gymnastics championship
-
విశాఖపట్నం : ఒళ్లా.. విల్లా (ఫొటోలు)
-
Simone Biles: ఒలింపిక్ లెజెండ్ - సింహం మెడలో మేక...
విమర్శలకు చాలా మంది కుంగిపోతుంటారు. ఆమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ అయిన సిమోన్ అరియన్నే బైల్స్ ఓవెన్స్ మాత్రం విమర్శలనే సవాల్‌గా తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇటీవల జరిగిన ఆల్‌రౌండ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. దీంతో తొమ్మిది ఒలింపిక్ పతకాలు, 30 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు ఆమె ఖాతాలో చేరి, ప్రపంచంలోనే అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన ఐదవ మహిళా ఒలింపిక్ జిమ్నాస్ట్‌గా పేరొందిందామె.27 ఏళ్ల సిమోన్ విజయం సాధించిన వెంటనే తన మెడలో మేక లాకెట్టుతో ఉన్న చైన్‌ను బయటకు తీసి అందరికీ చూపించింది. ‘చాలా మంది నన్ను ‘గోట్’ అని పిలుస్తుంటారు. నేను దానిని నెగిటివ్‌గా తీసుకోలేదు. ఈ గోట్లో కూడా ప్రత్యేకత ఉంది, అది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. అందుకే ‘స్టఫ్డ్ గోట్’ను హారంగా మెడలో ధరించాను’ అంటూ గోట్ లాకెట్‌ను చేత్తో పట్టుకొని చూపిస్తూ అంది సిమోన్ బైల్స్.తొమ్మిదవ ఒలింపిక్ పతకాన్ని, ఆరవ స్వర్ణాన్ని సంపాదించినందుకు సిమోన్ ప్రదర్శనలో అభినందనలు దక్కాయి. అయితే, 2021లో జరిగిన టోక్యో గేమ్స్ నుండి చివరి నిమిషంలో వైదొలగడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె చేష్టల కారణంగా మరొక క్రీడాకారిణికి అవకాశం లేకుండా పోయిందని, జాత్యహంకారం, సెక్సిస్ట్, ట్రాన్స్‌ఫోబిక్, డ్రగ్ చీట్... అని ఎంతో మంది చేత నాడు విమర్శలను ఎదుర్కొంది. దీంతో కుటుంబంలో వచ్చిన సమస్యలు, మానసిక సమస్యలతో పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయినా ఆమెపైన విమర్శలు ఆగలేదు. ఆ సందర్భంలో ఆమెను ‘గోట్’ అంటూ హేళన చేశారు. అదే ఆమె ఇప్పుడు తన బలంగా మార్చుకుని, దాంతోనే పతకాన్ని సాధించ గలిగింది. -
Gymnastics: విజేతగా నిషిక ప్రవీణ్ అగర్వాల్
CBSE Gymnastics Championship 2022: హైదరాబాద్‌లోని గాడియమ్ స్కూల్లో సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 750 పాఠశాలలకు చెందిన 1700 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అండర్–17 ఆల్‌రౌండ్ కేటగిరీలో గాడియమ్ స్కూల్‌కే చెందిన నిషిక ప్రవీణ్ అగర్వాల్ మొదటి స్థానంలో, నారాయణి మూడో స్థానంలో నిలిచారు. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో అరవిందో ఫార్మా డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు! -
జిమ్నాస్ట్ అరుణా రెడ్డికి 5 లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: ఈజిప్ట్‌లో జరిగిన ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డికి అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ. 5 లక్షలు నజరానాగా అందజేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ కె.నిత్యానందరెడ్డి జిమ్నాస్ట్ అరుణా రెడ్డిని సన్మానించి రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. -
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ మహిళకు రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ మహిళా జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెరిసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఈ టోర్నీలో 25 ఏళ్ల అరుణా రెడ్డి టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో అరుణ 13.800 స్కోరు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో అరుణ 13.487 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈజిప్ట్, పోలాండ్ జిమ్నాస్ట్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫయింగ్‌లో అరుణ 11.35 పాయింట్లు స్కోరు చేయగా... ఫైనల్లో 12.37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో అరుణా రెడ్డి కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. చదవండి: ‘బీడబ్ల్యూఎఫ్’ అథ్లెటిక్స్ కమిషన్‌లో సింధు -
వరల్డ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్: నంబర్‌వన్‌గా పాయస్ జైన్
భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) యువతార పాయస్ జైన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్ జైన్ మూడు అంతర్జాతీయ టైటిల్స్ సాధించాడు. మానవ్ ఠక్కర్ (అండర్–21) తర్వాత ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్ పాయస్ జైన్ కావడం విశేషం. వాల్ట్ ఈవెంట్లో అరుణా రెడ్డికి 11వ స్థానం ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి వాల్ట్ ఈవెంట్ ఫైనల్ ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయింది. జపాన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణా రెడ్డి క్వాలిఫయింగ్‌లో 13.353 పాయింట్లు స్కోరు చేసి 11వ స్థానంలో నిలిచింది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. అరుణ మూడో రిజర్వ్‌గా ఉంది. టాప్–8 నుంచి ముగ్గురు వైదొలిగితే అరుణా రెడ్డికి ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. చదవండి: Virat Kohli: టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం.. -
Simon Byles: విజయాలే భారమై...
టోక్యో: రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, వివిధ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 19 స్వర్ణాలు... మొత్తంగా అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్ బైల్స్. ►టోక్యో ఒలింపిక్స్‌కు తమ దేశం తరఫున మరో సారి భారీ అంచనాలతో వెళ్లిన బైల్స్‌ను మానసిక సమస్యలు వీడటం లేదు. మంగళవారం టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఒక్క ‘వాల్ట్’లోనే ఒకే ఒక ప్రయత్నం చేసి తప్పుకున్న బైల్స్... గురువారం జరిగే ఆల్ ఆరౌండ్ ఈవెంట్లో కూడా పాల్గొనడం లేదని ప్రకటించింది. ప్రస్తుతం తాను మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. వచ్చేవారంలో జరిగే వ్యక్తిగత ఈవెంట్లలో కూడా ఆమె పాల్గొంటుందా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ప్రతీ రోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటా మని అమెరికా ఒలింపిక్ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెరిగిపోయిందా..! జాగ్రత్తగా చూస్తే బైల్స్ పాల్గొనే ఈవెంట్లలో ఆమె ధరించే డ్రెస్‌పై ఏదో ఒక మూల ‘మేక’ బొమ్మ ము ద్రించి ఉంటుంది. ఇది ఏదో రాశిని బట్టి పెట్టుకు న్నది కాదు... ఎౖఅఖీ (ఎట్ఛ్చ్ట్ఛట్ట ౖజ అ ∙ఖీజీఝ్ఛ)... చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్ అని గుర్తు చేయడం దాని ఉద్దేశం! ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు ఆమె టోక్యో బయల్దేరినప్పుడు అమెరికా విమానయాన సంస్థ ‘యునైటెడ్’ కూడా ఫ్లయిట్లో ఇలాంటి వస్తువులే ఇచ్చి గౌరవం ప్రదర్శించుకుంది. మైకేల్ ఫెల్ప్స్ లాంటి దిగ్గజం లేకపోవడంతో అమెరికా దేశానికి ఈ ఒలింపిక్స్‌లో ఆమె ఒక ‘ముఖచిత్రం’ తరహాలో మారిపోయింది. ► ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఒకవైపు తన బ్రాండ్ పేరును కాపాడుకోవాలి. స్పాన్సర్లను సంతోషపెట్టాలి. అటు అభిమానులను అలరించాలి. ఇటు ఇంటా, బయటా విమర్శకులకు సమాధానమివ్వాలి. ఇదంతా 24 ఏళ్ల బైల్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. టోక్యోలో ఆమె మానసికంగా కుప్పకూలిపోవడం అనూహ్యమేమీ కాదు. ► ‘రియో’ విజయాల తర్వాత చాలాసార్లు ఆమె మానసికంగా ఆందోళనకు గురైంది. కిడ్నీలో రాయితో ఇబ్బంది పడుతున్న దశలో కూడా అందరి కోసం ఆమె 2018 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. కరోనా సమయంలో హ్యూస్టన్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో వరుసగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రావడం, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం బైల్స్‌ను బాగా ఇబ్బంది పెట్టింది (జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కూడా ఇదే కారణం చెబుతూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకుంది). ► అమెరికా ఒలింపిక్స్ ట్రయల్స్ సందర్భంగా ఆమె సహచరి సునీసా లీకంటే కూడా బైల్స్ వెనుకబడింది. గత ఎనిమిదేళ్లలో ఇలా జరగలేదు. గత రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌పై ఏ ఒత్తిడి లేదు. స్వేచ్ఛగా, చలాకీగా విన్యాసాలు ప్రదర్శిస్తూ పతకాలు కొల్లగొట్టింది. ► తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం ‘వాల్ట్’ విన్యాసం చేసినప్పుడు ఆమెలో ఉత్సా హం కనిపించలేదు. 2 1/2 ట్విస్ట్‌లు చేయాల్సిన చోట 1 1/2 ట్విస్ట్‌కే పరిమితమైంది. సరిగ్గా చెప్పాలంటే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని భయపడే కొత్త జిమ్నాస్ట్లాగా కనిపించింది. ఎంతో సాధించిన తర్వాత ఇంకా రిస్క్ చేసి ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన ఆమె వ్యాఖ్యల్లోనూ వినిపించింది. తాను పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో లేకపోయినా సరే... అందరినీ సంతృప్తిపరచడం కోసమే బైల్స్ ఒలింపిక్స్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యక్తిగత విభాగంలోనూ ఆమె పోటీ పడకపోవచ్చు! ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కుదురుగా కూర్చొని నా మానసిన సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని అనిపించింది. వివరంగా చెప్పలేను కానీ కొన్ని అంశాల్లో నా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. నాకు ఎలాంటి గాయం లేదు. మనసు ఎక్కడో ఉండి బరిలోకి దిగి... లేని గాయాలు తెచ్చుకునే పిచ్చి పనిని నేను చేయదల్చుకోలేదు. ఒలింపిక్స్‌కు వచ్చాక నేను నా కోసం కాకుండా ఇంకెవరి కోసమే ఆడుతున్నట్లు అనిపించింది. ఇది నన్ను బాధించింది. పేరు ప్రతిష్టలను పక్కన పెట్టి నా ఆరోగ్యానికి ఏది సరైందో ఆ నిర్ణయం తీసుకోవడం అవసరం. మళ్లీ పోటీల్లో పాల్గొంటానో లేదో చివరి నిమిషం వరకు చెప్పలేను. –సిమోన్ బైల్స్, అమెరికా జిమ్నాస్ట్ -
తెలంగాణ జిమ్నాస్ట్ సురభికి మూడు పతకాలు
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ సురభి ప్రసన్న మూడు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన అండర్–17 బాలికల మూడు ఈవెంట్లలో సురభి రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఆల్ అరౌండ్ వ్యక్తిగత విభాగంలో సురభి 39.85 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్స్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది. -
అక్షితికి 3 స్వర్ణాలు, 2 రజతాలు
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ అక్షితి మిశ్రా అదరగొట్టింది. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోన్న అక్షితి ఈ టోర్నీలో 3 పసిడి పతకాలు, 2 రజత పతకాలను హస్తగతం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖేల్ గాన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ పోటీల్లో అక్షితి పాల్గొన్న నాలుగు విభాగాల్లోనూ పతకాలను కైవసం చేసుకుంది. బ్యాలెన్సింగ్ బీమ్ ఈవెంట్లో ఆమె విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకోగా... మేఘాన్షి, కోమల్ వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్ ఈవెంట్లోనూ అక్షితి స్వర్ణంతో మెరిసింది. టేబుల్ వాల్ట్, అన్ఈవెన్ బార్స్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచి రెండు రజత పతకాలను నెగ్గింది. వీటితో పాటు టోరీ్నలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 36.95 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి మరో బంగారు పతకాన్ని గెలుచుకుంది. -
భళారే... బైల్స్
స్టుట్గార్ట్ (జర్మనీ): ఊహించిన అద్భుతమే జరిగింది. అమెరికా మెరుపుతీగ సిమోన్ బైల్స్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా 22 ఏళ్ల బైల్స్ రికార్డు నెలకొలిపంది. ఆదివారం ముగిసిన ప్రపంచ ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు బైల్స్ బ్యాలెన్సింగ్ బీమ్ (15.066 పాయింట్లు), ఫ్లోర్ ఎక్సర్సైజ్ (15.133 పాయింట్లు) ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పటివరకు బెలారస్ పురుష జిమ్నాస్ట్ వితాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న రికార్డును బైల్స్ 25వ పతకంతో బద్దలు కొట్టింది. శనివారం షెర్బో రికార్డును సమం చేసిన బైల్స్ ఆదివారం మరో రెండు స్వర్ణాలు గెలిచి తనకు ఎదురులేదని చాటుకుంది. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో బైల్స్కిది ఐదో పసిడి పతకం. ఐదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడిన బైల్స్ ఈ ఈవెంట్ చరిత్రలో 19 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు సాధించింది. తనకిదే చివరి ప్రపంచ చాంపియన్‌షిప్ కావొచ్చని... వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు కూడా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నానని బైల్స్ తెలిపింది. -
షెర్బో సరసన సిమోన్ బైల్స్
స్టుట్గార్ట్ (జర్మనీ): అమెరికా మెరుపుతీగ సిమోన్ బైల్స్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఆల్‌టైమ్ పతకాల రికార్డును సమం చేసింది. శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్లో 22 ఏళ్ల బైల్స్ 15.399 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో ఆమెకిది 17వ పసిడి పతకంకాగా ఓవరాల్‌గా 23వ పతకం. ఈ క్రమంలో బెలారస్ జిమ్నాస్ట్ వితాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న అత్యధిక పతకాల ఆల్‌టైమ్ రికార్డును బైల్స్ సమం చేసింది. షెర్బో 1991 నుంచి 1996 మధ్య జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో 12 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు గెలిచాడు. శనివారమే జరిగిన అన్ఈవెన్ బార్స్ ఫైనల్లో బైల్స్ బరిలోకి దిగినా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. లేదంటే కొత్త రికార్డు నెలకొల్పేది. అయితే నేడు బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్స్‌లోనూ బైల్స్ పోటీపడనుంది. ఈ రెండింటిలో ఆమె ఒక్క పతకం సాధించినా ప్రపంచ చాంపియన్íÙప్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా కొత్త చరిత్ర లిఖిస్తుంది. -
అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర
-
అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర
స్టుట్గార్ట్ (జర్మనీ): ఐదుసార్లు ఒలింపిక్ విజేత, 14 సార్లు ప్రపంచ చాంపియన్ అయిన అమెరికా జిమ్నాస్టిక్స్ సంచలనం సిమోన్ బైల్స్ మరోసారి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సరికొత్త ప్రదర్శనతో ఆటకే వన్నె తెచ్చారు బైల్స్. 22 ఏళ్లకే ప్రపంచ జిమ్నాస్టిక్స్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న బైల్స్ .. ఎన్నో పతకాలు ఖాతాలో వేసుకున్నారు. గుండె గుబేల్మనిపించే విన్యాసాలు చేసే ఈ అమ్మాయి.. తాజాగా వరల్డ్ ఆర్టిస్టిక్ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ మొదటి రోజే చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శరతో చూపరులను ఆకట్టుకున్నారు. గంటల వ్యవధిలో రెండు విన్యాసాలను తన పేరిట లిఖించుకున్నారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫికేషన్లో బైల్స్.. ట్రిపుల్ -డబుల్ స్కిల్‌ను ప్రదర్శించారు. దీనికి ‘బైల్స్ 2’అని పేరు పెట్టారు. ఆపై, బీమ్‌లో డబుల్-ట్విస్టింగ్ డబుల్ టక్ డిస్మౌంట్ను ప్రదర్శన చేశాడు బైల్స్. జిమ్నాస్టిక్స్‌లో మొట్టమొదటగా చేసిన ఈ విన్యాసాన్ని ఇకపై‘ బైల్స్’అని పిలవనున్నారు.(ఇక్కడ చదవండి: భారత జిమ్నాస్ట్స్ విఫలం) ఇటీవల జరిగిన యూఎస్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఫ్లోర్ రొటీన్ ఈవెంట్లో అత్యంత క్లిష్టమైన ట్రిపుల్-డబుల్ విన్యాసం చేసిన బైల్స్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్లోర్ ఈవెంట్లో ట్రిపుల్-డబుల్ అంటే.. గాలిలోకి ఎగిరి కిందకు ల్యాండ్ అయ్యే క్రమంలో శరీరాన్ని రెండుసార్లు బ్యాక్ ఫ్లిప్ చేస్తూ మూడుసార్లు ట్విస్ట్ చేయడం. అత్యంత అరుదైన, సాహసోపేతమైన ఈ అద్భుత విన్యాసాన్ని 22 ఏళ్ల బైల్స్ ఆవిష్కృతం చేసి సంచలనం సృష్టించారు. తాజాగా ఈ అరుదైన విన్యాసాలను మరోసారి ప్రదర్శించి దానికి తన పేరునే లిఖించుకున్న బైల్స్ కొత్త చరిత్ర సృష్టించారు. Simone Biles gets a second skill named after her tonight, this one her double-double dismount off the balance beam. Biles took issue with the point value an FIG committee awarded it, calling it bullshit. Note the claps in front of the judges. pic.twitter.com/AvUu8ddTxc — Nick Zaccardi (@nzaccardi) October 5, 2019 -
భారత జిమ్నాస్ట్స్ విఫలం
స్టుట్గార్ట్ (జర్మనీ): ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా క్రీడాకారిణులు నిరాశ పరిచారు. ప్రణతి నాయక్, ప్రణతి దాస్, తెలుగమ్మాయి బుద్ధా అరుణా రెడ్డి తమ ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఆల్ అరౌండ్ క్వాలిఫయింగ్‌లో ప్రణతి నాయక్ 45.832 పాయింట్లతో 127వ స్థానంలో... ప్రణతి దాస్ 45.248 పాయింట్లతో 132వ స్థానంలో నిలిచారు. వాల్ట్ ఈవెంట్లో ప్రణతి నాయక్ 14.200 పాయింట్లతో 27వ స్థానంతో సరిపెట్టుకుంది. అన్ఈవెన్ బార్స్‌లో ప్రణతి నాయక్ 10.566 పాయింట్లతో 164వ స్థానంలో... ప్రణతి దాస్ 9.916 పాయింట్లతో 182వ స్థానంలో... అరుణా రెడ్డి 8.925 పాయింట్లతో 193వ స్థానంలో నిలువడం గమనార్హం. బ్యాలెన్స్ బీమ్‌లో ప్రణతి దాస్ (10.866 పాయింట్లు) 138వ స్థానంలో... అరుణా రెడ్డి (10.200 పాయింట్లు) 164వ స్థానంలో... ప్రణతి నాయక్ (9.933 పాయింట్లు) 174వ స్థానంలో నిలిచారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ప్రణతి దాస్ (11.466 పాయింట్లు) 151వ స్థానంలో, ప్రణతి నాయక్ (11.133 పాయింట్లు) 179వ స్థానంలో నిలువగా...అరుణా రెడ్డి పోటీపడలేదు. -
లక్ష్యం ఒలింపిక్స్
ఆమె వయస్సు 16 సంవత్సరాలు. జిమ్నాస్టిక్స్‌లో ఆమె చేసే విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ‘రిథమిక్ జిమ్నాస్టిక్స్’ పోటీల్లో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సాధించి దేశం కళ్లు ఆమెవైపు తిప్పుకునేలా చేసింది అనన్య గరికిపాటి. సరదా కోసం ప్రారంభించిన జిమ్నాస్టిక్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలను సాధించుకుంది. రానున్న ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకం సాధించాలనే ఆశయంతో ముందుకెళ్తున్న అనన్య గరికిపాటిపై ప్రత్యేక కథనం. బాచుపల్లిలో నివాసముండే గరికిపాటి శ్రీధర్, డాక్టర్ పద్మజల మొదటి కుమార్తె అనన్య. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ పూర్తి చేసిన ఆమె గాంజెస్ వ్యాలీ హైస్కూల్లో ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. చిన్నప్పుడు తన ఫ్రెండ్స్ జిమ్నాసిక్ట్ చేస్తున్నప్పుడు చూసి తను కూడా సరదా కోసం ఆడటం ప్రారంభించింది. ఫ్రెండ్స్, టీచర్స్, ఇంట్లోవాళ్లు, బంధువులు అంతా బాగా చేస్తున్నావ్ అనే కాంప్లిమెంట్స్ రావడంతో ఆటపై మక్కువ పెంచుకున్నారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ నాజ్మీజాన్స్టన్ వద్ద 2016లో కోచింగ్ తీసుకున్నారు. ఇవీ సాధించిన పతకాలు ♦ పలు దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ రిథమిక్ జిమ్నాసిక్స్ పోటీల్లో అనన్య సత్తా చాటింది. జూనియర్ విభాగాల్లో బంగారు, కాంస్యం, వెండి పతకాలను సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ♦ 2016లో లండన్‌లో జరిగిన ‘లండన్ స్ప్రింగ్కప్’ పోటీల్లో మూడు కాంస్య పతకాలు, ఆల్‌రౌండ్ విభాగంలో మరో మూడు కాంస్య పతకాలు, ‘మిస్హోప్ ట్రోఫీ’ కైవసం చేసుకుంది. ♦ 2016 దుబాయిలో జరిగిన ‘డూజియంకప్’ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ♦ 2017 తాష్కంట్ ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన పోటీల్లో ఆల్‌రౌండ్‌లో సిల్వర్‌తో పాటు ‘మిస్ ఎమోషన్ క్రౌన్ పతకం’ సాధించింది. ♦ 2017 దుబాయిలో జరిగిన ‘ఎమిరేట్స్ కప్’లో ఒక కాంస్య పతకం, ఒక స్పెషల్ ప్రైజ్. ♦ 2018లో మాస్కోలో జరిగిన పోటీల్లో ఒక స్పెషల్ ప్రైజ్, బాల్ విభాగంలో థర్డ్, ఫ్రూఐజ్ క్లబ్స్‌లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. లండన్ స్ప్రింగ్కప్తో ఆరంభం 2016లో లండన్‌లో ‘లండన్ స్ప్రింగ్ కప్’ పేరుతో మేజర్ ఇంటర్నేషనల్ పోటీలు జరిగాయి. పోటీల్లో అప్పుడు జూనియర్‌గా ఉన్న అనన్య పాల్గొని ఆల్రౌండ్స్లో తన ప్రతిభ కనబర్చింది. ఈ పోటీల్లో మూడు కాంస్య పతకాలతో పాటు, ఆల్‌రౌండ్ మిస్హోప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. మాస్కోతో మనసు దోచుకుంది మే నెలలో ‘మాస్క్వో’ దేశంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దేశం నుంచి ‘రిథమిక్ జిమ్నాస్టిక్స్’ విభాగంలో అనన్య ఒక్కరే పాల్గొన్నారు. ఈ పోటీల్లో తన ప్రతిభను కనబరచి దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇక్కడ జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్స్‌లో ‘జూనియర్స్ స్టార్‌లో ఆర్‌రౌండ్ విభాగంలో బంగారు పతకం, స్పెషల్ ప్రైజ్‌తో పాటు మిస్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకుంది. ‘సెల్యూట్ కప్’లో ఆర్‌రౌండ్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో ‘నోవాగోర్స్ స్టార్స్’లో ఆర్టిస్ట్రీ విభాగంలో స్పెషల్ ప్రైజ్‌ను సాధించింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ నా డ్రీమ్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనాలనేది జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నప్పుడు కన్న కల. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం సంతృప్తిని ఇస్తున్నప్పటికీ.. నా డ్రీమ్ అంతా ఒలింపిక్సే. ఒలింపిక్స్‌లో పాల్గొని రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో దేశానికి బంగారు పతకం తేవాలనేది నా డ్రీమ్, నా లక్ష్యం, నా కర్తవ్యం కూడా.– అనన్య గరికిపాటి టాలెంట్ గుర్తించాం అనన్యలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ను గుర్తించాం. అందుకే నా డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి మరీ అనన్యకు తోడుగా ఉంటున్నాను. విదేశాలకు వెళ్లడం, రావడం, ఆడటం కష్టంగా ఉన్నప్పటికీ అనన్య కలల్ని సాకారం చేయాలనేదే మా కోరిక. అందుకే తనని ప్రతి అంశంలో ప్రోత్సహిస్తున్నాం. రిథమిక్ జిమ్నాస్టిక్స్లోని నాలుగు విభాగాల్లో అనన్య అందర్నీ ఆకట్టుకోవడం తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది. – డాక్టర్ పద్మజ గరికిపాటి,అనన్య తల్లి -
వైశాలికి రెండు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో విద్యా వినయలయ స్కూల్ విద్యార్థి వైశాలి అద్భుత ప్రదర్శన కనబరిచింది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వైశాలి రెండు స్వర్ణాలను గెలుచుకుంది. అండర్–16 బాలికల ఫ్లోర్, బీమ్ ఈవెంట్లలో వైశాలి విజేతగా నిలిచింది. ఫ్లోర్, బీమ్ ఈవెంట్లలో ఆమని (చిరెక్), ఆశ్రిత (సుచిత్ర అకాడమీ) వరుసగా రజత, కాంస్యాలను గెలుచుకున్నారు. వాల్ట్ కేటగిరీలో ఆమని పసిడిని కైవసం చేసుకోగా, జీవీ ఆశ్రిత రజతాన్ని గెలుచుకుంది. ఎం. ధన్యతా రెడ్డి (గాడియం స్కూల్), పి. వైశాలి కాంస్యాలను అందుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి ఎస్. సోమేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీబీఆర్ పాలక అధికారి జి. రవీందర్, మాజీ కార్యదర్శి ఎం. బాలరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శి బి. బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–6 బాలికలు: 1. వైష్ణవి (హోవర్డ్), 2. జనని (క్రెమన్ మాంటిస్సోరి), ఆర్యరావు (బిర్లా ఓపెన్ మైండ్స్). అండర్–8 బాలికల ఫ్లోర్ ఈవెంట్: 1. అనయ (ఇండస్), 2. అనన్య (పుల్లెల గోపీచంద్ అకాడమీ), 3. ఇషా (ఫ్యూచర్ కిడ్స్); బాలురు: 1. కృష్ణ (శ్రీహనుమాన్ వ్యాయామశాల), 2. అహాన్ (చిరెక్), 3. ఆకాశ్ (సుజాత స్కూల్). అండర్–10 బాలికల బీమ్ ఈవెంట్: 1. సిరిరెడ్డి (రోజరీ కాన్వెంట్), 2. నిధి (నాసర్ స్కూల్), 3. తన్వి (ఓక్రిడ్జ్). అండర్–10 బాలికల ఫ్లోర్ ఈవెంట్: 1. సిరి రెడ్డి (రోజరీ కాన్వెంట్), 2. మెహర్ (పుల్లెల గోపీచంద్), 3. నిధి (నాసర్ స్కూల్); బాలురు: 1. శ్రీకర్ (బ్రాహ్మణ్ టాలెంట్ స్కూల్), 2. కె. సాయి కిరణ్ (బల్విన్ హైస్కూల్), 3. శ్రీకర్ కుమార్ (ఓబుల్ రెడ్డి స్కూల్). అండర్–10 బాలుర వాల్ట్: 1. శ్రీకర్ (బ్రాహ్మణ్ టాలెంట్ స్కూల్), వివియానా అగర్వాల్ (చిరెక్), 3. కె. మోనిశ్ (సెయింట్ జోసెఫ్). అండర్–12 బాలికల ఫ్లోర్ ఈవెంట్: 1. ప్రణవి భారతీయ (డీపీఎస్), 2. వేద (చిరెక్), 3. క్రుతిక (గాడియం స్కూల్); వాల్ట్ ఈవెంట్: 1. దివేషి (చిరెక్), 2. క్షేత్ర (ఇండస్), 3. రేహా రెడ్డి (రాక్వెల్ స్కూల్); బీమ్: 1. హర్షిత (ప్రభుత్వ పాఠశాల), 2. విష్ణుప్రియ (సెయింట్ జోసెఫ్), 3. ప్రణవి (డీపీఎస్). అండర్–12 బాలుర ఫ్లోర్ ఈవెంట్: 1. సాయి అనీశ్ (గేట్‌వే ఇంటర్నేషనల్ స్కూల్), 2. సంతోష్ గౌడ్ (సెయింట్ మేరీస్), 3. గౌరీశంకర్ (హెచ్‌పీఎస్). అండర్–14 బాలికల ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. సీహెచ్ గీతా రాజ్, 2. అభిష్ట, 3. ఉన్నతి; బీమ్: 1. గీతా రాజ్ (సెయింట్ ఆండ్రూస్), 2. అభిష్ట (ఫ్యూచర్ కిడ్స్), 3. ఉన్నతి (ప్రభుత్వ బాలికల పాఠశాల); అండర్–14 బాలుర ఫ్లోర్: 1. దీపక్ గౌడ్ (సెయింట్ మేరీస్), 2. ఆదిత్య (కృష్ణవేణి టాలెంట్ స్కూల్). 3. రాఘవ్ (రాకెల్‌ఫోర్డ్). అండర్–18 బాలుర ఫ్లోర్: 1. రిత్విక్ మిశ్రా (గుడ్‌విల్), 2. పవన్ లాల్ (శ్రీమేధ), 3. బాలాజీ (శ్రీ సాయిరాం స్కూల్); వాల్ట్: 1. పీతాంబర్ (శ్రీమేధ), 2. రిత్విక్ మిశ్రా (గుడ్‌విల్), 3. బాలాజి (శ్రీ సాయిరాం). -
చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత మహిళా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పసిడి పతకంతో సత్తా చాటింది. టర్కీ లో జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో దీపా వాల్ట్ ఈవెంట్లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్ ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదే తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం సాధించింది. -
జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో జిమ్నాస్టిక్స్ సందడి మొదలైంది. సరూర్‌నగర్ స్టేడియంలో జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగే ఈ టోర్నమెంట్లో దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన 100 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ ఈవెంట్లలో వ్యక్తిగత, ఆల్‌రౌండ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీఎఫ్ఐ ఉపాధ్యక్షులు కౌశిక్ బిడివాలా, టోర్నమెంట్ డైరెక్టర్ శశి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, సలహాదారు సత్యనారాయణ, టీఆర్ఎస్ నేతలు అరవింద్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీడియో: విశ్వవేదికపై అరుణ రెడ్డి ఇలా..
ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. కాంస్య పతకం సాధించే వరకూ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని అరుణారెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు... ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో అరుణారెడ్డి ప్రదర్శనకు సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చింది. -
విశ్వవేదికపై అరుణ రెడ్డి ఇలా..
-
జిమ్నాస్ట్ అరుణకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం శంషాబాద్ నుంచి హైదర్ గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రపంచ్ కప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రభుత్వ సహాకారంతో ఈ మెడల్ సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. జిమ్నాస్టిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని అరుణ రెడ్డి తెలిపారు. -
జిమ్నాస్ట్ అరుణకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి కె.మహేశ్వర్ ఆమెను అభినందించారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమెను కలిసి సత్కరిం చారు. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను చూసి దేశం ఎంతో గర్విస్తోందని రంగారావు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఒలింపిక్ చాంపియన్ సంచలన నిర్ణయం
మాస్కో : ఒలింపిక్ చాంపియన్, రష్యా జిమ్నాస్ట్ మార్గరిటా మామున్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులో కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని మార్గరిటా కోచ్ ఇరినా వైనర్ ఉస్మనోవా రష్యా మీడియా సంస్థ టాస్కు తెలిపారు. 'మామున్ కెరీర్ క్ స్వస్తి పలికారు. ఇక ఆమె పోటీలో పాల్గొనదు. క్రీడల్లో ఆమె పోరాటం ముగిసింది' అంటూ ఇరినా వెల్లడించారు. గతేడాది (2016) బ్రెజిల్ లోని రియో డీ జనీరోలో జరిగిన రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలో దేశానికే చెందిన యానా కుర్దవత్సేవాను ఓడించి పసిడి పతకాన్ని సగర్వంగా అందుకుంది మార్గరిటా మామున్. 2000 నుంచి జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో కనీసం ఓ పసిడిని తన ఖాతాలో వేసుకుంది మార్గరిటా. రష్యా-బంగ్లాదేశ్ దంపతులకు మాస్కోలో జన్మించిన ఈ ఒలింపిక్ చాంపియన్.. ఏడు ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణాలు సాధించింది. కెరీర్లో ఓవరాల్‌గా 28 స్వర్ణాలు, 13 రజతాలు, ఓ కాంస్యంతో జిమ్నాస్టిక్స్ లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది రష్యా జిమ్నాస్ట్. ఆమె ఆకస్మిక నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు షాక్‌కు గురయ్యారు. -
జిమ్నాస్టిక్స్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్: క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్’ను ఆయన ఆదివారం ప్రారంభించారు. సరూర్‌నగర్ స్టేడియంలో ఈనెల 31 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ పోటీల్లో 10 జిల్లాలకు చెందిన 400 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన జిమ్నాస్ట్‌లు సౌత్‌జోన్, నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపికవుతారని ఆయన చెప్పారు. ఇదే కార్యక్రమంలో 2018 జనవరిలో హైదరాబాద్ వేదికగా జరుగనున్న ‘ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్’కు సంబంధించిన బ్రోచర్‌ను వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి కె. మహేశ్వర్, నగర కార్యదర్శి విజయ్‌పాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలరాజు, హరికిషన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మి, వందనలకు చెరో 3 పతకాలు
జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన జిమ్నాస్ట్‌లు లక్ష్మి, వందన ఆకట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆనంద్‌నగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ చెరో 3 పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–16 బాలికల కేటగిరీలో ఆదివారం జరిగిన పోటీల్లో ప్రతిభ కాలేజికి చెందిన వి. లక్ష్మి... ఫ్లోర్ ఎక్స్‌ర్‌సైజ్, బీమ్ విభాగాల్లో స్వర్ణాలతో పాటు వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. ఇదే వయోవిభాగంలో నేచర్ కాలేజి విద్యార్థి వందన... ఫ్లోర్, బీమ్, వాల్ట్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచి మూడు రజత పతకాలను సొంతం చేసుకుంది. మరోవైపు ఫ్లోర్, బీమ్ ఈవెంట్లలో మూడో స్థానంలో నిలిచిన ముస్కాన్... వాల్ట్ ఈవెంట్లో స్వర్ణంతో మెరిసింది. బాలుర విభాగంలో జరిగిన ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్లలో సాయిప్రసాద్, రిత్విక్, ఉమేశ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి తలో రెండు పతకాలను దక్కించుకున్నారు. పోటీల ముగింపు కార్యక్రమంలో హెచ్డీజీఏ అధ్యక్షులు మన్వీందర్ మిశ్రా, కార్యదర్శి సోమేశ్వర్, రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బాలికల ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు అండర్–6 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. తన్వి, 2. ఎన్. భవ్య, 3. కె. శాన్వి. అండర్–8 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. ఎం. సిరిరెడ్డి, 2. వృందశ్రీ,, 3. మెహర్; బీమ్: 1. సిరిరెడ్డి, 2. భవ్య, 3. తన్వి రెడ్డి. అండర్–10, ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. నిషిక, 2. వేదిక, 3. వేద; బీమ్: 1. నిషిక, 2. వేదిక, 3. ధన్య ప్రసాద్; వాల్ట్: 1. నిషిక, 2. వేదిక, 3. ప్రణవి. అండర్–12 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. చిన్మయి, 2. గీతా రాజ్, 3. ఖుషి; బీమ్: 1. చిన్మయి, 2. ప్రియాల్, 3. మేఘ; వాల్ట్: 1. చిన్మయి, 2. గీతారాజ్ 3. ప్రియాల్. అండర్–14 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. సొహిని, 2. దివ్య సింగ్, 3. ఆమని; బీమ్: 1. ఆమని, 2. సొహిని; వాల్ట్: 1. సొహిని, 2. ఆమని, 3. అమేషా అగర్వాల్. బాలురు: అండర్–6 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. చక్రీనాథ్, 2. తనద్ కంఠ, 3. దర్శన్. అండర్–8 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. అద్వైత్, 2. కౌశిక్, 3. సాయి హర్షిత్. అండర్–10 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. నీలకంఠ, 2. ఆకాశ్, 3. ధీరజ్; వాల్ట్: 1. నీలకంఠ, 2. ధీరజ్, 3. అక్షయ్. అండర్–12 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. విజిత్, 2. శివ్లాల్, 3. దీపక్ గౌడ్; వాల్ట్: 1. విజిత్, 2. శివ్లాల్, 3. దీపక్ గౌడ్. అండర్–14 ఫ్లోర్ ఎక్సర్సైజ్: 1. వెంకట్‌సాయి, 2. సతీశ్, 3. పూజిత్; వాల్ట్: 1. వెంకట్‌సాయి, 2. ప్రవీణ్, 3. పూజిత్.