సాక్షి,న్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి,మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను జులై 3వ వారంలో నాలుగు ఫేజుల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ జరిగే సమయంలో నీట్ అక్రమాల వల్ల ప్రయోజనం పొందినట్లు గుర్తిస్తే.. వారి కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తామని వెల్లడించింది.
పేపర్ లీకేజీ,అక్రమాలపై దాఖలైన సుమారు 40 పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం గురువారం (జులై11న) విచారణ చేపట్టనుంది.ఈ విచారణకు ముందు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment