వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్స్ ఫ్రాంక్‌ఫర్ట్ టోర్నీలో భారత స్టార్ మనిక బత్రా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. జర్మనీలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ్రçపపంచ 26వ ర్యాంకర్ మనిక 6–11, 11–13, 6–11తో పదో ర్యాంకర్ షిన్ యుబిన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది.
22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మనిక తన సర్వీస్‌లో 14 పాయింట్లు్ల గెల్చుకుంది. మనికకు 4,250 డాలర్ల (రూ. 3 లక్షల 57 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment