
'మందు తాగి బండి నడుపొద్దు'
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారికి గోషామహల్ స్టేడియంలో ప్రముఖ హాస్య నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నష్టాలపై వారికి వివరించారు.
కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట చనిపోయిన తన పెద్ద కొడుకు పవన్ కుమార్‌ను గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తాగడం తప్పు కాదని, తాగి డ్రైవింగ్ చేయడం తప్పని చెప్పారు.