Paris Olympics 2024
-
Manu Bhaker: నేను చేసిన తప్పు అదే.. అందుకే ఇలా!
తన కూతురిని ‘షూటర్’గా తీర్చిదిద్ది తప్పుచేశామంటూ మనూ భాకర్(Manu Bhaker) తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను క్రికెటర్‌ను చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు.కాగా భారత ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అత్యుతన్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న’(Major Dhyan Chand Khel Ratna). ఇందుకు సంబంధించిన అవార్డు కమిటీ సోమవారం నామినీల పేర్లను ప్రకటించగా.. అందులో మనూ భాకర్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మనూ తండ్రి రామ్ కిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నా బిడ్డ ఇంకేం చేయాలి?‘‘ఇప్పటి వరకు భారత్ తరఫున ఎవరూ సాధించని ఘనత నా కూతురు సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతకంటే దేశం కోసం నా బిడ్డ ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించాలి కదా!.పతకాలు గెలవకుంటేనే బాగుండేదిఈ విషయం గురించి నేను మనూతో మాట్లాడాను. తన మనసంతా బాధతో నిండి ఉంది. ‘నేనసలు దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించకపోయి ఉంటే.. ఈ బాధ ఉండేదే కాదు. అసలు క్రీడాకారిణిని కాకపోయే ఉంటే ఇంకా బాగుండేది’ అని తను నాతో అన్నది’’ అని రామ్ కిషన్ భాకర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తమ ఆవేదనను పంచుకున్నారు.బాహ్య శక్తుల ప్రభావం ఉంది!ఇక దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చినా గుర్తింపు దక్కకపోవడం చూస్తుంటే.. కమిటీపై బాహ్య శక్తుల ప్రభావం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదని రామ్ కిషన్ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.కాగా హర్యానాకు చెందిన రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024(Paris Olympics 2024)లో రెండు మెడల్స్ గెలిచింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొట్టమొదటి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
భారత స్టార్ జావెలియన్ త్రోయర్, హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) హెరిటేజ్ కలెక్షన్స్‌లో అతడి టీ షర్ట్ కొలువు తీరనుంది. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. పారిస్‌లో రజతం గెలిచాడు.తన అద్భుత ఆటతీరుతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన నీరజ్‌కు చెందిన టీషర్ట్ ఇప్పుడు మ్యూజియం ఆఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ (ఎమ్ఓడబ్ల్యూఏ)లో ‘షో పీస్’ కానుంది. పారిస్ మెగా ఈవెంట్లో రజత ప్రదర్శన సమయంలో వేసుకున్న టీషర్ట్‌ను డబ్ల్యూఏ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు.కాగా పారిస్‌లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం గెలుపొందాడు. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (పాక్; 92.97 మీ.) చాంపియన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. నీరజ్‌తో పాటు ఉక్రెయిన్‌కు చెందిన మహిళా అథ్లెట్లు యరోస్లావా మహుచిక్, థియా లాఫొడ్ల తీపిగుర్తులు కూడా ఆ హెరిటేజ్ కలెక్షన్లో ప్రముఖంగా కనిపించనున్నాయి. కొన్నేళ్ల పాటు ఈ విజేతల అపురూపాలను ప్రదర్శించాక క్రీడాభిమానులు, ఔత్సాహికులు కోసం సందర్భాన్ని బట్టి వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవల కొరకు వెచ్చించడం తరచూ జరిగేదే! చదవండి: ‘అతడు కావాలనే ఓడిపోయాడు?’.. అంతర్జాతీయ చెస్ సమాఖ్య స్పందన ఇదే -
చైనాకు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అరుదైన రికార్డు
రాజ్‌గిర్(బిహార్): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, ఆసియా క్రీడల చాంపియన్ అయిన చైనాతో తలపడింది.చైనాను 1-0తో ఓడించిఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.ఇక చైనాతో ఫైనల్లో భారత్ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్లో ఆమె గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.వుమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టుగోల్ కీపర్స్- సవిత, బిచు దేవి ఖరీబామ్డిఫెండర్స్- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరిమిడ్ఫీల్డర్స్- నేహా, సలీమా టెటె(కెప్టెన్), షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.ఫార్వర్డ్స్- నవనీత్ కౌర్(వైస్ కెప్టెన్), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
2028 ఒలింపిక్స్‌లో ఆడతా!
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకం అంచనాలతో బరిలోకి దిగినా... ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో కూడా ఆమె విఫలమైంది. ఈ నేపథ్యంలో సింధు భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. అయితే తాను ఆటను ఇంకా ముగించలేదని సింధు స్పష్టం చేసింది. ఫిట్‌గా ఉంటే 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు... 2020 టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించింది. వచ్చే ఒలింపిక్స్ సమయానికి సింధుకు 33 ఏళ్లు నిండుతాయి. ‘ఆ సమయానికి నేను ఫిట్‌గా, గాయాలు లేకుండా ఉంటే కచి్చతంగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతాను. ఇప్పుడైతే నా ఆలోచన ఇదే. కాబట్టి ప్రస్తుత నా లక్ష్యం పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ప్రయతి్నంచడం. అప్పుడు సహజంగానే ఆడాలనే ప్రేరణ లభిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. ఎంతో సాధించాలనే తపన ఉంది. మరిన్ని టైటిల్స్ గెలిచి పోడియం మీద నిలబడాలని భావిస్తున్నా. నా ఆటతో భవిష్యత్ తరాలను స్ఫూర్తినివ్వాలని భావిస్తున్నా. అందుకోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తా’ అని సింధు పేర్కొంది. పారిస్‌లో ఓటమితో తానేమీ బాధ పడలేదని, పరాజయంతో ప్రపంచం ఆగిపోదని ఆమె అభిప్రాయ పడింది. ‘నా కెరీర్లో రెండు ఒలింపిక్స్‌లు అద్భుతంగా సాగాయి. అయితే ప్రతీసారి అలా జరగదు. మూడోసారి పతకం గెలవలేకపోయా. నేను బాగానే ఆడానని అనుకుంటున్నా. అక్కడితో అంతా ముగిసిపోలేదు. తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి పారిస్ వైఫల్యంపై బాధ లేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు’ అని సింధు చెప్పింది. తన ఆటతీరు మెరుగుపర్చుకునే క్రమంలో మాజీ ఆటగాళ్లు లీ హ్యూన్, అనూప్ శ్రీధర్ల వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో మార్పు తప్పనిసరి అవుతుందని... అదే కారణంతో గత కోచ్‌ల వద్ద శిక్షణకు గుడ్‌బై చెప్పి కొత్త కోచ్‌లను ఎంచుకున్నట్లు సింధు వివరించింది. త్వరలో జరిగే జపాన్, చైనా ఓపెన్లపై దృష్టి పెట్టానని, మళ్లీ వరుస విజయాలు దక్కుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.‘ఇప్పుడు నేను శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నా. పూర్తి ఫిట్‌గా కూడా మారాను. స్పీడ్, డిఫెన్స్‌కు సంబంధించి కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. కోచ్‌ల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. వారి పర్యవేక్షణలో రాబోయే జపాన్, చైనా టోర్నీల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. అక్కడినుంచే మ్యాజిక్ మొదలవుతుంది. చూస్తూ ఉండండి’ అని సింధు వ్యాఖ్యానించింది. విశాఖపట్నంలో తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయని... ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాబోయే ఏడాదిన్నర కాలంలో అది సిద్ధమవుతుందని సింధు వెల్లడించింది. -
అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లు.. తొలి అడుగు వేసిన భారత్! కానీ..
భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన ఏకైక ప్రపంచ స్థాయి మెగా స్పోర్ట్స్ ఈవెంట్ 2010 కామన్వెల్త్ గేమ్స్. దేశ రాజధాని వేదికగా జరిగిన ఈ పోటీలు ఆటల పరంగా విజయవంతంగా ముగియడంతో పాటు ఆర్థికపరంగా వివాదాలను కూడా వెంట తెచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మన దేశం మరో ప్రతిష్టాత్మక క్రీడా సంబరం కోసం ముందుకు వస్తోంది.2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రకటించింది. దీనికి సంబంధించి తమ ఆసక్తిని కనబరుస్తూ అక్టోబర్ 1న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ‘లెటర్ ఆఫ్ ఇన్టెంట్’ను సమర్పించింది.ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు‘ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వస్తే అది భారత ఆర్థిక వ్యవస్థకు, సామాజిక పురోగతికి, దేశవ్యాప్తంగా యువత స్వావలంబనకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఐఓఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో జరిగిన ఐఓసీ సెషన్లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే అంశాన్ని మొదటిసారి ప్రస్తావించారు. ఆయన సూచనల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ అధికారులు సమగ్ర సమాచారంతో ప్రత్యేక నివేదికను రూపొందించారు.ఒలింపిక్స్‌కు ఎలా బిడ్ వేయాలనే అంశం మొదలు అవకాశం దక్కించేందుకు సాగే ప్రక్రియకు సంబంధించి అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. ఆ తర్వాతే ఐఓఏ దీనిపై ముందుకు వెళ్లింది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్ (అమెరికా)లో, 2032 బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి. ప్రక్రియ ఇలా... సాధారణంగా ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి మొదలు హక్కుల కేటాయింపు వరకు మూడు దశలు ఉంటాయి. ఎలాంటి ప్రక్రియలో అడుగుపెట్టకుండా వేర్వేరు వేదికలపై మేమూ నిర్వహిస్తాం అంటూ ప్రకటించే ‘ఇన్ఫార్మల్ డైలాగ్’ ఇందులో మొదటిది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కొంత ఆసక్తి మాత్రం ఏర్పడుతుంది తప్ప అధికారికంగా ఎలాంటి విషయమూ ఉండదు. అయితే ఇప్పుడు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ ఇవ్వడంతో దానిని దాటి భారత్ ‘కంటిన్యూయస్ డైలాగ్’ దశకు చేరింది.ఆసక్తి కనబర్చిన దేశాలు, అక్కడి రాజకీయ, ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఓసీ తెలుసుకుంటుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల అమలు లేదా ఉల్లంఘన వంటివి కూడా ఉంటాయి. ఆయా దేశాలతో కూడా దీనిపై ఐఓసీ చర్చిస్తుంది. అయితే నిర్వహణపై ఎలాంటి హామీని ఇవ్వదు. మూడో దశలో ‘టార్గెటెడ్ డైలాగ్’ ఉంటుంది. ఇక్కడే అసలు నిర్వహణపై స్పష్టత వస్తుంది.తుది నిర్ణయం ఆ కమిటీదేఆయా దేశాలు నిర్వహణపై తమ ప్రణాళికలు, మొత్తం బడ్జెట్ సహా ఇతర ఆర్థికపరమైన సమాచారం, తమకు అవకాశం ఇస్తే ఇతర దేశాలకంటే భిన్నంగా ఏం చేస్తామో అనే అన్ని అంశాలకు ఒక ఫార్మాట్లో వెల్లడించాల్సి ఉంటుంది. దీనిపై ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. 2036 క్రీడల వేదికను 2025 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అవకాశం వస్తే అహ్మదాబాద్‌లో! ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్న దేశాలు బిడ్‌లో వేదికగా నగరాల పేర్లను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను దీని కోసం భారత్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కలిపి 22 రకాల క్రీడా వేదికలను అధికారులు గుర్తించారు. అయితే 2036 కోసం పోటీ పడుతున్న ఇతర నగరాలు, దేశాలతో పోలిస్తే మన దేశానికి అవకాశం రావడం అంత సులువు కాదనేది వాస్తవం.నుసాన్తారా (ఇండోనేసియా), ఇస్తాంబుల్ (తుర్కియే), శాంటియాగో (చిలీ), న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ (ఈజిప్ట్), సియోల్ (దక్షిణ కొరియా), దోహా (ఖతర్), రియాద్ (సౌదీ అరేబియా), బుడాపెస్ట్ (హంగేరి), ట్యురిన్ (ఇటలీ), కోపెన్‌హాగెన్ (డెన్మార్క్), టొరంటో–మాంట్రియల్ (కెనడా) ఈసారి భారత్‌తో హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో సియోల్, మాంట్రియల్లకు గతంలోనే ఈ క్రీడలను నిర్వహించిన అనుభవం ఉండగా... సుసాన్తారా, ఇస్తాంబుల్, దోహా నగరాలు వరుసగా హక్కుల కోసం పోటీ పడుతూ త్రుటిలో అవకాశాలు చేజార్చుకున్నాయి.అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లుఈ నగరాల్లో అన్నింటిలో కూడా ఆర్థికపరంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు 2022లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ నిర్వహణతో ఇప్పటికే తమ స్థాయిని చూపించిన దోహా... 2034 ‘ఫిఫా’ వరల్డ్ కప్ హక్కులు దక్కించుకున్న రియాద్ ఒలింపిక్ రేసులో మిగతా నగరాలకంటే ముందున్నాయి. వీటన్నింటిని దాటి భారత్ అవకాశం దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరం. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ బడ్జెట్ అధికారికంగా 900 కోట్ల పౌండ్లు (సుమారు రూ.98 వేల కోట్లు) అంటే ఒలింపిక్స్ నిర్వహణ స్థాయి ఏమిటో ఊహించుకోవచ్చు! చదవండి: ఆఫ్రో–ఆసియా కప్ పునరుద్ధరణ! -
‘ఆమె’ మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్
ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.కౌమార దశలో తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్‌గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అప్పుడు నిషేధంఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్‌కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్‌పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. 46 సెకన్ల వ్యవధిలోనేఅందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్‌లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.బంగారు పతకం గెలిచిఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు. తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పతకం వెనక్కి తీసుకోవాలిటీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్‌లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024 -
త్వరలోనే DSPగా బాధ్యతలు చేపడతా: నిఖత్ జరీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత బాక్సర్ నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపింది. తన ప్రతిభను గుర్తించి డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పోస్ట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంది. క్రీడాకారులను ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తే తనలాగే మరికొంత మంది కూడా ముందుకు వస్తారని పేర్కొంది.కాగా తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. ప్రాథమిక దశలోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన వూ యు చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.సీఎం సానుకూలంగా స్పందించారుఅయితే, ప్రపంచ వేదికలపై సత్తా చాటిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ ప్రభుత్వం అభినందించడంతో పాటు డీఎస్పీగా పోస్టు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన నిఖత్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ అకాడమీ లేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్న నిఖత్.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.సిరాజ్‌కు కూడా‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. త్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటాను. డీజీపీ జితేందర్ గారు ట్రైనింగ్ సమాచారం ఇస్తామని చెప్పారు’’ అని నిఖత్ తెలిపింది. ఇక ప్యారిస్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందన్న నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా నిఖత్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2024 సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సైతం ప్రభుత్వం డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది. చదవండి: ఆమె నిజాయితీని అమ్ముకుంది.. మండిపడ్డ బబిత.. వినేశ్ స్పందన ఇదే -
అది తలచుకుంటేనే బాధేస్తుంది: బాక్సర్ నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ నుంచి చేదు ఫలితంతో తిరిగొచ్చిన ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ త్వరలోనే పంచ్ పవర్‌ను పెంచుకొని రింగ్‌లోకి దిగుతానని చెప్పింది. ఇందుకోసం వ్యక్తిగత కోచ్ అవసరమని... ప్రస్తుతం కోచ్‌ను నియమించుకునే పనిలో నిమగ్నమైనట్లు నిఖత్ వెల్లడించింది. మహిళల 50 కేజీల ఈవెంట్లో భారత్ ఆమెపై ఆశలు పెట్టుకుంది. ఈ చాంపియన్ బాక్సర్ తప్పకుండా పతకం సాధిస్తుందనే అంచనాలతో బరిలోకి దిగగా ఊహించని స్థాయిలో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో అందరికంటే ముందుగా బెర్తు సాధించిన తెలంగాణ స్టార్... పారిస్‌లో ప్రిలిమినరీ దశలో ఆసియా క్రీడల చాంపియన్ వూ యు (చైనా) చేతిలో కంగుతింది.‘లోపాలు లేకుండా ఎవరూ ఉండరు. పైగా ఆ రోజు నాకు కలిసిరాలేదు. నేను అన్‌సీడెడ్ ప్లేయర్ కాబట్టి ఆరంభంలోనే నాకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. చిత్రమేమిటంటే ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారెవరైతే ఉన్నారో వాళ్లను గతంలో నేను ఓడించాను. ఇది తలచుకుంటేనే బాధేస్తుంది. ఏదేమైనా జీవితంలో అన్నింటిని స్వీకరించాలి గెలుపైనా... ఓటమైనా! నాతో ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ ఎలా ఎదగాలో... ఎలా పుంజుకోవాలో తెలుసు. ఇప్పటివరకు నాకు వ్యక్తిగత కోచ్ లేడు. నేను నా శక్తిసామర్థ్యాలు పెంచుకోవాలంటే కోచ్ కావాల్సిందే. అతని శిక్షణతో రాటుదేలాలి. ఉత్తమ బాక్సర్‌గా ఎదగాలంటే మంచి కోచ్ వద్ద ట్రెయినింగ్ తప్పనిసరి. సుశిక్షితుడైన కోచ్ దొరికితే ఎలా సన్నద్ధం కావాలో నాకు తెలుసు’ అని రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ వివరించింది.చదవండి: మహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?భిన్నశైలి బాక్సర్లతో విభిన్నమైన పద్ధతుల్లో తలపడితేనే ఆటతీరు మారుతుందని ఆమె ఆశిస్తోంది. తనలో లోపాలున్న చోట సరిదిద్దుకునే పనిలో ఉన్నానని ముందుగా బలంగా తయారయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పింది. తద్వారా పంచ్ పవర్‌ను పెంచుకోవచ్చని తెలిపింది. -
రూ. 5 కోట్లు, ఫ్లాట్ ఇవ్వాలి: ఒలింపిక్ మెడలిస్ట్ తండ్రి డిమాండ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే తండ్రి సురేశ్ కుసాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అథ్లెట్లను గౌరవించే విషయంలో హర్యానా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు.ప్యారిస్ వేదికగా ఈ ఏడాది ఆగష్టులో ముగిసిన ఒలింపిక్స్‌లో 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో మూడోస్థానంలో నిలిచి ఈ పతకం కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ క్రీడాంశంలో ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అది కూడా తన తొలి ప్రయత్నంలోనే పతక కలను అతడు సాకారం చేసుకోవడం విశేషం. ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల చొప్పునఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయం గురించి స్వప్నిల్ కుసాలే తండ్రి సురేశ్ కుసాలే తాజాగా మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రభుత్వం ఒలింపిక్ మెడల్ గెలిచిన విజేతలకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చింది.అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన వారికి రూ. 2 కోట్ల నజరానా ఇవ్వాలనే కొత్త విధానం తీసుకువచ్చింది. మహారాష్ట్ర తరఫున విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పతకం గెలిచిన రెండో అథ్లెట్ స్వప్నిల్. అతడు మెడల్ గెలిచినపుడే ఇలాంటి పాలసీ ఎందుకు తీసుకువచ్చారు?ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఐదు వ్యక్తిగత పతకాలు వస్తే.. అందులో హర్యానా నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి స్వప్నిల్ ఒక్కడే ఉన్నాడు. మహారాష్ట్రతో పోలిస్తే హర్యానా చిన్న రాష్ట్రం. అయినా.. మెడల్ గెలిచిన అథ్లెట్లకు ఇక్కడి కంటే భారీ నజరానాలు, ప్రోత్సహకాలు ఇస్తోంది.ఇక మా ప్రభుత్వం గోల్డ్ గెలిస్తే రూ. 5 కోట్లు, వెండి పతకం అందుకుంటే రూ. 3 కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు ఇస్తామని ప్రకటించింది. సుదీర్ఘకాలంగా మహారాష్ట్రకు వ్యక్తిగత విభాగంలో రెండే పతకాలు వచ్చినా ఇలాంటి పద్ధతి అవలంభించడం దేనికి? క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలి.ఎమ్మెల్యే లేదంటే మంత్రి కొడుకు అయి ఉంటేస్వప్నిల్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. ఒకవేళ అతడు ఎమ్మెల్యే లేదంటే మంత్రి కొడుకు అయి ఉంటే ఇదే రివార్డు ఇచ్చేవారా? నిజానికి స్వప్నిల్‌కు రూ. 5 కోట్ల నగదు అవార్డుతో పాటు బెలేవాడిలోని స్పోర్ట్స్ స్టేడియానికి సమీపంలో ఒక ఫ్లాట్ ఇవ్వాలి. అంతేకాదు.. 50 మీటర్ల త్రీ పొజిషన్ రైఫిల్ షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలి’’ అని సురేశ్ కుసాలే డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే.. ఒలింపిక్ పతకం గెలిచిన తర్వాత రైల్వే శాఖ స్వప్నిల్‌కు పదోన్నతి కల్పించింది. సెంట్రల్ రైల్వేలోని పుణె డివిజన్లో 2015లో కమర్షియల్–కమ్–టికెట్ క్లర్క్‌గా చేరిన కుసాలేను ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే! -
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)
-
‘ప్రతిసారీ మెడల్స్ అవసరమా?’.. మనూ స్ట్రాంగ్ కౌంటర్
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై భారత షూటర్, ఒలింపిక్ పతకాల విజేత మనూ భాకర్ స్పందించింది. తాను హాజరవుతున్న ప్రతీ ఈవెంట్‌కు మెడల్స్ తీసుకువెళ్లడానికి గల కారణాన్ని వెల్లడించింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఈ హర్యానా షూటర్ రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో.. అదే విధంగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా ఆధునిక ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్‌లో రెండు మెడల్స్ గెలిచిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ హర్యానా షూటర్‌పై ప్రశంసల వర్షం కురిసింది.ఘన స్వాగతంతో పాటు సత్కారాలుస్వదేశంలో అడుగుపెట్టగానే మనూకు ఘన స్వాగతంతో పాటు సత్కారాలు లభించాయి. ఆ తర్వాత దేశంలోని రాజకీయ, క్రీడా ప్రముఖులను కలిసిన మనూ తన మెడల్స్‌ను వారికి చూపించి మురిసిపోయింది. ఇక దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రమంలో చాలా మంది తమ ఈవెంట్లకు మనూ భాకర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా?ఆ సమయంలోనూ ఈ యువ షూటర్ తన పతకాలను అక్కడ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మనూ భాకర్‌పై ట్రోల్స్ చేశారు. ‘‘కాంస్యం గెలిస్తేనే ఇంతలా హంగామా చేస్తున్నారు. మరి స్వర్ణం గెలిచి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో! అయినా ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా? పారాలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించిన వాళ్లకు ఏమాత్రం గుర్తింపు లేదు. మనూకు మాత్రం ఫుల్‌క్రేజ్’’ అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఈ విషయంపై మనూ భాకర్ స్పందించింది. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు‘‘అవును.. నేను ప్రతి చోటకూ మెడల్స్ తీసుకువెళ్తా. అయినా.. తీసుకువెళ్లకూడదని చెప్పేందుకు కారణాలేమైనా ఉన్నాయా?.. నిజానికి నన్ను ఈవెంట్స్‌కు ఆహ్వానించే ప్రతి ఒక్కరు పతకాలు తీసుకురావాలని కోరుతున్నారు.ఒలింపిక్స్ మెడల్స్‌ను ప్రతక్ష్యంగా చూడాలని ఆరాటపడుతున్నారు. ఆర్గనైజర్ల అభ్యర్థన మేరకే నేను మెడల్స్ వెంట తీసుకువెళ్తున్నా. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు’’ అని 22 ఏళ్ల మనూ భాకర్ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.చదవండి: అందరూ మహిళలే... -
సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్
పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సలి్టంగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది.దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
వినేశ్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది: యోగేశ్వర్ దత్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్‌పై ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయటం సరికాదని విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకవేళ నేను ఇటువంటి అనర్హత వేటు పరిస్థితిని ఎదుర్కొంటే.. తక్షణమే దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పేవాడిని. ఈ అంశాన్ని వినేశ్ ఫోగట్ ప్రజల్లోకి తీసుకువెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురయ్యాను. ఒలింపిక్స్ జరిగిన అంశంపై వినేశ్ ఫోగట్ వ్యాప్తి చేసిన కుట్ర పూర్తిత విధానాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.అదీకాక.. ఈ విషయంలో ఆమె ప్రధానమంత్రి మోదీని నిందించే స్థాయికి వెళ్లిపోయారు. ఆమె ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైతే.. జరిగిన పొరపాటుకు దేశానికి క్షమాపణలు తెలపాలి. కానీ, ఆమె ఈ విషయంలో కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. గ్రాము కంటే ఎక్కువ బరువు ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలుసు. కానీ ఆమె ఒలింపిక్స్‌లో ఏదో తప్పు జరిగిందని పేర్కొంది.ఫైనల్ వెళ్లిన సమయంలోనే ఆమె దేశం దృష్టిలో చాలా గౌరవం సంపాదించుకున్నారు’ అని అన్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడి పతకం కోల్పోయిన వినేశ్ అనంతం రాజకీయాల్లో చేరారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జులానా నియోజకవర్గంలో బరిలోకి దించిన విషయం తెలిసిందే. మరోవైపు.. రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం విధితమే.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
నీరజ్ చోప్రా భావోద్వేగం.. స్పందించిన మనూ భాకర్
తాను ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని.. తిరిగి పూర్తి ఫిట్నెస్తో మళ్లీ బరిలోకి దిగుతానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. 2024లో తాను పాల్గొనబోయే చివరి టోర్నీని విజయంతో ముగించాలనకున్నానని.. అయితే, అంచనాలు అందుకోలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోటీకి ముందు తాను గాయపడ్డాడని.. అయినప్పటికీ తన టీమ్ సహకారం వల్ల రెండో స్థానంలో నిలవగలిగానని పేర్కొన్నాడు.కాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో నీరజ్ చోప్రా రెండో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. బ్రసెల్స్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో గ్రెనెడాకు చెందిన వరల్డ్ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ విజేతగా నిలిచాడు. అతడే టైటిల్ విన్నర్పీటర్స్ జావెలిన్‌ను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. నీరజ్ ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచిన అతడికి ప్రైజ్‌మనీగా 12 వేల డాలర్లు (రూ. 10 లక్షలు) లభించాయి.ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ 85.97 మీటర్లు జావెలిన్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లోనూ రెండోస్థానంలోకాగా ఈ ఏడాది నీరజ్ మెరుగ్గానే రాణించాడు. అయితే, ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం గెలవాలన్న అతడి కల నెరవేరలేదు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్.. అర్షద్ నదీం పసిడి పతకం గెలవగా.. నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక డైమండ్ లీగ్‌లోనైనా అగ్రస్థానంలో నిలుస్తాడనుకుంటే.. అక్కడే రెండో స్థానమే దక్కింది.అయితే, ఓవరాల్‌గా నీరజ్ డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో టాప్–3లో నిలువడం ఇది మూడోసారి. 2022 గ్రాండ్ ఫైనల్లో విజేతగా నిలిచిన నీరజ్... 2023 గ్రాండ్ ఫైనల్లో రెండో స్థానాన్ని పొందాడు. ఈసారి డైమండ్ లీగ్ ఫైనల్లో ఈ సీజన్ మొత్తం నీరజ్ నిలకడగా రాణించాడు. ఆరు టోర్నీల్లో పోటీపడి ఐదింటిలో రెండో స్థానాన్ని, ఒక టోర్నీలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.అథ్లెట్‌గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యానుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది మిశ్రమ భావనలతో ముగిసింది. సోమవారం.. నేను గాయపడ్డాను. నా ఎడమఅరచేతిలోని ఎముక ఫాక్చర్ అయినట్లు ఎక్స్ రే ద్వారా తేలింది. పోటీకి ముందు ఇలా కావడం తీవ్రంగా బాధించింది. అయితే, నా టీమ్ నన్ను బ్రసెల్స్ లీగ్‌లో పాల్గొనేలా సమాయత్తం చేసింది.ఈ ఏడాది ఇదే చివరి కాంపిటీషన్. టైటిల్‌తో ముగించాలని కోరుకున్నా. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా ఈ ఏడాది ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాను. త్వరలోనే మళ్లీ పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ ఏడాది అథ్లెట్‌గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యాను. 2025లో కలుసుకుందాం’’ అని ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ క్రమంలో.. ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్ బదులిస్తూ.. నీరజ్ చోప్రాను అభినందించింది. స్పందించిన మనూ భాకర్‘‘2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నావు నీరజ్ చోప్రా. నువ్వు త్వరగా కోలుకోవాలని.. వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మనూ భాకర్ ఆకాంక్షించింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత నీరజ్ చోప్రా.. మనూ భాకర్, ఆమె తల్లితో ముచ్చటించిన దృశ్యాలు వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఈ హర్యానా అథ్లెట్ల మధ్య మంచి అనుబంధం ఉందంటూ వార్తలు రాగా.. మనూ భాకర్ తండ్రి స్పందిస్తూ.. నీరజ్ తమ కుమారుడి లాంటి వాడని పేర్కొన్నారు. చదవండి: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... -
ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్!
మూడేళ్ల క్రితం.. కెన్యాలోని నైరోబీలో అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. స్ప్రింట్స్ పోటీలకు ముందు ఒక కుర్రాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. అంతకు మూడు నెలల క్రితం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రిలేల్లో అతను మంచి ప్రదర్శన కనబరచాడు. క్రీడల్లో పెద్దగా గుర్తింపులేని ఆఫ్రికా దేశం బోత్స్వానా నుంచి వచ్చాడు. ప్రతిభనే నమ్ముకుంటూ ఒక్కోమెట్టు ఎక్కాడు.‘ఆఫ్రికా బోల్ట్’ అంటూ క్రీడాభిమానుల ఆశీస్సులు అందుకున్నాడు. ఊహించని వేగంతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయిన ఆ కుర్రాడు 21 ఏళ్ల వయసు వచ్చేసరికే వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకొని సత్తా చాటాడు. తమ దేశానికి ఈ మెగా క్రీడల చరిత్రలో తొలి పసిడి పతకాన్ని అందించాడు. రిలే పరుగులోనూ అతని వేగం వల్లే బోత్స్వానా దేశానికి మరో రజతమూ దక్కింది. అతని పేరే లెట్సిల్ టెబోగో.పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన కొద్ది రోజులకు ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు కొందరు టెబోగోను కలిసేందుకు బోత్స్వానాలోని అతని స్వస్థలం కాన్యేకు వచ్చారు. వారికి అతను తన సొంత పొలంలో పనిచేస్తూ కనిపించాడు. అదేదో ఫ్యాషన్ కోసమో సరదాగానో కాదు పూర్తిస్థాయి రైతులా శ్రమిస్తున్నాడు టెబోగో. ‘ఒలింపిక్స్ మెడల్ గెలిచినా, నా జీవనం మాత్రం ఇదే’ అని అతను చెప్పుకోవడం విశేషం. టెబోగో స్వర్ణంతో పారిస్ నుంచి తిరిగొచ్చాక బోత్స్వానా దేశం మొత్తం పండుగ చేసుకుంది. అతని విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు సెలవు ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు స్వయంగా వెళ్లి స్వాగతం పలకడంతో పాటు తాను కూడా డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించడం టెబోగో ఆట విలువను చూపింది.వరల్డ్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి..నైరోబీ అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత టెబోగో ఆగిపోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత కొలంబియాలోని క్యాలీలో మళ్లీ ఈ టోర్నీ జరిగింది. అక్కడా గత ఏడాది ప్రదర్శనను పునరావృతం చేశాడు. మళ్లీ స్వర్ణం, రజతంతో మెరిశాడు. అంతే కాదు 100 మీటర్ల పరుగును 9.96 సెకన్లలో పూర్తిచేసి అండర్–20 స్థాయిలో ప్రపంచ రికార్డును సృష్టించడంతోపాటు కొద్దిరోజులకే తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. మూడు నెలల తర్వాత 9.94 సెకన్ల టైమింగ్‌తో అతని ఖాతాలో కొత్త రికార్డు నమోదైంది. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 100 మీ., 200 మీ.లలో వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకోవడంతో దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో అతడిని పోల్చటం మరింతగా పెరిగింది.ఒలింపిక్స్ విజయం దిశగా..సాధారణంగా క్రీడల్లో జూనియర్ స్థాయిలోని జోరునే సీనియర్ స్థాయిలోనూ కొనసాగించడం అంత సులువు కాదు. స్థాయి మారడం, పోటీతోపాటు కొత్తగా బరిలోకి దిగుతున్నట్లుగా ఉండే ఒత్తిడి యువ ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తాయి. టెబోగో కూడా అలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. అండర్–20 విజయాల ఉత్సాహంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన అతను తొలి ప్రయత్నంలో తడబడ్డాడు. ఓటమి నుంచి నేర్చుకునే స్వభావమున్న అతను సరిగ్గా ఏడాది తర్వాత 2023 బుడాపెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తానేంటో చూపించాడు.100 మీటర్ల పరుగులో రజత పతకం గెలుచుకోవడంతో పాటు 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. ఇవి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి. పారిస్ ఒలింపిక్స్ ఫేవరెట్లలో ఒకడిగా నిలిపాయి. అయితే దురదృష్టవశాత్తు 100 మీటర్ల పరుగులో ఫైనల్ వరకు చేరగలిగినా అతని 9.86 సెకన్ల టైమింగ్ టెబోగోకు పతకాన్ని అందించలేకపోయింది. నిరాశ చెందలేదు. అంతే పట్టుదలగా మూడు రోజుల తర్వాతి 200 మీటర్ల పరుగుకు సన్నద్ధమయ్యాడు. 19.46 సెకన్ల టైమింగ్ నమోదుచేసి చాంపియన్‌గా నిలిచాడు. సగర్వంగా తన జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు.అమ్మ కోసం గెలిచి..‘నువ్వు ఎలాగైనా ఒలింపిక్స్ పతకం గెలవాలని అమ్మ మళ్లీ మళ్లీ చెప్పింది. ఆమె కోసమే ఈ పరుగు. ఆమెకే ఈ పతకం అంకితం!’ 200 మీటర్ల రేసు గెలిచాక టెబోగో భావోద్వేగంతో చెప్పిన మాటలవి. విజయం సాధించాక అతని కన్నీళ్లను చూస్తే ఆ గెలుపు ప్రత్యేకత కనిపిస్తుంది. టెబోగో ఈ స్థాయికి చేరడంలో అతని తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. ఆటలో ఓనమాలు నేర్పించడంతోపాటు అతను ఒక బలమైన అథ్లెట్‌గా ఎదగడంలో ఆమె అన్ని రకాలుగా అండగా నిలిచింది. జూనియర్ స్థాయిలో విజయాలతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే వరకు కూడా అమ్మ తోడుగా ఉంది.అయితే అతను ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే సమయంలోనే క్యాన్సర్‌తో 44 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఈవెంట్లో చేతివేలి గోర్లపై తల్లి పేరు, తన షూస్‌పై తల్లి పుట్టిన తేదీ రాసుకొని అతను బరిలోకి దిగాడు. చనిపోయిన తేదీ రాయాలంటే తనకు ధైర్యం సరిపోలేదని చెప్పాడు. విజయానంతరం ఆ షూస్‌ను కెమెరాకు చూపిస్తూ టెబోగో కన్నీళ్లపర్యంతమయ్యాడు. 21 ఏళ్ల వయసులోనే ట్రాక్‌పై అద్భుతాలు చేస్తున్న ఈ బోత్స్వానా స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించగలడనడంలో ఎలాంటి సందేహం లేదు. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ! -
అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ ఒప్పుకోలేదు: హరీశ్ సాల్వే
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందించారు. వినేశ్ లాయర్ల నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదన్న ఆయన.. స్పోర్ట్స్ కోర్టు తీర్పుపై స్విస్ కోర్టులో అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. కాగా ప్యారిస్ ఒలిపింక్స్-2024లో మహిళల యాభై కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. ఫైనల్లో పాల్గొనకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనర్హురాలిగా ప్రకటించింది. రజత పతకమైనా ఇవ్వాలని కోరగాఈ క్రమంలో వినేశ్ ఫొగట్, ఐఓఏ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది. కానీ, అప్పటికే టైటిల్ రేసు మొదలైందని.. అందుకే వినేశ్‌కు పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వలేమని సదరు న్యాయస్థానం పేర్కొంది.అయితే, సెమీస్ వరకు నిబంధనల ప్రకారం గెలిచాను కాబట్టి కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలన్న వినేశ్ ఫొగట్ అభ్యర్థన పిటిషన్‌ను స్వీకరించింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వేతో పాటు విదూశ్‌పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అనేక వాయిదాల అనంతరం కోర్టు తీర్పునిస్తూ.. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా నిబంధనలకు విరుద్ధమే అంటూ వినేశ్‌కు రజతం ఇవ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది.ఐఓఏపై వినేశ్ ఆరోపణలుఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోర్టుకు వెళ్లిన సమయంలో ఐఓఏ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపించింది. దేశం తరఫున కాకుండా.. తన పేరు మీదే పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అయితే, అక్కడా తనకు న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హరీశ్ సాల్వే తాజాగా స్పందించారు.వినేశ్ లాయర్లు సహకరించలేదు‘‘ఈ కేసులో మాకు, అథ్లెట్ నియమించుకున్న లాయర్లకు మధ్య సమన్వయం లోపించింది. నిజానికి భారత ఒలింపిక్ సంఘం మెరుగైన వ్యక్తుల(తమను ఉద్దేశించి)ను ఆమె కోసం నియమించింది. కానీ.. ఆమె లాయర్లు మాత్రం.. ‘మీతో మేము ఎలాంటి విషయాలు పంచుకోము. మాకు తెలిసిన సమాచారం మీకు ఇవ్వము’ అన్నట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రతి అంశంలోనూ ఆలస్యమైంది.అయిన్పటికీ మా శక్తి వంచన లేకుండా ఆఖరి వరకు పోరాడాము. అయితే, చివరకు మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు కూడా నేను ఆమెకు ఓ సూచన చేశాను. మనం స్విస్ కోర్టుకు వెళ్దామని చెప్పాను. అందుకు ఆమె ముందుకు రాలేదు కూడాకానీ తన లాయర్లు మత్రం ఆమెకు ఇక ముందుకు వెళ్లే ఉద్దేశంలేదని చెప్పారు’’ అని హరీశ్ సాల్వే చెప్పుకొచ్చారు. కాగా ఈ పరిణామాల తర్వాత 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలికి రాజకీయాల్లో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తోంది.చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే? -
వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?
భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ ఆస్తుల విలువ వెల్లడైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన సందర్భంగా తన దగ్గర ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను ఆమె వెల్లడించింది. కాగా ఒలింపిక్ పతకం గెలవాలన్న వినేశ్ ఫొగట్ కల ప్యారిస్‌లో చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో జరిగిన విశ్వక్రీడల్లో మహిళల యాభై కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. స్వర్ణ పతక పోరులో తలపడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.నిరాశతో వెనుదిరిగినిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్ పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక్క గ్రాము అదనపు బరువు ఉన్నా పోటీకి అనుమతించరని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా.. ఫైనల్ వరకు తన ప్రయాణం నిబంధనల ప్రకారమే సాగింది కాబట్టి కనీసం సంయుక్త రజతం ఇవ్వాలన్నా అభ్యర్థనను తిరస్కరించింది.కుస్తీకి స్వస్తిఈ పరిణామాల నేపథ్యంలో కలత చెందిన వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మళ్లీ రెజ్లర్‌గా తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినా.. రాజకీయరంగ ప్రవేశం చేయడం ద్వారా తానిక ఆటకు పూర్తిగా దూరమైనట్లు వినేశ్ చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే హస్తం పార్టీ కండువా కప్పుకొంది.రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్అంతేకాదు.. జింద్‌లోని జులనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తి వివరాలను పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... ‘వినేశ్ ఫొగట్ పేరిట మూడు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సీ 60(ధర దాదాపు రూ. 35 లక్షలు), హుందాయ్ క్రెటా (రూ. 12 లక్షలు), టయోటా ఇన్నోవా(రూ. 17 లక్షలు) వినేశ్ వద్ద ఉన్నాయి.ఆస్తి ఎన్ని కోట్లంటే?వీటిలో టయోటా కొనుగోలు చేసేందుకు రూ. 13 లక్షలు లోన్ తీసుకున్న వినేశ్.. ప్రస్తుతం దశల వారీగా చెల్లిస్తోంది. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 2 కోట్ల మేర(సోనిపట్‌లోని ప్లాట్ విలువ) ఉంటుందని ఆమె పేర్కొంది. 2023-24 ఏడాదికి గానూ తాను రూ. 13,85,000 ఆదాయం పొందినట్లు వినేశ్ తెలిపింది. తన చేతిలో ప్రస్తుతం రూ. 1.95 వేల నగదు ఉన్నట్లు వెల్లడించింది’. కాగా రెజ్లర్‌గా ఎదిగిన క్రమంలోనే 30 ఏళ్ల వినేశ్ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.నా కల సంగీత నెరవేరుస్తుందివినేశ్ ఫొగట్ ఇప్పుడే రాజకీయాల్లో చేరడం తనకు ఇష్టం లేదన్న ఆమె పెదనాన్న, కోచ్ మహవీర్ ఫొగట్.. తన కుమార్తె సంగీతను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానని అన్నారు. ‘‘వినేశ్ వచ్చే విశ్వ క్రీడల్లో పాల్గొంటుందని భావించాను. కానీ తను రాజకీయాల్లో చేరింది. అందుకే సంగీత ఫొగట్‌ను 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలని నిశ్చయించుకున్నా.దేశానికి తనే పతకం తీసుకువస్తుంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న కారణంగా సంగీత ఈ ఏడాది జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు’’ అని మహవీర్ ఫొగట్ పేర్కొన్నారు. కాగా నాటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జరిగిన ఉద్యమంలో వినేశ్, సంగీత, సంగీత భర్త బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిఇదిలా ఉంటే.. వినేశ్తో కలిసి సంగీత ఫొగట్ భర్త బజరంగ్ కూడా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరిద్దరు స్పోర్ట్స్ కోటాలో తాము పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. కాగా వినేశ్ ఫొగట్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లరే. అతడు రైల్వేలో పనిచేస్తున్నాడు.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు
భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై భారత స్టార్ రెజ్లర్‌గా వెలుగొందిన వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే తనతో దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారని.. నాకేదో అండగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించింది. తన విషయంలో చాలా రాజకీయాలు నడిచాయని.. అందువల్లే తన మనసు విరిగిపోయిందని తెలిపింది.అనూహ్య రీతిలో అనర్హత వేటుఅందుకే విరక్తిపుట్టి ఇక కుస్తీకి స్వస్తి పలకాలనే కఠిన నిర్ణయానికి వచ్చానంటూ వినేశ్ ఉద్వేగానికి లోనైంది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక బౌట్‌కు ముందు అనూహ్య రీతిలో ఆమెపై వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.నో మెడల్ఫలితంగా.. వినేశ్‌కు స్వర్ణం లేదంటే రజతం ఖాయమనుకున్న భారతీయుల కల చెదిరిపోయింది. అయితే, ఫైనల్ చేరే వరకు తన ప్రయాణం నిబంధనలకు అనుగుణంగానే సాగింది కాబట్టి.. కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. అనేక వాయిదాల అనంతరం వినేశ్ ఫొగట్ అభ్యర్థనను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని.. అలాంటి పరిస్థితిలో పతకం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.ఆస్పత్రిలో ఉండగా పీటీ పరామర్శఇదిలా ఉంటే.. ఫైనల్‌కు ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన వినేశ్ ఫొగట్ అస్వస్థకు గురై ప్యారిస్ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో భారతీయులంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు అండగా నిలబడగా.. ఐఏఓ అధ్యక్షురాలు పీటీ ఉష సైతం హాస్పిటల్‌కు వెళ్లి వినేశ్‌ను పరామర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉష నెట్టింట షేర్ చేసింది.నాడు ఢిల్లీ వీధుల్లో పోరాటంఅయితే, వినేశ్ గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న అప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల ఉద్యమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో కలిసి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో ప్యారిస్‌లో వినేశ్‌పై అనర్హత వేటు పడగానే అటు బీజేపీ పెద్దలు, పీటీ ఉష, కేంద్రం నియమించిన న్యూట్రీషనిస్టులపై ఆమె అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.వినేశ్దే బాధ్యత అన్నట్లుగా ఈ నేపథ్యంలో ఉష స్పందిస్తూ.. బరువు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు అథ్లెట్లదేనని.. ఇందులో తాము చేయడానికి ఏమీ లేదంటూ కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాల క్రమంలో రెజ్లింగ్‌కు స్వస్తి పలుకుతున్నాని ప్రకటించిన వినేశ్ ఫొగట్.. ఇటీవలే రాజకీయాల్లో ప్రవేశించింది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది.అందుకే నా గుండె పగిలిందిఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పీటీ ఉష తనకు కష్టసమయంలో ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించింది. ‘‘పీటీ ఉష మేడమ్ ఆస్పత్రిలో నన్ను చూడటానికి వచ్చారు. ఒక ఫొటో తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని మీరు అనవచ్చు. అయితే, ప్యారిస్ క్రీడాగ్రామంలోనూ రాజకీయాలు నడిచాయి.అందుకే నా గుండె పగిలింది. రెజ్లింగ్ వదలొద్దు అని చాలా మంది నాకు చెబుతూ ఉంటారు. కానీ ఇంకా ఆటలో కొనసాగడం వల్ల నాకేం ఒరుగుతుంది? అక్కడ ప్రతీదీ రాజకీయమే. మనం ఆస్పత్రిలో పడి ఉన్నపుడు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా.పీటీ ఉషది నాటకంనా జీవితంలో అత్యంత దుర్భర సమయంలో ఓ వ్యక్తి వచ్చి నాతో ఫొటో దిగి.. నాకు అండగా ఉన్నానన్న ప్రచారం కోసం దానిని సోషల్ మీడియాలో పెట్టడం సరైందేనా? మద్దతు పలకడం కాదది.. అండగా ఉన్నట్లు నటించడం. నిజానికి మెడల్ కోసం నా తరఫున ఒలింపిక్ సంఘం దేశం పేరుతో పిటిషన్ వేయాలి. కానీ నాకెవరూ అండగా లేకపోవడంతో నా పేరు మీదనే కేసు ఫైల్ చేశాను’’ అని కాంగ్రెస్ నేత, 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ పీటీ ఉషను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా పీటీ ఉష రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఆమెను ఈ పదవికి నామినేట్ చేసింది.చదవండి: నా ఓటమికి సంతోషించేవాళ్లు దేశ ద్రోహులే: వినేశ్ ఫోగట్ -
బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా అర్హత.. నదీమ్ ఔట్
భారత బల్లెం వీరుడు, ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా బ్రస్సెల్ వేదికగా జరగబోయే డైమండ్ లీగ్ ఆర్హత సాధించాడు. నీరజ్ గాయం కారణంగా జ్యూరిచ్ డైమండ్ లీగ్‌కు దూరంగా ఉన్నప్పటకి.. 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాడు.ఈ జాబితాలో గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా మోల్డోవాకు చెందిన ఆండ్రియన్ మర్దారే (13 పాయింట్లు), జపాన్‌కు త్రోయర్ రోడెరిక్ జెంకీ డీన్ (12 పాయింట్లు) టాప్-6లో చోటు దక్కించుకున్నారు. కాగా ఈ పోటీలు సెప్టెంబరు 13, 14 తేదీల్లో జరగనున్నాయి.నదీమ్ ఆనర్హత..అయితే ఈ పోటీలకు ప్యారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఆర్హత సాధించలేకపోయాడు. కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించి బ్రస్సెల్ డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయాడు. -
Paralympics 2024: రైలు ప్రమాదం నుంచి ఒలింపిక్ స్వర్ణం వరకు...
తండ్రి నేవీ ఆఫీసర్... ఆయనను చూసి తానూ అలాగే యూనిఫామ్ సర్వీస్‌లోకి వెళ్లాలనుకున్నాడు... కానీ అనూహ్య ఘటనతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఐటీ వరకు వెళ్లాడు... కానీ శరీరం అక్కడ ఉన్నా మనసు మాత్రం ఆటలపై ఉంది... కానీ అనుకోని వైకల్యం వెనక్కి లాగుతోంది... అయినా సరే ఎక్కడా తగ్గలేదు... అణువణువునా పోరాటస్ఫూర్తి నింపుకున్నాడు. బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించి పట్టుదలగా శ్రమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయాడు. ఇప్పుడు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను పూర్తి చేసుకున్నాడు. పారా షట్లర్ నితేశ్ కుమార్ విజయగాథ ఇది. 2009... నితేశ్ కుమార్ వయసు 15 ఏళ్లు. అప్పటికి అతనికి ఆటలంటే చాలా ఇష్టం. ఫుట్‌బాల్‌ను బాగా ఆడేవాడు. అయితే ఆ సమయంలో జరిగిన అనూహ్య ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. విశాఖపట్నం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నితేశ్ తన కాలును కోల్పోయాడు. కోలుకునే క్రమంలో సుదీర్ఘ కాలం పాటు ఆస్పత్రి బెడ్‌పైనే ఉండి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగైనా ఆటలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల్సి వచి్చంది. దాంతో చదువుపై దృష్టి పెట్టిన నితేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మండీలో సీటు సంపాదించాడు. అక్కడ ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే బ్యాడ్మింటన్ ఆటపై ఆసక్తి పెరిగింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌ను చూసి అతను స్ఫూర్తి పొందాడు. ఆటగాడిగా ఉండాలంటే ఎంత ఫిట్‌గా ఉండాలనే విషయంలో కోహ్లి నుంచి ప్రేరణ పొందినట్లు నితేశ్æ చెప్పాడు. కోల్పోయిన కాలు స్థానంలో కృత్రిమ కాలును అమర్చుకునే క్రమంలో నితేశ్ పుణేలోని ‘ఆర్టిఫీషియల్ లింబ్స్ సెంటర్’కు చేరాడు. అక్కడ ఎంతో మంది తనకంటే వయసులో పెద్దవారు కూడా ఎలాంటి లోపం కనిపించనీయకుండా కష్టపడుతున్న తీరు అతడిని ఆశ్చర్యపర్చింది. ‘40–45 ఏళ్ల వయసు ఉన్నవారు కూడా కృత్రిమ అవయవాలతో ఫుట్‌బాల్, సైక్లింగ్, రన్నింగ్ చేయడం చూశాను. ఈ వయసులో వారు చేయగా లేనిది నేను చేయలేనా అనిపించింది. ఆపై పూర్తిగా బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను’ అని హరియాణాకు చెందిన నితేశ్ చెప్పాడు. 2020లో జరిగిన పారా బ్యాడ్మింటన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తొలిసారి నితేశ్ బరిలోకి దిగాడు. తను ఆరాధించే భగత్‌తోపాటు మనోజ్ సర్కార్వంటి సీనియర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. దాంతో ఈ ఆటలో మరిన్ని సాధించాలనే పట్టుదల పెరిగింది. గత ఒలింపిక్స్‌లో భగత్ స్వర్ణం గెలుచుకోవడం చూసిన తర్వాత తానూ ఒలింపిక్స్ పతకం సాధించగలననే నమ్మకం నితేశ్‌కు కలిగింది. ఈ క్రమంలో గత మూడేళ్లుగా తీవ్ర సాధన చేసిన అతను ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. పారిస్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయాలు అందుకొని స్వర్ణపతకంతో సగర్వంగా నిలిచాడు. –సాక్షి క్రీడా విభాగం -
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు..
పారిస్‌లోని నేషనల్ స్టేడియం.. అథ్లెటిక్స్‌లో ఆ రోజుకు మిగతా అన్ని ఈవెంట్లూ ముగిశాయి. కానీ స్టేడియంలో కూర్చున్న 80 వేల మంది ప్రేక్షకులు మాత్రం ఆ వ్యక్తి కోసం, ఆ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరగా అతను వచ్చాడు. పొడవాటి పోల్‌ను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కార్బన్ ఫైబర్ పోల్ సహాయంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన అతను ఆకాశంలోకి దూసుకెళ్లినట్లుగా అనిపించింది. అక్కడినుంచి బార్ మీదుగా అవతలి వైపు ప్యాడింగ్ వైపు పడే లోపే కొత్త ప్రపంచ రికార్డు.. ఒలింపిక్ మెడల్ వచ్చేసింది. హర్షధ్వానాలతో స్టేడియం హోరెత్తిపోయింది. అథ్లెటిక్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న ఆ ఆటగాడే ఆర్మండ్ డుప్లాంటిస్.ఒకటి, రెండు, మూడు.. ఇలా ప్రపంచ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. అతను ఆడుతోందే వరల్డ్ రికార్డులు నెలకొల్పడానికి అన్నట్లుగా ఉంది పరిస్థితి. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఇలా ఏకంగా అతను 9 కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలో రెండు ఒలింపిక్ స్వర్ణాలు అతని ఖాతాలో చేరాయి. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త వరల్డ్ రికార్డుతో సాధించిన స్వర్ణం ఈ క్రీడలో డుప్లాంటిస్ స్థాయిని శిఖరానికి చేర్చింది. ఒలింపిక్ పతకం గెలిచిన రెండు వారాలకే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ పోటీల్లోనూ అలవోకగా అగ్రస్థానంలో నిలిచాడు.క్రీడాకారుల కుటుంబం నుంచి..తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలూ క్రీడాకారులే! అలా ఇంట్లో అంతా క్రీడా వాతావరణమే. డుప్లాంటిస్ కూడా సహజంగానే క్రీడల వైపు మళ్లాడు. అమెరికా జాతీయుడైన తండ్రి గ్రెగ్ పోల్‌వాల్టర్ కాగా, స్వీడన్‌కు చెందిన తల్లి హెలెనా హెప్టాథ్లాన్ ప్లేయర్. పెద్దన్నయ్య కూడా పోల్‌వాల్ట్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరగా, రెండో అన్న పోల్వాల్ట్తోనే మొదలుపెట్టినా ఆ తర్వాత బేస్‌బాల్ వైపు మళ్లి జాతీయ స్థాయి వరకు ఆడాడు. తండ్రి బాటలోనే డుప్లాంటిస్ నాలుగేళ్ల వయసులోనే పోల్‌వాల్ట్‌పై ఆసక్తి చూపించాడు.ఏడేళ్ల వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన అతను పదేళ్ల వయసులో 3.86 మీటర్లు ఎగిరి పోల్‌వాల్ట్‌లో తాను ఏ స్థాయికి చేరగలడో చూపించాడు. ఒక దశలో 7 నుంచి 13 ఏళ్ల వయసు వరకు అన్ని వయో విభాగాల్లో ప్రపంచస్థాయి అత్యుత్తమ ప్రదర్శనలన్నీ డుప్లాంటిస్ పేరు మీదే ఉండటం విశేషం. అమెరికాలోనే పుట్టి, అక్కడే ప్రా«థమిక విద్యాభ్యాసం చేసినా, అమ్మ పుట్టిల్లు స్వీడన్పైనే ఆర్మండ్కు అభిమానం ఎక్కువ. అందుకే క్రీడల్లో స్వీడన్‌కే అతను ప్రాతినిధ్యం వహించాడు.రికార్డుల హోరు..16 ఏళ్ల వయసులో డుప్లాంటిస్ తొలిసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. కొలంబియాలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో పాటు కొత్త చాంపియన్‌షిప్ రికార్డును నెలకొల్పాడు. ఆ వెంటనే అండర్–16 స్థాయిలోనూ కొత్త వరల్డ్ రికార్డు నమోదైంది. ఆపై వరల్డ్ జూనియర్ రికార్డు కూడా దరి చేరింది. 18 ఫీట్ల ఇండోర్ పోల్‌వాల్ట్ ఈవెంట్లో పోటీ పడిన తొలి స్కూల్ విద్యార్థిగా డుప్లాంటిస్ నిలిచాడు. అండర్–20 విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచాక అంతర్జాతీయ స్థాయిలో తన తొలి సీనియర్ టోర్నీ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో అతని సత్తా ప్రపంచానికి తెలిసింది. ఈ టోర్నీలో తొలిసారి 6 మీటర్ల ఎత్తును అధిగమించిన అతనిపై అందరి దృష్టీ పడింది.ఆపై ఎదురు లేకుండా దూసుకుపోయిన డుప్లాంటిస్ కెరీర్లో ఎన్నో అసాధారణ ఘనతలు ఉన్నాయి. యూరోపియన్ జూనియర్లో స్వర్ణం, వరల్డ్ యూత్‌లో స్వర్ణం, వరల్డ్ జూనియర్లో స్వర్ణ, కాంస్యాలతో అతని జూనియర్ కెరీర్లో కీలక మైలురాళ్లు. సీనియర్ స్థాయికి వచ్చే సరికి యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, యూరోపియన్ ఇండోర్‌లో స్వర్ణంతో మెరిశాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో మూడు స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాడు. వరల్డ్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మరో రెండు పసిడి పతకాలు అందుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లలో గెలుచుకున్న స్వర్ణాలు అతని కెరీర్‌ను సంపూర్ణం చేశాయి.ఒక్కో సెంటీ మీటర్ దాటుతూ..తొమ్మిది ప్రపంచ రికార్డులను నెలకొల్పడంలో డుప్లాంటిస్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ప్రతిసారీ ఒక్కో సెంటీ మీటర్ మెరుగైన ప్రదర్శన ఇస్తూ ముందుకు సాగాడు. 2020 ఫిబ్రవరిలో పోలండ్‌లో జరిగిన కోపర్నికస్ కప్‌లో 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి అతను తొలిసారి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అప్పటి నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు ఇది మెరుగవుతూ వచ్చింది. వరుసగా 6.18, 6.19, 6.20, 6.21, 6.22, 6.23, 6.24, 6.25 మీటర్లతో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పోయాడు.ఉక్రెయిన్ దిగ్గజం సెర్గీ బుబ్కా తర్వాత పోల్‌వాల్ట్ స్థాయిని పెంచి, దానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిన ఆటగాడిగా డుప్లాంటిస్ నిలిచాడు. అమెరికాను కాదని తాను ఎంచుకున్న స్వీడన్ కూడా అన్ని రకాలుగా అతనికి అండగా నిలిచింది. అన్నింటికి మించి తన తల్లి స్వస్థలం ఎవెస్టా మునిసిపాలిటీలో డుప్లాంటిస్ గౌరవ సూచకంగా ప్రభుత్వం ఒక పోల్ వాల్ట్ బార్‌ను ఏర్పాటు చేయడం అతడిని అన్నింటికంటే ఎక్కువగా భావోద్వాగానికి గురి చేసింది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: బడిని గుడి చేసిన గురుదేవుళ్లు.. -
ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా
సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో సెలబ్రిటీ వధువుల ఫస్ట్ ఆప్షన్ ఆమె. బాలీవుడ్ క్వీన్స్ అందాల హీరోయిన్ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్ ఫ్యావరేట్. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.వీణా నగ్దా మెహందీ ఆర్ట్‌పై తన తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్ అంబానీ కోకిలాబెన్ ఫోన్ నెంబరు, కార్డు ఉండాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు. అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.ఇషాకు ఆరేళ్లప్పటినుంచి గోరింటాకు పెడుతున్నాఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీణా నగ్దాను మెహందీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్‌లో ఉండేవారికి ఇంటికి వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.పారిస్ ఒలింపిక్స్ 2024, మెహిందీ ఆర్ట్పారిస్ ఒలింపిక్స్ 2024కి ఆహ్వానించినపుడు తానెంతో పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియన్ హౌస్‌లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం, ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్ రింగ్‌ను మెహందీ డిజైన్ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని కూడా వీణా గుర్తు చేసుకున్నారు. -
జియో సినిమాలో పారాలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం
ప్యారిస్ ఒలింపిక్స్-2024 క్రీడలను విజయవంతంగా ప్రసారం చేసిన వయాకామ్.. పారాలింపిక్స్-2024 లైవ్ కవరేజ్ కూడా ఇవ్వన్నుట్లు ప్రకటించింది. ప్యారిస్ వేదికగా ఆగష్టు 28- సెప్టెంబరు 8 వరకు జరుగనున్న దివ్యాంగుల విశ్వ క్రీడలను డిజిటల్ మాధ్యమంలో జియో సినిమా యాప్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఇక టీవీ ప్రేక్షకులు స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో పారాలింపిక్స్‌ను వీక్షించవచ్చని తెలిపింది.ఈ విషయం గురించి వయాకామ్ స్పోర్ట్స్ మార్కెటింగ్ హెడ్ దమయంత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మన పారా అథ్లెట్లు గతంలో పతకాలు సాధించి ఈ క్రీడలపై ఆసక్తిని మరింతగా పెంచారు. పారాలింపిక్స్‌ను సెలబ్రేట్ చేసుకునే క్రమంలో గొప్ప అనుభూతి కలిగేలా మేము ఈ క్రీడలను చూపించబోతున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ పారా అథ్లెట్ల ఆదర్శప్రాయమైన కథలను మీ ముందుకు తీసుకురాబోతున్నందుకు సంతోషిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.పతకధారులుగా వారేకాగా ప్యారిస్ పారాలింపిక్స్‌లో మొత్తం 4,400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. భారత్ నుంచి 84 మంది బరిలోకి దిగనుండగా.. జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. మొత్తంగా 12 క్రీడాంశాల్లో మన పారా అథ్లెట్లు భాగం కానున్నారు. ఇక గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు గెలిచింది. పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి ప్యారిస్‌లో పదికి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇక ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్యాలు కైవసం చేసుకుంది. -
లీలా ప్యాలెస్‌లో మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం
చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్‌లో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్ రూమ్స్‌లో టవల్స్, పిల్లోస్, న్యాప్కిన్స్ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్ నిర్వహకులు. హోటల్ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. The Leela Palace Chennai welcomes Manu Bhaker, the Olympic Champion ! Just WoW pic.twitter.com/Dc2lhQpnE4— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2024హోటల్ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కాగా, మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లోని రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి దివ్యాంగుల విశ్వ క్రీడలు ప్రారంభం
పారిస్: యావత్ క్రీడా ప్రపంచాన్ని ఏకం చేసిన సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌కు తెరలేవనుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారిస్ క్రీడల్లో మహిళల విభాగాల్లో మరో 10 మెడల్ ఈవెంట్స్‌ను జోడించారు. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరం... ఇప్పుడు పారాలింపిక్స్‌ను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది. పోటీల తొలి రోజు తైక్వాండో, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, సైక్లింగ్ క్రీడాంశాల్లో మెడల్ ఈవెంట్స్ జరగనున్నాయి. సమ్మర్, వింటర్ పారాలింపిక్స్‌లో కలిపి ఇప్పటికే 7 స్వర్ణాలు సహా 17 పతకాలు నెగ్గిన అమెరికా మల్టీ స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఒక్సానా మాస్టర్స్ హ్యాండ్ సైక్లింగ్‌లో మరిన్ని పతకాలపై దృష్టి పెట్టగా.. పారాలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఈజిప్ట్ పారా పవర్‌లిఫ్టర్ షరీఫ్ ఉస్మాన్ నాలుగో పసిడి సాధించాలనే లక్ష్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నాడు.భారీ అంచనాలతో భారత్..మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు... ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పారిస్‌లో అడుగు పెట్టారు. ఈసారి భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.గత కొంతకాలంగా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ సుమిత్ అంటిల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు. చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్ శీతల్ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్‌పుటర్ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్ రోయింగ్ ప్లేయర్ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది. -
‘ప్రతిసారి దూకుడు పనికిరాదు.. సూపర్ ఫిట్‌గా ఉండాలి’
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల ఈ షట్లర్ కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో ఆడటానికి ముందు అత్యుత్తమ ఫిట్నెస్ సాధించేందుకు ఆదివారం ఆస్ట్రియా బయలుదేరాడు. ఈ నేపథ్యంలో లక్ష్య కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. బలాబలాలు అంచనా వేసుకునేందుకు, సానుకూలతలు పెంచుకునేందుకు ఈ పర్యటన లక్ష్య సేన్‌కు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం లక్ష్యసేన్ పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడు. కానీ అతడికి మరింత శారీరక శిక్షణ అవసరం. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్‌పై దృష్టి పెట్టాలి. అందుకే లక్ష్య వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటాడు. ఫిట్నెస్ను మరింత మెరుగు పరుచుకోవడంతో పాటు... అతడి ఆటలో వేగం పెంచుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడనుంది. సాధారణంగా లక్ష్య ఆటతీరు దూకుడుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు డిఫెన్స్ కూడా ముఖ్యమే. నెట్ గేమ్‌పై పట్టు సాధించాలంటే సూపర్ ఫిట్‌గా ఉండాలి’అని విమల్ పేర్కొన్నాడు. వచ్చే నెలలో హాంకాంగ్ సూపర్–500, చైనా ఓపెన్ సూపర్–1000 టోరీ్నల్లో లక్ష్యసేన్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. -
వినేశ్ ఫోగట్‌కు బంగారు పతకం
ఇటీవలి ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను రోహ్తక్లోని (హర్యానా) సర్వ్‌ఖాప్ పంచాయతీ బంగారు పతకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..Haryana Khap Panchayat gave gold medal to Vinesh Phogat. Can someone tell me what is India's ranking at Olympics after this medal? pic.twitter.com/h6EBOCXQrj— BALA (@erbmjha) August 25, 2024“మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. మహిళా రెజర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము” అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన ఖాప్ పెద్దలకు ఫోగట్ ధన్యవాదాలు తెలిపింది. ఖాప్ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో ఖాప్ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అంది.కాగా, వినేశ్ ఫోగట్ గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజేపీ సీనియర్ లీడర్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా హర్యానా రెజ్లర్లతో కలిసి పోరాటం చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు ముందు ఫోగట్ నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో ఆమె కనీసం రజత పతకాన్ని కూడా నోచుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం విషయంలో వినేశ్ సీఏఏస్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రూల్స్ రూల్సే అని సీఏఏస్ ఫోగట్ అభ్యర్థనను కొట్టిపారేసింది. -
శ్రీజేష్‌కు రూ.2 కోట్ల భారీ నజరానా.. ప్రకటించిన కేరళ సర్కార్
భారత స్టార్ హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకీ విడ్కోలు పలికాడు.ఈ నేపథ్యంలో శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అతడికి రూ.2 కోట్ల నగదు బహుమతి ఇవ్వునున్నట్లు కేరళ సర్కార్ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. ప్యారిస్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. కాగా తన 18 ఏళ్ల కెరీర్లో శ్రీజేష్ భారత్ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు. -
Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్ తదితర వివరాలు
పారిస్‌లో విశ్వక్రీడలు ముగిసి రోజులు గడవక ముందే అదే చోట మరో మహాసంగ్రామం మొదలుకానుంది. ఆగస్ట్ 28 నుంచి పారిస్ వేదికగా 2024 పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్ తొలిసారి సమ్మర్ పారాలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 8న జరిగే క్లోజింగ్ సెర్మనీతో ముగుస్తాయి.2021 టోక్యో పారాలింపిక్స్లా కాకుండా ఈసారి పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తారు. కరోనా కారణంగా గత పారాలింపిక్స్ జనాలు లేకుండా సాగాయి.ఈసారి పారాలింపిక్స్‌లో మొత్తం 22 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4400 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. భారత్ ఈసారి 84 సభ్యుల బృందాన్ని పారిస్‌కు పంపుతుంది.ఈసారి పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు రెగ్యులర్ ఒలింపిక్స్ తరహాలో స్టేడియం బయట జరుగనున్నాయి. పెరేడ్ సందర్భంగా అథ్లెట్లు పారిస్‌లోనే ఐకానిక్ ల్యాండ్‌మార్క్స్ చుట్టూ మార్చ్ చేస్తారు.తొలి రోజు పారాలింపిక్స్ పోటీలు ఆగస్ట్ 29న మొదలవుతాయి. ఆ రోజు మొత్తం 22 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి.పారిస్ పారాలింపిక్స్‌లోని క్రీడా విభాగాలు..బ్లైండ్ ఫుట్బాల్పారా ఆర్చరీపారా అథ్లెటిక్స్బోసియాగోల్బాల్పారా బ్యాడ్మింటన్పారా కనోయ్పారా సైక్లింగ్పారా ఈక్వెస్ట్రియాన్పారా తైక్వాండోపారా ట్రయథ్లాన్పారా టేబుల్ టెన్నిస్సిట్టింగ్ వాలీబాల్వీల్చైర్ బాస్కెట్బాల్వీల్చైర్ ఫెన్సింగ్వీల్చైర్ రగ్బీవీల్చైర్ టెన్నిస్పారా స్విమ్మింగ్షూటింగ్ పారా స్పోర్ట్పారాలింపిక్స్లో ఈసారి భారత్ నుంచి రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రితం ఎడిషన్‌లో భారత్ 54 మంది మాత్రమే విశ్వక్రీడలకు పంపింది. ఆ క్రీడల్లో భారత్ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) సాధించి ఆల్‌టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా కనీసం 25 పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.క్రీడాంశాల వారీగా 2024 పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత్ అథ్లెట్లు..పారా ఆర్చరీ (6)హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పారా అథ్లెటిక్స్ (38)దీప్తి జీవన్జీ - మహిళల 400మీ -టీ20సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్‌పుట్ - F46మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్‌పుట్ - F34మను - పురుషుల షాట్ పుట్ - F37పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57రవి రొంగలి - పురుషుల షాట్‌పుట్ - F40సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47సోమన్ రాణా - పురుషుల షాట్‌పుట్ - F57హొకాటో హొటోచే సేమా- పురుషుల షాట్ పుట్ - F57సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55రక్షిత రాజు- మహిళల 1500 మీటర్ల T11అమీషా రావత్: మహిళల షాట్‌పుట్ - F46భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53పారా బ్యాడ్మింటన్ (13)మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4తరుణ్ - పురుషుల సింగిల్స్ S4మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3మన్దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6పారా కనోయ్ (3)ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పారా సైక్లింగ్ (2)అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్బ్లైండ్ జూడో (2)కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1కోకిల: మహిళల -48కిలోల జె2పారా పవర్ లిఫ్టింగ్ (4)పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకుఅశోక్ - పురుషుల 63 కేజీల వరకుసకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళలకస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళలపారా రోయింగ్ (2)అనిత - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xనారాయణ కొంగనపల్లె - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xపారా షూటింగ్ (10)అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1అవని లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1నిహాల్ సింగ్: P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1సిద్ధార్థ బాబు: R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1పారా స్విమ్మింగ్ (1)సుయాష్ నారాయణ్ జాదవ్- పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లై - S7పారా టేబుల్ టెన్నిస్ (2)సోనాల్‌బెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS3, మహిళల డబుల్స్- WD10భావినాబెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS4, మహిళల డబుల్స్- WD10పారా తైక్వాండో (1)అరుణ- మహిళల కే44- 47 కేజీలుపారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు 31 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. భారత్ గత పారాలింపిక్స్‌లోనే 19 పతకాలు సాధించింది.1. మురళీకాంత్ పెట్కర్ - హైడెల్బర్గ్ 1972 ( స్విమ్మింగ్‌లో స్వర్ణం, పురుషుల 50 మీ ఫ్రీస్టైల్ 3 )2. భీమ్రావ్ కేసర్కర్ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో రజతం)3. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో కాంస్యం)4. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల షాట్‌పుట్ L6లో రజతం)5. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల డిస్కస్ త్రో L6లో కాంస్యం)6. దేవేంద్ర ఝఝరియా - ఏథెన్స్ 2004 ( పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం F44/ 46)7. రాజిందర్ సింగ్ రహేలు - ఏథెన్స్ 2004 (పురుషుల 56 కేజీలలో కాంస్యం)8. గిరీషా ఎన్ గౌడ - లండన్ 2012 (పురుషుల హైజంప్ F42లో రజతం)9. మరియప్పన్ తంగవేలు - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో స్వర్ణం)10. వరుణ్ సింగ్ భాటి - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో కాంస్యం)11. దేవేంద్ర ఝఝరియా- రియో 2016 (పురుషుల జావెలిన్ త్రో F46లో స్వర్ణం)12. దీపా మాలిక్ - రియో 2016 (మహిళల షాట్‌పుట్ F53లో రజతం)13. భావినా పటేల్ - టోక్యో 2020 (మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో రజతం)14. నిషాద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T47లో రజతం)15. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్ SH1లో స్వర్ణం)16. దేవేంద్ర ఝఝరియా - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F46లో రజతం)17. సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో F46లో టోక్యో 2020 కాంస్యం)18. యోగేష్ కథునియా - టోక్యో 2020 (పురుషుల డిస్కస్ త్రో F56లో రజతం)19. సుమిత్ యాంటిల్ - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F64లో స్వర్ణం)20. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ SH1లో కాంస్యం)21. మరియప్పన్ తంగవేలు - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో రజతం)22. శరద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో కాంస్యం)23. ప్రవీణ్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T64లో రజతం)24. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో SH1లో కాంస్యం)25. హర్విందర్ సింగ్ - టోక్యో 2020 (పురుషుల వ్యక్తిగత రికర్వ్ - ఓపెన్ ఆర్చరీలో కాంస్యం)26. మనీష్ నర్వాల్ - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో స్వర్ణం)27. సింగ్‌రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో రజతం28. ప్రమోద్ భగత్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణం)29. మనోజ్ సర్కార్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో కాంస్యం)30. సుహాస్ యతిరాజ్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4లో రజతం)31. కృష్ణ నగర్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SH6లో కాంస్యం) -
క్రీడలను కెరీర్‌గా ఎంచుకోండి, జీవితం అందంగా ఉంటుంది: మనూ భాకర్
చెన్నై: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షూటర్ మనూ భాకర్ క్రీడారంగంలోనూ అందమైన కెరీర్ ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, ఇంజినీర్లే కాదు క్రీడాకారులుగా కూడా అందమైన జీవితాన్ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నై విద్యార్థులకు సూచింది. మంగళవారం వేళమ్మాల్ నెక్సస్ స్కూల్ మనూను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం టోక్యోలో ఎదురైనా పరాభవాన్ని పారిస్‌లో రెండు పతకాలతో అధిగమించిన తీరును వివరించింది. ఓటమిని రుచి చూసి... ‘ప్రపంచ రెండో ర్యాంక్ షూటర్‌గా టోక్యోకు వెళ్లాను. కానీ ఒలింపిక్స్‌లో నా గురి అస్సలు కుదర్లేదు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఎదురైన చేదు అనుభవం కొన్నాళ్లు నా ప్రయాణాన్ని కష్టంగా మార్చింది. అయినా నేనెప్పుడూ దాన్నే తలచుకొని దిగులుపడలేదు. ఓటమిని రుచి చూసిన నాకు విజయం దక్కుతుందని తెలుసు. స్పోర్ట్స్ అంటేనే అది! ఒకదాంట్లో పరాజయం, మరోదాంట్లో విజయం సహజం. అయితే ఇవన్నీ కూడా కష్టపడితేనే సాధ్యం’ అని పేర్కొంది. మనం కనే పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆ స్థాయిలో కఠోరంగా శ్రమించాల్సిందేనని మనూ తెలిపింది. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం చెమటోడ్చాలని, ఒక్కసారిగా అవి సాకారం కాకపోవచ్చని... కానీ అంతమాత్రాన నిరాశ చెందకుండా లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని వివరించింది. Badhiya pradarshani chal rahi is desh main Bronze medal ki. pic.twitter.com/sX2FpS4vZX— Prayag (@theprayagtiwari) August 20, 2024ఆత్మవిశాస్వంతో... ‘నేనెప్పుడు కూడా పోటీల్లో జయాపజయాల గురించి పట్టించుకోలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ప్రతీ పరీక్షను ఆ ఆత్మవిశ్వాసంతోనే నెట్టుకొస్తాను. మనకు కెరీర్లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. చాలామంది డాక్టరో, ఇంజనీర్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకుంటారు. కానీ క్రీడల్లోనూ అపారమైన అవకాశాలున్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన మద్దతు కావొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు. క్రీడల్లో అవన్నీ దక్కుతాయి’ అని మనూ భాకర్ వివరించింది. అమ్మ చూపిన దారి... తనకు తన అమ్మ స్ఫూర్తి అని ఆమె చూపించిన దారే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పింది. అడుగడుగునా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోతే పిల్లలకు ఇవేవి సాధ్యం కానేకావని తెలిపింది. ‘ఏ క్రీడయినా సరై బీజం పడేది ఇంట్లోనే! ఆ తర్వాత స్కూల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల భవితకు చక్కని బాట వేయడంలో కీలక భూమిక పోషిస్తారు’ అని వినమ్రంగా చెప్పింది. మన సంస్కృతి, నేపథ్యం ఏదైనా మనం ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకూడదని, చిన్న చిన్న అవరోధాలు ఎదురైనంత మాత్రాన ఆగిపోకూడదని స్ఫూర్తివంతమైన మాటలతో విద్యార్థులను మనూ ఉత్తేజపరిచింది. మన ప్రదర్శన బాలేకపోయినా, కొన్నిసార్లు విఫలమైనా, క్రీడల్లో పతకాలు గెలవలేకపోయినా, పరీక్షల్లో పాస్ కాకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోకూడదని ఉద్బోధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది. సరదాగా ఆడి పాడిన మనూ..కార్యక్రమం ముగింపు సందర్భంగా మనూ విద్యార్థులతో కలిసి ప్రముఖ హిందీ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
విన్ వీధిలో మెరిసినా... పాదాలు నేల మీదే
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సరే... ఆత్మస్థైర్యంతో ఆకాశంకేసి చూడాలి. పెద్ద కలలు కనాలి. కష్టపడి సాధించాలి. కల నెరవేరిన తరువాత ఆకాశంలో ఉండిపోకూడదు. మన పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలి. మన దేశంలోని జులేఖ, చైనా దేశానికి చెందిన యకిన్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు...పేవ్మెంట్ నుంచి ఒలింపిక్స్ వరకుపేవ్మెంట్ల దగ్గర భిక్షాటన చేసిన అమ్మాయి ఆ తరువాత కాలంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. ఇది సినిమా కథ కాదు. నిజ జీవిత కథ. ముంబైకి చెందిన జులేఖ కథ. అనాథాశ్రమంలో పెరిగిన జులేఖ వాలీబాల్ ఆటలో ్రపావీణ్యం సంపాదించింది. ఆ ఆట ఆమెను అబుదాబి స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో పాల్గొనేలా చేసింది.మంచం మీద పడుకోవడం ‘లగ్జరీ’ విషయమేమీ కాదు. జులేఖ షేక్‌కు మాత్రం లగ్జరీనే! పదహారు సంవత్సరాల క్రితం శుక్రాపూర్ హైవేపై ఎనిమిదేళ్ల జులేఖా షేక్ కాలికి గాయమై పడి ఉండడాన్ని పోలీసులు గమనించి చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆసుపత్రిలో జులేఖ ఫ్యాన్ కింద బెడ్‌పై పడుకుంది.ఇది తనకు సరికొత్త అనుభవం. కటిక నేల మీద తప్ప ఆమె ఎప్పుడూ బెడ్ మీద పడుకోలేదు. భిక్షాటన చేయడం, ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం, రాత్రి పడుకోవడానికి స్థలం వెదుక్కోవడం... స్థూలంగా ఇది తన జీవితం. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తరువాత జులేఖను ఒక అనాథాశ్రమంలో చేర్పించారు పోలీసులు. అలా ఆమెకు అనికేత్ సేవాభవి సంస్థ నిర్వాహకురాలు కల్పన వర్పే పరిచయ భాగ్యం కలిగింది. ఆ తరువాత జులేఖ జీవితమే మారిపోయింది.కట్ చేస్తే... అబుదాబి 2019 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో వాలీబాల్‌లో మన దేశానికి ్రపాతినిధ్యం వహించడమే కాదు కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పతకం తనకు పతకం మాత్రమే కాదు... కొత్త జీవితం... కొత్త శక్తి! ఈ పతకం గురించి అడిగిన వారికి, అడగని వారికి అందరికీ చూపిస్తూ ఎంతోసేపు సంతోషంగా మాట్లాడుతుంది జులేఖ.గతంలోకి వెళితే...గ్రౌండ్లో అబ్బాయిలు వాలీబాల్ అడుతున్నారు. ‘సర్, నేను ఆడవచ్చా’ అని స్పోర్ట్స్ టీచర్ అశోక్ రామచంద్రన్ నాంగ్రాను అడిగింది జులేఖ. ‘కుదరదు’ అని ఆయన అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన పచ్చ జెండా ఊపడంతో గ్రౌండ్లోకి అడుగుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అబ్బాయిలతో సమానంగా, వారిని మించి వాలీబాల్ ఆడడం మొదలుపెట్టింది. ఆ ప్రతిభ తనని రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్ ఆడేలా చేసింది. అబుదాబి ఒలింపిక్స్ కోసం తొలిసారి విమానం ఎక్కడం జులేఖ జీవితంలో మరచిపోలేని మధురమైన అనుభవం.‘బాల్యంలో ఎన్నో కష్టాలు పడి ఉండడం వల్ల మొదట్లో చాలా హైపర్‌గా కనిపించేది. ఆలోచనలు స్థిరంగా ఉండేవి కాదు. ఆ తరువాత ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఏదైనా సాధించి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటుంది జులేఖ గురించి కల్పనా వర్పే. ‘రాత్రి పడుకోవడానికి చోటు వెదుక్కోవడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అనాథాశ్రమంలో చేరిన తరువాత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లే ఉండేది. ఎన్నో పద్ధతులు నేర్చుకున్నాను. సెలవుల్లో అమ్మడానికి మట్టి ప్రమిదల నుంచి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం వరకు ఎన్నో చేశాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది జులేఖ. కొత్త జీవితాన్ని ఇచ్చిన అనికేత్ సేవాభవి సంస్థకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది.‘ఇక్కడి వారి పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధ, ప్రేమ అపురూపంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల నుంచి వచ్చిన వారికి వేడి వేడి చాయి చేసి ఇస్తుంది. వారికి ధైర్యం చెబుతుంటుంది’ అని జులేఖ గురించి ప్రశంసాపూర్వకంగా చెబుతుంది కల్పనా వర్పే. ఒకప్పటి జులేఖలాంటి అమ్మాయిలు ఇప్పుడు కూడా ఫుట్‌పాత్‌ల మీద కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. అలాంటి వారికి కొత్త జీవితం ఇవ్వాలనేది జులేఖ కల.ఒలింపిక్స్ నుంచి రెస్టారెంట్లో పనికి!ఒలింపిక్స్‌లో పాల్గొనడం గొప్ప. పతకం గెల్చుకోవడం మరింత గొప్ప. అసలుసిసలు ఆటగాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తారు తప్ప తల కెక్కించుకోరు అని చెప్పడానికి ఒలిపింక్స్‌లో రజత పతకం గెల్చుకున్న చైనా జిమ్నాస్ట్ యకిన్ ఒక ఉదాహరణ. పద్దెనిమిది సంవత్సరాల ఝౌ యకిన్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎప్పటిలాగే తన కుటుంబానికి చెందిన రెస్టారెంట్ పనుల్లో పడిపోయింది.ఒలింపిక్ యూనిఫామ్‌లో తమ రెస్టారెంట్లో ఎప్పటిలాగే కస్టమర్లకు వడ్డిస్తున్న వీడియోని చూస్తూ ‘షీ గాట్ ఏ సిల్వర్, బట్ గేవ్ ఏ గోల్డ్ సర్వీస్’ అంటున్నారు నెటిజనులు. సెంట్రల్ చైనాలోని హునాన్ ్రపావిన్స్లోని హెంగ్యాంగ్ సిటిలో ఈ రెస్టారెంట్ ఉంది. చైనా నుంచి ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అయిదుగురు జిమ్నాస్ట్‌లలో యకిన్ ఒకరు.‘ఈ అందమైన చైనీస్ జిమ్నాస్ట్ గుర్తుందా?’ అనే కాష్షన్‌తో ‘ఎక్స్’లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఒలింపిక్స్ విజయాన్ని, కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకుంటున్న యకిన్పై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్పారు. చేస్తున్న పని చిన్నదా, పెద్దదా అనేది పక్కన పెడితే పనిని గౌరవించడం మన బాధ్యత. పనికి మనం ఇచ్చే గౌరవం వృథా పోదు... ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని చెప్పడానికి కూడా ఝౌ యకిన్ నిలువెత్తు ఉదాహరణ. -
దేశం మారనున్న పారిస్ ఒలింపిక్స్ మూడు పతకాల విజేత
మెల్బోర్న్: విశ్వక్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఓ అథ్లెట్... వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్డ్సన్.. అనూహ్య నిర్ణయంతో అభిమానులను విస్మయ పరిచాడు. ఇకపై ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ‘పారిస్’ క్రీడల్లో రిచర్డ్సన్ రెండు వ్యక్తిగత రజతాలు, ఒక టీమ్ కాంస్యం గెలుచుకున్నాడు. 25 ఏళ్ల రిచర్డ్సన్ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ్రస్టేలియాకు వలస వచ్చాడు. ‘మాథ్యూ నిర్ణయం అనూహ్యం. చాలా వేదనకు గురయ్యాం. అయితే అతడు మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆ్రస్టేలియా సైక్లింగ్ సమాఖ్య మేనేజర్ జెస్ కోర్ఫ్ తెలిపాడు. ఇదేదో ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. బాగా ఆలోచించి తీసుకున్నదని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై గౌరవం ఉంది. అయినా ఇది అనాలోచిత నిర్ణయం కాదు. ఇకపై బ్రిటన్ తరఫున పోటీ పడాలనుకుంటున్నా’ అని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ సైక్లింగ్ సమాఖ్య సోషల్ మీడియా వేదికగా రిచర్డ్సన్కు స్వాగతం పలికింది. -
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది. -
వినేశ్‌కు రూ. 16 కోట్ల నజరానాలు?.. చీప్ పబ్లిసిటి అంటూ భర్త ఫైర్
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు భారీ నజరానాలు అందాయన్న ప్రచారాన్ని ఆమె భర్త సోమ్‌వీర్ రాఠీ ఖండించాడు. కేవలం ప్రచార యావతోనే కొంతమంది ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడ్డ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.పసిడి పతకంపై ఆశలు ఆవిరిప్రి క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్ సుసాకీ(జపాన్)ను ఓడించిన వినేశ్.. ఆ తర్వాత క్వార్టర్, సెమీ ఫైనల్లో వరుస విజయాలు సాధించింది. అయితే, స్వర్ణ పతక రేసులో పాల్గొనే క్రమంలో నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా అనూహ్య రీతిలో అనర్హత వేటుకు గురైంది వినేశ్. ఫలితంగా పసిడి పతకంపై ఆశలు పెట్టుకున్న భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి.అండగా అభిమానులుఅయినప్పటికీ వినేశ్ ఫొగట్ పోరాట పటిమను.. బరువు తగ్గే క్రమంలో ప్రాణాలకు తెగించి ఆమె కసరత్తులు చేసిన తీరును ప్రశంసిస్తూ అందరూ ఆమెకు అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఈ హర్యానా రెజ్లర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘‘పతకం కంటే మాకు నువ్వే ఎక్కువ బంగారం’’అంటూ యావత్ భారతావని ఆమెకు మద్దతు ప్రకటించింది.ఈ నేపథ్యంలో వినేశ్ ఫొగట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సుభాష్ ఫౌజీ అనే ఓ ఎక్స్ యూజర్.. వినేశ్ ఫొగట్‌కు రూ. 16 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ రివార్డు అందిందంటూ పోస్ట్ చేశారు. రాజకీయంగా ఓ పార్టీని టార్గెట్ చేస్తూ అందుకు వినేశ్ ఫొటోలను వాడుకున్నారు.తప్పుడు వార్తలు ప్రచారం చేయకండిఈ ట్వీట్‌పై స్పందించిన వినేశ్ ఫొగట్ భర్త, రెజ్లర్ సోమ్‌వీర్ రాఠీ.. ‘‘ఏ సంస్థల నుంచి గానీ, వ్యాపారస్తులు, కంపెనీలు, పార్టీల నుంచి గానీ వినేశ్ ఫొగట్ డబ్బు తీసుకోలేదు. మా శ్రేయోభిలాషులారా.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. ఇలాంటివి మాకు హాని తలపెట్టలేవు. కానీ.. సామాజిక విలువలను ప్రభావితం చేస్తాయి. కేవలం చవకబారు ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తారు’’ అని ఫైర్ అయ్యాడు. చదవండి: ‘అతడు లేకుంటే నేను లేను’.. వినేశ్ ఫొగట్ భర్త గురించి తెలుసా?निम्नलिखित संस्थाओं, व्यापारियों, कंपनियों और पार्टियों द्वारा विनेश फोगाट को कोई धनराशि प्राप्त नहीं हुई है. आप सभी हमारे शुभचिंतक लोग हैं, कृपया झूठी खबरें न फ़ैलाएँ. इससे हमारा नुक़सान तो होगा ही. सामाजिक मूल्यों का भी नुक़सान होगा.यह सस्ती लोकप्रियता पाने का साधन मात्र है. pic.twitter.com/ziUaA8ct1W— Somvir Rathee (@somvir_rathee) August 18, 2024 -
‘అతడు లేకుంటే నేను లేను’.. వినేశ్ ఫొగట్ భర్త గురించి తెలుసా?
Vinesh Phogat's Love Life: Who Is Somvir Rathee: ‘‘సోమ్‌వీర్.. నా జీవితంలోని ముఖ్యమైన పాత్రలన్నింటినీ అతడే పోషించాడు. ప్రతీ విషయంలోనూ నాకు అండగా నిలిచాడు. కఠినసవాళ్లు ఎదురైన ప్రతిసారీ.. నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. నాకు రక్షణగా నిలిచాడు. నా ప్రయాణం సజావుగా సాగేందుకు తను ఎన్నో వదులుకున్నాడు. అత్యంత విశ్వసనీయత, అంకితభావం, నిజాయితీ ఉన్న వ్యక్తి. తను గనుక నాతో లేకుంటే అన్న ఊహే కష్టంగా ఉంటుంది.తన తోడు లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదు. ఎల్లవేళలా నాతో కలిసి అడుగులు వేశాడు. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు.. అవసరమైన వేళ నాకు రక్షణంగా ముందు వరుసలో నిలబడ్డాడు. నా విజయాల్లో మాత్రం వెనకే ఉన్నాడు నా ప్రియమైన స్నేహితుడు’’- భర్త సోమ్‌వీర్ రాఠీ గురించి భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ భావోద్వేగంతో రాసిన వాక్యాలు. తన జీవితంలో తల్లి పాత్ర ఎంత ఉందో జీవన సహచరుడి పాత్ర కూడా అంతకంటే తక్కువేమీ కాదని అతడిపై ఇలా అక్షరాల రూపంలో ప్రేమను వ్యక్తపరిచింది.తండ్రి ప్రేమ చిన్ననాడే దూరం.. తల్లి ఇచ్చిన స్ఫూర్తితోహర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ తనకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు తండ్రిని కోల్పోయింది. బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద చనిపోవడంతో ఆ బాధ్యత భార్యపై పడింది. ముగ్గురు పిల్లల పోషణే గగనమైన సమయంలో క్యాన్సర్ రూపంలో ప్రాణాంతక వ్యాధి బారిన పడిన విషయం ఆమెకు తెలిసింది. అయినా.. ఆ తల్లి కుంగిపోలేదు. ధైర్యంగా మహ్మమారితో పోరాడి గెలిచింది. తన పిల్లల్లోనూ ధైర్యం నూరిపోసి.. కఠిన సవాళ్లకు ఎదురీదేలా చేసి.. రెజ్లర్లుగా తీర్చిదిద్దింది. అలా తల్లి నుంచి స్ఫూర్తి పొందిన వినేశ్ ఫొగట్.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో సోమ్‌వీర్ రాఠీతో 2011లో పరిచయం ఏర్పడింది.వినేశ్ ప్రేమ కథ అక్కడే మొదలుఅతడు కూడా హర్యానాకు చెందినవాడే. వినేశ్ మాదిరి తనూ రెజ్లరే. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్న సోమ్‌వీర్ రాఠీ కూడా రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. విధి నిర్వహణలో భాగంగా వినేశ్తో మాట కలిపిన సోమ్‌వీర్.. అనతికాలంలోనే ఆమెకు మంచి స్నేహితుడయ్యాడు. సంతోషం.. బాధ ఏదైనా ముందుగా తనతోనే పంచుకునేంతగా వినేశ్ మనసుకు చేరువయ్యాడు.కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో అన్నిరకాలుగా అండగా ఆమెకు నిలిచాడు. కష్టసుఖాల్లో వెంట ఉండే తన ప్రియమైన స్నేహితుడే.. భర్తగా మారితే ఇంకెంత బాగుంటుందోనని భావించిన వినేశ్ కలను నిజం చేస్తూ.. ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు సోమ్‌వీర్.ఎనిమిదో అడుగు2018 నాటి జకార్తా ఆసియా క్రీడల్లో వినేశ్ స్వర్ణం గెలిచి స్వదేశానికి చేరుకున్న శుభముహూర్తాన.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలోనే ఆమె వేలికి ఉంగరం తొడిగి.. తన మనసులోని మాటను వెల్లడించాడు. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు నిండు మనసుతో ఆశీర్వదించాయి. అదే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేశాయి.అయితే, ఆ సమయంలో వినేశ్- సోమ్‌వీర్ తమ కుటుంబ సభ్యులకు ఓ షరతు విధించారు. పెళ్లి వేడుకలోని ప్రతీ తంతులో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉపయోగించాలని కోరారు. తద్వారా రెండు మనసుల కలయికను సంప్రదాయబద్దంగా తెలియజేసేందుకు ఆడంబరాలు అవసరం లేదనే సందేశాన్ని యువ జంటలకు ఇచ్చి కపుల్ గోల్స్ సెట్ చేశారు.అంతేకాదు.. వివాహ సమయంలో ఏడడుగులతో పాటు ఎనిమిదో అడుగు కూడా కలిసి వేశారు వినేశ్- సోమ్‌వీర్. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి విషయంలోనూ పరస్పర అవగాహన, ప్రేమతో ముందుకు సాగుతున్నారు.వినేశ్ తన ఆరో ప్రాణంవినేశ్కు రెజ్లింగ్ అంటే ప్రాణం. సోమ్‌వీర్‌కు ఆమె ఆరోప్రాణం. అందుకే ఆమె ఆశయం కోసం తన కెరీర్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు. అంతేకాదు అన్యాయాన్ని సహించలేని గుణం ఉన్న వినేశ్ తోటి మహిళా రెజ్లర్ల కోసం న్యాయపోరాటానికి దిగినప్పుడూ నా మద్దతు నీకేనంటూ కొండంత భరోసా ఇచ్చాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య నాటి అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు వెనుక నుంచే ప్రోత్సాహం అందించాడు. ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ ఆమె వెంటే ఉన్న సోమ్‌వీర్.. పతకం లేకుండా తన సహచరి స్వదేశానికి తిరిగి రావడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు.మరేం పర్లేదు సోమ్వీర్భార్యకు దక్కిన అపూర్వ స్వాగతానికి, మద్దతుకు సంతోషిస్తూనే.. దేశం మొత్తం ఆమెపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్దుడవుతూనే... మెడల్ గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరేం పర్లేదు సోమ్‌వీర్.. నీ సహచరి వినేశ్ తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే యావత్ భారతావని హృదయాలు గెలిచింది. నీ పట్ల తన ప్రేమను చాటుకుని మీ బంధం ఎంత దృఢమైందో కూడా చెప్పింది!!అనర్హత వేటు.. పతక నిరాకరణప్యారిస్ ఒలింపిక్స్-2024లో సంచలన విజయాలతో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్ అనూహ్య రీతిలో విశ్వ క్రీడల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ప్రి క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్)పై గెలుపొందిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఓడించింది.ఈ క్రమంలో సెమీస్ చేరి.. అక్కడ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. అయితే, పసిడి పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంగా ఆమెపై వేటు పడింది. అయితే,సెమీస్ వరకు తన ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పోర్ట్‌ను కోరగా.. వినేశ్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.pic.twitter.com/8iu2vs21Wq— Vinesh Phogat (@Phogat_Vinesh) August 16, 2024 -
గిఫ్ట్‌గా గేదె బదులు.. పొలం ఇవ్వాల్సింది: అర్షద్ నదీమ్
గేదెను బహుమతిగా అందుకోవడం పట్ల పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ స్పందించాడు. తనకు పిల్లనిచ్చిన మామ ‘ధనవంతుడని’.. గేదెకు బదులు పొలం ఇచ్చి ఉంటే బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్-2024 జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు అర్షద్ నదీమ్.కోట్ల నజరానాపాకిస్తాన్ నలభై ఏళ్ల నిరీక్షణకు తెరదించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురిసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) రూపాయల నజరానా ప్రకటించగా.. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సైతం నగదు ప్రోత్సాహకంతో పాటు 92.97 నేమ్ప్లేటుతో ఉన్న కారును అతడికి బహూకరించారు.పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది!ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ మామయ్య అతడికి గేదెను బహుమతిగా ఇవ్వడం వార్తల్లో హైలైట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా గేదెనే బహుమతిగా ఇచ్చారు. దానికి బదులు ఓ ఐదెకరాల పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినా.. పర్లేదు.. బర్రె కూడా తక్కువేమీ కాదు కదా!’’ అంటూ జోక్ చేశాడు నదీమ్.భార్యను ఆటపట్టించిన నదీమ్ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న భార్య ఆయేషా స్పందిస్తూ.. ‘‘మా నాన్న ఈయనకు గేదెను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారని నాకసలు తెలియదు. వార్తల్లో చూసిన తర్వాతే ఈ విషయం తెలిసింది’’ అని పేర్కొంది. ఇందుకు బదులుగా.. ‘‘మీ నాన్న ధనికుడే కదా? మరి నాకు కేవలం గేదెను మాత్రమే ఎందుకు ఇచ్చాడు? 5-6 ఎకరాల పొలం ఇవ్వమని చెప్పాను. అయినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందనా లేదు’’ అంటూ నదీమ్ తన భార్యను ఆటపట్టించాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రేమతో ఇచ్చిన బహుమతిని అంతే ప్రేమగా స్వీకరించిన అర్షద్ నదీమ్‌లో హాస్య చతురత కూడా బాగానే ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా బలానికి గేదె ప్రతీక అని.. తమ గ్రామ ఆచారం ప్రకారం.. గేదెను బహుమతిగా పొందడాన్ని గౌరవంగా భావిస్తామని అర్షద్ నదీమ్ మామ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ బంగారు పతకం గెలవగా.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నీరజ్ ఖాతాలోనూ ఒలింపిక్ స్వర్ణం(టోక్యో) ఉండటం విశేషం.చదవండి: గ్రాండ్ వెల్కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)Arshad Nadeem's reaction on his father gifting him a buffalo after winning the Gold medal 😂😂😂He wanted 5-6 acre plot from his father-in-law and not a buffalo. Man, he's so simple 😭❤️ #Paris2024 pic.twitter.com/EzRv68GyAl— Farid Khan (@_FaridKhan) August 16, 2024 -
గ్రాండ్ వెల్కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు కారణంగా పతకం కోల్పోయిన ఫోగాట్.. సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ వద్ద ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఆపూర్వ స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వ్యాన్‌లో ర్యాలీగా ఆమెను ఊరేగించారు. ఈ సందర్భంగా వినేశ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమైంది. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా 55 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు ఫోగాట్ గురైంది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె అభ్యర్ధనను స్పోర్ట్స్ కోర్డు కొట్టిపారేసింది. #WATCH | Indian wrestler Vinesh Phogat receives a warm welcome at Delhi's IGI AirportCongress MP Deepender Hooda, wrestlers Bajrang Punia, Sakshee Malikkh and others welcomed her. pic.twitter.com/rc2AESaciz— ANI (@ANI) August 17, 2024 -
వినేశ్ ఫోగట్ కీలక నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడి పతకాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌కు విడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది.అయితే ఇప్పుడు వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్‌లో ఉద్వేగభరిత పోస్టు షేర్ చేసిన ఆమె.. అందులో పలు విషయాలను ప్రస్తావించింది. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, రెజ్లింగ్ కొనసాగించే సత్తా మాత్రం తనకు ఉందని ఫోగట్ తెలిపింది."నా బృందానికి, నా తోటి భారతీయులకు, నా ఫ్యామిలీకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా లక్ష్యాన్ని మేము ఇంకా చేరుకోలేదు. ఏదో మిస్ అయినట్లు అన్పిస్తోంది. అయితే పరిస్థితులు ఇకపై మునపటిలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు రెజ్లింగ్ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నేను నమ్మిన దాని కోసం నా పోరాటం ఆపనని వినేష్ పేర్కొంది.అదే విధంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ టీమ్‌పై ఫోగట్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరేన్ రస్కిన్హా, యతిన్ భట్కర్లతో పాటు చాలా మంది ఇతర అథ్లెట్లు నాకు మద్దతుగా నిలిచారు. వారి సపోర్ట్‌తోనే నేను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించగలిగాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు అంటూ ఫోగట్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
తను చచ్చిపోతుందేమోనని భయపడ్డాం: వినేశ్ కోచ్
‘‘సెమీ ఫైనల్ తర్వాత తను 2.7 కిలోల అధిక బరువు ఉన్నట్లు తేలింది. గంటా ఇరవై నిమిషాల వ్యాయామం తర్వాత కూడా ఇంకా కిలోన్నర బరువు ఎక్కువగా ఉంది. దీంతో మేము మరో యాభై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయిస్తూనే ఉన్నాం. తన శరీరం నుంచి ఒక్క చెమట చుక్క కూడా బయటకు రాలేదు.తనను నిర్ణీత బరువుకు రావడమే లక్ష్యంగా అర్ధ రాత్రి నుంచి మొదలు పెడితే తెల్లవారుజామున 5.30 నిమిషాల వరకు తను భిన్న రకాల కార్డియో ఎక్సర్సైజులు, రెజ్లింగ్ మూవ్స్ చేస్తూనే ఉంది. గంట గంటకు కేవలం రెండు- మూడు నిమిషాల విశ్రాంతి మాత్రమే తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ కసరత్తులు మొదలు.ఫలితంగా కాసేపటి తర్వాత ఆమె కుప్పకూలిపోయింది. అయితే, ఆ తర్వాత మళ్లీ గంటపాటు వ్యాయామం చేసింది. నేనేదో ఉద్దేశపూర్వకంగా తన కష్టం గురించి చెప్పడానికే ఈ పోస్టు పెట్టడం లేదు. తనను చూస్తే ఆరోజు నిజంగా భయం వేసింది. ఒకానొక దశలో చచ్చిపోతుందేమోనన్న భావన కలిగింది’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు షేర్ చేశాడు. గోల్డెన్ బౌట్లో పాల్గొనేందుకు వినేశ్ ఎంతగా శ్రమించిందో తమకు మాత్రమే తెలుసునంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కేజీల మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన హర్యానా అథ్లెట్ వినేశ్ ఫొగట్‌పై.. స్వర్ణ పతక రేసుకు ముందు అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండానే ఆమె వెనుదిరగాల్సి వచ్చింది.నంబర్ వన్ను ఓడించాను కదా!అయితే, తుదిపోరుకు అర్హత సాధించే క్రమంలో తాను ఎలాంటి పొరపాటు చేయలేదు గనుక.. సెమీస్ వరకు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని సంయుక్త రజతం ఇవ్వాల్సిందిగా వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీలు చేసింది. కానీ.. కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ వినేశ్‌కు అమె అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. నిజమైన చాంపియన్ నువ్వేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ నేపథ్యంలో వినేశ్ కోచ్ వోలర్ సైతం ఫేస్బుక్ వేదికగా పైవిధంగా పోస్ట్ పెట్టాడు. అంతేకాదు.. వినేశ్ వరల్డ్ నంబర్ వన్ యూ సుసాకీ ఓడించినందుకు గర్వంగా ఉందని.. ఈ విషయంలో వినేశ్ సైతం సంతృప్తిగా ఉందని తెలిపాడు. నిర్విరామ కసరత్తుల నేపథ్యంలో ఆస్పత్రి పాలై.. తిరిగి వచ్చిన తర్వాత.. ‘‘మన ప్రణాళికలు పక్కాగా అమలు చేయగలమని నిరూపించాం. అత్యుత్తమ రెజ్లర్‌ను నేను ఓడించాను. పతకాల కంటే మన ప్రదర్శనే ముఖ్యం’’ అని వినేశ్ తనతో అన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే, కాసేపటికే పోస్ట్ డిలీట్ చేయడం గమనార్హం. చదవండి: Vinesh Phogat: రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ.. -
Paris Olympic Players: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్యారిస్ ఒలింపిక్ బృందం (ఫొటోలు)
-
రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ..
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను ఉద్దేశించి ఆమె బంధువు, రెజ్లర్ బజరంగ్ పునియా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ఒలింపిక్ చేజారినా.. వినేశ్ పేరుప్రతిష్టలకు వచ్చిన నష్టమేమీ లేదని.. ఇప్పటికే అందరి హృదయాల్లో చాంపియన్‌గా ఆమె స్థానం దక్కించుకుందని పేర్కొన్నాడు. పతకాన్ని మాత్రమే కోరుకునే వారు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అంటూ వినేశ్‌ను విమర్శిస్తున్న వాళ్లకు చురకలు అంటించాడు.ఈ మేరకు.. ‘‘ఈ అంధకారంలో నీ పతకాన్ని ఎవరో మాయం చేశారు. అయినా సరే.. నువ్వొక వజ్రంలా మెరిసిపోతున్నావు. ఈరోజు ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంది. వరల్డ్ చాంపియన్. వినేశ్ ఫొగట్.. నువ్వు మన దేశపు కోహినూర్వి.వినేశ్ ఫొగట్ అంటే వినేశ్ ఫొగట్ మాత్రమే. హిందుస్థాన్ రుస్తం-ఇ-హింద్ నువ్వు. ఎవరైతే పతకాలు కావాలని కోరుకుంటున్నారో వారు రూ. 15 చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు’’ అని బజరంగ్ పునియా ఎక్స్ వేదికగా వినేశ్ ఫొగట్ మెడల్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.విశ్వ క్రీడల్లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడ్డ ఈ హర్యానా సివంగి.. పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) బుధవారం తమ తీర్పును వెలువరించింది. ఇక భారత ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.కాగా మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన వినేశ్.. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్పై విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి.. యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను 5-0తో మట్టికరిపించింది. ఫలితంగా ఒలింపిక్స్ ఫైనల్ చేరిన భారత తొలి రెజ్లర్‌గా రికార్డు నమోదు చేసింది.అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు అనూహ్య రీతిలో వినేశ్ ఫొగట్‌పై వేటు పడింది. నిర్ణీత 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య. ఈ నేపథ్యంలో తన అనర్హత, సెమీస్ వరకు చేరిన కారణంగా సంయుక్త రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అయితే పలుమార్లు తీర్పును వాయిదా వేసిన స్పోర్ట్స్ కోర్టు వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినేశ్‌కు అభిమానులు అండగా నిలుస్తుండగా.. కొంతమంది మాత్రం బరువు పెరగటంలో తప్పంతా ఆమెదే అన్నట్లుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బజరంగ్ పునియా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వినేశ్ ఫొగట్ వారి తరఫున ఢిల్లీలో ముందుండి పోరాటం చేయగా.. బజరంగ్ సహా సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ను వ్యతిరేకించేవారు.. ఆటపై కాకుండా క్రీడేతర విషయాలపై దృష్టి పెట్టిందని.. అందుకే ఈ ఫలితమని ఆమెపై విద్వేష విషం చిమ్ముతున్నారు. -
ఒలింపిక్స్-2036 ఆతిథ్యానికి భారత్ సన్నద్ధం: ప్రధాని మోదీ
భారత్ వేదికగా విశ్వ క్రీడలు నిర్వహించాలన్న ఆశయానికి చేరువవుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ప్యారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే విశ్వ క్రీడలు నిర్వహించాలన్న భారత్ కల సమీప భవిష్యత్తులో నెరవేరనుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.వారికి అభినందనలుఈ మేరకు.. ‘‘ఒలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేసిన యువ అథ్లెట్లు ఈరోజు మనతో ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారందరికీ అభినందనలు. మరికొన్ని రోజుల్లో భారత్ నుంచి మరో అతిపెద్ద బృందం ప్యారిస్‌కు వెళ్లబోతోంది. పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు భాగం కాబోతున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు.జీ20 సమావేశం నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది. తద్వారా ప్రపంచస్థాయి ఈవెంట్లను మనం సమర్థవంతంగా పూర్తిచేయగలమని నిరూపించబోతున్నాం. అదే విధంగా.. ఒలింపిక్స్-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఆరు పతకాలకు పరిమితంకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పది పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత క్రీడా బృందం కేవలం ఆరింటికే పరిమితమైంది. షూటింగ్లో మనూ భాకర్‌కు వ్యక్తిగత కాంస్యంతో పాటు.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో మరో కాంస్య పతకం దక్కింది. అదే విధంగా.. త్రీ రైఫిల్ పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం, భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్యం, రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు కాంస్యం లభించాయి. ఇక టోక్యో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానానికి పరిమితమై రజతం సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి ప్యారిస్ వేదికగా పారాలింపిక్స్ మొదలుకానున్నాయి. ఇక ఒలింపిక్స్-2028కు అమెరికాలో జరుగనున్నాయి.చదవండి: వినేశ్‌కు చుక్కెదురు -
పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు గోల్డెన్ బాయ్ నదీమ్..!?
ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసి ఐదు రోజులు అవుతున్నప్పటకి స్వర్ణ పతక విజేత, పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కు తొలి ఒలింపిక్ గోల్డ్‌మెడల్ అందించి ఓవర్‌నైట్ హీరోగా నదీమ్ మరిపోయాడు. అతడిని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా నదీమ్‌కు రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును ప్రదానం కూడా చేయనున్నారు.డ్రెస్సింగ్‌కు రూమ్ ఆహ్వానించిన గిల్లెస్పీ...ఈ క్రమంలో పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ గోల్డన్ బాయ్ నదీమ్‌ను తమ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి పాకిస్తానీ అథ్లెట్ కలవడం ద్వారా తమ క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు తమ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు సందర్భంగా పాక్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించే అవకాశముంది."అర్షద్ నదీమ్‌ని మా డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాం. ఒలింపిక్స్ సమయంలో మా క్రికెటర్ల అందరూ నదీమ్‌ని ఉత్సాహపరచడం నేను చూశాను. అతడు తన బంగారు పతకంతో మా డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శిస్తే ఆటగాళ్లలో మరింత పట్టుదల పెరుగుతుంది. మా క్రికెటర్లు అతడిని కచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారు" అని పీసీబీ పోడ్కాస్ట్లో గిల్లెస్పీ పేర్కొన్నాడు -
వినేశ్‌కు చుక్కెదురు
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో అసమాన పోరాటంతో ఫైనల్‌కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది. పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్‌ను సీఏఎస్ అడ్హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్‌కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా? కష్ట కాలంలో వినేశ్‌కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు. -
వినేశ్ ఫోగట్‌కు నిరాశ.. సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరణ
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తిరస్కరించింది.మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీ ఫైనల్‌కు ముందు నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాముల ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. -
భవిషత్తుకు తగ్గట్లు.. ఒలింపిక్స్ లోగో తయారుచేశాన్సార్!
-
అర్షద్ నదీమ్‌పై కానుకల వర్షం.. ఘన సత్కారం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో స్వర్ణ పతకం గెలిచిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌ను ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఘనంగా సత్కరించారు. అతడి కోసం ఇస్లామాబాద్‌లో మంగళవారం విందు ఏర్పాటు చేసిన ఆయన.. నదీమ్ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కఠిన సవాళ్లతో సావాసం చేయాల్సి వచ్చినా దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నదీమ్ నిరూపించాడని కొనియాడారు.రెండో అత్యున్నత పురస్కారంఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) చెక్కును ప్రధాని షరీఫ్ నదీమ్‌కు అందించారు. అదే విధంగా.. పాకిస్తాన్‌లోని రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును నదీమ్‌కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ పసిడి పతక వీరుడి పేరిట ఇస్లామాబాద్‌లోని జిన్నా స్టేడియంలో అర్షద్ నదీమ్ హై పర్ఫామెన్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.దీనితో పాటు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో పాక్ కరెన్సీలో ఒక బిలియన్ రూపాయల నిధిని కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కాగా నదీమ్ కుటుంబంతో పాటు అతడి కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌ను కూడా ప్రధాని ప్రశంసించారు. అతడి కూడా పాక్ కరెన్సీలో కోటి రూపాయలు నజరానా ఇస్తున్నట్లు తెలిపారు.నదీమ్‌కు కారు 92.97 పంజాబ్ (పాక్) ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) నదీమ్ స్వగ్రామానికి వెళ్లి మరీ ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. వారి కుటుంబసభ్యులతో ముచ్చటించిన ఆమె ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసిన కోచ్ సల్మాన్ ఇక్బాల్ భట్‌కూ రూ. 50 లక్షల (రూ.15 లక్షలు) చెక్ ఇచ్చారు.ఈ నెల 8న పారిస్‌లో జరిగిన ఫైనల్ ఈవెంట్లో నదీమ్.. భారత హాట్ ఫేవరెట్ నీరజ్ చోప్రా (89.45 మీటర్లు; రజతం)ను వెనక్కినెట్టి 92.97 మీటర్లతో కొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు. ఈ ఒలింపిక్ రికార్డు స్కోరుతో కూడిన నేమ్ ప్లేట్ ఉన్న కారును కూడా నదీమ్‌కు ఈ సందర్భంగా బహూకరించారు. -
ధిక్కారానికి ఇది మూల్యమా?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో దేశం సాధించిన పతకాల కన్నా వినేశ్ ఫోగట్‌కు అక్కడ ఎదురైన అనూహ్య పరిణామం అందరినీ ఖిన్నులను చేసింది, స్వాభిమానంతో క్రీడాపెద్దలకు ఎదురొడ్డి నిలవడమే ఈ అపరాజిత చేసిన నేరమా? క్రీడా రంగం నుంచి సినీ, రాజకీయ, మీడియా రంగాల దాకా ప్రతిచోటా ప్రశ్నించే మహిళలను పితృస్వామ్య భావజాలం తొక్కేస్తూనే ఉంది.ప్యారిస్‌లో భారత్ సాగించిన 2024 ఒలింపిక్ ప్రయాణంలో సాధించిన పతకాలను చాలా తక్కువగానే గుర్తుంచుకుంటాం. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో కంటే ఒక పతకాన్ని తక్కువగా భారత్ ఈ ఒలింపిక్‌లో గెల్చుకుంది. దానికంటే ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ చాంపియన్ వినేశ్ ఫోగట్ అందరికంటే ఎక్కువగా పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఫోగట్ కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఒక సామాజిక పురోగతికి, కట్టుబాట్ల నుండి విముక్తికి, కఠినమైన స్వావలంబనతో కూడిన స్వతంత్ర ముద్రకు ఆమె ప్రతినిధి. పితృస్వామ్య అధికారాన్ని ధిక్కరించడానికి ఆమె ఏమాత్రం భయపడదు. దాడిని ఎదుర్కొనేందుకు భయపడదు, గట్టిగా అరుస్తూ, వీధిలో నిరసన వ్యక్తం చేయడానికి, తన లక్ష్యం కోసం తనను తాను పణంగా పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ తిరుగుబాటు చేసే ఇలాంటి మహిళలపై భారతీయ సామాజిక విధానాలు విరుచుకుపడు తున్నాయి. బలీయమైన వ్యవస్థీకృత శక్తులు స్త్రీలను లొంగిపోవాలని బలవంతం చేస్తాయి. కానీ ధిక్కరించే స్త్రీ ధైర్యంతో కూడిన కొత్త ట్రెండ్‌ని వినేశ్ ఫోగట్ సృష్టించారు.మారని పితృస్వామ్య భావజాలంనిర్భయంగా ఉంటూ, కొన్నిసార్లు ప్రకాశించే, కొన్నిసార్లు కన్నీరు కార్చే ఫోగట్ గత కొద్ది రోజులుగా మన హృదయాలను కట్టివేశారు. ప్యారిస్‌లో ఆమెమీదే మనం దృష్టి పెట్టాం. అజేయమైన జపాన్ ప్రపంచ ఛాంపియన్ యుయి సుసాకీని ఓడించి, రెజ్లింగ్‌లో భారతదేశం మొట్టమొదటి ఒలింపిక్ బంగారు పతకాన్ని చేజిక్కించుకునే స్థాయికి వినేశ్ చేరుకున్నప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం. ఆమె ఫైనల్‌కు సిద్ధమవుతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. అంతు చిక్కని సాంకేతిక విషయాలపై ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు మాత్రం మనందరి ఊపిరి ఆగిపోయినంత పనయింది. ఫైనల్స్‌కు ముందు ఆమె గడిపిన సుదీర్ఘ రాత్రి గురించి మనం తెలుసుకున్నాము. 50 కిలోల ఫైనల్‌కు అర్హత సాధించడానికి, చివరి 100 గ్రాముల బరువు కోల్పోవడానికి ఆమె రాత్రంతా మేల్కొని ఉంది. ఒక ముద్ద తినలేదు. జాగింగ్చేసింది, స్కిప్పింగ్ చేసింది, సైకిల్ తొక్కింది, ఆవిరి స్నానంతో చెమటోడ్చింది, మైకంతో బాధపడింది. బరువు తగ్గడానికి ఆమె జుత్తును కూడా కత్తిరించుకుంది. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండి ఆమె చివరి తూకంలో విఫలమైనప్పుడు, 140 కోట్ల మంది భారతీయుల గుండె ఆగిపోయినంత పనయింది.ఖచ్చితంగా మన దేశ క్రీడా వ్యవస్థ ద్వారా ఫోగట్‌కు మెరుగైన సేవలందించవచ్చు. భారతదేశ పితృస్వామ్య, వీఐపీలతో కూడిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ బాడీలు... క్రీడాకారులను, అథ్లెట్లను నిరంతరం ఎలా విఫలం చేస్తున్నాయనడానికి వినేశ్ ఫోగట్ సంఘటనే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తమను తృణీకరించడం, తమ పట్ల అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం పట్ల ఫోగట్, ఆమె తోటి ఒలింపిక్ రెజ్లింగ్ ఛాంపియన్లు తిరగబడ్డారు. ఆరుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధినేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోప ణలతో వారు వీధుల్లో నిరసన తెలపవలసి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నుంచి సస్పెండ్ అయినప్పటికీ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించింది. క్రీడా మంత్రిత్వ శాఖ మల్లయోధులపై గురిపెట్టి దాడులను కొనసాగించింది. బ్రిజ్ భూషణ్ బినామీ అయిన సంజయ్ సింగ్ భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడయ్యాడు. ఫోగట్ మాట ఎవరూ వినలేదు. తనకు అవసరమైన వైద్యం, ఫిజియోథెరపీ అందడం లేదని ఆమె ఆరోపించారు. చివరికి, ఆమె ఇష్టపడే విభాగం 53 కిలోల పోటీ అయితే... 50 కిలోల విభాగంలో పోటీ చేయవలసి వచ్చింది. ఫోగట్‌కు అన్యాయం జరిగింది. ఒలింపిక్ పతకాల కోసం పోటీపడే వారికి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు, వైద్య సహాయం, ఉన్నత స్థాయి నిపుణుల పర్యవేక్షణను అందించాలి. కానీ తాను ప్రదర్శించిన ధిక్కారానికి ఫోగట్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఈరోజు, ఫోగట్ గాథ చాలా కారణాల వల్ల కుస్తీ మ్యాట్ కంటే ముఖ్యమైనది. ఎలాంటి ఆధారాలూ లేకుండా జోక్యం చేసుకునే ప్రభుత్వం చేతిలో భారతదేశ శ్రేష్టమైన క్రీడాకారులు అనుభవిస్తున్న బాధలను అది ప్రతిబింబిస్తుంది. అది క్రీడలు లేదా ఇతర రంగాలలో అయినా, అధికారాన్ని సవాలు చేసే స్త్రీల విషయానికి వస్తే, వారు అధిరోహించడానికి ఇప్పటికీ ఒక పర్వతం అడ్డుగా ఉంది అనేదానికి ఫోగట్ ఒక ప్రతీక. ఆమె తోటి మహిళా రెజ్లర్లు, మల్లయోధుల జీవితాలు, వారి కెరీర్లపై పూర్తి నియంత్రణను కోరుకునే ఆధిపత్య వ్యక్తిగా అపఖ్యాతిపాలైన బ్రిజ్ భూషణ్ వంటి కరుడు గట్టిన పితృస్వామ్య ప్రతినిధి... అందరూ పురుషులతోనే కూడిన రెజ్లింగ్ సమాఖ్యను కైవసం చేసుకున్నాడు. పూర్తిగా రాజకీయాలతో అనుసంధానంలో ఉండే పురుషులు నిర్వహించే క్రీడాసమాఖ్యలు ఆధునిక క్రీడల నిర్వహణకు అత్యంత విరుద్ధం. ప్రధాన క్రీడా సంఘానికి నాయకత్వం వహించే స్థానంలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరన్నది పెద్ద ప్రశ్న. ఫోగట్ ఈ ఉక్కిరి బిక్కిరి అధికార ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన స్వరం పెంచింది కాబట్టే మూల్యం చెల్లించుకుంది.అయితే క్రీడలు మాత్రమే మినహాయింపుగా లేవు. ధిక్కరించే స్త్రీలు, అణచివేయలేని మహిళల పట్ల అసహనం ఇప్పుడు కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లు, న్యూస్రూమ్లతోపాటు రాజకీయ రంగానికి కూడా విస్తరించింది. మహిళలు, ఎంత ఎక్కువ సాధించినా, తమను తాము నిరూపించుకోవాలని వారిని నిరంతరం అడుగుతారు. వారు మగ అధికారాన్ని సవాలు చేసే ’తప్పు’ చేస్తే, వారిని వెంటనే తిప్పికొడతారు, బహిష్కరిస్తారు. లేదా దూరంగా ఉంచుతారు.సినిమా ప్రపంచంలో కూడా, చలనచిత్ర పరిశ్రమ ప్రారంభ సంవత్సరాల్లో, మహిళా నటీనటులు ఆఫ్–స్క్రీన్, ఆన్–స్క్రీన్ పై ’సద్గుణ’వంతురాలైన విధేయ మహిళా ఇమేజ్‌కి అనుగుణంగా ఉండాలని భావించారు. నర్గీస్, మధుబాల, మీనా కుమారి వంటి మహిళా నటీనటులు అత్యంత విజయవంతమైన వృత్తినిపుణులు. వారు తమ వ్యక్తిగత జీవితాల్లో స్వయంప్రతిపత్తి కోసం పట్టుబట్టారు. కాబట్టే వారు అవిధేయ మహిళలుగా లేదా విఘాతం కలిగించే వ్యక్తులుగా కళంకిత ముద్ర పొందారు, సంప్రదాయ కుటుంబ ఆధారిత కట్టుబాటుకు వీరిని వ్యతిరేకులుగా పరిగణించారు. వెండి తెరపై ఆధునిక వ్యక్తిత్వాన్ని సృష్టించడానికి 1970లలో జీనత్ అమన్ శృంఖలాలను ఛేదించారు.నిజానికి, ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు భారత్ చాలా దూరంలో ఉంది. విభిన్నంగా ఉండటానికి, తమ గుర్తింపులను వ్యక్తీకరించడానికి భయపడని, సంప్రదాయ ఆలోచనా విధానాలను సవాలు చేసే మహిళల పట్ల సంబరాలు జరుపుకోవడంలో కూడా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ విషయంలో ప్రేరణ కోసం, ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల మారథాన్ బంగారు పతకాన్ని, మరో రెండు డిస్టెన్స్ పతకాలను గెలుచుకున్న ఇథియోపియన్ సంతతి డచ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన సిఫాన్ హసన్ ను మనం చూడవచ్చు. హసన్ ఒక శరణార్థి. ఆమె నెదర్లాండ్స్‌కు చేరుకుంది. నర్సుగా శిక్షణ పొందుతున్నప్పుడు ఆమె విరామ సమయాల్లో పరిగెత్తింది. గెలుపు సాధించింది. స్త్రీలో ఉన్న ప్రతిభ, తేజస్సు, ధిక్కరించడం అనే గుణాలు సామాజిక దురాచారాలు కావు; మనం క్రీడలలో, ఇతర రంగాలలో ఛాంపియన్ల దేశంగా ఉండాలంటే ఇలాంటి వారిని పెంచి పోషించాలి. వారి విజయాలను చూసి పండగ చేసుకోవాలి.సాగరికా ఘోష్ వ్యాసకర్త టీఎంసీ రాజ్యసభ ఎంపీ (‘ది ప్రింట్’ సౌజన్యంతో...) -
ఒలింపిక్ స్వర్ణాల విజేతకు భారీ నజరానా
మనీలా: విశ్వక్రీడల పతకాలకు ఉన్న ప్రతిష్టకు ఇదొక మచ్చుతునక. ఫిలిప్పీన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ యులో పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ‘రిసార్ట్ హోమ్’ను బహుకరించాలని నిర్ణయించింది. సాధారణంగా విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, క్రీడా అవార్డులు, స్థానిక ప్రభుత్వాలైతే విలువైన ఇంటి స్థలాల్ని ఇవ్వడం పరిపాటి! కానీ ఫిలిప్పీన్స్ మాత్రం కార్లోస్‌కు అద్వితీయ కానుకను సిద్ధం చేస్తోంది. అంతేనా... తమ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికింది. పారిస్ నుంచి మంగళవారం స్వదేశం చేరుకున్న 24 ఏళ్ల చాంపియన్‌కు అసాధారణ ఏర్పాట్లతో వెల్కమ్ చెప్పిన ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ 10 లక్షల అమెరికా డాలర్లు (రూ. 8.39 కోట్లు) చెక్ ఇవ్వడంతోపాటు ఒక రిసార్ట్ హోమ్‌నే బహుమతి ఇస్తామని ఆ రిసార్టులో జీవితకాలం ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని ప్రకటించారు. కార్లోస్ రెండు స్వర్ణాలతో పారిస్ గేమ్స్ పతకాల పట్టికలో ఫిలిప్పీన్స్ 37వ స్థానంలో నిలిచింది. -
మూడు రోజుల తర్వాత... సీఏఎస్ తీర్పు మళ్లీ వాయిదా
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకం కోసం చేస్తున్న న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు పతకం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మంగళవారం రావాల్సిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు మరోసారి వాయిదా పడింది. దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 16న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు తీర్పు వస్తుంది. 50 కేజీల కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైన వినేశ్ తాను అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరాను కాబట్టి తనకు సంయుక్తంగా రజత పతకం అందించాలని సీఏఎస్‌ను ఆశ్రయించింది. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం వరకు పారిస్ క్రీడాగ్రామంలోనే ఉన్న వినేశ్ అక్కడి నుంచి బయలుదేరి మంగళవారమే భారత్‌కు చేరుకుంది. -
సాకులు చెప్పడంలో మన దేశం బంగారు పతకాలు సాధిస్తుంది..!
భారత బ్యాడ్మింటన్ బృందం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. లక్ష్య సేన్ పతకం దగ్గరికి వచ్చినప్పటికీ లీ జి జియాతో జరిగిన కాంస్య పతక పోరులో ఓటమిపాలయ్యాడు. భారత షట్లర్ల పేలవ ప్రదర్శన పట్ల బ్యాడ్మింటన్ కోచ్ ప్రకాష్ పదుకొణే తీవ్ర నిరాశకు గురయ్యాడు. భారత షటర్ల ఆటతీరును బహిరంగంగా దుయ్యబట్టాడు. ప్రకాశ్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అశ్విని పొన్నప్ప ఆవేశపూరిత సమాధానంతో ముందుకు వచ్చారు. అయితే ప్రకాశ్ పదుకొణెకు భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. స్పోర్ట్‌స్టార్ కోసం రాసిన కాలమ్‌లో గవాస్కర్ ఇలా రాసుకొచ్చాడు. సాకులు చెప్పడం మన ఆటగాళ్లకు అలవాటుగా మారిందని అర్దం వచ్చేలా కామెంట్స్ చేశాడు. సాకులు చెప్పడంలో మన దేశం (షట్లర్లను ఉద్దేశిస్తూ) బంగారు పతకాలు సాధిస్తుంది ఎద్దేవా చేశాడు. ప్రకాశ్ బాధలో నిజాయితీ ఉందని, ఇందులో అతన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటగాళ్లకు ప్రభుత్వం నుంచి చాలా మద్దతు ఉందని, ఓటములకు ఆటగాళ్లు బాధ్యత వహించాలని ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత షట్లర్ల శిక్షణ నిమిత్తం కోట్ల రూపాయల ఖర్చు చేశారన్న అంశంపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో దూమారం రేగుతున్న విషయం తెలిసిందే. -
CAS: వినేశ్ విషయంలో చారిత్రాత్మక తీర్పు ఆశిస్తున్నాం
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అప్పీలుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS) మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ హర్యానా అథ్లెట్‌కు రజతం ఇవ్వాలా? లేదా అన్న అంశంపై మరికొన్ని గంటల్లో తమ నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ నేపథ్యలో వినేశ్ ఫొగట్ తరఫున CASలో వాదనలు వినిపించిన న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్ సింఘానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చారిత్రాత్మక తీర్పు ఆశిస్తున్నాం‘‘వినేశ్ పతకం వస్తుందనే అందరం ఆశిస్తున్నాం. సీఏఎస్(CAS) అడ్ హక్ ప్యానెల్.. అప్పీలు నమోదైన 24 గంటల్లోనే తీర్పునిస్తుంది. అయితే, వినేశ్ విషయంలో రోజుల తరబడి వాయిదా వేశారు కాబట్టి వారు ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారని అర్థమవుతోంది. ఒకవేళ ఆర్బిట్రేటర్ ఎంత ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తే.. మనకు అంత మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది.గతంలో సీఏఎస్(CAS)లో నేను కేసులు వాదించాను. నిజానికి ఇక్కడ సక్సెస్ రేటు తక్కువే. అయితే, చరిత్రలో గుర్తుండిపోయే తీర్పు కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నాం. అందరికీ చిరస్మరణీయంగా మిగిలే తీర్పు ఇవ్వాలని ఆర్బిట్రేటర్‌ను కోరాం. ఇది కాస్త కష్టమే. అయితే, అంతా మంచే జరుగుతుందని మనం ఆశిద్దాం.వినేశ్ కోసం మనమంతా ప్రార్థిద్దాం. తనకు పతకం వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఒకవేళ పతకం రాకపోయినా.. తనెప్పటికీ చాంపియనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని విదుష్పత్ సింఘానియా ఇండియా టుడేతో వ్యాఖ్యానించారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో వినేశ్ ఫొగట్ అద్భుత విజయాలతో మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది వినేశ్.అనూహ్య రీతిలో అనర్హత వేటుఅయితే, అనూహ్య రీతిలో స్వర్ణ పతక బౌట్‌కు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు తేలడంతో పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. దీంతో ఫైనల్‌కు వినేశ్ దూరమైంది. ఈ నేపథ్యంలో తనను పోటీకి అనుమతించాలని, లేనిపక్షంలో సంయుక్త రజత పతకం ఇవ్వాలని సీఏఎస్(CAS)కు అప్పీలు చేసింది.ఈ నేపథ్యంలో ఫైనల్‌కు అనుమతించలేమని ముందే స్పష్టం చేసిన స్పోర్ట్స్ కోర్టు.. రజత పతకం ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై ఆగష్టు 10నే తీర్పు ఇస్తామని చెప్పిన కోర్టు.. తదుపరి ఆగష్టు 13కు వాయిదా వేసింది. చదవండి: రూ. 1.5 కోట్లా? ఎవరిచ్చారు?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆగ్రహం -
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్‌లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్‌కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్‌లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్‌కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్‌గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్‌కు ఫ్రాన్స్‌లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్‌గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్‌పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్‌లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
నీరజ్‌తో మనూ పెళ్లా?.. షూటర్ తండ్రి స్పందన
ప్యారిస్ ఒలింపిక్స్-2024 పతక విజేతలు నీరజ్ చోప్రా- మనూ భాకర్ గురించి జరుగుతున్న ప్రచారంపై మనూ తండ్రి రామ్ కిషన్ భాకర్ స్పందించారు. మనూకు ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాగా విశ్వ క్రీడల తాజా ఎడిషన్‌లో షూటర్ మనూ భాకర్ రెండు కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన 22 ఏళ్ల మనూ.. అదే క్రీడాంశంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కంచు పతకం సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ నాలుగో స్థానంలో నిలిచి.. మూడో పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది.పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులుఈ నేపథ్యంలో మనూ భాకర్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. మరోవైపు.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణం గెలిచిన 26 ఏళ్ల నీరజ్ ఈసారి మాత్రం రెండోస్థానానికే పరిమితం కావడం కాస్త నిరాశ కలిగించేదే అయినా.. ప్యారిస్‌లో భారత్‌కు ఏకైక రజతం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల అనంతరం నీరజ్ చోప్రా- మనూ భాకర్ మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఇందులో వీరిద్దరు కాస్త సిగ్గుపడుతున్నట్లుగా కనిపించగా.. మనూ తల్లి సుమేధా భాకర్ ఫొటోలు క్లిక్‌మనిపించారు. అంతేకాదు.. అనంతరం నీరజ్ దగ్గరకు వచ్చిన సుమేధా.. అతడి చేయిని తన చేతుల్లోకి తీసుకుని మాటివ్వు అన్నట్లుగా తలపై పెట్టుకున్నారు. ఆ తర్వాత మనూ తండ్రి రామ్ కిషన్ కూడా అక్కడికి వచ్చారు. నీరజ్ ఆయన పాదాలకు నమస్కరించగా.. ఆయన అతడి వెన్నుతట్టారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో... ఈ హర్యానా అథ్లెట్లు పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇందుకు మనూ తల్లిదండ్రుల అనుమతి కూడా లభించిందంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. వాళ్లది తల్లీకొడుకుల అనుబంధంఈ విషయంపై స్పందించిన మనూ తండ్రి రామ్ కిషన్ దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘మనూ ఇంకా చిన్నపిల్ల. తనకు ఇంకా పెళ్లి చేసే ఈడు కూడా రాలేదు. ఇప్పట్లో అసలు ఆ విషయం గురించే మేము ఆలోచించడం లేదు.ఇక మనూ వాళ్ల అమ్మ నీరజ్‌ను తన కుమారుడిలాగే భావిస్తుంది. వాళ్లిద్దరి మధ్య తల్లీకొడుకుల అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. నీరజ్ చోప్రా అంకుల్ కూడా ఈ విషయం గురించి స్పందించారు. ‘‘నీరజ్ పతకం తీసుకురావడం దేశమంతా చూసింది కదా. అలాగే అతడి పెళ్లి కూడా అందరికి తెలిసే జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్ చోప్రాNeeraj Chopra can be seen talking to the Manu Bhaker's mother and into the other video, Neeraj Chopra and Manu Bhaker are discussing closely..!I'm sorry but I don't know why I am getting interested in Manu Bhaker and Neeraj Chopra 😜 pic.twitter.com/uymONMo8sj— Priyanshu Kumar (@priyanshu__63) August 11, 2024 -
భావి ఒలింపిక్స్‌కు వడదెబ్బ!
ఇదీ పారిస్ ఒలింపిక్స్‌తో వాతావరణం ఆటాడుకున్న తీరు. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడా వేడుకల నిర్వహణను దేశాలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కానీ 2050 నాటికి చాలా దేశాలకు ఒలింపిక్స్ నిర్వహణ కలగానే మిగలనుంది. ఆయా దేశాల్లో ఎండలు ఇప్పటికే ఠారెత్తిస్తుండటం, 2050కల్లా ప్రమాదకర స్థాయిని దాటేలా ఉండటమే ఇందుకు కారణం. ఒలింపిక్స్ జరిగేదే ప్రధానంగా వేసవిలోనే. కనుక ఉష్ణోగ్రతలు 27.8 డిగ్రీల సెల్సియస్ దాటితే వాటి నిర్వహణను రద్దు చేయాలన్నది అంతర్జాతీయ క్రీడా నిపుణుల సిఫార్సు. ఆ లెక్కన గతంలో ఒలింపిక్ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అట్లాంటా (అమెరికా), బీజింగ్ (చైనా), ఏథెన్స్ (గ్రీస్), టోక్యో (జపాన్) వంటి పలు నగరాలకు ఇంకెప్పటికీ ఆ అవకాశం దక్కబోదు. ఆ నగరాల్లో వేసవిలో ఎండలు మండిపోవడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే (2028) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోయే అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఎండలపరంగా చూసుకుంటే ఏ మేరకు సురక్షితమన్న ఆందోళన ఇప్పట్నుంచే మొదలైంది. ఆదివారం అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 34 డిగ్రీలు దాటేయడమే ఇందుకు కారణం! పారిస్‌లో ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి! వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తున్నాయో, రోజురోజుకూ ప్రమాదం అంచులకు నెడుతున్నాయో చెప్పేందుకు ఈ పరిణామం మరో తార్కాణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో చాలావరకు 2050 నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉండబోవని ప్రఖ్యాత క్లైమేట్ సైన్స్, అనలిటిక్స్ స్వచ్ఛంద సంస్థ ‘కార్బన్ప్లాన్’ హెచ్చరించింది. వాటిలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా పెరిగిపోతాయని పేర్కొంది. వాతావరణ మార్పుల ధోరణి ఆధారంగా రూపొందించిన గణాంకాలతో విడుదల చేసిన తాజా నివేదికలో సంస్థ ఈ మేరకు పేర్కొంది.ఎన్నో సమస్యలు... ఎండలు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధిని దాటితే ఒలింపిక్స్ నిర్వహణకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు... → ప్రఖ్యాత అథ్లెట్లు చాలా మంది ప్రధానంగా చలి దేశాల నుంచే వస్తారు. ఈ స్థాయి ఎండలను వాళ్లు అస్సలు తట్టుకోలేరు → దాంతో క్రీడాకారులు ఎండకు సొమ్మసిల్లిపోవడం, వడదెబ్బ బారిన పడటం వంటి సమస్యలు పొంచి ఉంటాయి → ఇవి వారిలో తీవ్ర అనారోగ్యానికి, కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. → 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతి 100 మంది అథ్లెట్లలో ఒకరు ఎండలకు తాళలేక కళ్లు తేలేశారు! → దాంతో మారథాన్, వాకింగ్ వంటి ఈవెంట్లను పర్వతప్రాంత నగరమైన సపోరోకు మార్చినా లాభం లేకపోయింది. ఆరుగురు వాకర్లు, రన్నర్లు వడదెబ్బ బారిన పడ్డారు.ఇలా కొలుస్తారు... సమస్యలకు దారితీసే స్థాయి ఎండ వేడిమిని వెట్ బల్బ్ గ్లోబ్ టెంపరేచర్‌గా పిలుస్తారు. వేడి, తేమ, గాలి వేగం, సూర్యుని కోణం, మేఘావరణం వంటి పలు అంశాల ప్రాతిపదికన దీన్ని నిర్ణయిస్తారు. ఆ లెక్కన ఒలింపిక్స్ నిర్వహణకు సురక్షితమైన ఉష్ణోగ్రత పరిధి 27.8 డిగ్రీ సెల్సియస్‌గా నిర్ణయించారు. ఎండలు అంతకు మించితే పోటీల వాయిదా, అవసరమైతే రద్దు తప్పనిసరని అంతర్జాతీయ క్రీడా నిపుణులు చెబుతారు. వచ్చే ఒలింపిక్స్ సంగతి ఏమిటీ?2028 ఒలింపిక్స్‌కు వేదిక అమెరికాలోని లాస్ ఏంజెలెస్. అక్కడ పసిఫిక్ గాలుల కారణంగా వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండదని భావించారు. కానీ ఒకట్రెండేళ్లుగా లాస్ ఏంజెలెస్‌లో ఎండలు గట్టిగానే ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా ఆదివారం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలు అక్కడ క్రమంగా పరిపాటిగా మారుతుండటం ఒలింపిక్ కమిటీని ఇప్పటినుంచే ఆందోళనపరుస్తోంది. 2032 ఒలింపిక్స్‌కు ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ వేదిక కానుంది. వేసవిలో అక్కడ కూడా ఎండలు ఠారెత్తిస్తాయి. కానీ ఒలింపిక్స్ నిర్వహించే జూలై చివరి నాటికి శీతాకాలమే ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండబోదని భావిస్తున్నారు. మనకు కష్టమే! 2036 ఒలింపిక్స్ వేదిక ఎంపిక మాత్రం నిర్వాహకులకు పెద్ద పరీక్షగానే మారనుంది. అందుకు బిడ్స్ వేసిన ఆరు దేశాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడా సంరంభాన్ని నిర్వహించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. ఇండొనేసియా నూతనంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక రాజధాని నుసంతర, దోహా (ఖతర్), ఇస్తాంబుల్ (తుర్కియే), వార్సా (పోలండ్), శాంటియాగో (చిలీ) కూడా బరిలో ఉన్నాయి. కానీ ఉష్ణోగ్రతల కోణంలో చూస్తే అహ్మదాబాద్, çనుసంతర, దోహాల్లో ఒలింపిక్స్ నిర్వహణ అస్సలు సాధ్యపడకపోవచ్చు. ఇది అంతిమంగా వార్సా, శాంటియాగోలకు అడ్వాంటేజ్‌గా మారొచ్చు. వాటి తర్వాత ఇస్తాంబుల్ కూడా ఉష్ణోగ్రతపరంగా కాస్త అనువుగానే ఉండనుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనుమతించే పక్షంలో అహ్మదాబాద్‌కు చాన్సుంటుంది. -
2028లో మళ్లీ కలుద్దాం!
పారిస్: ప్రపంచ సినిమా కలల ప్రపంచం హాలీవుడ్... లాస్ఏంజెలిస్ నగర శివారులో వెలసిన వినోదనగరి... నాలుగేళ్ల తర్వాత ఆ సినీ అడ్డా వద్ద ప్రపంచ క్రీడా సంబరం నిర్వహణకు రంగం సిద్ధమైంది... మరి దాని గురించి ప్రపంచానికి చెప్పాలంటే మామూలు పద్ధతిలో చేస్తే ఏం బాగుంటుంది? అందుకే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కొత్తగా ప్రయత్నించారు. అందుకోసం హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్కంటే సరైన వ్యక్తి ఎవరుంటారు. పారిస్ నేషనల్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ముగింపు ఉత్సవం మధ్యలో క్రూజ్ స్టేడియం పైభాగం నుంచి దూకి స్టేడియంలోకి వచ్చాడు. ఆ తర్వాత అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నుంచి ఒలింపిక్ పతాకాన్ని అందుకున్నాడు. లాస్‌ఏంజెలిస్‌లో క్రీడలు జరిగే సమయంలో ప్రధానాకార్షణగా మారే అవకాశం ఉన్న టామ్ క్రూజ్‌ను ఇలా అందరి ముందు తీసుకొచ్చారు. మోటార్ సైకిల్, విమానం, పారాచూట్‌తో టామ్ క్రూజ్ ఒలింపిక్స్‌కు ప్రచారం చేస్తూ గతంలోనే రికార్డు చేసిన వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంతో అధికారికంగా ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యత పారిస్ నుంచి లాస్ ఏంజెలిస్‌కు మారింది. ఈ అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెలిస్‌లో విశ్వ క్రీడలు జరిగాయి. అలరించిన కార్యక్రమాలు... సెన్ నదిపై ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకల తరహాలోనే ఒలింపిక్స్ ముగింపు ఉత్సవం కూడా ఘనంగానే ముగిసింది. దాదాపు 70 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పారిస్ నగర ఘనతను చెబుతూ సాగిన సంగీత కార్యక్రమంతో ఇది మొదలు కాగా... అనంతరం 206 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో పరేడ్‌లో పాల్గొన్నారు. ‘రికార్డ్స్’ పేరుతో సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. వచ్చే ఒలింపిక్స్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సంగీతకారులకు కూడా ఇందులో చోటు కల్పించారు. సంప్రదాయం ప్రకారం అన్నింటికంటే ముందుగా తొలి ఒలింపిక్స్ జరిగిన గ్రీస్ జాతీయ పతాకాన్ని, ఆ తర్వాత ఫ్రాన్స్ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. మెగా ఈవెంట్ విజయవంతం కావడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ థామస్ బాక్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘అథ్లెట్లు ఒక మ్యాజిక్‌ను ప్రదర్శించారు. కోట్లాది మంది క్రీడాభిమానుల తరఫున కృతజ్ఞతలు. మళ్లీ 2028లో కలుస్తాం. ఒలింపిక్స్ ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నా 206 దేశాల నుంచి ఆటగాళ్లు ఇక్కడకు చేరారు. పతకాల కోసం హోరాహోరీగా పోరాడారు. ఒలింపిక్స్‌తో వెలుగుల నగరం మరింతగా శోభిల్లింది. అత్యుత్తమ క్రీడా ప్రదర్శనే కాదు, ఆటగాళ్లకు సంబంధించి ఇదే సంబరాల వేడుక’ అని బాక్ వ్యాఖ్యానించారు. ఈ వేదికపై ఐఓసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ మహిళా బాక్సర్ సిండీ ఎన్గాంబా, చైనా టేబుల్ టెన్నిస్ స్టార్ సన్ యింగ్షా, కెన్యా స్టార్ మారథాన్ రన్నర్ కిప్చోగే, క్యూబా దిగ్గజ రెజ్లర్ మిజైన్ లోపెజ్, ఫ్రాన్స్ జూడో స్టార్ టెడ్డీ రైనర్, ఆ్రస్టేలియా స్విమ్మర్ ఎమ్మా మెకీన్ కూడా ఉన్నారు. ఐదు ఖండాల దేశాలకు ప్రతినిధులుగా వీరు వ్యవహరించారు. అనంతరం పారిస్ నగర మేయర్ అన్నె హిడాల్గో ఒలింపిక్ పతాకాన్ని థామస్ బాక్కు అందజేశారు. ఆయన నుంచి తదుపరి విశ్వ క్రీడలు జరిగే లాస్ ఏంజెలిస్ నగరానికి మేయర్‌గా వ్యహరిస్తున్న కరెన్ బాస్ ఈ పతాకాన్ని స్వీకరించారు. అనంతరం ఇదే వేదికపై ఉన్న అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌కు కరెన్ బాస్ ఒలింపిక్ పతాకాన్ని అందించింది. పారిస్, లాస్ఏంజెలిస్ నగరాలకు అన్నె హిడాల్గో, కరెన్ బాస్ తొలి మహిళా మేయర్లు కావడం విశేషం.ఒలింపిక్ పతాకం స్వీకరించాక ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత, అమెరికా సింగర్ గాబ్రియేలా సారిమెంటో విల్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది. ఫ్రాన్స్ స్విమ్మర్ లియాన్ మర్చండ్ ఒలింపిక్ జ్యోతిని స్టేడియంలోకి తీసుకురాగా, ఆ తర్వాత దానిని ఆర్పేసి అధికారికంగా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. ఫ్లాగ్ బేరర్లుగా శ్రీజేశ్, మనూ... ముగింపు వేడుకల పరేడ్‌లో భారత్ నుంచి షూటర్ మనూ భాకర్, హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్ రెండు కాంస్యాలు సాధించగా... కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన శ్రీజేశ్ ఈ పోటీల తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆఖరి ఈవెంట్లలో పాల్గొన్న కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మాత్రమే పరిమిత సంఖ్యలో భారత్ నుంచి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మనూ, ఆమె కోచ్ జస్పాల్ రాణా ముగింపు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా భారత్ నుంచి తిరిగి వెళ్లారు. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అక్కడే ఉన్నా ఆమె క్రీడాగ్రామానికే పరిమితమైంది. -
వినేశ్ రజత పతకం అప్పీల్‌పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్‌కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
చేయాల్సింది చాలావుంది!
ప్యారిస్ వేసవి విశ్వక్రీడా సంరంభం ముగిసింది. దాదాపు 850 పతకాలు విజేతలను వరించిన ఈ 2024 ఒలింపిక్స్‌లో 10 ప్రపంచ రికార్డులు, 32 ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం 42 రికార్డులు బద్దలయ్యాయి. మరి, భారత్ సాధించినదేమిటి అన్నప్పుడే ఆశ నిరాశలు దోబూచులాడతాయి. 117 మంది అథ్లెట్లతో, 16 క్రీడాంశాల్లో పోటీపడుతూ భారత ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో విశ్వ వేదికపై అడుగుపెట్టింది. ఈసారి రెండంకెల్లో పతకాలు సాధిస్తామనే ఆకాంక్షను బలంగా వెలి బుచ్చింది. తీరా ఒలింపిక్స్ ముగిసేవేళకు అరడజను పతకాలతోనే (5 కాంస్యం, 1 రజతం) తృప్తి పడాల్సి వచ్చింది. గడచిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన 7 పతకాల అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే... ఇది ఒకటి తక్కువే. ఈ సంరంభంలో మొత్తం 84 దేశాలు పాల్గొంటే, ప్రపంచంలో అత్యధికంగా 145 కోట్ల జనాభా గల మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. మన పతకాలు, జనాభా నిష్పత్తి చూస్తే, ప్రతి 25 కోట్ల మందికి ఒక్క పతకం వచ్చిందన్న మాట. ‘ఖేలో ఇండియా’ పేరిట కోట్లు ఖర్చుచేస్తున్నామంటున్న పాలకులు ఆత్మశోధనకు దిగాల్సిన అంశమిది.ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం, పొంచివున్న దాడుల పట్ల భద్రతా సిబ్బంది భయం, ఫ్రెంచ్ ప్రజానీకంలో పెద్దగా ఉత్సాహం లేకపోవడం... వీటన్నిటి మధ్య ప్యారిస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగు తాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు. అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది. పైగా, అస్తుబిస్తుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అత్యవ సరమైన కొత్త ఉత్సాహమూ నింపింది. క్రితంసారి కోవిడ్ మూలంగా టోక్యోలో ప్రేక్షకులు లేకుండానే పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఒత్తిడి ఉంది. నిర్వాహకులు మొత్తం ప్యారిస్ను ఓపెన్–ఎయిర్ ఒలింపిక్ క్రీడాంగణంగా మార్చేసి, అందరూ ఆహ్వానితులే అనడంతో ఊహించని రీతిలో ఇది దిగ్విజయమైంది. పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారుల జెండర్ అంశం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. ఉక్రెయిన్, గాజా లాంటి భౌగోళిక రాజకీయ అంశాలు, అలాగే అమెరికాలో ఎన్నికల వేడి, బ్రిటన్‌లో అల్లర్లు, బంగ్లాదేశ్‌లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి ఒలింపిక్స్ వివాదాలు వెనుకపట్టు పట్టాయనీ ఒప్పుకోక తప్పదు. ప్యారిస్ వేసవి ఒలింపిక్స్‌కు తెర పడింది కానీ, ఈ ఆగస్ట్ 28 నుంచి అక్కడే పారా ఒలింపిక్స్–2024 జరగనుంది. తదుపరి 2028 వేసవి ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్ సిద్ధమవుతోంది. కేవలం రెండే పతకాలు సాధించిన 2016 నాటి రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే, భారత్ మెరుగైన మాట నిజమే. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, మహిళా బ్యాడ్మింటన్‌లో వెనుకబడినా టేబుల్ టెన్నిస్, షూటింగ్లలో కాస్త ముందంజ వేశామన్నదీ కాదనలేం. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా 22 ఏళ్ళ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. గోల్‌కీపర్ శ్రీజేశ్ సహా హాకీ బృందమంతా సర్వశక్తులూ ఒడ్డి, వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో ఊరించి చేజారిన పతకాలూ చాలా ఉన్నాయి. భారత మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలన విజయాలు నమోదు చేసినా, వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే స్వర్ణం, లేదంటే కనీసం రజతం మన ఖాతాలో ఉండేవి. షట్లర్ లక్ష్యసేన్, అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా సహా కనీసం 6 సందర్భాల్లో మనవాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమ య్యారు. లేదంటే పతకాల పట్టికలో మన దేశం మరింత ఎగబాకేదే. పతకాలు, విజయాల మాటెలా ఉన్నా, మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి. గాయాల నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిన నీరజ్ చోప్రా, పీవీ సింధుల మొదలు నిలకడగా ఏళ్ళ తరబడి ఆడిన శ్రీజేశ్, రెండు పతకాల విజేత మనూ భాకర్, బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్యసేన్ దాకా పలువురు బ్రాండ్లకు ప్రీతిపాత్రులయ్యారు. కానీ ఇది సరిపోతుందా? ఆర్చరీ, బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాటే మిటి? మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నది అందుకే. ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరి చేసుకో వాలి. అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించి, సరైన రీతిలో తీర్చిదిద్దడమే కరవు. మనకొచ్చిన 6 పతకాల్లో 4 దేశ విస్తీర్ణంలో 1.4 శాతమే ఉండే హర్యానా సంపాదించి పెట్టినవే. అంటే, మొత్తం పతకాల్లో హర్యానా ఒక్కదాని వాటా 66 శాతం. మరి, మిగతా దేశం సంగతి ఏమిటి? అక్కడి పరిస్థితులేమిటి? ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ మనదని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు ఇవాళ్టికీ క్రీడలకు సరైన రీతిలో వస తులు, వనరులు ఇవ్వట్లేదు. పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఆటగాళ్ళకు నారు పోసి, నీరు పెట్టాలి. మన క్రీడా సంఘాలు, ప్రాధికార సంస్థలు రాజకీయ నేతల గుప్పెట్లో ఇరుక్కుపోవడం పెను విషాదం. పతకాలకై పోరాడాల్సిన ఆటగాళ్ళు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితిని కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదా? క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే, పతకాలు వచ్చేదెట్లా? అంతర్జాతీయ స్థాయిలో విజయానికి దూరదృష్టి, సరైన వ్యూహం, నిరంతరం పెట్టుబడి, స్పష్టమైన క్రీడా విధానం రాష్ట్ర స్థాయి నుంచే కీలకం. ఆ దిశగా ఆలోచించాలే తప్ప దాహమేసినప్పుడు బావి తవ్వితే కష్టం. అందుకే, 1900 తర్వాత నూటపాతికేళ్ళలో ఒలింపిక్స్‌లో ఇది మన రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇకనైనా అపూర్వ క్రీడాదేశంగా మనం అవతరించాలంటే, పాలకులు చేయాల్సింది చాలా ఉంది. -
Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి.. కష్టే ఫలి!
వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జావెలిన్ త్రో సూపర్‌స్టార్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం ఆటతోనే కాదు.. తన గుణగణాలతో అందరి మనసులు దోచుకున్నాడంటూ ఈ హర్యానా అథ్లెట్‌ను కొనియాడుతున్నారు అభిమానులు. నీరజ్ పెంపకం కూడా ఎంతో గొప్పగా ఉందంటూ అతడి తల్లిదండ్రులను కూడా ప్రశంసిస్తున్నారు.పాకిస్తాన్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్ కూడా తమ బిడ్డలాంటి వాడేనని నీరజ్ తల్లి సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అదే విధంగా.. ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతకధారిగా భారత హాకీ స్టార్ శ్రీజేశ్కు ఫ్లాగ్‌బేరర్‌గా అవకాశం ఇస్తామన్నపుడు.. నీరజ్ సంతోషంగా ఒప్పుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం నీరజ్ చోప్రా విలాసవంతమైన జీవితం, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువల గురించి చర్చిస్తున్నారు. మరి అతడి నెట్‌వర్త్ ఎంతో తెలుసా?!ఉమ్మడి కుటుంబంహర్యానాలోని పానిపట్‌లో గల ఖాంద్రా గ్రామంలో డిసెంబరు 24, 1997లో నీరజ్ చోప్రా ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి సతీశ్ కుమార్, తల్లి సరోజ్ దేవి. పందొమ్మిది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబం వారిది. నీరజ్‌కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. చెల్లెల్లు సంగీత- సరిత.ఇక పదకొండేళ్ల వయసులోనే 90 కిలోల బరువుతో బాధపడ్డ నీరజ్‌ను తండ్రి సమీప జిమ్‌లో చేర్పించాడు. ఊబకాయం వల్ల ఒత్తిడికి లోనైన నీరజ్‌లో స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపేది అతడి తల్లి. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూనే కొడుకును జావెలిన్ త్రోయర్‌గా ఎదిగేలా ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రులు.ఓవర్‌నైట్ స్టార్గాఈ క్రమంలో అనూహ్య రీతిలో.. అంచనాలు తలకిందులు చేస్తూ భారత ఆర్మీ సుబేదార్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి యావత్ భారతావని దృష్టిని ఆకర్షించాడు. వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ అథ్లెట్ కోసం వాణిజ్య ప్రచార సంస్థలు క్యూకట్టాయి.ఈ నేపథ్యంలో నీరజ్ పేరుప్రఖ్యాతులతో పాటు సంపద కూడా అమాంతం పెరిగింది. తమ గ్రామంలోనే అత్యంత విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది నీరజ్ కుటుంబం. ఖాంద్రాలోని ఈ మూడంతస్తుల భవనం విలువ కోట్లలో ఉంటుందని సమాచారం.లగ్జరీ కార్లుఇక నీరజ్ గ్యారేజీలో ఆనంద్ మహీంద్రా అందించిన ప్రత్యేకమైన వాహనంతో పాటు.. ఫోర్ట్ ముస్టాంగ్ జీటీ(సుమారు రూ. 93.52 లక్షలు), టయోటా ఫార్చునర్(సుమారు రూ. 33.43 లక్షలు), రేంజ్ రోవర్ స్పోర్ట్(రూ. 2 కోట్లు), హార్లే డేవిడ్సన్ బైకు(రూ. 11 లక్షలు), బజాజ్ పల్సర్(రూ. లక్ష) ఉన్నాయి.నెట్‌వర్త్ ఎంతంటే?కాగా టోక్యోలో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి వెండి పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక జావెలిన్ త్రో క్వాలిఫయర్స్ సందర్భంగా నీరజ్ ధరించిన వాచ్‌పై కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. ఒమేగా బ్రాండ్‌కు చెందిన ఆక్వా టెరా అల్ట్రా వాచ్ విలువ సుమారుగా రూ.52 లక్షలు ఉంటుందని సమాచారం. అన్నట్లు జాతీయ మీడియా DNA రిపోర్టు ప్రకారం.. నీరజ్ చోప్రా ఆస్తుల నికర విలువ సుమారు 32 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా నీరజ్‌కు అధిక మొత్తంలో ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. కష్టే ఫలిటోక్యోలో స్వర్ణం సాధించిన తర్వాత క్యాష్ ప్రైజ్ రూపంలో నీరజ్ చోప్రాకు మొత్తంగా రూ. 13 కోట్లు దక్కాయి. నైక్, ఒమేగా వంటి ప్రముఖ బ్రాండ్లకు అతడు ప్రచారకర్త. ఆటగాడిగా తనను నిరూపించుకునే క్రమంలో గాయాలతో సతమతమైనా.. ఎన్నో కఠినసవాళ్లు ఎదురైనా వాటిని దాటుకుని ఉన్నతశిఖరాలకు చేరిన నీరజ్ చోప్రా యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు.చదవండి: ఒట్టేసి చెప్పు బాబూ: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి -
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ క్రికెటర్ కొడుకు
పారిస్ ఒలింపిక్స్‌లో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ విన్స్టన్ బెంజమిన్ కొడుకు రాయ్ బెంజమిన్ గోల్డ్ మెడల్ సాధించాడు. విశ్వక్రీడల్లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహించిన రాయ్.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో 46.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాయ్ ప్రపంచ రికార్డు హోల్డర్, నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్‌ను ఓడించి పసిడి పతకం నెగ్గాడు.రాయ్ ఒలింపిక్స్ స్వర్ణం సాధించడం పట్ల తండ్రి విన్స్టన్ ఎనలేని ఆనందం వ్యక్తం చేశాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని విన్స్టన్ ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుతో పోల్చాడు. రాయ్ ఈ విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడని విన్స్టన్ తెలిపాడు. రాయ్ విజయం యునైటెడ్ స్టేట్స్కే కాకుండా తాను పుట్టి పెరిగిన ఆంటిగ్వాకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని విన్స్టన్ అన్నాడు.59 ఏళ్ల విన్స్టన్ 80, 90 దశకాల్లో వెస్టిండీస్ తరఫున 21 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడి 161 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా అయిన విన్స్టన్ టెస్ట్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయ్ బెంజమిన్.. విన్స్టన్ ఆరుగురు సంతానంలో ఒకరు. రాయ్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. చిన్నతనంలో క్రికెట్ పట్ల ఆకర్శితుడైన రాయ్.. ఆతర్వాత మనసు మార్చుకుని ట్రాక్ ఆండ్ ఫీల్డ్ గేమ్స్ వైపు మళ్లాడు. -
మాటివ్వు: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి
భారత అథ్లెట్లు మనూ భాకర్, నీరజ్ చోప్రాకు సంబంధించిన ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా.. మనూ తల్లి ఫొటోలు తీశారు. అంతేకాదు.. ఆ తర్వాత నీరజ్ చోప్రా చేయి తన తలమీద పెట్టుకుని ఒట్టు వేయించుకున్నారు కూడా!ప్యారిస్ ఒలింపిక్స్-2024లో షూటర్ మనూ భాకర్ భారత్ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కంచు పతకం గెలిచిన 22 ఏళ్ల ఈ హర్యానా అమ్మాయి.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. తద్వారా భారత ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్(స్వాతంత్ర్యం తర్వాత)గా అరుదైన రికార్డు సాధించింది.అరుదైన ఘనత సాధించిపందొమిదేళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. కఠిన సవాళ్లకు ఎదురీది ఈసారి రెండు మెడల్స్ గెలుచుకుంది మనూ. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ నాలుగోస్థానంలో నిలిచి.. పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. మరోవైపు.. టోక్యో ఒలింపిక్స్ ‘గోల్డెన్ బాయ్’, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సైతం ప్యారిస్‌లో పతకం గెలిచాడు.అయితే, ఈసారి రెండోస్థానంతో సరిపెట్టుకుని.. పసిడి కాకుండా రజత పతకానికి పరిమితమయ్యాడు. ఈ ఎడిషన్‌లో భారత్ తరఫున ఏకైక సిల్వర్ మెడల్ గెలిచిన అథ్లెట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మనూతో పాటు నీరజ్.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించాల్సింది. అయితే, ఆ ఛాన్స్ హాకీ లెజెండ్, కేరళ ప్లేయర్ శ్రీజేశ్కు దక్కింది. నీరజ్ చోప్రా మంచి మనసు వల్లే శ్రీజేశ్కు ఈ అవకాశం వచ్చింది.మాటివ్వు బాబూఇక ఆదివారం నాటి ముగింపు వేడుకల అనంతరం.. మనూ భాకర్- నీరజ్ చోప్రా సంభాషిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నీరజ్‌తో కలిసి ఫొటోకు ఫోజులివ్వాల్సిందిగా మనూ తల్లి సుమేధా భాకర్ కూతురిని కోరారు. అనంతరం.. నీరజ్ దగ్గరికి వచ్చిన సుమేధా.. నీరజ్ చేయి తన తల మీద పెట్టుకుని మాట తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పసిడి పతకం తేవాలి!వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన నీరజ్.. విజయ రహస్యం ఏమిటో తన కూతురికి కూడా చెప్పాలని కోరారని కొంతమంది అంటుండగా.. వచ్చేసారి కచ్చితంగా స్వర్ణం సాధించాలని 26 ఏళ్ల నీరజ్‌తో ఒట్టు వేయించుకున్నారని మరికొందరు అంటున్నారు. కాగా మనూ భాకర్, నీరజ్ చోప్రా.. ఈ ఇద్దరూ హర్యానాకు చెందిన వాళ్లే అన్న విషయం తెలిసిందే. నీరజ్ స్వస్థలం పానిపట్ కాగా.. మనూ భాకర్ కుటుంబానిది ఝజ్జార్ జిల్లాలోని గోరియా గ్రామం. ఇదిలా ఉంటే.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. షూటింగ్లో మూడు కాంస్యాలు, హాకీ పురుషుల జట్టుకు కాంస్యం, రెజ్లింగ్‌లో ఒక కాంస్యం, జావెలిన్ త్రోలో ఒక రజతం దక్కాయి. Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7— Avinash Aryan (@avinasharyan09) August 11, 2024Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) August 11, 2024 -
పారిస్ ఒలింపిక్స్ 2024 : ఈసారి పతకాలు తగ్గాయి..! (ఫొటోలు)
-
వినేశ్ విషయంలో మా తప్పేమీ లేదు: పీటీ ఉష
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత అంశంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తప్పొప్పులను ఎంచుతూ వినేశ్ అనుకూల, ప్రతికూల వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారత ఒలింపిక్ సంఘం(IOA) వైద్య బృందం తీరుపై విమర్శలు వస్తున్నాయి. వినేశ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వినేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. పార్లమెంటులోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య వినేశ్ అంశమై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో IOA అధ్యక్షురాలు పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వైద్య బృందాన్ని సమర్థిస్తూ.. వినేశ్, ఆమె కోచ్‌దే తప్పు అన్నట్లుగా పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు.. ‘‘రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో వంటి క్రీడల్లో బరువు నియంత్రణ అంశం అనేది పూర్తిగా సదరు అథ్లెట్, అతడు లేదంటే ఆమె కోచ్ బాధ్యత.ఈ విషయంలో IOAచే నియమితులైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దీవాలా, ఆయన బృందానికి ఈ విషయంతో ఎటువంటి సంబంధం లేదు. IOA మెడికల్ టీమ్, డాక్టర్ పార్దీవాలాపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. వీటిని నేను పూర్తిగా ఖండిస్తున్నా.వాస్తవాలు తెలుసుకోకుండా IOA వైద్య బృందాన్ని బాధ్యుల్ని చేస్తూ.. వారిని తప్పుబట్టడం సరికాదు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న ప్రతీ భారత అథ్లెట్‌కు వారికంటూ సొంత సహాయక సిబ్బంది ఉంది. ఎన్నో ఏళ్లుగా వారితోనే ఈ అథ్లెట్ ప్రయాణం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే IOA మెడికల్ టీమ్‌ను నియమించాం.పోటీల సమయంలో ఆటగాళ్లు గనుక గాయపడితే.. వారికి చికిత్స అందించడం మాత్రమే వీరి ప్రాథమిక విధి. తమకంటూ సొంతంగా న్యూట్రీషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్లేని అథ్లెట్లకు కూడా వీరు సేవలు అందిస్తారు’’ అని పీటీ ఉష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినేశ్ ఫొగట్ బరువు విషయంలో వినేశ్తో పాటు ఆమె కోచ్‌లదే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో హర్యానా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తద్వారా ఈ క్రీడాంశంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఫైనల్‌కు ముందు బరువు తూచగా.. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫలితంగా వినేశ్ ఫొగట్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలని వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు అప్పీలు చేసింది. ఇందుకు సంబంధించిన తీర్పు ఆగష్టు 13న వెలువడనుంది. -
Olympics: ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణాలు
Diana Taurasi: ఒలింపిక్స్ బాస్కెట్‌బాల్‌లో అమెరికా క్రీడాకారిణి డయానా టురాసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వరుసగా ఆరు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా 67–66తో ఫ్రాన్స్‌ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో డయానా సభ్యురాలిగా ఉంది. 42 ఏళ్ల డయానా 2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లోనూ పసిడి పతకాలు గెలిచిన అమెరికా బాస్కెట్‌బాల్ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా హవా పారిస్ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో చైనా ఐదు స్వర్ణాలతో అదరగొట్టింది. చివరిరోజు మహిళల ప్లస్ 81 కేజీల విభాగంలో చైనా లిఫ్టర్ లీ వెన్వెన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. లీ వెన్వెన్ మొత్తం 309 కేజీల (స్నాచ్‌లో 136 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 173 కేజీలు) బరువెత్తింది. చైనా తరఫున ఈ క్రీడల్లో హు జీహుయ్ (49 కేజీలు), షిఫాంగ్ లువో (59 కేజీలు), లీ ఫాబిన్ (61 కేజీలు), లీ హువాన్హువా (102 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. -
ముగిసిన పారిస్ ఒలింపిక్స్
-
Paris Olympics 2024: ముగిసిన విశ్వక్రీడలు.. క్లోజింగ్ సెర్మనీ అదరహో (ఫోటోలు)
-
Tom Cruise: ఘనంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్.. టామ్ క్రూస్ సందడి (ఫోటోలు)
-
రాష్ట్రంలో పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి... ఏపీ సీఎంను డిమాండ్ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఈఫిల్ టవర్‌పైకి ఆగంతకుడు
పారిస్: ఒలింపిక్ క్రీడల ముగింపు ముంగిట్లో ఆదివారం ఓ వ్యక్తి పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కడం కలకలం రేపింది. 330 మీటర్ల ఎత్తున్న టవర్‌పై అతను రెండో సెక్షన్ వద్ద ఉండగా సిబ్బంది గమనించారు. దాంతో పర్యాటకులను ఖాళీ చేయించారు. అతన్ని కిందికి దించి అరెస్ట్ చేశారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు మరో వేదికను నిర్ణయించడం తెలిసిందే. వీటికోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఏడు నుంచి ఆరుకు...48 నుంచి 71కి..!
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఉండే నాలుగేళ్లతో పోలిస్తే ఒక ఏడాది తక్కువ సమయం ఉండటంతో అన్ని క్రీడల్లోనూ పారిస్ లక్ష్యంగానే హడావిడి కనిపించింది. అధికారులు, ప్రభుత్వం కూడా రెండంకెల పతకాలు ఖాయమంటూ నమ్మకం పెట్టుకున్నాయి. అందుకు తగినట్లుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అథ్లెట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా ఒలింపిక్స్ సన్నద్ధత కోసమే 16 క్రీడాంశాల్లో సౌకర్యాల కల్పన, విదేశాల్లో ప్రత్యేక శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు రూ. 470 కోట్లు ఖర్చు కూడా చేసింది. 117 మందితో మన బృందం బరిలోకి దిగింది. అద్భుతాల గురించి కాకపోయినా ఎక్కువ మంది కచ్చితంగా బాగా ఆడతారనే అంచనాలు, ఆశలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. కానీ ఒక్కో రోజు కరుగుతున్న కొద్దీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. పతకం కోసం ఎంతో ఎదురు చూడాల్సిన స్థితి. చివరకు ఒక రజతం, ఐదు కాంస్యాలతో మన టీమ్ ముగించింది. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడమే కాదు... స్వర్ణం కూడా లేకపోవడంతో పతకాల పట్టికలో కూడా భారత్ చాలా దిగువకు పడిపోయింది. –సాక్షి క్రీడా విభాగంపారిస్: అథ్లెటిక్స్‌లో భారత మహిళల 4్ఠ400 రిలే జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 32.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది... ఇదే ఈవెంట్లో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత బృందం టైమింగ్ 3 నిమిషాల 32.49 సెకన్లు మాత్రమే! అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మన జట్టు టైమింగ్ మెరుగుకాకపోగా, అంతకంటే పేలవంగా రిలే టీమ్ ముగించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్‌లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేమూ ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. భారత ప్రదర్శన విషయంలో ఈ ఒక్క క్రీడాంశాన్నే విమర్శించడానికి లేదు. ఓవరాల్‌గా కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనను దాటలేకపోగా, అది పునరావృతం కూడా కాలేదు. ప్రతీ ఒలింపిక్స్ తర్వాత జరిగే సమీక్ష తరహాలోనే ఈసారి కూడా దాదాపు అవే కారణాలు. మన ప్రమాణాలు బాగా పెరిగాయని చెప్పుకోవడమే తప్ప అసలైన సమయంలో పోటీకి దిగినప్పుడు ఇంకా మనం చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని తేలిపోయింది. చాలా మంది భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనడమే ఒక ఘనతగా కనిపిస్తోంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో 43 మంది పాల్గొంటే 41వ స్థానంలో నిలిచిన ప్రియాంక గోస్వామి గేమ్స్ విలేజ్ గదిలో సరదాగా ‘రీల్స్’ చేస్తున్న వీడియో చూస్తే ఆమె తన ఆట పట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది.తాము అడిగిన కోచ్‌లు, ఫిజియోలు... తాము కోరిన చోట శిక్షణ... ఇలా ఒక్కటేమిటి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచింది. అయినా మెడల్స్ విషయంలో మన రాత మారలేదంటే లోపం ఆటగాళ్లలోనే ఉన్నట్లు అర్థం. తమకు సౌకర్యాలు లేవనే మాట ఇకపై ఆటగాళ్ల నుంచి రాకూడదని... ప్లేయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ చేసిన వ్యాఖ్య ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ వర్తిస్తుంది. పతకవీరులు... టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన షూటర్ మనూ భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్‌డ్‌లో ఆమె భాగస్వామిగా సరబ్జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అనూహ్యంగా స్వప్నిల్ కుసాలే మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది.భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాగా... యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. ‘టోక్యో’ పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది.అయితే దురదృష్టవశాత్తూ అది చేజారినా... రజతంతో కాస్త మెరుగైన పతకం మన ఖాతాలో చేరింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మనూ భాకర్ తన కీర్తిని పెంచుకుంది. అంచనా తప్పారు... టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి నుంచి ప్రదర్శన, తాజా ఫామ్, ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విఫలం కాగా... కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయంపాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా కనీసం పతకానికి చేరువగా కూడా రాలేకపోవడం గమనార్హం. బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ కూడా అంచనా తప్పగా... గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నాలుగో ఒలింపిక్స్‌లో కూడా దీపిక కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, ఈక్వె్రస్టియన్లు మనం పతకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్‌లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీల స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. నాలుగో స్థానాలతో సరి... విజయం సాధించిన వాడినే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రెండో స్థానానికి కూడా విలువుండదు... స్పోర్ట్స్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు చాలా మంది తరచుగా వాడే మాట ఇది. కానీ మన భారతీయులు ఇప్పుడు నాలుగో స్థానాన్ని చూసి కూడా అయ్యో... కొద్దిలో చేజారిందే అనుకుంటున్నాం. ఇది ఏదో ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఒలింపిక్స్‌లో నాలుగో స్థానానికి ఎలాంటి విలువ లేదు. అదృష్టం కలిసొస్తే మరో ఆరు పతకాలు మన ఖాతాలో చేరేవేమో కానీ అలాంటి వాటికి ఆటల్లో చోటు లేదు. మనూ భాకర్, అర్జున్ బబూతా, మహేశ్వరి–అనంత్‌జీత్ జోడీ (షూటింగ్), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్–అంకిత జోడీ (ఆర్చరీ) అసలు సమయంలో తమ ఆట స్థాయిని పెంచలేకపోయారు. చివరగా... గెలుపు కూడా ఓటమిగా మారిన వైనం వినేశ్ ఫొగాట్ విషయంలో జరిగింది. ఫైనల్ చేరిన తర్వాత వచ్చిన పతకం బరువు ఎక్కువై చేజారడం వినేశ్‌కే కాదు భారతీయులందరికీ వేదన కలిగించింది. -
‘రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం
పారిస్: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం హోరాహోరీగా పోటీ పడిన తర్వాత 2024 ఒలింపిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా పారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు 70 వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ ముగింపు వేడుకలు జరిగాయి.థామస్ జాలీ నేతృత్వంలో ముగింపు ఉత్సవాలను ‘రికార్డ్స్’ పేరుతో నిర్వహించారు. ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చండ్ క్రీడా జ్యోతిని తీసుకొని వేదిక వద్దకు రాగా... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ చైర్మన్ థామస్ బాక్ వేదికపై కూర్చున్నాడు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్‌బేరర్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత్ తరఫున మనూ భాకర్, పీఆర్ శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు. వచ్చే ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో జరగనున్న నేపథ్యంలో పారిస్ క్రీడల నిర్వాహకులు ఒలింపిక్ ఫ్లాగ్‌ను లాస్ ఏంజెలిస్ క్రీడల చైర్పర్సన్ కేసీ వాసర్‌మన్‌కు అందజేశారు. ఫ్రెంచ్ భాషలో ‘మెర్సీ పారిస్’ (థ్యాంక్యూ పారిస్) నినాదాలు హోరెత్తుతుండగా ఆఖరి ఘట్టం ముగిసింది. -
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్‌ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్‌లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్‌లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్‌జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
సూపర్ సిఫాన్...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్‌లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది. తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
అమెరికాను బోల్తా కొట్టించి స్వర్ణం గెలిచిన ఇటలీ మహిళల వాలీబాల్ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో చివరి రోజు సంచలన ఫలితం వచ్చి0ది. మహిళల వాలీబాల్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. తొలిసారి ఫైనల్ చేరిన ఇటలీ జట్టు 25–18, 25–20, 25–17తో అమెరికా జట్టును ఓడించి మొదటిసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇటలీ సీనియర్ క్రీడాకారిణి, నాలుగోసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మోనికా డి జెనారోను సభ్యులంతా గాల్లో ఎగరేసి సంబరం చేసుకున్నారు. మాజీ చాంపియన్ బ్రెజిల్ 25–21, 27–25, 22–25, 25–15తో టర్కీ జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో అమెరికా జట్టు ఓడిపోయినా ఒలింపిక్స్ మహిళల వాలీబాల్‌లో అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన జట్టుగా అవతరించింది. అమెరికా జట్టు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు దక్కించుకుంది. సోవియట్ యూనియన్, చైనా, జపాన్, బ్రెజిల్ ఆరు పతకాల చొప్పున నెగ్గాయి. -
లిన్ యూ టింగ్ పంచ్ అదిరె...
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ వివాదాన్ని ఎదుర్కొన్న మరో బాక్సర్ స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 57 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో లిన్ యూ టింగ్ 5–0తో జూలియా (పోలాండ్)పై గెలిచింది. అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ పతకం సాధించిన మరుసటి రోజే లిన్ యూ టింగ్ కూడా మెడల్‌తో మెరిసింది. బాక్సింగ్‌లో చైనీస్ తైపీకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం. ‘పారిస్’ క్రీడల ఆరంభం నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కొన్న లిన్ యూ టింగ్ బహుమతి ప్రదానోత్సవం సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ.. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని పేర్కొంది. ‘ప్రత్యర్థితోనే కాదు.. పరిస్థితులపై కూడా గెలిచా. ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టా. అయినా కోచ్ ద్వారా కొన్ని వార్తలు వినాల్సి వచ్చేది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆహ్వానంతోనే పారిస్‌లో అడుగుపెట్టా. అలాంటప్పుడు వచ్చిన పని వదిలేసి అనవసర విషయాలను దరి చేరనివ్వలేదు. పూర్తి ఏకాగ్రత బౌట్పైనే పెట్టా. ఈ పతకంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అయింది. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని లిన్ యూ టింగ్ వెల్లడించింది. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో లిన్‌తో పాటు ఖలీఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. ఈ ఇద్దరిలో పురుషులకు చెందిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ... లిన్ సాధించిన కాంస్యాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లిన్... విశ్వక్రీడల ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూ చివరకు చాంపియన్‌గా నిలిచింది. -
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. హెడ్‌కోచ్‌కు గుండె పోటు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్‌లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.అసలేం జరిగిందంటే?ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. -
అభినవ్ బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’
పారిస్: ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సముచిత రీతిలో గౌరవించింది. స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’ను అందజేసింది. ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంతో ఒలింపిక్ ఉద్యమం పాత్ర ఉంది. 1975 నుంచి ఈ ఒలింపిక్ ఆర్డర్‌ను అందజేస్తున్నారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ థామస్ బాక్ ఈ అవార్డును బింద్రాకు అందజేశారు.