
చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. రింకూ సింగ్ తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు వంటి ఐపీఎల్ హీరోలకు చోటు దక్కింది.
వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జట్టుకు యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టుపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. ఈ జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన అతిపెద్ద తప్పిదమని చోప్రా అభిప్రాయపడ్డాడు.
"ఆసియాక్రీడలకు భారత సెలక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపికచేశారు. రింకూ, జైశ్వాల్, ప్రభుసిమ్రాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మాత్రం సెలెక్టర్లు మాత్రం పెద్ద తప్పు చేశారు.
అతడు ప్రపంచంలోనే అత్యుతమ స్పిన్నర్లలో ఒకడు. అతడికి టీ20 ప్రపంచకప్-2021 జట్టులో అవకాశం ఇచ్చారు. అక్కడ విఫలమకావడంతో పూర్తిగా అతడిని పక్కన పెట్టేశారు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా రాణించాడు. కాబట్టి అతడు చైనాకు వెళ్లే భారత జట్టులో ఉండాల్సింది" అని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: Duleep Trophy: ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్