paris olympics
-
అరుదైన ఒలింపిక్ స్వర్ణానికి రూ.5 కోట్లు
బోస్టన్: అమెరికా గడ్డపై 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ నాటి బంగారు పతకం శుక్రవారం వేలంలో దాదాపు రూ.5 కోట్లు పలికింది! దానిపై ‘ఒలింపియాడ్, 1904’అని రాసుంది. ముందువైపు విజేత పుష్పగుచ్ఛం పట్టుకొని ఉండగా వెనకవైపు పురాతన గ్రీస్‌లో విజయానికి అధిదేవత నైక్, దేవతల రాజు జ్యూస్ ఉన్నారు.దీన్ని అమెరికన్ అథ్లెట్ ఫ్రెడ్షూల్కు ప్రదానం చేశారు. ఆ ఒలింపిక్స్‌లో అమెరికన్లు 96 ఈవెంట్లలో ఏకంగా 78 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నేటి ఒలింపిక్స్ వెండిపై బంగారు పూత పూసిన పతకాలిస్తున్నారు. అప్పట్లో మాత్రం అచ్చమైన బంగారంతో చేసిన పతకాలే ఇచ్చేవారు. ఇలాంటి పతకాలు వేలానికి రావడం అసాధారణమని వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్ పేర్కొంది.2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకంతో పాటు 1932, 1964, 1998 2012 ఒలింపిక్స్ పతకాలతో సహా వందలాది ఒలింపిక్ వస్తువులు వేలంలో అమ్మకానికి వచ్చాయి. ఒలింపిక్ స్మృతి చిహ్నాలకు ఎప్పటినుంచో మంచి ధర లభిస్తోంది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలెస్‌లో జరగనున్నాయి. ఈ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుండటం 1932, 1984 తరువాత ఇది మూడోసారి.ఇదీ చదవండి: రోమ్‌లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్ -
నలుగురు ‘ఖేల్ రత్న’లు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ‘ఖేల్ రత్న’ అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మెరిసిన మహిళా షూటర్ మనూ భాకర్... పిన్న వయసులో చెస్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్... 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితోపాటు మరో 32 మంది ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ దక్కింది. ఇందులో 17 మంది పారాథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. » స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా మనూ రికార్డు నెలకొల్పింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో హరియాణాకు చెందిన 22 ఏళ్ల మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనూ భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వచి్చనా... చివరకు ‘పారిస్’లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. » గత ఏడాది చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించిన గుకేశ్ ఆ తర్వాత సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (1991–1992లో) ‘ఖేల్ రత్న’ అవార్డు పొందనున్న రెండో చెస్ ప్లేయర్ గుకేశే కావడం విశేషం. » 2024 పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్ సింగ్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడుసార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. » పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. »‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల నగదు బహుమతి లభించనుంది. జ్యోతి, దీప్తిలకు ‘అర్జున’ ఆంధ్రప్రదేశ్ వర్ధమాన అథ్లెట్ జ్యోతి యర్రాజీ...తెలంగాణ పారాథ్లెట్ దీప్తి జివాంజిలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున అవార్డు’ లభించింది. వైజాగ్‌కు చెందిన 25 ఏళ్ల జ్యోతి పారిస్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజతాలు గెలిచింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టి20 కేటగిరీలో కాంస్యం... 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.అవార్డీల వివరాలు‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా–అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). అర్జున అవార్డు (రెగ్యులర్): జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), దీప్తి జివాంజి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ ఖిలారి, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మ, హొకాటో సీమ, సిమ్రన్, నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (లైఫ్‌టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ). ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్): మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో అనెలో కొలాకో (ఫుట్‌బాల్). -
పిస్టల్ వదిలి.. వయోలిన్ చేతబట్టి (ఫొటోలు)
-
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)
-
ఉగాండా మహిళా అథ్లెట్ విషాదాంతం
నైరోబి: తన భాగస్వామితో ఏర్పడిన స్థల వివాదం చివరకు ఉగాండా మహిళా ఒలింపియన్ అథ్లెట్ రెబెకా చెపె్టగె ప్రాణాలను తీసింది. గత నెలలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెబెకా మారథాన్ ఈవెంట్లో పాల్గొని 44వ స్థానంలో నిలిచింది.పలు అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలున్న ట్రాన్స్ ఎన్జొయా ప్రాంతంలో 33 ఏళ్ల రెబెకా స్థలం కొని ఇల్లు కట్టుకుంది. దీనిపై రెబెకా, ఆమె భాగస్వామి డిక్సన్ డియెమా మధ్య గత ఆదివారం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాతి రోజు సోమవారం డిక్సన్ తనవెంట గ్యాసోలిన్ (పెట్రోలియం ఉత్పాదన)ను క్యాన్‌లో తీసుకొచ్చి రెబెకాపై పోసి నిప్పంటించాడు. వెంటనే ఆమె శరీరమంతా మంటలు అంటుకోవడంతో పాటు డిక్సన్కూ కాలిన గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని కెన్యాలోని హాస్పిటల్లో చేర్పించగా గురువారం ఉదయం రెబెకా మృతి చెందింది. 30 శాతం కాలిన గాయాలున్న డిక్సన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీస్ కమాండర్ జెరెమా ఒలీ కొసిమ్ తెలిపారు. -
శెభాష్ ధరంబీర్.. భారత్ ఖాతాలో మరో గోల్డ్‌మెడల్
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్.. పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.తద్వారా పారాలింపిక్స్ చరిత్రలోనే క్లబ్ త్రో ఈవెంట్లో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా ధరంబీర్ నిలిచాడు. మరోవైపు ఇదే ఈవెంట్లో ప్రణవ్ సూర్మ రజతం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్రణవ్.. సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు సంఖ్య 24కు చేరింది. అందులో ఐదు బంగారు పతకాలు, 9 కాంస్య, 10 రజత పతకాలు ఉన్నాయి.చదవండి: ‘టోక్యో’ను దాటేసి... -
పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.మూడు రౌండ్లలో మనీష్ 234.9 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన జియోంగ్డు జో గోల్డ్‌మెడల్ సొంతం చేసుకోగా.. చైనా షూటర్ యాంగ్ చావో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.అంతకుముందు ఇవాళ(శుక్రవారం) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో మొత్తం 4 పతకాలు ఉన్నాయి. -
లీలా ప్యాలెస్‌లో మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం
చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్‌లో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్ రూమ్స్‌లో టవల్స్, పిల్లోస్, న్యాప్కిన్స్ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్ నిర్వహకులు. హోటల్ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. The Leela Palace Chennai welcomes Manu Bhaker, the Olympic Champion ! Just WoW pic.twitter.com/Dc2lhQpnE4— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2024హోటల్ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కాగా, మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లోని రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి దివ్యాంగుల విశ్వ క్రీడలు ప్రారంభం
పారిస్: యావత్ క్రీడా ప్రపంచాన్ని ఏకం చేసిన సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌కు తెరలేవనుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారిస్ క్రీడల్లో మహిళల విభాగాల్లో మరో 10 మెడల్ ఈవెంట్స్‌ను జోడించారు. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరం... ఇప్పుడు పారాలింపిక్స్‌ను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది. పోటీల తొలి రోజు తైక్వాండో, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, సైక్లింగ్ క్రీడాంశాల్లో మెడల్ ఈవెంట్స్ జరగనున్నాయి. సమ్మర్, వింటర్ పారాలింపిక్స్‌లో కలిపి ఇప్పటికే 7 స్వర్ణాలు సహా 17 పతకాలు నెగ్గిన అమెరికా మల్టీ స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఒక్సానా మాస్టర్స్ హ్యాండ్ సైక్లింగ్‌లో మరిన్ని పతకాలపై దృష్టి పెట్టగా.. పారాలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఈజిప్ట్ పారా పవర్‌లిఫ్టర్ షరీఫ్ ఉస్మాన్ నాలుగో పసిడి సాధించాలనే లక్ష్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నాడు.భారీ అంచనాలతో భారత్..మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు... ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పారిస్‌లో అడుగు పెట్టారు. ఈసారి భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.గత కొంతకాలంగా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ సుమిత్ అంటిల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు. చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్ శీతల్ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్‌పుటర్ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్ రోయింగ్ ప్లేయర్ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది. -
వినేశ్ ఫోగట్‌కు బంగారు పతకం
ఇటీవలి ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను రోహ్తక్లోని (హర్యానా) సర్వ్‌ఖాప్ పంచాయతీ బంగారు పతకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..Haryana Khap Panchayat gave gold medal to Vinesh Phogat. Can someone tell me what is India's ranking at Olympics after this medal? pic.twitter.com/h6EBOCXQrj— BALA (@erbmjha) August 25, 2024“మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. మహిళా రెజర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము” అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన ఖాప్ పెద్దలకు ఫోగట్ ధన్యవాదాలు తెలిపింది. ఖాప్ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో ఖాప్ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అంది.కాగా, వినేశ్ ఫోగట్ గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజేపీ సీనియర్ లీడర్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా హర్యానా రెజ్లర్లతో కలిసి పోరాటం చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు ముందు ఫోగట్ నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో ఆమె కనీసం రజత పతకాన్ని కూడా నోచుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం విషయంలో వినేశ్ సీఏఏస్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రూల్స్ రూల్సే అని సీఏఏస్ ఫోగట్ అభ్యర్థనను కొట్టిపారేసింది. -
భారత హాకీ జట్టకు ఘన సన్మానం.. అమిత్‌కు రూ. 4 కోట్ల నజరానా
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.బుధవారం భువనేశ్వర్‌లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.ఈ సందర్భంగా భారత సారథి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్‌కు వెళ్లాం. కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు. -
ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. టేబుల్ టెన్నిస్‌కు అర్చన కామత్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు ఆమె వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని కామత్ కోచ్ అన్షుల్ గార్గ్ ధ్రువీకరించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కామత్ తన కెరీర్ గురుంచి చర్చించినట్లు అన్షుల్ తెలిపాడు. "లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పతకం సాధించడం చాలా కష్టమైన పని నేను కమత్కు చెప్పాను. అందుకోసం తీవ్రంగా శ్రమించివలసి ఉంటుంది. ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు.అయితే గత రెండు నెలల్లో ఆమె చాలా మెరుగుపడింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆమె నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు. అయితే ఏ క్రీడలోనైనా అగ్రశ్రేణి ఆటగాళ్లకు సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. వారికి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది. కానీ యువ ఆటగాళ్లు పరిస్థితి వేరు. వారికి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎవరూ భరోశా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా వారు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కమత్ తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్షుల్ పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో కమత్ పతకం సాధించికపోయినప్పటకి తన పోరాటంతో అందరిని ఆకట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్‌లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే. -
Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్ తదితర వివరాలు
పారిస్‌లో విశ్వక్రీడలు ముగిసి రోజులు గడవక ముందే అదే చోట మరో మహాసంగ్రామం మొదలుకానుంది. ఆగస్ట్ 28 నుంచి పారిస్ వేదికగా 2024 పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్ తొలిసారి సమ్మర్ పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 8న జరిగే క్లోజింగ్ సెర్మనీతో ముగుస్తాయి.2021 టోక్యో పారాలింపిక్స్లా కాకుండా ఈసారి పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తారు. కరోనా కారణంగా గత పారాలింపిక్స్ జనాలు లేకుండా సాగాయి.ఈసారి పారాలింపిక్స్‌లో మొత్తం 22 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4400 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. భారత్ ఈసారి 84 సభ్యుల బృందాన్ని పారిస్‌కు పంపుతుంది.ఈసారి పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు రెగ్యులర్ ఒలింపిక్స్ తరహాలో స్టేడియం బయట జరుగనున్నాయి. పెరేడ్ సందర్భంగా అథ్లెట్లు పారిస్‌లోనే ఐకానిక్ ల్యాండ్‌మార్క్స్ చుట్టూ మార్చ్ చేస్తారు.తొలి రోజు పారాలింపిక్స్ పోటీలు ఆగస్ట్ 29న మొదలవుతాయి. ఆ రోజు మొత్తం 22 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి.పారిస్ పారాలింపిక్స్‌లోని క్రీడా విభాగాలు..బ్లైండ్ ఫుట్బాల్పారా ఆర్చరీపారా అథ్లెటిక్స్బోసియాగోల్బాల్పారా బ్యాడ్మింటన్పారా కనోయ్పారా సైక్లింగ్పారా ఈక్వెస్ట్రియాన్పారా తైక్వాండోపారా ట్రయథ్లాన్పారా టేబుల్ టెన్నిస్సిట్టింగ్ వాలీబాల్వీల్చైర్ బాస్కెట్బాల్వీల్చైర్ ఫెన్సింగ్వీల్చైర్ రగ్బీవీల్చైర్ టెన్నిస్పారా స్విమ్మింగ్షూటింగ్ పారా స్పోర్ట్పారాలింపిక్స్లో ఈసారి భారత్ నుంచి రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రితం ఎడిషన్‌లో భారత్ 54 మంది మాత్రమే విశ్వక్రీడలకు పంపింది. ఆ క్రీడల్లో భారత్ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) సాధించి ఆల్‌టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా కనీసం 25 పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.క్రీడాంశాల వారీగా 2024 పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత్ అథ్లెట్లు..పారా ఆర్చరీ (6)హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పారా అథ్లెటిక్స్ (38)దీప్తి జీవన్జీ - మహిళల 400మీ -టీ20సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్‌పుట్ - F46మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్‌పుట్ - F34మను - పురుషుల షాట్ పుట్ - F37పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57రవి రొంగలి - పురుషుల షాట్‌పుట్ - F40సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47సోమన్ రాణా - పురుషుల షాట్‌పుట్ - F57హొకాటో హొటోచే సేమా- పురుషుల షాట్ పుట్ - F57సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55రక్షిత రాజు- మహిళల 1500 మీటర్ల T11అమీషా రావత్: మహిళల షాట్‌పుట్ - F46భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53పారా బ్యాడ్మింటన్ (13)మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4తరుణ్ - పురుషుల సింగిల్స్ S4మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3మన్దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6పారా కనోయ్ (3)ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పారా సైక్లింగ్ (2)అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్బ్లైండ్ జూడో (2)కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1కోకిల: మహిళల -48కిలోల జె2పారా పవర్ లిఫ్టింగ్ (4)పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకుఅశోక్ - పురుషుల 63 కేజీల వరకుసకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళలకస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళలపారా రోయింగ్ (2)అనిత - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xనారాయణ కొంగనపల్లె - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xపారా షూటింగ్ (10)అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1అవని లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1నిహాల్ సింగ్: P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1సిద్ధార్థ బాబు: R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1పారా స్విమ్మింగ్ (1)సుయాష్ నారాయణ్ జాదవ్- పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై - S7పారా టేబుల్ టెన్నిస్ (2)సోనాల్‌బెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS3, మహిళల డబుల్స్- WD10భావినాబెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS4, మహిళల డబుల్స్- WD10పారా తైక్వాండో (1)అరుణ- మహిళల కే44- 47 కేజీలుపారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు 31 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. భారత్ గత పారాలింపిక్స్‌లోనే 19 పతకాలు సాధించింది.1. మురళీకాంత్ పెట్కర్ - హైడెల్బర్గ్ 1972 ( స్విమ్మింగ్‌లో స్వర్ణం, పురుషుల 50 మీ ఫ్రీస్టైల్ 3 )2. భీమ్రావ్ కేసర్కర్ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో రజతం)3. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో కాంస్యం)4. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల షాట్‌పుట్ L6లో రజతం)5. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల డిస్కస్ త్రో L6లో కాంస్యం)6. దేవేంద్ర ఝఝరియా - ఏథెన్స్ 2004 ( పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం F44/ 46)7. రాజిందర్ సింగ్ రహేలు - ఏథెన్స్ 2004 (పురుషుల 56 కేజీలలో కాంస్యం)8. గిరీషా ఎన్ గౌడ - లండన్ 2012 (పురుషుల హైజంప్ F42లో రజతం)9. మరియప్పన్ తంగవేలు - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో స్వర్ణం)10. వరుణ్ సింగ్ భాటి - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో కాంస్యం)11. దేవేంద్ర ఝఝరియా- రియో 2016 (పురుషుల జావెలిన్ త్రో F46లో స్వర్ణం)12. దీపా మాలిక్ - రియో 2016 (మహిళల షాట్‌పుట్ F53లో రజతం)13. భావినా పటేల్ - టోక్యో 2020 (మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో రజతం)14. నిషాద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T47లో రజతం)15. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్ SH1లో స్వర్ణం)16. దేవేంద్ర ఝఝరియా - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F46లో రజతం)17. సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో F46లో టోక్యో 2020 కాంస్యం)18. యోగేష్ కథునియా - టోక్యో 2020 (పురుషుల డిస్కస్ త్రో F56లో రజతం)19. సుమిత్ యాంటిల్ - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F64లో స్వర్ణం)20. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ SH1లో కాంస్యం)21. మరియప్పన్ తంగవేలు - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో రజతం)22. శరద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో కాంస్యం)23. ప్రవీణ్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T64లో రజతం)24. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో SH1లో కాంస్యం)25. హర్విందర్ సింగ్ - టోక్యో 2020 (పురుషుల వ్యక్తిగత రికర్వ్ - ఓపెన్ ఆర్చరీలో కాంస్యం)26. మనీష్ నర్వాల్ - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో స్వర్ణం)27. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో రజతం28. ప్రమోద్ భగత్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణం)29. మనోజ్ సర్కార్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో కాంస్యం)30. సుహాస్ యతిరాజ్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4లో రజతం)31. కృష్ణ నగర్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SH6లో కాంస్యం) -
క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండి, జీవితం అందంగా ఉంటుంది: మనూ భాకర్
చెన్నై: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షూటర్ మనూ భాకర్ క్రీడారంగంలోనూ అందమైన కెరీర్ ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, ఇంజినీర్లే కాదు క్రీడాకారులుగా కూడా అందమైన జీవితాన్ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నై విద్యార్థులకు సూచింది. మంగళవారం వేళమ్మాల్ నెక్సస్ స్కూల్ మనూను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం టోక్యోలో ఎదురైనా పరాభవాన్ని పారిస్‌లో రెండు పతకాలతో అధిగమించిన తీరును వివరించింది. ఓటమిని రుచి చూసి... ‘ప్రపంచ రెండో ర్యాంక్ షూటర్‌గా టోక్యోకు వెళ్లాను. కానీ ఒలింపిక్స్‌లో నా గురి అస్సలు కుదర్లేదు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఎదురైన చేదు అనుభవం కొన్నాళ్లు నా ప్రయాణాన్ని కష్టంగా మార్చింది. అయినా నేనెప్పుడూ దాన్నే తలచుకొని దిగులుపడలేదు. ఓటమిని రుచి చూసిన నాకు విజయం దక్కుతుందని తెలుసు. స్పోర్ట్స్ అంటేనే అది! ఒకదాంట్లో పరాజయం, మరోదాంట్లో విజయం సహజం. అయితే ఇవన్నీ కూడా కష్టపడితేనే సాధ్యం’ అని పేర్కొంది. మనం కనే పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆ స్థాయిలో కఠోరంగా శ్రమించాల్సిందేనని మనూ తెలిపింది. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం చెమటోడ్చాలని, ఒక్కసారిగా అవి సాకారం కాకపోవచ్చని... కానీ అంతమాత్రాన నిరాశ చెందకుండా లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని వివరించింది. Badhiya pradarshani chal rahi is desh main Bronze medal ki. pic.twitter.com/sX2FpS4vZX— Prayag (@theprayagtiwari) August 20, 2024ఆత్మవిశాస్వంతో... ‘నేనెప్పుడు కూడా పోటీల్లో జయాపజయాల గురించి పట్టించుకోలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ప్రతీ పరీక్షను ఆ ఆత్మవిశ్వాసంతోనే నెట్టుకొస్తాను. మనకు కెరీర్లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. చాలామంది డాక్టరో, ఇంజనీర్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకుంటారు. కానీ క్రీడల్లోనూ అపారమైన అవకాశాలున్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన మద్దతు కావొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు. క్రీడల్లో అవన్నీ దక్కుతాయి’ అని మనూ భాకర్ వివరించింది. అమ్మ చూపిన దారి... తనకు తన అమ్మ స్ఫూర్తి అని ఆమె చూపించిన దారే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పింది. అడుగడుగునా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోతే పిల్లలకు ఇవేవి సాధ్యం కానేకావని తెలిపింది. ‘ఏ క్రీడయినా సరై బీజం పడేది ఇంట్లోనే! ఆ తర్వాత స్కూల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల భవితకు చక్కని బాట వేయడంలో కీలక భూమిక పోషిస్తారు’ అని వినమ్రంగా చెప్పింది. మన సంస్కృతి, నేపథ్యం ఏదైనా మనం ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకూడదని, చిన్న చిన్న అవరోధాలు ఎదురైనంత మాత్రాన ఆగిపోకూడదని స్ఫూర్తివంతమైన మాటలతో విద్యార్థులను మనూ ఉత్తేజపరిచింది. మన ప్రదర్శన బాలేకపోయినా, కొన్నిసార్లు విఫలమైనా, క్రీడల్లో పతకాలు గెలవలేకపోయినా, పరీక్షల్లో పాస్ కాకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోకూడదని ఉద్బోధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది. సరదాగా ఆడి పాడిన మనూ..కార్యక్రమం ముగింపు సందర్భంగా మనూ విద్యార్థులతో కలిసి ప్రముఖ హిందీ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
దేశం మారనున్న పారిస్ ఒలింపిక్స్ మూడు పతకాల విజేత
మెల్బోర్న్: విశ్వక్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఓ అథ్లెట్... వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్డ్సన్.. అనూహ్య నిర్ణయంతో అభిమానులను విస్మయ పరిచాడు. ఇకపై ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ‘పారిస్’ క్రీడల్లో రిచర్డ్సన్ రెండు వ్యక్తిగత రజతాలు, ఒక టీమ్ కాంస్యం గెలుచుకున్నాడు. 25 ఏళ్ల రిచర్డ్సన్ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ్రస్టేలియాకు వలస వచ్చాడు. ‘మాథ్యూ నిర్ణయం అనూహ్యం. చాలా వేదనకు గురయ్యాం. అయితే అతడు మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆ్రస్టేలియా సైక్లింగ్ సమాఖ్య మేనేజర్ జెస్ కోర్ఫ్ తెలిపాడు. ఇదేదో ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. బాగా ఆలోచించి తీసుకున్నదని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై గౌరవం ఉంది. అయినా ఇది అనాలోచిత నిర్ణయం కాదు. ఇకపై బ్రిటన్ తరఫున పోటీ పడాలనుకుంటున్నా’ అని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ సైక్లింగ్ సమాఖ్య సోషల్ మీడియా వేదికగా రిచర్డ్సన్కు స్వాగతం పలికింది. -
సౌరభ్ చౌదరి ఎక్కడ? రైఫిల్ సమాఖ్యపై మండిపడ్డ మను కోచ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం విధితమే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భారత షూటర్ల సెలక్షన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ విధానాల వల్ల యువ షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాణా అసహనం వ్యక్తం చేశాడు. "ఫెడరేషన్ సెలక్షన్ పాలసీ ప్రతీ ఆరు నెలలకోసారి మారుతుంది. ఈ విషయం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి పరిశీలించాలని కోరాను.అది చూశాక వారు ఏ నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటాము. ఆ తర్వాత ఈ విషయం గురించి అస్సలు చర్చించం. షూటర్లకు అండగా నిలిస్తే కచ్చితంగా వారి ప్రదర్శనలలో మనం మార్పులు చూస్తాం. భారత షూటింగ్ ఫెడరేషన్ విధి విధానాల వల్ల ఎంతో మంది యువ షూటర్లు ముందుకు వెళ్లలేకపోతున్నారు. భారత్‌లో అత్యుత్తమ షూటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి సపోర్ట్‌గా నిలిచే వారు ఎవరూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్కడ? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్కడ? వీరిగురించి ఎవరూ మాట్లడటం లేదు. పారిస్‌లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. మళ్లీ అతడిని ఈ ప్లాట్‌ఫామ్‌కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు. -
గ్రాండ్ వెల్కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు కారణంగా పతకం కోల్పోయిన ఫోగాట్.. సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ వద్ద ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఆపూర్వ స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వ్యాన్‌లో ర్యాలీగా ఆమెను ఊరేగించారు. ఈ సందర్భంగా వినేశ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమైంది. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా 55 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు ఫోగాట్ గురైంది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె అభ్యర్ధనను స్పోర్ట్స్ కోర్డు కొట్టిపారేసింది. #WATCH | Indian wrestler Vinesh Phogat receives a warm welcome at Delhi's IGI AirportCongress MP Deepender Hooda, wrestlers Bajrang Punia, Sakshee Malikkh and others welcomed her. pic.twitter.com/rc2AESaciz— ANI (@ANI) August 17, 2024 -
వినేశ్ ఫోగట్ కీలక నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడి పతకాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌కు విడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది.అయితే ఇప్పుడు వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్‌లో ఉద్వేగభరిత పోస్టు షేర్ చేసిన ఆమె.. అందులో పలు విషయాలను ప్రస్తావించింది. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, రెజ్లింగ్ కొనసాగించే సత్తా మాత్రం తనకు ఉందని ఫోగట్ తెలిపింది."నా బృందానికి, నా తోటి భారతీయులకు, నా ఫ్యామిలీకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా లక్ష్యాన్ని మేము ఇంకా చేరుకోలేదు. ఏదో మిస్ అయినట్లు అన్పిస్తోంది. అయితే పరిస్థితులు ఇకపై మునపటిలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు రెజ్లింగ్ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నేను నమ్మిన దాని కోసం నా పోరాటం ఆపనని వినేష్ పేర్కొంది.అదే విధంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ టీమ్‌పై ఫోగట్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరేన్ రస్కిన్హా, యతిన్ భట్కర్లతో పాటు చాలా మంది ఇతర అథ్లెట్లు నాకు మద్దతుగా నిలిచారు. వారి సపోర్ట్‌తోనే నేను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించగలిగాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు అంటూ ఫోగట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. -
ప్రతి ఒక్కరూ చాంపియనే
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్ మనూ భాకర్.. ఒలింపిక్స్‌లో వినియోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్‌ను ప్రధానికి అందించారు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్‌తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్‌జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. పారిస్‌కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్ లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్‌కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఫీల్డ్ గోల్స్‌తోనే అది సాధ్యం: శ్రీజేశ్ న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్ గోల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్‌గోల్స్ ఎక్కువ చేయాలని శ్రీజేశ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్ చేసింది. అందులో 9 పెనాల్టీ కార్నర్లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్ గోల్స్ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ 14 ఫీల్డ్ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్ గోల్స్ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్ కూడా 10 ఫీల్డ్ గోల్స్‌తో ఆకట్టుకుంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్ గోల్స్‌లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్ అన్నాడు. -
వినేశ్‌కు చుక్కెదురు
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో అసమాన పోరాటంతో ఫైనల్‌కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది. పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్‌ను సీఏఎస్ అడ్హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్‌కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా? కష్ట కాలంలో వినేశ్‌కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు. -
ఒలింపిక్ బృందాన్ని అభినందించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పారిస్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందాన్ని బుధవారం అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండప్‌లో భారత బృందంతో భేటీ అయిన ముర్ము... దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులతో పాటు పతకాల కోసం పారిస్‌లో శ్రమించిన అథ్లెట్లను ఆమె ప్రశంసించారు. పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించిన ఫొటోలు, బృందంతో దిగిన ఫొటోల్ని రాష్ట్రపతి భవన్ అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మరోవైపు ఈరోజు ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆహా్వనం అందింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు కూడా ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. -
వినేశ్ ఫోగట్‌కు నిరాశ.. సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరణ
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తిరస్కరించింది.మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీ ఫైనల్‌కు ముందు నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాముల ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. -
2028లో మళ్లీ కలుద్దాం!
పారిస్: ప్రపంచ సినిమా కలల ప్రపంచం హాలీవుడ్... లాస్ఏంజెలిస్ నగర శివారులో వెలసిన వినోదనగరి... నాలుగేళ్ల తర్వాత ఆ సినీ అడ్డా వద్ద ప్రపంచ క్రీడా సంబరం నిర్వహణకు రంగం సిద్ధమైంది... మరి దాని గురించి ప్రపంచానికి చెప్పాలంటే మామూలు పద్ధతిలో చేస్తే ఏం బాగుంటుంది? అందుకే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కొత్తగా ప్రయత్నించారు. అందుకోసం హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్కంటే సరైన వ్యక్తి ఎవరుంటారు. పారిస్ నేషనల్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ముగింపు ఉత్సవం మధ్యలో క్రూజ్ స్టేడియం పైభాగం నుంచి దూకి స్టేడియంలోకి వచ్చాడు. ఆ తర్వాత అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నుంచి ఒలింపిక్ పతాకాన్ని అందుకున్నాడు. లాస్‌ఏంజెలిస్‌లో క్రీడలు జరిగే సమయంలో ప్రధానాకార్షణగా మారే అవకాశం ఉన్న టామ్ క్రూజ్‌ను ఇలా అందరి ముందు తీసుకొచ్చారు. మోటార్ సైకిల్, విమానం, పారాచూట్‌తో టామ్ క్రూజ్ ఒలింపిక్స్‌కు ప్రచారం చేస్తూ గతంలోనే రికార్డు చేసిన వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంతో అధికారికంగా ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యత పారిస్ నుంచి లాస్ ఏంజెలిస్‌కు మారింది. ఈ అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెలిస్‌లో విశ్వ క్రీడలు జరిగాయి. అలరించిన కార్యక్రమాలు... సెన్ నదిపై ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకల తరహాలోనే ఒలింపిక్స్ ముగింపు ఉత్సవం కూడా ఘనంగానే ముగిసింది. దాదాపు 70 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పారిస్ నగర ఘనతను చెబుతూ సాగిన సంగీత కార్యక్రమంతో ఇది మొదలు కాగా... అనంతరం 206 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో పరేడ్‌లో పాల్గొన్నారు. ‘రికార్డ్స్’ పేరుతో సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. వచ్చే ఒలింపిక్స్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సంగీతకారులకు కూడా ఇందులో చోటు కల్పించారు. సంప్రదాయం ప్రకారం అన్నింటికంటే ముందుగా తొలి ఒలింపిక్స్ జరిగిన గ్రీస్ జాతీయ పతాకాన్ని, ఆ తర్వాత ఫ్రాన్స్ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. మెగా ఈవెంట్ విజయవంతం కావడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ థామస్ బాక్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘అథ్లెట్లు ఒక మ్యాజిక్‌ను ప్రదర్శించారు. కోట్లాది మంది క్రీడాభిమానుల తరఫున కృతజ్ఞతలు. మళ్లీ 2028లో కలుస్తాం. ఒలింపిక్స్ ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నా 206 దేశాల నుంచి ఆటగాళ్లు ఇక్కడకు చేరారు. పతకాల కోసం హోరాహోరీగా పోరాడారు. ఒలింపిక్స్‌తో వెలుగుల నగరం మరింతగా శోభిల్లింది. అత్యుత్తమ క్రీడా ప్రదర్శనే కాదు, ఆటగాళ్లకు సంబంధించి ఇదే సంబరాల వేడుక’ అని బాక్ వ్యాఖ్యానించారు. ఈ వేదికపై ఐఓసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ మహిళా బాక్సర్ సిండీ ఎన్గాంబా, చైనా టేబుల్ టెన్నిస్ స్టార్ సన్ యింగ్షా, కెన్యా స్టార్ మారథాన్ రన్నర్ కిప్చోగే, క్యూబా దిగ్గజ రెజ్లర్ మిజైన్ లోపెజ్, ఫ్రాన్స్ జూడో స్టార్ టెడ్డీ రైనర్, ఆ్రస్టేలియా స్విమ్మర్ ఎమ్మా మెకీన్ కూడా ఉన్నారు. ఐదు ఖండాల దేశాలకు ప్రతినిధులుగా వీరు వ్యవహరించారు. అనంతరం పారిస్ నగర మేయర్ అన్నె హిడాల్గో ఒలింపిక్ పతాకాన్ని థామస్ బాక్కు అందజేశారు. ఆయన నుంచి తదుపరి విశ్వ క్రీడలు జరిగే లాస్ ఏంజెలిస్ నగరానికి మేయర్‌గా వ్యహరిస్తున్న కరెన్ బాస్ ఈ పతాకాన్ని స్వీకరించారు. అనంతరం ఇదే వేదికపై ఉన్న అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌కు కరెన్ బాస్ ఒలింపిక్ పతాకాన్ని అందించింది. పారిస్, లాస్ఏంజెలిస్ నగరాలకు అన్నె హిడాల్గో, కరెన్ బాస్ తొలి మహిళా మేయర్లు కావడం విశేషం.ఒలింపిక్ పతాకం స్వీకరించాక ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత, అమెరికా సింగర్ గాబ్రియేలా సారిమెంటో విల్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది. ఫ్రాన్స్ స్విమ్మర్ లియాన్ మర్చండ్ ఒలింపిక్ జ్యోతిని స్టేడియంలోకి తీసుకురాగా, ఆ తర్వాత దానిని ఆర్పేసి అధికారికంగా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. ఫ్లాగ్ బేరర్లుగా శ్రీజేశ్, మనూ... ముగింపు వేడుకల పరేడ్‌లో భారత్ నుంచి షూటర్ మనూ భాకర్, హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్ రెండు కాంస్యాలు సాధించగా... కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన శ్రీజేశ్ ఈ పోటీల తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆఖరి ఈవెంట్లలో పాల్గొన్న కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మాత్రమే పరిమిత సంఖ్యలో భారత్ నుంచి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మనూ, ఆమె కోచ్ జస్పాల్ రాణా ముగింపు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా భారత్ నుంచి తిరిగి వెళ్లారు. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అక్కడే ఉన్నా ఆమె క్రీడాగ్రామానికే పరిమితమైంది. -
వినేశ్ రజత పతకం అప్పీల్‌పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్‌కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ క్రికెటర్ కొడుకు
పారిస్ ఒలింపిక్స్‌లో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ విన్స్టన్ బెంజమిన్ కొడుకు రాయ్ బెంజమిన్ గోల్డ్ మెడల్ సాధించాడు. విశ్వక్రీడల్లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహించిన రాయ్.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో 46.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాయ్ ప్రపంచ రికార్డు హోల్డర్, నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్‌ను ఓడించి పసిడి పతకం నెగ్గాడు.రాయ్ ఒలింపిక్స్ స్వర్ణం సాధించడం పట్ల తండ్రి విన్స్టన్ ఎనలేని ఆనందం వ్యక్తం చేశాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని విన్స్టన్ ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుతో పోల్చాడు. రాయ్ ఈ విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడని విన్స్టన్ తెలిపాడు. రాయ్ విజయం యునైటెడ్ స్టేట్స్కే కాకుండా తాను పుట్టి పెరిగిన ఆంటిగ్వాకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని విన్స్టన్ అన్నాడు.59 ఏళ్ల విన్స్టన్ 80, 90 దశకాల్లో వెస్టిండీస్ తరఫున 21 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడి 161 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా అయిన విన్స్టన్ టెస్ట్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయ్ బెంజమిన్.. విన్స్టన్ ఆరుగురు సంతానంలో ఒకరు. రాయ్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. చిన్నతనంలో క్రికెట్ పట్ల ఆకర్శితుడైన రాయ్.. ఆతర్వాత మనసు మార్చుకుని ట్రాక్ ఆండ్ ఫీల్డ్ గేమ్స్ వైపు మళ్లాడు. -
ఏడు నుంచి ఆరుకు...48 నుంచి 71కి..!
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఉండే నాలుగేళ్లతో పోలిస్తే ఒక ఏడాది తక్కువ సమయం ఉండటంతో అన్ని క్రీడల్లోనూ పారిస్ లక్ష్యంగానే హడావిడి కనిపించింది. అధికారులు, ప్రభుత్వం కూడా రెండంకెల పతకాలు ఖాయమంటూ నమ్మకం పెట్టుకున్నాయి. అందుకు తగినట్లుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అథ్లెట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా ఒలింపిక్స్ సన్నద్ధత కోసమే 16 క్రీడాంశాల్లో సౌకర్యాల కల్పన, విదేశాల్లో ప్రత్యేక శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు రూ. 470 కోట్లు ఖర్చు కూడా చేసింది. 117 మందితో మన బృందం బరిలోకి దిగింది. అద్భుతాల గురించి కాకపోయినా ఎక్కువ మంది కచ్చితంగా బాగా ఆడతారనే అంచనాలు, ఆశలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. కానీ ఒక్కో రోజు కరుగుతున్న కొద్దీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. పతకం కోసం ఎంతో ఎదురు చూడాల్సిన స్థితి. చివరకు ఒక రజతం, ఐదు కాంస్యాలతో మన టీమ్ ముగించింది. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడమే కాదు... స్వర్ణం కూడా లేకపోవడంతో పతకాల పట్టికలో కూడా భారత్ చాలా దిగువకు పడిపోయింది. –సాక్షి క్రీడా విభాగంపారిస్: అథ్లెటిక్స్‌లో భారత మహిళల 4్ఠ400 రిలే జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 32.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది... ఇదే ఈవెంట్లో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత బృందం టైమింగ్ 3 నిమిషాల 32.49 సెకన్లు మాత్రమే! అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మన జట్టు టైమింగ్ మెరుగుకాకపోగా, అంతకంటే పేలవంగా రిలే టీమ్ ముగించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్‌లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేమూ ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. భారత ప్రదర్శన విషయంలో ఈ ఒక్క క్రీడాంశాన్నే విమర్శించడానికి లేదు. ఓవరాల్‌గా కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనను దాటలేకపోగా, అది పునరావృతం కూడా కాలేదు. ప్రతీ ఒలింపిక్స్ తర్వాత జరిగే సమీక్ష తరహాలోనే ఈసారి కూడా దాదాపు అవే కారణాలు. మన ప్రమాణాలు బాగా పెరిగాయని చెప్పుకోవడమే తప్ప అసలైన సమయంలో పోటీకి దిగినప్పుడు ఇంకా మనం చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని తేలిపోయింది. చాలా మంది భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనడమే ఒక ఘనతగా కనిపిస్తోంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో 43 మంది పాల్గొంటే 41వ స్థానంలో నిలిచిన ప్రియాంక గోస్వామి గేమ్స్ విలేజ్ గదిలో సరదాగా ‘రీల్స్’ చేస్తున్న వీడియో చూస్తే ఆమె తన ఆట పట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది.తాము అడిగిన కోచ్‌లు, ఫిజియోలు... తాము కోరిన చోట శిక్షణ... ఇలా ఒక్కటేమిటి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచింది. అయినా మెడల్స్ విషయంలో మన రాత మారలేదంటే లోపం ఆటగాళ్లలోనే ఉన్నట్లు అర్థం. తమకు సౌకర్యాలు లేవనే మాట ఇకపై ఆటగాళ్ల నుంచి రాకూడదని... ప్లేయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ చేసిన వ్యాఖ్య ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ వర్తిస్తుంది. పతకవీరులు... టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన షూటర్ మనూ భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్‌డ్‌లో ఆమె భాగస్వామిగా సరబ్జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అనూహ్యంగా స్వప్నిల్ కుసాలే మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది.భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాగా... యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. ‘టోక్యో’ పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది.అయితే దురదృష్టవశాత్తూ అది చేజారినా... రజతంతో కాస్త మెరుగైన పతకం మన ఖాతాలో చేరింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మనూ భాకర్ తన కీర్తిని పెంచుకుంది. అంచనా తప్పారు... టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి నుంచి ప్రదర్శన, తాజా ఫామ్, ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విఫలం కాగా... కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయంపాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా కనీసం పతకానికి చేరువగా కూడా రాలేకపోవడం గమనార్హం. బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ కూడా అంచనా తప్పగా... గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నాలుగో ఒలింపిక్స్‌లో కూడా దీపిక కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, ఈక్వె్రస్టియన్లు మనం పతకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్‌లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీల స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. నాలుగో స్థానాలతో సరి... విజయం సాధించిన వాడినే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రెండో స్థానానికి కూడా విలువుండదు... స్పోర్ట్స్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు చాలా మంది తరచుగా వాడే మాట ఇది. కానీ మన భారతీయులు ఇప్పుడు నాలుగో స్థానాన్ని చూసి కూడా అయ్యో... కొద్దిలో చేజారిందే అనుకుంటున్నాం. ఇది ఏదో ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఒలింపిక్స్‌లో నాలుగో స్థానానికి ఎలాంటి విలువ లేదు. అదృష్టం కలిసొస్తే మరో ఆరు పతకాలు మన ఖాతాలో చేరేవేమో కానీ అలాంటి వాటికి ఆటల్లో చోటు లేదు. మనూ భాకర్, అర్జున్ బబూతా, మహేశ్వరి–అనంత్‌జీత్ జోడీ (షూటింగ్), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్–అంకిత జోడీ (ఆర్చరీ) అసలు సమయంలో తమ ఆట స్థాయిని పెంచలేకపోయారు. చివరగా... గెలుపు కూడా ఓటమిగా మారిన వైనం వినేశ్ ఫొగాట్ విషయంలో జరిగింది. ఫైనల్ చేరిన తర్వాత వచ్చిన పతకం బరువు ఎక్కువై చేజారడం వినేశ్‌కే కాదు భారతీయులందరికీ వేదన కలిగించింది. -
‘రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం
పారిస్: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం హోరాహోరీగా పోటీ పడిన తర్వాత 2024 ఒలింపిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా పారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు 70 వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ ముగింపు వేడుకలు జరిగాయి.థామస్ జాలీ నేతృత్వంలో ముగింపు ఉత్సవాలను ‘రికార్డ్స్’ పేరుతో నిర్వహించారు. ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చండ్ క్రీడా జ్యోతిని తీసుకొని వేదిక వద్దకు రాగా... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ చైర్మన్ థామస్ బాక్ వేదికపై కూర్చున్నాడు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్‌బేరర్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత్ తరఫున మనూ భాకర్, పీఆర్ శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు. వచ్చే ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో జరగనున్న నేపథ్యంలో పారిస్ క్రీడల నిర్వాహకులు ఒలింపిక్ ఫ్లాగ్‌ను లాస్ ఏంజెలిస్ క్రీడల చైర్పర్సన్ కేసీ వాసర్‌మన్‌కు అందజేశారు. ఫ్రెంచ్ భాషలో ‘మెర్సీ పారిస్’ (థ్యాంక్యూ పారిస్) నినాదాలు హోరెత్తుతుండగా ఆఖరి ఘట్టం ముగిసింది. -
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్‌ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్‌లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్‌జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
సూపర్ సిఫాన్...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్‌లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది. తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
అమెరికాను బోల్తా కొట్టించి స్వర్ణం గెలిచిన ఇటలీ మహిళల వాలీబాల్ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో చివరి రోజు సంచలన ఫలితం వచ్చి0ది. మహిళల వాలీబాల్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. తొలిసారి ఫైనల్ చేరిన ఇటలీ జట్టు 25–18, 25–20, 25–17తో అమెరికా జట్టును ఓడించి మొదటిసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇటలీ సీనియర్ క్రీడాకారిణి, నాలుగోసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మోనికా డి జెనారోను సభ్యులంతా గాల్లో ఎగరేసి సంబరం చేసుకున్నారు. మాజీ చాంపియన్ బ్రెజిల్ 25–21, 27–25, 22–25, 25–15తో టర్కీ జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో అమెరికా జట్టు ఓడిపోయినా ఒలింపిక్స్ మహిళల వాలీబాల్‌లో అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన జట్టుగా అవతరించింది. అమెరికా జట్టు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు దక్కించుకుంది. సోవియట్ యూనియన్, చైనా, జపాన్, బ్రెజిల్ ఆరు పతకాల చొప్పున నెగ్గాయి. -
లిన్ యూ టింగ్ పంచ్ అదిరె...
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ వివాదాన్ని ఎదుర్కొన్న మరో బాక్సర్ స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 57 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో లిన్ యూ టింగ్ 5–0తో జూలియా (పోలాండ్)పై గెలిచింది. అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ పతకం సాధించిన మరుసటి రోజే లిన్ యూ టింగ్ కూడా మెడల్‌తో మెరిసింది. బాక్సింగ్‌లో చైనీస్ తైపీకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం. ‘పారిస్’ క్రీడల ఆరంభం నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కొన్న లిన్ యూ టింగ్ బహుమతి ప్రదానోత్సవం సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ.. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని పేర్కొంది. ‘ప్రత్యర్థితోనే కాదు.. పరిస్థితులపై కూడా గెలిచా. ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టా. అయినా కోచ్ ద్వారా కొన్ని వార్తలు వినాల్సి వచ్చేది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆహ్వానంతోనే పారిస్‌లో అడుగుపెట్టా. అలాంటప్పుడు వచ్చిన పని వదిలేసి అనవసర విషయాలను దరి చేరనివ్వలేదు. పూర్తి ఏకాగ్రత బౌట్పైనే పెట్టా. ఈ పతకంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అయింది. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని లిన్ యూ టింగ్ వెల్లడించింది. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో లిన్‌తో పాటు ఖలీఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. ఈ ఇద్దరిలో పురుషులకు చెందిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ... లిన్ సాధించిన కాంస్యాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లిన్... విశ్వక్రీడల ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూ చివరకు చాంపియన్‌గా నిలిచింది. -
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. హెడ్‌కోచ్‌కు గుండె పోటు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్‌లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.అసలేం జరిగిందంటే?ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. -
అభినవ్ బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’
పారిస్: ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సముచిత రీతిలో గౌరవించింది. స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’ను అందజేసింది. ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంతో ఒలింపిక్ ఉద్యమం పాత్ర ఉంది. 1975 నుంచి ఈ ఒలింపిక్ ఆర్డర్‌ను అందజేస్తున్నారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ థామస్ బాక్ ఈ అవార్డును బింద్రాకు అందజేశారు. -
Vinesh Phogat: తీర్పు 13కు వాయిదా!
పారిస్: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను డిస్క్వాలిఫై చేసిన అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) తీర్పు మరో సారి వాయిదా పడింది. భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 13న తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి శుక్రవారమే దీనిపై వాదనలు ముగిశాయి. దాంతో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తీర్పు రానుందని సమాచారం రాగా అది జరగలేదు. అనంతరం ఆదివారం అదే సమయానికి రావచ్చని వినిపించినా... చివరకు మంగళవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. నిజానికి ఒలింపిక్స్ ముగిసేలోగానే దీనిపై స్పష్టత ఇస్తామని సీఏఎస్ పేర్కొంది. అయితే వినేశ్ అంశాన్ని ‘ప్రత్యేక కేసు’గా చూస్తుండటంతో తీర్పు ఆలస్యమవుతూ వస్తోంది. కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను ఆదివారం సాయంత్రంలోగా తమకు అందించాలని సీఏఎస్ ఇరు పక్షాలను కోరింది. రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఉండటంతో వినేశ్‌ను నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. దాంతో ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తొలి రోజు ఫైనల్ చేరే వరకు నిబంధనలకు అనుగుణంగా తన బరువు పరిమితికి లోబడే ఉందని... కాబట్టి అప్పటి వరకు వచ్చిన ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటూ తనకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆమె తరఫున సీఏఎస్‌లో వాదించారు. ఈ వ్యవహారంలో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఐఓఏ అధికారులు చెప్పారు. -
నఫీసాటు సంచలనం
పారిస్: ఒక్క క్రీడాంశంలో పోటీపడి ఒలింపిక్ పతకం గెలవాలంటేనే ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే ఈవెంట్లో ఏడు క్రీడాంశాలు ఉంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బెల్జియం క్రీడాకారిణి నఫీసాటు థియామ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. ఏడు క్రీడాంశాల సమాహారమైన ‘హెప్టాథ్లాన్’లో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో హెప్టాథ్లాన్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా నఫీసాటు థియామ్ కొత్త చరిత్ర లిఖించింది. హెప్టాథ్లాన్‌లో 100 మీటర్ల హర్డిల్స్ రేసు, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్ల రేసు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల రేసు ఉంటాయి. ఈ ఏడింటిలో ఆయా అథ్లెట్స్ సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. పారిస్ ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల నఫీసాటు 6880 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నఫీసాటు పసిడి పతకాలు సాధించింది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కాటరీనా జాన్సన్ థాంప్సన్ (బ్రిటన్; 6844 పాయింట్లు) రజతం, నూర్ విడిట్స్ (బెల్జియం; 6707 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
చైనా అద్భుతం... రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ముందు వరుసలో దూసుకెళుతున్న చైనా మరో రికార్డు సొంతం చేసుకుంది. రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి యూరోపేతర జట్టుగా చైనా నిలిచింది. ఒలింపిక్స్ రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ఇప్పటి వరకు యూరప్ దేశాల ఆధిపత్యం కొనసాగుతుండగా... శనివారం చైనా మహిళల జట్టు దానికి గండి కొడుతూ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన చైనా టీమ్ ఫైనల్లో 69.800 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హూప్స్, రిబ్బన్స్, బాల్స్ విభాగాల్లో చైనా జిమ్నాస్ట్‌లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఇజ్రాయిల్ (68.850 పాయింట్లు), ఇటలీ (68.100 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బల్గేరియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రిథమిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రజతం గెలిచిన చైనా ఈసారి పసిడి పతకం సాధించింది. -
అజేయ అమెరికా
ఒలింపిక్స్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రికార్డును అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు సొంతం చేసుకుంది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు పరాజయం అన్నదే ఎరగకుండా దూసుకెళుతోంది. ఈ క్రమంలో వరుసగా 60 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ‘పారిస్’ క్రీడల్లో ఫైనల్ చేరడం ద్వారా అమెరికా ఈ ఘనత సాధించింది. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్లో అమెరికా 85–64తో ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్‌కు చేరింది. నేడు ఫ్రాన్స్‌తో స్వర్ణం కోసం తలపడనుంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు వరుసగా ఏడు స్వర్ణాలు గెలిచింది. ఈసారి కూడా పసిడి కైవసం చేసుకుంటే.. విశ్వక్రీడల చరిత్రలో వరుసగా 8 బంగారు పతకాలు గెలిచిన తొలి టీమ్‌గా చరిత్ర కెక్కనుంది. -
డైవింగ్‌లో చైనా క్లీన్‌స్వీప్
పారిస్ ఒలింపిక్స్ డైవింగ్ క్రీడాంశంలో చైనా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. అక్వాటిక్ సెంటర్లో అద్భుతాలు చేసిన చైనా డైవర్లు రికార్డు స్థాయిలో ఎనిమిది స్వర్ణాలతో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని పసిడి పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. శనివారం పురుషుల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ కావో యున్ (చైనా) 547.50 పాయింట్లతో టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ డైవింగ్‌లో 1988 తర్వాత స్వర్ణం నిలబెట్టుకున్న మొదటి స్విమ్మర్‌గా కావో యున్ నిలిచాడు. అమెరికాకు చెందిన గ్రెగ్ లుగానిస్ 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు నెగ్గాడు. తమాయి రికుటో (జపాన్; 507.65 పాయింట్లు), విలియమ్స్ నోహ్ (గ్రేట్ బ్రిటన్; 497.35 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. గతంలో ఎనిమిదింట ఏడు పతకాలు నెగ్గిన చైనా... ఈసారి మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. ‘పారిస్’ క్రీడల్లో డైవింగ్ విభాగంలో జరిగిన మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫామ్ పోటీల్లో చైనా స్విమ్మర్లు అగ్రస్థానాల్లో నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. చైనా డైవర్లు ఈ ఎనిమిది విభాగాల్లో స్వర్ణాలే కాకుండా.. మరో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలిచి మొత్తంగా డైవింగ్లోనే 11 పతకాలు పట్టారు. -
Paris olympics: ముగిసిన భారత ప్రస్థానం.. ఆరుతో సరి
టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్’లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. శనివారం రెజ్లింగ్ ఈవెంట్‌తో భారత పోరాటం ముగిసింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 76 కేజీల విభాగంలో రీతిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ఆమెను ఓడించిన కిర్గిస్తాన్ రెజ్లర్ ఫైనల్ చేరకుండా సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఫలితంగా రీతికకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కనీసం కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లేకుండా పోయింది. ‘పారిస్’లో భారత్‌కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 70వ స్థానంలో ఉంది. ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఫలితంగా చివరిరోజు పతకాల పట్టికలో భారత్ స్థానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలిచి 48వ స్థానంలో నిలిచింది. పారిస్: విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. శనివారంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 76 కేజీల విభాగంలో రీతిక కాంస్య పతక పోరుకు అర్హత సాధించి ఉంటే ఆదివారం కూడా భారత్ పతకం రేసులో నిలిచేది. కానీ రీతిక పతకం రేసులో స్థానం సంపాదించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ రీతిక క్వార్టర్ ఫైనల్లో కిర్గిస్తాన్ రెజ్లర్ ఐపెరి మెదెత్ కిజీ చేతిలో ఓడిపోయింది. మూడు నిమిషాల నిడివి గల రెండు భాగాలు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. స్కోరు సమమైతే నిబంధనల ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ బౌట్లో ముందుగా రీతిక ఒక పాయింట్ సాధించింది. రెండో భాగంలో కిర్గిస్తాన్ రెజ్లర్ పాయింట్ స్కోరు చేసి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ పాయింట్ లభించలేదు. దాంతో చివరి పాయింట్ స్కోరు చేసిన కిర్గిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. అనంతరం కిర్గిస్తాన్ రెజ్లర్ సెమీఫైనల్లో 6–8 పాయింట్ల తేడాతో కెన్నీడీ అలెక్సిస్ బ్లేడ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. దాంతో ‘రెపిచాజ్’ రూపంలో రీతికకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం చేజారింది. అంతకుముందు తొలి రౌండ్లో రీతిక కేవలం 29 సెకన్లలో హంగేరి రెజ్లర్ బెర్నాడెట్ నగీపై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో గెలిచింది. ఇద్దరు రెజ్లర్ల మధ్య పాయింట్ల తేడా 10 పాయింట్లకు చేరుకున్న వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేస్తారు. బెర్నాడెట్‌తో జరిగిన బౌట్లో 29 సెకన్ల సమయానికి రీతిక 12–2తో 10 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి రీతికను విజేతగా ప్రకటించారు. -
ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
Paris olympics: ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
‘మహిళల స్వేచ్ఛ’పై నినదించినందుకు...
పారిస్: ఒలింపిక్స్ క్రీడల ‘బ్రేకింగ్’ (బ్రేక్ డ్యాన్స్) ఈవెంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ ప్లేయర్ ఇండియా సర్జో, ఐఓసీ శరణార్ధి టీమ్‌కు చెందిన మనీజా తలాష్ మధ్య ప్రి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ పోరు కొనసాగుతున్న సమయంలో మనీజా అఫ్గనిస్తాన్‌లోని మహిళలను స్వేచ్ఛను ప్రసాదించమంటూ ‘ఫ్రీ అఫ్గాన్ ఉమెన్’ అంటూ రాసి ఉన్న కేప్‌ను తన డ్రెస్‌పై ధరించి డ్యాన్సింగ్ చేసింది. అయితే రాజకీయపరమైన వ్యాఖ్యలు, నినాదాలు ప్రదర్శించడంపై ఒలింపిక్స్‌లో నిషేధం ఉంది. దాంతో వెంటనే పోటీని నిలిపివేసిన అధికారులు ఆమెను డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మనీజా స్వదేశం అఫ్గానిస్తాన్ కాగా... ఆ దేశం తాలిబాన్ల ఆ«దీనంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ నుంచి పారిపోయి స్పెయిన్‌లో శరణార్థిగా తలదాచుకుంది. క్రీడల్లో కల నెరవేర్చుకునేందుకు వచ్చానంటూ 21 ఏళ్ల మనీజా తన గురించి చెప్పుకుంది. ఇప్పుడు శరణార్ధి జట్టు ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రాగా, బరిలోకి దిగి తమ మహిళల గురించి ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఒలింపిక్స్‌లో అనర్హత వేటును ఎదుర్కొంది. -
ఇక సౌకర్యాలు లేవని చెబితే కుదరదు
ఒలింపిక్స్ చరిత్రలో ఘనమైన రికార్డు ఉన్న భారత హాకీ జట్టు ‘పారిస్’ క్రీడల్లోనూ దాన్ని కొనసాగించింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడి కాంస్యం పతకం సాధించడం ఆనందంగా ఉంది. సహచరుల నుంచి ఇంతకు మించిన వీడ్కోలు బహుమతి అడగలేను. రెండు దశాబ్దాలకు పైగా జట్టుతో ఉన్నా. ఇప్పుడిక యువతరానికి పాఠాలు చెబుతా. వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడం ద్వారా యువ ఆటగాళ్లలో స్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగిందనుకుంటున్నా. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో యువ షూటర్ మనూ భాకర్‌తో కలిసి త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నా. మనూ నాకంటే 14 ఏళ్లు చిన్నది. అయినా ఆమె విశ్వక్రీడల్లో అద్భుతాలు చేసింది. ప్రతి అథ్లెట్ ఏకైక లక్ష్యం దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే. అది మనూలో సమృద్ధిగా ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్‌తో నా విశ్వక్రీడల ప్రయాణం ప్రారంభమైంది. ఈ పుష్కర కాలంలో క్రీడలకు ప్రోత్సాహం ఎలా మారిందో నేను ప్రత్యక్షంగా చూశాను. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సరైన సౌకర్యాలు లేవని సాకులు చెప్పే అవకాశమే లేదు. హాకీలో సాధించిన పతకం కోట్లాది మంది భారతీయుల సమష్టితత్వానికి నిదర్శనమని ప్రధాని అన్నప్పుడు... గర్వంతో నరాలు ఉప్పొంగాయి. పారిస్ క్రీడల్లో బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మా జట్టు కలిసికట్టుగా ఆడిన తీరు అద్భుతం. దాదాపు 75 శాతం సమయం కేవలం 10 మందితోనే ఆడాం. ఆ పట్టుదలే ఇక్కడి వరకు చేర్చింది. మన జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇప్పుడే వాళ్ల ప్రయాణాన్ని ప్రారంభించగా... మిగిలిన 11 మంది టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నారు.ప్రపంచంలోనే మేటి జట్లతో పోటీపడేందుకు బెంగళూరులోనూ ‘సాయ్’ శిక్షణ కేంద్రం మాకు అన్ని విధాలుగా సçహాయపడింది. గత పదిహేనేళ్లుగా ఈ కేంద్రమే నా ఇల్లు. కుటుంబ సభ్యులతో కన్నా అక్కడే ఎక్కువ గడిపా. అంతర్జాతీయ స్థాయి జిమ్, పారిస్‌లో మాదిరి సరికొత్త టర్ఫ్ ఇలా... ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా మరవలేనిది. కోచ్ క్రెయిగ్ ఫల్టన్ జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఆటగాళ్లందరికి ఒక్క తాటిపై నడిపించారు. ‘ఖేలో ఇండియా’ వ్యవస్థ భవిష్యత్తును మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నా. -పీఆర్ శ్రీజేశ్ -
Paris Olympics: బాధ్యత పెంచిన విజయం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టుకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్‌తో పాటు కొందరు ప్లేయర్లు పారిస్‌లోనే ఉండిపోగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ సహా పలువురు క్రీడాకారులు శనివారం స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హాకీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.‘యావత్ దేశం మా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ భావన అద్భుతంగా ఉంది. ఒలింపిక్స్ సమయంలో మాకు అభిమానుల నుంచి విశేష మద్దతు లభించింది. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలు మా బాధ్యతను మరింత పెంచాయి’అని భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మిడ్‌ఫీల్డర్ అమిత్ రోహిదాస్ ‘రెడ్ కార్డ్’కు గురై మైదానాన్ని వీడాల్సి రాగా.. మిగిలిన 10 మందితోనే పోరాడిన భారత జట్టు అద్వితీయ ప్రదర్శనతో సెమీస్ చేరింది. దీనిపై వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది జట్టులోని సభ్యులందరి పరస్పర నమ్మకానికి సంబంధించిన విషయంలో ఒక ప్లేయర్ లేకున్నా మ్యాచ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. గోల్ పోస్ట్ ముందు పీఆర్ శ్రీజేశ్ అయితే లెక్కకు మిక్కిలిసార్లు మమ్మల్ని కాపాడాడు’అని వివరించాడు. ప్రేరణ పెంచిన విజయం: మాండవీయా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా భారత జట్టుకు కేంద్ర మంత్రి రూ. 2 కోట్ల 40 లక్షల చెక్‌ను అందజేశారు. ‘దేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. మీ విజయం లక్షలాది మంది యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది. మీ ఘనతలు చూసి యావత్ దేశం గర్విస్తోంది. ఈ విజయం మీ పట్టుదల, సమష్టి కృషి, తిరుగులేని స్ఫూర్తికి నిదర్శనం’ అని మాండవీయా అన్నారు. మంచుకొండల్లో శిక్షణ ఫలితాన్నిచ్చింది పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగడానికి ముందు స్విట్జర్లాండ్‌లోని మంచు కొండల్లో మూడు రోజుల ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొనడం తమకెంతో ఉపయోగపడిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. మంచుకొండల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ జట్టు సభ్యుల్లో అనుబంధాన్ని పెంచేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఇక 2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా సçహాయక బృందంలో కీలక సభ్యుడైన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ రాక కూడా తమకు కలిసొచ్చిందని హర్మన్ అన్నాడు. ‘ఒకరికి ఒకరు అండగా నిలవడం.. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద ఫలితాలు తెచ్చాయి.పారిస్ క్రీడల్లో మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు మేమంతా ఒక జట్టుగా ముందుకు సాగాం. ఇందులో ప్యాడీ ఆప్టన్ పాత్ర కీలకం. అతడి వల్లే స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌కు వెళ్లాం. దాని వల్ల ఆటగాళ్లలో పట్టుదల, పరస్పర విశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. -
24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్‌కు పసడి పతకం
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు. మరోవైపు మారథాన్‌లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించేవాడు. -
భారత గోల్ఫర్ అదితికి 29వ స్థానం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ ‘పారిస్’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది. భారత్‌కే చెందిన మరో గోల్ఫర్ దీక్ష డాగర్ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ గోల్ఫర్ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్ హెన్సెలైట్ (280 పాయింట్లు; జర్మనీ), లిన్ జియా జానెట్ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ‘తొలి మూడు రోజులు సరైన షాట్లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది. -
అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం.. 10 కోట్ల భారీ నజరానా
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్, బల్లెం వీరుడు అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రం ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) ఒలింపిక్ చాంపియన్‌కు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 10 కోట్లు (భారత కరెన్సీలో రూ. 3 కోట్లు) నజరానా ప్రకటించారు. ఇప్పటికే కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సైతం రూ. 5 కోట్లు (భారత కరెన్సీలో రూ. 1.50 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా గురువారం(ఆగస్టు 8) ఆర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్.. తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు. కాగా ఈ పోటీల్లో రెండో స్ధానంలో నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నిరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
శెభాష్ అమన్.. 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గిన రెజ్లర్! లేదంటే?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకంతో మెరిశాడు. 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్‌లో ఓడినా.. కాంస్య పతక పోరులో మాత్రం అదరగొట్టాడు.ప్రత్యర్ధి క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను 13-5తో ఓడించిన అమన్.. తొలి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. తద్వారా ఒలిపింక్స్‌లో భారత తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా అమన్ చరిత్ర సృష్టించాడు.కాంస్యం వెనక కఠోర శ్రమ..అయితే అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సొంతం చేసుకోవడం వెనక కఠోర శ్రమ దాగింది. అమన్ తృటిలో ఆనర్హత వేటును తప్పించుకున్నాడు. అమన్ కాంస్య పతక మ్యాచ్‌కు ముందు భారత రెజ్లింగ్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమన్ బరువు(57 కేజీలు) ఉండాల్సిన కంటే 4.5 కేజీలు ఆధికంగా ఉండటమే అందుకు కారణం . సెమీస్‌లో ఓటమి తర్వాత గురువారం(ఆగస్టు 8) నాడు సాయంత్రం 6: 30 గంటలకు అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడినందున.. అమన్ విషయంలో మాత్రం భారత మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో కాంస్య పతక పోరుకు ముందు బరువు తూచే సమయానికి అమన్ 4.6 కిలోల బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అమన్ తన బరువు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. గురువారం రాత్రి మొత్తం అమన్ నిద్ర పోలేదు. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కోచ్‌లు వీరేంద్ర దహియా, జగ్మందర్ సింగ్ సెహ్రావత్ బరువు తగ్గించడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.అమన్ మిషన్ సాగింది ఇలా..తొలుత ఇద్దరు కోచ్‌లతో గంటన్నర సుదీర్ఘ మ్యాట్ సెషన్‌తో అమన్ వెయిట్ లాస్ మిషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ యువ రెజ్లర్ ఒక గంట పాటు హాట్ బాత్(వేడి నీళ్ల స్నానం) సెషన్లో పాల్గోన్నాడు. అనంతరం అర్ధరాత్రి దాటాక జిమ్‌లో 30 నిమిషాల నాన్‌స్టాప్ ట్రెడ్‌మిల్‌పై సాధన చేశాడు. ఆ తర్వాత అతడికి 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. బ్రేక్ తర్వాత దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్( ఆవిరి స్నానం) చేయించారు.అప్పటికి అతడు 3.6 కిలోలు తగ్గాడు. కానీ అమన్‌పై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మరింత బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అతడికి మసాజ్ సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత లైట్ జాగింగ్, 15 నిమిషాల రన్నింగ్ సెషన్లో పాల్గోన్నాడు. సరిగ్గా ఉదయం 4:30 గంటలకు అతని బరువు 4.6 కేజీల తగ్గి 56.9 కిలోలకు వచ్చింది. దీంతో భారత బృందం ఊపిరిపీల్చుకుంది. దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అమన్ తన బరువును తగ్గించుకున్నాడు. శుక్రవారం మ్యాచ్ జరిగే ముందు బరువు తూచే సమయానికి అమన్ సరిగ్గా 56.9 కిలోల బరువు ఉన్నాడు. దీంతో మ్యాచ్‌లో పాల్గోని కాంస్య పతకాన్ని భారత్‌కు అందించాడు. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా నీవు వారియర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
ఒలింపిక్స్ కాంస్య పతకంతో స్వదేశానికి చేరుకున్న భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. శనివారం ప్యారిస్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన భారత హాకీ జట్టుకు అభిమానులు పుష్ప గుచ్చాలతో ఆపూర్వ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ విశ్వ క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై భారత్ విజయం సాధించింది.అంతకుముందు సెమీఫైనల్లో జెర్మనీ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. కానీ కాంస్య పతక మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన పంజా విసిరింది. ఇక కాంస్య పతకం విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. 🇮🇳Indian Men's Hockey Team players arrive at Delhi airport after winning a bronze medal at the #Paris2024 🥉#Hockey #HarmanpreetSingh #Olympics pic.twitter.com/6O7BTlOy4u— InsideSport (@InsideSportIND) August 10, 2024 -
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్‌గా శ్రీజేశ్!
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. గోల్ పోస్ట్ ముందు తన అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో మధుర విజయాలు అందించిన శ్రీజేశ్.. ఇకపై జాతీయ జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ‘త్వరలోనే శ్రీజేశ్‌ను జూనియర్ (అండర్–21) జట్టు కోచ్‌గా నియమిస్తాం. దీని గురించి అతడితో మాట్లాడాం. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడికి మించిన వారు మరొకరు లేరు. దీంతో పాటు శ్రీజేశ్ స్థానాన్ని భర్తీ చేయనున్న గోల్ కీపర్లు సూరజ్ కార్కెరా, క్రిషన్ బహదూర్ పాఠక్‌కు కూడా దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. -
వినేశ్‌కు రజతం ఇవ్వాలి: సచిన్ టెండూల్కర్
పారిస్ ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. మహిళల 50 కేజీల విభాగంలో వరస విజయాలతో ఫైనల్‌కు చేరిన ఫొగాట్.. వంద గ్రాములు అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.ఈ నేపథ్యంలో సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘ప్రతి ఆటలో నిబంధనలు ఉంటాయి. వాటిని సందర్భానుసారంగా చూడాలి. అవసరమైతే మార్పులు చేయాలి. వినేశ్ చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది. తుదిపోరుకు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడి రజత పతకానికీ దూరమైంది. దీనికి సరైన కారణం కనిపించడం లేదు. ఇందులో క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’ అని సచిన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. డ్రగ్స్ వంటి అనైతిక చర్యలతో అనర్హతకు గురై ఉంటే చివరి స్థానం ఇవ్వడం సబబే అని.. కానీ వినేశ్ న్యాయంగా పోరాడి ఫైనల్‌కు చేరిందని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే అని.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) తీర్పు తర్వాత అయినా వినేశ్‌కు పతకం వస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. -
నిజమైన విజేతవు నీవే బంగారం!
క్రీడలే జీవితంగా భావించే వారు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఒలింపి క్స్‌లో పతకం సాధించాలని కోరుకొంటారు. పతకం కోసం అహరహం శ్రమిస్తూ సంవ త్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. అయితే... గెలుపు, ఓటమితో సంబంధం లేని ఓ సాంకేతిక కారణంతో స్వర్ణపతకం చేజారితే... కనీసం రజత పతకమైనా దక్కకుంటే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు వినేశ్ పోగట్‌కు అదే పరిస్థితి ఎదు రయ్యింది. వంద గ్రాముల అదనపు బరువు కొండంత దురదృష్టాన్ని, గుండెబరువును మిగిల్చింది.ఒలింపిక్స్‌లో పతకం మినహా ప్రపంచ కుస్తీలోని అన్ని రకాల పోటీలలో పతకాలు సాధించిన ఘనత వినేశ్‌కు ఉంది. 49 కిలోలు, 50 కిలోలు, 53 కిలోల విభాగాలలో పాల్గొంటూ చెప్పుకోదగ్గ విజయాలు, ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ పోటీలలో సైతం స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన వినేశ్‌కు ఒలింపిక్స్ పతకం మాత్రం గత పుష్కరకాలంగా అందని ద్రాక్షలా ఉంటూ వచ్చింది.2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటూ గాయంతో వైదొలిగిన వినేశ్ 2020 టోక్యో ఒలింపి క్స్‌లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దిమాసాల ముందు వినేశ్ న్యాయం కోసంముందుగా రోడ్లు, ఆ తరువాత న్యాయస్థానాల మెట్లు ఎక్కి పోరాడాల్సి వచ్చింది.అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొంటూ, దేశానికి పతకాలతో ఖ్యాతి తెస్తున్న ఏడుగురు మహిళా వస్తాదులపై బీజెపీ మాజీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్, ఆయన పరివారం లైంగిక వేధింపులకు పాల్పడటానికి నిరసనగా భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటి దిగ్గజ వస్తాదులతో కలసి వినేశ్ గొప్ప పోరాటమే చేసింది. చివరకు ఢిల్లీ పోలీసుల కాఠిన్యాన్ని రుచి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో బ్రిజ్ భూషణ్ అధ్యక్షపదవిని వీడక తప్పలేదు.మొక్కవోని దీక్షతో, మోకాలి శస్త్ర చికిత్సను సైతం భరించి, పోరాడి ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. 53 కిలోల విభాగంలో తనకు అవకాశం లేకపోడంతో యాభై కిలోల విభాగంలో పాల్గొనటం కోసం బరువు తగ్గించుకొని మరీ ప్యారిస్‌లో అడుగుపెట్టింది. మహిళా కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున 50 కిలోల బరువుతోనే జపాన్, ఉక్రెయిన్, క్యూబా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగు పెట్టింది. వినేశ్ ఫైనల్స్ చేరడంతో బంగారు పతకం ఖాయమనే శతకోటి భారత క్రీడాభిమానులు ఆశ పడ్డారు. కానీ జరిగింది వేరు. అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య నిబంధనల ప్రకారం పోటీలు జరిగే ప్రతి రోజూ వివిధ విభాగాలలో పోటీకి దిగే వస్తాదుల బరువును చూసిన తరువాతే పోటీకి అనుమతిస్తారు. అయితే...పోటీల తొలిరోజున 50 కిలోల బరువున్న వినేశ్... స్వర్ణపతం కోసం పోటీపడే రోజున మాత్రం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. బరువును నియంత్రించుకోడం కోసం ఫైనల్‌కు ముందురోజు రాత్రి వినేశ్, ఆమె శిక్షకులు చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. తెల్లవార్లూ నడకతో, సైక్లింగ్ చేస్తూ, విపరీతమైన వేడితో ఉండే ఆవిరి గదిలో వినేశ్ గడిపింది. చివరకు బరువు తగ్గించుకోవటం కోసం శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ప్రయోజనం లేకపోయింది. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా బంగారు పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోడంతో పాటు... కనీసం రజత పత కానికి సైతం నోచుకోలేకపోయింది. అదనపు బరువు నిబంధన కారణంగా వినేశ్‌కు బంగారు పతకం పోరులో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించడం గుండె కోతను మిగిల్చింది. వినేశ్తో పాటు కోట్లాది క్రీడాభి మానులు, యావత్ భారతజాతి తల్లడిల్లిపోయింది.అదనంగా ఉన్న 100 గ్రాముల బరువే తనకు ఒలింపిక్స్ పతకం సాధించే అవకాశం లేకుండా చేయటాన్ని జీర్ణించుకోలేని వినేశ్ అర్ధంతరంగా రిటై ర్మెంట్ ప్రకటించింది. వినేశ్‌కు న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి భారత కుస్తీ సమాఖ్య అప్పీలు చేసింది. ఫైనల్ బరిలో దిగకుండానే సర్వం కోల్పోయిన వినేశ్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ మొరపెట్టుకొన్నారు. రజత పతకాలు ఇద్దరికీ ఇచ్చినా ఇబ్బంది రాదని అంటున్నారు.వినేశ్‌కు ప్రధాని, కేంద్ర క్రీడామంత్రి; భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలు వురు క్రీడాదిగ్గజాలు, సింధు లాంటి ఒలింపియన్లు అండగా నిలిచారు.ప్రతిభకు, బరువుకు సంబంధం ఏంటని పలు వురు నిపుణులు, ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. 100 గ్రాముల అదనపు బరువుతో ప్రత్యర్థికి జరిగే నష్టమేంటని నిలదీస్తున్నారు. హార్మోనుల అసమతౌల్యత వల్ల మహిళల బరువు తరచూ మారిపోతూ ఉంటుందని, ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మినహా యింపు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.భారత ఒలింపిక్స్ సంఘం మొరను అంతర్జా తీయ ఒలింపిక్స్ సంఘం ఆలకించినా... ఆలకించ కున్నా, కనీసం రజత పతకం ఇచ్చినా, ఇవ్వకున్నా... నిజమైన విజేతగా కోట్లాది మంది క్రీడాభిమానుల గుండెల్లో వినేశ్ పోగట్ నిలిచిపోతుంది.వ్యాసకర్త సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొబైల్: 84668 64969 -
భారత మహిళల, పురుషుల 4*400 రిలే జట్లు విఫలం..
పారిస్: ఒలింపిక్స్‌లో కనీస అంచనాలను అందుకోలేకపోయిన భారత మహిళల, పురుషుల జట్లు 4*400 మీటర్ల రిలే ఈవెంట్లలో నిరాశపరిచి హీట్స్‌లోనే వెనుదిరిగాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, విత్యా రాంరాజ్, పూవమ్మ రాజు, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల జట్టు హీట్స్‌లో పోటీపడ్డ ఎనిమిది జట్లలో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.భారత బృందం 3 నిమిషాల 32.51 సెకన్లలో రేసును పూర్తి చేసి చివరి స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా విత్యా రేసును ఆరంభించి 53.46 సెకన్ల తర్వాత బ్యాటన్‌ను జ్యోతిక శ్రీకి అందించింది. జ్యోతిక శ్రీ వాయువేగంగా పరుగెత్తి 51.30 సెకన్ల తర్వాత బ్యాటన్‌ను పూవమ్మ రాజుకు అందించింది. పూవమ్మ 54.80 సెకన్ల తర్వాత శుభకు బ్యాటన్ ఇచ్చింది. శుభ 52.95 సెకన్లలో 400 మీటర్లను పూర్తి చేసింది. ఈ నలుగురిలో జ్యోతిక శ్రీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అనస్, అజ్మల్, అమోజ్, రాజేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3 నిమిషాల 00.58 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా భారత బృందం పదో స్థానాన్ని దక్కించుకుంది. -
Paris Olympics 2024: చిన్న దేశాలు... పెద్ద విజయాలు
మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన అల్ఫ్రెడ్ జూలియన్ 10.72 సెకన్లలో లక్ష్యానికి చేరి స్వర్ణం గెలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో డొమెనికాకు చెందిన లెఫాండ్ థియా 15.02 మీటర్ల దూరం దూకి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. సెయింట్ లూసియా జనాభా 1,80,000 కాగా.. డొమెనికా జనాభా 73 వేలు మాత్రమే. కరీబియన్ దీవుల్లోని అతి చిన్న దేశాలు విశ్వక్రీడల్లో సత్తా చాటుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఒలింపిక్స్ చరిత్రలో పసిడి గెలిచిన అతి తక్కువ జనాభా గల దేశంగా డొమినికా రికార్డుల్లోకెక్కింది. ఇవే కాకుండా.. పట్టుమని 10 లక్షల జనాభా కూడా లేని పదికి పైగా దేశాలు ఒలింపిక్స్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచాయి. –సాక్షి క్రీడా విభాగం ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు పతకాలు సాధించాయి. వాటిలో జనాభా పరంగా స్వర్ణం గెలిచిన అతిచిన్న దేశంగా డొమెనికా నిలిచింది. విశ్వక్రీడల్లో ఆ దేశానికి ఇదే తొలి పతకం కావడం మరో విశేషం. ఇప్పటి వరకు తమ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేకున్నా... ఈ మెడల్ అనంతరం డొమినికాను ప్రపంచ చాంపియన్‌గా అందరూ గుర్తిస్తారని... ఆ దేశానికి తొలి పతకం అందించిన ట్రిపుల్ జంపర్ లెఫాండ్ థియా ఆశాభావం వ్యక్తం చేసింది. భిన్న భౌగోళిక పరిస్థితులు ఉండే డొమెనికాలో... క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. అలాంటి చోటు నుంచి ‘పారిస్’ క్రీడలకు నలుగురు అథ్లెట్లు అర్హత సాధించగా అందులో లెఫాండ్ థియా సాధించిన బంగారు పతకం... ఆ దేశానికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి డొమెనికా విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 28 ఏళ్ల తర్వాత ఆ దేశానికి మొదటి పతకం దక్కింది. ఈ ఏడాది ప్రపంచ ఇండోర్ చాంపియన్íÙప్లో పతకం నెగ్గి ఆశలు రేపిన లెఫాండ్... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో 15.02 మీటర్ల దూరం లంఘించి పసిడి పతకం కైవసం చేసుకుంది. ‘ఇప్పుడు మేం కూడా ప్రపంచ చాంపియన్లమే. డొమెనికాకు ఒలింపిక్స్‌లో తొలి పతకం. అది కూడా పసిడి. చాలా గొప్పగా అనిపిస్తోంది. ఈ ఫలితంతో మా దేశంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం పెరిగింది. మా దేశ జనాభా సుమారు 73 వేలు. దేశానికి తొలి స్వర్ణం అందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా నిలవడం... అందులోనూ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. చిన్న దేశం అంటే... పరిమిత వనరులు ఉంటాయనుకుంటారు. అయితే సంఖ్య కన్నా నాణ్యత ముఖ్యం అని నా ఉద్దేశం. ఈ విజయాన్ని దేశమంతా ఆస్వాదిస్తుంది. డొమెనికా స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం మెరుగైన ట్రాక్ కూడా లేదు. ఇప్పుడు ఈ పతకం వల్ల దేశంలో క్రీడా మౌలిక వసతులు మెరుగు పడతాయని ఆశిస్తున్నా. భవిష్యత్తు తరాలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు నా వంతు కృషి చేస్తా’ అని పతకం గెలిచిన అనంతరం లెఫాండ్ వివరించింది. జూలియన్ కథే వేరు... పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్లలో రజతం నెగ్గిన సెయింట్ లూసియా అథ్లెట్ జూలియన్ అ్రల్ఫెడ్ కథే వేరు! అమెరికా అథ్లెట్లు షకారీ రిచర్డ్సన్, జెఫెర్సన్ మెలీస్సాలతో పోటీపడి అగ్రస్థానం దక్కించుకున్న జూలియన్... ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. ప్రాక్టీస్ చేసేందుకు షూస్ కాదు కదా... కనీసం చెప్పులు కూడా లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జూలియన్... చిన్నతనంలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్‌లోనే పరుగు పెట్టేది. రన్నింగ్ కోసం ప్రత్యేక దుస్తులు కొనే స్థోమత లేని జూలియన్... చిన్నప్పటి నుంచే పరుగును ప్రేమించింది. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలని ఊహ తెలిసినప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న జూలియన్... పారిస్‌లో తన కల సాకారం చేసుకుంది. ‘ఇది నాకు, నా దేశానికి ఎంతో విలువైంది. యావత్ దేశం సంబరాలు జరుపుకోవడం ఖాయం. చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా పరుగులు తీసే దాన్ని. కనీస వసతులు లేకుండానే ఈ స్థాయికి వచ్చా. ఈ ప్రదర్శన అనంతరం మా దేశంలో స్టేడియం నిర్మాణం జరుగుతుందనుకుంటున్నా. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం పెరుగుతుందని భావిస్తున్నా. దేశానికి అంబాసిడర్ అనే భావన కలుగుతోంది. ప్రపంచంలో చాలా మందికి సెయింట్ లూసియా గురించి తెలిసి ఉండకపోవచ్చు. అదెక్కడ ఉంది అని నన్ను ఎంతో మంది అడిగారు. కాని ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కాబట్టి... ప్రజలు సెయింట్ లూసియా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. దేశం కోసం పరుగెత్తడాన్ని గౌరవంగా భావిస్తా. ఇంటికి వెళ్లాక ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటా’అని జూలియన్ చెప్పింది.వీరిద్దరే కాదు... 1,25,000 జనాభా ఉన్న గ్రెనెడా అథ్లెట్లు ‘పారిస్’ క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించగా... 2,82,000 జనాభా ఉన్న బార్బడోస్ ఒక పతకం నెగ్గింది. ఇక సుమారు 4 లక్షల జనాభా గల బహామస్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు 8 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 16 పతకాలు గెలిచింది. -
అమన్ కంచు పట్టు.. కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కొనసాగింది. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్‌కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమన్ సెహ్రావత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలోనే భారత్‌కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్‌లో ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది.పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అమన్ 13–5 పాయింట్ల తేడాతో డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. అండర్–23 విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్‌తో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), యోగేశ్వర్ దత్ (2012 లండన్; కాంస్యం), సాక్షి మలిక్ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
Olympic 2024: అనాథగా వచ్చి అద్భుతం చేసి... అమన్ 'కాంస్య' కథ
‘గెలవడం అనేది నిజంగా అంత సులువే అయితే అందరూ అదే చేసేవాళ్లు’... ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ‘ఛత్రశాల్’లో అమన్ సెహ్రావత్ గదిలో అతని మంచం పక్కన చేతి రాతతో రాసుకున్న ఈ క్యాప్షన్ కనిపిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు ‘క్వాలిఫైడ్ అథ్లెట్’ అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా మరో పక్కన ఉంటుంది. ఒలింపిక్స్ ఐదు రింగులతో పాటు పతకం చిత్రాన్ని కూడా అక్కడ అతను అంటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బొమ్మ మాత్రమే కాదు అసలు ఒలింపిక్ పతకమే వేలాడనుంది! ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన 21 ఏళ్ల అమన్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. భారత్ తరఫున అన్ని కేటగిరీలు కలిపి పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఒకే ఒక్కడు ఇప్పుడు కాంస్యంతో మెరిశాడు. ఛత్రశాల్ సెంటర్లో యువ రెజ్లర్లకు స్ఫూర్తినివ్వడం కోసం దేశానికి కీర్తిని తెచ్చిన రెజ్లర్ల ఫొటోలను పెట్టారు.ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్, రవి దహియాలతో పాటు వరల్డ్ చాంపియన్ షిప్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడైన అమిత్ దహియా ఫోటో కూడా ఉంటుంది. ప్రతీ రోజూ ప్రాక్టీస్ కోసం అక్కడి నుంచే నడిచే అమన్ తన గురించి కూడా కలకన్నాడు. అతను ఢిల్లీ చేరేసరికి అతని ఫొటో కూడా సిద్ధమైపోతుందేమో! తల్లిదండ్రులను కోల్పోయి... హరియాణాలోని బిరోహర్కు చెందిన అమన్ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ప్రోత్సాహంతో మట్టిలో రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసిన అతను ఎప్పటికైనా ఢిల్లీలో ఛత్ర్శాల్ స్టేడియానికి వెళ్లి గొప్ప రెజ్లర్‌ను అవుతానంటూ నాన్నకు చెప్పేవాడు. దురదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోగా అతని తల్లిదండ్రులు అనూహ్యంగా మరణించారు. దాంతో కొందరు సన్నిహితులు 11 ఏళ్ల వయసులో ఛత్రశాల్ స్టేడియంకు తీసుకొచ్చి చేర్పించారు. అప్పటి నుంచి అతనికి ఆ కేంద్రమే సొంత ఇల్లుగా, అతని లోకమంతా రెజ్లింగ్మయంగా మారిపోయింది. ప్రాక్టీస్ తప్ప మరో పని లేకుండా అమన్ గడిపేవాడు. కోచ్ లలిత్ కుమార్ అతడిని తీర్చిదిద్దాడు. అండర్–23 ప్రపంచ విజేతగా... 18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచిన అనంతరం అమన్ జూనియర్ స్థాయిలో పలు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నాడు. ఆసియా క్యాడెట్స్, వరల్డ్ క్యాడెట్స్, ఆసియా అండర్–20, ఆసియా అండర్–23 చాంపియన్íÙప్లలో అతను సాధించిన విజయాలు అమన్‌కు గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే 19 ఏళ్ల వయసులో అండర్–23 వరల్డ్ చాంపియన్íÙప్లో స్వర్ణం సాధించడంతో అతనిపై అందరి దృష్టి పడింది. భవిష్యత్తులో అద్భుతాలు చేయగల ఆటగాడిగా అందరూ అంచనాకు వచ్చారు. వేర్వేరు గ్రాండ్‌ప్రిలు, ఇన్విటేషన్ టోర్నీలలో కూడా వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ స్థాయిలో సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అమన్ ఎక్కడా తగ్గకుండా తన ఆటలో మరింత పదును పెంచుకున్నాడు. ఫలితంగా 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం అతని ఖాతాలో చేరాయి. సుశీల్ ఫోన్ కాల్‌తో... ఆసియా క్రీడల సెమీఫైనల్లో, ఆ తర్వాత ఆసియా క్వాలిఫయిర్స్లో బలహీన డిఫెన్స్‌తో అమన్ పరాజయంపాలై కాస్త నిరాశ చెందాడు. ఆ సమయంలో అతనికి తీహార్ జైలు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి0ది. అది చిరపరిచితమైన గొంతే. తన కెరీర్ ఆరంభంలో తనను ప్రోత్సహించి నువ్వు గొప్పవాడిని అవుతావని ఆశీర్వదించిన సుశీల్ కుమార్ చేసిన ఫోన్ అది. ‘నీ ఆటకు డిఫెన్స్ పనికిరాదు. అలా చేస్తే ఎప్పటికీ గెలవలేవు. ఒక్క సెకను కూడా డిఫెన్స్‌పై దృష్టి పెట్టకుండా ఆరంభం నుంచి అటాక్ చేస్తేనే నీకు సరిపోతుంది. సీనియర్ స్థాయిలో డిఫెన్స్ టెక్నిక్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఫలితాన్ని ఇవ్వదు. నేను కూడా అలాగే చేశాను’ అంటూ సుశీల్ చెప్పడం అమన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత అతని ఆటలో దూకుడు మరింత పెరిగింది. గురువునే ఓడించి... పారిస్ ఒలింపిక్స్ అవకాశం అమన్‌కు అంత సులువుగా రాలేదు. ఛత్ర్శాల్లో తాను ఎంతో అభిమానించే రెజ్లర్ రవి దహియా. అతడిపై ఇష్టం కారణంగా అన్ని చోట్లా అతడినే అనుకరిస్తూ అతని శిష్యుడిగా తనను తాను భావించుకునేవాడు. కానీ గురువుతోనే పోటీ పడాల్సిన స్థితి వస్తే! అమన్‌కు అదే అనుభవం ఎదురైంది. రవి దహియా కేటగిరీ అయిన 57 కేజీల విభాగంలోనే తానూ పోటీ పడుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ఒకరికే అవకాశం ఉంది. కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్‌లో రవి చేతిలో 0–10తో అమన్ చిత్తుగా ఓడాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది తాను గురుభావంతో చూస్తే పని కాదని, ఒక ప్రత్యర్థి గా మాత్రమే చూడాలని. 2024 ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్‌లో చెలరేగి రవిని ఓడించడంలో సఫలమైన అమన్... గురువు స్థానంలోకి వచ్చి కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత క్వాలిఫయర్స్‌లోనూ చెలరేగి ఒలింపిక్ బెర్త్‌ను సాధించాడు. ఈ క్రమంలో వాంగెలోవ్, ఆండ్రీ యెట్సెంకో, చోంగ్ సాంగ్వంటి సీనియర్లను అతను ఓడించగలిగాడు. ఘనమైన రికార్డుతో... ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాత ప్రపంచ రెజ్లింగ్‌కు రాజధాని లాంటి ‘డేగిస్తాన్’లో అతను సన్నద్ధమయ్యాడు. ఛత్రశాల్లో మినహా అతని కెరీర్లో శిక్షణ తీసుకున్న మరో చోటు డేగిస్తాన్ (రష్యాకు సమీపంలో) మాత్రమే. అత్యుత్తమ సౌకర్యాలతో పాటు పలువురు చాంపియన్ ప్లేయర్ల మధ్య సాధన చేయడం, పదునైన స్పేరింగ్ పార్ట్నర్లు ఉండటంతో అమన్ ప్రాక్టీస్ జోరుగా సాగింది. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు అమన్ ఆగలేదు. ఫిబ్రవరి 2022లో సీనియర్ స్థాయిలో తొలిసారి అంతర్జాతీయ రెజ్లింగ్‌లో బరిలోకి దిగిన అమన్ అప్పటి నుంచి ఈ ఒలింపిక్స్‌కు ముందు వరకు 39 బౌట్లలో పాల్గొంటే 31 విజయాలు సాధించాడు. అంటే 79.4 విజయశాతం. ఇదే అతనిపై ఒలింపిక్ పతకం అంచనాలను పెంచింది. ఇప్పుడు తనకంటే ముందు ఒలింపిక్ పతకాలు సాధించిన తనలో స్ఫూర్తిని నింపిన దిగ్గజాల సరసన అతను సగర్వంగా నిలబడ్డాడు. –సాక్షి క్రీడా విభాగం -
అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు
పారిస్: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో ఆసక్తికర ఈవెంట్లలో ఒకటైన పురుషుల 200 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ అవతరించాడు. బోట్స్వానాకు చెందిన లెట్సిల్ టెబోగో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల టెబోగో 19.46 సెకన్లలో పరుగు పూర్తి చేశాడు. టోక్యోలో రజతం సాధించిన బెడ్నారెక్ (అమెరికా; 19.62 సెకన్లు) ఈసారి కూడా రజతంతో సరి పెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు విజేత అయిన మరో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్‌కు (19.70 సెకన్లు) కాంస్యం దక్కింది. గత ఒలింపిక్స్‌లోనూ లైల్స్‌కు కాంస్యమే లభించింది. కోవిడ్‌తో బాధపడుతూనే బరిలోకి దిగిన లైల్స్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు పొరుగున బోట్స్వానా ఉంది. 26 లక్షల జనాభా కలిగిన ఈ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం కావడం విశేషం. గత ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో టెబోగో 100 మీటర్లలో రజతం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. అతని కెరీర్ ఎదుగుదలలో తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. అయితే అతను ఒలింపిక్ సన్నాహాల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించింది.తన చేతి వేలి గోర్లపై తల్లి పేరు రాసుకొని అతను రేస్‌లో పాల్గొన్నాడు. పరుగు పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకున్న టెబోగో భుజాలపై తన రెండు షూస్ వేసుకొని భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అందులో ఒక షూను తీసి అతను కెమెరాకు చూపించాడు. దానిపై అతని తల్లి పేరు, పుట్టిన తేదీ రాసి ఉన్నాయి. ప్రేక్షక సమూహంలో ఉన్న అతని చెల్లెలు కూడా అన్న ప్రదర్శనకు జేజేలు పలకింది. ‘నేను ఒలింపిక్ పతకం గెలవాలని ఆమె ఎంతో కోరుకుంది’ అని టెబోగో చెప్పాడు. మరోవైపు టెబోగో విజయంతో బోట్స్వానా దేశంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంపై ప్రజలంతా సంబరాలు చేసుకోవాలంటూ దేశాధ్యక్షుడు మాగ్వీట్సీ మసీసీ శుక్రవారం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించడం విశేషం. -
బ్రేక్ డ్యాన్స్‌లో ‘ఇండియా’ జోరు
విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన బ్రేక్ డ్యాన్స్ (బ్రేకింగ్) ఈవెంట్లో ఇండియా జోరు సాగుతోంది. అదేంటి ఈ విభాగంలో భారత్ నుంచి ఒక్క డాన్సర్ కూడా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు కదా అని అనుకుంటున్నారా.. ఇండియా అంటే భారత్ అనుకుంటే మీరు పొరబడినట్లే. నెదర్లాండ్స్‌కు చెందిన 16 ఏళ్ల యువ డాన్సర్ ఇండియా సర్జో... ‘పారిస్’ క్రీడల్లో తాను పోటీపడుతున్న నాలుగు విభాగాల్లోనూ సెమీ ఫైనల్‌కు చేరింది. సాధారణంగా బ్రేక్డ్యాన్స్లో పాల్గొనే డాన్సర్లు ‘బి’ గర్ల్స్, ‘బి’ బాయ్స్ అని ఆసక్తికర పేర్లు వినియోగిస్తారు. కానీ 16 ఏళ్ల సర్జో మాత్రం తన అసలు పేరుతోనే పోటీల్లో దిగింది. ‘బి–గర్ల్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు అలాంటి ప్రత్యేకమైన పేరు ఎవరూ పెట్టలేదు. అందుకే ఇండియా పేరుతోనే బరిలోకి దిగుతున్నా’ అని సర్జో వెల్లడించింది. -
ప్రపంచ రికార్డు... పసిడి పతకం
పారిస్: ఒలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టి 40 ఏళ్లయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏ అథ్లెట్ వరుసగా రెండు స్వర్ణాలు సాధించలేదు. కానీ ‘పారిస్’లో అమెరికా క్రీడాకారిణి సిడ్నీ మెక్లాఫ్లిన్ లెవ్రోన్ ఈ ఘనత సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన సిడ్నీ మెక్లాఫ్లిన్ అదే ఫలితాన్ని పారిస్‌లో పునరావృతం చేసింది. ఈసారి ఏకంగా కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డులను కూడా సృష్టించింది. శుక్రవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 25 ఏళ్ల సిడ్నీ 50.37 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డులను నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ 30న 50.65 సెకన్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సిడ్నీ తిరగరాసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సిడ్నీ 51.46 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం నెగ్గింది. ఈ సమయాన్ని కూడా ఆమె ‘పారిస్’లో అధిగమించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ విభాగంలో సిడ్నీ మెక్లాఫ్లిన్ ఐదుసార్లు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. -
పారిస్ ఒలింపిక్స్‌లో.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్టు! ఎంతంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్‌లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్‌కు పేరు తీసుకువచ్చింది. -
కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా
ఆ దేశ జనాభా సుమారు 25 కోట్లు. కానీ విశ్వక్రీడలైన ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే ఆ దేశం నుంచి ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టారు. ఆ కొద్దిమందికి కూడా ఆర్థిక సహాయం అందించలేని దుస్థితి ఆ దేశానిది. అయితే వారిలో ఓ అథ్లెట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఒలింపిక్స్‌లో 40 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న పసిడి పతకాన్ని గెలిచి తమ దేశ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తన విజయంతో కష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు. అతడే పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీమ్. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో జావెలిన్ త్రో ఈవెంట్లో పసిడి పతకాన్ని నదీమ్ సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విశ్వవేదికపై సత్తాచాటిన నదీమ్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నదీమ్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.1ఎవరీ అర్షద్ నదీమ్?27 ఏళ్ల నదీమ్ జనవరి 2, 1997న పంజాబ్ ప్రావిన్స్‌లో ఖనేవాల్ అనే గ్రామంలో జన్మించాడు. నదీమ్‌కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతడు మూడోవాడు. నదీమ్ తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అతడొక్కడే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో ఒకకానొక సమయంలో తిండికి కూడా నదీమ్ ఇబ్బంది పడిన దుస్థితి.కానీ నదీమ్ లక్ష్యానికి తన పేదరికం అడ్డు రాలేదు. తన చిన్నతనం నుంచే క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. స్కూల్ డేస్‌లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్,అథ్లెటిక్స్ వంటి క్రీడలలో సత్తాచాటేవాడు. ముఖ్యంగా నదీమ్‌కు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్‌పై అతడి అభిరుచి జిల్లా స్ధాయిలో ఆడేలా చేసింది.నదీమ్ క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో ఓ అథ్లెటిక్స్ ఈవెంట్లో జావెద్ ప్రదర్శనకు కోచ్ రషీద్ అహ్మద్ సాకీ ఫిదా అయిపోయాడు. దీంతో అతడిని అథ్లెట్‌గా తీర్చిదిద్దాలని అహ్మద్ సాకీ నిర్ణయించుకున్నాడు. జావెలిన్ త్రోపై దృష్టి పెట్టడానికి ముందు నదీమ్ షాట్ పుట్, డిస్కస్ త్రోను ప్రాక్టీస్ చేసేవాడు.ఆ తర్వాత పూర్తిస్ధాయిలో జావెలిన్ త్రోయర్‌గా నదీమ్ మారాడు. వరుసగా పంజాబ్ యూత్ ఫెస్టివల్స్‌లో బంగారు పతకాలు, ఇంటర్-బోర్డ్ మీట్లతో సహా జాతీయ స్ధాయిలో సత్తాచాటాడు. అతడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అథ్లెటిక్స్ జట్ల నుండి ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ ఆర్ధికంగా అర్షద్ నదీమ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో 2016లో అతడికి వరల్డ్ అథ్లెటిక్స్ నుండి స్కాలర్షిప్ వచ్చింది.దీంతో మారిషస్‌లోని ఐఏఏఎఫ్ (IAAF) హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అవకాశం నదీమ్‌కు లభించింది. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం పతకం గెలిచి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. అనంతరం అతడికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ తన ప్రయాణాన్ని మాత్రం నదీమ్ కొనసాగించాడు.2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు.అదేవిధంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల విసిరిన నదీమ్.. ఒలింపిక్స్‌లో ఈటెను అత్యధిక దూరం విసిరిన అథ్లెట్‌గా నిలిచాడు. అయితే నదీమ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేతగా నిలవడంలో అతడి గ్రామ ప్రజల సాయం మరవలేనది. చాలా సందర్భాల్లో అతడికి ఖనేవాల్ ప్రజలు ఆర్ధికంగా సహాయం చేసి పోటీల్లో పాల్గొనేలా తోడ్పడ్డారు. -
కాంస్య పతకంతో వీడ్కోలు పలికిన భారత హాకీ లెజెండ్...
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. సెమీస్‌లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో మాత్రం సత్తాచాటింది. 2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మరణీయ విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి ముందే శ్రీజేశ్ ప్రకటించాడు.ఈ క్రమంలో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్‌కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్‌పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్‌తో జేజేలు కొట్టారు. కాగా భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు."నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్ ప్రకటనలో శ్రీజేష్ పేర్కొన్నాడు. -
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్.. అర్షద్ నదీమ్‌కు భారీ నజరానా ప్రకటించిన పాక్
ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తెరదించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న అర్షద్ నదీమ్.. విశ్వవేదికపై తన జాతీయ జెండాను రెపాలపడించాడు. గురువారం జరిగిన ఫైనల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఈ పాకిస్తానీ కైవసం చేసుకున్నాడు. ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. పసిడి పతకంతో పాటు అరుదైన ఒలింపిక్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఇక అర్షద్ గోల్డ్‌మెడల్ సాధించడంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. ఈ క్రమంలోసిద్ధిఖీ గోల్డెన్ బాయ్ నదీమ్‌కు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ భారీ నజరానా ప్రకటించారు. సింధ్ ప్రావిన్స్ తరపున రూ.5 కోట్లు(పాకిస్తానీ కరెన్సీ)ను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వహాబ్ సిద్ధిఖీ వెల్లడించారు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్ కూడా అర్షద్ కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్.. ఒలింపిక్స్ హిస్టరీలోనే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పసడి పతకంతో మెరిశాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అర్షద్ నదీమ్ స్వర్ణపతకం కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. గురువారం ఆర్ధ రాత్రి దాటాక జరిగిన ఫైనల్లో తన జావెలిన్‌ను 92.97 మీటర్లు విసిరిన జావెద్ ..తొలి ఒలింపిక్స్ గోల్డ్‌మెడల్‌ను ముద్దాడాడు. ఫైనల్లో 27 ఏళ్ల జావెద్ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కినెట్టి అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రజత పతకం సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్..ఇక ఈ విశ్వక్రీడల్లో అర్షద్ నదీప్ గోల్డ్‌మెడల్‌తో పాటు మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను అత్యధిక దూరం విసిరిన భల్లెం వీరుడుగా అర్షద్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు నార్వేకు చెందిన ఆండ్రియాస్ పేరిట ఉండేది. బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో ఆండ్రియాస్ 90.57 మీటర్లు విసిరి ఈ ఫీట్ సాధించాడు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్లు విసిరిన జావెద్ ఆండ్రియాస్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్‌గా అర్షద్ నిలిచాడు. ARSHAD NADEEM REWRITES OLYMPIC HISTORY WITH 9️⃣2️⃣.9️⃣7️⃣ Catch him in the Javelin final LIVE NOW on #Sports18 and stream for FREE on #JioCinema https://t.co/4IZVAsktjp#OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Olympics #JavelinThrow #Athletics pic.twitter.com/5gP5iRHgph— JioCinema (@JioCinema) August 8, 2024 -
దేశం మొత్తం గర్విస్తోంది.. నీరజ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. "నీరజ్ చోప్రా ఒక అద్భుతమైన అథ్లెట్. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి కెరీర్లో మరో ఒలింపిక్ మెడల్ చేరడం పట్ల యావత్తు భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. రజత పతకం సాధించినందుకు నిరాజ్కు అభినందనలు. ఎంతో మంది యువ అథ్లెట్లకు నీరాజ్ ఆదర్శమని" ఎక్స్‌లో మోదీ ప్రశంసించారు. ఇక ఈ జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb— Narendra Modi (@narendramodi) August 8, 2024 -
నేను అలసిపోయాను!
‘‘అమ్మలాంటి రెజ్లింగ్ నా మీద గెలిచింది. నేనేమో ఓడిపోయాను. దయచేసి... మీరంతా నన్ను క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి. ఇకపై నాకు పోరాడే శక్తి లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001–2024. నన్ను అభిమానించిన, మద్దతు తెలిపిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడే ఉంటాను’’... కుస్తీనే లోకంగా, ఒలింపిక్స్ పతకమే ధ్యేయంగా ఎదిగి... ఇంటా బయటా క్రీడ, క్రీడేతర శక్తులతో పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో మళ్లీ మన గుండెల్ని బరువెక్కించింది. పారిస్: సెమీస్‌లో గెలిచి... ఫైనల్‌కు ముందు 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ మ్యాట్‌పైకి దిగే ఉద్దేశం లేదని ప్రకటించింది. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని గురువారం 29 ఏళ్ల వినేశ్ వెల్లడించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) అప్పీలుకు సైతం వెళ్లిన ఆమె తీర్పు వెలువడక ముందే అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలసిపోయిన తనకు ఇకపై కుస్తీలో ప్రత్యర్థులను పట్టుపట్టే బలం లేదంటూ గురువారం సోషల్ మీడియా వేదికగా గుడ్‌బై చెప్పింది. ఊహించని ఆమె నిర్ణయానికి భారత క్రీడాలోకం నిర్ఘాంతపోయింది. ఆమెను పోరాట యోధురాలిగా చూసిన క్రీడాకారులంతా వారిస్తున్నారు. ఆమెను అభిమానించే వారంతా రెజ్లర్ అధైర్యపడొద్దని వేడుకొంటున్నారు. తల్లిలాంటి రెజ్లింగ్‌పై తన ఉక్కు సంకల్పం సడలించవద్దని అదేపనిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వినేశ్ పెదనాన్న ద్రోణాచార్య అవార్డీ, కోచ్ మహావీర్ ఫొగాట్ మాట్లాడుతూ భారత్‌కు చేరగానే తనతో మాట్లాడి వీడ్కోలు నిర్ణయాన్ని విరమించుకునేలా చేస్తానని తెలిపారు. ‘నేను బజరంగ్ పూనియా, గీత కలిసి కూర్చొని అమెతో మాట్లాడతాం. అంతా కలిసి ఆమెకు నచ్చజెబుతాం. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం లక్ష్య నిర్దేశం చేస్తాం’ అని మహావీర్ అన్నారు. వినేశ్ పోటీపడ్డ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సారా హిల్డర్బ్రంట్ (అమెరికా) మాట్లాడుతూ ‘వినేశ్ అనర్హతకు గురవడం బాధాకరం. బరువు తగ్గడం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అమె కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని పేర్కొంది. కల కాదు... ఆమెకు ఒలింపిక్స్ ఓ పీడకల! ప్రపంచ చాంపియన్íÙప్లు, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మంచి రికార్డే ఉన్న వినేశ్‌కు ఏ ఒలింపిక్స్ కూడా అచ్చి రాలేదు. అందుకే ఆమె కెరీర్లో ఒలింపిక్స్ కల కాదు ఓ పీడకలగా మిగిలిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కీలకమైన క్వార్టర్ ఫైనల్ బౌట్లో గాయం వల్ల ముందంజ వేయలేకపోయింది. మళ్లీ ఐదేళ్ల (కోవిడ్ వల్ల 2021లో) తర్వాత టోక్యో విశ్వక్రీడల్లో క్వార్టర్స్‌లోనే ఓటమితో ని్రష్కమించింది. ఇప్పుడు మూడేళ్లకే జరిగిన పారిస్ ఈవెంట్లో కనీసం ఖాయమనుకున్న రజతాన్ని అనర్హత వేటు అవహేళన చేసింది. క్రీడ అనేది మానవ సంకల్పానికి వేడుకలాంటింది. నా కెరీర్లో ఇలాంటి సందర్భాల్ని, వేడుకల్ని చాలాసార్లు చవిచూశాను. వినేశ్ సంకల్పానికి దేశం ఒక్కటై పలికిన జేజేలను మాత్రం ఎప్పుడూ చూడలేదు. పట్టు సడలించని ఆమె సంకల్పాన్ని జాతి యావత్తు వేడుక చేసుకుంటోంది. –అభినవ్ బింద్రా, షూటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత క్రీడాకారులు జీవితమంతా సవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. కలను నెరవేర్చుకునే రోజు నైపుణ్యంతో రాణిస్తే విజయం చేకూరుతుంది. కానీ ఊహకందని ఈ పొరపాట్లు (స్వల్ప బరువుతో అనర్హత) జరిగితే మాత్రం ఎవరికైనా గుండె బద్దలవుతుంది. –కేంద్ర క్రీడల మాజీ మంత్రి, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్ మేమంతా వినేశ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. కఠోర సాధనతో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో స్వర్ణం గెలిచి మా పిన్ని (వినేశ్ తల్లి), మా నాన్న మహావీర్ కలల్ని సాకారం చేసుకుంటుంది. ఇంటికొచ్చాక నాన్న ఆమెతో మాట్లాడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. –మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ వినేశ్... అంతపని (రిటైర్మెంట్) చేయొద్దు. బాధలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తగదు. నేను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తరఫున ఆమె వీడ్కోలుకు బై చెప్పి ఎప్పట్లాగే బౌట్లో సత్తాచాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. –డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వినేశ్ ప్రొఫైల్ -
కాంస్యం కోసం అమన్ పోరు
పారిస్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి ప్రయత్నంలోనే పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఒక విజయం దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత రె హిగుచి (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల అమన్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో పరాజయం చవిచూశాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగంలో 2 నిమిషాల 14 సెకన్లలో రె హిగుచి 10–0తో ఆధిక్యాన్ని సంపాదించడంతో రిఫరీ బౌట్‌ను ముగించాడు. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్తో అమన్ తలపడతాడు. రెండు ఘనవిజయాలతో... అంతకుముందు అమన్ రెండు వరుస ఘనవిజయాలతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో అమన్ 3 నిమిషాల 59 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో వ్లాదిమిర్ ఇగొరోవ్ (నార్త్ మెసడోనియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమన్ 3 నిమిషాల 56 సెకన్లలో 12–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అబాకరోవ్ జెలీమ్ ఖాన్ (అల్బేనియా)పై గెలుపొందాడు. అబాకరోవ్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో స్వర్ణం, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించడం విశేషం. అమన్ తన సహజశైలిలో ఆడితే నేడు జరిగే కాంస్య పతక బౌట్లో దరియన్‌పై నెగ్గడం అంత కష్టమేమీ కాదు. అన్షు తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. హెలెన్ లూసీ మరూలిస్ (అమెరికా)తో జరిగిన బౌట్లో అన్షు 2–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హెలెన్ ఫైనల్ చేరుకోకపోవడంతో అన్షుకు రెపిచాజ్ రూపంలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది. భారత్ ః పారిస్ ఒలింపిక్స్నాలుగో స్థానంలో నిలిచిన ప్లేయర్లులక్ష్య సేన్బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్అంకిత భకత్–బొమ్మదేవర ధీరజ్ఆర్చరీ మిక్స్డ్ టీమ్ మహేశ్వరీ చౌహాన్–అనంత్‌జీత్ సింగ్ షూటింగ్ స్కీట్ మిక్స్డ్ టీమ్ అర్జున్ బబూతాషూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్మనూభాకర్ షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ 10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్యాలు గెలిచింది.మీరాబాయి చానూవెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీలు ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం...పారిస్ ఒలింపిక్స్‌లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది. ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది. షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మనవాళ్లు నిరాశ పరిచారు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడగా... మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు. -
పడి.. లేచి.. మరో పతకం వైపు...
2023 మార్చి... సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. పేలవ ఆటతో సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచిన టీమ్... గతంలో ఏ ఆతిథ్య జట్టూ ఎదుర్కోని అవమానాన్ని భరించాల్సి వచ్చింది. దాంతో మరోసారి భారత హాకీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన జట్టు ఇదేనా అనిపించింది. అప్పుడప్పుడే మళ్లీ ఆటపై ఆసక్తి పెరుగుతున్న దశలో స్వదేశంలో జట్టు ఆట మళ్లీ నిరాశపర్చింది. దాంతో సహజంగానే జరిగిన మార్పుల్లో భాగంగా ముందుగా కోచ్ గ్రాహం రీడ్‌పై వేటు పడింది. కొత్త కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్ వచ్చాడు. ఆటగాడిగా, కోచ్‌గా విశేష అనుభవం ఉన్న అతను భారత జట్టును మళ్లీ దారిలోకి తీసుకురాగలడని అంతా భావించారు. ఈ నమ్మకాన్ని ఫుల్టన్ నిలబెట్టుకున్నాడు. తనదైన శైలిలో ఆటగాళ్లను మరింత పదునుగా మార్చే పనిలో పడ్డాడు. అప్పటికే సీనియర్లుగా దేశం తరఫున ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు ఆడిన వారిని కూడా తనకు కావాల్సిన రీతిలో మలచుకున్నాడు. ముఖ్యంగా అవుట్‌ఫీల్డ్‌లో వేగం పెంచడం, ఆరంభం నుంచే దూకుడు పెంచి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంవంటి విషయంలో ఆటగాళ్లలో కొత్త తరహా ఆటను తీసుకొచ్చాడు. ముందుగా ఆటగాళ్లు కొంత ఇబ్బంది పడ్డా మెల్లగా ఇవి మంచి ఫలితాలు అందించాయి.ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణాలు గెలిచిన భారత్ ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆటగాళ్లందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. వరల్డ్ కప్ వైఫల్యాన్ని దాటి మున్ముందు పెద్ద విజయం సాధించాలనే కసి, పట్టుదల వారిలో పెరిగాయి. ఒలింపిక్స్‌లో భారత జట్టు ఆట చూస్తే ఫుల్టన్ ప్రణాళికలు ఎంత అద్భుతంగా పని చేశాయో తెలుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకే తరహా ఆటతో కాకుండా వేర్వేరు ప్రత్యర్థుల కోసం జట్టు వేర్వేరు వ్యూహాలు పన్నింది. బెల్జియం జట్టు తమ డిఫెన్స్‌ను పటిష్టంగా ఉంచుకుంటూనే దూకుడుగా ఆడింది. అదే ఆ్రస్టేలియాపై వచ్చేసరికి ఆట మారింది. క్షణకాలం డిఫెన్స్‌లో పడినా ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందని తెలుసు కాబట్టి తొలి నిమిషం నుంచి పూర్తిగా అటాకింగ్‌పైనే దృష్టి పెట్టింది. మళ్లీ బ్రిటన్‌తో మ్యాచ్ వచ్చేసరికి డిఫెన్స్‌కు కట్టుబడింది. ఒక ఆటగాడు తగ్గినా కీపర్‌తో కలిసి గోల్స్‌ను కాపాడుకోవడంలో జట్టు సఫలమైంది. సెమీస్‌లో జర్మనీతో ఓడినా గతంలో ఎన్నడూ చూడని అటాకింగ్, ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం మన టీమ్ నుంచి కనిపించిందని మాజీ ఆటగాడు వీరేన్ రస్కిన్హా వ్యాఖ్యానించడం విశేషం. క్షణాల వ్యవధిలో వ్యూహాలు మార్చుకోవడం, పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు ఆటతీరును మలచుకోవడం గతంలో భారత జట్టు విషయంలో ఎప్పుడూ చూడనిది. భారత జట్టు గెలుపు మరో వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. అతనే ప్యాడీ ఆప్టన్. స్పోర్ట్స్ సైకాలిజిస్ట్ అయిన ఆప్టన్ భారత హాకీ ఆటగాళ్లను మానసికంగా సంసిద్ధం చేయడంలో, ఒత్తిడిని ఎదుర్కోకుండా బలంగా నిలబడే విషయంలో సరైన దిశలో తీర్చిదిద్దాడు. 2011లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో భారత జట్టు ఇదే ఆప్టన్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గా వ్యవహరించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కోచ్‌ల వ్యూహాలను అమలు చేసే విషయంలో ఆటగాళ్లు ఎక్కడా గతి తప్పలేదు. ఒలింపిక్స్‌తో రిటైర్ అవుతున్న గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా ప్రత్యర్థులను నిలువరించాడు. ఎనిమిది మ్యాచ్‌లలో అతను 62 షాట్లను ఎదుర్కొంటే 50 షాట్లను ఆపడం విశేషం. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీలను గోల్స్‌గా మలచడంలో అద్భుత నైపుణ్యం చూపిస్తూ ఒలింపిక్స్‌లో 10 గోల్స్ నమోదు చేశాడు. డిఫెండర్లు రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌లు అద్భుతంగా ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకున్నారు. అత్యంత సీనియర్ అయిన మాజీ కెపె్టన్ మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో తన పదును చూపించగ, మరో సీనియర్ మన్దీప్ ఫార్వర్డ్‌గా జట్టును నడిపించాడు. అందరి సమష్టి ప్రదర్శన, పోరాటం, పట్టుదల భారత్‌కు వరుసగా రెండో కాంస్యాన్ని అందించాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులోని 11 మంది సభ్యులు ‘పారిస్’లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. –సాక్షి క్రీడా విభాగం జ్యోతికి మళ్లీ నిరాశ పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. వెనుకంజలో గోల్ఫర్లు పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. -
వహ్వా హాకీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం
టోక్యోలో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత హాకీ జట్టు పారిస్ వరకు దానిని కొనసాగించింది. నాటి విజయం తర్వాత అంచనాలను పెంచిన మన టీమ్ ఈసారి కూడా దానికి తగినట్లుగా పతకాన్ని అందించింది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తమ సత్తాను చాటింది. 1952–1972 మధ్య వరుసగా ఒలింపిక్ మెడల్ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం గత ఒలింపిక్స్ కాంస్యపు ప్రదర్శనను పునరావృతం చేసింది. రెండు సందర్భాల్లోనూ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఈ గెలుపు తర్వాత ఘనంగా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీకిది 13వ పతకం కావడం విశేషం. పారిస్: మ్యాచ్‌లో 58 నిమిషాలు ముగిసేసరికి 2–1తో ఆధిక్యంలో భారత్... మరో రెండు నిమిషాలు బంతిపై పట్టు ఉంచుకుంటే చాలు మ్యాచ్ మనదే... అయితే సరిగ్గా 59వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దాంతో అందరిలో కాస్త ఆందోళన... గతంలో చాలా సందర్భాల్లో భారత జట్టు గెలిచే స్థితిలో ఉండి ఆఖరిలో పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ ఇచ్చి మ్యాచ్ కోల్పోయింది. కాబట్టి కొంత ఉత్కంఠ! అయితే స్పెయిన్ ప్లేయర్ మిరాల్స్ ప్రయత్నాన్ని భారత గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే 60వ నిమిషంలో కూడా వారికి మరో పెనాల్టీ కార్నర్. ఈసారి కూడా శ్రీజేశ్ నిలువరించాడు. దాంతో పాటు చురుగ్గా ఉన్న మన ఆటగాళ్లు బంతిని అందుకొని తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. స్పెయిన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినా మళ్లీ మన సర్కిల్‌లోకి రాలేకపోయారు. అంతే... టీమిండియా బృందంలో సంబరాలు మొదలయ్యాయి. శ్రీజేశ్ తన కీపింగ్ పోస్ట్ వద్ద కుప్పకూలిపోగా... సహచరులంతా చుట్టుముట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. సెమీస్‌లో అనూహ్యంగా ఓడినా... చివరకు కాంస్య పతకం గెలుచుకొని భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. ఈ ‘ప్లే ఆఫ్’ పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (30వ నిమిషం, 33వ నిమిషం) సాధించగా... స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్స్ (18వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో నాలుగో కాంస్యం చేరింది. సమష్టి ప్రదర్శనతో... 1980 తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భారత్ 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అదే తరహాలో భారతీయుల నమ్మకాన్ని జట్టు వమ్ము చేయలేదు. అటు అటాకింగ్‌లో, ఇటు డిఫెన్స్‌లో కూడా జట్టు ప్రభావం చూపించింది. సస్పెన్షన్ కారణంగా గత మ్యాచ్ ఆడని డిఫెండర్ అమిత్ ఈ మ్యాచ్‌లో తిరిగొచ్చి బలంగా నిలబడ్డాడు. 6వ నిమిషంలో సుఖ్‌జీత్‌కు గోల్ అవకాశం వచ్చినా అతను పోస్ట్‌కు దూరంగా కొట్టాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో గోల్ నమోదు కాలేదు. అయితే రెండో క్వార్టర్లో స్పెయిన్ శుభారంభం చేసింది. క్లేప్స్ను టాకింగ్ చేసే ప్రయత్నంలో ‘డి’లో మన్‌ప్రీత్ ఫౌల్ చేయడంతో స్పెయిన్ పెనాల్టీ స్ట్రోక్ లభించగా, దానిని మిరాల్స్ సులువుగా గోల్‌గా మలిచాడు. అయితే 21 సెకన్లలో రెండో క్వార్టర్ ముగుస్తుందనగా పెనాల్టీతో భారత్ స్కోరు సమం చేసింది. మరో మూడు నిమిషాలకే మళ్లీ పెనాల్టీ ద్వారానే హర్మన్ స్కోరు చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మన జట్టు దానిని చివరి వరకు నిలబెట్టుకోగా... ఆఖరి మూడు నిమిషాల్లో గోల్ కీపర్‌ను తప్పించి స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. తమకు లభించిన 6 పెనాల్టీ కార్నర్లను భారత్ 2 గోల్స్‌తో సద్వినియోగం చేసుకోగా... స్పెయిన్‌కు 9 పెనాల్టీలు లభించినా ఆ జట్టు ఒక్కదానినీ గోల్‌గా మలచలేకపోయింది.‘గ్రేట్ వాల్ ఆఫ్ భారత్’ శ్రీజేశ్ అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు శ్రీజేశ్ ముందే ప్రకటించాడు. అతనికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు జట్టు సభ్యులు వెల్లడించారు. ఒక్కొక్కరికీ 15 లక్షలు ప్లేయర్లకు హాకీ ఇండియా నజరానా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఒలింపిక్స్ హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు విశ్వక్రీడల్లో ఇది 13వ పతకం కావడం విశేషం. నెదర్లాండ్స్‌కు స్వర్ణం 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3–1తో జర్మనీ జట్టుపై గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. గతంలో నెదర్లాండ్స్ జట్టు 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లలో పసిడి పతకాలు సాధించింది. భారత జట్టు అత్యధికంగా 8 స్వర్ణాలు నెగ్గగా... నెదర్లాండ్స్, పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ జట్లు మూడు సార్లు చొప్పున బంగారు పతకాలు గెలిచాయి. నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించింది. –పీఆర్ శ్రీజేశ్ కాంస్యపతక పోరు మాకూ, మా దేశానికి ఎంతో కీలకం. ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫలితం మనకు అనుకూలంగా రాదు. భారత్ వరుసగా రెండు సార్లు పతకం సాధించడం గొప్ప విషయం. ఇది అంత సులువు కాదు. పెనాల్టీ కార్నర్లను మా బృందం చాలా అద్భుతంగా నిలువరించగలిగింది. హాకీపై ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. –హర్మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ఎన్నో తరాల పాటు గుర్తుంచుకునే ప్రదర్శన ఇది. భారత హాకీ జట్టు ఒలింపిక్ కాంస్యంతో మెరిసింది. ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం. ప్రతిభ, పట్టుదలకు తోడు సమష్టి కృషి దీనిని అందించింది. ఆటగాళ్లకు నా అభినందనలు. ప్రతీ భారతీయుడికి మానసికంగా హాకీతో బలమైన బంధం ఉంది. ఈ విజయం వల్ల యువతలో ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుంది. –నరేంద్ర మోదీ, ప్రధాని Harmanpreet Singh has 10 goals from 8 matches at the Paris Olympics. 🥶🇮🇳pic.twitter.com/Y7sxmI5jDF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024One of the crucial saves of PR Sreejesh. 🫡🇮🇳pic.twitter.com/2Qw7MghpqY— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024 -
Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన అమన్ సెహ్రావత్.. పతకానికి అడుగు దూరంలో..!
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. అల్బేనియాకు చెందిన జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0 తేడాతో గెలుపొందాడు. AMAN SEHRAWAT, THE NEW HERO OF INDIAN WRESTLING. 🌟🔥 pic.twitter.com/rafzNRz9q4— Johns. (@CricCrazyJohns) August 8, 2024ఇవాళ (ఆగస్ట్ 8) రాత్రే జరిగే సెమీఫైనల్లో సెహ్రావత్.. జపాన్‌కు చెందిన రె హిగుచితో తలపడతాడు. ఈ బౌట్లో సెహ్రావత్ గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమవుతుంది. భారత కాలమానం ప్రకారం సెమీఫైనల్ బౌట్ రాత్రి 9:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
Paris Olympics 2024: భారత రెజ్లర్‌పై మూడేళ్ల నిషేధం
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై భారత ఒలింపిక్ సంఘం (IOA) చర్యలు తీసుకుంది. అంతిమ్‌పై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. అంతిమ్‌తో పాటు ఆమె సహాయక సిబ్బంది మొత్తాన్ని తక్షణమే స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘం ఆదేశించింది. అంతిమ్ అక్రిడేషన్‌పై ఆమె సోదరి ఒలింపిక్ విలేజ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐఓఏ అంతిమ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. 19 ఏళ్ల అంతిమ్ ఒలింపిక్స్ తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. టర్కీ రెజ్లర్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 8) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. ఉత్తర మాసిదోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగొరోవ్పై 10-0 తేడాతో గెలుపొందాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్లో సెహ్రావత్ ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇవాళే జరిగే క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. జెలిమ్ఖాన్ అబాకరోవ్ లేదా దియామ్యాంటినో లూనా ఫఫేతో తలపడతాడు. -
రాజ్యసభలో వినేశ్ ఫొగట్ అంశం .. విపక్షాలపై ధన్‌ఖడ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్‌లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. #WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5— ANI (@ANI) August 8, 2024వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. -
పతకం లేకపోతేనేమి.. నువ్వే మా బంగారం!
వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరి ఒలింపిక్ పతకం ఖాయం చేసుకున్న సమయాన దేశం మొత్తం పులకించింది. ప్రజలంతా ‘దేశ్ కీ బేటీ’ గెలుపును తమ గెలుపుగా భావించారు. ఆమెను ఒక్క క్రీడాకారిణిగానే కాకుండా ఒక పోరాట యోధురాలిగా చూశారు. గత ఏడాదిన్నర కాలంగా వినేశ్ వ్యవస్థతో పోరాడటం, ఆపై మళ్లీ బరిలోకి దిగి విజయాలు సాధించిన తీరు ఫొగాట్‌పై ఆదరణను పెంచాయి. ఫైనల్ చేరినప్పుడు వచ్చిన స్పందన దానినే ప్రతిఫలించింది. ఎవరు గెలిచినా గెలవకపోయినా వినేశ్ పతకం గెలిస్తే చాలనుకున్నారు. ఇప్పుడు పతకం చేజారడం కూడా అంతే స్థాయిలో ఆవేదనను కలిగించింది. అందుకే అన్ని వైపుల నుంచి బాధతో కూడిన స్పందనలు. ఇదీ వినేశ్ సంపాదించుకున్న అభిమాన ధనం! ఒక్కసారి కొంత వెనక్కి వెళ్లి చూస్తే రెజ్లింగ్ ప్రపంచంలో ఆమె ఎన్నో పెద్ద విజయాలు అందుకుంది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు మాత్రమే కాదు వరల్డ్ చాంపియన్íÙప్లలో కూడా ఆమె రెండు పతకాలు గెలుచుకుంది. ఢిల్లీలో నిరసనల సమయంలో ఆమె తెగింపును, రెజ్లింగ్ పెద్దలతో తలపడిన ఘటనలను చూస్తే కెరీర్‌ను ముగించడానికే సిద్ధపడినట్లుగా అనిపించింది. ఆ సమయంలో మరో ఒలింపిక్ ప్రయత్నం అవకాశాలు కూడా కనిపించలేదు. కానీ నాటి ఘటనలు ఆమెలో మరింత పట్టుదలను పెంచాయి. తాను పోరాడుతోంది తన కోసం కాదని, సహచర మహిళా రెజ్లర్ల కోసమని నినదించిన వినేశ్ ఆ పోరాటంలో కొంత వరకు సఫలమైంది. కానీ అక్కడితే ఆగిపోతే రాజకీయాలు మొదలవుతాయని ఆమెకు అర్థమైంది. అందుకే మళ్లీ ఆటలోకి దిగేందుకు నిశ్చయించుకుంది. కెరీర్లో మిగిలిన ఒలింపిక్ పతకం కోసం ఆమె ఎంతో శ్రమించింది. వెయిట్ కేటగిరీలో మార్చుకొని మరీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టింది. మధ్యలో గాయాలు ఎదురైనా తగ్గలేదు. బుధవారం ఆమె అనుభవించిన వేదనను లెక్క కట్టేందుకు ఎలాంటి పరికరాలు లేవు. 100 గ్రాముల బరువు విలువ ఇంత భారంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. ఇక్కడ ఒక మెడల్ ఆమె మెడను అలంకరించకపోవచ్చు. కానీ ఆమె ఓడిపోలేదు. బంగారం, వెండి పతకాలతో పోలిస్తే ఆమె చూపించిన పోరాటం, పట్టుదల అమూల్యం. బరువు లెక్కలు తప్పడం తప్ప బాధపడేందుకు వినేశ్ ఎలాంటి తప్పూ చేయలేదు. ఆమె డోపింగ్‌కు పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా ఓడలేదు. అయినా మ్యాచ్ ఫిక్సర్లను కూడా మళ్లీ పిలిచి ఆడించే మన దేశంలో వినేశ్ సాధించిన ఘనతను చూసి సంతోషించాలి. అందరూ గర్వించేలా చేసిన ఈ అమ్మాయే అసలు బంగారం!- సాక్షి క్రీడా విభాగం -
Paris Olympics: భారత క్రీడాకారుల నేటి షెడ్యూల్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 13వ రోజు భారత క్రీడాకారులు తమ ఆదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యారు. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ రౌండ్లో పోటీపడనున్నాడు. ఈ ఫైనల్ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 11:55 నుంచి ప్రారంభం కానుంది.13వ రోజు భారత షెడ్యూల్ ఇదే..పురుషుల కాంస్య పతక పోరు: భారత్ వర్సెస్ స్పెయిన్ (సాయంత్రం గం. 5:30 నుంచి)మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రౌండ్: జ్యోతి యర్రాజీ (మధ్యాహ్నం గం. 2:05 నుంచి). పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా (రాత్రి గం. 11:55 నుంచి)పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్: అమన్ సెహ్రావత్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి). మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీలు: అన్షు మలిక్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) -
ఒలింపిక్స్‌లో అనర్హతపై వినేశ్ ఫొగట్ భావోద్వేగం
-
ఒలింపిక్స్‌లో మరో ప్రేమ జంట.. లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ప్రదర్శనతో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అందరని ఆకట్టుకుంటున్నాయి. ఈ విశ్వ క్రీడల వేదికగా మరో ప్రేమ జంట ప్రపంచానికి పరిచయమైంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ తన ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేసింది. కాగా ఆలిస్ ఫినోట్ రేసు ప్రారంభానికి ముందు ఓ ఛాలెంజ్ చేసింది. ఈ రేసును తొమ్మిది నిమిషాలలోపు పూర్తి చేస్తే తన ప్రియుడికి అందరి ముందు తన ప్రేమను తెలియజేస్తానని స్నేహితులతో కండీషన్ పెట్టుకుంది. అయితే అనుకున్న విధంగానే 9 నిమిషాల్లో పరుగు పూర్తి చేసిన ఈ ఫ్రెంచ్ క్రీడాకారణి.. బహిరంగంగా తన బాయ్‌ఫ్రెండ్‌కు తన ప్రేమను తెలియజేసింది.రేసును ముగించిన వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్లిన ఫినోట్.. ఉంగరాన్ని తీసి మోకాళ్లపై కూర్చోని లవ్ ప్రపోజ్ చేసింది. తన ప్రేయసి తనకోసం వేసిన ప్రపోజల్ ప్లాన్‌తో ఒక్కసారిగా సదరు బాయ్‌ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు.ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 3000 మీటర్ల రేసును అలిస్ ఫినోట్ ఎనిమిది నిమిషాల 58.67 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా ఈ రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి యూరోపియన్‌గా ఆమె రికార్డులకెక్కింది. కాగాఇంతకుముందు అర్జెంటీనా అథ్లెట్స్ సిమొనెట్, పిలర్ కంపోయ్.. చైనా బ్యాడ్మింటన్ జోడీ హువాంగ్ యా కియోంగ్ ,లీ యుచెన్ జోడీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగానే ఒక్కటయ్యారు. French athlete came in fourth in the 3000m steeplechase, a European record, and asked for her boyfriend's hand ...pic.twitter.com/ofs9DocirE— Figen (@TheFigen_) August 7, 2024 -
ఫైనల్‌కు ముందు హార్ట్ బ్రేకింగ్.. వినేశ్‌కు రజతం ఇస్తారా?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. మహిళల 50కేజీల విభాగం ఫైనలో పోటీ పడాల్సిన వినేష్‌పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. పోటీ విభాగం(50 కేజీల) కంటే 100 గ్రాముల బరువు ఆధికంగా ఉండటంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీంతో వినేష్ పతక ఆశలు అవిరయ్యాయి.సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన ఫోగట్ కచ్చితంగా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ కేవలం 100 గ్రాముల బరువు 140 కోట్ల భారతీయుల గుండె పగిలేలా చేసింది. ఈ క్రమంలో వినేష్ ఫోగట్‌కు రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించేసింది.గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ఫోగట్ వెల్లడించింది. తనకు మరి పోరాడే బలం లేదని వినేష్ తన రిటైర్మెంట్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే తనపై ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని ఛాలంజ్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీనిపై ఆర్భిట్రేషన్ ఇంకా తీర్పు వెల్లడించలేదు. ఈ క్రమంలో ఆర్భిట్రేషన్ తీర్పు ఫోగట్‌కు అనుకూలంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటుంది.ఫోగాట్‌కు సిల్వర్ మెడల్ ఇస్తారా?2016 రియో ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్ పోటీలను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్‌కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్లలో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమ ఉజ్జీల మధ్యే పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో రూల్ మార్చారు. నిబంధనల ప్రకారం రెండు రోజులూ బరువు చూస్తారు. రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మాడ్చుకొని అయినా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్ వరకు గెలిచింది కాబట్టి రజతం ఇవ్వవచ్చనే వాదన కొందరు లేవనెత్తారు. కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని బౌట్ల ఫలితాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్‌కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందని కూడా అభిమానులు అనుకున్నారు. కానీ అదీ నిబంధనలకు విరుద్ధం. అంతకుముందు మ్యాచ్‌లలో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్ రెండో వెయింగ్‌లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేశ్‌కు ఆ అవకాశమూ లేకపోయింది. -
కాంస్యం కోసం ఆఖరి పోరు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు.. గురువారం కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు చేరింది. మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకమే సాధించగా... వరుసగా రెండోసారి పోడియంపై నిలిచే అవకాశం టీమిండియా ముందుంది. జర్మనీతో సెమీఫైనల్లో భారత్ హోరాహోరీగా పోరాడి ఓడగా... మరో సెమీస్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయాం పాలైంది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘రెడ్ కార్డు’కు గురై సెమీస్‌కు అందుబాటులో లేకుండా పోయిన డిఫెండర్ అమిత్ రోహిదాస్... ఈ మ్యాచ్‌లో ఆడనుండటం భారత్‌కు సానుకూలాంశం. జర్మనీతో పోరులో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సది్వనియోగ పర్చుకోలేకపోయిన భారత్.. ఆ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టోరీ్నతో కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్న గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ మరోసారి కీలకం కానున్నాడు. ‘సెమీస్ పరాజయం చాలా బాధించింది. పసిడి నెగ్గే సువర్ణ అవకాశం చేజారింది. అయితే ఆ ఓటమిని మరిచి కాంస్య పతక పోరుపై దృష్టి పెట్టాం. దేశానికి పతకం అందించేందుకు ఇదే చివరి అవకాశం. అందుకే ప్రతి ఆటగాడు దీన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు’అని శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వేదికగా స్పెయిన్‌తో భారత్ పది సార్లు తలపడగా.. అందులో ఏడింట గెలిచింది. ఒక మ్యాచ్ స్పెయిన్ నెగ్గగా.. మరో రెండు ‘డ్రా’గా ముగిశాయి. -
నీరజ్‌పైనే పసిడి ఆశలు
పారిస్: యావత్ భారతావని ఆశలు మోస్తూ... పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ రౌండ్లో అదరగొట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురువారం ఫైనల్ బరిలో దిగనున్నాడు. వరుసగా రెండోసారి పసిడి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్‌చోప్రా.. అర్హత పోటీల్లో ఒకే ఒక్క త్రోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మంగళవారం క్వాలిఫయింగ్ ఈవెంట్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి దర్జాగా ఫైనల్ చేరాడు. పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో నీరజ్ అదే ప్రదర్శన కొనసాగించాలని చూస్తున్నాడు. అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జూలియన్ వెబర్ (జర్మనీ), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్), జాకుబ్ వెద్లెచ్ (చెక్ రిపబ్లిక్) నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురవనుంది. ఈరోజు జరిగే ఫైనల్లో మొత్తం 12 మంది పతకాల కోసం పోటీ పడనున్నారు. ముందుగా జావెలిన్ త్రోయర్లకు మూడు అవకాశాలు ఇస్తారు. మూడు అవకాశాల తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్న వారు ని్రష్కమిస్తారు. ఇక మిగిలిన ఎనిమిది మందికి మరో మూడు అవకాశాలు ఇస్తారు. మొత్తం ఆరు త్రోల తర్వాత టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు షట్లర్ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్ కాంస్యం; 2012 లండన్ రజతం), షూటర్ మనూ భాకర్ (2024 పారిస్; రెండు కాంస్యాలు) మాత్రమే విశ్వక్రీడల్లో రెండేసి పతకాలు సాధించారు. గురువారం నీరజ్ పోడియంపై నిలిస్తే ఈ జాబితాలో చేరనున్నాడు. ఇక అగ్రస్థానం దక్కించుకుంటే.. దేశం తరఫున వ్యక్తిగత విభాగంలో రెండు పసిడి పతకాలు గెలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
వినేశ్ ఫోగట్ సంచలన నిర్ణయం... రెజ్లింగ్‌కు గుడ్ బై
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు వినేష్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో తలపడాల్సిన వినేశ్.. ఆధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే. బంగారు పతకానికి అడుగు దూరంలో నిలబడిన వినేశ్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. ఈ క్రమంలోనే తన ఇష్టమైన క్రీడకు వినేశ్ విడ్కోలు పలికింది. "నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించిండి. మీ కల, నా ధైర్యం అన్ని విచ్ఛిన్నం అయ్యాయి. నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు. అందుకే నాకు ఇష్టమైన క్రీడ రెజ్లింగ్(2001-2024) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఎక్స్‌లో వినేశ్ రాసుకొచ్చింది.కాగా ఈ విశ్వక్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ పై 140 కోట్ల భారతీయలు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగాట్‌తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు విభాగం (50కేజీ) కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారని వినేశ్‌పై అనర్హత వేటు పడింది.కాగా ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్భిట్రేషన్ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. ఇంతలోనే వినేశ్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।अलविदा कुश्ती 2001-2024 🙏आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024 -
వినేశ్ కోసం రూల్స్ మార్చలేం: యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు లలోవిక్
పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వినేశ్ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు. బరుపు తగ్గేందుకు వినేశ్ శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నాడు. ఏదిఏమైనా రూల్స్‌ను గౌరవించాల్సిందేనని తెలిపాడు. ఇందుకు వినేశ్ మినహాంపు కాదని వివరించాడు. వినేశ్ స్వల్ప తేడాతోనే అధిక బరువు ఉన్నప్పటికీ నిబంధనలను మార్చలేమని తెలిపాడు. బరువు పెరిగిన అథ్లెట్‌ను పోటీకి అనుమతించడం అసాధ్యమని పేర్కొన్నాడు. నిబంధనల ప్రకారం అనర్హతకు గురైన అథ్లెట్ పోటీలో చివరి స్థానంలో ఉంటారని తెలిపాడు.కాగా, వినేశ్ ఫైనల్లో అమెరికాకు చెందిన సారా హిల్డర్‌బ్రాండ్‌తో తలపడాల్సి ఉండింది. వినేశ్ నిష్క్రమణతో సెమీఫైనల్లో ఓడిన క్యూబా క్రీడాకారిణి యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్ ఫైనల్‌కు అర్హత సాధించింది.నిబంధనలు ఇలా..ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో పోటీపడే అథ్లెట్ల బరువును ఏ రోజైతే బౌట్ ఉంటుందో ఆరోజు ఉదయం తూస్తారు. ప్రతి వెయిట్ క్లాస్‌లో పోటీపడే అథ్లెట్లకు తగినంత సమయం ఉంటుంది. రెండు రోజుల వ్యవధిలో తొలి రోజు బరువు కొలిచేందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో ఎన్నిసార్లైనా బరువు కొలుచుకోవచ్చు. అయితే, రెండోరోజు మాత్రం ఇందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. ఈలోపు నిర్ణీత బరువు ఉంటేనే బౌట్‌కు అనుమతిస్తారు. -
Paris Olympics 2024: వినేశ్ ఫోగట్ అనర్హత.. ప్రముఖుల స్పందన
పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ పోటీల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. సంచలన విజయాలతో ఫైనల్ వరకు చేరిన వినేశ్.. తుది సమరానికి ముందు జరిపిన బరువు పరీక్షలో విఫలమైంది. నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారతీయుల ఆశలు అడియాసలయ్యాయి. అనర్హత కారణంగా వినేశ్ పతకం లేకుండానే విశ్వక్రీడల సంగ్రామం నుంచి నిష్క్రమించింది.వినేశ్ అనర్హత నేపథ్యంలో దేశ ప్రధాన సహా చాలామంది ప్రముఖులు స్పందించారు. ఒలింపిక్స్‌లో వినేశ్ ప్రయాణాన్ని సోషల్‌మీడియా కీర్తిస్తుంది. వినేశ్ విజయాలను ఓర్వలేక కుట్ర చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. వినేశ్ పతకం గెలవలేకపోయినా అందరి హృదయాలను గెలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే వేటు వేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వినేశ్ పతక కలలు కల్లలు కావడంతో యావత్ భారతావణి బాధలో మునిగిపోయింది.ఆసుపత్రిలో చేరిన వినేశ్ఫైనల్కు ముందు అధిక బరువు ఉన్నానని గ్రహించిన వినేశ్.. బరువు తగ్గేందుకు శతవిధాల ప్రయత్నించి. కనీసం నీళ్లు కూడా తాగలేదు. రాత్రంగా నిద్రపోకుండా పరిగెత్తుతూ, కసరత్తులు చేస్తూ గడిపింది. అయినా బరువు పరీక్ష సమయానికి ఆమె 100 గ్రాములు అధికంగా ఉండింది. తీవ్రమైన వర్కౌట్లు చేయడం కారణంగా వినేశ్ అస్వస్థతకు గురైంది. ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న భారత అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వినేశ్ డీ హైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు.వినేశ్ అనర్హతపై ప్రముఖుల స్పందనవినేశ్.. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరు స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.వినేశ్ స్వర్ణంతో తిరిగి వస్తుందని దేశమంతా ఆశించింది. కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే వేటు వేస్తారా. దేశ ప్రజలారా.. మీరేమీ నిరాశ చెందవద్దు. ఏదో ఒకరోజు వినేశ్ కచ్చితంగా దేశానికి పతకం తెస్తుంది. వచ్చే ఒలింపిక్స్ కోసం నేను ఆమెను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తాను- మహవీర్ ఫొగట్, వినేశ్ ఫోగట్ బాబాయ్వినేశ్ సామర్థ్యం, సంకల్పం, ధైర్యం చాలా గొప్పవి. ఇప్పటి వరకు ఆమె సాధించిన విజయాలు ఆకట్టుకున్నాయి. వినేశ్ పతకం సాధించలేకపోయినా మా హృదయాలను గెలుచుకుంది.-శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీదేశం మొత్తానికి తీరని లోటు. ఈ విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ లోతుగా పరిశీలించి.. అవసరమైన చర్యలు తీసుకుంటుంది- బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్, వివాదాస్పద బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ తనయుడువినేశ్ విషయంలో కుట్ర జరిగింది. ఆమెకు కావాల్సినంత సమయం ఇవ్వలేదు.-ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్భారత్ ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలి- ఆమ్ ఆద్మీ పార్టీविनेश के साथ कोई साजिश नहीं हुई है!विनेश के साथ कोई राजनीति नहीं हुई है!विनेश फोगाट के चाचा महावीर फोगाट का बड़ा बयान!फेडरेशन में कड़े नियम होते हैं और नियम के अनुसार फैसला लिया जाता है।1 ग्राम भी वजन ज्यादा हो जाए तो डिसक्वालिफाई कर दिया जाता है।विनेश को एक रात पहले ही… pic.twitter.com/YcWWiLgIgs— Panchjanya (@epanchjanya) August 7, 2024వినేశ్‌కు మద్దతుగా ప్రముఖ కార్టూనిస్ట్‌ల కార్టూన్లు.. -
హృదయం ముక్కలైంది: మరేం పర్లేదు.. ఇప్పటికే గెలిచేశావ్! (ఫొటోలు)
-
ఒట్టు... మను బాకర్ భోజనమే చేయలేదు!
గెలుపు, ఓటములకు అతీతంగా కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆట అంటే ‘గెలుపు’ లేదా ‘ఓటమి’ మాత్రమే కాదు. గెలుపుకు ముందు, గెలిచిన తరువాత, ఓటమికి ముందు ఓటమికి తరువాత విషయాలు కూడా పసందుగా ఉంటాయి. ‘షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో భోజనం చేయలేదు’ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరె మనకు పతకాలు తెచ్చిన అమ్మాయి భోజనం చేయలేదా? ఎందుకు చేయలేదు?పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్డ్ టీమ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డ్ సృష్టించింది షూటర్ మను బాకర్. ‘ఇది మను ఒలింపిక్స్’ అంటూ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. 25 మీటర్ల విభాగంలో మూడో పతకం కొద్దిలో చేజారింది.హిస్టారిక్ మెడల్ హాట్రిక్ మిస్ అయిన తరువాత ఆమె ఏం ఆలోచించిందనే విషయానికి వస్తే... మొదటిది... నాలుగు సంవత్సరాల తరువాత లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్ గురించి. రెండోది... భోజనం గురించి. మొదటి విషయం సరే, రెండో విషయమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఆడి ఆడి అలిసిపోయిన మను బాకర్‌ను విశ్రాంతి గురించి అడిగినప్పుడు... ‘నేను చేసే మొదటి పని ఇంటి భోజనం చేయడం. ఇన్ని రోజులు నేను భోజనం చేయలేదు. విలేజ్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, షూటింగ్ రేంజ్‌కు వచ్చేదాన్ని. అక్కడ స్నాక్స్ తినేదాన్ని. విలేజ్‌లో మధ్నాహ్న భోజనం ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత 3 లేదా 5 గంటల మధ్య మాత్రమే తిరిగి భోజనశాలకు రావడానికి వీలయ్యేది. ఆ సమయానికి మధ్యాహ్న భోజనం అయిపోయేది. దాంతో సాయంత్రం ఏదో తినేదాన్ని’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మను బాకర్.మను మధ్యాహ్న భోజనానికి దూరమైన విషయం ఆమె తల్లి సుమేధకు కూడా తెలిసి పోయింది.కుమార్తె విజయం కోసం రోజూప్రార్థనలు చేసిన ఆమె ఇలా అన్నది...‘మను ఇంటికి తిరిగి రాగానే వేడి వేడి ఆలూ పరోట తినిపిస్తాను. మనుకు ఆలూ పరోట అంటే ఎంతో ఇష్టం’ ‘కుమార్తె గెలుపు వార్త మాత్రమే వినాలి... తన ఓటమిని చూడలేను’ అనుకుందో ఏమో మను బాకర్ లైవ్ మ్యాచ్‌లు చూడడానికి ఇష్టపడేది కాదు సుమేధ.‘మా అమ్మ నన్ను ఛాంపియన్ చేయడం కోసం ఎంతో కష్టపడింది. అమ్మా... నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటున్న మను బాకర్ అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తోంది.‘ఏదైనా సరే, మా ఇంట్లో అమ్మ చేతివంట తినడం అంటే ఎంతో ఇష్టం. ఐ రియల్లీ లవ్ ఆలూ పరోటా. ఆలూ పరోటా తినక నాలుగు నెలలు అవుతోంది’ అంటుంది మను బాకర్ మనకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ విజయాల వెనుక ఎన్ని సర్దుబాట్లు ఉంటాయో చెప్పడానికి మను బాకర్ ఒక ఉదాహరణ.ఒకటి రెండు రోజులంటే ఫరవాలేదుగానీ ఎన్నో రోజులు మధ్నాహ్న భోజనం లేకుండా గడిపింది మను. ఆ సమయంలో ఆమెకు కోపం రాలేదు. ఎందుకంటే మను బాకర్ ‘గెలుపు’ ఆకలితో ఉంది. రెండు పతకాలతో ఆ ఆకలి తీరింది.డైట్ రొటీన్భోజనానికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరు. క్రీడాకారిణిగా వేరు. శాకాహారి అయిన మను బాకర్ ‘డైట్ రోటిన్’ విషయానికి వస్తే... హెల్తీ ఫ్యాట్స్. లో–జీఐ కార్బోహైడ్రేడ్స్తో కూడిన సింపుల్ డైట్కుప్రాధాన్యత ఇస్తుంది. అలసట, గాయాలకు దూరంగా ఉండడానికి డైట్లో హైడ్రేషన్‌కు అధికప్రాధాన్యత ఇస్తుంది. మను డైట్లో రకరకాల పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఉంటాయి. హై–ఎనర్జీ, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటుంది.ఆహారానికి ఎంతప్రాధాన్యత ఇస్తుందో కంటినిండా నిద్రకు అంతేప్రాధాన్యత ఇస్తుంది. యోగా, జిమ్ తరువాత ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్స్ వేస్తుంటుంది. మైండ్ ఫోకస్డ్గా ఉండడానికి క్రియేటివ్ వర్క్ ఉపయోగపడుతుందని చెబుతుంది మను బాకర్. -
శెభాష్ నిషా.. ఓడినా పర్లేదు! నువ్వొక వారియర్
ప్యారిస్ ఒలింపిక్స్ 68 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ రెజ్లర్ నిషా దహియా, ఉత్తర కొరియా రెజ్లర్ పాక్ సోల్ గుమ్ తలపడ్డారు. గేమ్ ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై నిషా దహియా ఆధిపత్యం చెలాయించింది. ఆట మరో 90 సెకన్లలో ముగియనుంది. అప్పటికే 8-1 స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నిషా దహియా.. విజయం ఖాయమనే అంతా భావించారు. సరిగ్గా అదే సమయంలో ఆమెను దురదృష్టం వెంటాడింది. అనూహ్యంగా దహియా కుడి చేతి వేలికి గాయమైంది. నొప్పితో విలవిలలాడిపోయింది. తక్షణమే స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఓ వైపు గాయంతో బాధపడుతున్నప్పటకి.. పతకం సాధించాలన్న కసితో దహియా పోరాడింది. కానీ గాయం తర్వాత ప్రత్యర్ధికి పోటీ ఇవ్వలేకపోయింది.ఈ క్రమంలో ప్రత్యర్ధి పుంజుకుని వరుసగా 9 పాయింట్లు సాధించి 10-8తేడాతో నిషాను ఓడించింది. దీంతో ఒక్కసారిగా నిషా దహియా కన్నీటి పర్యంతమైంది. అయితే దహియా ఓటమి పాలైనప్పటకి.. తన పట్టుదలతో అందరని మనసులను గెలుచుకుంది. ఆమె పోరాట పటిమపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా నిషా దహియా ఓటమిపై భారత రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర దహియా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి సోల్ గమ్ పాక్ ఉద్దేశ్యపూర్వకంగానే నిషా దహియాను గాయపరిచిందని వీరేంద్ర దహియా పేర్కొన్నాడు."100కు 100 శాతం ఉద్దేశపూర్వకంగా ఆమె నిషాను గాయపరిచింది. ఆమెను కావాలనే గాయపరచడం అందరూ చూశారు. ఆమెకు కొరియన్ డగౌట్ నుంచి అలా చేయాలనే సూచనలు వచ్చాయి. అందుకే సోల్ గుమ్ నిషాను ఎటాక్ చేసింది. నిషా నుంచి పతకాన్ని దొచేశారుని" పీటీఐతో వీరేంద్ర దహియా చెప్పుకొచ్చాడు. -
Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 11వ రోజు షెడ్యూల్ ఇదే..టేబుల్ టెన్నిస్: పురుషుల టీమ్ ప్రిక్వార్టర్స్ (భారత్ వర్సెస్ చైనా)- మధ్యాహ్నం 1.30, మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ వర్సెస్ అమెరికా జర్మనీ)- సాయంత్రం 6.30అథ్లెటిక్స్: పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (కిశోర్ జెనా)- మధ్యాహ్నం 1.50, (నీరజ్ చోప్రా)- మధ్యాహ్నం 3.20, మహిళల 400మీ.పరుగు రెపిచేజ్ రౌండ్ (కిరణ్ పాహల్)- మధ్యాహ్నం 2.50రెజ్లింగ్: మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ (వినేశ్ వర్సెస్ సుసాకి)- మధ్యాహ్నం 3హాకీ: పురుషుల సెమీస్ (భారత్ వర్సెస్ జర్మనీ)- రాత్రి 10.30అథ్లెటిక్స్: మహిళల లాంగ్‌జంప్ క్వాలిఫికేషన్- మధ్యహ్నం 2.45పురుషుల 400మీ.పరుగు సెమీస్- రాత్రి 11.05పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్- రాత్రి 11.45, పురుషుల 1500మీ.పరుగు ఫైనల్- రాత్రి 12.20, మహిళల 200మీ.పరుగు ఫైనల్- రాత్రి 1.10 -
ఓటములకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలి: ప్రకాశ్ పడుకోన్
ప్యారిస్ ఒలింపిక్స్-2024 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిబాట పట్టారు. పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ స్టార్ షట్లర్లు క్వార్టర్స్‌లో ఓటమి చెందడంతో.. అందరి ఆశలు సెమీఫైనల్‌కు చేరిన యువ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉండేవి. లక్ష్య సేన్ కూడా సెమీఫైనల్లో ఓటమి చవి చూసి నిరాశపరిచాడు. కనీసం కాంస్య పతకమైన ఈ యువ షట్లర్ సాధించాలని అందరూ ఆశించారు. కానీ కాంస్య పతకపోరులోనూ లక్ష్య సేన్ బోల్తాపడ్డాడు. సోమవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. ఇక ఈ ఓటమిపై లక్ష్య సేన్ కోచ్ ప్రకాశ్ పడుకోన్ స్పందించాడు."పరాజయాలకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. ఫలానా సౌకర్యాలు కావాలని అడగడమే కాదు... అవన్నీ ఇచ్చాక ఫలితాలతోపాటు పతకాలు కూడా తీసుకురావాలి. లక్ష్య సేన్ మరింత మెరుగవ్వాల్సి ఉంది. తప్పులు జరగడం సహజమే కానీ కోర్టులో పరిస్థితిని బట్టి ఆటను మార్చుకోవాలి. ఈ విషయంలో సేన్‌కు మానసికంగా కూడా కొంత శిక్షణ అవసరం. భారత బ్యాడ్మింటన్‌లో ఒకరిద్దరు టాప్ ఆటగాళ్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయిలో వారిని కూడా తీర్చిదిద్దితేనే విజయాలు లభిస్తాయని" ప్రకాశ్ పడుకోన్ పేర్కొన్నాడు. -
నేను ఒత్తిడిలో తప్పులు చేశాను.. అతడు మాత్రం అద్భుతం: లక్ష్యసేన్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. పురుషుల బ్యాడ్మంటన్ సింగిల్స్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్.. కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. దీంతో 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టడం ఇదే తొలి సారి. 2012 లండన్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం లక్ష్యసేన్ స్పందించాడు."ఏం తప్పు జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేను మ్యాచ్‌ను బాగా మొదలు పెట్టినా దానిని కొనసాగించలేకపోయాను. ఫలితంతో చాలా నిరాశ చెందాను. గత మ్యాచ్, ఈ మ్యాచ్‌లను ఎలా పోల్చాలో కూడా అర్థం కావడం లేదు. రెండూ కీలక మ్యాచ్‌లే. కానీ రెండూ ఓడిపోయాను.కీలక దశలో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను చాలా తప్పులు చేశాను. నా ప్రత్యర్థి రెండో గేమ్ నుంచి అద్భుతంగా పుంజుకున్నాడు. కుడి చేతికి గాయంతో కొంత రక్తం రావడంతో మధ్యలో ఆటను ఆపి చికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. అయితే మ్యాచ్ ఫలితానికి దీనికి సంబంధం లేదని లక్ష్యసేన్ పేర్కొన్నాడు. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో ఓడిన నిషా దాహియా
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ (ఆగస్ట్ 5) భారత్‌కు అస్సలు కలిసి రాలేదు. ఇవాళ జరిగిన రెండు కాంస్య పతక పోటీల్లో భారత్ ఆటగాళ్లు పరాజయాలు ఎదుర్కొన్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్య సేన్.. మలేషియాకు చెందిన జెడ్ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. షూటింగ్ స్కీట్ మిక్స్డ్ ఈవెంట్లో భారత షూటర్లు జోడీ అనంత్‌జీత్ సింగ్ నరౌకా-మహేశ్వరి చౌహాన్ తృటిలో కాంస్యం చేజార్చుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన నిషా దాహియా మహిళల రెజ్లింగ్ 68 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ నిషా దాహియా క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. నిషా ఉత్తర కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్‌తో చేతిలో 8-10 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో నిషా ఆధిక్యంలో ఉన్నప్పుడు గాయపడింది. తద్వారా స్వల్ప తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఓటమి అనంతరం నిషా కన్నీటిపర్యంతమైంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో నిషా.. ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా సోవాపై 6-4 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నిషా 1-4తో వెనుకపడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. -
Olympics 2024: కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ పరాజయం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. కాంస్యం కోసం ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్.. మలేషియాకు చెందిన జెడ్ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ అలవోకగా నెగ్గిన సేన్.. రెండు, మూడు గేమ్‌లలో చేతులెత్తేశాడు. కాగా, ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ మూడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. షూటింగ్లో మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం, మిక్సడ్ విభాగాల్లో కాంస్య పతకాలు (సరబ్జోత్ సింగ్‌తో కలిసి) సాధించగా.. స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్స్‌లో కాంస్యం నెగ్గాడు. -
Olympics 2024: సరికొత్త చరిత్ర.. క్వార్టర్ ఫైనల్లో భారత్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు (మనిక బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్) క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత్.. రొమేనియాపై 3-2 తేడాతో గెలుపొందింది. విశ్వ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపె ట్టడం ఇదే తొలిసారి.MANIKA BATRA - The Clutch moment in Table Tennis for India. 🥶 pic.twitter.com/dN3XApe98K— Johns. (@CricCrazyJohns) August 5, 2024ఈ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు గేమ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్) విజయాలు సాధించి ఏకపక్ష విజయం సాధించేలా కనిపించింది. అయితే రొమేనియా ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు గేమ్స్‌లో (సింగిల్స్) విజయం సాధించి స్కోర్‌ను లెవెల్ (2-2) చేశారు. చివరి గేమ్‌లో మనిక బత్రా తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రత్యర్ధిపై విజయం సాధించింది. రేపు జరుగబోయే క్వార్టర్ ఫైనల్లో భారత్.. యూఎస్ఏ, జర్మనీ మధ్య మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా రౌండ్ ఆఫ్ 16కు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాతి రౌండ్లో వీరు ఓడిపోయారు. -
Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పదో రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..రెజ్లింగ్మహిళల 68 కేజీల ఫ్రీస్టయిల్ ప్రిక్వార్టర్స్: నిషా దహియా వర్సెస్ సోవా రిజ్కో (ఉక్రెయిన్) (సాయంత్రం గం. 6:30 నుంచి)టెబుల్ టెన్నిస్ మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ వర్సెస్ రొమేనియా (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)సెయిలింగ్ మహిళల డింగీ రేసులు: (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). పురుషుల డింగీ రేసులు: (సాయంత్రం గం. 6:10 నుంచి) అథ్లెటిక్స్మహిళల 400 మీటర్ల పరుగు తొలి రౌండ్: కిరణ్ పహల్ (హీట్ 5) (మధ్యాహ్నం గం. 3:57 నుంచి). పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ తొలి రౌండ్: అవినాశ్ సాబ్లే (హీట్ 2) (రాత్రి గం. 10:50 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరు: లక్ష్యసేన్ వర్సెస్ లీ జీ జియా (మలేసియా) (సాయంత్రం గం. 6:00 షూటింగ్స్కీట్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్: మహేశ్వరి చౌహాన్ఠ్అనంత్ జీత్ సింగ్ నరుకా (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ఫైనల్ (అర్హత సాధిస్తే): సాయంత్రం గం. 6:30 నుంచి. లవ్లీనా పంచ్ సరిపోలేదు విశ్వక్రీడల్లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. ఆరుగురు బాక్సర్లతో పారిస్‌లో అడుగు పెట్టిన భారత బృందం.. రిక్త హస్తాలతో తిరిగి రానుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహైన్ ఈసారి ఆకట్టుకోలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ లవ్లీనా 1–4తో లీ కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. బౌట్ ప్రారంభం నుంచే చైనా బాక్సర్ లెఫ్ట్ హుక్స్‌తో విరుచుకుపడగా.. వాటిని తప్పించుకుంటూ లవ్లీనా కొన్ని మంచి పంచ్‌లు విసిరింది. అయినా తొలి రౌండ్ కియాన్‌కు అనుకూలంగా ఫలితం వచి్చంది. ఆ తర్వాత లవ్లీనా పుంజుకునేందుకు ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. పంచ్‌ల ధాటి నుంచి నేర్పుగా తప్పించుకున్న కియాన్... కీలక సమయాల్లో జాబ్స్, హుక్స్‌తో పైచేయి సాధించింది. భారత్ నుంచి పారిస్ క్రీడలకు ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించగా.. అందరూ క్వార్టర్ ఫైనల్లోపే పరాజయం పాలయ్యారు. -
ఒలింపిక్స్‌లో తొలి గోల్డ్‌మెడల్.. కన్నీటి పర్యంతమైన జొకోవిచ్
కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 7 ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్, ఎనిమిది సార్లు నంబర్‌వన్‌గా ఏడాది ముగింపు, 2 సార్లు కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, డేవిస్‌కప్ విజేత, 428 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అత్యద్భుత ఆటతో సాధించిన అసాధారణ ఘనతలివి. అయితే ఇన్ని గొప్ప విజయాల తర్వాత కూడా జొకోవిచ్ కెరీర్లో ఒలింపిక్స్ స్వర్ణ పతకం ఒకటి ఇప్పటి వరకు లోటుగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు జొకో దానిని కూడా సాధించి తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జొకోవిచ్ పసిడి పతకం కోసం ఎంతో తపించాడు.దాని కోసం పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆ కల నెరవేరింది. ‘కెరీర్ గోల్డెన్‌స్లామ్’ నెగ్గిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో అతను తన పేరును లిఖించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకో 7–6 (7/3), 7–6 (7/2) స్కోరుతో కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.ఇటీవలే వింబుల్డన్ ఫైనల్లో తనను ఓడించి ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్పై తన అనుభవాన్నంతా ఉపయోగించి టైబ్రేక్‌లో సెర్బియా స్టార్ పైచేయి సాధించాడు. 37 ఏళ్ల జొకో అతి పెద్ద వయసులో ఒలింపిక్ టెన్నిస్‌లో స్వర్ణం సాధించిన ఆటగాడిగా నిలిచాడు.భావోద్వేగానికి లోనైన జొకోవిచ్ఇక గోల్డ్ మెడల్ విజయం తర్వాత జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సెర్బియా జాతీయ పతాకంతో తన కుటుంబసభ్యులు, టీమ్ వద్దకు పరుగెత్తిన జొకోవిచ్ కన్నీళ్లపర్యంతమయ్యాడు. తన కొడుకు, కూతురును కౌగిలించుకొని అతను ఏడ్చేసిన తీరు అతని దృష్టిలో ఈ పతకం విలువేమిటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Novak Djokovic crying as he can't believe 🥇🇷🇸Congratulations to @DjokerNole, for finally achieving the gold medal for your country & you have completed not only tennis but also my childhood 🥹❤️pic.twitter.com/E8e2HmY173— Shane Gupta (@Shanegupta22) August 4, 2024 Wow - have never seen Djokovic this emotional … incredible Sports. pic.twitter.com/rJjdDnsITP— Tommy Beer (@TommyBeer) August 4, 2024 -
Paris Olympics: జెర్మనీతో సెమీస్.. భారత హాకీ జట్టుకు బిగ్ షాక్
ప్యారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్‌కు ముందు భారత హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. నిషేదం కారణంగా భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ మంగళవారం జెర్మనీతో జరగనున్న సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని రోహిదాస్‌పై ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(FIH )టెక్నికల్ డెలిగేట్ ఒక్క మ్యాచ్ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే సెమీస్ పోరుకు రోహిదాస్ దూరంగా ఉండనున్నాడు. సెమీఫైనల్లో హాకీ జట్టు 16 మంది సభ్యులకు బదులుగా 15 మందితో ఆడనుంది. అయితే హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై భారత జట్టు అసహనంగా ఉంది. అయితే హాకీ ఇండియా ఇప్పటికే ఎఫ్ఐహెచ్ నిర్ణయంపై సవాలు చేసింది. రోహిదాస్‌పై విదించిన బ్యాన్ పై పూనరాలోచించాలని హాకీ ఇండియా అప్పీల్ చేసింది. అయితే సెమీస్‌కు ముందు ఎఫ్ఐహెచ్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు తక్కువ.అసలేం జరిగిందంటే?మ్యాచ్ 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది. -
పారుల్... రెండో‘సారీ’
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మహిళల 5000 మీటర్ల పరుగులో నిరాశ పరిచిన పారుల్ చౌధరీ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లోనూ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన పోటీల్లో పారుల్ 9 నిమిషాల 23.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్స్‌లో 9వ స్థానంలో నిలిచింది.ఒక్కో హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. గమ్యాన్ని చేరేందుకు తన అత్యుత్తమ టైమింగ్ (9 నిమిషాల 15.31 సెకన్లు) కంటే ఎక్కువ సమయం తీసుకున్న పారుల్ ఓవరాల్‌గా 21వ స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో పారుల్ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం, 5000 మీటర్లలో స్వర్ణం సాధించింది. అయితే తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న పారుల్ నిరాశపరిచింది. ఇక పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ అల్డ్రిన్ గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. 7.61 మీటర్ల దూరం లంఘించిన జెస్విన్ మొత్తంగా 26వ స్థానంతో ‘పారిస్’ క్రీడల నుంచి ని్రష్కమించాడు. ఈ విభాగంలో 8.15 మీటర్లు దాటిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సంపాదించారు. -
పిస్టల్ ‘మిస్’ ఫైర్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో... మహిళల స్కీట్ ఈవెంట్లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. ఆదివారం క్వాలిఫికేషన్ రౌండ్ ఆరంభంలో ఆకట్టుకున్న భారత షూటర్లు విజయ్‌వీర్ సిద్ధూ, అనీశ్ భన్వాలా చివరి వరకు అదే జోరు కొనసాగించలేక.. ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయారు. విజయ్‌వీర్ 583 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితం కాగా... అనీశ్ 582 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.ఒక దశలో రెండో స్థానానికి చేరి ఆశలు రేపిన విజయ్‌వీర్ ఆ తర్వాత గురి తప్పడంతో తుదిపోరుకు చేరకుండానే వెనుదిరిగాడు. తొలి ఆరు స్థానాల్లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహాన్ (118 పాయింట్లు) 14వ స్థానం, రైజా ధిల్లాన్ (113 పాయింట్లు) 23వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. నేటితో ఒలింపిక్స్‌లో షూటింగ్ ఈవెంట్ ముగుస్తుంది. చివరిరోజు స్కీట్ మిక్స్డ్ విభాగంలో భారత్ నుంచి మహేశ్వరి చౌహాన్, అనంత్‌జీత్ సింగ్ నరూకా జోడీ పోటీపడనుంది. మొత్తం 15 జోడీలు క్వాలిఫయింగ్‌లో ఉన్నాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2లో నిలిచిన రెండు జంటలు స్వర్ణ–రజత పతకాల కోసం... మూడు–నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జోడీలు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.శుభాంకర్ 40వ స్థానంలో... పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఈ విభాగంలో పోటీపడిన శుభాంకర్ శర్మ 40వ స్థానంలో నిలవగా ... గగన్‌జీత్ సింగ్ భుల్లర్ 45వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. శుభాంకర్ ఓవరాల్‌గా 283 పాయింట్లు సాధించగా.. గగన్‌జీత్ 285 పాయింట్లతో ఆకట్టుకోలేకపోయారు. సెయిలింగ్ డింగీ విభాగంలో 8 రేసులు ముగిసేసరికి పురుషుల విభాగంలో భారత సెయిలర్ విష్ణు శరవణన్ 18వ స్థానంలో.. మహిళల విభాగంలో నేత్ర కుమానన్ 25వ స్థానంలో నిలిచారు. నేడు మరో రెండు రేసులు జరగాల్సి ఉంది. మొత్తం పది రేసుల్లో టాప్–10లో నిలిచిన సెయిలర్లు పతక పోరుకు అర్హత సాధిస్తారు. -
ఒలింపిక్ పతకం నెగ్గేంతవరకు నిష్క్రమించను: ఆర్చర్ దీపిక కుమారి
పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి.. విశ్వక్రీడల్లో మెడల్ గెలిచేంత వరకు కెరీర్‌కు రిటైర్మెంట్ను ప్రకటించనని వెల్లడించింది. వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక... మహిళల వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ఓడి నిష్క్రమించింది. అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపికకు ఒలింపిక్ మెడల్ మాత్రం అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. ‘కెరీర్ కొనసాగిస్తా.ఒలింపిక్ పతకం గెలవాలని బలంగా కోరుకున్నా. అది సాధించేవరకు ఆట నుంచి విశ్రాంతి తీసుకోను, నిష్క్రమించను. మరింత కఠోర సాధన చేసి బలంగా తిరిగి పుంజుకుంటా. వేగంగా బాణాలు వేయడంపై దృష్టి పెడతా. ఈ వేదికపై పొరబాట్లకు తావివ్వకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని దీపిక వెల్లడించింది. కీలక పోరులో 7 పాయింట్లు సాధించడం ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. అదొక్కటి మినహా పారిస్‌లో మంచి ప్రదర్శనే చేశానని దీపిక వివరించింది. -
'దస్' కా దమ్..
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరో అద్భుతాన్ని చూపించింది. టోక్యోలో మూడేళ్ల క్రితం నాటి జోరును పునరావృతం చేస్తూ సెమీఫైనల్‌కు చేరింది. అప్పటిలాగే ఈసారి కూడా ప్రత్యర్థి బ్రిటన్. నాడు నిర్ణీత సమయంలోనే భారత్ విజయం సాధించగా, ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షూటౌట్‌కు చేరింది. తుది ఫలితం మాత్రమే సేమ్ టు సేమ్. భారత ఆటగాళ్లంతా చురుకైన ఆటతో సత్తా చాటగా, ఎప్పటిలాగే గోల్ కీపర్ శ్రీజేశ్ అసాధారణ గోల్ కీపింగ్ జట్టును గెలిపించింది. మూడు క్వార్టర్ల పాటు ఒక ఆటగాడిని కోల్పోయి పది మందితోనే టీమిండియా కొనసాగినా... పదునైన డిఫెన్స్‌తో మన జట్టు ప్రత్యర్థిని నిలువరించగలిగింది. మరో మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరితే గత ఒలింపిక్స్‌కంటే మెరుగైన ఫలితంతో భారత్ సగర్వంగా నిలుస్తుంది. పారిస్: ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించే దిశగా భారత పురుషుల హాకీ జట్టు ఆశలు రేపుతోంది. స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన మన జట్టు పారిస్ఒలింపిక్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో బ్రిటన్ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... ‘షూటౌట్’లో భారత్ 4–2తో పైచేయి సాధించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన పోరులో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22వ నిమిషంలో, బ్రిటన్ తరఫున లీ మార్టన్ 27వ నిమిషంలో గోల్స్ సాధించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్ గోల్స్ చేయగా... బ్రిటన్ ఆటగాళ్లలో జేమ్స్ ఆల్బరీ, జాక్ వలాస్ మాత్రమే గోల్స్ కొట్టారు. కానర్ విలియమ్సన్, ఫిలిప్ రాపర్ విఫలమయ్యారు. రాపర్ గోల్‌ను శ్రీజేశ్ అద్భుతంగా నిలువరించిన తర్వాత భారత్ 3–2తో ఆధిక్యంలో నిలవగా... నాలుగో షాట్‌ను రాజ్‌కుమార్ గోల్‌గా మలచడంతో భారత బృందం సంబరం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో చివరిదైన ఐదో షాట్‌ను బ్రిటన్ తీసుకోలేదు. జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో భారత జట్టు మంగళవారం జరిగే సెమీఫైనల్లో తలపడుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్ ఓడిపోతే గురువారం కాంస్య పతకం కోసం పోటీపడుతుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఆరంభంలో బ్రిటన్ చాలా దూకుడుగా ఆడుతూ వరుసగా దాడులు చేసింది. తొలి ఐదు నిమిషాల్లోనే ఆ జట్టుకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా, భారత్ వాటిని నిలువరించింది. 11వ నిమిషంలో కూడా బ్రిటన్ జట్టు పెనాల్టీ కార్నర్ ద్వారా చేసిన ప్రయత్నం వృథా అయింది. భారత్ కూడా తొలి క్వార్టర్లో రెండు పెనాల్టీలు సంపాదించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో క్వార్టర్ కూడా ఇదే తరహాలో సాగింది. అయితే 22వ నిమిషంలో లభించిన పెనాల్టీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో ఆధిక్యం దక్కింది. కానీ మరో ఐదు నిమిషాలకే వేగంగా దూసుకొచ్చిన లీ మార్టన్ చేసిన గోల్ ప్రయత్నాన్ని కీపర్ శ్రీజేశ్ ఆపడంలో విఫలం కావడంతో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్లో కూడా బ్రిటన్‌కు మూడు పెనాల్టీలు రాగా శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత చివరి వరకు ఇరు జట్లు మరో గోల్ కోసం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. బెల్జియంకు షాక్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న బెల్జియం జట్టు పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 3–2తో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత బెల్జియం జట్టును బోల్తా కొట్టించింది. తద్వారా 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత స్పెయిన్ జట్టు మళ్లీ సెమీఫైనల్‌కు చేరుకుంది. మూడో క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–0తో ఆస్ట్రేలియా జట్టును ఓడించి సెమీఫైనల్లో స్పెయిన్‌తో పోరుకు సిద్ధమైంది. రోహిదాస్‌కు రెడ్ కార్డ్ మ్యాచ్‌లో జరిగిన ఒక అనూహ్య ఘటన భారత్‌ను మ్యాచ్ ఆసాంతం ఇబ్బంది పెట్టింది. 17వ నిమిషంలో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ స్టిక్ బ్రిటన్ ఫార్వర్డ్ విలియమ్ కల్నాన్ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం భారత్ 10 మందితోనే ఆడింది. మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ డిఫెండర్‌గా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై భారత జట్టు అప్పీల్ చేసింది. దీనిపై వాదనల అనంతరం రోహిదాస్ తప్పు చేసినట్లు తేలితే అతనిపై ఒక మ్యాచ్ నిషేధం (సెమీఫైనల్) పడే అవకాశం ఉంది. చివరి వరకు స్కోరును సమంగా ఉంచడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అందుకే పూర్తిగా డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. పది మందితో ఆడటం మ్యాచ్‌లో కఠిన సమయం. కానీ ఏమీ చేయలేం. ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన కనబర్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇదే తరహా మానసిక దృఢత్వంతో సెమీస్ ఆడతాం. శ్రీజేశ్ దిగ్గజం. తొలి మ్యాచ్ నుంచి అతను మమ్మల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. –హర్మన్‌ప్రీత్ సింగ్, భారత కెప్టెన్ గోల్ కీపర్‌గా నా బాధ్యత నెరవేర్చాను. ఈ రోజు భారత్‌కు కలిసొచ్చింది. షూటౌట్లో షాట్ తీసుకున్న భారత ఆటగాళ్లెవరూ నిరాశపర్చలేదు. వారు స్కోరు చేయడం వల్ల నాలో నమ్మకం మరింత పెరిగింది. మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు ఇది నా ఆఖరి మ్యాచ్ కావచ్చు లేదా బాగా ఆడితే మరో రెండు మ్యాచ్‌లు ఆడవచ్చని అనుకున్నాను. సెమీస్ ప్రత్యర్థి ఎవరైనా ఇలాగే ఆడతాం. –పీఆర్ శ్రీజేశ్, భారత గోల్‌కీపర్7 ఒలింపిక్స్ హాకీలో బ్రిటన్ జట్టుపై భారత్ గెలుపొందడం ఇది ఏడోసారి. రెండు జట్లు విశ్వ క్రీడల్లో ఇప్పటి వరకు పది సార్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల్లో బ్రిటన్ నెగ్గింది. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టుపై బ్రిటన్ గెలిచింది.52 వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ చేరడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత జట్టు 1936 బెర్లిన్ ఒలింపిక్స్ నుంచి 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ వరకు కనీసం సెమీఫైనల్ దశ దాటింది. 1976 మెక్సికో ఒలింపిక్స్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. -
దిగ్గజాల సరసన లెడెకీ, డ్రెసెల్
పారిస్: విశ్వ క్రీడల్లో అతికొద్ది మందికే సాధ్యమైన ఘనతను అమెరికా స్విమ్మర్లు కేటీ లెడెకీ, సెలబ్ డ్రెసెల్ సాధించారు. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో వీరిద్దరు మరో నలుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానానికి చేరుకున్నారు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో లెడెకీ, డ్రెసెల్ రెండు స్వర్ణాల చొప్పున సాధించారు. దాంతో ఓవరాల్‌గా ఒలింపిక్స్ క్రీడల్లో వీరిద్దరు నెగ్గిన పసిడి పతకాల సంఖ్య 9కి చేరుకుంది.ఇప్పటికే ‘పారిస్’లో 1500 మీటర్లలో బంగారు పతకం గెలిచిన లెడెకీ ఆదివారం జరిగిన 800 మీటర్ల విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు డ్రెసెల్ 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ టీమ్ స్వర్ణానికి 4్ఠ100 మీటర్ల మిక్స్డ్ మెడ్లే పసిడి పతకాన్ని జత చేశాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన రికార్డు అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (23 స్వర్ణాలు) పేరిట ఉంది. ఆ తర్వాత 9 స్వర్ణాలతో లారిసా లాతినినా (జిమ్నాస్టిక్స్; సోవియట్ యూనియన్), పావో నుర్మీ (అథ్లెటిక్స్; ఫిన్లాండ్), మార్క్ స్పిట్జ్ (స్విమ్మింగ్; అమెరికా), కార్ల్ లూయిస్ (అథ్లెటిక్స్; అమెరికా), కేటీ లెడెకీ, డ్రెసెల్ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. -
Paris Olympics 2024: స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జకోవిచ్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఫైనల్లో స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్పై వరుస సెట్లలో (7-6(3), 7-6(2)) విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో జకోకు ఇది తొలి స్వర్ణం. 37 ఏళ్ల జకో ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. NOVAK DJOKOVIC - THE OLYMPIC GOLD MEDALIST AT THE AGE OF 37.🏅- The greatest ever of Tennis! 🐐pic.twitter.com/bj4uxuTRin— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024అలాగే కెరీర్ గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్స్ సింగిల్స్‌లో స్వర్ణం) నెగ్గిన ఐదో టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. ఇటీవలి కాలంలో అల్కరాజ్.. జకోవిచ్‌పై ఆధిపత్యం చాలాయించాడు. 2023, 2024 వింబుల్డన్‌లో అల్కరాజ్ జకోకు షాకిచ్చాడు. ఈ రెండు పరాజయాలకు జకో విశ్వవేదికపై బదులు తీర్చుకున్నాడు. జకో తన కెరీర్లో24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించగా.. అల్కరాజ్ చిన్నవయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమితో అల్కరాజ్ రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు. -
Paris Olympics 2024: లక్ష్యసేన్ పరాజయం
పారిస్ ఒలింపక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్లో పరాజయంపాలయ్యాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ ఒలింపిక్స్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సేన్ (డెన్మార్క్) చేతిలో 20-22, 14-21 తేడాతో ఓటమిని ఎదుర్కొన్నాడు. రేపు జరుగబోయే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్.. మలేసియాకు చెందిన లీ జీని ఎదుర్కొంటాడు. ఫైనల్లో అక్సెల్సేన్.. థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సర్న్తో అమీతుమీ తేల్చుకుంటాడు. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా ఓటమి.. ముగిసిన భారత్ పోరాటం
పారిస్ ఒలింపిక్స్ మహిళల 75 కేజీల విభాగం బాక్సింగ్ పోటీల్లో భారత స్టార్ బాక్సర్, ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన లి క్యియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమిపాలైంది. లవ్లీనా ఓటమితో బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. ఒక్క పతకం కూడా లేకుండానే భారత బాక్సర్ల బృందం నిరాశపర్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. -
Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో గ్రేట్ బ్రిటన్‌పై 4-2 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో గోల్ సాధించాయి. THE WINNING MOMENT FROM TEAM INDIA. 🇮🇳- Down with 10 men, the raw emotions says everything. 🥹❤️pic.twitter.com/FArmg3QtVR— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024ఈ మ్యాచ్‌లో భారత్ 40 నిమిషాలకు పైగా పది మంది ప్లేయర్లతోనే ఆడింది. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో అమిత్ రోహిదాస్ రెడ్ కార్డ్‌కు గురయ్యాడు. ఒలింపిక్స్‌లో భారత్ సెమీస్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.PR Sreejesh is a legend. 🫡- What a save in the Shootout. pic.twitter.com/QJ29ZdrkpY— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024 -
Paris Olympics 2024: ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు అరుదైన గౌరవం
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలతో సత్తాచాటిన భారత స్టార్ షూటర్ మను భాకర్ అరుదైన గౌరవం దక్కింది. ఈ విశ్వక్రీడల ముగింపు వేడకల్లో భారత మహిళా పతాకధారిగా మను భాకర్ వ్యవహరించనున్నారు. ఈ మెరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ క్లోజింగ్ సెర్మనీలో భారత్ నుంచి మెన్స్ ఫ్లాగ్ బేరర్ ఎవరన్నది ఇంకా ఖారారు చేయలేదు. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక ఆగష్టు 11న జరగనుంది. కాగా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా మను భాకర్ చరిత్ర సృష్టించింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన మను.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో పతకాన్ని తృటిలో మను కోల్పోయింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంతో ఈ హర్యానా అమ్మాయి సరిపెట్టుకుంది. -
నిశాంత్ దేవ్ 'పంచ్' మిస్.. క్వార్టర్స్‌లో ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 బాక్సింగ్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం ఆర్ధరాత్రి జరిగిన పురుషుల 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ ఘోర పరాజయాన్ని చవిచూశాడు.మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే అల్వారెజ్ చేతిలో 1-4 తేడాతో నిశాంత్ దేవ్ ఓటమి పాలయ్యాడు. మొదటి రౌండ్లో నిశాంత్ దూకుడుకనబరచినప్పటకి.. తర్వాతి మూడు రౌండ్లలో ప్రత్యర్ధి పుంజుకుని అద్భుత విజయం సాధించాడు. అంతకముందు మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ సైతం ఇంటిముఖం పట్టింది.మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో వు హు (చైనా) చేతిలో 0-5 తేడాతో జరీన్ ఓటమిపాలైంది. ఇప్పుడు వీరిద్దరి ఓటమితో బాక్సింగ్‌లో పతకంపై భారత్ ఆశలు స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. ఆదివారం మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో లి కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడనుంది. -
Paris Olympics 2024: లక్ష్యానికి చేరని భారత బాణం
పారిస్: ఒలింపిక్స్‌లో మన ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు! భారీ అంచనాలు, మంచి ఫామ్‌తో పారిస్‌లో అడుగుపెట్టిన ఆర్చర్లు పోటీపడ్డ అన్నీ విభాగాల్లో విఫలమై.. రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టారు. ఇప్పటికే పురుషుల టీమ్, మహిళల టీమ్, మిక్స్డ్ టీమ్, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో మనవాళ్లకు చేదు ఫలితాలు ఎదురుకాగా... శనివారం మహిళల వ్యక్తిగత విభాగంలోనూ అదే పునరావృతం అయింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన 19 ఏళ్ల టీనేజ్ ఆర్చర్ నామ్ సిహైన్ చేతిలో ఓడగా.. తొలిసారి విశ్వ క్రీడల్లో ఆడుతున్న భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ‘పారిస్’ క్రీడల రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ నాలుగో స్థానంలో నిలవడమే ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్ల అత్యుత్తమ ప్రదర్శన. వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక శనివారం జరిగిన రికర్వ్ మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో 4–6 (28–26, 25–28, 29–28, 27–29, 27–29)తో నామ్ సిహైన్ చేతిలో పరాజయం పాలైంది. తొలి మూడు సెట్లలో రెండింట గెలిచి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి ఆశలు రేపిన దీపిక.. నాలుగో సెట్లో గురితప్పి 7 పాయింట్లు సాధించడంతో వెనుకబడింది. 14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తూ మేటి ఆర్చర్‌గా పేరు తెచ్చుకున్న దీపిక వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పతకం లేకుండానే వెనుదిరిగింది. ‘నిరాశ చెందా. ఒలింపిక్స్‌లో ప్రతిసారీ ఇలాంటి ఫలితాలే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు.ఈ వాతావరణం, అంచనాలే కారణమనుకుంటా. రెండు బాణాలు గురి తప్పడంతో.. మ్యాచ్‌ను నేనే ప్రత్యరి్థకి అప్పగించినట్లు అనిపించింది’ అని 2012 ‘లండన్’లో 33వ స్థానంలో, 2016 ‘రియో’లో 16వ స్థానంలో, 2020 టోక్యోలో 8వ స్థానంలో నిలిచిన దీపిక వ్యాఖ్యానించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక గెలిచి ఉంటే సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతక రేసులో నిలిచేది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో దీపిక 6–4 (27–24, 27–27, 26–25, 27–29, 27–27)తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలిచింది. మరో ఆర్చర్ భజన్ కౌర్ ‘షూట్ ఆఫ్’లో దినంద చోరునిసా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మొదట స్కోర్లు 28–29, 27–25, 26–28, 28–28, 27–26తో సమం కాగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన ‘షూట్ ఆఫ్’లో తడబడ్డ భజన్ 8 పాయింట్లు సాధించగా.. 9 పాయింట్లతో ఇండోనేసియా ఆర్చర్ ముందంజ వేసింది. -
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 9వ రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..షూటింగ్: పురుషుల 25 మీటర్ల క్వాలిఫికేషన్ మొదటి స్టేజ్: విజయ్‌వీర్, అనీశ్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). పురుషుల 25 మీటర్ల క్వాలిఫికేషన్ రెండో స్టేజ్: విజయ్‌వీర్, అనీశ్ (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల స్కీట్ క్వాలిఫికేషన్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) హాకీపురుషుల క్వార్టర్ ఫైనల్: భారత్ వర్సెస్ బ్రిటన్ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) గోల్ఫ్పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే నాలుగో రౌండ్: శుభాంకర్ శర్మ, గగన్జీత భుల్లర్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్: లక్ష్యసేన్ వర్సెస్ అక్సెల్సన్ (డెన్మార్క్) (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)బ్యాక్సింగ్ మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్: లవ్లీనా బొర్గోహైన్ వర్సెస్ లి కియాన్ (చైనా) (మధ్యాహ్నం గం. 3:02 నుంచి) -
జొకోవిచ్ ఒలింపిక్ స్వర్ణ స్వప్నం నెరవేరేనా? నేడు అల్కరాజ్తో ఫైనల్ పోరు
తన సుదీర్ఘ కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు సెర్బియా దిగ్గజం విజయం దూరంలో నిలిచాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడుతున్న 37 ఏళ్ల జొకోవిచ్ తొలిసారి పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ సెమీఫైనల్లో జొకోవిచ్ 6–4, 6–2తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచాడు. తద్వారా ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా గుర్తింపు పొందాడు. నేడు జరిగే ఫైనల్లో ఈ ఏడాది ఫ్రెంచ్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జొకోవిచ్ కాంస్య పతకం గెలిచాడు. 2012 లండన్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జొకోవిచ్ 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. -
10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్‌కు స్వర్ణం
పారిస్: అథ్లెటిక్స్ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్ జోషువా చెప్తెగాయ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్’ గేమ్స్‌లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును జోషువా ‘పారిస్’లో సవరించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన జోషువా గత మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచాడు. 2020 వాలెన్సియా మీట్లో చెప్తెగాయ్ 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్ పేరిటే ఉంది. -
మథియాస్ బో గుడ్‌బై
పారిస్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ పదవి నుంచి మథియాస్ బో తప్పుకున్నాడు. సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీని గొప్పగా తీర్చిదిద్ది వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను పారిస్ ఒలింపిక్స్‌లో భారత ద్వయం వైఫల్యం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనతో వరుసగా ట్రోఫీలు నెగ్గి పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపిన సాతి్వక్–చిరాగ్ జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2012 లండన్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియాస్ భారత జట్టుకు నాలుగేళ్ల క్రితం డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌గా వచ్చాడు. ‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇకపై నేను భారత్‌లో గానీ, మరెక్కడా గానీ కోచింగ్ ఇవ్వబోవడం లేదు. చాలా సమయం బ్యాడ్మింటన్ కోర్టుల్లో తీవ్ర ఒత్తిడి మధ్య గడిపిన నేను బాగా అలసిపోయాను. నాకు అండగా నిలిచిన, ఎన్నో జ్ఞాపకాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మథియాస్ బో స్పష్టం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగి పతకం సాధించలేకపోయిన సాత్విక్ –చిరాగ్‌ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, భవిష్యత్తులో వారిద్దరు ఎన్నో విజయాలు సాధిస్తారని మథియాస్ ఆకాంక్షించాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల మథియాస్ ఈ ఏడాది మార్చిలోనే సినీ నటి తాప్సీని పెళ్లి చేసుకున్నాడు. -
భళా బైల్స్...
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గలేకపోయిన అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ ‘పారిస్’లో మాత్రం పసిడి మెరుపులు మెరిపిస్తోంది. ఇప్పటి వరకు పోటీపడ్డ మూడు ఈవెంట్లలోనూ ఆమె స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. 27 ఏళ్ల బైల్స్ మహిళల టీమ్ విభాగంలో, ఆల్ అరౌండ్ విభాగంలో పసిడి పతకాలు నెగ్గగా... తాజాగా శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్లోనూ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది మధ్య జరిగిన ఫైనల్లో బైల్స్ 15.300 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. రెబెకా అండ్రాడె (బ్రెజిల్; 14.966 పాయింట్లు) రజతం, జేడ్ కేరీ (అమెరికా; 14.466 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ క్రీడల్లో బైల్స్కిది పదో పతకంకాగా, ఇందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం నెగ్గింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బైల్స్‌కు ఒక రజతం, ఒక కాంస్యం దక్కింది.ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో మహిళల వాల్ట్ ఈవెంట్లో రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో జిమ్నాస్ట్‌గా బైల్స్ గుర్తింపు పొందింది. గతంలో వెరా కసాలావ్స్కా (చెకోస్లొవేకియా; 1964, 1968 ఒలింపిక్స్) రెండు సార్లు వాల్ట్ ఈవెంట్లో పసిడి పతకాలు గెలిచింది. ‘పారిస్’లో బైల్స్ ఖాతాలో నాలుగో స్వర్ణం కూడా చేరే అవకాశం ఉంది. నేడు జరిగే అన్ఈవెన్ బార్స్ ఫైనల్లో బైల్స్ పోటీపడనుంది. -
ఈసారీ గెలిచేద్దాం
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో తాము సాధించిన కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవాలంటే భారత జట్టు ముందుగా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటాలి. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన ప్రత్యర్థి బ్రిటన్ జట్టుతోనే పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నేడు జరిగే ఈ నాకౌట్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు చేరుకొని పతకం రేసులో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం టీమిండియా ఇంటిదారి పడుతుంది. ‘టోక్యో’ క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును ఓడించింది. ‘పారిస్’ గేమ్స్‌లో భారత హాకీ జట్టు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3–2తో గెలిచింది. రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్ విజేత అర్జెంటీనాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2–0తో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నాలుగో లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బెల్జియం జట్టు చేతిలో 1–2తో ఓడిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 3–2తో ఓడించి సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్ క్రీడల్లో ఆ్రస్టేలియా జట్టుపై 52 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని అందుకుంది. లీగ్ దశ మ్యాచ్‌ల ఫలితాలు, ప్రదర్శన ప్రస్తుతం గతంతో సమానం. నాకౌట్ మ్యాచ్ కావడంతో తప్పనిసరిగా గెలిస్తేనే జట్లు ముందుకు సాగుతాయి. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత బ్రిటన్ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బ్రిటన్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా భారత జట్టు ఆద్యంతం నిలకడగా ఆడాల్సి ఉంటుంది. గోల్ చేసేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దక్కిన పెనాల్టీ కార్నర్లను లక్ష్యానికి చేర్చాలి. అందుబాటులో ఉన్న ముఖాముఖి రికార్డు ప్రకారం భారత్, బ్రిటన్ జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడ్డాయి. 13 సార్లు బ్రిటన్ నెగ్గగా... 9 సార్లు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఒలింపిక్స్‌లో మాత్రం బ్రిటన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. విశ్వ క్రీడల్లో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా... ఆరుసార్లు భారత్, మూడుసార్లు బ్రిటన్ గెలుపొందాయి. నేడు జరిగే ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌తో బెల్జియం; నెదర్లాండ్స్‌తో శ్రీఆ్రస్టేలియా; జర్మనీతో అర్జెంటీనా తలపడతాయి. యాదృచ్చికంగా ‘పారిస్’ గేమ్స్‌లోనూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌లో ఎదురెదురుగా తలపడిన జట్లే ఈసారి పోటీపడుతున్నాయి. -
‘మూడో’ కన్ను చెదిరింది!
ఏడు రోజుల వ్యవధి. రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు గెలిచిన ఘనత. మూడో పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించేందుకు సై. కానీ చివరకు ‘షూట్ ఆఫ్’తో ఆశలకు తెర పడింది. త్రుటిలో కాంస్యం చేజారింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున వ్యక్తిగత క్రీడాంశంలో మూడు పతకాలు గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా నిలవాలని ఆశించిన యువ షూటర్ మనూ భాకర్‌కు చివర్లో చుక్కెదురైంది. తీవ్ర ఒత్తిడికి తలవంచిన ఆమె ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక నాలుగో స్థానంతో ముగించింది. అయితే 22 ఏళ్ల మనూ భాకర్ సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. మూడు ఈవెంట్లలో రెండు పతకాలు, మరో దాంట్లో నాలుగో స్థానం అంటే అసాధారణ ప్రదర్శన. గత టోక్యో ఒలింపిక్స్‌లో కనీస ప్రభావం చూపించలేక తీవ్ర విమర్శలపాలైన ఈ యంగ్‌స్టర్ ఇప్పుడు పారిస్ నుంచి సగర్వంగా స్వదేశం వెళుతోంది. పారిస్: భారత స్టార్ షూటర్ మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకాన్ని సాధించడంలో విఫలమైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మనూ నాలుగో స్థానానికి పరిమితమైంది. శనివారం జరిగిన ఫైనల్లో మనూ ‘షూట్–ఆఫ్’లో ఓటమి పాలైంది. ఒక్కో సిరీస్‌లో ఐదు షాట్ల చొప్పున ఉండే ఎనిమిది సిరీస్‌లు ముగిసేసరికి మనూ 28 పాయింట్లు స్కోరు చేసింది. హంగేరీకి చెందిన వెరోనికా మాయో కూడా సరిగ్గా 28 పాయింట్లే సాధించింది. దాంతో ఇద్దరి మధ్య ఐదు షాట్ల ‘షూట్–ఆఫ్’ నిర్వహించారు. ఇందులో మూడు షాట్లను మనూ లక్ష్యంపైకి సరిగ్గా కొట్టగా... నాలుగు షాట్లు సరిగ్గా కొట్టిన వెరోనికాయే పైచేయి సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దాంతో మనూకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో తొలి సిరీస్‌లో రెండు షాట్లు మాత్రం లక్ష్యం చేర్చిన మనూ పేలవంగా మొదలు పెట్టింది. అయితే ఆ తర్వాత వరుసగా 4, 4 పాయింట్లు సాధించి 10 పాయింట్లతో ఎలిమినేషన్ రౌండ్‌కు సిద్ధమైంది. ఇక్కడ మళ్లీ తడబడి 3తో మొదలు పెట్టిన మనూ ఆ తర్వాత వరుసగా 5, 4, 4 పాయింట్లతో ఏడు సిరీస్‌ల తర్వాత మొత్తం 26 పాయింట్లతో రెండో స్థానంతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఈ తర్వాత ఈ జోరు కొనసాగలేదు. ఎనిమిదో సిరీస్ మనూను బాగా దెబ్బ తీసింది. కేవలం 2 షాట్లు మాత్రమే లక్ష్యం చేరడంతో వెనకబడిపోయి కాంస్యం కోసం పోటీ పడాల్సి వచ్చింది. అయితే ‘షూట్–ఆఫ్’లో అదే వైఫల్యం కొనసాగింది. ఈ ఈవెంట్లో ‘షూట్–ఆఫ్’లో జిన్ యాంగ్ (దక్షిణ కొరియా) స్వర్ణం, క్యామిలె జెడ్రెస్కీ (ఫ్రాన్స్) రజతం గెలుచుకున్నారు. నిర్ణీత 10 సిరీస్‌ల తర్వాత ఇద్దరూ 37 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్–ఆఫ్’లో జిన్ యాంగ్ 3 పాయింట్లు సాధించగా... క్యామిలె ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. స్కీట్‌లో నిరాశ... షూటింగ్‌లోనే స్కీట్ ఈవెంట్ పురుషుల విభాగంలో భారత షూటర్ అనంత్ జీత్‌సింగ్ నరూకా విఫలమయ్యాడు. ఐదు క్వాలిఫయింగ్ రౌండ్ల తర్వాత అతను 24వ స్థానంలో మాత్రమే నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. తొలి ఆరుగురు ఫైనల్‌కు చేరే ఈ ఈవెంట్లో అనంత్ జీత్ మొత్తం 125కుగాను 116 (23, 22, 23, 24, 24) పాయింట్లు సాధించాడు. బాక్సర్ నిశాంత్ ఓటమి బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ దేవ్ 1–4తో మార్కో వెర్దె (మెక్సికో) చేతిలో ఓడిపోయాడు. నిశాంత్ ఓటమితో పురుషుల విభాగంలో భారత కథ ముగిసింది. ఒత్తిడిని అధిగమించలేకపోయాను పారిస్ ఒలింపిక్స్‌లో మూడో పతకంపై గురి పెట్టాను. అయితే కీలక సమయంలో ఒత్తిడిలో చిత్తయ్యాను. ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అయితే రెండు కాంస్యాల తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఇంతకంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాను. ‘షూట్–ఆఫ్’లో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా. దానిని అధిగమించి గెలిచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించినా అది సరిపోలేదు. రెండు పతకాలు గెలవడం సంతోషకరమే.కానీ ఈ క్షణాన మాత్రం నాలుగో స్థానం నాకు తీవ్ర నిరాశ కలిగించింది. ఒలింపిక్స్‌లో చాలా వరకు బాగానే ఆడినా ఈసారి విఫలమయ్యాను. ఎప్పుడైనా రేపు మరో అవకాశం అనేది ఉంటుంది. 2028 కోసం ఎదురు చూస్తున్నా. ఈ పోరుకు ముందు ఎలాగైనా మూడో పతకం సాధించాలని నాపై ఎవరూ ఒత్తిడి పెట్టలేదు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను కాబట్టి బయటి వ్యక్తుల అంచనాల గురించి కూడా నాకేమీ తెలియదు. నాలుగో స్థానం దక్కింది కాబట్టి నా లోపాలేమిటో తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. పతకం రాకపోతే ఎవరూ నిరాశ చెందవద్దని నేను ముందే చెప్పడం ఏదో మాట వరసకు అన్నదే. ఇక్కడా గెలిస్తే బాగుండేది. కానీ చివరి వరకు పోరాడగలిగాను. నేను ఈ ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఇక ముందు ఇలాగే కష్టపడతానని అందరికీ చెబుతున్నాను. –మనూ భాకర్ -
వెనుకంజలో భారత గోల్ఫర్లు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్లు ప్రభావం చూపలేకపోతున్నారు. శనివారం మూడో రౌండ్ పోటీలు ముగిసేసరికి శుభాంకర్ శర్మ 34వ స్థానంలో.. గగన్జీత్సింగ్ భుల్లర్ 48 స్థానంలో నిలిచారు. రెండు రౌండ్లు ముగిసేసరికి మెరుగైన స్థితిలో కనిపించిన శుభాంకర్... శనివారం పోటీల్లో తొమ్మిది స్థానాలు కోల్పోయి.. 211 పాయింట్లతో నిలిచాడు. సెర్బియా గోల్ఫర్ రహమ్ జాన్ (199) టాప్‌లో ఉన్నాడు. మొత్తం 18 హోల్స్ ఉన్న ఈ పోటీల్లో నాలుగు రౌండ్లు నిర్వహించనున్నారు. ఇందులో మెరుగైన షాట్లు ఆడిన తొలి ముగ్గురు గోల్ఫర్లకు పతకాలు దక్కుతాయి. ఆదివారం చివరి రౌండ్ పోటీలు జరగనున్నాయి. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి అదితి అశోక్, దీక్ష డాగర్ బరిలోకి దిగనున్నారు. నేత్ర, విష్ణు ఎదురీత పారిస్ ఒలింపిక్స్‌లో భారత సెయిలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మహిళల డింగీ విభాగంలో 6 రేసులు ముగిసేసరికి భారత సెయిలర్ నేత్ర కుమానన్ 24వ స్థానంలో నిలిచింది. మూడు రేసులు ముగిసేసరికి 11వ ప్లేస్‌లో ఉన్న నేత్ర శనివారం ఐదు, ఆరు రేసుల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. పురుషుల ఈవెంట్లో విష్ణు శరవణన్ 23వ స్థానంలో ఉన్నాడు. 10 రేసులు ముగిసేసరికి టాప్–10లో ఉన్న సెయిలర్లు ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. -
కొలనులో కొత్త కెరటం
ఒలింపిక్స్‌లో ఈత పోటీలు అనగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మైకేల్ ఫెల్ప్స్! మకుటం లేని మహారాజులా స్విమ్మింగ్‌పూల్‌ను ఏలిన ఈ అమెరికా స్విమ్మర్.. విశ్వక్రీడల్లో ఏకంగా 28 పతకాలు సాధించి అదుర్స్ అనిపించుకున్నాడు. అందులో 23 స్వర్ణాలు ఉన్నాయంటే.. విశ్వక్రీడల్లో అతడి హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ నయా స్విమ్మర్ లియాన్ మర్చండ్.. అమెరికా దిగ్గజం బాటలో దూసుకెళ్తున్నాడు. పాల్గొన్న తొలి ఒలింపిక్ క్రీడల్లోనే నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకొని ఫెల్ప్స్‌కు తానే సరైన వారసుడినని అనిపించుకుంటున్నాడు. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు సాధించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన మర్చండ్.. ‘పారిస్’ క్రీడల్లో నాలుగో పసిడి చేజిక్కించుకున్నాడు. నాలుగు భిన్న రేసుల్లో అగ్రస్థానంలో నిలిచిన మర్చండ్.. ఈ నాలుగింట ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. ఫ్రాన్స్ యువ స్విమ్మర్ లియాన్ మర్చండ్ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే నాలుగో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే మూడు స్వర్ణాలు నెగ్గిన మర్చండ్.. ఆదివారం పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసులో 1 నిమిషం 54.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో పసిడి పతకాలు గెలుచుకున్న 22 ఏళ్ల మర్చండ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని అంటున్నాడు. మర్చండ్ పోటీపడ్డ తొలి రేసును కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మక్రాన్.. అతడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు. వారం రోజుల వ్యవధిలో కొలనులో సంచలన ఫలితాలు సాధించి రికార్డులు తిరగరాసిన మర్చండ్కు తాను అభిమాని అయిపోయానని వెల్లడించారు.‘అభిమాన సందోహం మధ్య పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చొని అభివాదం చేస్తుంటే.. ఇన్నేళ్లు పడ్డ కష్టం అంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది’ అని నాలుగో పసిడి పతకం గెలిచిన అనంతరం మర్చండ్ అన్నాడు. తనను తాను సిగ్గరిగా చెప్పుకునే మర్చండ్.. తాజా క్రీడల్లో చివరగా బరిలోకి దిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించాడు. మూడు పతకాలు గెలిచిన గర్వం కానీ, మరో పతకం సాధించాలనే ఒత్తిడి కానీ ఏమాత్రం లేకుండా బరిలోకి దిగి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ‘నాలుగు స్వర్ణాలు గెలవడం నమ్మశక్యంగా లేదు. మొదట ఒక పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ తర్వాత వరుసగా మంచి ప్రదర్శనలు కనబర్చా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది’ అని మర్చండ్ పేర్కొన్నాడు. ఫ్రెంచ్ ఫెల్ప్స్... ఈత కొలనులో సంచలనాలు నమోదు చేస్తున్న మర్చండ్ను అభిమానులు ముద్దుగా ‘ఫ్రెంచ్ ఫెల్ప్స్’ అని పిలచుకుంటున్నారు. అయితే అది తనపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని.. ఒకింత ఆనందంగా కూడా ఉందని మర్చండ్ పేర్కొన్నాడు. దశాబ్దకాలం పాటు ఒలింపిక్స్‌లో ఏకఛత్రాధిపత్యం కనబర్చిన ఫెల్ప్స్ నమోదు చేసిన రెండు ఒలింపిక్ రికార్డుల (400 మీటర్ల మెడ్లే, 200 మీటర్ల మెడ్లే)ను మర్చండ్ తాజాగా బద్దలు కొట్టాడు. మరోవైపు ఫెల్ప్స్ కూడా మర్చండ్ ఫీట్‌కు ఫిదా అయిపోయాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మర్చండ్ స్వర్ణాలు గెలిచిన సందర్భంలో ఫెల్ప్స్ సంబరాలు జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఫెల్ప్స్తో పోల్చినప్పుడు గర్వంగా ఉంటుంది. స్విమ్మింగ్ రూపురేఖలను మార్చిన ఘనత అతడిది’ అని మర్చండ్ అన్నాడు. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించేందుకు ఫెల్ప్స్ ఇచ్చిన సూచనలు కూడా పనిచేశాయని వెల్లడించాడు. అయితే ‘పారిస్’ క్రీడల్లో మర్చండ్తో పోటీపడిన సహచరులు మాత్రం.. ఫెల్ప్స్ కన్నా మర్చండ్ కఠిన ప్రత్యర్థి అని ప్రశంసించారు. మర్చండ్తో కలిసి 400 మీటర్లు, 200 మీటర్లు వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలోకి దిగిన అమెరికా స్విమ్మర్ కార్సాన్ ఫాస్టర్ మాట్లాడుతూ.. ‘పోటీలో పాల్గొన్న వారందరికీ.. అత్యుత్తమ స్విమ్మర్తో బరిలోకి దిగిన అనుభవం ఎదురైంది. పోటీ పడిన నాలుగు ఈవెంట్లలోనూ స్వర్ణాలు గెలవడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నాడు. –సాక్షి క్రీడా విభాగం -
డోపింగ్‌లో పట్టుబడ్డ అఫ్గానిస్తాన్ జూడో ప్లేయర్
పారిస్ ఒలింపిక్స్‌లో మూడో డోపింగ్ కేసు నమోదైంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన జూడో ఆటగాడు మొహమ్మద్ సమీమ్ ఫైజాద్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతన్ని అఫ్గాన్ జట్టు నుంచి తప్పించారు. 81 కేజీల కేటగిరీలో తొలి బౌట్లో పాల్గొన్న సమయంలోనే 22 ఏళ్ల ఫైజాద్ నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించారు. అనంతరం ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆధ్వర్యంలోని ల్యాబ్‌లో పరీక్షించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిం ది. పారిస్ క్రీడల్లో పట్టుబడిన మూడో డోపీ సమీమ్ ఫైజాద్. ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషుల బృందంతో అఫ్గాన్ ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటుంది. -
థాంక్యూ అమ్మ.. నీ వల్లే ఇదంతా: మను భాకర్
ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత స్టార్ షూటర్ మను భాకర్‌కు నిరాశే ఎదురైంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో మూడో పతకాన్ని మను భాకర్ చేజార్చుకుంది.శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 4వ స్థానంతో మను సరిపెట్టుకుంది. ఏదమైనప్పటకి మను తన పేరును ఒలింపిక్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా మను రికార్డులకెక్కింది.మను బాకర్ తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకోగా .. ఆ తర్వాత మరో షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్‌లో మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. ఇక మూడో పతకం చేజారిన అనంతరం ఆధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన మను భాకర్ భావోద్వేగానికి లోనయ్యంది. తన తల్లి సహకారంతోనే ఇదింతా సాధించానని మను తెలిపింది.'ఈ సందర్భంగా మా అమ్మకు ఓ సందేశం పంపాలనుకుంటున్నాను. నా కోసం అన్నింటిని త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు. నీ సహకారంతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను.నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నీవు వీలైనంత ఎక్కువ కాలం నాతో పాటే ఉండాలని నేను ఆశిస్తున్నా అని మను బాకర్ పేర్కొంది. -
ముగిసిన భారత ఆర్చర్ల పోరాటం.. కార్టర్స్‌లో దీపికా ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆర్చరీ విభాగంలో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్ మిచ్చెల్లి క్రొప్పన్‌ను ఓడించి తన సత్తాచాటిన దీపికా కుమారి .. క్వార్టర్లో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయింది. దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియోన్ చేతిలో4-6 తేడాతో దీపికా కుమారి పరాజయం పాలైంది. 3వ సెట్ ముగిసే సమయానికి దీపిక 4-2తో ముందంజలో ఉన్నప్పటకి.. తర్వాత సెట్లలో పేలవమైన షూటింగ్‌ల కారణంగా ఆమె తమ సెమీ-ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది.అదేవిధంగా మరో ఆర్చర్ భజన్ కౌర్ రౌండ్-16లోనే ఇంటిముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన డియానందా చోయిరునిసా చేతిలో భజన్ కౌర్ ఓటమి చవిచూసింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ప్రయాణం ముగిసింది. మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి భారత ఆర్చర్లు ఇంటిముఖం పట్టారు. -
Vivianne Robinson: ఒలింపిక్స్ ఇంటిపేరయింది
మనసు ఉంటే మార్గమే కాదు ‘మనీ’ కూడా ఉంటుంది. ‘అదెలా!’ అని ఆశ్చర్యపడితే... వివియానా రాబిన్సన్ గురించి తెలుసుకోవాల్సిందే. ‘ఒలింపిక్స్’ అనే మాట వినబడగానే ఆమె ఒళ్లు పులకించి΄ోతుంది. ప్రపంచ సంగ్రామ క్రీడను టీవీలో కాదు ప్రత్యక్షంగా చూడాలనేది ఆమె కల. అలా కల కని ఊరుకోలేదు. ఒక్కసారి కాదు ఏడుసార్లు ఒలింపిక్స్ వెళ్లింది... అలా అని ఆమె సంపన్నురాలేం కాదు. చాలా సామాన్యురాలు.ఒలింపిక్స్‌పై ఆసక్తి రాబిన్సన్కు 1984 ఒలింపిక్స్ సమయం లో మొదలైంది. ఆమె తల్లి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో అథ్లెట్లకు ట్రాన్స్‌లేటర్‌గా ఉండేది. తల్లి నోటినుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలు, విశేషాలు వినేది. ఆ ఆసక్తి రాబిన్సన్ను అట్లాంటా ఒలింపిక్స్‌కు వెళ్లేలా చేసింది.‘ఇప్పటిలా అప్పట్లో అథ్లెట్స్‌కు హైసెక్యూరిటీ ఉండేది కాదు. దీంతో ఎంతోమంది అథ్లెట్స్‌తో మాట్లాడే అవకాశం దొరికేది. కాని ఇప్పుడు సమీపంలోకి కూడా వెళ్లే పరిస్థితి లేదు’ అని ఆరోజులను గుర్తు చేసుకుంటుంది రాబిన్సన్.లాస్ ఏంజెల్స్, అట్లాంటా, సిడ్నీ, ఏథెన్స్, లండన్, రియో డి జెనీరోలతో పాటు తాజాగా ప్యారిస్ ఒలిపింక్స్‌కు కూడా వెళ్లింది.స్థలం కొనడానికో, ఇల్లు కొనడానికో, భవిష్యత్ అవసరాల కోసమో సాధారణంగా డబ్బు పొదుపు చేస్తారు. కాని రాబిన్సన్ మాత్రం ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు పొదుపు చేస్తుంది. రోజుకు రెండు ఉద్యోగాలు చేసింది. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ కోసం కూడా ఎప్పటినుంచో పొదుపు మంత్రం పాటించింది.ఒలింపిక్ థీమ్డ్ ట్రాక్సూట్తో ప్యారిస్‌లో టూరిస్ట్‌లు, వాలెంటీర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది రాబిన్సన్. ఎంతోమంది ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు ఆమె పాపులర్ టిక్‌టాక్ వీడియోల గురించి మాట్లాడుతుంటారు.‘సాధారణ దుస్తుల్లో కంటే ఇలాంటి దుస్తుల్లో కనిపించడం వల్ల నాతో మాట్లాడటానికి ఉత్సాహం చూపుతారు’ అంటుంది తన ప్రత్యేక వేషధారణ గురించి చెబుతూ. ఒలింపిక్స్ పుణ్యమా అని ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు టామ్ క్రూజ్, లేడీ గాగా లాంటి సెలబ్రిటీ ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది.ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత ఉండక΄ోవచ్చు. అయితే 66 సంవత్సరాల వయసులోనూ రాబిన్సన్ కు ఒలిపింక్స్పై ఆసక్తి తగ్గలేదు.‘డబ్బును పొదుపు చేస్తూ నేను బతికి ఉన్నంత వరకు ఒలింపిక్స్‌కు వెళుతూనే ఉంటాను’ అంటుంది మెరిసే కళ్లతో రాబిన్సన్. అయితే నెక్స్›్టఒలింపిక్స్ కోసం ఆర్థికరీత్యా రాబిన్సన్ అంతగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే తన హోమ్టౌన్ లాస్ ఏంజెల్స్‌లోనే అవి జరగనున్నాయి.వివియానా రాబిన్సన్ పేరుతో ఎంతోమంది ్రపొఫెసర్లు, రచయితలు, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఒలింపిక్స్’ అనేది రాబిన్సన్ ఇంటి పేరు అయింది. ఆటల ప్రేమికులు, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లకు వివియానా రాబిన్సన్ అనే కంటే ‘ఒలింపిక్స్ రాబిన్సన్’ అంటేనే సుపరిచితం.ఒలింపిక్స్ డైరీస్ఒక్కసారి ఒలింపిక్స్‌కు వెళ్లొస్తేనే ఆ అనుభవం ‘ఆహా ఓహో’ అనిపిస్తుంది. అలాంటిది ఏడుసార్లు వెళ్లడం అంటే అంతులేని అనుభూతి. అలాంటి అనుభూతిని సొంతం చేసుకుంది రాబిన్సన్. అథ్లెట్లకు లక్ష్యం మాత్రమే, వాలెంటీర్లకు వారు చేస్తున్న పని మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రేక్షకులుగా వెళ్లాలనుకునే వారికి మాత్రం 360 డిగ్రీల కోణంలో ఒలింపిక్స్ అనుభూతి సొంతం అవుతుంది. ఏడు ఒలింపిక్‌ల జ్ఞాపకాల సంపదను వృథా చేయవద్దు అంటున్నారు రాబిన్సన్ స్నేహితులు. సామాన్య ప్రేక్షకురాలిగా తాను చూసిన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన గ్రంథం అవుతుంది. డైరీలలో దాగి ఉన్న ఆమె ఒలింపిక్ అనుభవాలు ఏదో ఒకరోజు పుస్తకరూపం దాల్చుతాయని ఖాయంగా చెప్పవచ్చు. -
కేటీ... 13 పతకాలతో మేటి
పారిస్: అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ విశ్వ క్రీడల్లో మరోసారి మెరిసింది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కేటీ లెడెకీ, క్లెయిర్ వీన్‌స్టెన్, పెయిజ్ మాడెన్, ఎరిన్ గిమెల్లతో కూడిన అమెరికా బృందం రజత పతకం (7ని:40.86 సెకన్లు) సాధించింది. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణం, మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం గెలిచిన లెడెకీకిది మూడో పతకం కాగా... 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది. తాజా పతకంతో లెడెకీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా చరిత్ర లిఖించింది. 12 పతకాలతో జెన్నీ థాంప్సన్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును లెడెకీ సవరించింది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లెడెకీ ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అమెరికా మాజీ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ అత్యధికంగా 28 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 13 పతకాలతో లెడెకీ మహిళల విభాగంలో అగ్రస్థానంలో, ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. ‘విశ్వక్రీడల్లో ఒత్తిడి సహజమే. అయితే నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఆ క్రమంలో రికార్డులు నమోదైతే అది మరింత ఆనందం. స్వదేశంలో జరిగే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటా’ అని లెడెకీ పేర్కొంది. -
మరో చరిత్రకు మను ‘సై’
ఏ భారత ప్లేయర్‌కూ సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు పిస్టల్ షూటర్ మనూ భాకర్ ఒక్క పతకం దూరంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్ మూడో పతకంపై గురి పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో మనూ రెండో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య నేడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జరిగే ఫైనల్లో మనూ టాప్–3లో నిలిస్తే మూడో పతకాన్ని ఖరారు చేసుకుంటుంది. దాంతోపాటు ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 3 వ్యక్తిగత పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌గా మనూ భాకర్ అవతరిస్తుంది.నార్మన్ ప్రిచర్డ్ (1900 పారిస్; అథ్లెటిక్స్‌లో 2 రజతాలు), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్‌లో కాంస్యం; 2012 లండన్‌లో రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియోలో రజతం; 2020 టోక్యోలో కాంస్యం) రెండు పతకాల చొప్పున సాధించగా... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి ప్రస్తుతం ఈ ముగ్గురి సరసన మనూ భాకర్ ఉంది. పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో పూర్తిగా నిరాశపరిచిన మనూ భాకర్ ‘పారిస్’లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తాను పాల్గొంటున్న మూడు ఈవెంట్లలోనూ మనూ భాకర్ ఫైనల్‌కు చేరి ఔరా అనిపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలోనూ కాంస్యం గెలిచిన మనూ భాకర్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక పోరుకు అర్హత పొందింది. 40 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్‌లో మనూ 600 పాయింట్లకుగాను 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత షూటర్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి 18వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్ బెర్త్‌లు ఖరారవుతాయి. 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్‌ను రెండు భాగాలుగా నిర్వహించారు. ముందుగా ప్రెసిషన్ ఈవెంట్లో, తర్వాత ర్యాపిడ్ ఈవెంట్లో పోటీపడ్డారు. మనూ ప్రెసిషన్ ఈవెంట్లో 294 పాయింట్లు, ర్యాపిడ్‌లో 296 పాయింట్లు సాధించింది. క్వాలిఫయింగ్‌లో వెరోనికా (హంగేరి; 592 పాయింట్లు) టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత హనియె రోస్తమియాన్ (ఇరాన్; 588 పాయింట్లు) మూడో స్థానాన్ని, ట్రిన్ తు విన్ (వియత్నాం; 587 పాయింట్లు) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. నాన్ జావో (చైనా; 586 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, జిన్ యాంగ్ (కొరియా; 586 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, కామిలి జెద్రావ్స్కీ (ఫ్రాన్స్; 585 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, కేటలిన్ మోర్గాన్ (అమెరికా; 585 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. -
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో...
పారిస్: ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల విజయగాథలే కాదు... వీటిలో పాల్గొనే వారిలో ఎన్నో భిన్నమైన, ఆసక్తికర నేపథ్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వెనిజులాకు చెందిన షూటర్ లియోనెల్ మార్టినెజ్ పారిస్‌లో ట్రాప్ ఈవెంట్లో పోటీ పడ్డాడు. ఓవరాల్‌గా 28వ స్థానంతో ముగించాడు. అయితే అతను పోటీల్లో పాల్గొనడం విశేషం కాదు... 60 ఏళ్ల వయసున్న మార్టినెజ్ 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగడమే అసలు ఘనత! 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మార్టినెజ్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆటకు దూరమై పలు వ్యాపారాల్లో స్థిరపడ్డాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ షూటింగ్ వైపు మనసు మళ్లింది. మొదటి నుంచి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న మారి్టనెజ్కు మరోసారి క్రీడల్లోకి అడుగు పెట్టడం కష్టం కాలేదు. తన షూటింగ్‌కు పదును పెట్టుకున్న అతను 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలనేదే మారి్టనెజ్ తర్వాతి లక్ష్యం. అప్పటికి 64 ఏళ్లు వచ్చినా సరే... ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను అంటూ అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మారి్టనెజ్కు ముందు జపాన్ ఈక్వె్రస్టియన్ ఆటగాడు హొకెసు హిరోషి మాత్రమే రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం (44 ఏళ్లు) తీసుకున్నవాడిగా నిలిచాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. -
‘కొంత విరామం కావాలి’
పారిస్: భారత్ తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు దురదృష్టవశాత్తూ ఆ ఘనతను అందుకోలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు ఆలోచనల గురించి సింధు వెల్లడించింది. తాజా ఓటమితో చాలా బాధపడుతున్నానన్న ఆమె... మరో చర్చకు తావు లేకుండా ఆటలో కొనసాగుతానని స్పష్టం చేసింది. అయితే శారీరకంగా, మానసికంగా కాస్త విరామం కోరుకుంటున్నానని పేర్కొంది. 29 ఏళ్ల సింధు ఒలింపిక్స్ పరాజయం తర్వాత సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేసింది. ‘పారిస్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. కానీ ఓటమి బాధించింది. ఈ పరాజయం నా జీవితంలో చాలా కఠినమైంది. దీని నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. అయితే జీవితం ఆగిపోదు. మళ్లీ కొనసాగాల్సిందే. పారిస్‌కు అర్హత సాధించే క్రమంలో ఎంతో పోరాడాను. గత రెండేళ్లు గాయాలతో ఎక్కువ సమయం ఆటకు దూరమయ్యాను. ఈ సవాళ్లను అధిగమించి నా దేశం తరఫున మూడో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం రావడం గొప్పగా అనిపించింది. ఈ స్థాయిలో ఆడటం, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవగలగడం నా అదృష్టం. నేను విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాను కాబట్టి ఎలాంటి చింత లేదు. ఇప్పుడు అభిమానుల మెసేజ్‌లు నాకు ఊరటనందిస్తున్నాయి. నా భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వదల్చుకున్నా. ఆటలో ఇంకా కొనసాగుతా. అయితే కొంత విరామం తీసుకుంటాను. నా శరీరానికి, మనసుకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. రాబోయే రోజుల కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుంటా. ఎందుకంటే నేను అమితంగా ఇష్టపడే ఆటలోనే నాకు ఆనందం దక్కుతుంది’ అని సింధు తన మనసులో భావాన్ని వ్యక్తపర్చింది. -
‘లక్ష్యం’ దిశగా మరో అడుగు
పారిస్: భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ఒలింపిక్స్ పతక ఆశలను సజీవంగా నిలిపాడు. అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న లక్ష్య సెమీఫైనల్లోకి అడుగు పెట్టి పతకంపై గురి పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–15, 21–12 స్కోరుతో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా... ఆ తర్వాత సత్తా చాటిన 23 ఏళ్ల లక్ష్య సెమీస్ చేరాడు. ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున సెమీఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా సేన్ ఘనత సృష్టించాడు. గతంలో భారత్ నుంచి అత్యుత్తమంగా పారుపల్లి కశ్యప్ (2012), కిడాంబి శ్రీకాంత్ (2016) క్వార్టర్ ఫైనల్ వరకు మాత్రమే రాగలిగారు. లో కీన్ యె (సింగపూర్), అక్సెల్సన్ (డెన్మార్క్) మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. సెమీస్‌లో లక్ష్య గెలిస్తే అతనికి స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో ఓడినా కాంస్య పత కం కోసం మళ్లీ పోటీ పడే అవకాశం ఉంటుంది. 2021 వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యపతక విజేత అయిన లక్ష్య క్వార్టర్స్‌లో తొలి గేమ్‌లో కూడా పోరాడాడు. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన టిన్ చెన్ 11–9తో ముందంజ వేసి ఆపై 14–9తో నిలిచాడు. అయితే కోలుకున్న లక్ష్య వరుస పాయింట్లతో 16–15కు దూసుకెళ్లాడు. స్కోరు 19–19కి చేరగా, చివరకు గేమ్ తైపీ ఆటగాడిదే అయింది. రెండో గేమ్ కూడా పోటాపోటీగా సాగగా సేన్ 11–10తో ఆధిక్యంలో నిలిచాడు. స్కోరు 13–13కి చేరిన తర్వాత 10 పాయింట్లలో 8 గెలుచుకొని గేమ్ సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌కు వచ్చే సరికి లక్ష్య ఆటతో మరింత జోరు పెరిగింది. విరామ సమయానికి 11–7 వద్ద ఉన్న సేన్ ఆ తర్వాత దూసుకుపోయాడు. వరుస స్మాష్‌లతో దూకుడు కనబర్చడంతో టిన్ చెన్ వద్ద సమాధానం లేకపోయింది. -
పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ బంపరాఫర్..
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తరపున పతకాలు సాధించేవారికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల్ జిందాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించిన భారత క్రీడాకారులకు 'ఎంజీ విండ్సర్' కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు సజ్జల్ జిందాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా శుక్రవారం వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల్స్ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిందాల్ తెలిపారు. "భారత్ తరపున పతకం సాధించే ప్రతీ క్రీడాకారుడికి జేఎస్‌డబ్ల్యూ గ్రూపు తరుపున 'ఎంజీ విండ్సర్స్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రకటన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ వ్యక్తులు అత్యుత్తమైనవి పొందేందుకు అర్హులు కదా! వారి అంకిత భావం, విజయాల కోసమే ఇది అంటూ" ఎక్స్‌లో జిందాల్ రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా కూడా సజ్జల్ జిందాల్ ఉన్నారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ప్రస్తుతం మూడు పతకాలు ఉన్నాయి. షూటింగ్లో మను భకర్ రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్ కుసాలే సింగ్ ఓ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. -
Paris Olympics: ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. 52 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు మరో అద్భుత విజయం సాధించింది. శుక్రవారం పూల్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 3-2 తేడాతో భారత్ గెలుపొందింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టుపై భారత్ విజయం సాధించడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరగా జర్మనీ వేదికగా జరిగిన 1972 ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా హాకీ జట్టును భారత్ ఓడించింది. మళ్లీ ఇప్పుడు ప్యారిస్‌లో ఆస్ట్రేలియాను భారత హాకీ జట్టు చిత్తు చేసింది. ఇక ఈ విజయంతో టీమిండియా లీగ్ స్టేజి(పూల్-బి)ని రెండో స్ధానంతో ముగించింది. పూల్-బిలో బెల్జియం తొలి స్ధానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత విజయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన గోల్స్‌తో హర్మన్ ప్రీత్ మెరిశాడు. అతడితో పాటు అభిషేక్ ఓ గోల్ సాధించాడు. మరోవైపు ఆస్ట్రేలియా సెకెండ్ క్వార్టర్లో ఓ గోల్ సాధించగా.. ఆఖరి క్వార్టర్లో మరో గోల్ చేసింది. ఇక క్వార్టర్ ఫైనల్లో భారత్ జర్మనీ లేదా గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. -
Paris Olympics 2024: స్వప్నిల్ కుసాలేకు ప్రమోషన్
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు రైల్వే శాఖ పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పుణె డివిజన్లో 2015లో కమర్షియల్–కమ్–టికెట్ క్లర్క్‌గా చేరిన కుసాలే ప్రస్తుతం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా పనిచేస్తున్నారు. ఒలింపిక్ పతక విజేతకు ప్రోత్సాహకంగా అతన్ని టీటీఈ నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమిస్తూ ప్రమోషన్ ఆర్డర్‌ను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇకపై కుసాలే ముంబైలోని స్పోర్ట్స్ సెల్‌కు ఓఎస్డీగా వ్యవహరిస్తాడు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం స్వప్నిల్‌కు రూ. 1 కోటి నజరానా ప్రకటించింది. -
ఒలింపిక్స్‌లో ఇవాల్టి (ఆగస్ట్ 2) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు (ఆగస్ట్ 1) భారత్‌కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న కొందరు అథ్లెట్లు అనూహ్య ఓటములు ఎదుర్కొని ఇంటిబాట పట్టారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. మహిళల బాక్సింగ్‌లో నిఖత్ జరీన్.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు ప్రత్యర్ధుల చేతుల్లో ఓడి పతక ఆశలను నీరుగార్చారు. ఏడో రోజు భారత్ పలు క్రీడాంశాల్లో పతకాలపై ఆశలు పెట్టుకుంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ (క్వార్టర్ ఫైనల్స్).. మహిళ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్లో మనూ భాకర్ పోటీపడనున్నారు. ఒలింపిక్స్‌లో ఇవాల్టి భారత షెడ్యూల్ ఇలా ఉంది.గోల్ఫ్- శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ (పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2)- మధ్యాహ్నం 12:30 గంటలకుషూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ (మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్)- మధ్యాహ్నం 12:30 గంటలకుఅనంత్జీత్ సింగ్ నరుకా (పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1)- మధ్యాహ్నం ఒంటి గంటకుఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర/అంకిత భకత్ వర్సెస్ దియానంద కొయిరున్నిసా/ఆరిఫ్ పంగెస్తు (రికర్వ్ మిక్సడ్ టీమ్ 1/8 ఎలిమినేషన్స్)- మధ్యాహ్నం 1:19 గంటలకుజూడో- తులికమన్ వర్సెస్ ఇడాలిస్ ఓర్టిజ్ (మహిళల +78 కేజీల ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32)- మధ్యాహ్నం 1:32 నుంచిషూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ (మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ (ర్యాపిడ్))- మధ్యాహ్నం 3:30 గంటలకుసెయిలింగ్- నేత్రా కుమనన్ (మహిళల డింఘీ రేస్ 3 మరియు 4)- మధ్యాహ్నం 3:45 గంటలకుహాకీ- ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (పురుషుల హాకీ పూల్ బి)- సాయంత్రం 4:45 గంటలకుబ్యాడ్మింటన్- లక్ష్యసేన్ వర్సెస్ చౌ టిన్ చెన్ (పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్)- 6:30 గంటలకుసెయిలింగ్- విష్ణు శరవణన్ (పురుషుల డింగీ రేస్ 3 అండ్ 4)- రాత్రి 7:05 గంటలకుఅథ్లెటిక్స్- అంకిత ధయాని (మహిళల 5000 మీటర్ల హీట్ 1)- రాత్రి 9:40 గంటలకుపారుల్ చౌధరి (మహిళల 5000 మీటర్ల హీట్ 2)- రాత్రి 10:06 గంటలకుతజిందర్ పాల్ సింగ్ తూర్ (పురుషుల షాట్ పుట్ క్వాలిఫికేషన్)- రాత్రి 11:40 గంటలకు -
పోరాడి ఓడిన శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో సంచలన ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్‌కు చేరిన భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ.. ప్రపంచ నంబర్‌వన్ చేతిలో పోరాడి ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ 10–12, 10–12, 8–11, 3–11తో సన్ యింగ్షా (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు గేమ్‌ల్లో మొదట ఆధిక్యం కనబర్చిన శ్రీజ.. చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయింది. -
నడకలో నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు. -
ప్రవీణ్ తొలి రౌండ్లోనే...
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా... బరిలో మిగిలిన ఏకైక భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ కూడా ఇంటిదారి పట్టాడు. వ్యక్తిగత రికర్వ్ తొలి రౌండ్లో ప్రవీణ్ 0–6 (28–29, 29–30, 27–28)తో వెన్‌చావో (చైనా) చేతిలో ఓడాడు. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్ శనివారం ప్రిక్వార్టర్స్ బరిలో దిగనున్నారు. -
స్వప్నం సాకారం
గత రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారత తుపాకీ ‘పారిస్’లో మాత్రం గర్జిస్తోంది. తమపై పెట్టుకున్న అంచనాలను వమ్ముచేయకుండా షూటర్లు భారత్‌కు మూడో పతకాన్ని అందించారు. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించాడు.క్వాలిఫయింగ్‌లో నిలకడగా లక్ష్యంపై గురి పెట్టి పాయింట్లు గెలిచిన స్వప్నిల్ పతకాన్ని ఖరారు చేసే ఫైనల్స్‌లోనూ దానిని కొనసాగించాడు. ఫలితంగా గతంలో ఏ క్రీడాంశంలోనూ నమోదుకాని అద్భుతాన్ని భారత షూటర్లు నిజం చేసి చూపించారు. ఒకే ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే ప్రథమం. ‘పారిస్’లో ఇప్పటికే రెండు కాంస్యాలు సాధించిన మనూ భాకర్ మరో ఈవెంట్లో పోటీపడనుండటంతో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరే అవకాశాలున్నాయి. పారిస్: గతంలో భారత్ నుంచి ఒలింపిక్స్‌లో ఎవరూ ఫైనల్‌కు చేరని ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తీవ్రమైన పోటీఉండే విశ్వ క్రీడల్లో క్వాలిఫయింగ్తో పోలిస్తే అసలు సిసలు సత్తా ఫైనల్లో చూపిస్తేనే పతకాలు ఖరారవుతాయి. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతుండటంతో స్వప్నిల్ పతకం సాధిస్తాడని పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ తన నైపుణ్యంపై అపార నమ్మకమున్న స్వప్నిల్ అందరినీ ఆశ్చర్యపరిచే ప్రదర్శన చేశాడు.షూటింగ్లో ఎంతో క్లిష్టమైన ఈవెంట్‌గా పేరున్న 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో (నీలింగ్, ప్రోన్, స్టాండింగ్) స్వప్నిల్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకాన్ని గెలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో 28 ఏళ్ల స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ 451.4 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్టేజ్–1లో త్రీ పొజిషన్స్‌లో భాగంగా నీలింగ్ స్టేజ్ ముగిశాక స్వప్నిల్ 153.3 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రోన్ స్టేజ్ పూర్తయ్యాక స్వప్నిల్ 310.1 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఎలిమినేషన్‌ను నిర్ణయించే చివరి స్టేజ్ స్టాండింగ్‌లో స్వప్నిల్ నిలకడగా పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.2012 నుంచి అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వప్నిల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలిసారే పతకాన్ని గెలిచి తన కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. లియు యుకున్ (చైనా; 463.6 పాయింట్లు) స్వర్ణం, సెరీ కులిష్ (ఉక్రెయిన్; 461.3 పాయింట్లు) రజతం సాధించారు. సిఫ్ట్ కౌర్, అంజుమ్ విఫలం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు తనే పేరిట లిఖించుకున్న భారత యువ షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా, సీనియర్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 32 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్ కౌర్ 575 పాయింట్లు స్కోరు చేసి 31వ స్థానంలో నిలువగా... అంజుమ్ 584 పాయింట్లు సాధించి 18వ స్థానాన్ని దక్కించుకుంది. కేవలం టాప్–8లో నిలిచిన షూటర్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ‘ఒక్కడే’ గెలిచి చూపించాడు! ఈతరం కుర్రాళ్లు, స్టార్ ఆటగాళ్లు ఒంటిపై టాటూస్ ముద్రించుకుంటే వాటిపై ఏం రాసి ఉంటుంది? తమకు ఆత్మీయులైన వారి పేర్లు గానీ ఆసక్తికర పంచింగ్ లైన్లు గానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. స్వప్నిల్ కుసాలే తన వెన్నెముక భాగం మొత్తం ‘మహా మృత్యుంజయ మంత్రం’ టాటూగా ముద్రించుకున్నాడు. మానసికంగా తనకు కావాల్సిన బలాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చలించని దృఢత్వాన్ని ఆ రుగ్వేద మంత్రం తనకు ఇస్తుందని అతను బలంగా నమ్ముతాడు. అందుకే కావచ్చు సుదీర్ఘకాలం పాటు షూటింగ్ సర్క్యూట్లో ఉంటూ గొప్ప ఫలితాలు రాకపోయినా అతను ఎప్పుడూ స్థైర్యాన్ని కోల్పోలేదు. నిజంగా కూడా కుసాలే కెరీర్‌ను చూస్తే చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 14 ఏళ్ల వయసులో షూటింగ్‌ను కెరీర్‌ను ఎంచుకున్న స్వప్నిల్ మూడేళ్ల తర్వాత తన తొలి అంతర్జాతీయ పోటీలో బరిలోకి దిగాడు. కానీ అతను తొలి ఒలింపిక్స్ ఆడేందుకు 12 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో అతని పేరు కనీసం పరిశీలనలో కూడా లేకపోగా... 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కొన్నాళ్ల ముందు చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోవడంతో టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. అయితే స్వప్నిల్ సుదీర్ఘ కాలం పాటు తన ఆటనే నమ్ముకున్నాడు. అవకాశం వ చ్చిన ప్రతీసారి విజయాన్ని అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటూనే వచ్చాడు. ఎట్టకేలకు ఈసారి 28 ఏళ్ల వయసులో అతను మొదటిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగడమే కాకుండా కాంస్యంతో చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. అవరోధాలను దాటి... మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి స్వప్నిల్ స్వస్థలం. తండ్రి సురేశ్ కుసాలే పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి అనిత ప్రస్తుతం సర్పంచ్‌గా పని చేస్తోంది. షూటింగ్ సర్క్యూట్లో ఉన్న చాలా మందితో పోలిస్తే స్వప్నిల్ నేపథ్యం సామాన్యమైనదే. తండ్రికి ఆటలపై ఆసక్తి ఉండటంతో కొడుకు స్కూల్లో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ‘క్రీడా ప్రబోధిని’లో చేర్పించాడు. నిబంధనల ప్రకారం వారంతా ఒకే తరహాలో ఫిట్నెస్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా క్రీడాంశం ఎంచుకునే అవకాశం ఇస్తారు. అందులో స్వప్నిల్ షూటింగ్‌ను ఎంచుకున్నాడు. నాసిక్‌లోని భోన్సాలా మిలిటరీ స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో ఓనమాలు నేర్చుకున్న స్వప్నిల్ ఆ తర్వాత మరింత రాటుదేలాడు. అయితే సహజంగానే ఖర్చుతో కూడుతున్న క్రీడ కావడంతో వేర్వేరు దశల్లో ఆర్థి క ఇబ్బందులు తప్పలేదు. తండ్రి బ్యాంకులో అప్పు చేసి మరీ సొంత రైఫిల్ కొనివ్వాల్సి వచ్చింది. దీంతో పాటు ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్లు కూడా చాలా ఖరీదైనవి కావడం వల్ల చాలా జాగ్రత్తగా వాడుకుంటూ సాధన చేయాల్సి వచ్చేది. గగన్ నారంగ్‌ను ఓడించి... 18 ఏళ్ల వయసులో స్వప్నిల్ ప్రతిభను ‘లక్ష్య స్పోర్ట్స్’ సంస్థ గుర్తించింది. వారి ఆర్థిక సహాయంతో పరిస్థితి మెరుగైంది. ఈ క్రమంలో భారత జాతీయ క్యాంప్‌లో అవకాశం దక్కింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో చూపించిన ప్రదర్శనకుగాను భారత రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం లభించడంతో పరిస్థితి మరింత మెరుగైంది. 2015లో ఆసియా జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3లో కేటగిరీలో స్వర్ణం గెలుచుకోవడంతో తొలిసారి అతనికి గుర్తింపు దక్కింది.రెండేళ్ల తర్వాత జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వప్నిల్ తన ఆటతో అందరి దృష్టిలో పడ్డాడు. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తన ఆరాధ్య షూటర్, 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్యపతక విజేత గగన్ నారంగ్, మరో సీనియర్ చయన్ సింగ్‌లను దాటి స్వర్ణం గెలుచుకున్న స్వప్నిల్ సంచలనం సృష్టించాడు. అతని ఎదుగుదలలో కోచ్‌గా భారత మాజీ షూటర్ దీపాలీ దేశ్‌పాండే కీలకపాత్ర పోషించింది. సందేహాలను పటాపంచలు చేస్తూ... చాలా కాలం క్రితమే 2022 అక్టోబరులోనే కైరోలో జరిగిన వరల్డ్ షూటింగ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలవడంతో స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ కేటగిరీలో భారత్‌కు కోటా ఖాయం చేశాడు. కొన్నాళ్ల క్రితం నిర్వహించిన ట్రయల్స్‌లో కూడా రాణించడంతో ఈ విభాగంలో భారత్ తరఫున పోటీ పడేందుకు అతనికే అవకాశం దక్కింది. అయినా సరే... స్వప్నిల్ పతకం సాధించడంపై పెద్దగా ఆశలు లేవు. దానికి కారణం ఉంది. ఈ ఒలింపిక్స్‌కు ముందు అతను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, వరల్డ్ కప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. ఇవన్నీ కూడా టీమ్ ఈవెంట్లలో గెలిచిన పతకాలే! వ్యక్తిగత విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ నమోదు చేయలేదు. దాంతో గెలుపుపై సందేహాలు. కానీ స్వప్నిల్ తన పట్టుదలతో వాటన్నింటినీ పటాపంచలు చేశాడు. అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్య ఆటతో ఒలింపిక్స్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచాడు. 1 ఒకే ఒలింపిక్స్ ఒకే క్రీడాంశంలో భారత్‌కు మూడు పతకాలు రావడం ఇదే తొలిసారి. గతంలో రెజ్లింగ్‌లో రెండుసార్లు రెండు పతకాల చొప్పున రాగా... షూటింగ్లో ఒకసారి, అథ్లెటిక్స్‌లో ఒకసారి రెండేసి పతకాలు లభించాయి. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియా అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు గెలిచాడు.2012 లండన్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్ షూటింగ్లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం సొంతం చేసుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా రజతం, బజరంగ్ పూనియా కాంస్యం సాధించారు. ఈవెంట్‌కు ముందు గుండెవేగం పెరిగింది. దేవుడిని ప్రార్థిస్తూ నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా నాకు తెలిసిన ఆటనే ప్రదర్శించాను. పోటీ జరుగుతున్న సమయంలో స్కోరుబోర్డు వైపు అస్సలు చూడలేదు. ఇన్నేళ్ల నా కష్టం మాత్రం గుర్చుకొచ్చి0ది. తల్లిలాంటి కోచ్ దీపాలీతో పాటు ఇతర సహాయక సిబ్బంది నన్ను మానసికంగా దృఢంగా ఉంచారు. ఒత్తిడిని తట్టుకుంటూ ప్రశాంతంగా ఉండటం నా ఆటలో కీలకం. ఈ విషయంలో నేను ఎమ్మెస్ ధోనిని అభిమానిస్తాను. కాంస్యం గెలవడం సంతృప్తినచ్చి0ది. అయితే నాకు నేను ఒక మాట (స్వర్ణం గెలవడం కావచ్చు) ఇచ్చుకున్నాను. అది మాత్రం ఇంకా పూర్తి కాలేదని అనుకుంటున్నా. –స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచిన స్వప్నిల్ కుసాలేకు హృదయపూర్వక అభినందనలు. షూటింగ్లో ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచి షూటర్లు భారత్ గర్వపడేలా చేశారు. స్వప్నిల్ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిస్వప్నిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనికి శుభాకాంక్షలు. పోటీలో చక్కటి ఆటతో పాటు ఎంతో పట్టుదల కనబర్చిన అతను ప్రతీ భారతీయుడిని సంతోషంలో ముంచెత్తాడు. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ఈ విభాగంలో భారత షూటర్లెవరూ ఎందుకు పతకం సాధించడం లేదని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు స్వప్నిల్ దానిని చేసి చూపించాడు. అతడిపై అంచనాలు లేకపోయినా బాగా ఆడగలడని నేను నమ్మేవాడిని. ఈ కాంస్యం బంగారంకంటే విలువైంది. –గగన్ నారంగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం అందించిన స్వప్నిల్ కుసాలేకు అభినందనలు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ దేశవాసులందరూ గర్వపడేలాచేశాడు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం -
కంటిచూపుతో...
టీ షర్ట్‌తో క్యాజువల్ లుక్... ఎడమ చేయి ప్యాంట్ జేబులో... లక్ష్యాన్ని స్పష్టంగా చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన లెన్స్‌లు లేవు, ఐ కవర్ లేదు, పక్కనుంచి వచ్చే కాంతి నుంచి తప్పించుకునేందుకు వైజర్ పెట్టుకోలేదు, ఇయర్ ప్రొటెక్షన్ లేదు. లక్ష్యంపై గురి...ట్రిగ్గర్‌పై వేలు... నొక్కితే దేశానికి రజత పతకం వచ్చేసింది! టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ ఒక్కసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. సాధారణంగా షూటర్లు పోటీలో దిగినప్పుడు తమతో పాటు ధరించే సరంజామా ఏదీ అతను వాడలేదు. ఏదో అలా వ్యాహ్యాళికి వెళుతూ బొమ్మ తుపాకీతో సంతలో బెలూన్లను కొట్టినంత అలవోకగా అతను బుల్లెట్లను దించేయడం విశేషం. టర్కీ ఆర్మీలో సైనికుడైన 51 ఏళ్ల యూసుఫ్ హాలీవుడ్ సినిమాల స్టయిల్‌ను గుర్తుకు తెచ్చేలా షూటింగ్ చేశాడంటూ కామెంట్లు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో తర్హాన్‌తో కలిసి యూసుఫ్ రజతం సాధించాడు. షూటింగ్లో టర్కీకి ఇదే తొలి మెడల్. -
భారత్‌కు ‘బ్యాడ్’మింటన్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గురువారం భారత్‌కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న పీవీ సింధు... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో రానున్నారు. పురుషుల సింగిల్స్‌లో సహచరుడు ప్రణయ్‌ను ఓడించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరి భారత్ ఆశలను నిలబెట్టాడు. పారిస్: ‘రియో’లో రజత పతకం. ‘టోక్యో’లో కాంస్యం... ‘పారిస్’లో మాత్రం నిరాశ... గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి వరుసగా మూడో ఒలింపిక్ పతకం లక్ష్యంగా ‘పారిస్’కు వచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19–21, 14–21తో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హి బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకున్న సింధు ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. పోరాడినా... పురుషుల డబుల్స్‌లో ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా ముందంజ వేయలేకపోయింది. స్వర్ణ పతకంతో తిరిగి వస్తారనుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–13, 14–21, 16–21తో పరాజయం పాలైంది. ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈసారి పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ రెండు టైటిల్స్ గెలిచి, నాలుగు టో ర్నీ ల్లో రన్నరప్‌గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా అందుకున్నారు. కానీ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవలేకపోయారు. ప్రణయ్ అవుట్ సింధు, సాత్విక్–చిరాగ్ నిష్క్రమించడంతో భారత పతక ఆశలన్నీ లక్ష్య సేన్‌పై ఉన్నాయి. భారత నంబర్‌వన్, సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–12, 21–6తో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. పారుపల్లి కశ్యప్ (2012 లండన్), కిడాంబి శ్రీకాంత్ (2016 రియో) తర్వాత ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ తలపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లక్ష్య సేన్ సెమీఫైనల్ చేరి పతకం రేసులో ఉంటాడు. -
Paris Olympics 2024: వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వియాటెక్‌కు (పోలాండ్) షాక్ తగిలింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన క్విన్వెన్ ఝెంగ్ స్వియాటెక్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించింది. గంటా 51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో క్విన్వెన్ వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. Qinwen Zheng becomes the 1st Chinese player in history to reach the final of the Olympics in singles. No man or woman has ever done it before today. Megastar in the making. 🇨🇳❤️🇨🇳 pic.twitter.com/24f1WkwBcz— The Tennis Letter (@TheTennisLetter) August 1, 2024ఒలింపిక్స్ టెన్నిస్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి చైనా క్రీడాకారిణిగా క్విన్వెన్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో రొలాండ్ గారోస్‌లో 1149 రోజుల పాటు సాగిన స్వియాటెక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2021 నుంచి రొలాండ్ అండ్ గారోస్‌లో స్వియాటెక్‌కు ఓటమనేదే లేదు. డొన్నా వెకిక్, అన్నా కరోలినా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విన్నర్‌తో క్విన్వెన్ ఫైనల్లో పోటీపడుతుంది. -
Paris Olympics 2024: లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో మహిళా బాక్సర్ ఓటమి
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఓ బాక్సర్ లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళితే.. అల్జీరియాకు చెందిన ఇమేన్ ఖెలిఫ్, ఇటలీకి చెందిన ఏంజెలా కారిని 66 కేజీల ప్రిలిమినరీ రౌండ్లో తలపడ్డారు. ఈ గేమ్‌లో ఖెలిఫ్ కేవలం 46 సెకెన్లలో విజయం సాధించింది. ఖెలిఫ్ పిడిగుద్దుల ధాటికి ఏంజెలా కారిని ముక్కు విరిగినంత పనై, బౌట్ నుంచి నిష్క్రమించింది. కారిని బౌట్ నుంచి వైదొలగడానికి ముందు రెండుసార్లు ఆమె హెడ్ సేఫ్టీ తొలగిపోయింది. Today, Angela Carini had her Olympics dreams shattered by Imane Khelif, a male boxer. It is suspected that he BROKE HER NOSE. Don’t let this pass quietly. MEN SHOULD NOT BE ALLOWED TO BEAT WOMEN FOR SPORT. SAVE WOMEN’S SPORTS. pic.twitter.com/i5GMdgWrwb— Hazel Appleyard (@HazelAppleyard_) August 1, 2024ఖెలిఫ్ రెండు పర్యాయాలు బలంగా కారిని తల భాగంపై అటాక్ చేసింది. ముక్కులో తీవ్రమైన నొప్పి రావడంతో బౌట్ నుంచి వైదొలిగినట్లు కారిని గేమ్ అనంతరం వివరించింది. కారిని నొప్పితో విలవిలలాడుతూ కన్నీటిపర్యంతమైంది. గేమ్ అనంతరం ఆమె ఖెలిఫ్‌కు కరచాలనం కూడా చేయలేదు. The moment the Olympics died. pic.twitter.com/S0qK8Jc8iw— Bill Moon (@BigBillMoon) August 1, 2024కాగా, కారినిని తీవ్రంగా గాయపరిచి క్షణాల్లో గేమ్‌ను గెలిచిన ఖెలిఫ్.. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమై 2023 వరల్డ్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించలేకపోయింది. ఖెలిఫ్ వివాదాల నడుమ పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్ధిని తీవ్రంగా గాయపరిచి మ్యాచ్‌ను గెలిచింది. మగ లక్షణాలున్న బాక్సర్ చేతిలో ఓటమి తర్వాత కారినిపై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. కారినికి అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. -
Paris Olympics 2024: ప్రణయ్‌పై గెలుపు.. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చెందిన లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో లక్ష్యసేన్.. భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై వరుస సెట్లలో (21-12, 21-6) విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. -
Olympics 2024: మనోళ్లకు భారీ షాక్.. సాత్విక్- చిరాగ్ అవుట్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పతకం ఖాయమనకున్న విభాగంలో భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు.ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విఫలమై ప్యారిస్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆద్యంతం ఆసక్తి రేపిన మ్యాచ్‌లో మలేషియా జోడీ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి ఇంటిబాటపట్టారు. ఒత్తిడిని అధిగమించలేకకాగా ఒలింపిక్స్‌లో పతకం రేసులో నిలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన సమయంలో సాత్విక్- చిరాగ్ తడబడ్డారు. వాస్తవానికి మలేషియా జోడీతో ముఖాముఖి రికార్డులో సాత్విక్–చిరాగ్ ద్వయం 3–8తో వెనుకబడి ఉంది. ఒకదశలో మలేసియా జంట చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే, భారత జోడీ ఇటీవల ఈ ద్వయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కానీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో చిత్తైంది. ఫలితంగా పతకం గెలవాలన్న కల చెదిరిపోయింది. కాగా.. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆరోన్ చియా–సో వుయ్ యిక్ ఈసారీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లారు.ఇదిలా ఉంటే.. ఆరోరోజు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం సాధించాడు. అయితే, 50 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. తాజాగా సాత్విక్- చిరాగ్ జోడీ కూడా నిరాశపరిచింది.చదవండి:Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం -
Paris Olympics 2024: షూటింగ్లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..?
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు చెందిన స్వప్నిల్ కుసాలె కాంస్య పతకం సాధించాడు. ఈ పతకంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. భారత్ సాధించిన మూడు పతకాలు షూటింగ్లో సాధించనవే కావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత్ జోడీ కాంస్య పతకాలు సాధించారు.ఎవరీ స్వప్నిల్ కుసాలె..?29 ఏళ్ల స్వప్నిల్ కుసాలె మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు సమీపంలో గల కంబల్వాడి అనే గ్రామంలో పుట్టిపెరిగాడు. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అతనికి 12 ఏళ్లు పట్టింది. స్వప్నిల్ అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే పతకం సాధించి ఔరా అనిపించాడు. ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్ స్వప్నిల్ కుసాలేనే కావడం విశేషం.మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని స్పూర్తితో..!స్వప్నిల్ కుసాలే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి ప్రేరణ పొందాడు. ధోనిని ఆరాధిస్తాడు. స్వప్నిల్ కూడా ధోనిలాగే కెరీర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్‌గా పని చేశాడు. ధోని బయోపిక్‌ను స్వప్నిల్ చాలాసార్లు చూశాడు. అతని స్పూర్తితో విజయాలు సాధించాలని కలలు కనేవాడు. ఎట్టకేలకు స్వప్నిల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.ధోనిలాగే ఓపికగా, ప్రశాంతంగా ఉంటాడు..!షూటర్‌కు ఓపిక, ప్రశాంతత చాలా అవసరం. ఈ రెండు లక్షణాలు స్వప్నిల్లో మెండుగా ఉన్నాయి. క్రికెట్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన ధోనిలోనూ ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. వాస్తవానికి ధోని సక్సెస్‌కు ఈ రెండు లక్షణాలే ప్రధాన కారణం. అతనికి మిస్టర్ కూల్ కెప్టెన్ అని బిరుదు కూడా ఉంది. ఇప్పుడు స్వప్నిల్ ధోనిని స్పూర్తిగా తీసుకుని భారత్‌కు పతకం సాధించి పెట్టాడు.స్వప్నిల్ కుటుంబ నేపథ్యంస్వప్నిల్ తండి, సోదరుడు ప్రభుత్వ టీచర్లు. స్వప్నిల్ తల్లి కంబల్వాడి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాడు. -
పారిస్‌లో కొత్తజంట..అథ్లెట్ల గురించి ఏం చెబుతున్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. భారత క్రీడాకారుల మ్యాచ్‌లు వీక్షించిన అనంతరం ఈ నవ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు మరిన్ని పథకాలు సాధిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ..‘దేవుడి దయతో భారత క్రీడాకారులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా చాలా పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నాను. భారత అథ్లెట్లు ప్రతి ఇండియన్ గర్వపడేలా చేస్తారని విశ్వసిస్తున్నాను’ అన్నారు. అనంత్ భార్య రాధిక మర్చంట్ మాట్లాడుతూ..‘పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి ఇండియా మ్యాచ్‌ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఆటగాళ్ల తీరు అద్భుతంగా ఉంది. మరింత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను. ఈ క్రీడల వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్కడ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియా హౌజ్’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాన్ని రూపొందించారు. రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ఇటీవల ఇండియా హౌజ్‌లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రెండు పతకాలతో స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ పారిస్‌లో విజయఢంకా మోగించారు.#WATCH | #ParisOlympics2024 | Reliance Industries Chairman Mukesh Ambani's son Anant Ambani says, "I am sure that with god's grace, the Indian team will perform very well and we will win many medals. I am sure the Indian team will make every Indian like me proud."Anant Ambani's… pic.twitter.com/HzDwTwNsKn— ANI (@ANI) July 31, 2024 -
Paris Olympics: ముగిసిన ఆకుల శ్రీజ పోరాటం.. ప్రీకార్టర్స్‌లో ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ టెబుల్ టెన్నిస్ ప్లేయర్, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెం1 ఇంగ్షా షున్(చైనా) చేతిలో శ్రీజ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో శ్రీజ 10-12, 10-12, 8-11, 3-11 తేడాతో పరాజయం పాలైంది. తొలి మూడు సెట్లలో ప్రత్యర్ధికి గట్టి పోటీ ఇచ్చిన శ్రీజ.. కీలకమైన నాలుగో సెట్లో మాత్రం తేలిపోయింది. కాగా టీటీ మహిళల సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్‌కు చేరిన రెండో భారత ప్లేయర్‌గా శ్రీజ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మరో భారత స్టార్ పెడ్లర్ మనికా బత్రా కథ కూడా ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
నాకౌట్ దశకు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. తద్వారా పతకం గెలిచే ఆశలను సజీవంగా నిలబెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎమ్’ రెండో లీగ్ మ్యాచ్‌లో సింధు 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)పై అలవోకగా గెలిచింది.33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ ‘ఎమ్’ విజేతగా అవతరించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించి గ్రూప్ ‘ఎల్’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 50 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–12తో క్రిస్టీపై గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 19–12 వద్ద ఉన్నపుడు ఇద్దరి మధ్య 50 షాట్ల ర్యాలీ జరిగింది. చివరకు క్రిస్టీ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో పాయింట్ లక్ష్య సేన్‌కు లభించింది. ఆ తర్వాత లక్ష్య సేన్ మరో పాయింట్ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. గ్రూప్ ‘కె’ టాపర్‌గా భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో ఫట్ లె డక్ (వియత్నాం)పై నెగ్గాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్): ప్రవీణŠ జాధవ్ X వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి). పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్): స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: నిఖత్ జరీన్ X యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్పురుషుల డింగీ తొలి రెండు రేసులు: విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ తొలి రెండు రేసులు: నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీభారత్ X బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్: (మధ్యాహ్నం గం. 12:00 నుంచి). పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
గురి కుదిరితే మరో పతకం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు అందించారు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు భారత్ ఖాతాలో షూటింగ్ ద్వారా మూడో పతకం చేరుతుంది. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ బరిలోకి దిగారు. స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారిస్: అంతగా అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే అదరగొట్టాడు. ఆద్యంతం నిలకడగా పాయింట్లు సాధించి పతకం రేసులో నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల స్వప్నిల్ 590 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం 44 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కూడా క్వాలిఫయింగ్‌లో పాల్గొని 589 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్ గుర్తింపు పొందాడు. ‘త్రీ పొజిషన్స్’ అని ఈవెంట్ పేరులో ఉన్నట్టే షూటర్లు వేర్వేరు మూడు భంగిమల్లో లక్ష్యం దిశగా షాట్లు సంధిస్తారు. తొలి సిరీస్‌లో షూటర్లు మోకాళ్లపై (నీలింగ్) కూర్చోని షూట్ చేస్తారు. రెండో సిరీస్‌లో సైనిక భంగిమ (ప్రోన్)లో షూట్ చేస్తారు. చివరిదైన మూడో సిరీస్‌లో నిల్చోని (స్టాండింగ్) లక్ష్యం వైపు షాట్లు కొడతారు. ఈ మూడు భంగిమల్లో స్కోరు చేసిన పాయింట్ల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయిస్తారు. అత్యధికంగా పాయింట్లు సాధించి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మహిళల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్, మహారాష్ట్రకే చెందిన తేజస్విని సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటున్న స్వప్నిల్ క్వాలిఫయింగ్‌లో సంయమనం కోల్పోకుండా, ఏకాగ్రతతో షూట్ చేశాడు. ముందుగా ‘నీలింగ్’ సిరీస్‌లో 198 పాయింట్లు... ‘ప్రోన్’ సిరీస్‌లో 197 పాయింట్లు... చివరిదైన ‘స్టాండింగ్’ సిరీస్‌లో 195 పాయింట్లు స్కోరు చేశాడు. స్వప్నిల్తోపాటు జిరీ ప్రివ్రత్స్కయ్ (చెక్ రిపబ్లిక్), పీటర్ నింబర్స్కయ్ (చెక్ రిపబ్లిక్) కూడా 590 పాయింట్లు స్కోరు చేశారు.అయితే ఈ ముగ్గురిలో 10 పాయింట్ల షాట్లు స్వప్నిల్ (38 సార్లు), జిరీ (35 సార్లు) ఎక్కువగా కొట్టడంతో ఏడు, ఎనిమిదో ర్యాంక్‌లతో ఫైనల్‌కు చేరగా... పీటర్ (32 సార్లు) తొమ్మిదో స్థానంతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ‘నీలింగ్’లో 197 పాయింట్లు... ‘ప్రోన్’లో 193 పాయింట్లు... ‘స్టాండింగ్’లో 193 పాయింట్లు స్కోరు చేసి 589 పాయింట్లతో 11వ స్థానాన్ని సంపాదించాడు. లియు యుకున్ (చైనా; 594 పాయింట్లు), జాన్ హెర్మన్ హెగ్ (నార్వే; 593 పాయింట్లు), సెర్హీ కులిష్ (ఉక్రెయిన్; 592 పాయింట్లు), డెనిస్ బెర్నార్డ్ లుకాస్ (ఫ్రాన్స్; 592 పాయింట్లు), లాజర్ కొవాసెవిచ్ (సెర్బియా; 592 పాయింట్లు), టొమాస్ బార్ట్నిక్ (పోలాండ్; 591 పాయింట్లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో నిలిచి స్వప్నిల్, జిరీలతో కలిసి నేడు జరిగే ఫైనల్లో పతకాల కోసం పోటీపడతారు. రాజేశ్వరి, శ్రేయసి విఫలం మహిళల ట్రాప్ ఈవెంట్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్ బరిలోకి దిగారు. మొత్తం 30 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో రాజేశ్వరి, శ్రేయసి 113 పాయింట్లు స్కోరు చేసి వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. రోయింగ్ సెమీస్‌లో బల్‌రాజ్‌కు ఆరో స్థానం భారత రోవర్ బల్రాజ్ పన్వర్ పారిస్ ఒలింపిక్స్ సింగిల్స్ స్కల్స్ సెమీఫైనల్లో ఆరో స్థానంలో నిలిచాడు. బుధవారం జరిగిన పోటీల్లో పన్వర్ 7 నిమిషాల 4.97 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఇక 19 నుంచి 24 స్థానాల కోసం శనివారం జరగనున్న పోటీలో బల్రాజ్ బరిలోకి దిగనున్నాడు. -
మనిక అవుట్... ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ
పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ (టీటీ) వ్యక్తిగత విభాగంలో భారత్ నుంచి ఆకుల శ్రీజ మాత్రమే బరిలో నిలిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 25వ ర్యాంకర్ ఆకుల శ్రీజ 9–11, 12–10, 11–4, 11–5, 10–12, 12–10తో జెంగ్ జియాన్ (సింగపూర్)పై విజయం సాధించింది. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజకు గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలక దశల్లో శ్రీజ పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో మనిక బత్రా తర్వాత ఒలింపిక్స్ క్రీడల టీటీ పోటీల్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన రెండో భారతీయ క్రీడాకారిణిగా తెలంగాణ అమ్మాయి శ్రీజ గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ యింగ్షా (చైనా)తో శ్రీజ తలపడుతుంది. మరోవైపు భారత రెండో ర్యాంకర్ మనిక బత్రా పోరాటం విశ్వ క్రీడల్లో ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మనిక 6–11, 9–11, 14–12, 8–11, 7–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ మియు హిరానో (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
పక్కా ప్రణాళికతోనే పతకాలు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటర్లు పతకాలతో సత్తా చాటుకున్నారు. సమర్థవంతమైన మౌలిక వసతులు, ప్రణాళికబద్ధమైన కృషి వల్లే ఇది సాధ్యమైందని షూటింగ్ బృందం నిరూపించింది. సమయానుకూలంగా మారాల్సిన ఆవశ్యకతను ఈ విజయాలు తెలియజేశాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పతకం లేకుండానే భారత షూటర్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ పతకాలతో 12 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో మన షూటర్లు చరిత్ర సృష్టించారు. మను ఖాతాలో రెండు పతకాలున్నాయి. మూడో పతకం గెలిచేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దురదృష్టం వల్లే అర్జున్ బబూతాకు కాంస్యం చేజారింది. దీన్ని వైఫల్యంగా చూడలేం. నిజానికి అతను అత్యుత్తమ ప్రదర్శనే చేశాడు. కాకపోతే ఏం చేస్తాం ఆ రోజు తనది కాదు! ఈ ఒలింపిక్స్‌లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది. పతకాలు ఏలా సాకారమయ్యాయంటే మాత్రం యువ షూటర్ల ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణం. క్రీడాగ్రామంలో నేను వారితో పోటీలకు ముందే భేటీ అయ్యాను. నేనో చెఫ్ డి మిషన్‌గా కాకుండా ఓ షూటర్‌గానే వాళ్లతో సంభాíÙంచాను. అప్పుడు వాళ్ల విశ్వాసం, పట్టుదల ఏంటో నాకు అర్థమైంది. ఓ సీనియర్ షూటర్‌గా నేను వారికి చెప్పేదొకటే... గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్రీడలపైనే దృష్టి సారించాలని చెప్పాను. ప్రస్తుత బృందంలోని 21 మందిలో 10 మంది ‘ఖేలో ఇండియా’ ద్వారా వెలుగులోకి వచ్చారు. మరో 11 మంది టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) అండదండలతో విశ్వక్రీడలకు అర్హత సాధించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడాకారులకు ఉన్న ఆరి్థక కష్టాలను తొలగించి ఆటపై దృష్టి పెట్టేలా పెద్ద ఎత్తున కృషి చేశారు. క్రీడాకారులకు సంబంధించి ప్రత్యేక, వ్యక్తిగత శిక్షణ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్చ కూడా కల్పిం చడం గొప్ప విషయం. విదేశీ కోచ్‌లు, విదేశాల్లో శిక్షణ వీటన్నింటి మీద క్రీడా శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఆరంభంలోనే రెండు పతకాలు (షూటింగ్) రావడంతో ఈ విశ్వక్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు గెలిచేందుకు పారిస్ ఒలింపిక్స్ దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. -
నీరజ్ చోప్రా పైనే భారత్ ఆశలు
పారిస్: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫికేషన్ రౌండ్... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్ జరగనుంది. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. రేస్ వాక్‌తో మొదలు.. అథ్లెటిక్స్‌లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్‌జీత్ సింగ్ బిష్త్ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్‌లో అవినాశ్ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు. హర్డిల్స్‌లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ ఇక ఒలింపిక్స్ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్‌గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్ చౌదరి, మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ పాల్‌సింగ్ తూర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావేల్, అబూబాకర్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. కొత్తగా రెపిచాజ్ రౌండ్.. రెజ్లింగ్, రోయింగ్ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లోనూ రెపిచాజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్‌కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్‌కు చేరేవారు. తాజా రెపిచాజ్ రౌండ్‌తో హీట్స్‌లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్ రౌండ్లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్‌కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది. అసలేంటీ రెపిచాజ్ఫ్రెంచ్ భాషలో రెపిచాజ్.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్ చాన్స్ వంటిదే. ‘పారిస్’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్‌లో ఈ రౌండ్‌ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్‌లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్ రౌండ్‌ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్‌లో కేవలం ఫైనల్ మాత్రమే నిర్వహించనున్నారు. మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీతొలి రౌండ్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం 2:10 నుంచి ఫైనల్: ఆగస్టు 11 అర్ధరాత్రి గం. 12.44 నుంచి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జ్యోతి యర్రాజీతొలి రౌండ్: ఆగస్టు 7 మధ్యాహ్నం గం. 1:45 నుంచి రెపిచాజ్ రౌండ్: ఆగస్టు 8 మధ్యాహ్నం గం. 2:05 నుంచి సెమీఫైనల్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం. 3:35 నుంచి ఫైనల్: రాత్రి గం. 11:05 నుంచిజావెలిన్ త్రో షెడ్యూల్ నీరజ్ చోప్రా,కిషోర్ జేనా క్వాలిఫయింగ్: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి ఫైనల్: ఆగస్టు 8 రాత్రి గం. 11:55 నుంచి -
ఆ ఆర్చర్ గురికి ఒకటే పాయింట్!
పారిస్: ఆర్చరీ పోటీల్లో గురి లక్ష బిందువుపైనే ఉంటుంది. ఇది కుదిరితే 10 కాస్త అటుఇటు తప్పితే 9, 8, 7 పాయింట్లు సహజం. కానీ ఆఫ్రికన్ దేశం చాద్ ఆర్చర్ ఇజ్రాయెల్ మదయె దాదాపు టార్గెట్ రింగ్స్ బోర్డుకే దూరమయ్యే బాణం సంధించాడు. త్రుటిలో బోర్డులో పడింది... కానీ వచి్చంది ఒకే పాయింట్! వినడానికి విడ్డూరంగా ఉన్న మదయె రెండో సెట్లో మూడు షాట్లలో ఒకటి ఒక్క పాయింటే తెచ్చి పెట్టింది. విలువిద్యలో కొరియన్ ఆర్చర్లకు తిరుగుండదు. పైగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన కిమ్ వూ జిన్ ముందు 36 ఏళ్ల మదయె ఓ పిల్లబచ్చ! ఈ మ్యాచ్‌లో 26–29, 15–29, 25–30 స్కోరుతో కిమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్లో 26 పాయింట్లు సాధించిన మదయె రెండో సెట్లో కేవలం 15 పాయింట్లే చేశాడు. అంటే మూడు బాణాల స్కోరుకు (10+10+10)కు సగమన్నమాట! ఇందులో మూడో షాట్ ఒక పాయింట్ తేవడంతో అతను సగం స్కోరుకు పరిమితమయ్యాడు. అయితే మూడో సెట్లో పుంజుకొని 25 పాయింట్లు సాధించాడు. ఇంత ఘోరంగా మదయె ఓడినప్పటికీ స్టేడియంలోని కొరియన్ అభిమానుల నుంచి ఓదార్పు లభించింది. చప్పట్లతో మదయెకు వీడ్కోలు పలికారు. -
ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ కు నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అశ్వక క్రీడల్లో (ఈక్వెస్ట్రియన్) భారత్‌కు నిరాశ తప్పలేదు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల డ్రెసాజ్ విభాగంలో రెండు పతకాలతో మెరిసిన అనూష్ అగర్వల్లా.. విశ్వక్రీడల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు. బుధవారం పురుషుల వ్యక్తిగత డ్రెసాజ్ ఈవెంట్ గ్రూప్ స్టేజ్‌లో అనూష్ 66.444 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గ్రూప్ ‘ఇ’లో పోటీపడిన 24 ఏళ్ల అనూష్ భారత్ నుంచి ఒలింపిక్స్ డ్రెసాజ్ విభాగంలో పాల్గొన్న తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.