సిడ్నీ: తొలిసారి నిర్వహించిన మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ టోర్నీ యునైటెడ్ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ) జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ మ్యాచ్‌ల ఫైనల్లో అమెరికా 4–0తో ఇటలీపై గెలిచింది. మహిళల తొలి సింగిల్స్‌లో జెస్సికా పెగూలా 6–4, 6–2తో మార్టినా ట్రెవిసాన్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో టియాఫో 6–2తో తొలి సెట్ గెలిచాక అతని ప్రత్యర్థి లోరెంజో ముసెట్టి గాయంతో వైదొలిగాడు.
దాంతో అమెరికా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సింగిల్స్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/4), 7–6 (9/7)తో ప్రపంచ 16వ ర్యాంకర్ బెరెటినిని ఓడించడంతో అమెరికాకు టైటిల్ ఖరారైంది. నామమాత్రపు నాలుగో సింగిల్స్‌లో మాడిసన్ కీస్ 6–3, 6–2తో లూసియాపై నెగ్గి అమెరికా ఆధిక్యాన్ని 4–0కు పెంచింది. ఫలితం తేలిపోవడంతో డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ టోర్నీలో మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment