కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 7 ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్, ఎనిమిది సార్లు నంబర్‌వన్‌గా ఏడాది ముగింపు, 2 సార్లు కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, డేవిస్‌కప్ విజేత, 428 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అత్యద్భుత ఆటతో సాధించిన అసాధారణ ఘనతలివి.
అయితే ఇన్ని గొప్ప విజయాల తర్వాత కూడా జొకోవిచ్ కెరీర్‌లో ఒలింపిక్స్ స్వర్ణ పతకం ఒకటి ఇప్పటి వరకు లోటుగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు జొకో దానిని కూడా సాధించి తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జొకోవిచ్ పసిడి పతకం కోసం ఎంతో తపించాడు.
దాని కోసం పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆ కల నెరవేరింది. ‘కెరీర్ గోల్డెన్‌స్లామ్’ నెగ్గిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో అతను తన పేరును లిఖించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకో 7–6 (7/3), 7–6 (7/2) స్కోరుతో కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.
ఇటీవలే వింబుల్డన్ ఫైనల్లో తనను ఓడించి ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అల్‌కరాజ్‌పై తన అనుభవాన్నంతా ఉపయోగించి టైబ్రేక్‌లో సెర్బియా స్టార్ పైచేయి సాధించాడు. 37 ఏళ్ల జొకో అతి పెద్ద వయసులో ఒలింపిక్ టెన్నిస్‌లో స్వర్ణం సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
భావోద్వేగానికి లోనైన జొకోవిచ్
ఇక గోల్డ్ మెడల్ విజయం తర్వాత జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సెర్బియా జాతీయ పతాకంతో తన కుటుంబసభ్యులు, టీమ్ వద్దకు పరుగెత్తిన జొకోవిచ్ కన్నీళ్లపర్యంతమయ్యాడు.
తన కొడుకు, కూతురును కౌగిలించుకొని అతను ఏడ్చేసిన తీరు అతని దృష్టిలో ఈ పతకం విలువేమిటో చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Novak Djokovic crying as he can't believe 🥇🇷🇸
Congratulations to @DjokerNole, for finally achieving the gold medal for your country & you have completed not only tennis but also my childhood 🥹❤️pic.twitter.com/E8e2HmY173— Shane Gupta (@Shanegupta22) August 4, 2024
Wow - have never seen Djokovic this emotional … incredible
Sports. pic.twitter.com/rJjdDnsITP— Tommy Beer (@TommyBeer) August 4, 2024
Comments
Please login to add a commentAdd a comment