
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల శౌర్య బావా భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీకి చెందిన శౌర్య 5–11, 5–11, 9–11తో టాప్ సీడ్, గత ఏడాది రన్నరప్ మొహమ్మద్ జకారియా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయాడు. 2014లో కుశ్ కుమార్ తర్వాత ఈ మెగా టోరీ్నలో పతకం నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా శౌర్య గుర్తింపు పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment