ఒక్క సీన్‌ కోసం 3 నెలలు వెయిట్‌ చేయించా.. చిరంజీవి కోపంతో! | Comedian Babu Mohan Reveals Interesting Things About His Assets And Chiranjeevi, Deets Inside - Sakshi
Sakshi News home page

Babu Mohan: నా పరుపు దులిపితే లక్షలకు లక్షలు దొరికాయి.. ఆ రోజు చిరంజీవి నాపై సీరియస్‌..

Published Sun, Mar 10 2024 7:14 PM | Last Updated on Mon, Mar 11 2024 10:03 AM

Comedian Babu Mohan About His Assets And Chiranjeevi - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ కమెడియన్లలో బాబూ మోహన్‌ ఒకరు. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక సినిమాల సంఖ్య తగ్గించేశాడు. ఇటీవలే ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

మూడు నెలలపాటు వెయిట్‌ చేయించా
'ముఠా మేస్త్రీ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది. నా గురించి మూడు నెలలపాటు ఓ సీన్‌ షూటింగ్‌ ఆగిపోయింది. చిరంజీవికి విసుగెత్తిపోయి.. మీరేం చేస్తారో నాకనవసరం.. ఈరోజో, రేపో షూటింగ్‌ అయిపోవాలన్నాడు. రెండు గంటల సమయం ఎప్పుడిస్తారో చెప్పాలన్నాడు. ఓ టైం ఫిక్స్‌ చేసి రావాలని చెప్తే.. ప్రయత్నిస్తానన్నాను. ఇంకా ట్రై చేయడమేంటి? అని సీరియసయ్యాడు. నేను సారీ చెప్పాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఆయనతో షూటింగ్‌ అంటే మహా ఇష్టం. కానీ బిజీగా ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్‌ చేయలేకపోయాను.

ఓపక్క సంతోషం.. మరోపక్క బాధ
ఇక అదంతా జరిగాక ఓ రోజు ఎలాగోలా టైం అడ్జస్ట్‌ చేసుకుని సారథి స్టూడియోలో అడుగుపెట్టాను. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందామనుకున్నాను. తీరా అప్పటికే మెగాస్టార్‌ అక్కడున్నారు. షూటింగ్‌ నుంచి వచ్చావా? నీ కళ్లే చెప్తున్నాయి.. సినిమా వాళ్ల జీవితం ఇంతే.. అని బాధపడ్డాడు. బ్రష్‌ చేసుకోమని చెప్పి ఇంటి దగ్గరి నుంచి దోసెలు తెప్పించాడు. నేను ఆవురావురుమని తింటుంటే చూసి సంతోషించాడు, బాధపడ్డాడు. నాకూ తినాలని ఉంటుంది కానీ హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీలయ్యాడు' అని చెప్పుకొచ్చాడు.

రూ. 1 కోటి దాకా ముంచాడు
తన ఆస్తి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు మంచం కింద పెట్టి మర్చిపోయేవాడిని. ఒకసారి నా బెడ్‌షీట్‌ దులిపితే రూ.12 లక్షలు బయటపడ్డాయి. క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడిని. చాలామంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు. చెక్‌ బౌన్స్‌ అయ్యేవి. పోనీలే అని వదిలేసేవాళ్లం. ఒకసారి నేను మేనేజర్‌ను పెట్టుకున్నాను. కానీ అతడు కోటి రూపాయలు లెక్క చెప్పకుండా తినేశాడు. అప్పటినుంచి నేనే అన్నీ మెయింటైన్‌ చేసుకున్నాను' అని బాబూ మోహన్‌ తెలిపాడు.

చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ అక్కడే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement