counselling
-
సగం సీట్లు ‘ఇతరులకే’..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ మెడికల్ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా 50 శాతం సీట్లను నింపుతుండటంపై రాష్ట్ర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సీట్లలో సగం వరకు జాతీయ కోటా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతు న్నాయి. ఎంబీబీఎస్‌లో నేషన ల్ పూల్ కింద ప్రభుత్వ సీట్లలో 15 శాతం జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా, పీజీ మెడికల్ సీట్లలో ఏకంగా సగం కేటాయిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మనోళ్ల అనాసక్తి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కలిపి దాదాపు 2,800 పీజీ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 1,200 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వాటిల్లో 600 వరకు (50 శాతం) జాతీయ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో నింపుతారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విధానం మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేస్తుండగా, తెలంగాణలాంటి రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం నష్టం కలిగిస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాదికి చెందిన చాలామంది విద్యార్థులు మన రాష్ట్రంలోని సీట్లపై ఆసక్తి చూపుతారు. కానీ మన రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జాతీయ కోటాలో నింపే మన రాష్ట్ర 600 సీట్లలో దాదాపు 300 మంది ఇతర రాష్ట్రాల వారే దక్కించుకుంటున్నారని కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని చెబుతున్నారు. -
కొత్తగా మరో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో మరో కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్– విజయ వాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్ సీట్లు నింపుకునేందుకు ఆ కాలేజీకి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత ప్రైవేటు కాలేజీకి అనుమతులు రావడం గమనార్హం.తాజాగా అందుబాటులోకి వచ్చిన 150 సీట్లలో సగం అంటే 75 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రస్తుతం రెండో రౌండ్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత 20–25 సీట్లు ఆ కోటాలో ఖాళీగా ఉన్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొత్త వాటిని కలిపితే 95 నుంచి 100 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయని వెల్లడించాయి.ఇలావుండగా కొత్త కాలేజీతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య 29కి చేరింది. వాటిలో మల్లారెడ్డి గ్రూపునకు చెందిన రెండు మెడికల్ కాలేజీలు ఈ ఏడాది డీమ్డ్ యూనివర్సిటీగా మారాయి. అందులోని సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునే అవకాశముంది. రాష్ట్ర కౌన్సెలింగ్‌తో సంబంధం ఉండదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు సీట్లు లభించే ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య 27కే పరిమితం అయింది. ఈ కాలేజీలన్నీ కలిపి 4,550 సీట్లున్నాయి. -
మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇంత హడావుడా?
సాక్షి, అమరావతి: ఈ సంవత్సరం మెడికల్ పీజీ ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా రాకుండానే రాష్ట్రంలో హడావుడిగా రాష్ట్ర కోటా దరఖాస్తుల ప్రక్రియ ముగించేశారని,, పైగా, ఆలస్య రుసుము పేరిట భారీగా భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మెడికల్ పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల చేశారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ రావాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కోటాలో ప్రవేశాలు ప్రారంభించాలి. అయితే, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు ఇంకా షెడ్యూల్ రాలేదు. మరోపక్క ఇన్‌సర్వీస్ కోటా కుదింపును సవాల్ చేస్తూ సరీ్వస్ ఎంబీబీఎస్ వైద్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇంకా స్పష్టత రాలేదు. అయినా ఆరోగ్య విశ్వవిద్యాలయం గత నెల 27న రాష్ట్ర కోటాలో పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారంతో ఆన్లైన్ దరఖాస్తులకు గడువు కూడా ముగిసింది. ఆలస్య రుసుముతో శనివారం నుంచి సోమవారం వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పైగా, ఆలస్య రుసుము కూడా సాధారణ ఫీజుకంటే నాలుగింతలు ఎక్కువగా వసూలు చేస్తోంది. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఓసీ, బీసీ వైద్యులకు ఆన్లైన్ దరఖాస్తు రుసుము రూ.7,080 ఉంటే.. ఆలస్య రుసుము రూ. 27,080గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.5,900 సాధారణ రుసుము ఉంటే ఆలస్య రుసుము రూ.25,900 చేశారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలోనే ఇలా ఆలస్య రుసుముల పేరిట భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ రాకపోవడంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇంకా అడ్మిషన్లు ప్రారంంభించలేదని, ఏపీలో మాత్రం హడావుడిగా దరఖాస్తుల ప్రక్రియనే ముగిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కన్వినర్ కోటా అడ్మిషన్లను హడావుడిగా ముగిస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రిజి్రస్టార్ డాక్టర్ రాధికారెడ్డిని వివరణ కోరగా.. ఏటా కొందరు అభ్యర్థులు దరఖాస్తుల గడువు ముగిశాక కోర్టులకు వెళ్లి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకుంటున్నారని, దాని ప్రభావం కౌన్సెలింగ్‌పై పడుతోందని చెప్పారు. అందువల్లే ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం కల్పించామన్నారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటామని, ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ మొదలయ్యాకే రాష్ట్ర కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. -
ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలైంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అన్ని సాక్షా్య లతో వర్సిటీ ఈ–మెయిల్ knrugadmission@gmail.comకు పంపించాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామన్నారు. అదేరోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గతేడాదికి సంబంధించిన కాలేజీలవారీ సీట్ల కేటాయింపు వివరాలు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని.. వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్... స్థానికతకు సంబంధించిన జీవో–33ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడం.. కోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం వల్ల ఈసారి కౌన్సెలింగ్ ఆలస్యమైంది. జీవోను సవాల్ చేసిన పిటిషనర్లలో అర్హత ఉన్న వాళ్లను కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని.. సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో–33 నుంచి పిటిషనర్లకు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు.. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. తుది తీర్పును మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితాలో కోర్టుకు వెళ్లిన 132 మంది పిటిషనర్లకు కూడా చోటు కల్పించింది. మరోవైపు తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న పిటిషనర్లలో మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నట్లు తేలింది. దీంతో వారిని తెలంగాణ జాబితా నుంచి తిరస్కరించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కాగా, అఖిల భారత స్థాయిలో ఎస్టీ విభాగంలో టాప్ ర్యాంకు సాధించిన గుగులోత్ వెంకట నృపేష్ కాళోజి వర్సిటీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి, మూడో స్థానంలో మహమ్మద్ ఆజాద్ సాద్, నాలుగో స్థానంలో లావుడ్య శ్రీరాం నాయక్ ఉన్నారు. -
సీట్లు రానివారికా... అందరికా
ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన సీట్లు ఎవరికి దక్కుతాయి? కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మొదట్లో డిమాండ్ లేని కోర్సులు రద్దు చేసుకున్న ప్రైవేట్ కాలేజీలకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లలో సీట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడం, తాజాగా సీట్ల పెంపునకు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. మాప్‌ఆప్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పెరిగిన సీట్లపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.– సాక్షి, హైదరాబాద్కౌన్సెలింగ్ ఎలా ?ష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాకింద 86 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, ఇందులో ఈ ఏడాది 79 వేల సీట్లు భర్తీ అయ్యాయి. మూడు దశలతోపాటు, ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతిమంగా స్పాట్ అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లోనూ రిపోర్టు చేసి, సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. సీట్లు రానివారు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో, దోస్త్ ద్వారా డిగ్రీలోనూ చేరారు. ఈ దశలో కౌన్సెలింగ్ నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. కేవలం మిగిలిపోయిన విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టాలా? మొత్తం అభ్యర్థులకూ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఇవ్వాలా? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఎక్కడా సీటు రాని వారు మాత్రమే ప్రస్తుతం మిగిలిపోయారు. వీరికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు ప్రయత్నించినా, ఆఖరుకు సివిల్, మెకానికల్, ఈఈఈలో చేరారు. ఇప్పుడు 3 వేల సీట్లు పెరిగితే, అందులో 2,100 కన్వీనర్ కోటా కింద ఉంటాయి. కేవలం సీట్లు రాని వారికే వీటిని కేటాయిస్తే, అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు.యూటర్న్ కష్టమేఇప్పటికే 79 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరారు. పెరిగిన సీట్లకు వీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొస్తుంది. వివిధ కాలేజీల్లో పలు గ్రూపుల్లో చేరిన వారు కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇప్పటికే చేరిన కాలేజీల్లో మళ్లీ సీట్లు ఖాళీ అవుతాయి. వీటికి మరో దఫా కౌన్సెలింగ్ చేపట్టాలి. మొత్తం మీద కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి చేపట్టడమే అవుతుందని సాంకేతిక విద్య విభాగం చెబుతోంది. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు తీర్పు ద్వారా పెరిగిన సీట్లకు కౌన్సెలింగ్ చేపడితే ర్యాటిఫికేషన్ ప్రక్రియ వాయిదా వేయాల్సి ఉంటుంది. పరిస్థితి అంతా గందరగోళంగానే ఉందని సాంకేతిక విద్యకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని అధికారులు, విద్యార్థులు కోరుతున్నారు. -
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఆగస్ట్ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది. ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. -
మార్కులు పెరిగినా.. ర్యాంకులు ఢమాల్!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించినవారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు వేలల్లోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నదీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ కోసం వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆలిండియా కోటా (ఏఐక్యూ)కు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ పూర్తిచేసి.. తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు.లీకేజీ గందరగోళం మధ్య.. ⇒ ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థుల ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాదప్రతివాదనల అనంతరం కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దీనితో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థు లు సీటు వస్తుందా? రాదా? వస్తే ఎక్కడ రావొచ్చన్న ఆందోళనలో పడ్డారు.మార్కులు ఘనం.. ర్యాంకు పతనం.. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచి్చన మార్కులు 711, ఆలిండియా స్థాయిలో వచి్చన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 711 మార్కులేరాగా.. జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచి్చంది. మంచి మార్కులు వచి్చనా.. ఆలిండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలా మంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆలిండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనూ అయోమయంప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు, రిజర్వేషన్ కోటా ప్రకా రం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీని యర్లు అభిప్రాయపడుతున్నారు. ఆలిండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. -
14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. మరోవైపు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ నిర్వహణకు డాక్టర్వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నీట్ యూజీ–2024లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలతో సన్నద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత అఖిల భారత కోటా.. నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలుత అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్మెర్ వంటి జాతీయ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన ఎంసీసీ ఏఐక్యూ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులయినా ఏఐక్యూలో సీట్లు పొందొచ్చు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఇలా.. తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 16 ప్రైవేట్, రెండు మైనారిటీ వైద్య కళాశాలలతోపాటు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఏఐక్యూలో, మిగిలిన 85 శాతం సీట్లను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో అన్ని రకాల కళాశాలల్లో 6,209 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, పద్మావతి వైద్య కళాశాలల్లోని 460 ఎంబీబీఎస్ సీట్లను ఏఐక్యూలో భర్తీ చేస్తారు. కన్వినర్, బీ, సీ కేటగిరీలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ చేపడతారు. రాష్ట్ర కోటాకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నీట్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఆ మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపడతారు. అంతా ఆన్లైన్లోనే ఇక ఏఐక్యూ, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ అంతా కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడం, రాష్ట్ర స్థాయి ర్యాంక్‌ల కేటాయింపు, కావాల్సిన కళాశాలల ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు ఇలా కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ http:// drysruhs.edu.in/ index.html లో ప్రకటిస్తుంది. నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు» నీట్ యూజీ– 2024 ర్యాంక్ కార్డ్ » పుట్టిన తేదీ ధ్రువీకరణ (పదో తరగతి మార్కుల మెమో) » 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు » ఇంటర్మీడియెట్ స్టడీ, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు » ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (ఇంటర్/10+2) » కుల ధ్రువీకరణ » ఆధార్ కార్డు » దివ్యాంగ ధ్రువీకరణ పత్రం » విద్యార్థి తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అర్హులు 43,788 మంది నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితా విడుదల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) నుంచి అందిన నీట్ యూజీ–2024 అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. 43,788 మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు పేర్కొంది. 715 స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో 44వ ర్యాంక్‌తో కె.సందీప్ చౌదరి తొలి స్థానంలో నిలవగా.. అదే స్కోర్‌తో గట్టు భానుతేజ సాయి(50), పి.పవన్‌కుమార్ రెడ్డి (81), వి.ముఖేష్ చౌదరి(150) తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తంగా రాష్ట్రం నుంచి 61 మంది 700, ఆపైన స్కోర్ సాధించారు. 2,349 మంది 600, ఆపైన స్కోర్ చేశారు. ఈ జాబితాను మెరిట్ లిస్ట్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. -
14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆల్ ఇండియా కౌన్సెలింగ్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తాత్కాలిక షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి స్ట్రే వేకెన్సీ రౌండ్‌కౌన్సెలింగ్‌ను ముగించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అక్టోబర్1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నీట్ యూజీ–2024 తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల సవరించిన మార్కులు, ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 64,299 మంది విద్యార్థులు నీట్ రాయగా 43,788 మంది అర్హత సాధించారు. జూన్ 4 తేదీ నాటి ఫలితాలతో పోలిస్తే ఏపీలో 70 మంది విద్యార్థులు అనర్హులుగా మారారు. రాష్ట్రం నుంచి నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఎన్టీఏ నుంచి వైఎస్సార్ విశ్వవిద్యాలయానికి రావాల్సి ఉంది. వర్సిటీ ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి ఈ సమాచారం తీసుకుని రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. ఇక ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభమైన అనంతరం రాష్ట్రస్థాయిలో వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభించనుంది. -
నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ నేతృత్వంలో కౌన్సెలింగ్ జరగనుంది.ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లోను, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోను, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ జరగనుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. -
డిప్లొమా విద్యార్థులకు 10వేల ఇంజనీరింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్, ఫార్మసీ డిప్లొమా పూర్తి చేసిన వారికి నిర్వహించే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీలో రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు కల్పించారు. ఇంజనీరింగ్‌లో 12,785 సీట్లు అందుబాటులో ఉంటే, 10,407 సీట్లు భర్తీ చేశారు. ఫార్మసీలో 1,180 సీట్లు అందుబాటులో ఉంటే, కేవలం 47 సీట్లు (3.98 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఈ సెట్‌కు 22,365 మంది అర్హత సాధించారు. ఫైనల్ ఫేజ్‌లో 9,646 మంది 3,92,923 ఆప్షన్లు ఇచ్చారు. ఆఖరి విడతలో 1,246 మంది బ్రాంచీలను మార్చుకున్నట్టు సాంకేతిక విద్య విభాగం తెలిపింది. ఇంజనీరింగ్‌లో ఎక్కువ భాగం కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 8,371 సీట్లు ఈ బ్రాంచీల్లో ఉంటే, 6,084 సీట్లు భర్తీ అయ్యాయి. 72.68 శాతం సీట్ల భర్తీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24లోగా రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. -
75,200 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. సాంకేతిక విద్య విభాగం ఇందుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించింది. మొత్తం 175 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. కనీ్వనర్ కోటా కింద 78,694 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిల్లో 75,200 సీట్లు భర్తీ చేశారు. 3,494 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 95.56 శాతం సీట్లు భర్తీ చేసినట్టు అధికారులు తెలిపారు. 95,735 మంది 62,60,149 ఆప్షన్లు ఇచ్చారు. 20,535 సరైన ఆప్షన్లు ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,038 మందికి సీట్లు వచ్చాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్ రిపోరి్టంగ్ చేయాలని సూచించారు. ముందుకు రాని టాపర్స్ ఈఏపీ సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందడానికే ప్రాధాన్యమిచ్చారు. వందలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కేవలం ఒక్కరే తొలి కౌన్సెలింగ్‌లో సీటు కోసం పోటీ పడ్డారు. 201 నుంచి 500 ర్యాంకులు వచి్చన వాళ్ళు కూడా 10 మందే ఉన్నారు. ఆఖరుకు వెయ్యిలోపు ర్యాంకర్లు కూడా 74 మంది మాత్రమే కని్పంచారు. 5 వేలు పైబడిన ర్యాంకు వచ్చిన వాళ్ళే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నించారు. 53 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనేభర్తీ అయిన 75,200 సీట్లల్లో 53,517 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇతర కంప్యూటర్ సైన్స్ అనుబంధ గ్రూపుల్లోనే ఉన్నాయి. వివిధ విభాగాలుగా ఉన్న ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ బ్రాంచీలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో 99.80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సుల్లోనూ 97 శాతంపైగా సీట్లుకేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ ఇంజనీరింగ్‌ల్లో సీట్లు తక్కువగా ఉన్నా మిగిలిపోయాయి. -
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్‌బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్‌లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్‌ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్‌నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
కంప్యూటర్ సైన్సు ఫస్ట్.. ఈసీఈ సెకండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులను తలపిస్తున్నాయి. ఇంజినీరింగ్ సీట్ల తొలి విడత కౌన్సెలింగ్‌లో 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా తొలి దశలో 1,17,136 సీట్లు భర్తీ అవడం విశేషం. 19,524 సీట్లు మలి విడత కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్సుకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత ఈసీఈకి డిమాండ్ ఉంది. కాలేజీలు కూడా ఇదే దృష్టితో కంప్యూటర్ సైన్సు సీట్లను ఎక్కువగా అందుబాటులో ఉంచాయి. ఈ మేరకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి.కంప్యూటర్ సైన్స్‌లోనే ఎక్కువ..కంప్యూటర్ సైన్స్‌లో కన్వీనర్ కోటాలో 42,303 సీట్లు ఉండగా, 40,242 సీట్లు తొలి దశలోనే భర్తీ అయ్యాయి. అంటే సీట్లన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ)లో 24,121 సీట్లు ఉండగా, 21,060 సీట్లను కేటాయించారు. సీఎస్ఈ (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్)లో 11,156 సీట్లకు గాను 10,133 సీట్లు భర్తీ అయ్యాయి. ఫెసిలిటైస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్‌లో 66 సీట్లలో ఒక్కటి కూడా భర్తీ కాలేదు. కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో 64 సీట్లకు గాను 7 సీట్లే భర్తీ అయ్యాయి. తొలి దశ కౌన్సెలింగ్ 17వ తేదీతో ముగిసింది. శుక్రవారం నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో మిగిలిన 19,524 సీట్లకు వచ్చే వారంలో మలి విడత కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. దానికంటే ముందే ఎన్ఆర్ఐ, కేటగిరీ–బి సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. చివరి దశలో కళాశాలలకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనుంది.వైఎస్ జగన్ దార్శనికతతో..వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికత, సంస్కరణలతో మెరిట్ సాధించిన పేద, మధ్య తరగతి విద్యార్థులు కూడా ప్రైవేటు వర్సిటీల్లో సీట్లు సాధించుకోగలిగారు. రాష్ట్రంలో 9 ప్రైవేటు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం సీట్లను ఏపీఈఏపీసెట్‌లో మెరిట్ సాధించిన విద్యార్ధులకు కన్వీనర్ కోటాలో కేటాయించేలా గత వైఎస్ జగన్ సర్కారు సంస్కరణలు తెచ్చింది. దీంతో గడిచిన రెండేళ్లలో 7 ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఎందరో పేదింటి విద్యార్థులు మెరుగైన ఉన్నత విద్యను అందుకున్నారు. ఈ ఏడాది ప్రైవేటు వర్సిటీలు 9కి చేరడంతో సీట్ల సంఖ్య 7,832కు చేరుకుంది. ఇందులో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో తొలి విడతలోనే 7,700 సీట్లను విద్యార్థులు దక్కించుకున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు వర్సిటీల్లో చదువంటే పేద మెరిట్ విద్యార్థులకు సాధ్యయ్యేది కాదు. లక్షల్లో ఫీజులు చెల్లించే వారికే అక్కడ సీట్లు దక్కేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులూ చదువుకోగలుగుతున్నారు. -
నీట్-యూజీ కౌన్సిలింగ్ జులై 3వ వారంలో: కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షను రద్దు చేసి,మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను జులై 3వ వారంలో నాలుగు ఫేజుల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ జరిగే సమయంలో నీట్ అక్రమాల వల్ల ప్రయోజనం పొందినట్లు గుర్తిస్తే.. వారి కౌన్సిలింగ్‌ను రద్దు చేస్తామని వెల్లడించింది. పేపర్ లీకేజీ,అక్రమాలపై దాఖలైన సుమారు 40 పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం గురువారం (జులై11న) విచారణ చేపట్టనుంది.ఈ విచారణకు ముందు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. -
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
-
నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా
ఢిల్లీ: నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. తిరిగి కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. NEET UG counselling deferred until further notice: Official sources pic.twitter.com/VVMvpGwDDH— ANI (@ANI) July 6, 2024నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు మాత్రం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పిటిషన్లను అన్నింటిని ఒక్కటిగా జూలై 8న(ఎల్లుండి) విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీయే నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజి కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తన అఫిడవిట్లో వెల్లడించింది. -
నీట్–యూజీ కౌన్సెలింగ్‌పై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీ ఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే యూజీ నీట్–2024 అడ్మిషన్ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో తీవ్ర అయో మయం నెలకొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మే 5వ తేదీన ఈ పరీక్షను నిర్వహించగా.. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత గ్రేస్ మార్కుల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతో ఆయా అభ్యర్థులకు తిరిగి జూన్ 23న పరీక్ష నిర్వహించారు.ఆ తర్వాత జూన్ 30న ఎన్టీఏ తుది ఫలితాలను ప్రకటించింది. మరోవైపు జూలై 6వ తేదీ (శనివారం) నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులంతా కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యారు. కానీ ఇప్పటివరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) యూజీ నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కేంద్రం ప్రకటించిన తేదీ సమీపించినా షెడ్యూల్ జాడలేకపోవడంతో కౌన్సెలింగ్‌పై సందిగ్ధం నెలకొంది. మరోవైపు విద్యార్థుల్లో రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతోంది.తరగతుల ప్రారంభం మరింత జాప్యం..యూజీ నీట్ పరీక్ష మే మొదటి వారంలోనే నిర్వహించడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ నెల మూడో వారం నాటికి ప్రారంభమవుతుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. కానీ ఫలితాల విడుదల.. ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని జూలై 6వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. యూజీ నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తే అన్ని కేటగిరీల్లో సీట్ల భర్తీకి కనీసం నెలన్నర సమయం పడుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైతే ఆగస్టు మూడో వారం నాటికి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పటివరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ వెలువడకపోవడంతో ఈ ఏడాది తరగతుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కోవిడ్–19 సమయంలో నీట్ అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో 2020 ఏడాదిలో ప్రవేశాల ప్రక్రియ దాదాపు డిసెంబర్ వరకు సాగింది. ఆ అంతరాన్ని తొలగించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అప్పటినుంచి ఎంబీబీఎస్ విద్యార్థులకు సెలవులు తగ్గించడం.. తరగతుల నిర్వహణకు ఎక్కువ సమయం కేటాయించడం తదితర అంశాలతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది.మానసిక ఒత్తిడిలో నీట్ విద్యార్థులుమరోవైపు యూజీ నీట్–2024 పరీక్షను మరోమారు నిర్వహించాలనే ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు వెలువడిన ఫలితాల ఆధారంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందా? లేక కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. ఈ అస్పష్టమైన పరిస్థితి విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి నీట్ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించినప్పటికీ ఆయా విద్యార్థులకు ర్యాంకులు లక్షల్లోకి ఎకబాకాయి. రాష్ట్రస్థాయి ర్యాంకులు వెలువడితే ఆమేరకు సీటు ఎక్కడ వస్తుందో అంచనా వేయొచ్చు. కానీ ఇప్పటివరకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వెలువడకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. సీటు రాకుంటే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. -
కొడుకులు బువ్వ పెడ్తలేరు
నెన్నెల: నవ మాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కుమారులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. దీంతో కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మంగళవారం పోలీసుస్టేషన్ మెట్లెక్కింది.ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్క, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తుండడంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్సై స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్లో మాట్లాడి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై చెప్పారు. కాగా, కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డు ఉద్యోగి కాగా, మరో ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు. -
Supreme Court: ‘నీట్’ కౌన్సెలింగ్ రద్దు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ కౌన్సెలింగ్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ, పేపర్ లీక్, మూల్యాంకనంలో వ్యత్యాసాలపై దాఖలైన పలు పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. నీట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ పిటిషన్లపై తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కోరారు. గ్రేసు మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించనున్న పరీక్షపై స్టే ఇవ్వాలని మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. గ్రేసు మార్కులు పొందిన అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించే పరీక్షతోపాటు వచ్చే నెల 6న జరిగే కౌన్సెలింగ్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. అడ్మిషన్ల ప్రక్రియ తుది తీర్పునకు లోబడే ఉంటుందని వ్యాఖ్యానించింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు ఈ పిటిషన్లను జత చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. వేర్వేరు హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీం నోటీసులిచ్చింది. హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్నపిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయా హైకోర్టుల్లో విచారణలపై స్టే విధించింది. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కని్పస్తోంది. వచ్చే నెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి గుర్తింపు రాలేదు. అసలు ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తాయి. అయితే దీనికన్నా ముందు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ 2024–25 విద్యా సంవత్సరానికి క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 10వ తేదీకల్లా అన్ని కాలేజీలకు అనుమతినివ్వాలి. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునే కాలేజీలకే అనుమతి లభిస్తుంది. జూన్ 10కల్లా అనుమతి రాని కాలేజీలు.. సౌకర్యాలు కల్పించుకుని మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పింస్తారు. ఈ ప్రక్రియను జూన్ 30 నాటికి ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జూన్ 10 నాటికి అనుమతి లభించడం కష్టమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కోర్సుల చేరిక వల్లే ఆలస్యం జాతీయ స్థాయిలో విద్యా విధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు భారత్‌లోనూ క్రెడిట్ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. టెన్త్ వరకూ కొన్ని క్రెడిట్స్, ఇంటర్ తర్వాత కొన్ని, డిప్లొమా కోర్సులకు, ఇంజనీరింగ్ కోర్సులకు ఇలా.. క్రెడిట్స్ విధానం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రొఫెషనల్ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలో చేరుస్తున్నారు. ఇప్పటివరకూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ వంటి కోర్సులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉండేవి. తాజాగా ఏఐసీటీఈ పరిధిలోకి తెస్తూ అన్ని కోర్సులకు కలిపి ఒకే దరఖాస్తు విధానం తీసుకొచ్చారు. అంటే బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఇదే దరఖాస్తు విధానంలోకి వచ్చాయన్న మాట. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడానికి కాస్త సమయం పట్టే అవకాశం కని్పస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలేజీలకు గుర్తింపు ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నాయి. జోసా కౌన్సెలింగ్ నాటికి జరిగేనా? ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెలలో కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయింది. త్వరలో జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఆరు దశలుగా ఉంటుంది. జోసా కౌన్సెలింగ్ చివరి తేదీని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశ చేపడతారు. విద్యార్థులు తొలి దశలో రాష్ట్ర కాలేజీల్లో చేరి, చివరి దశలో జాతీయ కాలేజీల్లోకి వెళ్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను చివరి దశలో భర్తీ చేస్తారు. కానీ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇప్పటికీ రాకపోవడంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈలోగానే అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్ణయించిన తేదీల్లోనే కొనసాగుతుంది. ఈలోగా ఏఐసీటీఈ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించింది. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కాలేజీలను ఏఐసీటీఈ పరిధిలోకి కొత్తగా తేవడం వల్ల కొంత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) -
ఏ కాలేజీ.. ఏబ్రాంచీ!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఈఏపీ ఫలితాలు ప్రకటించడంతో ఇంజనీరింగ్ సీట్ల కోసం విద్యార్థుల హడావుడి మొదలైంది. తనకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో బ్రాంచిలో సీటొస్తుంది? ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉంది? కౌన్సెలింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర సవాలక్ష ప్రశ్నలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. దీంతో కన్సల్టెన్సీలను, నిపుణులను సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ర్యాంకు గురించి చర్చిస్తున్నారు. కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించేలోగా స్పష్టమైన సమాచారంతో సిద్ధంగా ఉంటే మంచిదని భావిస్తున్నారు. వాస్తవానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలయ్యేలోగా కొంత కసరత్తు అవసరమని నిపుణులు కూడా అంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో ఖచ్చితమైన ఆప్షన్లు పెట్టుకుంటే సీటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాది కటాఫ్‌ను పరిశీలిస్తే కొంత స్పష్టత వచ్చే వీలుందని పేర్కొంటున్నారు. టెన్షన్ అవసరమే లేదు ఐదేళ్ళ క్రితం ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ బ్రాంచిలకు తీవ్ర స్థాయిలో పోటీ ఉండేది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులకే కాలేజీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గత రెండేళ్ళుగా కంప్యూటర్ సైన్స్‌లో సీట్లు పెరిగాయి. గత ఏడాది ఏకంగా 14 వేల సీట్లు కొత్తగా వచ్చాయి. కాబట్టి సీటు కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే వచి్చన ర్యాంకును బట్టి సీటు ఎక్కడ వస్తుందనేది సరిగ్గా అంచనా వేసి, ఆ దిశగా ఆప్షను ఇవ్వాలి. అవసరమైతే రెండో దశ కౌన్సెలింగ్ లేదా ఆఖరి దశలో సీట్లు మిగిలితే నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా సీఎస్ఈలో పోటీ అదే విధంగా ఉండే వీలుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో సీఎస్ఈ బ్రాంచిలో సీటు రావాలంటే ఈఏపీ సెట్లో ఓపెన్‌లో 4 వేల లోపు ర్యాంకు వచ్చి తీరాలని నిపుణులు అంటున్నారు. టాప్ కాలేజీల్లో రావాలంటే 8 వేల లోపు ర్యాంకు అవసరమని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ సంవత్సరం 60 వేల ర్యాంకు వచ్చినా సీఎస్ఈలో సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్‌లో పోటీ తక్కువగా ఉంటోంది. 19 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుంది. అందరి దృష్టీ సీఎస్‌ఈపైనే ఏ స్థాయిలో ర్యాంకు వచ్చినా విద్యార్థి ముందుగా కోరుకునేది కంప్యూటర్ సైన్స్ సీటు. గత మూడేళ్ళుగా విద్యార్థులు పెట్టే ఆప్షన్లు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. గత ఏడాది 58 శాతం కంప్యూటర్ సైన్స్ సీట్లకే అప్షన్లు ఇచ్చుకున్నారు. అయితే సరైన ర్యాంకు రాకపోయినా టాప్ కాలేజీలకు ప్రాధాన్యత ఇస్తూ అప్షన్లు పెడుతున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్ వరకూ ఇదే తరహా ఆప్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా తన ర్యాంకుకు వచ్చే కాలేజీని, బ్రాంచిని మొదటి రెండు దశల కౌన్సెలింగ్‌లోనే పోగొట్టుకుంటున్నారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి 16 వేల ర్యాంకు వచ్చింది. అతనికి టాప్ టెన్‌లో కాకుండా వేరే కాలేజీలో కోరుకున్న బ్రాంచిలో సీటు వచ్చే వీలుంది. కానీ ఆప్షన్లు పెట్టే సమయంలో టాప్ టెన్‌కే పరిమితమ అవుతున్నారు. దీంతో కోరుకున్న కాలేజీ రావడం లేదు. ఇలా చేయడం వల్ల తనకు వచ్చేందుకు అవకాశం ఉన్న కాలేజీలోనూ సీటు పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్లుఇచ్చేటప్పుడు అప్రమత్తత అవసరం ఆప్షన్లు ఇచ్చేప్పుడు విద్యార్థులు అన్ని అంశాలను పరిశీలించాలి. గత కొన్నేళ్లలో ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందనే అంశాన్ని పరిశీలించాలి. టాప్ కాలేజీలకే ప్రాధాన్యత ఇస్తూ ఆప్షన్లు ఇవ్వాలనే ధోరణి సరికాదు. ఈ దిశగా అనేక కౌన్సెలింగ్‌ల కోసం వేచి చూడటం మంచిది కాదు. మీకు సీటు వచ్చే వీలున్న కాలేజీని మీరు వదులుకుంటే, ఇతరులు ఆ సీటులో చేరతారు. అందువల్ల జాగ్రత్తగా కాలేజీని, బ్రాంచిని ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే మంచి కాలేజీ కోసం తర్వాత కౌన్సెలింగ్‌లో ప్రయత్నించాలి. – ఎంఎన్‌రావు (గణిత శాస్త్ర నిపుణుడు) -
కలిసుంటే కలదు సుఖం
పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్) సెంటర్లో అధికారులు కౌన్సిలింగ్ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. లక్డీకపూల్‌లోని నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ఖలీల్ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ ముందు వరకు ముంతాజ్‌ను బాగానే చూసుకున్న ఖలీల్ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్‌బాగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ చేయడంతో ఖలీల్‌లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్‌శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్ సెంటర్ల పరిధిలో ఏప్రిల్ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లుగృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
9 ఏళ్లలో 75 కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. జిల్లాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో మూతపడుతున్నాయి. కొన్ని రాజధాని పరిసర ప్రాంతాలకు మారుతున్నాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఎన్ని కాలేజీలు ఉంటాయనేది అధికార వర్గాలే స్పష్టత ఇవ్వడం లేదు. కనీస స్థాయి విద్యార్థుల ప్రవేశాలు లేని కాలేజీలు కౌన్సెలింగ్‌లో నిలబడటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ప్రతి ప్రైవేటు కాలేజీకి సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రక్రియ ఇంతవరకూ మొదలవ్వలేదు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా కాలేజీల తనిఖీలు చేపట్టాలనే యోచనలో ఉంది. దీంతో యూనివర్సిటీలు అఫ్లియేషన్ విధానాన్ని మొదలు పెట్టలేదు. మరోవైపు ఎక్కువ కాలేజీలు డిమాండ్ లేని బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్ల తగ్గింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంవత్సరం రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్ని సీట్లు ఉంటాయనేది ఇప్పటివరకు స్పష్టత కరువైంది. ఏటా తగ్గుతున్న కాలేజీలు... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు మినహా, జిల్లాల్లోని కాలేజీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దీంతో అనివార్యంగా మూతపడే పరిస్థితి కన్పిస్తోంది. 2014లో రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2023 కౌన్సెలింగ్ నాటికి ఈ సంఖ్య 159కి పడిపోయింది. తొమ్మిదేళ్ల కాలంలోనే దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. 2017 నుంచి కాలేజీలు కనుమరుగవ్వడం ఎక్కువైంది. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లల్లో తప్ప, ఇతర బ్రాంచీల్లో పది మంది కూడా చేరే పరిస్థితి కనిపించడం లేదు. పలు జిల్లాలకు చెందిన కాలేజీ యాజమాన్యాలు దాదాపు 15 కాలేజీలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మార్చుకునేందుకు దరఖాస్తులు పెట్టాయి. మరో పది కాలేజీలు ఈసారి అఫ్లియేషన్ నిబంధనలకు దూరంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల విముఖతే సమస్య.. జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సీట్లను పెంచుకునేందుకు జిల్లా కాలేజీలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో అధ్యాపకుల కొరత సమస్య కాలేజీలను వేధిస్తోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ జిల్లాల్లో ఉండటం లేదు. ఈ కారణంగా కాలేజీల నిర్వహణ అతికష్టంగా ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనికి తోడు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ తర్వాత తక్షణ ఉపాధి కోరుకుంటున్నారు. ఆలోచనల్లో మార్పు విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వీటికే మార్కెట్ ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లో ఉంటే ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభమనే ఆలోచనలతో ఉన్నారు. ఈ పరిణామాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీల నిర్వహణను కష్టంగా మారుస్తున్నాయి. అన్ని బ్రాంచీల్లోనూ సరికొత్త సాంకేతిక బోధన విధానం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
ఈసారి ఇంకా ఆలస్యంగా టీఎస్ఈఏపీ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి కౌన్సెలింగ్ ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ మొదలవ్వకపోవడం ఈ అనుమానా లకు తావిస్తోంది. ఇంజనీరింగ్‌కు సంబంధించిన కొన్ని బ్రాంచీల్లో సీట్ల పెంపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. మరికొన్ని బ్రాంచీల్లో సీట్ల కుదింపును కాలేజీలు కోరుకుంటున్నాయి. వీట న్నింటిపైనా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కాలేజీలకు అను బంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం యూనివర్సిటీ బృందాలు కాలే జీలను సందర్శించాల్సి ఉంటుంది. మౌలిక వస తులు ఏ మేరకు ఉన్నాయి? ఫ్యాకల్టీ పరిస్థితి ఏమిటి? అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే అనుబంధ గుర్తింపు ఇస్తారు. అప్పుడే కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనే వీలుంటుంది. కానీ ఇప్ప టివరకు ఇందుకు సంబంధించిన సమావేశమే జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యానికి కారణాలేంటి? రాష్ట్ర ఈఏపీసెట్ మే 7వ తేదీ నుంచి మొదలై 11తో ము గుస్తుంది. నెల రోజుల్లో ఫలి తాలు వెల్లడిస్తారు. అదే రోజు కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటిస్తారు. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లను బ్రాంచీల వారీగా వెల్లడించాల్సి ఉంటుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 90 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది మొత్తం 14 వేల సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో పెరిగాయి. ఈ ఏడాది కూడా మరి కొన్ని సీట్లు పెంచాలని కాలేజీలు కోరుతు న్నాయి. గత ఏడాది తనిఖీల ప్రక్రియపై ఆరో పణలు వచ్చాయి. మౌలిక వసతులు, సరైన అధ్యాపకులు లేకుండా అనుబంధ గుర్తింపు ఇచ్చి నట్టు కొన్ని వర్సిటీలపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ప్రత్యేక బృందాలను నియమించాలని నిర్ణయించారు. వసతులు లేని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచి సీట్ల కుదింపు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ఆల స్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే కౌన్సెలింగ్ సకాలంలోనే జరుగుతుందని భావిస్తు న్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
ఒత్తిడి తగ్గాలి..నైపుణ్యం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే ముందే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు విడుదల చేసింది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు దీన్ని పాటించాలంది. మారిన బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఐసీటీఈ రెండేళ్లుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను కూడా కౌన్సిల్ పరిగణనలోనికి తీసుకుంది. జాతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే మానసిక ఒత్తిడికి కారణమని భావిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక్కసారిగా మూస విధానం నుంచి స్వతహాగా ఆలోచించే విద్యావిధానంలో అడుగుపెడుతున్నారు. ఇది కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతోందని ఏఐసీటీఈ అధ్యయనంలో తేలింది. బ్యాక్లాగ్స్తోపెరుగుతున్నఒత్తిడి... అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మానసిక నిపుణులను నియమించాలి. ఇంటర్మీడియట్ విద్య వరకూ విద్యార్థులు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజనీరింగ్ విద్య ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టే పద్ధతి ఉండదు. కంప్యూటర్ సైన్స్‌లో గణితం భాష ఒక్కసారిగా మారిపోతోంది. రెండో ఏడాదికి వచ్చేసరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్‌లను విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా, దాని ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్‌లోనూ బేసిక్ ఇంటర్ విద్య స్థానంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం. ఈ కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులకు బ్యాక్‌లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విద్యార్థి మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. నిపుణులు విద్యార్థి మానసిక స్థితిని కౌన్సెలింగ్ ద్వారా మెరుగుపరచాలని మండలి సూచిస్తోంది. నైపుణ్య కొరత కూడా కారణమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిభ కనబర్చడం లేదని మండలి భావిస్తోంది. ప్రతి ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మాత్రమే అవసరమైన నైపుణ్యం కలిగిఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇది కూడా నామమాత్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఉపాధి పొందే విషయంలో, ఉద్యోగంలో రాణించే విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. -
రెండు దరఖాస్తులు చాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్ వంటి జాతీయస్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు. ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలేజీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్‌లలో పాల్గొనవచ్చు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. జాతీయ స్థాయి మెరిట్ అయినా వేర్వేరుగా..: దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ ఇలా 67,802 పీజీ మెడికల్ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్ జాబితాలను తయారు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. ప్రైవేట్ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. ► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఎన్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్ ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ఇక రౌడీలపై పాజిటివ్ షీట్లు
సాక్షి, హైదరాబాద్: నేర ప్రవృత్తిని వీడనాడే రౌడీలపై ఇక నుంచి పాజిటివ్ షీట్లు తెరుస్తామని, దీంతో వారు చేసే మంచి పనులు కూడా రౌడీ షీట్ రికార్డులో నమోదవుతాయని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్‌ను తొలగిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. మార్పు కోసం ప్రయత్నించే రౌడీలకు సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఆదివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వందకు పైగా రౌడీ షీటర్లు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు వాటిని వీడనాడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాలని సూచించారు. తొందరపాటులో నేరాలు చేసి నా సరే.. తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. డాక్టర్ బిడ్డలు డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు పోలీసులు అవుతున్నారని.. రౌడీ షీటర్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఇదో మంచి అవకాశమని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక నుంచి డిసెంబర్ 31 అంటే రౌడీ మార్పు దినోత్సవంగా గుర్తిండిపోవాలని పిలుపునిచ్చారు. రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి ధారావత్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ –1 గిరిధర్ రావుల, ఎస్ఓటి డీసీపీ–2 మురళీధర్ పాల్గొన్నారు. -
హార్టీకల్చర్ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హార్టీసెట్–2023లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కౌన్సెలింగ్‌కు 300 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ టి.జానకీరామ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యాన విద్యకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు, ప్రైవేటు యాజమాన్యంలోని నాలుగు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో హార్టీసెట్ ద్వారా బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి మొత్తం 92 సీట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యాన కళాశాలల్లో 52 సీట్లు, ప్రైవేటు ఉద్యాన కళాశాలల్లో 40 సీట్లకు ఈ కౌన్సెలింగ్ జరిగింది. -
అమెరికా సంబంధం అని పెళ్లిచేశారు..నెల తిరిగేసరికి విడాకుల నోటీస్
జానకి, రమేష్‌లకు సునీత ఒక్కగానొక్క కూతురు. ఆమె ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తమ కూతురు ఇంజినీర్ కాబట్టి ఇంజినీర్ సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందులోనూ విదేశీ సంబంధమైతే మంచిదనుకున్నారు. తనకు విదేశాలకు వెళ్లడం ఇష్టంలేదని, ఇక్కడే తల్లిదండ్రులకు దగ్గరగా ఉండటమే ఇష్టమని సునీత చెప్పినా పట్టించుకోలేదు. తమ కులం వాడు, శాకాహారి, సిగరెట్, మద్యం తాగనివాడు అయ్యుండాలని విపరీతంగా వెదికారు. చివరకు అన్నీ కుదిరిన అమెరికా సంబంధం దొరికింది. అక్కడున్న స్నేహితులతో అతని గురించి ఎంక్వయిరీ చేయించారు. అన్నీ బాగున్నాయని తెలుసుకున్నాక సంబంధం ఫిక్స్ చేశారు. వరుడి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి ఆర్భాటంగా చేశారు. వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ సమర్పించారు. పెళ్లయిన 15 రోజులకే కూతుర్ని ఆనందంగా అమెరికా పంపించారు. అమెరికా వెళ్లిన కొత్తల్లో సునీత కాపురం పిక్నిక్స్, పార్టీలు, సైట్ సీయింగ్లతో సంతోషంగా సాగింది. మూడునెలల తర్వాత ఫ్రెండ్స్‌తో పార్టీ అని వెళ్లిన సునీల్ తాగి వచ్చాడు. అదేమిటని అడిగితే ‘ఫ్రెండ్స్ బలవంతం చేశార’ని చెప్పాడు. ఆ తర్వాత వారం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినప్పుడు మళ్లీ తాగడంతో పాటు మాంసాహారం కూడా తిన్నాడు. అది చూసి సునీత షాకయ్యింది. అదేమిటని నిలదీస్తే ‘‘పెళ్లికి ముందు సవాలక్ష చెప్తాం, అలాగని అన్నిటికీ మడి కట్టుకుని కూర్చుంటామా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్లాగే ఉండాలి’’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. వీటన్నింటికీ మించి మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటం, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేయడం, ఎడాపెడా అబద్ధాలు చెప్పడం, అడిగితే చేయి చేసుకోవడం సునీతను కలచివేసింది. ‘‘నువ్వో పల్లెటూరి బైతువి, నిన్ను చేసుకోవడం నా ఖర్మ’’ అంటూ రోజూ తిట్టేవాడు. ఇవన్నీ భరించలేక సునీత డిప్రెషన్‌కి లోనయ్యింది. సునీల్ ఆమెను ఇండియాకు తీసుకొచ్చి వాళ్లమ్మ వాళ్లింట్లో దింపేసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పుడుగాని జానకి, రమేష్‌లకు అసలు విషయం తెలియలేదు. వాళ్లు ఫోన్లో అడిగితే... ‘‘సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నదాన్ని నాకు కట్టబెట్టి అన్యాయం చేశారు. మీ అమ్మాయి నాకు అక్కర్లేదు. విడాకులు ఇచ్చేస్తున్నా’’ అని చెప్పి, నెల తిరిగేసరికి విడాకుల నోటీస్ కూడా పంపాడు. దాంతో సునీత మరింత డిప్రెషన్‌కి లోనయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెను కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరు శారీరక, మానసిక, లైంగిక అవసరాలు ఉంటాయి. ప్రేమ వివాహమైనా, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమైనా భాగస్వాములు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో ఊహించడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవేవీ గుర్తించకుండా జానకి, రమేష్‌లు చేసిన తప్పే చేస్తుంటారు. పెళ్లికి కులం, గోత్రం, జాతకాలు కలిస్తే చాలనుకుంటారు. మంచి జాబ్ ఉంటే భేషనుకుంటారు. కానీ పెళ్లి చేసుకోబోయే వారిద్దరి ఇష్టాయిష్టాలు, మనసులు, మనస్తత్వాలు, అలవాట్లు కలవాలని ఆలోచించరు. ప్రయత్నించినా సునీల్ లాంటి వారు నెగెటివ్ పాయింట్స్ దాచి పాజిటివ్స్‌ను మాత్రమే ముందుంచుతారు. ఈ సమస్యకు పరిష్కారమే ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్. ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుంది? ప్రీ–మేరిటల్ కౌన్సెలింగ్ అనేది జంటలను మానసికంగా వివాహానికి సిద్ధం చేయడానికి సహాయపడే చికిత్స. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండగలరని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకరికొకరు వారి వైవాహిక సంబంధాన్ని గురించి వారి దృక్కోణాలను అంచనా వేయడానికి రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి విడివిడిగా ప్రశ్నలు అడుగుతారు.ఫైనాన్స్, కమ్యూనికేషన్, నమ్మకాలు, విలువలు, ఆప్యాయత, సెక్స్, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ బాంధవ్యాలు, బాధ్యతలు, డెసిషన్ మేకింగ్, యాంగర్ మేనేజ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, లైఫ్ స్టైల్, వైవాహిక జీవితంలో ఒత్తిళ్లు, వాటిని ఎదుర్కొనే విధానంలాంటి వివిధ అంశాల గురించి చర్చిస్తారు. ప్రి–మేరిటల్ కౌన్సెలింగ్ వల్ల ఉపయోగాలు ►వివాహ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కాబోయే వధూవరులను సిద్ధం చేస్తుంది. ► తమను తాము మార్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి, భాగస్వాములతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడుతుంది. ► వధువు లేదా వరుడు మానసికంగా వివాహానికి సిద్ధమైనట్టయితే.. తగిన భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి సరైన దారి చూపుతుంది. ► వ్యక్తిగత యోగ్యతలను అంచనావేయడానికి బదులుగా భాగస్వాముల మధ్య అనుకూలతను అంచనా వేసుకోగలరు. ► జంట మధ్య సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ► భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి, వివాహానికి వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడానికి సహాయపడుతుంది. ► సంఘర్షణ–పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి. ఈ అంశంపై ఎన్ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
ముగిసిన ఎంసెట్–23 ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్–2023 ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో వివిధ కాలేజీల్లో 16,296 ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. ఇవి ఖాళీగా ఉన్నట్టే లెక్క. అడపాదడపా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే సీట్లు నింపుకునే అవకాశముంది. ఇలా నిండేవి స్పల్పంగానే ఉంటాయి. ♦ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కోర్సుల్లో 5,723 సీట్లు, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ల్లో 4,959, సివిల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో 5,156, ఇతర బ్రాంచ్‌ల్లో మరో 458 సీట్లకు అడ్మిషన్లు జరగలేదు. ♦ రాష్ట్రంలో 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్ సీట్లుండగా, వీటిలో 69,375 సీట్లు (80.97శాతం) భర్తీ అయ్యాయి. ♦ యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు, 289 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 29లోగా ఫీజు చెల్లించాలి ఎంసెట్–23 స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. ఈ సీట్లు పొందిన వారు ఈనెల 29లోపు ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు టీసీతో పాటు ఒరిజినల్ సరి్టఫికెట్లు కాలేజీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. -
ఉన్నత విద్యపై ఉన్మాదపు రాతలెందుకు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే పని అన్నట్టు ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలు మానడం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ భూతద్దం పెట్టి వెతకడం.. అందులో ఏమీ దొరక్కపోయినా తన విష పుత్రిక ‘ఈనాడు’లో విషం జిమ్మడం రామోజీకి నిత్యకృత్యంగా మారింది. ఈ కోవలోనే వాస్తవాలను వక్రీకరించి ‘ఉన్నత విద్యలో గాడి తప్పిన క్యాలెండర్’ అంటూ శనివారం ‘ఈనాడు’లో దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా రంగాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది. అయితే చంద్రబాబు అనే గుడ్డి గుర్రానికి పళ్లు తోమడమే పనిగా పెట్టుకున్న రామోజీకి ప్రభుత్వం చేసిన మంచి పనులు కనిపించడం లేదు. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు ప్రభుత్వం ఏం చేసినా తప్పే.. ఏం చేయకపోయినా తప్పే అనే రీతిలో అడ్డగోలు రాతలకు దిగజారుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు కథనానికి సంబంధించి వాస్తవాలు ఇవిగో.. కరోనాతో దెబ్బతిన్నషెడ్యూల్ సాధారణ స్థితికి.. కరోనా కాలంలో దాదాపు పదినెలల విద్యా సంవత్సరాన్ని కోల్పోయినా గత రెండేళ్లలో ఆ కాలాన్ని క్రమబద్ధీకరించి రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం సాధారణ స్థితికి తెచ్చింది. ప్రస్తుతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాల ప్రక్రియ నడుస్తోంది. తెలంగాణలోనూ ఇప్పుడే పలు కోర్సులకు ప్రవేశాల ప్రక్రియ చేపట్టారు. వాస్తవం ఇలా ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నత విద్యలో క్యాలెండర్ గాడి తప్పిందని రామోజీ దుష్ప్రచారానికి దిగారు. వాస్తవానికి విద్యార్థులు రాష్ట్రంలో పలు సెట్స్ రాసినా వారి మొదటి ప్రాధాన్యత సెంట్రల్ యూనివర్సిటీలకే ఉంటుంది. దీంతో విద్యార్థులు మంచి అవకాశాలు కోల్పోరాదన్న భావనతో ఏపీ పీజీఈ సెట్ కౌన్సెలింగ్‌ను ఆగస్టు 11న చేపట్టారు, సెప్టెంబర్ 6న ఐసెట్, 11న పీజీసెట్, 26న లాసెట్, 30న ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని గతంలోనే షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6న, టీఎస్ పీజీసెట్‌ను మూడో వారంలో నిర్వహించనున్నారు. పలు సెంట్రల్ యూనివర్సిటీలు కూడా సెప్టెంబర్‌లోనే ప్రవేశ ప్రక్రియ చేపట్టబోతున్నాయి. అందుకు అనుగుణంగా ఏపీ సెట్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోనే అనర్థం జరిగిపోతోందంటూ రామోజీ తనకలవాటైన రీతిలో ఏడుపు లంకించుకున్నారు. యూజీసీ నిబంధనలు పట్టవా రామోజీ? మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యపై బురద చల్లడమే ‘ఈనాడు’ పనిగా పెట్టుకుంది. సజావుగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా తీవ్ర అపరాధంగా చిత్రీకరించేందుకు నానా అగచాట్లు పడుతోంది. ఇలాగే ఆర్–సెట్ విషయంలోనూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసింది. యూజీసీ.. పీహెచ్డీ ప్రవేశాల నిబంధనలను మార్చడంతో మన ఆర్–సెట్ జీవో కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. ముందుగా జేఆర్ఎఫ్ అభ్యర్థుల అడ్మిషన్స్ పూర్తి చేశాకే రాష్ట్ర సెట్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఒక జాప్యంగా ‘ఈనాడు’ చూపడం ప్రభుత్వంపై బురద చల్లడంలో భాగమే. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పైనా వ్యంగ్యమేనా? అడ్మిషన్స్ ప్రక్రియకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తూ ‘ఈనాడు’ తన కుత్సిత బుద్ధిని చాటుకుంది. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై దిశానిర్దేశం చేస్తే దాన్ని కూడా వ్యంగ్యానికి వాడుకోవడం రామోజీకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతతో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. గత నాలుగేళ్లలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై గతంలో ఏ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయలేదు. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ.. ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వస్తున్న మంచి పేరును దెబ్బతీసే ప్రక్రియలో భాగంగానే ‘ఈనాడు’ ఇలాంటి విష ప్రచారానికి దిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం లేదని రామోజీ తీర్మానించేశారు. రెండేళ్లుగా విద్యార్థులు సాధించిన సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్స్, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్లేస్‌మెంట్స్ సమన్వయానికి నిదర్శనాలుగా నిలుస్తున్నా ఆయన పచ్చ కళ్లకు కనిపించడం లేదు. దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా వ్యవస్థని మెచ్చుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాలు మన పథకాలను అమలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ రామోజీ మాత్రం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. -
19 వేల సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు ఇంకా 19,049 మిగిలాయి. ఆదివారం మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ లెక్క తేలినట్టు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు 3,034 వరకూ ఉన్నాయి. ఈసారి సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ సీట్లను అన్ని కాలేజీలు ముందే భారీగా తగ్గించుకున్నాయి. ఈ బ్రాంచీల్లో మొత్తం 7 వేల సీట్లకు కోత పడింది. ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులే 56,811 ఉన్నాయి. ఈ విధంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెరగడంతో టాప్ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో మాత్రం కంప్యూటర్ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువే (కాలేజీలు తగ్గించుకోవడం వల్ల) ఉన్నప్పటికీ, చివరకు వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలాయి. ఇలా మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. -
నేడు తుది దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరగనుంది. ఈ విడతలో వివిధ బ్రాంచీలకు చెందిన 19 వేల సీట్లను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు ఆ విడతలో సీట్లు లభించినా రిపోర్టు చేయకపోవడంతో మిగిలిపోయిన 18 వేల సీట్లను కలిపి రెండో దశలో 30 వేలకుపైగా సీట్లు కేటాయించారు. రెండో దశలోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఆ విడతలో సీట్లు లభించినా 7 వేల మంది చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌లో 19 వేల వరకూ సీట్లు కేటాయించనున్నారు. 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ తుది విడత సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. ఎన్ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ కూడా పూర్తవ్వడంతో వాటిల్లో సీట్లు పొందని వారికి ఇది ఉపయోగపడుతుంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వగానే ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేసి సీటు దక్కించుకోవాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పిడి చేసుకోవాలి. వేరొక కాలేజీలో సీటు వచి్చన పక్షంలో అంతకుముందు రిపోర్టు చేసిన కాలేజీలో టీసీ, ఇతర సరి్టఫికెట్లను ఈ నెల 25లోగా తీసుకొని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టు చేయాలి. యాజమాన్య కోటా సీట్ల పరిశీలన ఎంసెట్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ప్రత్యేక కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను పంపాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐ సిఫార్సులకు సీట్లు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. జేఈఈ, ఎంసెట్ ర్యాంకులను, ఇంటర్లో వచి్చన మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ రూల్స్ ఎంతమేర పాటించారనేది అధికారులు పరిశీలిస్తారు. -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ శనివారం ముగిసిందని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. మొత్తం 1,086 మందికి గాను 904 మంది విద్యార్థులు మొదటి విడతలో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. మిగిలిన 182 సీట్లు రెండవ విడతలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ నెల 24, 25వ తేదీల్లో ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. -
ముగిసిన నూజివీడు ట్రిపుల్ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
నూజివీడు/వేంపల్లె: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తోన్న ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 540 మంది అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించి పిలవగా అందులో 475 మంది హాజరయ్యారు. వారందరికీ సీట్లు కేటాయించారు. రెండు రోజుల్లో 1,085 మందికి గాను 956 మందికి అడ్మిషన్లు కల్పించారు. కౌన్సెలింగ్‌కు రాని అభ్యర్థులు ఇంటర్, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి ఉండొచ్చని ట్రిపుల్ఐటీ అధికారులు భావిస్తున్నారు. మరో 129 సీట్లు మిగిలిన నేపథ్యంలో 4 ట్రిపుల్ఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత రెండో జాబితాను ప్రకటించి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియను డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభమైంది. టాప్‌లో నిలిచిన విద్యార్థులు కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి చెందిన ఆకుల ప్రేమ్‌సాయి, కడప జిల్లా సోములవారిపల్లె గ్రామానికి చెందిన శీల హరిణి, కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందిన సోమల వెంకటరామ శరణ్య, నంద్యాల జిల్లా అవుకు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ సమీర్, ప్రకాశం జిల్లా దొర్నాల గ్రామానికి చెందిన బండారు కార్తీక్‌లు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచురెడ్డి, వైస్ చాన్స్‌లర్ విజయ్‌కుమార్‌ల చేతుల మీదుగా అడ్మిషన్ల పత్రాలను పొందారు. మొదటి రోజు 444మంది అడ్మిషన్లు పొందారు. -
వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రవేశాలకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ విడుదల చేసింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 100 శాతం సీట్లకు ఈ నెల 27 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్య నీట్–పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి ఆగస్టు రెండో తేదీ మధ్య వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు మూడు, నాలుగు తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. ఏడో తేదీ నుంచి 13వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 16వ తేదీకి తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రెండోవిడత, 7వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య ఉంటుంది. రాష్ట్రంలో సీట్లకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, డెంటల్ కళాశాలలు, స్విమ్స్ తిరుపతిలో రాష్ట్ర కోటా పీజీ, ఎండీఎస్ సీట్ల భర్తీకి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ ప్రవేశాల కోసం http://pgcq.ysruhs.com/ ఎండీఎస్ ప్రవేశాల కోసం https://mdscq. ysruhs.com/ వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వాలి. శనివారం (నేడు) ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ పీజీ–2023, ఎండీఎస్–2023లో అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. నియమ, నిబంధనల్లో సందేహాల నివృత్తికి 8978780501, 7997710168, 9391805238, 9391805239, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, 90634 00829, పేమెంట్ గేట్‌వేపై స్పష్టత కోసం 8333883934 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్ర్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలి పారు. అభ్యర్థనలను appgadmissions2021 @gmail. comM మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొన్నారు. -
20 నుంచి ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు. కాలేజీలు, సీట్ల వివరాలను ఈ నెల 20వ తేదీన ఎంసీసీ, ఎన్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, అదే రోజున ఉదయం పది గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రే షన్ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇవ్వనున్నట్టు తెలిపింది. 29వ తేదీన సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. ఆగస్ట్ నాలుగో తేదీ నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఆగస్ట్ 7 నుంచి 28వ తేదీ వరకూ రెండో దశ, ఆగస్ట్ 31వ తేదీ నుంచి సెపె్టంబర్ 18వ తేదీ వరకూ మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మూడో దశలో మిగిలిన సీట్లకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. 15 శాతం అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 15 శాతం అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఈ సీట్లలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరతారు. కాగా, ఈసారి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌ను మార్పు చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) భావించింది. ఆ ప్రకారం అఖిల భారత స్థాయి కౌన్సెలింగ్, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి న అభ్యర్థనల మేరకు ఈసారి కొత్త విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంటే అఖిల భారత కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ మేరకు జాతీయ, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లు వేర్వేరు తేదీల్లో కొనసాగుతాయి. అయితే రాష్ట్రాల కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఎన్ఎంసీ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకటించలేదు. -
టాపర్లంతా క్యాంపస్ కాలేజీలకే.. ఎక్కువ మంది మొగ్గు చూపింది ఈ కోర్సుకే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆప్షన్లు ఇచ్చే గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 16న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. తొలి దశలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సీట్లు పెరగడం, సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వస్తాయని భావించడంతో ఎక్కువ మంది ఈ కోర్సును ఎంచుకున్నారు. విద్యార్థులు మొత్తం 49,42,005 ఆప్షన్లు ఇవ్వగా, వీటిలో 38 లక్షల వరకూ కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 3,777 సీట్లు ఉంటే, విద్యార్థుల నుంచి 10 లక్షలకు మించి ఆప్షన్లు రాలేదు. గడువు ముగిసే నాటికి మొత్తం 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఒకే విద్యార్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లు ఇచ్చారు. వాస్తవానికి 12వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పొడిగించారు. ర్యాంకర్ల నుంచి కన్పించని స్పందన తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ ర్యాంకులు పొందిన వారు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లు అతి కొద్ది ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. విశ్వవిద్యాలయాల క్యాంపస్ పరిధిలో ఉండే సీట్లకు పోటీ పడ్డారు. 500 ర్యాంకు దాటిన వారు మాత్రం టాప్ టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. ఎంసెట్‌లో వెయ్యి వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులు తొలి కౌన్సెలింగ్‌లో 500లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా ర్యాంకర్ల చేతే దరఖాస్తు చేయించి, సీటు వచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్ సమయంలో రద్దు చేయించడం ఆనవాయితీగా సాగుతోంది. ఈ సంవత్సరం దీనిపై దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో వారు పొందిన సీట్ల వివరాలు తెప్పించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది. దీంతో సీట్లను బ్లాక్ చేసే యాజమా న్యాలకు సహరించేందుకు విద్యార్థులు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో ఉండే సీట్ల కోసమే ర్యాంకర్లు పోటీప డ్డారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలో 2,580, కాకతీయ పరిధిలోని 1,080 సీట్లతో కలుపుకొని రాష్ట్రంలోని 9 వర్సిటీల పరిధిలో మొత్తం 4,773 సీట్లున్నాయి. వీటికే టాపర్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. తొలి విడతలో 76,359 సీట్లు ఈ ఏడాది సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. 7 వేల వరకూ సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌లో తగ్గించుకున్న కాలేజీలు, ఆ మేర కంప్యూటర్ బ్రాంచీల్లో పెంచుకున్నాయి. దీంతోపాటు అదనంగా మరో 7 వేల వరకూ సీఎస్సీలో సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 42,087 సీట్లు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ బ్రాంచీల్లో ఉన్నాయి. -
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వినర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్)– 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటినుంచి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఈ నెల 10వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీచేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ స్కోర్ 291 మార్కులు అభ్యర్థులు నీట్ పీజీలో కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత 50 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 291 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కనీస అర్హత 40 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 257 మార్కులు, దివ్యాంగుల కనీస అర్హత 45 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 274 మార్కులు సాధించి ఉండాలని వర్సిటీ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలు ♦ అభ్యర్థి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపుపొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ♦ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి శాశ్వత నమోదు చేసుకొని ఉండాలి. ♦ కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ♦ ఎంబీబీఎస్ చదివినవారు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల నుండి వచ్చే నెల 11వ తేదీ లేదా అంతకు ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. 11 ఆగస్టు 2023 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే అభ్యర్థులు సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ♦ సర్విస్‌లో ఉన్న అభ్యర్థుల విషయంలో 30 జూన్ 2023 నాటికి వారు అందించిన సేవలను పరిగణలోకి తీసుకుంటారు. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు రూ.5500 ♦ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5500 (బ్యాంక్ లావాదేవీల చార్జీలు అదనం), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5000 (బ్యాంకు లావాదేవీల చార్జీలు అదనం). రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ♦ అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అడ్మిట్ కార్డ్, నీట్ పీజీ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్, పర్మినెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తదితరాలు సమర్పించాలి. ♦ ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే సాయం కోసం 9392685856, 7842542216 నంబర్లను సంప్రదించవచ్చు. -
బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!
సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్‌నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్‌కు వచ్చారు. సునీత, సురేష్‌లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్‌కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్‌కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్‌కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు. జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్‌కు కూడా. భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్‌ల మధ్య ఇది శూన్యం. మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్‌కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం. అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్‌పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు. నిరంతరం ప్రయత్నించాలి.. ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్‌లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్‌ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి. ఆత్మీయతకు ఆటంకాలు ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది. (చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!) -
గురుకుల సీటుకు సిఫారసు కట్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురు కుల విద్యాసంస్థల్లో సిఫారసు లేఖలకు కాలం చెల్లింది. గురు కులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగి శాక మిగులు సీట్ల భర్తీలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫా రసు లేఖలను ఏమాత్రం పరిగణ నలోకి తీసుకో రాదని... కేవలం మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. గత నెలలో ప్రవే శాల ప్రక్రియను ప్రారంభించిన గురుకుల సొసై టీలు తొలివిడత కౌన్సెలింగ్ చేపట్టి సీట్లు పొందిన విద్యార్థులకు గడువులోగా నిర్దేశిత విద్యాసంస్థల్లో రిపోర్టు చేయాల్సిందిగా స్పష్టం చేశాయి. మెజారిటీ విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరగా మిగులు సీట్లకు సంబంధించి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఆశావహులు భావించారు. కానీ గురుకుల సొసైటీలు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేయలేదు. మరోవైపు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమవగా బోధన సైతం వేగంగా కొనసాగుతోంది. మెరిట్‌కే పరిమితం...: రాష్ట్రంలో ఐదు గురుకుల విద్యాసంస్థల సొసైటీలు న్నాయి. మహాత్మా జ్యోతిభాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం పాఠశాల విద్యాశాఖ పరిధిలో కొనసాగుతోంది. ఐదు సొసైటీల పరిధిలో 1005 పాఠశాలలు, కళాశాలలున్నాయి. వాటిలో ఐదో తరగతి అడ్మిషన్లతోపాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్‌కు ఏటా అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలో ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మిగతా తరగతులకు మాత్రం సొసైటీలు వేరువేరుగా ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. -
ఈసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పలు డిప్లొమా కోర్సులు పూర్తిచేసి, ఇంజనీరింగ్ ద్వితీ య సంవత్సరంలో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్–2003) ఫలితాల ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 20,988 మంది (93.07 శాతం) అర్హత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించినవారి లో 14,415 మంది పురుషులు, 6,484 మంది మహిళలు ఉన్నారు. బీఎస్సీ (మ్యాథ్స్), కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాని క్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ బ్రాంచీల్లో 9 వేల సీట్లు ఉన్నా యని, వీటికి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి తెలిపారు. విలే కరుల సమావేశంలో ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఓయూ వీసీ డి.రవీందర్ పాల్గొన్నారు. -
పెరుగుతున్న గృహ వేధింపులు!
సామాజికంగా ఎన్ని మార్పులు చేసుకుంటున్నా.. గృహ హింసలో మాత్రం తగ్గుదలఉండడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తింటి వారి వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న గృహ హింస సంబంధిత ఫిర్యాదుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అయితే గతంలో మాదిరిగా ఇంటి పరువు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న భయాన్ని గృహిణులు వీడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ గత ఐదేళ్లలో నమోదైన గృహ హింస ఫిర్యాదులను పరిశీలిస్తే.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 మంది మహిళలు గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో కొందరు నేరుగా మహిళా భద్రత విభాగానికి, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, మరికొందరు మహిళా భద్రత విభాగం వాట్సాప్ నంబర్‌కు, ఈ–మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, షీటీమ్స్, ఇతర చర్యలతో మహిళల్లో పోలీసులపై భరోసా పెరగడం వల్ల కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గృహ హింస ఫిర్యాదులు పెరగడానికి, మహిళల్లో పెరిగిన అవగాహన, భరోసాయే కారణమని పేర్కొన్నారు. మహిళా భద్రత విభాగానికి వచ్చే గృహ హింస ఫిర్యాదులపై సఖి, భరోసా సెంటర్ల ద్వారా, అవి అందుబాటులోని లేని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రైవేటు కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్నిటిని కుటుంబీకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఏపీ ‘గురుకుల’ ఫలితాల వెల్లడి
సాక్షి,అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ సంస్థ పరిధిలో 38 పాఠశాలలు, 7 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 3,195 సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న 356 ఖాళీల భర్తీకి, ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ విభాగాల్లో ఉన్న 1,149 సీట్లకు, డిగ్రీలోని బీఏ, బీకాం, బీఎస్సీలోని 4,852 సీట్లకు గత నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్ నంబర్లతో పాటు వారి పాఠశాలలకు కూడా పంపించామని, https://aprs.apcfss.in వెబ్సైట్లో కూడా ఉంచామన్నారు. మొత్తం అన్ని విభాగాల్లోను 87,252 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు. వీరికి ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులైనవారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాగా, 12 మైనార్టీ పాఠశాలలు, 3 జూనియర్ కాలేజీల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చేపడతామని చెప్పారు. తొలి స్థానంలో నిలిచింది వీరే.. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 100 మార్కులకు, ఇంటర్, డిగ్రీ కాలేజీ ఎంట్రన్స్ టెస్ట్ 150 మార్కులకు నిర్వహించారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లను గురుకుల విద్యాలయ సంస్థ వెల్లడించింది. ♦ ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లాకు చెందిన బి.దిలీప్ కృష్ణ 99 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆరో తరగతిలో పి.జితేంద్రకుమార్ (శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో జీకే సాయిపవన్ (పశ్చిమ గోదావరి), ఎనిమిదో తరగతిలో కె.నవీన్ కుమార్ (కృష్ణా జిల్లా) మొదటి స్థానం సాధించారు. ♦ ఇంటర్ కేటగిరీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.సాయి సృజన (ఎంపీసీ) 146 మార్కులు, టీ సాహితి (బైపీసీ) 140 మార్కులు, విజయనగరం జిల్లాకు చెందిన కేవీ.వంశీకృష్ణ నాయుడు (ఎంఈసీ/సీఈసీ) 133 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. ♦ డిగ్రీ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.అచ్యుతరావు (బీఏ), విజయనగరం జిల్లాకు చెందిన ఎం.జ్ఞానతేజ (బీకాం), టి.పునీత్ కుమార్ (బీఎస్సీ–ఎంఎస్సీఎస్), పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎస్.తేజ (బీఎస్సీ–ఎంపీసీ) విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించారు. -
మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల భర్తీకి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి కోఠీలో ఉన్న డీఎంఈ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు. మల్టీ జోన్ –1 అభ్యర్థులకు 15, 16 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మల్టీ జోన్ –2 అభ్యర్థులకు 17, 18 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మల్టీ జోన్ 1, 2 రెండింటిలోని సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు 19వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అభ్యర్థులందరూ డీఎంఈ వెబ్సైట్లో పేర్కొన్న సూచనలు పాటించాలని, ఆ ప్రకారం సంబంధిత ధ్రువీకరణపత్రాలతో పాటు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. జోన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా వివరాల షెడ్యూల్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://dme.telangana.gov.in లో ఉంచామని తెలిపారు. 1442 పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 34 స్పెషాలిటీలకు చెందిన 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను మెడికల్ – హెల్త్ సర్వి సెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 8వ తేదీన ప్రకటించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొని రావాలి. బోర్డుకు అందజేసిన దరఖాస్తు ఫారం కాపీ, బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన నాన్ క్రిమీలేయర్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి. సీట్ మ్యాట్రిక్స్‌ను కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శిస్తారు. ఉదయం పూట కౌన్సిలింగ్ ఉన్న అభ్యర్థులు 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం సమయం కలిగిన అభ్యర్థులు 1.30 గంటల కల్లా చేరుకోవాలి. ఏ రోజు ఎవరికి కౌన్సిలింగ్? ♦ 15వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాడయాగ్నసిస్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, జనరల్ మెడిసిన్, టీబీసీడీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 16వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకే జనరల్ సర్జరీ, ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ విభాగాల్లో నిర్వహిస్తారు. ♦ 17వ తేదీన మల్టీ జోన్–2 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, టీబీసీడీ, జనరల్ సర్జరీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 18వ తేదీన ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ రేడియో డయాగ్నసిస్ విభాగాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ♦ 19వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మల్టీ జోన్ –1 అభ్యర్థులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి మల్టీ జోన్–2 అభ్యర్థులకు ఈఎండీ, రేడియేషన్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ ఎఈడీ, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రైనాలజీ, ఎంఈడీ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ఐఫోనా మజాకా? మైనర్ కిడ్నాప్ డ్రామా...కట్‌చేస్తే..!
ఖరీదైన ఐఫోన్ కోసం 9వ తరగతి కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిరు వ్యాపారి అయిన తండ్రి ఐఫోన్ కొనివ్వలేకపోవడంతో ఎలాగైనా తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు చివరికి పోలీసుల చేతికి గతుక్కుమన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తానే కిడ్నాప్ అయినట్టుగా డ్రామా ఆడాడు. ఆ తరువాత తన స్నేహితుడి ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, లొకేషన్‌ను ఆధారంగా వారిని పట్టుకున్నారు. సీతాపూర్ కొత్వాలి పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు మైనర్‌కు ఏడాది వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. దీంతో గారాబంగా పెరిగాడు. రెండు రోజుల క్రితం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని తండ్రి, ఇతర బంధువులు కంగారుపడి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ మొత్తాన్ని ఖైరాబాద్లో(యూపీ) మసీదు సమీపంలో డెలివరీ చేయాలని కూడా చెప్పాడు. దీంతో తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన జిల్లా పోలీసులు, సైబర్, ఎస్ఓజీ బృందాలు వివరాలు ఆరాతీశారు. ఫోన్ ఫుట్‌వేర్ షాప్ యజమానిదిగా గుర్తించి విచారించగా ఆఫోన్‌ను వాళ్లబ్బాయి వాడుతున్నట్టు తేలింది. ఎట్టకేలకు ఇద్దరినీ కనుగొన్న పోలీసులు కౌన్సెలింగ్ అనంతరం వారిని కుటుంబాలకు అప్పగించారు. -
‘చెడు’జోలికి పోకుండా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే 25.3 కోట్ల మందితో అత్యధికంగా యువత కలిగిన దేశం భారత్. ఈ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య కౌమార దశలో (టీనేజిలో) ఉన్నారు. కౌమార దశలో ఉన్న బాలబాలికలు చెడు ప్రభావాలకు గురికాకుండా లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్య సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్లినిక్స్‌లో నమోదు చేసుకునే కౌమార బాలల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన పరిణామం అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో, వివిధ రాష్ట్రాలవారీగా కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో నమోదు సంఖ్య, కౌన్సెలింగ్ తీరుపై విశ్లేషణాత్మక నివేదికను ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో వివిధ రాష్ట్రాల్లో క్లినిక్‌లలో నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది. 2020–21లో కోవిడ్ నేపథ్యంలో ప్రతి లక్ష జనాభాలో 383 మంది ఈ క్లినిక్‌లలో కౌన్సెలింగ్‌కు పేర్లు నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 601కు పెరిగిందని పేర్కొంది. రాష్ట్రంలో కూడా 2020–21లో ప్రతి లక్ష మందిలో 283 మంది నమోదు చేసుకోగా 2021–22లో ఆ సంఖ్య 1,673కు పెరిగిందని పేర్కొంది. యుక్త వయస్సులోని యువతీ యువకులను ఆరోగ్యంగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని, ఈ నేపథ్యంలోనే కౌమార దశలోని బాలికలు, బాలురకు పని, విద్య, వివాహం, సామాజిక సంబంధాల విషయంలో చెడు ప్రభావాలకు లోనుకాకుండా చేయడమే స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో కౌన్సెలింగ్ అని నివేదిక పేర్కొంది. రాష్ట్రీయ కిశోర్ స్వాస్త్య కార్యక్రమం కింద కౌమార ఆరోగ్య సమస్యలు, పౌష్టికాహారం, లింగ ఆధారిత హింస, నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యంతోపాటు పెడ ధోరణులకు లోనుకాకుండా వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. శిక్షణ పొందిన సర్విస్ ప్రొవైడర్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఈ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్స్‌లో 36,56,271 మంది బాలురు, 45,73,844 మంది బాలికలు నమోదయ్యారు. 2021–22లో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో 60 శాతం పైగా కౌమార దశలోని బాల బాలికలు క్లినికల్ సేవలు, కౌన్సెలింగ్ పొందినట్లు నివేదిక పేర్కొంది. 2021–22లో దేశం మొత్తమీద 70 శాతం బాలికలు, 66 శాతం బాలురు క్లినికల్ సేవలు పొందారు. అలాగే 76 శాతం బాలికలు, 69 శాతం బాలురు కౌన్సెలింగ్ తీసుకున్నారు. మన రాష్టంలో 2021 నాటికి 5,28,95,000 జనాభా ఉండగా అందులో 8,85,150 మంది కౌమార బాలలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
డాక్టర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో ఎంబీబీఎస్ అర్హతతో చేప ట్టే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాలకు మంగళవారం నుంచి 3 రోజు లపాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో మల్టీజోన్–1కు చెందిన 452 మంది అభ్యర్థులకు, 29న మల్టీజోన్–2కు చెందిన 282 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది. అభ్యర్థులు హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియ న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కార్యాలయంలో హాజరుకావాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాకపోతే సుమోటోగా పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో పొందిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుగా వస్తే వారి ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్‌లు వస్తాయని, పైరవీలను నమ్ముకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
లా కోర్సుల్లో 5,747 మందికి ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు, ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 6,724 సీట్లు ఉన్నాయి. ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించగా తొలివిడతలో 5,747 సీట్లు భర్తీ అయినట్లు టీఎస్‌సెట్ అడ్మిషన్స్–2022 కన్వీనర్ పి.రమేశ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. అందులో 5,747 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 28 నుంచి డిసెంబర్ 3వ తేదీలోపు నిర్దేశించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. ఈ నెల 30 నుంచే సంబంధిత కోర్సులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. -
పుత్తడి బొమ్మకు పుస్తెల బంధనం
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన పుత్తడిబొమ్మలకు మూడుముళ్ల బంధనాలు వేసి వారి భవితను చిదిమేస్తున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహన లోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వారికి వివరించి పుస్తెల భారం వేయకుండా పుస్తకాలతో చెలిమి చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 17 నుంచి 25వ తేదీలోపు అధికారులు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్లినా..ఇంకా కొందరి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నారేమో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లీడు రాకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లకు వయస్సు రాగానే తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా అని చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2012 నుంచి 2022 వరకు 589 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని అనుకుంటున్న బాలికలకు కొంతమంది తల్లిదండ్రులు మూడుముళ్లతో బంధనాలు వేసి సంసార సాగరంలోకి తోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుస్తెలు వద్దు..పుస్తకాలే ముద్దు అంటూ ఒక వైపు ఊరూరా ప్రచారం చేస్తూ, మరో వైపు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను తల్లిదండ్రులకు సవివరంగా తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ బాల్య వివాహాలు ఎక్కువగా 13 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి జరుగుతున్నాయి. బాల్య వివాహాల జరుగుతున్న ప్రదేశాలకు అధికారులు వెళ్లి పెళ్లి అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వీటిపై అన్ని మండల కేంద్రాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాలపై ఈ నెల 17 వ తేదీ నుంచి 25 లోపు గ్రామ కమిటీల ఏర్పాటు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్‌లైన్ 1098, ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. 2012లోనే జీవో జారీ... బాల్య వివాహ నిరోధక చట్టం 2006కు సంబంధించిన జీవో నంబరు 13ను 2012 మార్చి 19న ప్రభుత్వం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధానికి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటును సూచించింది. జిల్లా స్థాయిలో కమిటీకి కలెక్టరు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్లుగా ఐసీడీఎస్ పీడీ, ఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో చైర్మన్‌గా ఆర్డీఓ, సీడీపీఓ, డీఎస్పీ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీకి చైర్మన్‌గా తహశీల్దారు, మెంబరు కన్వీనర్లుగా ఐసీడీసీ సూపర్వైజర్, ఎస్ఐ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉంటారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ చైర్మన్‌గా, కన్వీనర్‌గా అంగన్వాడీ కార్యకర్త, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, గ్రామానికి చెందిన ఉపాధ్యాయడు, మహిళ వార్డు మెంబరు, ఏఎన్ఎం, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, యువజన సంఘం ప్రతినిధి, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. బాల్య వివాహం నేరానికి శిక్ష.. బాల్యవివాహాన్ని ప్రోత్సహించే వారికి, చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహాన్ని దాచేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఆ వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. న్యాయమూర్తి ఉత్తర్వుల ఉల్లంఘన కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను ఆపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్ లేని శిక్ష విధించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు...పిల్లల ప్రవర్తన కారణంగా.. చాలా చోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడినవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తే.. అమ్మాయి జీవితం బాగుంటుందని భావిస్తున్నారు. మరి కొందరైతే రకరకాల కారణాల ప్రభావంతో పిల్లలు పెడదారి పడుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. అడ్డుకుంటున్నా ..ఆగడం లేదు బాల్య వివాహాలను మాతాశిశు సంరక్షణ అధికారులు అడ్డుకుంటున్నా వివాహాలు ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంత వరకు బాల్య వివాహాలు తగ్గినట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు చేస్తున్నారు. -
కౌన్సెలింగ్‌కు అనుమతించండి.. తెలంగాణ సర్కార్‌కు షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్/బీడీఎస్ కౌన్సెలింగ్‌కు తమను అనుమతించాలని కోరుతూ నలుగురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారిని కౌన్సెలింగ్‌కు అనుమతించాలని ఆదేశించింది. అయితే తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. తమను ఎంబీబీఎస్/బీడీఎస్ కౌన్సెలింగ్‌కు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ భారత మూలలున్న (పీవోఐ: పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) టేకుమాల విదిత సహా మరో ముగ్గురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాము నాలుగేళ్లుగా తెలంగాణలోనే చదువు తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్ఎంసీ, రాష్ట్ర వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణ రావు వర్సిటీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, కేంద్ర తరఫున అడ్వొకేట్ బి.కవిత యాదవ్, ఎన్ఎంసీ తరఫున శ్రీరంగ పూజిత, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎ.సంజీవ్‌కుమార్, కాళోజీ వర్సిటీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. భారత మూలాలున్న వారు, విదేశాల్లో ఉండే భారతీయులు ఇక్కడ ఎంబీబీఎస్/బీడీఎస్ చదివేందుకు అర్హులేనన్నారు. -
Osmania University: ఓయూలో దసరా సెలవులు ఇలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు శనివారం నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్ఎల్ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8 వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 26న పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్–2022 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు. పీజీ ప్రవేశ పరీక్షలో (సీపీజీఈసెట్–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్ తిరస్కరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: టీహబ్–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు ప్రారంభం) -
కంప్యూటర్ సైన్స్ సీటు కోసం పోటాపోటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న మొదలు కానున్న ఇంజనీరింగ్ రెండోవిడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ సీట్లు దక్కించుకునేందుకు ఎక్కువగా పోటీపడుతున్నారు. కన్వీనర్ కోటాతోపాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఈసారి విపరీతమైన పోటీ కన్పిస్తోంది. చాలామంది తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా, సీటు, కాలేజీ నచ్చని కారణంగా వదిలేసుకున్నారు. ఇలాంటివాళ్లు 17 వేలమంది వరకూ ఉన్నారు. ఇందులో చాలామంది కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను ఇష్టపడుతున్నారు. దీంతో రెండోవిడతలో సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కంప్యూటర్ సైన్స్‌సహా పలు అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లకు అనుమతించింది. ఇది కూడా విద్యార్థులు ఆశలు రేకెత్తిస్తోంది. మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందులో సీటు వచ్చేవారు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే అవకాశముంది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని పలువురు విద్యార్థులు భావిస్తున్నారు. ఇదే సరైన సమయం... రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉండగా, 60,208 సీట్లు కేటాయించారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఈ కేటాయింపు జరిగింది. ఈ నెల 13వ తేదీ నాటికి సీటు వచ్చినవారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటే, కేవలం 43 వేల మంది మాత్రమే రిపోర్టింగ్ చేశారు. 17 వేలమంది సీటు వచ్చినా, అది తమకు నచ్చలేదని భావించారు. ఇలాంటివారిలో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే ఉన్నారు. తొలిదశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. అందుకే తమకు ఆశించిన సీటు రాలేదనే భావనతో వారు ఉన్నారు. 25 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలిదశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్సీ)లో సీటు వచ్చినా, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం మొదటి విడతలో జాయిన్ అవ్వలేదు. మేనేజ్మెంట్కు పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్లలో 30 శాతం మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐకి ఇవ్వాలి.నిబంధనలు ఎలా ఉన్నా, యాజమాన్యాలు నచ్చినవారికి, నచ్చిన రేటుకు అమ్ముకోవడం ఏటా జరిగే తంతే. కాలేజీని బట్టి కంప్యూటర్‌సైన్స్ సీట్ల రేట్లు రూ.10 నుంచి 16 లక్షల వరకూ పలుకుతున్నాయి. 40 వేలపైన ఎంసెట్ ర్యాంకు వచ్చినవారిలో చాలామంది మేనేజ్మెంట్లో కంప్యూటర్ సైన్స్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, సీఎస్సీ కోర్సులకు డిమాండ్ బాగా కన్పిస్తోంది. ఈసారి ఆప్షన్లు కీలకమే రెండోవిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల 28 నుంచి మొదలవుతుంది. తొలి విడత కన్నా, ఇది చాలా కీలకమైందని సాంకేతిక రంగం నిపుణులు అంటున్నారు. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెరగడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి పోటీలో పెద్దగా ఉండకపోవడం వల్ల రాష్ట్రస్థాయి విద్యార్థులకు సానుకూలంగా ఉండే వీలుందని చెబుతున్నారు. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు. దాదాపు 5 వేల లోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే ఉండే వీలుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆపై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
ఇంజనీరింగ్‌లో మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గిపో నున్నాయి. దీనిపై సాంకేతిక విద్య విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా పెరిగే సీట్లలో ఎక్కువభాగం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి విభాగాల సీట్లే ఉండనున్నాయి. కొన్ని కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ సీట్లను పెంచనున్నారు. గత మూడేళ్లుగా డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకుని, వాటి స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను పెంచుకునేందు కు అఖిల భారత సాంకేతిక విద్యశాఖ అనుమతించడంతో.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 28 నుంచి ఇంజనీరింగ్ మలి విడత కౌన్సెలింగ్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆ సీట్లు సగానికన్నా తక్కువే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేని పరిస్థితి ఉంది. మొత్తం సీట్లలో వీటి సంఖ్య సగానికన్నా తక్కువే. ఇలా డిమాండ్ లేని కోర్సుల రద్దు, వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతితో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సివిల్ విభాగంలో 5 వేలు, మెకానికల్‌లో 4,615, ఈసీఈ 12,219, ఈఈఈ 5,778 సీట్లు మాత్రమే రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉండబోతున్నాయి. మొత్తం కలిపి ఈ సీట్ల సంఖ్య 27,612 మాత్రమే. పెరిగే 9,240 కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపితే.. రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 80,526 సీట్లకు చేరనుంది. అంటే సంప్రదాయ కోర్సులు మూడో వంతుకు తగ్గిపోనున్నాయి. 52 వేలకుపైగా కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల సీట్లే ఉండనున్నాయి. ఇప్పటికే సీఎస్సీ సీట్లు 18,686, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు 7,737 వరకు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 17 వేల సీట్లు ఖాళీ.. ఇంజనీరింగ్ ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కేటాయించిన సీట్లలో 17 వేల మేర అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో 71,286 సీట్లు అందుబాటులో ఉంటే, 60,208 సీట్లను కేటా యించారు. ఇందులో 43 వేల మంది మాత్రమే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని తెలిపాయి. మిగిలిన సీట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్లే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. -
చాయిస్ ఫిల్లింగ్‌లో అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించే ‘జోసా’ ప్రక్రియలో జేఈఈ అడ్వాన్స్డ్ ఉత్తీర్ణులు తమ చాయిస్ ఫిల్లింగ్, ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల ప్రాథమ్యాల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి సూచించారు. వందల సంఖ్యలో ఆప్షన్స్ ఇచ్చే అవకాశమున్నందున చిన్న పొరపాటు కూడా భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారవచ్చునని హెచ్చరించారు. ఈ నెల 11న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల విడుదల, ఆ మర్నాడే ‘జోసా’ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు ‘ఆస్క్ ఐఐటీఎం’ పేరుతో.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో కామకోటి పాల్గొన్నారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఐఐటీ మద్రాస్ విశిష్టతలను వివరించారు. ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు ప్రస్తుతం ఇంటర్ డిసిప్లినరీ విధానంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. కోర్ సబ్జెక్ట్‌లతోపాటు తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్ట్‌లను చదివే అవకాశం ఉందని.. వీటిలో పొందిన క్రెడిట్స్‌ను సైతం బీటెక్ ప్రోగ్రామ్‌కు కలుపుతారని కామకోటి తెలిపారు. ఫలితంగా తమ ర్యాంకుకు వచ్చిన బ్రాంచ్‌తో తృప్తిపడకుండా ఇష్టమైన సబ్జెక్ట్‌లు చదివే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ (బీటెక్+ఎంటెక్) ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు నాలుగో సెమిçÜ్టర్‌లో తమకు ఆసక్తిఉన్న వేరే బ్రాంచ్‌కు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా.. వైద్య రంగానికి అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. వైద్య అనుబంధ అంశాలకు సంబంధించి ప్రత్యేక విభాగాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణిస్తూ బోధన, కరిక్యులం, పరిశోధనల విషయంలో ఎప్పటికొప్పుడు మార్పులు, చేర్పులు చేపడుతున్నామని సృజనాత్మకతకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే ఐఐటీ మద్రాస్ ఏడేళ్లుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో కొనసాగుతోందన్నారు. విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్లూ దక్కుతున్నాయని కామకోటి చెప్పారు. 2021–22 విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థుల్లో 80 శాతం మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయని, మొత్తం 1,199 మందికి ఆఫర్లు లభించగా అందులో 45 మందికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు వచ్చాయని తెలిపారు. 25 శాతం మేర తెలుగు విద్యార్థులే ఐఐటీ మద్రాస్‌లో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 25 శాతం మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. అన్ని రంగాల్లోనూ మంచి అవకాశాలు ‘ప్రస్తుత తరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, అందుకు ఐఐటీలే మేలు మార్గమని అనే భావన నెలకొంది. అయితే ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల సహజ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఇతర కోర్సులకూ ప్రాధాన్యమివ్వాలి. ఐఐటీలో సీటు రాకపోతే భవిష్యత్తు లేదన్న ఆందోళన అర్థరహితం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తి ఏంటో తెలుసుకోకుండానే వారిని బీటెక్, కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరికాదు’ అని కామకోటి అన్నారు. ఆన్లైన్ కోర్సులను అందిపుచ్చుకోవాలి ‘ఐఐటీలో చేరే అవకాశం కోల్పోయిన విద్యార్థులు ఆన్లైన్ కోర్సుల అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం ఎన్పీటీఈఎల్ పోర్టల్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్ల లెక్చర్లు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ తరగతి గదిలో చెప్పిన అంశాలు యథాతథంగా ఉంటాయి. వీటిని అనుసరించడం ఫలితంగా నిపుణులైన ప్రొఫెసర్ల లెక్చర్లు విని తమ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం పెంచుకునే అవకాశం లభిస్తుంది’ అని కామకోటి సూచించారు. రెండేళ్లుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఐఐటీలపై క్రేజ్ తగ్గుతోందనే అభిప్రాయం సరికాదని అన్నారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైన ఈ సదస్సులో కామకోటితోపాటు ఐఐఎం–ఎం అలూమ్నీ అండ్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ మహేశ్ పంచాజ్ఞుల, ఆస్క్ ఐఐటీఎం ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రక్రియ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచే ఆప్షన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కడపటి వార్తలు అందే సమయం వరకూ ఇది ప్రారంభం కాలేదు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీల జాబితా అందకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వనందునే కాలేజీల జాబితా సకాలంలో ఇవ్వలేదని యూనివర్సిటీలు అంటున్నాయి. అఫిలియేషన్ ఇవ్వకపోయినా, గత ఏడాది ఏ కాలేజీలున్నాయో వాటినే కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఫీజుల వ్యవహారంపైనా దోబూచులాట కొనసాగుతోంది. ఇన్ని అస్పష్టతల మధ్య ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి ఎలా ఉంటుందోనని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలు? ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 1,26,140 మంది అర్హత పొందారు. వీరిలో ఇప్పటివరకు 40 వేల మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 వేల మంది సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తిచేశారు. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. 145 కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించినా, గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వలేదు. ఉస్మానియా సహా మిగతా వర్సిటీలూ ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు గుర్తింపు విషయాన్ని పక్కనబెట్టి, గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 175 కాలేజీలను ఆప్షన్ల జాబితాలోకి తేవాలని నిర్ణయించారు. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో ఆ కాలేజీలను తొలగించి, ఆ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఫీజులపై పీటముడి ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలోనూ ఇంతవరకూ స్పష్టత రాలేదు. పాత ఫీజులే ఈ ఏడాది వర్తించేలా రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా జీవో విడుదల కాలేదు. ఈలోగానే ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కమిటీ తొలుత అనుమతించిన పెంపు ఫీజునే కాలేజీలు వసూలు చేసుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తుది నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ధారిత ఫీజుకన్నా ఎక్కువ ఉంటే దాన్ని విద్యార్థులకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ లెక్కన ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది? రీఎంబర్స్‌మెంట్‌కు అనుమతించేది ఎంత? అనే గందరగోళం వెంటాడుతోంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన వాళ్లు అదే నెల 13కల్లా ఫీజులు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా అనే సందేహాలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. ఏ కోర్సులు? ఎన్ని సీట్లు? వెబ్ ఆప్షన్ల వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేరుకున్నా.. ఏ కాలేజీలో ఏ కోర్సులుంటాయో తెలియదు. గత ఏడాది లెక్క ప్రకారం ప్రస్తుతం 67 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం చాలా కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ సీట్ల వివరాలేంటో ఆప్షన్ల సమయంలో విద్యార్థులకు తెలిసే అవకాశం కల్పించడం లేదు. అఫిలియేషన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ గత ఏడాది ఉన్న కోర్సుల లెక్కనే చూపించడం వల్ల నచ్చిన కోర్సులో సీటు పొందినా... ఆఖరులో అది ఉంటుందో? ఉండదో? తెలియక విద్యార్థులు అయోమయపడుతున్నారు. అధికారులు మాత్రం రెండో విడత కౌన్సెలింగ్‌కు సీట్లపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. -
ఆ ఆపరేషన్ మాకోద్దు బాబోయ్ అంటోన్న పురుషులు.. ఎందుకంటే
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మగవారికే సులభం ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికి కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. 55 ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు జిల్లాలోని 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 6,236 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగ్గా అందులో కేవలం 24 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1,384 ఆపరేషన్లు జరగ్గా కేవలం 9 మంది పురుషులు మాత్రమే ముందుకు వచ్చారు. మగవారు ముందుకు రావాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. భార్యకు మరో ఆపరేషన్ అవసరం లేకుండా భర్త ముందుకొస్తే చాలా మంచిది. వేసెక్టమీపై మగవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి ఇష్టపూర్వకంగా ఆçపరేషన్ చేస్తాం. మగవారిలో మార్పు రావాలి. వారు జనాభా నియంత్రణలో భాగస్వాములు కావాలి. – కె.ఐశ్వర్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కు.ని.విభాగం భీమవరం ప్రభుత్వాసుపత్రి -
మిస్సింగ్ కేసుల కలకలం...ప్రేమ.. పెడదోవ
ఇటీవలి కాలంలో ‘అదృశ్యం’ కేసులుపెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం టీనేజీ అమ్మాయిలతో మహిళలు ఉండటం కలవరం రేపుతోంది. పిల్లలు విద్య పూర్తి చేశాక.. ఉద్యోగం సంపాదించాక.. వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే చదువుకోవాల్సిన సమయంలోనే పిల్లలు ప్రేమలో పడి తొందరపడుతున్నారు. పెద్దలు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిన డబ్బు అయిపోయి.. కష్టాలు చుట్టు ముట్టి.. ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకూ కన్నీళ్లు మిగులుస్తున్నారు. రాయదుర్గం: విద్యార్థి దశలోనే కొందరు అమ్మాయిలు పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రుల గారాబంతో పాటు పర్యవేక్షణ కొరవడటంతో క్రమశిక్షణ తప్పుతున్నారు. కొందరు స్మార్ట్ఫోన్లలో గేమ్స్‌కు బానిసైతే.. మరికొందరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువును పక్కనపెట్టి ప్రేమలో పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలిసినా.. మందలించినా ... తమ స్వేచ్ఛను వారు ఏదో హరిస్తున్నారనుకుని అనాలోచిత నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. చేజేతులా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో 2020 నుంచి 2022 జూలై 15వ తేదీ వరకు 2,037 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలు, మహిళలు 1,657 మంది ఉన్నారు. చదువు కోసం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, గ్రామాల్లో కూలీలు, పరిశ్రమల్లో పనులకెళ్లే మహిళలు ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వెళ్లిపోవడం.. రోజులు గడిచాక చేసిన తప్పు తెలుసుకుని బాధపడటం చేస్తున్నారు. చివరకు పోలీస్ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇంటిబాట పడుతున్నారు. అదృశ్యం కేసుల్లో మచ్చుకు కొన్ని... రాయదుర్గం పట్టణం చన్నవీరస్వామి ఆలయ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి షాపింగ్‌కని ఈ ఏడాది ఏప్రిల్ 26న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మే 4న గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ చేయగా.. గుడ్డిగా నమ్మి.. వెళ్లానని.. తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించేశారు. రాయదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఏప్రిల్ 25న నీళ్లు తేవటానికని బిందె తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. కొళాయి వద్ద బిందె ఉంచి.. ప్రేమికుడితో ఉడాయించింది. కుటుంబ సభ్యులు మూడు రోజులు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ ఆధారంగా అదే నెల 30న ఎట్టకేలకు ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసు కౌన్సిలింగ్ తీరు... ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సొమ్ము అయిపోయిన తర్వాత పరిస్థితి ఆలోచించాలి. అసాంఘిక శక్తుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటి? ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులకు తెలియజేస్తే మంచిది. ఇష్టం లేని వివాహాలు, చదువులు, ఆశించిన ర్యాంకు రాదనే కారణాలు సహేతుకం కాదు. ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని బంధువులు, సమాజం చులకనగా చూస్తుంది. మొదట్లో బాగున్నా తర్వాత సంసారాల్లో కలహాలు మొదలవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. టీనేజీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చూడాలి. (చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి) -
వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాలన్న అధికారుల ఆలోచన చర్చనీయాంశమైంది. కౌన్సెలింగ్ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న యంత్రాంగం వైద్యుల అభిప్రా యాలకు ప్రాధాన్యత ఇచ్చి విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. దరఖాస్తు చేసే వైద్యులకు నాలుగైదు ఆప్షన్లు ఇవ్వాలని, వారు కోరుకున్న చోటే పోస్టింగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకే ప్రాంతానికి ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే ఇతర అంశాలన్నిటినీ పరిగణన లోకి తీసుకొని పోస్టింగులు ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే భార్యాభర్తలు ఒకేచోట లేదా దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వ నున్నారు. ఈ విధమైన కౌన్సెలింగ్ వల్ల వైద్యుల సేవలను పూర్తిస్థాయిలో ఉప యోగించుకునేందుకు వీలుంటుందని, వారు రెగ్యులర్‌గా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుం చెబుతున్నారు. గతానుభవం దృష్ట్యా .. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖలో 12 వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. డాక్టర్ పోస్టుల్లో ప్రధానంగా బోధనాసు పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఉన్నాయి. పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, దాదాపు 10 వేలకుపైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్, నర్సులు, ఏఎన్ఎం పోస్టులను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్ బోర్డు భర్తీ చేస్తుంది. అందులో ప్రధానంగా 2,467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్ తదితర స్పెషలిస్ట్ పోస్టులున్నాయి. మరో 1,200 వరకు ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. అయితే స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కీలక సమస్యగా మారింది. 2018లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా దరఖాస్తు చేసిన వారికి అధికారులే ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పైరవీలు జోరుగా జరిగాయన్న విమర్శలూ వచ్చాయి. భార్యా భర్తలను సుదూర ప్రాంతాలకు పంపారన్న అపవాదు కూడా వచ్చింది. ఫలితంగా 600 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు. మిగిలినవారు ఉద్యోగాలనే వదులుకున్నారు. చేరినవారిలోనూ చాలామంది విధుల్లోకి వెళ్లలేదు. అందులో కొందరికి నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో ఉద్యోగంలోంచి తీసేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌన్సెలింగ్ నిర్వహించాలనే ఆలోచనకు వైద్య ఆరోగ్య శాఖ వచ్చింది. మరోవైపు కొత్త వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతమంది ప్రభుత్వ వైద్యులుగా చేరేందుకు ఆసక్తి చూపిస్తారనే సంశయమూ వెంటాడుతోంది. -
వణుకు పుట్టిస్తోన్న బ్లేడ్‌బ్యాచ్.. రంగంలోకి కమిషనర్!
సాక్షి ప్రతినిధి విజయవాడ: వారికి గంజాయితో నిత్యం సహవాసం.. జన సంచారం అంతగాలేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారే లక్ష్యం.. డబ్బులు ఇవ్వలంటూ బ్లేడుతో దాడి చేయడం, పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే తమను తాము కోసు కుని చస్తామంటూ బెదిరించడం వారికి సహజం.. ఇదీ విజయవాడలో హల్చల్ చేసే బ్లేడ్‌బ్యాచ్ సభ్యుల నైజం. నగరంలో అలజడి సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యుల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. వారి మూలాలను శోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగేవారు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలకు, గంజాయి తాగేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలైన వన్ టౌన్, టూ టౌన్, రైల్వే అప్ యార్డు, సీపీఆర్ ఫ్లై ఓవర్, ఆర్పీఎఫ్ పోస్టు, రామరాజ్యనగర్లోని రైల్వే బ్రిడ్జ్ కింద ఖాళీ ప్రదేశాలు, జక్కంపూడి శివారులోని 60, 40 అడుగుల రోడ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేర చరిత్ర ఆధారంగా బ్లేడ్ బ్యాచ్ సభ్యులను ఆయా పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీస్ కమిషనర్ టి.కె.రాణా వన్‌టౌన్, సింగ్‌నగర్ ప్రాంతంలో బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తాగేవారికి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కదలికలు ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో సీపీ స్వయంగా పర్యటించి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. సన్మార్గంలో నడిస్తే ఉపాధి బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నేర ప్రవృత్తిని మార్చుకుని మంచి మార్గంలో నడవాలని నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆధ్వర్యంలో పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ జన జీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన దండన తప్పదనే సంకేతాలు పంపుతున్నారు. నేర ప్రవృత్తి మార్చుకోని వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచి మార్గంలో నడుచుకునే వారికి వ్యాపార సంస్థలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఆగడాలకు అడ్డుకట్ట ఇలా.. బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగి చెడ్డదారుల్లో నడిచేవారికి ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను సీపీ టి.కె.రాణా ఆదేశించారు. గంజాయి తాగేందుకు అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి పోలీస్ గస్తీ పెంచాలని, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి పిల్లలు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసేలా తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి డీ–ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని పేర్కొన్నారు. నేరాలు జరగడానికి అవకాశం ఉన్న చీకటి ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో స్థానిక అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా... చెడు నడత గల వ్యక్తుల సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు స్వయంగా లేదా, 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సీపీ టి.కె.రాణా ప్రజలను కోరారు. మత్తు పదార్థాల విక్రేతలు, వినియోగదారుల వివరాలను, వీధుల్లో తిరుగుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆకతాయిల వివరాలను పోలీసులకు తెలపాలని కోరారు. ఈ సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. చదవండి: బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు -
TS: డిసెంబర్ 1 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలంగాణ ఎడ్‌సెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. 1 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 18–20 తేదీల మధ్య వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబర్ 28లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. 30వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు. (‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా) 27 నుంచి లాసెట్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ లాసెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. 27 నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 11 నుంచి 13 వరకు కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. డిసెంబర్ 17న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయవాద కోర్సుల తరగతులు డిసెంబర్ 27 నుంచి మొదలవుతాయని తెలిపారు. (చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్) -
విడిపోదామనుకున్న దంపతులను ఒక్కటిగా చేస్తూ..
విజయనగరం ఫోర్ట్: చూపులు కలిసి ఒక్కటైనవారే వారంతా...కానీ క్షణికావేశంలో మాటామాటా పెరిగి దూరమయ్యారు. విడపోదామనుకున్న ఆ మనసులను రంజింపచేసి రాజీ బాట పట్టించారు. విరిగిన హృదయాల్లో ప్రేమను మళ్లీ చిగురింపజేసి సరికొత్త జీవితాన్ని చూపించారు. వారే గృహ హింస విభాగ ప్రతినిధులు. విడిపోవడం ఓ క్షణం ... అదే దగ్గరైతే జీవితమే మకరందమంటూ ఎన్నో జంటల్లో మానసిక పరివర్తనను తేగలిగారు ఆ ప్రతినిధులు. ►ఆనందపురం మండలానికి చెందిన మహిళకు పూసపాటిరేగ మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నేళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. 2019లో తనను, పిల్లలను సరిగా చూడడం లేదని, మనోవర్తి ఇప్పించాలని కలెక్టరేట్లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆ మహిళ ఆశ్రయించింది. దీంతో గృహహింస విభాగం కౌన్సిలర్లు భార్యాభర్తలకు పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించి ఒక్కటి చేశారు. ►గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళకు అదే మండలానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి కాపురం కొన్ళేళ్లు సజావుగా సాగింది. వివాహం జరిగిన మూడేళ్లు తర్వాత తన భర్త వేధిస్తున్నాడని, అతని నుంచి విముక్తి కల్పించాలని కలెక్టరేట్లో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. అక్కడ కౌన్సిలర్లు భార్య,భర్తలకి కౌన్సిలింగ్ నిర్వహించి చేయీ చేయీ కలిపించారు. ►అదో గృహ హింస విభాగం. ఈ విభాగంలో ఒక సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, ఇద్దరు హోం గార్డులు పనిచేస్తున్నారు. అక్కడకు వచ్చిన వారంతా భర్తతో, అత్తమామలతో హింసలకు గురైనవారే. భర్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కొందరు, భర్తతో కలిసి ఉండేలా చూడాలని మరి కొందరు. వీరంతా తమ గోడును కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గృహహింస విభాగానికి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న బాధితులే. కౌన్సిలింగ్ ద్వారా... గృహహింస విభాగాన్ని ఆశ్రయించిన మహిళలనుతన భర్తతో కలిసి ఉండేలా కౌన్సిలర్లు చర్యలు చేపడతారు. మహిళల నుంచి ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను పిలిపించి కౌన్సిలర్లు ఇద్దరు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకసారి కౌన్సిలింగ్లో రాజీపడని వారికి పలు దఫాలుగా పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు ఆ దంపతులను కలిపే ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లో రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా విడాకులకు కాకుండా ఒక్కటయ్యే మార్గాన్నే వారు చూపిస్తారు. విడాకులనేది ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తారు. 130 మందిని మళ్లీ ఒక్కటిగా చేశారు 2006లో గృహహింస విభాగం జిల్లాలో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 767 మంది గృహహింస విభాగాన్ని అశ్రయించారు. వీరిలో కౌన్సిలింగ్ ద్వారా 130 మందిని కలిపారు. 122 మంది కేసులను ఉపసంహరించుకున్నారు. 512 కేసులు కోర్టులో వేయగా 65 మంది కోర్టు సమక్షంలో మళ్లీ చేయీచేయీ కలిపారు. 257 కేసులకు తుది తీర్పు వచ్చాయి. 149 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. సంతోషంగా ఉంది కుటుంబ కలహాలతో మా దగ్గరకు వచ్చే వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తాం. కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల కోసం చెబుతాం. చాలా మందికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కలిశారు. విడిపోదాం అనుకొని వచ్చిన వారిని కలపడం ఎంతో సంతోషంగా ఉంటుంది. – జిల్లెల రజని, సోషల్ కౌన్సిలర్ ఉచిత న్యాయ సహాయాన్నిఅందిస్తాం కౌన్సిలింగ్ ద్వారా రాజీ పడని వారికి ఉచితంగా కోర్టులో కేసు వేస్తాం. వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తాం. కోర్టులో కేసు వేసిన తర్వాత కూడా చాలా మంది రాజీ పడి కలిసిన సందర్భాలున్నాయి. – జి. మాధవి, లీగల్ కౌన్సిలర్ -
పద్ధతి మార్చుకోండి.. లేకపోతే..: ఎస్పీ ‘ఓపెన్’ వార్నింగ్
పాత నేరస్తులకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తనదైన శైలిలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నేరాలు చేయడం మానకపోతే కఠిన చర్యలు తప్పవని ‘ఓపెన్’గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సాక్షి, విజయవాడ: సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే సహించేది లేదని, పద్ధతి మార్చుకోకుండా తిరిగితే రౌడీషీట్లు తెరిచి, చట్టరీత్యా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కా వంటి వాటిని అక్రమ రవాణా చేసే జిల్లాలోని ఐదు డివిజన్లకు చెందిన 2,530 మంది పాత నేరస్తులకు సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ► ఎస్పీ మాట్లాడుతూ కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆరాటంతో కొంతమంది వ్యక్తులు మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కాల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారన్నారు. ► చదువుకున్న వారు, యువకులు కూడా ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉండడం బాధాకరమన్నారు. ► ఈ కేసుల్లో పట్టుపడితే ఏముంటుందిలే, బెయిల్ మీద వస్తాం, చక్కగా తిరిగేస్తామనుకొని ఇప్పటివరకూ పదే పదే తప్పులు చేస్తూ కొంతమంది నడుచుకుంటున్నారన్నారు. అటువంటి వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. నేరాల అదుపునకు యాక్షన్ ప్లాన్ కృష్ణా జిల్లాలో ఈ నేరాల సంఖ్యను పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని ఎస్పీ తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో అదనంగా మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటుచేసి, సరిహద్దు గ్రామాలు, నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, అమ్మోనియా, పటిక వంటి నిల్వలపై నిరంతర తనిఖీలు, ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. సత్ప్రవర్తనతో ఉంటే ఉద్యోగావకాశాలు.. నేరాలు విడిచి సత్ప్రవర్తనతో నడుచుకునే వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలను నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జేడీ మోకా సత్తిబాబు, జిల్లాలోని పలువురు ఏఎస్పీలు, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్‌కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్‌వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, బీడీఎస్‌లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
Jubilee Hills: స్పోర్ట్స్ బైకు యజమానికి కౌన్సిలింగ్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నంబర్ ప్లేట్ లేకుండా జూబ్లీహిల్స్ రహదారులపై చక్కర్లు కొడుతున్న రూ.25 లక్షల విలువైన వాహనాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా, నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్‌ను ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి గుర్తించి పట్టుకున్నారు. సంబంధిత ధ్రువపత్రాలు చూపించమని కోరగా అతని వద్ద లేకపోవడంతో పాటు బైక్‌కు నంబర్ ప్లేట్ కూడా లేదు. ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న 800 సీసీ ఆస్టానా స్పోర్ట్స్ బైక్‌గా దీన్ని పోలీసులు గుర్తించారు. దీని ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన అనూష్రెడ్డికి చెందిన బైక్‌గా దీన్ని గుర్తించిన పోలీసులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొచ్చిన తర్వాత నంబర్ ప్లేట్ లేకుండా తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. చదవండి: ట్విటర్లో పరిచయం.. ఆపై వాట్సాప్.. చివరికి నమ్మకంగా -
ప్రేమ మైకంలో యువతి: జీవితానికి ‘దిశ’ చూపిన పోలీసులు
వైఎస్సార్ కడప అర్బన్: ప్రేమ వ్యవహారంలో పడి ఓ యువతి చదువును నిర్లక్ష్యం చేసింది. తాను ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేయాలని పట్టుపట్టింది. మూడు రోజులుగా పస్తులుంటూ మారం చేసింది. ఈ విషయమై ఆ యువతి ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ‘దిశ’ డీఎస్పీ కె. రవికుమార్, మహిళా ఎస్ఐ లక్ష్మీదేవి, సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ యువతికి నచ్చచెప్పి ఇప్పట్లో పెళ్లి ఆలోచన చేయకుండా విరమింపజేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే దిశ సిబ్బంది నేరుగా యువతి నివాసానికి వెళ్లారు. ఆమెతో ఆత్మీయంగా మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ వయసులో చదువుపై శ్రద్ద పెట్టాలని సూచించారు. ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లికి తామే చొరవ తీసుకుంటామని ఆ యువతికి పోలీసు సిబ్బంది హామీ ఇచ్చారు. పోలీసుల కౌన్సెలింగ్‌తో ఆమెలో మార్పు వచ్చింది. ‘పెళ్లి ఇప్పుడు చేసుకోను.. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటా’ అని పోలీసులకు ఆ యువతి చెప్పింది. తనలో మార్పునకు దోహదం చేసిన ‘దిశ’ సిబ్బందికి, భవిష్యత్తుపై భరోసా కల్పించిన ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు ఫోన్లో ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసేలా ఎవరూ ప్రవర్తించరాదని ఈ సందర్భంగా యువతకు ఎస్పీ సూచించారు. ఏమన్న సమస్యలుంటే దిశ పోలీస్‌స్టేషన్ అండగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మహిళలకు తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా తన (94407 96900)కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఏపీ: నేటి నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (నేటి) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కలి్పస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సరి్టఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు. అభ్యర్థుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ కేంద్రాలను జనవరి 1వ తేదీవరకు కొనసాగించాలని కనీ్వనర్ నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 29న విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో చేపట్టనున్నారు. రిజిస్టర్ అయి ఉన్న వారు మొబైల్ నంబరు మార్పు, లాగిన్ ఐడీ తదితర అంశాలపై హెల్ప్‌లైన్ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ను చూడవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసేందుకు కమిషనరేట్‌లో మూడు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటికి ఫోన్‌చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు. జనవరి 1వ తేదీన అభ్యర్థులు తమ ఆప్షన్లలో పొరపాట్లు సవరించుకునే అవకాశం ఉంది. అనంతరం 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రయివేటుకు సంబంధించి 257 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,29,016 సీట్లు, 120 ఫార్మసీ కాలేజీల్లో 10,675 బీఫార్మసీ సీట్లు, 62 కాలేజీల్లో 1,860 డీఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా ఇంజనీరింగ్‌లో 82 కాలేజీలు, బీఫార్మసీలో 19 కాలేజీలు, డీఫార్మాలో 7 కాలేజీలు యూనివర్సిటీలకు వివిధ రుసుములు బకాయి ఉండడంతో వాటిలోని 35,347 ఇంజనీరింగ్, 1,660 బీఫార్మసీ సీట్లు, 210 డీఫార్మా సీట్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఆ కాలేజీలనుంచి అఫిడవిట్లు తీసుకుని ఆ సీట్లను కూడా విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అవికూడా జత అయితే సీట్లసంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ వర్సిటీల పరిధిలోని 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో 5,212 సీట్లు, 9 బీఫార్మసీ కాలేజీల్లో 520 సీట్లు, 1 డీఫార్మసీ కాలేజీలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాక మిగిలిన సీట్లు ప్రయివేటు కాలేజీలకు సంబంధించినవి. 4 లేదా 5 నుంచి తరగతులు ఈనెల 3వ తేదీ సాయంత్రానికి సీట్ల కేటాయింపు పూర్తిచేసి 4 లేదా 5వ తేదీనుంచి తరగతుల ప్రారంభించాలని సూచిస్తున్నాం. మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాక రెండు, మూడో విడత సీట్ల కేటాయింపు చేస్తాం. ఎంపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక జనవరి 9 నుంచి బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ చేపడతాం. ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కలి్పస్తాం. – ఎం.ఎం.నాయక్, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ స్ట్రీమ్ కోర్సులకు వెబ్ ఆప్షన్లు గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ కోర్సులకు ఏపీ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్‌కృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు: 1,85,936 ఎంసెట్‌కు హాజరైన వారు: 1,56,953 క్వాలిఫై అయిన వారు: 1,33,072 ఆప్షన్ల నమోదు షెడ్యూల్ తేదీ ర్యాంకు నుంచి ర్యాంకు వరకు డిసెంబర్ 28, 29 1 60,000 డిసెంబర్ 30, 31 60,001 చివరి వరకు జనవరి 1 –– ఆప్షన్లలో సవరణ జనవరి 3 – సీట్ల కేటాయింపు వర్సిటీల వారీగా అందుబాటులో ఉన్న వర్సిటీ, ప్రయివేటు సీట్లు మొత్తం యూనివర్సిటీ ఇంజనీరింగ్ బీఫార్మసీ డీఫార్మా ఏఎన్‌యూ 3,420 1,840 300 జేఎన్టీయూఏ 38,637 3,285 780 జేఎన్టీయూకే 81,757 3,360 480 ఏయూ 3,190 1,750 270 కేయూ –– 260 30 ఇతర వర్సిటీలు 2,012 180 –– మొత్తం 1,29,016 10,675 1,860 వర్సిటీల వారీగా జీరో అడ్మిషన్ల కాలేజీలు ఇలా వర్సిటీ ఇంజనీరింగ్ బీఫార్మసీ ఏఎన్‌యూ 1 –– జేఎన్టీయూ–ఏ 21 2 జేఎన్టీయూ–కే 26 2 ఏయూ –– 1 హైల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995681678 ఈమెయిల్ ఐడీ: ‘సీఓఎన్‌వీఈఎన్‌ఈఆర్‌ఏపీఈఏఎంసీఈటీ2020:జీమెయిల్.కామ్’ను మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
రేపటి వరకు డిగ్రీ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా మూడో దశ కౌన్సెలింగ్ సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి తేదీని ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పొడిగించినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ నెల 28వ తేదీలోగా దోస్త్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్) సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థుల సీట్లు రద్దు అవుతాయని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సెలవుల కారణంగా ఈ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. అలాగే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును కూడా ఈనెల 28వ తేదీ వరకు పొడిగించామని వివరించారు. కాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును ఈనెల 31వ తేదీన ప్రకటిస్తామని, విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలాగే అన్ని దశల కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆయా కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని వెల్లడించారు. చదవండి: మెదక్‌లో అరుదైన జీవజాతి.. మూషిక జింకలు -
జేఈఈ కౌన్సెలింగ్ 6 రౌండ్లకు కుదింపు!
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర సంస్థల్లో 2020–21 విద్యా సంవత్సరపు ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను ఏడు నుంచి ఆరు దశలకు కుదించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇప్పటివరకు ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఏడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్–19, లాక్డౌన్ల దృష్ట్యా జేఈఈ మెయిన్స్ రెండో విడత, అడ్వాన్సుడ్ పరీక్షలు ఆలస్యమైన నేపథ్యంలో ఈ రెండు ముగిసిన అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ఆరు విడతలకు కుదించి సీట్లు భర్తీ చేయడమే మంచిదని జేఈఈ అడ్వాన్సును నిర్వహిస్తున్న ఐఐటీ ఢిల్లీ.. జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి ప్రతిపాదించింది. దీనిపై అన్ని ఐఐటీల నుంచి ఆమోదం వచ్చాక సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డుకు పంపిస్తారు. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్‌ను, జేఈఈ అడ్వాన్సును ఆగస్టు 23న నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఈఈ అడ్వాన్సు ఫలితాలను వారంలో ఇవ్వాలని, అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆరు విడతల్లో పూర్తిచేస్తే అక్టోబర్ మొదటి వారం నుంచే తరగతులను ఆరంభించేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. కోవిడ్–19 గందరగోళ పరిస్థితులు లేకపోతే సెప్టెంబర్‌లోపే తరగతులను ప్రారంభించేవారు. (1–6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..) -
నేరాలను అదుపులో పెట్టేందుకు స్పెషల్ డ్రైవ్
సాక్షి, కృష్ణా : నేరాలను అదుపులో పెట్టేందుకు కృష్ణా జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు, వ్యభిచార గృహాలు, పేకాట స్థావరాలు, రౌడీ షీటర్లు, ఆకతాయిలు, జులాయి గ్యాంగ్‌ల ఆటకట్టించేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. పోలీసులు బృందాలుగా విడిపోయి తెల్లవారుజాము నుంచే మెరుపుదాడులు నిర్వహించి అనుమానిత ప్రాంతాల్లో నిర్భంధ తనిఖీలు నిర్వహించారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలను చుట్టుముట్టి దిగ్బంధనం చేశారు. ఇటీవలే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అని ఆరా తీశారు. ఆధార్, ఇతర ఐడెంటీ కార్డులను పరిశీలించి ప్రతి ఒక్కరి డేటాను సేకరించారు. సరైన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా, అనుమానితులను అదుపులోకి తీసుకొని నేరప్రవృత్తి మానుకోవాలని పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి
సాక్షి,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం విస్తరిస్తోందని ఎసిపి గౌస్‌భాష పేర్కొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, హాజీపూర్, శ్రీరాంపూర్లలో గంజాయి వినియోగం జోరుగా కొనసాగుతుంది. తాజాగా హాజీపూర్ మండలం రాపల్లిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎసిపి గౌస్‌భాష వెల్లడించారు. విచారణలో భాగంగా మరికొంత మంది గంజాయికి బానిసలు అవుతున్నట్లు తెలుసుకొని మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన గౌస్‌భాష మరోసారి గంజాయి జోలికి పోకూడదంటూ ప్రమాణం చేయించారు. కాగా, వారం క్రితమే మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయికి బానిసలుగా మారిన 39 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో డిసిపి రక్షిత్ కె మూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
బంధాన్ని మరిచి..ఇంటిని విడిచి...
కాలం మారింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. పిల్లలపై పెద్దలకు పట్టు సడలుతోంది. నాలుగు మంచిమాటలు చెప్పేవారు లేకపోతున్నారు. పిల్లల ప్రవర్తనను పసిగట్టలేని బిజీ జీవనాన్ని తల్లిదండ్రులు గడుపుతున్నారు. వారి ఆసక్తి, అభిరుచులను తెలుసుకోలేకపోతున్నారు. కష్టాలను అధిగ మించే సామర్థాలను పెంపొందించకుండా అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. కలహాలు పడుతున్నారు. పిల్లలపై ఆవేశాన్ని చూపుతున్నారు. ఇంటిని వీడిపోయే ఆలోచనను రేకెత్తిస్తున్నారు. చేతులారా పిల్ల ల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు మమకారం పంచాలని... ఆసక్తులు గమనించాలని.. బంధాన్ని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. సాక్షి, విజయనగరం : చదువుకోవాలంటూ తల్లిదండ్రులు మందలించారని గుర్ల మండలానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఇంటి నుంచి పారిపోయి బస్సులో వచ్చేసింది. విజయనగరం చైల్డ్‌లైన్ సభ్యులు బాలికను కార్యాలయానికి తీసుకుని వచ్చి సంరక్షించారు. తల్లిదండ్రుల అంగీకారం ప్రకారం కేజీబీవీలో చేర్పించారు. 'విశాఖపట్నం పూర్ణమార్కెట్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల కిందట ఇంటి నుంచి వచ్చేసాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు’. ఇలా అనేక మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని కొంతమంది, పట్టణాలు చూద్దామని మరి కొందరు ఇంటిని వీడుతున్నారు. ఆవేశంలో ఇంటిని వీడిన వారు పోలీసులు, చైల్డ్‌లైన్ సభ్యులకు దొరికితే ఫర్వాలేదు. పొరపాటును ఏ అగంతుకులకో దొరికితే పిల్లల పరిస్థితి అంతే సంగతి. మూడేళ్లలో 100 మంది... గత మూడేళ్ల కాలంలో దాదాపు 100 మంది వరకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేశారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. అధికారులు గుర్తించని వారు ఎంతోమంది ఉంటారు. నేటి సాంకేతిక కాలంలో తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తున్నారు. పిల్లల ఆసక్తులు, అభిరుచులను గమనించలేనంత బిజీ అవుతున్నారు. దీంతో పిల్లల ప్రవర్తనపై పట్టుకోల్పోతున్నారు. వారు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మరికొందరు పిల్లలకు ఆసక్తిలేని రంగాల్లో రాణించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఆయా రంగాల్లో వెనుకబడితే మందలిస్తున్నారు. దండిస్తున్నారు. దీనివల్లే చాలామంది పిల్లలు ఇంటిని వీడేందుకు సిద్ధపడుతున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడడంతో పిల్లలకు భద్రత కరువవుతోంది. ఇంటిని వీడిపోవాలన్న ఆలోచన తలెత్తి మెల్లగా తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్నారు. వీరిలో కొందరు మంచి మార్గాల్లో పయనిస్తుంటే.. మరికొందరు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. గొడవల వల్లే... కుటుంబంలోను, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడంతో పిల్లలకు భద్రత కరువవుతోంది. దిశానిర్దేశం చేసేవారు లేకపోతున్నారు. దీంతో కొంతమంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండడం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – జీకే దుర్గ, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ -
టీఆర్టీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ–2017 నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. -
మీరు చెబితే.. మేం వినాలా!
సాక్షి, శ్రీకాకుళం రూరల్ : చిన్నారి పెళ్లికూతుళ్లు రోజురోజుకూ అధికమవుతున్నారు. చైల్డ్‌లైన్ సిబ్బంది, అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. వారు వెళ్లిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపించేస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లి జరగడం, బిడ్డలకు జన్మనివ్వడంతో చాలామంది అమ్మాయిలు 16 నుంచి 20 ఏళ్ల వయసులోపే కాన్సుల సమయంలో మృత్యువాత పడుతున్నారు.ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే ఉన్నతాధికారులు ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో బాలికతో మాట్లాడి చిన్న వయసులో పెళ్లి జరిగితే కలిగే అనర్ధాలను వివరిస్తున్నారు. అయినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. గ్రామపెద్ద, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో కౌన్సెలింగ్ చేసినప్పటికీ రాజకీయ నాయకులతో చెప్పించి చూసీచూడనట్లు వదిలేయండిని చెప్పడంతో అధికారులు ఏమిచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ముహూర్తబలం చేదాటిపోకూడదని దొంగచాటుగా గుడిలోనో, వేరేచోటనో గుట్టుచప్పుడు కాకుండా మూడుముళ్లు వేయించేస్తున్నారు. కానరాని మార్పు.. తక్కువ వయసులోనే వివాహం కావడం, ఏడాదిలోనే కాన్పులు రావడంతో బాలికలు యుక్త వయస్సులోనే మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. ఈ విషయంలో అధికారులు, వైద్యులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం జరిపించాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాం తాల్లో ఎక్కువ శాతం మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అమ్మాయి పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుందంటూ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకడం, అబ్బాయి తరఫు వారు కూడా వయసును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహాలు నేరమంటూ చైల్డ్‌లైన్ సిబ్బంది, ఐసీడీస్ సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, యువతీ యువకుల తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇస్తున్నా ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్.. రెండు రోజులు క్రితం చైల్డ్‌లైన్ సిబ్బందికి వచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఈ నెల 23న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు గురువారం కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లికి బాలిక వయసు సరిపోదంటూ, వివాహం చేయకూడదని ఇరువర్గాల కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఇదిఇలావుండగా గడిచిన కొన్ని రోజులు క్రితమే ఈ అమ్మాయికి ప్రధానం కుడా జరిగిపోయింది. ఈ వివాహాంకు సంబందించి అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
బావా బావా కన్నీరు
పెళ్లి చేసుకున్నాక బావా మరదళ్లలా ఉంటే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న బావ అన్నల్లో ఒకడిలాగా అనిపించవచ్చు. అలాంటి బావను ఎలా పెళ్లి చేసుకోవాలి? మేనత్త పోరు వల్లో, మేనమామ గోడు వల్లో అమ్మాయి జీవితం మోడు కాకూడదు. బలవంతం చేస్తే... బాబా బావా పన్నీరు కాస్తా... బావా బావా కన్నీరు అవుతుంది. సైకియాట్రిస్ట్ దగ్గర తల్లిదండ్రులు కూచుని ఉన్నారు. ‘చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్. ‘బయట మా అమ్మాయి కూచుని ఉంది. మీరు కొంచెం కౌన్సెలింగ్ ఇవ్వాలి’ అన్నారు వాళ్లు. ‘దేని గురించి?’ ‘పెళ్లి చేసుకోను అంటోంది’ ‘ఎప్పటికీ ఎవరినీ చేసుకోనంటోందా?’ ‘కాదు... ఒక సంబంధం చూశాం. ఆ అబ్బాయిని చేసుకోను అని అంటోంది’ సైకియాట్రిస్ట్ కళ్లద్దాలు తీసి చేతిలో పట్టుకుంది. ‘చూడండి. ఇది మానసిక వైద్యం చేసే విభాగం. అమ్మాయి పెళ్లి వద్దంటోంది... ఫలానా చీర కట్టుకోనంటోంది... ఫలానా కాలేజీలో చేరనంటోంది అంటే మేము చేసేది ఏమీ లేదు. ఇది మీరు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్. మీ అమ్మాయిని అడిగి ఆ సంబంధం కాదంటే ఇంకో సంబంధం చేయండి’ ‘అదికాదండీ.. మీరొక్కసారి మాట్లాడితే... అది మంచి సంబంధం... అందుకని’ బతిమిలాడారు. ‘సరే’ అందామె. ఆ అమ్మాయికి 21 ఏళ్లు. చామనఛాయలో చక్కటి కను ముక్కుతో ఉంది. స్థిరంగా ఉన్నట్లు కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కళ్లలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ‘చెప్పమ్మా... పెళ్లి ఎందుకు చేసుకోవద్దనుకుంటున్నావు’ అడిగింది సైకియాట్రిస్ట్. ‘చేసుకోను అని చెప్పట్లేదు డాక్టర్. ఇప్పుడే వద్దు. రెండేళ్ల తర్వాత చేసుకుంటాను అంటున్నాను. అబ్బాయి గురించి నాకేం వ్యతిరేకత లేదు కాని నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు’ అందా అమ్మాయి. ‘ఎవరినైనా ప్రేమించావా?’ ‘అయ్యో! అలాంటిదేమీ లేదండీ’ ‘మరి ఈ మాత్రం దానికి ఎందుకు అందరూ వర్రీ అవుతున్నారు. నువ్వూ... మీ అమ్మా నాన్నలూ’ అమ్మాయి సడన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది. ‘అయ్యో. ఏడవకమ్మా’ సైకియాట్రిస్ట్ నాప్కిన్ తీసిచ్చింది. ‘ఆ అబ్బాయి మా మేనత్త కొడుకే డాక్టర్. చిన్నప్పటి నుంచి చూసినవాడే. అతన్ని పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు అంటున్నారు. నాకైతే ఇప్పటికిప్పుడు నా మైండ్ సిద్ధంగా లేదు. అంతే కాదు అతడి మీద పెళ్లి చేసుకునేంత మనసు పోవడం లేదు. అదీగాక మేనరికం వల్ల పిల్లలు సరిగా పుట్టరు అని అంటారు కదా. ఆ సందేహం కూడా ఉంది. ఇవన్నీ నేను చెప్తుంటే మా వాళ్లు’... మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది. సైకియాట్రిస్ట్‌కు ఇదంతా స్ట్రేంజ్‌గా అనిపించింది. చాలా సాధారణ సమస్య. అమ్మాయి మేనరికం వద్దంటోంది. ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అదీ ఇప్పుడు కాదనుకుంటోంది. ఇందులో సమస్య ఏమిటో అర్థం కావడం లేదు. ‘సమస్య ఉంది డాక్టర్. మా ఇంట్లో అందరూ నన్ను టార్చర్ పెడుతున్నారు’ ‘అంటే?’ అంది సైకియాట్రిస్ట్. ‘మా అమ్మకు డయాబెటిస్ ఉంది. ఆమె రెండు వారాలుగా మందులు మానేసింది. మా అన్నయ్య ఆ సంగతి చెప్పి నీ వల్ల అమ్మ మందులు మానేసింది... ఆమె చచ్చిపోతుంది... ఒకవేళ చచ్చిపోతే నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని టెన్షన్ పెడుతున్నాడు. మా నాన్న నాతో మాట్లాడకుండా సాధిస్తున్నాడు. మా అమ్మ చచ్చిపోతుందేమోనని నిజంగానే నాకు భయంగా ఉంది. ఆమె చచ్చిపోయేలోపు నాకే ఆత్మహత్య చేసుకోవాలని ఉంది’ అంది తల వొంచుకుని దుఃఖిస్తూ. ఆ అమ్మాయికి ఒక మేనత్త కొడుకు ఉన్నాడు. అతడు బాగా చదువుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. మేనత్తకు తన తమ్ముడంటే అభిమానం. తమ్ముడి కూతురంటే వాత్సల్యం. అమ్మాయి తండ్రికి కూడా తన చెల్లెలి కుటుంబంతో వియ్యమందడం సంతోషం. ఈ పెళ్లి జరిగితే రక్తసంబంధం తర్వాతి తరానికి కొనసాగుతుందని పెద్దల ఆలోచన. ఈ పెళ్లి జరక్కపోతే స్థితిమంతులైన చెల్లెలి కుటుంబంతో తేడా ఎక్కడ వస్తుందో వాళ్లు ఎక్కడ దూరమైపోతారో అని తండ్రి, తల్లి, అన్న ఆందోళన చెందుతున్నారు. కాని అమ్మాయికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. అన్ని విధాలా చెప్పి చూశారు. చివరకు బెదిరింపులకు దిగారు. కుటుంబ పరువు ఏం కాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వొత్తిడికి ఆ అమ్మాయి కిందా మీదా అయిపోతూ ఉంది. చచ్చిపోవాలని లోలోపల అనుకుంటూ ఉంది. ఇదీ కేసు. సైకియాట్రిస్ట్‌కు మొత్తం అర్థమైంది. ‘సరేనమ్మా. నువ్వెళ్లు. రేపు మీ అమ్మను నాన్నను అన్నయ్యను రమ్మన్నానని చెప్పు’ అంది. ఆ చిన్న ఆశతో డాక్టర్ వైపు చూసి లేచి బయటకెళ్లిపోయింది. మరుసటి రోజు తల్లి, తండ్రి, అన్నయ్య సైకియాట్రిస్ట్ ఎదురుగా కూచుని ఉన్నారు. ‘అది కాదు డాక్టర్. మా నిర్ణయంలో తప్పేముంది చెప్పండి’ అన్నాడు తండ్రి. ‘సార్. మీరు బాగా రెడీ అయ్యి ఆఫీసుకు బయల్దేరుదామని బయటికొస్తే పైనుంచి మీ షర్ట్ మీద పక్షి రెట్ట పడితే మీరు ఆ షర్ట్‌తోనే వెళతారా? మార్చుకొని వెళతారా?’ ‘మార్చుకుని వెళతాను’ ‘కాసేపటి వ్యవహారానికే షర్ట్ మారిస్తే జీవితాంతం ఇష్టం లేని బరువును ఆ అమ్మాయి ఎందుకు మోయాలనుకుంటున్నారు?’ అతను దెబ్బ తిన్నట్టుగా చూశాడు. ‘కాపురం చేయాల్సింది ఆ అమ్మాయి. అతనితో జీవితాన్ని పంచుకోవాల్సింది ఆ అమ్మాయి. ఇరవైనాలుగ్గంటలూ అతడు ఎదురుగా ఉంటే చూస్తూ స్వీకరించాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అది ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తారు? ప్రతి ఒక్కరికీ నిర్ణయం తీసుకునే హక్కు, ఎదుటివారికి ఆ నిర్ణయాన్ని గౌరవించే బాధ్యత ఉందని ఎందుకు భావిస్తున్నారు? పైగా కుటుంబ మర్యాద బంధాల కొనసాగింపు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆడపిల్ల మాత్రమే కుటుంబ మర్యాద కాపాడాలా? ఆడపిల్ల పెళ్లి ఇష్టం లేదన్నా లేదంటే నచ్చినవాణ్ణి చేసుకున్నా కుటుంబ మర్యాద పోయిందని ఎందుకు రాద్ధాంతం చేస్తారు. ఆడపిల్ల భుజాల మీద మాత్రమే కుటుంబ మర్యాద ఎందుకు ఉంది? ఆమె నిర్ణయానికి మంచి చెడులకు అతీతమైన మర్యాదను మీ కుటుంబానికి మీరు సంపాదించి పెట్టలేదా? ఇక బంధాల కొనసాగింపు. మీరు, మీ చెల్లెలు ఈ పెళ్లితో మాత్రమే బలపడతారా? ఈ పెళ్లి జరక్కపోతే విడిపోయేంత బలహీనమైన అన్నాచెల్లెళ్ల అనుబంధమా మీది. అంత బలహీనమైనదైతే దాని కోసం బాధపడటం అనవసరం ఏమో కదా! మీరు చేస్తున్న వొత్తిడి వల్ల మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తోంది. అదే జరిగితే సమస్యకు పరిష్కారం జరిగిందని సంతోషపడతారా?’ తల్లిదండ్రులు, అన్న అదిరిపోయారు. ‘మాకు తెలియదు డాక్టర్. ఏదో అమ్మాయికి మంచి జరుగుతుందని తాపత్రయపడ్డాం’ ‘ఆమ్మాయికి ఏది ఇష్టమో అది చేస్తే మంచి. నచ్చనిది చేస్తే చెడు. అది గ్రహించండి ముందు’ అంది లేడీ సైకియాట్రిస్ట్. తండ్రి తల పంకించాడు. ‘ఇది మాకు కొంచెం కష్టమే. అయినా అమ్మాయి కంటే ఏదీ ఎక్కువ కాదు. నా చెల్లెలికి మేనల్లుడికి నేను సర్ది చెప్పుకుంటాను. వాళ్లు కూడా మూర్ఖంగా ఉంటారని అనుకోను. ఎనీ హౌ థ్యాంక్యూ డాక్టర్’ ముగ్గురూ లేచి నిలబడ్డారు. వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు. ఆ అమ్మాయి మీద వొత్తిడి పెట్టి పెళ్లి చేసి ఉండరనే సైకియాట్రిస్ట్ నమ్మకం. ఆ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుందాం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
ఏముందో అక్కడ?
చిత్తూరు పోలీసు శాఖలో జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌లో అయినవారిని అందలం ఎక్కించడానికి కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇందులో భాగంగానే ఐదు ప్రధాన విభాగాలను అడగొద్దంటూ సిబ్బందికి ఆప్షనల్ ఫారమ్‌లో సూచించారా..? ఈ లెక్కన పదోన్నతి పొందిన సిబ్బందికి నిర్బంధ బదిలీ చేస్తున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ బదిలీ కావడంతో.. పోలీసుశాఖలో ‘కీ’లకంగా ఉన్న ఓ అధికారి బదిలీల వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు అర్బన్: పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఉత్తర్వులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్షనల్స్‌గా కొన్ని విభాగాలను ఎంచుకోకూడదన్న నిబంధనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలను ఎందుకు ఎంచుకోకూడదు? ఎవరికోసం ఆ నిబంధన పెట్టారు.. ఇంతకీ అక్కడ ఏముంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందికి పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. చిత్తూరు పోలీసు జిల్లాలో 104 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా.. 46 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతులు లభించాయి. వాస్తవానికి వీరికంతా పదోన్నతి వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి ఏ స్టేషన్లలో ఖాళీ ఉంటే అక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పటికింకా ఎన్నికల హడావుడి కూడా లేదు. కనీసం ఈ ఏడాది జనవరిలో బదిలీలు చేసుంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా సార్వత్రిక ఎన్నికలు మొత్తం పూర్తయ్యాక పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించడానికి ఓ అధికారి తహతహలాడుతున్నారు. ఇప్పటికే విక్రాంత్ పాటిల్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా అప్పలనాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేసింది. ఇలాంటి తరుణంలో బదిలీల కౌన్సెలింగ్ పూర్తిచేయాలని చూడడం విమర్శలకు దారితీస్తోంది. ఇంతకూ ఏముందో అక్కడ..? బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన 150 మంది సిబ్బందికి జిల్లా పోలీసుశాఖ నుంచి ఓ ప్రొఫార్మా అందింది. ఇందులో సొంత ఊరు కోరుకోకూడదనే ఓ అంశాన్ని ఉంచారు. ఇది బాగానే ఉంది. ఎక్కడకు బదిలీ కావాలో అయిదే స్టేషన్లను ఎంచుకోవాలి సూచించారు. ఇది కూడా బాగానే ఉంది. అయితే స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), డీసీఆర్బీ (క్రైమ్ రికార్డ్స్), ఐటీ కోర్, డీటీసీ, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను ఆప్షనల్‌గా ఎంచుకోకూడదని చెప్పడం వివాదానికి తెరలేపినట్లయ్యింది. అంటే ఈ ఐదు విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నవారికి బదిలీలు ఉండవా..? చేయకూడదా..? మరెవరూ ఇక్కడ పనిచేయకూడదా..? వాటికి అంత ప్రత్యేకత ఏముంది..? అంటూ కడుపుమండిన సిబ్బంది అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పైగా ఈ ఐదు విభాగాల్లో ఓ సామాజికవర్గానికి చెందిన సిబ్బంది ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో అయితే టీడీపీ నేతలు చెప్పిందే అన్నట్లు కొందరు నడుచుకుని రూ.లక్షలు కూడబెట్టుకున్నారు. అలాంటి వారిని కదిలించకుండా బదిలీల్లో వీటిని కోరుకోకూడదని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు అడుగుతున్నారు. పాతుకుపోయిన వారి పొజిషన్ ఏంటో..! జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న సిబ్బందిని కదిలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. గత ఏడాది కూడా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టలేదు. కొన్నిచోట్ల అటాచ్మెంట్ల పేరిట కాలం నెటుకొచ్చేవారు ఉన్నారు. పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి స్టేషన్లు కేటాయించాలంటే లాంగ్ స్టాండింగ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయా స్థానాల్లో కదిలించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను కౌన్సెలింగ్‌లో ఉంచాలి. కనీసం స్టేషన్ల వారీగా ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని మంజూరయ్యాయనే వివరాలు కూడా చెప్పకుండా ఏకపక్షంగా బదిలీలు చేయడంపై సొంత శాఖలోని సిబ్బంది అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.