
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా రోజుకో ట్విస్ట్ తెరమీదకి వస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపాయి. అదే స్థాయిలో ఎన్నికల తర్వాత కూడా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఆ విషయం గురించి నేను చెప్పకూడదు: 'మా' ఎన్నికల అధికారి
మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడికే ఉంటుంది.
‘మా’ బైలాస్ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. దీనికి జనరల్ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి: కొత్త కుంపటిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment