Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 6 క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో మనికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అసమాన విజయాలతో సెమీస్ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే.
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. ఆసియా కప్‌లో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
Published Sun, Nov 20 2022 10:47 AM | Last Updated on Sun, Nov 20 2022 10:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment