Manika Batra
-
మనిక బత్రాకు నిరాశ
వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్స్ ఫ్రాంక్ఫర్ట్ టోర్నీలో భారత స్టార్ మనిక బత్రా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. జర్మనీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ్రçపపంచ 26వ ర్యాంకర్ మనిక 6–11, 11–13, 6–11తో పదో ర్యాంకర్ షిన్ యుబిన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మనిక తన సర్వీస్‌లో 14 పాయింట్లు్ల గెల్చుకుంది. మనికకు 4,250 డాలర్ల (రూ. 3 లక్షల 57 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా టేబుల్‌టెన్నిస్ ప్లేయర్ మనిక బత్రా ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజకు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ఫ్రాన్స్‌లోని మాంట్పిలియెర్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో మనిక తనకన్నా ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న రొమేనియా స్టార్ బెర్నాడెట్ సాక్స్‌కు షాకిచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక 3–1 (11–9, 6–11, 13–11, 11–9)తో టోర్నీ ఎనిమిదో సీడ్ ప్రపంచ 14వ ర్యాంకర్ బెర్నాడెట్‌ను కంగుతినిపించింది. ఇద్దరు చెరో గేమ్ గెలిచి పోటాపోటీగా దూసుకెళ్తున్న తరుణంలో మూడో గేమ్‌లో మనిక పోరాటపటిమ మ్యాచ్‌లో గెలిచేందుకు దోహదం చేసింది. రెండు గేమ్ పాయింట్లను కాపాడుకున్న ఆమె ప్రత్యర్థిని ఓడించి 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో గేమ్‌లోనూ ఇదే ఆటతీరును కొనసాగించి మ్యాచ్‌లో గెలిచింది. మెరుగైన రొమేనియన్ క్రీడాకారిణిని 29 నిమిషాల్లోనే ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ పోటీల్లో 5–5తో సమంగా నిలువగా తాజా విజయంతో భారత ప్లేయర్ 6–5తో పైచేయి సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత స్టార్ 3–2తో బెర్నాడెట్ సాక్స్‌ను ఓడించింది. తొలి రౌండ్ పోరులో శ్రీజ 2–3 (11–6, 7–11, 1–11, 11–8, 8–11)తో ప్రపంచ 13వ ర్యాంకర్ అడ్రియాన డియాజ్ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో మనిక.. చైనాకు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ క్వియన్తో తలపడనుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3–0తో చైనాకే చెందిన టాప్‌సీడ్ వాంగ్ యిదిని ఓడించింది. -
భారత టీటీ జట్ల కెప్టెన్లుగా మనిక, శరత్ కమల్
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లు ఖరారయ్యాయి. పురుషుల జట్టుకు వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్, మహిళల జట్టుకు సీనియర్ మనిక బత్రా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ కజకిస్తాన్ రాజధాని అస్తానాలో వచ్చే నెల 7 నుంచి 13 వరకు జరుగుతుంది. ఇది ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడ్డ 42 ఏళ్ల శరత్ సహా అనుభవజ్ఞులైన హర్మీత్ దేశాయ్, సత్యన్ తదితరులతో భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.ఇక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాక విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ స్టార్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ ఈ టోర్నీతో మళ్లీ బరిలోకి దిగనునంది. ప్రస్తుతం జరుగుతున్న అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో శ్రీజ పాల్గొనడం లేదు. జట్ల వివరాలు మహిళల జట్టు: మనిక బత్రా (కెప్టెన్), ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ, దియా చిటాలే, సుతీర్థ ముఖర్జీ, రిజర్వ్ ప్లేయర్లు: యశస్విని, పాయ్‌మంటీ బైస్య. ఫురుషుల జట్టు: శరత్ కమల్ (కెప్టెన్), మానవ్ ఠక్కర్, హర్మీత్ దేశాయ్, సత్యన్, మనుశ్ షా, రిజర్వ్ ప్లేయర్లు: స్నేహిత్, జీత్‌చంద్ర. -
UTT 2024: టీటీ లీగ్‌కు వేళాయె... బరిలో 8 జట్లు
గత నాలుగు సీజన్లుగా భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లకు చక్కని అవకాశాలు కల్పిస్తున్న అల్ట్మేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఫ్రాంచైజీ లీగ్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో యూటీటీ ఐదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్‌తో పాటు మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు లీగ్ దశ పోటీలు జరుగుతాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్ల మధ్య 5, 6 తేదీల్లో సెమీఫైనల్స్... 7న జరిగే ఫైనల్స్‌తో ఐదో సీజన్ ముగుస్తుంది. ప్రతి రోజూ రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే మ్యాచ్‌లను స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సత్తాచాటి మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన తెలంగాణ ప్లేయర్ ఆకుల శ్రీజ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే పురుషుల కేటగిరీలో హైదరాబాదీ ఆటగాడు సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ సీజన్లో రాణించడం ద్వారా అందరి దృష్టిలో పడేందుకు అతను ఉవ్విళ్లూరుతున్నాడు.భారత స్టార్ మహిళా ప్లేయర్ మనిక బత్రా బెంగళూరు స్మాషర్స్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైంది. శ్రీజతో పాటు మనిక కూడా పారిస్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌దాకా పోరాడింది. యూటీటీ టోర్నీ సందర్భంగా 29 ఏళ్ల మనిక మాట్లాడుతూ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు ఈ ఫ్రాంచైజీ లీగ్ ఎంతగానో దోహదం చేసిందని చెప్పుకొచ్చింది. ‘వ్యక్తిగతంగా నేను రాణించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడింది. విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడటం ద్వారా మెలకువలు నేర్చుకునేందుకు, దీటుగా పోరాడేందుకు యూటీటీ దోహదం చేసింది. ఈ టోర్నీని ప్లేయర్లంతా ఆస్వాదిస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళల సింగిల్స్‌లో పురోగతికి యూటీటీ కూడా ఒక కారణం. అంతర్జాతీయంగా మన క్రీడాకారిణులు సాధిస్తున్న విజయాలు యూటీటీ చలవే’ అని మనిక తెలిపింది. నిరుటి రన్నరప్ చెన్నై లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట శరత్ కమల్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లు రాటుదేలేందుకు యూటీటీ చక్కని వేదికని అన్నాడు.దీనివల్లే మన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే కాదు... ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాయని చెప్పాడు. మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్, టీమ్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరడం గొప్ప మైలురాయని శరత్ తెలిపాడు.ఈ టోర్నీలో ఆడటాన్ని అమితంగా ఇష్టపడతానని పేర్కొన్నాడు. పారిస్ మెగా ఈవెంట్లో శరత్‌కు ఊహించని విధంగా తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడిన 42 ఏళ్ల శరత్ రిటైర్మెంట్ అనంతరం అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లే యోచనలో ఉన్నాడు. దీనిపై భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్యతో పాటు, తన కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. బరిలో ఉన్న జట్లుఅహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్ టీటీ, యూ ముంబా టీటీ. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్‌ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
మనిక మెరిసె
పారిస్: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల టీమ్ ఈవెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో రొమేనియా జట్టును బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–అర్చనా కామత్ జోడీ 11–9, 12–10, 11–7తో అదీనా దియకోను–ఎలిజబెటా సమారా (రొమేనియా) జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మనిక 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్టె జాక్స్‌పై గెలిచింది. దాంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమారా చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో అర్చన 5–11, 11–8, 7–11, 9–11తో బెర్నాడెట్టె జాక్స్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మనిక 11–5, 11–9, 11–8తో అదీనా దియకోనుపై గెలిచి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించింది. నేడు అమెరికా, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఆడతుంది. -
Olympics 2024: సరికొత్త చరిత్ర.. క్వార్టర్ ఫైనల్లో భారత్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపె ట్టడం ఇదే తొలిసారి.MANIKA BATRA - The Clutch moment in Table Tennis for India. 🥶 pic.twitter.com/dN3XApe98K— Johns. (@CricCrazyJohns) August 5, 2024ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు గేమ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్‌లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్‌ను లెవెల్ (2-2) చేశారు. చివరి గేమ్‌లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్ఏ, జర్మనీ మధ్య మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాతి రౌండ్లో వీరు ఓడిపోయారు. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారత టీటీ ప్లేయర్‌గా (ఫోటోలు)
-
Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మనిక బత్రా
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు ఆఖర్లో భారత్‌కు ఊరట కలిగించే విజయం దక్కింది. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో మనిక బత్రా విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రితిక పవడేపై మనిక 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో గెలుపొంది, రౌండ్ ఆఫ్ 16కు చేరింది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై అయిన తొలి భారత పాడ్లర్‌గా మనిక చరిత్ర సృష్టించింది. రౌండ్ ఆఫ్ 16లో మనిక హాంగ్‌కాంగ్ చైనాకు చెందిన ఝూ చెంగ్ఝూ లేదా జపాన్‌కు చెందిన మియు హిరానోతో తలపడతుంది.HISTORIC MOMENT. 🔥Manika Batra becomes the first Indian Table Tennis player to qualify into R-16 in Olympics history...!!! 👌 pic.twitter.com/Aez0cYRavR— Johns. (@CricCrazyJohns) July 30, 2024కాగా, ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్య సేన్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత్ కాంస్య పతక రేసులో నిలిచింది. మనూ-సరబ్జోత్ కాంస్య పతకం మ్యాచ్ ఇవాళ (జులై 30) మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగనుంది. -
టీటీలో మేటి మనికా..
ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కూల్ దాటి కాలేజ్‌లోకి వచ్చిన తర్వాతా అదే కొనసాగింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం. కానీ టేబుల్ టెన్నిస్ కోసం అర్ధాంతరంగా చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టీనేజ్లోనే పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం ఆమెను సంప్రదించాయి. కానీ టేబుల్ టెన్నిస్ కోసం వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఎందుకంటే ఆమె ధ్యాసంతా ఆటపైనే కాబట్టి! ఒక క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె అన్నింటినీ పక్కన పెట్టింది. కఠిన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఆటలోనే పైకి ఎదిగింది. ఆరంభ అవరోధాలను దాటి కామన్వెల్త్ పతకాల విజేతగా, ఒలింపియన్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో తన పేరు లిఖించుకున్న ఆ ప్యాడ్లరే మనికా బత్రా.29 ఏళ్ల మనికా ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. గత రెండు సందర్భాల్లో తనకు దక్కకుండా పోయిన పతకాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.దాదాపు రెండున్నరేళ్ల క్రితం మనికా బత్రా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా గతంలో ఒలింపిక్స్ ఆడిన భారత ఆటగాళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరచి మూడో రౌండ్ వరకు చేరింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆమెకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ్యాచ్‌లు జరిగే సమయంలో కోర్టు పక్కనుంచి భారత జట్టు కోచ్ సౌమ్యదీప్ రాయ్ సూచనలను తీసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేను అక్కడికి వచ్చేందుకు అధికారులు అంగీకరించకపోగా.. కోచ్ లేకపోయినా ఫర్వాలేదని, అలాగే ఆడతానని ఆమె చెప్పేసింది.అర్జున అవార్డ్ అందుకుంటూ..ఇది టీటీఎఫ్‌ఐకి ఆగ్రహం తెప్పించింది. అందుకే మనికాపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. దాంతో మనికా కోర్టు మెట్లెక్కింది. అంతటితో ఆగిపోకుండా తన నిరసనకు కారణాన్ని కూడా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా సౌమ్యదీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుతీర్థ ముఖర్జీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తనను మ్యాచ్ ఓడిపొమ్మని చెప్పాడంటూ బయటపెట్టింది. షోకాజ్ నోటీసుతో తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది.చివరకు కోర్టు మనికా ఆవేదనను అర్థంచేసుకుంది. టీటీఎఫ్ఐలో పూర్తి ప్రక్షాళన కార్యక్రమం జరిగి అధికారులు మారాల్సి వచ్చింది. సాధారణంగా అగ్రశ్రేణి ప్లేయర్లు ఏ ఆటలోనైనా జాతీయ సమాఖ్యతో గొడవకు దిగరు. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే, రాజీ మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కెరీర్లో అగ్రస్థానానికి ఎదుగుతున్న దశలో ఒక 27 ఏళ్ల ప్లేయర్ అధికారులతో తలపడింది. ఇది టీటీ కోర్టు బయట ఆమె పోరాటానికి, ధైర్యానికి సంకేతం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు మాత్రమే కాదు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తాను నిలబడగలననే ధైర్యాన్ని ఆమె చూపించింది.కుటుంబసభ్యుల అండతో..ఢిల్లీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మనికా. ముగ్గురు సంతానంలో ఆమె చిన్నది. అన్న సాహిల్, అక్క ఆంచల్ టేబుల్ టెన్నిస్ ఆడటం చూసి నాలుగేళ్ల వయసులో తాను కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. చాలామంది ప్లేయర్ల తరహాలోనే ఒకరిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటే ఇతర కుటుంబసభ్యులు వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడపడం, తాము తెర వెనక్కి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే. మనికా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది.తల్లి సుష్మతో..ఆమె ఆటను మొదలుపెట్టినప్పుడు అందరిలాగే సరదాగా ఆడి ముగిస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో దానికి మించి అపార ప్రజ్ఞ ఉన్నట్లు కోచ్‌లు చెప్పడంతోనే కుటుంబ సభ్యులకు అర్థమైంది. ఆ తర్వాత మనికా విషయంలో మరో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. అక్క ఆంచల్ కూడా ఆటపై తనకున్న పరిజ్ఞానంతో చెల్లికి మెంటార్‌గా మారి నడిపించింది. రాష్ట్రస్థాయి అండర్–8 టోర్నీ మ్యాచ్‌లో ఆ చిన్నారి ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా తన మార్గనిర్దేశనంతో శిక్షణకు తీసుకోవడంతో ఆటలో మనికా ప్రస్థానం మొదలైంది.అగ్రస్థానానికి చేరి..‘బ్యాడ్మింటన్‌లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు భారత ఆటగాళ్లు అంతంత మాత్రమే ప్రదర్శన కనబరచారు. కానీ సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో దాని స్థాయిని పెంచారు. మన దేశంలో బ్యాడ్మింటన్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నేనూ అదే చేయాలనుకుంటున్నా. టీటీకి చిరునామాగా మారి మన దేశంలో ఆటకు ఆదరణ పెంచాలనేదే నా లక్ష్యం’ అని మనికా చెప్పింది.నిజంగానే భారత టీటీకి సంబంధించి ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. మరో మహిళా ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. శాఫ్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీల్లో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా 24వ స్థానానికి చేరుకొని ఆమె భారత్ తరఫున కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెకు ముందు ఎవరూ కూడా మహిళల సింగిల్స్‌లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించలేదు.2018, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్‌తో.., 2018, ఐఐటీఎఫ్ ‘ద బ్రేక్‌త్రూ స్టార్’ అవార్డ్‌తో..పతకాల జోరు..అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో మనికా అత్యుత్తమ ప్రదర్శన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కనబడింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేర్వేరు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణం గెలుచుకున్న ఆమె.. మహిళల డబుల్స్‌లో రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం అందుకుంది.అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. డబ్ల్యూటీటీ టోర్నీల్లోనైతే ఆమె ఖాతాలో పలు సంచలన విజయాలు నమోదయ్యాయి. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2, మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)పై సాధించిన గెలుపు వాటిలో అత్యుత్తమైంది.మూడో ప్రయత్నంలో..మనికా బత్రా తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఆమె ఘనతలకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అర్జున, ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఒకప్పుడు మోడలింగ్ వద్దనుకున్న ఆమె ఇప్పుడు టీటీలో స్టార్‌గా ఎదిగిన తర్వాత అలాంటివాటిలో చురుగ్గా భాగమైంది. ప్రఖ్యాత మేగజీన్ ‘వోగ్’ తమ కవర్‌పేజీలో మనికాకు చోటు కల్పించి అటు గేమ్ ప్లస్ ఇటు గ్లామర్ కలబోసిన ప్లేయర్ అంటూ కథనాలు ప్రచురించింది.ఇతర ఫొటోషూట్ల సంగతి సరేసరి. కెరీర్లో ఎన్నో సాధించిన ఆమె ది బెస్ట్ కోసం చివరి ప్రయత్నం చేస్తోంది. 21 ఏళ్ల వయసులో తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మనికా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకుండా అనుభవం మాత్రమే సాధించి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతో మూడో రౌండ్‌కి చేరింది. ఇప్పుడు మరింత పదునెక్కిన ఆటతో చెలరేగితే పారిస్ ఒలింపిక్స్‌లో పతకం దక్కవచ్చు. ఈ లక్ష్యాన్ని మనికా అందుకోవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్ టీటీ ప్లేయర్!(ఫొటోలు)
-
Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి
Paris Olympics 2024- న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్ టెన్నిస్ సంఘం (టీటీఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. మే 16న అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నుంచి టాప్–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. తొలిసారి టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. పురుషుల, మహిళల టీమ్ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా... ఈ ముగ్గురిలో టాప్–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్ ప్లేయర్‌ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న ఆచంట శరత్ కమల్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పాల్గోనుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్). భారత పురుషుల జట్టు: శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, సత్యన్ జ్ఞానశేఖరన్ (రిజర్వ్). మనిక పరాజయం కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన కృత్విక రాయ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో కృత్విక 12–10, 11–4, 11–7తో వెరోనికా (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సానిల్ శెట్టి–హరీ్మత్ దేశాయ్ (భారత్) ద్వయం 8–11, 11–6, 6–11, 6–11తో ఎస్టెబన్ డోర్–ఫ్లోరియన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పోమంతి బైస్యా–కృత్విక రాయ్ (భారత్) జంట 11–7, 11–1, 14–12తో ఫ్రాన్జిస్కా (జర్మనీ)–యశస్విని (భారత్) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. -
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన మనిక!
కపాడోసియా (టర్కీ): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా మూడో రౌండ్లోకి చేరింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక బుధవారం జరిగిన రెండో రౌండ్లో 11–9, 6–11, 11–8, 9–11, 11–5తో వాంగ్ జిజు (చైనీస్ తైపీ)పై గెలిచింది.భారత్‌కే చెందిన కృత్విక, యశస్విని, స్వస్తిక కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కృత్విక 11–9, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్ (ఫ్రాన్స్)పై, యశస్విని 11–9, 11–7, 8– 11, 11–4తో సిమే కులాక్సెకెన్ (టర్కీ)పై, స్వస్తిక 11–5, 11–5, 11–9తో గరీమా గోయల్ (భారత్) పై విజయం సాధించారు.ఇవి చదవండి: Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన -
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్‌లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్‌కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్‌లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్‌లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్‌లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్‌లో, సత్యన్ 68వ ర్యాంక్‌లో ఉన్నారు -
క్వార్టర్ ఫైనల్లో మనిక ఓటమి
సౌదీ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ మనిక బత్రా పోరాటం ముగిసింది. బుధవారం జెద్దాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మనిక 11–7, 6–11, 4–11, 11–13, 2–11తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో ఓడిపోయింది. మనిక బత్రాకు 17,000 డాలర్ల (రూ. 14 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
గ్రూప్ దశలోనే శ్రీజ, మనిక నిష్క్రమణ
మకావు: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి మహిళాక్రీడాకారిణులు మనిక బత్రా, ఆకుల శ్రీజలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. మొత్తం 48 మంది క్రీడాకారిణులను మొత్తం 16 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ముగ్గురికి చోటు క ల్పించారు. 16 గ్రూప్‌ల్లో టాపర్‌గా నిలిచిన వారు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గ్రూప్–2లో ఢిల్లీ అమ్మాయి మనిక, గ్రూప్–4లో తెలంగాణ ప్లేయర్ శ్రీజ రెండో స్థానంలో నిలిచారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ మనిక, ప్రపంచ 39వ ర్యాంకర్ శ్రీజ ఓడిపోయారు. బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లలో మనిక 6–11, 4–11, 9–11, 4–11తో ప్రపంచ రెండో ర్యాంకర్ మాన్యు వాంగ్ (చైనా) చేతిలో... శ్రీజ 4–11, 4–11, 15–13, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ మెంగ్ (చేతిలో) ఓటమి పాలయ్యారు. -
WTT Champions Tourney 2024: పోరాడి ఓడిన మనిక
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12–10, 9–11, 6–11, 11–8, 8–11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో కీలక తరుణంలో మనిక తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఓడిన మనిక బత్రాకు 3,500 డాలర్ల (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రెండో రౌండ్లో శరత్ కమల్.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైన మనిక
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
భారత్‌ను గెలిపించిన మనిక
బుసాన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టుకు తొలి విజయం లభించింది. హంగేరితో ఆదివారం జరిగిన గ్రూప్–1 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో గెలిచింది. భారత నంబర్‌వన్ మనిక బత్రా తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు భారత పురుషుల జట్టు గ్రూప్–3లో భాగంగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–3తో ఓడిపోయింది. -
Table Tennis Player Manika Batra Pics: ఆటలోనే కాదు అందంలోనూ తగ్గేదేలే..(ఫొటోలు)
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మనిక దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీఫైనల్‌కు, ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 82వ ర్యాంక్‌లో ఉంది. -
మనికాకు చేదు అనుభవం.. ఒక్క ట్వీట్‌తో తిరిగొచ్చేలా! థాంక్యూ సర్..
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపింది. తన బ్యాగేజ్‌ను ఇంటికి చేర్చేలా చొరవ తీసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. కాగా పెరూ టోర్నమెంట్లో ఆడిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనిక బత్రా డచ్ విమానయాన సంస్థకు చెందిన కేఎల్ఎమ్ ఎయిర్‌లైన్స్‌లో భారత్‌కు చేరుకుంది. అయితే ఈ విమానంలో తన విలువైన బ్యాగేజ్‌ను మరిచిపోయిన మనిక ఇక్కడికి వచ్చాక సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఆమె.. సాయం చేయాలని కోరుతూ జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేసింది. మనికా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్యాలయం.. ‘‘ఢిల్లీకి రానున్న విమానంలో బ్యాగేజీ ఉంది. రేపు ఉదయం 01:55 నిమిషాలకు కలెక్ట్ చేసుకోవచ్చు’’ అని బుధవారం ట్విటర్ వేదికగా మనికాకు రిప్లై ఇచ్చింది. కాగా డచ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన తాను బ్యాగేజీ పోగొట్టుకున్నానని మనిక మంగళవారం ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటూ మనికా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆమెకు ఊరట లభించింది. Thank you so much @JM_Scindia sir and his office for prompt action and helping me in getting my baggage. I have received it this morning. https://t.co/XBVeQIApXO — Manika Batra (@manikabatra_TT) August 9, 2023 -
ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను శుక్రవారం ప్రకటించారు. 10 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లకు ఆచంట శరత్ కమల్, మనిక బత్రా సారథ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్ జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కూడా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, మహారాష్ట్ర ప్లేయర్ సానిల్ షెట్టి రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్ సెపె్టంబర్ 3 నుంచి 10 వరకు దక్షిణ కొరియాలో... ఆసియా క్రీడల టీటీ ఈవెంట్ చైనాలోని హాంగ్జౌలో సెపె్టంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. భారత టీటీ జట్లు: పురుషుల టీమ్ విభాగం: ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుష్ షా. రిజర్వ్: ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్, సానిల్ శెట్టి. మహిళల టీమ్ విభాగం: మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియా చిటాలె. రిజర్వ్: అర్చన కామత్, రీత్ రిష్యా. పురుషుల డబుల్స్: శరత్ కమల్–సత్యన్; మానవ్–మనుష్. మహిళల డబుల్స్: సుతీర్థ–అహిక ముఖర్జీ; శ్రీజ–దియా. మిక్స్డ్ డబుల్స్: మనిక– సత్యన్; శ్రీజ–హర్మీత్ దేశాయ్. ఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌధరీ (భారత్) ద్వయం 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్‌టెడ్–మంచాయ సావంగ్కెవ్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సహజ 0–6, 6–1, 6–1తో లీ జాంగ్ సియో (కొరియా)పై విజయం సాధించింది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
PV Sindhu: సింధు శుభారంభం
కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21–16, 21–9తో తాలియా ఎన్జీ (కెనడా)పై విజయం సాధించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 12–21, 3–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. లక్ష్య సేన్ 21–18, 21–15తో రెండో సీడ్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించగా... సాయిప్రణీత్ 12–21, 17–21తో వైగోర్ కొల్హో (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. మనిక ముందంజ లుబ్లియానా (స్లొవేనియా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ లుబ్లియానా టోరీ్న లో భారత నంబర్‌వన్ మనిక బత్రా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక 11–4, 11–9, 11–7తో ప్రపంచ 15వ ర్యాంకర్ చెంగ్ ఐ చింగ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయింది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 9–11, 8–11, 11–9, 9–11తో భారత సంతతికి చెందిన ఫ్రాన్స్ క్రీడాకారిణి ప్రీతిక చేతిలో ఓడిపోయింది. -
World TT Championship: మనిక శుభారంభం
డర్బన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో మనిక 11–1, 11–3, 11–2, 11–5తో లిండా లోగ్రైబి (అల్జీరియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో శరత్ కమల్ 11–8, 9–11, 11–9, 11–6, 11–6తో డేవిడ్ సెర్డారోగ్లు (ఆస్ట్రియా)పై నెగ్గగా... సత్యన్ 11–9, 11–8, 7–11, 11–2, 13–15, 11–13, 11–6తో టామ్ జార్విస్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో శరత్ కమల్–సత్యన్ ద్వయం 11–6, 11–9, 11–6తో ఎల్బెలీ–షౌమన్ (ఈజిప్ట్) జోడీపై విజయం సాధించింది. -
ప్రపంచ టీటీలో శ్రీజ ముందంజ
World TT Championship: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రారంభమైన ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో శ్రీజ 4–1 (11–6, 11–9, 9–11, 11–4, 11–5) స్కోరుతో నికోల్ అర్లియా (ఇటలీ)ని ఓడించింది. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మనికా బాత్రా – అర్చనా కామత్ జోడి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి పోరులో మనిక – అర్చన ద్వయం 3–1 (10–12, 11–2, 11–9, 11–5) స్కోరుతో లిన్ యుషాన్ – క్వాన్ ఎమిలీ (అమెరికా)ను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో కూడా మనికా బాత్రా – సత్యన్ జ్ఞానశేఖరన్ జంట విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్లో మనిక – సత్యన్ 3–2 (9–11, 11–8, 14–16, 11–7, 11–6)తో గ్జియా లిన్ – ల్యూకా మ్లాడనోవిచ్ (లక్సెంబర్గ్)పై గెలుపొందింది. -
క్వార్టర్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్ చెన్–యిది వాంగ్ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
Singapore Smash 2023: క్వార్టర్ ఫైనల్లో మనిక జోడీ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగపూర్‌లో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక–సత్యన్ ద్వయం 11–7, 12–10, 9–11, 11–3తో జెంగ్ జియాన్–క్లారెన్స్ చ్యూ (సింగపూర్) జోడీపై గెలిచింది. మనిక–సత్యన్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన హరిమోతో–హినా హయాటా ద్వయంతో మనిక–సత్యన్ ఆడతారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక ఓటమి
గోవాలో జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు . 34వ ర్యాంకర్ మనిక బత్రా 6–11, 3–11, 11–9, 7–11తో 20వ ర్యాంకర్ కియాన్ తియాని (చైనా) చేతిలో... సుతీర్థ 5–11, 7–11, 5–11తో ఫు యు (పోర్చుగల్) చేతిలో ఓడిపోయారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక.. పడిపోయిన ఆకుల శ్రీజ ర్యాంకు
International Table Tennis Federation (ITTF) world rankings- న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌లో నిలిచింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల మనిక గత నవంబర్‌లో ఆసియా కప్‌లో కాంస్యం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతవారం దోహా డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో కాంస్యం గెలిచి 140 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ ఆరు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ 41వ ర్యాంక్‌లో, ఆచంట శరత్ కమల్ 46వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణకు చెందిన సూరావజ్జుల స్నేహిత్ మూడు స్థానాలు పడిపోయి 125వ ర్యాంక్‌లో నిలిచాడు. చదవండి: Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు శ్రీజ అర్హత
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు. దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్డ్ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందారు. ఇది కూడా చదవండి: బోపన్న, రామ్‌కుమార్ జోడీలు ఓటమి అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్‌కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..? -
Table Tennis: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో మనిక బత్రా.. ఆకుల శ్రీజ పురోగతి
Manika Batra: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మూడు స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకుంది. జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు స్థానాలు పురోగతి సాధించి 72వ ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ 136వ ర్యాంక్ లో ఉన్నాడు. సత్యన్ 39వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఇది కూడా చదవండి: రామ్‌కుమార్‌కు మిశ్రమ ఫలితాలు పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ 3–6, 7–5, 3–6తో ప్రపంచ 62వ ర్యాంకర్ పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. అయితే డబుల్స్ తొలి రౌండ్లో రామ్‌కుమార్–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ 7–6 (7/5), 6–7 (4/7), 11–9తో రోహన్ బోపన్న (భారత్)–జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) ద్వయంపై ‘సూపర్ టైబ్రేక్’లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 7–6 (7/1), 5–7, 7–10తో మూడో సీడ్ సాదియో దుంబియా–రిబూల్ (ఫ్రాన్స్) జంట చేతిలో... పురవ్ రాజా–దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 4–6, 3–6తో జీవన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ చేతిలో ఓడిపోయాయి. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
Manika Batra Won Bronze Medal At Asia Cup TT 2022: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 2 ప్లేయర్, జపాన్ క్రీడాకారిణి మిమా ఇటో చేతిలో ఓడిన మనిక.. శనివారమే జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 6 క్రీడాకారిణి, జపాన్‌కు చెందిన హిన హయటపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో గెలుపొంది రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో మనికా, హిన ఇద్దరూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడినప్పటికీ, విజయం మనికనే వరించింది. కాగా, మనిక బత్రా ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అసమాన విజయాలతో సెమీస్ వరకు దూసుకొచ్చిన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!
బ్యాంకాక్: ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ చెన్ సు యు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. -
మనిక బాత్రా సంచలనం
బ్యాంకాక్: ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియాన్ కప్‌లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఈ క్రీడలో ‘పవర్ హౌజ్’ అయిన చైనాకు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ జింగ్టాంగ్ను కంగు తినిపించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 44వ ర్యాంకర్ మనిక 4–3 (8–11, 11–9, 11–6, 11–6, 9–11, 8–11, 11–9)తో తనకన్నా ఎన్నో రెట్లు మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్ జింగ్టాంగ్ను ఇంటిదారి పట్టించింది. చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సర్వం సిద్దం -
ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలె, రీత్ టెనిసన్, స్వస్తిక ఘోష్‌లతో కూడిన భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన గ్రూప్–5 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–1తో ఈజిప్ట్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–6, 11–4, 11–1తో హనా గోడాపై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో మనిక 8–11, 11–6, 11–7, 2–11, 11–8తో దీనా మెష్రఫ్‌ను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో దియా 11–5, 10–12, 11–9, 9–11, 4–11తో యుస్రా హెల్మీ చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 11–8, 11–8, 9–11, 11–6తో దీనా మెష్రఫ్‌పై గెలుపొందడంతో భారత విజయం ఖరారైంది. నాలుగు జట్లున్న గ్రూప్–5లో భారత్ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, జర్మనీ ఆరు పాయింట్లతో టాపర్‌గా నిలిచాయి. -
‘కామన్వెల్త్’ టీటీ ప్రాబబుల్స్‌లో స్నేహిత్, శ్రీజ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లను ఎంపిక చేసేందుకు 16 మంది క్రీడాకారులతో కూడిన ప్రాథమిక జాబితాను ప్రకటించారు. ఈనెల 23 నుంచి 30 వరకు బెంగళూరులో జరిగే శిక్షణ శిబిరం తర్వాత తుది జట్లను ఎంపిక చేస్తారు. ప్రాబబుల్స్‌లో ప్రస్తుత జాతీయ మహిళల సింగిల్స్ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ... తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్‌లకు చోటు లభించింది. ఇప్పటివరకు ఐదు కామన్వెల్త్ గేమ్స్‌లో కలిపి భారత టీటీ క్రీడాకారులు మొత్తం ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు సాధించారు. -
మనిక జంటకు కాంస్యం.. సాయిప్రణీత్ శుభారంభం.. రెండో రౌండ్లో సౌజన్య
న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీలో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జంట కాంస్య పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 8–11, 6–11, 7–11తో చెంగ్ ఐ చింగ్–లియు జున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో మనిక–అర్చన తమ సర్వీస్‌లో ఏకంగా 16 పాయింట్లు కోల్పోయారు. ఇతర క్రీడాంశాలు.. సాయిప్రణీత్ శుభారంభం పారిస్: ఓర్లియన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన అతను బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 21–19, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో కెయుర మోపాటి (భారత్) 21–16, 7–21, 15–21తో వెన్ జు జాంగ్ (కెనడా) చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండో రౌండ్లో సౌజన్య కాన్బెర్రా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సౌజన్య బవిశెట్టి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. జో హైవ్స్ (ఆస్ట్రేలియా)తో జరిగిన తొలి రౌండ్లో సౌజన్య తొలి సెట్‌ను 2–6తో కోల్పోయి, రెండో సెట్‌ను 6–4 తో గెల్చుకుంది. మూడో సెట్లో సౌజన్య 1–0 తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగింది. చదవండి: IPL 2022- RCB Vs KKR: బెంగ తీర్చిన హసరంగ -
మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: క్రీడా సమాఖ్యలు క్రీడాకారులను అనవసరంగా వేధించడం ఆపాలని ఢిల్లీ హైకోర్డు ఆదేశించింది. స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వాలని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)ను ఆదేశించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆడకుండా ఉద్దేశపూర్వకంగానే తనను జట్టు నుంచి తప్పించారని, కోచ్ సౌమ్యదీప్ రాయ్ తన శిష్యురాలికి ఒలింపిక్ బెర్త్ కోసం తనను మ్యాచ్‌లో ఓడిపోవాలని ఒత్తిడి చేశారని మనిక గత నెలలో హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు జస్టిస్ రేఖ పల్లి ప్లేయర్ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా క్రీడా శాఖను ఆదేశించగా... సీల్డు కవర్లో నివేదికను కోర్టుకు సమరి్పంచింది. ఇందులో ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తేలడంతో ఢిల్లీ హైకోర్టు సోమ వారం విచారణ సందర్భంగా టీటీఎఫ్ఐపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సమాఖ్య తీరుపట్ల నిరాశ చెందాను. కారణం లేకుండానే ఒక క్రీడాకారిణిని వివాదాల్లోకి లాగు తున్నారు. ఇది సమంజసం కాదు. క్రీడాశాఖ నివేదిక చదివాను. ఆమెకు జారీచేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోండి. క్లీన్చిట్ ఇచ్చి భారత జట్టుకు ఎంపిక చేయండి’ అని ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. -
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మనిక, అర్చన జోడీ
లాస్కో (స్లొవేనియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ టోర్నమెంట్లో భారత్‌కు చెందిన మనిక బత్రా–అర్చన కామత్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మనిక–అర్చన ద్వయం 11–6, 8–11, 11–6, 5–11, 11–8తో లియు వెషన్–యిది వాంగ్ (చైనా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మెలానీ–అద్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) జంటతో మనిక–అర్చన జోడీ తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో మనిక 2–4తో యిది వాంగ్ చేతిలో ఓడి కాంస్య పతకం సాధించింది. చదవండి: T20 World Cup 2021: దురదృష్టం అంటే ఇదే..! మ్యాచ్ గెలిచినా సఫారీ జట్టు ఇంటికి.. ఎందుకంటే? -
కోచ్ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు!
Manika Batra: టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీల్లో తనను కావాలనే ఓడిపోమన్నాడంటూ భారత కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు చేసిన టీటీ ప్లేయర్ మనికా బాత్రా చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఈ వివాదంపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై సమావేశం నిర్వహించిన ఐటీటీఎఫ్, మనికాపై చర్యలు తీసుకోవచ్చు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే -
సంచలన ఆరోపణలు.. ఢిల్లీ హైకోర్టులో మనిక బత్రాకు భారీ ఊరట
న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఎంపిక నిర్ణయంపై గురువారం స్టే విధించింది. జాతీయ శిబిరంలో పాల్గొన్న వారినే ఎంపిక చేయాలనే నిబంధనకు ఈ స్టే వర్తిస్తుంది. అంటే ఇకపై అంతర్జాతీయ టోర్నీలకు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. జాతీయ శిబిరానికి హాజరు, గైర్హాజరుతో సంబంధం ఉండదు. అలాగే మనిక చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కూడా కోర్టు కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది. కాగా ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా సుతీర్థ ముఖర్జీ కోసం జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ తనను ఓడిపోవాలని సూచించారని మనిక ఆరోపించింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై గురువారం విచారించిన జస్టిస్ రేఖ పల్లి టీటీఎఫ్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సమాఖ్యకు నోటీసు జారీ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేస్తానని అన్నారు. ఓ మేటి క్రీడాకారిణి ఆరోపణలపై తదుపరి చర్యలు చేపట్టకుండానే జాతీయ శిబిరంలో తప్పనిసరిగా పాల్గొంటేనే ఎంపిక చేస్తామని ఎలా అంటారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది క్రీడాశాఖ విచారణ చేపడుతుందని కోర్టుకు విన్నవించారు. చదవండి: Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం -
మనిక బాత్రాకు షాకిచ్చిన టీటీఎఫ్ఐ
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) స్టార్ ప్లేయర్ మనిక బాత్రాకు ఊహించని షాకిచ్చింది. భారత జట్టు నుంచి తప్పించింది. దోహాలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అమెను ఎంపిక చేయలేదు. సోనెపట్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి గైర్హాజరు కావడం వల్లే ఆమెపై వేటు వేసినట్లు టీటీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. 56వ ప్రపంచ ర్యాంకర్ మనికను తప్పించడంతో 97వ ర్యాంకర్ సుతీర్థ ముఖర్జీ మహిళల జట్టును నడిపించనుంది. ఈ జట్టులో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ (131వ ర్యాంకు), అర్చన కామత్ (132వ ర్యాంకు) ఉన్నారు. పురుషుల జట్టులో వెటరన్ శరత్ కమల్ (33వ రాం్యకర్), సత్యన్ (38), హరీ్మత్ దేశాయ్ (72), మానవ్ ఠక్కర్ (134), సానిల్ శెట్టి (247) ఎంపికయ్యారు. -
కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్‌లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్‌పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్ -
మనిక–సత్యన్ జోడీకి టైటిల్
బుడాపెస్ట్ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై గెలుపొందింది. సింగిల్స్ సెమీస్‌లో అవుట్ మిక్స్డ్ డబుల్స్‌లో విజయవంతమైన మనిక సింగిల్స్‌లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్ అబ్రామియెన్ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్ చేతిలో అది కూడా ఒక్క గేమ్ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో సత్యన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
క్రమశిక్షణ ఉల్లంఘన చర్య; భారత ప్లేయర్‌కు షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్ సలహాలు తీసుకునేందుకు నిరాకరించిన భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ క్రీడాకారిణి మనిక బత్రాకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) సిద్ధమైంది. మనిక వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేకు ఒలింపిక్స్‌లో పోటీలు జరిగే ప్రదేశంలో ప్రవేశించడానికి అవసరమైన అక్రిడేషన్ కార్డు లేకపోవడంతో మనిక ఆడే మ్యాచ్‌లకు అతడు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో సౌమ్యదీప్ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినా... మనిక పట్టించుకోలేదు. ఈ విషయం గురించి టీటీఎఫ్ఐ కార్యదర్శి అరుణ్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘టోక్యోలో జరిగింది దురదృష్టకరం. క్రమశిక్షణా ఉల్లంఘన చర్య. మనికా తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేతో అక్కడికి వెళ్లారు. కానీ ఆయన అక్రిడేషన్ కార్టుతో పోటీలు జరిగే చోట ప్రవేశించలేరు. దీంతో పరాంజపే కార్డు అప్‌గ్రేడ్ చేయాలని మనికా డిమాండ్ చేసింది. కానీ నిబంధనల ప్రకారం అది కుదరలేదు. సౌమ్యదీప్ సలహాలు తీసుకోమని చెప్పగా.. సుతిర్థా ముఖర్జీకి ఆయన ఒకప్పుడు వ్యక్తిగత కోచ్‌గా ఉన్నారంటూ మనికా అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
టీటీ మూడో రౌండ్లో మనిక
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా మూడో రౌండ్‌కు చేరగా.. పురుషుల ఈవెంట్ నుంచి సత్యన్ నిష్క్రమించాడు. రెండో రౌండ్లో 62వ ర్యాంకర్ మనిక 4–11, 4–11, 11–7, 12–10, 8–11, 11–5, 11–7తో 32వ ర్యాంకర్ పెసొస్కా (ఉక్రెయిన్) పై గెలిచింది. తన వ్యక్తిగత కోచ్‌కు మైదానంలో అందుబాటులో ఉండే అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడంతో మనిక కోచ్ లేకుండానే ఆడుతోంది. జట్టు హెడ్ కోచ్ సౌమ్యదీప్ రాయ్ నుంచి ఆమె సలహాలు తీసుకోవడానికి నిరాకరించింది. పురుషుల రెండో రౌండ్లో సత్యన్ 7–11, 11–7, 11–4, 11–5, 9–11, 10–12, 6–11తో సియు హంగ్ లమ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. -
శరత్ కమల్–మనిక జంటకు క్లిష్టమైన ‘డ్రా’
టోక్యో ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ శరత్ కమల్–మనిక బత్రాకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. బుధవారం విడుదల చేసిన ‘డ్రా’లో భారత జంట తొలి రౌండ్లో మూడో సీడ్ లిన్ యున్–జు, చెంగ్ చింగ్ (చైనీస్ తైపీ) ద్వయంతో తలపడుతుంది. మార్చిలో ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రపంచ 8వ ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జీ జెనోన్ (దక్షిణ కొరియా)పై నెగ్గి శరత్ కమల్–మనిక జోడీ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. -
శరత్–మనిక జంట సంచలనం
దోహా: టోక్యో ఒలింపిక్స్ వేదికగా టేబుల్ టెన్నిస్ (టీటీ)లో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత ప్రాతినిధ్యం ఖరారైంది. శనివారం ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జంట ఆచంట శరత్ కమల్–మనిక బత్రా విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్‌ను దక్కించుకుంది. ఫైనల్లో శరత్ కమల్–మనిక జోడీ 8–11, 6–11, 11–5, 11–6, 13–11, 11–8తో టాప్ సీడ్, ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జియోన్ జిహీ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో తొలిసారి టీటీ క్రీడకు చోటు కల్పించారు. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి పురుషుల, మహిళల డబుల్స్ ఈవెంట్లను తొలగించి వాటి స్థానంలో టీమ్ ఈవెంట్‌కు స్థానం కల్పించారు. మూడు ఒలింపిక్స్ క్రీడల తర్వాత టీమ్ ఈవెంట్స్‌కు జతగా మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సత్యన్ జ్ఞానశేఖరన్, శరత్ కమల్... మహిళల సింగిల్స్‌లో సుతీర్థ ముఖర్జీ, మనిక బత్రా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ‘క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలుస్తామని ఊహించలేదు. ఫైనల్లో మనిక అద్భుతంగా ఆడింది. ఒలింపిక్స్‌లో మిక్స్డ్ ఈవెంట్లో 16 జోడీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో మేము మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకం ఖాయమవుతుంది. సింగిల్స్‌తో పోలిస్తే మిక్స్డ్ డబుల్స్‌లో మాకు పతకం గెలిచే అవకాశముంది’ అని శరత్ కమల్ వ్యాఖ్యానించాడు. -
ఖేల్ రత్నకు రోహిత్ శర్మ నామినేట్
ఢిల్లీ : క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతనితో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మక అవార్డుకు వీరిని నామినేట్ చేసినట్లు మంగళవారం పేర్కొంది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు క్రీడాకారులు నామినేట్ కావడం ఇది రెండవసారి. 2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. (చదవండి : ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ 11 2019 ఏడాదిలో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో రోహిత్ వన్డేల్లో ఏడు సెంచరీలతో మొత్తం 1490 రన్స్ చేశాడు. కాగా 2019 ఏడాది క్రికెట్లో అత్యున్నత ప్రదర్శనకు గానూ రోహిత్ శర్మను ప్రతిష్టాతక్మ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కమిటీలో సభ్యుడైన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఎషియన్ గేమ్స్‌లో బంగారు పతకాలు, 2019 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం సాధించి వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించారు. మరియప్పన్ తంగవేలు.. 2016లో రియో పారాఒలింపిక్స్‌లో టి42 హై జంప్ కేటగిరి విభాగంలో బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పాడు. టేబుల్ టెన్నిస్ సంచలనంగా పేరు పొందిన మనిక బాత్రా 2018 నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, ఏసియన్ గేమ్స్‌లో క్యాంస్య పతకం సాధించి తన సత్తాను చాటింది.(కోహ్లి.. అప్పుడే 12 ఏళ్లయిందా!) కాగా ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ కంటే ముందు ముగ్గురు మాత్రమే రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(1998), టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని(2007), ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(2018)లో ఎంపికయ్యారు. -
మనిక, సుతీర్థ ఓటమి
బుడాపెస్ట్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్ షిప్లో భారత స్టార్ ప్లేయర్ మనికా బత్రా పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 56వ ర్యాంకర్ మనిక 2–11, 8–11, 11–7, 7–11, 9–11తో ప్రపంచ 24వ ర్యాంకర్ చెన్ జు యు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గిన మనిక తొలి రౌండ్ మ్యాచ్‌లో 14–12, 11–5, 11–5, 11–8తో సెర్బియా క్రీడాకారిణి ఆండ్రియా టొడొరివిక్ను సునాయాసంగా ఓడించింది. భారత క్వాలిఫయర్, ప్రపంచ 502వ ర్యాంకర్ సుతీర్థ ముఖర్జీ 8–11, 17–15, 11–9, 5–11, 6–11, 11–8, 11–6తో ప్రపంచ 58వ ర్యాంకర్ సబైన్ వింటర్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే రెండో రౌండ్లో సుతీర్థ 11–4, 8–11, 11–7, 5–11, 3–11, 9–11తో అడ్రియానా దియాజ్ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అర్చన11–8, 11–8, 19–17, 8–11, 6–11, 7–11, 4–11తో దినా మెష్రెఫ్ (ఈజిప్ట్) చేతిలో, మధురికా 5–11, 11–9, 11–6, 8–11, 11–7, 13–11తో అమెలీ సొల్జా (ఆస్ట్రియా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ లో సత్యన్–అర్చన ద్వయం 11–9, 11–4, 11–8, 11–13, 11–9తో అల్వారో–గాలియా ద్వొరాక్ (స్పెయిన్) జోడీపై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. -
భారత టీటీ స్టార్ మనిక బత్రాకు అంతర్జాతీయ పురస్కారం
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ప్లేయర్ మనిక బత్రా ప్రతిష్టాత్మక ‘బ్రేక్‌థ్రూ టేబుల్ టెన్నిస్ స్టార్’ అవార్డు దక్కించుకుంది. ఈ పురస్కారం పొందిన తొలి భారత టీటీ ప్లేయర్ మనిక కావడం విశేషం. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఇంచియోన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మనికకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ‘ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఈ ఏడాది చాలా గొప్పగా గడిచింది’ అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత పసిడి పతకంతో పాటు టీమ్ విభాగంలో భారత మహిళల జట్టు స్వర్ణం గెలవడంలో మనిక కీలక పాత్ర పోషించింది. -
నజరానా కోసం నిరీక్షణ!
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం సాధించింది. ఇంతటి ఘనత సాధించి మూడు నెలలు దాటినా... సొంత రాష్ట్రం నుంచి ప్రొత్సాహక బహుమతికి ఇంకా నోచుకోలేకపోయింది. ప్రస్తుత ఢిల్లీ క్రీడా పాలసీ ప్రకారం స్వర్ణ, రజత, కాంస్యాలకు వరుసగా రూ. 14 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 6 లక్షలు నజరానా ఇస్తున్నారు. ఇది హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు ఇచ్చే నజరానా కంటే చాలా తక్కువ. అయితే కొత్త పాలసీ ప్రకారం మనికకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలకు వరుసగా రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నజరానా ఆలస్యంపై ఢిల్లీ ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్ (స్పోర్ట్స్) ధర్మేందర్ సింగ్ మాట్లాడుతూ ఫైల్‌ను కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు చెప్పారు. -
క్రీడాకారులకు ఎయిరిండియా క్షమాపణ
న్యూఢిల్లీ : నేషనల్ క్యారియర్ ఎయిరిండియా.. టెన్నిస్ ప్లేయర్లను వదిలేసి గాలిలోకి ఎగిరిపోయింది. టెన్నిస్ ప్లేయర్లను ఇలా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోనే వదిలిపోయిన ఘటనకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, తాము ఆటగాళ్లకు క్షమాపణ చెబుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి అన్నారు. తదుపరి అందుబాటులో ఉన్న విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఎయిరిండియా గొప్ప వారసత్వం కలిగి ఉందని, ఆటగాళ్లకు తాము ఎక్కువ గౌరవం కూడా ఇస్తామన్నారు. పలు పీఎన్ఆర్లలో మెల్బోర్న్ విమానాన్ని దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్ బుక్ చేసుకున్నారని, పొరపాటున వీరిలో కొంతమంది ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత విమానాలను ఏర్పాటు చేసేంతవరకు క్రీడాకారులకు ఎయిరిండియా హోటల్ సదుపాయం కూడా కల్పించినట్టు ఈ విమానయాన సంస్థ మరో ట్వీట్లో చెప్పింది. అసలేం జరిగిందంటే... ఎయిరిండియా విమానం నెంబర్. ఏఐ0308లో టిక్కెట్లను దేశీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ల టీమ్ బుక్ చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మనీకా బాత్రాతో పాటు ఏడుగురు ప్లేయర్లను ఎయిరిండియా విమానంలోకి అనుమతించలేదు. సీట్లన్నీ బుక్ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్.ఆర్. (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లు సరిపోలేదని ఎయిర్ ఎండియా విమానం నిరాకరించింది. ఈ విషయంపై మనీకా బాత్రా ట్విటర్ ద్వారా తన బాధను షేర్చేసుకున్నారు. క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాథోర్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ ట్వీట్ షేర్ చేశారు. దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్‌కు చెందిన మొత్తం 17 మంది క్రీడాకారులు, అధికారులు ఏఐ 0308 విమానంలో మెల్బోర్న్కు వెళ్లాల్సి ఉంది. మెల్బోర్న్లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్. (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాము ఎయిరిండియా కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత విమానమంతా ఓవర్‌బుక్ అయినట్టు తెలిసింది. కేవలం 10 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుందని కౌంటర్ వద్ద చెప్పారు. మిగతా ఏడుగురు క్రీడాకారులు ప్రయాణించడానికి వీలులేదు అనే సరికి, క్రీడాకారులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం అని చెప్పింది. సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ వెంటనే స్పందించారు. కొన్ని గంటల తర్వాత మరో విమానంలో వారిని మెల్బోర్న్కు పంపించేలా కృషిచేశారు. మిగతా క్రీడాకారులకు కూడా మెల్బోర్న్ వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ దొరకడంతో, మనీకా క్రీడా మంత్రికి, పీఎం ఆఫీసుకు, స్పోర్ట్స్ అథారిటీకి, నీలం కపూర్ మేడమ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నట్టు మరో ట్వీట్ చేశారు. -
కుమారస్వామికి మోదీ చాలెంజ్
న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌కు ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం తన ఫిట్నెస్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, 22 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మాణికా బాత్రా, ఐపీఎస్ అధికారులు ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారికి మోదీ అదే సవాలు విసిరారు. మోదీ చాలెంజ్‌ను బాత్రా స్వీకరించగా, కుమారస్వామి మాత్రం..తనకు కర్ణాటక ఫిట్నెస్, అభివృద్ధే ముఖ్యమని కాస్త వ్యంగ్యంగా స్పందించారు. ధ్యానం..యోగా..వాకింగ్.. తాను పోస్ట్ చేసిన 90 సెకన్ల నిడివి గల వీడియోలో మోదీ..ధ్యానం, యోగా, వాకింగ్ చేస్తున్నట్లు కనిపించింది. నలుపు రంగు జాగింగ్ దుస్తుల్లో ఆయన పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం) స్ఫురించేలా ఏర్పాటుచేసిన ఇరుకైన వృత్తాకార ట్రాక్‌పై తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచారు. శరీరాన్ని అటూఇటూ వంచుతూ కసరత్తులు చేశారు. బండరాయిపై కూర్చుని ధ్యానం చేశారు. ‘యోగాతో పాటు, పంచభూతాల స్ఫూర్తితో ఏర్పాటుచేసిన ట్రాక్‌పై నడుస్తాను. ప్రాణాయామ కసరత్తులు కూడా చేస్తా. ఇవి మనసు, శరీరాన్ని తాజాగా ఉంచటంతో పాటు కొత్త ఉత్సాహాన్నిస్తాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. కోహ్లి సవాల్ విసిరిన సుమారు మూడు వారాల తరువాత మోదీ ఈ వీడియోను విడుదల చేశారు. ఫిట్నెస్ ముఖ్యమే..కానీ: కుమారస్వామి మోదీ సవాలుపై కుమారస్వామి స్పందిస్తూ..‘ప్రధానమంత్రి గారు! నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు. మనందరికీ ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యమని నేను కూడా నమ్ముతాను. యోగా, ట్రెడ్మిల్లు నా రోజువారీ జీవితంలో భాగంగా ఉన్నాయి. కానీ నాకు అంతకన్నా కర్ణాటక ఫిట్నెస్, అభివృద్ధే ముఖ్యం. ఈ విషయంలో మీ మద్దతు కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. కుమారస్వామికి 2007, 2017లో రెండుసార్లు హృద్రోగ సంబంధ శస్త్రచికిత్సలు జరిగాయి. తన ఆరోగ్యంపై ఆందోళనతో తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులను కోరినట్లు కుమారస్వామి గతంలో ఓసారి వెల్లడించారు. మరోవైపు, మోదీ సవాలును స్వీకరించిన బాత్రా త్వరలోనే తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేస్తానని వెల్లడించింది. ‘నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు మోదీ గారికి కృతజ్ఞతలు. ఆయన సవాలును స్వీకరిస్తున్నా. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కేవలం క్రీడాకారులకే కాదు అందరికీ ముఖ్యమే’ అని ఆమె పేర్కొంది. ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో టీం, వ్యక్తిగత విభాగాల్లో పతకాలు సాధించిన బాత్రా దేశం దృష్టిని ఆకర్షించింది. -
నామినేట్ చేసినందుకు మోదీకి థ్యాంక్స్!
న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేను సైతం అంటూ తన ఫిట్నెస్ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోదీ ఫిట్నెస్ ఛాలెంజ్‌పై భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి తనకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను గుర్తించి ఫిట్నెస్ ఛాలెంజ్‌కు నామినేట్ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్ చరిత్రలో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మందిలో మోదీ ఒకరు: రాజ్యవర్థన్ రాథోడ్ తాను ప్రారంభించిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్నెస్ విడుదల చేయడంపై కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని తరచుగా యువత ఫిట్నెస్ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్నెస్ వీడియోలు షేర్ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం మంచిధోరణిలో వెళ్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని’ రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. -
కామన్వెల్త్ క్రీడా విజేతలకు ఘనస్వాగతం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెల్చుకుని వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభిస్తోంది. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్‌కి, బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. మనికా దేశం గర్వపడేలా చేసిందని, ఇలాగే మరిన్ని స్వర్ణ పతకాలు గెలవాలని క్రీడాభిమానులు కోరుకున్నారు. మనికా బత్రా మాట్లాడుతూ.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. కామన్వేల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, ఇలాగే మరిన్ని పతాకాలను భారత్‌కు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో భారతదేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించింది క్రీడాకారిణి మనికా బత్రా. సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మనికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్లతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో కామన్వెల్త్ చరిత్రలో భారతదేశానికి టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణపతకం తీసుకొచ్చిన మొదటి మహిళగా రికార్డులకెక్కింది. సెమీ ఫైనల్లో ఈమె వరల్డ్ నెంబర్ ఫోర్ మరియు ఒలింపిక్ మెడల్ గ్రహీతైన సింగపూర్ క్రీడాకారిణి తియాన్వై ఫెంగ్‌ను ఓడించడం విశేషం. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. భారత మెన్స్ అథ్లెట్లు 13 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 13 కాంస్యా పతకాలు సాధించారు. ఇక ఉమెన్స్ విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యా పతకాలు వచ్చాయి. మిక్స్ డ్ టీమ్ విభాగం లో ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
భారత్ ఖాతాలో మరో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. పదోరోజు ఆటలో భాగంగా భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. శనివారం ఒక్కరోజే భారత్ 7 స్వర్ణాలు కైవసం చేసుకుంది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మానికా బాత్రా సింగపూర్‌కు చెందిన మియింగ్యూ యుపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్‌లు స్వర్ణ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమి చెందడంతో రజతాలతో సరిపెట్టుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 55కు చేరగా.. అందులో 24 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
భారత్‌కు మరో రెండు రజతాలు, ఓ కాంస్యం
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. తొమ్మిదో రోజు పోటీల్లో మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్(టీటీ), పురుషుల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు దక్కగా.. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో ఓ కాంస్యం సొంతమైంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మనిక బాత్రా, మౌమా దాస్‌ల జోడి టియాన్వీ ఫెంగ్ ,మెంగువు యు( సింగఫూర్) ద్వయం చేతిలో పరాజయం పొందడంతో రజత పతకం సొంతమైంది. పురుషుల 75 కేజీల సెమీ ఫైనల్లో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ స్టీవెన్.. డానెల్లీ( ఇంగ్లండ్)పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. దాంతో కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుని తుది పోరుకు అర్హత సాధించాడు.. పురుషుల బాక్సింగ్ 69 కేజీల విభాగం సెమీ ఫైనల్లో మనోజ్‌కుమార్ ప్యాట్ మెక్‌కార్మాక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోవడంతో కాంస్యం చేజిక్కింది. ఇక అంతక ముందు పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ మౌసమ్ ఖత్రీ రజతం సాధించగా.. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత మహిళా షూటర్లు తేజస్విని సావంత్ స్వర్ణానికి గురి పెట్టగా, అంజుమ్ రెండు పాయింట్ల తేడాతో రజతం పతకం సొంతం చేసుకొంది. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించగా.. భారత మహిళా రెజ్లర్ పూజా ధండా ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 17 స్వర్ణం, 11 రజతం, 14 కాంస్యలతో 42 పతకాలు చేరాయి. సెమీస్‌లో ఓడిన పురుషుల హాకీ జట్టు ఇక భారత్ పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లె 2-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందింది. కాంస్య పతకం కోసం రెండో సెమీఫైనల్లో తలపడే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లలో ఓడిన జట్టుతో పోటీపడనుంది. ఇక మహిళల హాకీ జట్టు సైతం కాంస్యం కోసం ఇంగ్లండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. -
కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు మరో స్వర్ణం
గోల్డ్ కోస్ట్ : కామన్వెల్త్ క్రీడా గ్రామంలో నాలుగో రోజు భారత్ పంట పండింది. టేబుల్ టెన్నిస్(టీటీ)లో మానికా బత్రా అండ్ కో స్వర్ణం సాధించింది. టీమ్ ఈవెంట్లో భాగంగా ఆదివారం ఢిపెండింగ్ చాంపియన్ సింగపూర్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 3-1 తేడాతో విజయం సాధించి పసిడిని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ స్వర్ణం గెలుచుకోవడం ఇదే తొలిసారి. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా పతకాల సంఖ్య పన్నెండుకు చేరింది. మానికా బత్రా, మౌమా దాస్, మాధురికా పట్కార్, సుత్రితా ముఖర్జీ, పూజా సహస్రాబుదేలతో కూడిన భారత టీటీ జట్టు.. ఏలిన్, వాన్లింగ్ జింగ్, తియాన్వి,మెన్గ్యూ, యిహాన్ జోలతో కూడిన పటిష్టమైన సింగపూర్‌ను మట్టికరిపించింది. అండర్ డాగ్‌గా ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. అదే ఊపును తుది పోరులో కూడా కొనసాగించిన భారత్ ఏకంగా పసిడిని ఖాతాలో వేసుకుఉంది. దాంతో నాలుగో రోజు ఆటలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు దక్కాయి. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. -
‘రియో’కు సౌమ్యజిత్, మోనిక
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సౌమ్యజిత్ ఘోష్, మానికా బాత్రాలు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ ఇద్దరు తమ గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచారు. కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే బరిలోకి దిగిన ఈ టోర్నీలో ప్రతి గ్రూప్‌లో నలుగురు చొప్పున మ్యాచ్‌లు ఆడారు. -
భారత మహిళల జోరు
వరుసగా ఐదో విజయంతో ‘టాప్’ ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు విజయపరంపర కొనసాగుతోంది. రెండో డివిజన్ గ్రూప్ ‘జి’లో భారత్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో క్రొయేషియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మనిక బాత్రా 11-8, 12-10, 8-11, 11-6తో లియా రకోవాపై, రెండో సింగిల్స్‌లో మౌమా దాస్ 13-11, 9-11, 11-8, 11-2తో యువాన్ తియాన్‌పై, మూడో సింగిల్స్‌లో షామిని 14-12, 11-8, 7-11, 11-3తో ఇవానాపై నెగ్గారు. ఆరు జట్లు ఉన్న ఈ గ్రూప్‌లో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక భారత్ 25 నుంచి 28 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి డివిజన్లో ఉన్న జట్లు మాత్రం చాంపియన్‌షిప్ కోసం పోటీపడతాయి. మరోవైపు భారత పురుషుల జట్టు రెండో డివిజన్ గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో స్లొవేకియాపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్, రెండో సింగిల్స్‌లో శరత్ కమల్, మూడో సింగిల్స్‌లో హర్మీత్ దేశాయ్ 11-7, 11-6, 11-6తో అలెగ్జాండర్ వలూచ్‌పై గెలిచారు.