
నూక్లియర్ సైన్స్‌లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మకమైన మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్(ఎంఎస్‌సీఎఫ్‌పీ)కు ఇండియన్ స్టూడెంట్ హేమంగి శ్రీవాస్తవ ఎంపికైంది. మాస్కో పవర్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎంపీఈఐ) లో హేమంగి ఎలక్ట్రానిక్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ చేస్తుంది.
2023లో రష్యాలో నిర్వహించిన ‘వరల్డ్ యూత్ ఫెస్టివల్’కు హాజరైన హేమంగి అక్కడ ఒక మహిళా ప్రొఫెసర్ నోటినుంచి నూక్లియర్ ఎనర్జీ ప్రాముఖ్యత గురించి విన్న మాటలు ‘ఎంపీఈఐ’కి దరఖాస్తు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తాను ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి ‘సైన్స్, ఆర్ట్‌ల సమ్మేళనం’ అంటుంది హేమంగి.
మరింతమంది మహిళలు నూక్లియర్ సెక్టర్‌లోకి రావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.
(చదవండి: ఖాదీ కమ్ బ్యాక్)