Simone Biles: ఒలింపిక్‌ లెజెండ్‌ - సింహం మెడలో మేక... | Simone Biles Is The Fifth Female Olympic Gymnast With The Most Olympic Medals In The World | Sakshi
Sakshi News home page

Simone Biles: ఒలింపిక్‌ లెజెండ్‌ - సింహం మెడలో మేక...

Published Fri, Aug 9 2024 9:52 AM | Last Updated on Fri, Aug 9 2024 11:19 AM

Simone Biles Is The Fifth Female Olympic Gymnast With The Most Olympic Medals In The World

సిమోన్‌ అరియన్నే బైల్స్‌ ఓవెన్స్‌

విమర్శలకు చాలా మంది కుంగిపోతుంటారు. ఆమెరికన్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్ట్‌ అయిన సిమోన్‌ అరియన్నే బైల్స్‌ ఓవెన్స్‌ మాత్రం విమర్శలనే సవాల్‌గా తీసుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇటీవల జరిగిన ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. దీంతో తొమ్మిది ఒలింపిక్‌ పతకాలు, 30 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాలు ఆమె ఖాతాలో చేరి, ప్రపంచంలోనే అత్యధిక ఒలింపిక్‌ పతకాలు సాధించిన ఐదవ మహిళా ఒలింపిక్‌ జిమ్నాస్ట్‌గా పేరొందిందామె.

27 ఏళ్ల సిమోన్‌ విజయం సాధించిన వెంటనే తన మెడలో మేక లాకెట్టుతో ఉన్న చైన్‌ను బయటకు తీసి అందరికీ చూపించింది. ‘చాలా మంది నన్ను ‘గోట్‌’ అని పిలుస్తుంటారు. నేను దానిని నెగిటివ్‌గా తీసుకోలేదు. ఈ గోట్‌లో కూడా ప్రత్యేకత ఉంది, అది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. అందుకే ‘స్టఫ్డ్‌ గోట్‌’ను హారంగా మెడలో ధరించాను’ అంటూ గోట్‌ లాకెట్‌ను చేత్తో పట్టుకొని చూపిస్తూ అంది సిమోన్‌ బైల్స్‌.

తొమ్మిదవ ఒలింపిక్‌ పతకాన్ని, ఆరవ స్వర్ణాన్ని సంపాదించినందుకు సిమోన్‌ ప్రదర్శనలో అభినందనలు దక్కాయి. అయితే, 2021లో జరిగిన టోక్యో గేమ్స్‌ నుండి చివరి నిమిషంలో వైదొలగడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె చేష్టల కారణంగా మరొక క్రీడాకారిణికి అవకాశం లేకుండా పోయిందని, జాత్యహంకారం, సెక్సిస్ట్, ట్రాన్స్‌ఫోబిక్, డ్రగ్‌ చీట్‌... అని ఎంతో మంది చేత నాడు విమర్శలను ఎదుర్కొంది. దీంతో కుటుంబంలో వచ్చిన సమస్యలు, మానసిక సమస్యలతో పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయినా ఆమెపైన విమర్శలు ఆగలేదు. ఆ సందర్భంలో ఆమెను ‘గోట్‌’ అంటూ హేళన చేశారు. అదే ఆమె ఇప్పుడు తన బలంగా మార్చుకుని, దాంతోనే పతకాన్ని సాధించ గలిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement