Tennis
-
ఎట్టకేలకు సినెర్‌పై నిషేధం
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్‌పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చినట్లయ్యింది. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ కేసుకు ఎట్టకేలకు నిషేధంతో తెర పడనుంది. మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్ సినెర్ గత మార్చిలో డోపింగ్‌లో పట్టుబడ్డాడు.అతని నమూనాల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... ఈ టాప్ ర్యాంకర్‌పై అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మెతక వైఖరి అవలంభించింది. అతని టెస్టు ఫలితాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత బయటికి పొక్కినా కూడా 23 ఏళ్ల సినెర్ తను ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదని, బహుశా మసాజ్‌కు వాడిన తైలం వల్లా తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే వివరణతో ఐటీఐఏ సంతృప్తి చెంది పెద్దగా చర్యలేం తీసుకోలేదు. దీంతో టెన్నిస్ ఇంటిగ్రిటీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు దిగ్గజాలు, స్టార్లు, విశ్లేషకులు ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చట్టాలు–చర్యలా’ అంటు దుమ్మెత్తిపోశారు. అయినా ఐటీఐఏ నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. ‘వాడా’ మాత్రం పరీక్షల్లో పట్టుబడ్డాడు కాబట్టి ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. చివరకు తాజాగా ఐటీఐఏ, సినెర్, వాడాల మధ్య ఒప్పందం కుదరడంతో వాడా ఇటీవల అప్పీల్‌ను ఉపసంహరించుకుంది. ఒప్పందంలో భాగంగా మూడు నెలలు నిషేధం విధించేందుకు ఐటీఐఏ సిద్ధమవగా... సినెర్ కూడా విమర్శలకు చెక్ పెట్టేందుకు సమ్మతించడంతో డోపింగ్ వివాదం ముగిసింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4 వరకు ఈ నిషేధం అమలవుతుంది. ఈ కాలంలో అతను ఏ స్థాయి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు. అయితే మే 25 నుంచి జరిగే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను బరిలోకి దిగుతాడు. ఇదేం సస్పెన్షన్? సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్ష పట్ల టెన్నిస్‌లో పలువురు ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో విమర్శించిన తరహాలోనే సినెర్ చాలా తక్కువ శిక్షతో బయటపడ్డాడని... టెన్నిస్‌లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన నిబంధన ఉందని వారు వ్యాఖ్యానించారు. ‘సినెర్ సన్నిహితులు తమ పరపతిని బాగా ఉపయోగించినట్లుంది. కేవలం మూడు నెలల నిషేధంతో సరిపెట్టేలా చేసుకోగలిగారు. ఒక్క టైటిల్ వెనక్కి తీసుకోలేదు. కనీసం ప్రైజ్‌మనీలో కూడా కోత విధించలేదు. మరి అతను తప్పు చేసినట్లా, చేయనట్లా. టెన్నిస్‌కు దురదృష్టకరమైన రోజు. ఇక్కడ నిజాయితీ మిగల్లేదు’ అని కిరియోస్ అన్నాడు. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన స్టాన్ వావ్రింకా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెన్నిస్ ఇక ఏమాత్రం స్వచ్ఛమైన ఆట కానే కాదు’ అని చెప్పాడు. టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ‘ఇక్కడి వ్యవస్థ నిజంగా చెడిపోయింది. ఇది ఒక క్లబ్‌లా మాత్రమే వ్యవహరిస్తోంది. ఒక్కో కేసుకు ఒక్కో రకంగా స్పందిస్తోంది. అన్నింటా అసమానతలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత, పద్ధతి లేవు. ఇది ఆటగాళ్లను అగౌరవపర్చడమే. ఇకపై మార్పు అవసరం’ అని స్పందించింది. -
మాయ పోరాటం ముగిసె...
ముంబై: భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి సంచలన ప్రదర్శన సెమీ ఫైనల్లో ముగిసింది. ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె అద్భుత ప్రదర్శనతో పలువురు అంతర్జాతీయ క్రీడాకారిణులను కంగుతినిపించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కానీ ఆమె జోరుకు సెమీస్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల భారత ప్లేయర్ 3–6, 1–6తో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ చేతిలో పరాజయం చవిచూసింది. మొత్తానికి బరిలోకి దిగిన తొలి సీనియర్ స్థాయి టోరీ్నలో మాయ చేసిన పోరాటం అందర్ని ఆకట్టుకుంది. రెండో సెమీస్‌లో ఎనిమిదో సీడ్ మనంచయ సవంగ్‌కావ్ (థాయ్‌లాండ్) 6–2, 6–2తో రెండో సీడ్ రెబెక్కా మరినో (కెనడా)పై గెలిచి ఫైనల్ చేరింది. టెచ్‌మన్, రెబెక్కాల మధ్య నేడు టైటిల్ పోరు జరుగనుంది. డబుల్స్‌లో డచ్ ప్లేయర్ అరియనె హర్తొనొతో కలిసి బరిలోకి దిగిన భారత స్టార్ ప్రార్థన తోంబరే తుదిపోరుకు అర్హత సాధించింది. -
హాలెప్ వీడ్కోలు
బుకారెస్ట్ (రొమేనియా): మాజీ ప్రపంచ నంబర్‌వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్ (రొమేనియా) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. డోపింగ్ సస్పెన్షన్‌తో పాటు గాయాల కారణంగా చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 33 ఏళ్ల హాలెప్... బుధవారం ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన హాలెప్... టాన్సిల్వేనియా ఓపెన్ తొలి రౌండ్లో పరాజయం ఆనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఇది సంతోషమో, బాధో అర్థం కావడం లేదు. కానీ ఈ నిర్ణయంతో నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు నా శరీరం సహకరించదని అనిపిస్తోంది. అందుకే ఆట నుంచి తప్పుకుంటున్నా. ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డా. చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. అయినా అభిమానుల సమక్షంలో మైదానంలో దిగడాన్ని ఆస్వాదించా’ అని హాలెప్ పేర్కొంది. 2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన హాలెప్... ఆ తర్వాత గాయాలు, నిషేధం కారణంగా 870వ ర్యాంక్‌కు పడిపోయింది. టాన్సిల్వేనియా ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె బుధవారం జరిగిన మ్యాచ్‌లో 1–6, 1–6తో లుసియా బ్రాంజెట్టి (రొమేనియా) చేతిలో ఓడింది. మోకాలు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతున్న హాలెప్ ఇటీవల ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కూడా తప్పుకుంది. 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన హాలెప్ మరో మూడు గ్రాండ్‌స్లామ్ (2014, 2017 ఫ్రెంచ్ ఓపెన్, 2018 ఆస్ట్రేలియా ఓపెన్) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2022 యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పరాజయం అనంతరం డోపింగ్ కారణంగా హాలెప్ ప్రొఫెషనల్ కెరీర్‌కు దూరమైంది. దీంతో ఆమె మీద నాలుగు సంవత్సరాల నిషేధం పడింది. దీనిపై హాలెప్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ స్పోర్ట్‌లో అప్పీల్ చేసుకోగా... నిషేధాన్ని 9 నెలలకు తగ్గించారు. అయితే గాయాల బెడద ఎక్కువవడంతో తిరిగి కోర్టులో పూర్వ వైభవం సాధించలేకపోయింది. కెరీర్ విశేషాలు 24 మొత్తం గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 2 సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2018 ఫ్రెంచ్ ఓపెన్; 2019 వింబుల్డన్) 580 కెరీర్లో గెలిచిన మ్యాచ్‌లు 243 కెరీర్లో ఓడిన మ్యాచ్‌లు 1 అత్యుత్తమ ర్యాంక్ (అక్టోబర్ 9, 2017) 64 ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న వారాలు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో గెలుపోటములు (112/44) » ఆ్రస్టేలియన్ ఓపెన్ (12 సార్లు): 31/12 » ఫ్రెంచ్ ఓపెన్ (11 సార్లు): 32/11 » వింబుల్డన్ (10 సార్లు): 29/9 » యూఎస్ ఓపెన్ (12 సార్లు): 20/12 సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ 4,02,32,663 డాలర్లు (రూ. 351 కోట్లు) -
అమ్మతనం ఆటకు అడ్డుకాలేదు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ. అర్వపల్లి: హైదరాబాద్‌లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్‌లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.ముంబైలో కోచింగ్..తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్‌కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.సింగిల్స్‌గానే..రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్‌తో పాటు వివిధ దేశాల్లో ఆడారు. స్పెయిన్‌కు పయనంజాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్‌లోని స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘మున్డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.ఆటకు ‘లాక్డౌన్’రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలురేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు. -
ఆస్ట్రేలియా ఓపెన్-2025 విజేత జానిక్ సిన్నర్
ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) గెలుచుకున్నాడు. మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరినాలో ఇవాళ (జనవరి 26) జరిగిన ఫైనల్లో అలెక్స్ జ్వెరెవ్‌ను (జర్మనీ) 6-3 7-6(4) 6-3 తేడాతో ఓడించాడు. సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ (2 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు, ఓ యూఎస్ ఓపెన్) టైటిల్. సిన్నర్ గతేడాది డానిల్ మెద్వెదెవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. సిన్నర్ వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ఆటగాడిగా అలెక్స్ జ్వెరెవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అలెక్స్ జ్వెరెవ్‌కు ముందు ఆండ్రీ అగస్సీ, గోరాన్ ఇవానిసెవిక్, ఆండీ ముర్రే, డొమినిక్ థీమ్, కాస్పర్ రూడ్ కూడా తొలి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడారు.కెరీర్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన తొలి ఇటాలియన్ జన్నిక్ సిన్నర్జిమ్ కొరియర్ (1992-93) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను డిఫెండ్ చేసుకున్న అతి పిన్నవయస్కుడు జన్నిక్ సిన్నర్ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా జన్నిక్కు 35,00,000 ఆస్ట్రేలియన్ డాలర్లు ప్రైజ్‌మనీగా లభించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం 19 కోట్లకు పైమాటే. -
స్టార్ టెన్నిస్ ప్లేయర్‌కు షాక్.. అతిగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా
స్టార్ టెన్నిస్ ప్లేయర్, 2021 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ డానిల్ మెద్వెదెవ్కు (రష్యా) షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్-2025 సందర్భంగా అతి చేసినందుకు గానూ మెద్వెదెవ్కు భారీ జరిమానా విధించారు నిర్వహకులు. మెద్వెదెవ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్లో నిష్క్రమించాడు. రెండు రౌండ్లలో మెద్వెదెవ్ చాలా దురుసగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ 76,000 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. తొలి రౌండ్ లో మెద్వెదెవ్.. 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. గెలుపు అనంతరం విజయోత్సవ సంబురాల్లో భాగంగా పలు మార్లు తన రాకెట్‌తో నెట్ కెమెరాను బాదాడు. ఇలా చేసినందుకు గానూ క్రమశిక్షణ చర్యల కింద అతనికి 10 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. మరోసారి ఇలా ప్రవర్తించకూడదని ఘాటుగా హెచ్చరించారు.Daniil Medvedev was fined $76,000 at this year’s Australian Open.$10k for hitting the camera with his racquet during the 1st round.$66k for his behavior during his match against Tien & not attending press. His total winnings were $124k.pic.twitter.com/bDQ4aj064j— The Tennis Letter (@TheTennisLetter) January 18, 2025నిర్వహకులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినా మెద్వెదెవ్ తీరు ఏ మాత్రం మారలేదు. రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ అలానే ప్రవర్తించాడు. ఈ రౌండ్ లో 19 ఏళ్ల అమెరికా కుర్రాడు, క్వాలిఫయర్ లెర్నర్ టీన్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న మెద్వెదెవ్.. ఓటమి అనంతరం సహనం కోల్పోయి రాకెట్‌ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి కొట్టాడు. తన రాకెట్ బ్యాగ్‌ను విసిరేశాడు. మరోసారి కెమెరాపై తన ప్రతాపాన్ని చూపాడు.మెద్వెదెవ్ ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న నిర్వహకులు ఈసారి 66 వేల ఆసీస్ డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండు రౌండ్లలో మెద్వెదెవ్ 76 వేల డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.40 లక్షలు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్నందుకు గానూ మెద్వెదెవ్కు 1,24,000 ఆసీస్ డాలర్లు ప్రైజ్‌మనీ లభిస్తుంది. దీంట్లో సగానికి పైగా అతను జరిమానా కింద కోల్పోయాడు.కాగా, 2021, 2022, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో భంగపడ్డ మెద్వెదెవ్.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో బరిలో దిగాడు. కానీ మరోసారి అతడికి నిరాశే ఎదురైంది. -
Australian Open: మాజీ ఛాంపియన్‌కు షాక్.. తొలి రౌండ్లోనే ఓటమి
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో లూసియా బ్రాన్జెట్టి (ఇటలీ) 6–2, 7–6 (7/2)తో అజరెంకాను బోల్తా కొట్టించింది. 17వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడిన 26వ సీడ్ అజరెంకా తొలి రౌండ్లో ఓడిపోవడం నాలుగోసారి మాత్రమే కావడం గమనార్హం. 2012, 2013లలో విజేతగా నిలిచిన అజరెంకా ఆ తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. బ్రాన్జెట్టితో జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 37 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 16వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 3–6, 6–7 (6/8)తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), మాజీ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 6–3, 6–3తో 2020 చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–0తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)పై, 2019, 2021 విజేత ఒసాకా 6–3, 3–6, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
Australian Open: జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
అటువైపు ప్రత్యర్థి 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత... ఏకంగా 1126 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్... కెరీర్లో ఇప్పటికే 76 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవం సొంతం... ఇటువైపు ప్లేయర్‌కు ‘వైల్డ్ కార్డు’ ద్వారా కెరీర్లోనే తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడే అవకాశం... ఎదురైన ప్రత్యర్థి తానెంతో ఇష్టపడే ఆటగాడు... ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే మ్యాచ్ ఏకపక్షంగా వరుస సెట్లలో ముగియడం ఖాయమని విశ్లేషకుల ఏకాభిప్రాయం... కానీ అలాంటిదేమీ జరగలేదు. ఒకే ఒక్క మ్యాచ్‌తో టెన్నిస్ ప్రపంచాన్ని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆ కుర్రాడు వదులుకోలేదు. తన అసమాన పోరాటపటిమతో అందరి దృష్టిలో పడ్డాడు. అతడే 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి... తెలుగు సంతతికి చెందిన అమెరికన్ టెన్నిస్ టీనేజ్ రైజింగ్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నిశేష్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా... ప్రతి పాయింట్ సాధించేందుకు జొకోవిచ్‌ను తెగ కష్టపెట్టాడు. నిశేష్‌కు ఎంతో భవిష్యత్ ఉందని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మెల్బోర్న్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అధిగమించాడు. ప్రపంచ 107వ ర్యాంకర్, అమెరికన్ రైజింగ్ టీనేజ్ టెన్నిస్ స్టార్ నిశేష్ బసవరెడ్డితో జరిగిన తొలి రౌండ్ పోరులో జొకోవిచ్ గెలిచి 18వ సారి ఈ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నిశేష్ 6–4, 3–6, 4–6, 2–6తో జొకోవిచ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. గత నెలలోనే ప్రొఫెషనల్‌గా మారిన 19 ఏళ్ల నిశేష్ ఏమాత్రం తడబడకుండా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బేస్‌లైన్ వద్ద సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూనే... అడపాదడపా డ్రాప్ షాట్లు... కళ్లు చెదిరే రిటర్న్‌లతో వరుసగా 21వ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న జొకోవిచ్‌కు ఇబ్బంది పెట్టడంలో నిశేష్ సఫలమయ్యాడు. తొలి సెట్లోని ఎనిమిదో గేమ్‌లో జొకోవిచ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన నిశేష్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 5–3తో ముందంజ వేశాడు. తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్ కాపాడుకోగా... పదో గేమ్‌లో నిశేష్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను 49 నిమిషాల్లో 6–4తో సొంతం చేసుకోవడంతో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు, టీవీల ముందున్న లక్షలాది వీక్షకులు ఆశ్చర్యపోయారు. తొలి సెట్ నెగ్గిన ఉత్సాహంతో రెండో సెట్లోనూ నిశేష్ భేషుగ్గా ఆడాడు. అయితే అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ టీనేజర్ నిశేష్ ఆటతీరుపై అవగాహన పెంచుకొని దూకుడు పెంచాడు. స్కోరు 4–3 వద్ద ఎనిమిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 44 నిమిషాల్లో రెండో సెట్ దక్కించుకొని లయలోకి వచ్చాడు. రెండో సెట్లోని చివరి గేమ్ ఆడుతున్న సమయంలో నిశేష్ కాలు బెణకడంతో అతను ఆ తర్వాత చురుగ్గా కదల్లేకపోయాడు. మరోవైపు జొకోవిచ్ మరింత జోరు పెంచాడు. మూడో సెట్లోని తొలి గేమ్‌లోనే నిశేష్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సరీ్వస్‌లను కాపాడుకొని 43 నిమిషాల్లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో కూడా తొలి గేమ్‌లో, ఐదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన జొకోవిచ్ కళ్లు చెదిరే ఏస్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ‘నిశేష్ పరిపూర్ణ క్రీడాకారుడిలా ఆడాడు. అతను ఆడిన కొన్ని షాట్లు నన్నే ఆశ్చర్యానికి గురి చేశాయి. చివరి పాయింట్ వరకు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. భవిష్యత్ లో నిశేష్ ఆటతీరును చాలాసార్లు చూస్తాము. ఇందులో సందేహం లేదు’ అని మ్యాచ్ ముగిశాక జొకోవిచ్ వ్యాఖ్యానించాడు. 2005లో అమెరికాలో పుట్టి పెరిగిన నిశేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. నిశేష్ తల్లిదండ్రులు మురళీ రెడ్డి, సాయిప్రసన్న స్వస్థలం నెల్లూరు జిల్లా. 1999లో ఉద్యోగరీత్యా భారత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తొలి రౌండ్లో ఓడిన నిశేష్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 70 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ ముగిశాక విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో నిశేష్ కెరీర్ బెస్ట్ 104వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. అల్కరాజ్ అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో సోమవారం స్టార్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 2023 ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్ 5–7, 3–6, 6–2, 4–6తో మికిల్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. 2018 తర్వాత ఈ టోర్నీలో సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఓడిపోవ డం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సినెర్ 7–6 (7/2), 7–6 (7/5), 6–1తో నికోలస్ (చిలీ)పై, అల్కరాజ్ 6–1, 7–5, 6–1తో షెవ్చెంకో (కజకిస్తాన్)పై విజయం సాధించారు. పసారో (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో పదో సీడ్ దిమిత్రోవ్ గాయం కారణంగా రెండో సెట్లో వైదొలిగాడు. 21-టెన్నిస్ ఓపెన్ శకంలో (1968 నుంచి) వరుసగా 21వ ఏడాది జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఒక్క విజయమైనా సాధించాడు. ఈ జాబితాలో రోజర్ ఫెడరర్ (22 ఏళ్లు) మాత్రమే ముందున్నాడు. 429-ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఫెడరర్ (429 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకోవిచ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఫెడరర్ రికార్డును అధిగమిస్తాడు. -
సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే...
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. బరిలో ఉన్న ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 91వ ర్యాంకర్ నగాల్ 3–6, 1–6, 5–7తో ఓడిపోయాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 20 అనవసర తప్పిదాలు చేశాడు. 19 విన్నర్స్ కొట్టిన నగాల్ తన సరీ్వస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన నగాల్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 69 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హైదరాబాద్ తూఫాన్స్ విజయం రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 5–1 గోల్స్ తేడాతో గెలిచింది. తూఫాన్స్ తరఫున గొంజాలో పిలాట్ (6వ, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మైకో కసెల్లా (21వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (47వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కళింగ లాన్సర్స్ జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (5వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్‌తో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు ఆడుతుంది. ఒడిశా వారియర్స్ బోణీ రాంచీలో ఆదివారం మొదలైన తొలి మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఒడిశా వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. ఒడిశా వారియర్స్ 4–0 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఒడిశా వారియర్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ (16వ, 37వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... బల్జీత్ కౌర్ (42వ నిమిషంలో), ఫ్రీక్ మోయిస్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌తో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ తలపడుతుంది. -
రిటైర్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న జకోవిచ్
టెన్నిస్ చరిత్రలో 'ఆల్ టైమ్ గ్రేట్' ఎవరు..? టెన్నిస్ అభిమానులు గంటల తరబడి ఈ ప్రశ్న గురించి చర్చించుకుంటారు. ఇంతకీ పురుషుల టెన్నిస్‌లో "GOAT" ఎవరు..? ఈ ప్రశ్నపై జరిగే చర్చలో జాన్ మెకెన్రో, జాన్ బోర్గ్, పీట్ సాంప్రస్, జిమ్మీ కానర్స్ వంటి దిగ్గజాల పేర్లు కచ్చితంగా ప్రస్తావనకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో గ్రాండ్ స్లాం టెన్నిస్ టోర్నమెంట్లను శాసించిన నోవాక్ జకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి.ముగ్గురిలో ఒక్కడే మిగిలాడు సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఈ జాబితా లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 యుఎస్ ఓపెన్ విజయం తరువాత జకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల తో ఎవ్వరికీ అందనంత ఎత్తు కి చేరుకున్నాడు. జకోవిచ్ తన 24 స్లామ్లలో 10 ఆస్ట్రేలియా ఓపెన్ లో సాధించి, మెల్బోర్న్ హార్డ్ కోర్టులపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.ఆల్ టైమ్ "క్లే కింగ్" గా పేరుపొందిన నాదల్ తన 22 గ్రాండ్ స్లాం టైటిళ్ల లో 14 ఫ్రెంచ్ ఓపెన్ లో చేజిక్కించుకోగా.. ఫెదరర్ సాధించిన 20 గ్రాండ్ స్లాం విజయాలలో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు కావడం విశేషం.ఈ ముగ్గురి లో ప్రస్తుతం జకోవిచ్ మాత్రమే టెన్నిస్ బరిలో మిగిలాడు. ఫెదరర్ 2022 సెప్టెంబర్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయాల బారిన పడిన స్పానిష్ ఆటగాడు నాదల్ సైతం గత నవంబర్ లో ఆటకి స్వస్తి చెప్పాడు.గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం ఒక్కటేజకోవిచ్ విషయానికి వస్తే, గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో జకో తన మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాడు. అయితే జకోవిచ్ గతేడాది ఒలింపిక్ స్వర్ణం మినహా మరే గ్రాండ్ స్లాం టైటిల్ గెలవలేక పోయాడు. వచ్చే ఆదివారం ప్రారంభమయ్యే 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో తన ప్రారంభ రౌండ్లోభారత సంతతి కి చెందిన వైల్డ్‌కార్డ్ ఆటగాడు నిశేష్ బసవరెడ్డితో తలపడనున్నాడు.జకోవిచ్ ఇప్పటికీ తన అద్భుతమైన ప్రదర్శనతో టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తున్నప్పటికీ అతని చిరకాల ప్రత్యర్థులైన ఫెదరర్, రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ లతో అతని దృక్పధం లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా జకోవిచ్ తండ్రి అతని రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి తెస్తున్నాడు. "గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు.శరీరం పై టెన్నిస్ ప్రభావం సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది జకో శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఈ నేపధ్యం లో తన రిటైర్మెంట్ గురుంచి జకోవిచ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇందుకు ఖచ్చితమైన సమయం ఎప్పుడు, ఎక్కడా అన్న విషయం పై దృష్టి పెట్టాడు. తన కెరీర్‌ను ఎలా ముగించాలనుకుంటున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి పెట్టాడు. "నేను నా టెన్నిస్ కెరీర్ ని ఎలా ముగించాలి, ఎక్కడ ముగించాలి అన్న విషయం పై వ్యూహం సిద్ధం చేయాలి అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం టెన్నిస్ లో అగ్ర స్థాయి ఆటగాళ్ల పై విజయం సాధిస్తున్నందున ఇప్పుడే రిటైర్ అవుతానని చెప్పడం లేదు" అని నర్మగర్భంగా తన ఆలోచనని బయటపెట్టాడు.జకోవిచ్ రిటైర్మెంట్ నిర్ణయం.. ఆతను గ్రాండ్ స్లాం పోటీల్లో తలబడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. గ్రాండ్ స్లాం టోర్నమెంట్ల విషయానికి వస్తే గతేడాది జకోవిచ్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. అడపాదప కొన్ని టైటిళ్లు గెలిచినా, గ్రాండ్ స్లాం టైటిల్ సాధిస్తేనే జకోవిచ్ తన క్రీడా జీవితాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశముంది. లేనిపక్షంలో జకోవిచ్ ఎక్కువ కాలం టెన్నిస్ లో కొనసాగడం కష్టమే.తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి, జొకోవిచ్ ఇప్పటికే తన షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకున్నాడు. తక్కువ టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరియు గ్రాండ్ స్లాం వంటి మేజర్లపై దృష్టి పెట్టాడు. చాలా మంది తాను ఉన్నత స్థాయిలో రిటైర్ కావాలని నమ్ముతున్నప్పటికీ, జకోవిచ్ శారీరకంగా మరియు మానసికంగా సమర్థుడిగా ఉన్నంత వరకు టెన్నిస్ లో కొనసాగాలని నిశ్చయించుకున్నాడు. "గ్రాండ్ స్లామ్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించగల సత్తా నాలో ఇప్పటికీ ఉందని భావిస్తే, నేను నా టెన్నిస్ జీవితానికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటాను" అని జకోవిచ్ వ్యాఖ్యానించాడు. -
నయా రాకెట్ నిశేష్ రెడ్డి...
అంతర్జాతీయ స్థాయిలో మరో యువ టెన్నిస్ ఆటగాడు దూసుకొస్తున్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి... గత సీజన్లో అనూహ్య ప్రదర్శనతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) యూత్ చాలెంజర్స్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించడంతో పాటు... సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు వైల్డ్ కార్డు ఎంట్రీ పొందాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి డిసెంబర్లోనే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారాడు. 457వ ర్యాంక్‌తో 2024వ సంవత్సరం టెన్నిస్ సీజన్‌ను ప్రారంభించిన నిశేష్... వరుస విజయాలతో సత్తా చాటి సీజన్ ముగిసేసరికి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానానికి చేరాడు. చాలెంజర్ టూర్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశేష్ ఈ మధ్యకాలంలో 6 టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండింట టైటిల్ చేజిక్కించుకున్నాడు. దీంతో అతడికి ఆ్రస్టేలియా ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశం దక్కింది. ఆదివారం నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నిశేష్ బరిలోకి దిగనున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాటా సైన్సెస్ అభ్యసించిన నిశేష్ కుటుంబం నెల్లూరు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. నెల్లూరుకు చెందిన నిశేష్ తండ్రి మురళీ రెడ్డి టెక్ పరిశ్రమలో పని చేస్తుండగా... సోదరుడు నిశాంత్ రెడ్డి ఐటీ కంపెనీలో ఉద్యోగి. తల్లి సాయి ప్రసన్న గృహిణి. చిన్నప్పుడు చాలాసార్లు భారత్‌కు వచ్చి వెళ్లిన నిశేష్‌కు హైదరాబాద్, నెల్లూరులో బంధువులు ఉన్నారు. చుట్టాలు, స్నేహితుల వల్ల తెలుగుపై అవగాహన పెంచుకున్న నిశేష్ స్పష్టంగా మాట్లాడలేకపోయినా సినిమాలు మాత్రం బాగా చూస్తాడు. సబ్ టైటిల్స్ లేకుండా భాషను అర్థం చేసుకుంటాడు. ఒలింపిక్ పతక విజేత రాజీవ్ రామ్ వద్ద శిక్షణ పొందుతున్న నిశేష్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ‘17 ఏళ్ల వయసులోనే పట్టభద్రుడిగా మారాను. చాలా అంశాలపై ఆసక్తి ఉంది. అందుకే వాటిలో మరింత మెరుగవ్వాలని నిర్ణయించుకున్నా. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. చిన్నప్పుడు తరచూ గాయపడే వాడిని. పాఠశాల విద్య పూర్తవగానే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారాలని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయిందంతే. చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే విపరీతమైన ఇష్టం. టీవీలో ఎప్పుడూ టెన్నిస్ చానల్ చూస్తూ ఉండేవాడిని. కామెంటేటర్లు చెప్పే మాటలు వింటూ ప్లేయర్ల లాగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. దేన్నైనా నిశితంగా పరిశీలించడం నాకు అలవాటు. దీనివల్లే ప్రత్యర్థి ఆటగాళ్ల తప్పులను గమనించి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించుకోవడం నేర్చుకున్నా. ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు. నిరంతర సాధన వల్ల వచ్చిoది’ అని తాజా ర్యాంకింగ్స్‌లో 133వ ర్యాంక్‌లో ఉన్న నిశేష్ అన్నాడు. –సాక్షి క్రీడా విభాగంఆక్లాండ్ ఓపెన్‌లో శుభారంభంఈ ఏడాది ఆడుతున్న రెండో ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ బసవరెడ్డి శుభారంభం చేశాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ టోర్నీలో నిశేష్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో క్వాలిఫయర్‌గా అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో 6–2, 6–2తో ప్రపంచ 85వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని నిశేష్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడిన నిశేష్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో మూడు సెట్లపాటు పోరాడి ఓడిపోయాడు. -
దేశవాళీ టోర్నీలు పెంచాలి
టెన్నిస్ క్రీడకు మరింత ఆదరణ లభించాలంటే... దేశవాళీ టోర్నీలు విరివిగా నిర్వహించాలని భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న అభిప్రాయపడ్డాడు. టెన్నిస్ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న 44 ఏళ్ల బోపన్న... భారత్‌లో టెన్నిస్ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ముందున్న సవాళ్లు, తన సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో విడిపోయి కొత్త భాగస్వామితో కలిసి ఆడనుండటం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చాడు. బోపన్న పంచుకున్న వివరాలు అతడి మాటల్లోనే...» మన దేశంలో టెన్నిస్ భవిష్యత్తు కోసం మొదట అఖిల భారత టెన్నిస్ సంఘాన్ని క్రమబద్దీకరించాలి. దాని ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా టోర్నమెంట్లు నిర్వహించాలి. దేశవాళీ సర్క్యూట్‌ను బలంగా నిర్మించాలి. ‘ఫ్యూచర్స్’, ‘చాలెంజర్స్’ వంటి టోర్నీలు అవసరమే అయినా... వాటితో పాటు దేశవాళీ టోర్నీలు కూడా చాలా ముఖ్యం. » జూనియర్ స్థాయిలో రాణించిన ఎందరో ప్లేయర్లు 18 ఏళ్ల తర్వాత ఏ టోర్నీల్లో పాల్గొనాలో తెలియక ఆటకు స్వస్తి చెబుతున్నారు. తదుపరి స్థాయిలో పోటీపడేందుకు ప్రతి ఒక్కరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదు. పెద్ద టోర్నీల కోసం ప్రయాణాలు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ప్రతిభావంతులు ఆటకు దూరం అవుతున్నారు. దేశవాళీ టోర్నీల్లో పెద్దగా నగదు ప్రోత్సాహకాలు ఉండకపోవడం ఇందుకు కారణం. అందుకే దీన్ని మరింత బలోపేతం చేసి ఒక వ్యవస్థగా మార్చాలి. » గత రెండేళ్లుగా అందరూ నా రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారు. అయితే అదే సమయంలో రెండేళ్లుగా నేను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీలకు అర్హత సాధించాను. అంటే, సీజన్ ఆసాంతం బాగా ఆడాననే కదా అర్థం. మరి అలాంటప్పుడు వీడ్కోలు ఆలోచనలు ఎందుకు వస్తాయి. » ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నా.. శారీరకంగా మానసికంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం. ఇలాంటప్పుడు రిటైర్మెంట్ ఆలోచన కూడా దరిచేరనివ్వను. » కెరీర్ చరమాంకంలో ఉన్నాననే విషయాన్ని పట్టించుకోను. గత 12 నెలల కాలంలో మెరుగైన ప్రదర్శన కనబర్చాను. శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. » సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. ఎందుకు విడిపోవాలనుకున్నాడో ఎబ్డెన్కే తెలియాలి. అతడి కారణాలు అతడికి ఉంటాయి. గత ఏడాది యూఎస్ ఓపెన్ సమయంలో అతను వేరే ఆటగాడితో కలిసి ఆడనున్నట్లు మొదట చెప్పాడు. ఆ తర్వాత తిరిగి నాతో కలిసి కోర్టులో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు. » ఎబ్డెన్ తన నిర్ణయం ఆలస్యంగా వెల్లడించడంతో నికోలస్ బారియెంటాస్ (కొలంబియా)తో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడాలని నిర్ణయించుకున్నా. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో సీడింగ్ లభించనుంది. గతంలో నికోలస్‌తో ప్రత్యరి్థగా తలపడ్డాను. అతడి బేస్‌లైన్ గేమ్ బలంగా ఉంటుంది. » బారియోంటాస్తో కలిసి ప్రస్తుతానికి రెండు టోర్నీలు ఆడాలని నిర్ణయించుకున్నా. అడిలైడ్ ఓపెన్‌తో పాటు, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కలిసి ఆడుతాం. ఈ రెండు టోర్నీల తర్వాత ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పాయింట్లు కాపాడుకోకపోతే మాస్టర్స్ టోర్నీ ‘డ్రా’లలో అవకాశం లభించదు. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. -
ఆ ముగ్గురిలాంటి ప్రతిభ ఉన్నా...
బెంగళూరు: ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌లో ప్రతిభావంతుడైన యువ ఆటగాళ్లలో స్పెయిన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ ఒకడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే అల్కరాజ్ ఆట గురించి టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేర్వేరు అంశాలపరంగా ముగ్గురు స్టార్లు జొకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెడరర్‌లాంటి ఆట అతనిలో కనిపిస్తున్నా... వారిలా గొప్ప ఘనతలు సాధించలేడని అగస్సీ అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు దిగ్గజాలు వరుసగా 23, 22, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గారు. ‘జొకోవిచ్ తరహా డిఫెన్స్, నాదల్లాంటి పవర్ గేమ్, ఫెడరర్లా చూడచక్కని ఆటను అల్కరాజ్ కూడా ప్రదర్శించాడు. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన వారిలా అతను పెద్ద విజయాలు సాధించడం కష్టం. నేను జ్యోతిష్యం చెప్పేవాడిని కాదు కానీ టెన్నిస్ అలాంటి ఘనతలు అందుకోవాలంటే ఎన్నో కలిసి రావాలి. వ్యూహాలు, గాయాలు లేకపోవడంతో పాటు అదృష్టం కూడా ఉండాలి’ అని అగస్సీ వ్యాఖ్యానించాడు. మరోవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న 37 ఏళ్ల జొకోవిచ్ ఇకపై అదే దూకుడు కొనసాగించలేడని కూడా అతను అన్నాడు. తాను అత్యుత్తమ స్థాయికి చేరే క్రమంలో ఎదురైన ముగ్గురు అద్భుత ప్రత్యర్థులు తప్పుకున్న తర్వాత అలాంటి ఆట కనిపించదని అగస్సీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘జొకోవిచ్ ఇప్పటికే కెరీర్లో చాలా సాధించాడు. అతని శక్తియుక్తులన్నీ సహజంగానే బలహీనంగా మారిపోతాయి. నా అభిప్రాయం ప్రకారం ఎదురుగా ప్రత్యరి్థని చూస్తే చాలు ఇంకా సాధించాలనే ప్రేరణ లభిస్తే విజయాలు దక్కుతాయి. తాను చరిత్ర సృష్టంచడంలో భాగమైన ఆ ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. పీట్ సంప్రాస్ రిటైరయ్యాక నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీని నుంచి ముందుకు సాగాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. జొకోవిచ్‌లో అలాంటిది ఉందా అనేది ఆసక్తికరం’ అని అగస్సీ వివరించాడు. తనకు ప్రత్యర్థిగా ఆడిన ఆండీ ముర్రే ఇప్పుడు కోచ్‌గా మారడం జొకోవిచ్‌కు సానుకూలతే అయినా... ఫలితాలు పరస్పర నమ్మకంతోనే వస్తాయని, అది అంత సులువు కాదని ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అగస్సీ విశ్లేíÙంచాడు. 1980ల్లో, 1990ల్లో ప్రపంచ టెన్నిస్‌కు అమెరికా ఆటగాళ్లు శాసించిన విషయాన్ని గుర్తు చేస్తూ అగస్సీ... భవిష్యత్తులో అలాంటి మంచి రోజులు అమెరికాకు మళ్లీ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తనతో పాటు సంప్రాస్, జిమ్ కొరియర్, మైకేల్ చాంగ్ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగామని వెల్లడించాడు. -
‘అప్పుడే ఓటమి విలువ బాగా తెలుస్తుంది’
పాఠశాల విద్యలో క్రీడల్ని భాగం చేయాలని, అప్పుడే విద్యార్థులకు ఓటమి విలువేంటో ఆటలు నేర్పిస్తాయని టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీ(Andre Agassi) చెప్పాడు. టీఐఈ (ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్) గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు విచ్చేశాడు ఈ అమెరికన్ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్. ఈ క్రమంలో క్రీడలతో భవిష్యత్తు, పాఠశాల విద్యపై తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు.గెలుపోటములు మనకు పాఠాలు నేర్పుతాయి‘ఒకవేళ వైఫల్యం ఎదురైనా... తట్టుకొని నిలబడేందుకు, మళ్లీ మరుసటి రోజు వెంటనే ఆడేందుకు స్థయిర్యాన్ని క్రీడలే ఇస్తాయి. అందుకే చెబుతున్నా... క్రీడల్లోని గెలుపోటములు మనకు పాఠాలు నేర్పుతాయి. ఓడిన ప్రతీసారి గెలవడంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తాయి. అంటే మెరుగయ్యేందుకు, ప్రగతి సాధించేందుకు దోహదం చేస్తాయి’ అని అగస్సీ వివరించాడు.కాగా అగస్సీ రెండు దశాబ్దాల క్రితమే బలహీనవర్గాల పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో పాఠశాలలు నిర్మించాడు. 2001లో మొదలైన ఈ సంకల్పంతో అతను 130 పాఠశాలల్ని ఏర్పాటు చేసి 80 వేల మంది చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. టెన్నిస్ క్రీడ వల్లే తాను ఇంతలా రాటుదేలానని చెప్పుకొచ్చాడు.స్పోర్ట్స్ అంటేనే సవాళ్లు...అంతేకాదు... ఆటలు ఆడటం వల్ల మానసిక, శారీరక స్థయిర్యం పెరిగి... జీవితానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నానని అగస్సీ చెప్పాడు. ‘స్పోర్ట్స్ అంటేనే సవాళ్లు... వాటిని అధిగమించడం. అంటే సమస్యకు ఎదురీది పరిష్కరించుకోవడం. టెన్నిస్ నాకు అదే నేర్పించింది. సవాళ్లు ఎదురైన ప్రతీసారి నిలబడి ఎదుర్కోవాలన్న ధైర్యాన్ని అలవర్చింది.ఓడితే గెలిచేందుకు మరింత శ్రద్ధపెట్టాలన్న కసిని నాలో పెంచింది. పోరాటానికి అవసరమైన సాధన, సంపత్తిని సమకూర్చింది’ అని అగస్సీ పేర్కొన్నాడు. ప్రస్తుత విద్యలో టెక్నాలజీది ప్రముఖ పాత్రని అన్నాడు. అవసరమైన ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభ్యాసానికి ఆధునిక టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పాడు. తన కెరీర్లో ఎనిమిది గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన 54 ఏళ్ల అగస్సీ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణ పతకం కూడా గెలిచాడు. 2001లో జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్‌ను అగస్సీ పెళ్లి చేసుకున్నాడు. -
జొకోవిచ్పై ‘ఆఖరి సవాల్’ గెలిచి...
బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా): శక్తివంతమైన సర్వీస్‌లకు పెట్టింది పేరు... బుల్లెట్లా దూసుకుపోయే ఫోర్‌హ్యాండ్ షాట్లు... ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకోగల సమర్థుడు... 97 కేజీల బరువు... 6 అడుగుల 6 అంగుళాల ఆజానుబాహుడు... అతనే అర్జెంటీనా వెటరన్ టెన్నిస్ స్టార్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో. ఎంతో సత్తా ఉన్నా గాయాల కారణంగా కెరీర్‌ను కొనసాగించలేక ఎట్టకేలకు ఆటకు టాటా చెప్పేశాడు. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్పై గెలిచి డెల్ పొట్రో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ మూడో ర్యాంకర్ డెల్ పొట్రో 6–4, 7–5తో వరుస సెట్లలో సెర్బియా దిగ్గజంపై గెలిచాడు. ‘ది లాస్ట్ చాలెంజ్’ (ఆఖరి సవాల్) పేరిట జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అర్జెంటీనా మహిళా టెన్నిస్ స్టార్ గాబ్రియేలా సబటినితోపాటు పలువురు సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు విచ్చేశారు. దీంతో వీడ్కోలుకు వేదికైన పార్కే రోకా స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతిమ సమరంలో విజయానంతరం అభిమానులు, ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య డెల్ పొట్రో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కోర్టులో నెట్‌ను ముద్దాడాడు. చెమర్చిన కళ్లతో వున్న అర్జెంటీనా స్టార్‌ను అనునయిస్తూ జొకోవిచ్ అభినందించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘యువాన్‌ను ప్రేమించని వారంటూ ఉండరు. అందరు అభిమానించే ఆటగాడు అతను. అతని జీవితంలో అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే అది అతని వ్యక్తిత్వమే’ అని 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత, ఆల్‌టైమ్ గ్రేటెస్ట్లలో ఒకడైన సెర్బియన్ సూపర్‌స్టార్ డెల్ పొట్రోను ఆకాశానికెత్తాడు. 2009లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)లను వరుసగా సెమీఫైనల్, ఫైనల్లో ఓడించిన డెల్‌పొట్రో తన కెరీర్లోనే ఏకైక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ గాయాలు అతన్ని కుదురుగా ఆడనివ్వలేకపోవడంతో కెరీర్ అసాంతం ఫిట్నెస్ సమస్యలతోనే సతమతమయ్యాడు. అతను చివరిసారిగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 22 టైటిళ్లను గెలుచుకున్నాడు. 36 ఏళ్ల డెల్ పొట్రో కెరీర్లో రెండు ఒలింపిక్ పతకాలు కూడా ఉన్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన డెల్ పొట్రో 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016లో పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘డేవిస్ కప్’ టైటిల్ అర్జెంటీనాకు దక్కడంలో డెల్ పొట్రో కీలకపాత్ర పోషించాడు.మిగతా గ్రాండ్‌స్లామ్ టోర్నీల విషయానికొస్తే... రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో (2009, 2012)... రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో (2009, 2018) క్వార్టర్ ఫైనల్ వరకు చేరాడు. వింబుల్డన్ టోర్నీలో (2013) ఒకసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 3 డెల్ పొట్రో సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్. 2018లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. 439 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో డెల్ పొట్రో గెలిచిన మ్యాచ్‌లు.174 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో డెల్ పొట్రో ఓడిన మ్యాచ్‌లు.4418 డెల్ పొట్రో తన కెరీర్లో సంధించిన ఏస్‌లు.2,58,96,046 డాలర్లు (రూ. 219 కోట్లు) డెల్ పొట్రో కెరీర్లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ -
భావోద్వేగంతో‘బుల్’ గుడ్‌బై
22 గ్రాండ్‌స్లామ్‌లు... 36 మాస్టర్ సిరీస్–1000 ట్రోఫీలు... 25 ఏటీపీ–500 టైటిల్స్... 10 ఏటీపీ–250 టైటిల్స్... 2 ఒలింపిక్ స్వర్ణాలు... 209 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్...1250 రాకెట్లు...300 కిలోమీటర్ల స్ట్రింగ్...16500 మీటర్ల ఓవర్గ్రిప్... ఇదీ కోర్టులో రాఫెల్ నాదల్ టెన్నిస్ ప్రయాణం! సుదీర్ఘంగా సాగిన ఈ అద్భుత ప్రస్థానం ముగిసింది. స్వదేశంలో, సొంత అభిమానుల సమక్షంలో ‘స్పెయిన్ బుల్’ నాదల్ కెరీర్ చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి పోరులో పరాజయం పలకరించినా... ఈ మ్యాచ్ తుది ఫలితంకంటే అతని నిష్క్రమణే టెన్నిస్ ప్రపంచాన్ని భావోద్వేగంలో ముంచింది... కన్నీళ్లపర్యంతమవుతూ నాదల్ అభిమాన ఆటకు గుడ్‌బై చెప్పాడు.మలాగా (స్పెయిన్): ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన దిగ్గజాలలో ఒకడైన రాఫెల్ నాదల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్‌కప్ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 1–2తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ప్ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో అల్కరాజ్ 7–6 (7/0), 6–3తో గ్రీక్స్పూర్ను ఓడించి 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్ జోడీ వాన్ డి జాండ్‌షుల్ప్–వెస్లీ కూల్‌హాఫ్ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్ ద్వయం అల్కరాజ్–మార్సెల్ గ్రానోలర్స్‌ను ఓడించింది. స్పెయిన్ నిష్క్ర మణతో నాదల్కు ఇదే చివరి పోరుగా మారింది. నాదల్ మ్యాచ్‌ను తిలకించేందుకు కుటుంబసభ్యులందరూ వచ్చారు. అంతా అతనే... మ్యాచ్ ఆరంభానికి ముందు స్పెయిన్ జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో 38 ఏళ్ల నాదల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుమారు 10 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం అంతా ఎరుపు వర్ణం పులుముకున్న తర్వాత అతను ఆటలోకి అడుగు పెట్టాడు. కోర్టులో ప్రతి షాట్‌కు అభిమానులు ‘రా...ఫా...రా...ఫా....’ అంటూ జేజేలు పలుకుతూ ప్రోత్సహిస్తుండగా అతను పోటీ పడ్డాడు. అయితే ఊహించినట్లుగానే గతంలోలా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను వరుస సెట్లలో ఓడిపోయాడు. నాదల్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో అతని ఓటమి ఖాయమైంది. స్పెయిన్ ఓటమి తర్వాత నాదల్ స్టేడియం అంతా కలియతిరిగాడు. ఆటగాళ్లు, కోచ్‌లను కౌగిలించుకొని భావోద్వేగభరితమైన అతను అభిమానుల చప్పట్ల హోరు మధ్య ప్రసంగం పూర్తి చేసుకొని వీడాడు.వరుసగా 19 ఏళ్ల పాటు...2024: 02023: 02022: 4 2021: 2 2020: 2 2019: 4 2018: 52017: 62016: 2 2015: 3 2014: 4 2013: 10 2012: 4 2011: 3 2010: 7 2009: 52008: 8 2007: 6 2006: 5 2005: 11 2004: 1 మొత్తం 92రాఫెల్ నాదల్ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పోలాండ్లోని సొపోట్ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్ ఓపెన్ టోర్నీలో నాదల్ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్ కనీసం ఒక్క టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు.అంకెల్లో నాదల్ కెరీర్1080 సింగిల్స్ విభాగంలో గెలిచిన మ్యాచ్‌లు 227 సింగిల్స్ విభాగంలో ఓడిన మ్యాచ్‌లు 910 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో కొనసాగిన వారాలు 209 ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగిన వారాలు 92 కెరీర్ మొత్తంలో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ 63 క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 22 మొత్తం నెగ్గిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్: 14, ఆ్రస్టేలియన్ ఓపెన్: 2; వింబుల్డన్: 2, యూఎస్ ఓపెన్: 4) 2 గెలిచిన ఒలింపిక్స్ స్వర్ణాలు (2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్; 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్) 4 డేవిస్‌కప్ టీమ్ టైటిల్స్(2004, 2009, 2011, 2019)కెరీర్లో సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ13,49,46,100 డాలర్లు (రూ. 1138 కోట్లు)భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. అయితే ప్రశాంతమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నా. నా విజయాల సంఖ్య, టైటిల్స్, రికార్డుల గురించి అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఊరు మలొర్కా నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా, తన కలలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడిన ఒక చిన్న కుర్రాడిగా నేను గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్లో ఎంతో మంది మిత్రులను సంపాదించుకోగలిగాను. డేవిస్ కప్‌లో తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టిన నేను ఇప్పుడూ ఓడి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. నా చివరి మ్యాచ్ చాలా కఠినంగా అనిపించింది. నిజానికి ఎవరూ ఇలాంటి క్షణం రావాలని కోరుకోరు. నేను టెన్నిస్ ఆడే విషయంలో అలసిపోలేదు. కానీ నా శరీరం అలసిపోయింది. ఇక ఆడటం సాధ్యం కాదని చెప్పేసింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరించాలి. నిజాయితీగా చెప్పాలంటే ఒక హాబీగా మొదలు పెట్టిన ఆటలో ఇంత గొప్ప కెరీర్ నిర్మించుకోగలగడాన్ని నేను గొప్పగా భావిస్తున్నా. పైగా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ కాలం ఆడగలిగాను. – వీడ్కోలు ప్రసంగంలో రాఫెల్ నాదల్ -
ప్యాడెల్ టెన్నిస్ ఆడేద్దాం..!
ఎప్పుడైనా ప్యాడెల్ టెన్నిస్ గురించి విన్నారా? టెన్నిస్ గురించి తెలుసు.. బ్యాడ్మింటన్ గురించి తెలుసు.. ఇంకా స్క్వాష్ గురించీ తెలుసు కానీ కొత్తగా ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది చాలా కొత్త గేమ్.. కాకపోతే చాలా ట్రెండీ గేమ్. మెక్సికోలో పుట్టిన ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కానీ మన హైదరాబాదీయులకు మాత్రం ఇది కాస్త కొత్త గేమ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్యాడెల్ టెన్నిస్‌పై నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి? సాధారణ టెన్నిస్‌కు, ప్యాడెల్ టెన్నిస్‌కు మధ్య వ్యత్యాసాలేంటి? ఎలా ఆడుతారు..? ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం..! ప్యాడెల్ టెన్నిస్ కూడా టెన్నిస్ లాంటి ఆటనే. 1969లో మెక్సికోకు చెందిన ఎన్రిక్ కార్క్యూరా అనే క్రీడాకారులు ఈ గేమ్ కనిపెట్టాడు. టెన్నిస్, స్క్వాష్ ఆటల కలయికనే ఈ ప్యాడెల్ టెన్నిస్. టెన్నిస్‌లో ఉన్నట్టే అన్ని రూల్స్ ఉంటాయి. కోర్టు, రాకెట్, వాడే బాల్ ఇలా చాలా విషయాల్లో కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. సాధారణంగా టెన్నిస్ కోర్టులు పెద్ద పరిమాణంలో, ఓపెన్‌గా ఉంటాయి. అయితే ప్యాడెల్ టెన్నిస్ కోర్టులు మాత్రం కాస్త చిన్న పరిమాణంలో మూసేసి ఉంటాయి. 20 మీటర్ల పొడవుతో, 10 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అదే టెన్నిస్ కోర్టులు మాత్రం 23 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ప్యాడెల్ గేమ్‌లో కాస్త ఫన్నీ అనిపించే అంశం ఏంటంటే.. చిన్నప్పుడు డబుల్ స్టెప్ ఔట్ అనుకునేవాళ్లం కదా.. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి వెనుక ఉన్న గోడకు తగిలి.. మరోసారి కోర్టులో బౌన్స్ అయినా కూడా ఆట కొనసాగించవచ్చు. చాలా మంది గోడకు బంతి తగిలేలా చేసి స్ట్రాటజీలా ఆడుతుంటారు. అదే టెన్నిస్‌లో మాత్రం ఒకసారే బౌన్స్ కావాల్సి ఉంటుంది. ఇక, వెనుక గోడలకు తగిలితే ప్రత్యరి్థకే పాయింట్ దక్కుతుంది. ఇదో సోషల్ గేమ్..ప్యాడెల్ టెన్నిస్‌ను సోషల్ గేమ్ అంటుంటారు. ఎందుకంటే దీన్ని కచి్చతంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుగా ఆడాల్సి ఉంటుంది. అదే టెన్నిస్ మాత్రం సింగిల్స్, డబుల్స్ కూడా ఆడొచ్చు. ఇక, రాకెట్ విషయంలో టెన్నిస్‌కు, ప్యాడెల్ టెన్నిస్‌కు చాలా తేడా ఉంటుంది. టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉండవు. పొడవు విషయంలో కూడా టెన్నిస్ రాకెట్ కన్నా ప్యాడెల్ రాకెట్ చిన్నగా ఉంటుంది. వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అయితే వాడే బాళ్లు చూడటానికి ఒకేలా కనిపించినా.. కాస్త తేడా ఉంటుంది. టెన్నిస్ బాల్స్ గట్టిగా ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ విషయంలో కాస్త మెత్తగా, తక్కువ పీడనంతో ఉంటాయి. ఆడే విధానంలో కూడా రెండు గేమ్స్ మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్ సరీ్వంగ్ విషయంలో చాలా రూల్స్ ఉంటాయి.ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.. మనదేశంలో క్రికెట్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోన్న గేమ్ టెన్నిస్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్యాడెల్ టెన్నిస్ ఆడుతున్నా.. చూస్తున్నా కూడా చాలా ఫన్ ఉంటుంది. ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు ప్యాడెల్ టెన్నిస్ శిక్షకులు. హైదరాబాద్‌లో కూడా పలు అకాడమీలు ఈ ప్యాడెల్ టెన్నిస్ నేరి్పస్తున్నారు.ఇప్పుడే ట్రెండ్ అవుతోంది.. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ గురించి అవగాహన పెరుగుతోంది. నేర్చుకునేందుకు యువత, పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. టెన్నిస్‌తో పోలిస్తే ప్యాడెల్ టెన్నిస్ గురించి చాలా మందికి తెలియదు. ప్యాడెల్ టెన్నిస్‌లో ఫిట్నెస్తో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కొన్ని మెళకువలతో నేర్చుకుంటే ప్యాడెల్ టెన్నిస్ ఆడటం సులువే. – ఎన్.జగన్నాథం, టెన్నిస్ ట్రైనర్ -
సుమిత్... మళ్లీ తొలి రౌండ్లోనే...
మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 66వ ర్యాంకర్ కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)తో ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను 5–7తో కోల్పోయి, రెండో సెట్లో 0–4తోవెనుకబడ్డాడు. ఈ దశలో సుమిత్‌కు గాయం కావడంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు.సుమిత్‌కు 6,215 యూరోలు (రూ. 5 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా దక్కాయి. సుమిత్ ఆడిన గత పది టోర్నీలలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందడం గమనార్హం. -
రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం
టెన్నిస్ దిగ్గజం, స్పానిష్ బుల్ రఫెల్ నదాల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని అతను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశాడు. తన కెరీర్ మొత్తంలో మద్దతుకు నిలిచిన వారికి నదాల్ కృతజ్ఞతలు తెలిపాడు. నదాల్ వచ్చే నెలలో (నవంబర్) జరుగబోయే డేవిస్ కప్‌లో చివరిసారి స్పెయిన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల నదాల్ తన సుదీర్ఘ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. నదాల్‌కు మట్టి కోర్టు వీరుడిగా పేరుంది. నదాల్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ఆస్ట్రేలియా ఓపెన్ (2009, 2022)-2ఫ్రెండ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022)- 14వింబుల్డన్ (2008, 2010)-2యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017, 2019)-4 -
రెండో సీడ్ జోడీకి షాక్.. సెమీస్‌లో జీవన్-ప్రశాంత్ ద్వయం
హాంగ్జౌ: భారత టెన్నిస్ జంట జీవన్ నెడుంజెళియన్ – ప్రశాంత్ ఏటీపీ టోర్నీ హాంగ్జౌ ఓపెన్ డబుల్స్‌లో సెమీస్‌లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో నెడుంజెళియన్ –ప్రశాంత్ 6–7 (4/7), 7–6 (8/6), 10–8తో రెండో సీడ్ జులియన్ కాశ్ –లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జోడీపై చెమటోడ్చి గెలిచారు. మ్యాచ్ ఆరంభం నుంచి పోటాపోటీగా జరిగిన ఈ పోరులో టైబ్రేక్‌కు దారితీసిన తొలిసెట్‌ను భారత ద్వయం కోల్పోయింది. తర్వాత రెండో సెట్లో తమకన్నా మెరుగైనా ర్యాంకు జంటతో దీటుగా పోరాటం చేసింది. వరుసగా ఈ సెట్ కూడా టైబ్రేక్ దాకా వెళ్లినా... భారత జోడీ ఈ సెట్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గెలిచి పోటీలో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోనూ ఇరు జోడీలు ఏమాత్రం తగ్గలేదు. నువ్వానేనా అన్నట్లు ప్రతి పాయింట్ కోసం శ్రమించాయి. చివరకు భారత ద్వయం 10–8తో గెలిచి ఊపిరి పీల్చుకుంది. రెండు గంటల పాటు ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. సెమీస్‌లో మూడో సీడ్ ఎరియెల్ బెహర్ (ఉరుగ్వే)–రాబర్ట్ గెలొవే (అమెరికా) జంటతో భారత ద్వయం తలపడుతుంది. -
సెమీ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
న్యూఢిల్లీ: భారత డబుల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ ఏటీపీ టోర్నీ చెంగ్డూ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ బాంబ్రీ – ఫ్రాన్స్ ప్లేయర్ అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడి చక్కని పోరాట పటిమతో తమకన్నా మెరుగైనా ర్యాంకింగ్ ప్లేయర్లను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి జంట 5–7, 6–3, 12–10తో ఈక్వెడార్‌కు చెందిన గాంజాలొ ఎస్కోబార్–డీగో హిదాల్గొ జోడీపై చెటడోడ్చి గెలిచింది. ఆరంభ సెట్లో వెనుకబడిన భారత్–ఫ్రాన్స్ ద్వయం రెండో సెట్లో అసాధారణ ఆటతీరుతో ఈక్వెడార్ జంటకు ఏమాత్రం అవకాశమివ్వకుండా సెట్‌ను కైవసం చేసుకొంది. కీలకమైన ఆఖరి సెట్ ఊహించని విధంగా సాగింది. ఇరు జోడీలు ధీటుగా ఆడటంతో ప్రతి పాయింట్ కోసం పెద్ద పోరాటం తప్పలేదు. చివరకు 12–10తో యూకీ బాంబ్రి జోడీ సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో భారత్–ఫ్రాన్స్ జోడీ... రెండో సీడ్ ఇవాండ్ డొడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఎదర్కొంటుంది. -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం
యూఎస్ ఓపెన్ 2024 పెను సంచలనం నమోదైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఓటమిపాలయ్యాడు. నెదర్లాండ్స్‌కు చెందిన 74వ ర్యాంక్ ప్లేయర్ బొటిక్ వాన్ డి జాండ్స్కల్ప్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.బొటిక్ 6-1, 6-5, 6-4 తేడాతో వరుస సెట్లలో అల్కరాజ్పై విజయం సాధించాడు. 2021 వింబుల్డన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించడం అల్కరాజ్కు ఇది తొలిసారి.ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు సాధించిన అల్కరాజ్ ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌తో పాటు యూఎస్ ఓపెన్ కూడా గెలిచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలవాలనుకున్న అల్కరాజ్ ఆశలపై బొటిక్ నీళ్లు చల్లాడు.ఇదిలా ఉంటే, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ జన్నిక్ సిన్నెర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొకోగాఫ్, సబలెంకా కూడా రెండో రౌండ్‌ను దాటారు. అయితే నయోమి ఒసాకా రెండో రౌండ్లో పరాజయాన్ని చవిచూసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా ముచోవా ఒసాకాపై 6-3, 7-6 తేడాతో విజయం సాధించింది. -
US Open 2024: తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సుమిత్ నగాల్
భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. ప్రపంచ 40వ ర్యాంకర్ టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 73వ ర్యాంకర్ సుమిత్ 1-6, 3-6, 6-7 (6/8)తో ఓడిపోయాడు. 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ రెండు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 1,00,000 డాలర్లు (రూ. 83 లక్షల 90 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. యూఎస్ ఓపెన్‌లో ఆడటం ద్వారా సుమిత్ తన కెరీర్లో తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిపోయిన సుమిత్ ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లో నిష్క్రమించాడు. -
టీపీఎల్‌లో సుమిత్ నగాల్
ముంబై: భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఈ సీజన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) బరిలోకి దిగనున్నాడు. డిసెంబర్ 3 నుంచి 8 వరకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని టెన్నిస్ కోర్టుల్లో ఆరో సీజన్ పోటీలు జరుగుతాయి. హైదరాబాద్ స్ట్రయికర్స్, పుణే జాగ్వార్స్, బెంగాల్ విజార్డ్స్, పంజాబ్ పేట్రియా ట్స్, గుజరాత్ పాంథర్స్, ముంబై లియోన్ ఆర్మీ, బెంగళూరు పైపర్స్ ఈ లీగ్‌లో ఆడనున్నాయి. -
ఎదురులేని సినెర్
మేసన్ (అమెరికా): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఐదో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మంగళవారం ముగిసిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో 23 ఏళ్ల సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో సినెర్ 7–6 (7/4), 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. సినెర్‌కు 10,49,460 డాలర్ల (రూ. 8 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టియాఫోతో గంటా 36 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్ 13 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండుసార్లు టియాఫో సర్విస్‌ను బ్రేక్ చేసిన సినెర్ తన సర్విస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చిన సినెర్ 11 సార్లు పాయింట్లు గెలిచాడు. టియాఫో ఓటమితో సిన్సినాటి ఓపెన్ టోర్నీలో అమెరికా ప్లేయర్‌ను విజేతగా చూసేందుకు మరో ఏడాది వేచి చూడాలి. చివరిసారి ఆండీ రాడిక్ రూపంలో 2006లో అమెరికా ప్లేయర్ సిన్సినాటి ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది సినెర్ ఫైనల్ చేరిన ఐదు టోర్నీల్లోనూ విజేతగా నిలువడం విశేషం. ఈ టోర్నీకి ముందు సినెర్ ఆ్రస్టేలియన్ ఓపెన్, మయామి మాస్టర్స్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, హాలె ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. డోపింగ్‌లో దొరికినా... ఈ ఏడాది మార్చిలో సినెర్ డోపింగ్‌లో పట్టుబడ్డాడని అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ వెల్లడించింది. సినెర్ నుంచి రెండుసార్లు సేకరించిన యూరిన్ శాంపిల్స్‌లో నిషేధిత ఉ్రత్పేరకం క్లోస్టెబోల్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో అతనిపై ఏప్రిల్ 4 నుంచి 5 వరకు... ఏప్రిల్ 17 నుంచి 20 వరకు సస్పెన్షన్ విధించారు. ఈ రెండుసార్లూ వెనువెంటనే సినెర్ సస్పెన్షన్ తొలగించాలని దరఖాస్తు చేసుకున్నాడు. తాను ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉ్రత్పేరకం తీసుకోలేదని ... సహాయక సిబ్బంది గాయం తగ్గడానికి స్ప్రే చేయగా... అది తన శరీరంలోకి వచ్చి0దని ఇండిపెండెంట్ ప్యానెల్ ముందు సినెర్ వాదనలు వినిపించాడు. సినెర్ సమాధానాలతో సంతృప్తి చెందిన ప్యానెల్ సినెర్‌పై సస్పెన్షన్ విధించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది. అయితే మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ లో అతను గెల్చుకున్న ప్రైజ్‌మనీని, ర్యాంకింగ్ పాయింట్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. సబలెంకా సూపర్... మరోవైపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో బెలారస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా కూడా తొలిసారి విజేతగా అవతరించింది. గతంలో మూడుసార్లు సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా ఈసారి మాత్రం టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో సబలెంకా 6–3, 7–5తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. సబలెంకాకు 5,23,485 డాలర్ల (రూ. 4 కోట్ల 38 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సబలెంకా ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా సబలెంకా కెరీర్లో ఇది 15వ సింగిల్స్ టైటిల్. తాజా విజయంతో సబలెంకా సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. -
Paris Olympics 2024: స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జకోవిచ్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఫైనల్లో స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్పై వరుస సెట్లలో (7-6(3), 7-6(2)) విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో జకోకు ఇది తొలి స్వర్ణం. 37 ఏళ్ల జకో ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. NOVAK DJOKOVIC - THE OLYMPIC GOLD MEDALIST AT THE AGE OF 37.🏅- The greatest ever of Tennis! 🐐pic.twitter.com/bj4uxuTRin— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024అలాగే కెరీర్ గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్స్ సింగిల్స్‌లో స్వర్ణం) నెగ్గిన ఐదో టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. ఇటీవలి కాలంలో అల్కరాజ్.. జకోవిచ్‌పై ఆధిపత్యం చాలాయించాడు. 2023, 2024 వింబుల్డన్‌లో అల్కరాజ్ జకోకు షాకిచ్చాడు. ఈ రెండు పరాజయాలకు జకో విశ్వవేదికపై బదులు తీర్చుకున్నాడు. జకో తన కెరీర్లో24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించగా.. అల్కరాజ్ చిన్నవయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమితో అల్కరాజ్ రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు. -
Paris Olympics 2024: వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
పారిస్ ఒలింపిక్స్ మహిళల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వియాటెక్‌కు (పోలాండ్) షాక్ తగిలింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన క్విన్వెన్ ఝెంగ్ స్వియాటెక్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించింది. గంటా 51 నిమిషాల పాటు సాగిన ఈ పోటీలో క్విన్వెన్ వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. Qinwen Zheng becomes the 1st Chinese player in history to reach the final of the Olympics in singles. No man or woman has ever done it before today. Megastar in the making. 🇨🇳❤️🇨🇳 pic.twitter.com/24f1WkwBcz— The Tennis Letter (@TheTennisLetter) August 1, 2024ఒలింపిక్స్ టెన్నిస్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి చైనా క్రీడాకారిణిగా క్విన్వెన్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో రొలాండ్ గారోస్‌లో 1149 రోజుల పాటు సాగిన స్వియాటెక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2021 నుంచి రొలాండ్ అండ్ గారోస్‌లో స్వియాటెక్‌కు ఓటమనేదే లేదు. డొన్నా వెకిక్, అన్నా కరోలినా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విన్నర్‌తో క్విన్వెన్ ఫైనల్లో పోటీపడుతుంది. -
Paris Olympics 2024: నాదల్‌ను మట్టికరిపించిన జొకోవిచ్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ ఈవెంట్ సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–4తో నాదల్‌ను ఓడించాడు. వీరిద్దరు ఇప్పటి వరకు 60 సార్లు తలపడగా.. జొకోవిచ్ 31 సార్లు, నాదల్ 29 సార్లు విజయం సాధించాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జొకోవిచ్‌కు ఒలింపిక్ స్వర్ణం లోటుగా ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జొకోవిచ్... 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం పతకాలు సాధించలేకపోయాడు. -
తానొక.. చెక్ క్రేజీ స్టార్!
మూడేళ్ల క్రితం ఆమె గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ బరిలోకి దిగిన సమయంలో ఎలాంటి అంచనాలు లేవు. అప్పటికి డబుల్స్‌లో రెండు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినా.. డబుల్స్ స్పెషలిస్ట్‌గానే ముద్ర పడింది. సింగిల్స్‌లో ముందుకెళ్లడం కష్టం అని అనుకున్నారు. కానీ ఆమె ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచింది. అయినా సరే మహిళల టెన్నిస్‌లో ఎంతోమంది తరహాలో వన్ గ్రాండ్‌స్లామ్ వండర్‌గా నిలిచిపోతుందనే భావించారు అంతా! తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో అంతా ఆమెను మర్చిపోయారు.కానీ ఇప్పుడు మళ్లీ ఉవ్వెత్తున పైకి లేచింది. ఈ సారి వింబుల్డన్ బరిలోకి దిగే సమయానికి సరిగ్గా మూడేళ్ల క్రితం నాటి పరిస్థితే. సీడింగ్ ఇచ్చిన 32 మంది ప్లేయర్లలో ఆమెది 31వ స్థానం. వైఫల్యాల కోర్ట్‌లో ఉన్న ఆమె ఆమె ప్రదర్శనపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఒక్కో రౌండ్ దాటుతున్న కొద్దీ ఆమె ఆట ఏంటో అందరికీ తెలిసింది. చివరకు ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను ముద్దాడటంతో మళ్లీ టెన్నిస్ ప్రపంచం ఆమెపై ఫోకస్ పెట్టింది. ఆ స్టార్ పేరే బార్బరా క్రెజికోవా. 2024 వింబుల్డన్ చాంపియన్.2021లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఈ చెక్ రిపబ్లిక్ ప్లేయర్.. రెండు పూర్తి భిన్నమైన సర్ఫేస్లు ఎర్ర మట్టి కోర్టు, పచ్చిక కోర్టులపై విజేతగా నిలిచిన అతి తక్కువ మంది మహిళా ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. పైగా సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లలో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన అరుదైన జాబితాలో కూడా క్రెజికోవా చోటు దక్కించుకుంది.2024లో తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రెజికోవా ప్రదర్శన పర్వాలేదనిపించింది. క్వార్టర్ ఫైనల్ వరకు చేరిన ఆమె.. ఈ దశలో టోర్నీ విజేత అరైనా సబలెంకా చేతిలో ఓడింది. అయితే ఆ తర్వాతే ఆమె కష్టకాలం మొదలైంది. అనారోగ్యం, గాయాలు ఆమెను వేధించాయి. ఫలితంగా ఏ టోర్నీకి వెళ్లినా పరాజయమే పలకరించింది. ఐదు నెలల కాలంలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లలోనే గెలవగలిగింది. ఫ్రెంచ్ ఓపెన్లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో మాజీ చాంపియన్‌గా బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓటమిపాలవ్వడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.డబుల్స్‌లో కూడా మూడో రౌండ్‌కే పరిమితమైన క్రెజికోవా.. మిక్స్డ్ డబుల్స్‌లో గాయంతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఇలాంటి స్థితిలో ఆమె ట్రావెలింగ్ కోచ్ పావెల్ మోటెల్ ఆమెలో స్ఫూర్తి నింపాడు. క్రెజికోవాకంటే రెండేళ్లు చిన్నవాడైన అతను ఆమె స్కూల్‌మేట్. ప్రస్తుతం ట్రైనింగ్ పార్ట్నర్గా కూడా ఉన్న పావెల్.. గత ఫలితాలను పక్కనపెట్టి గ్రాస్ కోర్టు సీజన్‌పై క్రెజికోవా దృష్టి పెట్టేలా చేశాడు. ఈసారి అన్ని విధాలుగా సిద్ధమై వింబుల్డన్‌లో అడుగు పెట్టిన తర్వాత ఆమె కొత్త ఉత్సాహంతో కనిపించింది. తొలి మూడు రౌండ్లలో అనామకులపై గెలిచిన తర్వాత ఆమె అసలు ఆట తర్వాతి మూడు మ్యాచ్‌లలో వచ్చింది. తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న డానిల్ కొలిన్స్, ఒస్టాపెంకో, రిబాకినాలను ఓడించి ఆమె ఫైనల్ చేరింది. తుది పోరులో కూడా ఏడో సీడ్ పావొలినిని చిత్తుచేసి సగర్వంగా నిలిచిన క్రెజికోవా.. అతి తక్కువ ర్యాంక్‌తో మైదానంలోకి దిగి వింబుల్డన్ గెలిచినవారి జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. తాజా ప్రదర్శనతో సహజంగానే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన ఈ చెక్ ప్లేయర్ 10వ స్థానానికి దూసుకుపోయింది.చిన్ననాటినుంచే..క్రెజికోవా అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్యంగా, సంచలనంలా దూసుకురాలేదు. ఆరేళ్ల వయసులో మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టి ఓనమాలు నేర్చుకున్న ఆమె చెక్ రిపబ్లిక్ జాతీయ స్థాయి జూనియర్ టోర్నీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2013లో జూనియర్ సర్క్యూట్లో క్రెజికోవా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో యూరోపియన్ చాంపియన్‌గా నిలవడం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అన్నింటినీ మించి ఆ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సాధించిన అద్భుత విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. స్నేహితురాలు కేటరినా సినియోకొవాతో కలసి మూడు జూనియర్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)ను క్రెజికోవా గెలుచుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒలెకాండ్రా కొరాష్విలి (ఉక్రెయిన్)తో కలసి ఆడిన క్రెజికోవా రన్నరప్‌గా నిలిచింది. మరొక్క మ్యాచ్ ఫైనల్లో గెలిచి ఉంటే ఒకే ఏడాది జూనియర్ స్థాయిలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లూ గెలిచిన అరుదైన ఘనత ఆమె ఖాతాలో చేరేది. అదే ఏడాది వరల్డ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో క్రెజికోవా మూడో స్థానాన్ని అందుకోవడం విశేషం.2021 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్స్ ట్రోఫీతో, 2024 వింబుల్డన్ విమెన్స్ టైటిల్ ట్రోఫీతో..క్రెజికోవా అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్యంగా, సంచలనంలా దూసుకు రాలేదు. ఆరేళ్ల వయసులో మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టి ఓనమాలు నేర్చుకున్న ఆమె చెక్ రిపబ్లిక్ జాతీయ స్థాయి జూనియర్ టోర్నీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చింది.అన్నీ తానే అయి..చెక్ రిపబ్లిక్కు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణిగా యానా నవోత్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1998లో ఆమె అద్భుత ఆటతో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా మారిన ఆమె శిక్షణలోనే క్రెజికోవా ఉన్నతస్థాయికి చేరింది. సరిగ్గా చెప్పాలంటే ఒక కోచ్ కంటే కూడా మార్గదర్శిగా, స్నేహితురాలిగా ఉన్న నవోత్నా పర్యవేక్షణలోనే క్రెజికోవా తన ఆటను తీర్చిదిద్దుకుంది. కెరీర్లో తొలి కోచ్‌గా ఉన్న నవోత్నా వద్దే ఆమె మూడేళ్ల పాటు శిక్షణ పొందింది.అయితే దురదృష్టవశాత్తు 2017లో క్యాన్సర్‌తో నవోత్నా మరణించింది. క్రెజికోవా అగ్రస్థాయికి చేరే విజయాలను అందుకునేసరికే ఆమె లోకం నుంచి నిష్క్రమించింది. అయితే నవోత్నా ఇచ్చిన స్ఫూర్తి, ఆమె మాటలు తన జీవితంలో ఎప్పుడూ అంతర్భాగమేనని క్రెజికోవా చెప్పుకుంది. 2021లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచినప్పుడు కోచ్‌ను గుర్తు చేసుకొని కన్నీళ్ళపర్యంతమైన ఈ చెక్ ప్లేయర్ ‘నాకు వింబుల్డన్ అంటే చాలా ఇష్టం. అక్కడి పచ్చికపై ఆట ఎంతో ప్రత్యేకం. నువ్వు ఎలాగైనా వింబుల్డన్ గెలవాలి’ అని నవోత్నా చెప్పిన మాటలను మర్చిపోలేదు. ఇప్పుడు వింబుల్డన్ టైటిల్ సాధించిన క్షణాన వేదికపై తన కోచ్‌కు నివాళి అర్పిస్తూ ఆమె చేసిన ప్రసంగం ఈ అనుబంధం ఎలాంటిదో చూపించింది.మిగిలిన రెండూ గెలిస్తే..12 ఏళ్ల వయసులో క్రెజికోవా తాను భవిష్యత్తులో సాధించాల్సిన మూడు లక్ష్యాల గురించి తన నోట్‌బుక్‌లో రాసుకుంది. అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారని ఆ టీనేజర్‌కు నిజంగా తాను సాధించగలదో లేదో తెలీదు. ప్రపంచ టెన్నిస్‌లో టాప్–10 ర్యాంక్‌కు చేరడం, ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం, ఒలింపిక్స్‌లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహించి స్వర్ణం అందుకోవడం.. ఇప్పటికే ఇవన్నీ ఆమె సాధించేసింది.సింగిల్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ వరకు వెళ్లిన ఆమె.. డబుల్స్‌లో ఆరేళ్ల క్రితమే వరల్డ్ నంబర్‌వన్ కూడా అయింది. క్రెజికోవా ఖాతాలో ఓవరాల్‌గా ప్రస్తుతం 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. సింగిల్స్‌లో 2, మిక్స్డ్ డబుల్స్‌లో 3, మహిళల డబుల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లను ఆమె గెలుచుకుంది. మహిళల డబుల్స్లోనైతే 8 సార్లు ఫైనల్‌కి చేరితే ఒక్కసారి మాత్రమే ఆమె ఓడింది. ఈ 8 సార్లూ తన జూనియర్ సహచరి, చెక్ రిపబ్లిక్‌కే చెందిన కేటరినా సినియాకొవానే ఆమె భాగస్వామిగా ఉంది.మిక్స్డ్ డబుల్స్‌లో రెండుసార్లు రాజీవ్‌రామ్‌తో, మరోసారి నికొలా మెక్టిక్‌తో కలసి క్రెజికోవా విజేతగా నిలిచింది. ఈ మూడూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లే కాగా.. మహిళల డబుల్స్‌లో మాత్రం నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు ఆమె సొంతం చేసుకోవడం విశేషం. వీటికి తోడు మహిళల టెన్నిస్‌లో ప్రపంచ కప్‌లాంటి టీమ్ ఈవెంట్ ఫెడరేషన్ కప్‌లో కూడా అరుదైన ఘనతను అందుకుంది. 2018లో ఫెడ్ కప్ నెగ్గిన చెక్ రిపబ్లిక్ టీమ్‌లో క్రెజికోవా సభ్యురాలు. అంతే కాదు చాలామంది కలలు కనే ఒలింపిక్స్ పతకం కూడా ఆమె సాధించగలిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కేటరినా సినియాకొవాతోనే కలసి స్వర్ణపతకం సొంతం చేసుకుంది.వింబుల్డన్ గెలిచిన వెంటనే తన తదుపరి లక్ష్యం ఒలింపిక్స్ సింగిల్స్‌లో స్వర్ణమేనని ఆమె ప్రకటించింది. అదే ఉత్సాహంతో పారిస్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. అయితే సింగిల్స్‌లో మాత్రం గ్రాండ్‌స్లామ్ మరో రెండు వేర్వేరు ట్రోఫీలు బాకీ ఉన్నాయి. హార్డ్కోర్ట్లపై జరిగే యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్లలో గెలిస్తే క్రెజికోవా కెరీర్ సంపూర్ణం అవుతుంది. తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ ఏడాది ఆగస్టు చివర్లో జరిగే యూఎస్ ఓపెన్‌లో కూడా ఆమెకు మంచి విజయావకాశాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ వరకు జోరు కొనసాగిస్తే వరల్డ్ టెన్నిస్‌లో గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా క్రెజికోవా నిలిచిపోవడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న వరల్డ్ నంబర్ వన్
పురుషుల నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు జన్నిక్ సిన్నర్ పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత (టాన్సిల్స్) కారణంగా విశ్వ క్రీడల బరి నుంచి వైదొలుగుతున్నట్లు సిన్నర్ ప్రకటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉందని, ఇంటి నుంచే ఇటలీ అథ్లెట్లను సపోర్ట్ చేస్తానని సిన్నర్ తెలిపాడు. ఒలింపిక్స్‌లో సిన్నర్ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లో పోటీ పడాల్సి ఉండింది. సిన్నర్ వైదొలగడంతో అతని పార్ట్నర్ లొరెంజో ముసెట్టి మరో భాగస్వామిని వెతుక్కోవాల్సి వచ్చింది.సింగిల్స్ పోటీల నుంచి సిన్నర్ తప్పుకోవడంతో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న నొవాక్ జకోవిచ్ (సెర్బియా) టాప్ సీడ్ ఆటగాడిగా బరిలో నిలుస్తాడు. ఒలింపిక్స్ డ్రా ఇవాళ (జులై 25) ప్రకటించే అవకాశం ఉంది. జులై 27 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఆగస్ట్ 4న అన్ని విభాగాల్లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లు జరుగుతాయి.సిన్నర్ విషయానికొస్తే.. 22 ఏళ్ల ఈ ఇటలీ ఆటగాడు ఈ ఏడాది తన తొలి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) టైటిల్‌ను సాధించాడు. సిన్నర్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సిన్నర్ డేనియల్ మెద్వెదెవ్పై 3–6, 3–6, 6–4, 6–4, 6–3 తేడాతో అద్బుత విజయం సాధించాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడలో భారత్ రెండు విభాగాల్లో పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్.. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-శ్రీరామ్ బాలాజీ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
రోహిత్ సూపర్ లుక్.. వింబుల్డన్‌లో హిట్‌మ్యాన్ సందడి (ఫోటోలు)
-
భారీగా పెరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫ్రైజ్‌మనీ.. ఎన్ని కోట్లంటే?
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రైజ్‌మనీ భారీగా పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 50 మిలియన్ల పౌండ్ల(రూ.534 కోట్లు) ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) గురువారం ప్రకటించింది. అదేవిధంగా పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒక్కో విజేతకు 2.7 మిలియన్ల పౌండ్లు (సుమారు రూ.29.60 కోట్లు) దక్కనున్నాయి. 2023లో ఫ్రైజ్‌మనీతో పోలిస్తే ప్రస్తుతం ప్రైజ్‌మనీ విలువ 11.9శాతం అదనం. టోర్నీ ఫస్ట్ రౌండ్లో ఓడిన ఆటగాడికి 60 వేల పౌండ్లు ఇవ్వనున్నారు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జూలై 1 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది. -
విద్యార్థులకు ఫెదరర్ చెప్పిన జీవిత పాఠాలు.. వీడియో
రోజర్ ఫెదరర్.. టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న ధీరుడు రోజర్ ఫెదరర్. తాజాగా ఈ స్విస్ టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గౌరవం దక్కింది. న్యూ హాంప్‌షైర్‌లోని డార్ట్మౌత్ కాలేజీ నుంచి ఫెదరర్ డాక్టరేట్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాలను విధ్యార్ధులతో ఫెదరర్ పంచుకున్నాడు.దాదాపు 25 నిమిషాల పాటు సాగిన తన స్పీచ్‌తో విధ్యార్ధులను ఫెదరర్ మంత్రముగ్ధులను చేశాడు. తన కెరీర్లో సాధించిన ప్రతీ విజయానికి తను ఎంతో కష్టపడ్డానని ఫెదరర్ చెప్పుకొచ్చాడు.‘ఎఫర్ట్‌లెస్.. నిజానికి ఈ పదాన్ని తమ కోసం ఉపయోగించినట్లయితే చాలా మంది ప్రశంసలా భావిస్తారు. నాకు మాత్రం ఈ పదం వింటేనే నాకు చిరాకెత్తిపోతుంది. ఎందుకంటే.. శ్రమించకుండా ఏదీ అంత సులువుగా దొరకదు. చాలా మంది నేనేదో అలవోకగా.. ఎటువంటి కష్టం లేకుండా ఆడతానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. చాలా సార్లు నాకు నేనే తిట్టుకుంటూ రాకెట్ విసిరి కొట్టేవాడిని.కచ్చితంగా నేనే కాదు ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించేందుకు కష్టడాల్సి ఉంటుంది. ఇక రెండో పాఠం.. వీలైనంతవరకు మీరు అనుకున్నదానికంటే ఎక్కువ కష్టపడండి. అప్పటికి మీరు ఓటమి చవిచూస్తే ఆఖరివరకు పోరాడాలి. నా కెరీర్‌ను ఉదహరణగా తీసుకుంటే వింబుల్డన్‌లో ఓడిపోయాను. నేను నా నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయాను. ఆ సమయంలో కూడా నన్ను చాలా మంది ప్రశంసలతో ముంచెత్తారు. కానీ అప్పుడు కూడా వాటిని నేను పట్టించుకోలేదు. ఏమి చేయాలో నాకు తెలుసు, నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మీరు కూడా పొగడ్తలను ఎప్పుడూ పట్టించుకోకండి.ఇక మూడో పాఠం.. టెన్నిస్ కోర్టు కంటే జీవితం చాలా విలువైనది. నేను చాలా కష్టపడ్డాను. నా కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ చిన్న స్థలంలో (టెన్నిస్ కోర్ట్) చాలా మైళ్ళు పరిగెత్తాను. కానీ టెన్నిస్ కోర్టు ప్రపంచం చాలా పెద్దదని గ్రహించానని విధ్యార్ధులకు ఇచ్చిన ప్రసంగంలో ఫెదరర్ పేర్కొన్నాడు. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Roger Federer’s Commencement Address at Dartmouth yesterday might be the best speech he’s ever given.Amazingly articulate, funny, full of wisdom. Made me laugh and tear up. I’m so very proud to have had him as my idol for the past two decades.If you have 25 minutes to spare… pic.twitter.com/qfd9io9kzV— Bastien Fachan (@BastienFachan) June 10, 2024 -
వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో సుమిత్ నగాల్..
భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ తన కెరీర్లో తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు నేరుగా అర్హత సాధించాడు.గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రారంభానికి ఆరు వారాల ముందు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–104లో ఉన్న క్రీడాకారులకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభిస్తుంది. సుమిత్ నగాల్ ప్రస్తుతం 94వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2019లో చివరిసారి భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వింబుల్డన్ టోరీ్నలో పాల్గొన్నాడు.ఇవి చదవండి: రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి... -
తొలి రౌండ్లోనే రష్మిక పరాజయం
షార్లోట్స్విల్ డబ్ల్యూ–75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రష్మిక 2–6, 2–6తో గాబ్రియేలా ప్రైస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
టైటిల్ పోరుకు యూకీ–అల్బానో జోడీ
మ్యూనిక్: భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడోసారి ఏటీపీ –250 టోర్నీలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి జంట 6–1, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎర్లెర్–మెడ్లెర్ (ఆ్రస్టియా) ద్వయంపై గెలిచింది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ఏడు ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
సెమీఫైనల్లో రిత్విక్ జోడీ పరాజయం
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్–జీవన్ (భారత్) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్ (బ్రిటన్)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్ చేరింది. -
మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత్ గెలుపు
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్ చాన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షువో లియాంగ్ జంటపై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. టైబ్రేక్‌లో అంకిత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. -
మళ్లీ నంబర్‌వన్‌గా బోపన్న.. తన రికార్డు తానే తిరగరాసుకున్నాడు
ఫ్లోరిడా: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. గతవారం రెండో ర్యాంక్‌లో నిలిచిన 44 ఏళ్ల రోహన్ బోపన్న తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో సోమ వారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 95వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత వారం 97వ ర్యాంక్‌లో నిలిచిన సుమిత్ రెండు స్థానాలు పురో గతి సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 61 స్థానాలు ఎగబాకి 349వ ర్యాంక్‌లో నిలిచాడు. -
సినెర్ ఖాతాలో మయామి మాస్టర్స్ టైటిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మూడో ప్రయత్నంలో మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫ్లోరిడాలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–3, 6–1తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచాడు. 2021, 2023లలో రన్నరప్‌గా నిలిచిన సినెర్ ఈసారి మాత్రం టైటిల్‌ను వదల్లేదు. సినెర్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సినెర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా నిలిచాడు. -
మయామి ఓపెన్ చాంపియన్ కోలిన్స్
ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ అద్భుతం చేసింది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్ 7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది.కోలిన్స్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్ స్టీఫెన్స్ తర్వాత మయామి ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆరో అమెరికన్ ప్లేయర్‌గా కోలిన్స్ గుర్తింపు పొందింది. -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి మయామి మాస్టర్స్ టైటిల్
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 26 డబుల్స్ టైటిల్‌కాగా... ‘మాస్టర్స్ సిరీస్’లో ఆరో టైటిల్ కావడం విశేషం. 44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్ సిరీస్’లో ఇండియన్ వెల్స్ (2023), మోంటెకార్లో ఓపెన్ (2017), మాడ్రిడ్ ఓపెన్ (2015), పారిస్ ఓపెన్ (2012), పారిస్ ఓపెన్ (2011) టైటిల్స్ సాధించాడు. లియాండర్ పేస్ (2012లో) తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. -
Girona Open: అనిరుధ్–విజయ్ జోడీకి నిరాశ
కోస్టా బ్రావా (స్పెయిన్): జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన భాగస్వామి విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్ సాండెర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీతో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో అనిరుద్–విజయ్ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమాన్ (జర్మనీ) ద్వయం 4–6, 3–6తో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–హెన్రీ పాటెన్ (బ్రిటన్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. తొలి రౌండ్లో ఓడిన అనిరుద్–విజయ్; బాలాజీ–బెగెమాన్ జోడీలకు 800 యూరోలు (రూ. 72 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Miami Masters: ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ
మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఫ్లోరిడాలో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–4తో బొలెలీ–వావాసోరి (ఇటలీ) జోడీని ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–వీనస్ (న్యూజిలాండ్) జంట 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడింది. -
వరల్డ్ నంబర్ వన్ బోపన్న జోడీకి తొలి రౌండ్లోనే షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ జోడీ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్లోనే నిష్కమించింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (1/7), 6–4, 8–10తో సాండర్ జిలీ–జొరాన్ వ్లిజెన్ (బెల్జియం) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జంటకు 18,640 డాలర్ల (రూ. 15 లక్షల 42 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సాకేత్ జోడీకి టైటిల్
బెంగళూరు: భారత డేవిస్ కప్ ప్లేయర్ సాకేత్ మైనేని మరో డబుల్స్ టైటిల్ సాధించాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రామ్‌కుమార్ రామనాథన్‌తో జోడీ కట్టిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రెంచ్ జంటపై విజయం సాధించాడు. భారత ద్వయం 6–3, 6–4తో మ్యాక్సిమ్ జాన్వియెర్–బిటన్ కౌజ్మినె జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. సింగిల్స్‌లో భారత టాప్‌ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు మాత్రం సెమీస్‌లో చుక్కెదురైంది. రెండో సీడ్ నగాల్ 6–7 (2/7), 4–6తో ఇటలీకి చెందిన ఏడో సీడ్ స్టెఫానో నెపొలిటనో చేతిలో పరాజయం చవిచూశాడు. ఆట ఆరంభంలో సుమీత్ 4–1తో ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అయితే ఇటలీ ప్లేయర్ వరుసగా గేమ్‌లను గెలవడంతో తొలి సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. భారత ఆటగాడు రెండో సెట్ ఆరంభంలో పట్టుదల కనబరిచినప్పటికీ తర్వాత స్టెఫానో జోరు ముందు నిలువలేకపోయాడు. -
చెన్నై ఓపెన్ చాంపియన్ సుమిత్ నగాల్
భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ స్వదేశంలో తొలిసారి ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సుమిత్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 121వ ర్యాంకర్ సుమిత్ 6–1, 6–4తో 114వ ర్యాంకర్ లుకా నార్డీ (ఇటలీ)పై గెలిచి తన కెరీర్లో నాలుగో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ సాధించాడు. విజేతగా నిలిచిన సుమిత్‌కు 18,230 డాలర్ల (రూ. 15 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్‌తో డేవిస్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్లో అనాసక్తి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య మైదానంలో పోటీ అంటేనే ఓ సమరాన్ని తలపిస్తుంది. పెద్ద హడావుడి, హంగు, ఆర్భాటం అంతా కనిపిస్తుంది. అయితే ఇదంతా క్రికెట్‌కే పరిమితం. టెన్నిస్ అంటే ఆసక్తి అంతంతమాత్రమే! ఇప్పుడు కూడా ఆరు దశాబ్దాల తర్వాత ఇరు జట్ల మధ్య పాక్ గడ్డపై ప్రతిష్టాత్మక డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–1 పోటీలు జరగాల్సి ఉంటే... దేశంలో, రాష్ట్రంలో కాదుకదా... కనీసం వేదికైన ఇస్లామాబాద్‌లో కూడా చడీచప్పుడు లేనేలేదు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కేవలం మీడియా, పాకిస్తాన్ టెన్నిస్ సమాఖ్య (పీటీఎఫ్) నిర్వాహకులు తప్ప ఇంకెవరి అడుగులు, చూపులు అటువైపు పడటం లేదు. మ్యాచ్‌ల కోసం పాస్‌లు, వీఐపీ పాస్‌లు కావాలనే ప్రతిపాదనలు కూడా రావట్లేదు. రేపు, ఎల్లుండి డేవిస్ కప్ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్‌కు వచ్చిన భారత టెన్నిస్ జట్టు సభ్యులకు అక్కడి భారత హైకమిషనర్ గీతిక శ్రీవాస్తవ విందు ఏర్పాటు చేసి ఆటగాళ్లకు బెస్టా్టఫ్ లక్ చెప్పారు. -
రన్నరప్‌గా నిలిచిన అనిరుధ్-విజయ్ సుందర్ జోడీ
ఫ్రాన్స్‌లో జరిగిన క్వింపెర్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో అనిరుద్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ 6–7 (4/7), 3–6తో గినార్డ్–రిండెర్నెచ్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓడిపోయింది. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అనిరుద్–విజయ్ జంట ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో నిష్క్రమించింది. -
Australian Open: పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాలు.. టాప్ సీడ్లకు షాకిచ్చిన అనామకులు
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాలు నమోదయ్యాయి. రష్యాకు చెందిన 16 ఏళ్ల మిరా అండ్రీవా అద్భుత ఆటతో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యునీషియా)ను ఇంటిదారి పట్టించగా... ఎలీనా అవెనెస్యాన్ (రష్యా) ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ రెండో రౌండ్ మ్యాచ్‌లో అండ్రీవా 6–0, 6–2తో ఆన్స్ జెబర్పై, ఎలీనా 6–4, 6–4తో సాకరిపై గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–2తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 7–6 (7/2), 6–2తో డొలెహిడె (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో తమారా (జర్మనీ)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/4), 6–3తో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. -
Australian Open Qualifier: రెండో రౌండ్లో సుమిత్ నగాల్
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 139వ ర్యాంకర్ సుమిత్ 6–3, 7–5తో జెఫ్రీ బ్లాన్కనెక్స్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అంకిత రైనా (భారత్) 1–6, 5–7తో సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. -
2017 తర్వాత మళ్లీ టైటిల్...
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బల్గేరియా టెన్నిస్ స్టార్ దిమిత్రోవ్ తన కెరీర్లో తొమ్మిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 32 ఏళ్ల దిమిత్రోవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 14వ ర్యాంకర్ దిమిత్రోవ్ 7–6 (7/5), 6–4తో 8వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి 95,340 డాలర్ల (రూ. 79 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దిమిత్రోవ్ చివరిసారి 2017 నవంబర్ 17న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ నెగ్గాడు. -
నాదల్ ఖాతాలో తొలి విజయం
తుంటి గాయం నుంచి కోలుకున్న స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ కొత్త ఏడాదిలో తొలి విజయం అందుకున్నాడు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ 7–5, 6–1తో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడిపోయాక నాదల్ తుంటి గాయంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. బ్రిస్బేన్ ఓపెన్‌తో పునరాగమనం చేసిన నాదల్ ఇదే టోర్నీ డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సింగిల్స్‌లో మాత్రం శుభారంభంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్‌లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్‌రాజ్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. 50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్‌గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్‌లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్‌గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు. విజయ్ అమృత్‌రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్‌గా 15 టైటిళ్లు సాధించిన అమృత్‌రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్‌గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. -
అప్పుడు సెరెనా... ఇప్పుడు స్వియాటెక్!
పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. మహిళల టెన్నిస్ సంఘంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఆమె నిలిచింది. 22 ఏళ్ల స్వియాటెక్ 2023లో ఆరు టైటిళ్లను సాధించింది. గతంలో వరుసగా రెండేళ్లు, అంతకుమించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన రికార్డు అమెరికన్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పేరిట ఉంది. సెరెనా 2012 నుంచి నాలుగేళ్ల పాటు ఆ అవార్డు సాధించింది. -
టెన్నిస్ లెజెండ్‌కు క్యాన్సర్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం
అమెరికా టెన్నిస్ లెజెండ్, ఈస్పీఎన్ ఎనలిస్ట్ క్రిస్ ఎవర్ట్ మరోసారి క్యాన్సర్ బారిన పడింది. దీంతో జనవరిలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఈస్పీఎన్ నెట్వర్క్ కవరేజీకి ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ఈస్పీఎన్ సోషల్ మీడియా వేదికగా శనివారం వెల్లడించింది. ఆమె పేరిట ఓ నోట్‌ను ఈస్పీఎన్ నెట్వర్క్ పోస్ట్ చేసింది. కాగా అంతకుముందు 2022 జనవరిలో క్రిస్ ఎవర్ట్ అండాశయ క్యాన్సర్‌తో బాధపడింది. అయితే 11 నెలల తర్వాత ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలిపింది. కానీ 66 ఏళ్ల వయస్సులో మళ్లీ ఆమె క్యాన్సర్ బారిన పడడం అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది. ఆమె ఒక టెన్నిస్ లెజెండ్.. టెన్నిస్ చరిత్రలో క్రిస్ ఎవర్ట్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. క్రిస్ ఎవర్ట్ 1975 నుండి 1986 వరకు వరల్డ్ నెం1 లేదా రెండో ర్యాంక్‌లోనే కొనసాగింది. టెన్నిస్‌లో 1,000 సింగిల్స్ విజయాలను సాధించిన మొదటి టెన్నిస్ క్రీడాకారిణిగా ఎవర్ట్ నిలిచింది. 1995లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా ఎవర్ట్‌కు చోటు దక్కింది. క్రిస్ ఎవర్ట్ తన కెరీర్లో 18 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. A message from @ChrissieEvert Evert will not be part of ESPN's 2024 @AustralianOpen coverage pic.twitter.com/LKGmKDBNGU — ESPN PR (@ESPNPR) December 8, 2023 -
ఆ్రస్టేలియన్ ఓపెన్ బరిలో వొజ్నియాకి
ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ టెన్నిస్ స్టార్ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్‌లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడింది. -
పదేళ్ల తర్వాత కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో బోపన్న
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న పదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్ కు చేరుకున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఈ ప్రదర్శనతో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న మూడు స్థానాలు ఎగబాకాడు. 43 ఏళ్ల బోపన్న 2013లో చివరిసారి కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఏడు టోర్నీల్లో ఫైనల్ చేరి రెండింటిలో టైటిల్ నెగ్గి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. -
ATP Finals 2023: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. రింకీ హిజికాటా–జేసన్ కుబ్లెర్ (ఆ్రస్టేలియా) జంటతో బుధవారం జరిగిన రెడ్ గ్రూప్ రెండో లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–4తో గెలిచింది. ఈ విజయంతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ ఫైనల్స్ టోర్నీ చరిత్రలో మ్యాచ్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. నాలుగు జోడీలు ఉన్న రెడ్ గ్రూప్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్), బోపన్న–ఎబ్డెన్ జోడీలు చెరో విజయంతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు ఈ రెండు జోడీల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేత సెమీఫైనల్ చేరుకుంటుంది. సెమీస్‌లో సినెర్ ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రీన్ గ్రూప్ నుంచి యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో 7–6 (7/1), 4–6, 6–1తో హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచాడు. జొకోవిచ్‌తో మ్యాచ్‌లో హుర్కాజ్ ఒక సెట్ నెగ్గడంతో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సినెర్ గ్రీన్ గ్రూప్ నుంచి టాప్ లేదా రెండో స్థానంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖరారైంది. ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సినెర్ గుర్తింపు పొందాడు. సినెర్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో హోల్గర్ రూనె (డెన్మార్క్) గెలిస్తే మాత్రం జొకోవిచ్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు. సినెర్ విజయం సాధిస్తే జొకోవిచ్‌కు కూడా సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. మరోవైపు రెడ్ గ్రూప్ నుంచి మెద్వెదెవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. -
వరల్డ్ నంబర్ వన్‌కు షాక్
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)కు రెండో లీగ్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మెక్సికోలోని కాన్కున్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగూలా 6–4, 6–3తో సబలెంకాను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు సబలెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సబలెంకా, రిబాకినా (కజకిస్తాన్) మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది. -
వరల్డ్ నంబర్ వన్ సబలెంకా శుభారంభం
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి లీగ్ మ్యాచ్‌లో సబలెంకా 6–0, 6–1తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరో లీగ్ మ్యాచ్‌లో జెస్సికా పెగూలా (అమెరికా) 7–5, 6–2తో రిబాకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. -
యూకీ ఖాతాలో మూడో డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన బ్రెస్ట్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–జూలియన్ క్యాష్ (బ్రిటన్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో యూకీ–క్యాష్ జోడీ 6–7 (5/7), 6–3, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ గాలోవే (అమెరికా)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జంటను ఓడించింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. టైటిల్ నెగ్గిన యూకీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది యూకీ గిరోనా చాలెంజర్ టోర్నీ (స్పెయిన్), నొంతబురి (థాయ్‌లాండ్) చాలెంజర్ టోర్నీలో కూడా డబుల్స్ టైటిల్ సాధించాడు. -
భళా బోపన్న..! 43 ఏళ్ల వయస్సులో సత్తాచాటుతూ!
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్.. 43 ఏళ్ల 6 నెలల వయసులో ఒక ‘కుర్రాడు’ టెన్నిస్ కోర్టులో సత్తా చాటుతున్నాడు. అతని ఆట పార్ట్నర్ను కూడా అబ్బురపరుస్తోంది. చూస్తే మూడు పదులు ఇంకా దాటలేదేమో అనిపిస్తోంది. చివరకు అద్భుతమైన ఆటతో పార్ట్నర్తో కలసి అతను ఫైనల్‌కు చేరాడు. తద్వారా అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. అతనే రోహన్ బోపన్న. భారత టెన్నిస్‌కు సంబంధించి తనదైన ముద్ర వేసిన అతను.. పేస్–భూపతి ద్వయం తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికీ సత్తా చాటుతూ డబుల్స్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం వరుస పరాజయాలు బోపన్నను కలవరపరచాయి. ఒక ఏడాదైతే అప్పటికి అతను ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలయ్యాడు. సముద్రం ఒడ్డున నిలబడి అతను ‘నేను అసలు ఎందుకు ఆడుతున్నాను? ఎవరి కోసం ఆడుతున్నాను? కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోతున్నా. ఇంట్లో భార్యా, పసిపాపను వదిలి ప్రపంచమంతా తిరుగుతున్నాను. ఇక ఆటను ఆపేసి తిరిగి వెళ్లిపోతాను’ అంటూ రోదించాడు. కానీ ఆ తర్వాత అతనిలో పట్టుదల పెరిగింది. ఆపై విజయాలు నడిచొచ్చాయి. గత రెండేళ్లలో అతను తన కెరీర్లో అత్యుత్తమ దశను చూశాడు. ఇప్పుడు అదే గుర్తు చేస్తే ‘నేను ఇంకా ఎందుకు ఆడకూడదు? ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తా’ అంటూ సగర్వంగా చెప్పగలగడం అతని మారిన ఆటకు, దృక్పథానికి నిదర్శనం. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడినా.. 43 ఏళ్ల వయసులో కోర్టులో అతని ఆట, కదలికలు నభూతో అనిపించాయి. 2019లో మోకాలిలో మృదులాస్థి పూర్తిగా కోల్పోయి రోజుకు మూడు పెయిన్ కిల్లర్లపై ఆధారపడిన అతను ఇప్పుడు ఈ రకంగా చెలరేగడం బోపన్న పట్టుదలను, పోరాటాన్ని చూపిస్తోంది. తండ్రి అండతో ఆటలో అడుగులు.. కర్నాటకలోని కూర్గ్.. అందమైన కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడే ఎంజీ బోపన్న, మల్లిక నివాసం. వారి ఇద్దరు పిల్లల్లో రోహన్ ఒకడు. చిన్నతనంలో ఫుట్‌బాల్, హాకీలాంటి ఆటలను ఇష్టపడినా ఏదైనా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో తన కొడుకును తీర్చిదిద్దాలనేది అతని తండ్రి కోరిక. సరిగ్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ క్రీడాకారుడిని చేయడమే ఆయన ఆలోచన. దాంతో 11 ఏళ్ల రోహన్‌ను ఆయన టెన్నిస్ వైపు మళ్లించాడు. ఆ అబ్బాయి కూడా అంతే ఉత్సాహంగా ఆటకు సిద్ధమయ్యాడు. స్టార్ ప్లేయర్ మహేశ్ భూపతి తండ్రి సీజీ భూపతి బెంగళూరులో అప్పటికే గుర్తింపు పొందిన కోచ్. తన కుమారుడికి అతడే సరైన శిక్షకుడిగా భావించిన ఎంజీ బోపన్న వెంటనే అక్కడ చేర్పించాడు. ఆటలో ఓనమాలు నేర్చుకొని కొంత మెరుగైన తర్వాత సహజంగానే జూనియర్ స్థాయి పోటీల్లో రోహన్ సత్తా చాటడం మొదలుపెట్టాడు. నాలుగేళ్లు జాతీయ స్థాయిలో విజయాల తర్వాత సీనియర్ దశలోకి అతను ప్రవేశించాడు. ఆఫ్రో ఏషియన్ క్రీడలతో మొదలు.. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిర్వహించే వరుస టోర్నీల్లో పాల్గొంటూ తన ఆటకు పదును పెట్టుకున్న రోహన్ 23 ఏళ్ల వయసులో పూర్తి స్థాయి ప్రొఫెషనల్‌గా మారి సర్క్యూట్‌లోకి అడుగు పెట్టాడు. అయితే ఊహించినట్లుగానే చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. చాలా సందర్భాల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం రొటీన్‌గా మారిపోయింది. సింగిల్స్‌లో ఫలితాలు ఇలా రావడంతో మరో వైపు డబుల్స్‌పై కూడా బోపన్న దృష్టి పెట్టాడు. 2003లో హైదరాబాద్‌లో జరిగిన ఆఫ్రో ఏషియన్ క్రీడల్లో తన గురువు కొడుకు, తాను అభిమానించే మహేశ్ భూపతితో కలసి అతను డబుల్స్ బరిలోకి దిగాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాలు రెండింటిలోనూ స్వర్ణాలు గెలవడంతో అతనికి భారత టెన్నిస్ వర్గాల్లో తగిన గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ ఫ్యూచర్స్ టోర్నీలో ఆడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 26 ఏళ్ల వయసు.. సాధారణంగా టెన్నిస్ ప్రపంచంలో ఈ వయసు వచ్చేసరికే చాలా మంది ఆటగాళ్లు తమ సత్తాను ప్రదర్శించి ఒక స్థాయికి చేరుకొని ఉంటారు. ఆ వయసులో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఆడటం అంటే బాగా ఆలస్యమైనట్లే. కానీ బోపన్న కెరీర్‌కి సంబంధించి అదే కీలక మలుపు. 2006 గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో తొలిసారి రోహన్ బరిలోకి దిగాడు. క్వాలిఫయింగ్‌లో ఒక మ్యాచ్ గెలిచి మెయిన్ డ్రా వరకు చేరలేకపోయినా.. ఈ మేజర్ టోర్నీ అనుభవం అతనికి ఎంతో మేలు చేసింది. భారత డేవిస్ కప్ జట్టులో సభ్యుడిగా కూడా ఆడి దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తన తండ్రి కోరికనూ నెరవేర్చడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని రోహన్ ఒకసారి చెప్పుకున్నాడు. సింగిల్స్‌లో అప్పుడప్పుడూ మంచి ఫలితాలే వస్తున్నా పెద్ద విజయాలు లేకపోవడం రోహన్‌ను అసంతృప్తికి గురి చేస్తూ వచ్చింది. మరో వైపు తీవ్రమైన భుజం గాయంతో అతను కొంతకాలం బాధపడ్డాడు. కోలుకున్న తర్వాత అతను తీసుకున్న ఒక నిర్ణయం అతని కెరీర్‌ను ఇంత సుదీర్ఘంగా నిలబెట్టింది. 17 ఏళ్లుగా సర్క్యూట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. సింగిల్స్‌ను వదిలి డబుల్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేసింది. చదవండి: WC 2023: ఒకప్పుడు పసికూన.. ఇప్పుడు వరల్డ్‌క్లాస్ జట్లకు కూడా దడ పుట్టించగలదు -
పసిడి టెన్నిస్ శభాష్ స్క్వాష్...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత కొనసాగుతోంది. శనివారం కూడా నాలుగు వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి. స్క్వాష్ టీమ్ విభాగంలో, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో మన ఆటగాళ్లు పసిడి పంట పండించారు. షూటింగ్లో సాంప్రదాయం కొనసాగిస్తూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో రజతం మనకు దక్కింది. ఏకంగా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత అథ్లెట్లు 10 వేల మీటర్ల పరుగులో రజత, కాంస్యాలు అందించారు. వీటికి తోడు మహిళల టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ చాంపియన్ చైనాకు షాక్ ఇచ్చి మన ప్యాడ్లర్లు సంచలనం సృష్టించగా... బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో భారత బృందం తొలిసారి ఫైనల్ చేరింది. ఎప్పటిలాగే హాకీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా అదనపు ఆనందాన్ని అందించింది. పాకిస్తాన్‌ను పడగొట్టి... ఎనిమిదేళ్ల తర్వాత స్క్వాష్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో పాక్ చేతిలో ఓడిన సౌరవ్ ఘోషాల్ బృందం అసలు సమయంలో సత్తా చాటింది. పోరు 1–1తో సమంగా నిలిచిన తర్వాత భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత యువ ఆటగాడు అభయ్ సింగ్‌పై పడింది. లీగ్ దశలో తనపై విజయం సాధించిన నూర్ జమాన్‌తో అభయ్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఐదు గేమ్‌ల పోరులో చివరకు అభయ్ 11–7, 9–11, 8–11, 11–9, 12–10తో జమాన్‌ను ఓడించాడు. నాలుగో గేమ్‌లో ఒక దశలో జమాన్ 9–7లో ఆధిక్యం నిలవగా, ఐదో గేమ్‌లోనూ అతను 10–8తో విజయానికి చేరువయ్యాడు. కానీ అద్భుత పోరాటపటిమ కనబర్చిన అభయ్ రెండు సందర్భాల్లోనూ సత్తా చాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి పాయింట్ తర్వాత భారత జట్టు సభ్యులు భావోద్వేగంతో సంబరాలు చేసుకున్నారు. అంతకు ముందు తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఇక్బాల్ నసీర్ 11–8, 11–2, 11–3తో మహేశ్ మంగావ్కర్పై ఘన విజయం సాధించాడు. అయితే ఆరో సారి ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రెండో మ్యాచ్‌లో 11–5, 11–1, 11–3తో ముహమ్మద్ ఆసిమ్ ఖాన్‌ను చిత్తు చేసి స్కోరును సమం చేశాడు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత్ 2018 పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌఆసియా క్రీడలు ‘సిల్వర్’ సరబ్జోత్ – దివ్య భారత షూటర్ సరబ్జోత్ సింగ్ శనివారం తన 22వ పుట్టిన రోజున మరో ఆసియా క్రీడల పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మిక్సడ్ టీమ్ ఈవెంట్లో అతనికి రజతం దక్కింది. మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ – దివ్య టీఎస్ జోడి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకుంది. స్వర్ణ పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ జోడి జాంగ్ బోవెన్ – జియాంగ్ రాంగ్జిన్ 16–14 తేడాతో సరబ్జోత్ – దివ్యలను ఓడించింది. గురువారమే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన సరబ్జోత్ మరోసారి పసిడిపై గురి పెట్టినా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. దివ్యకు ఇది రెండో రజతం. తాజా ప్రదర్శన తర్వాత ఈ ఆసియా క్రీడల షూటింగ్లో భారత్ పతకాలు సంఖ్య 19కి చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. సత్తా చాటిన కార్తీక్, గుల్విర్ 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగులో భారత్‌కు చెందిన గులాబ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఐదు ఆసియా క్రీడలు జరిగినా ఈ లాంగ్ డిస్టెన్స్ ఈవెంట్లో మనకు మెడల్ దక్కలేదు. కానీ శనివారం ఆ లోటు తీరింది. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. రజత, కాంస్యాలు రెండూ మన అథ్లెట్లే గెలవడం విశేషం. కార్తీక్ కుమార్‌కు రజతం దక్కగా, గుల్విర్ సింగ్ కాంస్యం సాధించాడు. కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 28 నిమిషాల 17.21 సెకన్ల టైమింగ్‌తో గుల్వీర్ మూడో స్థానం సాధించాడు. వీరిద్దరికీ ఈ టైమింగ్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు కావడం గమనార్హం. ఈ ఈవెంట్లో బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను యమతావ్ (28 నిమిషాల 13.62 సెకన్లు) స్వర్ణపతకం గెలుచుకున్నాడు. మెరిసిన బోపన్న–రుతుజ ద్వయం ఆసియా క్రీడల టెన్నిస్ ఈవెంట్‌ను భారత్ రెండు పతకాలతో ముగించింది. శుక్రవారం భారత్‌కు పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం దక్కగా...శనివారం మన జట్టు ఖాతాలో పసిడి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి రోహన్ బోపన్న – రుతుజ భోస్లే ద్వయం ఈ ఘనత సాధించారు. పోటాపోటీగా సాగిన ఫైనల్లో బోపన్న – రుతుజ 2–6, 6–3, 10–4 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ హవో – షువో లియాంగ్‌పై విజయం సాధించారు. భారత్ స్వీయ తప్పిదాలతో భారత్ తొలి సెట్ కోల్పోయినా...ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శనతో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. రుతుజ పేలవ సర్వీస్‌తో పాటు లియాంగ్ చక్కటి రిటర్న్‌లతో తైపీ 5–1తో దూసుకుపోయింది. ఏడో గేమ్‌లో బోపన్న ఎంత ప్రయత్ని0చినా లాభం లేకపోయింది. అయితే రెండో సెట్లో రుతుజ ఆట మెరుగవడంతో పరిస్థితి మారిపోయింది. బోపన్న సర్వీస్‌తో సెట్ మన ఖాతాలో చేరగా...మూడో సెట్ సూపర్ టైబ్రేక్‌కు చేరింది. ఇక్కడా భారత జోడి చక్కటి ఆటతో ముందుగా 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఆపై దానిని నిలబెట్టుకుంది. బోపన్నకు ఇది రెండో ఆసియా క్రీడల స్వర్ణం కాగా, రుదుజకు మొదటిది. -
సాకేత్ జోడీకి పతకం ఖాయం
ఆసియా క్రీడల టెన్నిస్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (10/8)తో జిజెన్ జాంగ్–యిబింగ్ వు (చైనా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కానుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్‌లో రజతం, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సుమిత్ నగాల్ 7–6 (7/3), 1–6, 2–6తో టాప్ సీడ్ జిజెన్ జాంగ్ (చైనా) చేతిలో, అంకిత రైనా 6–3, 4–6, 4–6తో హరూకా కాజి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
‘నా అకౌంట్లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్ స్టార్ ఆవేదన
న్యూఢిల్లీ: అతను భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు... ఏడాది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏటీపీ టోర్నీలలో పాల్గొంటున్నాడు. టోర్నీల్లో ప్రదర్శనకు ప్రైజ్‌మనీ కూడా దక్కుతుంది. మామూలుగా అయితే టెన్నిస్ ఆటగాళ్లు బాగా డబ్బున్నవాళ్లు అయి ఉంటారని, ఏ స్థాయిలో ఆడినా విలాసవంతమైన జీవితం ఉంటుందనిపిస్తుంది. కానీ ప్రపంచ టెన్నిస్‌లో వాస్తవ పరిస్థితి వేరు. అది ఎంత ఖరీదైందో... అగ్రశ్రేణి స్టార్లు తప్ప 100 కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల స్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పేందుకు ఇది చక్కటి ఉదాహరణ! భారత్‌కు చెందిన ప్రపంచ 159వ ర్యాంకర్ సుమీత్ నగాల్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తన బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు 900 యూరోలు (సుమారు రూ. 80 వేలు) మాత్రమే ఉన్నాయని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రైజ్‌మనీల ద్వారా వచ్చిన డబ్బు, ఐఓసీఎల్ కంపెనీ జీతం, మహా టెన్నిస్ ఫౌండేషన్ ఇచ్చే ఆర్థిక సహాయం మొత్తం టెన్నిస్‌లోనే పెడు తున్నానని, అయినా సరే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని వెల్లడించాడు. డబ్బులు లేకపోవడంతో ఫిజియో కూడా లేకుండా ఒకే ఒక కోచ్‌తో తాను పోటీల్లో పాల్గొంటున్నానని అన్నాడు. టెన్నిస్ సర్క్యూట్లో నిలకడగా ఆడుతూ టాప్–100లో చేరాలంటే ఏడాదికి కనీసం రూ. 1 కోటి ఖర్చు అవుతుందని నగాల్ చెప్పాడు. ‘కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ భారత నంబర్‌వన్‌గా ఉన్నా నాకు కనీస మద్దతు కరువైంది. ప్రభుత్వం ‘టాప్స్’ పథకంలో నా పేరు చేర్చలేదు. డబ్బులు లేక జర్మనీలోనే టెన్నిస్ అకాడమీలో శిక్షణకు దూరమయ్యాను. నేను గాయపడి ఆటకు దూరమైనపుడు అసలు ఎవరూ నన్ను పట్టించుకోలేదు. రెండుసార్లు కోవిడ్ రావడంతో ర్యాంక్ పడిపోయింది. మన దేశంలో ఆర్థికంగా మద్దతు లభించడం చాలా కష్టం. నా వద్ద ఉన్న డబ్బంతా ఆటకే పెడుతున్నా. గత రెండేళ్లలో ఏమీ సంపాదించలేదు. నేనేమీ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉండటం లేదు. అన్నీ కనీస అవసరాలే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పూర్తిగా చేతులెత్తేశాను’ అని నగాల్ తన బాధను చెప్పుకున్నాడు. -
హాలెప్‌పై నాలుగేళ్ల నిషేధం
లండన్: డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు... రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. 31 ఏళ్ల హాలెప్ 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై 2022 అక్టోబర్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఐటీఐఏ ప్యానెల్ విచారణలో హాలెప్ ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ నియమావళిని ఉల్లంఘించిందని తేలింది. దాంతో ఆమెపై నిషేధాన్ని అక్టోబర్ 2026 వరకు పొడిగించారు. 2017లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన హాలెప్ రెండు గ్రాండ్‌స్లామ్ (2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్) సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరోవైపు ఐటీఐఏ విధించిన నిషేధాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో సవాలు చేస్తానని హాలెప్ తెలిపింది. -
చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్
టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు. Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8 — Bleacher Report (@BleacherReport) August 21, 2023 3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది. One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6 — Tennis TV (@TennisTV) August 20, 2023 ఈ మ్యాచ్‌లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు. -
సంచలనాల 'అల్కరాజ్'.. 'ఆల్‌టైమ్ గ్రేట్' లక్షణాలు పుష్కలంగా
ఏడాది క్రితం.. స్పెయిన్‌లో మాడ్రిడ్ ఓపెన్.. కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్లే కోర్టుపై అప్పటికే అతను చెప్పుకోదగ్గ విజయాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. క్వార్టర్స్ సమరంలో ప్రత్యర్థి ఎవరో తెలియగానే అతను భావోద్వేగానికి గురయ్యాడు. దిగ్గజ ఆటగాడు, తాను ఆరాధించే, అభిమానించే రాఫెల్ నాదల్ ఎదురుగా ఉన్నాడు. ఇద్దరు స్పెయిన్ స్టార్ల మధ్య వారి సొంతగడ్డపై పోరు అనగానే ఆ మ్యాచ్‌కు ఎక్కడ లేని ఆకర్షణ వచ్చింది. చివరకు నాదల్‌పై సంచలన విజయంతో తన 19వ పుట్టిన రోజున అల్కరాజ్ తనకు తానే కానుక ఇచ్చుకున్నాడు. అతను అంతటితో ఆగలేదు. సెమీస్‌లో జొకోవిచ్‌నూ మట్టికరిపించి ఒకే క్లే కోర్టు టోర్నీలో ఆ ఇద్దరినీ ఓడించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అక్కడే అతను ఏమిటో ప్రపంచానికి తెలిసింది. భవిష్యత్తులో సాధించబోయే ఘనతలకు అది సూచిక అయింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో వింబుల్డన్ గెలవడం, వరల్డ్ నంబర్ వన్ కావడం తన కల అని చెప్పుకున్నాడు. క్లే కోర్టు వేదిక ఫ్రెంచ్ ఓపెన్ చాలా ఇష్టమైనా, వింబుల్డన్‌కు ఉండే ప్రత్యేకత వేరని అన్నాడు. 17 ఏళ్ల వయసులో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతలన్నీ సాధిస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. నాదల్ దేశం నుంచి వచ్చి.. నాదల్ తరహాలోనే బలమైన షాట్లు ఆడుతూ, అతనిలాగే క్లే కోర్టును ఇష్టపడే అల్కరాజ్ను అందరూ నాదల్కు సరైన వారసుడిగా గుర్తించారు. బేబీ నాదల్ అంటూ పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం వింబుల్డన్ గ్రాస్ కోర్టుల్లో ఫెడరర్‌తో కలసి ప్రాక్టీస్ చేసిన అతను ఇప్పుడు అదే వింబుల్డన్‌ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించాడు. అసాధారణంగా.. సమకాలీన టెన్నిస్‌లో అల్కరాజ్ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. తండ్రి గొన్జాలెజ్ అల్కరాజ్ మాజీ టెన్నిస్ ఆటగాడు. ఒకప్పుడు స్పెయిన్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. సహజంగానే తండ్రి వల్లే అతనికి ఆటపై ఆసక్తి పెరిగింది. ముర్షియా పట్టణంలో గొన్జాలెజ్ ఒక టెన్నిస్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు అల్కరాజ్. సహజ ప్రతిభ ఉన్న అతను ఆటలో వేగంగా దూసుకుపోయాడు. దిగువ స్థాయి జూనియర్ టోర్నీలలో అతను రెగ్యులర్‌గా ఆడాల్సిన అవసరమే లేకపోయింది. 15 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌గా మారి వరుస విజయాలు సాధించడంతో సర్క్యూట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ విజేత యువాన్ కార్లోస్ ఫెరీరోను కోచ్‌గా పెట్టుకోవడం అతని కెరీర్లో కీలక మలుపు. ముడి పదార్థంలా ఉన్న అల్కరాజ్ను ఫెరీరో మెరిసే బంగారంగా తీర్చిదిద్ది.. అద్భుతమైన అతని ఆటలో తన వంతు పాత్ర పోషించాడు. అన్నీ సంచలనాలే.. ఏటీపీ టూర్లో అల్కరాజ్ ఎన్నో అరుదైన విజయాలు అందుకున్నాడు. వీటిలో ఎక్కువ భాగం పిన్న వయస్సులోనే సాధించిన ఘనతలుగా గుర్తింపు పొందాయి. టీనేజర్‌గా ఉండగానే 9 టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించాడు. ఏటీపీ 500 స్థాయి టోర్నీ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను సాధించిన మూడో పిన్న వయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. తనపై ఉన్న అంచనాలను అతను ఎప్పుడూ వమ్ము చేయలేదు. వాటికి అనుగుణంగా తన ఆటను మెరుగుపరచుకుంటూ, తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు. అతని కెరీర్లో అన్నింటికంటే అత్యుత్తమ క్షణం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానాన్ని పొందడం! వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన చిన్న వయస్కుడిగా, మొదటి టీనేజర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. ఈ మైలురాయిని దాటాక అతని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. కేవలం అతని ఆట, అతను సాధించబోయే టైటిల్స్‌పైనే అందరి చూపులు నిలిచాయి. గ్రాండ్‌గా విజయాలు.. 17 ఏళ్ల వయసులో తొలిసారి అల్కరాజ్ వింబుల్డన్ బరిలోకి దిగాడు. ఇదే అతనికి మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. అయితే క్వాలిఫయింగ్ దశను అధిగమించలేకపోయాడు. తర్వాత ఏడాదికే యూఎస్ ఓపెన్‌లో ఏకంగా క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాడు. 1963 తర్వాత ఎవరూ 18 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించలేకపోవడం అతని విజయం విలువను చూపించింది. 2022లో తనకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు చేరిన అల్కరాజ్ ఏడాది చివరికల్లా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకొని మొదటిసారి అతను మేజర్ విజయాన్ని చవి చూశాడు. అప్పటికే వరల్డ్ నంబర్ వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్కరాజ్ అదే స్థానంతో ఏడాదిని ముగించాడు. అనూహ్య గాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరం చేయగా.. గాయం కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లోనూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మళ్లీ రివ్వున పైకి ఎగిశాడు. పూర్తి ఫిట్నెస్ను సాధించిన తర్వాత గ్రాస్ కోర్టు టోర్నీ క్వీన్స్ క్లబ్ విజేతగా.. వింబుల్డన్‌పై గురి పెట్టాడు. గ్రాస్ కోర్టుపై తన ఆట కాస్త బలహీనం అని తాను స్వయంగా చెప్పుకున్నా.. పట్టుదల ఉంటే ఎక్కడైనా గెలవొచ్చని ఈ స్పెయిన్ కుర్రాడు నిరూపించాడు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన తీరు కొత్త శకానికి నాంది పలికింది. గత రెండు దశాబ్దాల్లో ముగ్గురు దిగ్గజాలు మాత్రమే శాసించిన వింబుల్డన్‌ను గెలుచుకొని తాను టెన్నిస్‌ను ఏలడానికి వచ్చానని సూత్రప్రాయంగా చెప్పాడు. పదునైన ఆటతో.. అల్కరాజ్ ఆటలోకి వచ్చినప్పుడు అతను క్లే కోర్టు స్పెషలిస్ట్ మాత్రమే అన్నారు. అతను ఆరంభంలో అతను సాధించిన టైటిల్స్, నాదల్ వారసుడిగా వచ్చిన గుర్తింపు ఒక్క సర్ఫేస్కే పరిమితం చేసేలా కనిపించింది. కానీ ఏడాది తిరిగే లోపే అది తప్పని నిరూపించాడు. తొలి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ హార్డ్ కోర్టు కాగా, ఇప్పుడు సాధించిన వింబుల్డన్ గ్రాస్ కోర్టు. ఇక క్లే కోర్టులో ఫ్రెంచ్ ఓపెన్ బాకీ ఉంది. దాన్ని సాధించేందుకూ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇప్పుడతను ఆల్‌రౌండ్ ప్లేయర్. పదునైన ఫోర్హ్యండ్ అతని ప్రధాన బలం. అతని డ్రాప్ షాట్లు నిజంగా సూపర్. ఆ షాట్ బలమేమిటో తాజాగా వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ రుచి చూశాడు. ఫిట్నెస్, ఫుట్ స్పీడ్, దృఢమైన శరీరంతో అతను యువ నాదల్‌ను గుర్తుకు తెస్తున్నాడు. అల్కరాజ్ ఇప్పటికే తన ఆటతో ప్రపంచ టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోనే జీవితకాలం సంతృప్తి పొందే ఆటగాళ్లతో పోలిస్తే రెండు పదుల వయసులోనే అతను రెండు గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. మున్ముందు గాయాల బారిన పడకపోతే పెద్ద సంఖ్యలో టైటిల్స్ అతని ఖాతాలో చేరడం ఖాయం. 2021లో క్రొయేషియా ఓపెన్ గెలిచి తన తొలి ట్రోఫీని అందుకున్న అల్కరాజ్ తర్వాతి ఏడాది వచ్చేసరికి 5 టైటిల్స్ గెలిచాడు. 2023లో ఇప్పటికే 6 టైటిల్స్ అతని ఖాతాలో చేరాయంటే అతను ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో అర్థమవుతోంది. ముగ్గురు దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ తర్వాత టెన్నిస్‌ను శాసించగల ఆటగాడిగా అతని పేరు ముందుకొచ్చేసింది. దాంతో సహజంగానే ఎండార్స్మెంట్లు, బ్రాండ్లు అతని వెంట పడ్తున్నాయి. ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కంపెనీలు నైకీ, బబోలట్, రోలెక్స్, ఎల్పోజో, బీఎండబ్ల్యూ, కెల్విన్ క్లీన్, లూయీ విటాన్ అతనితో జత కట్టాయి. ఆటలో ఇదే జోరు కొనసాగిస్తే అల్కరాజ్ ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలవడం ఖాయం. చదవండి: #StuartBroad: రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్ క్రికెట్లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు, 48 పరుగులు! వీడియో వైరల్ -
జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు
సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో మెరిశాడు. అయితే ఇటీవలే వింబుల్డన్ ఫైనల్లో అల్కారాజ్ చేతిలో అనూహ్యంగా ఓడినప్పటికి మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కొట్టే సత్తా జొకోవిచ్‌కు ఇంకా ఉంది. ఇప్పటికే 23 టైటిల్స్‌తో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. ఆగస్టులో యూఎస్ ఓపెన్ జరగనున్న నేపథ్యంలో జొకోవిచ్ దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ను ఇప్పటికే మొదలుపెట్టాడు. తాజాగా జకోవిచ్ తండ్రి స్ర్ద్జన్ జకోవిచ్ అతని కొడుకు రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జకోవిచ్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పే అవకాశముందని తెలిపాడు. ''టెన్నిస్ ఆట అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో సవాల్‌తో కూడినది. అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంతో, జీవితంలో ఇతర పనులు చేసేందుకు అతడికి సమయం ఉండడం లేదు. టెన్నిస్ అనేది జకోవిచ్ జీవితంలో ఓ భాగం. అంతేకానీ, అదే జీవితం'' కాదంటూ పేర్కొన్నాడు. జకోవిచ్ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తతో అతడి అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. చదవండి: WI Vs IND 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. అనిరుధ్–ప్రశాంత్ 6–4, 6–3తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు. -
గ్రాండ్‌స్లామ్ టైటిళ్లే కాదు జరిమానా పొందడంలోనూ రికార్డే
24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న నొవాక్ జొకోవిచ్ కలను చెరిపేశాడు స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. కొదమ సింహాల్లా తలపడిన ఇద్దరిలో ఎవరు తేలిగ్గా ఓడిపోయేందుకు ఒప్పుకోలేదు. అయితే తొలి సెట్ ఓడినప్పటికి రెండు, మూడు సెట్లు గెలిచి ఆధిక్యంలోకి వచ్చిన అల్కరాజ్ ఇక ఈజీగా చాంపియన్ అవుతాడని అంతా ఊహించారు. కానీ జొకోవిచ్ నాలుగో సెట్లో ప్రతిఘటించడంతో పాటు సెట్‌ను గెలుచుకొని రేసులోకి వచ్చాడు. అయితే కుర్రాడి కదలికల ముందు జొకోవిచ్ అనుభవం పనికిరాలేదు. ఐదో సెట్లో పోరాడినప్పటికి అల్కరాజ్ దూకుడు ముందు ఓడిపోవాల్సి వచ్చింది. తాజాగా వింబుల్డన్ ఫైనల్ సందర్భంగా టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టినందుకు గానూ జొకోవిచ్‌కు భారీ జరిమానా పడింది. ఐదో సెట్లో భాగంగా అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసిన జొకోవిచ్.. కాసేపటికే తన సర్వీస్‌ను కోల్పోయాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకొని కోపంతో రాకెట్‌ను నెట్పోస్ట్కు బలంగా విసిరికొట్టాడు. దీంతో రాకెట్ రెండు ముక్కలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా గమనించిన అంపైర్ ఫెర్గూస్ ముర్ఫీ జొకోవిచ్‌కు ఫీల్డ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం సెర్బియా స్టార్‌కు 8వేల అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 6లక్షల 50వేలు) జరిమానా విధించారు. కాగా టెన్నిస్‌లో 2023 ఏడాదిలో జొకోవిచ్‌కు విధించిన జరిమానా ఇప్పటివరకు అత్యధికమని చెప్పొచ్చు. RACQUET SMASH: Novak Djokovic was unable to keep his cool as his long reign at Wimbledon was brought to an end by Spaniard Carlos Alcaraz in an epic men's singles final. 🎾 #9News HIGHLIGHTS: https://t.co/AxhB6GIW6R pic.twitter.com/QKZZCpmZld — 9News Australia (@9NewsAUS) July 17, 2023 చదవండి: 'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి' రెక్కలు కట్టుకు తిరుగుతున్న రషీద్ ఖాన్.. ఎక్కడ చూసినా అతడే..! -
అల్కరాజ్ అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా?
దశాద్దం కిందట పురుషుల టెన్నిస్‌లో ఎక్కువగా వినిపించిన పేర్లు ముగ్గురివే. స్విజ్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్.. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్.. గత పదేళ్లలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఎగురేసుకుపోయేవారు. మధ్యలో ముర్రే, డానిల్ మెద్వెదెవ్, కాస్పర్ రూడ్ సహా చాలా మంది స్టార్లు వచ్చినా ఎవరు ఈ త్రయం ముందు నిలబడలేకపోయారు. కానీ రెండేళ్లుగా టెన్నిస్‌లో ఒక పేరు మార్మోగిపోతుంది. అతనే స్పెయిన్ నుంచి వచ్చిన యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్. ప్రస్తుతం వరల్డ్ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కరాజ్ రాబోయే రోజుల్లో టెన్నిస్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. ఫెదరర్, నాదల్, జొకోవిచ్‌ల తర్వాత టెన్నిస్ ఏలే రారాజులా కనిపిస్తున్నాడు. 20 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న అల్కరాజ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2022లో యూఎస్ ఓపెన్ గ్గిన అల్కరాజ్.. తాజాగా 2023లో వింబుల్డన్ నెగ్గి కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సాధించాడు. వింబుల్డన్‌లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కలను అల్కరాజ్ చెరిపేశాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అల్కరాజ్ ప్రేమించడంలోనూ దూసుకెళ్తున్నాడు. తన దేశానికే చెందిన టెన్నిస్ ప్లేయర్ మారియా గొంజాలెజ్ గిమినేజ్తో అల్కరాజ్ ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ ఇద్దరి మధ్య రిలేషన్ ప్రస్తుతం సీక్రెట్‌గా కొనసాగుతున్నా.. ఇటీవల కార్లోస్ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు కొన్ని డౌట్స్ క్రియేట్ చేసింది. మారియాను కిస్ ఇస్తున్న ఫోటోను అల్కరాజ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని టెన్నిస్ అభిమానులు డిసైడ్ అయిపోయారు. 20 ఏళ్ల అల్కరాజ్ కొన్నాళ్ల నుంచి డేటింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మారియా కూడా ముర్సియా క్లబ్ తరపునే టెన్నిస్ ఆడుతుంది. అల్కరాజ్ తన కెరీర్లో ఇప్పటికే 12 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ గెలిచాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ సొంతం చేసుకున్నాడు. నాలుగు మాస్టర్స్ టైటిళ్లను కూడా అతను కైవసం చేసుకున్నాడు. జోకోవిచ్ ప్రాక్టీసు మ్యాచ్‌లను వీడియో తీసిన వివాదంలో అల్కరాజ్ ఇరుక్కున్నా.. వింబుల్డన్ ఫైనల్లో అతనే ఓడించడం గమనార్హం. -
బోపన్న జోడి ఓటమి.. ఫైనల్లో జబర్, వొండ్రుసోవా
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆన్స్ జబర్ (ట్యునీషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జబర్ 6–7 (5/7), 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది. ఫైనల్ శనివారం జరుగుతుంది. జబర్‌తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా ఏకంగా 45 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన స్వితోలినా సెమీఫైనల్లో మాత్రం తడబడింది. ఒక్కఏస్ కూడా కొట్టలేకపోయిన స్వితోలినా నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచింది. బోపన్న జోడీ ఓటమి పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 5–7, 4–6తో టాప్ సీడ్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ని్రష్కమించిన బోపన్న జోడీకి లక్షా 50 వేల పౌండ్లు (రూ. కోటీ 61 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్ (రష్యా)తో అల్కరాజ్ (స్పెయిన్) తలపడతారు. ఈ మ్యాచ్‌లను సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. చదవండి: #KylianMbappe: ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్' జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!'
టెన్నిస్‌లో ప్రస్తుతం కార్లోస్ అల్కారాజ్ ఒక సంచలనం. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్న అల్కారాజ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టాడు. బుధవారం హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అల్కారాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో గెలుపొందాడు. ఇక శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); డానిల్ మెద్వెదెవ్‌తో అల్కారాజ్ తలపడనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్, అల్కారాజ్ల మధ్య ఆసక్తికర పోరు చూసే అవకాశముంది. ఈ విషయం పక్కనబెడితే కార్లోస్ అల్కారాజ్ తండ్రికి టెన్నిస్ అంటే ప్రాణం. అయితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సందర్భంగా మ్యాచ్‌లను చూడడానికి వచ్చిన అల్కారాజ్ తండ్రి.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రాక్టీస్ వీడియోనూ ఫోన్లో బంధించాడు. అయితే తన కొడుక్కి జొకోవిచ్ ఆటను చూపించడం కోసమే అతను ఈ పని చేశాడని కొంతమంది అభిమానులు ఆరోపించారు. అల్కారాజ్‌కు సహాయం చేసేందుకే ఇలా చేశాడని పేర్కొన్నారు. దీనిని అల్కారాజ్ ఖండించాడు. ఒక్క వీడియో చూడడం వల్ల తనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదన్నాడు. ''మా నాన్నకు వ్యక్తిగతంగా టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఎక్కువ సమయాన్ని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్‌లోనే గడుపుతారు. అక్కడే కదా నెంబర్ వన్ నుంచి టాప్-20 ర్యాంకింగ్ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేది. వాళ్లందరి ప్రాక్టీస్‌ను గమనిస్తూనే ఫోన్లో వీడియోలు తీసుకొని సంతోషపడడం ఆయనకు అలవాటు. ఇక జొకోవిచ్ ఆటతీరు అంటే నాన్నకు చాలా ఇష్టం. రియల్ లైఫ్‌లో నేను జొకోవిచ్‌తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంలో నాన్న జొకోవిచ్‌కే సపోర్ట్ చేయడం చూశాను. అందుకే జొకో ఎక్కడ కనిపించినా ఆయన ఫోటోలను, ఆటను తన ఫోన్ కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. అందుకే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. మరి మీ నాన్న జొకోవిచ్ ఆటను కెమెరాలో బంధించారు. ఫైనల్లో చాన్స్ ఉంటే తలపడే మీకు ఇది అడ్వాంటేజ్ కానుందా అని అడగ్గా.. దీనిపై అల్కారాజ్ స్పందిస్తూ.. ''నాకు పెద్దగా ఒరిగేదేం లేదు.. దీనర్థం ఏంటంటే.. జొకోవిచ్ ఆటకు సంబంధించిన వీడియాలు ప్రతీ ప్లాట్ఫామ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.'' అంటూ తెలిపాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) చదవండి: T10 League: బ్యాట్ పట్టనున్న టీమిండియా మాజీ స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే Wimbledon 2023: సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్! -
సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 7–5, 6–2తో టాలన్ గ్రీక్స్పూర్–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 2015 తర్వాత వింబుల్డన్ టోర్నీలో బోపన్న డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్ ఆన్స్ జబర్, ఎలీనా రిబాకినా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరించనుంది. ట్యునిషియా క్రీడాకారిణి, ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆన్స్ జబర్ ధాటికి డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ ఆన్స్ జబర్ 6–7 (5/7), 6–4, 6–1తో రిబాకినాను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జబర్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచి విజయం దక్కించుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన జబర్ నెట్ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు రిబాకినా 22 సార్లు నెట్ వద్దకు వచ్చి 10 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గింది. 35 విన్నర్స్ కొట్టిన జబర్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రిబాకినా 20 అనవసర తప్పిదాలు చేసింది. సెమీస్‌కు చేరుకున్న సబలెంకా మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) అలవోక విజయంతో రెండోసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–2, 6–4తో 25వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. రెండో సెట్లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడినా ఆందోళన చెందకుండా పట్టుదలతో ఆడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్)తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్); ఆన్స్ జబర్‌తో సబలెంకా తలపడతారు. సెమీస్‌లో ప్రవేశించిన సబలెంకా, అల్కారాజ్ తొలిసారి సెమీస్‌లోకి అల్కరాజ్, మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 6–4, 1–6, 4–6, 7–6 (7/4), 6–1తో క్రిస్టోఫర్ యుబాంక్స్ (అమెరికా)పై, అల్కరాజ్ 7–6 (7/3), 6–4, 6–4తో ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్‌తో అల్కరాజ్ ఆడతారు. Welcome back to the semi-finals, @SabalenkaA 👏 The No.2 seed powerfully gets past Madison Keys in straight sets, 6-2, 6-4#Wimbledon pic.twitter.com/tPuQdJzmoc — Wimbledon (@Wimbledon) July 12, 2023 చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన #NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం -
46వసారి సెమీస్‌లో.. ఫెదరర్ రికార్డు సమం
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 12వసారి వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–4, 6–3తో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 46వసారి జోకొవిచ్ సెమీస్ చేరడం విశేషం. ఈ క్రమంలో అతడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు. ఇప్పటికే వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ మరో టైటిల్ కు చేరవవుతున్నాడు. ప్రస్తుతం జోకొవిచ్ ఖాతాలో ఏడు వింబుల్డన్ టైటిల్స్ ఉండగా మరొక్కటి గెలిస్తే 8వ టైటిల్ తో ఫెదరర్ సరసన నిలుస్తాడు. ఇక టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ పురుషుల విభాగంలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మధ్యే అతడు ఫ్రెండ్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఈ టైటిల్‌తో అతడు రఫేల్ నాదల్‌ను వెనక్కి నెట్టాడు. ఫెదరర్ ఖాతాలో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఒకవేళ జొకోవిచ్ వింబుల్డన్ గెలిస్తే 24వ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలుస్తాడు. జొకోవిచ్ శుక్రవారం అతడు సిన్నర్ తో సెమీఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోకొవిచ్.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి 1969లోరాడ్ లేవర్ తర్వాత తొలి కేలండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. చదవండి: WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్‌షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.