Paris Olympics 2024 Day 1: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత షూటర్ల బృందానికి శుభారంభం లభించలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ ఈవెంట్‌లో మన షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. అర్జున్ బబూటా–రమితా జిందాల్, సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జంట ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాయి. ఫలితంగా ఈ ఈవెంట్లో భారత్ పతక రేసు నుంచి నిష్క్రమించింది.
ఇక ఈ పోటీలో రమితా- అర్జున్ జోడీ ఓవరాల్‌గా 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా.. ఇలవేనిల్- సందీప్ ద్వయం 626.3 పాయింట్లతో 12వ స్థానానికి పడిపోయింది.
నిబంధనల ప్రకారం.. క్వాలిఫయింగ్ రౌండ్‌లో టాప్–4లో నిలిచిన నాలుగు జోడీలు మాత్రమే పసిడి, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడే అర్హత సాధిస్తాయి. అయితే, భారత షూటింగ్ జోడీలు ఈ అడ్డంకిని దాటలేకపోయాయి. చైనా, కొరియా, కజకిస్తాన్, జర్మనీ టాప్-4లో నిలిచాయి.
గోల్డ్ మెడల్ రౌండ్‌లో చైనా- కొరియా
ఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ ఈవెంట్.. గోల్డ్ మెడల్ రౌండ్‌లో చైనా- కొరియా అమీతుమీ తేల్చుకోనుండగా.. కాంస్య పతక పోరులో కజకిస్తాన్ జర్మనీతో తలపడనుంది. ఇదిలా ఉంటే.. తదుపరి పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది.
భారత్ నుంచి అర్జున్ సింగ్ చీమా, సరబ్‌జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో.. మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం గం. 4 నుంచి) మహిళ విభాగంలో పోటీపడనున్నారు.
రోయింగ్‌లో మరో అవకాశం
ఇండియన్ రోవర్ బాల్‌రాజ్ పన్వార్‌కు కూడా తొలిరోజు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెన్స్ వ్యక్తిగత స్కల్స్ హీట్ 1లో నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే, ప్రతి హీట్ నుంచి టాప్-3 మాత్రమే ఆటోమేటిక్‌గా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. దీంతో తొలి ప్రయత్నంలో బాల్‌రాజ్‌కు నిరాశే మిగిలినా.. రేపెచెజ్ రౌండ్ రూపంలో సెమీ ఫైనల్ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి.
చదవండి: ఆర్చరీలో అదరగొట్టి.. క్వార్టర్ ఫైనల్‌లో
Comments
Please login to add a commentAdd a comment