
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్ వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment