చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా స్క్వాష్ ఈవెంట్‌లో భారత్ గోల్డ్‌మెడల్ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్లో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ ద్వయం 11-10, 11-10తో మలేషియా జంట మొహమ్మద్ కమల్,ఐఫా అజ్మాన్‌లను ఓడించింది. దీంతో బంగారు పతకాన్ని ఈ భారత జోడీ కైవసం చేసుకుంది.
కాగా ఆసియా క్రీడల్లో స్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ ఛాంపియన్స్‌గా నిలిచారు. స్వాష్ డబుల్స్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 84(20 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. కాగా ఇది స్క్వాష్‌లో రెండవ స్వర్ణం కావడం విశేషం.
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే?
20th gold for India🥇🇮🇳
— The Bridge (@the_bridge_in) October 5, 2023
The experienced pair of Dipika Pallikal and Harinder Pal Singh Sandhu defeated the Malaysian duo 11-10 11-10 to clinch gold in the mixed doubles category of #Squash 🔥💯#AsianGames2022 #AsianGames pic.twitter.com/xcZKc7aVog
Comments
Please login to add a commentAdd a comment