resingnation
-
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ‘బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల (వాటికి ఎంత మంచి ప్రాముఖ్యత ఉన్నా) వల్ల బీఎస్పీ వంటి గొప్ప పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice left. With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭. I don’t want the image of… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024 బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్‌గా ప్రవీణకుమార్ ప్రకటించారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) ఎన్నికలో బరిలో దిగనున్నారని బీఎస్పీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయటం పార్టీకి పెద్ద షాక్ అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
బీజేపీకి బాబు మోహన్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. రేపు రాజీనామ లేఖ పంపుతాను. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తా’ అని బాబు మోహన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బాబు మోహన్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక.. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున దామోదరం రాజనరసింహ విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం -
MAA: రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అనఆనరు. కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్ వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్ ఈసీ మెంబర్స్ బ్రహ్మాజీ శివారెడ్డి సుడిగాలి సుధీర్ ప్రభాకర్ తనీష్ కౌశిక్ సురేశ్ కొండేటి సమీర్ -
కొత్త పార్టీని ప్రకటించిన పంజాబ్ మాజీ సీఎం..
చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం కొత్త పార్టీ పేరుని ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఆయన.. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త పార్టీ పేరును ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పార్టీ గుర్తు ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందన్నారు. త్వరలోనే నూతన పార్టీ గుర్తును కూడా వెల్లడిస్తానని తెలిపారు. అదే విధంగా అమరీందర్ సింగ్.. తన రాజీనామాను ట్విటర్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు తెలిపారు. ఈ లేఖలో రాజీనామాకు గల కారణాలను పొందుపర్చానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తోందని అన్నారు. బీజేపీతో.. తమ పార్టీకి పొత్తు ఉంటుందని ఎక్కడ ప్రకటించలేదన్నారు. కేంద్రం రైతు చట్టాల సమస్యను పరిష్కరిస్తే.. ఆ తర్వాత పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. I have today sent my resignation to @INCIndia President Ms Sonia Gandhi ji, listing my reasons for the resignation. ‘Punjab Lok Congress’ is the name of the new party. The registration is pending approval with the @ECISVEEP. The party symbol will be approved later. pic.twitter.com/Ha7f5HKouq — Capt.Amarinder Singh (@capt_amarinder) November 2, 2021 -
ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా
న్యూఢిల్లీ: బీజేపీ మాజీ నేత బాబుల్ సుప్రియో లోక్‌సభ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేశారు. నెల రోజుల క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, రాజీనామా పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు నా మనసెంతో వేదనకు గురవుతోంది. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి, పార్టీ అధ్యక్షుడు నడ్డాకు, హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్లోని ఆసన్సోల్ నుంచి రెండు పర్యాయాలు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. చదవండి: యూపీలో 40% టికెట్లు మహిళలకే -
ఉద్యోగం చేయలేను.. డీజీపీ రాజీనామా
సాక్షి, బెంగళూరు : పదోన్నతి లభించలేదని అసంతృప్తితో కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అటవీశాఖ అదనపు డీజీపీగా ఉన్న ఆయన బుధవారం జరిగిన ఐపీఎస్‌ల పదోన్నతుల్లో తన పేరు లేదని కినుక వహించారు. బుధవారం అర్ధరాత్రి డీజీపీ ప్రవీణ్‌సూద్ కు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లగా భేటీ కుదరలేదు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి రాజీనామా లేఖను అందజేశారు. ముగ్గురికి ప్రమోషన్లు తాజా పదోన్నతుల్లో అమర్‌కుమార్‌పాండేను శాంతిభద్రతల అదనపు డీజీపీ పోస్టు నుంచి డీజీపీ– పోలీస్ శిక్షణ విభాగానికి, టీ.సునీల్‌కుమార్‌ను ఏసీబీ ఏడీజీపీ నుంచి సీఐడీ ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం డీజీపీగా, సీహెచ్.ప్రతాప్‌రెడ్డికి ఏడీజీపీ– పోలీస్ సంబంధాలు, ఆధునీకరణ, శాంతిభద్రతల విభాగం బాధ్యతలను అప్పగించారు. ఈ ముగ్గురికీ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా పదోన్నతులు జారీచేసింది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ నిరాశకు గురయ్యారు. సునీల్‌కుమార్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నప్పటికీ ప్రమోషన్ దక్కింది. దీంతో ఆయన ఒక్కరోజు డీజీపీగా రికార్డుల్లో ఉంటారు. నా కంటే జూనియర్లకు ఇస్తారా: రవ్రీందనాథ్ రాజీనామాపై విలేకరులతో రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగానికి బుధవారం రాత్రి రాజీనామా చేశాను. నా కంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో చెప్పలేను. పోలీస్‌శాఖలో టార్గెట్ చేయడం, వేధించడం సామాన్యం. కానీ వీటన్నింటిని భరిస్తూ ఉండరాదు. ఈ తప్పులపై పోరాడాలి. డీజీపీకి నాకంటే రూ.300 వేతనం అధికంగా వస్తుందంతే. అయితే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేను గతంలోనే మూడుసార్లు రాజీనామాకు ప్రయత్నించా అని చెప్పారు. తన సమర్థతలో లోపాలు ఉన్నాయని అంటుండడం బాధ కలిగిస్తోందన్నారు. ఇద్దరు ఐపీఎస్‌ల రిటైర్మెంటు బనశంకరి: సీనియర్ ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, అశిత్‌మోహన్‌ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమాన్ని గురువారం కోరమంగల కేఎస్ఆర్పీ మైదానంలో నిర్వహించారు. డీజీపీ ప్రవీణ్‌సూద్ వీరికి ప్రభుత్వ గౌరవాలతో వీడ్కోలు పలికారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ కర్ణాటక తనకు చాలా ప్రేమ ఇచ్చిందని, అందరికీ ధన్యవాదాలని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
షాకింగ్ నిర్ణయం : ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ రాజీనామా
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. కొత్త కొత్త ఫీచర్లు రావడం, ఎక్కువ మంది సెలబ్రిటీలు దీన్ని వాడటం ఇన్‌స్టాగ్రామ్‌కు క్రేజీ పెరిగిపోతుంది. ఎనిమిదేళ్ల కింద లాంచ్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్బుక్ తన సొంతం చేసుకునేటప్పుడే, దాని స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ఢోకా ఉండదని వాగ్దానం చేసింది. కానీ ఇటీవల ఇన్స్టాగ్రామ్ పూర్తిగా తన స్వేచ్ఛ కోల్పోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ కంపెనీలో నెలకొన్న పరిణామం కూడా ఇదే సూచిస్తోంది. ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులైన సీఈవో కెవిన్ సిస్ట్రోమ్, సీటీఓ మైక్ క్రెగర్లు కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వారు ఎందుకు రాజీనామా చేస్తున్నారో స్పష్టత ఇవ్వకుండానే రాజీనామా లేఖను కంపెనీకి సమర్పించారు. మరికొన్ని వారాల్లో తాము కంపెనీని వీడనున్నట్టు ప్రకటించేశారు. ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుల రాజీనామా, టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మధ్య నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినట్టు అందుకే, వీరు రాజీనామా చేసినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇన్స్టాగ్రామ్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ వైల్ గత కొన్ని రోజుల క్రితమే ఫేస్బుక్ కొత్త బ్లాక్ చైన్ టీమ్‌కు బదిలీ అయ్యారు. జుకర్‌బర్గ్ ఇన్నర్ సర్కిల్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్కు పలుమార్లు విభేదాలు వచ్చాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘కెవిన్, మైక్ అద్భుతమైన ప్రొడక్ట్ లీడర్లు. ఇన్స్టాగ్రామ్ వారి సృజనాత్మక ప్రతిభనే. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం. నేను వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాల్సి ఉంది’ అంటూ మార్గ్ జుకర్‌బర్గ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వారి మధ్య గొడవలు, విభేదాలు ఉన్నట్టు జుకర్‌బర్గ్ ఎక్కడా బయటపడలేదు. అదేవిధంగా సిస్ట్రోమ్ కూడా స్పందించారు. తమ ఉత్సుకతను, సృజనాత్మకతను మరోసారి వెలికితీయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కాగా, 715 మిలియన్ డాలర్లు పెట్టి, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసింది. -
జోమాటోకి ఎదురుదెబ్బ
ముంబై : భారత్‌లో అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటోకి ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ మేనేజ్మెంట్లో మరో అధికారి ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ముకుంద్ కులశేఖరన్, బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల వ్యవధిలోనే సంస్థ నుంచి వైదొలిగినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు. కులశేఖరన్ అర్బన్‌క్లాప్ అనే సంస్థలో చేరబోతున్నారని తెలిపారు. అయితే అర్బన్‌క్లాప్ ఆఫర్‌ను కులశేఖరన్ అధికారికంగా ఆమోదించాల్సి ఉందని, ఇంకా ఆయన అర్బన్‌క్లాప్ సంస్థకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సంబంధిత వ్యక్తులు చెప్పారు. డిసెంబర్లోనే కులశేఖరన్ తొలిసారి రాజీనామా చేశారు. అయితే ఆయన చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ప్రమోట్ చేయడంతో, జోమాటోలోనే ఉండిపోయారు. స్విగ్గీని ఓవర్టేక్ చేయడానికి ఎక్కువగా కృషిచేశారు. కులశేఖరన్ కాక, గత మూడు నెలల్లో మరో 10 మంది మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు జోమాటోకు రాజీనామా చేశారు. వారిలో భారత్‌కు చెందిన గ్లోబల్ గ్రోత్ టీమ్ సభ్యులు, ఆస్ట్రేలియా, యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రీజనల్ ఆపరేషన్స్ టీమ్స్ సభ్యులు ఉన్నారు. కులశేఖరన్ రాజీనామాను, కంపెనీ నుంచి వైదొలిగిన మిగిలిన సభ్యుల రాజీనామాలను జోమాటో ధృవీకరించింది. గత కొన్ని నెలల కాలంలో ముకుంద్ కులశేఖరన్, మిగతా ఉద్యోగులు జోమాటో నుంచి వెళ్లిపోయినట్టు కంపెనీ వీపీ-పబ్లిక్ రిలేషన్స్ నైనా సాహ్ని చెప్పారు. వీరందరూ జోమాటోలో ఐదేళ్లకు పైగా పనిచేశారని, ఇక్కడ వారు సాధించిన విజయాలకు ఎంతో గర్విస్తున్నామన్నారు. ఎంతో క్లిష్టతరమైన పరిస్థితుల్లో జోమాటోను అభివృద్ధి చేయడానికి ఎంతో సహకరించారన్నారు. ప్రస్తుతం వారి స్థానాలను భర్తీ చేస్తూ మంచి బలమైన నాయకత్వ టీమ్‌ను నియమించామని పేర్కొన్నారు. ముఖ్యంగా ముకుంద్ కులశేఖరన్, జోమాటోను ఫుడ్ ఆర్డరింగ్ బిజినెస్ నుంచి మార్కెట్లో ఆధిపత్య స్థానానికి తీసుకొచ్చారని సాహ్ని అన్నారు. ఆయన తమకు ఓ స్నేహితుడిగా, మెంటర్‌గా ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే కులశేఖరన్ కానీ, అర్బన్‌క్లాప్ కానీ ఈ విషయాలపై స్పందించడం లేదు. మరోవైపు కులశేఖరన్ స్థానంలో(సీబీఓగా) మరొకర్ని నియమించడం లేదని జోమాటో స్పష్టంచేసింది. ప్రస్తుతం జోమాటో గ్లోబల్ అధినేతగా మోహిత్ కుమార్ ఉన్నారు. అంతకముందు ఆయన రన్నర్ అనే హైపర్-లోకల్ లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసేవారు. గతేడాదే మోహిత్‌ను జోమాటో నియమించుకుంది. -
కాంగ్రెస్‌కు గుడ్ బై: టీఆర్ఎస్లోకి ఖమ్మం ఎమ్మెల్యే
ఖమ్మం: ఎన్నికల్లో ఒటమి తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు, సమిష్టి నాయకత్వ లోపాలతో తీవ్రమైన చిక్కుల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో, మీడియా చర్చల్లో పార్టీ గొంతుకను బలంగా వినిపించే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనమా చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నాయకులపై అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో నన్ను అణగదొక్కే ప్రయత్నం చేశారు. అయినాసరే ఇన్నాళ్లూ మనసు చంపుకొని పార్టీ కోసం పాటుపడ్డా. నిజానికి సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం తీవ్రంగా పాటుపడుతున్నారు. కానీ ఆ విషయాలపై మా నాయకులు నాతో అబద్ధాలు చెప్పించారు' అని పువ్వాడ అజయ్ తాను పార్టీ మారబోతుండటాన్ని సంమర్థించుకున్నారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితోపాటు జిల్లా వృద్ధిపథంలో ముందుండాలని కోరుకుంటున్నానన్న ఆయన.. సోమవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. సీపీఐ కురువృద్ధుడు పువ్వాడ నాగేశ్వర్ రావు తనయుడు, మమత వైద్య విద్యాసంస్థల అధినేత అయిన పువ్వాడ అజయ్ కుమార్ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరీచేరగానే ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో ఆయనతోపాటు హస్తం గుర్తుపై గెలిచిన భట్టి విక్రమార్క(మధిర) కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇప్పటికే కారెక్కగా, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి కొద్ది నెలల కిందట అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మరణంతో అనివార్యమైన పాలేరు ఉప ఎన్నిక మరి కొద్ది రోజుల్లో జరుగుతుందనగా అజయ్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించడం గమనార్హం. పువ్వాడ చేరికతో కాంగ్రెస్ నుంచి అధికారపార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఇక టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల చేరికను స్పీకర్ మధుసూదనాచారి అధికారిక విలీనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీసీ నుంచి గెలిచి, టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.