భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ధన్యవాదాలు తెలిపింది. తన బ్యాగేజ్‌ను ఇంటికి చేర్చేలా చొరవ తీసుకున్నందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. కాగా పెరూ టోర్నమెంట్‌లో ఆడిన భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనిక బత్రా డచ్ విమానయాన సంస్థకు చెందిన కేఎల్‌ఎమ్ ఎయిర్‌లైన్స్‌లో భారత్‌కు చేరుకుంది.
అయితే ఈ విమానంలో తన విలువైన బ్యాగేజ్‌ను మరిచిపోయిన మనిక ఇక్కడికి వచ్చాక సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఆమె.. సాయం చేయాలని కోరుతూ జ్యోతిరాదిత్య సింధియాకు ట్వీట్ చేసింది. మనికా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రి కార్యాలయం.. ‘‘ఢిల్లీకి రానున్న విమానంలో బ్యాగేజీ ఉంది. రేపు ఉదయం 01:55 నిమిషాలకు కలెక్ట్ చేసుకోవచ్చు’’ అని బుధవారం ట్విటర్ వేదికగా మనికాకు రిప్లై ఇచ్చింది.
కాగా డచ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన తాను బ్యాగేజీ పోగొట్టుకున్నానని మనిక మంగళవారం ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయిందంటూ మనికా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆమెకు ఊరట లభించింది.
Thank you so much @JM_Scindia sir and his office for prompt action and helping me in getting my baggage. I have received it this morning. https://t.co/XBVeQIApXO
— Manika Batra (@manikabatra_TT) August 9, 2023
Comments
Please login to add a commentAdd a comment