పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఫైనల్లో స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్‌కరాజ్‌పై వరుస సెట్లలో (7-6(3), 7-6(2)) విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో జకోకు ఇది తొలి స్వర్ణం. 37 ఏళ్ల జకో ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
NOVAK DJOKOVIC - THE OLYMPIC GOLD MEDALIST AT THE AGE OF 37.🏅
- The greatest ever of Tennis! 🐐pic.twitter.com/bj4uxuTRin— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024
అలాగే కెరీర్ గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్స్ సింగిల్స్‌లో స్వర్ణం) నెగ్గిన ఐదో టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. ఇటీవలి కాలంలో అల్‌కరాజ్.. జకోవిచ్‌పై ఆధిపత్యం చాలాయించాడు. 2023, 2024 వింబుల్డన్‌లో అల్‌కరాజ్ జకోకు షాకిచ్చాడు. ఈ రెండు పరాజయాలకు జకో విశ్వవేదికపై బదులు తీర్చుకున్నాడు. జకో తన కెరీర్‌లో24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించగా.. అల్‌కరాజ్ చిన్నవయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమితో అల్‌కరాజ్ రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment