MAA President Manchu Vishnu Accepts Resignation Of Prakash Raj Panel Members - Sakshi
Sakshi News home page

MAA: రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం

Published Sun, Dec 12 2021 1:06 PM | Last Updated on Sun, Dec 12 2021 1:33 PM

MAA President Manchu Vishnu Accept Resignation Of Prakash Raj Panel Members - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్‌ రాజ్‌ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అన​ఆనరు. 

కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు…ప్ర‌కాశ్ రాజ్‌పై ఘ‌న విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు మూకుమ్మ‌డి రాజీనామాలు చేశారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే

జాయింట్‌ సెక్రటరీ: ఉత్తేజ్‌ 
వైస్‌ ప్రెసిడెంట్‌: బెనర్జీ 
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: శ్రీకాంత్‌

ఈసీ మెంబర్స్‌
బ్రహ్మాజీ
శివారెడ్డి
సుడిగాలి సుధీర్‌
ప్రభాకర్‌
తనీష్‌
కౌశిక్‌
సురేశ్‌ కొండేటి
సమీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement