయను అందుకున్నాడు. ఇన్నాళ్లు.. సూర్యగ్రహణం పట్టింది.. ఇప్పుడిప్పుడే గ్రహణం వీడి సూర్యుడు ప్రకాశించడం మొదలుపెట్టాడు. నిజానికి ఈరోజు రోహిత్ శర్మ తొందరగా అవుటైపోయాడు. తన పుట్టినరోజు అయినప్పటికీ సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ పర్వాలేదనిపించాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అలాంటి క్లిష్ట సమయంలో కామెరాన్ గ్రీన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి పట్టుదలగా నిలబడ్డాడు. కామెరాన్ గ్రీన్ భవిష్యత్ సూపర్‌స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు భవిష్యత్ సూపర్‌స్టార్ మానసికంగా.. శారీరకంగా అతడు ఫిట్నెస్ కాపాడుకోగలిగితే కచ్చితంగా రాక్‌స్టార్‌గా వెలుగొందుతాడు. తనదొక విభిన్న శైలి. తను అద్బుతంగా బౌలింగ్ కూడా చేయగలడు. గ్రీన్ ఒక సంచలనం అనడంలో అతిశయోక్తి లేదు’’ అని ఆకాశ్ చోప్రా ముంబై బ్యాటర్ల ఆటను విశ్లేషిస్తూ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా సొంతమైదానంలో రాజస్తాన్‌తో తలపడ్డ ముంబై మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి విధించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఇషాన్ 28 పరుగులు సాధించాడు. టిమ్ డేవిడ్ విధ్వంసం వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్ 26 బంతుల్లో 44 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 29, టిమ్ డేవిడ్ 45 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. చివరి ఓవర్లో మొదటి మూడు బంతుల్లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబై గెలుపును ఖరారు చేశాడు. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ పదహారో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి 201 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 57. ముంబై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్- రాజస్తాన్- బ్యాటింగ్ ►రాజస్తాన్- 212/7 (20) ►ముంబై- 214/4 (19.3) ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్(రాజస్తాన్)- 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 124 పరుగులు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. అతడొక అద్భుతం: సంజూ శాంసన్ 1️⃣0️⃣0️⃣0️⃣th IPL match. Special Occasion... ...And it ends with an electrifying finish courtesy Tim David & @mipaltan 💥💥💥 Scorecard ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/qK6V5bqiWV — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
KKR Vs RCB: ఆ షాట్ సెలక్షన్ ఏంటి? రాణా సంగా అవుదామనుకుని..
IPL 2023- Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ సమర్పించుకున్నాడని విమర్శించాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు రాణా సంగాలా మారుదామనుకున్నాడని.. కానీ, పూర్తిగా విఫలమయ్యాడని విమర్శలు చేశాడు. కాగా ఐపీఎల్-2023లో తమ రెండో మ్యాచ్‌లో కేకేఆర్ గురువారం ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే వెంకటేశ్ అయ్యర్(3), వన్‌డౌన్ బ్యాటర్ మన్దీప్ సింగ్(0) అవుటయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రింకూ సింగ్(46), శార్దూల్ ఠాకూర్ (68) అద్భుత ఇన్నింగ్స్‌తో 204 పరుగులు చేసిన కేకేఆర్.. వరుణ్ చక్రవర్తి సహా మిగతా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో 123 పరుగులకే ఆర్సీబీని కట్టడి చేసింది. ఈ క్రమంలో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఈ సీజన్లో తొలి గెలుపు నమోదు చేసింది. అసలు ఎలాంటి షాట్ ఆడుతున్నాడో?! ఈ నేపథ్యంలో కేకేఆర్ ఇన్నింగ్స్ సాగిన విధానం ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కేకేఆర్ ఆరంభంలోనే తడబడింది. రీస్ టోప్లే స్థానంలో వచ్చిన డేవిడ్ విల్లే వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చాడు. ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ త్వరగానే అవుటయ్యాడు. ఇక మన్దీప్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. జట్టులో అతడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్న విషయంపై మనకు సందేహాలు రాకమానవు. ఆ తర్వాత నితీశ్ రాణా. అసలు ఎలాంటి షాట్ ఆడుతున్నాడో తనకైనా అర్థమైందో లేదో?! రాణా సంగా అవుదామనుకున్నాడు. కానీ.. ఎక్కువసేపు నిలవలేక అవుటై పోయాడు. మైకేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, రింకూ సింగ్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. రింకూ సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. రసెల్ పూర్తిగా నిరాశపరచగా.. శార్దూల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 204 పరుగుల మార్కును చేరుకోగలిగింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన నితీశ్ రాణా.. దినేశ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్ -
ఇషాన్ కిషన్ వద్దు.. కేఎస్ భరత్‌ను పక్కకు పెట్టొద్దు, కోహ్లి, పుజారా ఏం చేశారని..?
BGT 2023 IND VS AUS 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు ఎలా ఉండబోతున్నదానిపై మేనేజ్మెంట్ ఇప్పటికే కొన్ని సంకేతాలు వదిలింది. టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుందని, సిరాజ్ స్థానంలో షమీ, వికెట్‌కీపర్ కేఎస్ భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడే పరోక్షంగా క్లూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్‌కు ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. నాలుగో టెస్ట్‌లో భరత్‌ను పక్కకు పెట్టొదని జట్టు మేనేజ్మెంట్కు సూచించాడు. ఇషాన్ కిషన్ ప్రస్తావన తేకుండా భరత్‌ను తుది జట్టులో కొనసాగించాలని కోరాడు. బ్యాట్‌తో రాణించలేదన్న కారణంగా భరత్‌ను పక్కకు పెట్టడం సహేతుకం కాదని, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, పుజారా, శ్రేయస్ అయ్యర్ ఫెయిలైన చోట భరత్ బ్యాట్‌తో రాణించాలని ఆశించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. Do you agree with Aakash Chopra?#CricTracker #AakashChopra #INDvAUS pic.twitter.com/aiFlSw6u0M — CricTracker (@Cricketracker) March 8, 2023 ఢిల్లీ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. బ్యాట్‌తో ప్రతి ఇన్నింగ్స్‌లో రాణించడలేదని భరత్‌ను బెంచ్‌కు పరమితం చేస్తే, ఇంతకు మించిన అపహాస్యం ఇంకోటి ఉండదని అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే భరత్ వికెట్ల వెనక ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడని, బ్యాట్‌తో ప్రూవ్ చేసుకునేందుకు అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే మెరుగవుతాడని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగు మ్యాచ్‌ల BGT 2023లో ఇప్పటివరకు జరిగిన 3 టెస్ట్‌ల్లో భారత్ 2 (తొలి రెండు), ఆసీస్ ఒక మ్యాచ్ (మూడో టెస్ట్) గెలుపొందిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్‌ల్లో గెలిచి జోరుమీదుండిన భారత్.. అనూహ్యంగా మూడో టెస్ట్‌లో ఓటమిపాలై చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్‌లో నాథన్ లయోన్ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్‌ల్లో బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన భారత్.. మూడో టెస్ట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్‌లో లయోన్ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (197) పరిమితమైన ఆసీస్.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు భారత్.. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132 తేడాతో, రెండో టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్ అనంతరం భారత్, ఆసీస్‌లు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది. -
MI Vs RCB: పరుగుల వరద.. ముంబైపై ఆర్సీబీ గెలుపు ఖాయం!
Womens Premier League 2023 RCB VS MI: మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్పక గెలుస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముంబై ఇండియన్స్ మహిళా జట్టుపై స్మృతి సేన పైచేయి సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగడం ఖాయమని.. ఆర్సీబీని విజయం వరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవాలని సూచించాడు. ఇక ముంబై టాపార్డర్ పటిష్టంగా ఉన్నపటికీ ఆర్సీబీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బెంగళూరు మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ మ్యాచ్ జరిగింది బ్రబౌర్న్ స్టేడియంలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబైతోనూ అదే మైదానంలో పోటీపడనుంది. ఇప్పటికే బ్రబౌర్న్‌లో ఆడినందు వల్ల అక్కడి పరిస్థితులపై ఆర్సీబీ ప్లేయర్లకు అవగాహన ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ గత ప్రదర్శనలు గమనిస్తే అందరూ ముంబై వైపే మొగ్గు చూపుతారు. కానీ నేను మాత్రం ఈసారి ఆర్సీబీకే ఓటు వేస్తున్నా. స్మృతి రాణిస్తేనే అయితే, స్మృతి భారీ స్కోరు నమోదు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై స్పిన్ ఆల్‌రౌండర్ హైలీ మాథ్యూస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. ఈ ఆఫ్ స్పిన్నర్ కచ్చితంగా స్మృతిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి స్మృతి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక సోఫీ డివైన్ కూడా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. ఇక ఆర్సీబీ పేస్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్ సేవలను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై టాపార్డర్ అత్యద్భుతంగా ఉంది. హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్.. ఆ తర్వాత పూజా వస్త్రాకర్‌లతో పటిష్టంగా కనపడుతోంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న ఆకాశ్ చోప్రా.. ‘‘బ్రబౌర్న్ పిచ్ ఫ్లాట్‌గా ఉంది. మరో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవాలి. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుంది.. కాబట్టి ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటే కనీసం 200 పరుగులు స్కోరు చేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూపీఎల్-2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలపడ్డ ముంబై.. 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ సేన ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించింది. మరోవైపు.. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ టీమ్‌తో తలపడ్డ ఆర్సీబీ.. 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఆర్సీబీ సారథి స్మృతి 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం (మార్చి 6) మ్యాచ్ జరుగనుంది. చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన సచిన్ ప్రపంచంలో మేటి బ్యాటరే.. కానీ..! షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు -
కేఎల్ రాహుల్ విషయంలో మాజీల మధ్య తిట్ల పురాణం
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికి ఆటతీరు మాత్రం రోజురోజుకు మరింత నాసిరకంగా తయారైంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోర ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ పదవి కూడా మూడింది. అతన్ని జట్టులో నుంచి తీసేయాలని పెద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా కేఎల్ రాహుల్ విషయమై టీమిండియా మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రాల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది.రాహుల్ విషయంలో వెంకటేశ్ ప్రసాద్ వ్యక్తిగత ఎజెండాతోనే విమర్శలు గుప్పిస్తున్నాడని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. దీనికి ట్విటర్ ద్వారా ప్రసాద్ కౌంటర్ వేశాడు. టెస్ట్ క్రికెట్ లో అతని ఫామ్ నానాటికి దిగజారుతుండటంపై తీవ్ర విమర్శలు చేశాడు. తుది జట్టులో ఉండే అర్హత అతనికి లేదని స్పష్టం చేశాడు. రాహుల్ లాగా మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ లకు ఎక్కువ అవకాశాలు దక్కలేదనీ అన్నాడు. అయితే దీనిపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో స్పందిస్తూ.. ''ప్రసాద్ తనకు అనుకూలంగా ఉండేలా మయాంక్, ధావన్, గిల్ గణాంకాలను చూపెట్టాడని'' విమర్శించాడు. ఇది ప్రసాద్ కు అస్సలు రుచించలేదు. ఎప్పుడో పదేళ్ల కిందట రోహిత్ శర్మ గురించి ఆకాశ్ చోప్రా వ్యంగ్యంగా చేసిన ఓ ట్వీట్ ను గుర్తు చేస్తూ అతనిపై ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించాడు. "యూట్యూబ్ లో నా ఫ్రెండ్ ఆకాశ్ చోప్రా ఓ చెత్త వీడియో చేసి నాది వ్యక్తిగత ఎజెండా అని విమర్శిస్తున్నాడు. స్వదేశంలో మయాంక్ సగటు 70 అన్న విషయాన్ని మరచిపోయి తన అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్న వారి అభిప్రాయాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇదే వ్యక్తి రోహిత్ కు జట్టులో చోటు వద్దని వాదించాడు" అని ఓ ట్వీట్ లో ప్రసాద్ అన్నాడు. "నాకు ఏ ప్లేయర్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఎజెండా లేదు. ఇతరులకే అలాంటి ఎజెండాలు ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా వ్యక్తిగత ఎజెండా అనే విమర్శలు సరి కాదు. కేఎల్ రాహుల్ పైనే కాదు ఏ ఇతర ఆటగాడికి నేను వ్యతిరేకం కాదు. అన్యాయమైన టీమ్ ఎంపికనే నేను సవాలు చేస్తున్నాను. సర్ఫరాజ్ అయినా, కుల్దీప్ అయినా మెరిట్ ఆధారంగానే నా గళం వినిపిస్తున్నాను. కానీ ఆకాశ్ దీనిని వ్యక్తిగత ఎజెండా అనడం నిరాశ కలిగించింది" అని ప్రసాద్ అన్నాడు. ఈ సందర్భంగా 2014లో రోహిత్ శర్మపై ఆకాశ్ చోప్రా చేసిన ఓ వ్యంగ్యమైన ట్వీట్ ను ప్రసాద్ తెరపైకి తెచ్చాడు. "రోహిత్ 24 ఏళ్ల వయసు, 4 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్నప్పుడు అతని గురించి ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ ఇదీ. రోహిత్ పై తన వ్యంగ్యాన్ని అతడు ఉపయోగించవచ్చు కానీ నేను 8 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న రాహుల్ సరిగా ఆడని సమయంలో మాత్రం విమర్శలు చేయకూడదు. ఇది సరైనదేనా?" అని ప్రసాద్ ప్రశ్నించాడు. Venky bhai, msgs are getting lost in translation. You here. Me on YT. I invite you to come on a Video Chat…we can do it Live. Difference on opinions is nice…lets do it properly 😊 I’ll not have any sponsors on it & nobody will make money out of it. Up for it? You have my number https://t.co/ZrAzWoJiTv — Aakash Chopra (@cricketaakash) February 21, 2023 I have no agenda against any player, maybe there are others who have. Difference of opinion is fine but calling contrary views as apna personal agenda and Twitter par mat laayein is funny for @cricketaakash , considering he has made a great career by airing his views. I have … — Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023 This is what Aakash had aired when Rohit was 24 with 4 yrs in international cross. He can use sarcasm for Rohit at 24, and I cannot point out underperforming Rahul at 31 with 8 years in International cricket. Yeh bhi sahi hai pic.twitter.com/caNnrbC5lj — Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023 KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే! -
‘టీమిండియాను పాక్ మాత్రమే ఓడించగలదు’.. అవునా! కౌంటర్ అదుర్స్
India vs Australia- World Test Championship: టీమిండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ పాకిస్తాన్ అభిమానికి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సానుకూల దృక్పథంతో ఉండటం తప్పు కాదంటూనే పాక్ జట్టు వైఫల్యాలు ఎత్తిచూపుతూ సెటైర్లు వేశాడు. కాగా భారత్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇరు జట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి టెస్టు ఆరంభం కాగా.. ఆది నుంచి రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్విటిజెన్.. ‘‘భారత గడ్డపై టీమిండియాను ఓడించగల సత్తా కేవలం పాకిస్తాన్‌కు మాత్రమే ఉంది’’ అంటూ కామెంట్ చేశాడు. పాపం.. పాకిస్తాన్! తిక్క కుదిరింది.. ఇందుకు స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘నీ సానుకూల దృక్పథం నాకు నచ్చిందబ్బాయ్! అయితే.. ఒకటి కనీసం సొంతగడ్డపై అయినా మీ జట్టు సిరీస్‌లు గెలవొచ్చు కదా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్‌లు ఏమయ్యాయి. విదేశీ గడ్డపై బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్‌ల సిరీస్‌లు అన్నిటిలో పాకిస్తాన్ గెలిచి ఉంటే గనుక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది’’ అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తిక్క బాగా కుదిర్చావు! దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు ఆకాశ్ భాయ్’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ పోరులో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్.. ఆసీస్‌పై గెలిస్తే ఫైనల్ చేరడం ఖాయం. మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్‌వాష్‌కు గురవడం సహా ఇతర సిరీస్‌లు గెలవలేకపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది. చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్ Todd Murphy: 7 వికెట్లతో చెలరేగిన ఆసీస్ సంచలనం.. మరో రికార్డు! I love your positivity but janaab, aap Apne ghar ki series toh Jeet lo. With Australia, England and NZ at home. Bangladesh, Sri Lanka and WI in away series, Pakistan should have reached the WTC finals already. 🫣🫂 https://t.co/UEo67hQYU9 — Aakash Chopra (@cricketaakash) February 9, 2023 -
BGT 2023: 36 ఆలౌట్ గుర్తుందా.. సిరీస్ ఓటమి గుర్తు లేదా..?
IND VS AUS: దాయాదుల సమరం, యాషెస్ సిరీస్ తర్వాత క్రికెట్లో అంత క్రేజ్ ఉన్న సిరీస్ ఏదైనా ఉందంటే..? అది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనేని తప్పక చెప్పాల్సిందే. ఇరు జట్ల మధ్య గత 27 ఏళ్లుగా జరుగుతున్న ఈ రైవల్రీలో ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఈ విషయాన్ని పక్కకు పెడితే.. ఆసీస్ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతి సిరీస్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టుపై మాటల యుద్ధానికి దిగి, ఆ జట్టును నైతికంగా బలహీన పర్చాలని వ్యూహాలను రచిస్తుందన్న విషయం విధితమే. ఆసీస్ ఆడే ఈ మైండ్ గేమ్‌లో మేటి జట్లు సైతం చిక్కి విలవిలలాడిన సందర్భాలు మనం చాలా చూశాం. All out for 36 😳The Border-Gavaskar Trophy starts on Thursday! #INDvAUS pic.twitter.com/Uv08jytTS7— cricket.com.au (@cricketcomau) February 6, 2023 BGT 2023 ప్రారంభానికి ముందు కూడా ఆసీస్ ఇలాంటి మైండ్ గేమ్నే మొదలుపెట్టింది. టీమిండియా ఆటగాళ్లను, జట్టు ప్రదర్శనను తక్కువ చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డే (క్రికెట్ ఆస్ట్రేలియా) రంగంలోకి దిగి టీమిండియాను కించపర్చే విధంగా ట్వీట్ చేసింది. 2020-21 సిరీస్‌లో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైన విషయాన్ని ప్రస్తావించి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. సీఏ ఆడిన ఈ మైండ్ గేమ్‌కు టీమిండియా ఆటగాళ్లు కానీ, యాజమాన్యం కానీ స్పందించనప్పటికీ.. భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు. And the series score-line? #JustAsking 🫶 https://t.co/u0X43GgS8k— Aakash Chopra (@cricketaakash) February 6, 2023 భారత్ 36 పరుగులకే ఆలౌటైన విషయం ఓకే.. సిరీస్ సంగతేంటీ..? అంటూ సుతిమెత్తగా కౌంటరిచ్చాడు. ఆ సిరీస్‌లో తొలి టెస్ట్‌లోనే టీమిండియా ఓటమిపాలు కావడంతో 4 టెస్ట్‌ల సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా ఊహించారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా ఆసీస్‌కు వారి స్వదేశంలోనే ఫ్యూజుల ఎగిపోయేలా చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్నే ఆకాశ్ చోప్రా పరోక్షంగా ప్రస్తావించి.. ఆసీస్ మైండ్‌గేమ్‌కు కౌంటరిచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా, 2020-21 సిరీస్‌లో విరాట్ కోహ్లి తొలి టెస్ట్ అనంతరం తప్పుకున్నప్పటికీ.. యువకులతో కూడిన యంగ్ ఇండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఆసీస్‌కు షాకిచ్చింది. -
'ఆస్ట్రేలియాకు కోహ్లి చుక్కలు చూపిస్తాడు.. కనీసం రెండు సెంచరీలైనా'
పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. ఇప్పుడు టెస్టుల్లో కూడా తన పూర్వ వైభవాన్ని పొందాలని భావిస్తున్నాడు. టెస్టుల్లో విరాట్ సెంచరీ సాధించి దాదాపు 1000 రోజులు పైనే అవుతుంది. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో సెంచరీ సాధించి.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాలని కింగ్ కోహ్లి యోచిస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రంమంలో నాగ్‌పూర్‌లోని ఓల్డ్ విదర్భ క్రికెట్ ఆసోషియషన్ గ్రౌండ్లో కోహ్లి కఠోర సాధన చేస్తున్నాడు. ఇక ఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే చాలు కోహ్లి చెలరేగిపోతాడని చోప్రా అన్నాడు. అదే విధంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కనీసం రెండు సెంచరీలైనా సాధిస్తాడని అతడు జోస్యం చెప్పాడు. కనీసం రెండు సెంచరీలైనా.. "బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-భారత్ మధ్య ఎప్పుడూ తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇదొక చారిత్రత్మక సిరీస్. కాబట్టి ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి పరుగులు చేయడం తప్పనిసరి. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలు కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. గతంలో కూడా ఆస్ట్రేలియాపై విరాట్ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. కాబట్టి మరోసారి ఆసీస్‌పై కోహ్లి విరుచుకుపడతాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి కనీసం రెండు సెంచరీలు సాధిస్తాడు" అని చోప్రా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నేను ఒక్క విషయం గమనించాను. విరాట్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. బంగ్లా సిరీస్‌లో స్పిన్నర్ తైజుల్ ఇస్లాంకు రెండు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అతడు వేసిన ఫుల్ డెలివరీని కోహ్లి బ్యాక్ఫూట్లో ఆడి క్లీన్ బౌల్డయ్యాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఇదేవిధంగా విరాట్ తన వికెట్‌ను కోల్పోయాడు. మిచెల్ సాంట్నర్ వేసిన ఫుల్ డెలివరీకి కోహ్లి అడడంలో విఫలమయ్యాడు. కాబట్టి కాస్త స్పిన్నర్లపై దృష్టిపెడితే చాలు అని చోప్రా అన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారత జట్టులోకి జయంత్ యాదవ్, పుల్కిత్ -
Ind Vs NZ: పృథ్వీ షాకు నో ఛాన్స్! ఓపెనర్లుగా గిల్- ఇషాన్ జోడీనే..
India vs New Zealand, 3rd T20I: టీమిండియా తరఫున బరిలోకి దిగేందుకు యువ ఓపెనర్ పృథ్వీ షా ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20 సందర్భంగా ఈ విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ సాధ్యం కాకపోవచ్చని అంచనా వేశాడు. ఇషాన్- గిల్ జోడీనే మరోసారి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా గత కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న ముంబై బ్యాటర్ పృథ్వీ షా చాలా కాలం తర్వాత కివీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. రంజీల్లో రికార్డులు సృష్టించిన ఈ సంచలన ఆటగాడిని ఎట్టకేలకు సెలక్టర్లు కరుణించడంతో తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టీ20లలో వాళ్లు విఫలమైనా అయితే, పృథ్వీ సమకాలీన క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో చెలరేగిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్.. టీ20లలో సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20లలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. గిల్ వరుసగా 7, 11 పరుగులు చేయగా ఇషాన్ 4, 19 రన్స్ మాత్రమే చేశాడు. వీరిద్దరు విఫలమైన నేపథ్యంలో ఆఖరి టీ20లలోనైనా పృథ్వీకి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం.. ఇందుకు భిన్నంగా పృథ్వీకి ఇప్పుడు అవకాశం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు. పృథ్వీని ఆడించొద్దు.. ఎందుకంటే ఇందుకు గల కారణాలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తూ.. ‘‘నాకు తెలిసి ఇషాన్ కిషన్- శుబ్‌మన్ గిల్ జోడీ కొనసాగుతుంది. పృథ్వీ షా వేచిచూడాల్సిందే! అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పృథ్వీ షాను ఆడించారనుకోండి.. అతడు రన్స్ స్కోరు చేయొచ్చు లేదంటే విఫలం కావొచ్చు. ఒకవేళ అనుకున్నట్లు రాణిస్తే బాగుంటుంది. లేదంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగానే పృథ్వీ రాణించకపోతే.. ఒక్క మ్యాచ్‌ను బట్టి అతడి ఆట తీరును జడ్జ్ చేస్తారా? ఒకే ఒక్క మ్యాచ్‌లో.. అది కూడా సిరీస్‌లో ఆఖరిదైన నిర్ణయాత్మక టీ20లో అవకాశం ఇచ్చి పరీక్ష పెట్టం సరికాదు. వాళ్లకు మరిన్ని ఛాన్స్‌లు అంతేకాదు.. గిల్- కిషన్ జోడీని కూడా ఇప్పుడే విడదీయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. తమను తాము నిరూపించుకుంటే వాళ్లు దీర్ఘకాలం ఆడగలుగుతారు. లేదంటే లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ విజేతను తేల్చే బుధవారం నాటి మూడో టీ20కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. చదవండి: Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ Virushka With Vamika: ప్రకృతి ఒడిలో.. వామికాను ఆటలాడిస్తూ.. విరుష్క ఫొటోలు వైరల్ పృథ్వీ షా చేతికి మైక్ ఇచ్చిన ద్రవిడ్.. నవ్వాపుకొన్న గిల్! వీడియో చూశారా? -
హార్దిక్ వద్దు.. టీమిండియా వన్డే కెప్టెన్సీకి వారిద్దరే సరైనోళ్లు
టీమిండియా త్వరలోనే స్ప్లిట్ కెప్టెన్సీ (వేర్వేరు కెప్టెన్ల)ని కాన్సెప్ట్‌ను ఆచరణకు తీసుకోచ్చే అవకాశం ఉంది అని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నాడని చోప్రా జోస్యం చెప్పాడు. కాగా ఇప్పటికే టీ20ల్లో రోహిత్ స్థానంలో పూర్తి స్థాయి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి రోహిత్ దూరంగా ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రమే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా ప్రస్తుతం టీ20ల్లో భారత కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హార్దిక్ పాండ్యాకు వన్డేల్లో మాత్రం జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం లేదని చోప్రా తెలిపాడు. "త్వరలో భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను చూడబోతున్నాం. అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండే రోజులు ముగిశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ వరకు రోహిత్ టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగుతాడు. అదే విధంగా ప్రస్తుతం టీ20ల్లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇదే ఫార్మాట్లో హార్దిక్‌ను సారథిగా మరి కొంత కాలం కొనసాగిస్తారని భావిస్తున్నాను. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌గా హార్దిక్ బాధ్యతలు నిర్వహించడం మనం చూస్తాం. ఇక 2023 వన్డే ప్రపంచకప్ అనంతరం వన్డే ఫార్మాట్లో కూడా భారత జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. హార్దిక్‌కు మాత్రం వన్డేల్లో జట్టు పగ్గాలు అప్పగించే సూచనలు కనిపించడం లేదు. అయితే యువ ఆటగాళ్లు శుబ్మాన్ గిల్, రిషబ్ పంత్‌లు వన్డే కెప్టెన్సీ రేసులో ఉంటారు. నా వరకు అయితే వీరిద్దరికి భారత జట్టును విజయపథంలో నడిపించే సత్తా ఉంది" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IND VS NZ 2nd T20: టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..! -
WC 2023: ఇక బుమ్రా లేకుండానే... కానీ..
ODI World Cup 2023- Team India Pacers: ‘‘సెప్టెంబరు నుంచి అతడు క్రికెట్ ఆడటమే లేదు. నాకు తెలిసి ఇకపై తను లేకుండానే భారత జట్టు అన్ని మ్యాచ్‌లకు సిద్ధమైపోవాలి. మధ్యలో ఏదో ఒక్క మ్యాచ్ ఆడి.. వెళ్లిపోయాడు. మళ్లీ ఇంతవరకు పునరాగమనం చేయనేలేదు. తిరిగి జట్టులోకి వస్తాడో లేదో కూడా తెలియదు. మొన్నటికి మొన్న తను జట్టులో ఉన్నట్లు ప్రకటించారు. కానీ వెంటనే మళ్లీ గాయం కారణంగా దూరం. అసలే ఈ ఏడాది వరల్డ్‌కప్ ఉంది. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాడు ఇలా పదే పదే జట్టుకు దూరం కావడం సానుకూల అంశమైతే కాదు. ఇప్పటికే ఓ ప్రపంచకప్ టోర్నీ మిస్సయ్యాడు. నాకు తెలిసి ఇక ముందు కూడా జట్టులోకి వస్తాడో లేదో అనుమానమే!’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఫిట్నెస్ సమస్యలతో సతమతం వెన్ను నొప్పి కారణంగా.. గతేడాది ఆసియా టీ20 కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ముందుగా ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేనప్పటికీ ఫిట్నెస్ సాధించిన కారణంగా ఆఖరి నిమిషంలో అతడి పేరును చేర్చారు. కానీ మళ్లీ అంతలోనే గాయం వేధిస్తుండటంతో అందుబాటులోకి లేకుండా పోయాడు. తను భర్తీ చేయగలడు! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బుమ్రా భవిష్యత్తు గురించి పైవిధంగా స్పందించాడు. ఇదే గనుక పునరావృతమైతే అతడు లేకుండానే టీమిండియా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా భారత పేస్ విభాగం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్లు ఇప్పుడైతే లేరని, అయితే ఉమ్రాన్ మాలిక్ కొంతవరకు బుమ్రా లేని లోటు తీరుస్తాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్ సైతం సత్తా చాటుతున్నాడని, తనతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా ప్రభావం చూపగలుగుతున్నాడన్నాడు. అయితే, ప్రసిద్ కృష్ణ గురించి మాత్రం ఇప్పుడే అంచనాకు రాలేమని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. బుమ్రా ఉంటేనే మ్యాచ్‌లు గెలవడం సాధ్యమవుతుందని తాను అనడం లేదని, తను జట్టులో ఉంటే విజయావకాశాలు పెరుగుతాయని మాత్రం చెప్పగలగనని పేర్కొన్నాడు. కానీ అతడి ఫిట్నెస్ సమస్యలు చూస్తుంటే తను తిరిగి జట్టులోకి వస్తాడనే నమ్మకం మాత్రం లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. చదవండి: SA20 2023: డికాక్ పోరాటం వృధా.. చెన్నై చేతిలో లక్నో ఓటమి Prithvi Shaw: ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే! ఇప్పటికైనా.. -
'అతడు చాలా కాలం టీమిండియాకు ఆడతాడు.. కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు'
మంగళవారం(జనవరి 3) శ్రీలంకతో జరిగిన తొలి టీ20 టీమిండియా యువ ఆటగాడు శుబ్మాన్ గిల్ తన టీ20 అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన డెబ్యూ మ్యాచ్‌లోనే గిల్ నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అతడు కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. గిల్ ఆటతీరు టీ20లకు కాకుండా లాంగ్ ఫార్మాట్(టెస్టులు, వన్డేలు)కు మాత్రమే సరిపోతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. "శుబ్మాన్ గిల్‌కు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. అతడు తన అరంగేట్ర సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తే.. రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం లభిస్తుంది. అయితే నా దృష్టిలో మాత్రం గిల్ ఎప్పటికీ లాంగ్ ఫార్మాట్ ఆటగాడే. ఎందుకంటే అతడు ఆడే విధానం టీ20 క్రికెట్‌కు సెట్‌కాదు. గిల్‌కు టెస్టులు, వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. శుబ్మాన్ భవిష్యత్తులో టెస్టు క్రికెట్లో కెప్టెన్ కూడా కావచ్చు. అదే విధంగా అతడికి చాలా కాలం పాటు భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి వన్డేల్లో గిల్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: PAK vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ పేసర్ వచ్చేశాడు -
కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 10 వికెట్లు తీస్తారు..
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. తిరిగి టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక గత కొంత కాలంగా వైట్‌బాల్ క్రికెట్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ కనీసం ఈ టెస్టు సిరీస్‌తోనైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్-భారత మధ్య తొలి టెస్టు ఛాటోగ్రామ్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను అభిమానులతో పంచుకున్నాడు. బంగ్లాతో తొలి టెస్టులో విరాట్ కోహ్లి, పంత్ కలిసి కనీసం 125 పరుగులు చేస్తారని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా మాట్లాడుతూ.. :"బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కనీసం 125 పరుగులు చేస్తారని నేను భావిస్తున్నాను. పంత్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. కాబట్టి జట్టులో ఖచ్చితంగా ఉంటాడు. అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కలిసి 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొడతారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్ ఆలౌట్ అవుతుంది. ఆ 20 వికెట్లలో వీరిద్దరూ కలిసి కచ్చితంగా 10 వికెట్లు సాధిస్తారు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: KL Rahul: అతడిని ఏ ప్రాతిపదికన వైస్ కెప్టెన్ చేశారో తెలీదు.. అయితే పంత్ మాత్రం.. -
టీమిండియా అత్యుత్తమ వన్డే జట్టు.. సూర్యకుమార్ యాదవ్‌కు నో ఛాన్స్!
టీమిండియా అత్యుత్తమ వన్డే ప్లేయింగ్ ఎలెవెన్‌ను భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రకటించాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. వన్డేల్లో భారత ఆటగాళ్ల ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా చోప్రా తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌ను చోప్రా ఎంపిక చేశాడు. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు అతడు అవకాశమిచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కింది. తన జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా యజువేంద్ర చాహల్‌కు అతడు చోటిచ్చాడు. అదే విధంగా పేస్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను మాత్రమే అతడు ఎంపిక చేశాడు. ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: బంగ్లాతో తొలి టెస్ట్.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..! -
టీ20లు కాదు.. వన్డేలపై దృష్టి పెట్టండి! ఐపీఎల్ ఆడడం మానేయండి
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లందరూ టీ20 క్రికెట్‌పై కాకుండా వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించాలని చోప్రా సూచించాడు. ఇక సిరీస్‌ను చేజార్చుకున్న భారత్.. బంగ్లాదేశ్‌తో ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టు కోవాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే ఛాటోగ్రమ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "భారత ఆటగాళ్లు తరచూ విశ్రాంతి తీసుకోవడం మనం చూస్తున్నాం. గత ఏడాది నుంచి చాలా మంది స్టార్ ఆటగాళ్లు పలు వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్నారు. మీకు విశ్రాంతి కావాలంటే ఐపీఎల్ లేదా టీ20 సిరీస్‌లలో విశ్రాంతి తీసుకోండి. కానీ వన్డే క్రికెట్లో మాత్రం జట్టుకు అందుబాటులో ఉండండి. ఎందుకంటే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఐపీఎల్ వరకు భారత జట్టు దాదాపు 10 వన్డేలు ఆడనుంది. కాబట్టి ఈ మొత్తం వన్డేల్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఆడాలి. అప్పడే ప్రపంచకప్‌లో పోటీ పడగలరు. ఇక ఆటగాళ్లకు ఎక్కువగా విశ్రాంతిని ఇవ్వడం మన జట్టులోనే కాదు ప్రపంచ క్రికెట్లో చాలా జట్లు అలానే చేస్తున్నాయి. అది సరైన నిర్ణయం కాదు. ఆటగాళ్లు ఎక్కువగా క్రికెట్ ఆడకపోతే వాళ్లకి ప్రాక్టీస్ ఎలా అవుతుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే తప్పు చేసింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు అలసట పేరిట చాలా మంది ఆటగాళ్లకు రెస్టు ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది మెగా టోర్నీలో ఆసీస్ కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు! -
3 ఫిఫ్టీలు ఉన్నా అతడి ఇన్నింగ్సే అద్భుతం! వాషీని ప్రశంసిస్తూనే.. పంత్‌ను కూడా!
New Zealand vs India, 1st ODI- Washington Sundar- Rishabh Pant: ‘‘వాషింగ్టన్ సుందర్ ఆట తీరు అమోఘం. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. భారత యువ ఆల్‌రౌండర్‌పై ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడి తనదైన ముద్ర వేశాడని కొనియాడాడు. మెరుపు ఇన్నింగ్స్ కాగా కివీస్‌తో మొదటి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు(స్ట్రైక్‌రేటు 231.25) సాధించాడు. టీమిండియా స్కోరు 300 మార్కు దాటడంలో తన వంతు పాత్ర పోషించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక టాపార్డర్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్ 72, శుబ్‌మన్ గిల 50 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో అదరగొట్టాడు. వీరికి తోడు సంజూ శాంసన్ 36, వాషీ 37 పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. వారెవ్వా సుందర్ ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘టీమిండియా ఇన్నింగ్స్‌లో మూడు 50+ స్కోర్లు ఉన్నప్పటికీ సుందర్ మెరుపు ఇన్నింగ్సే ఎక్కువ ప్రభావంతమైనదని చెప్పవచ్చు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అతడు ఏ మేరకు స్కోరు చేశాడనేదే ముఖ్యం’’ అని వాషింగ్టన్ సుందర్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. Well played, Washington Sundar. What an innings. This Indian innings has three 50+ scores but it’s Sundar’s innings that might have had the biggest impact. People who bat lower down the order mustn’t be judged with the usual parameters of ‘average’. Impact is what matters. — Aakash Chopra (@cricketaakash) November 25, 2022 పంత్‌పై సానూభూతి! ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ యువ బ్యాటర్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. నెటిజన్లు అతడిని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘రిషభ్ పంత్‌పై ఈ ప్లాట్ఫామ్లో ఈ స్థాయిలో విద్వేషం చిమ్మడాన్ని నమ్మలేకపోతున్నా’’ అని ఈ మాజీ బ్యాటర్ అన్నాడు. కాగా టీ20 ఫార్మాట్లో రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నప్పటికీ వన్డేల్లో మాత్రం అతడి ఆట తీరు మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. పర్లేదు.. మరీ అంత చెత్తగా ఏమీ లేదు ఈ ఏడాది ఇంగ్లండ్ మీద 125(నాటౌట్), వెస్టిండీస్ మీద అర్ధ శతకం(56).. సౌతాఫ్రికాతో విలువైన 85 పరుగులతో జట్టు గెలుపులో పాలుపంచుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వన్డేలో 125 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ పంత్ హేటర్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు అతడి అభిమానులు. The amount of hate Rishabh Pant gets on this platform is unreal… 🤷♂️ — Aakash Chopra (@cricketaakash) November 25, 2022 చదవండి: Ind Vs NZ 1st ODI: కివీస్ గడ్డపై శ్రేయస్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా! వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమంటూ.. IND vs NZ: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
Surya Kumar Yadav: ఏ గ్రహం నుంచి వచ్చాడో దేవుడికే తెలియాలి..!
టీమిండియా డాషింగ్ ఆటగాడు, నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో స్కై ఆటకు ముగ్దుడైన అతను.. సూర్య బ్యాటింగ్ విన్యాసాలను వేనోళ్లతో పొగిడాడు. ముఖ్యంగా రెండో టీ20లో సూర్యప్రతాపాన్ని ఆకాశ్ ఆకాశానికెత్తాడు. ఆ మ్యాచ్‌లో అతను ఆడిన షాట్లు నమ్మశక్యంగా లేవని, అసలు అలాంటి షాట్లు ఆడటం భూమిపై ఎవరికైనా సాధ్యపడుతుందా అని నోరెళ్ల పెట్టాడు. ఆ ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో అతను అలరించిన తీరు అత్యద్భుతమని, అతని బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు చాల లేదని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడిన షాట్లు మనిషి అనే వాడు ఆడలేడని, కొన్ని షాట్లు చూసాక అతను మనిషా లేక గ్రహాంతర వాసా అన్న డౌట్లు వచ్చాయని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఒకవేళ సూర్యకుమార్ గ్రహాంతర వాసే అయితే, అతను ఏ గ్రహం నుంచి వచ్చాడో దేవుడికే తెలియాలని అన్నాడు. ఇటీవలి కాలంలో అతని బ్యాటింగ్ శైలిలో చాలా మార్పు వచ్చిందని, ఇది టీమిండియాకు ఎంతో లాభదాయకమని తెలిపాడు. మౌంట్ మాంగనూయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కేవలం 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన సూర్య.. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ట్యాగ్‌కు నిజమైన అర్హుడని అనిపించుకున్నాడని అన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆడిన షాట్లు చూస్తే నమ్మశక్యంగా లేవని, టీ20ల్లో సూర్య టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లంతా అతనికి ఎదురుపడాలంటే జంకుతున్నారని, అంతలా అతను బౌలర్లను భయపెడతున్నాడన్నాడు. అయితే, అతను షాట్లు ఆడే రిస్కీ విధానం చూస్తే.. ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోవడం ఖాయమని, ఒకవేళ అలా జరిగినా అది ఎక్కువ కాలం కొనసాగదని జోస్యం చెప్పాడు. -
ఓపెనర్‌గా పంత్ వద్దు.. అతడిని పంపండి! విధ్వంసం సృష్టిస్తాడు
టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్సీ, ఓపెనింగ్ స్థానాల పైన తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. భారత టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పజెప్పాలని పెద్ద సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీ20ల్లో భారత ఓపెనర్‌గా రిషబ్ పంత్‌ను పంపాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా పంత్‌ను టీ20ల్లో ఓపెనింగ్ పంపాలని సూచించాడు. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఒక వేళ రోహిత్ జట్టుకు దూరమైతే భారత ఓపెనర్‌గా రిషబ్ పంత్‌ను ఫస్ట్ చాయిస్‌గా భావించకూడదని ఆకాష్ చోప్రా అన్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత జట్టుకు ఒక విధ్వంసకర ఓపెనర్ అవసరం. పృథ్వీ షా రూపంలో టీమిండియాకు అద్భుతమైన అవకాశం ఉంది. అతడు విధ్వంసకర ఆటగాడు. పవర్ ప్లే జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కానీ అతడు ఫిట్‌గా లేడు, ఓపెనర్‌గా పనికిరాడని కొంతమంది భావిస్తున్నారు. దేశీవాళీ క్రికెట్లో ఓపెనర్‌గా అతడి రికార్డులు చూసి మాట్లాడాలి. అయితే ప్రతీ మ్యాచ్‌లోనూ చేలరేగుతాడని నేను చెప్పడం లేదు. బట్లర్, హేల్స్ వంటి వారు కూడా ప్రతీ మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడలేరు కదా. పృథ్వీ మీ దృష్టిలో లేకపోతే, ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వండి. అతడు కూడా విధ్వంసక బ్యాటర్. ఒక్క సారి క్రీజులో నిలదొక్కకుంటే చెలరేగి ఆడుతాడు. అంతే తప్ప పంత్‌ను మాత్రం ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్‌గా భావించకూడదు" అని పేర్కొన్నాడు. చదవండి: Rishabh Pant: రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్‌దే హవా.. జట్టులో కీలక ప్లేయర్‌గా.. -
అది వందకు వంద శాతం ఫేక్ ఫీల్డింగ్.. తప్పే.. అయితే: భారత మాజీ ప్లేయర్
T20 WC 2022 Ind Vs Ban- Virat Kohli: ‘‘ఐసీసీ ప్రాథమిక నిబంధన ప్రకారం.. మైదానంలో ఫీల్డర్.. తన సమీపంలో బంతి లేనప్పటికీ ఫేక్ త్రో ద్వారా గానీ.. డైవ్ చేస్తున్నట్లు గానీ నటించి బ్యాటర్ల దృష్టిని మరల్చేలా చేయడం ముమ్మాటికీ తప్పే. బ్యాటర్ల దృష్టిని సదరు ఫీల్డర్ ఆకర్షించాడా లేడా అన్న విషయం పక్కన పెడితే.. ఫేక్ ఫీల్డింగ్ జరిగినట్లు అంపైర్లు గుర్తిస్తే పెనాల్టీ రూపంలో బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు ఇవ్వాల్సిందే. ఏదైనా జరిగి ఉండేది ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆ ఐదు పరుగులు ఇచ్చి ఉంటే.. బంగ్లాదేశ్ బ్యాటర్లు తీసిన పరుగు కూడా కౌంట్లోకి వచ్చేది. ఒకవేళ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తే.. మరుసటి బంతికి ఎవరు స్ట్రైక్ తీసుకోవాలా అన్న విషయం గురించి బంగ్లా ఆలోచించుకునేది. ఈ ఘటన తర్వాత మ్యాచ్‌లో ఏదైనా జరిగి ఉండేది. అయితే, అక్కడేం జరిగిందంటే.. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఈ విషయాన్ని గమనించలేదు. ఫేక్ ఫీల్డింగ్ అన్న విషయం అసలు వాళ్ల దృష్టికే రాలేదు. మైదానంలో ఎవరూ దీనిని గురించి పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం అంపైర్లు ఇలాంటి వాటిని గమనించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఉండాల్సింది. ఒకవేళ థర్డ్ అంపైర్ పరిధిలో గనుక ఈ అంశం ఉండి.. నిబంధనలకు లోబడి.. జోక్యం చేసుకునే వీలుంటుంది. వందకు వంద శాతం నిజం చెప్పాలంటే అది వందకు వంద శాతం ఫేక్ ఫీల్డింగే! తన సమీపంలో బంతి లేకున్నా అతడు బంతిని విసిరినట్లుగా నటించాడు. ఒకవేళ అంపైర్ ఈ విషయాన్ని గమనించి ఉంటే మనకు ఐదు పరుగుల పెనాల్టీ పడేది. అయినా మనం ఐదు పరుగుల తేడాతో గెలిచేవాళ్లం. ఈసారికైతే తప్పించుకోగలిగాం. కానీ తదుపరి మ్యాచ్‌లలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే అంపైర్లు తప్పక గమనించాలి. వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి బంగ్లా జట్టు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? అవును కచ్చితంగా వాళ్లు సరిగ్గానే చెప్పారు. అయితే, ఆ విషయాన్ని మైదానంలో ఎవరూ గమనించలేదు కాబట్టి మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? తమతో మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ బంగ్లాదేశ్ చేసిన ఆరోపణలను సమర్థించాడు. కాగా ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 16 ఓవర్లకు కుదించి 151 పరుగుల టార్గెట్ విధించారు. ఈ క్రమంలో భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఇదిలా ఉంటే.. బంగ్లా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కోహ్లి తన దగ్గర బంతి లేకపోయిన్పటికీ త్రో చేసినట్లుగా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం స్పందించిన బంగ్లా ఆటగాడు నూరుల్ హసన్.. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపించాడు. బంగ్లా ఫ్యాన్స్ సైతం ఇదే తరహాలో టీమిండియా గెలుపును తక్కువ చేసి చూపేలా ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లి వల్ల బ్యాటర్ల దృష్టి మరలలేదు.. కాబట్టి పెనాల్టీ విధించాలనడం సరైంది కాదని కొంతమంది టీమిండియాను సపోర్టు చేస్తున్నారు. ఆయన అలా... ఈయన ఇలా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం ఈ అంశంపై తన స్పందన తెలియజేస్తూ.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటనపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. బంగ్లాను సమర్థించే విధంగా మాట్లాడుతునే టీమిండియా ఐదు పరుగుల తేడాతో గెలిచేదంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇందుకు బదులుగా టీమిండియా ఫ్యాన్స్ ఈ కామెంటేటర్‌పై సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బంగ్లా ఫ్యాన్స్ మాత్రం సరిగ్గా చెప్పారంటూ ఆకాశ్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి (64- నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్ దిగ్గజం.. అయితే! T20 WC 2022 NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్! Kohli Fake Fielding: డిస్టర్బ్ అయినట్లు కనిపించలేదు.. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఇవ్వలేదు -
'టీ20 ప్రపంచకప్‌లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్'
టీ20 ప్రపంచకప్-2022 మెగా సమరానికి మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జిలాంగ్ వేదికగా ఆక్టోబర్ 16న శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే.. రోహిత్ సేన తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌కు రెండు వారాల ముందే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో పరజాయం పాలైంది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు రాహల్ 74 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తరపున టాప్ రన్ స్కోరర్ కేఎల్ రాహుల్ కావచ్చు. అతడు ఓపెనర్‌గా వస్తాడు కాబట్టి మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియాలో పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తాయి. అక్కడ బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది. అక్కడి పిచ్‌లు కేఎల్ రాహుల్‌కు సరిగ్గా సరిపోతాయి" అని పేర్కొన్నాడు. చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
Ind Vs SA: అతడు లేడు.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్
India vs South Africa, 1st T20I: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడం తీరని లోటు అని.. తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనకు పరాజయం తప్పదని జోస్యం చెప్పాడు. ఎయిడెన్ మార్కరమ్, క్వింటన్ డికాక్ చేరికతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని.. మొదటి టీ20లో బవుమా బృందం విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం(సెప్టెంబరు 28) భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు.. పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడు లేని భారత జట్టు బలహీనం! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేసే క్రమంలో.. ‘‘చివరిసారి దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడికి వచ్చినపుడు ఎయిడెన్ మార్కరమ్ లేడు. డికాక్ కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందుకే అప్పుడు ప్రొటిస్ కాస్త బలహీనంగా కనిపించింది. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో ఉన్నారు. డెత్ ఓవర్లలోనూ.. ఇక టీమిండియా విషాయనికొస్తే హార్దిక్ పాండ్యా లేకపోవడంతో జట్టు కాస్త బలహీనపడిందని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుంది. ఈ సిరీస్‌కు పాండ్యా అందుబాటులో లేకపోవడం ఒక కారణం అయితే.. డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక భువనేశ్వర్ కుమార్ ఇటీవలి కాలంలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే, ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నాడు. కానీ తర్వాత అతడు ఎలా ఆడతాడన్నది చూడాలి. నాకైతే భువీ విషయంలో నమ్మకం కాస్త సడలింది. ఇక గాయం నుంచి కోలుకున్న ఆటగాడు సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. హర్షల్ పటేల్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆసీస్‌తో మూడో టీ20లో ఫైనల్ ఓవర్ అతడు బౌల్ చేసిన విధానం చూస్తే ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఏదేమైనా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ అంశం కలవరపెడుతోందన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మూడోసారి! ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో టీమిండియాకు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్. జనవరిలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. జూన్‌లో ఆ జట్టు ఇక్కడికి వచ్చింది. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. చదవండి: Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! -
T20 WC: మరీ ఇంత దారుణమా? టీమిండియా ట్రోఫీ గెలవడం కష్టమే!
T20 World Cup 2022- Team India: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా విజయావకాశాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందని.. ఇలాంటి జట్టుతో ట్రోఫీ గెలవడం కష్టమేనని పేర్కొన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్ కాపాడుకోలేకపోయారని విమర్శించిన ఆకాశ్ చోప్రా.. టీమిండియా బౌలర్ల ఆట తీరు ఇలాగే ఉంటే మెగా టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెత్త ఫీల్డింగ్, బౌలింగ్! ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాతో టీమిండియా వరుస సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా కంగారూలతో తొలి టీ20లో 208 పరుగులు చేసిన టీమిండియా.. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అదే విధంగా.. ఆసియా కప్-2022లో సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సైతం టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడి ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. కాగా గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ ఈ టోర్నీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీళ్లతో ట్రోఫీ గెలవడం కష్టమే ఈ పరిణామాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ముఖ్యంగా యజువేంద్ర చహల్ ఆట తీరుపై పెదవి విరిచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘నా అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. వికెట్లు తీసే బౌలర్ ఒక్కరూ కనబడటం లేదు. లెగ్ స్పిన్నర్ యుజీ చహల్ ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆసియా కప్‌లోనూ ఇలాగే ఆడాడు. స్లోవర్ బాల్స్ వేయకుండా అతడు వికెట్లు ఎలా తీస్తాడు? ఇక ఇప్పుడేమో హర్షల్, బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చారని.. అంతా బాగుంటుందని సంబరపడిపోతున్నారు. కానీ నాకెందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బాధగా అనిపించినా ఇదే నిజం. ఐపీఎల్లో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈసారి మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. ఒక్క మ్యాచ్‌లో ఐదు లేదంటే ఆరు వికెట్లు తీసి మిగతా మ్యాచ్‌లలో చేతులు ఎత్తేయడం సరికాదు కదా! మన బౌలింగ్ బలహీనంగా ఉందనేది వాస్తవం. ఇలాంటి ఆట తీరుతో మనం ట్రోఫీ ఎలా గెలవగలం? రోజురోజుకీ మన విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి’’ అని పేర్కొన్నాడు. చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే!
Asia Cup 2022- Team India: ‘‘గతేడాది ప్రపంచకప్ టోర్నీలో మన జట్టు ఓడిపోయినపుడు చాలా మంది దానికి కారణం విరాట్ కోహ్లి అన్నారు. కెప్టెన్‌ను మార్చాలని మాట్లాడారు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఆసియా కప్ గెలవలేకపోయాడు కదా’’ అని టీమిండియా మాజీ కెప్టెన్ ఆకాశ్ చోప్రా అన్నాడు. మెగా టోర్నీలో భారత్ చతికిల పడటానికి కెప్టెన్లు కారణం కాదని.. అసలు సమస్య జట్టు ఎంపికలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. కోహ్లి, రోహిత్ కారణం కాదు! గతేడాది యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్-2021లో కోహ్లి సేన తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఐసీసీ ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరు, కోహ్లి కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు చెప్పినట్లుగానే విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. చెత్త ప్రదర్శన ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హిట్‌మాన్ సారథ్యంలో భారత జట్టు టీ20 ఫార్మాట్లో అద్బుత విజయాలు సాధించింది. కానీ ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిల పడింది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. సూపర్-4లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో వరుస పరాజయాలతో కనీసం ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ముఖ్యంగా టోర్నీకి ముందు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడటం.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం.. అవకాశాలు అందుకున్న అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యువ ఫాస్ట్ బౌలర్లు కీలక సమయాల్లో ఒత్తిడిని జయించలేక చేతులెత్తేయడం.. తుది జట్టు కూర్పులోనూ స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో భారత జట్టు భారీ మూల్యమే చెల్లించింది. టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అదే! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ షోలో మాట్లాడుతూ.. గతేడాది ప్రపంచకప్.. ఈసారి ఆసియా కప్‌లో భారత జట్టు ఓటమికి కెప్టెన్సీ కారణం కాదన్నాడు. జట్టు ఎంపికే ప్రధాన సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా తుది జట్టు కూర్పు విషయంలో సరైన ప్రణాళిక లేకుండానే ముందుకు వెళ్లి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. తరచూ జట్టులో మార్పులు చేయడం సరికాదని.. శ్రీలంక, పాకిస్తాన్ ఒకటీ రెండు మార్పులు మినహా ఒకే జట్టుతో ఆడి ఫైనల్‌కు చేరుకున్నాయని చెప్పుకొచ్చాడు. చదవండి: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం -
'రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే'
ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. అయితే రోహిత్ ఫిట్నెస్, వయస్సు దృష్ట్యా ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశం కనిపించడం లేదన్నది చాలా మంది అభిప్రాయం. దీంతో రోహిత్ తర్వాత భారత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న విషయంపై చర్చ నడుస్తోంది. మరోవైపు రోహిత్‌పై పనిభారం తగ్గించి కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేయాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. కాగా 34 ఏళ్ల రోహిత్ కెప్టెన్‌గా వైట్‌బాల్ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఏర్పరచుకున్నాడు. ఇక రోహిత్ తర్వాత భారత టెస్టు కెప్టెన్సీ రేసులో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఉన్నారు. ఇదే విషయంపై ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను యూట్యూబ్ ఛానల్లో పంచుకున్నాడు. టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు కేఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్‌కే ఎక్కువగా ఉన్నాయని ఆకాష్ చోప్రా అన్నాడు. భారత కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. కానీ "భారత కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఉన్నారని నేను భావిస్తున్నాను. వారిలో కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. అదే విధంగా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు కెప్టెన్ అయ్యే అర్హత ఉన్నప్పటికీ.. అతడికి జట్టులో సుస్ధిరమైన స్థానం లేదు. కాగా ప్రస్తుతం కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం భారత సారథి అయ్యే అవకాశాలు పంత్‌కే ఉన్నాయి. అయితే రాహుల్ కూడా ప్రస్తుతం మూడు ఫార్మాట్ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ కెప్టెన్‌గా రాహుల్ అంతగా అకట్టుకోలేకపోయాడు. ఇక పంత్ కెప్టెన్సీ పరంగా దూకుడుగా ఉన్నప్పటికీ బౌలర్లను మాత్రం సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఐపీఎల్లో ఇదే మనం చూశాం. ఓ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టినప్పటికీ.. అతడికి తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసే అవకాశం పంత్ ఇవ్వలేదు. అయితే రాహుల్ కంటే పంత్ కాస్త బెటర్’’ అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: FIFA Ban On AIFF: భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు -
Ind VS Zim: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్‌కు నో ఛాన్స్! అతడి అరంగేట్రం!
Ind Vs Zim 1st ODI- Aakash Chopra's India Probable XI: కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో గురువారం(ఆగష్టు 18) హరారే వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మొదటి వన్డేకు తన జట్టును ప్రకటించాడు. ఇషాన్‌కు నో ఛాన్స్! కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ జట్టులో ఉన్న నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం రాదని అంచనా వేసిన ఆకాశ్.. ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో అసలు చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌తో 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో సంజూ శాంసన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఆకాశ్ అంచనా వేశాడు. అదే విధంగా.. జింబాబ్వేతో మొదటి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. పేస్ బౌలర్లు దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణకు తన జట్టులో చోటిచ్చాడు ఈ కామెంటేటర్. ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఈ మేరకు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్‌తో వెళ్లాలనుకుంటే కచ్చితంగా వీళ్లిద్దరే ఓపెనర్లుగా వస్తారు. అయితే, రాహుల్ విలక్షణమైన బ్యాటర్.. ఏ స్థానంలోనైనా అతడు సత్తా చాటగలడు. కానీ.. ఐపీఎల్-2022 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏదేమైనా ఎప్పటిలాగే అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. ఇక మూడో స్థానంలో శుబ్‌మన్ గిల్ ఉండనే ఉన్నాడు. త్రిపాఠి అరంగేట్రం! నేనైతే సంజూ శాంసన్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేస్తాను. దీపక్ హుడా ఐదు, ఆ తర్వాతి స్థానంలో రాహుల్ త్రిపాఠి. నిజానికి త్రిపాఠి కూడా ఏ స్థానంలోకి బరిలోకి దిగినా తనను తాను నిరూపించుకోగలడు. రుతురాజ్, ఇషాన్ లోయర్ ఆర్డర్లో ఆడరు కాబట్టి అతడు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది’’ అని బ్యాటింగ్ ఆర్డర్ గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా రాహుల్ త్రిపాఠి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో మొదటి వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. చదవండి: Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు.. తాజా అప్డేట్లు! Ned Vs Pak 1st ODI: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ‘పసికూన’! వామ్మో.. బాబర్ ఏమన్నాడంటే! -
కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ మాత్రం అలా కాదు!
Aakash Chopra On Virat Kohli And Rohit Sharma Captaincy: విరాట్ కోహ్లి కెప్టెన్సీ గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లి దూకుడుగా ఉంటాడని.. అయితే అతడి సారథ్యంలోని జట్టులో మాత్రం అలాంటి లక్షణాలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో తనదైన కెప్టెన్సీతో నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అదే స్థాయిలో జట్టును ముందుకు నడిపించలేకపోయాడని వ్యాఖ్యానించాడు. అయితే, రోహిత్ శర్మ మాత్రం కోహ్లిలా కాదని.. అతడి నేతృత్వంలో జట్టు దూకుడుగా ఆడుతోందని పేర్కొన్నాడు. కోహ్లి అలా.. రోహిత్ ఇలా! కాగా పలువురు టీమిండియా కెప్టెన్ల శైలి గురించి ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా కోహ్లి, రోహిత్ శర్మ మధ్య భేదాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది నేను చేయాలని అని విరాట్ కోహ్లి అనుకుంటే కచ్చితంగా చేసి తీరాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. మైదానంలో అత్యంత దూకుడుగా కనిపిస్తాడు. ప్రత్యర్థి ఎవరైనా.. పరిస్థితులు ఎలాంటివైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా ముందుకు సాగుతాడు. కానీ.. ఎందుకో అతడి సారథ్యంలోని జట్టు మాత్రం ఇలా ఉండేది కాదు. కోహ్లి కెప్టెన్సీలోని జట్టులో ఇలాంటి దూకుడు ఎప్పుడూ చూడలేదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కోహ్లి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో జట్టు సభ్యులు విఫలమైనందు వల్లే కొన్నిసార్లు అనవసర తప్పిదాలు చేసేవారంటూ ఛతేశ్వర్ పుజారా ఓ మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. టెస్టు కెప్టెన్సీ వేరే లెవల్.. కానీ ఇక టెస్టుల్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీ గురించి చెబుతూ.. ‘‘కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేవాడు. నా అభిప్రాయం ప్రకారం అతడు నిబంధనలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ ముందుకు సాగేవాడు. కెప్టెన్‌గా తన దూకుడు అలాంటిది. కానీ ముందు చెప్పినట్లుగా జట్టులో మాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించేవి కావు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక టెస్టు క్రికెట్లో ప్రతిభావంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం దూకుడైన సారథిగా తనదైన ముద్ర వేయలేకపోయాడని పేర్కొన్నాడు. బ్యాటర్‌గా ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే కోహ్లి సారథ్యంలోని జట్టు మాత్రం దూకుడుగా ఉండేది కాదన్న ఆకాశ్ చోప్రా.. కేవలం టీమిండియా మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇలాంటి పరిస్థితిని చూశామని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఉంటే ఆటగాళ్లు చెలరేగిపోతారు! అయితే, రోహిత్ శర్మ మాత్రం కోహ్లిలా మైదానంలో దూకుడు ప్రదర్శించడని.. అదే సమయంలో జట్టులో మాత్రం ఆత్మవిశ్వాసం నింపి వారికి ధైర్యాన్నిస్తాడన్నాడు. కెప్టెన్ అండతో ఆటగాళ్లు దూకుడుగా ఆడతారని చెప్పుకొచ్చాడు. కాగా భారత సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్న కోహ్లి.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ సారథ్యంలోని పరిమిత ఓవర్ల జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: Asia Cup 2022: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర -
Ind Vs Pak: పాక్‌తో మ్యాచ్.. డీకే, అశ్విన్ వద్దు! అతడు ఉంటేనే బెటర్!
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీ ఆసియా కప్-2022 ఆగష్టు 27న ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా గ్రూప్- బిలోని శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఆ మరుసటి రోజే.. క్రికెట్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. డీకే వద్దు! ఈ క్రమంలో టోర్నీ టీ20 వరల్డ్‌కప్-2021లో గతేడాది దాయాది జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ శర్మ సేన సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆసియా కప్-2022కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌కు తుది జట్టును అంచనా వేశాడు. ఈ రసవత్తర మ్యాచ్ ఆడే జట్టులో అతడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కు చోటివ్వలేదు. అందుకే హుడా ఉండాలి! ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ తన జట్టు ఎంపిక గురించి వివరాలు వెల్లడించాడు. ‘‘టాపార్డర్‌లో రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి.. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్లో ఆడాలి. ఆరోస్థానంలో హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. ఇక లోయర్ ఆర్డర్లో దినేశ్ కార్తిక్‌కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే.. దీపక్ హుడా రూపంలో బ్యాట్‌తో.. బాల్‌తో రాణించగల ఆటగాడు ఉన్నాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌తోనే టోర్నీలో తొలి మ్యాచ్.. కేఎల్ రాహుల్ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి సైతం బ్రేక్ తర్వాత ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పరిణామాల క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్ ఒకవేళ కుప్పకూలితే.. దీపక్ హుడా రూపంలో చక్కని ప్రత్యామ్నాయం ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఆకాశ్ చోప్రా చోటివ్వలేదు. అతడికి బదులు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు లెగ్ స్పిన్నర్ చహల్‌కు స్థానం కల్పించాడు. ఆసియా కప్-2022లో పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్ అయితే..: మాజీ కెప్టెన్ CWG 2022: పతకాల పట్టికలో 58 దేశాలు ఆమె వెనకే..! -
ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మొగ్గు!
ఆసియా కప్-2022లో పాల్గొనబోయే భారత జట్టును టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనావేశాడు. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ తిరిగి ఆసియా కప్‌తో రిఎంట్రీ ఇస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మతో కలిసి రాహుల్ భారత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉందని చోప్రా తెలిపాడు. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌ను అతడు ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,దీపక్ హుడాకు అవకాశం ఇచ్చాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే.. అశ్విన్, యజువేంద్ర చాహల్‌ను చోప్రా స్థానం కల్పించాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌కు సింగ్, భువనేశ్వర్‌కు చోటుచ్చాడు. కాగా ఆసియా కప్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా ఆసియా కప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఆసియా కప్‌కు ఆకాశ్ చోప్రా అంచనా వేసిన భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్,భువనేశ్వర్ కుమార్ , మహ్మద్ షమీ 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭'𝐬 𝐠𝐫𝐞𝐚𝐭𝐞𝐬𝐭 𝐫𝐢𝐯𝐚𝐥𝐫𝐲 returns to deliver a blockbuster with @ImRo45's #TeamIndia! 🤩#BelieveInBlue | #AsiaCup2022 | #INDvPAK | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Jf01OLLwYz — Star Sports (@StarSportsIndia) August 8, 2022 చదవండి: Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో -
ఓపెనర్‌గా ఇషాన్ కిషన్.. అవేష్ ఖాన్‌కు నో ఛాన్స్!
ఫ్లోరిడా వేదికగా శనివారం వెస్టిండీస్‌తో టీమిండియా నాలుగో టీ20లో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. మరో వైపు విండీస్ కూడా ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరిగే నాలుగో టీ20కి భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనావేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే బాగుటుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ట్రినిడాడ్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే తరువాతి మ్యా్చ్ల్లో భారత్ అదనపు పేసర్‌తో బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో భారత్ ప్లాన్ బెడిసి కొట్టింది అనే చెప్పుకోవాలి. అదే విధంగా ఒక వేళ ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైతే అతడి స్థానంలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని చోప్రా సూచించాడు.. అదే విధంగా గత రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైన పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రానున్నాడని అతడు జోస్యం చెప్పాడు. ఒక వేళ ఈ మ్యాచ్‌కు కూడా రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో దీపక్ హుడాను కొనసాగించే అవకాశం ఉందని చోప్రా పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు: సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా/దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్! -
Ind Vs WI: ఓపెనర్‌గా డీకే! ఐదో స్థానంలో రోహిత్ ఎందుకు రాకూడదు?
India Vs West Indies T20 Series- Suryakuma Yadav As Opener: ‘‘నా వరకు నేను ఏమనుకుంటున్నానంటే.. దినేశ్ కార్తిక్‌తో మీరు ఎందుకు ఓపెనింగ్ చేయించకూడదు? రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఎందుకు బ్యాటింగ్‌కు రాకూడదు? అయినా వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు రూల్స్ ఉంటాయా?’’ అంటూ భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా టీమిండియా మేనేజ్మెంట్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా టీమిండియా తరచుగా ఓపెనింగ్ జోడీని మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాలుగో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్‌గా దించడంపై క్రీడా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇలాగే ఉంటాం! ఇంగ్లండ్ టూర్లో రిషభ్ పంత్ ఓపెనర్‌గా విఫలమవడం.. ప్రస్తుతం సూర్య కూడా అదే తరహాలో నిరాశపరచడంతో విమర్శలు తీవ్రతరమయ్యాయి. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. జట్టులోని ఏ ఒక్క బ్యాటర్ ఏ ఒక్క స్థానంలో ఆడటానికే పరిమితం కావొద్దని.. ప్రతి ఒక్కరు ఏ స్థానంలో బరిలోకి దిగేందుకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా అదో పిచ్చి పని! అదే విధంగా.. ఒకరిద్దరిపై ఆధారపడాల్సిన పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతోనే ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ జతిన్ సప్రుతో యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ మేరకు ఆకాశ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఓపెనింగ్ జోడీ విషయం అందరినీ తికమక పెడుతోంది. ఇంగ్లండ్‌తో రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపారు కదా! మరి ఇప్పుడు.. సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా పంపడం అర్థంపర్థంలేని చర్య. ఒకవేళ సూర్య బాగా ఆడి తదుపరి మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధిస్తే భేష్! వరస్ట్ కేస్ ఏంటంటే.. మూడు మ్యాచ్‌లలో కలిపి అతడు 30 పరుగులు కూడా చేయలేకపోవచ్చు. మొత్తానికి ఈ టీ20 సిరీస్‌లో అతడు 60 పరుగులు చేస్తే పెద్ద విషయమే’’ అని పేర్కొన్నాడు. మీరేం సాధించారు? అదే విధంగా.. తనకు అలవాటైన స్థానంలో రాణిస్తున్న బ్యాటర్‌ను ఇలా ఇబ్బందిపెట్టి మీరు ఏం సాధిస్తామనుకుంటున్నారు అని మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. వరుస మ్యాచ్‌లలో విఫలమైతే బ్యాటర్ ఆత్మవిశ్వాసం కోల్పోతాడని, తిరిగి ఫామ్ అందుకోవడానికి కష్టపడాల్సి వస్తుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. విండీస్- భారత్ మధ్య మూడో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా వెస్టిండీస్‌తో ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20లలో రోహిత్ శర్మకు జోడీగా ఓపెనింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ చేసిన స్కోర్లు వరుసగా.. 24,11. ఇక మంగళవారం(ఆగష్టు 2) విండీస్- టీమిండియా మధ్య మూడో టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు చెరోటి గెలిచి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే! IND vs WI: టీ20ల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు.. రెండో భారత కెప్టెన్‌గా! -
'పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల జట్లలో ఆడనున్నారు'
పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఒక్క ఐపీఎల్ మినహా మిగితా దేశాల ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీల్లో భాగం అవుతున్నారు. ఇక త్వరలో జరగనున్న యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు యూఏఈ టీ20 లీగ్‌లో జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లు ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల కోసం ఆడనున్నారని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం ఉంది. కానీ పాక్ ఆటగాళ్లు మిగతా టీ20 లీగ్‌లలో ఆడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ టీ20 లీగ్‌లలో జట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. కాబట్టి వారి జట్లులో పాక్ ఆటగాళ్లు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానుల తో జతకట్టనున్నారు" అని ఆకాష్ చోప్రా యూ ట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు " -
Ind Vs WI 1st T20: ఓపెనర్‌గా పంత్.. అశ్విన్‌కు నో ఛాన్స్! కుల్దీప్ వైపే మొగ్గు!
India Vs West Indies 1st T20: వెస్టిండీస్- టీమిండియా మధ్య శుక్రవారం టీ20 సిరీస్ ఆరంభం కానుంది. బ్రియన్ లారా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భారత తుది జట్టును అంచనా వేశాడు. రోహిత్ శర్మకు జోడీగా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఓపెనర్‌గా వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇక మూడో స్థానంలో దీపక్ హుడా పేరు పరిశీలనలో ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో.. ఇటీవల పూర్తిస్థాయిలో రాణిస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అశూ వద్దు! అదే విధంగా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆరో స్థానంలో బరిలోకి దిగుతాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. ఇక గాయంతో బాధపడుతున్న రవీంద్ర జడేజా అందుబాటులో లేనట్లయితే అతడి స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేయొచ్చని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు తనైతే తుదిజట్టులో అవకాశం ఇవ్వనని, అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఎంచుకుంటానని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఆవేశ్ ఖాన్ కంటే కూడా అర్ష్‌దీప్‌ను ఆడిస్తేనే మెరుగైన ఫలితం ఉంటుందన్న ఆకాశ్ చోప్రా.. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌తో అతడు బౌలింగ్ విభాగంలో ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్-2022 ప్రణాళికల్లో అర్ష్‌దీప్ పేరు ఉంటే గనుక అతడికి ఈ సిరీస్‌లో తప్పక అవకాశం ఇవ్వాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. మ్యాచ్ గెలవడం ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం తుది జట్టును ఎంపిక చేయడం కూడా అంతే సవాలుతో కూడుకున్న పనిగా మారిందని ఈ సందర్భంగా అతడు వ్యాఖ్యానించాడు. అందరూ మెరుగ్గా రాణిస్తున్నపుడు జట్టు ఎంపిక క్లిష్టతరమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు: రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియాబీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్*. చదవండి: Ind Vs WI T20I Series: భారత్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన... బంగ్లాను ఓడించిన అదే టీమ్‌తో! -
Ind Vs WI 3rd ODI: అతడి అరంగేట్రం ఇప్పుడే కుదరదు! అదే నిజమైంది!
India Tour Of West Indies 2022- ODI Series: అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్ ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలో ఈ టీమిండియా యువ బ్యాటర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని పేర్కొన్నాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 25 ఏళ్ల రుతు అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక గతేడాది టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌లోనైనా ఛాన్స్ వస్తుందేమోనని ఎదురుచూసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు రెండు సార్లు మొండిచేయే ఎదురైంది. మొదటి, రెండు వన్డేల్లో కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అంతేకాదు.. మొదటి వన్డేలో 64 పరుగులు, రెండో వన్డేలో 43 పరుగులతో రాణించాడు. దీంతో ప్రస్తుతం అతడిని కదిలించే పరిస్థితి లేదు. మరోవైపు.. గిల్‌తో పాటు ఇషాన్ కిషన్ సైతం రుతుకు పోటీగా ఉన్నాడు. అసలు సమస్య ఇదే! ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అయినా మూడో వన్డేకు టీమిండియా మార్పులు ఎందుకు చేస్తుంది? శుబ్‌మన్ గిల్ ఒకటి, రెండు వన్డేల్లో బాగా ఆడిన తర్వాత కూడా అతడిని ఎందుకు పక్కనపెడతారు? ఇక్కడ ఇదే అసలు సమస్య. ప్లేయర్లను ఎలా రొటేట్ చేయాలో ఎవరికీ తెలియదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు. శిఖర్ ధావన్ ఒకే ఒక్క ఫార్మాట్లో ఆడుతున్నాడు. పైగా అతడు ఈ సిరీస్ కెప్టెన్. కాబట్టి తనకు విశ్రాంతినివ్వడం కుదరదు. కాబట్టి రుతురాజ్ అవకాశం కోసం మరి కొన్నాళ్లు వేచిచూడక తప్పదు’’ అని పేర్కొన్నాడు. వాళ్లిద్దరిని ఎవరూ రీప్లేస్ చేయలేరు! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా.. రుతురాజ్ విషయంలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అదే విధంగా.. టీమిండియాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా స్థానాలను భర్తీ చేయగల ఆల్‌రౌండర్లు లేరని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. ‘‘హార్దిక్ పాండ్యా మీడియమ్ పేస్ ఆల్‌రౌండర్. అలాంటి లక్షణాలు ఉన్న ఆటగాడు దేశంలో మనకు ఎక్కడా దొరకడు. ఇక జడేజా.. టెస్టుల్లో సెంచరీలు చేయడం సహా వికెట్లు కూలుస్తూ అద్బుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వన్డేలు, టీ20లలో కూడా అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇలాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లను రీప్లేస్ చేయడం ఎవరి తరం కాదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా బుధవారం(జూలై 27) నాటి ఆఖరి వన్డే తర్వాత.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు జూలై 29 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ గతేడాది అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక ట్రనిడాడ్ వేదికగా మొదలైన మూడో వన్డేలోనూ ఆకాశ్ చెప్పినట్లే రుతుకు చోటు దక్కలేదు. ధావన్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. చదవండి: T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్ గెలిస్తే.. Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! సిరీస్ మొత్తానికి అతడు దూరం? -
Ind Vs WI: రుతురాజ్‌కు నో ఛాన్స్! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే!
India tour of West Indies, 2022: టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మొదటి మ్యాచ్‌కు తన జట్టును ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్‌కు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం రాకపోవచ్చని, అతడి అరంగేట్రానికి ఇంకా సమయం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ సరైనోడన్న ఆకాశ్.. అతడిని విండీస్ బౌలర్లు బౌన్సర్లతో టార్గెట్ చేస్తారని, షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో సంజూ శాంసన్, దీపక్ హుడాకు ఆకాశ్ చోప్రా అవకాశం ఇచ్చాడు. కాగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు అందుబాటులో లేని నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉందని ఆకాశ్ అన్నాడు. కాబట్టి ఆరో స్థానానికి అతడే కరెక్ట్ అని పేర్కొన్నాడు. ఇక తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లకు చోటిస్తానని ఈ మాజీ బ్యాటర్ పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే... అతడి తర్వాత శార్దూల్ ఠాకూర్ వస్తే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో మొదటి వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు: శిఖర్ ధావన్, ఇసాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! 'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c — BCCI (@BCCI) July 21, 2022