పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపె ట్టడం ఇదే తొలిసారి.
MANIKA BATRA - The Clutch moment in Table Tennis for India. 🥶 pic.twitter.com/dN3XApe98K
— Johns. (@CricCrazyJohns) August 5, 2024
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు గేమ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్‌లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్‌ను లెవెల్ (2-2) చేశారు.
చివరి గేమ్‌లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్‌ఏ, జర్మనీ మధ్య మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాతి రౌండ్‌లో వీరు ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment