babu mohan
-
ఒక్క సీన్ కోసం 3 నెలలు వెయిట్ చేయించా.. చిరంజీవి కోపంతో!
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో బాబూ మోహన్ ఒకరు. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక సినిమాల సంఖ్య తగ్గించేశాడు. ఇటీవలే ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మూడు నెలలపాటు వెయిట్ చేయించా 'ముఠా మేస్త్రీ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది. నా గురించి మూడు నెలలపాటు ఓ సీన్ షూటింగ్ ఆగిపోయింది. చిరంజీవికి విసుగెత్తిపోయి.. మీరేం చేస్తారో నాకనవసరం.. ఈరోజో, రేపో షూటింగ్ అయిపోవాలన్నాడు. రెండు గంటల సమయం ఎప్పుడిస్తారో చెప్పాలన్నాడు. ఓ టైం ఫిక్స్ చేసి రావాలని చెప్తే.. ప్రయత్నిస్తానన్నాను. ఇంకా ట్రై చేయడమేంటి? అని సీరియసయ్యాడు. నేను సారీ చెప్పాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఆయనతో షూటింగ్ అంటే మహా ఇష్టం. కానీ బిజీగా ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను. ఓపక్క సంతోషం.. మరోపక్క బాధ ఇక అదంతా జరిగాక ఓ రోజు ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకుని సారథి స్టూడియోలో అడుగుపెట్టాను. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందామనుకున్నాను. తీరా అప్పటికే మెగాస్టార్ అక్కడున్నారు. షూటింగ్ నుంచి వచ్చావా? నీ కళ్లే చెప్తున్నాయి.. సినిమా వాళ్ల జీవితం ఇంతే.. అని బాధపడ్డాడు. బ్రష్ చేసుకోమని చెప్పి ఇంటి దగ్గరి నుంచి దోసెలు తెప్పించాడు. నేను ఆవురావురుమని తింటుంటే చూసి సంతోషించాడు, బాధపడ్డాడు. నాకూ తినాలని ఉంటుంది కానీ హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీలయ్యాడు' అని చెప్పుకొచ్చాడు. రూ. 1 కోటి దాకా ముంచాడు తన ఆస్తి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు మంచం కింద పెట్టి మర్చిపోయేవాడిని. ఒకసారి నా బెడ్‌షీట్ దులిపితే రూ.12 లక్షలు బయటపడ్డాయి. క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడిని. చాలామంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు. చెక్ బౌన్స్ అయ్యేవి. పోనీలే అని వదిలేసేవాళ్లం. ఒకసారి నేను మేనేజర్‌ను పెట్టుకున్నాను. కానీ అతడు కోటి రూపాయలు లెక్క చెప్పకుండా తినేశాడు. అప్పటినుంచి నేనే అన్నీ మెయింటైన్ చేసుకున్నాను' అని బాబూ మోహన్ తెలిపాడు. చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అక్కడే! -
ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏపాల్ సమక్షంలో సోమవారం ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు బాబూమోహన్. కాగా ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని ఆ సయంలోనే బాబూ మోహన్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలపొందారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. చదవండి: నా జీవితం దేశానికి అంకితం: ప్రధాని మోదీ -
బీజేపీకి బాబు మోహన్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్‌తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్‌తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్‌గా రాజేంద్ర ప్రసాద్‌తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్‌తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్‌తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్‌కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
ఏడ్చేసిన బాబు మోహన్..
-
బాబూ మోహన్‌కు తనయుడి షాక్
సాక్షి, సిద్ధిపేట: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబూ మోహన్‌కి ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉదయ్ బాబు మోహన్‌తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. చదవండి: తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా? -
బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీకి రాజీనామా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బాబు మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదని విమర్శించారు. తన విషయంలో పార్టీ ఇచ్చే స్పందనను బట్టి బీజేపీలో ఉండాలా? లేదా అని నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటానని పేర్కొన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో తన కుమారునికి తనకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాబు మోహన్ పేర్కొన్నారు. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిచారని, ఇది సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోల్ ప్రజలు తనను మూడు సార్లు ఆదరించారని పేర్కొన్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ మంచి నాయకుడేనని.. కానీ రాష్ట్రంలో ఉన్న నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించారు. అర్హులకే టికెట్ ఇవ్వాలని భాజపా పెద్దలను కోరుతున్నట్లు చెప్పారు. కనీసం తనకు మొదటి జాబితాలో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు తెలిపారు. ఒకవేళ రెండో లిస్టులో తన పేరు ఉన్నా.. తాను మాత్రం పోటీ చేయనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు అవమానాలు జరిగాయని, ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చదవండి: రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా? -
పాపులర్ హీరోయిన్స్ నాతో డాన్స్ చేశారు: బాబూ మోహన్
-
ఫ్యాన్స్ కోసం ఫేవరెట్ డైలాగ్ చెప్పిన బాబు మోహన్
-
మా ఇద్దరి కామెడీ అందరికీ చాలా నచ్చుతుంది...!
-
మీకు ఏది అంటే ఎక్కువ ఇష్టం రాజకీయాలు లేక సినిమా..?
-
సినిమా కష్టాలు బయటపెట్టిన బాబు మోహన్..!
-
నా జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవం ఇదే..!
-
బాబూ మోహన్ తో రాపిడ్ ఫైర్..!
-
మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది, నాన్న వదిలేసి పోయారు
కమెడియన్, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబూ మోహన్. ఆహుతి సినిమాతో ఆయన సినీప్రస్థానం మొదలైంది. తొలి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేసిన బాబూ మోహన్ తక్కువ కాలంలో కమెడియన్‌గా టాప్ పొజిషన్‌కు వెళ్లాడు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక సినిమాలు తగ్గించేసిన ఈయన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆర్గానిక మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఓ బుల్లితెర షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన పిల్లలు వేసిన ఎమోషనల్ స్కిట్ చూసి ఏడ్చేశాడు. తన చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఒక్కసారిగా నన్ను గతంలోకి తీసుకెళ్లారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను మూడో తరగతి చదువుతుండగా అమ్మ చనిపోయింది. నాకో చిన్న చెల్లెలు. చిన్నప్పటి నుంచి తల దువ్వి జడ వేసి దగ్గరుండి చూసుకున్నాను. మా నాన్న ఎక్కడికో వెళ్లిపోయారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. బాబూ మోహన్ ఎక్కువగా కోట శ్రీనివాస్ రావుతో కలిసి కామెడీ పండించేవారు. ఆ తర్వాత బ్రహ్మానందంతో ఎక్కుగా కాంబినేషన్ కామెడీ సీన్లు ఉండేవి. మామగారు సినిమాకుగానూ బాబూ మోహన్ నంది అవార్డు అందుకున్నాడు. తెలుగు వెండితెరపై టాప్ కమెడియన్‌గా రాణించిన ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు. చదవండి: వీడియో షేర్ చేసిన స్నేహ.. అలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటూ అభిమానుల హెచ్చరిక -
ఒకే ఫొటోలో ఐదుగురు స్టార్ కమెడియన్స్.. అరుదైన దృశ్యం చూశారా?
సినిమాకు కామెడీ అనేది ప్రధానం. ఎంత పెద్దసినిమా అయినా సరే కాసింతైనా కామెడీ లేకపోతే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. కథ ఎంత బలంగా ఉన్నప్పటికీ.. కామెడీ కనిపించకపోతే అబ్బే ఏదో సినిమాలో లోపించందండి అంటుంటారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే కామెడీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అలా తెలుగు సినిమాలో 1990ల్లో కడుపుబ్బా నవ్వించిన వారిలో ఠక్కున వినిపించే పేర్లు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు జోడీ. వీరిద్దరు చేసిన కామెడీ తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఎంఎస్ సత్యనారాయణ, బ్రహ్మనందం లాంటి వాళ్లు తెలుగు సినిమా కామెడీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పట్లో కమెడియన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బ్రహ్మనందమే. ఆయన లేకుండా సినిమా లేదంటే ఓ వెలితి ఉన్నట్లే అనిపిస్తుంది. అలా తన కామెడీతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) అయితే ఒక్క కమెడియన్ సినిమాలో ఉంటేనే కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. అలా ఏకంగా ఐదుగురు స్టార్ కమెడియన్స్ ఓకే ఫోటోలో కనిపిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక నవ్వులే నవ్వులు. అలాంటి అరుదైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే తెలుగులో స్టార్ కమెడియన్స్‌గా పేరొందిన ఆ ఐదుగురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అప్పటి ఐదుగురు తెలుగు స్టార్ కమెడియన్స్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేయగా.. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది మా పాతికేళ్ల కామెడీ కుటుంబం అంటూ నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. ఓకే ఫోటోలో బ్రహ్మనందం, బాబు మోహన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, చలపతిరావు నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం తెలుగు సినిమా కామెడీ కుటుంబం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి సార్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కమెడియన్ సినిమాకు ప్రాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) పాతికేళ్ల క్రితం మా కామెడీ కుటుంబం! 🥰 https://t.co/WW2dmgePOl — Tanikella Bharani (@TanikellaBharni) August 7, 2023 -
తెలంగాణలో అధికారంపై ఆశలు సరే! ఆ జిల్లాలో బీజేపీకి నాయకులున్నారా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా జెండా ఎగరేయాలని కమలం పార్టీ ఆశపడుతోంది. అందుకోసం చాలా కష్టపడుతోంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకులే కరువయ్యారు. కొన్ని చోట్ల ఉన్నవారు కూడా యాక్టివ్‌గా లేరు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి బీజేపీ నాయకత్వం దూకుడు మీదుంటే.. మెదక్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ నాయకులు నామ మాత్రంగా కూడా స్పందించడం లేదు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆందోల్‌లో మాజీ మంత్రి బాబు మోహన్ కమలం పార్టీలో ఉన్నప్పటికీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వచ్చి వెళ్తున్నారు. పార్టీ కేడర్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. కార్యకర్తలను నడిపించడానికి బలమైన నాయకుడు లేకుండా పోయారు. జహీరాబాద్ నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జంగం గోపిపై సస్పెషన్ వేటు పడింది. దీంతో బీజేపీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించడానికి నాయకుడే లేకుండా పోయారు. జిల్లా కేంద్ర నియోజకవర్గం సంగారెడ్డిలో బీజేపీకి కొంత పట్టు ఉంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేశ్ పాండే పార్టీ కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నా.. ఇక్కడ నేతల మధ్య విభేదాలు రగులుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో, విభేదాల కారణంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహించడంలో విఫలం అవుతున్నారు. పఠాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్ లు ఎవరికీ వారే అన్న చందంగా తయారయ్యారు. నారాయణ ఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కూడా అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..? బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పలు నియోజక వర్గాల నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఉన్న కొద్ది మంది నాయకులు అంతర్గత కలహాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా నాయకులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. నాయకత్వ సమస్యను అధిగమించేందుకు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఆపరేషన్ ఆకర్షపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినప్పటికీ జిల్లాలో పెద్దగా స్పందన రావడంలేదు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళి యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ బీజేపీలో చేరలేదు. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సోదరుడు రాంచందర్ కాషాయ కండువా కప్పుకున్నప్పటికీ ఏ మేరకు ప్రభావం చూపగలరనేది ప్రశ్నార్ధకమే. జిల్లా నాయకత్వం అనుసరిస్తున్న తీరుతోనే పార్టీ అగ్రనేతల కార్యక్రమాలు తరచుగా రద్దవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
అది బాబుమోహన్ వాయిసేనా? బండి మీద అంత కోపమెందుకు?
తాజాగా సోషల్ మీడియాలో బాబుమోహన్ పేరిట ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది. అది బాబుమోహన్ వాయిస్ అవునా? కాదా? అనేది పక్కన పెడితే అందులో మొత్తం బూతు పురాణమే వినిపిస్తోంది. బండి సంజయ్ ఎవడు? అనే ప్రస్తావన కూడా రావడంతో ఆ ఆడియో వైరల్‌గా మారింది. అది నిజంగానే బాబుమోహన్ వాయిస్ అయితే బండి సంజయ్ మీద అంత కోపం ఎందుకు అనే చర్చ కూడా నెట్టింట్లో మొదలైంది. -
విషం పెట్టి చంపాలని ప్లాన్ చేశారు, ఆ ఒక్క ఫోన్‌కాల్‌తో..
తన కామెడీతో జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు కమెడియన్ బాబూ మోహన్. సినిమాలతో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టాడు. అయినప్పటికీ ఆయనకు సినిమాల మీద ప్రేమ తగ్గలేదు. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న బాబూ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఢిల్లీలో 'వన్స్‌మోర్' సినిమా షూటింగ్ చేస్తున్నాం. సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నాడు. నన్ను రుచి చేయమన్నాడు. సరేనని ఒకటి నోట్లో పెట్టుకున్నా, కానీ ఛీఛీ అని దాన్ని ఊసేశా. విచిత్రంగా తర్వాతి రోజు నుంచి నేనే ఒక పాన్ ఇవ్వమని అడిగేవాడిని. అలా ఒకానొక దశలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్లు తినేవాడిని. సంగారెడ్డి వచ్చానంటే అక్కడ ఓ డబ్బాలో కచ్చితంగా పాన్ తినేవాడిని. నేను అక్కడ పాన్ కట్టించుకుంటానని తెలిసిన కొందరు ఓసారి అందులో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్ తీసుకుని కారులో వెళ్లాను. ఇక తిందామనుకునే సమయానికి ఫోన్ వచ్చింది. దయచేసి పాన్ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. వెంటనే పాన్ పక్కన పడేశాను. అంతలోనే మరో ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి పాన్ కట్టే వ్యక్తి భార్య మాట్లాడుతూ.. తప్పయిపోయింది సార్, విషం కలిపిన పాన్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారంటూ ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా? అని అప్పుడు తెలిసొచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబూ మోహన్. చదవండి: రాకెట్రీలో ఆ సీన్ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్, హీరో దెబ్బకు ట్వీట్ డిలీట్! ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా? -
గంధర్వ: సునీత పాడిన ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ విన్నారా?
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఆదివారంనాడు బాబూ మోహన్ గంధర్వ చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీని జూలై 1న విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ మాధవ్ ప్రకటించగా ఏమైందో ఏమో.. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు. ఈ పాటను సింగర్ సునీత ఆలపించింది. అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ, మాకు కోడిరామకృష్ణ గురువు. ఆ తర్వాత మా సోదరుడు వీరశంకర్. ఎందుకనో ఆయనకు నామీద కోపం. నాకు ఏ సినిమా ఇవ్వలేదు. అయితే ఈ సినిమా పూజరోజు వీరశంకర్ సినిమా చేస్తున్నాడనిపించింది. కానీ ఆ తర్వాత చెప్పారు కొత్త దర్శకుడు అప్సర్ చేస్తున్నాడని. చిత్ర కథలోని పాయింట్ కొత్తది. చెప్పడం వేరు, తీయడం వేరు. సెట్లో ఎక్కడా టెన్షన్ పడలేదు. అనున్నది అనుకున్నట్లు తీశాడు అని తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతుంది. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్ అందుకు ఉదాహరణలు. ఇక దర్శకుడు వీరశంకర్గారు గంధర్వ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. సందీప్‌తో చేయడం గాప్పగా ఫీలవుతున్నాను. గంధర్వ టైటిల్లో చూపించినట్లుగా 1971-2021 కథ. అయితే నా సినీ కెరీర్కూడా 1972 నుంచి ఇంకా కొనసాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జర్నీలో గంధర్వ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇందులో ప్రధానమైన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. ఇండియన్ తెరపై ఇప్పటివరకు రాని పాయింట్. ఇలాంటివి చెప్పడం ఈజీ. తీయడం కష్టం. దర్శకుడు అప్సర్ బాగా తీశాడు. దర్శకుడు మిలట్రీ మనిషి కాబట్టి నాతో కూడా యాక్షన్ చేయించాడు. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి అన్నారు. -
ఆస్థిపంజరంలా మారిపోయా.. చనిపోవాలనుకున్నా: బాబు మోహన్ ఎమోషనల్
తనదైన మ్యానరిజం కామెడీతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు కమెడియన్ బాబు మోహన్. అప్పట్లో సినిమా విజయాల్లో బాబు మోహన్ కామెడీ కీలక పాత్ర పోషించేంది. అప్పటి దర్శకులు సైతం బాబుమోహన్‌ని దృష్టిలో పెట్టుకొని కామెడీ సీన్స్ రాసేవారు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. హీరోగానూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక గత కొంత కాలంగా రాజకీయాలతో పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న బాబు మోహన్.. తాజాగా ఓ కామెడీ షోలో పాల్గొని అందరిని అలరించాడు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడిని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మృతి చెందిన విషయాన్ని చాలా కాలంపాటు జీర్ణించుకోలేకపోయానని, ఆ సమయంలో అస్తిపంజరంగా మారిపోయానని బాబుమోహన్ చెప్పుకొచ్చారు. ఒకనొక దశలో చనిపోవాలని అనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, బాబు మోహన్ ఏకైక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బాబు మోహన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. -
గెలుపును సెలబ్రేట్ చేసుకున్న మంచు విష్ణు
-
ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్
‘మా’ ఎన్నికలు ముగిసినప్పటికీ రోజుకో ట్విస్ట్‌తో ఎన్నికలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గుడుస్తున్నా మా ఎన్నికల్లో రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్, విమర్శలు, దాడులతో చివరికి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఎన్నికల రోజున జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయి. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించి సంగతి తెలిసిందే. ఇక ప్రకాశ్ ఆరోపణలపై నేడు తిరుపతిలో జరిగిన మీడియాలో సమావేశంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. చదవండి: ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే అలాగే ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన సీనియర్ నటుడు బాబూ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన.. ‘మా’లోని ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే అన్నారు. అంగీకరించకపోతే రెండు రాష్ట్రాల ప్రజలు క్షమించరని, ఇంకో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడిగా గెలుస్తారని పేర్కొన్నారు. అందరు మంచు విష్ణుకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆవేశం తగ్గించుకోవాలని, తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదు అన్న వ్యక్తి హైస్కూల్లో చదివారన్నారు. కానీ విష్ణు యూనివర్సిటీ సీఈవో అంటూ వ్యాఖ్యానించారు. -
పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబూ మోహన్
Babu Mohan Respond On Pawan Kalyan Comments: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఇక త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ ఆన్లైన్ టికెట్ల విధానంపై స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు బాబూ మోహన్, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చదవండి: posani krishna murali: పోసాని ఇంటిపై రాళ్లదాడి ‘మా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్లో బాబూ మోహన్ సభ్యుడిగా ఉన్న సంగతి విదితమే. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో బాబూ మోహన్ మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు. ఇంతకీ ఆయన పరిశ్రమ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? ముందుగా పవన్ కల్యాణ్ తేల్చుకోవాలి. సర్కారు సహకారం ఇండస్ట్రీకి అవసరం. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీనే ఓ విషయం అడిగింది. దీనిపై పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడారు’ అన్నారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: వైరల్ అవుతున్న ప్రకాశ్ రాజ్ ట్వీట్ అలాగే ‘ఈ విషయంలో పవన్ వ్యవహరించిన తీరు సరైనది కాదు. నిన్న పవన్‌కు మా విష్ణు బాబు ఓ ప్రశ్న వేశారు. అందులోనే ఓ విషయం ఉంది. పవన్‌ను ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా అని విష్ణు ప్రశ్నించారు. ఏదేమైనా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి. అంతేగాని తెరముందుకు వచ్చి మాట్లాడటం ఏంటి? మరి అంత చిరాకుతో మాట్లాడటం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల మన పరిశ్రమ పరువే పోతుంది. అంత పెద్ద అన్యాయమే జరిగితే పెద్ద మనుషులతో మాట్లాడి తేల్చుకోవాలి’ అంటూ బాబూమోహన్ చెప్పుకొచ్చారు. -
ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్ భావోద్వేగం
మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై నటుడు బాబు మోహన్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ప్రస్తుతం అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు మరణాన్ని గుర్తు చేసుకుని భావోద్యేగానికి లోనయ్యారు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వార్త విన్న వెంటనే నాకు ఆనాటి సంఘటన గుర్తొచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ఈ సందర్భంగా ఆయన ఓ సందేశం ఇచ్చారు. చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్ ఈ మేరకు.. ‘సాయి హెల్మెట్ పెట్టుకుని మంచి పని చేశాడు. ఎందుకో తెలియదు కొందరూ హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. అది మంచి పద్దతి కాదు. రోడ్డుపై నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదం బారిన పడితే దాని ప్రభావం వారి కుటుంబ సభ్యులు, నమ్ముకున్న వారిపై పడుతుంది. దానికి ఉదాహరణ నేనే. ఓ తండ్రిగా కొడుకును కోల్పోతే జీవితాంతం ఆ దు:ఖం ఉంటుంది, కడుపు తీపితో వచ్చే దు:ఖాన్ని ఎవరూ ఆపలేరు. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ వాడిన బైక్ ఏంటి? ధర ఎంత? దయచేసి మోటారు బైకు ప్రియులు మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుని బైక్ నడపాలని వేడుకుంటున్నా. మీ తల్లిదండ్రులను పూజించాల్సిన బాధ్యత మీపైనే ఉంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడొద్దని, వారిని ప్రేమించే వాళ్లు మానసిక క్షోభ అనుభవిస్తారన్నారు. ఈ విషయాన్ని యువత దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని బాబు మోహన్ కోరారు. -
మా ఎన్నికలపై బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అది తుగ్లక్ పార్టీ... ఇది తాలిబన్ పార్టీ
జోగిపేట (అందోల్): రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ తుగ్లక్ పార్టీ అని, ఎంఐఎం తాలిబన్ పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుక్కకు ఉన్న విలువ పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయిందన్నారు. భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ఎకరాలు పంట నష్టపోయి, ఆస్తి నష్టమై రైతులు, జనం అల్లాడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని చెప్పారు. గురువారం చౌటకూరు మండల కేంద్రంలో ప్రజా సంగ్రామయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘బాబూ మోహన్ నన్ను ఎంపీగా గెలిపించేందుకు చాలా కష్టపడ్డారు. మహారాష్ట్ర సహా ఎక్కడ ఎన్నికలొచ్చినా వెళ్లి ప్రచారం చేసి బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం వద్దకు ఓ ఎమ్మెల్యే వెళితే ‘పెద్ద మనిషి ఏమైనా పైసలు సంపాదిస్తున్నవా?’అని కేసీఆర్ అడిగిండట. ఎక్కడ సార్ డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నం అని ఆయన జవాబిస్తే... ప్రభుత్వ భూములు కబ్జా చేసుకో. రూ.100 కోట్లుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటిస్తా అని చెప్పిండు. అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం’అని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో రూ.100 కోట్లతో రూములు కట్టుకున్నాడే తప్ప 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక వస్తేనే దళితబంధు ‘ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదు? దళితబంధు రావాలంటే ఇక్కడ కూడా ఉప ఎన్నిక రావాల్సిందే. ఉప ఎన్నిక వస్తేనే రోడ్లు వస్తయి.. నీళ్లు వస్తయి.. పథకాలు వస్తాయని జనం చెబుతున్నారు’అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని, హిందూ సమాజాన్ని చీల్చే పార్టీ ఎంఐఎం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని జరపడానికి వెనుకాడుతున్న అవకాశవాది కేసీఆర్ అని ఆరోపించారు. హిందూ సంఘటిత శక్తిని దేశానికి చాటడమే తన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సినిమాలో జోకర్‌నే.. నిజజీవితంలో హీరోని’
జోగిపేట(అందోల్): నేను సినిమాలో జోకర్‌నే.. జోకర్‌గా 1027 సినిమాలో నటించానని, నంది అవార్డు కూడా వచ్చిందని, నిజజీవితంలో మాత్రం హీరోనని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకుడు బాబూమోహన్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో రామందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనను జోకర్ అని సంబోధిస్తూ సోషల్‌మీడి యాలో రావడంతో ఆయన స్పందించారు. కళాకారుడిగా జోకర్‌గా నటించానన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించినా దామోదర్ రాజనర్సింహను ఒక్క సారి వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. రామందిర నిర్మాణానికి విరాళాల సేకరణ జోగిపేట పట్టణంలో రామ మంది నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక వ్యాపారస్తుల వద్దకు వెళ్లి విరాళాలలను సేకరించారు. స్థానిక సుప్రభాత్ హోటల్ యజమాని విజయ్ రూ.5వేల చెక్కును అందజేశారు. తాము సేకరించిన నిధి నేరుగా రామ మందిర ట్రస్టుకు వెళ్తుందన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు నవీన్, పట్టణ అధ్యక్షుడు సయ్య సాయికుమార్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి వెంకట రమణ, మాజీ పట్టణ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, జిల్లా నాయకులు జగన్నాథం పట్టణ నాయకులు మహేష్కర్ సుమన్, సుజీత్, పుల్కల్ మండల కార్యదర్శి శేఖర్‌గౌడ్, మండల నాయకులు పాల్గొన్నారు. -
దుబ్బాక ఉప ఎన్నిక: యువతకు గాలం
దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. పార్టీ బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో సందడి చేయాలంటే యువత పాత్ర కీలకం. వయసు మళ్లిన వారి ఓటింగ్ సైలెంట్‌గా జరగుతుందని గమనించిన నాయకులు యువకులను ఆకర్షించే పనిలో పడ్డారు. వీరిని మచ్చిక చేసుకుంటే.. ఈ నాలుగు రోజులు ప్రచారానికి పనికి రావడంతోపాటు ఓట్లు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో యువకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తాయిలాలు ప్రకటిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నియోజకవర్గంలో 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు 10 శాతం మంది ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 20 వేల మేరకు యువత ఓట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటు పొందిన వారు 5 వేల మేరకు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు, వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు. ఇలా మొత్తం ఓటర్లు, యువకులు, యువతులతోపాటు, వారు చేసే పనులను ఆధారంగా విభజించి వారి అవసరాలను గుర్తించి హామీలుస్తూ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ఎటు మొగ్గు చూపుతారో.. టీఆర్ఎస్ పార్టీ ఇటీవల దౌల్తాబాద్‌లో రెండు వేల మంది యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పార్టీ అనుబంధ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులను నియోజకవర్గంలో తిప్పి యువతను గ్యాదర్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి, యువజన సంఘాల సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారికి కావాల్సిన ఆటవస్తువులు, కిట్లు, జిమ్ములు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఆకర్షిస్తున్నారు. అయితే యువతే ఆధారంగా బీజేపీ ప్రచారం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా బీజేపీ అనుబంధ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదల్, మహిళా మోర్చ ఇలాంటి సంఘాల్లోని యువతను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనుబంధ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ క్యాడర్‌ను పెంచుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నియోజకవర్గంలోని యువతే కాకుండా ప్రచారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులను సైతం నియోజకవర్గానికి పిలిపించుకొని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. లాక్ డౌన్‌తో కళాశాలలు ఇంకా తెరవకపోవడం, ఇతర పనులు కూడా లేకపోవడంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న వారిలో యువత ఎక్కువగా కన్పిస్తోంది. అయితే పోలింగ్ నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో.. యువత ఓట్లు ఎటు మొగ్గుచూపుతాయో వేచి చూడాల్సి ఉంది. 46 మంది అభ్యర్థులు.. 103 నామినేషన్లు దుబ్బాకటౌన్: దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9 వ తేదీ నుంచి నేటి వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చివరిరోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలు చేసిన అభ్యర్థులు.. సోలిపేట సుజాత(టీఆర్ఎస్), మాధవనేని రఘునందన్‌రావు(బీజేపీ), చెరుకు శ్రీనివాసురెడ్డి(కాంగ్రెస్), కత్తి కార్తీక బీఆర్ఎం(ఆల్ ఇండియా ఫార్వర్డు బ్లాక్), గౌటి మల్లేశ్ ( జై స్వరాజ్), లొంగరి రమేశ్ (బహుజన రాష్ట్ర సమితి), సుకూరి అశోక్( రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), మైసంగారి సునీల్(ఇండియన్ ప్రజాబంధు) సుదర్శన్ ఆడెపు (శివసేన), జాజుల భాస్కర్ (శ్రమజీవి పార్టీ), ఎం.జగదీష్ రరాజ్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), వడ్ల శ్యాం ( అన్న వైఎస్సార్ కాంగ్రెస్), చెరుకు విజయలక్ష్మి (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), జై.భరసింహరాయుడు (తెలంగాణ జగ్ హీర్), ఇండిపెండెంట్లుగా బుర్ర రవితేజ, రేవు చిన్న ధన్‌రాజ్, శ్రీకాంత్ సిలివేరు, మోతె నరేష్, మీసాల రాజాసాగర్, కోట శ్యాంకుమార్, షేక్ సర్వర్ హుస్సెన్, పెద్దలింగన్నగారి ప్రసాద్, పోసానిపల్లి మహిపాల్‌రెడ్డి, దొడ్ల వెంకటేశం, కొల్కూరి ప్రసాద్, అడ్ల కుమార్, గొంది భుజంగం, కొట్టాల యాదగిరి, జక్కుల నర్సింలు, మద్దెల నర్సింలు, పెద్దమ్యాతరి బాబు, వడ్ల మాధవచారి, వర్కోలు శ్రీనివాసు, ఉడుత మల్లేశం, కంటె సాయన్న, రణవేని లక్ష్మణ్, బుట్టంగారి మాధవరెడ్డి, వేముల విక్రంరెడ్డి, రేపల్లి శ్రీనివాసు, పెంటం మల్లికార్జున్, పిడిశెట్టి రాజు, బండారు నాగరాజు, కొల్లూరు జగన్మోహన్రావు ముదిరాజ్, జక్కుల రాధారమణి, అల్వాల కృష్ణస్వామి, డి.కిషన్‌రావు లు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపఎన్నిక టీఆర్ఎస్కు గుణపాఠం కావాలి మిరుదొడ్డి(దుబ్బాక): దుబ్బాక ఉపఎన్నికలో ఓటర్లు ఇచ్చే తీర్పుతో టీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం కావాలని మాజీ మంత్రి, ప్రముఖ హాస్య సినీనటుడు బాబూమోహన్ అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం విశ్వకర్మ కర్మ సంఘం సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు బాబూమోహన్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తలబిరుసుతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు. వజ్రాయుధం కంటే విలువైన ఓటును సందించి బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. బీజేపీకి జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ అవినీతి డబ్బులతో ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి పల్లి బాబూమోహన్ ఆరోపించారు. మండల కేంద్రమైన తొగుటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారికి టీఆర్ఎస్లో గౌరవంలేదన్నారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన రఘునందన్‌రావు లాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ది రఘునందన్‌రావును గెలిపించాలని ప్రజలను కోరారు. లక్ష ఓట్లు లక్ష్యంగా యువత కృషి చేయాలి తొగుట(దుబ్బాక): దుబ్బాక ఉప ఎన్నికలో యువత కీలకంగా వ్యవహరించాలని తొగుట ఇన్చార్జి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని కాన్గల్ గ్రామంలో టీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగం ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలిపేట సుజాతమ్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడుమెరుగు మహేష్, మండల అద్యక్షుడు అనిల్ కుమార్, సోషల్ మీడియా మండల కో–ఆర్డినేటర్ బండారు రమేష్ గౌడ్, నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, నరేష్, కుమార్, మహేష్, ఆబిద్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
విజేతల యాత్ర
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడమే ఒక విజయం. ‘విన్నర్స్ ట్రిప్’ టీమ్ సంతోషం చూస్తుంటే కచ్చితంగా గెలవాలనే తపనతోనే ఈ సినిమా తీశారనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే యూనిట్ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నమ్ముతున్నా’’ అని నటుడు బాబూమోహన్ అన్నారు. మహి, సోనా పాటిల్ జంటగా శ్రీను తెలుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విన్నర్స్ ట్రిప్’. శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్ఎస్సి క్రియేషన్స్ పతాకంపై సంపత్ శ్రీను, కె. లక్ష్మణరావు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బాబూమోహన్ విడుదల చేశారు. సంపత్ శ్రీను మాట్లాడుతూ– ‘‘మా సినిమా 30 రోజులు టాకీ, 10రోజులు పాటల చిత్రీకరణంతా గోవాలోనే పూర్తి చేశాం. ఎడిటర్ ఈశ్వర్ మా చిన్న సినిమాని పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లారు’’ అన్నారు. ‘‘ఒక ఎఫ్ఎమ్ రేడియో పోటీ విజేతలను ఒక ట్రిప్‌కి తీసుకెళ్లగా అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటి నుండి ఎంతమంది బయటపడ్డారు? అనేది చిత్రకథాంశం’’ అన్నారు తెలుగు శ్రీను. మహి, సోనా పాటిల్, ప్రసన్నకుమార్ మాట్లాడారు. -
మళ్లీ నీ నటనతో నవ్వించు: ఎమ్మెల్యే
సాక్షి, సంగారెడ్డి: అంధోల్ మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని అంధోల్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోకు ఆకర్షితులై టీఆర్ఎస్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించారన్నారు. గత పాలకుల పని తీరుకు విసిగిపోయిన ప్రజలు ఈసారి తమ ఓటు బలంతో అంధోల్‌ను అభివృద్ధి పరుచుకున్నారన్నారు. అంధోల్‌ను భ్రష్టు పట్టించిన మాజీ మంత్రి బాబుమోహన్‌కు టీఆర్ఎస్ నేతలపై మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ అని విమర్శించారు. అంధోల్ అభివృద్ధికి అడ్డుపడ్డ బాబుమోహన్, ఆర్థిక మంత్రి హరీష్ రావును విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇక సినిమాలో నవ్వించిన ఆయన మళ్లీ ఆ రంగంలో ఇన్నింగ్స్ మొదలు పెట్టమని, సేద తీరే సమయంలో ఆయన నటన చూసి నవ్వుకుంటామని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. -
భగవంతుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని క్షమించడు..
సాక్షి, సంగారెడ్డిః ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ధ్వజమెత్తారు. గురువారం జోగిపేటలో ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు తెలంగాణ చేస్తానంటూ కుటుంబ పాలనతో బంగారు కుటుంబం చేసుకున్నారంటూ’ ఎద్దేవా చేశారు. ఆనాడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తే, నేడు ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారన్నారు. కన్నతండ్రిలా వ్యవహరించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ పాలనకు అతి త్వరలో చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఆ భగవంతుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని క్షమించడని, అతి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాబుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహిళా మంత్రులు లేనందునే మహిళా గవర్నర్
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కే.మాధవి అన్నారు. జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో జరిగిన నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం.. రాష్ట్రంలో మహిళా మంత్రులకు అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించకపోవడంతో కేంద్రం ఒక మహిళను గవర్నర్‌గా నియమించిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని చూస్తేనే టీఆర్ఎస్ పార్టీలో గుబులు పుడుతుందన్నారు. రాష్ట్రంలో కమీషన్ల ప్రభుత్వం కొనసాగుతుందని, సచివాలయంలో కాలుపెట్టని తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. 33లక్షల బీజేపీ సభ్యత్వాలు పూర్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు 33 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు. మాజీ మంత్రి బాబూమోహాన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7500 సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.80 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, జనవరి 13వ తేది వరకు సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సమావేశంలో జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ ఇంచార్జి ఆర్.ప్రభాకర్‌గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి ప్రభాత్‌కుమార్, జిల్లా నాయకులు జగన్నాథం, ప్రేమ్‌సాగర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ఆర్.మాణయ్య,పట్టణ అధ్యక్షులు ఎర్రారం సతీష్ ముదిరాజ్, నాయకులు నవీన్, సాయి, హరీష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘హిందూధర్మానికి రక్షణగా ఉంటా’
సాక్షి, మల్యాల(చొప్పదండి): హిందూధర్మ పరిరక్షణే ధ్యేయమని, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని, ఒక్కసారి ఆశీర్వదించాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మల్యాల బ్లాక్ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తల డప్పుచప్పుళ్లు, యువకుల బైక్ ర్యాలీ మధ్య మాజీమంత్రి బాబుమోహన్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. హిందూ ధర్మరక్షణే తన ప్రథమ కర్తవ్యమని, ఎంపీగా గెలిపిస్తే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటానని సంజయ్ స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడబోనని, హిందువులను సంఘటితం చేసి తీరుతానని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను టీఆర్ఎస్ విడుదల చేస్తున్నట్లు గొప్పలకు పోతోందని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో పొత్తుపెట్టుకున్న కేసీఆర్ ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ రక్షణ కోసం అవసరమైతో సరిహద్దులో యుద్ధం చేసే సైనికులను తయారుచేస్తున్నానని అన్నారు. అన్ని కేంద్ర నిధులతోనే.. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదని సంజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1000 పింఛన్లో కేంద్రం వాటా రూ.800 ఉందని, ఉపాధి హామీ పథకం, హరితహారం, స్వచ్ఛభారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల కోసం రూ.1,500 కోట్లు విడుదల చేశారని అన్నారు. ఆకట్టుకున్న బాబుమోహన్ డైలాగ్స్.. బాబుమోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ను గెలిపించి, మోదీకి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో బింగి వేణు, కెల్లేటి రమేశ్, పాల్గొన్నారు. కేసు నమోదు బండి సంజయ్, బాబుమోహన్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. మల్యాలలో రోడ్‌షోకు సోమవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు అనుమతి తీసుకుని అదనంగా మూడు గంటలు ఎక్కువ సమయం ప్రచారం చేశారని, దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ పల్లె ప్రసాద్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిధులు కేంద్రానివి.. పేరు టీఆర్ఎస్ది కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన నిధులను రాష్ట్రానికి సంబంధించినవిగా చెప్పుకుంటూ.. సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కొడిమ్యాల, పూడూరులో సోమవారం రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణలో రెండులక్షల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లను మంజూరుచేస్తే కేసీఆర్ పేదలకు ఇళ్లను నిర్మించకుండా నిధులను పక్కదారిపట్టించారని ఆరోపించారు. కొడిమ్యాల, మల్యాల మండలాలకు కేంద్రంద్వారా మంజూరైన నిధుల వివరాలను చదివి వినిపించారు. ప్రముఖపుణ్యక్షేత్రమైన కొండగట్టు సమీపంలో జరిగిన బస్సుప్రమాదంలో 62 మంది హిందువులు చనిపోతే కనీసం పరామర్శించడానికి రాని కేసీఆర్, ఎన్నికలసమయంలో తానే అసలైన హిందువునని చెబుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాబుమోహన్ మాట్లాడుతూ తిమ్మినిబమ్మిని చేసేలా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే మాయలమరాఠి కేసీఆర్అని, ఎమ్మెల్సీఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ రానున్నాయని అన్నారు. పార్టీ మండలశాఖ అధ్యక్షుడు బూస గంగాధర్, నాయకులు రేకులపల్లి రవీందర్‌రెడ్డి, సామల లక్ష్మణ్, అక్కెపల్లి రవిందర్, మేర్గు కిషన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ సినిమా కాదు
‘‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ రాజకీయ సినిమా కాదు.. చక్కని కుటుంబ కథా చిత్రం. ‘రక్తకన్నీరు’ టైటిల్ బలంగా ఉన్నా సినిమా వినోదాత్మకంగా ఉంటుంది. అలా మా టైటిల్‌ని చూసి ఇది పొలిటికల్ సినిమా అనుకోవద్దు. చాలా గొప్ప కామెడీ ఉంటుంది’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. బాబూమోహన్, పోసాని, జీవా, అలీ, నవీనారెడ్డి ముఖ్య తారలుగా పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’. పి.రత్నాకర్, భీమనాదం భరత్, శ్రీధర్ చల్లా నిర్మించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. టైటిల్ ఏంటన్నది సినిమా పూర్తయ్యే వరకు నిర్మాతలకు కూడా తెలియదు. అలాంటిది ‘ఫలానా టైటిల్‌తో పోసాని ఓ సినిమా తీశారు, అది చంద్రబాబునాయుడుగారిని అన్‌పాపులర్ చేసేలా ఉంది’ అని ఎవరో ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అతను ఫిర్యాదులో పేర్కొన్న టైటిల్‌కి, మా టైటిల్‌కి చాలా తేడా ఉంది. ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అన్నది చాలా పాజిటివ్ టైటిల్. ఇందులో చంద్రబాబు గురించి బ్యాడ్‌గా ఉంటే ఏపీలో నన్ను కూడా బ్యాన్ చేయండి. ఆయన్ని విమర్శించడానికి నేను ఈ సినిమా చేయలేదు. ఇందులో ఆయన పేరు, గెటప్, ఆలోచనలు ఏవీ ఉండవు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, హరికృష్ణ, బాలకృష్ణగార్ల పాత్రలు కూడా ఉండవు. ‘మేనిఫెస్టో’ అంశాలపై మాత్రమే చర్చించాం. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన కథ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ప్రజాస్వామ్యం, ప్రజల క్షేమం గురించి తీశాం. కులం, డబ్బు, మందుని చూసి కాకుండా నిజాయతీగా సేవ చేసేవాడికి ఓటెయ్యండి అని చెబుతున్నాం. దీనికి, బాబుకి ఏంటి సంబంధం? అవినీతి, వెన్నుపోటు పొడిచినవాళ్లు భయపడాలి. కానీ, బాబు అలాంటివి చేయలేదు కదా? నిజాయతీపరుడు కదా? మరెందుకు ఉలిక్కిపడుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు చేసుకొని బతకడానికి. ఈ సినిమాకి, బాబుగారికి ఏ సంబంధం లేదు. ఇందులో 2రీళ్లు రాజకీయాలుంటే, మిగిలిన 12 రీళ్లు వినోదం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ప్రేమికుడి మోసం... ఇలాంటి అంశాలని చూపించాం. ఒకర్ని టార్గెట్ చేయడానికి ఈ సినిమా తీయలేదు. ఈ సినిమాకి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు పోసాని ఉజ్వల్ రాశాడు. వాడికిది తొలి సినిమా. ప్రస్తుతం హంగేరీలో ‘మీడియా సైన్స్’ అనే కోర్సు చేస్తున్నాడు. కొత్తగా ఉంటుంది, బాగుంటుంది సినిమా తీయమని చెప్పి ఈ కథ నా చేతిలో పెట్టాడు. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి? వాడి వయసు 20ప్లస్. కానీ, ఆలోచనల్లో నాకంటే పదేళ్లు ముందుంటాడు’’ అన్నారు. నటుడు, దర్శక–నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పోసాని నమ్మింది ధైర్యంగా, ముక్కుసూటిగా చెబుతాడు. ఆయన రచనా శైలికి సెల్యూట్. పాలించేవారెవరైనా ఆడిన మాట తప్పకూడదు. ప్రజల పట్ల పాలకులకు భయం, భక్తి ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకిచ్చిన మాట తప్పొద్దు. ఎవరో ఏదో ఫిర్యాదు చేశారని అమరావతికి రండి అంటూ చెప్పొద్దని నేను ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తున్నా. మేము ప్రజల పక్షం. మాకు సెన్సార్ బోర్డు ఉంది. ఏదైనా అభ్యంతరాలుంటే కట్స్ చెబుతారు. మమ్మల్ని అమరావతి పిలిచించి సంజాయిషీ అడగకండి’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన పోసాని అన్న ‘పోలీస్ బ్రదర్స్’ సినిమాతో రచయితగా మారారు. హరికృష్ణ, కృష్ణగార్లతో పాటు ఇండస్ట్రీలోని కమెడియన్లందర్నీ పెట్టి ‘శ్రావణమాసం’ సినిమా తీశారు. ఆ చిత్రం ఫ్లాప్ అయినా ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా లేదనకుండా ఆస్తులు అమ్మి మరీ చెల్లించిన గొప్ప మనసున్న వ్యక్తి’’ అన్నారు. బాబూమోహన్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. ఎందుకు? అని అందరూ అడుగుతుంటే, మంచి పాత్ర వస్తే చేస్తానని చెబుతున్నా. పోసాని మన సినిమా చేయాలనగానే మంచి పాత్ర దొరికిందనుకున్నా’’ అన్నారు. -
నేను నటించడం లేదని మావాళ్లే ప్రచారం చేశారు
సాక్షి, దుగ్గిరాల(గుంటూరు): బాబూ మోహన్ నటించడం లేదంటూ తోటి ఆర్టిస్టులే ప్రచారం చేశారని ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ వాపోయారు. మండలంలోని పెదపాలెం గ్రామంలో జరిగిన పండు గాడి ఫొటో స్టూడియో సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశాలు కోల్పోవలసి వచ్చింది. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతూ సినిమాల్లో నటించాలంటే క్యాబినెట్ అనుమతి పొందాల్సి ఉంది. దీనిని కొందరు అవకాశంగా తీసుకుని బాబూమోహన్ నటించడం లేదంటూ తోటి ఆర్టిస్టులే ప్రచారం చేశారు. దీనిలో ఆగ్రగణ్యుడు మా వాడు బ్రహ్మం. రాజకీయంగా ఓటమిపాలైన సమయంలో సరైన క్యారెక్టర్లు రాలేదు. రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న నేను డబ్బుల కోసం దిగజారుతున్నారని ప్రజలు భావిస్తారని సందేహం కలిగింది. టెర్రర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన నాకు జేబులు కొట్టే ఎమ్మెల్యే, జేబులో కత్తెర పెట్టుకుని తిరిగే ఎమ్మెల్యే క్యారెక్టర్లలో నటించే అవకాశం కల్పించడంతో తిరస్కరించాను. దీంతో కొంతకాలం నటనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో బిచ్చగాళ్లా... మజాకా అనే సినిమాలో సుమన్‌తో కలిసి యాచకుల సంఘం నాయకుడి పాత్రలో నటించాను. చాల కాలం తరువాత మళ్లీ వినోద్‌కుమార్‌ను కలవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం నాలుగయిదు సినిమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
టీడీపీ అంటే గౌరవం ఉండేది కానీ..
సంగారెడ్డి: టీడీపీ అంటే తనకు గౌరవం ఉండేది..కానీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం తనకు నచ్చలేదని ఆంథోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్ తెలిపారు. సంగారెడ్డిలో బాబూమోహన్‌కు ఓయూ జేఏసీ విద్యార్థులు మద్ధతు పలికారు. ఎన్నికల్లో బాబు మోహన్ తరపున ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బాబూ మోహన్ విలేకరులతో మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గానికి రూ.50 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. కొడుకు, కూతురు కోసం సింగూర్‌ని కేసీఆర్ ఖాళీ చేశారని ఆరోపించారు. క్రాంతి కిరణ్ అనే దళారికి టికెట్ ఇచ్చి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పుట్టి అక్కడే చదివి అక్కడే ఉండే వ్యక్తి ఆంథోల్‌లో లోకల్ ఎలా అవుతారని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌ని తిట్టరాని తిట్లు తిట్టిన వారికి మంత్రి పదవులిచ్చారని, మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారు...మరి నేనేం అపరాధం చేశారని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. -
‘కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు’
రేగోడ్ (మెదక్): టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజ లు అసంతృప్తితో ఉన్నారని అందోల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబూ మోహన్ అన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ముందస్తు ఎన్నికలతో అభివృద్ధి రెండేళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. టీఆర్ఎస్పై ప్రజలు ఆవేశంగా ఉన్నారని, తగిన శాస్తి జరగడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు నలభై సీట్లు కూడా వచ్చేలా లేవని, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. -
బీజేపీ అధికారంలోకి వస్తే రూ.5 లక్షల బీమా
సాక్షి, జోగిపేట(అందోల్): రాష్ట్రంలో అందరికి రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయనీయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికి బీమా పథకాన్ని అమలు పరుస్తామని మాజీ మంత్రి అందోలు బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ అన్నారు. మంగళవారం జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే కల్యాణలక్ష్మి పథకం ద్వారా చెల్లించే రూ.100.116 లక్షల రూపాయలతో పాటు మంగళ సూత్రానికి తులం బంగారం అందజేస్తామన్నారు. డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివే విద్యార్థినులకు 50శాతం రాయితీపై స్కూటీలు, 7–10 తరగతులు చదివే విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అనంతరావు కులకర్ణి, జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇంచార్జి ఆర్.ప్రభాకర్‌గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రేమ్‌సాగర్, నియోజకవర్గ ఇంచార్జి ప్రభాత్‌కుమార్ నాయకులు వినయ్‌కుమార్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
కుటుంబ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలి
సాక్షి, అల్లాదుర్గం(మెదక్): కేసీఆర్ కుటుంబ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలని అందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ అన్నారు. సోమవారం అల్లాదుర్గం పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వం ఉందన్నారు. తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమా అని ఆయన ప్రశ్నించారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం టీఆర్ఎస్ పార్టీ నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకూ బీజేపీ బలపడుతోందన్నారు. ప్రధానమంత్రి మోది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని బాబూమోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రభాకర్‌గౌడ్, అనంతరావుకులకర్ణి, రాములు, శామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆయన వెంట జనాలే లేరు. అల్లాదుర్గం మండలానికి చెందిన కార్యకర్తలు ఒకరిద్దరే ఆయన వెంట ఉండటం విశేషం. నియోజకవర్గం నుంచి బాబూమోహన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న జనాలు 20 మంది లోపే ఉన్నారు. -
కేసీఆర్‌పై విరుచుకుపడ్డ బాబుమోహన్
సాక్షి, అందోల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగని తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబుమోహన్ విమర్శించారు. బుధవారం జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబుమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దళితుల్ని అవమానపరుస్తున్నారని, దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్‌ను దళిత వ్యతిరేకిగా అభివర్ణించారు. బీజేపీకి దళితున్ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్టపతిగా అవకాశం కల్పించిన ఘనత ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అన్నారు. మంచి మహా మహా రాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని పేర్కొన్నారు. బీజేపీ జెండా అందోల్ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మందుకు డబ్బుకు బీజేపీ దూరంగా ఉంటుందని తెలిపారు. -
‘ప్రశ్నించినందుకే టికెట్ ఇవ్వలేదు’
పుల్కల్(అందోల్): దళితులను అవమానిస్తూ దొరల పాలన సాగిస్తున్నా కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తాజా, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ తెలిపారు. సింగూర్ నీటిని కొడుకు, బిడ్డ కోసం తరలించి ఈ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రమైన పుల్కల్లో పార్టీ ఎన్నికల కార్యాలయంతో పాటు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితున్ని సీఎం చేస్తానని ఆయనే సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పనిచేసిన తనకు కాకుండా తెలంగాణ వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చి అగౌరవ పరిచినట్లు ఆరోపించారు. తెలంగాణ భవన్‌పై రాళ్ల దాడి చేసిన క్రాంతికి టీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం క్రాంతి బ్లాక్‌మేయిల్ చేసి టిక్కేట్ సంపాదించాడని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని చిత్రపూరి కాలనీలో క్రాంతికి ఇంటి స్థలం ఎలా వచ్చింది..? తాను అలా కాకుండా ప్రజలకు మెలు చేయాలనే ఉద్ధేశంతో పనిచేస్తే ఇలా అవమానిస్తారా..? అంటూ ప్రశ్నించారు.. తెలంగాణలో 105 మందికి టికెట్లు ఖారారు చేస్తే అందులో ఇద్దరికి ఇవ్వాలేదని అందులో వారు ఎస్సీలే కావడం గమనార్హం అన్నారు. పార్టీకోసం పని చేసిన వారిని కాదని పదువులకోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి టికెట్ ఇవ్వకుండా సీనియర్లను అవమానిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిచేందుకే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు అనంతరావు కులకర్ణి, వెంకట్‌నర్సింహ్మరెడ్డి, రాజు, ప్రబాకర్‌గౌడ్, శ్యాంగౌడ్, ప్రభా‹స్, రూప్, దేవి, తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి, కొడుకులు ఇద్దరూ నరుకుడే: బాబుమోహన్
సాక్షి, సంగారెడ్డి : కేటీఆర్‌ను అర్జెంట్‌గా ముఖ్యమంత్రిని చెద్దామను కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారని బీజేపీ నేత బాబుమోహన్ ఆరోపించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సమరభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ మోహన్ మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిందని చాలా ఆనంద పడ్డాను. తెలంగాణ ప్రజలకు విలువ, గౌరవం వచ్చిందనుకున్నాను. కేసీఆర్ పాలన అహో.. ఓహో అనుకున్నా కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ నరుకుడే. నీళ్లు ఇవ్వకుముందే ఓట్లు అడుగుతున్నారు. వద్దంటే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు. దళితున్ని సీఎం చేస్తానని మోసగించారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? బీజేపీ దళితులను గౌరవించే పార్టీ కాబట్టే బీజేపీలో చేరాను. దళితులను రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ. మోదీ ఒక్క పైసా అప్పు తేలేదు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు అప్పులయ్యాయి. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పొద్దున లేస్తే మంత్రి హరీశ్ ఇంటి గేట్ దగ్గరే ఉంటారు. ఇటువంటి వ్యక్తిని గెలిపించ వద్దు.’’ అని అన్నారు. ముందస్తుకు ఎందుకు వెళ్లారు : సదానంద గౌడ జమిలి ఎన్నికలకు కాకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని కేంద్ర మంత్రి సదానండ గౌడ డిమాండ్ చేశారు. బీజేపీ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం కేసీఆర్‌యేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం లోకి వస్తే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే కేవలం ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. రెండు రాష్ట్రాలకు ఎంతో సహకరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీలో చేరిన బాబూమోహన్
సాక్షి, న్యూఢిల్లీ: ‘నాలుగేళ్లపాటు అలుపెరగకుండా ప్రజాసేవ చేశా. ఎన్నడూ అబద్ధం ఆడలేదు. లంచాలు తీసుకోలేదు. అక్రమాలు చేయలేదు. అలాంటిది నాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించి ఒక చేతకానివాడిగా చిత్రీకరించింది. అది నన్ను తీవ్రంగా బాధించింది. కనీసం టికెట్ ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పలేదు. అయితే బీజేపీలో పనికొస్తానని అమిత్‌షా స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక నుంచి నేనేంటో చూపిస్తా’అని అందోల్ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో తన కుమారుడు ఉదయ్ భాస్కర్‌తో కలసి వచ్చి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. అనంతరం బాబుమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు ప్రకటించకపోగా తనను చేతకానివాడిగా చిత్రీకరించి పక్కన పెట్టడం తీవ్రంగా బాధించిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్‌రావు పిలిస్తేనే టీఆర్ఎస్ పార్టీలో చేరానని, అలాంటిది ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంపై కనీసం సమాధానం కూడా చెప్పలేదన్నారు. మొదట కేటీఆర్‌ను సంప్రదిస్తే కేసీఆర్ నేరుగా మాట్లాడతారని చెప్పారన్నారు. అయితే గత 25 రోజులుగా ఎదురుచూసినా కేసీఆర్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ తనను పనికిరానివాడిగా చిత్రీకరించి పక్కనపెట్టినా.. బీజేపీలో పనికొస్తానని అమిత్‌షా గుర్తించి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో నరేంద్ర మోదీ, అమిత్‌షా నాయకత్వంలో పనిచేయాలన్న కోరిక ఉండేదని, అందుకే బీజేపీలో చేరానని చెప్పారు. ఇక నుంచి తానేంటో చూపిస్తానని, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, ఏం చెప్పాలో అక్కడే చెప్తానని అన్నారు. కాగా, బాబుమోహన్ సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్–టీడీపీలది మహాకూటమి కాదని, అదో విషకూటమి అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్టే అని అన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని పేర్కొన్నారు. అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా బాబూమోహన్ అందోలు నుంచి పోటీ చేస్తారని స్థానిక బీజేపీ నాయకులు అంటున్నారు. కాగా, అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని ఢిల్లీలో బాబూమోహన్ ప్రకటించడంతో ఆయన ఎక్కడ పోటీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
ఇరవై ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నా..
-
అన్నీ బయటపెడతా: బాబుమోహన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇరవై ఐదు రోజులుగా ఎదురుచూస్తున్నా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ రాకపోవడంతోనే తాను బీజేపీలో చేరినట్లు ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. శనివారం పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినందు వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని బాబుమోహన్ వ్యాఖ్యానించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో హరీశ్‌రావు ఫోన్ చేసి తనను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారన్నారు. వారు చెప్పినట్లుగానే ఆందోల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. కానీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆ 105 మందిలో తానొక్కడినే పనికి రాని వాడిని అయ్యానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు తాను ఎందుకు పనికిరాలేదో, టికెట్ ఎందుకు ఇవ్వలేదోనన్న విషయాలన్నీ సమయం వచ్చినపుడు బయటపెడతానని వ్యాఖ్యానించారు. పదవుల కోసం కాదు.. టికెట్ విషయమై కేటీఆర్‌ను అడిగితే కేసీఆర్ ఫోన్ చేస్తారని చెప్పారని, కానీ ఇంతవరకు ఆయన నుంచి ఫోన్ రాలేదని బాబుమోహన్ అన్నారు. అదే సమయంలో అమిత్ షా పిలిచి తనకు అవకాశం ఇచ్చారని బాబుమోహన్ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనతో పాటు, తన కుమారుడు ఉదయ్ కూడా బీజేపీలో చేరారని బాబుమోహన్ తెలిపారు. పదవుల కోసం కాకుండా కేవలం పనిచేయడం కోసమే పార్టీలో చేరామని స్పష్టం చేశారు. (చదవండి: టీఆర్ఎస్కు మరో షాక్) స్వార్థ రాజకీయాలు చూడలేకే : లక్ష్మణ్ మూడు పర్యాయాలు ఆందోల్ ఎమ్మెల్యే గా గెలుపొందిన బాబుమోహన్... నటుడిగా కూడా ప్రజల గుండెల్లో నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి కూటమిగా పోటీ చేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. ఇలాంటివి చూడలేకే బాబుమోహన్ బీజేపీలో చేరారని వ్యాఖ్యానించారు. మరోవైపు మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది మహాకూటమి కాదు విషకూటమి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటు వేస్తే మూసీనదిలో వేసినట్లేనని విమర్శలు గుప్పించారు. కాగా అక్టోబర్‌లో అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తారని లక్ష్మణ్ తెలిపారు. -
వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధం : దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో భావ సారూప్య శక్తులు, గ్రూపులతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఉత్సుకతో ఉన్నారని.. పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఓవైపు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంటే.. మరోవైపు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మాత్రం పగటి కలలు కంటున్నారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. కాగా ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆర్ఎస్ను వీడి శనివారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. (చదవండి : టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలో చేరిన బాబుమోహన్!) రావణ కాష్టంగా ఉంచాలనుకుంటున్నారా? అయోధ్య అంశాన్ని రావణ కాష్టంలా ఉంచాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ విరుద్దమని ఒవైసీ చెప్పడం సరికాదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన ఇలా మాట్లాడుతున్నారని దత్తాత్రేయ విమర్శంచారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం కోసం ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని దత్తాత్రేయ ఆరోపించారు. చంద్రబాబు అవినీతి శక్తులతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్కు మరో షాక్!
-
టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలో చేరిన బాబుమోహన్!
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన.. శనివారం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బాబుమోహన్‌కు కమలం కండువా కప్పి..పార్టీలోకి ఆహ్వానించారు. అందోల్ నియోజకవర్గం టికెట్‌ను బాబుమోహన్‌కు బీజేపీ కేటాయించినట్టు తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్ నుంచి గెలుపొందిన బాబుమోహన్‌కు తాజా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. బాబుమోహన్‌ను కాదని అందోల్ టికెట్‌ను జర్నలిస్టు క్రాంతి కుమార్‌కు ఇచ్చారు. (బాబుమోహన్‌కు దక్కని అసెంబ్లీ టికెట్) ఈ క్రమంలో కష్టపడి పనిచేసినా టీఆర్ఎస్ పెద్దలు తనపై వివక్ష చూపుతున్నారని బాబుమోహన్ తన సన్నిహితుల వద్ద విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ టికెట్ నిరాకరిచండంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనను బీజేపీ నేతలు బుజ్జగించి తమవైపునకు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. అందోల్ టికెట్ ఇస్తామని తనకు హామీ లభించడంతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం అందోల్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో బాబుమోహన్ చేరిక తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. (చదవండి : ఇద్దరికే సారీ!) -
ఇద్దరికే సారీ!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు తాజా మాజీలకు మాత్రమే టికెట్లను నిరాకరించారు. చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్థానంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్ కేటాయించారు. ఆందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినీనటుడు బాబూమోహన్‌కు టికెట్ ఇవ్వకుండా, అక్కడ జర్నలిస్టు సీహెచ్ క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలను వెల్లడించలేదు. 2009 నుంచి ఇప్పటిదాకా రెండుసార్లు సాధారణ ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికలోనూ ఆయన గెలిచారు. అయితే స్థానికంగా ఉన్న వ్యతిరేకత వల్లనే టికెట్ నిరాకరించినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
బాబుమోహన్‌కు దక్కని అసెంబ్లీ టికెట్
సాక్షి, హైదారాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రముఖ హాస్యనటుడు, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు చేదు అనుభవం మిగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాబుమోహన్‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ప్రముఖ జర్నలిస్టు నాయకుడు చంటి క్రాంతికిరణ్‌కు అవకాశం కల్పించారు. దీంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు నాయకుడికి అవకాశం దక్కినట్టు అయింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్న క్రాంతికుమార్ పలు టీవీ చానెళ్లలో పని చేశారు. ఇక, మరో విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి మరోసారి అవకాశం ఇచ్చారు. మంత్రులుగా ఉన్న వారందరికి వారి సొంత నియోజకవర్గాల్లో సీట్లు ప్రకటించారు. ప్రముఖుల అసెంబ్లీ స్థానాలు గజ్వేల్ - కేసీఆర్ సిరిసిల్ల-కేటీఆర్ సిద్దిపేట- హరీశ్‌రావు సూర్యాపేట - జి. జగదీశ్ రెడ్డి భూపాలపల్లి- మధుసుదనాచారి బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి -
లక్షల్లో పేరుకు పోయిన ఎమ్మెల్యే ఇంటి నల్లా బిల్లు!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిల వసూలుకు అధికారులు నడుం బిగించారు. బకాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని తెగేసి చెప్తున్నారు. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఇంటి నల్లా కనెక్షన్‌ను వాటర్‌బోర్డు అధికారులు తొలగించారు. బాబుమోహన్ ఇంటిపై 4 లక్షల రూపాయల నల్లా బిల్లులు బకాయి ఉందని తెలిపారు. సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్ కూడా కట్ చేశారు. రవి ఇంటిపై రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని వెల్లడించారు. -
అధికార పార్టీలో పోటాపోటీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందోలు టీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2014 సా«ధారణ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన బాబూమోహన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వైఖరితో పార్టీ నియోజకవర్గ నేతలు కొందరు దూరంగా ఉంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తామంటూ ఇద్దరు నేతలు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అందోలు అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 సాధారణ ఎన్నికల వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ వరుస విజయాలు నమోదు చేసిన ఈ నియోజకవర్గంలో 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 1998 ఉప ఎన్నికతో పాటు 1999 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ సాధించిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరుస ఓటమి చవిచూసిన ఆయన 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా నాలుగేళ్లకు పైగా పదవీ కాలం పూర్తి చేసిన బాబూమోహన్ వైఖరితో కొందరు టీఆర్ఎస్ నేతలు విభేదిస్తున్నారు. జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి.నాగభూషణం, సాయికుమార్ వంటి ఒకరిద్దరు నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరికి మరికొందరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, కొందరు నేతలు కూడా తోడైనట్లు సమాచారం. అసంతృప్త నేతల్లో కొందరు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో సత్సబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ బీబీ పాటిల్ చాలా కాలంగా అందోలు నియోజకవర్గంలో పర్యటించకపోవడం ఎమ్మెల్యే, ఎంపీ నడుమ నెలకొన్న విభేదాలకు తార్కాణంగా చెబుతున్నారు. బరిలోకి కొత్త ముఖాలు అందోలు నియోజకవర్గం టీఆర్ఎస్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య తాజాగా తెరమీదకు వస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలపై తమదైన పట్టుకలిగిన మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి వర్గం బక్కి వెంకటయ్యకు మద్దతు పలుకుతున్నట్లు తెలి సింది. మాణిక్ రెడ్డి సోదరుడు జైపాల్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నట్లు సమాచారం. గతంలో దుబ్బాక జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బక్కి వెంకటయ్యకు సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యం కూడా ఉంది. జోగిపేటలో సుమారు రెండు దశాబ్దాలుగా వ్యాపార సంబంధాలు కలిగి ఉండడంతో స్థానికులతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న బక్కి వెంకటయ్య ఇప్పటికే అంతర్గతంగా స్థానిక నేతలను కలుస్తూ, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాబూమోహన్ ఉండడంతో ఎన్నికల నాటికి బలంగా తెరమీదకు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఆర్సీపురం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన జర్నలిస్టు సంఘం నేత సీహెచ్ క్రాంతికిరణ్ కూడా టీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అందోలు టికెట్ స్థానికులకే అనే నినాదాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఆయన మద్దతుదారులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ క్రాంతికిరణ్ టికెట్ ఆశించినా దక్కక పోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చే శారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇటీవల కొందరు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సమావేశమైనట్లు సమాచారం. బాబూమోహన్ వర్గీయులు మాత్రం ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలు అందోలు నియోజకవర్గంలో పకడ్బంధీగా అమలవుతుండటాన్ని ప్రస్తావిస్తున్నారు. -
సామాన్యుల పరిస్థితి ఏంటి?
‘‘నాకు ఇష్టమైన దర్శకుడు భరత్. తను గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తాడు. కానీ, టైమ్ బాగా లేకనో, మరేంటో కానీ.. కొన్ని మిస్‌ఫైర్ అవుతున్నాయి. ‘మేరా భారత్ మహాన్’ పాటలు, ట్రైలర్స్ చూశాక సూపర్ హిట్ సాధించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేశా. నిర్మాతలు ఎంతో అభిరుచితో ఈ సినిమా నిర్మించారు’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా భారత్ మహాన్’. వరంగల్‌కు చెందిన వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. లలిత్ సురేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బాబూమో హన్ విడుదల చేసి, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందించారు. ‘‘విద్య, వైద్యం సామాన్యులకు అందడం లేదు. డబ్బున్న వాళ్లకే దక్కుతున్నాయి. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే వ్యవస్థలోని కొన్ని సమస్యలు. వాటిని సవరించమని చెప్పే ప్రయత్నమే తప్ప, ఎవరికీ వ్యతిరేకంగా ఉండదు’’ అన్నారు భరత్. శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్, అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, పాటల రచయిత పెద్దాడమూర్తి, మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి, కథా రచయిత,నటుడు డా. శ్రీధర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బిచ్చగాళ్లు లేని సమాజం కోసం...
‘‘నిర్మాత చంద్రశేఖర్ అన్నీ తానే అయి కె.ఎస్.నాగేశ్వర రావు నుంచి చాలా మంచి ఔట్పుట్ తీసుకున్నారు. భవిష్యత్‌లో తను చాలా పెద్ద నిర్మాత అవుతాడు. శ్రీ వెంకట్ మ్యూజిక్ చాలా బాగుంది. వినూత్నమైన కథాంశంతో రూపొందిన ‘బిచ్చగాడా మజాకా’ సినిమా మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే జంటగా కె.ఎస్.నాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఎ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడంతోపాటు, టైటిల్ సాంగ్ ఆలపించిన బాబూమోహన్ విడుదల చేశారు. కె.ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా రిలీజ్ అవుతోన్న మా ‘బిచ్చగాడా మజాకా’ విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది. బాబూమోహన్గారి సహాయ సహకారాలు మరువలేనివి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అన్నారు. ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఒక యువకుడు చేసిన పోరాటం ఎటువంటి మలుపులు తిరిగింది? అది అతని ప్రేమకథను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు బి.చంద్రశేఖర్. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే, శ్రీ వెంకట్, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.ఎం.బాషా, లైన్ ప్రొడ్యూసర్ తేజా రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఏ.రెహమాన్. -
డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తా : బాబూ మోహన్
రేగోడ్(మెదక్): రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా శాసనసభ ఎన్నికలు రావొచ్చని మాజీ మంత్రి, అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని గజ్వాడ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుంచి సీనీయర్ నాయకుడు కిషన్‌రెడ్డితో పాటు సుమారు 110 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరినట్లు టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలకు టీఆర్ఎస్ కండువా వేసి బాబూమోహన్ పార్టీలోకి ఆహ్వానించారు. సీనీయర్ నాయకుడు కిషన్‌రెడ్డి, వట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ పట్లోళ్ల భూంరెడ్డితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే బాబూమోహన్‌ను ఘనంగా సన్మానించారు. బాబూమోహన్ మాట్లాడుతూ ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావొచ్చని అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ కేడర్‌కు సూచించారు. గజ్వాడ గ్రామానికి గతంలో నేను చేసిన అభివృద్ధే ఉందని, ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించుకుందామని తెలిపారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను తప్పకుండా మంజూరు చేస్తానని బాబూమోహన్ హామీ ఇచ్చారు. నాలుగైదు రోజుల్లో కలెక్టర్‌తో మాట్లాడి ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో ఒకే స్థలంలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా స్థలం పరిశీలించాలని సూచించారు. ఎక్కడ మనస్పర్థలు రాకుండా పని చేయాలని కోరారు. బోరంచ మడుగు నుంచి సాగుకు నీళ్లు బోరంచ మడుగు నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు సాగుకు, తాగుకు నీళ్లిస్తానని బాబూ మోహన్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. తా టిపల్లి గట్టుపైన లిప్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, ముం దుకు వస్తే వెయ్యి ఇళ్లు ఇవ్వడానికైనా సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మమత, కో అప్షన్ సభ్యుడు మొహీజొద్దీన్, వట్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, డైరెక్టర్లు పట్లోళ్ల భూంరెడ్డి, సుంకె రమేశ్, పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సీహెచ్.లక్ష్మన్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాములు, కొత్వాన్‌పల్లి సర్పంచ్ రవీందర్, గొర్రెల కాపరుల సంఘం మండల అధ్యక్షుడు రాజుయాదవ్, నాయకులు బాబా, సుభాశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘నేరేళ్ల’ కుటుంబానికి బాబూమోహన్ పరామర్శ
వరంగల్: విఖ్యాత మిమిక్రీ కళాకారుడు దివంత నేరేళ్ల వేణుమాధవ్ కుటుంబ సభ్యులను సినీ నటుడు, అంథోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన మిమిక్రీ ప్రదర్శనలతో ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చిన మహావ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం మిమిక్రీ ప్రపంచానికి తీరని లోటు అన్నారు.ఆయన వెంట వరంగల్‌కు చెందిన సినీ నటుడు శ్యామల గణేష్, గుళ్లపెల్లి శ్రీనివాస్, బొమ్మల అంబేడ్కర్, డీడీ, ఏఐఆర్ ప్రొగ్రాం హెడ్ ఎంవీ.వాసుప్రసాద్‌లు పాల్గొన్నారు. -
ష్.. సైలెన్స్
కిషన్, డానియల్ హీరోలుగా, సుమ హీరోయిన్గా రంజిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ష్.. సైలెన్స్’. నాగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్‌పై వి. రమణబాబు, డానియల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ క్లాప్ ఇచ్చారు. వి.రమణబాబు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ నచ్చడంతో సినిమా నిర్మాణం ప్రారంభించాం. ఈ నెల ద్వితీయార్ధంలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నా. ఈ చిత్రం నాకు మంచి పేరు, గుర్తింపు ఇస్తుంది’’ అన్నారు కిషన్. ‘‘చక్కటి కథతో రూపొందుతోన్న చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాను. ఈ చిత్రబృందానికి మంచి పేరు తెస్తుంది’’ అన్నారు డానియల్. విక్కీ, బుల్లెట్ సుధాకర్, బళ్లారి బాబు తదితరులు నటి స్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవేందర్, కెమెరా: ఏ. విజయ్ కుమార్. -
ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్ : నువ్వెంత అంటే నువ్వెంత
సాక్షి, వట్పల్లి(అందోల్): మండలంలోని ఖాది రాబాద్ గ్రామంలో ఎమ్మెల్యే బాబూమోహన్ పర్యటన ఉద్రిక్తతకు దారిసింది. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే బాబూమోహన్‌కు స్థానిక సర్పంచ్ రమేశ్జోషి మధ్య విద్యుత్ ఉపకేంద్రం వివాదం చెలరేగింది. గ్రామంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇంత వరకు వినియోగంలోకి రాలేదని, అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మూడేళ్లుగా ఇవే మాటలు చెబుతూ గ్రామస్తులను మోసం చేస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని సర్పంచ్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం నువ్వేంత అంటే నువ్వెంత అని, చూసుకుందామంటే చూసుకుందామనే స్థాయికి వెళ్లింది. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికులు భయాందోళలకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే కలుగజేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బంగారు తెలంగాణ
బిపిన్, రమ్య, ఏవి స్వామి, బాబుమోహన్, సాయి త్రిశాంక్ ముఖ్య తారలుగా కూర అంజిరెడ్డి సమర్పణలో షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బంగారు తెలంగాణ’. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేశారు. దర్శకుడు– నటుడు– నిర్మాత బిపిన్ మాట్లాడుతూ–‘‘తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. సీయం కేసీఆర్ కృషి వల్లే బంగారు తెలంగాణ సాధ్యం అయింది. అసలు... తెలంగాణ ఎలా వచ్చింది? అనే కాన్సెప్ట్‌పై సినిమాను తెరకెక్కించాం. సినిమాకు సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు మా సినిమా రిలీజ్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మందల విజయభాస్కర్ రెడ్డి. -
ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్!
పీఆర్ ఏఈపై ఎమ్మెల్యే బాబూమోహన్ ఆగ్రహం రేగోడ్ (మెదక్): ‘‘అంతా నీ ఇష్టారాజ్య మా? ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్.. అభి వృద్ధి కోసం నిధులు మం జూరు చేస్తే నీ ఇష్టమొచ్చిన చోట పనులు చేయిస్తావా.. ఉద్యోగం ఊడదీస్తా’’అంటూ మెదక్ జిల్లా అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగోడ్ మండలం జగిర్యాల, కొండాపురం, రేగోడ్ల్లో శుక్రవారం నిర్వహించిన హరిత హారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడానికి వచ్చిన బాబూమోహన్‌కు, అం తకు ముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు కనిపించలేదు. సీసీ రోడ్డు నిర్మించలేదా? ఎందుకంటూ పలువురిని ఆరా తీశారు. దానిని మరోచోట నిర్మించారని తెలిసింది. తాను ఇక్కడి సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తే మరోచోట వేయడం ఏమిటని ఏఈపై మండిపడ్డారు. -
సోనియా వల్లే కాలేదు.. రాహుల్ ఎంత?
అందోలు : అందోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ పెడితే కనీసం అందోలు సీటును కూడా గెలవలేకపోయారు.. ఇక రాహుల్ ఎంత? అంటూ అందోలు ఎమ్మెల్యే పి. బాబూమోహన్ ఎద్దేవా చేశారు. అందోలు ఐబీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పగటి వేషగాళ్లంతా గురువారం సంగారెడ్డి వచ్చి ప్రగల్భాలు పలికారన్నారు. ఒక్కసారి అధికారం ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం సిగ్గుచేటని, పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు.. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫొటోల్లోని నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా గాంధీలు ఒక్క కుటుంబం కాదా అంటూ కేటీఆర్, కవితలకు ఉన్న పరిజ్ఞానం రాహుల్ గాంధీకి ఉన్నదా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఆవేశంతో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమని బాబుమోహన్ అన్నారు. స్టెప్పులేసిన బాబుమోహన్ రాష్ర్ట ఆవిర్బావ దినోత్సవ సంబరాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి తిరిగి వెళుతుండగా ఆసుపత్రి సిబ్బంది డీజే సౌండ్ పాటలు పెట్టి బతుకమ్మ ఆట ఆడుతుండగా ఎమ్మెల్యేను ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సంగారెడ్డి ఆహ్వానించారు. ఏఎన్ఎంలు, సిబ్బంది, నగర పంచాయతీ చైర్పర్సన్ కవిత సురేందర్ గౌడ్, ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాబూమోహన్ కొద్దిసేపు బతుకమ్మ ఆడారు. డీజే సౌండ్‌లో తెలంగాణ పాట వస్తుండడంతో మార్కెట్ చైర్మన్ నాగభూషణం వారి మద్యలోకి వచ్చి స్టెప్పులు వేశారు. ఎమ్మెల్యే చేతులు పట్టుకుని లాగడంతో ఆయన కూడా పాటకనుగుణంగా స్టెప్పులు వేశారు. దీంతో కార్యకర్తలు ఈలలు కొడుతూ ఉత్సాహపరిచారు. -
హరితహారంలో పాల్గొన్న బాబు మోహన్
మెదక్ : మెదక్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో బుధవారం చేపట్టిన హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాబూమోహన్ అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజే ఏడువేల మొక్కలను గ్రామంలో నాటారు. ఆయనతోపాటు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, రాష్ట్ర హరితహారం ఇంచార్జి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం నుంచి చౌదరి చెరువు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడుగునా జనంతో రహదారి నిండిపోయింది. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు, పాటలతో ప్రముఖులకు స్వాగతం పలికారు. -
మేడారంలో పోలీసులపై బాబుమోహన్ ఫైర్
వరంగల్: మేడారంలో ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ పోలీసులపై మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో మేడారం జాతర సందర్భంగా శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి బాబుమోహన్ వచ్చారు. ఈ సమయంలో మేడారం వద్ద గేట్లకు తాళం వేసి ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బాబుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులే దగ్గర ఉండి బాబుమోహన్‌తో సమ్మక్క-సారలమ్మ దర్శనం చేయించినట్టు సమాచారం. కాగా, ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరగనున్న సంగతి తెలిసిందే. -
బాబుమోహన్‌కు ‘గ్రేటర్’ బాధ్యతలు
జోగిపేట: త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందోలు ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌కు ప్రచార బాధ్యతలను పార్టీ అధిష్టానవర్గం అప్పగించింది. ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీ డివిజన్లవారీగా అభ్యర్థి తరపున ప్రచారం చేసి గెలిపించే బాధ్యతలను అప్పగిస్తున్న విషయం తెలిసిందే. తనకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందానగర్ డివిజన్ ప్రచార బాధ్యతలను అప్పగించినట్లు బాబూమోహన్ తెలియజేశారు. చందానగర్‌తో పాటు పక్కనే ఉన్న శేరిలింగం పల్లి డివిజన్‌లోనూ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈ రెండు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శాయశక్తులా కషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులు సైతం తనవెంట ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌లు తనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
'మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
అల్లాదుర్గం (మెదక్ జిల్లా) : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన అల్లాదుర్గం పట్టణంలో దీపం పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు గ్యాస్ సిలండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కట్టెల పోయ్యిలతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే గ్యాస్ కనేక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ్గానికి 5 వేల కనేక్షన్లు మంజూరయినట్లు తెలిపారు. విడతల వారిగా అర్హూలైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మంజూరు చేసినట్లు ఆయన ఆరోపించారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ, వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ రాంగారి ఇందిర, జెడ్పీటీసీ కంచరి మమత, వైస్ ఎంపీపీ బిక్షపతి, ఎంపీడీఓ కరుణశీల, తహశీల్దార్ చంద్రకళ, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు సుభాశ్‌రావ్, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్‌లింగాగౌడ్, ఎంపీటీసీలు అనూరాధ, శివాజీరావ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులకు బాబుమోహన్ కౌన్సలింగ్
-
'మందు తాగి బండి నడుపొద్దు'
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారికి గోషామహల్ స్టేడియంలో ప్రముఖ హాస్య నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నష్టాలపై వారికి వివరించారు. కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట చనిపోయిన తన పెద్ద కొడుకు పవన్ కుమార్‌ను గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తాగడం తప్పు కాదని, తాగి డ్రైవింగ్ చేయడం తప్పని చెప్పారు. -
‘మిషన్ కాకతీయ’ అవినీతి నిరూపిస్తే రాజీనామా: బాబూ మోహన్
మెదక్(పుల్కల్): మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ తెలిపారు. ఆయన పుల్కల్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ పనులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో కమీషన్లు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆరోపణలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన మహా యజ్ఙంలో విపక్షాలు పాలుపంచుకోవాలని కోరారు. -
ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాబుమోహన్
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం అసెంబ్లీ కొత్త కమిటీల చైర్మన్ల పేర్లు గురువారం ఖరారు చేసింది. మహిళ శిశు సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రేఖా నాయక్, ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా బాబు మోహన్, బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గంగాధర్‌గౌడ్, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రెడ్యా నాయక్, మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా షకీల్ అహ్మద్‌గా నియమితులయ్యారు. -
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
-
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మంచితనం మూర్తీభవించిన కుర్రాడని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరామ్ కు ఆయన ఆదివారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జానకిరామ్ ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నాడని గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ తెలియనీయలేదని చెప్పారు. జానకిరామ్ మరణం హరికృష్ణకు తీరనిలోటని అన్నారు. పుత్రశోకం అనుభవించిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసునని సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. తన కుమారుడు, కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమదాల్లో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. జానకిరామ్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంపతాం తెలిపారు. -
పోలీసులతో బాబూమోహన్ వాగ్వాదం!
హైదరాబాద్: జలవిహార్ వద్ద పోలీసులకు, మెదక్ జిల్లా ఆదోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ మధ్య వాగ్వాదం జరిగింది. తన వాహనాన్ని బయటకు పంపడంతో బాబూమోహన్ పోలీసులతో గొడవకు దిగారు. తనను తక్కువ చేసి చూస్తున్నారంటూ బాబూమోహన్ అసహనం వ్యక్తం చేశారు. ** -
జోగిపేట నగర పంచాయతీ టెండర్ల రద్దు
జోగిపేట: జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2.63 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి అప్పట్లోనే టెండర్లను నిర్వహించారు. ఎన్నికల ముందు నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడంతో టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ.50 లక్షలు నూతన భవన నిర్మాణానికి, మిగతా రెండు కోట్లు జోగిపేట, అందోలులోని సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం తదితర పనుల నిమిత్తం వినియోగించుకునేందుకు అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నగర పంచాయతీ అధికారులు రూ.2.63 కోట్లకు సంబంధించి 36 పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా టెండర్లు నిర్వహించాలని ఆదేశించింది. ఫిబ్రవరిలో టెండర్ల తేదీని కూడా ఖరారు చేశారు. పనులను చేపట్టేందుకు సీడీఆర్ అనే కాంట్రాక్టు సంస్థ టెండర్లను దక్కించుకుంది. పనులను ప్రారంభించాలనుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో పనులను ప్రారంభించలేదు. ఇటీవల నగర పంచాయతీకి కొత్త పాలక వర్గం ఏర్పడింది. రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నగర పంచాయతీకి సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్లను రద్దు చేసి తిరిగి చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పి.బాబూమోహన్ మున్సిపల్ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వెంటనే రూ.2.63 కోట్ల పనులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ప్రస్తుతం నగర పంచాయతీ ఖాతాలో ఉన్నాయి. నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయమై కొత్త పాలకవర్గం సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఒక్కో వార్డులో రూ.8, 9 లక్షల చొప్పున కేటాయించి పనులు చేపట్టాలని చెర్మైన్‌తో పాటు వార్డు కౌన్సిలర్లు అనధికార సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కావడం..నగర పంచాయతీ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో నిధుల వినియోగ విషయంలో స్పష్టత రావడంలేదు. గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ద్వారానే పనులు చేపట్టేలా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు నగర పంచాయతీ పాలకవర్గం భావిస్తున్నట్లు తెలిసింది. -
దామోదరను దెబ్బతీసిన అందోల్, పుల్కల్
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహపై టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ ఓటమిని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్ మండలాలే దోహదపడ్డాయి. 12వ రౌండ్ వరకు రేగోడ్, అల్లాదుర్గం, రాయికోడ్ మండలాల ఓట్లతో లీడ్ల్ ఉన్న రాజనర్సింహకు 13వ రౌండ్ నుంచి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఈ రౌండ్ నుంచి అందోల్, పుల్కల్, టేక్మాల్, మునిపల్లి మండల ఓట్లు వచ్చాయి. అందోల్‌లో 3747 ఓట్లు, పుల్కల్ మండలంలో 2750 ఓట్లు మొత్తం 6497 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. మునిపల్లి, టేక్మాల్ మండలాల్లో కాంగ్రెస్‌కు స్పల్ప మెజార్టీ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండడంతో చివరి రౌండ్లో 3208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జోగిపేట నగర పంచాయతీలోనే టీఆర్ఎస్కు 2410 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఓట్లే రాజనర్సింహ విజయాన్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. అల్లాదుర్గం, రాయికోడ్, రేగోడ్, మునిపల్లి మండలాల్లో కనీసం 20వ వేల ఓట్ల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ భావించింది. అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. గత ఎన్నికల్లో అందోల్, పుల్కల్ మండలాల్లో బాబూమోహన్‌కు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. ఈ రెండు మండలాల్లోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగా రావడంపై దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మునిపల్లి, టేక్మాల్, పుల్కల్, రాయికోడ్ మండలాల్లో స్థానిక సంస్థల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్కు కూడా అల్లాదుర్గంలో జెడ్పీటీసీ సభ్యుడికి వచ్చిన మెజార్టీ రాలేదని సమాచారం. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వగ్రామాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థికి తక్కువగా ఓట్లు వచ్చాయి. -
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా విజయం
కీసర, న్యూస్‌లైన్: శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు, ప్రజాదరణతో తాను విజయం సాధించినట్లు మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో ఆయన మండల పరిధి చీర్యాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్‌ను స్వామివారికి అప్పగించినప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. దామోదర రాజనర్సింహ వంటి దిగ్గజాన్ని ఎదుర్కొన్నానని, ఫలితాలు వెలువడే ముందు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు. శ్రీస్వామివారి ఆశీర్వాదంతోనే గెలుపొందానని, తన విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నానని పేర్కొన్నారు. ఇక నుంచి ఏ కార్యక్రమమైనా శ్రీవారి ఆశీస్సులతో చేపట్టి విజయవంతంగా పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందుతానని అన్నారు. అనంతరం ఆయన చీర్యాల నుంచి నేరుగా కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. కాగా, కంటోన్మెంట్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన సాయన్న చీర్యాల శ్రీవారి ఆశీస్సులతోనే విజయం సాధించినట్లు దేవాలయానికి సందేశం పంపారు. -
అందోల్ టీఆర్ఎస్లో అయోమయం
జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు దగ్గర పడుతున్నా అందోల్ టీఆర్ఎస్లో మాత్రం విభేదాలు కొలిక్కి రావడం లేదు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి బాబూమోహన్ ఒక వర్గం వారినే ప్రోత్సహిస్తున్నారని చాలాకాలంగా పార్టీ జెండాలు మోస్తున్న వారిని పట్టించుకోవడంలేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందోల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీపై కేసీఆర్, హరీష్‌రావుకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్వయంగా వచ్చి ఇరువురితో చర్చలు జరిపినా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందోల్, పుల్కల్, అల్లాదుర్గం మండలాలకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల జోగిపేటలో సమావేశం నిర్వహించి బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్రెడ్డిలను ఆహ్వనించారు. సమావేశంలో పార్టీలో మొదటి నుంచి ఉంటున్న నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బాబూమోహన్ తాను టీడీపీ నుంచి ప్రత్యేకమైన పరిస్థితుల్లో టీఆర్ఎస్లో చేరానని, తనతోపాటే మిగతా టీడీపీ కార్యకర్తలంతా వచ్చారని, ఇంకా టీడీపీ ఎక్కడుందని, మనమంతా ఒక్క తల్లిబిడ్డలమేనంటూ కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. అయితే రెండు రోజుల క్రితం జోగిపేటకు వచ్చిన జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కొంత మంది పాత టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. సమస్యలు తొలగేదాకా జోగిపేటలో ప్రచారం చేపట్టవద్దని ఒక వర్గం బాబూమోహన్ వర్గీయులకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. 5 రోజుల క్రితం అందోల్ టీఆర్ఎస్కు చెందిన యువకులు గ్రామాల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించి జోగిపేట మీదుగా వెళ్లారు. దీంతో పట్టణానికి చెందిన యువజన విభాగం టీఆర్ఎస్ నాయకులు తమకు చెప్పకుండా ఎలా ర్యాలీ నిర్వహిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం 5 రోజులే ఉన్నా పట్టణంలో ఊపు కనిపించడంలేదు. స్థానికంగా టీఆర్ఎస్ నాయకులు మాత్రమే పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. -
టీఆర్ఎస్కు విలువలు లేవు
అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ పార్టీకి విలువుల లేవని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. గురువారం అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబీ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంత భావజాలం లేని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏం పాలిస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ తన కొడుకుకు సిరిసిల్లా, కూతురుకు నిజామాబాద్, అల్లుడికి సిద్దిపేటలో టికెట్ ఇచ్చి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బాబుమోహన్, హన్మం త్‌రావ్, మాణిక్‌రెడ్డిలు ఎన్ని పార్టీలు మారారని, 24గంటల్లో కండువా మార్చిన వారికి టికెట్లు కేటాయిస్తూ వలసలను పోత్సహిస్తున్నారని విమర్శించారు. నాయకులు గ్రూపులు చేసుకొని పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తే రా జకీయ వ్యభిచారం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉం డి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు తమ ఉనికి కాపాడుకోవడానికి గ్రూపులు చేయడం మంచిపద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణలో టీఆర్ఎస్కే మెజార్టీ సీట్లువచ్చే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇతర పార్టీలో చిచ్చుపెట్టి తాను రాజకీయ లబ్ధి పొ ందేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంగమేశ్వర్, నాయకులు జగదీశ్వర్, నారాయణగౌడ్, శేషారెడ్డి, నర్సింహా రెడ్డి, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అందోల్’లో గెలిస్తే రాజయోగమే
జోగిపేట, న్యూస్‌లైన్: అందోలు అసెంబ్లీ స్థానం...మంత్రిపదవికి రాజమార్గంగా మారింది. ఎస్సీకి రిజర్వయిన ఇక్కడి నుంచి పోటీచేసిన వారినంతా పదవులు వరించాయి. ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లిన చాలామంది మంత్రులుగా పనిచేశారు. అందువల్లే ఈ సీటు పొందేందుకు దాదాపు అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. గెలిస్తే...పదవే 1967, 72, 77 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున అందోలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సి.రాజనర్సింహకు రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పదవులు దక్కాయి. ఇక 1985వ సంవత్సరంలో జడ్జి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మల్యాల రాజయ్య రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 1989వ సంవత్సరంలో తండ్రి రాజనర్సింహ మృతితో రాజకీయాల్లోకి వచ్చిన సి.దామోదర రాజనర్సింహ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందారు. ఆయన ఆ పదవిలో మూడేళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మల్యాల రాజయ్య ఇక్కడ జయకేతనం ఎగురవేసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన రాజయ్య, సిద్దిపేట ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఖాళీ అయిన అందోలు స్థానానికి 1998వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున సినీనటుడు పి.బాబూమోహ న్ పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించిన బాబూమోహన్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సి.దామోదర్‌కు ప్రాథమిక విద్యాశాఖమంత్రి పదవి వరించింది. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అందోల్ నుంచి విజేతగా నిలిచిన దామోదర్ రాజనర్సింహ మార్కెటింగ్ శాఖ, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ, రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఇద్దరిలో ఎవరు గెలిచినా కేబినెట్లో స్థానం? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని ఆ అధిష్టానం ప్రకటించడం...దానికితోడు తెలంగాణ ప్రాంత ప్రచార కమిటీకి సారథ్య బాధ్యతలను దామోదరకు అప్పగించడంతో రానున్న రోజుల్లో ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని స్థానిక పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇక్కడి నుంచే ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న బాబూమోహన్ విజేతగా నిలిచి, టీఆర్ఎస్ అధికారాన్ని చేపడితే కేసీఆర్‌కు సన్నిహితుడైన బాబూమోహన్‌కు ముఖ్య పదవే దక్కుతుందని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సారి ఎవరికి రాజయోగం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
అందోల్ నుంచే పోటీ
జోగిపేట, న్యూస్‌లైన్: రెండు, మూడు మాసాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంబ నకు తెరపడింది. కేసీఆర్‌కు సన్నిహితుడైన బాబూమోహన్ బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్ఎస్ తరఫున అందోల్ సీటు ఆయనకేనంటూ ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కూడా అందోలు సీటు బాబూమోహన్‌కే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న విడుదల చేయనున్న తొలివిడత అభ్యర్థుల జాబితాలోనే బాబూమోహన్ పేరు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే జోగిపేటలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో కేసీఆర్ జోగిపేట అభ్యర్థిని ప్రకటించలేదని తెలుస్తోంది. తొలుత విజయోత్సవ సభలోనే గులాబీకండువా కప్పుకునేందుకు బాబూమోహన్ ఉత్సాహం చూపారనీ, అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందువల్లే బాబూమోహన్ బుధవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో పార్టీలో చేరారని సమాచారం.