Bronze medal
-
Asian Wrestling 2025: భారత రెజ్లర్లకు మూడు పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు ఆదివారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్స్‌లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్‌హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ తుర్క్మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్ను ఓడించాడు. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు. -
తెలంగాణ టీటీ జట్టుకు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్‌లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు. మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్‌మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
తైక్వాండోలో హర్షప్రదకు రజతం... వరుణ్‌కు కాంస్యం
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో మాయ ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మాయ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్‌మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేజైపూర్: భారత మాజీ లెగ్‌స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్‌లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు. -
స్వప్నిల్‌కు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలె కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ విభాగంలో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తరఫున బరిలోకి దిగిన 25 ఏళ్ల నీరజ్ కుమార్ 464.1 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐశ్వరి ప్రతాప్ సింగ్ (462.4 పాయింట్లు) రజత పతకం దక్కించుకోగా... పారిస్ ఒలింపిక్స్ కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్ (447.7 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–ప్రమోద్ (హరియాణా) 17–7 పాయింట్ల తేడాతో అంజలి షెఖావత్–ఉమేశ్ చౌదరీ (రాజస్తాన్)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. రాహి సర్ణోబత్–ప్రణవ్ అరవింద్ పాటిల్ (మహారాష్ట్ర) జట్టు కాంస్యం గెలుచుకుంది. సుదీర్ఘ కాలంగా భారత టాప్ ఆర్చర్‌గా ఉన్న దీపిక కుమారి పసిడిని అందుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైన దీపిక నేషనల్ గేమ్స్‌లో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగి వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్‌ను ఓడించిన 18 ఏళ్ల బెంగాల్ ఆర్చర్ జుయెల్ సర్కార్ జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. మరో వైపు బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్, ఆరు సార్లు ఆసియా చాంపియన్ శివ థాపా విజయాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా తిరుగులేని ప్రదర్శన కనబర్చగా... పురుషుల 64 కేజీల విభాగంలో శివ థాపా (అసోం) సత్తాచాటాడు. -
వెల్డన్ వైశాలి
న్యూయార్క్: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో 23 ఏళ్ల వైశాలి కాంస్య పతకాన్ని గెల్చుకుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన ఈ మెగా ఈవెంట్లో వైశాలి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్జున్తో జరిగిన సెమీఫైనల్లో తమిళనాడుకు చెందిన వైశాలి 0.5–2.5తో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో లె టింగ్జీ (చైనా) 3.5–2.5తో కాటరీనా లాగ్నో (రష్యా)పై గెలిచింది. జు వెన్జున్తో జరిగిన సెమీఫైనల్ తొలి గేమ్‌ను వైశాలి 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. రెండో గేమ్‌లో జు వెన్జున్ 86 ఎత్తుల్లో... మూడో గేమ్‌లో 36 ఎత్తుల్లో వైశాలిని ఓడించి 2.5–0.5తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో వీరిద్దరి మధ్య నాలుగో గేమ్‌ను నిర్వహించలేదు. సెమీఫైనల్లో ఓడిన వైశాలి, కాటరీనా లాగ్నోలకు కాంస్య పతకాలు లభించాయి. ఫైనల్లో వెన్జున్ 3.5–.2.5తో లె టింగ్జీపై గెలిచి తొలిసారి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించింది. 3 ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా వైశాలి గుర్తింపు పొందింది. 2017లో విశ్వనాథన్ ఆనంద్ కాంస్య పతకం... 2022లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రజత పతకం గెలిచారు. -
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
జ్యోతి సురేఖకు కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ 900 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 18 మీటర్ల దూరం ఉన్న లక్ష్యంవైపు ఆయా ప్లేయర్లు 30 బాణాలను మూడుసార్లు చొప్పున సంధించారు.నిర్ణీత 90 బాణాల తర్వాత సురేఖతోపాటు ఎలీసా రోనెర్ (ఇటలీ), అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా), ఆండ్రియా మునోజ్ (స్పెయిన్) 900 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే పతకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్లను లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా ఎలీసా రోనెర్ (87)కు స్వర్ణ పతకం, అలెజాంద్రా (80) రజతం, జ్యోతి సురేఖ (79)కు కాంస్య పతకం ఖరారయ్యాయి. ఉమామహేశ్‌కు నాలుగో స్థానం న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఉమమహేశ్ 208.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. -
జోహర్ కప్‌లో యువ భారత్‌కు కాంస్య పతకం
సుల్తాన్ జొహర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా శనివారం జరిగిన కాంస్య పతక పోరులో భారత జట్టు షూటౌట్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కాంస్యం ఖాతాలో వేసుకుంది. గోల్‌కీపర్ బిక్రమ్‌జిత్ సింగ్ ప్రత్యర్థి మూడు గోల్స్ ప్రయత్నాలను అడ్డుకోవడంతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్ చేయగా... ఫలితం తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 3–2తో గెలుపొందింది. షూటౌట్లో భారత్ తరఫున గుర్జోత్ సింగ్, మన్మీత్ సింగ్, సౌరభ్ ఆనంద్ గోల్ కొట్టారు.అంతకుముందు భారత్ తరఫున దిల్‌రాజ్ సింగ్ (11వ నిమిషంలో), మన్మీత్ సింగ్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... న్యూజిలాండ్ తరఫున బ్రౌన్ (51వ ని.లో), జాంటీ ఎల్మ్స్ (57వ ని.లో) చెరో గోల్ చేశారు. ఆరంభం నుంచి మ్యాచ్‌పై పట్టు కొనసాగించిన భారత జట్టు... చివరి క్వార్టర్లో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చింది. -
వివాన్‌కు రజతం... అనంత్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌ను భారత జట్టు నాలుగు పతకాలతో ముగించింది. టోర్నీ చివరిరోజు గురువారం భారత్ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి రెండు పతకాలు చేరాయి. పురుషుల ట్రాప్ ఈవెంట్లో జైపూర్‌కు చెందిన వివాన్ కపూర్ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరూకా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ‘ట్రాప్’ ఫైనల్లో 22 ఏళ్ల వివాన్ 44 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వివాన్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ వ్యక్తిగత పతకం. గతంలో అతను మూడుసార్లు వరల్డ్‌కప్ టీమ్ ఈవెంట్స్‌లో రజత పతకాలు సాధించాడు. ‘స్కీట్’ ఈవెంట్ ఫైనల్లో ‘పారిస్ ఒలింపియన్’ అనంత్‌జీత్ 43 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని పొందాడు. అనంత్ కెరీర్లో ఇదే తొలి వరల్డ్‌కప్ మెడల్ కావడం విశేషం. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టోరీ్నలో భారత్ 2 రజతాలు, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు నెగ్గి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. -
భారత పురుషుల టీటీ జట్టుకు కాంస్యం
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2021, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టుకు కాంస్య పతకాలు లభించాయి. కజకిస్తాన్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 0–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శరత్ కమల్ 7–11, 10–12, 9–11తో లిన్ యున్ జు చేతిలో... రెండో మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 9–11, 11–8, 3–11, 11–13తో చెంగ్ జుయ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 6–11, 9–11, 7–11తో హువాంగ్ యాన్ చెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. నేటి నుంచి మొదలయ్యే వ్యక్తిగత విభాగంలో శరత్ కమల్, సత్యన్, హర్మీత్, మనుష్ షా, మానవ్ ఠక్కర్, ఆకుల శ్రీజ, మనిక బత్రా, ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ, దియా పరాగ్ పోటీపడతారు. -
అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి
చిన్న చిన్న సమస్యలకే భయపడి జీవితాన్ని ముగించే యువత ఉన్న నేటి రోజుల్లో.. తనకు రెండు చేతులు లేకపోయినా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది శీతల్ దేవి. పదిహేడేళ్ల వయసులోనే పారాలింపిక్స్ పతకం గెలిచి సత్తా చాటింది. తనను కన్న తల్లిదండ్రులతో పాటు దేశం మొత్తం గర్వపడేలా పారా విశ్వక్రీడ వేదికపై కాంస్యంతో మెరిసింది. అయితే, తన ప్రయాణమేమీ సజావుగా సాగలేదని.. పారా ఆర్చర్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాని చెబుతోంది శీతల్.విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి‘‘మొదట్లో నాకు క్రీడల గురించి అసలేమీ తెలియదు. అయితే, మా గ్రామంలో చాలా మంది కర్రలతో విల్లులు తయారు చేస్తారు.వాటితో ఆడుకోవడం అంటే నాకెంతో ఇష్టం. అలా విలువిద్యపై దృష్టి సారించాను.అయితే, విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి నా మనసులో ఒకే ఆలోచన ఉండేది. నేను నా దేశ జెండాను క్రీడా వేదికపై రెపరెపలాడిస్తే ఎంతో బాగుంటుంది కదా అనిపించేది. ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేశాను.నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయిత్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అసలు నేను ఏదైనా సాధించగలనని ఎవరూ నమ్మలేదు. నాపై ఎవరికీ విశ్వాసం లేదు. అయితే, అప్పుడు ఎవరైతే నన్ను తక్కువగా చూశారో.. ఇప్పుడు వాళ్లే స్వయంగా నా తల్లిదండ్రులకు మిఠాయిలు తినిపిస్తున్నారు’’ అని శీతల్ దేవి గర్వంగా చెప్పింది. సలాం శీతల్అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తే గెలుపు జెండా ఎగర వేయవచ్చునని తన సంకల్ప బలాన్ని ఉదాహరించింది. ఈ మేరకు శీతల్ దేవి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. సలాం శీతల్ అంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.శీతల్ దేవి.. తనే ఒక అద్భుతంకశ్మీర్లోని కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం శీతల్ స్వస్థలం. ఆమె తండ్రి మాన్ సింగ్. తల్లి శక్తిదేవి. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. మాన్ సింగ్ రైతు కాగా.. కుటుంబ పోషణలో భర్తకు సాయంగా ఉండేందుకు శక్తి దేవి గొర్రెలు సాకుతోంది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. వీరిలో శీతల్ అందరికంటే పెద్దది. అయితే, ఫొకోలిమా అనే డిజార్డర్ కారణంగా పుట్టుకతోనే ఆమెకు చేతులు ఏర్పడలేదు. అయినప్పటికీ శీతల్ తల్లిదండ్రులు కుంగిపోలేదు. మిగతా ఇద్దరు పిల్లల మాదిరే ఆమెనూ పెంచారు. ఆత్మవిశ్వాసం ఇనుమడించేలా ధైర్యం నూరిపోశారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చేతులతో చేయాల్సిన పనులు కాళ్లతోనే చేయడం అలవాటు చేసుకుంది శీతల్. భారత ఆర్మీ కోచ్‌ల శిక్షణలోఈ క్రమంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీయింగ్ యు సంస్థ తనకు విలువిద్యలో శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో రెండు చేతులు లేకుండానే విల్లు ఎక్కుపెట్టిన తొలి పారా ఆర్చర్‌గా శీతల్ ఎదిగింది. భారత ఆర్మీకి చెందిన కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్దీప్ వధ్వాన్ శిక్షణలో రాటుదేలింది.పసిడి వెలుగులువారి ఆధ్వర్యంలో ట్రెయినింగ్ మొదలుపెట్టిన కేవలం 11 నెలల వ్యవధిలోనే 2023 ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న శీతల్ స్వర్ణం గెలిచి ఔరా అనిపించింది. వ్యక్తిగత కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచింది. అదే విధంగా మహిళల డబుల్స్ విభాగంలో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. అరుదైన ఘనతఈ క్రమంలో పారా ఆర్చర్ కాంపౌండ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగిన శీతల్.. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లోనూ స్వర్ణ పతకం గెలిచింది. ఈ క్రమంలో అర్జున అవార్డు అందుకున్న శీతల్ దేవి.. ప్యారిస్ పారాలింపిక్స్-2024లో రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. 17 ఏళ్లకే ఘనత సాధించి.. అత్యంత పిన్న వయసులో పారాలింపిక్ మెడల్ గెలిచిన భారత తొలి పారా ప్లేయర్‌గా నిలిచింది.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలుSheetal Devi - What a Star 💫 Credits Mrityuu Dev Insta pic.twitter.com/YQpS6tANE7— ISH PARA Sports (@ISHsportsmedia) September 10, 2024 -
Paris Paralympics 2024: గతంకంటే ఘనంగా...
పారిస్: కనీసం 25 పతకాలతో తిరిగి రావాలనే లక్ష్యంతో ‘పారిస్’ బయలుదేరిన భారత దివ్యాంగ క్రీడాకారులు లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు. పారాలింపిక్స్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించింది. భారత్ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మెరిసిన నవ్‌దీప్... శనివారం భారత్‌కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితుల్లో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగిరీలో భారత అథ్లెట్ నవ్‌దీప్ సింగ్ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఇరాన్ అథ్లెట్ సాదెగ్ బీట్ సాయె జావెలిన్‌ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెగ్ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతాకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెగ్ సంకేతం ఇచ్చాడు. దాంతో అతనికి హెచ్చరికగా ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పతాకాన్ని ప్రదర్శించడంతో సాదెగ్‌కు రెండో ఎల్లో కార్డు చూపెట్టారు. దాంతో అతను డిస్క్వాలిఫై అయ్యాడు.సాదెగ్ ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్‌కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు. మరోవైపు మహిళల 200 మీటర్ల టి12 (దృష్టిలోపం) కేటగిరీలో సిమ్రన్ కాంస్యం సాధించింది. ఫైనల్లో సిమ్రన్ తన గైడ్ అభయ్ సింగ్‌తో కలిసి 24.75 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
Paralympics: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ క్రీడల్లో నాలుగో రోజు కూడా మనోళ్ల జోరు కొనసాగింది. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పురుషుల హైజంప్ టీ46 ఈవెంట్లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించగా.. మహిళల 200 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతీ పాల్ కాంస్యంతో మెరిసింది. కాగా ప్రీతీ 100 మీ. టీ35 పరుగు పందెంలో కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఇక ఇప్పటివరకు పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 7కు చేరింది.అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించగా.. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. అదే విధంగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. -
రుబీనా అదుర్స్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు మన గన్ గర్జించడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత పారా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యంతో సత్తా చాటింది. చెదరని గురితో పోడియంపై చోటు దక్కించుకుంది. ఇతర క్రీడల్లోనూ శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో నితీశ్ కుమార్, సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. పారిస్: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. శుక్రవారం రైఫిల్ విభాగంలో అవనీ లేఖరా, మోనా అగర్వాల్ పతకాలతో సత్తా చాటితే... శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో మెరిసింది. ఈ విభాగంలో పారాలింపిక్స్ పతకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. తుదిపోరులో 25 ఏళ్ల రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాతాలో వేసుకుంది. వైల్డ్‌కార్డ్ ద్వారా పారిస్ పారాలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఇరాన్ షూటర్ జవాన్మార్డీ సారా 236.8 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. సారాకు ఇది వరుసగా మూడో పారాలింపిక్ పసిడి కావడం విశేషం. అజ్గాన్ అయ్సెల్ (టర్కీ) 231.1 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. స్థిరమైన గురితో సత్తాచాటిన రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్ కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి పోడియంపై నిలిచింది. తుది పోరులో తొలి పది షాట్ల తర్వాత రుబీనా 97.6 పాయింట్లతో నిలిచింది. 14 షాట్ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న రుబీనా తదుపరి రెండు షాట్లలో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానానికి చేరింది. కాంస్యం గెలిచిన రుబీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. గొప్ప సంకల్పం, అసాధారణమైన గురితో పతకం సాధించిన రుబీనా దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. గగన్ నారంగ్ స్ఫూర్తితో.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన మెకానిక్ కూతురైన రుబీనా... పుట్టుకతోనే కుడి కాలు లోపంతో జన్మించింది. తండ్రి స్నేహితుల ప్రోద్బలంతో షూటింగ్ కెరీర్ ప్రారంభించిన రుబీనా... ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. జబల్పూర్ అకాడమీలో షూటింగ్ ఓనమాలు నేర్చుకున్న ఫ్రాన్సిస్... ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ ఘనతలు చూసి షూటింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుంది. కెరీర్ ఆరంభంలో షూటింగ్ రేంజ్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రుబీనా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగి 2017లో గగన్ నారంగ్ అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’లో అడుగుపెట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్ సెమీస్‌లో నితీశ్, సుకాంత్ పారిస్ పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితీశ్ కుమార్, ఎస్ఎల్4లో సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శనివారం క్వార్టర్ ఫైనల్లో నితీశ్ 21–13, 21–14తో మాంగ్ఖాన్ బున్సన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్ ప్లేస్ దక్కించుకొని సెమీస్‌కు చేరాడు. గ్రూప్ నుంచి రెండో స్థానంలోనిలిచిన బున్సన్ కూడా సెమీస్‌కు చేరాడు. ఎస్ఎల్4 క్లాస్‌లో సుకాంత్ 21–12, 21–12తో టిమార్రోమ్ సిరిపాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3లో సుహాస్ యతిరాజ్–పాలక్ కోహ్లీ జంట 11–21, 17–21తో హిక్మత్–లియాని రాట్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో నితీశ్ కుమార్–తులసిమతి ద్వయం కూడా పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో సరిత ఓటమి భారత పారా ఆర్చర్ సరితా కుమారి క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం మహిళల కాంపౌండ్ క్వార్టర్స్‌లో సరిత 140–145తో టాప్ సీడ్ ఓజు్నర్ కూర్ గిర్డి (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ఎలిమినేషన్ రెండో రౌండ్లో సరిత 141–135తో ఎలెనోరా సార్టీ (ఇటలీ)పై గెలిచింది. తొలి రౌండ్లో సరిత 138–124తో నూర్ అబ్దుల్ జలీల్ (మలేసియా)పై గెలిచింది. మరోమ్యాచ్‌లో భారత ఆర్చర్, రెండో సీడ్ శీతల్ దేవి 137–138తోమిరియానా జునీగా (చిలీ)పై చేతిలో ఓడింది. రోయింగ్ రెపిచాజ్లో మూడో స్థానం రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె జంట రెపిచాజ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ ‘బి’లో అడుగుపెట్టింది. శనివారం పోటీలో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఉక్రెయిన్ (7 నిమిషాల 29.24 సెకన్లు), బ్రిటన్ (7 నిమిషాల 20.53 సెకన్లు) జోడీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫైనల్ ‘బి’లోని రోవర్లు 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనున్నారు. సైక్లింగ్‌లో నిరాశ పారిస్ పారాలింపిక్స్‌లో భారత సైక్లిస్ట్‌లకు నిరాశ ఎదురైంది. అర్షద్ షేక్, జ్యోతి గడేరియా తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగారు. పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 విభాగంలో బరిలోకి దిగిన అర్షద్ శనివారం క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి స్థానంతో రేసును ముగించాడు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో అర్షద్ 1 నిమిషం 21.416 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి గడేరియా 49.233 సెకన్లలో లక్ష్యాన్ని చేరి చివరి స్థానంలో నిలిచింది. -
Paris Paralympics: భారత్ ఖాతాలో మరో పతకం.. రుబీనాకు కాంస్యం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. షూటింగ్ విభాగంలో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్ లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం సాధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రుబీనా.. ఫైనల్లో 211.1 స్కోర్‌తో మూడో స్ధానంలో నిలిచి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సారే జవాన్‌మర్డి 236.8 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. టర్కీ షూటర్ ఐసెల్ ఓజ్గాన్ రజతం కైవసం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించాయి. అందులో నాలుగు పతకాలు షూటర్లు సాధించినవే కావడం గమనార్హం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించిగా.. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు. BRONZE 🥉 For INDIA 🇮🇳Rubina Francis wins bronze medal in the Women's 10m Air Pistol SH1 Final with a score of 211.1⚡️#Paris2024 #Cheer4Bharat #Paralympic2024 #ParaShooting@mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI… pic.twitter.com/iSBUZ6KNS7— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2024 -
ఫైనల్లో అనాహత్
కోల్‌కతా: భారత టీనేజ్ సంచలనం అనాహత్ సింగ్ హెచ్‌సీఎల్ స్క్వాష్ టూర్ పీఎస్ఏలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అనాహత్ సింగ్ 11–3, 11–4, 11–4తో ఫెరెష్త్ ఎహెతెదరి (ఇరాన్)పై అలవోకగా నెగ్గింది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అనాహత్... శనివారం జరగనున్న తుదిపోరులో జేమ్యా అరిబాడో (ఫిలిప్పీన్స్)తో అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సూరజ్ చంద్ గాయం కారణంగా తప్పుకున్నాడు. -
Paris Olympics: బాధ్యత పెంచిన విజయం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టుకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్‌తో పాటు కొందరు ప్లేయర్లు పారిస్‌లోనే ఉండిపోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ సహా పలువురు క్రీడాకారులు శనివారం స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హాకీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.‘యావత్ దేశం మా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ భావన అద్భుతంగా ఉంది. ఒలింపిక్స్ సమయంలో మాకు అభిమానుల నుంచి విశేష మద్దతు లభించింది. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలు మా బాధ్యతను మరింత పెంచాయి’అని భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మిడ్‌ఫీల్డర్ అమిత్ రోహిదాస్ ‘రెడ్ కార్డ్’కు గురై మైదానాన్ని వీడాల్సి రాగా.. మిగిలిన 10 మందితోనే పోరాడిన భారత జట్టు అద్వితీయ ప్రదర్శనతో సెమీస్ చేరింది. దీనిపై వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది జట్టులోని సభ్యులందరి పరస్పర నమ్మకానికి సంబంధించిన విషయంలో ఒక ప్లేయర్ లేకున్నా మ్యాచ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. గోల్ పోస్ట్ ముందు పీఆర్ శ్రీజేశ్ అయితే లెక్కకు మిక్కిలిసార్లు మమ్మల్ని కాపాడాడు’అని వివరించాడు. ప్రేరణ పెంచిన విజయం: మాండవీయా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా భారత జట్టుకు కేంద్ర మంత్రి రూ. 2 కోట్ల 40 లక్షల చెక్‌ను అందజేశారు. ‘దేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. మీ విజయం లక్షలాది మంది యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది. మీ ఘనతలు చూసి యావత్ దేశం గర్విస్తోంది. ఈ విజయం మీ పట్టుదల, సమష్టి కృషి, తిరుగులేని స్ఫూర్తికి నిదర్శనం’ అని మాండవీయా అన్నారు. మంచుకొండల్లో శిక్షణ ఫలితాన్నిచ్చింది పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగడానికి ముందు స్విట్జర్లాండ్‌లోని మంచు కొండల్లో మూడు రోజుల ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొనడం తమకెంతో ఉపయోగపడిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. మంచుకొండల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ జట్టు సభ్యుల్లో అనుబంధాన్ని పెంచేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఇక 2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా సçహాయక బృందంలో కీలక సభ్యుడైన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ రాక కూడా తమకు కలిసొచ్చిందని హర్మన్ అన్నాడు. ‘ఒకరికి ఒకరు అండగా నిలవడం.. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద ఫలితాలు తెచ్చాయి.పారిస్ క్రీడల్లో మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు మేమంతా ఒక జట్టుగా ముందుకు సాగాం. ఇందులో ప్యాడీ ఆప్టన్ పాత్ర కీలకం. అతడి వల్లే స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లాం. దాని వల్ల ఆటగాళ్లలో పట్టుదల, పరస్పర విశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. -
Olympics: ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించిన సరబ్జోత్ సింగ్
ఒలింపిక్ పతక విజేత, షూటర్ సరబ్జోత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్యానా ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగాన్ని తాను స్వీకరించలేనన్నాడు. తన దృష్టి మొత్తం షూటింగ్‌పైనే కేంద్రీకృతమై.. ఉందని అందుకే ఈ ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపాడు. తాను ముందే కొన్ని కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నానని.. వాటికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.ప్రభుత్వం ఆఫర్ చేసిన ఉద్యోగం ఇదే కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి మూడోస్థానంలో నిలిచిన ఈ హర్యానా అథ్లెట్.. తొలిసారి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అతడికి క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ పదవిని ఆఫర్ చేసింది.కారణం ఇదేఅయితే, సరబ్జోత్ సింగ్ మాత్రం ఇందుకు నో చెప్పాడు. ఒలింపిక్ పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చిన 22 ఏళ్ల సరబ్జోత్ అంబాలాలో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా... ‘‘ఇది మంచి ఉద్యోగమే. కానీ ఇప్పుడు దీనిని స్వీకరించలేను. షూటింగ్‌పైనే మరింతగా దృష్టి సారించాలనుకుంటున్నాను.నా కుటుంబం కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటోంది. అయితే, నేను షూటర్‌గానే కొనసాగాలని భావిస్తున్నాను. నా లక్ష్యాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను మార్చుకోలేను. అందుకే ప్రస్తుతం ఈ జాబ్ చేయలేను’’ అని సరబ్జోత్ సింగ్ తన మనసులో మాటను వెల్లడించాడు. కాగా రైతు కుటుంబంలో జన్మించిన సరబ్జోత్ ఎన్నో కష్టాలు దాటి షూటర్‌గా ఎదిగాడు. చదవండి: ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్‌గా ఒలింపిక్ మెడల్ #WATCH | Ambala, Haryana: On Haryana government's offer of the post of Deputy Director in the Sports Department, Indian Shooter and Olympic Athlete Sarabjot Singh says, "The job is good but I will not do it right now. I want to work on my shooting first. My family has also been… pic.twitter.com/XU7d1QdYBj— ANI (@ANI) August 10, 2024 -
ఒలింపిక్స్‌లో 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం
-
అమన్ కంచు పట్టు.. కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కొనసాగింది. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్‌కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమన్ సెహ్రావత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలోనే భారత్‌కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది.పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అమన్ 13–5 పాయింట్ల తేడాతో డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. అండర్–23 విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్‌తో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), యోగేశ్వర్ దత్ (2012 లండన్; కాంస్యం), సాక్షి మలిక్ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విజయం: ప్రధాని మోదీ
ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో నాలుగో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గురువారం స్పెయిన్‌పై జరిగిన ఈ పోరులో భారత్ 2-1తో గెలుపొందింది. కాగా ఒలింపిక్స్‌లో భారత జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఒలింపిక్స్‌లోనూ ఇండియా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.హాకీ జట్టు విజయంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా భారత్‌కు మరో ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో.. ‘భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో హాకీకి వరుసగా రెండో పతకం.క్రీడాకారుల నైపుణ్యం, పట్టుదలకు స్ఫూర్తి ఈ విజయం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు. భారత హాకీ బృందం స్ఫూర్తిని చాటింది. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉంది. ఈ విజయానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. క్రీడాకారులందరికీ అభినందనలు’ అని తెలిపారు.A feat that will be cherished for generations to come! The Indian Hockey team shines bright at the Olympics, bringing home the Bronze Medal! This is even more special because it is their second consecutive Medal at the Olympics. Their success is a triumph of skill,…— Narendra Modi (@narendramodi) August 8, 2024 -
భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పారిస్ ఒలంపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది. ఈ క్రమంలో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.కాగా, ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్.. 2024 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు అభినందనలు!. మీ విజయంతో భారత జెండా రెపరెపలాడుతోంది అంటూ పోస్టు చేశారు. Congratulations to the Indian men’s hockey team on bringing home the Bronze at the 2024 Olympics!The Indian flag continues to fly high!#IndiaAtOlympics pic.twitter.com/wEuOfpePcI— YS Jagan Mohan Reddy (@ysjagan) August 8, 2024 -
వహ్వా హాకీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం
టోక్యోలో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత హాకీ జట్టు పారిస్ వరకు దానిని కొనసాగించింది. నాటి విజయం తర్వాత అంచనాలను పెంచిన మన టీమ్ ఈసారి కూడా దానికి తగినట్లుగా పతకాన్ని అందించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తమ సత్తాను చాటింది. 1952–1972 మధ్య వరుసగా ఒలింపిక్ మెడల్ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం గత ఒలింపిక్స్ కాంస్యపు ప్రదర్శనను పునరావృతం చేసింది. రెండు సందర్భాల్లోనూ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఈ గెలుపు తర్వాత ఘనంగా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీకిది 13వ పతకం కావడం విశేషం. పారిస్: మ్యాచ్‌లో 58 నిమిషాలు ముగిసేసరికి 2–1తో ఆధిక్యంలో భారత్... మరో రెండు నిమిషాలు బంతిపై పట్టు ఉంచుకుంటే చాలు మ్యాచ్ మనదే... అయితే సరిగ్గా 59వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దాంతో అందరిలో కాస్త ఆందోళన... గతంలో చాలా సందర్భాల్లో భారత జట్టు గెలిచే స్థితిలో ఉండి ఆఖరిలో పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ ఇచ్చి మ్యాచ్ కోల్పోయింది. కాబట్టి కొంత ఉత్కంఠ! అయితే స్పెయిన్ ప్లేయర్ మిరాల్స్ ప్రయత్నాన్ని భారత గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే 60వ నిమిషంలో కూడా వారికి మరో పెనాల్టీ కార్నర్. ఈసారి కూడా శ్రీజేశ్ నిలువరించాడు. దాంతో పాటు చురుగ్గా ఉన్న మన ఆటగాళ్లు బంతిని అందుకొని తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. స్పెయిన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినా మళ్లీ మన సర్కిల్‌లోకి రాలేకపోయారు. అంతే... టీమిండియా బృందంలో సంబరాలు మొదలయ్యాయి. శ్రీజేశ్ తన కీపింగ్ పోస్ట్ వద్ద కుప్పకూలిపోగా... సహచరులంతా చుట్టుముట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. సెమీస్‌లో అనూహ్యంగా ఓడినా... చివరకు కాంస్య పతకం గెలుచుకొని భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. ఈ ‘ప్లే ఆఫ్’ పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (30వ నిమిషం, 33వ నిమిషం) సాధించగా... స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్స్ (18వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో నాలుగో కాంస్యం చేరింది. సమష్టి ప్రదర్శనతో... 1980 తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భారత్ 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అదే తరహాలో భారతీయుల నమ్మకాన్ని జట్టు వమ్ము చేయలేదు. అటు అటాకింగ్‌లో, ఇటు డిఫెన్స్‌లో కూడా జట్టు ప్రభావం చూపించింది. సస్పెన్షన్ కారణంగా గత మ్యాచ్ ఆడని డిఫెండర్ అమిత్ ఈ మ్యాచ్‌లో తిరిగొచ్చి బలంగా నిలబడ్డాడు. 6వ నిమిషంలో సుఖ్‌జీత్‌కు గోల్ అవకాశం వచ్చినా అతను పోస్ట్‌కు దూరంగా కొట్టాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో గోల్ నమోదు కాలేదు. అయితే రెండో క్వార్టర్లో స్పెయిన్ శుభారంభం చేసింది. క్లేప్స్ను టాకింగ్ చేసే ప్రయత్నంలో ‘డి’లో మన్‌ప్రీత్ ఫౌల్ చేయడంతో స్పెయిన్ పెనాల్టీ స్ట్రోక్ లభించగా, దానిని మిరాల్స్ సులువుగా గోల్‌గా మలిచాడు. అయితే 21 సెకన్లలో రెండో క్వార్టర్ ముగుస్తుందనగా పెనాల్టీతో భారత్ స్కోరు సమం చేసింది. మరో మూడు నిమిషాలకే మళ్లీ పెనాల్టీ ద్వారానే హర్మన్ స్కోరు చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మన జట్టు దానిని చివరి వరకు నిలబెట్టుకోగా... ఆఖరి మూడు నిమిషాల్లో గోల్ కీపర్‌ను తప్పించి స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. తమకు లభించిన 6 పెనాల్టీ కార్నర్లను భారత్ 2 గోల్స్‌తో సద్వినియోగం చేసుకోగా... స్పెయిన్‌కు 9 పెనాల్టీలు లభించినా ఆ జట్టు ఒక్కదానినీ గోల్‌గా మలచలేకపోయింది.‘గ్రేట్ వాల్ ఆఫ్ భారత్’ శ్రీజేశ్ అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు శ్రీజేశ్ ముందే ప్రకటించాడు. అతనికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు జట్టు సభ్యులు వెల్లడించారు. ఒక్కొక్కరికీ 15 లక్షలు ప్లేయర్లకు హాకీ ఇండియా నజరానా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఒలింపిక్స్ హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు విశ్వక్రీడల్లో ఇది 13వ పతకం కావడం విశేషం. నెదర్లాండ్స్‌కు స్వర్ణం 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3–1తో జర్మనీ జట్టుపై గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. గతంలో నెదర్లాండ్స్ జట్టు 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లలో పసిడి పతకాలు సాధించింది. భారత జట్టు అత్యధికంగా 8 స్వర్ణాలు నెగ్గగా... నెదర్లాండ్స్, పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ జట్లు మూడు సార్లు చొప్పున బంగారు పతకాలు గెలిచాయి. నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించింది. –పీఆర్ శ్రీజేశ్ కాంస్యపతక పోరు మాకూ, మా దేశానికి ఎంతో కీలకం. ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫలితం మనకు అనుకూలంగా రాదు. భారత్ వరుసగా రెండు సార్లు పతకం సాధించడం గొప్ప విషయం. ఇది అంత సులువు కాదు. పెనాల్టీ కార్నర్లను మా బృందం చాలా అద్భుతంగా నిలువరించగలిగింది. హాకీపై ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. –హర్మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ఎన్నో తరాల పాటు గుర్తుంచుకునే ప్రదర్శన ఇది. భారత హాకీ జట్టు ఒలింపిక్ కాంస్యంతో మెరిసింది. ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం. ప్రతిభ, పట్టుదలకు తోడు సమష్టి కృషి దీనిని అందించింది. ఆటగాళ్లకు నా అభినందనలు. ప్రతీ భారతీయుడికి మానసికంగా హాకీతో బలమైన బంధం ఉంది. ఈ విజయం వల్ల యువతలో ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుంది. –నరేంద్ర మోదీ, ప్రధాని Harmanpreet Singh has 10 goals from 8 matches at the Paris Olympics. 🥶🇮🇳pic.twitter.com/Y7sxmI5jDF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024One of the crucial saves of PR Sreejesh. 🫡🇮🇳pic.twitter.com/2Qw7MghpqY— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024 -
మీరాబాయికి నాలుగో స్థానం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం త్రుటిలో చేజారింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో భారత స్టార్ మీరాబాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో మీరాబాయి మొత్తం 199 కేజీల బరువెత్తి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. హు జిహుయ్ (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు) మొత్తం 206 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మిహేలా వలెంటీనా (రొమేనియా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు) మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. సురోద్చనా ఖాంబావ్ (థాయ్‌లాండ్; స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు) 200 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. పారిస్‌లోనూ మీరాబాయి పతకం సాధించి ఉంటే ఒలింపిక్స్ వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందేది. అవినాశ్‌కు 11వ స్థానం మరోవైపు బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే 8 నిమిషాల 14.18 సెకన్లలో గమ్యానికి చేరి 11వ స్థానంలో నిలిచాడు. సూఫియాన్ (మొరాకో) స్వర్ణం, రూక్స్ (అమెరికా) రజతం, కిబివోట్ (కెన్యా) కాంస్యం గెలిచారు. -
ఊరించి... ఉసూరుమనిపించి
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలంటే అపార నైపుణ్యంతోపాటు, చెక్కు చెదరని విశ్వాసం, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. లేదంటే కచ్చితంగా మెడలో పతకం వేసుకోవాల్సిన చోట... కీలకదశలో ఒత్తిడికిలోనై... అనవసరపు ఆందోళనతో తడబడి... ప్రత్యరి్థకి పతకాలు అప్పగించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పారిస్ ఒలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రెండు కాంస్య పతకాల వేటలో బరిలోకి దిగిన మనోళ్లు ముందుగా ఊరించి చివరికొచ్చేసరికి ఉసూరుమనిపించారు. బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్... షూటింగ్లో మహేశ్వరి–అనంత్‌జీత్ జోడీ మంచి అవకాశాలను వదులుకున్నారు. ఫలితంగా రెండు పతకాలు రావాల్సిన చోట ఒక్క పతకమూ దక్కలేదు. ఇక మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో నిషా దహియా అయితే చివరి నిమిషంలో ఏకంగా తొమ్మిది పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకుంది. పారిస్: ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించే అవకాశాన్ని లక్ష్య సేన్ వదులుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 16–21, 11–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. లక్ష్య సేన్ ఓటమితో 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. 2012 లండన్‌లో సైనా నెహా్వల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఈసారి పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై భారీ అంచనాలు ఉన్నా వారు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. లీ జి జియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ శుభారంభం చేశాడు. దూకుడుగా ఆడుతూ తొలి గేమ్‌ను అలవోకగా దక్కించుకున్నాడు. రెండో గేమ్ ఆరంభంలోనూ లక్ష్య తన ఆధిపత్యం చాటుకొని 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో లక్ష్య సేన్ ఒక్కసారిగా గాడి తప్పాడు. వరుసగా తొమ్మిది పాయింట్లు సమరి్పంచుకున్నాడు. ఇక్కడి నుంచి లీ జి జియా జోరు మొదలైంది. 3–8తో వెనుకబడిన లీ జి జియా 12–8తో ఆధిక్యంలోకి వచ్చి చివరకు 21–16తో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లీ జి జియా పూర్తి ఆధిపత్యం కనబరిచి 9–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా మలేసియా ప్లేయర్ ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడటంతో లక్ష్య సేన్ కోలుకోలేకపోయాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అక్సెల్సన్ 21–11, 21–11తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వితిద్సర్న్ కున్లావత్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్ సె యంగ్ (దక్షిణ కొరియా) 21–13, 21–16తో హి బింగ్జియావో (చైనా)పై విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫినిషింగ్ ‘గురి’ తప్పింది... షూటింగ్ పోటీల చివరిరోజు భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశాలు కనిపించాయి. ఒలింపిక్స్‌లో తొలిసారి మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టిన స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చెందిన మహేశ్వరి చౌహాన్–అనంత్‌జీత్ నరూకా జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్ ద్వయం 43–44 పాయింట్లతో జియాంగ్ యిటింగ్–జియాన్లిన్ లియు (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. ఒక్క పాయింట్ తేడాతో భారత జోడీకి కాంస్య పతకం చేజారడం గమనార్హం. ముందుగా 15 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్.. జియాంగ్ యిటింగ్–జియాన్లిన్ (చైనా) జోడీలు 146 పాయింట్ల చొప్పున సాధించి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. డయానా బకోసి–గాబ్రియెలా రొసెట్టి జోడీ (ఇటలీ; 149 పాయింట్లు), ఆస్టిన్ జెవెల్–విన్సెంట్ హాన్కాక్ ద్వయం (అమెరికా; 148 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత పొందాయి. ఫైనల్లో డయానా–రొసెట్టి ద్వయం 45–44తో జెవెల్–హాన్కాక్ జంటను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. చివరి నిమిషంలో ‘పట్టు’ కోల్పోయి... మహిళల రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా క్వార్టర్ ఫైనల్లో 8–10 పాయింట్ల తేడాతో పాక్ సోల్ గుమ్ (ఉత్తర కొరియా) చేతిలో ఓడిపోయింది. బౌట్ ముగియడానికి ఒక నిమిషం ఉన్నంతవరకు నిషా 8–1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆఖరి 60 సెకన్లలో నిషా పట్టు కోల్పోయింది. ఉత్తర కొరియా రెజ్లర్ ధాటికి నిషా తొమ్మిది పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. అంతకుముందు నిషా తొలి రౌండ్లో 6–4తో తెతియానా సొవా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఒకవేళ ఉత్తర కొరియా రెజ్లర్ ఫైనల్ చేరుకుంటే నిషాకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం సాధించే అవకాశం లభిస్తుంది. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో అవినాశ్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే ఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండో హీట్‌లో అవినాశ్ 8 నిమిషాల 15.43 సెకన్లలో గమ్యానికి చేరి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. 12 మంది అథ్లెట్స్‌తో కూడిన మూడు గ్రూప్‌లకు హీట్స్ నిర్వహించారు. మూడు గ్రూపుల్లో టాప్–5 నిలిచిన వారు ఫైనల్‌కు చేరారు. గురువారం రాత్రి ఫైనల్ జరుగుతుంది. -
Olympics: ఒక్క పాయింట్.. భారత్ చేజారిన కాంస్యం
భారత షూటర్లు అనంత్ జీత్ సింగ్ నరౌకా- మహేశ్వరి తృటిలో కాంస్యం చేజార్చుకున్నారు. స్కీట్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన భారత ద్వయం.. మెడల్ కోసం చైనాతో జరిగిన ప్లే ఆఫ్స్‌లో ఆఖరి వరకు పోరాడింది.అయితే, ఆరంభంలో కాస్త తడబడ్డా భారత జోడీ తిరిగి పుంజుకుంది. కానీ..ఆది నుంచి పొరపాట్లకు తావివ్వని చైనా జోడీ జియాంగ్ యితింగ్- లియు జియాన్లిన్ పతకం ఖాయం చేసుకున్నారు. ఫలితంగా.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో నాలుగో స్థానానికి పరిమితమైన అనంత్ జీత్ సింగ్ నరౌకా- మహేశ్వరి రిక్తహస్తాలతో వెనుదిరగనున్నారు.స్కీట్ మిక్స్డ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ జరిగిందిలారెండు జోడీలు... తలా నాలుగు షాట్లు.. షాట్లో సఫలమైతే ఒక్కో షూటర్‌కు ఒక్కో పాయింట్👉ఫస్ట్ స్టేషన్రెండు జోడీల్లో కలిపి అనంత్ జీత్ సింగ్ ఒక్కడి షాట్ మిస్ఇండియా 7 పాయింట్లు- చైనా ఎనిమిది పాయింట్లు👉సెకండ్ స్టేషన్మహేశ్వరి, అనంత్ ఒక్కో షాట్ మిస్యితింగ్ మూడు షాట్లు మిస్13- 13తో స్కోరు సమం చేసిన భారత్👉థర్డ్ స్టేషన్మహేశ్వరి, యితింగ్ ఒక్కో షాట్ మిస్20-20తో సమంగా భారత్- చైనా👉ఫోర్త్ స్టేషన్నాలుగు షాట్లలో అనంత్ సఫలంఒక షాట్ మిస్ అయిన మహేశ్వరిచైనా జోడీకి ఎనిమిదికి ఎనిమిది పాయింట్లుస్కోరు: 28-27తో ముందంజలో చైనా👉ఫిఫ్త్ స్టేషన్మహేశ్వరి- అంకిత్.. నాలుగు షాట్లలో నాలుగూ సఫలంచైనా జోడీ కూడా అన్ని షాట్లలో సఫలం36-35తో ఆధిక్యంలో చైనా👉సిక్త్స్ స్టేషన్నాలుగు షాట్లలో సఫలమై ఎనిమిది పాయింట్లు సాధించిన చైనా జోడీ.. ఓవరాల్‌గా 44 పాయింట్లునాలుగు షాట్లలో సఫలమై ఎనిమిది పాయింట్లు సాధించిన భారత జోడీ.. ఓవరాల్‌గా 43 పాయింట్లుఒక్క పాయింట్ తేడాతో భారత జోడీ చేజారిన కాంస్యం. -
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం
-
స్వప్నం సాకారం
గత రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారత తుపాకీ ‘పారిస్’లో మాత్రం గర్జిస్తోంది. తమపై పెట్టుకున్న అంచనాలను వమ్ముచేయకుండా షూటర్లు భారత్‌కు మూడో పతకాన్ని అందించారు. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు.క్వాలిఫయింగ్‌లో నిలకడగా లక్ష్యంపై గురి పెట్టి పాయింట్లు గెలిచిన స్వప్నిల్ పతకాన్ని ఖరారు చేసే ఫైనల్స్‌లోనూ దానిని కొనసాగించాడు. ఫలితంగా గతంలో ఏ క్రీడాంశంలోనూ నమోదుకాని అద్భుతాన్ని భారత షూటర్లు నిజం చేసి చూపించారు. ఒకే ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే ప్రథమం. ‘పారిస్’లో ఇప్పటికే రెండు కాంస్యాలు సాధించిన మనూ భాకర్ మరో ఈవెంట్లో పోటీపడనుండటంతో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరే అవకాశాలున్నాయి. పారిస్: గతంలో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో ఎవరూ ఫైనల్‌కు చేరని ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తీవ్రమైన పోటీఉండే విశ్వ క్రీడల్లో క్వాలిఫయింగ్తో పోలిస్తే అసలు సిసలు సత్తా ఫైనల్లో చూపిస్తేనే పతకాలు ఖరారవుతాయి. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతుండటంతో స్వప్నిల్ పతకం సాధిస్తాడని పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ తన నైపుణ్యంపై అపార నమ్మకమున్న స్వప్నిల్ అందరినీ ఆశ్చర్యపరిచే ప్రదర్శన చేశాడు.షూటింగ్లో ఎంతో క్లిష్టమైన ఈవెంట్‌గా పేరున్న 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో (నీలింగ్, ప్రోన్, స్టాండింగ్) స్వప్నిల్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో 28 ఏళ్ల స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ 451.4 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్టేజ్–1లో త్రీ పొజిషన్స్‌లో భాగంగా నీలింగ్ స్టేజ్ ముగిశాక స్వప్నిల్ 153.3 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రోన్ స్టేజ్ పూర్తయ్యాక స్వప్నిల్ 310.1 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఎలిమినేషన్‌ను నిర్ణయించే చివరి స్టేజ్ స్టాండింగ్‌లో స్వప్నిల్ నిలకడగా పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.2012 నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వప్నిల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలిసారే పతకాన్ని గెలిచి తన కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. లియు యుకున్ (చైనా; 463.6 పాయింట్లు) స్వర్ణం, సెరీ కులిష్ (ఉక్రెయిన్; 461.3 పాయింట్లు) రజతం సాధించారు. సిఫ్ట్ కౌర్, అంజుమ్ విఫలం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు తనే పేరిట లిఖించుకున్న భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా, సీనియర్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 32 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్ కౌర్ 575 పాయింట్లు స్కోరు చేసి 31వ స్థానంలో నిలువగా... అంజుమ్ 584 పాయింట్లు సాధించి 18వ స్థానాన్ని దక్కించుకుంది. కేవలం టాప్–8లో నిలిచిన షూటర్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ‘ఒక్కడే’ గెలిచి చూపించాడు! ఈతరం కుర్రాళ్లు, స్టార్ ఆటగాళ్లు ఒంటిపై టాటూస్ ముద్రించుకుంటే వాటిపై ఏం రాసి ఉంటుంది? తమకు ఆత్మీయులైన వారి పేర్లు గానీ ఆసక్తికర పంచింగ్ లైన్లు గానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. స్వప్నిల్ కుసాలే తన వెన్నెముక భాగం మొత్తం ‘మహా మృత్యుంజయ మంత్రం’ టాటూగా ముద్రించుకున్నాడు. మానసికంగా తనకు కావాల్సిన బలాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చలించని దృఢత్వాన్ని ఆ రుగ్వేద మంత్రం తనకు ఇస్తుందని అతను బలంగా నమ్ముతాడు. అందుకే కావచ్చు సుదీర్ఘకాలం పాటు షూటింగ్ సర్క్యూట్లో ఉంటూ గొప్ప ఫలితాలు రాకపోయినా అతను ఎప్పుడూ స్థైర్యాన్ని కోల్పోలేదు. నిజంగా కూడా కుసాలే కెరీర్‌ను చూస్తే చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 14 ఏళ్ల వయసులో షూటింగ్‌ను కెరీర్‌ను ఎంచుకున్న స్వప్నిల్ మూడేళ్ల తర్వాత తన తొలి అంతర్జాతీయ పోటీలో బరిలోకి దిగాడు. కానీ అతను తొలి ఒలింపిక్స్ ఆడేందుకు 12 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో అతని పేరు కనీసం పరిశీలనలో కూడా లేకపోగా... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కొన్నాళ్ల ముందు చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోవడంతో టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. అయితే స్వప్నిల్ సుదీర్ఘ కాలం పాటు తన ఆటనే నమ్ముకున్నాడు. అవకాశం వ చ్చిన ప్రతీసారి విజయాన్ని అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటూనే వచ్చాడు. ఎట్టకేలకు ఈసారి 28 ఏళ్ల వయసులో అతను మొదటిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగడమే కాకుండా కాంస్యంతో చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. అవరోధాలను దాటి... మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి స్వప్నిల్ స్వస్థలం. తండ్రి సురేశ్ కుసాలే పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి అనిత ప్రస్తుతం సర్పంచ్‌గా పని చేస్తోంది. షూటింగ్ సర్క్యూట్లో ఉన్న చాలా మందితో పోలిస్తే స్వప్నిల్ నేపథ్యం సామాన్యమైనదే. తండ్రికి ఆటలపై ఆసక్తి ఉండటంతో కొడుకు స్కూల్లో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ‘క్రీడా ప్రబోధిని’లో చేర్పించాడు. నిబంధనల ప్రకారం వారంతా ఒకే తరహాలో ఫిట్నెస్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా క్రీడాంశం ఎంచుకునే అవకాశం ఇస్తారు. అందులో స్వప్నిల్ షూటింగ్‌ను ఎంచుకున్నాడు. నాసిక్‌లోని భోన్సాలా మిలిటరీ స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో ఓనమాలు నేర్చుకున్న స్వప్నిల్ ఆ తర్వాత మరింత రాటుదేలాడు. అయితే సహజంగానే ఖర్చుతో కూడుతున్న క్రీడ కావడంతో వేర్వేరు దశల్లో ఆర్థి క ఇబ్బందులు తప్పలేదు. తండ్రి బ్యాంకులో అప్పు చేసి మరీ సొంత రైఫిల్ కొనివ్వాల్సి వచ్చింది. దీంతో పాటు ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్లు కూడా చాలా ఖరీదైనవి కావడం వల్ల చాలా జాగ్రత్తగా వాడుకుంటూ సాధన చేయాల్సి వచ్చేది. గగన్ నారంగ్‌ను ఓడించి... 18 ఏళ్ల వయసులో స్వప్నిల్ ప్రతిభను ‘లక్ష్య స్పోర్ట్స్’ సంస్థ గుర్తించింది. వారి ఆర్థిక సహాయంతో పరిస్థితి మెరుగైంది. ఈ క్రమంలో భారత జాతీయ క్యాంప్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చూపించిన ప్రదర్శనకుగాను భారత రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం లభించడంతో పరిస్థితి మరింత మెరుగైంది. 2015లో ఆసియా జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3లో కేటగిరీలో స్వర్ణం గెలుచుకోవడంతో తొలిసారి అతనికి గుర్తింపు దక్కింది.రెండేళ్ల తర్వాత జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వప్నిల్ తన ఆటతో అందరి దృష్టిలో పడ్డాడు. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తన ఆరాధ్య షూటర్, 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత గగన్ నారంగ్, మరో సీనియర్ చయన్ సింగ్‌లను దాటి స్వర్ణం గెలుచుకున్న స్వప్నిల్ సంచలనం సృష్టించాడు. అతని ఎదుగుదలలో కోచ్‌గా భారత మాజీ షూటర్ దీపాలీ దేశ్‌పాండే కీలకపాత్ర పోషించింది. సందేహాలను పటాపంచలు చేస్తూ... చాలా కాలం క్రితమే 2022 అక్టోబరులోనే కైరోలో జరిగిన వరల్డ్ షూటింగ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలవడంతో స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ కేటగిరీలో భారత్‌కు కోటా ఖాయం చేశాడు. కొన్నాళ్ల క్రితం నిర్వహించిన ట్రయల్స్‌లో కూడా రాణించడంతో ఈ విభాగంలో భారత్ తరఫున పోటీ పడేందుకు అతనికే అవకాశం దక్కింది. అయినా సరే... స్వప్నిల్ పతకం సాధించడంపై పెద్దగా ఆశలు లేవు. దానికి కారణం ఉంది. ఈ ఒలింపిక్స్‌కు ముందు అతను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, వరల్డ్ కప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. ఇవన్నీ కూడా టీమ్ ఈవెంట్లలో గెలిచిన పతకాలే! వ్యక్తిగత విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు చేయలేదు. దాంతో గెలుపుపై సందేహాలు. కానీ స్వప్నిల్ తన పట్టుదలతో వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్య ఆటతో ఒలింపిక్స్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచాడు. 1 ఒకే ఒలింపిక్స్ ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే తొలిసారి. గతంలో రెజ్లింగ్‌లో రెండుసార్లు రెండు పతకాల చొప్పున రాగా... షూటింగ్లో ఒకసారి, అథ్లెటిక్స్‌లో ఒకసారి రెండేసి పతకాలు లభించాయి. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియా అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు గెలిచాడు.2012 లండన్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్ షూటింగ్లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం సొంతం చేసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా రజతం, బజరంగ్ పూనియా కాంస్యం సాధించారు. ఈవెంట్‌కు ముందు గుండెవేగం పెరిగింది. దేవుడిని ప్రార్థిస్తూ నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా నాకు తెలిసిన ఆటనే ప్రదర్శించాను. పోటీ జరుగుతున్న సమయంలో స్కోరుబోర్డు వైపు అస్సలు చూడలేదు. ఇన్నేళ్ల నా కష్టం మాత్రం గుర్చుకొచ్చి0ది. తల్లిలాంటి కోచ్ దీపాలీతో పాటు ఇతర సహాయక సిబ్బంది నన్ను మానసికంగా దృఢంగా ఉంచారు. ఒత్తిడిని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండటం నా ఆటలో కీలకం. ఈ విషయంలో నేను ఎమ్మెస్ ధోనిని అభిమానిస్తాను. కాంస్యం గెలవడం సంతృప్తినచ్చి0ది. అయితే నాకు నేను ఒక మాట (స్వర్ణం గెలవడం కావచ్చు) ఇచ్చుకున్నాను. అది మాత్రం ఇంకా పూర్తి కాలేదని అనుకుంటున్నా. –స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచిన స్వప్నిల్ కుసాలేకు హృదయపూర్వక అభినందనలు. షూటింగ్లో ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచి షూటర్లు భారత్ గర్వపడేలా చేశారు. స్వప్నిల్ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిస్వప్నిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనికి శుభాకాంక్షలు. పోటీలో చక్కటి ఆటతో పాటు ఎంతో పట్టుదల కనబర్చిన అతను ప్రతీ భారతీయుడిని సంతోషంలో ముంచెత్తాడు. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ఈ విభాగంలో భారత షూటర్లెవరూ ఎందుకు పతకం సాధించడం లేదని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు స్వప్నిల్ దానిని చేసి చూపించాడు. అతడిపై అంచనాలు లేకపోయినా బాగా ఆడగలడని నేను నమ్మేవాడిని. ఈ కాంస్యం బంగారంకంటే విలువైంది. –గగన్ నారంగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం అందించిన స్వప్నిల్ కుసాలేకు అభినందనలు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ దేశవాసులందరూ గర్వపడేలాచేశాడు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం -
Olympics 2024: పతకానికి అడుగుదూరంలో లవ్లీనా
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అదరగొడుతోంది. మహిళల 75 కేజీల విభాగంలో ఈ అస్సామీ అమ్మాయి.. క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో ఒలింపిక్ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో లవ్లీనా నార్వే బాక్సర్ సునివ హొఫ్సాటడ్‌తో తలపడింది. ఆది నుంచే ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన లవ్లీనా.. ఐదు రౌండ్లలోనూ పదికి తొమ్మిది పాయింట్ల చొప్పున సంపాదించింది. ఈ క్రమంలో 5-0తో సునివను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తదుపరి బౌట్లో లవ్లీనా చైనాకు చెందిన లీ కియాన్‌తో ఆగష్టు 4న పోటీపడనుంది.సెమీస్ చేరుకుంటే చాలుఇక ఈ బౌట్లో గెలిస్తే లవ్లీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, నిబంధనల ప్రకారం సెమీస్ చేరుకుంటే చాలు లవ్లీనా కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. విశ్వ క్రీడల్లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోటీ జరుగుతుంది. సెమీ ఫైనల్లో ఓడిన ఇద్దరు ప్లేయర్లు బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడాల్సి ఉంటుంది.కానీ.. బాక్సింగ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.సెమీస్ చేరిన ఇద్దరు బాక్సర్లకు మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా పతకం ఖాయమవుతుంది. సహజంగానే సెమీస్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి.. ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా.. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత బాక్సర్లు స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు.అందుకే ఇద్దరికీ పతకాలుఅలాంటపుడు వారు సాధారణ స్థితికి వచ్చి.. మళ్లీ వెంటనే బౌట్‌కు సిద్ధం కావడం కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే మూడో స్థానం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు కూడా రావచ్చు. అందుకే బాక్సింగ్‌లో మూడో స్థానం కోసం పోటీ రద్దు చేసి.. సెమీస్‌చేరిన ఇద్దరికీ కాంస్యాలు ఇస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్-2020లో లవ్లీనా బొర్గొహెయిన్ ఇలాగే కంచు పతకం(69 కేజీల విభాగం) గెలుచుకుంది. సెమీస్‌లో ఓడినప్పటికీ మెడల్‌తో తిరిగి వచ్చింది. ఇక ఒలింపిక్స్‌లో ఇప్పటికే షట్లర్ పీవీ సింధు, షూటర్ మనూ భాకర్ రెండేసి పతకాలు గెలుచున్నారు. లవ్లీనా క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే వీరితో పాటు ఈ జాబితాలో చేరిన భారత మహిళా క్రీడాకారిణిగా నిలుస్తుంది. A 𝑳𝒐𝒗𝒍𝒊 PERFORMANCE FROM THE CHAMP!! 🥊She punches her way into the Quarter-Finals 😤 💪Stream the action on #JioCinema for FREE. Also, watch it LIVE on #Sports18!#Cheer4Bharat #OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Paris2024 #Boxing pic.twitter.com/j5ogV5iWmQ— JioCinema (@JioCinema) July 31, 2024 -
మను మహరాణి
పారిస్ వేదికగా మంగళవారం భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఏ భారత ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను మనూ సాధించి చూపించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్... మంగళవారం అదే వేదికపై సహచరుడు సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా ఆమె చరిత్రకెక్కింది. తాను పోటీపడ్డ రెండు ఈవెంట్లలోనూ పతకాలు నెగ్గిన మనూకు మూడో పతకం సాధించే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 2న ఆమె 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగుతుంది. క్వాలిఫయింగ్‌లో రాణించి ఫైనల్‌కు చేరితే ఆగస్టు 3న మూడో పతకంపై మనూ గురి పెడుతుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత క్వాలిఫయింగ్‌లో త్రుటిలో ఫైనల్ స్థానాన్ని చేజార్చుకున్న సరబ్జోత్... మనూతో కలిసి ‘మిక్స్డ్’లో కాంస్యం నెగ్గి కెరీర్లోనే చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేశాడు.పారిస్: రెండు రోజుల క్రితం పతకం సాధించిన విశ్వాసంతో భారత మహిళా యువ షూటర్ మనూ భాకర్ మరోసారి అదరగొట్టింది. పూర్తి సంయమనంతో, చెక్కు చెదరని ఏకాగ్రతతో లక్ష్యం దిశగా బుల్లెట్లు సంధించిన మనూ ఈ క్రమంలో కొత్త చరిత్రలో భాగమైంది. స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని ఘనతను మనూ అందుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా మనూ భాకర్ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ సింగ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ–సరబ్జోత్ ద్వయం 16–10 పాయింట్ల తేడాతో జిన్ ఓయె–లీ వన్హో (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మనూ–సరబ్జోత్ 580 పాయింట్లతో మూడో స్థానంలో, జిన్ ఓయె–లీ వన్హో 579 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. తర్హాన్ సెవల్ ఇల్యాదా–యూసుఫ్ డికెచ్ (టర్కీ) జోడీ 582 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయం 581 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత పొందారు. మంగళవారం జరిగిన ఫైనల్లో జొరానా–దామిర్ ద్వయం 16–14తో తర్హాన్–యూసుఫ్ జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. తర్హాన్–యూసుఫ్ జోడీకి రజత పతకం లభించింది. 1900 పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో బ్రిటిష్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. అయితే ఈ ఘనత భారత్‌కు స్వాతంత్య్రంరాక ముందు నమోదైంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో సౌరభ్ చౌదరీతో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో బరిలోకి దిగిన మనూ భాకర్ క్వాలిఫయింగ్‌లో ఏడో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈసారి సరబ్‌జోత్‌తో జత కట్టిన మనూ క్వాలిఫయింగ్‌లోనే కాకుండా కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిలకడగా స్కోరు చేసి తన ఖాతాలో రెండో పతకాన్ని వేసుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం క్వాలిఫయింగ్‌లో 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన బాధను మర్చిపోయి సరబ్జోత్ ‘మిక్స్డ్’ ఈవెంట్లో గురి తప్పని లక్ష్యంతో పాయింట్లు సాధించి తన ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్నాడు. మిక్స్డ్ ఈవెంట్ పతక మ్యాచ్‌లో రెండు జోడీల్లో తొలుత 16 పాయింట్లు స్కోరు చేసిన జంటను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో అవకాశంలో రెండు జట్లలోని ఇద్దరేసి షూటర్లు లక్ష్యం దిశగా రెండు షాట్ల చొప్పున సంధిస్తారు. రెండు జోడీల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జంటకు 2 పాయింట్లు, తక్కువ స్కోరు చేసిన జోడీకి 0 పాయింట్లు కేటాయిస్తారు. 13 సిరీస్లపాటు జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో తొలి సిరీస్‌లో కొరియా జోడీ నెగ్గగా... ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్‌లలో భారత జంట గెలిచి 8–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆరో సిరీస్‌లో కొరియా ద్వయం... ఏడో సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించాయి. ఎనిమిదో సిరీస్‌లో కొరియా గెలుపొందగా... తొమ్మిది, పది సిరీస్‌లను భారత జోడీ సొంతం చేసుకొని 14–6తో విజయానికి చేరువైంది. అయితే 11వ సిరీస్‌లో, 12వ సిరీస్‌లో కొరియా ద్వయం పైచేయి సాధించి ఆధిక్యాన్ని 10–14కి తగ్గించింది. అయితే 13వ సిరీస్‌లో మనూ–సరబ్జోత్ జోడీ 19.6 స్కోరు చేయగా... కొరియా జంట 18.5 స్కోరు సాధించింది. దాంతో భారత జంట మొదటగా 16 పాయింట్లను అందుకొని విజయంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. పతకం గెలవగానే నా మనసులో ఎన్నో చిన్ననాటి ఆలోచనలు వచ్చాయి. ఇన్నేళ్లుగా నాన్న, తాత నాకు అండగా నిలిచిన వైనం, తొలి రెండేళ్లు కోచింగ్ కోసం బస్సులో అంబాలాకు వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి. ఈవెంట్‌కు ముందు రేంజ్‌లోకి అడుగు పెట్టే సమయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా. వ్యక్తిగత విభాగంలో వైఫల్యం తర్వాత నా కుటుంబసభ్యులు, కోచ్‌లు ఓదార్చి నాలో మళ్లీ స్ఫూర్తిని నింపారు. ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. నా విజయంలో ఆరి్థకపరంగా అండగా నిలిచిన భారత ప్రభుత్వ పాత్ర కూడా ఎంతో ఉంది. –సరబ్జోత్ సింగ్ మనందరం గర్వపడే క్షణాలను మన షూటర్లు మళ్లీ అందించారు. మనూ, సరబ్‌జోత్‌లకు అభినందనలు. ఇద్దరూ చక్కటి ప్రదర్శన కనబర్చారు. భారత్ ఎంతో సంతోషిస్తోంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి వరుసగా రెండో ఒలింపిక్ పతకం సాధించడం మనూ భాకర్ నిలకడైన ప్రదర్శనను, అంకితభావాన్ని చూపిస్తోంది. కాంస్యం గెలిచిన మనూ, సరబ్‌జోత్‌లకు శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిమనూ, సరబ్జోత్... గతంలో ఏ భారత జోడీ సాధించని ఘనతను మీరు అందుకున్నారు. షూటింగ్లో ఇది భారత్‌కు తొలి టీమ్ మెడల్. ఈ క్షణాలను ఆస్వాదించండి. –అభినవ్ బింద్రా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి మనూ, సరబ్జోత్ దేశం గర్వపడేలా చేశారు. ఇతర క్రీడాకారులకు మీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలుస్తుంది. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం3 స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన మూడో భారత ప్లేయర్ మనూ భాకర్. గతంలో రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం) ఈ ఘనత సాధించారు.6 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఆరో భారతీయ షూటర్‌గా సరబ్జోత్ సింగ్ గుర్తింపు పొందాడు. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్), మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుస్తానని నేను అనుకోలేదు. ఈ అనుభూతి కొత్తగా ఉంది. దేశం తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు గెలవాలని కోరుకుంటా. టోక్యోలో వైఫల్యం చూశాను కాబట్టి ఆ పతకాల విలువ ఏమిటో నాకు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి మరో మెడల్ సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నా. తర్వాతి ఈవెంట్లో ఎలా ఆడతానో చెప్పలేను. నా శాయశక్తులా ప్రయతి్నస్తా. ఒకవేళ విఫలమైతే అభిమానులు నిరాశపడరనే అనుకుంటున్నా. నాపై కురుస్తున్న ఈ ప్రేమాభిమానులు ఇలాగే కొనసాగాలి. –మనూ భాకర్ -
ఫుట్‌బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్‌గా ఒలింపిక్ మెడల్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత యువ షూటర్ సరబ్జోత్ సింగ్ సత్తాచాటాడు. సరబ్జోత్ 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని భారత్‌కు అందించాడు. మూడు రోజుల క్రితం పురుషుల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తృటిలో ఫైనల్‌కు చేరే ఛాన్స్ కోల్పోయిన సరబ్జోత్.. మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం తన గురితప్పలేదు. విశ్వవేదికపై మను భాకర్‌తో కలిసి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో దేశవ్యాప్తంగా సరబ్జోత్ సింగ్ పేరు మారుమ్రోగుతోంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం అందించిన సరబ్జోత్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఎవరీ సరబ్జోత్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ సరబ్జోత్ సింగ్.. ?22 ఏళ్ల సరబ్జోత్ సింగ్ హర్యానా రాష్ట్రం అంబాలాలోని ధీన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. సరబ్జోత్ తన చిన్నతనంలో ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్నాడు. ఆ విధంగానే ముందుకు అడుగులు వేశాడు. కానీ తన 13 ఏళ్ల వయస్స్సులో ఒక రోజు స్కూల్ సమ్మర్ క్యాంప్‌లో కొంత మంది పిల్లలు ఎయిర్ గన్లతో తాత్కాలిక రేంజ్లో టార్గెట్‌ను గురిపెట్టడం సరబ్జోత్ చూశాడు.ఆ దృశ్యం(షూటింగ్) అతడిని ఎంతో గానో ఆకట్టుకుంది. దీంతో సరబ్జోత్ కూడా షూటర్ కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జతీందర్ సింగ్ కూడా సరబ్‌జోత్‌కు మద్దతుగా నిలిచాడు. సరబ్జోత్ చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీలో చదువును కొనసాగిస్తూ కోచ్ అభిషేక్ రాణా దగ్గర శిక్షణ పొందాడు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం వంటి స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలు కూడా అతడు షూటర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. 2019లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడం సరబ్జోత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఆ తర్వాత సరబ్జోత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఏకంగా విశ్వక్రీడల్లో కూడా తన తుపాకీ పవర్‌ను సరబ్జోత్ చూపించాడు.సరబ్జోత్ సింగ్ సాధించిన విజయాలు ఇవే..2023 ఆసియా ఛాంపియన్షిప్, కొరియా: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, (ఒలింపిక్ కోటా)2023 ప్రపంచ కప్, భోపాల్: వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకం2023 ప్రపంచ కప్, బాకు: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం2022 ఆసియా క్రీడలు: టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం2022 జూనియర్ ప్రపంచ కప్, సుహ్ల్: టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో రజత పతకాలు2021 జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, లిమా: టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ -
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్.. అత్యంత అరుదైన ఘనత
విశ్వ క్రీడల్లో భారత షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మహిళల విభాగంలో 22 ఏళ్ల మనూ కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లోతద్వారా భారత్‌కు ఈ ఎడిషన్‌లో తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా మనూ నిలిచింది. తాజాగా మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ జంట మెడల్‌ను కైవసం చేసుకుంది.124 ఏళ్ల క్రితంఈ క్రమంలో భారత్ తరఫున ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మనూ.. ఈ ఘనత అందుకున్న ప్యూర్ ఇండియన్‌గా రికార్డులకెక్కింది. అంతకు ముందు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్ ఈ రికార్డు బద్దలు కొట్టింది.చదవండి: నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ రాణా సంతోషంTHE HISTORIC MOMENT! 🇮🇳Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉 - #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024 -
Olympics 2024: భారత్ ఖాతాలో రెండో పతకం
Olympics 2024 Day 4: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు. దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.సరబ్‌జోత్‌కు తొలి మెడల్మరోవైపు.. పురుషుల వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్‌జోత్‌కు మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం లక్ కలిసి వచ్చింది. పేలవంగా ఆరంభించినా మనూ ఆది నుంచే ఆకట్టుకోవడంతో కొరియన్ జంటను ఓడించగలిగారు. ఫలితంగా మనూ ఖాతాలో రెండో పతకం చేరగా.. సరబ్జోత్ తొలి మెడల్‌ను ముద్దాడాడు.ఇక సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. THE HISTORIC MOMENT! 🇮🇳Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉 - #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024BREAKING: India WIN Bronze medal 🔥🔥🔥 Manu Bhaker & Sarabjot Singh beat Korean pair 16-10 in 10m Air Pistol Mixed team event to win India's 2nd medal in Paris. #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/G2XcZRgpoN— India_AllSports (@India_AllSports) July 30, 2024 -
చరిత్ర సృష్టించిన మను భాకర్
-
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో మూడో స్థానం.. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Olympics: ‘మను’సంతా పతకమే!
జూలై 25, 2021, టోక్యో... ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించకుండా తీవ్ర నిరాశ... పని చేయని తుపాకీతో వేదనగా నిష్క్రమించిన రోజు... జూలై 28, 2024, పారిస్... ఫైనల్స్‌లో సత్తా చాటి ఒలింపిక్ కాంస్యం గెలుచుకున్న క్షణం... గర్జించిన తుపాకీని గొప్పగా ప్రదర్శించిన రోజు... అవే ఒలింపిక్స్ క్రీడలు...అదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్... అదే ప్లేయర్...కానీ తుది ఫలితం మాత్రం భిన్నం...విజయాలు కొత్త కాదు... మూడేళ్ల క్రితం మనూ భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. 19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్లో మొదటిసారి... అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు. కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచి్చన ఈ షూటర్ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్‌పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. జూనియర్ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు, యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, వరల్డ్ కప్‌లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దది. దాంతో ఇదే జోరులో ఒలింపిక్ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్ పోటీల్లో కీలక సమయంలో భాకర్ పిస్టల్ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది. అయినా సరే 60 షాట్ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. మళ్లీ మొదలు... ఒలింపిక్ పతకం ప్రతిభ ఉంటేనే కాదు... ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు. టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్ వర్మ, మిక్స్డ్ ఈవెంట్లో ఆమె సహచరుడు సౌరభ్ చౌదరీ మళ్లీ కెరీర్లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్‌కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది. షూటింగ్ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్‌బై చెప్పి సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయతి్నద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్లో కొనసాగేలా చేసింది. ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ కప్‌లలో రెండు కాంస్యాలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి. అయితే పారిస్ క్రీడలకు ముందు గత రికార్డులను ఆమె పట్టించుకోలేదు. తనపై అంచనాలు లేకపోవడమే మంచిదని భావించి ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మెగా ఈవెంట్లోకి అడుగు పెట్టి పతకంతో తన విలువను ప్రదర్శించింది. కానీ ఈ మూడు సంవత్సరాల మూడు రోజుల వ్యవధి ఒక చాంపియన్ ప్లేయర్ కెరీర్లో ఎన్నో మార్పులు తీసుకొచి్చంది... ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు వైపు ఎలా సాగాలో చూపించింది. 22 ఏళ్ల వయసులో మనూ భాకర్ ఇప్పుడు ఒలింపిక్ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగంనాన్న అండతో... హరియాణాలోని ఝఝర్ జిల్లా గోరియా మనూ భాకర్ స్వస్థలం. తండ్రి రామ్‌కిషన్ భాకర్ మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజినీర్. చిన్నప్పటి నుంచి ఆయన తన కూతురు ఆసక్తి కనబర్చిన ప్రతీ చోటా ప్రోత్సహించాడు. టెన్నిస్, స్కేటింగ్, మార్షల్ ఆర్ట్స్...ఇలా అన్నీ ఆడించాడు. ఒకదశలో బాక్సింగ్‌పై బాగా ఆసక్తి కనబర్చి ఎక్కువ సమయం ఈ గేమ్‌పై దృష్టి పెట్టింది. కానీ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదీ నచ్చలేదు. చివరకు తండ్రికి చెప్పి షూటింగ్ వైపు మరలగా... ఆయన ఇక్కడా వద్దనలేదు. కేవలం రెండేళ్ల శిక్షణ, సాధనతో షూటింగ్లో మనూ దూసుకుపోవడం విశేషం. 15 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ చాంపియన్íÙప్లో అగ్రశ్రేణి షూటర్ హీనా సిద్ధూను ఓడించి సంచలనం సృష్టించడంతో పాటు ఈ టోరీ్నలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించడంతో అందరి దృష్టి భాకర్‌పై పడింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలుచుకొని పిన్న వయసులో ఈ ఘనత సాధించిన షూటర్‌గా నిలిచిన తర్వాత మనూ కెరీర్ బుల్లెట్లా దూసుకుపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
మను మురిపించె...
గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారతీయ తుపాకీ ‘పారిస్’లో గర్జించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి కనీసం ఫైనల్ చేరుకోకుండానే వెనుదిరిగిన మనూ భాకర్... ‘పారిస్’లో మాత్రం చిరస్మరణీయ ప్రదర్శనతో దేశం మొత్తాన్ని మురిపించింది. చెక్కు చెదరని ఏకాగ్రతతో... గురి తప్పని లక్ష్యంతో... ఒక్కో బుల్లెట్‌ను 10 మీటర్ల ముందున్న వృత్తంలోకి పంపిస్తూ... మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మనూ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా ఈ హరియాణా అమ్మాయి గుర్తింపు పొందింది. పారిస్: గత చేదు అనుభవాలను వెనక్కి నెట్టి పారిస్ వేదికగా భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓయె (243.2 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్ యెజీ (241.3 పాయింట్లు) రజతం గెలిచింది. ఫైనల్ సాగిందిలా... ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ జరిగింది. ముందుగా స్టేజ్–1లో ఎనిమిది మంది షూటర్లు 10 షాట్లు సంధించారు. 12వ షాట్ తర్వాత స్టేజ్–2లో ఎలిమినేషన్ మొదలైంది. 12 షాట్ల తర్వాత తక్కువ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెరోనికా మాయో (హంగేరి–114 పాయింట్లు) ని్రష్కమించింది. అప్పటికి మనూ 121.2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 14వ షాట్ తర్వాత తర్హాన్ (టర్కీ –135.6 పాయింట్లు), 16వ షాట్ తర్వాత రాన్‌జిన్ జియాంగ్ (చైనా–156.5 పాయింట్లు), 18వ షాట్ తర్వాత జుయ్ లీ (చైనా–178.3 పాయింట్లు) వెనుదిరిగారు. 20వ షాట్ తర్వాత త్రిన్ తు విన్ (వియత్నాం–198.6 పాయింట్లు) నాలుగో స్థానంతో ని్రష్కమించడంతో వరుసగా జిన్ ఓయె, కిమ్ యెజీ, మనూ భాకర్ పతకాల రేసులో నిలిచారు. 22వ షాట్ తర్వాత మనూ భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో... కిమ్ యెజీ 221.8 పాయింట్లతో రెండో స్థానంలో, జిన్ ఓయె 222.6 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారు. 0.1 పాయింట్ తేడాతో కిమ్ యెజీకంటే మనూ వెనుకబడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చివరి రెండు షాట్లలో జిన్ ఓయె 10, 10.6 పాయింట్లు... కిమ్ యెజీ 9.7, 9.8 పాయింట్లు స్కోరు చేశారు. దాంతో జిన్ ఓయె 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని ఖాయం చేసుకోగా, కిమ్ యెజీ 241.3 పాయింట్లతో రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో మెరిసి...పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్ టాప్–8లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. 49 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా 630.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 43 మంది షూటర్లు పోటీపడ్డ మహిళల క్వాలిఫయింగ్‌లో రమితా జిందాల్ 631.5 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ విభాగంలోనూ టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచింది. ఈ జాబితాలో కరణం మల్లీశ్వరి (వెయిట్‌లిఫ్టింగ్; కాంస్యం–2000 సిడ్నీ), సైనా నెహా్వల్ (బ్యాడ్మింటన్; కాంస్యం–2012 లండన్), మేరీకోమ్ (బాక్సింగ్; కాంస్యం–2012 లండన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్; రజతం–2016 రియో, కాంస్యం–2020 టోక్యో), సాక్షి మలిక్ (రెజ్లింగ్; కాంస్యం–2016 రియో), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్; కాంస్యం–2020 టోక్యో) ఉన్నారు. 5 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఐదో భారతీయ షూటర్‌గా, తొలి మహిళా షూటర్‌గా మనూ భాకర్ గుర్తింపు పొందింది. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్) ఈ ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేను తీవ్రంగా నిరాశపడ్డాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కాంస్యం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని మాటల్లో చెప్పలేను. వచ్చే సారి ఇంతకంటే మెరుగైన పతకం గెలుస్తానేమో. చాలా కాలం తర్వాత భారత్‌కు షూటింగ్లో మెడల్ రావడం కూడా గొప్పగా అనిపిస్తోంది. ఫైనల్లో ఆఖరి షాట్లో కూడా ఎంతో ప్రయత్నించా. ఒక దశలో రజతం సాధించగలనని భావించా. నేను భగవద్గీత చదువుతాను. నేను చేయాల్సింది చేసి ఫలితాన్ని భగవంతునికే వదిలేస్తాను. మీకు ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. జరగబోయేది మన చేతుల్లో ఉండదు. మన ప్రయత్నం చేస్తూ అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఇవ్వగలం. ఈ పతకం కోసం మేం చాలా కష్టపడ్డాం. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. –మనూ భాకర్ చారిత్రక విజయం! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మనూ భాకర్‌కు అభినందనలు. షూటింగ్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడం మరింత గర్వకారణం.–నరేంద్ర మోదీ, ప్రధానిభారత పతకాల బోణీ చేసిన భాకర్‌కు శుభాకాంక్షలు. ఈ విజయం మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. మనూ మరిన్ని ఘనతలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించావు. మనూ... నీ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వించేలా చేశావు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంనీ అంకితభావం, శ్రమ ఫలించాయి. ప్రతీ షాట్‌తో భారత్ గర్వపడేలా చేశావు. నీ పట్టుదలకు ఈ పతకం ఉదాహరణ. –అభినవ్ బింద్రా -
ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. మను బాకర్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మను బాకర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఒలింపిక్స్‌లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశారు’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత. My best wishes and congratulations to @realmanubhaker on creating history as the first Indian woman to win a medal in shooting at the Olympics. You have made me and all of India very proud!#Olympics2024Paris pic.twitter.com/tu8YK1Afpd— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2024 -
‘మనూభాకర్’ పాత జుమ్లా ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం గెలిచిన మనూ భాకర్ పాత ట్వీట్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. 2018 అక్టోబర్‌లో యూత్ ఒలింపిక్స్‌లో మనూభాకర్ గోల్డ్‌మెడల్ గెలిచిన తర్వాత అప్పటి హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆమెకు రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు. అయితే ఈ నగదు అందకపోవడంతో రివార్డు ప్రకటించిన మూడు నెలల తర్వాత మనూ భాకర్ ఒక ట్వీట్ చేశారు. అనిల్‌విజ్ రివార్డు ప్రకటించిన ట్వీట్ స్క్రీన్‌షాట్స్ పోస్ట్ చేస్తూ ‘సర్ ప్లీజ్ కన్ఫామ్ చేయండి. ఈ రివార్డు నిజమేనా లేక ఉత్త జుమ్లానా’అని ప్రశ్నించారు. తమకు రివార్డుగా ప్రకటించిన సొమ్ముతో హర్యానా ప్రభుత్వంలో కొందరు ఆటలాడుతున్నారని భాకర్ విమర్శించారు. దీనికి స్పందించిన అనిల్‌విజ్ రివార్డు గురించి భాకర్ తొలుత క్రీడాశాఖలో తెలుసుకుని తర్వాత ఓపెన్‌గా మాట్లాడాలని సూచించారు. భాకర్‌కు రూ.2కోట్ల రూపాయలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. క్రీడాకారులకు క్రమశిక్షణ అవసరం అన్నారు. తాజాగా ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. శివసేన(ఉద్ధవ్) వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. భాకర్‌కు రివార్డు నగదు ఎగ్గొట్టి ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం రాగానే క్రెడిట్ కోసం బీజేపీ నాయకులు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మనుభాకర్ షూటింగ్లో కాంస్య పతకం గెలుచుకుని ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరిచారు. -
శౌర్యకు కాంస్యం
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల శౌర్య బావా భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీకి చెందిన శౌర్య 5–11, 5–11, 9–11తో టాప్ సీడ్, గత ఏడాది రన్నరప్ మొహమ్మద్ జకారియా (ఈజిప్‌్ట) చేతిలో ఓడిపోయాడు. 2014లో కుశ్ కుమార్ తర్వాత ఈ మెగా టోరీ్నలో పతకం నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌గా శౌర్య గుర్తింపు పొందాడు. -
షూటర్ సిఫ్ట్ కౌర్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు రెండో పతకం లభించింది. మ్యూనిక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 452.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. -
షణ్ముగ శ్రీనివాస్‌కు స్వర్ణం... శిరీషకు కాంస్యం
ఇండియన్ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్ స్వర్ణ పతకం సాధించగా... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఇదే నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్ చాంపియన్‌షిప్‌లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో శ్రీనివాస్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది. -
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్‌కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
Asian Shooting Championships 2023: అనీశ్ డబుల్ ధమాకా
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు. ఈ ప్రదర్శనతో అనీశ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్లో భారత్‌కు 12 ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 30 పతకాలు సాధించింది. -
సరబ్‌జోత్‌కు కాంస్య పతకంం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సరబ్జోత్ 221.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. సరబ్జోత్ కాంస్య పతక ప్రదర్శనతో భారత్‌కు షూటింగ్ క్రీడాంశంలో ఎనిమిదో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ సరబ్జోత్ 581 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌కు రుద్రాం„ పాటిల్ (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), స్వప్నిల్, అఖిల్ షెరాన్ (పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), భౌనీష్ మెండిరట్టా (పురుషుల ట్రాప్), మెహులీ ఘోష్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), సిఫ్ట్ కౌర్ (మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), రాజేశ్వరి కుమారి (మహిళల ట్రాప్) అర్హత పొందారు. మరోవైపు మహిళల జూనియర్ విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సంయమ్ 240.6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి బంగ్లాదేశ్ గెలుపు! పాక్‌కు బిగ్ షాక్
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాకిచ్చింది. శనివారం పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరిగిన కాంస్య పతకపోరులో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. దీంతో కాంస్య పతకాన్ని బంగ్లా టైగర్స్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 6 బంతుల్లో 20 పరుగులు.. ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావల్సిన నేపథ్యంలో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. ముఖీమ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే యాసిర్ అలీ సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసిన యాసిర్ అలీ.. మూడో బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. ఈ క్రమలో ఆఖరి మూడు బంతుల్లో బంగ్లాకు 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అలీ.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో బంగ్లా డగౌట్లో ఒక్కసారిగా నిరాశ నెలకొంది. అయితే ఆరో బంతికి రకీబుల్ హసన్ ఫోర్ బాది బంగ్లాదేశ్‌కు చిర్మసరణీయ విజయాన్ని అందించాడు. కాగా తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ 5 ఓవర్లలో 48/1 ఉండగా మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 65 పరుగులుగా నిర్ణయించారు. బంగ్లా బ్యాటర్లలో యాసిర్ అలీ(16 బంతుల్లో 34), అఫిప్ హోస్సేన్(11 బంతుల్లో 20 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. -
29 ఏళ్ల తర్వాత కనోయింగ్‌లో పతకం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రీడాకారులు అర్జున్ సింగ్–సునీల్ సింగ్ ఆసియా క్రీడల కనోయింగ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకం అందించారు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ కనోయ్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో అర్జున్–సునీల్ 3ని:53.329 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో సిజీ సదానందన్–జానీ రోమెల్ భారత్‌కు కాంస్యం అందించారు. చదవండి: Asian Games 2023: ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు -
Asian Games: చరిత్ర సృష్టించిన అనూష్.. తొలి పతకం
Asian Games 2023- Anush Agarwalla: ఆసియా క్రీడల చరిత్రలో భారత క్రీడాకారుడు అనూష్ అగర్వాలా చరిత్ర సృష్టించాడు. టీఎల్ ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి పతకం అందించాడు. చైనాలోని హోంగ్జూ వేదికగా గురువారం నాటి ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. తద్వారా 24 ఏళ్ల అనూష్ అగర్వాలా, అతడి గుర్రం ఎట్రోతో పాటు రికార్డులకెక్కాడు. కోల్‌కతాకు చెందిన అనూష్.. తన అశ్వానికి అన్ని రకాలుగా తర్ఫీదునిచ్చాడు. ఈ క్రమంలో డ్రెసాజ్ ఈవెంట్ ఫైనల్లో అనూష్ సూచనల(మ్యూజిక్)కు తగినట్లుగా ఎట్రో పర్ఫెక్ట్ సింక్‌లో ప్రదర్శన ఇచ్చింది. చక్కటి సమన్వయం.. పతకం ఖాయం దీంతో ఇంప్రెస్ అయిన న్యాయనిర్ణేతలు అనూష్, ఎట్రోల మధ్య సమన్వయం చక్కగా ఉండటంతో పతకం ఖరారు చేశారు. ఈ క్రమంలో 73.030 స్కోరు చేసిన అనూష్ అగర్వాలాకు కాంస్యం లభించింది. కాగా డ్రెసాజ్ ఫైనల్లో బ్లాక్‌బస్టర్ జయహో పాటను కూడా ప్లే చేయడం గమనార్హం. ఇక ఈ ఈవెంట్లో మలేషియాకు చెందిన బిన్ మహ్మద్ స్వర్ణం గెలవగా.. హాంకాంగ్ ప్లేయర్ జాక్వెలిన్ వింగ్ యింగ్ రజతం సాధించింది. కాగా 19వ ఆసియా క్రీడల్లో ఇప్పటికే ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. డ్రెసాజ్ అంటే ఏంటి? డ్రెసాజ్ అనే ఫ్రెంచ్ పదానికి ఇంగ్లిష్‌లో ట్రెయినింగ్ అని అర్థం. ఇందులో రైడర్ తన గుర్రానికి ఏవిధమైన శిక్షణ ఇచ్చాడు.. ఇద్దరి మధ్య కో ఆర్డినేషన్ ఎలా ఉందన్న అంశాలను గమనిస్తారు. రైడర్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా అశ్వం ఎంత మేర నడుచుకుంటుందో చూసి అందుకు తగ్గట్లుగా పాయింట్లు కేటాయిస్తారు. కాగా ఈక్వెస్ట్రియన్‌లో ఎండ్యూరన్స్, ఈవెంటింగ్, పెగ్గింగ్,డ్రెసాజ్, జంపింగ్ వంటి విభాగాలు ఉంటాయి. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్‌గా మార్కరమ్ -
సాకేత్ జోడీకి పతకం ఖాయం
ఆసియా క్రీడల టెన్నిస్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్ జాంగ్–యిబింగ్ వు (చైనా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్‌లో రజతం, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్ నగాల్ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్ సీడ్ జిజెన్ జాంగ్ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
అంతిమ్ అదరహో
బెల్గ్రేడ్: భారత మహిళా టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ అద్భుతం చేసింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అండర్–20 ‘డబుల్ ప్రపంచ చాంపియన్’ అంతిమ్ 16–6 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, యూరోపియన్ చాంపియన్ ఎమ్మా జోనా డెనిస్ మాల్‌్మగ్రెన్ (స్వీడన్)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో అంతిమ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకంపై పోటీపడుతున్నారు. అంతిమ్ 2022, 2023 ప్రపంచ అండర్–20 చాంపియన్íÙప్లో 53 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు 2023 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచింది. 8 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన ఎనిమిదో భారతీయ రెజ్లర్‌గా అంతిమ్ పంఘాల్ గుర్తింపు పొందింది. గతంలో అల్కా తోమర్ (2006; కాంస్యం), బబిత ఫొగాట్ (2012; కాంస్యం), గీతా ఫొగాట్ (2012; కాంస్యం), వినేశ్ ఫొగాట్ (2019, 2022; కాంస్యాలు), పూజా ధాండ (2018; కాంస్యం), అన్షు మలిక్ (2021; రజతం), సరితా మోర్ (2021; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
భారత్ బంగారు గురి
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత షూటర్లు అద్వితీయ ప్రదర్శనతో అలరించారు. రెండు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను ఖరారు చేశారు. తెలంగాణ షూటర్ ఇషా సింగ్, హరియాణా అమ్మాయిలు రిథమ్ సాంగ్వాన్, మనూ భాకర్ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు బంగారు పతకం అందించింది. రిథమ్, ఇషా సింగ్, మనూ భాకర్ జట్టు 1,744 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో రిథమ్ 583 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్ 581 పాయింట్లతో 16వ స్థానంలో, మనూ 580 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రిథమ్ ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో అఖిల్ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం మొత్తం 1750 పాయింట్లు స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్ ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఎనిమిది మంది మధ్య షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్ 450 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ ఐదో బెర్త్‌ను అందించాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. అనాహత్ అదరహో డాలియన్ (చైనా): భారత స్క్వాష్ రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. 15 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3–1తో ఇనా క్వాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. ఈ టోరీ్నలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. అండర్–19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్–19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్–15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. చాంపియన్ వృత్తి అగర్వాల్ భువనేశ్వర్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోరీ్నలో తెలంగాణ స్విమ్మర్లు ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు. హైదరాబాద్ అమ్మాయి వృత్తి అగర్వాల్ గ్రూప్–1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించింది. వృత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. చివరిరోజు శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది. గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శివాని శిక్షణ తీసుకుంటోంది. నిత్యశ్రీ సాగి రెండు రజతాలు, ఒక కాంస్యం, సుహాస్ ప్రీతమ్ రెండు కాంస్యాలు నెగ్గారు. -
కాంస్య పతకంతో భారత్ బోణీ
ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజే భారత్ పతకాల బోణీ కొట్టింది. అజర్బైజాన్ రాజధాని బకూలో గురువారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శివా నర్వాల్ (579), సరబ్జోత్ సింగ్ (578), అర్జున్ సింగ్ (577)లతో కూడిన భారత జట్టు 1,734 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత క్వాలిఫయింగ్ పోటీల్లో ఆయా దేశాల షూటర్లు సాధించిన పాయింట్ల సగటు ఆధారంగా టీమ్ ఈవెంట్ పతకాలను ఖరారు చేస్తారు. భారత పిస్టల్ షూటర్లెవరూ టాప్–8లో నిలవకపోవడంతో వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. మరోవైపు హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్, పలక్, దివ్యలతో కూడిన భారత మహిళల పిస్టల్ జట్టు 1,708 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. -
కాంస్యంతో జ్యోతి జాతీయ రికార్డు
చెంగ్డూ (చైనా): భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ మరో ఘనత సాధించింది. ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి 12.78 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో 12.82 సెకన్లతో గత ఏడాది తానే నెలకొల్పిన జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది. గత నెలలో ఆసియా చాంపియన్‌గా నిలిచిన జ్యోతి తదుపరి ఈనెల మూడో వారంలో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిలో పోటీపడుతుంది. అథ్లెటిక్స్‌లో శుక్రవారమే భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో అమ్లాన్ బొర్గోహైన్ కాంస్య పతకం సాధించాడు. అమ్లాన్ 20.55 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టు 11 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
కాంస్యం నెగ్గిన వ్రితి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణకు రెండో పతకం లభించింది. గచి్చ»ౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది. వ్రితి 18ని:09.50 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ వ్రితికి కాంస్య పతకం దక్కింది. మహిళల 200 మీటర్ల మెడ్లే విభాగంలో హషిక రామచంద్ర (కర్ణాటక) కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. హషిక 2ని:21.15 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలువడంతోపాటు 2010 నుంచి రిచా మిశ్రా (2ని:23.62 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఆర్యన్ నెహ్రా (గుజరాత్; 8ని:01.81 సెకన్లు), మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో అనన్య నాయక్ (మహారాష్ట్ర; 57.31 సెకన్లు) కూడా స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు కొత్త జాతీయ రికార్డులు సృష్టించారు. -
సత్తా చాటిన ఆంధ్ర అథ్లెట్స్.. స్వర్ణం నెగ్గిన జ్యోతి యర్రాజీ
భువనేశ్వర్: జాతీయ సీనియర్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. మహిళల 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో మల్లాల అనూష గౌడ్ (13.24 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 11.46 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శ్రాబణి నందా (ఒడిశా; 11.59 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (హరియాణా; 11.71 సెకన్లు) కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అమ్మాయి నిత్య గాంధె (11.79 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నాలుగు ఈవెంట్లు (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు) ముగిశాక తెలంగాణకు చెందిన అగసార నందిని 3450 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. నేడు మిగిలిన మూడు ఈవెంట్లు (లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) పూర్తయ్యాక అత్యధిక పాయింట్లు సాధించిన అథ్లెట్ విజేతగా నిలుస్తుంది. -
Bhopal ISSF World Cup: మనూ భాకర్‌కు కాంస్యం
భోపాల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ పతకం సాధించడంలో విఫలమైంది. శనివారం ఈవెంట్లు ముగిసే సరికి భారత్ 1 స్వర్ణం, 1 రజతాలు, 4 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా...6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు (మొత్తం 10 పతకాలు) చైనా అగ్ర స్థానంలో నిలిచింది. -
ISSF Shotgun World Cup 2023 Doha: పృథ్వీరాజ్‌కు కాంస్యం
దోహాలో జరుగుతున్న వరల్డ్ కప్ షాట్‌గన్ షూటింగ్లో భారత ఆటగాడు పృథ్వీరాజ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో అతను 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఒగుజాన్ టుజున్ (టర్కీ–33 పాయింట్లు), కోవార్డ్ హాలీ (బ్రిటన్–30 పాయింట్లు)కు స్వర్ణ, రజతాలు దక్కాయి. మరో వైపు మహిళల విభాగంలో శ్రేయాన్షి సింగ్ పతకావకాశాలు కోల్పోయింది. సెమీఫైనల్‌కు అర్హత సాధించిన శ్రేయాన్షియ ఆపై ముందంజ వేయడంలో విఫలమైంది. -
తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ
2000, సెప్టెంబర్ 19.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం.. ఒలింపిక్స్ బహమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతు లేని ఆనందం! బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో పాతికేళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరో వైపు భారత్‌లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతో మంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత ‘భారత్ కీ బేటీ’ అంటూ దేశ ప్రధాని వాజ్‌పేయి నుంచి వచ్చిన ఏకవాక్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకమది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్న గొప్ప విజయమది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్స్‌లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని, పతకం ఆశించని భారత క్రీడాభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మలీశ్వరి గెలిచిన మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. సిడ్నీ ఒలింపిక్స్‌కు ముందు భారత్ ఖాతాలో రెండు వ్యక్తిగత పతకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కె.డి. జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో లియాండర్ పేస్ ఆ పతకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్ పతకంపై అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించగా.. మల్లీశ్వరి వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండింది. 1993, 1994, 1995, 1996లలో వరుసగా నాలుగేళ్ల పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించింది. అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొనకపోగా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేళ్లయింది. దాంతో మల్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఆ రోజు ఏం జరిగిందంటే... ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిపోగా, ముగ్గురి మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లీశ్వరి మరో లిఫ్టర్‌తో కలసి సమానంగా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్ అండ్ జర్క్ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్ విసిరారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరికంటే మల్లీశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం, ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది. అయితే ఈ సమయంలో కోచ్‌లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది. ప్రాక్టీస్‌లో దీనిని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండటం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలే ఎత్తిన మల్లీశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ‘ఫౌల్’గా మారింది. చివరకు ఓవరాల్‌గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం.. భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. అమ్మ అండగా.. మల్లీశ్వరి ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో పాతకాలపు పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆట వైపు ఆకర్షితురాలైంది. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలంశెట్టి అప్పన్న తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెకు అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురుని ప్రోత్సహించింది. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్ లియోనిడ్ తారానెంకో గుర్తించి సరైన దిశ చూపించాడు. దాంతో బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది. ఆపై జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న ఆమె వరల్డ్ చాంపియన్ షిప్‌లలో సంచలన ప్రదర్శనతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకుంది. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగడం విశేషం. ఆమె స్ఫూర్తితోనే.. ‘80వ దశకం చివర్లో మన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తుండటం మొదలైంది. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించారు. కానీ మలీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో సైనా, సింధు, మేరీకోమ్వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్ దిగ్గజం అంజూ జార్జ్ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది. సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫొగాట్ వెల్లడించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినప్పుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించే మాకు ట్రైనింగ్‌లో మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి హరియాణా అమ్మాయే’ అని గీత గుర్తు చేసుకుంది. నిజంగానే ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిందనడంలో సందేహం లేదు. కొత్త బాధ్యతతో... సహచర వెయిట్‌లిఫ్టర్ రాజేశ్త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హరియాణాలోనే..యమునా నగర్లో మల్లీశ్వరి స్థిరపడిపోయింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పురస్కారాలు అందుకున్న మల్లీశ్వరి ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతోంది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్స్‌లర్‌గా ఆమెను నియమించారు. -
Cairo Shooting World Cup: భారత షూటర్ వరుణ్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో బోణీ చేసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 19 ఏళ్ల వరుణ్ తోమర్ మూడో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో నిర్ణీత ఐదు సిరీస్‌ల తర్వాత వరుణ్, సరబ్‌జ్యోత్ సింగ్ 250.6 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ‘షూట్ ఆఫ్ షాట్’లో వరుణ్ 10.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం దక్కించుకోగా... సరబ్‌జ్యోత్ 10.1 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. -
Asian Mixed Team Championships: భారత్‌కు కాంస్యం
దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత స్టార్స్ ప్రణయ్, పీవీ సింధు తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం భారత్‌ను దెబ్బ తీసింది. తొలి మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 15–21తో 121వ ర్యాంకర్ లె లాన్ జీ (చైనా) చేతిలో... రెండో మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ పీవీ సింధు 9–21, 21–16, 18–21తో 101వ ర్యాంకర్ గావో ఫాంగ్ జీ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుబడింది. అయితే మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 21–19తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ ద్వయంపై... నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–18, 13–21, 21–19తో లియు షెంగ్ షు–తాన్ నింగ్ ద్వయంపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఇషాన్–తనీషా ద్వయం 17–21, 13–21తో జియాన్ జాంగ్ బాంగ్–వె యా జిన్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత్ కాంస్యంతో సంతృప్తి పడింది. -
Khelo India Youth Games: ‘పసిడి’ నెగ్గిన గురునాయుడు
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. అండర్–18 బాలుర వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్.గురు నాయుడు పసిడి పతకం సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో సోమవారం 55 కేజీల విభాగంలో గురు నాయుడు మొత్తం 227 కేజీల బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. టామ్చౌ మీటీ (మణిపూర్) రజతం, విజయ్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) కాంస్య పతకం గెలుపొందారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో 15వ స్థానంలో ఉంది. -
Zagreb Open 2023 wrestling: అశు ‘కంచు పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్ గ్రిగాలియునస్ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్ చేరుకోవడంతో... రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి బౌట్లో అశు 8–0తో పోహిలెక్ (హంగేరి)పై... రెండో బౌట్లో 9–0తో హావర్డ్ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్‌కు అర్హత సాధించాడు. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 6 క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో మనికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అసమాన విజయాలతో సెమీస్ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. -
భారత జట్టుకు కాంస్యం
కైరో (ఈజిప్ట్): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘన సజ్జనార్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 17–11తో జర్మనీపై గెలిచింది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్ రజతం గెలిచాడు. ఫైనల్లో సమీర్ 23–25తో వాంగ్ షివెన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
భారత్ ఖాతాలో కాంస్యం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తొలి రోజే కాంస్యంతో బోణీ కొట్టింది. గురువారం ప్రారంభమైన ఈ పోటీల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, నామ్య కపూర్, విభూతి భాటియాలతో కూడిన జట్టు మహిళల 25 మీటర్ల జూనియర్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత బృందం 17–1తో జర్మనీపై గెలిచింది. ముందుగా క్వాలిఫికేషన్లో 856 పాయింట్లతో భారత బృందం నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి రౌండ్లో 437 పాయింట్ల స్కోరు చేసిన భారత త్రయం జర్మనీ తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు కాంస్యం కోసం తలపడగా భారత్ విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన చిన్నారి అథ్లెట్.. విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు
36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ అనే క్రీడాంశంలో శౌర్యజిత్ కాంస్య పతకం సాధించి.. జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రీడాంశంలో విశేష ప్రతిభ కనబర్చిన శౌర్యజిత్.. అందరినీ మంత్రముగ్దుల్ని చేశాడు. శౌర్యజిత్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారి విన్యాసాలు చూసి నోరెళ్లబెట్టిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గుజరాతీ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. 10-year-old Shauryajit Khaire from Gujarat wins Bronze Medal 🥉 in Mallakhamb(Individual Pole); Becomes the youngest Medalist at the #36thNationalGames #Mallakhamb #NationalGames2022 #Shauryajit @Media_SAI @ianuragthakur pic.twitter.com/Oa1OUHeRAj— All India Radio News (@airnewsalerts) October 10, 2022 -
తెలంగాణ ‘డబుల్’ ధమాకా
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్ 3గీ3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల రోయింగ్ కాక్స్డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. -
తెలంగాణకు కాంస్య పతకం
సూరత్: అధికారికంగా జాతీయ క్రీడలు ఇంకా ప్రారంభంకాకముందే తెలంగాణ జట్టు పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో జాతీయ సింగిల్స్ చాంపియన్ ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనిక మనోహర్ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో తెలంగాణ 0–3తో పశ్చిమ బెంగాల్ చేతిలో... తమిళనాడు 1–3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 7–11, 11–13, 4–11తో సుతీర్థ ముఖర్జీ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 9–11, 11–7, 11–13, 11–9, 12–14తో ఐహిక ముఖర్జీ చేతిలో... మూడో మ్యాచ్‌లో నిఖత్ బాను 10–12, 8–11, 4–11, 13–11, 9–11తో మౌమా దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ 3–1తో మహారాష్ట్రను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగా, మహారాష్ట్ర రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్, ఫారూఖి, వరుణ్ శంకర్‌లతో కూడిన తెలంగాణ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ 3–0తో ఢిల్లీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. అయితే భారత టీటీ జట్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు చైనాలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో జాతీయ క్రీడల నిర్వాహకులు టీటీ ఈవెంట్‌ను ముందస్తుగా నిర్వహిస్తున్నారు. -
World Wrestling Championships 2022: భళా బజరంగ్...
బెల్గ్రేడ్ (సెర్బియా): అందివచ్చిన పతకావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ఆదివారం జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు. వాజ్జెన్తో జరిగిన మ్యాచ్‌లో ఒకదశలో బజరంగ్ 1–4తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. అనంతరం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో బజరంగ్ 11–9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. రివెరాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే బజరంగ్ 0–6తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న ఈ హరియాణా రెజ్లర్ ఆరు పాయింట్లు గెలిచి తొలి భాగం ముగిసేసరికి 6–6తో సమంగా నిలిచాడు. రెండో భాగం ఆరంభంలో బజరంగ్ మళ్లీ మూడు పాయింట్లు కోల్పోయి 6–9తో మళ్లీ వెనుకబడ్డాడు. అయినా ఆందోళన చెందని బజరంగ్ ఉడుంపట్టుతో మెరిసి 2, 2 పాయింట్లు సాధించి 10–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో ప్యూర్టోరికో రెజ్లర్ రివ్యూకు వెళ్లడం, దానిని అతను కోల్పోవడంతో భారత రెజ్లర్‌కు అదనంగా మరో పాయింట్ లభించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో క్యూబా రెజ్లర్ అలెజాంద్రో వాల్డెస్తో పోటీపడుతున్న సమయంలో బజరంగ్ తలకు గాయమైంది. అయినా కట్టు కట్టుకొని ఆడిన బజరంగ్ తొలి రౌండ్లో 5–4తో వాల్డెస్ను ఓడించాడు. ఆ తర్వాత తలకు గాయంతోనే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లలో పోటీపడి చివరకు కాంస్య పతకం సాధించాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. -
World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు. బజరంగ్‌ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. -
World Wrestling Championships: నవీన్‌కు నిరాశ
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్ 70 కేజీల విభాగంలో నవీన్ త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. ఎర్నాజర్ అక్మతలియెవ్ (కిర్గిజిస్తాన్)తో శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్లో నవీన్ 1–4 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. తొలి రౌండ్ ఆరంభంలో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన నవీన్ ఆ తర్వాత రెండు పాయింట్లు సమర్పించుకున్నాడు. రెండో రౌండ్లో మరో రెండు పాయింట్లు కోల్పోయిన నవీన్ తేరుకోలేకపోయాడు. ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో పోటీపడిన నవీన్ స్వర్ణ పతకం సాధించాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 70 కేజీల విభాగంలో బరిలోకి దిగి తొలి రౌండ్లో 1–6తో తైషి నరుకుని (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తైషి నరుకుని ఫైనల్ చేరుకోవడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం నవీన్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో నవీన్ 11–3తో సిర్బాజ్ తల్గాట్ (కజకిస్తాన్)పై నెగ్గిన నవీన్‌కు రెండో రౌండ్లో ఇలియాస్ బెక్బులతోవ్ (ఉజ్బెకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. దాంతో నవీన్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. అనూహ్య ఫలితం... మరోవైపు భారత్‌కు కచ్చితంగా పతకం అందిస్తాడని ఆశించిన స్టార్ రెజ్లర్ రవి కుమార్ రిక్త హస్తాలతో స్వదేశానికి రానున్నాడు. ఈ మెగా ఈవెంట్ కోసం రష్యాలో ప్రత్యేక శిక్షణ పొందిన రవి కుమార్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్లో 10–0తో మరియన్ కొవాక్స్ (రొమేనియా)పై గెలిచిన రవి ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–10తో గులామ్జాన్ అబ్దులయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోఓడిపోయాడు. అబ్దులయెవ్ ఫైనల్ చేరుకొని ఉంటే ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం రవి కుమార్‌కు కనీసం కాంస్యం కోసం పోటీపడేందుకు మరో అవకాశం లభించేది. కానీ అబ్దులయెవ్ క్వార్టర్ ఫైనల్లో 2–13తో జెలీమ్ఖాన్ అబకరోవ్ (అల్బేనియా) చేతిలో ఓడిపోవడంతో రవి పతకం ఆశలు ఆవిరయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన రవి గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. 2020, 2021, 2022 ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడేళ్లు స్వర్ణ పతకాలు నెగ్గిన రవి ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకం గెలిచాడు. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిరాశపరిచాడు. 74 కేజీల విభాగంలో సాగర్ జగ్లాన్ క్వార్టర్ ఫైనల్లో 0–5తో కైల్ డగ్లస్ డేక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. కైల్ ఫైనల్ చేరుకోవడంతో సాగర్ నేడు కాంస్య పతకం కోసం బరిలో నిలిచాడు. రెండు బౌట్లలో సాగర్ గెలిస్తే అతనికి కాంస్యం లభిస్తుంది. -
చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
బెల్గ్రేడ్ (సెర్బియా): నాలుగు రోజుల నిరాశాజనక ప్రదర్శన అనంతరం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ 53 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కాంస్య పతకంతో మెరిసింది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 28 ఏళ్ల వినేశ్ రికార్డు నెలకొల్పింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ వినేశ్ కాంస్య పతకం సాధించింది. బుధవారం జరిగిన 53 కేజీల కాంస్య పతక బౌట్లో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేశ్ 8–0 పాయింట్ల తేడాతో ఎమ్మా జోనా మాల్మ్‌గ్రెన్ (స్వీడన్)పై గెలిచింది. వాస్తవానికి మంగళవారం వినేశ్ తొలి రౌండ్లో 0–7తో ఖులాన్ బత్కుయగ్ (మంగోలియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. అయితే ఖులాన్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ప్రకారం వినేశ్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది. ఫైనల్ చేరిన రెజ్లర్ చేతిలో అంతకుముందు రౌండ్లలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బౌట్లు నిర్వహిస్తారు. ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో వినేశ్ 4–0తో జుల్దిజ్ ఇషిమోవా (కజకిస్తాన్)పై గెలిచింది. తదుపరి రౌండ్లో వినేశ్తో పోటీపడాల్సిన లేలా గుర్బనోవా (అజర్బైజాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్‌కు ‘వాకోవర్’ లభించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం రేసులో నిషా మరోవైపు 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్ నిషా దహియా కాంస్య పతకం రేసులో నిలిచింది. సెమీఫైనల్లో నిషా 4–5తో అమీ ఇషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో నిషా 11–0తో దనుతె దొమికైతె (లిథువేనియా)పై, రెండో రౌండ్లో 13–8తో అదెలా హంజ్లికోవా (చెక్ రిపబ్లిక్)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో సోఫియా (బల్గేరియా)పై గెలిచింది. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరిత మోర్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–7తో లిసాక్ అన్హెలినా (పోలాండ్) చేతిలో... మాన్సి అహ్లావత్ క్వార్టర్ ఫైనల్లో 3–5తో జోవితా మరియా (పోలాండ్) చేతిలో... రితిక తొలి రౌండ్లో 2–6తో కెండ్రా అగస్టీన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. 🇮🇳's @Phogat_Vinesh wins her 2nd #WorldChampionship 🥉 after defeating Sweden's Joana Malmgren 8-0 Great resilience by #VineshPhogat after shocking 1st round defeat yesterday. She has now also become 1️⃣st Indian woman to have won 2️⃣ World Championships medals in #Wrestling 🤼♀️ pic.twitter.com/J0zpoWxKGz — SAI Media (@Media_SAI) September 14, 2022 -
కాంస్యం నెగ్గిన సాత్విక్-చిరాగ్ శెట్టి.. అయినా చరిత్రే
అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌ను 22-20తో గెలిచిన సాత్విక్- చిరాగ్.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్‌లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్-చిరాగ్ జంట బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది. BWF World Championships 2022 Men's Doubles - Semi Finals Aaron Chia/Soh Wooi Yik 🇲🇾 vs Satwiksairaj Rankireddy/Chirag Shetty 🇮🇳 20-22, 21-18, 21-16 Alhamdulillah they finally break the SF curse! 🤧 Huge congrats for advancing to the FINAL ChiaSoh 👏👏 #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p — レディディラ (@ladydyla__) August 27, 2022 చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా -
పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్‌లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం
CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. తొమ్మిదో రోజు వరకు మొత్తం 40 పతాకలు (13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించిన భారత్.. పదో రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పతకాల సంఖ్యను 43కు పెంచుకుంది. మహిళల బాక్సింగ్ 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసరగా.. మహిళల హాకీలో భారత్ కాంస్యం చేజిక్కించుకుంది. సెమీస్‌లో (ఆస్ట్రేలియా) అంపైర్ తప్పిదం కారణంగా స్వర్ణం లేదా రజతం గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన భారత మహిళా హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో అసమాన పోరాట పటిమ కనబర్చి పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్ కొద్ది సెకెన్లలో (18 సెకెన్లలో) ముగుస్తుందనగా న్యూజిలాండ్ గోల్ చేసి 1-1తో స్కోర్‌ను సమం చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున సోనికా, నవ్‌నీత్ కౌర్ గోల్స్ సాధించగా.. కివీస్ తరఫున మెగాన్ హల్ మాత్రమే గోల్ చేయగలిగింది. చదవండి: Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు -
CWG: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్!
Commonwealth Games 2022: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పూజ సాధించిన పతకం ఆనందోత్సవాలకు కారణమవుతుందన్న ఆయన.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆమెను ఓదార్చారు. కాగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా సాగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో పూజా గెహ్లోత్ కాంస్య పతకం సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (50 కేజీల) విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో పూజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో స్కాట్లాండ్ రెజ్లర్ క్రిస్టెలీ లెమోఫాక్ లిచిద్జియోతో ప్లే ఆఫ్‌లో తలపడింది. ఇందులో భాంగా 12-2తో విజయం సాధించి కాంస్య పతకం గెలిచింది. అయితే, సెమీ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన పూజా.. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. నన్ను క్షమించండి! తాను కాంస్య పతకానికే పరిమితమైనందుకు క్షమించాలంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై జాతీయ గీతం వినిపించలేకపోయానంటూ భారతావనిని క్షమాపణలు కోరింది. ఈ మేరకు పూజా గెహ్లోత్ మాట్లాడుతూ.. ‘‘నేను సెమీ ఫైనల్ చేరుకున్నాను. కానీ ఓడిపోయాను. నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. జాతీయ గీతం వినిపించాలనుకున్నా.. కానీ అలా చేయలేకపోయాను.. నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. వాటిని సరిదిద్దుకుంటాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ పూజను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘పూజా.. నీ పతకం సెలబ్రేషన్స్‌కు కారణమవుతుంది. క్షమాపణకు కాదు! నీ జీవిత ప్రయాణం మాకు ఆదర్శం. నీ విజయం మాకు సంతోషాన్నిచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి.. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలి’’ అంటూ పూజాకు అండగా నిలిచారు. నవీన్, రవి దహియా, వినేశ్ ఫొగట్ రెజ్లర్లు అదరగొట్టారు.. కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత రెజ్లర్ అద్భుత విజయాలు అందుకున్నారు. ఈ క్రీడా విభాగంలో భారత్‌కు మొత్తంగా ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు లభించాయి. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్, వినేశ్ ఫొగట్, రవి దహియా, నవీన్ స్వర్ణ పతకాలతో మెరవగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్, పూజా గెహ్లోత్, పూజా సిహాగ్, దీపక్ నెహ్రా కాంస్య పతకాలు గెలిచారు. చదవండి: Rohit Sharma-Rishabh Pant: పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! Pooja, your medal calls for celebrations, not an apology. Your life journey motivates us, your success gladdens us. You are destined for great things ahead…keep shining! ⭐️ https://t.co/qQ4pldn1Ff — Narendra Modi (@narendramodi) August 7, 2022 -
World U20 Championship: కాంస్యం నెగ్గిన రూపల్ చౌదరీ
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రూపల్ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. యెమీ మేరీజాన్ (బ్రిటన్; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్ ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్ సభ్యురాలిగా ఉంది. -
వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్
తేజస్విన్ శంకర్.. వారం క్రితం కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయిన భారత బృందంలో పేరు లేదు. హై జంప్ విభాగంలో క్వాలిఫై స్టాండర్డ్స్ అందుకోలేదన్న కారణంగా చూపి భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారులు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన తేజస్విన్ శంకర్ ఆఖరి నిమిషంలో కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లనున్న భారత బృందంలో బెర్త్ దక్కించకున్నాడు. తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధో తెలియదు కానీ.. ఇవాళ 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హై జంప్ విభాగంలో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రికార్డును బ్రేక్ చేయలేదన్న బాధ ఉన్నప్పటికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున హై జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. మరి బర్మింగ్హమ్లో కాంస్యం సాధించిన తేజస్విన్ శంకర్ హై జంప్ ప్రాక్టీస్ ఎలా చేశాడో తెలిస్తే షాకవుతారు. తాను రోజు ప్రాక్టీస్ చేసే జేఎల్ఎన్ గ్రౌండ్లో మూడు కుక్కలు ఉండేవి. వాటిని మచ్చిక చేసుకున్న శంకర్ హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడు. రోజు వాటికి ఆహారం అందిస్తూ స్టిక్స్ ఏర్పాటు చేసి వాటి వెనకాల పరిగెత్తుతూ హై జంప్ చేసేవాడు. అలా హైజంప్‌లో మరింత రాటు దేలే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అతనికి షాక్ ఇచ్చింది. అయితే కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా విజయం సాధించిన తేజస్విన్ శంకర్ కామెన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టాడు. వాస్తవానికి అథ్లెట్ల సంఖ్య కోటా ఎక్కువగా ఉన్నందున శంకర్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తర్వాత తేలింది. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం హైజంప్ విభాగంలో జరిగిన ఫైనల్లో తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల ఎత్తు దూకి కాంస్యం ఒడిసిపట్టాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినా ఇది కూడా గొప్ప ఘనత కిందే లెక్కించొచ్చు. ఇక ఈ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3 — jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022 ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది? -
CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా మాత్రం చరిత్రలో నిలిపోయాడు. తాజా పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక కాంస్య పతకం సాధించిన శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ''తేజస్విని శంకర్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.'' అంటూ తెలిపారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా శంకర్‌ను అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు. ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు 🇮🇳🥇 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂! Tejaswin Shankar - remember the name! 💪 This is India's first medal in Athletics at #B2022.#TejaswinShankar #B2022 #CWG2022 #HighJump #TeamIndia #BharatArmy pic.twitter.com/7zQ2S8eMAA — The Bharat Army (@thebharatarmy) August 3, 2022 Tejaswin Shankar creates history. He wins our first high jump medal in the CWG. Congratulations to him for winning the Bronze medal. Proud of his efforts. Best wishes for his future endeavours. May he keep attaining success. @TejaswinShankar pic.twitter.com/eQcFOtSU58 — Narendra Modi (@narendramodi) August 4, 2022 -
కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ భారత్‌కు కాంస్య పతకం అందించాడు. స్నాచ్ రౌండ్లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 192 కేజీలు ఎత్తిన లవ్‌ప్రీత్ సింగ్.. మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. కెమరూన్‌కు చెందిన పెరిక్లెక్స్ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, లవ్‌ప్రీత్ గెలిచిన పతకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్).. తాజాగా లవ్‌ప్రీత్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. చదవండి: CWG 2022: దూసుకుపోతున్న భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో పతకం -
కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం
బర్మింగహమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి. కాగా స్నాచ్ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్ కౌర్.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది. 9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩 After high voltage 🤯 drama India's #HarjinderKaur bags 🥉 in Women's 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022 Snatch- 93kg Clean & Jerk- 119kg With this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతుంది. రెండో రోజు భారత అథ్లెట్లు వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు పతకాలు సాధించారు. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించగా.. తాజాగా 61 కేజీల (పురుషుల) విభాగంలో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు. గురురాజ మొత్తం 269 కేజీల బరువును (స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 153 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలువగా.. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్ 285 కేజీలు (127, 158) ఎత్తి స్వర్ణ పతకాన్ని.. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి రజతం సాధించారు. కాగా, గురురాజకు కామన్వెల్త్ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2️⃣nd medal for 🇮🇳 at @birminghamcg22 🤩 What a comback by P. Gururaja to bag 🥉 with a total lift of 269 Kg in the Men's 61kg Finals🏋♂️ at #B2022 Snatch- 118kg Clean & Jerk- 151kg With this Gururaj wins his 2nd consecutive CWG medal 🙂 Congratulations Champ!#Cheer4India pic.twitter.com/UtOJiShUvS — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం -
అంజుమ్ మౌద్గిల్‌కి కాంస్య పతకం
కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సంజీవ్ రాజ్‌పుత్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 12–16తో చెక్ రిపబ్లిక్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Zouhaier Sghaier wrestling: భారత రెజ్లర్ల పసిడి పట్టు -
'రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా పతకం అందుకుంటా'
అమెరికా లెజెండరీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఓరెగాన్‌లోని హ్యూజిన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అలిసన్ ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం కావడం విశేషం. 36 ఏళ్ల అలిసన్ ఫెలిక్స్ అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్‌లో ఎన్నో ఏళ్లుగా ముఖ్య క్రీడాకారిణిగా ఉంది. తన కెరీర్లో ఫెలిక్స్ 19 వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలతో పాటు 13 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఏడుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా అలిసన్ ఫెలిక్స్ నిలవడం విశేషం. తాను రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా మెడల్ అందుకుంటానని అలిసన్ ఫెలిక్స్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అలీసన్ తన మాటను నిలబెట్టుకుంది. What a race 🔥 The Dominican Republic 🇩🇴 overtakes the Netherlands 🇳🇱 and the USA 🇺🇸 in the dying metres to take world mixed 4x400m victory!#WorldAthleticsChamps pic.twitter.com/tJb3EWKpid — World Athletics (@WorldAthletics) July 16, 2022 చదవండి: Kick Boxing: నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్ బాక్సర్ Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి! -
World Games 2022: సురేఖ జంటకు కాంస్యం
బర్మింగ్‌హామ్ (అమెరికా): వరల్డ్ గేమ్స్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ చేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో... శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 157–156తో ఆండ్రియా బెసెరా–మిగెల్ బెసెరా (మెక్సికో) జంటపై గెలిచింది. -
దీపిక బృందానికి రజతం
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీని భారత్ రజత పతకంతో ముగించింది. ఆదివారం జరిగిన మహిళల టీమ్ రికర్వ్ ఫైనల్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. చైనీస్ తైపీ జట్టుతో జరిగిన ఫైనల్లో దీపిక బృందం 1–5తో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట స్వర్ణం నెగ్గగా... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ రజతం సాధించింది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
కాంస్య పతక పోరులో ఓటమి
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్య పతక పోరులో ఓడిపోయింది. వెన్నం జ్యోతి సురేఖ, ప్రియా గుర్జర్, ముస్కాన్ కిరార్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 228–231తో సోఫీ డోడిమోంట్, లోలా గ్రాండ్‌జీన్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందిన భారత్ 230–227తో బ్రెజిల్ జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 228–231తో బ్రిటన్ జట్టు చేతిలో పరాజయంపాలై కాంస్య పతకం బరిలో నిలిచింది. అభిషేక్ వర్మ, మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్, అమన్ సైనీలతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో 234–235తో టర్కీ చేతిలో ఓడింది. -
ఏపీ కబడ్డీ జట్టుకు కాంస్యం
పంచ్‌కుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో అండర్–18 మహిళల కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 15–50 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర 45–23తో తమిళనాడును ఓడించి నేడు జరిగే ఫైనల్లో హరియాణాతో అమీతుమీకి సిద్ధమైంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తారు. చదవండి: Kho Kho -League: ఖో–ఖో లీగ్‌లో జీఎంఆర్, అదానీ ఫ్రాంచైజీలు -
ఉత్కంఠపోరులో జపాన్‌పై విజయం.. టీమిండియా హాకీ జట్టుకు కాంస్య పతకం
హాకీ ఆసియాకప్ 2022లో ఫైనల్ చేరడంలో విఫలమైన టీమిండియా పరుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భాగంగా బుధవారం జపాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో 1-0తో భారత్ జయకేతనం ఎగురవేసింది. టీమిండియా తరపున ఆట ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. జపాన్ పలుమార్లు గోల్‌పోస్ట్ వైపు దాడులు చేసినప్పటికి టీమిండియా డిఫెన్స్ బలంగా ఉండడంతో నిర్ణీత సమయంలోగా జపాన్ గోల్ చేయడంలో చతికిలపడింది. దీంతో భారత్ ఖాతాలో విజయంతో పాటు కాంస్య పతకం వచ్చి చేరింది. ఇక మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 4-4తో డ్రా చేసుకోవడంతో ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక హాకీ ఆసియా కప్ విజేతగా దక్షిణ కొరియా నిలిచింది. మలేషియాతో జరిగిన ఫైనల్లో 2-1తో విజయం అందుకొని స్వర్ణ పతకం సాధించింది. చదవండి: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా Hockey Asia Cup 2022: టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం Let us applaud the young Indian Team for their outstanding performance in the Hero Asia Cup 2022, Jakarta, Indonesia for winning a Bronze. 🥉 We are proud of this team 💙#IndiaKaGame #HockeyIndia #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/ptTFDJo7Y5 — Hockey India (@TheHockeyIndia) June 1, 2022 -
Archery World Cup 2022: భారత్ గురి అదిరింది
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో సత్తా చాటుకున్నారు. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్ గాంటియర్, జీన్ ఫిలిప్ బౌల్చ్, క్విన్టిన్ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును ఓడించింది. గత నెలలో టర్కీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం. అనంతరం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్ (భారత్) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్ 141–149తో ప్రపంచ నంబర్‌వన్ మైక్ షోలోసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సెమీఫైనల్లో 143–141తో ప్రపంచ చాంపియన్ నికో వీనర్ (ఆస్ట్రియా)పై గెలుపొందడం విశేషం. -
భారత మహిళలకు కాంస్యం
గ్వాంగ్జూ: ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహిళల రికర్వ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అయితే పురుషుల రికర్వ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. తరుణ్‌దీప్ రాయ్, జయంత్ తాలుక్దార్, నీరజ్ చౌహాన్ సభ్యులుగా ఉన్న టీమ్ తమకంటే ర్యాంకుల్లో బాగా వెనుకబడి ఉన్న ఫ్రాన్స్ చేతిలో 2–6 (54–57, 55–52, 53–55, 47–53) తేడాతో ఓటమిపాలైంది. -
Deaflympics 2022: షేక్ జాఫ్రీన్‌కు కాంస్యం
కాక్సియాల్ డు సల్ (బ్రెజిల్): బధిరుల ఒలింపిక్ క్రీడల్లో (టెన్నిస్) ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ కాంస్య పతకం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్–పృథ్వీ శేఖర్ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్ దూబే జంటను ఓడించింది. ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్. అంతకు ముందు సెమీ ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన బ్లాస్కికోవా–స్మెడెక్ చేతిలో 7–5, 5–7, 2–6తో జాఫ్రీన్–పృథ్వీ ఓడగా...వెన్ లిన్–వీ వాంగ్ (చైనీస్ తైపీ) 6–0, 6–1తో భవాని–ధనంజయ్‌పై గెలుపొందారు. -
సింధు... కాంస్యంతో సరి
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–13, 19–21, 16–21తో పోరాడి ఓడింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో స్కోరు 19–19తో సమంగా ఉన్న కీలకదశలో సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో అకానె యామగుచి ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అకానె గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీ, 8,400 పాయింట్లు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు లభించిన పతకాలు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు. -
సీఎం ప్రోత్సాహంతో కాంస్య పతకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి దేహదారుఢ్య పోటీలో కాంస్య పతకం సాధించినట్లు బాడీబిల్డర్ రవికుమార్ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీకి సీఎం ఆర్థికంగా సాయం అందించి ప్రోత్సహించారని తెలిపారు. ఈ మధ్యనే దక్షిణ కొరియాలో జరిగిన 170కి పైగా దేశాలు పాల్గొన్న మిస్టర్ యూనివర్స్–2022 పోటీలో 70 కేజీల విభాగంలో రవికుమార్ కాంస్యపతకం సాధించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 2020 అక్టోబర్‌లో సీఎం జగన్‌ను కలిసి ఆర్థికసాయం అందించాల్సిందిగా కోరగా, సీఎం ఆదేశాల మేరకు స్వర్గీయ మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవ తీసుకొని ఆర్జాస్ స్టీల్ కంపెనీ ద్వారా రూ.9 లక్షల సాయాన్ని అందించారని గుర్తు చేశారు. ఈ కాంస్య పతకాన్ని మేకపాటి గౌతమ్‌రెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రవికుమార్‌ను ఏపీఐఐసీ ఎండీ సత్కరించి అభినందించారు. మరిన్ని అంతర్జాతీయ పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. -
శ్రీజ జోడీకి కాంస్యం
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ మస్కట్ కంటెండర్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. సెమీఫైనల్లో శ్రీజ–సెలీనా (భారత్) జంట 4–11, 6–11, 10–12తో సుతీర్థ–అహిక (భారత్) ద్వయం చేతిలో ఓడింది. ఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 6–11, 11–8, 10– 12, 7–11తో జాంగ్ రుయ్–కుయ్ మాన్ (చైనా) జంట చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. -
అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం
మోంటెనిగ్రోలో జరిగిన అంతర్జాతీయ అల్పైన్ స్కీయింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్‌ను ఆంచల్ 1ని:54.30 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల ఆంచల్ 2018లో టర్కీలో జరిగిన టోర్నీలోనూ కాంస్యం గెలిచింది. గతంలో ఆమె నాలుగుసార్లు ప్రపంచ స్కీయింగ్ చాంపియన్‌షిప్‌లలో పోటీ పడింది. -
పాక్‌పై నెగ్గిన భారత్.. కాంస్యం కైవసం
పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్‌ను 4-3 తేడాతో ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్ సింగ్ నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ తరపున హర్మన్‌ప్రీత్, అక్షదీప్‌సింగ్, వరుణ్ కుమార్, గుర్‌సాహిబిజిత్ సింగ్‌లు గోల్ చేశారు. చదవండి: BWF Rankings: అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..! ఇక పాకిస్తాన్ తరపున అర్ఫాజ్, అబ్దుల్ రాణా, అహ్మద్ నదీమ్‌లు గోల్ చేశారు. ఇక లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూఫ్ టాపర్‌గా నిలిచిన భారత్ సెమీఫైనల్లో మాత్రం జపాన్ చేతిలో చతికిలపడింది. అయితే కాంస్య పతక పోరు కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. లీగ్ దశలోనూ భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
పాయస్ జైన్‌కు పతకం ఖాయం
ప్రపంచ యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం ఖరారైంది. పోర్చుగల్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అండర్–19 బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్ పాయస్ జైన్ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాయస్ జైన్ 11–9, 11–8, 11–8, 8–11, 11–4తో నవీద్ షమ్స్ (ఇరాన్)పై గెలిచాడు. అండర్–15 బాలికల డబుల్స్‌లో సుహానా సైనీ (భారత్)–వెరోనికా (ఉక్రెయిన్) జంట సెమీఫైనల్లో ఓడి కాంస్యం దక్కించుకుంది. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టు ఓడిపోయింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రిషభ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్‌ను ఓడించి కాంస్యం నెగ్గింది. భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో 208–220తో కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడింది. -
బాక్సర్ ఆకాశ్ కుమార్‌కు పతకం ఖాయం
Aakash Kumar Won Bronze Medal World Boxing Championship.. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. బెల్గ్రేడ్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ (54 కేజీలు) సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఆకాశ్ 5–0తో యోల్ ఫినోల్ రివాస్ (వెనిజులా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన నరేందర్ (ప్లస్ 92 కేజీలు), శివ థాపా (63.5 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో మంజు బసుమతిరి (అస్సాం)పై నెగ్గింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ బౌట్లో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత మంజు రాణి 5–0తో మీనాక్షి (పంజాబ్)పై గెలిచింది. -
కాంస్య పతక బౌట్లో పింకీ పరాజయం
Pinky loses bronze World Wrestling Championship.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. నార్వేలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత రెజ్లర్ పింకీ కాంస్య పతక బౌట్లో ఓడిపోయింది. జెనా రోజ్ బుర్కెర్ట్ (అమెరికా)తో జరిగిన బౌట్లో పింకీ 2–5తో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో ఓడిపోయారు. -
టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్యం..
దోహా: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. టోర్నీలో సెమీస్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకం దక్కుతుంది. తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 12–10, 8–11, 5–11తో 12వ ర్యాంకర్ వూజిన్ జాంగ్ చేతిలో ఓడాడు. రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 11–7, 13–15, 11–8, 6–11, 9–11తో లీ సాంగసూ చేతిలో పోరాడి ఓడాడు. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 4–11, 11–9, 11–8, 6–11, 11–13తో చో సీంగ్మిన్ చేతిలో ఓటమి చవిచూశాడు. మరోవైపు మహిళల టీమ్ విభాగంలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో థాయ్‌లాండ్‌పై నెగ్గి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ -
పసిడి కాంతులు...
మునుపెన్నడూ లేని విధంగా దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్‌కు నేటితో తెర పడనుండగా... శనివారం భారత దివ్యాంగ క్రీడాకారులు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను గెల్చుకున్నారు. షూటింగ్లో మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్–1 ఫైనల్లో మనీశ్ నర్వాల్ పసిడి పతకం నెగ్గగా... సింగ్‌రాజ్ అధానా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లోనూ భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–3 విభాగంలో ప్రపంచ చాంపియన్ ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించగా... మనోజ్ సర్కార్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. టోక్యో: పారాలింపిక్స్‌లో మరోసారి భారత క్రీడాకారులు తమ ప్రతాపం చూపించారు. శనివారం ఏకంగా నాలుగు పతకాలతో అదరగొట్టారు. ముందుగా షూటింగ్లో మనీశ్ నర్వాల్... సింగ్‌రాజ్ అధానా... అనంతరం బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, మనోజ్ సర్వార్ పతకాలు సొంతం చేసుకున్నారు. మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్ 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రీడల్లో సింగ్‌రాజ్‌కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సింగ్‌రాజ్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత ప్లేయర్‌గా సింగ్‌రాజ్ గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్‌లో అథ్లెట్ జోగిందర్ సింగ్ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్‌లో మహిళా షూటర్ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది. ఫుట్‌బాలర్ కావాలనుకొని... హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్ జన్మతః కుడి చేతి వైకల్యంతో జని్మంచాడు. కొన్నాళ్లు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసి క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు కూడా ఆడిన మనీశ్ కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్‌బాల్‌లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత తండ్రి దిల్బాగ్ మిత్రుడొకరు మనీశ్‌కు షూటింగ్‌ను పరిచేయం చేశాడు. స్థానిక 10ఎక్స్ షూటింగ్ అకాడమీలో చేరిన మనీశ్ రెండేళ్లలో ఆటపై పట్టు సాధించాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలిచాడు. ప్రమోదం నింపిన విజయం టోక్యో పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సూపర్ ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ ప్రమోద్ 21–14, 21–17తో రెండో సీడ్ డానియెల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించాడు. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నా కల నిజమైంది. ఈ పతకాన్ని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాను’ అని ప్రమోద్ వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్ ఇరుగు పొరుగు వారు బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఈ ఆటపై ఆసక్తి ఏర్పరచుకున్నాడు. 2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మరోవైపు ఎస్ఎల్–4 విభాగంలోనే భారత్‌కు చెందిన మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల మనోజ్ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితుడైన మనోజ్ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్íÙప్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. చివరి రోజు భారత ప్లేయర్లు 5 పతకాలపై గురి పెట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ స్వర్ణం కోసం... తరుణ్ కాంస్యం కోసం... ఎస్‌హెచ్ –6 విభాగంలో కృష్ణ నాగర్ స్వర్ణం కోసం... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రమోద్–పలక్ ద్వయం కాంస్యం కోసం పోటీపడతారు. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో సిద్ధార్థ, దీపక్, అవని బరిలో ఉన్నారు. -
Tokyo Paralympics: అవని అద్వితీయం
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్‌హెచ్–1 ఈవెంట్లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్‌గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది. టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు. ‘షూట్ ఆఫ్’లో సూపర్... టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు. అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్జెవ్స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. పొలంలో సాధన చేసి... హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్‌కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్‌కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్‌లో పతకం రూపంలో ఫలితం వచ్చింది. ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్‌ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు ఖాయం పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్‌కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు. -
భారత్‌కు మరో పతకం; ఆర్చరీలో పతకం సాధించిన తొలి పారా అథ్లెట్‌గా
టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్ కిమ్ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడించిన హర్వీందర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక పారాలింపిక్స్‌లో ఆర్యరీ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు. హర్వీందర్ సింగ్ సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా అవనీ లేఖరా సరికొత్త చరిత్ర సృష్టించింది. చదవండి: Tokyo Paralympics: సాహో జెంగ్ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు Avani Lekhara: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం -
Tokyo Paralympics: ‘హై’ పైకి...
దివ్యాంగుల విశ్వక్రీడల్లో ఈసారి గతంలో కంటే ఘనమైన ప్రదర్శన చేస్తామని ప్రకటించిన భారత పారాథ్లెట్స్ అన్నమాట నిలబెట్టుకున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం రెండు పతకాలు సాధించిన మనోళ్లు... సోమవారం ఏకంగా ఐదు పతకాలు నెగ్గగా... మంగళవారం మరో మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. గత నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది. టోక్యో: పారాలింపిక్స్‌లో వరుసగా మూడో రోజు భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాల పంట పండించారు. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి–42 కేటగిరీలో మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ఫలితంగా మంగళవారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్ 10 పతకాలతో 30వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల క్రితమే షూటింగ్ క్రీడలో అడుగుపెట్టిన సింగ్‌రాజ్ పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సింగ్‌రాజ్ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్ హువాంగ్ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు. ఫైనల్లో పాల్గొన్న మరో భారత షూటర్ మనీశ్ నర్వాల్ 135.8 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్–1 కేటగిరీ ఫైనల్లో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ ఏడో స్థానంలో నిలిచింది. సొంతంగా రేంజ్ ఏర్పాటు చేసుకొని... హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్‌రాజ్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే షూటింగ్‌వైపు మాత్రం అతను 35 ఏళ్ల వయసులో ఆకర్షితుడయ్యాడు. తన మేనల్లుడిని షూటింగ్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో అక్కడే సరదాగా ప్రాక్టీస్ చేసిన సింగ్‌రాజ్ ఆటపట్ల మక్కువ పెంచుకొని సీరియస్‌గా సాధన చేయడం ప్రారంభించాడు. కోచ్‌లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్ సుభాశ్ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్‌రాజ్ 2018లో ఆసియా పారాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, స్వర్ణం గెలిచాడు. యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన సింగ్‌రాజ్ కోవిడ్–19 సమయంలో షూటింగ్ రేంజ్‌లకు తాళాలు పడటంతో ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడ్డాడు. పారాలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సింగ్‌రాజ్ కుటుంబసభ్యుల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే సొంతంగా షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ కొనసాగించాడు. విశ్వ క్రీడల్లో పతకంతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మళ్లీ మెరిసిన తంగవేలు... 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మరియప్పన్ తంగవేలు టోక్యోలోనూ అదరగొట్టాడు. పురుషుల హైజంప్ టి–42 విభాగంలో పోటీపడిన ఈ తమిళనాడు ప్లేయర్ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. తాను స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ పోటీలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం తన స్వర్ణావకాశాలను ప్రభావితం చేసిందని 26 ఏళ్ల తంగవేలు అన్నాడు. ఐదేళ్ల ప్రాయంలో బస్సు ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయిన తంగవేలు స్కూల్లో వ్యాయామవిద్య ఉపాధ్యాయుడి సలహాతో అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాడు. కూరగాయాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తల్లి సరోజకి చేదోడు వాదోడుగా ఉండేందుకు తంగవేలు 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఇళ్లల్లో పేపర్లు వేశాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి తంగవేలు ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ‘రియో’ పతకంతో లభించిన నగదు ప్రోత్సాహకాలతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, ఆ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఇప్పటి నుంచే సాధన మొదలుపెడతానని తంగవేలు వ్యాఖ్యానించాడు. నాన్న సలహాతో... టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్ శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల శరద్ రెండేళ్లుగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. సోమవారం రాత్రి మోకాలి నొప్పితో బాధపడ్డ శరద్ ఈవెంట్ నుంచి వైదొలగాలని భావించాడు. అయితే తండ్రి సూచన మేరకు భగవద్గీత పఠించి మంగళవారం ఈవెంట్లో పాల్గొని శరద్ పతకం సాధించాడు. ‘సోమవారం రాత్రంతా మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఈ విషయాన్ని ఫోన్లో నాన్నకు వివరించాను. ఈవెంట్లో పాల్గొనడం కష్టమని చెప్పాను. పట్టుదల కోల్పోకుండా తనవంతు ప్రయత్నం చేయాలని... తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకూడదని నాన్న సలహా ఇచ్చారు. భగవద్గీత చదవాలని సూచించారు’ అని రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ శరద్ వివరించాడు. -
బుల్లెట్టు మరోసారి దిగింది.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం
టోక్యో: పారాలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్(SH1) ఈవెంట్లో సింగ్‌రాజ్ అదానా కాంస్య పతకం సాధించాడు. కాగా, మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తంగా సింగ్‌రాజ్ అదానా కాంస్యంతో భారత పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. -
డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచినా...
పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో ఎఫ్–52 కేటగిరీలో భారత ప్లేయర్ వినోద్ కుమార్ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. కోసెవిచ్ (పోలాండ్– 20.02 మీటర్లు) స్వర్ణం... సాండోర్ (క్రొయేషియా–19.98 మీటర్లు) రజతం గెల్చుకున్నారు. అయితే ప్రత్యర్థులు వినోద్ ఎఫ్–52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు చేశారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయయ లోపం ఉన్నవారు ఎఫ్–52 కేటగిరీలోకి వస్తారు. ‘నిర్వాహకులు 22వ తేదీన వినోద్‌ను పరీక్షించి అతను ఎఫ్–52 విభాగంలో పోటీపడవచ్చని నిర్ణయించారు. నేడు ఫిర్యాదును సమీక్షించి ఫలితాన్ని ప్రకటిస్తారు’ అని భారత చెఫ్ డి మిషన్ గురుశరణ్ సింగ్ వివరించారు. -
తల్లి మెడలో కాంస్య పతకం.. ఒడిలో హాయిగా నిద్రపోయాడు
జలంధర్: టీమిండియా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒలింపిక్స్ నుంచి ఇటీవలే తన ఇంటికి చేరుకున్న మన్‌ప్రీత్ కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లికి చూపించి మురిసిపోయాడు. ఆ తర్వాత తన తల్లి మెడలో ఆ పతకాన్ని వేసి.. ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ లీగ్‌లో ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లపై మంచి విజయాలను నమోదు చేసింది. ఇక సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడినప్పటికి.. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడిన మెన్స్ టీమ్ 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. ఈ విజయంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ కీలకం.. ఒత్తిడి సమయాల్లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. కాగా ఇటీవలే టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పురుషుల హాకీ జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది. View this post on Instagram A post shared by Manpreet Singh (@manpreetsingh07) -
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన పోలీసులు పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చిన పీవీ సింధును సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పీవీ సింధు తండ్రి పీవీ రమణతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. -
జై బజరంగ్ భళి...
శీతాకాలం... తెల్లవారుజాము 2 గంటలకు ఎముకలు కొరికే చలిలో... ఓ 11 ఏళ్ల బాలుడు ఇంట్లో దిండ్లను వరుస పెట్టి దుప్పటి కప్పి తాను పడుకున్నట్లు చేసి అఖాడాకు వెళ్లేవాడు. ఉదయం అమ్మ అడిగితే 4 గంటల తర్వాతే వెళ్లానని చెప్పేవాడు. తనయుడు ఎప్పుడు వెళ్లాడో తల్లికి తెలుసు! అయినా కొడుకు ఆసక్తికి అడ్డుచెప్పకూడదని ఆ మాతృమూర్తి నిర్ణయించుకుంది. అక్కడ సీన్ కట్ చేసి టోక్యోలో చూస్తే ఆ బాలుడు బజరంగ్ పూనియా అయ్యాడు. రెజ్లింగ్ బరిలో కాంస్యం గెలిచాడు. టోక్యో: ‘పసిడి’ పతకానికి దూరమైనా... తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ 8–0తో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. తద్వారా 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో నియాజ్బెకోవ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హాజీ అలియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో లెగ్ డిఫెన్స్ బలహీనత, కౌంటర్ ఎటాక్‌లో తడబడి పాయింట్లు చేజార్చుకున్న బజరంగ్ ఈ బౌట్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. నియాజ్‌బెకోవ్‌కు ఏదశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. దాంతో నియాజ్బెకోవ్ చివరకు ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఓటమి చవిచూశాడు. హరియాణకు చెందిన 27 ఏళ్ల బజరంగ్ తన కెరీర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు. బజరంగ్ బాహువుల్లోనో లేదంటే పిడికిలిలోనో రెజ్లింగ్ లేదు. అతని రక్తంలోనే మల్లయుద్ధం వుంది. ఎందుకంటే తన తండ్రి, సోదరుడు కూడా దంగల్ వీరులే! ఈ కుస్తీపట్లే నరనరాన జీర్ణించుకున్న బజరంగ్ తాజాగా ఒలింపిక్ పతకం పట్టాడు. అన్నట్లు ఇతనికి ఒలింపిక్ పతకం కొత్తేమో కానీ ఈ నంబర్‌వన్ (65 కేజీల కేటగిరీ) రెజ్లర్ ఖాతాలో ప్రపంచ, ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గేమ్స్ స్వర్ణాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు సిసలు సత్తాచాటాల్సిన చోట స్వర్ణ, రజతాలు చేజార్చుకున్నాడేమో కానీ పతకం లేకుండా ఉత్తచేతులతో రాలేదు. కాంస్యం పోరు లో విజేయుడిగా నిలిచాడు. 34 కేజీల బరువుతో 60 కేజీల విభాగంలో... మచ్రోలి గ్రామంలో 2008లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బజరంగ్ వెళ్లాడు. కానీ 34 కిలోల బరువున్న అతన్ని 60 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఎలాగోలా అతని అన్న హరిందర్ నచ్చచెప్పడంతో ఆర్గనైజర్లు అంగీకరించారు. అపుడు దంగల్‌లో దిగిన బజరంగ్ తనకంటే ఎక్కువ బరువున్న రెజ్లర్ ఓడించడం అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కుర్రాడి బాహువు బలం తెలిసిన కోచ్ ఆర్య వీరేందర్ మల్లయుద్ధంలో బజరంగ్ పూనియాను తీర్చిదిద్దాడు. అదే ఏడాది తండ్రి బల్వాన్ సింగ్ తనయుడిని ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో చేర్పించాడు. అక్కడ అందరు మేటి రెజ్లర్లే ఉండటంతో వారితో తలపడిన బజరంగ్ రెండేళ్లకే ఆసియా క్యాడెట్ చాంపియన్ అయ్యాడు. మరుసటి ఏడాది (2011) దాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటాబయటా పతకాల పట్టు పట్టేవాడు. 2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను సాధించిన రజతం బజరంగ్‌ను ఒలింపిక్ మెడలిస్ట్‌ల జాబితాలో చేర్చింది. యోగేశ్వర్ దత్ కిటుకులు... ఛత్రశాల్ స్టేడియం చేసిన మేలు, మెరుగైన తీరు అంతా ఇంతా కాదు. అక్కడ ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాహచర్యం... బజరంగ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం... అంతర్జాతీయ పోటీల్లో అసాధారణ రెజ్లర్‌గా, పతకాల విజేతగా నిలబెట్టాయి. యోగేశ్వర్ రాజకీయాల్లోకి వెళ్లాక భారత రెజ్లింగ్ సమాఖ్య బజరంగ్‌కు వ్యక్తిగత కోచ్‌గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ను నియమించింది. ఇతని వల్ల విదేశీ రెజ్లర్లతో చేసిన ప్రాక్టీస్ బజరంగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ పతక విజేతగా మార్చింది. తల్లి ప్రోత్సాహం... బజరంగ్ తల్లి ఓంప్యారీకి 11 ఏళ్ల తనయుడి అడుగులు ఎటువైపో తెలుసు. అందుకే తెల్లారుజామునే వెళ్తున్నా... ఉదయం లేచాక అబద్ధం చెబుతున్నా... మిన్నకుండిపోయింది. అయితే ఒక విషయం మాత్రం మాతృమూర్తి గట్టిగా చెప్పేది. ‘ఓడినంత మాత్రాన ఏడవొద్దు. ప్రత్యర్థుల ముందు పలుచనవ్వొద్దు. ఓటములను గెలిచేందుకు మెట్లుగా మలచుకోవాలి’ అని! ఈ మాట బాగా వంటబట్టించుకున్న బజరంగ్ చదువులో వెనుకబడినా... దంగల్‌లో మట్టికరిచినా... ఎప్పుడు కన్నీరు కార్చలేదు. అమ్మ అన్నట్లే ప్రతి ఓటమిని గెలుపు మలుపుగా చేసుకున్నాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింహాబలుళ్లను ఓడించే శక్తి తన తల్లి మాటల ద్వారానే సంపాదించుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా.. భారత్‌కు మరో పతకం
-
చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా.. భారత్‌కు మరో పతకం
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్ పూనియా చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించిన భజరంగ్ తన కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. అంతేగాక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు. ఇదే ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజతం గెలవగా.. తాజాగా భజరంగ్ కాంస్యం గెలిచాడు. ఇంతకముందు కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్ (కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం), రవి దహియా(రజతం) గెలిచారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ పీరియడ్‌లో భజరంగ్ మొదట ఓ పాయింట్ సాధించాడు. రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కొట్టిన దౌలత్.. ఈ మ్యాచ్‌లో భజరంగ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఫస్ట్ పీరియడ్ ముగింపులో మరో పాయింట్‌ను భజరంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ పీరియడ్‌లోకి అతనికి 2-0 లీడ్ వచ్చింది. సెకండ్ పీరియడ్ కూడా రసవత్తరంగా సాగింది. అయితే ఆ పీరియడ్ ఆరంభంలోనే భజరంగ్ రెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. ఆ పీరియడ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. కాగా భజరంగ్ కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటివరకు భారత్‌కు 2 రజతాలు, 4 కాంస్య పతకాలు వచ్చాయి. -
కాంస్య పతక పోరు; భజరంగ్ పూనియా వీడియో వైరల్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్ రేపు కాంస్య పతక పోరుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా భజరంగ్‌కు సంబంధించిన ఒక పాత వీడియోను బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా ట్విటర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో భజరంగ్ మ్యాచ్ సందర్భంగా బౌట్‌కు సిద్ధమవుతుండగా ఇంతలో ఒక వ్యక్తి రింగ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే భజరంగ్ అతన్ని రింగ్ బయటే ఆపేందుకు ప్రయత్నించాడు. అతను ఆగకపోవడంతో బజరంగ్ అతన్ని రింగ్ నుంచి ఎత్తిపడేశాడు. ఆ తర్వాత మళ్లీ రింగ్‌లోకి వచ్చి విజయసంకేతాన్ని చూపించాడు. దీనిని షేర్ చేసిన రణదీప్ ఇలాంటి ప్రదర్శనను ఒలింపిక్స్‌లో చూపించాలి అంటూ ట్వీట్ చేశాడు. కాగా సెమీస్‌లో ఓటమి పాలైన పూనియా కాంస్య తెస్తాడేమో చూడాలి. Can’t wait to celebrate like this again .. #BajrangPunia #Olympics #Olympics2020 #Tokyo2020#Wrestling @BajrangPunia pic.twitter.com/TNOHg9sMIf — Randeep Hooda (@RandeepHooda) August 6, 2021 -
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి
సెమీస్‌లో భజరంగ్ పూనియా ఓటమి ►ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా పరాజయం పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్‌పై ఆశలు రేపిన భజరంగ్.. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజి ముందు భజరంగ్ నిలవలేకపోయాడు. కాగా కాంస్య పతక పోరు కోసం భజరంగ్ పూనియా రేపు మరో మ్యాచ్ ఆడనున్నాడు. Tokyo Olympics 2020 Live Updates: గోల్ఫ్‌లో భారత్‌కు పతకం వచ్చే అవకాశం కనబడుతోంది. మూడో రౌండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్ పతకం సాధించేలా కనిపిస్తోంది. వాతావరణం అనుకూలించకుంటే, శనివారం జరుగనున్న నాలుగో రౌండ్ ఫలితం తేలనట్లయితే, మూడో రౌండ్ ఫలితాలను బట్టి అదితి అశోక్‌కు మెడల్ వచ్చే అవకాశం ఉంది. సెమీస్ చేరిన భజరంగ్ ► పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సెమీస్ చేరాడు. ఇరాన్ రెజ్లర్‌పై 2-1 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు. ► రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా సత్తా చాటాడు. కజికిస్థాన్ రెజ్లర్ అక్మతలీవ్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పోరాడి ఓడిన భారత్ ►కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల జరిగిన హోరాహోరీ పోరులో బ్రిటన్ విజయం సాధించింది. 4-3 తేడాతో భారత్‌పై గెలుపొందింది. నాలుగో క్వార్టర్ ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బ్రిటన్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరి చరిత్ర సృష్టించిన రాణి సేన.. ఈ ఓటమి కారణంగా రిక్తహస్తాలతోనే స్వదేశానికి తిరిగిరానుంది. ►మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమంగా ఉన్నాయి. నిరాశ పరిచిన సిమీ బిస్లా ►రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సారా హమీద్ చేతిలో భారత మహిళా రెజ్లర్ సీమీ బిస్లా ఓటమి పాలైంది. బ్రిటన్‌తో భారత్ హోరాహోరీ ►రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-2తో ఆధిపత్యం ప్రదర్శించగా... మూడో క్వార్టర్ ఆరంభంలోనే గోల్ కొట్టి 3-3కి భారత్ ఆధిక్యాన్ని బ్రిటన్ తగ్గించేసింది. ►బ్రిటన్‌తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకున్న రాణి సేన క్వార్టర్ ముగిసే సరికి వరుస గోల్స్ చేసి 3-2తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు. ► శుక్రవారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో భారత్-గ్రేట్ బ్రిటన్ మధ్య కాంస్యపు పోరు. ► బ్రిటన్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్.. సేవ్ చేసిన నవనీత్ ►లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. Let's own the stage. 💪 🇬🇧 0:0 🇮🇳https://t.co/FEfTJeC69a#GBRvIND #HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/sC5lUzw937 — Hockey India (@TheHockeyIndia) August 6, 2021 ►ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. ► పురుషుల 50 కి.మీ నడకలో భారత్‌కు నిరాశ. 50 కి.మీ నడకను పూర్తిచేయలేకపోయిన గురుప్రీత్‌సింగ్. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ►ఉ.7 నుంచి హాకీ మహిళల కాంస్య పతక పోరు (భారత్ Vs బ్రిటన్) ►ఉ. 8 గంటలకు రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగం (సీమీ బిస్లా) ►ఉ.8:45కు రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగం (బజరంగ్ పునియా) ►మ.ఒంటిగంట నుంచి మహిళల 20 కి.మీ వడక (ప్రియాంక, భావన) ►మధ్యాహ్నం 3 గంటలకు రెజ్లింగ్ పురుషుల సెమీస్ ►మధ్యాహ్నం 3:15 నుంచి రెజ్లింగ్ మహిళల సెమీస్ సాయంత్రం 5 గంటలకు పురుషుల 4x400 మీటర్ల హీట్స్ -
హ్యాకీ డేస్.. బంగారంలా మెరిసిన భారత కాంస్యం
అప్పట్లో భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా ఆడేదట! ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలుచుకుందట! ఒక తరం మొత్తం వింటూ వచ్చిన కథ ఇది. రికార్డు పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో, కొన్నేళ్ల తర్వాత గూగుల్ సెర్చ్‌లో... ఇలా అలనాటి ఘనత గురించి వినడమే తప్ప ఒక్కసారి కూడా మన ఇండియా ఒలింపిక్ పతకం గెలవడం ఈతరం చూడలేదు. ఆఖరిసారిగా 1980లో స్వర్ణం నెగ్గిందని సమాధానం గుర్తించడమే కానీ మన దేశం పతకం సాధించిన రోజు కలిగే ఆనందం ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఇప్పుడు కొత్త తరం క్రీడాభిమానులు కూడా మేం భారత్ ఒలింపిక్ పతకం గెలవడాన్ని చూశామని ఘనంగా చెప్పుకోవచ్చు... జర్మనీని ఓడించి పోడియంపై మన స్టార్లు సగర్వంగా నిలబడిన సమయాన జాతీయ పతాకం ఎగురుతున్న దృశ్యం మా కళ్లల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని సంతోషాన్ని ప్రకటించవచ్చు! ఆ సమయంలో భావోద్వేగానికి గురికాని భారతీయుడు ఎవరు! మైదానంలో ఆడి గెలిచిన మనోళ్లు సంబరాలు చేసుకున్నారు... హాకీతో సంబంధం లేని ఆటగాళ్లు కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు... మాజీ హాకీ ఆటగాళ్లయితే తామే గెలిచినంతగా గంతులు వేస్తున్నారు... ఒలింపిక్స్‌లో ఆడి పతక విజయంలో భాగం కాలేనివారు ఇప్పుడు గెలిచిన బృందంలో తమను తాను చూసుకుంటున్నారు. ఓడినా, గెలిచినా సుదీర్ఘ కాలంగా భారత హాకీనే ప్రేమిస్తూ వచ్చిన వారి స్పందన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు... ఈ గెలుపును ఆస్వాదించాలంటే హాకీ అభిమానులే కానవసరం లేదు. భారతీయుడైతే చాలు! టోక్యోలో ఇతర పతకాలు కూడా మన ఖాతాలో చేరుతున్నాయి. కానీ హాకీ విజయాన్ని అందరూ కోరుకున్నారు, ప్రార్థించారు. ఎందుకంటే ఇది ఫలితానికి సంబంధించి మాత్రమే కాదు, ఆ ఆటతో ఎంతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. మరో ఈవెంట్లో ఓడినా, గెలిచినా హాకీ జట్టు మాత్రం పతకం సాధించాలని కోరుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. 1984, 1988, ...., 2012, 2016... కాలక్రమంలో తొమ్మిది సార్లు ఒలింపిక్స్ వచ్చి వెళ్లాయి... పతకం మాత్రం రాలేదు. ఒకసారి అయితే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశం కూడా దక్కలేదు. బంగారు హాకీ ఘనతలు ముగిసిన తర్వాత మొదలైన పతనం వేగంగా సాగిపోయింది. ఈ సారైనా గెలవకపోతారా, ఒక్కసారైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తూ రావడం... ఆ ఆశలు కుప్పకూలడం రొటీన్‌గా మారిపోయాయి. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించే ఆటలు అంటూ అంచనాలు పెంచే జాబితాలోంచి హాకీ పేరు ఎప్పుడో తీసేశారు. కానీ గెలిస్తే బాగుండేదన్న చిరు కోరిక మాత్రం అభిమానుల మనసులో ఏమూలనో ఉండేది. అందుకే ఈ మూడో స్థానమూ మురిపిస్తోంది. పసిడి రాకపోతేనేమి, పునరుజ్జీవం పొందుతున్న ఆటకు ఈ విజయం బంగారంకంటే గొప్ప. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో హాకీకి దక్కిన ఈ కాంస్య పతకం విలువ అమూల్యం. టోక్యో: కోట్లాది అభిమానులకు ఆనందం పంచుతూ భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడో స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. ఒకదశలో 1–3తో వెనుకబడినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మన టీమ్ చివరకు విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జిత్ సింగ్ (17వ, 34వ నిమిషాల్లో), హార్దిక్ సింగ్ (27వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ నిమిషంలో), రూపిందర్‌పాల్ సింగ్ (31వ నిమిషంలో) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున టిమర్ ఒరుజ్ (2వ నిమిషంలో), నిక్లాస్ వెలెన్ (24వ నిమిషంలో), బెనెడిక్ట్ ఫర్క్ (25వ నిమిషంలో), ల్యూకాస్ విండ్‌ఫెడర్ (48వ నిమిషంలో) జర్మనీ జట్టుకు గోల్స్ చేశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించిన ఇన్నేళ్లకు మళ్లీ భారత్ ఖాతాలో మరో హాకీ పతకం చేరింది. వెనుకంజ వేసి... కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో ఆశలతో మ్యాచ్ బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ రెండో నిమిషంలోనే గోల్‌తో ముం దంజ వేసింది. భారత నెమ్మదైన డిఫెన్స్‌ను ఛేదించిన ఒరుజ్ రివర్స్ హిట్‌తో తొలి గోల్ నమోదు చేశాడు. మరో మూడు నిమిషాలకే భారత్‌కు పెనాల్టీ లభించినా అది వృథా అయింది. వరుసగా గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ జర్మనీ తొలి క్వార్టర్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్స్‌లో భారత జట్టు కుదురుకుంది. మిడ్ ఫీల్డ్ నుంచి నీలకంఠ శర్మ ఇచ్చిన పాస్‌ను సర్కిల్లో అందుకున్న సిమ్రన్ జర్మనీ కీపర్‌ను తప్పించి రివర్స్ హిట్ కొట్టడంతో స్కోరు సమమైంది. ఈ జోరులో భారత్ అటాక్‌కు ప్రయత్నించినా, జర్మనీ వెంటనే కోలుకుంది. నీలకంఠ, సురేంద్ర కుమార్‌లు చేసిన పొరపాట్లతో బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న జర్మనీ వరుస నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టింది. దాంతో ఆ జట్టు ఆధిక్యం 3–1కి పెరిగింది. మళ్లీ దూసుకెళ్లి... గతంలోనైతే ఇలాంటి స్థితి నుంచి భారత్ ఇక ముందుకు వెళ్లడం కష్టంగా మారిపోయేదేమో. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా, ఆశలు కోల్పోకుండా భారత్ పట్టుదలగా ఆడటం సత్ఫలితాన్ని ఇచ్చింది. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ కీపర్ స్టాడ్లర్ సమర్థంగా అడ్డుకున్నా, రీబౌండ్లో హార్దిక్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ వెంటనే మరో పెనాల్టీ రాగా, ఈసారి హర్మన్‌ప్రీత్ విఫలం కాలేదు. స్కోరు 3–3కు చేరడంతో భారత్ జట్టులో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో క్వార్టర్ మొదటి నిమిషంలోనే భారత్‌కు కలిసొచ్చింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌ను జర్మనీ ఆటగాళ్లు సర్కిల్ లోపల మొరటుగా అడ్డుకోవడంతో ‘పెనాల్టీ స్ట్రోక్’ లభించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపిందర్ దీనిని గోల్ చేయడంతో ఆధిక్యం 4–3కు పెరిగింది. మరో మూడు నిమిషాలకే గుర్జంత్ ఇచ్చిన పాస్‌ను అందుకొని దూసుకుపోయిన సిమ్రన్‌జిత్ మరో గోల్ చేయడంతో భారత్ 5–3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో మరింత దూకుడుగా ఆడిన భారత్‌కు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే అవి గోల్‌గా మారలేదు. చివరి క్వార్టర్లో జర్మనీ మళ్లీ బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో పెనాల్టీ అవకాశం దక్కించుకున్న జర్మనీ దానిని ఉపయోగించుకోవడంతో భారత్ ఆధిక్యం 5–4కు తగ్గింది. మ్యాచ్ ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు జర్మనీ తీవ్రంగా ప్రయత్నించింది. తమ గోల్ కీపర్‌ను ఆ స్థానం నుంచి తప్పించి ఫీల్డ్‌లోకి తీసుకొచ్చి దాడులకు దిగింది. అయితే వీటిని మన గోల్ కీపర్ శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకోగలిగాడు. తమకు దక్కిన 13 పెనాల్టీ కార్నర్లలో జర్మనీ ఒకదానిని మాత్రమే గోల్‌గా మలచగా... భారత్ 6 పెనాల్టీలలో రెండింటిని గోల్స్‌గా మార్చుకోగలిగింది. 6.8 సెకన్ల ముందు... అద్భుతంగా ఆడటం... ఇక మనం గెలిచేశాం అనుకుంటుండగా చివరి క్షణాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించి మ్యాచ్‌లు చేజార్చుకున్న దృశ్యం భారత హాకీ చరిత్రలో లెక్కలేనన్ని సార్లు జరిగింది. మన ఉదాసీతనకు తోడు అనూహ్యంగా వచ్చే అటాక్‌ను అంచనా వేసే లోపే ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. మ్యాచ్ ముగియడానికి మరో 6.8 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న దశలో కూడా జర్మనీకి పెనాల్టీ లభించింది. దీనిని జర్మనీ గోల్ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే డిఫెన్స్‌లో ముందుగా దూసుకొచ్చి న అమిత్ రోహిదాస్, కీపర్ శ్రీజేశ్ కలిసి ఆపగలిగారు. అంతే... భారత ఆటగాళ్లు పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించగా, జర్మనీ ప్లేయర్లు కుప్పకూలిపోయారు. టిక్..టిక్.. టైమర్ ఆగిపోయింది! మ్యాచ్ మరో 29 సెకన్లలో ముగుస్తుందనగా మైదానంలో ఉన్న అఫీషియల్ టైమర్ పని చేయడం ఆగిపోయింది. కానీ ఆట మాత్రం సాగిపోయింది. చివరకు 11 సెకన్ల తర్వాత అది మళ్లీ పని చేసింది. సాంకేతిక సమస్యలతో టైమర్ పని చేయలేదు. జర్మనీకి 6 సెకన్ల ముందు పెనాల్టీ లభించిందంటే ఒక రకంగా అది అదనపు సమయంలో భారత్‌కు జరిగిన నష్టమే! మ్యాచ్ ముగిశాక కూడా నిర్వాహకులు దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సమస్య రాలేదు కానీ అదే చివరి పెనాల్టీ గోల్‌గా మారి ఉంటే..! -
Men's Hockey: ‘మా ఇంటిని.. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్ నిలబెట్టింది’
కొడుకు ఫీల్డ్‌లో పరిగెడుతుంటే అమ్మ గుండెలు పరిగెడతాయి. కొడుకు చెమటలు కక్కుతుంటే అమ్మ కళ్లు కన్నీరు చిందుతాయి. అమ్మ రెండు చేతులు ఎప్పుడూ కొడుకు విజయం కోసమే కదా ప్రార్థిస్తాయి. 41 సంవత్సరాల తర్వాత హాకీలో విజయం సాధించిన భారత జట్టు వెనుక ఉన్నది ఈ దేశమే కావచ్చు. కాని వారి తల్లులు కూడా. దేశం కోసం గెలిచిన కొడుకులను చూసి చూపుడు వేలికి కాటుక రాసుకుని దిష్టి చుక్క పెట్టడానికి ఎదురు చూస్తున్నారా తల్లులు. సంతోషంతో తబ్బిబ్బవుతున్నారని వేరే చెప్పాలా? పంజాబ్ క్రీడా శాఖామంత్రి గుర్మిత్ సింగ్ సోధి తమ రాష్ట్రం నుంచి హాకీ టీమ్‌లో ఉండి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ప్రతి ఒక్క సభ్యుడికి కోటి రూపాయలు అనౌన్స్ చేసి వారు రావడంతోటే చెక్ చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.కాని ఆ కోటి రూపాయల సంగతి తర్వాత. జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మాత్రం తన తల్లి మంజిత్ కౌర్ చేసే ఆలూ పరాఠాల కోసం కాచుకుని ఉన్నాడు. భారతదేశం చేరుకుని ఇంటికి వచ్చిన వెంటనే అతడు తినాలనుకుంటున్నది తల్లి చేతి ఆలూ పరాఠానే. ‘నా కొడుకు కోసం స్వహస్తాలతో ఆలూ పరాఠాలు చేస్తా. ఆలుగడ్డ కూర కూడా చేస్తా’ అని ఆమె అంది. మన్‌ప్రీత్ ఇంటి బయట కోలాహలం జలంధర్ జిల్లాలోని మిథాపూర్ అనే చిన్న ఊరు ఇప్పుడు సంతోషంతో కేరింతలు కొడుతోంది. మన్‌ప్రీత్ సింగ్‌ది ఆ ఊరే. అతనిదే కాదు... ప్రస్తుతం హాకీ టీమ్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా ఆ ఊరివారే. అందుకే దానిని ‘ఒలింపిక్ గ్రామం’ అని అంటారు. కాంస్యం కోసం జర్మనీతో హోరాహోరి పోరు గురువారం జరుగుతున్నప్పుడు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తల్లి చేత హాకీ బ్యాట్ పట్టుకుని ఇరుగుపొరుగు వారితో కలిసి ఇంట్లో ఉత్కంఠగా మేచ్ చూసింది. కుటుంబసభ్యులతో కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్, గ్రౌండ్లోమన్ప్రీత్సింగ్ ‘ఈ బ్యాటే నా కొడుకును అంత దూరం తీసుకెళ్లింది’ అందామె మేచ్ గెలిచాక ఉద్వేగపడుతూ. మేచ్ మొదలయ్యే ముందు మన్‌ప్రీత్ తల్లికి వీడియో కాల్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ‘బాగా ఆడు నాన్నా... కాని జర్మనీని తక్కువ తీస్కోవద్దు’ అని హెచ్చరించింది ఆమె. ‘వాహె గురు నా ప్రార్థనలు ఆలకించాడు. గురుద్వార్ వెళ్లి ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు చేస్తాను’ అని చెప్పిందామె. 2016లో మన్‌ప్రీత్ తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తల్లే మన్‌ప్రీత్ ఆటకు వెన్నుదన్నుగా ఉంది. అతణ్ణి ముందుకు తీసుకెళ్లింది. తన శ్రమ ఫలించిన సంతృప్తి ఆమె కళ్లల్లో కనిపించింది. ఉంగరం కానుక ఇక మరో ఆటగాడు హార్దిక్ సింగ్ తల్లి కన్వల్జిత్ కౌర్ కొడుకు కోసం ఒలింపిక్ రింగ్స్‌ను పోలిన బంగారు ఉంగరం చేయించి సిద్ధంగా ఉంది. ‘నా కొడుకు విజయానికి నేనిచ్చే కానుక ఇది’ అని ఆ తల్లి చెప్పింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డ్ ఆటగాడు హార్దిక్ సింగ్ ఒలింపిక్స్ జట్టులో ఎంపికైయ్యాక అతని తమ్ముడు ‘అన్నయ్యా... మన కారు మీద ఒలింపిక్స్ లోగో వేయించేదా’ అని అడిగాడు. దానికి హార్దిక్ ‘ఇప్పుడే వద్దురా. టైమ్ వచ్చినప్పుడు చెప్తాను’ అని జవాబు ఇచ్చాడు. ‘ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. నా కొడుకు కారు మీద ఒలింపిక్స్ లోగో ఉంటుంది’ అని కన్వల్జిత్ కౌర్ తన చుట్టుపక్కల వారికి ఒకటి రెండు స్వీట్లు పంచుతోంది. తల్లి ఉషతో గోల్‌కీపర్ శ్రీజేష్, ఆనందంలో శ్రీజేష్ గోడ కట్టిన కొడుకు ఇక కొచ్చిలో హాకీ టీమ్ గోల్ కీపర్ శ్రీజేష్ ఇంటి దగ్గర హడావిడి అంతా ఇంతా లేదు. టపాకాయలు మోగిపోతున్నాయి. ‘కాంస్యమైతే ఏంటి... బంగారంతో సమానం’ అని శ్రీజేష్ తల్లి ఉషా అంది. వచ్చిపోయే వారిని, కొడుకు గొప్పతనం గురించి పొగుడుతున్నవాళ్లను ఎక్కడ దిష్టి తగులుతుందో అని కంగారుగానే వింటూ తబ్బిబ్బవుతోంది ఆమె. ‘నా కొడుకు శత్రువులకు అడ్డంగా గోడలా నిలబడ్డాడు’ అని ఆమె అంది. నిజంగానే జర్మనీతో సాగిన మేచ్‌లో గోల్ కీపర్‌గా శ్రీజేష్ ఎదుర్కొన్న వొత్తిడి తక్కువది కాదు. శ్రీజేష్ భార్య అనీషా ఆయుర్వేద డాక్టర్. ‘ఆయన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను’ అంది సంబరంగా. ఒరిస్సా వీరుడు ఐదు మంది సంతానంలో చివరివాడుగా పుట్టిన ఒరిస్సా ఆటగాడు అమిత్ రోహిదాస్ ఇంటికే కాదు దేశానికి కూడా కీలకంగా మారడం అతడి తల్లిని గర్వపడేలా చేస్తోంది. ‘మేము పేదరైతులం. నా కొడుకే మా ఇంటిని నిలబెట్టాడు. నా కొడుకు చేతిలోని హాకీ స్టిక్ నిలబెట్టింది’ అని అతని తల్లి అంది. వాళ్ల గ్రామం సౌనామోరా (రూర్కెలా నుంచి 120 కి.మీ) ఇప్పుడు అమిత్ తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. కేవలం ప్లాస్టిక్ కుర్చీలు ఉన్న ఇంటిలో ఊపిరి బిగపట్టి మేచ్ చూసిన అమిత్ తల్లి గెలిచాక మురిసిపోయింది. మరి కాసేపటికి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో మాట్లాడటం కూడా చిన్న అనుభవం కాదు. అన్నట్టు ఒరిస్సా ముఖ్యమంత్రి తమ రాష్ట్రం నుంచి కాంస్యం తెచ్చిన ప్రతి ఆటగాడికి రెండున్నర కోట్లు ప్రకటించారు. అమిత్‌కు కూడా ఆ నగదు కాచుకుని ఉంది. దానికంటే ముందు ఆ తల్లి ఆలింగనం కూడా. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాలను త్యాగం చేస్తారు. వాటిలో చాలామటుకు పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడతారు. పిల్లలు విజయం సాధించినప్పుడు ఆ త్యాగాలకు ఒక అర్థం దొరికి సంతృప్తిపడతారు. ఇవాళ భారత హాకీటీమ్లోని ప్రతి సభ్యుని తల్లిదండ్రులు ఈ అద్భుత సంతృప్తితో తల ఎత్తుకు తిరుగుతారు. -
PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మరువలేనిది. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీజేష్ పేరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్. తాజాగా శ్రీజేష్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. 1998లో తన 12 ఏళ్ల వయసులో హాకీలో ఓనమాలు నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. అయితే ఆ స్కూల్ హాకీ కోచ్ శ్రీజేష్ను గోల్ కీపింగ్ చేయమని సలహా ఇచ్చాడు. కోచ్ చెప్పిన విషయాన్ని శ్రీజేష్ తన తండ్రికి వివరించాడు. కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేసి శ్రీజేష్‌కు గోల్ కీపింగ్ కిట్‌ను కొనిచ్చాడు. అయితే ఆ సమయంలో రవీంద్రన్ శ్రీజేష్‌కు ఒక మాట చెప్పాడు. '' ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని తాకట్టు పెడుతున్నా. నువ్వు అనుకున్న కలను సాధించాలి.. హాకీలో గోల్ కీపర్‌గా మెరవాలి.. దేశానికి పతకం తేవాలి.'' అని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలను శ్రీజేష్ ఈరోజుతో నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తన గోల్ కీపింగ్‌తో మెప్పించి దేశానికి కాంస్యం అందించాడు. ఇటు తండ్రి కోరికను నెరవేర్చడంతో పాటు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణకు తన జట్టుతో కలిసి తెరదించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో భారత్ 5-4 తేడాతో జయకేతనం ఎగురవేసి కాంస్యం దక్కించుకుంది. -
పాయింట్ల పట్టికలో అట్టడుగున.. పడి పడి పైకి ఎగసి
ఒలింపిక్స్‌లో నాలుగు దశాబ్దాల తర్వాత దక్కిన పతకం.. చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ టీం. మ్యాచ్ ఆరు సెకండ్ల వ్యవధిలో ముగుస్తుందనగా.. ప్రత్యర్థికి దక్కిన పెనాల్టీ కార్నర్. మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే ఆ గోల్‌ను తీవ్ర ఒత్తిడిలోనూ చాకచక్యంగా అడ్డుకుని హీరో అయ్యాడు భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్. ‘అయినా గెలిచింది కాంస్యమే కదా.. ఆ మాత్రానికేనా ఇంతా?’ అని అనుకునేవాళ్లు బోలెడు మంది ఉండొచ్చు. కానీ, ఇవాళ్టి విజయం నిజంగానే సంబురాలకు అర్హమైందని భారత హాకీ చరిత్ర చెప్పకనే చెబుతోంది. హాకీ.. మన జాతీయ క్రీడ. ఈ పేరు వినగానే జైపాల్ సింగ్ ముండా, లాల్ షా బోఖారి, ధ్యాన్ చంద్, కిషన్‌లాల్, కేడీ సింగ్ లాంటి హాకీ దిగ్గజాల పేరు గుర్తుకు వచ్చేది ఒకప్పుడు. వీళ్ల సారథ్యంలో వరుస ఒలింపిక్స్‌లో ఆరు స్వర్ణాలు సాధించింది భారత హాకీ పురుషుల జట్టు. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్ గ్యాప్(కెనడా ఒలింపిక్స్‌లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డు. అలాంటిది ఆ తర్వాతి నుంచి ఒలింపిక్ పతాకం కాదు కదా.. పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఎక్కడో అట్టడుగునకు చేరుతూ వచ్చింది భారత పురుషుల హాకీ టీం. ఇక మహిళల జట్టు సంగతి సరేసరి. అయితేనేం కిందపడ్డా.. పోరాట పటిమను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇన్నేళ్లలో మెరుగైన స్థితిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 ఏళ్ల తర్వాత జాతీయ క్రీడలో భారత్‌కు దక్కిన ఒలింపిక్ పతక విజయం అద్భుతమనే చెప్పాలి. క్లిక్ చేయండి:1980 తర్వాత తొలిసారి.. ఫొటో హైలెట్స్ కారణాలు.. క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన అందలం దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వెరసి.. ఈ ప్రతికూల ప్రభావాలన్నీ ఆటగాళ్లపై, ఆటపై పడ్డాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తల్లో మాత్రమే వినిపిస్తుండేవి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఇదే ధోరణిని జనాల్లోనూ పెరిగిపోయేలా చేశాయి. గత నలభై ఏళ్లలో లీగ్ టోర్నీలు, ఆసియన్ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్‌ల్లో(తొలి రెండింటిల్లో కాంస్యం, ఆపై 1975లో స్వర్ణం), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్ కోచింగ్‌లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌లో బ్రిటన్ను ఓడించడం సంచలన విజయమనే చెప్పాలి. అటుపై సెమీస్‌లో ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓటమి, ఆపై కాంస్యపు పోరులో జర్మనీపై విజయాన్ని.. అద్భుతంగానే వర్ణించాలి. ఒకవేళ ఓడిపోయి ఉన్నా.. ఈ ఒలింపిక్స్‌లో మనవాళ్లు సత్తా చూపారనే భావించాల్సి వచ్చేది. మొత్తం 12.. 1980 మాస్క్ ఒలింపిక్స్‌లో గోల్డ్ తర్వాత(అప్పుడు నేరుగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది భారత్)..ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల టీం కనబరిచిన ప్రదర్శన కచ్చితంగా మెరుగైందనే చెప్పొచ్చు. 1984 నుంచి వరుస ఒలింపిక్స్‌లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో తీవ్ర విమర్శలపాలైంది. ఈ తరుణంలో హాకీలో తిరిగి జవసత్వాలు నింపుతూ వస్తున్న యువ టీం.. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా చేరుకోవడం, అటుపై కాంస్యం పోరులో నెగ్గడం విశేషం. ఇప్పటిదాకా జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు.. ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో(టోక్యో కాంస్యంతో కలిపి) పతకాలు సాధించించింది. ఈ మెరుగైన ప్రదర్శనను జట్టు మునుముందు ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. -సాక్షి, వెబ్ డెస్క్ -
కాంస్య పోరు: భారత్ వీరవిహార విజయం, 41 ఏళ్ల తర్వాత..
Tokyo Olympics 2020 Men Hockey Bronze Match: టగ్ ఆఫ్ వార్‌గా భావించిన పోరులో భారత్ జయకేతనం ఎగరేసింది. ఒలింపిక్స్ కాంస్యపు పోరులో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ పురుషుల హాకీ టీం విజయం సాధించింది. ఆఖర్లో ఉత్కంఠను పెంచి 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. తద్వారా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకాన్ని ఖాతాలో వేసుకుంది ఇండియన్ మెన్స్ హాకీ టీం. ఇక పెనాల్టీ కార్నర్లు ఈ మ్యాచ్‌ను శాసించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది. ఆరంభంలో రెండో నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ కట్టబెట్టిన భారత్.. మొదట్లో తడబడినట్లు కనిపించింది. ఇక రెండో క్వార్టర్లో సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమంగా ముగిసింది. మూడో క్వార్టర్లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది మ్యాచ్. జర్మనీ రెండు గోల్స్ కొట్టగా.. ఆ వెంటనే భారత్ మరో గోల్ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో సమం చేసింది భారత్. పూర్తి పైచేయి మూడో క్వార్టర్లో పూర్తిగా భారత్ డామినేషన్ కొనసాగింది. ఆరంభంలోనే ఓ గోల్ సాధించి.. 4-3తో ఆధిక్యం కనబరిచింది భారత్. ఆ వెంటనే మరో గోల్‌తో 5-3 ఆధిక్యంలో నిలిచి.. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్థికి మరో గోల్ దక్కకుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. మధ్యలో గోల్ అవకాశం దక్కినా.. ఇరు జట్లు తడబడడంతో మూడు క్వార్టర్ భారత్ వైపే ఆధిక్యంతో ముగిసింది. చివర్లో.. జర్మనీ గోల్‌తో స్కోర్ 4-5 అయ్యింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. మరో గోల్ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖర్లో సెకన్ల వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో.. భారత్ విక్టరీ ఖాయమైంది. రియల్ హీరో.. హాకీ టీం గోల్ కీపర్ శ్రీజేష్.. చివర్లో షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకుని హీరో అనిపించుకున్నాడు. మన్‌ప్రీత్ సారథ్యంలో ఒలింపిక్ పతాక కలను సార్థకం చేశాడు. హాకీలో డిఫెండింగ్ దిగ్గజంగా కోచ్ గ్రాహం రెయిడ్.. సూచనలు భారత జట్టుకు ఎంతో ఉపకరించాయి. 17, 27, 29, 31, 34 నిమిషాల్లో గోల్స్ చేసిన భారత్జట్టులో 2 గోల్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు సిమ్రన్జీత్సింగ్. -
ఇక చాలు అనుకోలేదు
అలుపన్నది ఉందా ఎగిరే అలకు... విరామమన్నది లేదా సింధు సాధనకు... టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పీవీ సింధు పడిన కష్టం మాటలకు అందనిది. కోర్టులో తన ఆటను మెరుగుపర్చుకోవడం ఒక ఎత్తు కాగా, అత్యుత్తమ ఫిట్నెస్ నుంచి సాధించేందుకు బ్రేక్ అనేదే లేకుండా సుదీర్ఘ సమయం పాటు కొన్ని నెలలపాటు చేసిన ట్రైనింగ్ ఆమెకు మరో పతక విజయంలో కీలకపాత్ర పోషించింది. బ్యాడ్మింటన్‌పై ఉన్న మక్కువే గత ఐదేళ్లలో తనను నడిపించిందని సింధు ‘సాక్షి’తో వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం... నలుపు రంగు జంప్ సూట్లో బయటకు వస్తున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును చూసి ఆ ప్రాంతమంతా హోరెత్తింది. పూలతో అభినందన, శాలువాలతో సత్కారం...పొలిటీషియన్ల నుంచి పోలీస్ ఉన్నతాధికారి వరకు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. మాస్క్ వెనక దాగిన ఆమె చిరునవ్వులో రెండో ఒలింపిక్ పతకం సాధించిన విజయగర్వం కనిపించింది. అనంతరం ఇంటికి చేరిన సింధు, తన కెరీర్‌లోని ప్రత్యేక సందర్భం విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకుంది. ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే... ‘రియో’ రజతంతో పోలిస్తే... సహజంగానే రజత పతకం తర్వాత స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోనే సన్నద్ధమయ్యాను. సెమీఫైనల్లో కూడా నా శక్తిమేర ప్రయత్నించినా విజయం సాధించలేదు. అదే కాంస్యం కోసం జరిగిన మ్యాచ్ చూస్తే ఎంత పదునైన ఆటతీరు కనబర్చానో కనిపిస్తుంది. రజతంతో పోలిస్తే ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తున్నా... ఒలింపిక్ పతకానికి ఉండే విలువ ఎప్పుడైనా ప్రత్యేకమే. కరోనా పరిస్థితులను అధిగమించి... ఒకదశలో ఒలింపిక్స్ జరగవేమో అనిపించింది. నిజానికి ఏ ప్లేయర్‌కైనా తాను తర్వాత ఎప్పుడు, ఎక్కడ ఆడబోతున్నాడో తెలిస్తేనే ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. కానీ ఈ ఒలింపిక్స్ విషయంలో అలా జరగలేదు. గత ఏడాది పరిస్థితి కొంతమారి లాక్డౌన్ పాక్షికంగా తొలగించిన తర్వాతా టోర్నీల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ప్రాక్టీస్ చేసినా ఏం లాభం అనే పరిస్థితి కనిపించింది. ఇలాంటప్పుడు కూడా నేను సాధన కొనసాగించాను. నిజానికి ఆ సమయాన్ని నేను ఇంకా బాగా వాడుకున్నట్లే లెక్క. హైదరాబాద్ విమానాశ్రయంలో సింధుకు స్వాగతం పలికిన తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అందరి సహకారంతోనే... ఒక ఒలింపిక్ మెడల్ విజయం వెనక ఆట మాత్రమే కాదు, అదనంగా అనేక అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది. ప్లేయర్‌గా నేను కష్టపడటంతోపాటు అండగా నిలిచే ఒక ‘ఎకో సిస్టం’ అవసరం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొదటి నుంచి తోడుగా ఉన్నారు. కెరీర్లో నేను ఎదుగుతున్న కీలక సమయంలో 2014లో సహకరించేందుకు ముందుకు వచ్చిన బేస్‌లైన్ కంపెనీ ఇప్పటికీ నాతో కలిసి పని చేస్తోంది. కోచ్ పార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్రైనర్, ఫిజియోల వల్లే గాయాల నుంచి తప్పించుకుంటూ ఒలింపిక్స్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లగలిగాను. ఫిట్నెస్ ట్రైనింగ్‌తో... కష్టం, పోరాటం లేనిది విజయం రాదని నమ్మే వ్యక్తిని నేను. అత్యుత్తమ అథ్లెట్లతో పోటీ పడే విధంగా నా ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమించాను. ట్రైనర్ శ్రీకాంత్ నాకు శిక్షణ ఇచ్చారు. ఆయన నన్ను ఎంత కష్టపెట్టినా భరించాను. కష్టసాధ్యమైన ఎక్సర్సైజ్లు, వెయిట్ ఎక్సర్సైజ్లు చాలా చేశాను. గంటలకొద్దీ ట్రైనింగ్ తర్వాత కూడా ఏ రోజూ ఇక చాలు అని ఆగిపోలేదు! మళ్లీ దేనికైనా సిద్ధం అన్నట్లుగా మానసికంగా దృఢంగా ఉన్నాను. గతంలో సుదీర్ఘ ర్యాలీల సమయంలో అలసిపోయి మ్యాచ్‌లు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దానిపైనా దృష్టి పెట్టాం. ఒలింపిక్స్ మ్యాచ్‌లలో ముఖ్యంగా టోక్యో బయల్దేరడానికి రెండు నెలల ముందు నుంచైతే ఇంకా కఠోర సాధన చేసాను. ప్రతీ రోజు, ప్రతీ సెషన్‌ను కీలకంగానే భావించా తప్ప విరామం తీసుకోలేదు. మళ్లీ మళ్లీ గెలవాలనే తపనే... ఒకసారి ఒలింపిక్ పతకం గెలుచుకున్నాక ఇక కెరీర్లో అన్ని సాధించేసిన భావన చాలా మందిలో వచ్చేస్తుంది. రియోలో రజతం తర్వాత సహజంగానే కొంత కాలం ఆ విజయాన్నే ఆస్వాదించాను. అయితే ఇక చాలు అనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. అదే మరో ఒలింపిక్ పతకం వరకు తీసుకెళ్లింది. నాకు బ్యాడ్మింటన్ అంటే పిచ్చి ప్రేమ. మనకు నచ్చిన పని చేయడంలో ఎవరికీ కష్టం అనిపించదు. అలాంటప్పుడు ప్రేరణ సహజంగానే లభిస్తుంది. మధ్యలో కొన్నిసార్లు మన మనసు చెదిరి ఇతర అంశాలపై దృష్టి వెళ్లడం కూడా సహజం. అయితే వెంటనే మన లక్ష్యం ఏమిటో తెలిస్తే వెంటనే మళ్లీ దారిలో పడతాం. ఒలింపిక్స్ పతకమే కాదు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కూడా నేను ఆగిపోలేదు. మున్ముందూ అంతే పట్టుదలగా ఆడతాను. కెరీర్లో ఇంకా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించలేదు. బాగా ఆడి అది కూడా అందుకోగలను. ఇప్పుడే 2024 పారిస్ ఒలింపిక్స్ గురించి ఆలోచించడం లేదు. కొంతకాలం ఈ విజయాన్ని ఆస్వాదించి మళ్లీ ప్రాక్టీస్‌లోకి దిగుతా. అంతకుముందు ఉదయం ‘సాక్షి’ న్యూఢిల్లీ ప్రతినిధితో మాట్లాడుతూ సింధు... ‘2016లో మొదటిసారి మెడల్ వచ్చినప్పుడు నాపై అంత అంచనాలు ఏవీ లేవు. కానీ ఈసారి ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఒత్తిడి, అంచనాలు, బాధ్యతలు చాలానే ఉన్నాయి. సెమీఫైనల్స్‌లో ఓడిపోయినప్పుడు కొంచెం బాధేసింది. కానీ మా కోచ్, మా ఫిజియో నాకు చాలా సపోర్ట్ చేశారు. పేరెంట్స్ కూడా ఫోన్ చేసి నీకు ఇంకో ఛాన్స్ ఉంది అని నన్ను ప్రోత్సహించారు. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురవుతాం. ఆ ఆలోచనలను పక్కనబెట్టి కాంస్య పతకంపై దృష్టి పెట్టాలని మా కోచ్ నాకు సూచించారు. కాంస్య పతకం రావడం, నాలుగో స్థానంలో ఉండడానికి చాలా తేడా ఉంటుందని కోచ్ చెప్పారు. కష్టపడితే నువ్వు తప్పకుండా కాంస్యం సాధిస్తావని ఆయన నన్ను ప్రోత్సహించారు. అందువల్లే నేను మెడల్ సాధించగలిగాను. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ప్రయాణం ప్రారంభించినప్పుడు స్వల్పకాలిక లక్ష్యాలు ఉండేవి. ఆ తర్వాత నేను నా ఆటను చాలా మెరుగు పర్చుకున్నాను. వచ్చే రెండు వారాల్లో ప్రధాని సమయం కేటాయించినప్పుడు వెళ్ళి ఆయనను కలుస్తాము. ప్రధాని చెప్పినట్లుగానే ఆయనతో కలిసి ఐస్‌క్రీం తింటాను. ఆయనను కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను’ అని వ్యాఖ్యానించింది. -
Tokyo Olympics: ఓడిపోయారు.. కాంస్యం గెలిచినా చరిత్రే
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల జట్టు సెమీస్‌లో ఓడిపోయినప్పటికి అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత మహిళల జట్టు ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అర్జెంటీనాతో జరిగిన సెమీస్‌లో ఆట ఆరంభంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు. అయితే భారత్ జట్టు సెమీస్‌లో ఓడినప్పటికి రాణి రాంపాల్ సేనకు మరో సువర్ణావకాశం ఉంది. కాంస్య పతక పోరులో భాగంగా ఆగస్టు 6న బ్రిటన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గనుక అది కూడా ఒక చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు ఇంతవరకు పతకం సాధించలేదు. ఒకవేళ కాంస్యం గెలిస్తే మాత్రం సరికొత్త చరిత్ర కానుంది. -
కొడుకు పుట్టలేదని అమ్మానాన్నను వేధించారు.. వారికిదే జవాబు
సాక్షి, వెబ్‌డెస్క్: అసోంలోని గోల్ఘాట్ జిల్లాలోని మారుమూల గ్రామం బారోముఖియా.. రాజధాని డిస్పూర్ నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరికి ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.. బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే మట్టి రోడ్డే దిక్కు.. అటువంటి గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ పుట్టిన గడ్డగా ప్రత్యేకతను సంతరించుకుంది. విశ్వ క్రీడల్లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన ఘనతను సాధించినందుకు తమ ఆడపడుచుకు స్వాగతం పలికేందుకు ముస్తాబు అవుతోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన లవ్లీనా ఈ విజయంతో తన దేశమంతా గర్వపడేలా చేసింది. పొలంలో నాట్లు వేయడం కూడా వచ్చు.. లవ్లీనా తండ్రి టికెన్ బొర్గోహెయిన్‌కు స్వస్థలంలో చిన్న తేయాకు తోట ఉంది. సాధారణ కుటుంబం. మొత్తం ముగ్గురు అమ్మాయిల్లో లవ్లీనా చిన్నది. కవల అక్కల బాటలో సరాదాగా ఆమె కూడా మువతాయ్ (కిక్ బాక్సింగ్)తోనే కెరీర్ ఆరంభించింది. 2009లో కోచ్ ప్రశాంత కుమార్ దాస్ వద్ద తన అక్కలతో పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురూ కలిసి బారోముఖియా నుంచి 3- 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్పాథార్లోని కోచింగ్ సెంటర్‌కు సైకిల్‌పై వెళ్లేవారు. ఫొటో కర్టెసీ: ఇండియా టుడే ఈ విషయాల గురించి లవ్లీనా తండ్రి టికెన్ మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలు చాలా కష్టపడేవారు. రాళ్లురప్పలతో నిండిన మట్టిరోడ్డు మీద ప్రయాణం వారికి నరకప్రాయంగా ఉండేది. వచ్చేటపుడు గాయాలతో తిరిగి వచ్చేవారు. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా లవ్లీనా ఎన్నటికీ తన మూలాలు మర్చిపోదని, లాక్డౌన్ సమయంలోలో పొలంలో నాట్లు వేస్తూ తమకు సహాయపడిందని బిడ్డపై ప్రేమను కురిపించారు. కాగా మువతాయ్ కొనసాగిస్తున్న సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ పదమ్ బోరో దృష్టిలో పడటంతో లవ్లీనా కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని... టోక్యోకు కోచ్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన లవ్లీనా... 2020లో జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాక్డౌన్లో సొంతూరిలోనే ఉన్న ఆమె.. ప్రాక్టీస్ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి పయనమైంది. కానీ, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న తల్లికి సహాయంగా ఉండేందుకు అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో లవ్లీనా కరోనా బారిన పడింది. దీంతో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె వైదొలగాల్సిన పరిస్థితి. అయినా సరే ఆమె కుంగిపోలేదు. కోవిడ్‌ను జయించడమే కాకుండా.. పట్టుదలగా ముందుకు సాగి టోక్యోలో సత్తా చాటింది ఈ 23 ఏళ్ల బాక్సర్. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి, ప్రతిభ ముందు ఏ అవాంతరాలైనా దూదిపింజల్లా తేలిపోవాల్సిందేనని నిరూపించింది. విశ్వ క్రీడల్లో పతకంతో మెరిసి, ఈ ఘనత సాధించిన మూడో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. అమ్మానాన్నలను ఎన్నో మాటలు అన్నారు.. వారికిదే సమాధానం ‘‘ముగ్గురు ఆడపిల్లలను కలిగి ఉన్నందుకు గానూ నా తల్లిదండ్రులను ఈ సమాజం ఎన్నో మాటలు అన్నది. గత జన్మలో ఏదో పాపం చేసినందుకే కొడుకు పుట్టలేదంటూ వేధించేవారు. నిజానికి నేను బాక్సింగ్ చేయడం ప్రారంభించినపుడు చాలా మంది నన్ను చూసి నవ్వారు. ముఖ్యంగా లింగ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి నా ప్రదర్శన, ఈ పతకం ముఖం మీద కొట్టినట్లుగా సమాధానం ఇస్తుందని భావిస్తున్నా. మాకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నా తల్లిదండ్రులకు ఈ విజయం అంకితం చేస్తున్నా’’ అని సెమీ ఫైనల్ అనంతరం ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ లవ్లీనా భావోద్వేగానికి గురైంది. ఫైనల్ చేరాలని భావించానని, అయితే తన ప్రణాళికను పక్కాగా అమలు చేయలేకపోయానని పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌తో తప్పక ఇంతకంటే మెరుగ్గా రాణించి, మరో పతకం గెలుస్తానని లవ్లీనా చెప్పుకొచ్చింది. అంతకంటే ముందు... వరల్డ్ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటాల్సి ఉందని అని పేర్కొంది. ఏదేమైనా.. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించిన లవ్లీనా నిజంగానే బంగారుకొండ.. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ లవ్లీనా!! -
దేశానికి పతకం తీసుకురావడం ఆనందంగా ఉంది
సాక్షి, హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన పీవీ సింధు బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు పీవీ సింధుకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. '' ఒలింపిక్స్‌లో పతకం రావడం ఆనందంగా ఉంది. దేశానికి పతకం తీసుకురావడం ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా నిన్న(మంగళవారం) టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పీవీ సింధుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర మంత్రులు సింధుతో పాటు ఆమె కోచ్ పార్క్‌ను ఘనంగా సత్కరించారు.2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. -
ఒలింపిక్స్‌లో పతకం రావడం ఆనందంగా ఉంది: పీవీ సింధు
-
PV Sindhu: పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం
-
పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం స్వదేశానికి చేరుకున్న సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధు కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్ పార్క్ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక రేపు(బుధవారం) 11.30 గంటలకు పీవీ సింధు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నది. -
PV Sindhu: సింధుకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన రాష్ట్రానికి చెందిన పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాలని అధికారులను సీఎం జగన్ సోమవారం ఆదేశించారు. సింధుతోపాటు వివిధ అంతర్జాతీయ, జాతీయ క్రీడా వేదికలపై పతకాలు సాధించిన రాష్ట్రంలోని ఇతర క్రీడాకారులకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందని సీఎం జగన్ కొనియాడారు. సింధు విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి జాతీయ సీనియర్, సబ్ జూనియర్ స్థాయిల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నగదు ఇచ్చామని గుర్తు చేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులు ఇంకా ఎవరైనా మిగిలిపోతే స్పోర్ట్స్ పాలసీ ప్రకారం నగదు ఇవ్వాలని సీఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విశాఖపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని అకాడమీ నిర్వహణ కోసం కేటాయించింది. టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లేముందు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ.5 లక్షల చొప్పున నగదు సహాయం కూడా చేశారు. 2017–22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.75 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.30 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు. -
Tokyo Olympics: పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
-
సింధు పతకం సాధించడం ఆనందంగా ఉంది : సింధు తల్లి
-
ఒత్తిడిలోనూ సింధు విజయం సాధించింది: తండ్రి రమణ
-
పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి కొత్త అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ అంటూ ట్విట్టర్లో సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. విశ్వక్రీడల్లో సింధు మరోసారి సత్తా చాటి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించగా, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసింది. 2016లో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డును పీవీ సింధు అందుకుంది. All good wishes and much Congratulations to our Telugu girl @Pvsindhu1 for winning Bronze for India at #TokyoOlympics2020 She is the 1st Indian woman to have won two individual medals at #Olympics. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2021 -
పీవీ సింధుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సింధు విజయం ద్వారా భారత్‌కు మరింత గౌరవం దక్కిందని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. ఈ విజయం స్ఫూర్తిగా భారత యువత క్రీడల్లో రాణించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. పీవీ సింధుని ప్రశంసించారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌కు భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్‌కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్‌కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. -
ఒత్తిడిలోనూ సింధు విజయం సాధించింది: తండ్రి రమణ
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడిలోనూ పీవీ సింధు విజయం సాధించిందని ఆమె తండ్రి రమణ అన్నారు. దేశం మొత్తం సింధుకు అండగా నిలిచిందన్నారు. దేశానికి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. నిన్నటి ఓటమి గురించి మరిచి.. ఈరోజు ఆటమీద దృష్టి పెట్టాలని చెప్పానని, వ్యక్తిగత ఈవెంట్లో దేశానికి రెండు మెడల్స్ తీసుకురావడం గర్వించదగ్గదన్నారు. సింధు పతకం సాధించడం ఆనందంగా ఉందని.. సింధు తల్లి విజయ అన్నారు. సింధు మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఉత్కంఠగా చూశానని విజయ తెలిపారు. -
వయసు 58... ఉత్సాహం 18: కాంస్యం సాధించిన షూటర్
2016 రియో ఒలింపిక్స్... షూటింగ్ స్కీట్ ఈవెంట్లో 53 ఏళ్ల అబ్దుల్లా అల్ రషీదీ కాంస్య పతకం సాధించాడు. అయితే అతనిలో ఏమాత్రం ఆనందం లేదు. తన సొంత దేశం కువైట్‌పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించి ఉండటంతో అతను ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్‌గా బరిలోకి దిగాడు. ఫుట్‌బాల్ క్లబ్ ‘అర్సెనల్’ జెర్సీ వేసుకొని పతకం అందుకోగా... వేడుక సమయంలో ఒలింపిక్ పతాకం మాత్రమే ఎగిరింది. ఇది అతడిని చాలా బాధించింది. అంతే... తాను మళ్లీ ఒలింపిక్స్ ఆడాలని, దేశం తరఫున పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా అనుకోవడమే కాదు... ఐదు సంవత్సరాల తర్వాత దానిని సాధించి చూపించాడు. 58 ఏళ్ల వయసులో అదే స్కీట్ ఈవెంట్లో మళ్లీ కాంస్యం గెలిచి కువైట్ జాతీయ పతాకం ఎగురుతుండగా సగర్వంగా నిలబడ్డాడు. టోక్యో క్రీడల్లో పతకం సాధించిన అతి పెద్ద వయస్కుడి గా రషీదీ నిలవడం విశేషం. 1996 నుంచి వరుసగా విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న రషీదీకి ఇవి ఏడో ఒలింపిక్స్ కావడం విశేషం. తొలి ఐదు సందర్భాల్లో 42, 14, 9, 9, 21 స్థానాల్లో నిలిచినా, అతను వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే వచ్చాడు. సోమవారం ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి పతకం కోసం రషీదీతో చివరి వరకు పోటీ పడిన ఈటూ కలినన్ (ఫిన్లాండ్)... రషీదీ తొలి ఒలింపిక్స్ ఆడే సమయానికి పుట్టనే లేదు! అన్నట్లు అతని కుమారుడు తలాల్ అలా రషీదీ కూడా షూటరే. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తండ్రితో కలిసి బరిలోకి దిగిన తలాల్, ఈసారి కూడా ‘ట్రాప్’ ఈవెంట్లో మళ్లీ ఆడుతున్నాడు. చివరగా... ఇంతటితో ఆగిపోనని చెబుతున్న రషీదీ, రిటైర్మెంట్ వయసు (61) వచ్చినా సరే పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పోటీ పడతానని ప్రకటించడం విశేషం! అదో అంకె మాత్రమే... టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన పెద్ద వయస్కురాలిగా మేరీ హనా (ఆస్ట్రేలియా) నిలిచింది. 66 ఏళ్ల హనా ఈక్వెస్ట్రియన్‌లో ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. అమెరికా ఈక్వెస్ట్రియన్ జట్టు సభ్యుడైన ఫిలిప్ డాటన్ వయసు 57 ఏళ్లు కాగా, ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవితినా వయసు 46 సంవత్సరాలు. ఎనిమిదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న చుసోవితినాకు 21 ఏళ్ల కొడుకు ఉండగా... ఈ పోటీల్లో అతనికంటే చిన్న వయసువారు ఎంతో మందితో ఆమె పోటీ పడుతోంది. 45 ఏళ్ల అమెరికా బీచ్ వాలీబాల్ ప్లేయర్ జేక్ జిబ్ను చూసినా సరే... వీరంతా కాలాన్ని వెనక్కి తిప్పి యవ్వనంతో పోటీ పడుతున్నారా అనిపిస్తుంది! -
టోక్యో ఒలింపిక్స్: మెడల్స్ తయారీ వెనుక ఆసక్తికర విషయాలు
టోక్యో: 1964 తర్వాత ఒలింపిక్స్ క్రీడల నిర్వహణను జపాన్ ప్రభుత్వం దక్కించుకోవడం మళ్లీ ఇదే. ఈ ఒలింపిక్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రభుత్వం నిర్వహణలోనూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి పతకాల తయారీ వరకు వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది. అయితే ఒలింపిక్స్ మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేయాలని జపాన్ ప్రభుత్వం ముందే నిర్ణయించింది. అందుకోసం మూడేళ్ల క్రితం ఆ దేశ వాసుల నుంచి పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. అందులోని లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్‌ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ చెత్తను ఒక మంచి పనికి ఉపయోగించారు. అంతేకాదు ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్‌లను కూడా సంప్రదాయపద్దతిలోనే తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్‌లను నేయించింది. దీంతో పాటు పతకాలను ఉంచేందుకు... కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. జపాన్ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ మెడల్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు తాము గెలుచుకున్న పతకాలు ఎవరికి వారే మెడలో వేసుకోవాలని జపాన్ ప్రభుత్వంతో పాటు ఐవోసీ(ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) నిర్ణయించింది. -
భారత మహిళల పిస్టల్ జట్టుకు కాంస్యం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో కాంస్య పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్, రాహీ సర్నోబత్, యశస్విని సింగ్‌లతో కూడిన భారత బృందం మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మనూ, రాహీ, యశస్విని త్రయం 16–12 పాయింట్ల తేడాతో వెరోనికా, మిరియమ్ జాకో, సారా రాహెల్‌లతో కూడిన హంగేరి జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కాంస్య పతక పోరులో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ పన్వర్‌లతో కూడిన భారత జట్టు 14–16తో మిలెంకో, స్టెఫనోవిచ్, లాజార్‌లతో కూడిన సెర్బియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల స్కీట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ గుర్జత్ ఖంగురా క్వాలిఫయింగ్‌లో 115 పాయింట్లు స్కోరు చేసి 56వ స్థానంలో నిలిచాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ రెండు విభాగాల్లో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశముంది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సౌరభ్ కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. మనూ, రాహీ, యశస్విని -
Wrestler Gurpreet Singh: గుర్‌ప్రీత్‌కు కాంస్యం
సోఫియా (బల్గేరియా): వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరి రోజు ఆదివారం పురుషుల గ్రీకో రోమన్ 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. కాంస్య పతక బౌట్లో గుర్ప్రీత్ 4–2 పాయింట్ల తేడాతో విక్టర్ నెమిస్ (సెర్బియా)పై విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నీకాగా... ఈ టోర్నీ ద్వారా భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేసుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుమిత్ మలిక్ (125 కేజీలు) రజతం నెగ్గి, మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా బిస్లా (50 కేజీలు) స్వర్ణ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కేవలం ఫైనల్‌కు చేరిన రెజ్లర్లే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్నారు. గ్రీకో రోమన్ విభాగం 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. అయితే గుర్ప్రీత్ సింగ్‌ను ఓడించిన రఫీగ్ హుసెనోవ్ (అజర్బైజాన్) ఫైనల్‌కు చేరుకోవడంతో గుర్ప్రీత్ సింగ్‌కు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం దక్కింది. -
నా శ్వాస.. ధ్యాస.. సంద్రమే!
దేన్ని చూసి భయపడతామో దానితోనే తలపడితే... ధైర్యం విజయసోపానాలతో స్వాగత సత్కారం చేస్తుంది. నీళ్లను చూసి భయపడిన ఆ నీళ్లతోనే ఫైట్ చేసింది రికార్డులను కొల్లలుగా కొల్లగొడుతోంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ నీటి మెరుపుతో ముచ్చటించిన విశేషాలు ఇవి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆడవారిలో సహజంగా ఓ భయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనేది ఆ భయం వెనక దాగున్న వాస్తవం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, అందుకు తగిన సాధన విషయంలో అంతగా శ్రద్ధ ఉండదు. ఈ విషయాన్ని తన సంభాషణలో తొలుతగా ప్రస్తావించిన శ్యామల పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. సోషియాలజీ విభాగంలో పట్టభద్రురాలైన శ్యామల నీళ్లు తనతో స్నేహం చేసిన తొలినాళ్ల గురించి చెబుతూ– ‘‘నేను యానిమేషన్ మూవీస్ కి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్‌గా ఉండేదాన్ని. దీంట్లో నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాను. బిజినెస్ క్లోజ్ చేశాను. మైండ్‌ను మరోవైపుకు మళ్లించాల్సిన అవసరం అది. అప్పుడు స్విమ్మింగ్ ఎంచుకున్నాను. ఎవరైనా నీళ్లలో ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు వెయిట్‌లాస్, ఫిట్నెస్ గురించో ఆలోచిస్తారు. కానీ, నేను ఒక లక్ష్యం ఉండాలనుకున్నాను. అయితే, నీళ్లంటే విపరీతమైన భయం ఉండేది. నాలుగేళ్ల క్రితం సమ్మర్ టైమ్‌లోనే మొదటిసారి స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాను. ఆ రోజు నీళ్లలో దిగినప్పుడు వచ్చిన వణుకు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్ని రోజుల్లో ఏడు అడుగుల దూరం డైవింగ్ బోర్డ్ నుంచి జంప్ చేసినప్పుడు వణికిపోయాను. కానీ, మూడు నెలల్లోనే పోటీలో పాల్గొనేంతగా సాధన చేశాను. మొదటిసారే కాంస్య పతకం వచ్చింది’’ అని తెలిపిన శ్యామల యుద్ధంలో దిగేంతవరకే భయం. దిగితే ఎంతటివారినైనా ఓడించాల్సిందేననే తపనను కనబర్చింది. సంద్రంవైపు గురి నాటి నుంచి పాల్గొన్న ప్రతీ పోటీలో మెడల్స్, అవార్డ్స్ వరిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన వారి గురించిన వార్తలు కంటబడ్డాయి. ఆ విషయాన్ని శ్యామల ప్రస్తావిస్తూ ‘నేనూ సముద్రాన్ని ఈదుతాను.. అని స్నేహితులతో మాట్లాడినప్పుడు వాళ్లు నా వయసు గురించి ప్రస్తావించారు. పాతికేళ్లలోపైతే ఓకే కానీ, నలభై ఏళ్లు దాటాక చాలా కష్టం అన్నారు. ఆ కష్టాన్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకోవాలనుకున్నాను. వయసు అనే అడ్డంకిని దాటాలనుకున్నాను. అయితే, ఇంగ్లిష్ ఛానెల్ కన్నా మన దేశంతో కలిసి ఉన్న సముద్రం అయితే బాగుంటుందనుకున్నాను. అప్పుడే నాకు రామసేతు దృష్టిలోకి వచ్చింది. అక్కణ్ణుంచి నా ప్రయత్నం, ప్రయాణం ఆగలేదు. నిరంతరం సాధన. దానికి తోడు ఇప్పటి వరకు ఎవరైనా రామసేతును క్రాస్ చేశారా.. అనే శోధన. అలాంటి వారి కోసం అన్వేషణ.. నిరంతరం సాగుతూనే ఉంది. అప్పుడే రామసేతును క్రాస్ చేసిన రాజా త్రివేది గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదించినప్పుడు ప్రోత్సహించి, తగు సూచనలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచన, ఏడాది క్రితమే పూర్తి చేయాలనుకున్నాను. కానీ, కోవిడ్ కారణంగా మరో ఏడాది పట్టింది’ అంటూ సముద్రంపై తను గురిపెట్టిన లక్ష్యాన్ని వివరించారు. సముద్రమంత సాధన! స్త్రీ, పురుషులు ఎవరైనా వారు చేసే పనుల ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఈ విషయం గురించి అడిగితే.. ‘నిజమే, కానీ జీవితంలో మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి’ అంటారు శ్యామల. మా వారు ‘ఏం ఫర్వాలేదు. నువ్వు తిరిగి వస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది’ అన్నారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కి ‘ఇండియా,–శ్రీలంక ఫ్రెండ్షిప్ స్విమ్మింగ్’ అని పేరు పెట్టాం. ఫెడరేషన్ వాళ్లు ఒక అబ్జర్వేటర్, మహారాష్ట్ర నుంచి ఒక అబ్జర్వేటర్ వచ్చారు. కుటుంబ సభ్యులతో శ్యామల క్రూలో 14 మందిమి వెళ్లాం. ఒక డాక్టర్, ఫీడింగ్‌కి సాయం చేయడానికి ఫ్రెండ్‌ని తీసుకెళ్లాను. ఉదయం 4 గంటలకు స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యింది. రీచ్ అయ్యేసరికి సాయంకాలం 5:35 గంటలు అయ్యింది. స్విమ్మింగ్ మొదలయ్యే క్షణం నుంచి ధనుష్కోటికి చేరుకునే క్షణం వరకు నా మదిలో ఒకటే ఆలోచన స్విమ్.. స్విమ్.. అంతే! 13 గంటల 43 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను. ఈ పాక్ జలసంధి ని బులా చౌదరి 13 గంటలు 55 నిమిషాల్లో ఈది రికార్డ్‌లో ఉన్నారు. ఆ రికార్డ్‌కి దరిదాపుల్లో వెళ్లగలనా అనుకున్నాను. కానీ, ఆ రికార్డ్‌ను ్ర»ే క్ చేయాలనే సంకల్పం నన్ను ముందు నిలబెట్టింది’ అని వివరిస్తున్నప్పుడు విజయం తాలూకు ఆనందం ఆ కళ్లలో కనిపించింది. ధైర్యం వెన్నుదన్ను సముద్రాన్ని దూరం నుంచి చూడటం ఓ ఆహ్లాదం. కానీ, సముద్రాన్ని ఈదడం అంటే.. ‘షార్క్స్ ఉంటాయి. ఏ క్షణమైనా అవి దాడి చేయవచ్చు. మింగేయచ్చు. ఇలా వీటి గురించి భయపెట్టి కొందరు కిందటేడాది స్విమ్మర్స్ ఆలోచనను మార్చేశారు. కానీ, చావో రేవో తేల్చుకోవాలనుకున్నాను. ఏమీ సాధించకుండా ఉండేదానికన్నా ఒక ధీరలాగా పోరాడైన పోవాలనుకున్నాను. అందుకే భయానికి ఏ మాత్రం తావివ్వలేదు. నేను గమనించిందేంటంటే స్విమ్మర్స్ని షార్క్స్ దాడి చేసిన ఘటనలైతే ఏమీ లేవు. ఈ రికార్డ్‌లో భాగంగా నీళ్లలో ఉన్నంతసేపు ఏదీ పట్టుకోకూడదు, దేనినీ ముట్టుకోకూడదు. శ్రీలంక నుంచి స్విమ్ చేస్తున్నప్పుడు అక్కడి నీళ్లలో సులువు అనిపించింది. అది క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటరయ్యేటప్పుడు ముఖ్యంగా చివరి 3 గంటలు చాలా కష్టమనిపించింది. గట్టి అలలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడా కష్టమంతా మర్చిపోయాను. సక్సెస్ ను ఆనందిస్తున్నాను’ అని స్విమ్మింగ్ పూల్ నుంచి సముద్రాన్ని జయించిన విజయ ప్రవాహం గురించి వివరిస్తూనే ఉన్నారు శ్యామల. ఒక దారి మూసుకుపోతే దేవుడు వేయి అవకాశాల దారులను మన ముందుంచుతాడు. ఏ దారిలో వెళ్లినా లక్ష్యం వైపుగా గురి ఉంటే విజయం వరించి తీరుతుంది. 47 ఏళ్ల వయసులో 30 మైళ్ల పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించిన శ్యామల విజయం ఒక్కనాటితో కాదు నిరంతర సాధనతో, పట్టుదలతో ఆమె సొంతమైంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
టీటీలో కోటి ఆశలతో...
దాదాపు ఏడాదిన్నర క్రితం... జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్... పురుషుల రెండో రౌండ్లో 18 ఏళ్ల కుర్రాడు భారత టీటీ దిగ్గజం ఆచంట శరత్ కమల్‌ను బోల్తా కొట్టించాడు. 9 సార్లు జాతీయ చాంపియన్... ‘ట్రిపుల్ ఒలింపియన్’... తను ఆరాధించే ఆటగాడు అయిన శరత్ కమల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆ కుర్రాడే తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్. అలాంటి అరుదైన విజయంతోనే ఆగిపోకుండా మరింత పట్టుదలతో శ్రమించిన స్నేహిత్ ఇటీవల తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 49 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన స్నేహిత్... రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లక్ష్యంగా తన అడుగులు వేస్తున్నాడు. సాక్షి క్రీడా విభాగం ఏడేళ్ల వయసులో టేబుల్ టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్న స్నేహిత్ వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణిస్తూ వేగంగా దూసుకుపోయాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలు నమోదు చేసిన అనంతరం 2014లో క్యాడెట్ విభాగంలో తొలి అంతర్జాతీయ టైటిల్‌తో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన దక్షిణాసియా పోటీల్లో స్నేహిత్ రజత పతకం సాధించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్న అనంతరం 2017 స్నేహిత్ కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. జోర్డాన్‌లో జరిగిన ఐటీటీఎఫ్ వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఓపెన్ టోర్నమెంట్లో అతను సింగిల్స్ లో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్యాడ్లర్ జూనియర్ స్థాయిలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్లొవేనియా, మయన్మార్, ఇండియన్ ఓపెన్, జూనియర్ నేషనల్స్‌తో పాటు ఆలిండియా ర్యాంకింగ్ టోర్నమెంట్లలో అతను వరుసగా పతకాలు సాధించాడు. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో 20 పతకాలు అతని ఖాతాలో చేరాయి. ఫిట్నెస్ను మెరుగుపర్చుకొని... జూనియర్ విభాగంలో రెండు ప్రపంచ చాంపియన్ షిప్‌లలో (ఇటలీ, ఆస్ట్రేలియా) కూడా పాల్గొన్న 20 ఏళ్ల స్నేహిత్... జాతీయ స్థాయిలో కేడెట్, సబ్ జూనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో వరుసగా ప్రతీ ఏడాది టాప్–4 ర్యాంక్‌లో కొనసాగాడు. అతని కెరీర్‌ను తీర్చి దిద్దడంలో కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు ఘోష్ శిక్షణలో రాటుదేలిన స్నేహిత్ జూనియర్ స్థాయిలో నిలకడగా రాణించాడు. చెన్నైకి చెందిన ఎస్.రామన్ వద్ద కూడా స్వల్పకాలం పాటు శిక్షణ పొందగా... 2015లో మాజీ ప్రపంచ చాంపియన్ పీటర్ కార్ల్సన్ వద్ద స్వీడన్లో రెండు నెలల పాటు కోచింగ్ తీసుకోవడం అతని కెరీర్‌కు మేలు చేసింది. ఇప్పుడు కోచ్ ఘోష్‌తో పాటు ఫిజియో హిరాక్ బాగ్చీ స్నేహిత్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా జూనియర్ స్థాయి నుంచి సీనియర్ విభాగంలో పోటీ పడే దశలో వచ్చే ప్రతికూలతలకు అధిగమించేలా చేసి అతడిని ఫిట్‌గా తీర్చిదిద్దడంలో బాగ్చీ కీలక పాత్ర పోషించారు. శరత్ కమల్‌తో సాధన అనంతరం... ర్యాంకింగ్ టోర్నీలో శరత్ కమల్‌పై గెలిచిన తర్వాత స్నేహిత్‌కు అనూహ్య ఫలితాలు వచ్చాయి. వరుసగా ఐదు టోర్నీల్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఈ దశలో మానసికంగా బలహీనపడి టోర్నీల్లో పోటీ పడటం కష్టంగా మారింది. అయితే 2019 డిసెంబర్లో జమ్మూలో జరిగిన యూత్ నేషనల్స్ టోర్నీ స్నేహిత్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీని కోసం కఠోర సాధన చేసిన అతను చివరకు ఫలితం సాధించాడు. యూత్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలవడంతో టీమ్ విభాగంలో రజతం కూడా దక్కింది. ఇదే విజయం సీనియర్ స్థాయిలో సత్తా చాటేందుకు కావాల్సిన ప్రేరణను కూడా కల్పించింది. లాక్డౌన్ సమయంలో శరత్ కమల్ స్వయంగా కొందరు యువ ఆటగాళ్లను ఆహ్వానించి వారితో కలిసి సాధన చేశాడు. అది కూడా స్నేహిత్‌కు ఉపయోగపడింది. ఇప్పుడు సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి అతను కొత్త ఘనతను నమోదు చేశాడు. తల్లిదండ్రుల అండతో... చాలా మంది వర్ధమాన ఆటగాళ్లలాగే స్నేహిత్ తల్లిదండ్రులు సూరావజ్జుల రాము, హేమ కూడా తమ అబ్బాయిని చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమించారు. టోర్నీలో పాల్గొనేందుకు పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రైవేట్ స్పాన్సర్ల నుంచి గానీ ఎలాంటి సహకారం లేకపోవడంతో కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఎలాగైనా స్నేహిత్‌ను టీటీలో మేటిగా తీర్చిదిద్దాలనే సంకల్పం, పట్టుదలతో వారు ఈ ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహిత్‌కు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్టయిఫండ్ అందిస్తుండగా... ‘ఖేలో ఇండియా’ తరఫు నుంచి శిక్షణ లభిస్తోంది. స్నేహిత్‌కు సన్మానం... జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన స్నేహిత్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జయేశ్ రంజన్... తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మంచి క్రీడా పాలసీ తేనుందని... దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత టీటీ సమాఖ్య ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రాజు, స్నేహిత్ కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నేషనల్స్‌లో పతకం సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. ఈ స్థాయిలో నేనూ నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది. అయితే ఇది చిరు ఆనందం మాత్రమే. నా అసలు లక్ష్యాలు ముందున్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ముఖ్యంగా నా ఆటతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నా ఫిట్నెస్ను కూడా మెరుగుపర్చుకున్నా. ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించాల్సి ఉంది. ఆపై 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నా. – ‘సాక్షి’తో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ -
హుసాముద్దీన్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. జర్మనీలోని కొలోన్‌లో శనివారం జరిగిన పురుషుల 57 కేజీల సెమీస్‌లో నిజామాబాద్ జిల్లా బాక్సర్ హుసాముద్దీన్ జర్మనీకి చెందిన హమ్‌సత్ షడలోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మరోవైపు 52 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘాల్ పసిడి పతకం నెగ్గాడు. ఫైనల్లో అతని ప్రత్యర్థి అర్గిష్టి టెట్రెర్యాన్ (జర్మనీ) వాకోవర్ ఇవ్వడంతో అమిత్ రింగ్‌లోకి అడుగు పెట్టకుండానే స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ రజతంతో సంతృప్తి చెందాడు. గాయం కారణంగా సతీశ్ ఫైనల్లో పోటీపడలేదు. మహిళల 57 కేజీల విభాగంలో సాక్షి, మనీషా ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో సాక్షి 4–1తో రమోనా గ్రాఫ్ (జర్మనీ)పై, మనీషా 5–0తో సోనియా (భారత్)పై నెగ్గారు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత పూజా రాణి, గౌరవ్ సోలంకీ సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యాలను గెలుచుకున్నారు. -
పతకధారి పేస్...
భారత బృందం ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళుతున్నా ఎవరిలోనూ పెద్దగా ఆశలు లేని రోజులవి... పతకాల సంగతి దేవుడెరుగు, మనవాళ్లు కనీసం పరువు నిలబెట్టుకునే ప్రదర్శన చేసినా గొప్పే అనిపించేది. 1980 మాస్కో ఒలింపిక్స్‌తోనే టీమ్ ఈవెంట్ హాకీ జోరు ముగిసింది. ఆ తర్వాత వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో 5, 6, 7 స్థానాల్లో నిలవడంతో దానినీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక వ్యక్తిగత విభాగంలో విజయం అంటే సుదూర స్వప్నం. కానీ ఇలాంటి సమయంలో 23 ఏళ్ల కుర్రాడి సంచలన ప్రదర్శన ఒక్కసారిగా దేశంలో అమితానందం నింపింది. ఎవరూ ఊహించని విధంగా టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్యం సాధించి లియాండర్ పేస్ అద్భుతం చేసి చూపించాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అతను గెలుచుకున్న కంచు పతకం అందరి దృష్టిలో బంగారమైంది. దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా అసమాన ఆటతీరు కనబర్చడం లియాండర్ పేస్‌లో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆసియా క్రీడల్లో, డేవిస్కప్లాంటి పోటీల్లో అతని రికార్డులే చెబుతాయి. భారత్‌కు ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఎంత బలమైనవాడో, ఏ ర్యాంకులో ఉన్నాడో అతనికి కనిపించదు. తన అత్యుత్తమ ఆటతీరుతో చెలరేగిపోయే తత్వంతో పేస్ పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. సరిగ్గా ఇదే శైలితో అతను ఒలింపిక్స్‌లో భారత జాతీయ పతకాన్ని ఎగురవేశాడు. సన్నాహాలు... లియాండర్ పేస్‌కు ఇది రెండో ఒలింపిక్స్. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అతను రమేశ్ కృష్ణన్‌తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. దాంతో తర్వాతి ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అతను ఆ తర్వాత వెల్లడించాడు. 1996 ఒలింపిక్స్ కోసం నాలుగేళ్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యాడు. ఇందుకోసం ప్రొఫెషనల్ టూర్లో కొన్ని టోర్నీలను వదిలేసుకున్నాడు. ఒలింపిక్స్ జరిగే అట్లాంటాలోని స్టోన్ మౌంటెయిన్ను పోలి ఉండే వాతావరణంలో (సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉంటుంది) జరిగే టోర్నీలలో, అదీ హార్డ్‌కోర్టు టోర్నీలలో మాత్రమే పాల్గొన్నాడు. ప్రతిభ ప్లస్ అదృష్టం... అయితే ఇంతగా శ్రమించినా ఒలింపిక్స్ ‘డ్రా’ చూడగానే అతనిలో ఉత్సాహం ఆవిరైంది. తొలి రౌండ్ ప్రత్యర్థిగా దిగ్గజ ఆటగాడు పీట్ సంప్రాస్ ఎదురయ్యాడు. దాంతో సహచరులు కూడా అయ్యో అంటూ ఓదార్చారు. కానీ అతని కష్టం వృథా పోలేదు. అనూహ్యంగా సంప్రాస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఊపిరి పీల్చుకొని వరుసగా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పోయాడు. ఆ సమయంలో పేస్ ప్రపంచ ర్యాంక్ 126. కానీ అతని పట్టుదల ముందు ర్యాంక్‌లు పని చేయలేదు. వరుస రౌండ్లలో రికీ రెనెబర్గ్ (వరల్డ్ నంబర్ 20), నికోలాస్ పెరీరా (వరల్డ్ నంబర్ 74), థామస్ ఎన్క్విస్ట్ (వరల్డ్ నంబర్ 10), రెంజో ఫుర్లాన్ (వరల్డ్ నంబర్ 26)లను పడగొట్టి పేస్ ముందుకు దూసుకుపోయాడు. నాలుగు విజయాల తర్వాత లియాండర్ దిగ్విజయంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి మరో సూపర్ స్టార్, అప్పటి ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆండ్రీ అగస్సీ ఎదురయ్యాడు. అయితే అప్పటికే ఆత్మవిశ్వాసంతో ఉన్న పేస్ బెదరలేదు. తొలి సెట్‌ను టైబ్రేక్ వరకు తీసుకెళ్లగలిగాడు. అయితే చివరికు అగస్సీ ముందు 6–7 (5/7), 3–6తో తలవంచక తప్పలేదు. అసలు సమరం... సెమీస్ మ్యాచ్‌లోనే పేస్ కుడి మణికట్టుకు గాయమైంది. అది తగ్గకుండానే తర్వాతి రోజు కాంస్య పతకం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. బ్రెజిల్‌కు చెందిన వరల్డ్ 93వ ర్యాంకర్ ఫెర్నాండో మెలిగినీ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన సమరంలో గాయాలను పట్టించుకునే స్థితిలో అతను లేడు. నొప్పిని భరిస్తూనే మైదానంలోకి దిగాడు. ఆ రోజు పేస్ తన కోసం కాకుండా దేశం కోసం ఆడినట్లు కనిపించాడు. భారత జాతి యావత్తూ కూడా అన్నీ ఆపేసి అతని విజయం కోసం ఎదురుచూసింది. గెలుపు దక్కాలని కోరుకుంది. కానీ తొలి సెట్‌ను పేస్ 3–6తో కోల్పోయాడు. కోర్టు మొత్తం నిశ్శబ్దం. అదే సమయంలో వాన రావడంతో ఆట ఆగిపోయింది. అయితే ఒక్కసారి వర్షం వెలిశాక పేస్ కొత్తగా కనిపించాడు. రెండో సెట్లో 1–2తో వెనుకబడి 30–40తో మరో గేమ్ కోల్పోయే దశలో ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. అంతే... అతడిని ఆపడం మెలిగినీ వల్ల కాలేదు. వరుసగా రెండు సెట్లు పేస్ ఖాతాలో చేరాయి. చివరకు 3–6, 6–2, 6–4తో అద్భుత విజయం అందుకొని కన్నీళ్లపర్యంతమయ్యాడు. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లర్ ఖాషాబా జాదవ్ తర్వాత వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో భారతీయుడిగా పేస్ నిలిచాడు. కోట్లాది భారతీయులు ఈ విజయం తామే సాధించినంతగా సంబరపడ్డారు. పేస్ తండ్రి వీస్ పేస్ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు. దాంతో ఒకే కుటుంబంలో రెండు ఒలింపిక్ పతకాలు చేరడం విశేషం. -
మన ‘మల్లి’ మెరిసిన వేళ....
ఒలింపిక్ వేదికపై మన తెలుగమ్మాయి సగర్వంగా నిలబడిన రోజది... భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా ఆమె మెడలో పడిన కాంస్య పతకం దేశంలోని అమ్మాయిలకు కొత్త స్ఫూర్తిని అందించింది. ఏళ్లుగా అంచనాల భారం మోస్తూ వెళ్లే మన అథ్లెట్లు మెగా ఈవెంట్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వస్తున్న సమయంలో నేనున్నానంటూ బరువులెత్తి పరువు నిలబెట్టిన ఘనత ఆమె సొంతం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కరణం మల్లీశ్వరి విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేట నుంచి ఒలింపిక్స్ వరకు ఎదిగి ఆమె సాధించిన పతకానికి భారత క్రీడా చరిత్రలో ‘తొలి మహిళ’గా ప్రత్యేక స్థానం ఉంటుంది. లెక్కల్లో చూస్తే అది కాంస్యమే కావచ్చు కానీ ఈ ఘనత బంగారు పతకంకంటే తక్కువేమీ కాదు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ టెన్నిస్ సింగిల్స్‌లో సాధించిన కాంస్యమే భారత్ ఖాతాలో చేరిన ఏకైక పతకం. ఆ తర్వాత కూడా మన క్రీడలు ఒక్కసారిగా ఏమీ మారిపోలేదు కాబట్టి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌పై కూడా పెద్దగా ఆశలు లేవు. పతకం సాధించగల సత్తా ఉన్న క్రీడాకారుల జాబితాలో కరణం మల్లీశ్వరిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. నిజానికి అప్పటికే మల్లీశ్వరి తనను తాను నిరూపించుకుంది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం (1994, 1995)తో పాటు మరో రెండు కాంస్యాలు కూడా సాధించింది. వరుసగా రెండు ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు కూడా ఉన్నాయి. సిడ్నీ సంచలనానికి వచ్చేసరికే మల్లీశ్వరి 11 స్వర్ణాలు సహా 29 అంతర్జాతీయ పతకాలు సాధించింది. అయితే వెయిట్ కేటగిరీ మారిపోవడంతోపాటు ఇతర ఫలితాలు ఎలా ఉన్నా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మనవాళ్ల తడబాటు జగమెరిగిందే కాబట్టి ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. ఇదే చివరకు మల్లీశ్వరికి కూడా మేలు చేసింది. ఒకదశలో ఒలింపిక్స్‌కు ముందు ఉత్తరాది లాబీ ఒకటి పనిగట్టుకొని ఇండియాటుడే లాంటి పత్రికలో మల్లీశ్వరి గురించి తప్పుడు కథనాలు ప్రచురింపజేసి ఆమెను మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా దృఢ చిత్తంతో ఆమె ముందడుగు వేసింది. స్వర్ణానికి గురి పెట్టి... 2000 సెప్టెంబర్ 19న సిడ్నీ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో పోరు జరిగింది. మహిళల 69 కేజీల విభాగంలో మల్లీశ్వరి బరిలోకి దిగింది. స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో మన వెయిట్‌లిఫ్టర్ ఎక్కడా తడబాటుకు గురి కాకుండా వరుసగా 105 కేజీలు, 107.5 కేజీలు, 110 కేజీలు బరువులెత్తింది. ఫలితంగా అత్యుత్తమ ప్రదర్శన 110 కేజీల వద్ద స్కోరు నిలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125 కేజీలు, 130 కేజీలు ఆమె ఎత్తింది. అయితే ఈ దశలో చేసిన చిన్న తప్పు ఆమెను వైఫల్యంలో పడేసింది. మల్లీశ్వరి స్వయంగా నిర్ణయం తీసుకుందో, లేక కోచ్‌లు చెప్పారో కానీ చివరి ప్రయత్నంలో ఎవరికీ అందనంత పైన ఉండి స్వర్ణం సాధించే పట్టుదలతో ఏకంగా 137.5 కేజీల బరువెత్తేందుకు సిద్ధమైంది. సాధారణంగా వెయిట్‌లిఫ్టర్లు తమ చివరి లిఫ్ట్ వచ్చేసరికి అంతకుముందు లిఫ్ట్కంటే గరిష్టంగా 2.5 కేజీల వరకు అదనంగా బరువు ఎత్తగలరు. అయితే ఒక్కసారిగా 7.5 కేజీలు పెరిగేసరికి మల్లీశ్వరి తడబడింది. ఫలితంగా మూడో యత్నంలో 137.5 కేజీలు ఎత్తలేక వదిలేసింది. తుది ఫలితంలో మొత్తంగా 240 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెలుచుకుంది. స్వర్ణ, రజతాలు సాధించిన లిన్ వీనింగ్ (చైనా), ఎర్‌జెబెత్ (హంగేరి) ఎత్తిన మొత్తం (242.5 కేజీలు) మల్లీశ్వరికంటే 2.5 కేజీలే ఎక్కువ కావడం గమనార్హం. ఆమె కూడా 132.5 కేజీల లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటే స్వర్ణం కోసం పోటీలో నిలిచేదేమో! లిన్ వీనింగ్, ఎర్‌జెబెత్ సమానంగా 242.5 కేజీలు ఎత్తినా... ఎర్‌జెబెత్ (68.52 కేజీలు) శరీర బరువుకంటే లిన్ వీనింగ్ (66.74 కేజీలు) తక్కువగా ఉండటంతో చైనా లిఫ్టర్‌కు స్వర్ణం దక్కింది. అభినందనల వర్షం... మల్లీశ్వరి కాంస్య పతకం కూడా భారత్‌కు సంబంధించి బంగారమే అయింది. సిడ్నీలో మనకు దక్కిన పతకం అదొక్కటే. మల్లీశ్వరికి కూడా తాను సాధించిన విజయం విలువ తెలిసేందుకు కొంత సమయం పట్టింది. దేశం యావత్తూ ఆమెకు జేజేలు పలికి ప్రశంసల్లో ముంచెత్తింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తికెక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మాన సత్కారాలతో ఆమెను అభినందించి భారీ పురస్కారాలు ప్రకటించింది. అయితే పతకం గెలిచిన మరుసటి రోజు ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అత్యంత ప్రత్యేకమైంది. ‘భారత్ కీ బేటీ’ అంటూ మల్లీశ్వరిని అభినందించిన ప్రధాని ఒక కవితను కూడా వినిపించారు. అయితే ఆ హిందీ కవిత తనకేమీ అర్థం కాలేదని ఆ తర్వాత ఆమె సరదాగా గుర్తు చేసుకుంది. మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ ఘనతపై త్వరలోనే సినిమా కూడా రూపుదిద్దుకోనుంది. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. -
ఓటమి అంచుల నుంచి...
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో సాయిప్రణీత్ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయిన్ చేతిలో... రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంట 21–18, 22–20తో కెద్రిన్–విరియంగ్‌కురా (థాయ్‌లాండ్) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–19, 21–18తో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–కిడాంబి శ్రీకాంత్ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్జిత్–నిపిత్పోన్ (థాయ్‌లాండ్) జోడీని ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. 2016 చాంపియన్‌షిప్‌లోనూ భారత్ సెమీస్‌లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
ప్రియదర్శినికి కాంస్యం
కోల్‌కతా: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ప్రియదర్శిని కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ప్రియదర్శిని మొత్తం 168 కేజీల (స్నాచ్‌లో 70+క్లీన్ అండ్ జెర్క్‌లో 98) బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. మీరాబాయి జాతీయ రికార్డు: 49 కేజీల విభాగంలోనే భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల మీరాబాయి మొత్తం 203 (స్నాచ్‌లో 88+ క్లీన్ అండ్ జెర్క్‌లో 115) కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 201 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. రైల్వేస్‌కే చెందిన మరో వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను మొత్తం 185 కేజీలు (స్నాచ్‌లో 80+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి రజత పతకాన్ని దక్కించుకుంది.