సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు.
బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బాబు మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదని విమర్శించారు. తన విషయంలో పార్టీ ఇచ్చే స్పందనను బట్టి బీజేపీలో ఉండాలా? లేదా అని నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటానని పేర్కొన్నారు.
అదే విధంగా సోషల్ మీడియాలో తన కుమారునికి తనకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాబు మోహన్ పేర్కొన్నారు. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిచారని, ఇది సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోల్ ప్రజలు తనను మూడు సార్లు ఆదరించారని పేర్కొన్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ మంచి నాయకుడేనని.. కానీ రాష్ట్రంలో ఉన్న నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించారు. అర్హులకే టికెట్ ఇవ్వాలని భాజపా పెద్దలను కోరుతున్నట్లు చెప్పారు.
కనీసం తనకు మొదటి జాబితాలో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురైనట్లు తెలిపారు. ఒకవేళ రెండో లిస్టులో తన పేరు ఉన్నా.. తాను మాత్రం పోటీ చేయనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు అవమానాలు జరిగాయని, ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
చదవండి: రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment