
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలేకు రైల్వే శాఖ పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పుణె డివిజన్‌లో 2015లో కమర్షియల్–కమ్–టికెట్ క్లర్క్‌గా చేరిన కుసాలే ప్రస్తుతం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా పనిచేస్తున్నారు.
ఒలింపిక్ పతక విజేతకు ప్రోత్సాహకంగా అతన్ని టీటీఈ నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నియమిస్తూ ప్రమోషన్ ఆర్డర్‌ను జారీ చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఇకపై కుసాలే ముంబైలోని స్పోర్ట్స్ సెల్‌కు ఓఎస్‌డీగా వ్యవహరిస్తాడు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం స్వప్నిల్‌కు రూ. 1 కోటి నజరానా ప్రకటించింది.