Mixed Team Event
-
Olympics: చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జోడీ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ మరో పతకానికి చేరువైంది. మిక్స్డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీసెమీ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్లో స్పానిష్ జంట కనాలెస్- గొంజాలెజ్‌పై విజయం సాధించింది. ఆద్యంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి స్పెయిన్ ద్వయాన్ని 5-3తో ఓడించి జయభేరి మోగించింది.తద్వారా ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత తొలి ఆర్చరీ జోడీగా చరిత్ర సృష్టించింది. మరో క్వార్టర్స్ పోరులో సౌత్ కొరియా జంట.. ఇటలీపై గెలుపొందింది. ఈ క్రమంలో భారత్- సౌత్ కొరియా జట్ల మధ్య సెమీ ఫైనల్ పోటీ మొదలుకానుంది.కాంస్య పతక పోరులో భారత్ ఓటమిమిక్స్డ్ ఆర్చరీ టీమ్ కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీ ఓటమి పాలైంది. యునైటెడ్ స్టేట్స్ బ్రాడీ-కేసీ జంట చేతిలో6-2 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది. సెమీస్‌లో ఓటమి.. కాంస్య పతకపోరుకు మనోళ్లుసెమీ ఫైనల్లో సౌత్ కొరియా జోడీ లిమ్- కిమ్ జోడీ చేతిలో ధీరజ్- అంకిత ఓడిపోయారు. 6-2తో పరాజయం పాలై స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అయితే, కాంస్య పతకం కోసం అమెరికాతో తలపడతారు. ఇక సౌత్ కొరియాతో పాటు జర్మనీ ఫైనల్‌కు చేరింది.ఇప్పటికి మూడు పతకాలుప్యారిస్లో ఇప్పటికే భారత్ మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్, స్వప్నిల్ కుసాలే.. టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ.. సరబ్‌జోత్‌తో కలిసి ఇదే విభాగంలో టీమ్ మెడల్(కాంస్యం), స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన.. మనూ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి మూడో పతకానికి గురిపెట్టింది. -
Olympics: షూటింగ్ జోడీలు విఫలం.. పతక రేసు నుంచి అవుట్
Paris Olympics 2024 Day 1: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత షూటర్ల బృందానికి శుభారంభం లభించలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ మెడల్ ఈవెంట్లో మన షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. అర్జున్ బబూటా–రమితా జిందాల్, సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జంట ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి. ఫలితంగా ఈ ఈవెంట్లో భారత్ పతక రేసు నుంచి నిష్క్రమించింది.ఇక ఈ పోటీలో రమితా- అర్జున్ జోడీ ఓవరాల్‌గా 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా.. ఇలవేనిల్- సందీప్ ద్వయం 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పడిపోయింది.నిబంధనల ప్రకారం.. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–4లో నిలిచిన నాలుగు జోడీలు మాత్రమే పసిడి, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడే అర్హత సాధిస్తాయి. అయితే, భారత షూటింగ్ జోడీలు ఈ అడ్డంకిని దాటలేకపోయాయి. చైనా, కొరియా, కజకిస్తాన్, జర్మనీ టాప్-4లో నిలిచాయి.గోల్డ్ మెడల్ రౌండ్లో చైనా- కొరియాఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ మెడల్ ఈవెంట్.. గోల్డ్ మెడల్ రౌండ్లో చైనా- కొరియా అమీతుమీ తేల్చుకోనుండగా.. కాంస్య పతక పోరులో కజకిస్తాన్ జర్మనీతో తలపడనుంది. ఇదిలా ఉంటే.. తదుపరి పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది.భారత్ నుంచి అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో.. మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం గం. 4 నుంచి) మహిళ విభాగంలో పోటీపడనున్నారు.రోయింగ్‌లో మరో అవకాశంఇండియన్ రోవర్ బాల్‌రాజ్ పన్వార్‌కు కూడా తొలిరోజు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెన్స్ వ్యక్తిగత స్కల్స్ హీట్ 1లో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే, ప్రతి హీట్ నుంచి టాప్-3 మాత్రమే ఆటోమేటిక్‌గా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో తొలి ప్రయత్నంలో బాల్‌రాజ్‌కు నిరాశే మిగిలినా.. రేపెచెజ్ రౌండ్ రూపంలో సెమీ ఫైనల్ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి. చదవండి: ఆర్చరీలో అదరగొట్టి.. క్వార్టర్ ఫైనల్లో -
ఇషా–శివ జోడీకి స్వర్ణం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన ఇషా సింగ్... హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10తో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) ద్వయంపై విజయం సాధించారు. ఫైనల్‌ను మొత్తం 13 రౌండ్లపాటు నిర్వహించారు. ఒక్కో రౌండ్లో ఇరు జట్ల షూటర్లు రెండేసి షాట్లు లక్ష్యం దిశగా సంధిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన జోడీకి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. భారత జోడీ ఎనిమిది రౌండ్లలో నెగ్గగా, తుర్కియే జంట ఐదు రౌండ్లలో గెలిచింది. అంతకుముందు 65 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్–శివా నర్వాల్ ద్వయం 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో... తర్హాన్–యూసుఫ్ జోడీ 581 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. 580 పాయింట్లతో జియాంగ్ రాన్‌జిన్–జాంగ్ బౌవెన్ (చైనా), హనియె–సాజద్ (ఇరాన్) జంటలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందాయి. కాంస్య పతక మ్యాచ్‌లో రాన్‌జిన్–జాంగ్ బౌవెన్ ద్వయం 17–7తో హనియె–సాజద్ జంటను ఓడించింది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీలకు నిరాశ ఎదురైంది. మెహులీ–ఐశ్వరీ ప్రతాప్ సింగ్ జోడీ 630.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... రమిత –దివ్యాంశ్ జంట 628.3 పాయింట్లు సాధించి 17వ స్థానంలో నిలిచాయి. టాప్–4లో నిలిచిన జోడీలు మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాల మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో పరీనాజ్ ధలివాల్, గనీమత్ సెఖోన్, దర్శన రాథోడ్ బృందం 351 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచింది. 8 ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ గెలిచిన స్వర్ణ పతకాలు. గతంలో అభినవ్ బింద్రా (2006; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మానవ్‌జిత్ సింగ్ (2006; ట్రాప్), తేజస్విని సావంత్ (2010; మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్), ఓంప్రకాశ్ (2018; 50 మీటర్ల పిస్టల్), అంకుర్ మిట్టల్ (2018; డబుల్ ట్రాప్), రుద్రాం„Š (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రుద్రాం„Š , అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్ బృందం (2022; 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్) ఈ ఘనత సాధించారు. -
యూఎస్ఏ ఖాతాలో యునైటెడ్ కప్
సిడ్నీ: తొలిసారి నిర్వహించిన మిక్స్డ్ టీమ్ టెన్నిస్ టోర్నీ యునైటెడ్ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ మ్యాచ్‌ల ఫైనల్లో అమెరికా 4–0తో ఇటలీపై గెలిచింది. మహిళల తొలి సింగిల్స్‌లో జెస్సికా పెగూలా 6–4, 6–2తో మార్టినా ట్రెవిసాన్పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో టియాఫో 6–2తో తొలి సెట్ గెలిచాక అతని ప్రత్యర్థి లోరెంజో ముసెట్టి గాయంతో వైదొలిగాడు. దాంతో అమెరికా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సింగిల్స్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7–6 (7/4), 7–6 (9/7)తో ప్రపంచ 16వ ర్యాంకర్ బెరెటినిని ఓడించడంతో అమెరికాకు టైటిల్ ఖరారైంది. నామమాత్రపు నాలుగో సింగిల్స్‌లో మాడిసన్ కీస్ 6–3, 6–2తో లూసియాపై నెగ్గి అమెరికా ఆధిక్యాన్ని 4–0కు పెంచింది. ఫలితం తేలిపోవడంతో డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ టోర్నీలో మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి. -
రాఫెల్ నాదల్కు చుక్కెదురు
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2022 సంవత్సరాన్ని ఓటమితో ముగించాడు. సిడ్నీలో జరుగుతున్న యునైటెడ్ కప్ మిక్స్డ్ టీమ్ టోర్నీలో భాగంగా శనివారం బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 0–2తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 3–6, 4–6తో 14వ ర్యాంకర్ కామెరాన్ నోరీ చేతిలో ఓడిపోయాడు. గతంలో నోరీతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో నాదల్ ఈ బ్రిటన్ ప్లేయర్ చేతిలో తొలిసారి ఓడిపోవడం గమనార్హం. -
తెలంగాణ ‘డబుల్’ ధమాకా
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్.అర్జున్ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్ 3గీ3 ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల రోయింగ్ కాక్స్డ్–8లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్ సింగ్ కెతావత్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. -
పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ విభాగం రజత పతకం సాధించింది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందుగా భారత షెట్లర్లు చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్‌తో జరిగిన పురుషులు డబుల్స్ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 21-18,21-15 తేడాతో చిరాగ్-సాత్విక్ జంట ఓటమి చవిచూసింది. అనంతరం సింగిల్స్‌లో భాగంగా పీవీ సింధు.. మలేషియా స్టార్ జిన్ వెయ్-గోహ్‌ను 22-20, 21-17తో మట్టికరిపించి మ్యాచ్ గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మలేషియా షెట్లర్ జె యోంగ్ చేతిలో 21-19,6-21,21-16తో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో మ్యాచ్ అయిన మహిళల డబుల్స్‌లో భారత్ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్ చేతులెత్తేసింది. మలేషియన్ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18,21-17తో భారత్ జంట ఓటమి పాలవ్వడంతో భారత్ ఖాతాలో రజతం వచ్చి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణం, ఐదు రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. SILVER FOR INDIA 🇮🇳 Indian #Badminton Mixed Team puts up a brilliant show of team play, grit, resilience to bag its 2nd consecutive medal🥇🥈 at #CommonwealthGames A mix of comebacks & dominance by our Champs lead 🇮🇳 to this 🥈 at @birminghamcg22 Well played 👏#Cheer4India pic.twitter.com/AMj8q9sAik — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’ CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం! -
CWG 2022: సెమీస్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్... మూడో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. స్క్వాష్‌లో మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ క్వార్టర్ ఫైనల్ చేరారు. -
Archery World Cup: సురేఖ డబుల్ ధమాకా
పారిస్: పునరాగమనంలో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో శనివారం జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్–జీన్ ఫిలిప్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్ ఆఫ్’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి. -
Deaflympics 2022: అదరగొట్టిన ధనుష్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: మరోసారి తన గురితో తెలంగాణ యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ అదరగొట్టాడు. బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని అందించాడు. బ్రెజిల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 19 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా దేశ్‌ముఖ్ జంట 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఖాతాలో బంగారు పతకాన్ని వేసింది. ఫైనల్లో ధనుష్ శ్రీకాంత్–ప్రియేషా ద్వయం 16–10 పాయింట్ల తేడాతో సెబాస్టియన్ హెర్మానీ–సబ్రీనా (జర్మనీ) జోడీపై విజయం సాధించి విజేతగా నిలిచింది. వరుసగా నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం తోపాటు 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ మేటి షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్న ధనుష్ శ్రీకాంత్‌కు ఈ బధిరుల ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం కావడం విశేషం. ఇంతకుముందు ధనుష్ శ్రీకాంత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. క్వాలిఫయింగ్‌లో శ్రీకాంత్–ప్రియేషా జంట 414 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కాంస్య పతక పోరులో శౌర్య సైనీ–నటాషా జోషి (భారత్) జంట 8–16తో వయోలెటా–అలెగ్జాండర్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలతో ఆరో ర్యాంక్‌లో ఉంది. -
స్వర్ణ సురేఖ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో మరో గొప్ప ఘనత జమ చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగం మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖఅభిషేక్ వర్మ (భారత్) జంట 158151 పాయింట్ల తేడాతో యి సువాన్ చెన్చియె లున్ చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఫైనల్లో ఒక్కో జోడీకి లక్ష్యంవైపు 16 బాణాల చొప్పున అవకాశం ఇచ్చారు. విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతి సురేఖ తాను సంధించిన ఎనిమిది బాణాలకు గరిష్టంగా లభించే 80 పాయింట్లను సాధించడం విశేషం. ఆమె సంధించిన ఎనిమిది బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లాయి. అభిషేక్ వర్మ 80 పాయింట్లకుగాను 78 పాయింట్లు స్కోరు చేశాడు. ‘ఆసియా చాంపియన్‌షిప్‌లో ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. గాలి బాగా వీస్తున్నా స్వర్ణం నెగ్గే ఆఖరి అవకాశాన్ని వదులుకోలేదు’ అని సురేఖ వ్యాఖ్యానించింది. అంతకుముందు జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్లో భారత జట్టు 215231తో చెవన్ సో, యున్ సూ సాంగ్, డేయోంగ్ సియోల్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టుకు కూడా రజతం లభించింది. ఫైనల్లో భారత జట్టు 232233తో కేవలం పాయింట్ తేడాతో జేవన్ యాంగ్, యోంగ్హి చోయ్, యున్ క్యు చోయ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. బుధ వారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో కలిపి భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. గురువారం ఇదే వేదికపై టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 2: కాంపౌండ్ విభాగంలో ఇప్పటివరకు పది ఆసియా చాంపియన్‌షిప్‌లు జరిగాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ జంట స్వర్ణం నెగ్గడం ఇది రెండోసారి. 2013లో అభిషేక్ వర్మలిల్లీ చాను ద్వయం తొలి పసిడి పతకం గెలిచింది. 3: ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో జ్యోతి సురేఖ నెగ్గిన స్వర్ణాల సంఖ్య. సురేఖ 2015లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, 2017లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో పసిడి పతకాలు సాధించింది. 30: తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన పతకాలు. ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. -
ఫైనల్లో జ్యోతి సురేఖ జంట
సాక్షి, హైదరాబాద్: కొరియాలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ-కన్వల్‌ప్రీత్ సింగ్ ద్వయం ఫైనల్లోకి ప్రవేశించిందిప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల ఆర్చరీ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రాణించింది.. సెమీఫైనల్లో సురేఖ-కన్వల్ జోడి 154-153తో బెల్జియంపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్, కొరియాతో తలపడుతుంది.