IIT Madras
-
అంగారకుడిపై నిర్మాణాలకు నీటి రహిత కాంక్రీట్
చెన్నై: ఇతర గ్రహాలపై సమీప భవిష్యత్తులో మానవ ఆవాసాలు నిర్మించడం సాధ్యమేనని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి ఆవల గ్రహాలపై ఆవాసాలు నిర్మించుకొనే దిశగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయా గ్రహాలపై లభించే వనరులతోనే ఇళ్లు రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాసుకు చెందిన ఎక్స్ట్రాటెరెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్(ఎక్స్‌టెమ్) గణనీయమై పురోగతి సాధించింది. నీటితో సంబంధం లేని కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. అంగారక(మార్స్) గ్రహంపై ఇళ్ల నిర్మాణానికి ఈ కాంక్రీట్ చక్కగా సరిపోతుందని చెబుతున్నారు. సల్ఫర్ మిశ్రమంతో కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఎక్స్‌టెమ్ బృందం వెల్ల్లడించింది. అంగారకుడిపై సల్ఫర్ సమృద్ధిగా ఉంది. అక్కడ ఇప్పటివరకైతే నీటి జాడ కనిపెట్టలేదు. ఇదిలా ఉండగా, ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఎక్స్‌టెమ్ బృందం పరిశోధనలు చేస్తోంది. మైక్రోగ్రావిటీ డ్రాప్టవర్ను రూపొందించింది. జీరో గ్రావిటీలో వస్తువుల లక్షణాలపై దీనిద్వారా అధ్యయనం చేయొచ్చు. భూమిపై నుంచి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇతర గ్రహాలపై ఉన్న వస్తువులు, వసతులతోనే వ్యోమగాములు అక్కడ మనుగడ సాగించేలా చేయాలన్నదే తమ ఆశయమని ఎక్స్‌టెమ్ ప్రతినిధి ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య చెప్పారు. -
రోగులకు చేదోడుగా ‘ప్లూటో’ రోబోట్.. ప్రత్యేకతలివే..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూరు సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటి న్యూరో రిహాబిలిటేషన్ రోబోట్-అసిస్టెడ్ థెరపీ సాధనాన్ని తయారు చేశాయి. ప్లూటో (ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్ ఫర్ హ్యాండ్ న్యూరో రిహాబిలిటేషన్) అని పిలవబడే ఈ రోబో న్యూరో, వెన్నుముక సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. ‘ప్లూటో’ను థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ దేశంలో మార్కెట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.సీఎంసీ వెల్లూరు బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాలసుబ్రమణియన్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్), టాటా ఎలిక్సీ లిమిటెడ్ అందించిన సీఎస్ఆర్ గ్రాంట్లు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి వచ్చిన నిధులు ప్రాజెక్ట్‌కు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.తొమ్మిది క్లినిక్‌ల్లో ట్రయిల్స్ పూర్తి‘ప్లూటో న్యూరో రోగులకు అవసరమైన కచ్చితమైన చికిత్సలు, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు అవసరమైన మెరుగైన చికిత్సలు, ఫలితాలను అంచనా వేస్తుంది. అధిక చికిత్స ఖర్చులు, దేశంలో చాలా మంది స్ట్రోక్ బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్లూటోను రూపొందించారు. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ టేబుల్ టాప్ పరికరం. చిన్న సూట్ కేస్ ద్వారా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దేశంలోని తొమ్మిది క్లినిక్‌ల్లో ప్లూటోను ట్రయిల్ చేశారు. గత 30 నెలల్లో 1,000 మందికి పైగా రోగులు, 100 మంది వైద్యులు దీన్ని ఉపయోగించారు. ఇంట్లో ఉపయోగిస్తూ రోగుల వ్యాధికి సంబంధించిన కచ్చితమైన థెరపీ అధ్యయనాలు తెలుసుకోడానికి ప్లూటో ఎంతో దోహదం చేస్తుంది’ అని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎవరికి అవసరం అంటే..ఈ టెక్నాలజీకి లైసెన్స్ ఇచ్చిన థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ప్లూటోను బిజినెస్ పరంగా వినియోగించుకునేందుకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, రోగుల ఇళ్లల్లో దీన్ని సులువు వినియోగించవచ్చని తెలిపింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనవారు, చేతి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఇది చాలా అవసరం అని పేర్కొంది. -
ఐఐటీ మద్రాసులో టెక్ ఫెస్టివల్స్
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశంలోనే అతి పెద్ద విద్యార్థి ఉత్సవంగా టెక్ ఫెస్టివల్స్‌లో ఒకటైన శాస్త్త్ర 26వ ఎడిషన్ నిర్వహించనున్నారు. 80 ఈవెంట్లు, 130 స్టాల్స్‌తో జరగనున్న ఈ కార్యక్రమానికి 70,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా విద్యార్థులచే నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన 750 మంది విద్యార్థులు వివిధ సంస్థాగత సేవలో పనిచేయనున్నారు. సోమవారం క్యాంపస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శాస్త్ర 2025 గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ శ్ఙ్రీశాస్త్ర వంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో నిర్వహణ నైపుణ్యాలు, నిబద్ధత, బాధ్యత వంటి విలువైన లక్షణాలను పెంపొందించేందుకు వలుందన్నారు. ఒక సాధారణ ప్రయోజనం కోసం పెద్ద బృందాలలో పని చేసే సామర్థ్యంతో పాటూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అనేక ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యక్తులను ఈవెంట్‌కు ఆహ్వానించే అవకాశం విద్యార్థులకు దక్కినట్లయ్యిందన్నారు. శాస్త్ర 2025కు సహకారంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ రామకృష్ణన్ మాట్లాడుతూ, వాస్తవ–ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, ఆవిష్కరణ , ప్రోత్సాహం, సహకారం, అకాడెమియా నైపుణ్యాలు, జ్ఞానమార్పిడికి ఓ ప్రత్యేక వేదికగా శాస్త్ర నిలవబోతోందన్నారు.వివిధ ఈవెంట్లు..ఏఐ రోబోటిక్స్, స్థిరమైన సముద్ర సాంకేతికతలు వంటి అత్యాధునిక రంగాలలో సహకార పరిశోధన, నైపుణ్య అభివృద్ధికి దోహదకరంగా నిలవనున్నట్లు వివరించారు. శాస్త్ర వంటి ప్రధానమైన సాంకేతిక ఈవెంట్‌తో భారతదేశ సాంకేతిక, శాసీ్త్రయ సామర్థ్యాలను పెంపొందించే స్టీమ్ కెరీర్లను ప్రోత్సహిస్తూ స్థిరమైన సముద్ర అన్వేషణ, వాతావరణ స్థితిస్థాపకత కోసం పరిష్కారాలను అన్వేషించడానికి, తరువాతి తరాన్ని ప్రేరేపించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. అటానమస్ డ్రోన్ డెలివరీని కలిగి ఉండే శాస్త్ర ఏరియల్ రోబోటిక్స్ ఛాలెంజ్ ఇందులో కీలకం కానున్నట్టు పేర్కొన్నారు. డ్రోన్లు తమ ప్రోగ్రామింగ్, సెన్సార్ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, లక్ష్యాన్ని గుర్తించడానికి స్వయం ప్రతిపత్తితో నావిగేట్ చేస్తాయన్నారు. అలాగే రోబో స్కోర్ ఈవెంట్, ఆల్గో ట్రేడింగ్, పెట్రి–డిష్ ఛాలెంజ్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రయోజనకరం కానున్నట్లు వివరించారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్. గుమ్మడి మాట్లాడుతూ శాస్త్ర సమ్మిట్, రీసెర్చ్ కాన్ఫరెన్స్‌లో రెండు కొత్త అంశాలను పరిచయం చేయబోతున్నామన్నారు. ఇందులో ఒకటి ఫ్యూచర్ సిటీస్ మరొకటి స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ అని వివరించారు. ఐఐటీ మద్రాస్‌లోని సహ–కరిక్యులర్ అడ్వైజర్ డాక్టర్ మురుగయన్ అమృతలింగం, మాట్లాడుతూ వార్షిక టెక్నికల్ ఈవెంట్ అయిన శాస్త్ర విద్యార్థులచే నిర్వహించే టెక్నో–మేనేజిరియల్ పండుగలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ 26వ వార్షిక కార్యక్రమం బహుళ సాంకేతిక , వ్యాపార డొమైనన్లలో విభిన్నమైన ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలతో పాటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, అటానమస్ రోవర్ ఛాలెంజ్‌లు, సాయుధ దళాల ప్రదర్శనలు, రోబోట్ యుద్ధాలు, ఇతర ప్రాంతాలలో వర్క్‌షాప్‌ల నిర్వహణకు కూడా వేదికగా నిలవనున్నట్టు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యా ర్థులు, టెక్నో ఔత్సాహికులు తరలిరావాలని ఆహ్వానించారు. సహ–కరిక్యులర్ అఫైర్స్ సెక్రటరీ సుఖేత్ కల్లుపల్లి మాట్లాడుతూ ఇది సాంకేతిక ఆవిష్కరణల వేడుక అని, ఇన్స్టిట్యూట్ ఓపెన్ హౌస్ సందర్భంగా ఐఐటీ మద్రా స్లోని ల్యాబ్‌లు, సెంటర్లను రెండు రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నంబి నారాయణన్ , గణిత శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్సుజాత రామదురై, రుచిరా వంటి వారు ఈ వేడుకలో ప్రత్యేక ప్రసంగం చేయబోతున్నారని వివరించారు. ఈ సమావేశంలో స్టూడెంట్ కోర్ సుధన్, అనుమల సాథ్విక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.4.3 కోట్ల వేతనం: జాక్‌పాట్ కొట్టిన ఐఐటీ స్టూడెంట్
గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలోని(IITs) 2025 బ్యాచ్ విద్యార్థుల కోసం బేస్, ఫిక్స్డ్ బోనస్ & రీలొకేషన్ వంటి వాటితో సహా మొత్తం రూ. 4.3 కోట్లకు పైగా అత్యధిక వేతన ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ ఐఐటీ మద్రాస్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి సొంతం చేసుకున్నారు.ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, ఖరగ్‌పూర్, గౌహతి, బీహెచ్‌యూలలో ఆదివారం తుది నియామకాలు ప్రారంభమైన సమయంలో ఈ ఆఫర్ వెలువడింది.ఎక్కువ శాలరీ ఫ్యాకేజీ ఆఫర్ చేసిన కంపెనీల జాబితా➤బ్లాక్‌రాక్, గ్లీన్ & డావిన్సీ: రూ. 2 కోట్ల కంటే ఎక్కువ.➤ఏపీటీ పోర్ట్‌ఫోలియో అండ్ రూబ్రిక్: రూ. 1.4 కోట్ల కంటే ఎక్కువ➤డేటాబ్రిక్స్, ఎబుల్లియెంట్ సెక్యూరిటీస్, ఐఎంసీ ట్రేడింగ్: రూ. 1.3 కోట్ల కంటే ఎక్కువ➤క్వాడే: సుమారు రూ.1 కోటి➤క్వాంట్‌బాక్స్ అండ్ గ్రావిటన్: రూ. 90 లక్షలు.➤డీఈ షా: రూ. 66 లక్షల నుంచి రూ. 70 లక్షల మధ్య➤పేస్ స్టాక్ బ్రోకింగ్: రూ. 75 లక్షలు➤స్క్వేర్‌పాయింట్ క్యాపిటల్: రూ. 66 లక్షల కంటే ఎక్కువ➤మైక్రోసాఫ్ట్: రూ. 50 లక్షల కంటే ఎక్కువ➤కోహెసిటీ: రూ. 40 లక్షలుమొదటి రోజు వచ్చిన రిక్రూటర్లలో క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాక్స్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, అల్ఫోన్సో, న్యూటానిక్స్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్లో భారీ ప్యాకేజీలను ప్రకటించారు. -
వీల్‌చెయిర్ మోటార్బైక్గా మారిపోతే..!
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్బైక్గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.‘నియోమోషన్’ మోటర్బైక్కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్బైక్గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్చెయిర్బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.వైకల్యం ఓ పెద్ద సవాలు.. ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.సౌకర్యవంతంగా.. దృఢంగా..ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్లో దొరికే వీల్చెయిర్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.గంటకు 50 కి.మీ ప్రయాణంనియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్బైక్గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు. -
మెదడు నుంచి మార్కెట్లోకి..
చెన్నై: విజయవంతమైన ప్రతి స్టార్టప్ మొదట విద్యార్థుల మెదడులో మొదలైన ఆలోచనే. అలాంటి ఆలోచనలు ఆవిష్కరణలై అభివృద్ధి చెంది మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటైన ప్రీ-ఇంక్యుబేటర్ ‘నిర్మాణ్’.. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తోంది. దీని ద్వారా పురుడు పోసుకున్న స్టార్టప్‌లను ప్రదర్శించేందుకు ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా 'నిర్మాణ్ డెమో డే 2024' కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్మాణ్ డెమో డే కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి.. అథితులు, ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో ప్రారంభించారు. ఏఐ, హెల్త్‌టెక్, డీప్‌టెక్, సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాలలో ఆలోచన దశలో ఉన్న మొత్తం 30 స్టార్ట్-అప్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ 'నిర్మాణ్ డెమో డే'ను వార్షిక కార్యక్రమంగా ఏటా నిర్వహించాలని ఐఐటీ మద్రాస్ భావిస్తోంది.క్రియాశీల విద్యార్థుల నేతృత్వంలోని క్షేత్ర స్థాయిలో ఉన్న 85 స్టార్టప్‌లకు నిర్మాణ్ మద్దతు ఇస్తోంది. వీటిలో దాదాపు 26 స్టార్టప్‌లు ఇప్పటికే విజయవంతంగా మార్కెట్లోకి వచ్చి వెంచర్ ఫండింగ్‌లో రూ.108 కోట్లకు పైగా నిధులు సాధించాయి. వీటన్నింటి విలువ రూ.1,000 కోట్లకు పైగా చేరుకోవడం గమనార్హం. ఇలా నిర్మాణ్‌లో విజయవంతమైన స్టార్టప్‌లలో అర్బన్ మ్యాట్రిక్స్, మాడ్యులస్ హౌసింగ్, టాన్90, టోకల్, ఇన్ఫ్యూ ల్యాబ్స్, ఇన్వాల్వ్, మెల్‌వానో, సస్స్టెయిన్స్, జిమ్స్, ప్లీనోమ్ టెక్నాలజీస్, ప్రిస్క్రైబ్, గెలాక్సీ స్పేస్ ఉన్నాయి. గెలాక్సీ స్పేస్ ఇటీవల ఇన్ఫోసిస్ నుండి రూ. 17 కోట్ల నిధులు పొందగలిగింది. -
వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. దేశమంతటికీ విస్తరించిన ఆందోళనలు..
-
మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు
‘ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా.. మన మాతృభూమిని మరవకూడదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. జన్మభూమికి సేవ చేసేందుకు ముందుకు రావాలి. ముఖ్యంగా విద్యా రంగంలో చేసే సేవ.. భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇదే ఉద్దేశంతో ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళమిచ్చాను. అదే విధంగా పాఠశాల స్థాయిలోనూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను’ అని అంటున్నారు.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి, అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్త డాక్టర్ కృష్ణ చివుకుల. ఇంత భారీ విరాళంతో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..ఎంతో కొంత తిరిగివ్వాలి.. మనం పుట్టి పెరిగి, మన అభివృద్ధికి పునాది వేసిన మాతృభూమికి.. ఎంతో కొంత తిరిగివ్వాలి అనేది నా ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తు తరాలు ఎదిగే అవకాశం కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో నేను ఐఐటీ మద్రాస్‌కు విరాళమిచ్చాను. 74 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నాను.మా సంస్థ నంబర్‌వన్ పరిశ్రమగా ముందుకెళుతోంది. ఆదాయం విషయంలో ఆందోళన లేదు. అందుకే.. నేను చదివిన ఐఐటీ మద్రాస్‌కు, అక్కడి విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడేలా విరాళమిచ్చాను.విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే దేశాభివృద్ధికి తోడ్పడినట్టే.. విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తే.. భవిష్యత్తులో అది దేశాభివృద్ధికి తోడ్పడుతుందనేది నా నమ్మకం. ఎందరో విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులతో.. ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ఇలాంటి వారికి తోడ్పడితే ఉన్నత విద్యావంతులుగా రూపొందుతారు. తద్వారా నిపుణులైన మానవ వనరుల కొరత కూడా తీరుతుంది. ఇది సంస్థల అభివృద్ధికి, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఇతర పారిశ్రామికవేత్తలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని ఆశిస్తున్నాను.స్వదేశంలో చదువులకే ప్రాధాన్యమివ్వాలి.. ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు.. విదేశీ విద్య కోసం యూఎస్, యూకే వంటి దేశాలకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు మన విద్యా సంస్థల్లోనూ ప్రపంచ శ్రేణి నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టి స్వదేశంలో విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలనేది నా అభిప్రాయం. 1.3 బిలియన్ జనాభా ఉన్న మన దేశంలో 10 లేదా 11 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్లినా.. ఆందోళన చెందక్కర్లేదు. అయితే వారు తమ చదువు పూర్తయ్యాక మన దేశానికి తిరిగొచ్చి సేవలు అందించాలి. మేం చదువుకునే రోజుల్లో ఇన్ని మంచి విద్యా సంస్థలు లేవు కాబట్టే నేను అమెరికా వెళ్లాను. పెట్టుబడిదారులు ముందుకు రావాలి.. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకెళుతోంది. అమెరికా ఆర్థిక పురోగతి మందగమనంలో ఉంటే.. మన ఆర్థిక పురోగతి దినదిన ప్రవర్థమానమవుతోంది. ఇదే చక్కని సమయంగా భావించి పెట్టుబడిదారులు ముందుకు రావాలి. మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి, ఉద్యోగ కల్పన, దేశ అభివృద్ధికి సహకరించాలి.ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి.. యువతలో చాలా మంది పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్నారు. ఇందుకోసం పరిశోధనలపై దృష్టి పెడుతున్నారు. అయితే.. వారు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే వ్యాపార ఆలోచనలు వినూత్నంగా, విభిన్నంగా ఉండాలి. కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా.. సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఆలోచనలు చేయాలి.ఆత్మవిశ్వాసంతో కదలాలి.. యువత ముఖ్యంగా.. జెన్–జెడ్ వారు ఏ పని తలపెట్టినా, ఎందులో అడుగుపెట్టినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. తమపై తాము నమ్మకంతో వ్యవహరించాలి. చేయగలమా? లేదా? అనే మీమాంసతో ఉంటే అడుగులు ముందుకు పడవు. ఇది అంతిమంగా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించాలి. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో అడుగులు వేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే సత్తా లభిస్తుంది.కష్టపడటమే.. విజయానికి సూత్రం.. నేటి తరం విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుతాయని గుర్తించాలి. చదువుకునే సమయంలోనే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు పొందేలా కృషి చేయాలి. సర్టిఫికెట్ల కోసం కాకుండా.. శ్రేష్టత కోసం చదవడం ముఖ్యమని గుర్తించాలి.కృష్ణ చివుకుల గురించి..ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. విద్యాభ్యాసం విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో ఐఐటీ బాంబే నుంచి బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్), ఐఐటీ మద్రాస్ నుంచి ఎంటెక్ (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. తుమకూరు యూని వర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. 1976లో అమెరికాలోని హాఫ్మన్ ఇండస్ట్రీస్‌లో చీఫ్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. 1990లో న్యూయార్క్‌లో శివ టెక్నాలజీస్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. 1997లో.. ఇండో– యూఎస్ ఎంఐఎం టెక్నాలజీ పేరుతో మరో సంస్థను నెలకొల్పారు. దీన్ని మెటల్ ఇంజక్షన్ మోడలింగ్‌లో ప్రపంచంలోనే పేరొందిన సంస్థగా తీర్చిదిద్దారు.దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు..ఇప్పుడు మన విద్యా రంగం ఉన్నతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఐటీలు, ఎన్ఐటీలతోపాటు మరెన్నోప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.వీటిని మరింత అభివృద్ధి చేస్తే.. మరింత నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలి.మంచి వేతనాలు అందించాలివిదేశీ విద్యకు వెళుతున్న విద్యార్థుల విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న విషయం.. వారికి భవిష్యత్తులో లభించే వేతనాలు. మన దేశంలో చదువుకున్నవారికి కూడా మంచి వేతనాలు అందించేలా పారిశ్రామికవేత్తలు, సంస్థలు అడుగులు వేయాలి. నైపుణ్యాలకు అనుగుణంగా ఆకర్షణీయ వేతనాలివ్వాలి. ప్రతిభావంతులను నియమించుకుంటే సంస్థలను వృద్ధి బాటలో నడిపించొచ్చు. ఇది కార్యరూపం దాల్చితే యువత దేశంలోనే చదువుకునేందుకు ముందుకొస్తారు. -
బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల.. ఐఐటీ మద్రాసుకు 220 కోట్ల భారీ విరాళ ప్రకటన!
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన. తాజాగా తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6న క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. బాపట్ల నుంచి ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు.ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్మన్ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్'ను నెలకొల్పారు.మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇదే కంపెనీని బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ (MIM) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో వీరి టర్నోవర్ రూ.వెయ్యి కోట్లకు పైనే. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.దాతృత్వంలో మేటి..కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారాయన. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్ అవార్డు అందజేశాయి.బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. మైసూర్ సమీపంలోని చామరాజనగర్‌లో కృష్ణ దత్తత తీసుకున్న పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపునకు తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఆ విద్యాసంస్థకు వరంగా మారనుంది. -
నీట్-యూజీ కౌన్సిలింగ్ జులై 3వ వారంలో: కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి,మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను జులై 3వ వారంలో నాలుగు ఫేజుల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ జరిగే సమయంలో నీట్ అక్రమాల వల్ల ప్రయోజనం పొందినట్లు గుర్తిస్తే.. వారి కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తామని వెల్లడించింది. పేపర్ లీకేజీ,అక్రమాలపై దాఖలైన సుమారు 40 పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం గురువారం (జులై11న) విచారణ చేపట్టనుంది.ఈ విచారణకు ముందు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. -
అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం
-
‘పాపులరైజింగ్ సైన్స్’.. గ్రామీణ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ కానుక
చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ ‘సైన్స్ పాపులరజైషన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద ఏడు రాష్ట్రాల్లో 9193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3లక్షల20వేల702 పుస్తకాలను పంపిణీ చేసింది. 2026 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్‌లోని మొత్తం 50 వేల స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అవగాహన కల్పించడాన్ని ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎమ్)లలో కెరీర్‌ను ఎంచుకోవడం పట్ల విద్యార్థులను సన్నద్ధులను చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న స్కూళ్లు, విద్యార్థులు బయోటెక్.ఐఐటీఎమ్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఐటీ మద్రాస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి కోరారు. ఈయన ఇప్పటివరకు 70 సైన్స్ పుస్తకాలను ప్రభుత్వ హై స్కూళ్లలో చదివే విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ‘సైన్స్ పాపులరైజేషన్’ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు క్లిష్టతరమైన సైన్స్ పరిశోధనలకు సంబంధించిన విషయాలను వారికి అర్ధమయ్యే భాషలో చేరవేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ప్రోగ్రామ్‌కు అవసరమయ్యే వనరులను సమకూర్చడంలో ఐఐటీ పూర్వ విద్యార్థులు, అకడమిక్‌గా సైన్స్ నేపథ్యం ఉన్న ఇతర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే..
గర్భంలోని పిండం వయసును అత్యంత కచ్చితత్వంతో లెక్కింటే ఒక కృత్రిమ మేధ (ఏఐ) పరికరాన్ని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఇది మూడు నెలలు పైబడిన పిండం వయసును లెక్కించడానికి సాయపడుతుంది. పరిశోధనలో ఫరీదాబాద్‌లోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్(టీహెచ్ఎస్టీఐ) పరిశోధకులు కూడా భాగస్వాములయ్యారు. పిండం వయసును కచ్చితత్వంతో నిర్ధారించడం చాలా అవసరం. దానివల్ల గర్భిణికి సరైన సంరక్షణ అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కాన్పు తేదీని కూడా నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు. తాజా ఏఐ పరికరానికి ‘గర్భిణి-జీఏ2’ అని పేరు పెట్టారు. భారతీయ జనాభా డేటాను ఉపయోగించి రూపొందిన తొలి ఏఐ సాధనం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం పశ్చిమ దేశాల జనాభా కోసం రూపొందించిన ఒక సూత్రం ఆధారంగా పిండం వయసును లెక్కిస్తున్నారు. ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు మూడు నెలలు నిండాక దీన్ని వర్తింపజేస్తే.. ఫలితంలో తప్పు రావొచ్చు. భారతీయ జనాభాలో పిండం ఎదుగుదలలో ఉన్న వైరుధ్యాలే ఇందుకు కారణం. ‘గర్భిణి-జీఏ2’తో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. తద్వారా భారత్‌లో మాతా శిశు మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు. -
సోషల్ మీడియా దుర్వినియోగంపై... జర జాగ్రత్త: సీజేఐ
సాక్షి, చెన్నై: వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టే సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఐఐటీ మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కలి్పంచాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేసి నిరుపాయకరమైందిగా మార్చా లన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ పేర్కొన్నారు. -
దేశంలో నెంబర్ 1 .. మద్రాస్ IIT ఎలా ఉంటుందో తెలుసా? (ఫొటోలు)
-
విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు
సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సోమవారం విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు. వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్–వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్ కాలేజ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు. అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ, నిట్–వరంగల్ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–వైజాగ్ 29వ, ఐసీఎఫ్ఏఐ–హైదరాబాద్ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ విభాగంలో.. ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్–హైదరాబాద్ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం https://www.nirfindia.org/ వెబ్సైట్లో చూడొచ్చు. సమష్టి కృషితోనే సాధ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. -ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్ హెచ్‌సీయూ మానవాళి కోసం టెక్నాలజీ ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్ ముందుకెళ్తోంది. – ప్రొ. బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్ IIT Madras ranked best institution followed by IISC Bengaluru and IIT Delhi as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/yAKN3uVnuU— ANI (@ANI) June 5, 2023 IISC, Bangalore ranked best university followed by JNU and Jamia Millia Islamia as per the NIRF Ranking released by the Union Ministry of Education pic.twitter.com/Jvr1OixSHz— ANI (@ANI) June 5, 2023 ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దర్ద్, బిట్స్ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి.న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీనికి సంబంధించిన సమగ్ర వార్తకథనం మా ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో చదవండి -
అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?
ఐఐటీలో ఇటీవల జరుగుతున్న ఘటనలు, వివిధ వార్తల నేపథ్యంలో ఒక ఐఐటీ విద్యార్థి పేరుతో Sripati Nagaraju ఫేస్ బుక్‌లో రాసిన అభిప్రాయాన్ని పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలను ఐఐటీల్లో చేర్పించాలన్న తపన పడుతుంటారు. ఇటీవల ఐఐటీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యల ఘటనలకు సంబంధించిన వార్తలతో కొందరు అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు. అలాంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒక ఐఐటీ విద్యార్థి అభిప్రాయం IIT లు సృజనాత్మకతకు కేంద్రాలు. ఒక క్రియేటర్ గా ఉండాలనుకున్నవాడికి , ఐఐటీలో వాడి కులమే గుర్తుండదు.. పక్కవాడి కులంతో పనేలేదు. ఒత్తిడి అనేది IITలలో కో కరిక్యులర్, ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటిస్‌లో, క్లబ్స్‌లో పాల్గొనకుండా నా రూమ్ లో నేను తెగ చదివేసుకుంటాను అనేవాడికి ఉంటుంది. అసలు అలాంటివాళ్ళు IIT లకు పనికి రారు అని అడ్మిషన్ అయిన మొదటిరోజు జరిగే ఓరియంటేషన్ క్లాస్ లోనే ప్రొఫెసర్లు చెప్తారు. Drop outs : వరసగా ఏవైనా రెండు సెమిస్టర్లలో 5 GPA కంటే తక్కువ వస్తే ఆటోమేటిక్ గా రోల్స్ నుండి ఔట్ అవుతారు. Hindi, English లలో నైపుణ్యం పెంచుకోకుండా , సెల్ఫ్ స్టడీ అలవాటు చేస్కోకుండా, క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఉండే స్టూడెంట్ డ్రాప్ అవడానికి అవకాశం ఎక్కువ. Games ఆడకపోవటం వలన ఫిజికల్ ఫిట్నెస్ తగ్గొచ్చేమోగానీ, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వం IITiansకి ఉంటుంది కు ప్రిపేర్ అయ్యే క్రమంలో రాసే వందల ప్రాక్టీస్ టెస్టులు ప్రతీదీ ఒక ఆటే. అందులో తగ్గడం, పడిలేచిన కెరటంలా ఎదగటం మేం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నాం. ఇక IITలలో చేరినాక జిమ్‌లో మన ఫిట్నెస్ పెంచుకోవచ్చు. నచ్చిన స్పోర్ట్స్ ఎంచుకొని ఆడుకోవచ్చు. ప్రిపరేషన్లో భాగంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు హ్యపీ ఎంజైమ్స్ రిలీజ్ అవకపోవటం అంటూ ఉండదు. మా ఫన్ మాకు ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులను మిస్ అయినా , చాలా మంది స్నేహితుల ద్వారా ఆ లోటు పూరించుకుంటూ పరీక్షకు చదువుకుంటాం. కాబట్టి ఆ లోటు మాకు లేదు. యూనివర్శిటీలలో కుల వివక్ష ఉండొచ్చేమోగానీ, అత్యుత్తమ IIT లలో కులం తో సాధించేదేమీ లేదు, స్కాలర్ షిప్ తప్ప. అసలు అడ్మిషన్ కోసమే IIT Rank అవసరం. కానీ ఒకసారి అడ్మిట్ అయ్యాక మనకొచ్చిన ర్యాంకు నాలుక గీస్కోటానికి కూడా పనికిరాదు. అసలు IIT లలో నీ ర్యాంకు ఎంత అని అడిగేవాడే ఉండడు. ఈ ర్యాంకు వల్ల విద్యార్థుల్లో ఆత్మన్యూనతకి అవకాశమేలేదు. IIT లో Ph.D లాంటి మహోత్కృష్ఠమైన కోర్స్ లో చేరినవాడు కూడా ఆత్మహత్య చేస్కున్నాడూ అంటే వాడు ఐడియాలజికల్‌గా ఎంతో వెనకబడి ఉన్నాడని అర్థం. దానికీ అసలు ఒత్తిడి అనేమాటే ఉండదు. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల ప్రవర్తన, ఇలా ఎన్నో పార్శ్వాలు ఆత్మహత్యల వెనక ఉంటాయి. IITల శిక్షణ పేరిట వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు గాక. అది IITల బయట విషయం. దానికీ IITలకి సంబంధం లేదు. కార్పొరేట్ కాలేజీలు రాకముందు కూడా 1954 నుండే IIT లు ఉన్నాయి. కార్పొరేట్ వ్యాపార దాహానికి ప్రతిష్టాత్మక IIT లకు సంబంధం లేదు. కార్పోరేట్ కాలేజీల్లో చేర్పిస్తేనే మా IIT లో అడ్మిషన్ ఇస్తాం అని ఏ ఒక్క IIT కూడా చెప్పదు. విద్యార్థి ఇష్టాయిష్టాలు, శక్తి సామర్థ్యాల ప్రకారం తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేయాలి. అంతే తప్ప దానికి భిన్నంగా ప్రవర్తించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు అనేది ఉండనే ఉంది. అది ఏ రంగం కైనా వర్తిస్తుంది. IIT కి ఒక్కదానికే కాదు. -
‘నన్ను క్షమించండి’.. వాట్సప్‌లో స్టేటస్ పెట్టి పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య!
చెన్నై: ఏం జరిగిందో ఏమో గానీ పీహెచ్డీ పట్టా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలన్న తపన పడ్డ ఓ విద్యార్థి అర్థాంతరంగా జీవితాన్ని ముగించాడు. కొడుకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం ఇంటికి వస్తాడనే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి శుక్రవారం వేలచేరిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయు ముందు తన వాట్సాప్‌లో ఈ విధంగా స్టేటస్ పెట్టుకున్నాడు... ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’ అని రాశాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జైన్, ఐఐటీ మద్రాస్‌లోని గిండీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎప్పటిలానే తన రెగ్యులర్ క్లాస్‌లకు హాజరయ్యాడు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో గానీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన నివాసానికి తిరిగి వెళ్లిపోయాడు. గంట సేపు నుంచి జైన్ ఎవరికి కనిపించకపోవడంతో అతని స్నేహితులు వెతకడం ప్రారంభించారు. క్యాంపస్ మొత్తం ఎంత సేపు వెతికిన ఆచూకి తెలియరాలేదు. దీంతో జైన్ స్నేహితులు చివరకి అతని ఇంటికి వెళ్లి చూడగా.. డైనింగ్ హాల్లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతని స్నేహితులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆసుపత్రిలోని సిబ్బంది అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. -
సింథటిక్ వజ్రాల ల్యాబ్.. ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీయంగా సింథటిక్ వజ్రాల తయారీకి సంబంధించిన సెంటర్‌ను (ఇన్సెంట్–ఎల్జీడీ) ఐఐటీ–మద్రాస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనికి 5 ఏళ్లలో సుమారు రూ. 243 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా సింథటిక్ వజ్రాల తయారీ పరిశ్రమకు, వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించింది. స్టార్టప్‌లకు చౌకగా టెక్నాలజీని అందించేందుకు, ఉపాధి అవకాశాలను .. ఎల్జీడీ ఎగుమతులను పెంచేందుకు ఇన్సెంట్–ఎల్‌జీడీలో పరిశోధనలు ఉపయోగపడగలవని వాణిజ్య శాఖ తెలిపింది. ల్యాబ్స్‌లో తయారయ్యే వజ్రాలను ఆభరణాల పరిశ్రమలోనే కాకుండా కంప్యూటర్ చిప్‌లు, ఉపగ్రహాలు, 5జీ నెట్‌వర్క్‌లు మొదలైన వాటిల్లోనూ ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 2020లో బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2025 నాటికి సింథటిక్ డైమండ్ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో వీటికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు 25.8% వాటా ఉంది. కెమికల్ వేపర్ డిపోజిషన్ (సీవీడీ) టెక్నాలజీతో వజ్రాలను తయారు చేసే టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే, కీలకయంత్ర పరికరాలు, ముడి వనరు అయిన సీడ్స్ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. (ఇదీ చదవండి: కొత్త బడ్జెట్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ విమర్శలు) -
భరోస్, డేటా భద్రతకు ఓఎస్! భారత్ విప్లవాత్మక ముందడుగు
ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఓఎస్ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్‌ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్’. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. భరోస్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు. ఏమిటీ భరోస్? ► విదేశీ ఓఎస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇందుకోసం భరోస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ► ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్‌లతో డిఫాల్ట్ యాప్‌లు, గూగుల్ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు. ► భరోస్ ఓఎస్ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్–సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్(ఎన్డీఏ)తో వస్తుంది. అంటే భరోస్ ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్‌లు కనిపించవు. ► గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటివి డిఫాల్ట్‌గా వస్తుండడం తెలిసిందే. ► డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్‌లను ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్(పాస్) నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ‘పాస్’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్‌లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు. ► స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్‌ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు వాడుతున్నారు? ► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నాయి. ► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఎందుకీ ఓఎస్? ► గూగుల్ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ► ఆండ్రాయిడ్‌తో డిఫాల్ట్‌గా వస్తున్న కొన్ని యాప్‌ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది. ► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విప్లవాత్మక ముందడుగు ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జండ్‌కాప్స్) అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ భరోస్ ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ చెప్పారు. తమ అవసరాలను తీర్చే యాప్‌లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్‌లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చాయిస్ ఫిల్లింగ్‌లో అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించే ‘జోసా’ ప్రక్రియలో జేఈఈ అడ్వాన్స్డ్ ఉత్తీర్ణులు తమ చాయిస్ ఫిల్లింగ్, ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల ప్రాథమ్యాల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి సూచించారు. వందల సంఖ్యలో ఆప్షన్స్ ఇచ్చే అవకాశమున్నందున చిన్న పొరపాటు కూడా భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారవచ్చునని హెచ్చరించారు. ఈ నెల 11న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల, ఆ మర్నాడే ‘జోసా’ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు ‘ఆస్క్ ఐఐటీఎం’ పేరుతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో కామకోటి పాల్గొన్నారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఐఐటీ మద్రాస్ విశిష్టతలను వివరించారు. ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు ప్రస్తుతం ఇంటర్ డిసిప్లినరీ విధానంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. కోర్ సబ్జెక్ట్‌లతోపాటు తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్‌లను చదివే అవకాశం ఉందని.. వీటిలో పొందిన క్రెడిట్స్‌ను సైతం బీటెక్ ప్రోగ్రామ్‌కు కలుపుతారని కామకోటి తెలిపారు. ఫలితంగా తమ ర్యాంకుకు వచ్చిన బ్రాంచ్‌తో తృప్తిపడకుండా ఇష్టమైన సబ్జెక్ట్‌లు చదివే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ (బీటెక్+ఎంటెక్) ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు నాలుగో సెమిçÜ్టర్‌లో తమకు ఆసక్తిఉన్న వేరే బ్రాంచ్‌కు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా.. వైద్య రంగానికి అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. వైద్య అనుబంధ అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణిస్తూ బోధన, కరిక్యులం, పరిశోధనల విషయంలో ఎప్పటికొప్పుడు మార్పులు, చేర్పులు చేపడుతున్నామని సృజనాత్మకతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే ఐఐటీ మద్రాస్ ఏడేళ్లుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో కొనసాగుతోందన్నారు. విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్లూ దక్కుతున్నాయని కామకోటి చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల్లో 80 శాతం మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయని, మొత్తం 1,199 మందికి ఆఫర్లు లభించగా అందులో 45 మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు. 25 శాతం మేర తెలుగు విద్యార్థులే ఐఐటీ మద్రాస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 25 శాతం మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. అన్ని రంగాల్లోనూ మంచి అవకాశాలు ‘ప్రస్తుత తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, అందుకు ఐఐటీలే మేలు మార్గమని అనే భావన నెలకొంది. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల సహజ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఇతర కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలి. ఐఐటీలో సీటు రాకపోతే భవిష్యత్తు లేదన్న ఆందోళన అర్థరహితం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి ఏంటో తెలుసుకోకుండానే వారిని బీటెక్, కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరికాదు’ అని కామకోటి అన్నారు. ఆన్లైన్ కోర్సులను అందిపుచ్చుకోవాలి ‘ఐఐటీలో చేరే అవకాశం కోల్పోయిన విద్యార్థులు ఆన్లైన్ కోర్సుల అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ఎన్పీటీఈఎల్ పోర్టల్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల లెక్చర్లు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ తరగతి గదిలో చెప్పిన అంశాలు యథాతథంగా ఉంటాయి. వీటిని అనుసరించడం ఫలితంగా నిపుణులైన ప్రొఫెసర్ల లెక్చర్లు విని తమ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది’ అని కామకోటి సూచించారు. రెండేళ్లుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఐఐటీలపై క్రేజ్ తగ్గుతోందనే అభిప్రాయం సరికాదని అన్నారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైన ఈ సదస్సులో కామకోటితోపాటు ఐఐఎం–ఎం అలూమ్నీ అండ్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ మహేశ్ పంచాజ్ఞుల, ఆస్క్ ఐఐటీఎం ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐఐటీ మద్రాస్‌లో లైంగిక వేధింపుల కలకలం!
చెన్నై: ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అనాసక్తితో ఉన్నట్లు చెప్పింది. ఆదివారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి స్నేహితురాలు రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే క్యాంపస్ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు సంస్థ సిబ్బంది. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు 300 మంది ఫోటోలను సేకరించారు. అలాగే 35 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా విచారణకు పిలిపించారు. అయితే బాధితురాలు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించింది ఎవరో ఇంకా గుర్తించలేదని సంస్థ తెలిపింది. ఐఐటీ మద్రాస్ గేట్ల వద్ద సరిపడా బందోబస్తు ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రతి 100 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడని తెలిపింది. విద్యార్థుల కోసం బడ్డీ వ్యవస్థ కూడా అందుబాటులో ఉందని, దాని ద్వారా కాల్ చేస్తే సంస్థకు చెందిన బస్సు సెక్యూరిటీ గార్డులతో వెంటనే వస్తుందని వివరించింది. చదవండి: రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ -
Divanshu Kumar: గొప్ప ఆవిష్కరణ.. సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేసే రోబో! ఇకపై
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది....అంటారు. చాలామంది ఐడియాను మాత్రమే నమ్ముకొని కష్టాన్ని మరిచిపోతారు. ‘ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు... అవసరాల నుంచి మాత్రమే కాదు విషాదాల నుంచి కూడా ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ‘హోమో సెప్’ రెండో కోవకు చెందిన ఆవిష్కరణ. మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు. అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు! అని ఆలోచించాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థి దివాన్షు కుమార్. ఫైనల్ ఇయర్ మాస్టర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు. దీనికి ప్రొ.ప్రభురాజగోపాల్ మార్గదర్శకం వహించారు. రోబోను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఒక డైనమిక్ టీమ్ తయారైంది. ఈ టీమ్ రాత్రనకా పగలనకా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎన్నో మాక్–అప్ ట్రయల్స్ చేసింది. అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఎంతోమంది సీఎస్ఆర్ డోనర్స్ అండగా నిలిచారు. దివాన్షు ఆలోచనలో నుంచి పుట్టిన రోబోకు ‘హోమో సెప్’ అని నామకరణం చేశారు. తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి. ఒక ఐడియా రాగానే ‘ఆహా! ఎంత గొప్పగా ఉంది’ అనుకుంటాం. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది. అందుకే ‘ఐడియాలు గొప్పవే అయినప్పటికీ, ఉత్తుత్తి ఐడియాలు, సాధారణ ఐడియాలపై శ్రమ వృథా చేయవద్దు’ అనే మంచిమాటను నమ్ముతున్న దివాన్షు నుంచి భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ఆశించవచ్చు. చదవండి: Mamta Tiwari: ఐఏఎస్ అనుకుంది కానీ... పదిహేనేళ్ల తరువాత... -
ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం..
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది... అంటారు. చాలామంది ఐడియాను మాత్రమే నమ్ముకొని కష్టాన్ని మరిచిపోతారు. ‘ఎంత గొప్ప ఐడియా అయినా సరే, కష్టంతోనే సాకారం అవుతుంది’ అని నమ్మే దివాన్షు కుమార్ దివ్యమైన ఆవిష్కరణకు తొలి బీజం వేశాడు... అవసరాల నుంచి మాత్రమే కాదు విషాదాల నుంచి కూడా ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ‘హోమో సెప్’ రెండో కోవకు చెందిన ఆవిష్కరణ. మనదేశంలో ప్రతిసంవత్సరం సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే క్రమంలో అందులోని విషపూరితాల వల్ల ఎంతోమంది చనిపోయారు. చనిపోతున్నారు. అనేక రంగాలలో రోబోలను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంలో ఎందుకు ఉపయోగించకూడదు! అని ఆలోచించాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థి దివాన్షు కుమార్. ఫైనల్ ఇయర్ మాస్టర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే మానవరహిత రోబోకు రూపకల్పన చేశాడు. దీనికి ప్రొ.ప్రభురాజగోపాల్ మార్గదర్శకం వహించారు. రోబోను మరింత అభివృద్ధి పరిచే క్రమంలో ఒక డైనమిక్ టీమ్ తయారైంది. ఈ టీమ్ రాత్రనకా పగలనకా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. ఎన్నో మాక్–అప్ ట్రయల్స్ చేసింది. అనుకున్నది సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఎంతోమంది సీఎస్ఆర్ డోనర్స్ అండగా నిలిచారు. దివాన్షు ఆలోచనలో నుంచి పుట్టిన రోబోకు ‘హోమో సెప్’ అని నామకరణం చేశారు. తొలిసారిగా ఈ రోబోలు తమిళనాడులో పనిలోకి దిగబోతున్నాయి. ఒక ఐడియా రాగానే ‘ఆహా! ఎంత గొప్పగా ఉంది’ అనుకుంటాం. ఉద్వేగంలో ఒక నిర్ణయానికి రాకుండా, అది ఏ రకంగా గొప్పదో ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నప్పుడే, అందులో గొప్పదనం ఎంతో తెలుస్తుంది. అందుకే ‘ఐడియాలు గొప్పవే అయినప్పటికీ, ఉత్తుత్తి ఐడియాలు, సాధారణ ఐడియాలపై శ్రమ వృథా చేయవద్దు’ అనే మంచిమాటను నమ్ముతున్న దివాన్షు నుంచి భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని ఆశించవచ్చు. (క్లిక్: పురుషులకు అండగా స్త్రీ గొంతుక) -
5జి కాల్ విజయవంతం.. ఇంత కాలానికా?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! బలహీనత మంచిదా? ఇండియాలో 1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సరళీకరణ మొదలై, రూపాయి పతనమైంది. సింగపూర్‌లో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ప్రసిద్ధ పెట్టుబడుల బ్యాంకర్‌ను ఆ పతనం గురించి అడిగాను. అది మనకేమీ మంచి చేయదని చెప్పారు. ‘కానీ అది ఎగుమతులకు మంచిది కదా?’ అని నేను ప్రశ్నించాను. ఆయన నవ్వి, ‘బలమైన దేశాలు బలహీన కరెన్సీ కలిగివున్నాయా?’ అన్నారు. కానీ దీన్నే మీరు ‘భక్తానమిస్టులను’ అడిగితే, బలహీన రూపాయి మంచిదని చెబుతారు. – సలీల్ త్రిపాఠీ, కాలమిస్ట్ ఏం జరగనుంది? ఇప్పుడు ట్విట్టర్ డీల్ నుంచి బయటపడాలని వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చూస్తున్నాడు; కానీ దాన్ని కొనాల్సిందేనని ట్విట్టర్ పట్టుబడుతోందా? ఇప్పుడున్న పరిస్థితిని నేను సరిగ్గానే అంచనా వేస్తున్నానా? ఏంటో ఈ చీదర వ్యవహారాన్ని నేను ఫాలో కాలేకపోతున్నాను. – తిమ్మిన్ గెబ్రూ, కంప్యూటర్ సైంటిస్ట్ తెలియాల్సింది తెలుసు ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు ఏం తెలుసో అది అబ్బురపరుస్తుంది. ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు ఏం తెలియదని జనం అనుకుంటారో అది ఆందోళన కలిగిస్తుంది. – నీల్ డెగ్రాస్ టైసన్, ఆస్ట్రో ఫిజిసిస్ట్ వ్యతిరేకతా మంచికే! టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అవకాశవాద హడావిడి వల్ల, ‘నాటో’ కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్లను చేర్చుకోవాలన్న పిచ్చి నిర్ణయం గనక నెమ్మదిస్తే– ప్రత్యేకించి రష్యాతో ఫిన్లాండ్కు సుదీర్ఘ సరిహద్దు ఉన్న నేపథ్యంలో– ఆయన ప్రపంచానికి సేవ చేస్తున్నట్టే. – అజము బరాకా, యాక్టివిస్ట్ ఆత్మనిర్భర్ 5జి ఐఐటీ మద్రాసులో 5జి కాల్‌ను విజయవంతంగా పరీక్షించడమైంది. ఈ ‘ఎండ్ టు ఎండ్’ నెట్వర్క్ మొత్తం రూపకల్పన, అభివృద్ధి ఇండియాలోనే జరిగింది. – అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి ఇంత కాలానికా? బిహార్ కోర్టు 108 ఏళ్ల నాటి ఒక కేసులో తీర్పునిచ్చింది. అది ఆరా సివిల్ కోర్టులో 1914 సంవత్సరానికి సంబంధించిన ఒక భూవివాదం కేసు. ఓ నా ప్రియమైన దేశమా, దుఃఖపడు! – ప్రకాశ్ సింగ్, పోలీస్ మాజీ ఉన్నతాధికారి ఇదేనా పరిష్కారం? సైబర్ దాడుల మీద జరుగుతున్న ఒక చర్చలో, ఆ దాడిని నిరోధించడానికి గానూ మహిళలు తమ ఫొటోలను ఆన్లైన్లో పోస్టు చేయకూడదని ఒకాయన చెప్పే అభిప్రాయాన్ని అతిథులు అనుమతించారు. హ్మ్! – హనా మొహిసిన్ ఖాన్, పైలట్ అలవాటైతే అంతే! కాఫీ చేదుగా ఉంటుంది సరే, కానీ నెమ్మదిగా నువ్వు ఆ చేదుకు అలవాటు పడతావు. – ఐశ్వర్యా ముద్గిల్, వ్యాఖ్యాత -
ఇండియాలో తొలి 5జీ కాల్ మాట్లాడింది ఎవరు? ఎక్కడ?
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలతో ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ చేసినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘ఆత్మనిర్భర్ 5జీ. ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఈ నెట్వర్క్ పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు‘ అని గురువారం కాల్ అనంతరం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్థ్యాలు సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష దీనితో సాకారమైనట్లయిందని మంత్రి పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్‌బెడ్‌ను ఐఐటీ మద్రాస్‌లో ప్రధాని మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే 5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు ఉన్నాయి. Aatmanirbhar 5G 🇮🇳 Successfully tested 5G call at IIT Madras. Entire end to end network is designed and developed in India. pic.twitter.com/FGdzkD4LN0 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 19, 2022 చదవండి: అదిరిపోయేలా 5జీ డౌన్‌లోన్ స్పీడ్ -
తమిళనాడులో మళ్లీ లాక్డౌన్?.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మళ్లీ కరోనా లాక్డౌన్ విధించే అవకాశం ఉండదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఐఐటీ మద్రాసులో పాజిటివ్ కేసులు 111కి చేరుకున్నాయి. ఒకేచోట కేసులు కేంద్రీకృతమై ఉన్నందున ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ఇక్కడ వైద్య బృందాలు తిష్టవేసి కరోనా పరీక్షలు చేస్తూ విస్తృతం చేశారు. ఈ పరిస్థితుల్లో చెన్నై గిండీలోని కింగ్స్ ప్రభుత్వ కరోనా ఆసుపత్రిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు కరోనా పరిస్థితుల గురించి భయపడాల్సిన పనిలేదు, నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 29 జిల్లాల్లో కరోనా కేసులు లేవు, 9 జిల్లాల్లో చాలా స్పల్పంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి వెయ్యిమందిలో మూడు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఎంతమాత్రం లేవు. కరోనా కట్టుబాట్లపై మైక్రోప్లాన్ సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని వివరించారు. కరోనా కట్టడి చర్యలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు, త్వరలో లాక్డౌన్ వి«ధిస్తారనే వదంతులను ఎంతమాత్రం నమ్మవద్దని ఆయన కోరారు. లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు తమిళనాడులో లేవని తేల్చిచెప్పారు. ఐఐటీ మద్రాసులో మరో 32 మందికి పాజిటివ్ కాగా ఐఐటీ మద్రాసులో సోమవారం వరకు 79 కేసులు నమోదుకాగా మంగళవారం మరో 32 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్ చెప్పారు. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 111కి పెరిగింది. అయితే అదృష్టవశాత్తు కరోనా సోకిన వారంతా క్షేమంగా ఉన్నారు. రాబోయే రెండు రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఐఐటీ మద్రాసులోని మొత్తం 7,490 మందిలో ఇప్పటి వరకు 3,080 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. చదవండి: Tamil Actor Vimal: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు -
ఢిల్లీలో డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వారంలో ఆర్–వేల్యూ 2.1ని దాటిందని ఐఐటీ మద్రాస్ అంచనా వేసింది. జాతీయ స్థాయిలో ఇది 1.3 మాత్రమేనని తెలిపింది. ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమెటిక్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ కంప్యూటేషనల్ మేథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ విభాగాధిపతులు ప్రొఫెసర్ నీలేశ్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ ఎస్.సుందర్ ఈ వివరాలను వెల్లడించారు. ఆర్–వేల్యూ 2.1కు చేరుకోవడాన్ని బట్టి ఢిల్లీలో నాలుగో వేవ్ మొదలైందన్న అంచనాకు రావడం తొందరపాటే అవుతుందన్నారు. ‘ప్రస్తుతానికి ఒక్కో కరోనా బాధితుడి ద్వారా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందుతోందని మాత్రమే ఆర్–వేల్యూ ద్వారా చెప్పగలం. ప్రజల్లో వ్యాధి నిరోధకత స్థాయిలు, జనవరిలో థర్డ్‌వేవ్ సమయంలో వైరస్ బారిన పడిన వారు మళ్లీ వ్యాధికి గురవుతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అందుకే వ్యాప్తి అంచనాకు కొంత సమయం పడుతుంది’అని వారన్నారు. ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో స్వల్ప స్థాయిలో కేసులు వెలుగులోకి వస్తున్నందున వ్యాప్తి తీవ్రతను ఊహించలేమని చెప్పారు. ఢిల్లీలో తాజాగా 1,042 కరోనా కేసులు బయటపడగా పాజిటివిటీ రేట్ 4.64%గా ఉంది. దేశంలో కొత్త కేసులు 2,527 దేశంలో ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 2,527 కరోనా కేసులు బయటపడటంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 4,30,54,952కు చేరుకున్నాయని కేంద్రం శనివారం వెల్లడించింది. అదే సమయంలో, మరో 33 మంది బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,22,149కు చేరుకున్నట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 838 యాక్టివ్ కేసులు నిర్థారణ కాగా మొత్తం యాక్టివ్ కేసులు 15,079 అయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04%గా ఉన్నాయని తెలిపింది. -
కోరలు చాస్తోన్న కరోనా.. తమిళనాడులో ఆంక్షలు
సాక్షి, చెన్నై: కరోనా ప్రభావం తగ్గిపోయిందని సంతోషపడుతున్న తరుణంలో వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో గురువారం 21 కేసులు నమెదు కాగా శుక్రవారం 37 మంది వైరస్ బారిన పడ్డారు. కేసుల సంఖ్యలో క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ.500 జరిమానా విధానం శక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఐఐటీ మద్రాసులో ముగ్గురికి కరోనా పాజిటివ్ బయటపడడంతో అప్రమత్తమై మరికొందరికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సంఖ్య శుక్రవారానికి 30కి చేరింది. ఈ క్రమంలో మే 8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా లక్ష మెగా వ్యాక్సిన్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు శిబిరాలు పనిచేస్తాయని చెప్పారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసులు భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని అన్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉత్తరా ది నుంచి కార్మికులను రప్పించే సంస్థలు చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)కి ముందుగా సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. అలాగే వారందరినీ జీహెచ్‌కు తీసుకొస్తే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతారని తెలిపారు. గుంపులుగా రైళ్లలో వచ్చే ఉత్తరాది కూలీలపై అప్రమత్తంగా ఉండాలని.. లేకుంటే పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడులో ఇప్పటికే కరోనా కేసులు 39కి చేరుకున్నాయని తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. చదవండి👉🏾 సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ క్వారంటైన్లో ఐఐటీ మద్రాసు విద్యార్థులు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చెన్నై ఓమందూరులోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాసులో 700 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. స్వల్ప లక్షణాలున్న వారిని కళాశాల ప్రాంగణంలో హోం క్వారంటైన్లలో ఉంచామన్నారు. విద్యార్థులకు కోవిడ్ సోకితే ఆయా ప్రాంగణాల్లోనే క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఐఐటీ మద్రాస్‌లో కీచకపర్వం
చెన్నై: ఐఐటీ మద్రాస్‌లో ఎస్సీ మహిళా రీసెర్చ్ స్కాలర్‌పై లైంగిక వేధింపుల పర్వం నాలుగేళ్లు కొనసాగింది. పరిపాలనా విభాగానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2016లో రీసెర్చ్ స్కాలర్‌గా చేరిన మహిళపై తోటి స్కాలర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు తీశాడు. అతనికి ఇద్దరు ప్రొఫెసర్లు వంతపాడారు. ల్యాబ్ పరికరాలనూ వాడుకోకుండా, పరిశోధన చేయకుండా అడ్డు తగిలారు. దారుణంగా తిట్టిపోశారు. 2018, 2019లో జరిగిన ఘోరాలను భరించిన ఆమె 2020లో ఫిర్యాదు చేసింది. దాంతో లైంగిక వేధింపుల ఫిర్యాదుల అంతర్గత కమిటీ దర్యాప్తుకు ఆదేశించింది. ముగ్గురు తోటి విద్యార్థులు, ఒక ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించారని తేలింది. జాతీయ మహిళా కమిషన్ ఆదేశంతో గతేడాది మైలాపూర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలికి న్యాయం జరిగేదాకా నిందితుల పీహెచ్డీ పూర్తి కాకుండా చూడాలని కమిటీ సిఫార్సు చేసింది. -
దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ వాటిని నెటిజన్లతో పంచుకుంటారు. అయితే, తాజాగా మరో అంశంపై స్పందించారు. ముంబైకి చెందిన బిజినెస్ మొగల్ ఐఐటీ మద్రాస్ మద్దతుగల స్టార్ట్అప్ త్వాస్తా 21 రోజుల్లో నిర్మించిన భారతదేశపు మొదటి 3డి ప్రింటెడ్ ఇంటికి సంబంధించిన ఒక 104 సెకన్ల నిడివి గల వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాలను తాను అనుసరిస్తున్నానని, ఈ రంగంలో స్వదేశంలో అభివృద్ది చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం భారతదేశానికి కీలకమని మహీంద్రా అన్నారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. "విదేశాల్లో 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాలను అనుసరిస్తున్నాను. ఈ రంగంలో ఐఐటి మద్రాస్(ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ టెక్-ఇంక్యుబేటర్లలో ఒకటి) మద్దతుతో వచ్చిన టెక్ కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం భారతదేశానికి చాలా అవసరం. మీరు కొత్తగా నిధుల సమీకరణ జరిపారని నాకు తెలుసు. కానీ నేను చేరడానికి ఏదైనా గది?" అని వీడియో జతచేస్తూ పోస్టు చేశారు. Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8 — anand mahindra (@anandmahindra) January 31, 2022 3డి ప్రింటింగ్ కేటగిరీ కింద ఇండస్ట్రీ 4.0 రంగంలో నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2021 విజేతగా త్వాస్తాను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనికి ముందు, ప్రధాని నరేంద్ర మోడీ జూలై 2021లో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ స్టార్ట్-అప్ గురించి కూడా మాట్లాడారు. (చదవండి: దేశంలో జోరుగా స్టార్టప్ కల్చర్.. ప్రపంచంలోనే 3వ స్థానంలో!) -
వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. మెటావర్స్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్ సాధించబోతోంది ఈ కాబోయే జంట. తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ ఎస్పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్ ద్వారా. ఇది గనుక సక్సెస్ అయితే భారత్‌లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. ఇన్‌స్టా పరిచయం దినేశ్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్.. మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్‌లో ‘ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్’ తమదేనంటూ దినేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హ్యారీ పోటర్ యూనివర్స్ థీమ్‌తో ఈ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్ జరగనుండగా.. ల్యాప్ ట్యాప్ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్ రిసెప్షన్ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్‌లు(గిఫ్ట్ వౌచర్ల ట్రాన్స్ఫర్, గూగుల్‌పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది. I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4 — Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022 మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్లతో ఇంటెరాక్ట్ కావడం. అగుమెంటెడ్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్, వర్చువల్ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్సెల్వరాజ్ టీం ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ద్వారా ఈ మెటావర్స్ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. -
భారత్‌లో థర్డ్‌వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ నాట్ వాల్యూ లేదంటే ఆర్ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. డెల్టా వేరియెంట్ ప్రబలి కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్ నాట్ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళ డిసెంబర్ 25–31 తేదీల్లో ఆర్ నాట్ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్ రేటు, వైరస్ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్ నాట్ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్ రేటు తగ్గి ఆర్ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్ వాల్యూ మారవచ్చునని జయంత్ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు. 2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు. -
దివ్యాంగుల కోసం ‘అసిస్టివ్ టెక్నాలజీ’
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యంతో బాధపడుతున్న వారి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు పరిష్కారాలు కనుగొనేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) సోమవారం ‘అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు 2.0’ ను నిర్వహించింది. రాష్ట్ర ఐటీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో జరిగిన ఈ సదస్సులో 18 విద్యార్థి బృందాలు ప్రత్యక్షంగా, మరో ఐదు బృం దాలు వర్చువల్ విధానంలో పాల్గొన్నాయి. రాష్ట్రంలో సాంకేతికవిద్యను అవలంబిస్తున్న విద్యార్థుల నుంచి వికలాంగుల సమస్యల పరిష్కారానికిగాను ఆలోచనలు, నమూనాలను టీఎస్ఐసీ ఆహ్వానించింది. మొత్తం 87 మంది బృందాలు దరఖాస్తు చేయగా, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ నిపుణులు డాక్టర్ బ్యూలా క్రిస్టీ, యూత్ 4 జాబ్స్ వ్యవస్థాపకుడు మీరా షెనాయ్ తదితరుల నేతృత్వంలోని బృందం వీటిని మదింపు చేసింది. సదస్సులో పాల్గొన్న 23 బృందాల్లో మూడు అత్యుత్తమ బృందాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. -
ఐపీవో ఎఫెక్ట్.. ఏకంగా బిలియనీర్ అయ్యాడు
ఐపీవో.. ఈ పేరు వినగానే చాలామంది హడలిపోతున్నారు ఇప్పుడు. బడా బడా కంపెనీలు, స్టార్టప్‌లు మెగా ఐపీవోలతో పబ్లిక్ ఇష్యూయింగ్కు వెళ్లడం, షేర్ మార్కెట్లో చతికిలపడి లక్షల మంది ఇన్వెస్టర్లను నిండా ముంచడం చూస్తున్నాం. ముఖ్యంగా పేటీఎం పర్యవసనాలు.. ఐపీవోకి వెళ్లాలన్న ఆలోచనల్లో ఉన్న చాలా కంపెనీలను పునరాలోచనల్లో పడేశాయనే చెప్పాలి. ఈ తరుణంలో ఐపీవో ఆ కంపెనీ పాలిట వరంగా మారింది. చెన్నైకి చెందిన డేటా అనలైటిక్స్ కంపెనీ లాటెన్ వ్యూ అనలైటిక్స్ లిమిటెడ్ దలాల్ స్ట్రీట్ వద్ద బంపర్‌హిట్ సాధించింది. లాటెంట్ వ్యూ షేర్లు స్టాక్‌ఎక్స్ఛేంజీ లిస్టింగ్‌లో అదరగొడుతున్నాయి. ఇష్యూ ధర రూ.197 కాగా.. దీనికి 169 శాతం అధికంగా రూ.702 వద్ద బీఎస్ఈలో, 160 శాతం అధికంగా రూ.670 వద్ద ఎన్ఎస్ఈలో షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ కంపెనీ షేర్లు 338 రెట్ల కంటే ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు లాభాలతో పండుగ చేసుకుంటున్నారు. అందరి కంటే ముఖ్యంగా లాటెంట్ ప్రమోటర్ అడుగుడి విశ్వనాథన్ వెంకట్రామన్ (వెంకట్ విశ్వనాథన్) ను ఏకంగా బిలియనీర్‌ను చేసింది ఈ ఐపీవో పరిణామం. వెంకట్రామన్ లాటెంట్ వ్యూ అనలైటిక్స్‌కు చైర్పర్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. కంపెనీలో 117.91 కోట్ల షేర్లు ఉన్నాయి ఆయనకి. అంటే దాదాపు 69.62 శాతం వాటా ఈయనదే!. డేటా అనలైటిక్స్ ఐపీవో వెంకట్రామన్ నెత్తిన పాలుపోసింది. గురువారం క్లోజింగ్ ప్రైస్‌ను గనుక పరిగణనలోకి తీసుకుంటే.. ఆయన వాటా విలువ అక్షరాల 8, 275 కోట్ల రూపాయలకు చేపరింది. అంటే 1.1 బిలియన్ డాలర్లతో ఆయన్ని బిలియనీర్ లిస్ట్‌లో చేర్చిందన్నమాట. ఐఐటీ మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్, ఐఐఎం కలకత్తాలో చదివిన వెంకట్రామన్.. కాగ్నిజెంట్ లాంటి కొన్ని టాప్ కంపెనీల్లో పనిచేశారు. ఐటీ సర్వీసుల్లో ఉంటూనే బిజినెస్ సెక్టార్లో మంచి అనుభవం సంపాదించారు. 2007లో లాటెంట్ వ్యూ అనలైటిక్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లాటెంట్ వ్యూ అనలిటిక్స్ లిమిటెడ్ LVAL.. దేశంలో డేటా అనలిటిక్స్ సర్వీసులను అందించే సంస్థల్లో ఒకటి. డిజిటల్ సొల్యూషన్స్‌తో పాటు బిజినెస్ అనలైటిక్స్-ఇన్సైట్స్, డాటా ఇంజినీరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఆసియా దేశాలు, యూరప్‌తో పాటు అమెరికాలోని కొన్ని కంపెనీలు లాటెంట్ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. చదవండి: 38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే.. నెటిజన్ల ఫైర్! -
ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా
IIT Madras Created: దివ్యాంగులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరి తోడు ఉండాల్సిందే. అలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్ తయారు చేసిన బ్యాటరీ వాహనం ఎంతో ఉపయోగపడుతోంది. దానిని ఇంట్లో వీల్ చైర్‌లా..బయటకు వెళ్తే స్కూటీలాగా వాడొచ్చు. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఒక్కరే దానిని అటాచ్ చేసుకునేలా, తొలగించుకునేలా తయారు చేశారు. (చదవండి: హ్యాట్సాఫ్ సార్!... హీరోలా రక్షించారు!) నాలుగు గంటలు చార్జ్ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్‌కు చెందిన శ్రావణ్ పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రమాదంలో నడవలేని స్థితికి చేరుకున్నాడు. అప్పటినుంచి ఎవరైనా తోడుంటేనే బయటకు వచ్చాడు. కానీ ఈ వెహికిల్ సహాయంతో ఒక్కడే బయటకు రాగలుగుతున్నాడు. కాగా, దీని ఖరీదు రూ.95,000. దీన్ని శ్రావణ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు చెబుతున్నాడు. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్(ఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 15 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఆఫీసర్లు–02, ప్రాజెక్ట్ అసోసియేట్లు–05, జూనియర్ టెక్నీషియన్లు–08. ► ప్రాజెక్ట్ ఆఫీసర్లు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.27,500 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ప్రాజెక్ట్ అసోసియేట్లు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ అర్హత సాధించి ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.21,500 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు. ► జూనియర్ టెక్నీషియన్లు: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.16,000 నుంచి రూ.38,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నై–600036 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.11.2021 ► వెబ్సైట్: https://icandsr.iitm.ac.in -
మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వీల్‌చైర్ వెహికల్‌ను తయారు చేసినట్లు ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీ) మద్రాస్ పరిశోధకులు ప్రక టించారు. ఈ వాహనం రోడ్లపైనే కాదు, ఇతర అనను కూల ప్రాంతాల్లోనూ ఉపయో గపడు తుందని చెప్పారు. ‘నియోబోల్ట్ అనే పేరు న్న ఈ వాహనంలో వాడే లిథియం– అయాన్ బేటరీని ఒక్కసారి ఛార్జి చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. వీల్‌చైర్ వాడే వారికి ఇది ఎంతో సౌకర్యం, సురక్షితం. ఆటో, స్కూటర్, కారు కంటే దీనికయ్యే ఖర్చు తక్కువ’అని వారన్నారు. ఐఐటీ మద్రాస్ లోని సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైజ్ డెవలప్మెంట్ విభాగం ‘నియో మోషన్’ అనే స్టార్టప్‌తో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిం చిందన్నారు. ఈ వీల్ చైర్ సుమారుగా రూ.55 వేలకే అందుబాటులోకి వచ్చే అవకా శం ఉందని ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సుజాతా శ్రీనివాసన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో నియోబోల్ట్ మాదిరి విశిష్టలతో కూడిన వాహనాల ధరలు మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏటా అమ్ముడయ్యే దాదాపు 3 లక్షల వీల్ చైర్లలో 2.5 లక్షల వీల్ చైర్లు విదేశాల్లో తయారైనవేనని చెప్పారు. -
అప్పటికింకా మాకు పెళ్లి కాలేదు.. అందుకే అలా: ఐఏఎస్
అగర్తలా: సాధారణంగా పరీక్షలు రాయడం పూర్తి కాగానే విద్యార్థులు ఉపశమనం దొరికినట్లు ఫీలవుతారు. అదే విధంగా.. ఫలితాలు ఎప్పుడు వస్తాయో, పాస్ అవుతామో లేదో అన్న భయాలతో ఒత్తిడికి కూడా గురిఅవుతారు. అటువంటి సమయాల్లో నచ్చిన పని చేస్తూ సేద దీరడం లేదంటే, సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఐఏఎస్ అధికారిణి చాందినీ చంద్రణ్ కూడా ఇందుకు అతీతం కాదు. 2015లో ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒత్తిడికి లోనైన చాందినీ.. తన ప్రియ మిత్రుడు అరుణ్ సుదర్శన్‌తో కలిసి సరాదాగా ఔటింగ్‌కి వెళ్లారు. సరిగ్గా అప్పుడే వర్షం పడింది. ఒకే గొడుగు కింద ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అరుణ్ సుదర్శన్ ఆమె భుజంపై ఆత్మీయంగా చేయి వేసి ముందుకు నడిపిస్తుండగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నారు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు కెమెరాను క్లిక్ మనిపించారు. ఇంకేముంది.. తర్వాతి రోజు పత్రికలో.. ‘‘వేసవివి సెలవు.. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది’’ అంటూ చాందినీ చంద్రణ్, అరుణ్ సుదర్శన్ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్ చేశారు. అయితే, కాకతాళీయంగా అదే రోజు సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆ యేడు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఫొటోలతో పాటు మరో పేజీలో చాందినీ చంద్రణ్(ఆమె అప్పుడు ఉత్తీర్ణురాలు కాలేదు) ఫొటో కూడా పబ్లిష్ కావడం గమనార్హం. దీంతో.. అరుణ్ సుదర్శన్... సదరు పత్రికా సంస్థకు ఫోన్ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్ చేయవద్దని హితవు పలికారు. ఈ విషయాన్ని మంగళవారం ట్విటర్ వేదికగా పంచుకున్న ఐఏఎస్ చాందినీ చంద్రణ్ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు. అప్పటికి మాకింకా పెళ్లికాలేదు ‘‘ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీ లేదు!! కానీ అలాంటి ఫొటోలు ఇంట్లో వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి కదా. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. అయితే, ప్రస్తుతం మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా.. అరుణ్ సుదర్శన్ సదరు ఫొటోగ్రాఫర్‌ను సంప్రదించగా... ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్ అనే మాటతో సరిపెట్టలేను!!’’ అని ఈ స్టోరీని రివీల్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో.. ‘‘అత్తుత్తమ ఫొటోల్లో ఇది ఒకటి!! మధుర జ్ఞాపకాలు. ఏంటో.. ఊహించనవి అలా అప్పుడప్పుడూ అలా జరిగిపోతూ ఉంటాయి. పాత ఫొటో అయినా ఇది మీకెంతో ప్రత్యేకం కదా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐఐటీ మద్రాస్‌లో విద్యనభ్యసించిన చాందినీ చంద్రణ్ 2017లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె.. ఉత్తర త్రిపురలోని కాంచన్‌పూర్‌లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. as we weren't married then 😅.I took it as a sign that my photo was destined to be there in the paper filled with UPSC toppers and that I can happily walk towards any destination with someone holding an umbrella and looking out for me with love unbound when I take each step.(2/3) — Chandni Chandran (@chandni_ias) June 29, 2021 -
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది!
ట్రాఫిక్ తలనొప్పులు లేకుండా సరిౖయెన టైమ్‌కు మనల్ని గమ్యస్థానం చేర్చే ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. ఆకాశమార్గంలో పట్టాలెక్కబోయే ఎయిర్‌ట్యాక్సీ ప్రాజెక్ట్‌లలో ఇండియా నుంచి జర్మనీ వరకు యువత కీలక పాత్ర పోషిస్తుంది. జర్మన్ కంపెనీ ‘వోలోకాప్టర్’ ఎయిర్ట్యాక్సీల ట్రెండ్‌కు మార్గదర్శిగా నిలిచింది. ‘ఏమిటి? ఎయిర్ ట్యాక్సీనా?’ అనే ఆశ్చర్యం ‘అవును ఇది నిజం’ అనే నమ్మకానికి రావడానికి ఎంతోకాలం పట్టలేదు. 2011లో మొదలై రెండు సంవత్సరాలు గడిచేసరికి తొలి 2-సీటర్ ప్రోటోటైప్‌ను రూపొందించారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు లైసెన్స్ వచ్చింది. మరో రెండు సంవత్సరాలకు అయిదు వందల ప్లేన్లు తయారుచేశారు. ‘సేఫ్ అండ్ స్టేబుల్’ కాన్సెప్ట్‌తో అర్బన్ ఎన్విరాన్మెంట్లో ప్యాసింజర్‌ను భద్రంగా గమ్యస్థానానికి ఎలా చేర్చాలి? అధిక శబ్దాలను నియంత్రిస్తూ టేకింగ్ ఆఫ్, ల్యాండింగ్...ఇలా ఎన్నో విషయాలలో జాగ్రత్తలు తీసుకొని, తేలికపాటి బరువుతో ఎయిర్‌ఫ్రేమ్‌లు తయారుచేశారు. గంట నుంచి 5 గంటల వరకు తీసుకునే ఛార్జింగ్ సమయాన్ని సెకండ్లకు పరిమితం చేసి స్మూత్రైడ్కు బాటలు వేశారు. ‘ప్రయోగాలేవో చేస్తున్నాం, మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే అనుమతి లభిస్తుందా? అనే పెద్ద డౌట్ వచ్చింది. కమర్శియల్ ఎయిర్ లైనర్స్లాగే వీటికి అత్యున్నతమైన భద్రతాప్రమాణాలు రూపొందించుకోవడంతో అనుమతి సులభమైంది’ అంటున్నాడు ‘వోలోకాప్టర్’ కోఫౌండర్ అలెగ్జాండర్ లోసెల్. ఎయిర్‌ట్యాక్సీ అయినంత మాత్రానా ధరలు ఆకాశంలో ఉంటాయనుకోనక్కర్లేదు. ధరలు అందుబాటులోనే ఉంటాయట. బ్రిస్టల్(యూకే)కు చెందిన ఫ్లైయింగ్ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ ‘వెర్టికల్ ఎరో స్పేస్’ 2016 నుంచే రకరకాల ప్రయోగాలు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎయిరోస్పేస్ అండ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను ఈ ప్రాజెక్ట్ కోసం వాడుకున్నారు. 800 కీ.మీ దూరం ప్రయాణం చేసే పవర్ఫుల్ మోడల్ సెట్‌ను ఈ కంపెనీ తయారుచేసింది. ‘సిటికీ దూరంగా ఉన్న విమానాశ్రయాలకు వెళ్లడానికే చాలా సమయం వృథా పోతుంది. ఎయిర్ ట్యాక్సీల ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుంది’ అంటున్నాడు ‘వెర్టికల్ ఎరో స్పేస్’ ఫౌండర్ స్టీఫెన్ ఫిట్జ్‌పాట్రిక్.రెండు దశబ్దాల కిందటి తన కలను పదకొండు సంవత్సరాలు కష్టపడి నిజం చేసుకున్నాడు కాలిఫోర్నియాకు చెందిన జోబెన్. ‘జోబి ఎవియేషన్’ వ్యవస్థాపకుడైన జోబెన్-‘ ఎయిర్ ట్యాక్సీలతో ఆకాశం కళకళలాడే రోజులు ఎంతో దూరంలో లేవు’ అంటున్నాడు. జోబి ఏవియేషన్‌కు చెందిన రూఫ్ టాప్-టు-రూఫ్ టాప్ ఎయిర్ ట్యాక్సీలు 2023లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మన దగ్గరకు వస్తే... ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీలు ఊపందుకుంటున్న దశలో ఇప్పుడు అందరి దృష్టి ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘ఇ-ప్లేన్ కంపెనీ’పై పడింది. సీడ్ ఫండింగ్ ఆశాజనకంగా ఉండడంతో వరల్డ్‌క్లాస్ ఇంజనీరింగ్ టీమ్‌ను తయారుచేసుకునే వీలు ఏర్పడుతుంది. ఎరో స్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సత్యనారాయణ చక్రవర్తి ఆయన శిష్యుడు ప్రంజల్ మెహతా మానసపుత్రిక ‘ఇ-ప్లేన్’ కంపెనీ. ఈ 2 సీటర్ ‘ఇ ప్లేన్’కు ‘వెర్టిపోర్ట్స్’ అవసరం లేదు. రూఫ్ టాప్, పార్కింగ్ లాట్స్ నుంచే టేక్ ఆఫ్ చేయవచ్చు. రాబోయే కాలంలో ‘ఎయిర్ ట్యాక్సీ’ల ప్రయోగం విజయవంతం అయితే ‘శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి’ అని కాస్త గట్టిగానే నమ్మవచ్చు. చదవండి: ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! ట్రాఫిక్ చలానా తగ్గించుకోండిలా! -
చెన్నై ఐఐటీలో కరోనా కలకలం : లాక్డౌన్
సాక్షి, చెన్నై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అంతానికి టీకా అందుబాటులో రానుందనే ఆశ చిగురిస్తోంటే..మరోవైపు కోవిడ్-19 ఉధృతి ఆందోళన పుట్టిస్తోంది. తాజాగా భారతదేశపు ప్రధాన విద్యా సంస్థ చెన్నై ఐఐటీలో కరోనా కేసులు కలకలం రేపింది. చెన్నై ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా 71 మందికి కరోనా బారినపడ్డారు. ఇందులో 66 మంది విద్యార్థులున్నారని ఐఐటీ అధికారులు తెలిపారు. ఎక్కడ నుంచి విస్తరించిందోతెలియదుగానీ, కేవలం ఒక్కరోజులోనే 32 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని క్యాంపస్ అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది. యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మళ్లీ లాక్డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చామని, అన్ని డిపార్టుమెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ చెన్నై ఆదివారం జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం కోవిడ్ కేసులు పెరిగిన దృష్ట్యా, తదుపరి నోటీసులిచ్చే వరకు అన్ని విభాగాలు, కేంద్రాలు, లైబ్రరీని వెంటనే మూసివేయాలని నిర్ణయించారు. అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్ట్ సిబ్బంది, పరిశోధకుల తదితరులు ఇంటి నుండే పని చేస్తారు. క్యాంపస్‌లో బస చేసే విద్యార్థులు, ప్రాజెక్ట్ సిబ్బంది అందరూ తమ హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాలి. భౌతిక దూరం, ఫేస్‌మాస్క్ లాంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కోవిడ్ (జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, విరేచనాలు, రుచి /వాసన కోల్పోవడం లేదా తదితర) లక్షణాలు కనిపించినవారు తక్షణమే అధికారులను సంప్రదించాలని సర్క్యులర్‌లో పేర్కొంది. -
ఫొటోషూట్ లేకుండానే మోడల్స్ చిత్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల దుకాణానికి వెళ్లినప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించి, ఒకసారి వేసుకుని మరీ చూస్తాం. నచ్చితేనే కొంటాం. ఆన్లైన్లో అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈకామర్స్ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్ చేసి మరీ దుస్తులను ప్రదర్శిస్తాయి. ఇంత వరకు బాగానే ఉంది. మరి చిన్న చిన్న విక్రేతలు ఆన్లైన్లో ఎలా పోటీపడాలి? ఖరీదైన ఫొటోషూట్స్‌తో పనిలేకుండా ఫోన్లో తీసిన సాధారణ చిత్రాలు 3డీ రూపంలో మారితే? అలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ విద్యార్థులైన తెలుగు కుర్రాళ్లు నితీశ్ రెడ్డి పర్వతం, కృష్ణ సుమంత్ అల్వాల అభివృద్ధి చేశారు. నాస్కాం, ఐఐటీ మద్రాస్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ కంపెనీ పేరు ట్రై3డీ. ఎలా పనిచేస్తుందంటే.. విక్రేతలు ట్రై3డీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎంపిక చేసిన దుస్తులను రెండు మూడు ఫొటోలు తీసి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న టెంప్లేట్‌కు జత చేయాలి. వెంటనే 3డీ రూపంలో ఫొటో రెడీ అవుతుంది. రెండు మూడు నిముషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటోషూట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాలు సహజంగా కనిపిస్తాయి. ఈ 3డీ చిత్రాలను ఈ-కామర్స్ పోర్టల్స్‌లో, సొంత వెబ్‌సైట్స్‌లో ప్రదర్శించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ఫోటోలను పోస్ట్ చేసి వ్యాపారం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. మోడల్స్‌తో ఫొటోషూట్ చేసి ఈ టెంప్లేట్స్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు పలువురు మోడళ్లతో వివిధ భంగిమల్లో 250 రకాల టెంప్లేట్స్‌ను సిద్ధం చేశారు. సులభంగా ఆన్లైన్లో.. ఆఫ్‌లైన్‌కు పరిమితమైన విక్రేతలు ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆన్లైన్కూ విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని ట్రై3డీ కో-ఫౌండర్ నితీశ్ రెడ్డి పర్వతం సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘చీరలు, డ్రెస్ మెటీరియల్, హోం డెకోర్ ఉత్పత్తులను 3డీ రూపంలో మార్చవచ్చు. ఫొటోషూట్స్ ఖర్చులు ఉండవు. భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయికి చెందిన 260 మంది కస్టమర్లు విజయవంతంగా వ్యాపారాన్ని విస్తరించారు. భారత్‌లో ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ కంపెనీ ఈ జాబితాలో ఉంది. ఏడాది కాలంలో మా క్లయింట్లు 80 వేలకుపైగా 3డీ చిత్రాలతో అమ్మకాలను సాగించారు. కోవిడ్-19 కారణంగా వినియోగదార్లు ఆన్‌లైన్‌కు మళ్లుతుండడంతో మా క్లయింట్ల సంఖ్య పెరుగుతోంది. 100 క్రెడిట్స్‌కు రూ.5,000 చార్జీ చేస్తున్నాం. రూ.3 లక్షల వార్షిక ఫీజుతో అపరిమిత క్రెడిట్స్ వాడుకోవచ్చు’ అని వివరించారు. -
సముద్ర ప్రాంతాల సర్వేకు రోబోటు
సాక్షి, హైదరాబాద్: దేశానికి సంబంధించిన వేలాది కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని సులువుగా సర్వే చేసేందుకు సరికొత్త రోబో బోటును ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దేశ సముద్ర సంబంధ రంగంలో స్వావలంబన సాధించే దిశగా రూపొందించిన ఈ రోబో బోటు పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. సముద్ర ప్రాంతాలతోపాటు నదీజలాల్లోనూ స్వతంత్రంగా సర్వే చేయడం, గస్తీ కాసేందుకూ దీన్ని ఉపయోగించవచ్చు. ధ్వనికి సంబంధించిన ఎకో సౌండర్, జీపీఎస్, బ్రాడ్‌బ్యాండ్ వంటి ఐటీ హంగులను, లిడార్, 360 డిగ్రీ కెమెరా కొలతలకు సంబంధించిన ఇతర పరికరాలు ఇందులో ఉంటాయి. ఈ రోబో బోటును ఇప్పటికే చెన్నై సమీపంలోని కామరాజర్ నౌకాశ్రయంలో పరీక్షించామని, కోల్‌కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంలో మరిన్ని కఠిన పరీక్షలకు గురిచేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్‌వేస్ అండ్ కోస్ట్స్ ఇన్చార్జి ప్రొఫెసర్ కె. మురళి తెలిపారు. లోతు తక్కువ సముద్ర జలాల్లోనూ ఇది కచ్చితమైన కొలతలు ఇవ్వగలదని, నౌకాశ్రయం సామర్థ్యం పెంచేందుకు పలు విధాలుగా ఉపయో గపడుతుందని ఆయన వివరించారు. పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఎంత సేపైనా ఉపయోగించుకోవచ్చని, అడ్డంకులను దానంతట అదే తప్పించుకొని పనులు నిర్వహించగలదని తెలిపారు. వచ్చే ఏడాది ఈ బోటు కార్యకలాపాలు సాగించగలదని అంచనా వేస్తున్నారు. -
పిల్లల కోసం.. కరోనా గేమ్
మీ పిల్లలు కరోనా జాగ్రతలు పాటించడం లేదా? అయితే వారితో ఈ గేమ్ ఆగించండి. మీకే ఎలా భద్రంగా ఉండాలో చెప్తారు. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు పిల్లల్లొ అవగాహన పెంచడానికి ఐఐఎమ్ కోవిడ్ గేమ్‌ని రూపొందించారు. ఇది 12 ప్రాంతీయ భాషలో అందుబాటులో ఉంది. కోవిడ్-19 పై పిల్లల్లో అవేర్నెస్ కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదొక బ్రౌజర్ బేస్డ్ గేమ్ దీన్ని మోబైల్, టాబ్లెట్, లాప్టాప్, పీసీ ఎందులోనైనా ఆడొచ్చు. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడటానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ గేమ్‌ని రూపొందించారు. ప్రసిద్ధ సూపర్ మరియో గేమ్‌ని ఆదర్శంగా తీసుకుని దీన్ని రూపొందించారు. ఒక నిమిషం పాటు సాగే కోవిడ్-19 ఆటలో గరిష్ట పాయింట్లు సాధించడానికి సరైన పనులు చేయాలి. ఎక్కువ పాయింట్లు సాధించినవారు విన్నర్. సరైన పనులు అంటే గేమ్‌లో పాత్రలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి(మాస్క్ ధరించటం, శానిటైజర్ వాడటం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ) ఇవి సరిగా పాటించినప్పుడల్లా ఒక పాయింట్ కలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోతారు.ఐఐఎమ్ కోవిడ్ గేమ్‌ని వసుధ టీకే, ఎన్ఎస్ కీర్తి, శివప్రియ వెళైచామీ అనే విద్యార్థులు రూపొందించారు. ఈ గేమ్‌ని విద్యార్థులు జనవరి నుంచి మే మధ్య అందించే లెట్స్ ప్లే టూ లెర్న కోర్స్‌లో భాగంగా రూపొందించారు. ఈ కోర్సులో 30 మంది విద్యార్థులు పాలుపంచుకుని వివిధ అంశాలపై బోర్డ్ గేమ్స్ రూపొందించారు. ఇందులో ముగ్గురు కరోనా సంబంధిత గేమ్‌ని తయారుచేశారు. కొందరి అభిప్రాయం సేకరించిన తర్వాత గేమ్‌ని ఇంకొన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని గేమ్స్‌ని రూపొందిస్తామని విద్యార్థులు అంటున్నారు. -
అయోధ్య: ప్రారంభమైన రామమందిర నిర్మాణం
-
ప్రారంభమైన రామమందిర నిర్మాణం
లక్నో: దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన రామ మందిర నిర్మణానికి సంబంధించి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ ట్వీట్ చేసింది. ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ ట్వీట్ చేసింది. The construction of Shri Ram Janmbhoomi Mandir has begun. Engineers from CBRI Roorkee, IIT Madras along with L&T are now testing the soil at the mandir site. The construction work is expected to finish in 36-40 months. — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 20, 2020 -
‘త్వరలో కరోనా లక్షణాలకు ఐఐటీ బ్యాండ్’
సాక్షి, చెన్నై: కరోనాను త్వరగా గుర్తించేందుకు దేశీయంగా వివిధ పరికరాలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, మ్యుస్ వియర్‌బేల్స్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా కరోనా లక్షణాలను గుర్తించే బ్యాండ్‌ను వచ్చే నెలల్లో మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. అయితే ఈ బ్యాండ్‌ను చేతి మణికట్టుకు ధరించవచ్చు. ఈ బ్యాండ్ కరోనా లక్షణాలను గుర్తించే ముఖ్యమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత, గుండె, ఆక్సిజన్, రక్త పనితీరును బ్యాండ్ ద్వారా గుర్తించవచ్చు. ఈ బ్యాండ్‌కు రూ.3,500కు ధర నిర్ణయించారు. కాగా ఈ బ్యాండ్‌ను మొబైల్ ఫోన్, బ్లూటూత్‌లలో ధరించవచ్చు. అయితే కంటైన్మెంట్ జోన్లకు ప్రవేశించగానే ఈ బ్యాండ్‌ను ధరిస్తే ఆరోగ్య సేతు యాప్‌ను అలర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 2లక్షల బ్యాండ్ల అమ్మకాలకు ప్రణాళిక ఉందని, రాబోయే 2022సంవత్సరానికి 10లక్షలకు పెంచనున్నారు. -
2 గంటల్లో మినీ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్ : అసలే ఇది కరోనా కాలం.. చాలా ఆస్ప త్రుల్లో ఐసీయూ పడకల కొరత! కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, ఐసీయూ పడకల ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. ఈ చిక్కు సమస్యకు తెలివైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది ఐఐటీ మద్రాస్ లోని స్టార్టప్ కంపెనీ మోడ్యులస్ హౌసింగ్. కొన్ని గంటల్లోనే మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. మెడిక్యాబ్ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీ సాయంతో పది హేను పడకలతోపాటు ఒక ఐసీయూ, వైద్యుడి కోసం ప్రత్యేక గదిని నలుగురు వ్యక్తులు కలిసి రెండు గంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కరోనా రోగులను గుర్తించడం మొదలు, ఐసోలేషన్‌లో ఉంచే వరకు అన్ని ప్రక్రియలను ఒక్కచోటే నిర్వ హించవచ్చన్నమాట. దేశవ్యాప్తంగా మినీ ఆస్ప త్రుల ఏర్పాటుకు ఇది మేలైన మార్గమని అంటు న్నారు. మెడిక్యాబ్‌లో వైద్యుడి గది, ఐసోలేషన్ గది, చికిత్స అందించే వార్డు, రెండు పడకలున్న ఐసీయూలతో అచ్చం పెద్దాస్పత్రుల్లో మాదిరిగానే రుణాత్మక పీడనం ఉంటుంది. కేరళలో నమూనా మెడిక్యాబ్! కేరళలోని వైనాడ్ జిల్లాలో మెడిక్యాబ్ మినీ ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీ చిత్ర తిరుణాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సాయం అందించింది. 2018లో ఇద్దరు ఐఐటీ పట్టభద్రులు మోడ్యులస్ హౌసింగ్ కంపెనీని స్థాపించారు. ముందుగానే నిర్మించిన గోడలు, కిటికీల్లాంటి భాగాలతో గృహ నిర్మాణాన్ని చౌకగా మార్చడం అప్పట్లో ఈ కంపెనీ ఉద్దేశం. కానీ దీన్ని తాము కరోనా పరిస్థితులకు అనుగుణంగా మార్చి మెడిక్యాబ్‌ను సిద్ధం చేశామని కంపెనీ సీఈవో శ్రీరామ్ రవిచంద్రన్ తెలిపారు. కేరళలో ఏర్పాటైన నమూనా మినీ ఆసుపత్రి మెడిక్యాబ్ ప్రాముఖ్యత, అవసరాన్ని ప్రపంచానికి చాటేందుకు ఉపయోగపడుతుందన్నారు. ‘గంటల్లో ఏర్పాటు చేసుకోగల ఈ ఆసుపత్రిని ఐదు రెట్లు తక్కువ సైజుకు మడిచేసి ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చు. ఒక లారీలో దాదాపు ఆరు మెడిక్యాబ్‌ల సామగ్రిని మోసుకెళ్లవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు మెడిక్యాబ్‌లు ఉపయోగపడతాయి. మినీ ఆసుపత్రులతోపాటు ఐసొలేషన్ వార్డులను కూడా మేం సిద్ధం చేశాం. చెన్నైలోని చెంగల్‌పేట్‌లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి వెయ్యిమందికి ఒకటి కంటే తక్కువ ఆసుపత్రి పడక అందుబాటులో ఉంది. మెడిక్యాబ్ వంటి సృజనాత్మక ఆలోచనలతోనే ఈ కొరతను అధిగమించడం సాధ్యమని అంచనా’ అని ఆయన వివరించారు. కరోనాపై పోరుకు ఐఐటీ మద్రాస్ తనదైన తోడ్పాటు అందిస్తోందని, ఎన్95 మాస్కుల తయారీ మొదలుకొని, చౌకైన వెంటిలేటర్ల తయారీ వరకు అనేక ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిందని ఐఐటీ మద్రాస్ ఇన్క్యుబేషన్ సెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ తమస్వతి ఘోష్ తెలిపారు. -
ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ
బీఎస్సీ ఇన్ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్‌ను దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టిన ఐఐటీ మద్రాస్.. కోర్సులో ఎన్నెన్నో ప్రత్యేకతలు సాక్షి, హైదరాబాద్: సర్టిఫికెట్ కోర్సుకు 3 – 4 నెలలు.. డిప్లొమా అంటే ఏడాది.. డిగ్రీ చదవాలంటే మూడేళ్లు! ఇదీ ప్రస్తుత విధానం. ఇకపై మాత్రం కాదు. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా ఐఐటీ మద్రాస్ మంగళవారం ఆన్లైన్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆన్లైన్లో ఈ కోర్సును ప్రారంభించారు. ‘బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్’ అనే ఈ కోర్సుకు బోలెడు ప్రత్యేకతలున్నాయి. ఇంటర్మీడియెట్ పాసైతే చాలు ఈ కోర్సులో చేరి పోవచ్చు. అంతేకాదు.. ఇతర కోర్సులు చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లూ చేరవచ్చు. ఒకసారి చేరితే మూడేళ్లపాటు డిగ్రీ చదివి తీరాలనే నిబంధనేదీ లేదు. కొన్ని నెలలు, కొన్ని అంశాలను చదవకుంటే సర్టిఫికెట్ కోర్సుగా, మరింత కాలం అదనపు సబ్జెక్టులను కలుపుకుని చదివితే డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లు అందించటం ఈ కోర్సు ప్రత్యేకత. ఐటీ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు రూపొందిన ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాక, వృత్తి నైపుణ్యాలను పెంచు కోవాలనుకునే ఐటీ ఉద్యోగులకూ ఉప యోగపడుతుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు.మేధోవలసను ఆపాలి: కేంద్ర మంత్రి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఢిల్లీ నుంచి ఈ ఆన్లైన్ కోర్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థులు ఏటా ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఐఐటీలాంటి సంస్థలు ఈ మేధోవలసకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఐఐటీ మద్రాస్ సిద్ధంచేసిన బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్ ఇందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు ప్రతాప్ హరిదాస్, ఆండ్రూ తంగరాజ్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పవన్‌కుమార్ గోయంకా పాల్గొన్నారు. ఏటా జనవరి, మే, సెప్టెంబర్‌లో విద్యార్థులను చేర్చుకుంటారు. వారానికి 2 – 3 గంటల వీడియో పాఠాలు, క్విజ్లు.. దగ్గరలోని సెంటర్ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. క్వాలిఫయర్ పరీక్ష సాయంతో కోర్సులోకి ఎవరు చేరవచ్చో నిర్ణయిస్తారు. ఫౌండేషన్ సర్టిఫికెట్ కోర్సులో గణితం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక పాఠాలు వంటి ఎనిమిది కోర్సులుంటాయి. ఈ 8 సబ్జెక్టులను పూర్తిచేసి కోర్సు వదిలేయాలనుకునే వారికి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కొనసాగిస్తే.. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లలో డిప్లొమా చేయవచ్చు. కంపెనీల్లో పనిచేస్తూ నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వారు నేరుగా డిప్లోమా కోర్సులో చేరవచ్చు. వారానికి పది గంటల చొప్పున ఆన్లైన్ పాఠాలు, పరీక్షలుంటాయి. ఏడాది నుంచి రెండేళ్లలో ఈ దశను పూర్తిచేసిన వారికి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ సబ్జెక్టుల్లో విడివిడిగా డిప్లొమా అందిస్తారు. రెండు సబ్జెక్టుల్లోనూ డిప్లొమా అందుకునే అవకాశమూ ఉంది. డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనునుకునే వారు కోర్సును కొనసాగించవచ్చు కూడా. చివరగా డిగ్రీ కోర్సు పూర్తికి మూడు నుంచి ఆరేళ్లు పడుతుంది. తొలి రెండు దశలు పూర్తిచేసిన వారు లేదా నేరుగా డిప్లొమా కోర్సులో చేరి పూర్తిచేసిన వారు డిగ్రీ కోర్సు పూర్తి చేసేందుకు అర్హులు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు ఆప్షన్లలో రెండింటిని ఎంచుకుని కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫౌండేషన్ కోర్సుకైతే రూ.32 వేలు, డిప్లొమా కోర్సుకు రూ.1.10 లక్షలు, డిగ్రీ కోర్సుకు రూ.లక్ష ఫీజు. అంటే, ఇంటర్మీడియట్ తరువాత బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్ డిగ్రీ కోర్సు పూర్తికి రూ.2.42 లక్షలు ఖర్చవుతాయన్నమాట. వివరాలకు వెబ్సైట్: onlinedegree. iitm. ac. in -
ఇకపై ఆన్లైన్లో బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా డేటా సైన్స్‌కు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుతోంది. 2026 నాటికి ఈ రంగంలో దాదాపు 11.5 మిలియన్ల ఉద్యోగాలు లభ్యమవుతాయని అంచన. దానిని దృష్టిలో పెట్టుకొని డేటాసైన్స్‌లో ఆన్లైన్ ద్వారా సమగ్రమైన ఒక డిగ్రీని అందించే కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో మొదటిసారి ప్రోగ్రామింగ్ అండ్ డేటాసైన్స్‌లో ఆన్లైన్ బీఎస్సీకోర్సును మంగళవారం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేష్ పొక్రియల్ నిశాంక్ ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కోర్సును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీ, మద్రాస్) అందిస్తోంది. 12వ తరగతి పాస్ అయ్యి, 10వ తరగతిలో ఇంగ్లీష్, మ్యాథ్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. (ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1) ఈ కోర్సును మూడు స్టేజ్లలో అందించనున్నారు. ఫౌండేషన్ ప్రోగ్రాం, డిప్లమా ప్రోగ్రాం, డిగ్రీ ప్రోగ్రాం. అయితే ఏ స్టేజ్‌లో కావాలన్నా కోర్సును మధ్యలో ఆపేయవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా ఐఐటీ మద్రాస్ నుంచి పొందవచ్చు. (తాగునీటి శుద్ధికి జనుము + రాగి!) ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష అఫ్లికేషన్ ఫీజు రూ. 3000 ఉంటుంది. వారికి నాలుగు వారాల పాటు మ్యాథ్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్‌లో కోర్సు ఉంటుంది. వీరికి ఆన్లైన్లో విద్యాబోధన అందిస్తారు. వీరు ఆన్లైన్లో ఎసైన్మెంట్స్, నాలుగో వారం చివరిలో క్వాలిఫయింగ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటంతో 50శాతం పైగా ఉత్తీర్ణత సాధించిన వారిని ఈ ఫౌండేషన్ కోర్సుకు అర్హులుగా ఎంపిక చేస్తారు. (ప్రపంచం భారత్ వైపు చూస్తోంది!) -
తాగునీటి శుద్ధికి జనుము + రాగి!
సాక్షి, హైదరాబాద్: తాగునీటిలో హానికారక సూక్ష్మజీవుల చేరికను నిరోధించేందుకు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. చౌకగా అందుబాటులో ఉండే జనపనారకు రాగిపూత పూసి వాడటం ద్వారా తాగునీటి కాలుష్యాన్ని అడ్డుకోవచ్చునని, తద్వారా కలుషిత నీటితో వచ్చే వ్యాధులను నివారించవచ్చునని వీరు చెబుతున్నారు. బిందెలు, కుండల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం మనమందరం చేసే పనే. అయితే ఇలా నిల్వచేసిన నీటిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు ఉత్పత్తయ్యే అవకాశాలెక్కువ. ఈ సూక్ష్మజీవుల వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి అనేక రోగాలు వస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నీటిని కాచి వడబోసి వాడాలని చెబుతారు. కానీ నీటిని కాచేందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది. పైగా పర్యావరణానికీ అంత మంచిది కాదు. పోనీ రివర్స్ ఆస్మాసిస్ వంటి టెక్నాలజీలను వాడే వాటర్ ఫిల్టర్లను కొందామా? అంటే చాలామంది ఈ ఖర్చు భరించలేరు. వీటితో నీటివృథా కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో వీలైనంత చౌకగా నీటిని శుద్ధిచేసే లక్ష్యంతో మద్రాస్ ఐఐటీలోని రసాయన శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దిలీప్‌కుమార్ చాంద్ ప్రయోగాలు చేపట్టారు. జనుము, రాగితో మెరుగైన ఫలితాలు బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను చంపేందుకు రాగి భేషుగ్గా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. రాగి చెంబు లేదా గ్లాస్లో ఉంచిన నీటిని తాగడం కూడా ఇందుకే. అయితే ఒక పరిమితి దాటాక రాగితో మనిషికి ప్రమాదం ఏర్పడవచ్చునని, అది నీటిలోకి చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ దిలీప్‌కుమార్ చాంద్ తెలిపారు. రాగిని మెరుగ్గా వాడేందుకు తాము చేసిన పరిశీలనల్లో జనుము గురించి తెలిసిందని, చౌకగా లభించడం, నీటిపై తేలియాడే లక్షణం కారణంగా దీన్ని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. జనుమును చిన్నచిన్న పూసల్లా చేసి దానిపై కుప్రస్ ఆక్సైడ్ లేదా రాగిని పూతగా పూసి నీటిని నిల్వ ఉంచిన పాత్రలో వేస్తే వాటిల్లో సూక్ష్మజీవులు అసలు ఉత్పత్తి కాలేదని ప్రయోగపూర్వకంగా గుర్తించామని చెప్పారు. సాధారణ నీటితో పోల్చినప్పుడు ఐదు రోజుల తరువాత కూడా రాగితో కూడిన జనుము పూసలు ఉన్న నీటిలో బ్యాక్టీరియా అతి తక్కువగా పెరిగిందని తెలిపారు. ఈ ప్రయోగాల్లో ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఎన్.గుమ్మడి సత్యనారాయణ, రణధీర్ రై కూడా పాల్గొన్నారు. పరిశోధన వివరాలు ఏసీఎస్ ఒమేగా జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1
సాక్షి, న్యూఢిల్లీః 2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్–2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్ నల్సార్ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్ నైపర్ ఐదో స్థానంలో నిలిచింది. (అత్యధిక కేసులున్నా అదుపులోనే వైరస్!) కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్(టీఎల్ఆర్), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్(ఆర్పీ), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్(జీవో), ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్(పీఆర్) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్ ర్యాంకులు, ఇంజినీరింగ్ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్) టాప్–10 ఇండియా ర్యాంకులు (ఓవరాల్ కేటగిరీ) ఇనిస్టిట్యూట్ పేరు ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐఎస్సీ–బెంగళూరు 2 ఐఐటీ–ఢిల్లీ 3 ఐఐటీ–బాంబే 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–కాన్పూర్ 6 ఐఐటీ–గౌహతి 7 జేఎన్‌యూ–ఢిల్లీ 8 ఐఐటీ–రూర్కీ 9 బనారస్ హిందూ వర్శిటీ 10 యూనివర్శిటీ కేటగిరీలో టాప్–10 ర్యాంకులు ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు 1 జేఎన్‌యూ, న్యూఢిల్లీ 2 బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి 3 అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు 4 జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా 5 యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 6 కలకత్తా యూనివర్శిటీ, కోల్‌కతా 7 మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ 8 సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ, పూణే 9 జామియామిలియాఇస్లామియా, న్యూఢిల్లీ 10 ఇంజినీరింగ్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐటీ–ఢిల్లీ 2 ఐఐటీ–బాంబే 3 ఐఐటీ–కాన్పూర్ 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–రూర్కీ 6 ఐఐటీ–గౌహతి 7 ఐఐటీ–హైదరాబాద్ 8 ఐఐటీ–తిరుచిరాపల్లి 9 ఐఐటీ–ఇండోర్ 10 మేనేజ్మెంట్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐఎం–అహ్మదాబాద్ 1 ఐఐఎం–బెంగళూరు 2 ఐఐఎం–కలకత్తా 3 ఐఐఎం–లక్నో 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐఎం–కోజికోడ్ 6 ఐఐఎం–ఇండోర్ 7 ఐఐటీ–ఢిల్లీ 8 ఎక్స్ఎల్ఆర్ఐ 9 మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(గురుగ్రామ్) 10 కళాశాలల కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మిరండా హౌజ్ 1 లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ 2 హిందూ కాలేజ్, ఢిల్లీ 3 సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ 4 ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై 5 లయోలా కాలేజ్, చెన్నై 6 సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా 7 రామకృష్ణ మిషన్ విద్యామందిర, హౌరా 8 హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ 9 పీఎస్జీఆర్ కృష్ణమ్మల్ ఫర్ విమెన్, కోయంబత్తూర్ 10 ఫార్మసీ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు జామియా హమ్దర్ద్, న్యూఢిల్లీ 1 పంజాబ్ యూనివర్శిటీ, చంఢీగఢ్ 2 నైపర్, మోహలీ 3 ఐసీటీ, ముంబై 4 నైపర్, హైదరాబాద్ 5 బిట్స్, పిలానీ 6 మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మా సైన్సైస్, ఉడిపి 7 నైపర్, అహ్మదాబాద్ 8 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ 9 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 మెడికల్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఎయిమ్స్, న్యూఢిల్లీ 1 పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్ 2 క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్ 3 ఆర్కిటెక్చర్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ, ఖరగ్‌పూర్ 1 ఐఐటీ, రూర్కీ 2 ఎన్ఐటీ, కాలికట్ 3 న్యాయ విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు నేషనల్ లా స్కూల్, బెంగళూరు 1 నేషనల్ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ 2 నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ 3 దంత విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ 1 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి 2 డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠం, పూణే 3 -
టాప్‌లో నిలిచిన ఐఐటీ మద్రాస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ 2020 ఏడాదికి గాను నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు సంబంధించిన ర్యాంకులను వెల్లడించింది. ఈ జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీ మద్రాస్) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ట్విటర్లో వెబ్‌కాస్ట్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సంజయ్ ధోత్రే, ఏఐసీటీఐ చైర్మన్ అనిల్ సహస్రబుధే, యూజీసీ చైర్మన్ డీపీ సింగ్ పాల్గొన్నారు. (ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్ ) ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానాన్నిదక్కించుకుంది. ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ నాలుగు, అయిదు, ఆరవ స్థానంలో ఉన్నాయి. ఏడవ స్థానంలో జేఎన్‌యూ, ఎమిమిదవ స్థానంలో న్యూఢిల్లీ, తొమ్మిదవ స్థానంలో ఐఐటీ గువాహటి, పదవ స్థానంలో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం వారణాసి నిలిచాయి. కాగా కాలేజీలకు, వర్సిటీలకు జాతీయ స్థాయిలో సొంత ర్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో 2016 నుంచి తొమ్మిది విభాగాల్లో ర్యాంకులను కేటాయిస్తోంది. (అద్భుతమైన ఎంఐ నోట్‌బుక్స్ లాంచ్) నేషనల్యూ ఇన్నిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 15 స్థానం, ఐఐటీ హైదరాబాద్ 17వ స్థానం,ఆంధ్రా యూనివర్సిటీ 36వ స్థానం ఎన్ఐటీ 46వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 53 స్థానం, కేఎల్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ 70 వ స్థానంలో ఉన్నాయి. -
సీబీఐకి ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసు
సాక్షి, చెన్నై : ఐఐటీ మద్రాస్ విద్యార్ధిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. తమ కుమార్తె ఆత్మహత్య కేసును సీబీఐకి నివేదించాలని ఫాతిమా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు సంస్థకు కేసును బదలాయించింది. నవంబర్ 8న ఐఐటీ మద్రాస్‌లో హ్యుమనిటీస్ విద్యార్ధిని ఫాతిమా (19) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతోనే కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆశించిన మార్కులు రాకపోవడంతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ నిత్యం వేధిస్తుండటంతోనే తమ కుమార్తె మరణించిందని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్లోనూ ఇదే విషయం ఫాతిమా ప్రస్తావించిందని చెబుతున్నారు. ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తమ కుమార్తెను మతపరమైన వివక్షకు గురిచేశారని ఆమె తండ్రి ఆరోపించారు. -
చదువు చావుకొస్తోంది!
సాక్షి, చెన్నై: ఉన్నత విద్యకు నెలవుగా మారాల్సిన చెన్నై ఐఐటీ ఆత్మహత్యలకు కొలువుగా మారింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ప్రొఫెసర్ సహా తొమ్మిది మంది విదారి్థనీ, విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది. కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ (19) ఈ ఏడాది ఆగస్టులో చెన్నై ఐఐటీలో చేరింది. మూడు నెలల్లోనే మానసిక క్షోభకు గురై ఈనెల 9వ తేదీన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. చెన్నై ఐఐటీలో విదార్థిని, విద్యార్థులు ఆత్మహత్యకు దిగడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫాతిమా ఉదంతం తొమ్మిదోది. 2016లో పీహెచ్డీ విద్యార్థి, ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. (చదవండి: అది ఆత్మహత్యే) కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన సాహుల్గోర్నాథ్ 2018 సెపె్టంబర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ రిజిస్టర్లో హాజరీ దినాలు తక్కువయ్యాయనే ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 2018 డిసెంబర్లో ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అథితి సింహ విషం సేవించి ప్రాణాలుతీసుకుంది. కుటుంబ సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావించారు. ఈ ఏడాది జనవరిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంజనాకుమారీ అనే విద్యారి్థని, గోపాల్‌బాబు అనే విద్యార్థి వెంట వెంటనే బలవన్మరణానికి దిగారు. వేధింపుల వల్లనే రంజనాకుమారీ ఆత్మహత్య చేసుకుందని పేరుచెప్పేందుకు ఇష్టపడని సహ విద్యార్థులు తెలిపారు. ఈ కేసు విచారణలో ఇంత వరకు ఎలాంటి పురోగతీలేదు. ఇప్పటికీ ఆమె మరణం మర్మంగానే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంటెక్ విద్యార్థి గోపాల్‌బాబు మనోవేదనతోనే తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా వరుసగా ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నా ఐఐటీ యాజమాన్యం చేష్టలుడిగి చూస్తున్నట్లు దుయ్యబడుతున్నారు. ఇటీవలి కాలంలో కొత్త రిక్రూట్ అయిన ఉత్తర రాష్ట్రాలకు చెందిన యువ అసిస్టెంట్ ప్రొఫెసర్లు దక్షిణాది విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాది విద్యార్థులను చేరదీయడం, దక్షిణాది విద్యార్థుల పట్ల పరుషంగా ప్రవర్తించడం యువ ప్రొఫెసర్లకు పరిపాటిగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఐఐటీ యాజమాన్యం మాత్రం ఇదంతా క్రమశిక్షణలో భాగమేనని తేలిగ్గా తీసిపారేస్తోంది. దీంతో ఆత్మహత్యల సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కాగా ఫాతిమా ఆత్మహత్య కేసుకు సంబంధించి విద్యార్థులు, ప్రొఫెసర్లు కలుపుకుని ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు విచారించారు. సీఎం, డీజీపీలను కలిసిన ఫాతిమా తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ విదార్థిని ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్ శుక్రవారం ఉదయం కేరళ నుంచి చెన్నైకి చేరుకున్నారు. తన కుమార్తె మరణానికి ముగ్గురు ప్రొఫెసర్లు కారణమని ఫాతిమా తన సెల్ఫోన్లో నమోదు చేసినట్లు విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులకు ఆయన చెప్పారు. కుమార్తె ఆరోపించిన ముగ్గురు ప్రొఫెసర్లపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం సీఎం ఎడపాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. కుమార్తె మర్మమరణంపై తగిన విచారణ జరిపించాలని వారిని కోరాడు. -
ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం
సాక్షి, చెన్నై : ఐఐటీ – మద్రాసులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని ఫాతిమా లతీఫ్ మరణం కేసు మలుపు తిరిగింది. ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులతో ఆ యువతి బలన్మరణానికి పాల్పడినట్టుగా వెలుగు చూసింది. దీంతో ఫాతిమా మరణానికి న్యాయం కోరుతూ విద్యార్థులు చెన్నైలో ఆందోళన బాట పట్టారు. అడయార్‌లో ఐఐటీ –మద్రాసు క్యాంపస్ ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ విద్యా సంస్థలు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యషిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంగా ఇక్కడ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడడంపెరుగుతోంది. అయితే, పరీక్షల్లో తప్పడం, ఎంపిక చేసుకున్న కోర్సుల మీద ఆసక్తిలేక పోవడం, మానసిక ఒత్తిడి అంటూ విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడుతున్నట్టుగా అక్కడి నిర్వాహకులు పేర్కొంటున్నా, ఒత్తిళ్ల ఆరోపణలు గుప్పించే వాళ్లు ఎక్కువే. ఈనేపథ్యంలో కేరళ రాష్ట్రం కొల్లం కిలికొళ్లురు గ్రామానికి చెందిన ఫాతిమా లతీఫ్(19) తొలి సంవత్సరం ఎంఏ చదువుతున్నది. ప్రతి రోజూ ఇంటికి తప్పని సరిగా ఫోన్ చేసినానంతరం నిద్ర పోవడం ఫాతిమాకు అలవాటు. శనివారం రాత్రి ఆమె తల్లి సజిత లతీఫ్ కుమార్తెకు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో ఆమె స్నేహితురాలికి ఫోన్ చేశారు. ఆమె గదికి స్నేహితురాలు వెళ్లి చూడగా, తలుపులు తెరచుకోలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది తలుపు పగల కొట్టి లోనికి వెళ్లగా,అ క్కడ ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఫాతిమా వేళాడుతుండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న కోట్టూరు పురం పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసును ఆత్మహత్యగా నమోదు చేసినా అసలు ట్విస్టు అన్నది తాజాగా బయట పడింది. తండ్రికి సమాచారం... ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్ విదేశాల్లో ఉన్నారు. ఆయనకు ఫాతిమా ఓ సమాచారాన్ని పంపించి ఉన్నది. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తీవ్రంగా వేదిస్తున్నారని, వారి వేధింపులు తాళ లేక బలన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు వివరించి ఉండటం వెలుగు చూసింది. ఈ విషయాన్ని కోట్టూరు పురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో కొల్లం మేయర్‌గా ఉన్న అబ్దుల్ లతీఫ్ స్నేహితుడు రాజేంద్ర బాబుతో కలిసి ఫాతిమా సోదరి అయ్యేషా కేరళ సిఎం పినరాయ్‌విజయన్ కలిశారు. దీంతో వ్యవహారం ముదిరింది. అక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి కార్యాలయానికి, డీజీపికి సమాచారం రావడంతో కోట్టూరు పురం పోలీసులకు ముచ్చమటలు తప్పలేదు. బుధవారం తమ విచారణను వేగవంతం చేశారు. దీంతో ఫాతిమా మరణం వెనుక ప్రొఫెసర్ల వేదింపులు ఉన్నట్టుగా తేలి ఉన్నది. ఇప్పటి వరకు 11 మంది ప్రొఫెసర్ల వద్ద కోట్టూరు పురం పోలీసులు విచారించినట్టు సమాచారం. అయితే, ఆ ముగ్గురు ప్రొఫెసర్లను సస్పెండ్ చేయాలని , వారి మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, క్యాంప్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఐఐటీని ముట్టడించేందుఉ ఆ ఫ్రంట్ వర్గాలు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. ప్రొఫెసర్ల వేదింపులతో గత కొన్ని నెలల్లో ఐదు మంది విద్యార్థులు బలన్మరణానికి పాల్పడి ఉన్నారని, ఈ కేసుల మీద కూడా విచారణ జరగాలని, విద్యార్థుల మరణాలకు న్యాయంజరగాలని పట్టుబడుతూ వారు ఆందోళనను ఉధృతంచేశారు. దీంతో వారిని బుజ్జగించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. దీంతో ఐఐటీ పరిసర మార్గాల్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
మోదీ స్పీచ్‌కు చెక్ : డీడీ అధికారిపై వేటు
చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ మద్రాస్‌లో చేసిన ప్రసంగం ప్రసారాన్ని నిలిపివేసినందుకు చెన్నై దూరదర్శన్ కేంద్రం అధికారిపై ప్రసార భారతి వేటు వేసింది. ప్రధాని ప్రసంగం ప్రసారాన్ని డీడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వసుమతి అడ్డుకున్నారనే అభియోగాలపై ఆమెను ప్రసారభారతి సస్పెండ్ చేసింది. సీనియర్ అధికారుల నుంచి అనుమతి ఉన్నా ప్రధాని ప్రసంగాన్ని డీడీ పొదిగై టీవీ ప్రసారం చేయలేదని సమాచారం. వసుమతిని సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణం పేర్కొనకపోయినా ప్రధాని ప్రసంగం వ్యవహారంపైనే ఆమెపై చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సెప్టెంబర్ 30న వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉందా అని అసిస్టెంట్ డైరెక్టర్ వసుమతి తన ఉన్నతాధికారులకు ఈమెయిల్ చేయగా ప్రధాని ప్రసంగాన్ని లైవ్ ఇవ్వాలని వారు బదులిచ్చినట్టు ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. స్పష్టమైన ఉత్తర్వులున్నా అసిస్టెంట్ డైరెక్టర్ వసుమతి ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నారని ప్రసార భారతి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు 1965 కింద వసుమతిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రసార భారతి వెల్లడించింది. -
ప్రపంచం భారత్ వైపు చూస్తోంది!
చెన్నై: భారత్ వైపు ప్రపంచం ఒక ఆశావహ దృక్పథంతో చూస్తోందని, భారతీయ యువత శక్తి సామర్థ్యాలపై ప్రగాఢ విశ్వాసం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘అమెరికా పర్యటన నుంచి రెండు రోజుల క్రితమే తిరిగొచ్చాను. అక్కడ పలు దేశాల అధినేతలతో, బిజినెస్ లీడర్లతో, పెట్టుబడిదారులతో భేటీ అయ్యాను. ప్రతీ భేటీలోనూ ఒకటి ప్రత్యేకంగా నాకు కనిపించింది. అది భారత్ పట్ల సానుకూల ధోరణి.. భారతీయ యువత సామర్ధ్యంపై నమ్మకం’ అని వివరించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. ‘ప్రపంచమంతా వినూత్న అవకాశాల దేశంగా భారత్ వైపు చూస్తున్న తరుణంలో మీరు ఈ కాలేజ్ నుంచి డిగ్రీతో బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మీ ముందు ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. కానీ మీకు నాదో విన్నపం. ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా.. మీ మాతృదేశ అవసరాలను గమనించండి. మీ పని, మీ ఆవిష్కరణ, మీ పరిశోధన మీ సోదర భారతీయుడికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ ఉండండి’ అని విద్యార్థులను కోరారు. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేశారన్నారు. వారిలో మీ సీనియర్ల పాత్ర చాలా కీలకమని ఐఐటీ విద్యార్థులకు గుర్తు చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనూ ఐఐటీ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులవుతున్నారని, ఈ విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఈ విధంగా కూడా దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘కార్పొరేట్ ప్రపంచంలోనూ మీరున్నారు. దేశాభివృద్ధిలో మీ పాత్ర కీలక’మన్నారు. ‘కాలేజ్ లైఫ్‌ను ఇకపై మీరు కోల్పోతున్నారు. ఇక ఖరీదైన పాదరక్షలను మీరు కొనుక్కోవచ్చు’ అని చమత్కరించారు. ఐఐటీ మద్రాసు క్యాంపస్‌లోకి వచ్చి ఖరీదైన దుస్తులు, పాదరక్షలు, వస్తువులు ఎత్తుకుపోతున్న కోతుల బెడదను ఉద్దేశించి మోదీ అలా వ్యాఖ్యానించారని కాలేజీ వర్గాలు తెలిపాయి. గృహావసరాలకు వాడుతున్న నీటిని పునర్వినియోగించడంపై, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌కు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు మోదీ సూచించారు. అలాగే, విద్యార్థులు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ఫిట్నెస్ పైన దృష్టిపెట్టాలని కోరారు. అంతకుముందు ‘సింగపూర్, ఇండియా హ్యాకథాన్ 2019’ విజేతలకు మోదీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ అవసరాలను తీర్చగల సాంకేతిక ఆవిష్కరణలను భారత్ రూపొందించగలదన్నారు. పాఠశాలల నుంచి కళాశాలల వరకు అన్ని చోట్ల.. ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందన్నారు. అమెరికాలో తమిళం ప్రతిధ్వనిస్తోంది చెన్నై పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలను వణక్కం(నమస్కారం) అంటూ తమిళంలో పలకరించారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అక్కడ తమిళంలో ఓ వాక్యం పలికారు. ‘చెన్నై ప్రజలను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని తమిళంలో అని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఆ కార్యక్రమంలోనూ, తర్వాత ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవంలోనూ తమిళంపై మోదీ ప్రశంసలు కురిపించారు. అమెరికా అంతా తమిళం ప్రతిధ్వనిస్తోందని ఇటీవలి అమెరికా పర్యటనలో తనకు స్పష్టమైందన్నారు. చెన్నై ఇచ్చిన ఆతిథ్యం అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇడ్లీ, సాంబారు, వడ, దోస చాలా బావున్నాయన్నారు. న్యూయార్క్‌లో ఐరాస వేదికపై నుంచి ప్రసంగించిన సమయంలోనూ తమిళ భాషను ప్రధాని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష తమిళమని పేర్కొన్నారు. ప్రసిద్ధ తమిళ కవి కనియన్ పూంగుంద్రనర్ కవితా పంక్తిని కూడా ఉటంకించారు. దేశానికి ఒక జాతీయ భాషగా హిందీ ఉండాలన్న అమిత్‌షా వ్యాఖ్యలకు నష్టపరిహారంగా మోదీ తమిళబాట పట్టారని విశ్లేషకుల అంచనా. -
5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే..
చెన్నై : 2024 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగడంలో ఐఐటియన్ల వినూత్న సాంకేతికత కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ మద్రాస్ 56వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగిస్తూ భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోందని, ఈ స్వప్నం సాకారమయ్యేందుకు మీ వినూత్న సాంకేతికత, ఆకాంక్షలు, ఉత్సాహం బాటలు వేస్తుందని వ్యాఖ్యానించారు. ఐఐటియన్లలో తాను నవ భారత స్ఫూర్తిని చూస్తున్నానని చెప్పుకొచ్చారు. మీ ముందున్న తాను నవ భారతాన్ని, మినీ భారతాన్ని చూడగలుగుతున్నాని..మీలో శక్తి, ఉత్సాహం, సానుకూల దృక్పథం మన స్వపాల్నను నెరవేర్చుకునేందుకు దోహదపడతాయని అన్నారు. మీ కళ్లలో భవిష్యత్ స్వప్నాలను తాను వీక్షిస్తున్నానని, దేశ భవిష్యత్ గమ్యం మీ కళ్లలో దాగుందని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత పురాతన భాషల్లో ఒకటైన తమిళ భాష తమిళనాడులో వేళ్లూనుకుందని అన్నారు. ఐఐటీ మద్రాస్ అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్ధని ఆయన అభివర్ణించారు. -
ధోని టాస్ గెలిస్తే ఏం చేస్తాడు: ఐఐటీ మద్రాస్
హైదరాబాద్: ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఐఐటీ మద్రాస్ సోమవారం నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రశ్న అడిగి విద్యార్థులను ఆశ్చర్యపరిచింది. మంగళవారం చెపాక్ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ ఎంచుకోవాలా అనే ప్రశ్నను సంధించింది. మ్యాచ్ జరగడానికి ముందు రోజు నిర్వహించిన మెటీరియల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ పేపర్లో ఇదే తొలి ప్రశ్న కావడం విశేషం. క్రికెట్ అంటే ఇష్టపడే చాలా మంది విద్యార్థులనే కాదు.. ఐసీసీని కూడా ఈ ప్రశ్న ఆకర్షించింది. ప్రొఫెసర్ విఘ్నేష్ రూపొందించిన ఈ ప్రశ్నను మ్యాచ్ జరగడానికి ముందే ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రసుత్తం ఐసీసీ చేసిన ట్వీట్ తెగత వైరల్ అవుతోంది. ‘డై అండ్ నైట్ మ్యాచ్‌ల్లో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. అవుట్ ఫీల్డ్‌పై మంచు అధికంగా కురవడం వల్ల బంతి తడిగా మారుతుంది. దీంతో బంతిపై పట్టు సాధించడం స్పిన్నర్లకు కష్టం అవుతుంది. ఫాస్ట్ బౌలర్లు కూడా నిర్దేశించిన చోట బంతిని విసరలేరు. దీంతో మంచు ఎక్కువగా ఉండటం రాత్రి పూట ఫీల్డింగ్ చేసే జట్టుకు ప్రతికూలంగా మారుతుంది. ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ మే 7న చెపాక్ స్టేడియంలో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది. ఆ రోజున చెన్నైలో గాలిలో తేమ 70 శాతం ఉండొచ్చు. ఆట ప్రారంభంలో ఉష్ణోగ్రత 39 డిగ్రీలు ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి అది 27 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమాచారం ఆధారంగా ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ చేయాలా?’ అనే ప్రశ్నను విద్యార్థులకు సంధించారు. ఈ ప్రశ్నను రూపొందించిన ప్రొఫెసర్ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘32-33 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరితే మంచు ప్రభావం ఉంటుంది. ముంబైతో మ్యాచ్ జరిగే రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ సమయానికి 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.. దీంతో కచ్చితంగా మంచు కురుస్తుంది. కాబట్టి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం తెలివైన నిర్ణయం’అంటూ వివరించాడు. అనుకున్నట్టే టాస్ గెలిచిన చెన్నై సారథి ధోని తొలుత బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. బ్యాట్స్‌మెన్ వైపల్యానికి తోడు ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే నిర్దేశించిన స్వల్పలక్ష్యాన్ని ముంబై ఆడుతూ పాడుతూ ఛేదించడంతో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఐఐటీ ప్రొఫెసర్లా ధోని ఆలోచించలేకపోయాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూన్నారు. View this post on Instagram Shout out to Professor Vignesh at @iit_madras for making exams relevant to important, real-life issues! Can anyone help @mahi7781 and @chennaiipl make a decision before the toss tomorrow? (and show your workings 😜) #LoveCricket #Cricket #Madras A post shared by ICC (@icc) on May 6, 2019 at 7:20am PDT -
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్
న్యూఢిల్లీ: భారత్‌లోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఐఐటీ–మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా రూపొందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యా సంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, జేఎన్‌యూ, బీహెచ్‌యూ ఆతర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే కళాశాల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని మిరండా కాలేజీ అగ్రస్థానం దక్కిచుకుంది. మరోవైపు అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థలు సత్తా చాటాయి. టాప్–10లో ఏకంగా 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–ముంబై తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్మెంట్ విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) తొలి 10 స్థానాల్లో ఆరింటిని దక్కించుకున్నాయి. వీటిలో ఐఐఎం–బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, ఐఐఎం–ఢిల్లీ, ఐఐఎం–ముంబై, ఐఐఎం–రూర్కీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉన్నతవిద్య విషయంలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంపై రాష్ట్రపతి కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. -
రోజుకు 2 సెషన్లలో ‘గేట్’
సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పూర్తిస్థాయి షెడ్యూలు జారీ అయింది. దేశంలోని ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో 2019–20 విద్యా సంవత్సరంలో ఎంటెక్‌లో ప్రవేశాలకు గత ఆగస్టులోనే నోటిఫికేషన్ జారీ చేసిన ఐఐటీ మద్రాసు పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూలును బుధవారం జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షను ఐఐఎస్సీ బెంగళూరు, ఏడు ఐఐటీల నేతృత్వంలో నిర్వహించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించాయి. గత సెప్టెంబర్‌లోనే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఐఐటీ మద్రాస్ స్వీకరించారు. 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10 తేదీల్లో గేట్‌ను నిర్వహిస్తామని వెల్లడించింది. రోజూ 2 సెషన్లుగా 4 రోజుల పాటు 24 సబ్జెక్టుల్లో గేట్ నిర్వహించనుంది. 2019లో స్టాటిస్టిక్స్ సబ్జెక్టులోనూ ప్రవేశాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. పరీక్షల కోసం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్ పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులను పరీక్ష హాల్లోకి 40 నిమిషాల ముందునుంచే అనుమతిస్తారు. ఉదయం సెషన్లో 10 గంటల తర్వాత, మధ్యాహ్నం సెషన్ వారిని 3 గంటల తర్వాత అనుమతించరు. నెగటివ్ మార్కుల విధానం ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. పరీక్ష ఫలితాలు 2019 మార్చి 16న విడుదల అవుతాయి. పెరిగిన ప్రాధాన్యం.. ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు తాము చేపట్టే నియామకాల్లో గేట్ స్కోర్‌కు ప్రాధాన్యం ఇస్తుండటంతో తెలంగాణ నుంచి గేట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బీహెచ్ఈఎల్, గెయిల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఐవోసీఎల్, ఎన్టీపీసీ, ఎన్పీసీఐఎల్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వంటి సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. అలాగే కేంద్రం గ్రూప్–ఏ కేటగిరీలోని సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్; సీనియర్ రీసెర్చ్ ఆఫీ సర్ వంటి పోస్టులను కూడా గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తోంది. అయితే గేట్ నిర్వహణ సంస్థకు, ఉద్యోగ నియామకాలకు సంబంధం లేదని, అది అభ్యర్థులే చూసుకోవాలని ఐఐటీ మద్రాసు స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ కోర్సు ల్లో పరిశోధన విద్యార్థులు ఆర్థి«క సాయం పొందేందుకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి ఇచ్చే స్కాలర్షిప్లు పొందేందుకు గేట్లో అర్హత సాధించాలి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. గేట్ స్కోర్‌ను ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మూడేళ్ల పాటు పరిగణనలోకి తీసుకుంటారు. -
మన దేశంలో 3డీ ఇళ్లు!
చెన్నై: మరో ఏడాదిలో దేశంలో 3డీ ప్రింటెడ్ ఇళ్లు దర్శనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్‌కు చెందిన పూర్వ విద్యార్థులు (త్వస్త మ్యాన్‌ఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ స్టార్టప్) కేవలం రెండు రోజుల్లోనే దేశీ టెక్నాలజీతో విజయంతంగా 3డీ ప్రింటెడ్ ఇల్లును నిర్మించారు. ఐఐటీఎమ్ క్యాంపస్‌లోనే నిర్మించిన ఈ నమునాను ఏడాదిలోగా పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకురానున్నట్లు త్వస్త సహా వ్యవస్థాపకుడు ఆదిత్య వీఎస్ తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయల కొరత, తలదాచుకోవడానికి ఇళ్లు కూడా లేనివారే ఈ నిర్మాణాలకు ప్రేరణ అని పేర్కొన్నారు. స్వచ్ఛ్భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అందరికీ ఇళ్లు)పథకాలను 3డీ ప్రింటింగ్‌తో సాకారం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ప్రమాణాలతో కూడిన ఇళ్లను నిర్మించడానికి పలు పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కలసి పనిచేస్తున్నట్లు ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కొషి వర్ఘేస్ వెల్లడించారు. ఈ నిర్మాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్‌ను వాడుతున్నామని, మరోవైపు సహజమైన పదార్థాలతో సిమెంట్ తయారు చేయడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నమునా ఇంటి నిర్మాణానికి రెండు రోజులు పట్టినా 320 చదరపు అడుగుల ఇంటిని అన్ని హంగులతో వారం రోజుల్లో పూర్తి చేయగలమని త్వస్త వ్యవస్థాపకులు పరివర్తన్‌రెడ్డి, విద్యాశంకర్, సంతోష్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
నయా ఏసీలతో భలే మేలు..!
ఈ రోజుల్లో ఇళ్లల్లో.. షాపింగ్‌మాల్స్‌లో.. రెస్టారెంట్లలో.. ఎక్కడకు వెళ్లినా ఏసీలు తప్పనిసరి! చల్లదనం మాటెలా ఉన్నా.. వీటిల్లో వాడే రసాయనాల పుణ్యమా అని.. పర్యావరణానికి కలుగుతున్న నష్టం ఇంతింత కాదు! మరి తరుణోపాయం..? కార్బన్ డయాక్సైడ్ అంటోంది ఐఐటీ మద్రాస్! పర్యావరణ కాలుష్యానికి విరుగుడుగా కార్బన్ డయాక్సైడ్ వాడకం ఎలాగో తెలుసుకునే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం రిఫ్రిజరేటర్లు, భారీస్థాయి ఏసీల్లోనూ హైడ్రోఫ్లోరో కార్బన్స్ (హెచ్ఎఫ్సీ) అనే శీతలీకరణ రసాయనాలను వాడుతున్నాం. ఓజోన్ పొరకు నష్టం కలుగుతోందన్న కారణంతో ఒకప్పుడు వాడిన క్లోరోఫ్లోరో కార్బన్స్ స్థానంలో ఈ కొత్త రసాయనాలు వచ్చాయి. మొదట్లో అంతా బాగుందని అనుకున్నా.. ఈ హెచ్ఎఫ్సీలు కార్బన్ డయాక్సైడ్ కంటే కొన్ని వందల, వేల రెట్లు ఎక్కువ ప్రమాదకరమని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వాతావరణంలోకి చేరే కార్బన్ డయాక్సైడ్ సహజసిద్ధంగా నాశనమయ్యేందుకు వంద సంవత్సరాలు పడుతుందని అనుకుంటే.. హెచ్ఎఫ్సీలు కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2100 నాటికి ఒక్క హెచ్ఎఫ్సీల కారణంగానే భూమి ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరుగుతుందని అంచనా. సమస్య ఇంత తీవ్రంగా ఉన్న కారణంగానే ఈ హెచ్ఎఫ్సీల వాడకాన్ని 2050 నాటికల్లా కనీసం 90 శాతం తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఇందుకు తగ్గట్టుగానే హెచ్ఎఫ్సీలకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఇప్పటికే కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేసినప్పటికీ లోటుపాట్లు ఎక్కువగా ఉన్న కారణంగా అవేవీ విస్తృతంగా వాడకంలోకి రాలేదు. గతంలో వాడిందే మళ్లీ.... రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణ కోసం ఒకప్పుడు కార్బన్ డయాక్సైడ్నే వాడేవారు. అయితే అధిక ఒత్తిడికి గురిచేసి వాడాల్సి ఉండటం.. మరమ్మతుల సమయంలో ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. 19వ శతాబ్దపు చివరినాటికి కృత్రిమంగా తయారు చేసిన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాడకం మొదలైంది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త ప్రకాశ్ మయ్యా కార్బన్ డయాక్సైడ్ రిఫ్రిజరేషన్పై ప్రయోగాలు మొదలుపెట్టారు. నార్వే సంస్థతో కలసి చేపట్టిన ఈ ప్రయోగాల ఫలితంగా ఓ నమూనా రిఫ్రిజరేటర్ సిద్ధమైంది. రెండు ప్రయోజనాలు... కార్బన్ డయాక్సైడ్ శీతలీకరణ రసాయనంగా వాడే ఏసీల వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. భవనాల్లోపలి భాగాలకు చల్లదనం అందించడం ఒక ప్రయోజనమైతే.. ఈ క్రమంలో వెలువడే వేడిని కూడా ఒడిసిపట్టుకోగలగడం రెండోది. ఆసుపత్రులతోపాటు కొన్ని ఇతర చోట్ల ఒకపక్క చల్లదనం పొందుతూనే ఇంకోపక్క వేడినీటిని సిద్ధం చేసుకోవచ్చునన్నమాట. థర్మల్ పవర్ స్టేషన్లు మొదలుకొని చాలా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కార్బన్ డయాౖక్సైడ్ను అక్కడికక్కడే సేకరించి శీతలీకరణ కోసం వాడుకోవచ్చు కాబట్టి ఈ కొత్త ఏసీలకయ్యే ఖర్చు చాలా తక్కువగానే ఉంటుందని అన్నారు. స్పెయిన్‌లోని వెలంసియాలో ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఈ కొత్త టెక్నాలజీకి మంచి ఆదరణ లభించింది. ఆ సదస్సులో పాల్గొన్న ప్రకాశ్ మయ్యా మాట్లాడుతూ ‘‘పర్యావరణ అనుకూల శీతలీకరణ రసాయనాల తయారీకి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. సూపర్ మార్కెట్లు, ఆసుపత్రుల్లోనూ తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని కల్పించేందుకు అనువైన టెక్నాలజీ ఇది’’అని అన్నారు. విద్యుత్ వినియోగంలో 20 శాతం తగ్గుదల సాధారణ ఏసీలతో పోలిస్తే 20 శాతం తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే ఈ నమూనా ఏసీ ఎక్కువ చల్లదనాన్ని కూడా అందిస్తుందని, ఏడాదిగా తాము దీన్ని విజయవంతంగా నడుపుతున్నామని ప్రకాశ్ మయ్యా బృందంలోని శాస్త్రవేత్త సిమర్‌ప్రీత్ సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. యూరప్‌లోనూ కార్బన్ డయాక్సైడ్ సాయంతో పనిచేసే ఏసీలు ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణాల్లో అవి పనిచేయవని చెప్పారు. తాము తయారు చేసిన నమూనా మాత్రం 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసిందని.. పరిసరాలను చల్లబరిచిందని వివరించారు. అయితే ప్రస్తుతానికి పది టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న ఏసీలతోనే వాడాల్సి ఉంటుందని.. వ్యక్తిగత స్థాయిలో తయారీకి మరికొంత కాలం పడుతుందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
డయాబెటిస్ పేషెంట్లకు శుభవార్త
సాక్షి, చెన్నై : డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి శుభవార్త. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చినప్పడు డయాబెటిస్తో బాధపడే వారిలో గాయాలు అంత తొందరగా మానవు. ఒక్కోసారి దీర్ఘకాలిక గాయాలు పెను ప్రమాదానికి కూడా దారి తీసే అవకాశం లేకపోలేదు. వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెందినా.. ఈ విషయంలో అనుకున్న ప్రగతి సాధించలేకపోయింది. తాజాగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన విద్యార్థులు దీనికి పరిష్కారానికి కనుగొన్నారు. డయాబెటిస్ పేషెంట్లకు అయిన గాయాలు త్వరగా నయం అయ్యేట్లు ప్రత్యేక డ్రెసింగ్ విధానాన్ని రూపొందించారు. గాయం ఏర్పడిన ప్రాంతంలో కొత్త కణాలు త్వరగా ఉత్పత్తి కావడానికి గ్రాఫిన్ ఆధారిత డ్రెసింగ్ విధానాన్ని కనుగొన్నారు. త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ తెలిపారు. ‘సైలియం, గ్రాఫిన్ ఆక్సైడ్ నానో కంపోజిట్ మంచి ఫలితాలు ఇచ్చాయి. గ్రాఫిన్ ఆధారంగా అతి తక్కువ ధరలో ట్రీట్మెంట్ అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. సాధారణ వ్యక్తులకు గాయాలైనప్పుడు ఈ డ్రెసింగ్ విధానాన్ని ఉపయోగిస్తే 23 రోజుల్లో నయం కావాల్సిన గాయం.. కేవలం 16 రోజుల్లో నయమవుతుంది. అలాగే డయాబెటిస్ పెషెంట్లలో 26 రోజుల్లో నయమయ్యే గాయం 20 రోజుల్లోనే తగ్గిపోతుంది’ అని ఆయన వెల్లడించారు. డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
టెకీలకు గుడ్‌న్యూస్
సాక్షి,చెన్నై: క్యాంపస్ రిక్రూట్మెంట్లతో ఉన్నత విద్యా సంస్థలు కళకళలాడనున్నాయి. ఆర్థిక మందగమనం క్రమంగా తొలగిపోతుండటంతో దిగ్గజ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లతో తాజా నైపుణ్యాలను సమీకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. డిసెంబర్ 1నుంచి ప్రారంభమయ్యే ఐఐటీ మద్రాస్ వార్షిక ప్లేస్‌మెంట్స్‌లో తొలిసారిగా యాపిల్, యూఐడీఏఐ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న కంపెనీల్లో దాదాపు 15 శాతం సంస్థలు తొలిసారి ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో యూబీఎస్ ఏజీ, నాస్డాక్ స్టాక్ మార్కెట్, అల్వారెజ్,మర్సాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ గార్డెన్,హల్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెకిసూ కెమికల్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. మొత్తం 400 జాబ్ ప్రొఫైల్స్‌తో 270 కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకున్నాయి. గత ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో 250 కంపెనీలు పాల్గొన్నాయి. ఇక ఈ ఏడాది పార్టిసిపెంట్స్‌లో 43 శాతం రిక్రూటర్స్ ఇంజనీరింగ్, ఆర్అండ్డీ నుంచి, 25 శాతం ఫైనాన్స్ రంగం, 32 శాతం కంపెనీలు ఐటీ రంగం నుంచి పాల్గొంటున్నాయి. 2017-18 క్యాంపస్ రిక్రూట్మెంట్ తొలిదశ డిసెంబర్ 1 నుంచి 10 వరకూ జరుగుతుందని ఐఐటీ మద్రాస్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ 50 స్టార్టప్‌లకు శ్రీకారం చుట్టనుంది. -
ఆస్పిరిన్ మాత్రలతో క్యాన్సర్ మాయం!
ప్రాణాంతకమైన క్యాన్సర్ జబ్బును తలనొప్పికి వాడే ఆస్పిరిన్ అనే చౌకైన మాత్రలతో నయం చేయొచ్చని మద్రాస్ ఐఐటీకి చెందిన పరిశోధక బృందం చెబుతోంది. ఆస్పిరిన్ మాత్రల్లోని క్యాల్షియం అయాన్లు క్యాన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాల్లోకి వెళతాయని, అక్కడ అవి ఆహారాన్ని ఇంధనంగా మార్చకుండా మైటోకాండ్రియాను అడ్డుకుంటాయని, పర్యవసానంగా క్యాన్సర్ కణాలకు ఇంధనం అందక అవి మరణిస్తాయని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బోరా మీడియాకు తెలిపారు. అయితే మరింత సమర్థంగా పనిచేసేలా ఆస్పిరిన్ మందును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. క్యాన్సర్‌ను శాశ్వతంగా నివారించేందుకు మందులు లేవని, మందుతో రోగి జీవితకాలాన్ని మాత్రమే పొడిగించవచ్చని, క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనదనే అపోహలు పలు దేశాల ప్రజల్లో ఉన్నాయి. వీటిని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల నుంచి చికిత్స పేరిట కోట్లాది రూపాయలను గుంజుతున్నాయి. బీ–17 లోపం వల్లనే క్యాన్సర్లు వస్తాయని, వాటిని అరికట్టడం కూడా తేలికేనని కూడా ఇటీవల కొంతమంది నిపుణులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఆస్పిరిన్ మాత్రలతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చన్నది పూర్తిస్థాయిలో రుజువైతే.. అది వైద్య చరిత్రలో పెద్ద ముందంజ అవుతుంది. భారత జాతీయ వైద్య మండలి లెక్కల ప్రకారం 2016 నాటికి దేశంలో 14.5 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. వీరి సంఖ్య 2020 నాటికి 17 లక్షలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. -
బులెటిన్ బోర్డ్
ఐఐటీ మద్రాస్‌లో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మద్రాస్(ఐఐటీ–ఎం)వివిధ విభాగాల్లో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అప్లైడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో పీహెచ్డీ లేదా తత్సమానమైన కోర్సు. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇండస్ట్రియల్/రీసెర్చ్/టీచింగ్ విభాగంలో ఆరేళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మూడేళ్లు ఉద్యోగానుభవం ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల అభ్యర్థులు ఆరేళ్ల ఉద్యోగ కాలంలో కనీసం మూడేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ /సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 35 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులుwww.iitm.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాన్ని ప్రింటవుట్ తీసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి కవర్లో ఉంచి ‘డీన్ (అడ్మినిస్ట్రేషన్), ఐఐటీ మద్రాస్, చెన్నై–600036’ చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 23, 2017. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iitm.ac.in -
ఐఐటీ మద్రాసు వెబ్ సైట్ హ్యాక్
ఐఐటీ మద్రాసు వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు అందులో పాకిస్తాన్ నినాదాలను పోస్టు చేశారు. సంస్ధ వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన విద్యార్ధులు హ్యాకర్ల రాతలను చూసి షాక్ కు గురయ్యారు. ఫైజల్1337ఎక్స్ అనే హ్యాకర్ ఈ పనికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ హ్యాకర్స్ శక్తిని మీరు ఇంకా రుచి చూడలేదంటూ ఫైజల్1337ఎక్స్ వ్యాఖ్యానాలు చేశాడు. వెబ్సైట్ హ్యాక్ అయిన విషయాన్ని కొందరు విద్యార్ధులు తన దృష్టికి తీసుకువచ్చారని ఐఐటీ మద్రాస్ అధికార ప్రతినిధి వెంకట్రామన్ మీడియాతో తెలిపారు. కొద్ది సేపటి తర్వాత వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. -
ఆమె ఫోన్ చేసింది
చెన్నై: మద్రాస్ ఐఐటీ నుంచి అదృశ్యమైన తెలుగు విద్యార్ధిని వేదాంతం ఎల్ ప్రత్యూష (20) కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడింది. అయితే ఎక్కడి నుంచి మాట్లాడిందనే విషయం వెల్లడించలేదు. తన కూతురు ఫోన్ లో మాట్లాడిందని గుంటూరులోని బ్రాడీపేటలో ఉంటున్న ప్రత్యూష తల్లి తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, తన గురించి కంగారు పడొద్దని ప్రత్యూష చెప్పిందన్నారు. అయితే తమ కుమార్తె భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రత్యూష ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్లో ఉంటున్న ఆమె హిమాలయాలకు వెళుతున్నట్టు లేఖ రాసి అదృశ్యమైంది. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్‌కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
మద్రాస్ ఐఐటీలో కడప విద్యార్థి ఆత్మహత్య
చెన్నై: ప్రఖ్యాత మద్రాస్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఏపీలోకి కడప జిల్లాకు చెందిన నరం నాగేందర్ రెడ్డి మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్ ఆవరణలోనే సోమవారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం గానీ నాగేందర్ మరణ వార్తను ఐఐటీ ఉన్నతాధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతానికి నాగేందర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నప్పటికీ దర్యాప్తు అనంతరమే మొత్తం విషయం బయటకువచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సాఫ్ట్వేర్ కొలువు నుంచి సివిల్స్ వైపు
ఐఐటీ మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా అందుకుని ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలైన అమెజాన్, గూగుల్ల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించాడు. కానీ ఇవేవీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు. సమాజంపై తనకున్న అవగాహన, సేవా భావంఅతడిని సివిల్ సర్వీసు వైపు మరల్చాయి. భారీ వేతన ప్యాకేజీలను కాదనుకుని దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన సీఎం సాయికాంత్ వర్మ.సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2014లో సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. మాది కర్నూలు జిల్లా. నాన్న చంద్రకాంత్ రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ రిటైర్ట్ ఉపాధ్యాయురాలు. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది. 2011లో ఐఐటీ మద్రాసులో కంప్యూటర్ సైన్స్‌లో డ్యుయల్ డిగ్రీ పూర్తి చేశాను. ఆమెజాన్, గూగుల్ సంస్థల్లో పనిచేశాను. సమాజంపై నాకున్న అవగాహన, సేవా భావం దృష్ట్యా సివిల్ సర్వీసులను ఎంచుకున్నాను. అన్న శశికాంత్ వర్మ నాకు స్ఫూర్తి. ఆయన గెడైన్స్‌తోనే సివిల్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభించాను. స్వీయ ప్రణాళికే ప్రధానం సివిల్స్ ప్రిపరేషన్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ స్వీయ ప్రణాళిక లేకపోతే వృథానే. కాబట్టి పక్కా వ్యూహం, ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. రోజంతా పుస్తకాలకే అంకితం కాలేదు. రోజుకు 4 నుంచి 8 గంటలు చదివాను. ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే సమయంలోనే మెయిన్స్‌లో ఉపయుక్తంగా ఉండే సబ్జెక్టుల ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్సు తయారు చేసుకున్నాను. తద్వారా మెయిన్స్ ప్రిపరేషన్ సులువైంది. వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ రాత పరీక్షలు రాశాను. ఒత్తిడి అనిపించినప్పుడు సినిమాలు కూడా చూశాను. సమయం చిక్కినప్పుడల్లా చదివిన అంశాలను రివిజన్ చేసుకున్నా. మ్యాథ్స్ ఆప్షనల్ చాలా తక్కువ మంది మ్యాథ్స్ ఆప్షనల్‌గా ఎంచుకుంటారు. కానీ నాకు చిన్నతనం నుంచి మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఆసక్తి. ముందు నుంచీ పట్టు ఉన్నందున నేను మెయిన్స్‌లోనూ మ్యాథమెటిక్స్ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. మెయిన్సలో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వమే ఇంటర్వ్యూ గెడైన్‌స అందిస్తే బాగుంటుంది. అభ్యర్థులకు బ్యూరోకాట్ల సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అప్పుడు మన రాష్ట్రాలకు మరిన్ని ర్యాంకులు లభించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్వ్యూ సాగిందిలా! ప్రశాంతమైన వాతావరణంలో పర్సనాలిటీ టెస్ట్ సాగింది. ఐదుగురు సభ్యులున్న డాక్టర్ కిలెమ్సుంగ్లా బోర్డు దాదాపు అరగంట సమయం ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సామాజిక అంశాలు, అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్ని.. చైర్మన్: మన దేశంలో ఇప్పటి వరకు సిలికాన్ వ్యాలీ వంటి నగరం లేకపోవడానికి కారణమేంటి? భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ విషయంపై ఐటీ నేపథ్యం నుంచి వచ్చిన నీ అభిప్రాయం ఏంటి? సమాధానం: మేడమ్, మనదేశంలో సిలికాన్ వ్యాలీలా నగరాలు ఉండాలని నేను అనుకోవడం లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమూహాలు ఏర్పాటు అవసరం. ఆ దిశగానే దేశం పయనిస్తోంది. ఉదాహరణకు బెంగళూరుతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణే, కోల్‌కతా, గుర్గావ్ తదితర అనేక నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. బోర్డు సభ్యుడు-3 (మధ్యలో కలుగజేసుకుని): యూఎస్ఏ సిలికాన్ వ్యాలీ విధానం సరైంది కాదంటారా? సమాధానం: అలా కాదు. అక్కడి విధానం మనదేశ పరిస్థితులకు సరితూగదు. యూఎస్ఏ అభివృద్ధి చెందిన, ఆర్థికంగా బలమైన దేశం. ఎన్నో వైరుధ్యాలు, అసమానతలున్న మన దేశంలో ఆ విధానం ఆచరణీయం కాదు. చైర్మన్: ఈశాన్య రాష్ట్రాల్లో ఐటీ సామర్థ్యాలు ఏమున్నాయి? సమాధానం: అక్కడి యువతే ఆ రాష్ట్రాల సామర్థ్యం. నిర్మాణ రంగంతో పోల్చుకుంటే ఐటీ రంగానికి తక్కువ పెట్టుబడులు అవసరం. ఆ రాష్ట్రాల్లోని యువతకు తగిన ఎడ్యుకేషన్, నైపుణ్యాలు అందిస్తే ఐటీ కంపెనీలు వారికి విస్తృత అవకాశాలు అందిస్తాయి. వీటితోపాటు అడిగిన మరిన్ని ప్రశ్నలు: ఐటీ రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశంలో సరిపడా తయారీ కేంద్రాలు లేవు. దీనిపై నీ ఆలోచనలేంటి? పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ పనితీరుపై నీ అభిప్రాయం ఏంటి? ఎన్జీఓలు విదేశీ నిధులు పొందడాన్ని ప్రభుత్వం నిషేదించడంపై నీ అభిప్రాయం ఏంటి? అసలు విదేశాల నుంచి నిధులు పొందాల్సిన అవసరమేంటి? దేశంలోనే ఎందుకు నిధులు సమీకరించలేకపోతున్నాయి? అంతర్జాతీయ ర్యాంకుల్లో ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఎందుకు వెనుకంజలో ఉంటున్నాయి? రాత పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు అరగంటసేపు ఇంటర్వ్యూ నిర్వహించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేస్తున్నాం. యూపీఎస్సీ అమలు చేస్తున్న ఈ విధానం సరైనదేనా? ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివిన వారు కూడా సివిల్ సర్వీసెస్వైపు రావడం వల్ల.. వారిని ఇంజనీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి చేసిన ఖర్చు వృథా అయినట్లేగా? అందుకే ఇంటర్మీడియెట్ పూర్తి కాగానే సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసి, వారికి పాలిటీ, ఎకానమీ, టెక్నాలజీ తదితర అన్ని విభాగాల్లో పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి మంచి పాలనాధికారులుగా తీర్చిదిద్దాలని నేనంటాను. దీనిపై నీ అభిప్రాయం ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ చైనా, సౌత్ కొరియా పర్యటించడానికి కారణం తెలుసు. కానీ మంగోలియా వెళ్లడానికి కారణమేంటి? ఒకే వాక్యంలో సమాధానం చెప్పండి? (నా ఇంటర్వ్యూకు ఒక రోజు ముందు ప్రధాని మంగోలియా పర్యటనలో ఉన్నారు) ప్రణాళిక ప్రకారం సివిల్స్‌లో విజయం అంటే ఒక మహా సముద్రాన్ని ఈదడం అనే భావన నుంచి బయటపడాలి. పక్కా వ్యూహం సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే సాధించలేనిది ఏదీ ఉండదు. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. -
భిన్నాభిప్రాయం నేరమా?!
యువ మస్తిష్కాల్లో పురివిప్పే సృజనాత్మక ఆలోచనలకు రెక్కలు తొడిగే బృహత్తర బాధ్యత ఉన్నత విద్యా సంస్థలది. కానీ, అవి సంకుచిత కుడ్యాలమధ్య కునారిల్లుతున్నాయని మద్రాస్ ఐఐటీలో జరిగిన ఉదంతం తేటతెల్లం చేస్తున్నది. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రచనలపై నిర్వహించిన గోష్టిలో ఒక వక్త చేసిన ప్రసంగాన్ని కరపత్రంగా ప్రచురించడం నేరంగా పరిగణి ంచి క్యాంపస్‌లో పనిచేస్తున్న ఒక విద్యార్థి సంస్థ కార్యకలాపాలను అక్కడ నిషేధించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. కరపత్రం నుంచి నిషేధందాకా నడిచిన ప్రక్రియ మరింత వింత గొలుపుతుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్డీ)కు ఆకాశరామన్న లేఖ వచ్చింది. క్యాంపస్‌లోని అంబేడ్కర్-పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఎస్సీ) కరపత్రాలు, పోస్టర్లద్వారా విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నదని ఆ లేఖ సారాంశం. ఆ లేఖతోపాటు ఒక మేధావి చేసిన ప్రసంగ పాఠం ఉన్న కరపత్రాన్ని కూడా జతపరిచారు. ఆ లేఖనూ, కరపత్రాన్నీ ఆ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మద్రాస్ ఐఐటీకి పంపారు. ఐఐటీ యాజమాన్యం చురుగ్గా స్పందించి ఇకపై సంస్థ పేరునుగానీ, క్యాంపస్‌లోని సదుపాయాలనుగానీ వాడుకోవడానికి వీల్లేదంటూ ఏపీఎస్సీకి హుకుం జారీచేసింది. రవీంద్ర కవీంద్రుడు భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన ప్రార్థనలో ‘ఎక్కడైతే మేధస్సు నిర్భయంగా ఉంటుందో... విజ్ఞానానికి సంకెళ్లు ఉండవో... ఎక్కడైతే ప్రపంచం సంకుచిత కుడ్యాలుగా ముక్కలైపోదో... ఎక్కడైతే హేతువు దారితప్పదో...’ అలాంటి స్వేచ్ఛాప్రపంచంలో తనను మేల్కొల్పమంటాడు. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన విద్యాసంస్థలు నిజానికి అలాంటి ప్రపంచానికి ప్రతీకలుగా ఉండాలి. వర్తమాన ప్రపంచ ధోరణులను, వినూత్న ఆవిష్కరణలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తూ వాటిపై సమగ్ర విశ్లేషణకూ, పరిశోధనకూ చోటీయాలి. కానీ అవి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తమ చుట్టూ గోడలు కట్టుకుంటున్నాయి. ఒక విద్యార్థి సంస్థ కార్యకలాపాలు అందరికీ నచ్చాలని ఏం లేదు. వారి సిద్ధాంతాలతో, వారి అభిప్రాయాలతో, వారి ఆచరణతో అందరూ ఏకీభవించాలని ఏంలేదు. అయితే, అందుకొక విధానం ఉండాలి. ఆ సంస్థ పనితీరుపై అభ్యంతరం ఉంటే ఆ సంగతిని బహిరంగ చర్చకు పెట్టాలి. అందుకు భిన్నంగా... పేరు కూడా వెల్లడించుకోవడానికి ధైర్యం చేయలేని వారెవరో లేఖ రాస్తే దానిపై ఇంతగా స్పందించడం మద్రాస్ ఐఐటీ వంటి ఉన్నతశ్రేణి విద్యా సంస్థ చేయాల్సిన పనేనా? కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అలాంటి ఫిర్యాదు పంపితే ఆ సంస్థ నిర్వాహకులను పిలిచి మాట్లాడటం, వారినుంచి వివరణ కోరడం వంటివి చేసి ఉండొచ్చు. అంతవరకూ వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలుసుకుని... అభ్యంతరకరమైనవి, క్యాంపస్ మార్గదర్శకాలకు విరుద్ధమైనవి ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. అటువంటివి ఇకపై కొనసాగించవద్దని కోరవచ్చు. అనుసరించాల్సిన పద్ధతి ఇది కాగా మద్రాస్ ఐఐటీ రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించినట్టు కనబడుతోంది. ఈ వ్యవహారంలో పారదర్శకంగా తగిన విచారణ జరిపి, సంబంధింత సంస్థనుంచి సంజాయిషీ కోరి, అటుమీదట స్వతంత్రంగా ఆలోచించి వ్యవహరిస్తే బాగుండేది. ఆ లేఖనే ఆదేశంగా శిరసావహించి చర్యకు ఉపక్రమించినట్టుగా కనబడటంవల్ల తన ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఆలోచన మద్రాస్ ఐఐటీకి కలిగినట్టులేదు. మద్రాస్ ఐఐటీకి సుసంపన్నమైన చరిత్ర ఉంది. దేశంలోని అత్యుత్తమ శ్రేణి విద్యా సంస్థగా గుర్తింపు ఉంది. అక్కడ భిన్నాభిప్రాయాలకు తావిచ్చిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు పర్యావరణానికీ, సమాజానికీ ఎలా ముప్పు కలిగిస్తున్నాయో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేథా పాట్కర్ ఇదే క్యాంపస్‌లో మాట్లాడారు. నిజానికి ఇలాంటి ఉద్యమకారుల అభిప్రాయాలూ, మనోభావాలు తెలుసుకోవడం... అందులోని లోటుపాట్ల గురించి నేరుగా వారితోనే సంభాషించడం క్యాంపస్ విద్యార్థులకు అవసరం. సమాజానికి దూరంగా, ఏకదంత ప్రాకారాల్లో కూర్చుంటే...తమ క్లాసు పుస్తకాలు తప్ప మరేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తే విద్యార్థులు రాణించలేరు. పట్టాలు తీసుకున్నాక వారు ఈ సమాజోన్నతికే తమ మేథస్సునూ, విజ్ఞానాన్నీ ఉపయోగించాల్సి ఉంటుంది. విద్యా సంస్థల్లో తాము నేర్చుకునే ప్రతి అంశాన్నీ రేపన్నరోజున వారు ఈ సమాజంలో ప్రయోగించి చూడాల్సివస్తుంది. అందువల్లే భిన్న సిద్ధాంతాలనూ, దృక్పథాలనూ... వాటిల్లోని మంచిచెడులనూ వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకూ ఎపీఎస్సీ సమాజానికి ముప్పు కలిగించే ఏ ఉగ్రవాద కార్యకలాపాలకూ పాల్పడటం లేదు. సామాజిక విప్లవకారుడు డాక్టర్ అంబేడ్కర్, కులజాడ్యంపై కత్తిగట్టిన పెరియార్ రామస్వామి వంటివారి భావాలను ప్రచారం చేస్తోంది. ఆ వెలుగులో వర్తమాన పరిణామాలను అధ్యయనం చేస్తూ.... అందులో భాగంగా ప్రముఖులతో గోష్టులు ఏర్పాటుచేస్తున్నారు. చర్చకు చోటిస్తున్నారు. వామపక్షాలు, మితవాదులు, మధ్యేవాదుల రాజకీయాలపైనా, ఆచరణపైనా విమర్శనాత్మక విశ్లేషణలు చేస్తున్నారు. ఇదెలా నేరమవుతుందో అర్థంకాని విషయం. ఇప్పుడు మద్రాస్ ఐఐటీ చర్యకు కారణమైన కరపత్రంలో కూడా ద్రవిడ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త వివేకానంద గోపాల్ అంబేడ్కర్ దృక్పథంపై చేసిన ప్రసంగంలోని అంశాలున్నాయి. అందులో ఎన్డీయే సర్కారు హిందూత్వ ఎజెండాపైనా, ఘర్వాపసీవంటివాటిపైనా విమర్శలున్నాయి. ఆ విషయంలో వారితో విభేదించడానికీ, వారి అవగాహనలోని లోపాలను చర్చించడానికీ ఎవరికైనా హక్కుంటుంది. అలాంటివారి హక్కులకు ఆటంకం కల్పిస్తే ఏపీఎస్సీ ది దోషమవుతుంది తప్ప... వర్తమాన పరిణామాలపై అభిప్రాయం కలిగి ఉండటమే నేరంగా పరిగణిస్తే ఎలా? కేంబ్రిడ్జి, హార్వర్డ్, ప్రిన్స్టన్వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచాన ఇంకా కళ్లు తెరవని రోజుల్లో దేశదేశాల్లోని విద్యార్థులకూ మన భారతావనిలోని నలంద, తక్షశిలలే జ్ఞానభిక్ష పెట్టాయి. అదంతా గత వైభవంగా మిగలడానికి కారణమేమిటో తాజాగా మద్రాసు ఐఐటీ వైఖరి చూస్తే అర్థమవుతుంది. ఆలోచనలనూ, అభిప్రాయాలనూ మొగ్గలోనే తుంచాలని చూడటం ఎక్కడైనా తప్పే అవుతుంది. ఐఐటీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థ ఆ పనికి పూనుకోవడం మరింత దారుణమవుతుంది. మద్రాస్ ఐఐటీ ఇప్పటికైనా తన పొరపాటును గుర్తించాలి. -
ఐఐటీ మద్రాస్‌లో ఇన్ఫీ మూర్తి విభాగం
చెన్నై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేరుతో మద్రాస్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రత్యేక విభాగం (చెయిర్) ఏర్పాటైంది. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ దీన్ని నెలకొల్పారు. రూ. 10 కోట్ల నిధితో ఏర్పాటైన ఈ విభాగంలో ఐఐటీలోని ప్రముఖ ప్రొఫెసర్లు కంప్యుటేషన్ బ్రెయిన్ అంశంపై అధ్యయనం చేస్తారు. మెదడుపై పరిశోధనలకు సంబంధించి ఇది భారత్‌కి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తేగలదని నారాయణ మూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు చెందిన పార్థ మిత్రా సారథ్యంలోని ఈ విభాగంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. కార్పొరేట్ జీవన విధానం గురించి మూర్తి నుంచి తానెన్నో విషయాలు నేర్చుకున్నానని క్రిస్ తెలిపారు. వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు క్రిస్ తలో రూ. 10 కోట్లతో మొత్తం మూడు విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. తన గురువు, ఐఐటీ మాజీ ప్రొఫెసర్ మహాబల పేరిట ఇప్పటికే ఒక విభాగం నెలకొల్పారు.