Asian Games 2023
-
రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్.. నాలుగేళ్లకే కెరీర్ ఖతం
పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ కాదిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించబోవడం లేదని తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం తనకు దక్కిందని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒడిదుడుకుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు.పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన అబ్దుల్ కాదిర్ కుమారుడే ఉస్మాన్ కాదిర్. ఈ లెగ్ స్పిన్నర్ 2020లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఖరిసారిగా ఆడాడు.ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే ఆడిన ఉస్మాన్ కాదిర్ ఖాతాలో ఒక వికెట్ ఉంది. ఇక పాక్ తరఫున ఆడిన 25 టీ20లలో అతడు 31 వికెట్లు పడగొట్టగలిగాడు. అయితే, 31 ఏళ్ల ఉస్మాన్‌కు జాతీయ జట్టులో ఎప్పుడూ సుస్థిర స్థానం దక్కలేదు. దీంతో కలత చెందిన అతడు.. తాను ఇక పాకిస్తాన్‌కు ఆడనని.. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకుంటున్నానని 2018లో వ్యాఖ్యానించాడు.ఇక తాజాగా.. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగానూ పాకిస్తాన్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నానని ఉస్మాన్ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననంటూ ట్విస్టు ఇ వ్వడం విశేషం. ఏదేమైనా పాకిస్తాన్ జట్టుతో తనకున్న అనుబంధం మర్చిపోలేనని.. సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఉస్మాన్ కాదిర్ ఇటీవల చాంపియన్స్ వన్డే కప్‌లో డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. -
Preeti Rajak: సుబేదార్ ప్రీతి
ఆర్మీలో మొదటిసారి ఒక మహిళ ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో హవల్దార్‌గా చేరిన ప్రీతి రజక్ తన క్రీడాప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్‌లో ట్రాప్ షూటర్‌గా సిల్వర్ మెడల్ సాధించింది. దేశవ్యాప్తంగా యువతులను ఆర్మీలో చేరేలా ఆమె స్ఫూర్తినిచ్చిందని ఆమెకు ఈ గౌరవం కల్పించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీతి రజక్ ఆర్మీలో ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. ఆర్మీలో ‘సుబేదార్’ అనిపించుకోవడం చిన్న విషయం కాదు. ‘సిపాయి’ నుంచి మొదలయ్యి ‘లాన్స్ నాయక్’, ‘నాయక్’, ‘హవల్దార్’, ‘నాయబ్ సుబేదార్’... ఇన్ని దశలు దాటి ‘సుబేదార్’ అవుతారు. ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్ 1992లో మొదలయ్యాక సంప్రదాయ అంచెలలో ఒక మహిళ సుబేదార్‌గా పదవి పొందటం ఇదే మొదటిసారి. ఆ మేరకు ప్రీతి రజక్ రికార్డును నమోదు చేసింది. ట్రాప్ షూటర్‌గా ఆసియన్ గేమ్స్‌లో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన ఉన్నత అధికారులు ఆమెను ఈ విధంగా ప్రోత్సహించి గౌరవించారు. ► లాండ్రీ ఓనరు కూతురు ఇరవై రెండేళ్ల ప్రీతి రజక్ది మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లాండ్రీషాపు నడుపుతాడు. తల్లి సామాజిక సేవలో ఉంది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండవ సంతానమైన ప్రీతి చిన్నప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. క్రీడలంటే ఆసక్తి ఉన్న తండ్రి తన కూతుళ్లను శక్తిమేరకు క్రీడాకారులు చేయదలిచి ప్రోత్సహించాడు. అలా ప్రీతి షూటింగ్‌లోకి వచ్చింది. భోపాల్‌లోని స్పోర్ట్స్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రీతి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. పతకాలు సాధించింది. దాంతో ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో మిలటరీ పోలీస్ డివిజన్లో నేరుగా 2022లో హవల్దార్ ఉద్యోగం వచ్చింది. ► ఏ సాహసానికైనా సిద్ధమే ఆర్మీలో చేరినప్పటి నుంచి ప్రీతి ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్టుగా పనిచేస్తూ పై అధికారుల మెప్పు పొందింది ప్రీతి. షూటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కాని ఆర్మీలో చేరాక ఆమెకు శిక్షణ మరింత సులువైంది. అందుకు కావలసిన గన్స్ ఆమెకు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇక చైనాలో జరిగిన 2023 ఆసియన్ గేమ్స్‌లో షార్ట్ పిస్టల్ విభాగంలో ప్రీతి రజత పతకం సాధించడంతో ఆర్మీ గౌరవంతో పాటు దేశ గౌరవమూ ఇనుమడించింది. ‘నేటి యువతులు ఇళ్లల్లో కూచుని ప్రతిభను వృథా చేయొద్దు. ఇంటినుంచి బయటకు రండి’ అని ప్రీతి ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపారు. ఇది పై అధికారులకు మరింతగా సంతోషం కలిగించడంతో జనవరి 28, 2024న ఆమెకు సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ► పారిస్ ఒలింపిక్స్‌కు ఈ సంవత్సరం జూలైలో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం తేవడానికి ప్రీతికి ఆర్మీ వారే శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ‘ఆర్మీ మార్క్స్‌మెన్‌షిప్ యూనిట్’ (ఏ.ఎం.యు.)లో ప్రీతికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతూ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ట్రాప్ షూటింగ్లో విభాగంలో ఆరవ ర్యాంక్‌లో ఉంది ప్రీతి. ఆమె గనక ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆర్మీలో ఆమెకు దొరకబోయే ప్రమోషన్ మరింత ఘనంగా గర్వపడే విధంగా ఉంటుంది. -
ఆ జట్టులోనూ నా పేరు లేదు.. షాకయ్యాను! అందుకే: ధావన్
"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను. ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్‌సీఏది కీలక పాత్ర. నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్‌కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది. యువ ఓపెనర్లకు పెద్దపీట బంగ్లాదేశ్‌తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్‌ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. చోటు ఆశించి భంగపడ్డా మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్ ధావన్‌కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు. ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. అందుకే ఇలా ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్‌ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. -
శెభాష్ తల్లీ.. గ్రీష్మను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: స్కేటింగ్ క్రీడాకారిణి, ఆసియా క్రీడల విజేత గ్రీష్మ దొంతరను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ప్రతిభావంతురాలైన గ్రీష్మ ఆట తీరు.. ఆమె సాధించిన విజయాలను ప్రశంసించారు. కాగా.. ఒక్కరోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ గురువారం విశాఖపట్నం వచ్చారు. ఈ క్రమంలో.. నగరానికి చెందిన గ్రీష్మ దొంతర తన తండ్రితో పాటు మధురవాడ ఐటీ హిల్‌పైన హెలీప్యాడ్ వద్ద సీఎంను కలిశారు. ఈ సందర్భంగా గ్రీష్మ.. తను సాధించిన మెడళ్లను ముఖ్యమంత్రికి చూపించి మురిసిపోయారు. స్కేటింగ్‌లో తన విజయాల గురించి సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. 105 పతకాలు ఈ నేపథ్యంలో శెభాష్ తల్లీ అంటూ చిరునవ్వుతో గ్రీష్మను అభినందించిన సీఎం జగన్.. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆమెకు ఆశీర్వాదం అందించారు. కాగా.. ఇప్పటి వరకు స్కేటింగ్‌లో వివిధ స్థాయిల్లో 105 మెడల్స్ సాధించినట్లు గ్రీష్మ తెలిపారు. అదే విధంగా.. ఇటీవల చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భాగస్వామ్యం అయ్యానని.. మూడు పతకాలు కూడా సాధించి 16వ స్థానంలో నిలిచానని పేర్కొన్నారు. చదవండి: #Virat Kohli: నీకే ఎందుకిలా కోహ్లి? -
ఆసియా క్రీడల్లో సత్తా చాటారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్), జ్యోతి యర్రాజీ (అథ్లెట్), బి.అనూష (క్రికెట్) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీకి 11 పతకాలు.. ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్‌లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్‌కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
‘ఆడుదాం ఆంధ్రా’.. క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం: సాత్విక్ సాయిరాజ్
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్‌లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్లేయర్స్‌తో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సాత్విక్ సాయిరాజ్ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏషియన్ గేమ్స్‌లో మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ కార్యక్రమం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సాత్విక్ పేర్కొన్నారు. ఇక.. సాత్విక్ సాయిరాజ్ తల్లితండ్రులు కాశి విశ్వనాథ్, రంగమణి సైతం తమ కుమారుడి ఘనత పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కాగా చైనాలో జరిగిన 19వ ఆసియా క్రీడల సందర్భంగా.. అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టితో కలిసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్ ‘పసిడి’ కల నెరవేరుస్తూ... పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జోడీ స్వర్ణం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు తొలిసారి గోల్డ్ మెడల్ అందించి సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. హోంగ్జూలో జరిగిన ఫైనల్లో 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించి ఈ మేరకు చాంపియన్‌గా అవతరించింది సాత్విక్- చిరాగ్ జోడీ. అంతేగాక ఈ అద్భుత విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జంట నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడం విశేషం. చదవండి: ‘ఆడుదాం ఆంధ్ర’కు సన్నద్ధం -
‘ఒలింపిక్ సవాల్‌కు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్: ‘మేం వరుస విజయాలు సాధిస్తున్నా చాలా మంది ప్రత్యర్థులు కొంత కాలం వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మా ఆటపై అందరి దృష్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇకపై మా ఆటను విశ్లేషించి మాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు’... భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్ ఈవెంట్లో కూడా భారత పురుషుల జట్టు రజతం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యం గెలిచాడు. ఈ నేపథ్యంలో బుధవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆటగాళ్లతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్ పాల్గొన్నారు. వాళ్లని పడగొట్టగలిగాం... గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందామని, ఆ తర్వాత మరింత పట్టుదలగా సాధన చేసి ఆసియా క్రీడలకు వెళ్లినట్లు సాత్విక్ వెల్లడించాడు. చాలా కాలంగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న మలేసియా జోడీ సొ వుయి యిక్–ఆరోన్ చియాలను ఆసియా క్రీడల సెమీఫైనల్లో ఓడించడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతను అన్నాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం తాము అన్ని విధాలా సిద్ధమవుతామన్న సాత్విక్... అన్నింటికంటే ఫిట్నెస్ కీలకమని వ్యాఖ్యానించాడు. ‘ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు. మా శరీరమే మాకు ప్రత్యర్థి. రాబోయే రోజుల్లో గాయాలు లేకుండా పూర్తి ఫిట్‌గా ఉంటే చాలు. కోర్టులో ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌కు ముందు కొన్ని టోరీ్నలలో మేం ఓడినా పర్వాలేదు. అన్నింటిలోనూ గెలిస్తే అసలు సమయానికి సమస్య రావచ్చేమో’ అని సాత్విక్ అన్నాడు. ఇలాంటి అవకాశం రాదని... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీవ్ర గాయంతో బాధపడుతూనే ప్రణయ్ పతకం కోసం పోరాడాడు. చివరకు అతను విజయం సాధించినప్పుడు కోచ్ గోపీచంద్ సహా సహచరులంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే గాయం ఉన్నా ఆడేందుకు సిద్ధం కావడం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని ప్రణయ్ చెప్పాడు. ‘నా శరీరం ఎంత వరకు సహకరించగలదో ఫిజియో కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారమే కోచ్ గోపీ సర్‌తో పాటు అందరితో చర్చించాక నేను ఆడేందుకు సిద్ధమయ్యా. నొప్పి ఉన్నా సరే పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఆసియా క్రీడల్లో పతకం విలువేంటో తెలుసు. గతంలో ఎన్నోసార్లు గాయాలతో బాధపడి కీలక సమయాల్లో అవకాశం కోల్పోయా. ఈ జీవితకాలపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావించా. అయితే గాయం తీవ్రత వల్లే టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆడలేదు’ అని ప్రణయ్ చెప్పాడు. నిజానికి తమ స్వర్ణంకంటే ప్రణయ్ కాంస్యం గెలుచుకోవడం తమకు ఎక్కువ ఆనందాన్నిచ్చిందని సాత్విక్ అన్నాడు. అతను పతకం కోసం ఎంత కష్టపడ్డాడో, కీలక సమయాల్లో వెనుకబడి పుంజుకునేందుకు ఎంత పోరాడాడో తమకు తెలుసు కాబట్టి అతను పతకం సాధించాని జట్టంతా కోరుకుందని సాత్విక్ వెల్లడించాడు. ‘వారి వల్లే ఈ ఉత్సాహమంతా’ గోపీచంద్ భారత కోచ్‌గా మారి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక చాలనుకొని తప్పుకోవాలని చాలా సార్లు భావించానని, అయితే యువ ఆటగాళ్ల విజయాలు తనకు ప్రేరణ అందిస్తున్నాయని గోపీచంద్ చెప్పారు. సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో పతకాలు రావడం ఎంతో ఆనందం కలిగించిందని గోపీచంద్ అన్నారు. ‘నా దృష్టిలో ఆసియా క్రీడల మెడల్ అంటే ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలతో సమానం. అందుకే ఈ ఆనందమంతా. జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. శ్రీకాంత్, లక్ష్య సేన్‌లకు ప్రత్యేక అభినందనలు. ఇక ప్రణయ్ పతకం కోసం ప్రార్థించినంతగా నేను ఎప్పుడూ ప్రార్థించలేదు. ఈ ఒక్కసారి అతడిని గెలిపించమని దేవుడిని కోరుకున్నా. ఒలింపిక్స్‌కు ఇంకా సమయముంది. అయితే దానికి తగిన విధంగా సిద్ధమవుతాం’ అని గోపీచంద్ అన్నారు. అధికారికంగా ఇప్పుడు సాత్విక్–చిరాగ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... గత ఏడాది కాలంగా వారి ఆటను చూస్తే అప్పటి నుంచే వారిని తాను నంబర్‌వన్‌గా భావించినట్లు ఆయన వెల్లడించారు. -
జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్ ప్రతినిధులు
సాక్షి, విజయవాడ: హాంగ్ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. -
ఆసియా క్రీడల పతక విజేతలకు మోదీ ప్రశంస
తదుపరి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరెన్నో పతకాలు తెస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారందరినీ ప్రశంసించారు. ‘ప్రభుత్వం క్రీడాకారులకు ఏం కావాలో అది చేస్తుంది. వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన క్రీడాకారులు వచ్చే క్రీడల్లో ఈ రికార్డును అధిగమిస్తారనే నమ్మకముంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నాను’అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో రజత పతకం గెలిచిన సాకేత్ మైనేని, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రుతుజా భోస్లే ప్రధానికి జ్ఞాపికగా రాకెట్‌ను అందించారు. స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్‌ను, క్రికెట్లు జట్లు బ్యాట్‌ను మోదీకి బహూకరించాయి. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల బృందం 107 పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. తదుపరి ఆసియా క్రీడలు 2026లో జపాన్‌లో జరుగుతాయి. -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్‌లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్‌లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్‌తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్‌లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్‌లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్‌లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్‌కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్‌లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్‌లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
నగోయాలో కలుద్దాం!
హాంగ్జౌ: గత 16 రోజులుగా క్రీడాభిమానులను ఆద్యంతం అలరించిన ఆసియా క్రీడా సంరంభానికి ఆదివారం తెర పడింది. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు అక్టోబర్ 8న అంతే ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ‘బిగ్ లోటస్’ స్టేడియంలో 75 నిమిషాలపాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా... చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు, భారత మాజీ దిగ్గజ షూటర్ రణ్‌ధీర్ సింగ్ 19వ ఆసియా క్రీడలు ముగిశాయని అధికారికంగా ప్రకటించారు. ‘గత 16 రోజుల్లో మనమంతా ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలను తిలకించాం. హాంగ్జౌకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చి న హాంగ్జౌను ఆసియానే కాకుండా మొత్తం ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వానికి, చైనా ఒలింపిక్ కమిటీకి, నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రణ్‌దీర్ సింగ్ వ్యాఖ్యానించారు. తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి రాష్ట్ర రాజధాని నగోయా నగరంలో జరుగుతాయి. ముగింపు వేడుకల్లో ఐచి రాష్ట్ర గవర్నర్ ఒమురా హిడెకి, నగోయా నగర డిప్యూటీ మేయర్ నకాటా హిడియో ఆసియా క్రీడల జ్యోతితోపాటు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ పతాకాన్ని అందుకున్నారు. ♦ ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేశ్ పతాకధారిగా వ్యవహరించాడు. చాలా మంది భారత క్రీడాకారులు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, ముగింపు వేడుకల్లో వంద మంది వరకు క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. ♦ మొత్తం 45 దేశాల నుంచి 40 క్రీడాంశాల్లో 12,407 మంది క్రీడాకారులు హాంగ్జౌలో పోటీపడ్డారని నిర్వాహకులు తెలిపారు. ♦ మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చి న చైనా మరోసారి తమ ఆధిపత్యం చాటుకొని హాంగ్జౌలోనూ ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 188 పతకాలతో జపాన్ రెండో స్థానంలో, 190 పతకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో, 107 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా దక్షిణ కొరియా కంటే జపాన్ రెండు తక్కువ పతకాలు గెలిచినా... కొరియాకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు గెలిచినందుకు జపాన్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. ♦ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 13 కొత్త ప్రపంచ రికార్డులు, 26 ఆసియా రికార్డులు, 97 ఆసియా క్రీడల రికార్డులు నమోదయ్యాయి. 41 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 41 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. 4 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక్క పతకం కూడా నెగ్గని దేశాలు (భూటాన్, ఈస్ట్ తిమోర్, మాల్దీవులు, యెమెన్). 2 తొలిసారి బ్రూనై, ఒమన్ దేశాలు ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకాలు గెలిచాయి. 4 ఒకే ఆసియా క్రీడల్లో 100 పతకాల మైలురాయిని దాటిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి. 11 వరుసగా పదకొండోసారి ఆసియా క్రీడల పతకాల పట్టికలో చైనా ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి చైనా 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలి స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి చైనా పతకాల పట్టికలో తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటోంది. 201 తాజా ఆసియా క్రీడల్లో చైనా గెలిచిన స్వర్ణ పతకాలు. ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాల్లో 200 మైలురాయిని దాటిన తొలి దేశంగా చైనా నిలిచింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పతకాలు గెలిచింది. 9 వరుసగా తొమ్మిదోసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాల్లో తొలిసారి ‘సెంచరీ’ నమోదు చేసింది. -
2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్ వేయాలి: పీటీ ఉష
హాంగ్జౌ: ఆసియా క్రీడల చరిత్రలోనే భారత క్రీడా బృందం ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అత్యధికంగా 107 పతకాలు సాధించడంపట్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఆనందం వ్యక్తం చేసింది. ‘ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయి ప్రదర్శన తర్వాత భారత క్రీడాకారులు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించాలి. మన క్రీడాకారులు, కోచ్‌లు, జాతీయ క్రీడా సమాఖ్యలు శ్రమిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య కచ్చితంగా రెండంకెలు దాటుతుంది. ఇక మనం కూడా ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ పోటీపడాలి’ అని 59 ఏళ్ల పీటీ ఉష వ్యాఖ్యానించింది. కేవలం ఒకట్రెండు క్రీడాంశాల్లో కాకుండా వేర్వేరు క్రీడాంశాల్లో భారత్‌కు పతకాలు రావడంపట్ల రాజ్యసభ సభ్యురాలైన ఉష ఆనందాన్ని వ్యక్తం చేసింది. -
తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ పురస్కారం
ప్రతి ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో నుంచి ఒకరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) పురస్కారం అందజేస్తారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో తొలిసారి ఈ ‘ఎంవీపీ’ అవార్డును ప్రవేశపెట్టారు. గత ఆరు ఆసియా క్రీడల్లో ఒక్కరిని మాత్రమే ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుండగా... ఈ క్రీడల్లో తొలిసారి ఇద్దరికి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కడం విశేషం. ఆదివారం హాంగ్జౌలో ముగిసిన 19వ ఆసియా క్రీడలకు సంబంధించి ‘ఎంవీపీ’ అవార్డు చైనా స్విమ్మర్లు జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్లకు సంయుక్తంగా లభించింది. 25 ఏళ్ల మహిళా స్విమ్మర్ జాంగ్ యుఫె హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఏకంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. పురుషుల స్విమ్మింగ్‌లో 24 ఏళ్ల కిన్ హైయాంగ్ ఐదు పసిడి పతకాలు గెలిచాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్ (2010 గ్వాంగ్జౌ) తర్వాత ఆసియా క్రీడల్లో ‘ఎంవీపీ’ అవార్డు గెల్చుకున్న చైనా ప్లేయర్లుగా జాంగ్ యుఫె, కిన్ హైయాంగ్ గుర్తింపు పొందారు. -
ఏషియన్ గేమ్స్ లో విజేతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
-
జయహో భారత్ 107
‘వంద’ పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత క్రీడా బృందం అనుకున్నది సాధించింది. శనివారంతో భారత క్రీడాకారుల ఈవెంట్స్ అన్నీ ముగిశాయి. చివరిరోజు భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిసి ఏకంగా 12 పతకాలు సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి ‘పతకాల సెంచరీ’ మైలురాయిని దాటింది. అంతేకాకుండా ఈ క్రీడల చరిత్రలోనే 107 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌కిదే గొప్ప ప్రదర్శన కావడం విశేషం. 2010లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 101 పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనను భారత్ అధిగమించింది. శనివారం భారత్‌కు ఆర్చరీలో రెండు స్వర్ణాలు.. కబడ్డీల్లో రెండు పసిడి పతకాలు... పురుషుల టి20 క్రికెట్లో, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఒక్కో బంగారు పతకం లభించాయి. ఆదివారం కేవలం కరాటే, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ ఈవెంట్స్ జరగనున్నాయి. అనంతరం సాయంత్రం ముగింపు వేడుకలతో హాంగ్జౌ ఆసియా క్రీడలకు తెరపడుతుంది. హాంగ్జౌ: చైనా గడ్డపై భారత్ తమ పతకాల వేటను దిగ్విజయంగా ముగించింది. ఆసియా క్రీడల్లో ఎవరూ ఊహించని విధంగా 107 పతకాలతో అదరగొట్టింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. తమ పోటీల చివరిరోజు భారత్ 12 పతకాలు గెలిచి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకుంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో కలిపి 70 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సురేఖ, ఓజస్ ‘స్వర్ణ’ చరిత్ర శనివారం ముందుగా ఆర్చరీలో భారత్ బాణం ‘బంగారు’ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో జ్యోతి సురేఖ 149–145తో చేవన్ సో (దక్షిణ కొరియా)ను ఓడించింది. జ్యోతి సురేఖ 15 బాణాలు సంధించగా అందులో 14 పది పాయింట్ల లక్ష్యంలో... ఒకటి 9 పాయింట్ల లక్ష్యంలో దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్‌గా జ్యోతి సురేఖకు ఈ ఆసియా క్రీడలు చిరస్మరణీయమయ్యాయి. ఈ క్రీడల్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 3 స్వర్ణాలు సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌తోపాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సురేఖ బంగారు పతకాలు గెలిచంది. తద్వారా దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష (1986 సియోల్ గేమ్స్; 4 స్వర్ణాలు, 1 రజతం) తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో కనీసం 3 స్వర్ణ పతకాలు గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతకం కూడా భారత్ ఖాతాలోనే చేరింది. ప్రపంచ చాంపియన్ అదితి స్వామి (భారత్) 146–140తో ఫాదిలి జిలిజాటి (ఇండోనేసియా)పై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజత పతకాలు భారత్‌కే లభించాయి. ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 149–147తో అభిషేక్ వర్మ (భారత్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రీడల్లో ఓజస్కిది మూడో స్వర్ణం. పురుషుల కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ విభాగంలో ఓజస్ పసిడి పతకాలు గెలిచాడు. సాత్విక్–చిరాగ్ జోడీ అద్భుతం ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ‘పసిడి’ కల నెరవేరింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ చాంపియన్‌గా అవతరించి ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు తొలిసారి బంగారు పతకాన్ని అందించింది. శనివారం జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–16తో చోయ్ సోల్గు–కిమ్ వన్హో (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. సెమీస్‌లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్ జోడీని బోల్తా కొట్టించిన భారత జంట తుది పోరులోనూ దూకుడుగా ఆడింది. కళ్లు చెదిరే స్మాష్‌లతో, చక్కటి డిఫెన్స్‌తో కొరియా జోడీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని దక్కించుకుంది. 1982 ఆసియా క్రీడల్లో లెరాయ్–ప్రదీప్ గాంధే భారత్‌కు పురుషుల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని అందించారు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో వచ్చే వారం విడుదల చేసే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి సాత్విక్–చిరాగ్ జోడీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనుంది. దీపక్ ‘రజత’ పట్టు ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్‌ను భారత్ రజత పతకంతో ముగించింది. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్ దిగ్గజ రెజ్లర్ హసన్ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం బౌట్లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్ తొలి రౌండ్లో 3–2తో షరిపోవ్ (ఖతర్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–0తో రియాన్డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్ (జపాన్)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన యశ్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయారు. భారత జట్ల ‘పసిడి’ కూత గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను చేజార్చుకున్న భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు ఈసారి తమ ఖాతాలోకి వేసుకున్నాయి. శనివారం జరిగిన ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 33–29తో డిఫెండింగ్ చాంపియన్ ఇరాన్ జట్టును ఓడించగా... భారత మహిళల జట్టు 26–25తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. ఆసియా క్రీడల కబడ్డీ ఈవెంట్లో భారత పురుషుల జట్టు ఎనిమిదోసారి స్వర్ణ పతకం నెగ్గగా... మహిళల జట్టు మూడోసారి పసిడి పతకం సాధించింది. చెస్‌లో డబుల్ ధమాకా వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకాలు కోల్పోయిన భారత చెస్ క్రీడాకారులు టీమ్ ఈవెంట్లో సత్తా చాటుకొని రజత పతకాలు నెగ్గారు. పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్‌లతో కూడిన భారత పురుషుల జట్టు నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన చివరి రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలిచింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, వంతిక, సవితాశ్రీలతో కూడిన భారత మహిళల జట్టు కూడా 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ 4–0తో దక్షిణ కొరియాను ఓడించింది. క్రికెట్లో కనకం... తొలిసారి ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో పోటీపడ్డ భారత క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో శనివారం భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గానిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసిన దశలో వచ్చిన వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్‌ను విజేతగా ప్రకటించి స్వర్ణ పతకాన్ని అందించగా... అఫ్గానిస్తాన్ జట్టుకు రజతం లభించింది. స్వర్ణం నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. -
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఏషియన్ గేమ్స్ 2023లో ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో 107 పతకాలు
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జైత్రయాత్ర ముగిసింది. ఇవాల్టితో (అక్టోబర్ 7) ఆసియా క్రీడల్లో భారత్ ఈవెంట్స్ అన్ని పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) సాధించింది. ఈ ఎడిషన్‌కు ముందు భారత్ అత్యధిక పతకాలను 2018 జకార్తా ఆసియా క్రీడల్లో (70) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ జకార్తా గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. పతకాల పట్టికలో చైనా 376 పతకాలతో (197 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్యాలు) అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత జపాన్ (181; 50 స్వర్ణాలు, 63 రజతాలు, 68 కాంస్యాలు), రిపబ్లిక్ ఆఫ్ కొరియా (188; 40 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) ఉన్నాయి. భారత్ పతకాల వివరాలు.. ఆర్చరీ (కాంపౌండ్ మెన్స్): ఓజాస్ దియోతలే (గోల్డ్) ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): జ్యోతి సురేఖ (గోల్డ్) ఆర్చరీ (మెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (వుమెన్స్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మిక్సడ్ టీమ్): గోల్డ్ ఆర్చరీ (మెన్స్ సింగిల్స్): అభిషేక్ వర్మ (సిల్వర్) ఆర్చరీ (రికర్వ్ మెన్స్ టీమ్): సిల్వర్ ఆర్చరీ (కాంపౌండ్ వుమెన్స్): అదితి స్వామి (బ్రాంజ్) ఆర్చరీ (రికర్వ్ వుమెన్స్ టీమ్): బ్రాంజ్ అథ్లెటిక్స్ (మెన్స్ 3000 స్టీపుల్‌ఛేజ్): అవినాశ్ సాబ్లే (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 4X400మీ రిలే): గోల్డ్ అథ్లెటిక్స్ (జావెలిన్ త్రో): నీరజ్ చోప్రా (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ షాట్‌పుట్): తజిందర్‌పాల్ సింగ్ తూర్ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 5000): పారుల్ చౌదరీ (గోల్డ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ జావెలిన్ త్రో): అన్నూ రాణి (గోల్డ్) అథ్లెటిక్స్ (మెన్స్ 10000): కార్తీక్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): అజయ్ కుమార్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 5000 ): అవినాశ్ సాబ్లే (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ 800): మోహమ్మద్ అఫ్సల్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ డెకత్లాన్): తేజస్విన్ శంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ జావెలిన్ త్రో): కిషోర్ జెనా (సిల్వర్) అథ్లెటిక్స్ (మెన్స్ లాంగ్ జంప్): శ్రీశంకర్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 100 మీ హర్డిల్స్): జ్యోతి యర్రాజీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 1500): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్‌ఛేజ్): పారుల్ చౌదరీ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 4X400మీ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (వుమెన్స్ 800): హర్మిలన్ బెయిన్స్ (సిల్వర్) అథ్లెటిక్స్ (వుమెన్స్ లాంగ్‌జంప్): అంచీ సోజన్ (సిల్వర్) అథ్లెటిక్స్ (4X400మీ మిక్సడ్ రిలే): సిల్వర్ అథ్లెటిక్స్ (మెన్స్ 10000): గుల్వీర్ సింగ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ 1500): జిన్సన్ జాన్సన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (మెన్స్ ట్రిపుల్ జంప్): ప్రవీణ్ చిత్రవేల్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 3000 స్టీపుల్‌ఛేజ్): ప్రీతి లాంబా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ 400 హర్డిల్స్): విత్య రామ్రాజ్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ డిస్కస్ త్రో): సీమా పూనియా (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ హెప్టాత్లాన్): నందిని అగసర (బ్రాంజ్) అథ్లెటిక్స్ (వుమెన్స్ షాట్‌పుట్): కిరణ్ బలియాన్ (బ్రాంజ్) అథ్లెటిక్స్ (35కిమీ రేస్‌వాక్ మిక్సడ్ టీమ్): బ్రాంజ్ బ్యాడ్మింటన్ (మెన్స్ డబుల్స్): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి (గోల్డ్) బ్యాడ్మింటన్ (మెన్స్ టీమ్): సిల్వర్ బ్యాడ్మింటన్ (మెన్స్ సింగిల్స్): ప్రణయ్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 75 కేజీ): లవ్లీనా (బ్రాంజ్) బాక్సింగ్ (మెన్స్ 92 కేజీ): నరేందర్ (బ్రాంజ్)ఔ బాక్సింగ్ (వుమెన్స్ 45-50 కేజీ): నిఖత్ జరీన్ (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 50-54 కేజీ): ప్రీతి (బ్రాంజ్) బాక్సింగ్ (వుమెన్స్ 54-57 కేజీ): పర్వీన్ (బ్రాంజ్) బ్రిడ్జ్ (మెన్స్ టీమ్): సిల్వర్ కనోయ్ స్ప్రింట్ ఝ(మెన్స్ డబుల్స్ 1000మీ): బ్రాంజ్ చెస్ (మెన్స్ టీమ్): సిల్వర్ చెస్ (వుమెన్స్ టీమ్): సిల్వర్ క్రికెట్ (మెన్స్): గోల్డ్ క్రికెట్ (వుమెన్స్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్ టీమ్): గోల్డ్ ఈక్వెస్ట్రియన్ (డ్రెసేజ్): అనూష అగర్వల్లా (బ్రాంజ్) గోల్ఫ్ (వుమెన్స్): అదితి అశోక్ (సిల్వర్) హాకీ (మెన్స్): గోల్డ్ హాకీ (వుమెన్స్): బ్రాంజ్ కబడ్డీ (మెన్స్): గోల్డ్ కబడ్డీ (వుమెన్స్): గోల్డ్ రోలర్ స్కేటింగ్ (వుమెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోలర్ స్కేటింగ్ (మెన్స్ 3000మీ రిలే): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ డబుల్స్): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 8): సిల్వర్ రోయింగ్ (మెన్స్ 4): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ పెయిర్): బ్రాంజ్ రోయింగ్ (మెన్స్ క్వాడ్రపుల్): బ్రాంజ్ సెయిలింగ్ (గర్ల్స్ ILCA4): నేహా ఠాకూర్ (సిల్వర్) సెయిలింగ్ (మెన్స్ ILCA7): విష్ణు శరవనన్ (బ్రాంజ్) సెయిలింగ్ (మెన్స్ విండ్‌సర్ఫర్ RS-X): ఎబద్ అలీ (బ్రాంజ్) సెపకతక్రా (వుమెన్స్ రేగు): బ్రాంజ్ షూటింగ్ (10మీ ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (ట్రాప్ టీమ్ మెన్): గోల్డ్ షూటింగ్ (10మీ ఎయిర్‌పిస్టల్ వుమెన్): పలక్ (గోల్డ్) షూటింగ్ (25మీ పిస్టల్ టీమ్ వుమెన్): గోల్డ్ షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ టీమ్ వుమెన్): సిఫ్త్ కౌర్ సమ్రా (గోల్డ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పోజిషన్స్ మెన్: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (స్కీట్ మెన్): అనంత్‌జీత్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్‌పిస్టల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్‌పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (25మీ పిస్టల్ వుమెన్): ఈషా సింగ్ (సిల్వర్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (ట్రాప్ టీమ్ వుమెన్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్‌పిస్టల్ మిక్సడ్ టీమ్): సిల్వర్ షూటింగ్ (10మీ ఎయిర్ రైఫిల్ మెన్): ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (సిల్వర్) షూటింగ్ (25మీ రాపిడ్‌ఫైర్ పిస్టల్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (స్కీట్ టీమ్ మెన్): బ్రాంజ్ షూటింగ్ (ట్రాప్ మెన్): చెనై కేడీ (బ్రాంజ్) షూటింగ్ (50మీ రైఫిల్ 3 పొజిషన్స్): అషి చౌక్సీ (బ్రాంజ్) స్క్వాష్ పురుషుల జట్టు- స్వర్ణం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- స్వర్ణం స్క్వాష్ పురుషుల సింగిల్స్ సౌరవ్ ఘోశల్ - రజతం స్క్వాష్ మహిళల జట్టు- కాంస్యం స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్- కాంస్యం టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్- కాంస్యం టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్- గోల్డ్ టెన్నిస్ పురుషుల డబుల్స్- రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీ దీపక్ పునియా - రజతం రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల అమన్ - కాంస్యం రెజ్లింగ్ పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీ సునీల్ కుమార్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల ఆంటిమ్ పంఘల్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 62 కేజీల విభాగంలో సోనమ్ - కాంస్యం రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీ కిరణ్ - కాంస్యం ఉషు మహిళల 60 కిలోల రోషిబినా దేవి - రజతం -
క్రికెట్ లో భారత్ కు గోల్డ్.. ఎలా వచ్చిందంటే?
-
Asian Games 2023: కబడ్డీలో భారత్‌కు స్వర్ణం
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ స్వర్ణ పతక జోరు కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 స్వర్ణ పతకాలు చేరాయి. తాజాగా పురుషుల కబడ్డీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో భారత్.. ఇరాన్‌పై 33-29 తేడాతో నెగ్గింది. ఏషియన్ గేమ్స్ పురుషుల కబడ్డీలో మొత్తంగా భారత్‌కు ఇది 8వ స్వర్ణం. ఈ పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 28కి చేరింది. మొత్తంగా ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఇప్పటివరకు 103కు (28 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. ప్రస్తుతానికి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. చైనా ఇప్పటివరకు 366 పతకాలు (193 స్వర్ణాలు, 107 రజతాలు, 66 కాంస్యాలు) సాధించింది. పతకాల పట్టికలో జపాన్ రెండో స్థానంలో (177; 48 స్వర్ణాలు, 62 రజతాలు, 67 కాంస్యాలు) ఉంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (183; 39 స్వర్ణాలు, 55 రజతాలు, 89 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది. -
Ind Vs Afg: ఫైనల్ మ్యాచ్ రద్దు.. టీమిండియా గోల్డ్ మెడల్ ఎలా గెలిచిందంటే!
Asian Games Mens T20I 2023- India vs Afghanistan, Final: ఆసియా క్రీడల్లో టీమిండియా స్వర్ణంతో మెరిసింది. భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పసిడి గెలిచి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా చైనా వేదికగా హోంగ్జూలో రుతురాజ్ గైక్వాడ్ సేన శనివారం అఫ్గనిస్తాన్‌తో ఫైనల్లో తలపడింది. టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ల దాటికి అఫ్గన్ టాపార్డర్ కుదేలైంది. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షహీదుల్లా కమల్ 43 బంతుల్లో 49 పరుగులతో, కెప్టెన్ గులాబదిన్ నయీబ్ 24 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, వర్షం రాకతో సీన్ మారిపోయింది. వరణుడి అంతరాయం కారణంగా 18.2 ఓవర్లలో అఫ్గనిస్తాన్ 5 వికెట్లు నష్టానికి 112 పరుగుల వద్ద ఉన్న వేళ మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కురుస్తూనే ఉండటంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రుతురాజ్ సేనకు స్వర్ణం ఎలా అంటే? ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను స్వర్ణం వరించింది. ఇక భారత మహిళా క్రికెట్ జట్టు సైతం గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇక రుతురాజ్ సేన విజయంతో భారత్ పసిడి పతకాల సంఖ్య 27కు చేరింది. అదే విధంగా 35 రజత, 40 కాంస్య పతకాలు రావడంతో మొత్తంగా 102 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆసియా క్రీడలు-2023లో రుతురాజ్ సేన ప్రయాణం ►పటిష్ట టీమిండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ►తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ►తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ►ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ రద్దు కావడంతో పసిడి కైవసం. చదవండి: శుభ్‌మన్ గిల్ కోసం సారా టెండూల్కర్ ట్వీట్ Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్‌లో తొలి స్వర్ణం -
Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్.. బ్యాడ్మింటన్‌లో తొలి స్వర్ణం
ఏషియన్ గేమ్స్-2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. పతకాలకు సంబంధించి ఇవాళ ఉదయమే సెంచరీ మార్కు తాకిన భారత్ తాజాగా మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. సౌతా కొరియా జోడీ కిమ్-చోయ్‌పై 21-18, 21-16 వరుస సెట్లలో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. FIRST BADMINTON GOLD FOR INDIA🇮🇳🇮🇳😭😭❤️❤️ History has been scripted in Hangzhou as @Shettychirag04 and @satwiksairaj become the first ever badminton players from India to win gold at the #AsianGames 🥇💯 The 'Brothers of Destruction' defeated South Korea's Kim-Choi in the… pic.twitter.com/X87O5owODf — The Bridge (@the_bridge_in) October 7, 2023 #AsianGames2023 #AsianGames #Cheer4India #IndiaAtAG22 #India 🇮🇳 #SatwiksairajRankireddy and #ChiragShetty after their historic #Badminton gold 🥇 FOLLOW LIVE: https://t.co/38IQLKfS9H@WeAreTeamIndia pic.twitter.com/80fk2YpHIX — TOI Sports (@toisports) October 7, 2023 ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో భారత్ ఎన్నడూ ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ సాధించలేదు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది (బ్యాడ్మింటన్‌లో) మూడో పతకం. పురుషుల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్, పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం సాధించారు. బ్యాడ్మింటన్ గోల్డ్‌తో భారత్ పతకాల సంఖ్య 101కి (26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. India creates history at the #AsianGames in winning Gold in the men’s doubles in badminton! Congratulations to @satwiksairaj and @Shettychirag04 for their spectacular performance! Kudos to our very our very own @satwiksairaj for making me, all of Andhra Pradesh and India proud!… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 7, 2023 అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన సాత్విక్‌సాయిరాజ్-చిరగ్ షెట్టి ద్వయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సాత్విక్‌సాయిరాజ్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. సాత్విక్ నాతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశాడని కొనియాడాడు. -
నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..
Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్ మలిక్ (62 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అమన్ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్ 7–5తో జియా లాంగ్ (చైనా)పై, కిరణ్ 6–3తో అరియున్జర్గాల్ (మంగోలియా)పై నెగ్గారు. బజరంగ్ విఫలం సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బజరంగ్ పూనియా కాంస్య పతక బౌట్లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్ ప్లేయర్ కైకి యామగుచి 10–0తో బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు. రెండునెలల పాటు నిరసనలో రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్‌లో బజరంగ్ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్‌లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు. ఎవరూ ఊహించలేరు కూడా! కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్‌కు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అండగా నిలిచారు. ‘‘బజరంగ్.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్ బజరంగ్ పునియాను ప్రశంసించారు. నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ మద్దతుదారులు బజరంగ్‌ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్ ఉద్వేగానికి లోనయ్యారు. -
AFG vs IND Final: భారత్- ఆఫ్గాన్ ఫైనల్ రద్దు.. టీమిండియాకు గోల్డ్
ఆసియాక్రీడల్లో భారత్-ఆఫ్గానిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 112/5 వద్ద మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేనకు స్వర్ణం ఖాయమైంది. 18 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 109/5 18 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(48), నైబ్(26) పరుగులతో ఉన్నారు. 15 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 86/5 15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 13 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్ స్కోర్: 70/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(36), నైబ్(4) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్.. భారత్‌తో జరగుతున్న ఫైనల్లో ఆఫ్గానిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 53 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం ఇఒక్క పరుగు మాత్రమే చేసిన కరీం జనత్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 53/5 నాలుగో వికెట్ డౌన్.. 49 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జజాయ్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 47/3 షహీదుల్లా కమల్ నిలకడగా ఆడుతుండటంతో(21 పరుగులతో ) అఫ్గన్ ఇన్నింగ్స్ తిరిగి గాడిలో పడింది. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆఫ్గానిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నూర్ అలీ జద్రాన్ రూపంలో ఆఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన జద్రాన్ రనటౌయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 5 పరుగులు చేసిన జుబైద్ అక్బరీను శివమ్ దుబే పెవిలయన్‌కు పంపగా.. మహ్మద్ షాజాద్(4)ను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 3 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 10/2 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఈ గోల్డ్‌మెడల్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ దూరమయ్యాడు. భారత జట్టు మొత్తం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ఆఫ్గానిస్తాన్ ఒకే ఒక మార్పు చేసింది. జుబైద్ అక్బరీ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు భారత్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్ ఆఫ్గానిస్తాన్: జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్ టాస్ ఆలస్యం.. ఏషియన్ గేమ్స్-2023 పురుషుల క్రికెట్ ఫైనల్లో పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా భారత్- ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది. -
అసాధారణం.. మన అద్భుత విజయం: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇవాళ వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారాయన. అంతేకాదు వాళ్లను కలుసుకుని ముచ్చటించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు దక్కిన అద్భుత విజయం!. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అబ్బుర పరిచే వాళ్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించి.. మన హృదయాలను గర్వంతో నింపింది. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. A momentous achievement for India at the Asian Games! The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals. I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వంద పతకాలు వచ్చాయి. అందులో స్వర్ణం 25 ఉండగా.. ఇవాళ ఒకే రోజు 3 దక్కాయి. ఇక.. మిగిలిన పతకాల్లో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది భారత్. రేపటితో ఆసియా గేమ్స్ 2023 ముగియనున్నాయి.