
‘మిషన్ కాకతీయ’ అవినీతి నిరూపిస్తే రాజీనామా: బాబూ మోహన్
మెదక్(పుల్కల్): మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ తెలిపారు. ఆయన పుల్కల్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ పనులు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో కమీషన్‌లు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆరోపణలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన మహా యజ్ఙంలో విపక్షాలు పాలుపంచుకోవాలని కోరారు.