
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్‌అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?
మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్‌శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి.
అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్‌ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్‌ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్‌లో సీటు సంపాదించింది.
అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్‌లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది.
ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లను పారిస్‌లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది.
తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్‌లు, టెక్నికల్ టీమ్‌లలో పాల్గొనడం, ఈవెంట్‌ల నిర్వహించడం వల్ల కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.
(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!)