
మద్రాస్ ఐఐటీలో కడప విద్యార్థి ఆత్మహత్య
చెన్నై: ప్రఖ్యాత మద్రాస్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఏపీలోకి కడప జిల్లాకు చెందిన నరం నాగేందర్ రెడ్డి మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్ ఆవరణలోనే సోమవారం రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.
మంగళవారం మధ్యాహ్నం గానీ నాగేందర్ మరణ వార్తను ఐఐటీ ఉన్నతాధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతానికి నాగేందర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నప్పటికీ దర్యాప్తు అనంతరమే మొత్తం విషయం బయటకువచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.