మాస్కో : ఒలింపిక్ చాంపియన్, రష్యా జిమ్నాస్ట్ మార్గరిటా మామున్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులో కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని మార్గరిటా కోచ్ ఇరినా వైనర్ ఉస్మనోవా రష్యా మీడియా సంస్థ టాస్‌కు తెలిపారు. 'మామున్ కెరీర్ క్ స్వస్తి పలికారు. ఇక ఆమె పోటీలో పాల్గొనదు. క్రీడల్లో ఆమె పోరాటం ముగిసింది' అంటూ ఇరినా వెల్లడించారు.
గతేడాది (2016) బ్రెజిల్ లోని రియో డీ జనీరోలో జరిగిన రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలో దేశానికే చెందిన యానా కుర్దవత్సేవాను ఓడించి పసిడి పతకాన్ని సగర్వంగా అందుకుంది మార్గరిటా మామున్. 2000 నుంచి జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో కనీసం ఓ పసిడిని తన ఖాతాలో వేసుకుంది మార్గరిటా. రష్యా-బంగ్లాదేశ్ దంపతులకు మాస్కోలో జన్మించిన ఈ ఒలింపిక్ చాంపియన్.. ఏడు ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణాలు సాధించింది. కెరీర్‌లో ఓవరాల్‌గా 28 స్వర్ణాలు, 13 రజతాలు, ఓ కాంస్యంతో జిమ్నాస్టిక్స్ లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది రష్యా జిమ్నాస్ట్. ఆమె ఆకస్మిక నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు షాక్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment