resignations
-
బంగ్లాలో హిందూ టీచర్లపై దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందూ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలైన హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఇలా 50 మంది దాకా రాజీనామా చేశారు. వెలుగులోకి రాని ఉదంతాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆఫీసును ముట్టడించి... బరిషాల్లోని బేకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ శుక్లా రాణి హాల్దర్ కార్యాలయాన్ని ఆగస్టు 29న మూకలు ముట్టించాయి. వీరిలో బయటి వ్యక్తులతో పాటు ఆ కాలేజీ విద్యార్థులూ ఉన్నారు! తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి బెదిరింపులకు దిగారు. దాంతో వేరే మార్గం లేక ఖాళీ కాగితం మీదే ‘నేను రాజీనామా చేస్తున్నాను’ అంటూ సంతకం చేసిచ్చారామె. అజీంపూర్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ గీతాంజలి బారువాతో పాటు అసిస్టెంట్ హెడ్ టీచర్ గౌతమ్ చంద్ర పాల్ తదితరులతో బలవంతంగా రాజీనామా చేయించారు. వారంతా తన కార్యాలయంపై దాడి చేసి తనను అవమానించారని గీతాంజలి వాపోయారు. వైరలవుతున్న వీడియోలు... బంగ్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలంటూ హిందూ టీచర్లను, ఇతర సిబ్బందిని బలవంతం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేధింపుల దెబ్బకు ప్రొక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచి్చందని కాజీ నజ్రుల్ వర్సిటీ పబ్లిక్ అసోసియేట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ముఖర్జీ తెలిపారు. ఖండించిన తస్లీమా ఈ ఘటనలపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ మండిపడ్డారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించారు. ‘‘హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు హత్యలకు, వేధింపులకు గురవుతున్నారు. జైలుపాలవుతున్నారు. దర్గాలను కూలి్చవేస్తున్నారు. అయినా యూనస్ నోరు విప్పడం లేదు’’ అంటూ ఎక్స్‌లో దుయ్యబట్టారు. టీచర్లపై వేధింపులను బంగ్లా ఛత్ర ఐక్య పరిషత్ ఖండించింది. -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్‌డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్‌లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్‌షిప్‌కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
ఏసీఏ పాలకవర్గం రాజీనామా
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత వ్యవస్థలను స్వా«దీనం చేసుకునే పనిలో నిమగ్నమైన ‘పచ్చ ముఠా’ క్రీడా సంఘాల్లోకి కూడా చొరబడుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)ను హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కేంద్రంగా ఈ క్రీడా రాజకీయం కొనసాగుతోంది.ప్రస్తుతం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌చంద్రారెడ్డి, గోపినాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేశ్, కోశాధికారిగా ఎ.వి.చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పురుషోత్తం వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంకా ఏడాది సమయముంది. కానీ ఆదివారం విజయవాడలోని ఓ హోటల్లో ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, క్రికెట్ అకాడమీల ప్రతినిధులు కలిపి మొత్తం 33 మంది హాజరయ్యారు. గోపినాథ్‌రెడ్డి, రాకేశ్, చలం తమ రాజీనామా పత్రాలతో పాటు మిగిలిన వారివి కూడా తీసుకొని సమావేశానికి వచ్చారు. ఎలాంటి చర్చ లేకుండానే పాలకవర్గం రాజీనామాలను ఆమోదించినట్లు విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుతో ఎంపీ కేశినేని చిన్ని ప్రకటింపజేశారు. ఆ వెంటనే గోపీనాథ్‌రెడ్డి, చలం వెళ్లిపోయారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్.. ఏసీఏకు ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు విష్ణుకుమార్‌రాజు మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీలో ఆర్.వి.ఎస్.కె.రంగారావు, మాంచో ఫెర్రర్, మురళీమోహనరావును నియమించినట్లు తెలిపారు. వారిలో ఇద్దరికి చెక్ పవర్ ఇచ్చామన్నారు. ఎన్నికలు జరిగే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. పాలకవర్గానికి ఉన్న మిగిలిన ఏడాది కాలానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించామన్నారు. సెపె్టంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తారని వెల్లడించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లోని క్రికెట్ సంఘాలను సందర్శించి క్రికెట్ సంఘాల్లో ఉన్న సమస్యలను, క్రీడాకారుల ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు. -
17 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ల(వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.యూనివర్సిటీల్లో టీఎన్ఎస్ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. -
రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగతం
సాక్షి, అమరావతి: రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవ్వరినీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు.వలంటీర్ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు.ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 22 వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారుఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు 929 మంది వలంటీర్లను తొలగించామన్నారు. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులిచ్చామని, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వారి రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇదెలా సాధ్యమని అన్నారు.ఇప్పుడు వలంటీర్లు ఖాళీగా ఉన్నారుప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పగించలేదన్నారు. వారు ఖాళీగా ఉన్నారని, అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తూనే ఉన్నామన్నారు. దీని వల్ల ఖజానాపై భారం పడుతోందని వివరించారు.పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చన్నారు. వలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. -
మీ దూకుడూ ...సాటెవ్వరు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు. నిన్నటిదాకా తిట్టిపోసిన పార్టీల్లోనే దర్జాగా చేరుతూ తమను అక్కున చేర్చుకున్న పార్టీలను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార బీఆర్ఎస్తోపాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రేఖా నాయక్, మైనంపల్లితో మొదలు... బీఆర్ఎస్ దాదాపు రెండున్నర నెలల కిందటే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అప్పట్లో ఒకరిద్దరు నేతలు మినహా మరెవరూ ఆ పార్టీని వీడలేదు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఎస్టీ మహిళనైన తనను పార్టీ బలిపశువు చేసిందని , మహిళలను గౌరవించని పార్టీలో కొనసాగలేనంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తాజా జాబితాలో రేఖానాయక్ భర్త శ్యాం నాయక్‌కు టికెట్ కేటాయించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెండు టికెట్లు ఆశించి భంగపడటంతో ఏకంగా మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తనకు, తన కుమారునికి టికెట్లు ఖాయం చేసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి యూటర్న్...: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీయేనని... అందుకే ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో రేవంత్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డిని దూషించారు. అదే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తన అభిమానులు, కార్యకర్తలంతా కలసి బీఆర్ఎస్ను ఓడించడం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు. ఆల్ పార్టీ నేత నాగం...: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఒక్కప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో టీడీపీకి రాజీనామా చేశాక సొంత పార్టీ పెట్టిన ఆయన 2013లో బీజేపీలో చేరిపోయారు. 2018లో ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ ఆయనకు నాగర్‌కర్నూల్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని దుర్భాషలాడుతూ అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఏకంగా కోర్టుకెక్కిన నాగం... తాజాగా అదే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరిదీ అదే దారి... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే టికెట్లు పొందారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తనకు టికెట్ లభించే అవకాశం ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా నామినేట్ అయిన కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, ఆయన సతీమణి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరగా ఆ వెంటనే ఆయనకు శేరిలింగంపల్లి టికెట్ లభించింది. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకునిగా ఉన్న మనోహర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనకు తాండూరు టికెట్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే ఆయనకు కల్వకుర్తి సీటు ఖరారైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరగానే ఆయనకు టికెట్ కేటాయించిందా పార్టీ. నేరేడుచర్ల మున్సిపల్ వైస్–చైర్పర్సన్ శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆమెకు హుజూర్నగర్ టికెట్ దక్కే అవకాశం ఉంది. కొందరికి భవిష్యత్ పై హామీలు... కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల రగడతో బీఆర్ఎస్లోకి సైతం భారీగానే మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. అయితే వారికి ఇప్పటికిప్పుడు సీట్లు కేటాయించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తోంది. ఇలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు/మంత్రులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మెదక్ డీసీసీ అధక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
దమ్మూ ధైర్యముంటే నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..
నాడు: గత టీడీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయాలకే వాడుకుంది. కేవలం ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంది. చట్టసభల్లోగానీ, రాజకీయ పదవుల్లోగానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కింది. నామమాత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా నిధులు విదిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనబెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అన్యాయం బీసీలకు బాగా అర్థమైంది. ఏళ్ల తరబడి మోస్తున్నా.. అడుగడుగునా అవమానాలే ఎదురవుతుండడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బాబుకు బైబై చెప్పే పరిస్థితి వచ్చింది. నేడు: ‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. వారు సమాజానికి బ్యాక్ బోన్లాంటి వారు’ అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఉచ్ఛరిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. చట్టసభల్లో సైతం వారికి సముచిత స్థానం కల్పించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన రాజకీయ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సమకూర్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీలు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమను ఇంతలా ఆదరించలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలోని బీసీ నాయకులు టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానంలేక కొందరు.. బాబు సామాజికవర్గం దాడులకు భయపడి మరికొందరు.. చులకన చేసి మాట్లాడడంతో ఇంకొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింలేక ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి పేరున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం టీడీపీకి, పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాజాగా చిత్తూరుకు చెందిన బీసీ నాయకుడు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం శుక్రవారం ఉదయం టీడీపీకి, తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఇదివరకే చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాపాక్షి మోహన్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీలే అధికం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గం వారే అధికం. మొత్తంగా 15 లక్షలకుపైగా ఓటర్లుండగా వీరిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే సుమారు 40 శాతం ఉన్నారు. కుప్పం, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓట్లే కీలకం. అందుకే వారిలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వరకే వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు చేస్తూ.. చులకనగా చూస్తూ బాబు సామాజికవర్గం నేతలు బీసీలను చులకన చేయడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. మరో వైపు దాడులకు తెగబడుతున్నట్లు బాధితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన పీ షణ్ముగంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు దాడిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే షణ్ముగం ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏకమవుతున్న బీసీలు టీడీపీలో బీసీలకు జరుగుతున్న అవమానాలను జీర్ణించుకోలేక ఆ సామాజికవర్గ నేతలంతా ఏకమవుతున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వన్నెకుల క్షత్రియులతో పాటు మిగిలిన బీసీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్త లు రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స మావేశాల్లో టీడీపీ చేసిన అన్యాయాలు, ఆగడాలను ఎండగడుతున్నారు. శివరాత్రితర్వాత ఉమ్మడి చిత్తూ రు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు సమావేశం ఏర్పా టు చేసి కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. బీసీల సాధికారత ఎక్కడ? బీసీల సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నీరుగార్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ప్రకటనలు చేసేవారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో బీసీలు దగాపడ్డారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు వారి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. టీడీపీలో ఎంత కష్టపడినా బీసీలకు న్యాయం, తగిన గౌరవం, గుర్తింపు లభించదు. 15 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నన్ను నమ్మిన బీసీల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. –డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి బీసీలను అణగదొక్కేందుకు కుట్ర టీడీపీ కోసం కష్టపడ్డాను. 32 ఏళ్లుగా పార్టీని నమ్మాను. చంద్రబాబు, లోకేష్, ముఖ్యనాయకులు వస్తే వారి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించాను. అయితే పారీ్టలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మొన్న లోకేష్ పర్యటనలో పులివర్తి నాని నాపై దాడిచేసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్‌కు ఫిర్యాదు చేశాను. నానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. చిత్తూరులో బీసీలను అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారు. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీ వారికి రుచిచూపిస్తాం. – పీ షణ్ముగం, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, చిత్తూరు మొదలైన బుజ్జగింపుల పర్వం బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితుండడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పలువురు మాజీ మంత్రులను బీసీ నాయకుల నివాసాలకు పంపుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుతామని చెబుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, తమకు ఏ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారి వెంట నడుస్తామని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేసిన వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నుంచి లేఖలు విడుదల చేయడం గమనార్హం. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కైకలూరు నియోజకర్గ టీడీపీలో కల్లోలం రేగింది. ప్రస్తుతం ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి అధికార వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకోనుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేడర్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనస్త్రాలు సంధించింది. మరోవైపు ఇన్చార్జిగా ఎవరినైనా కొంతకాలం పెట్టి పార్టీని నడపడానికి సన్నాహాలు చేస్తున్నా, ఇన్చార్జి పదవికి ముఖ్యులంతా ముఖం చాటేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ డైలామాలో పడింది. ఇప్పటికే టీడీపీ రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ గురువారం వైఎస్సార్సీపీలో చేరనున్నారు. హడావుడిగా టీడీపీ నేతల భేటీ దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో జయమంగళ వెంకటరమణ క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా నియోజకవర్గంలో పట్టు ఉండటంతో 1998లో కైకలూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పార్టీ అంతర్గత వెన్నుపోట్లతో టికెట్ కోల్పోయారు. మళ్ళీ 2019లో చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో వెన్నుపోటు రాజకీయాలతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో అనేక హామీలు, పార్టీపరంగా రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు పలు పర్యాయాలు చెప్పినప్పటికీ ఆయనను పూర్తిగా విస్మరించారు. దీంతో టీడీపీ తీరుపై విరక్తి చెంది పార్టీకి రాజీనామా ప్రకటించడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. బుధవారం హడావుడిగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఏర్పాటు చేశారు. అది కాస్తా రసాభాసగా సాగింది. నేతలతో వాగ్వాదం: దీంతో కేడర్‌ను కాపాడుకోడానికి మాగంటి బాబు, ఏలూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బొర్రా చలమయ్యలు సమావేశానికి హాజరయ్యారు. ప్రారంభంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు జానీకి కనీసం వేదికపై చోటు ఇవ్వకపోవడంతో నిలదీశారు. అతనికి మద్దతుగా రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.మాల్యాద్రి వేదికపై నాయకులను ప్రశ్నించారు. దీంతో గన్ని వీరాంజనేయులు సర్ధిచెప్పారు. సమావేశం అనంతరం జానీ, మాల్యాద్రిలు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుకు ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపధ్యంలో కమ్మిలి విఠల్, జానీ, మాల్యాద్రిల మధ్య మాటల యుద్ధం జరిగింది. పోటీ కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిక వైఎస్సార్సీపీలోకి చేరుతున్న జయమంగళ ప్రధాన అనుచరులను పొమ్మనలేక పొగబెడుతున్నారని జానీ, మల్యాద్రి మండిపడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తే ఇప్పుడు గెంటేయడానికి ప్రయత్ని స్తున్నారన్నారు. ఇలాగైతే టీడీపీలో విడిగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ.. మీది నాతో మాట్లాడే స్థాయి కాదని, నా మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు జానీ, మాల్యాద్రి కొనసాగుతున్న రాజీనామాల పర్వం తెలుగుదేశం పార్టీకి కైకలూరు నియోజకవర్గంలో కాలం చెల్లే పరిస్థితి దాపరించింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పారీ్టకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని మంగళవారం ప్రకటించిన విషయం విధితమే. అదే బాటలో టీడీపీ రైతు అధికార ప్రతినిధి సయ్యపురాజు గుర్రాజు పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు లేఖ పంపారు. జయమంగళతో పాటు వైఎస్సార్సీపీలోకి వెళుతున్నట్లు స్థానికలతో చెప్పారు. గుర్రాజు బాటలోనే మరికొందరు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి త్వరలో రానున్నట్లు సమాచారం. డీఎన్నార్‌ను కలిసిన జయమంగళ వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా కృషి చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)ను బుధవారం ఆయన మర్వాదపూర్వకంగా కలిశారు. డీఎన్నార్‌కు జయమంగళ పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ముందుగా డీఎన్నార్ మాట్లాడుతూ జయమంగళ వెంకటరమణ టీడీపీ పాలనలో అణచివేతకు గురైన బీసీ నాయకుడన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి జయమంగళ పేరును ఎమ్మెల్సీగా సూచించామన్నారు. కొల్లేరు అభివృద్ధికి సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. జయమంగళ రాకతో కొల్లేరు ప్రజలకు మరింత చేరువగా పథకాలను అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మాట విని టిక్కెట్టును కామినేని శ్రీనివాస్‌కు త్యాగం చేశానన్నారు. తనకు మొదటి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కొల్లేరు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. నేడు సీఎం జగన్ కొల్లేరు రీసర్వే, రెగ్యులేటర్ల నిర్మాణం, పెద్దింట్లమ్మ వారధి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. భవిష్యత్తులో డీఎన్నార్ భారీ మెజారి్టఈతో ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. కొల్లేరులంక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వైఎస్సార్సీపీ చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు జయమంగళ తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే డీఎన్నార్ కుమారులు వినయ్, శ్యామ్‌కుమార్, టీడీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర నాయకుడు సయ్యపురాజు గుర్రాజు ఉన్నారు. -
Meghalaya: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మేఘాలయలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బుధవారం తమ రాజీనామాను గవర్నరకు సమర్పించి యూనైటెడ్ డెమోక్రటిక్ పార్టీలో(యూడీపీ) చేరేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసిన వారిలో కేబినెట్ మంత్రి హిల్ స్టేట్ పిపుల్ డెమోక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ) ఎమ్మెల్యే రెనిక్టన్ లింగ్డో టోంగ్కార్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే షిత్లాంగ్ పాలే, సస్పెండెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైరల్బోర్న్ సియోమ్, పిటి సాక్మీతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఈ పరిణామంతో రాష్ట్రంలో కాంగ్రెస్, హెచ్ఎస్పీడీపీ పార్టీలకు ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. కాగా మేఘాలయలో ఈమధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 18 మంది శాసనసభ్యులు సంబంధిత పార్టీలకు రాజీనామాలు సమర్పించారు. ఇదిలా ఉండగా మార్చి 15తో మేఘాలయ 11వ అసెంబ్లీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించనుంది. ఇక మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ పేరుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికితోడు తాము కూడా ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ పేర్కొంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో మెజార్టీ మార్కును దాటగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 2018లో ఎన్సీపీ (20), యూడీపీ (8), పీడీఎఫ్ (4), హెచ్ఎస్పీడీపీ (2), బీజేపీ (2), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి(మొత్తం 39) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ సీఎంగా ఉన్నారు. చదవండి: ట్రైన్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు. -
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత
-
ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్.. ఇప్పుడేం చేస్తావ్!
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖర్చుని తగ్గించడం కోసం మస్క్ ట్విటర్ సిబ్బందిని తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వందలాది మంది ఉద్యోగులు తమకీ పని వద్దురా బాబో అంటూ రాజీనామా చేసినట్లు సీఎన్‌బీసీ తన నివేదికలో తెలిపింది. ట్విటర్లో ఏం జరుగుతోంది.. ట్విటర్‌కు సీఈఓ బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ సంస్థలో భారీ మార్పులకు పూనుకున్నాడు. పైగా ఇటీవల ఉద్యోగులతో జరిపిన సమావేశంలో మస్క్ మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఫ్రీ ఫుడ్ తొలగింపు, ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు అందించే ప్రోత్సాహకాల తగ్గింపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను రద్దు చేస్తున్నట్లు తెగేసి చెప్పారు. సంస్థ దివాలా తీసే పరిస్థితిలో ఉందంటూ సిబ్బందిలో మార్పు రాకపోతే తొలగింపులు తప్పవని స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం.. ట్విటర్ బాస్ జారీ చేసిన అల్టిమేటంకు సంస్థలోని ఇంజనీర్లతో సహా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాజీనామ చేశారు. అయితే అనుహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ట్విట్టర్ సోమవారం వరకు ఆ ప్రాంతంలోని తన కార్యాలయాలను మూసివేసింది. మరో వైపు, సామూహిక రాజీనామాలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ముగ్గురు ట్విటర్ ఉద్యోగులు తాము కంపెనీకి వీడ్కోలు పలుకుతున్నట్లు పంచుకున్నారు. చదవండి: త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన -
జాబ్‌కు రిజైన్ చేస్తున్నారా? ఆ పని మాత్రం చేయకండి! ఎందుకంటే?
ఉదయం తొమ్మిదింటికల్లా తయారై టిఫిన్ బాక్సు సర్దుకుని ఆఫీసుకు బయల్దేరడం. రాత్రికల్లా ఉసూరంటూ ఇల్లు చేరడం. కుటుంబీకులతో గడపాలన్నా, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లాలన్నా సెలవు రోజుల్లోనే! ఇదంతా ఒకప్పటి ఉద్యోగి జీవితం. కానీ కరోనాతో అంతా మారిపోయింది. ఇంటినుంచే పని. నచ్చిన ఉద్యోగం. కావాల్సినంత జీతం. ఇంతకంటే ఏం కావాలి’ అంటూ చేస్తున్న ఉద్యోగాలకు ఉన్న పళంగా రాజీనామాలు (ది గ్రేట్ రిజిగ్నేషన్) చేసి కొత్త ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఫలితం? ఉద్యోగులు ఊహించింది వేరు. అక్కడ జరుగుతుంది వేరంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ లేబర్ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెరికాకు చెందిన 4.7 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారు. మన దేశంలోనూ ఐటీ, టెలికాం రంగాల్లో ఏకంగా 86 శాతం మంది ఉద్యోగం మారాలనుకుంటున్నారని మైకెల్ పేజ్ సర్వేలో తేలింది! 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.7 శాతం మంది ఉద్యోగులు మానేశారు! నచ్చిన పనివిధానం కోసం జీతం తక్కువైనా, ప్రమోషన్లు లేకున్నా పర్లేదని మన దేశంలో ఏకంగా 61 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారట! చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ అయితే తాజాగా ఉద్యోగుల రిజైన్లపై ఇండీడ్ హైరింగ్ ల్యాబ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ నిక్ బంక్ స్పందించారు. నచ్చిన పనిగంటలు, ఎక్కువ జీతం కోసం ఆశపడి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలిపారు. ఎందుకంటే? ఈ ఏడాది జులైలో రిజైన్ చేసి వేరే సంస్థలో చేరిన ఉద్యోగి జీతం వృద్ధి 8.5శాతంగా ఉంది. కానీ మూడు నెలలు తిరక్కుండా ఉద్యోగుల శాలరీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. ఆగస్ట్‌లో శాలరీ వృద్ధి రేటు ఆగస్ట్‌లో 8.4శాతం, సెప్టెంబర్‌లో 7.9శాతం, అక్టోబర్‌లో 7.6శాతం, నవంబర్‌లో 6.4శాతం కంటే ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొందరపడకండి మరోవైపు గ్లాస్‌డోర్ ఎకనమిస్ట్ డేనియల్ జావో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో దిగ్రేట్ రిజిగ్నేషన్ అంశం ముగియలేదు. జాబ్ మార్కెట్లో ఉద్యోగాల రాజీనామా సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ ఆర్ధిక మాద్యం ముప్పు కారణంగా తగ్గే అవకాశం ఉంది. ఇక జాబ్ మారే ఉద్యోగులు ఇంతకు ముందులా..మాకు ఇంత శాలరీ కావాలని డిమాండ్ చేయడం సాధ్యం కాదన్నారు. అందుకే ఉద్యోగులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అన్నారు. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఉద్యోగులపై ఆర్ధిక మాంద్యం ప్రభావం తక్కువే. అయినప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారు. లేదంటే ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి 2023 కొంచెం గడ్డు కాలమని అని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, జీతాల నెగోషియేషన్లు ఉద్యోగికి సంతృప్తిని ఇవ్వకపోవచ్చని తెలిపారు. చదవండి👉 వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, ‘యాపిల్ సంస్థను అమ్మేయండి’! -
Twitter layoffs: ఉద్వాసన తప్ప దారి లేదు: మస్క్
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. సంస్థను ప్రక్షాళన చేసే పనిలో మస్క్ నిమగ్నమయ్యారు. సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని మస్క్ శనివారం ట్వీట్ చేశారు. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, పట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు. ట్విట్టర్‌ను మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థలో నిత్యం వందలాది మందికి పింక్ స్లిప్పులు అందుతున్నాయి. భారత్‌లో 200 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో లేఆఫ్‌లు అమలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పలువురు ట్విట్టర్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్ యజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘింస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నప్పుడూ హోం సెక్రటరీగా ఉన్న సుయోల్లా బ్రేవర్ మాన్ భద్రతా ఉల్లంఘనల విషయమై పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బ్రేవర్ మాన్ రాజీనామ చేసిన కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ కూడా అనుహ్యాంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మళ్లీ సుయోల్లా బ్రేవర్‌మాన్‌ని తిరిగి హోమంత్రిగా నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని సునాక్ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఒక మంత్రి మళ్లీ తిరిగి నియమించడం బాధ్యతారహితమైన నిర్ణయం అంటూ రిషిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు లేబర్ నాయకుడు కైర్ స్టార్మర్, కూపర్లు కూడా ఆమెని తొలగించాలని పట్టుపట్టారు. బ్రేవర్ మాన్ అత్యంత మితవాద టోరీ ఎంపీలకు ప్రాతినిథ్యం వహిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఆమె యూకేకు అక్రమంగా వచ్చిన వలసదారులను రువాండ్కు పంపించేందుకు మద్దతు ఇచ్చిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అదీగాక ఆమె ఒక ప్రైవేట్ ఇ-మెయిల్‌కు సెన్సిటివ్ డాక్యుమెంట్‌ని పంపించిన వివాదాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి ఆమెను దేశీయ భద్రతా సమస్యలకు బాధ్యత వహించే ప్రముఖ స్థానానికి మళ్లీ తిరిగి నియమించడంపై బ్రిటన్ అంతటా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రిషి సునాక్ కూడా ఆ వివాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు. (చదవండి: బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!) -
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫోసిస్ గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ విభాగానికి ఆయన సారథ్యం వహించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో న్యూక్లియర్ సైంటిస్టుగా కెరియర్ ప్రారంభించిన రవి కుమార్ 2002లో ఇన్ఫీలో చేరారు. 2016లో ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2017లో డిప్యుటీ సీవోవోగా నియమితులైన రవి .. ఆ తర్వాత సీవోవోగా పదోన్నతి పొందుతారనే అంచనాలు ఉండేవి. అయితే, అప్పటి సీవోవో యూబీ ప్రవీణ్ రావు రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫీ ఆ పోస్టునే తీసివేసింది. -
పదాధికారులు ప్రచారంలో పాల్గొనొద్దు
న్యూఢిల్లీ: రెండు వారాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను కాంగ్రెస్ పార్టీ వెలువరించింది. ‘ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పదాధికారులు(ఆఫీస్ బేరర్లు) తమ పదవికి రాజీనామా చేయాలి. పార్టీ ప్రతినిధులు(డెలిగేట్స్) తమకు నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేయవచ్చు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీలో పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ సెల్స్‌లో ఉన్న వారు, అధికార ప్రతినిధులు... అభ్యర్థికి అనుకూలంగా/వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పార్టీలో మీ పదవికి రాజీనామా చేయండి’ అని పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార విభాగం మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మర్యాదపూర్వకంగా కలవవచ్చని స్పష్టంచేసింది. ‘ప్రచారానికి సంబంధించిన సమావేశ మందిరాలు, చైర్లు, ప్రచార ఉపకరణాలు సమకూర్చవచ్చు. డెలిగేట్స్‌ను ఓటింగ్ స్థలానికి వాహనాల్లో తరలించకూడదు. మార్గదర్శకాలను మీరితే చర్యలు తప్పవు’ అని పార్టీ పేర్కొంది. -
‘కొలువుకు టాటా’.. ప్రపంచవ్యాప్తంగా రాజీనామాల ట్రెండ్
ప్రపంచాన్ని గడగడలాడించి 65 లక్షల మందిని కబళించిన కరోనా దిగ్గజ కంపెనీలకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ విజృంభన మొదలైనప్పటి నుంచీ లక్షల మంది ఉద్యోగాలు మానేస్తున్నారు. ప్రపంచమంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కరోనా కల్లోలం సద్దుమణిగినా రాజీనామాల జోరు మాత్రం తగ్గడం లేదు. గత ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా, సింగపూర్లలో 13,382 మంది ఉద్యోగులపై మెకిన్సే సర్వే చేసింది. రాజీనామాలకు కారణాలతో పాటు ఏం చేస్తే ఉద్యోగం మానకుండా ఉంటారో తెలుసుకోవడం దీని ఉద్దేశం. కనీసం 40 శాతం మంది తమ ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తేలింది. వీరంతా మూడు నుంచి ఆర్నెల్లలో రాజీనామా యోచనలో ఉన్నారట. చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన, మరింత తృప్తినిచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నారట. ఎదుగుదలకు అవకాశాల్లేక మానేసినట్టు 41 శాతం మంది చెప్పారు. మొత్తమ్మీద ఆశించిన వేతనం, ఇతరత్రా తగినన్ని లాభాలు లేకపోవడం రాజీనామాలకు ప్రధాన కారణమని సర్వే తేల్చింది. ఈ ఏడాదిలో ఒక్క అమెరికాలోనే ఇప్పటిదాకా దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాలు మానేసినట్లు తేలింది. 2022 అంతా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చన్నది నిపుణుల అంచనా. ఇందుకు కరోనా కొంతవరకే కారణమని మెకిన్సే నివేదికను సిద్ధం చేసిన వారిలో ఒకరైన బోనీ డౌలింగ్ అన్నారు. ‘‘ఉద్యోగమనే భావనే సమూలంగా మారుతున్న వైనం కొన్నాళ్లుగా స్పష్టంగా కన్పిస్తోంది. జీవితంలో ప్రాథమ్యాల విషయంలో ఆలోచనా శైలిలోనే మార్పు కనిపిస్తోంది. ఏ ఉద్యోగం చేసినా తమకు నచ్చినట్లు ఉండాలని ఆశిస్తున్నారు’’ అని వివరించారు. ఉద్యోగుల మార్కెట్ ఇప్పుడిప్పుడే కరోనా ముందునాటి స్థితికి చేరుకోవడం కష్టమేనన్నారు. నచ్చని రంగాలకు గుడ్‌బై... కరోనా తరువాత రాజీనామా చేసిన వాళ్లలో సగం ఇతర రంగాలకు మళ్లుతున్నట్లు మెకిన్సే చెబుతోంది. సర్వేలో భాగంగా గత రెండేళ్లలో ఉద్యోగాలు మానేసిన ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాలకు చెందిన 2,800 మందిని ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నించింది. వీరిలో 48 శాతం ఇతర రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నట్లు తేలింది. ‘‘కరోనా వేళ విపరీతమైన ఒత్తిడికి గురై శక్తివిహీనంగా మారిపోయిన భావన తట్టుకోలేక పలువురు ఉద్యోగాలు మానేశారు. ఉన్న రంగంలో మెరుగైన ఆదాయం కష్టమని కొందరు ఇతర రంగాల వైపు మళ్లారు. రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మానేసిన వారిలో ఏకంగా 60 శాతం రంగం మారడమో, పూర్తిగా మానేయడమో చేశార’’ని తేల్చింది. భారత్‌లోనూ... భారత ఐటీ కంపెనీల్లో ఈ ఏడాది వేలకొద్ది రాజీనామాలు జరిగాయి. గత ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌కు ఏకంగా 28.4 శాతం మంది రాజీనామా చేశారు. తర్వాత స్థానాల్లో విప్రో (23.3), టెక్ మహీంద్రా (22), టీసీఎస్ (19.7) ఉన్నాయి. ‘‘ఒకే కంపెనీలో మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటే ఎదుగుదలకు అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. కెరీర్ కోసం అవసరమైతే ఏడాదిలో రెండు ఉద్యోగాలు కూడా మారతాం’’ అని ఓ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ రఘురామ మంచినేని అన్నారు. భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు భారీగా ఉండటమూ రాజీనామాలకు ఓ కారణమని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లంతా పెద్ద కంపెనీల్లో చేరి కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు’’అని సాక్షి ప్రతినిధితో అన్నారు. స్వయం ఉపాధే బెటర్... మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేసిన వారిలో 29 శాతమే మళ్లీ సంప్రదాయ కొలువుల్లో చేరారు. మిగతా వారిలో చాలామంది సొంత వ్యాపారాలకు మొగ్గారు. కొందరు పార్ట్‌టైం కొలువులకు జై కొట్టారు. కరోనా సమయంలో అమెరికాలో సొంత వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 శాతం పెరిగిందట. 2021లోనే 54 లక్షల దరఖాస్తులు వచ్చాయని వైట్‌హౌస్ వెల్లడించింది. మనోళ్లు అక్కడలా... అమెరికాలోని భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం కాసులు కురిపించింది. ఓవైపు వేలాది మంది రాజీనామాలు చేస్తుంటే మనవాళ్లేమో ఫుల్ టైం కొలువుకు తోడు రెండు, మూడు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా చేశారు. ఇది వారికీ, అటు ఉద్యోగుల కొరతతో అల్లాడిన పలు కంపెనీలకూ కలిసొచ్చింది. కానీ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇకపై వారానికి కనీసం 3 రోజులు విధిగా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేయడంతో చాలామంది పార్ట్ టైం కొలువులకు స్వస్తి పలకాల్సి వస్తోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్‌ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు. అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు. అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్‌లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్‌ను వీడారు! రాహుల్ రాకతో సర్వం నాశనం సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు. ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్‌కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్‌శిబిర్‌లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్‌కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు. కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్‌ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. కోటరీ గుప్పెట్లో బందీ కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. రాహుల్‌పై ఆజాద్ ఆరోపణలు... ► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది. ► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు. ► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్‌వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది! ► ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ► కాంగ్రెస్‌ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు. ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్ దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్‌పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్‌కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్‌పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ఆజాద్ బాటలో మరో ఐదుగురు.. కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్ తగులుతోంది. సీనియర్లు, యువనేతలు అనే తేడా లేకుండా చాలా మంది పార్టీని వీడుతున్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేయగానే.. కశ్మీర్‌కు చెందిన మరో ఐదుగురు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆజాద్‌కు అత్యంత సన్నిహితులైన వీరంతా.. ఆయన బాటలోనే నడుస్తామని తేల్చి చెప్పారు. ఆజాద్ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కశ్మీర్ నేతల్లో జీఎం సరూరి, హజి అబ్దుల్ రషీద్, మొహమ్మద్ ఆమిన్ భట్, గుల్జర్ అహ్మద్ వాని, చౌదరి మహ్మద్ అక్రమ్ ఉన్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్ అభ్యన్నతి కోసమే తాను ఆజాద్‌తో కలిసి ముందుకుసాగాలనుకుంటున్నట్లు చిబ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోల్పోయిందన్నారు. అందకే పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూ వస్తోందని చెప్పారు. చదవండి: బీజేపీతో టచ్‌లో లేను.. ఆజాద్ క్లారిటీ -
పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరం, బాధాకరం అని కాంగ్రెస్ తెలిపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతున్న సమయంలో ఆయన రాజీనామా చేయడంపై విచారం వ్యక్తం చేసింది. ఆజాద్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, జైరాం రమేశ్ మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయంపై స్పందించారు. ఆజాద్ రాజీనామా లేఖలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జైరాం రమేశ్ అన్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు జైరాం రమేశ్. గులాం నబీ ఆజాద్ డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఎంతో గౌరవించిందని అన్నారు. కానీ అతను మాత్రం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాజీనామా లేఖలో ఆజాద్ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన అసలు రంగుకు నిదర్శనమన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఐదు పేజీల లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. 2013లో రాహుల్ గాంధీ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాశనమైందని ఆరోపించారు. సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు రాహుల్ త్వరలో చేపట్టబోయే 'భారత్ జోడో యాత్ర'పైనా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు ముందు 'కాంగ్రెస్ జోడో యాత్ర' చేపట్టాల్సిందని సైటెర్లు వేశారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని లేఖ రాసిన జీ-23 నేతలను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. గౌరవం ఉండదు.. మరోవైపు ఆజాజ్‌కు ఇకపై గౌరవం దక్కకపోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఆయనపై గతంలో ఎంతో ప్రేమ చూపించామన్నారు. కాంగ్రెస్‌కు గతంలోనూ ఇలా జరిగిందని, ఆ తర్వాత మళ్లీ పుంజుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఆహ్వానం.. కాంగ్రెస్ తనను తానే నాశనం చేసుకుంటోందని ఆజాద్ అన్నదాంట్లో తప్పేంలేదని బీజేపీ నేత కుల్దీప్ బిష్ణోయ్ అన్నారు. ఆయనను కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే తానే ఆజాద్‌తో సంప్రదింపులు జరిపి తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ఆజాద్ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్ -
కాంగ్రెస్‌కు యువనేత గుడ్‌బై.. సోనియా, రాహుల్, ప్రియాంకపై విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మరో యువనేత షాక్ ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్న 39 ఏళ్ల ఈ యువనేత.. పార్టీకి, అధికార పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. ఈమేరకు రాజీనామా లేఖను సోనియాకు పంపారు. అంతేకాదు పార్టీని వీడుతూ గాంధీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రస్తుత యువత, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండటం లేదని జైవీర్ ఆరోపించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల అపాయింట్మెంట్ కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా.. అనుమతి దొరకడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తిపూజ చెదపురుగులా తినేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో జరిగే విషయాలకు పార్టీ నిర్ణయాలకు పొంతన ఉండట్లేదన్నారు. గత ఎనిమిదేళ్లుగా పార్టీ నుంచి తాను ఏమీ తీసుకోలేదని షెర్గిల్ అన్నారు. తానే పార్టీ కోసం చాలా చేశానని చెప్పుకొచ్చారు. లాయర్ అయిన జైవీర్ కాంగ్రెస్‌కు కీలక అధికార ప్రతినిధుల్లో ఒకరు. ఈ నెలలో ఇప్పటికే గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో సంస్కరణలు తీసుకురావాలని అసంతృప్తి వ్యక్తం చేసిన జీ-23 నేతల్లో ఈ ఇద్దరూ ఉన్నారు. చదవండి: ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగవుతుంది.. బిహార్ నుంచే పతనం మొదలైంది.. -
పీకల్లోతు కష్టాల్లో కాంగ్రెస్.. ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు
కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. రోజుకొక పరిణామం ఆ పార్టీ నాయకత్వానికి కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబో అని తప్పుకుంటున్నారు. పార్టీ కీలక పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు సీనియర్లు ఏకంగా పార్టీనే వీడుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే ఆనంద్ శర్మ ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పుకోవడం పార్టీకి పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జమ్మూకశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ కు కాంగ్రెస్ సిద్ధం మవుతున్న దశలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెబుతున్నారు. ఆనంద్‌శర్మ, ఆజాద్ ఇద్దరూ... జీ-23 గ్రూపులో కీలక సభ్యులుగా ఉన్నారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు తేవాలని.. బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ఎన్నికైన కార్యవర్గాలు ఉండాలని కొంతకాలంగా జీ-23 గ్రూప్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచింది. ఈమేరకు రెండేళ్ల క్రితమే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి ఈ గ్రూపు నేతలు లేఖలు కూడా రాశారు. పార్టీలో అవమానం జరిగిందని.. తన గౌరవానికి భంగంకలిగితే సహించేదిలేదంటూ... సోనియాకు రాసిన రాజీనామా లేఖలో ఆనంద్‌శర్మ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు. అయితే పార్టీని ధ్వంసం చేయడానికి కాంగ్రెస్‌లోనే అంతర్గత కుట్ర జరుగుతోందని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్‌శర్మ చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇద్దరు గాంధీలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితం కావాలా? అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై ఎటాక్ చేశారు. గత కొన్నాళ్లుగా ఎంతోమంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. సుమారు 30 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో అనుబంధమున్న కపిల్ సిబల్ లాంటి వారు కూడా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఎస్పీ మద్దతులో స్వతంత్ర అభ్యర్ధిగా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రశాఖ చీఫ్ సునీల్ జాఖడ్ కూడా 50 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరారు. కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి అశ్వనీకుమార్, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కూడా హస్తం పార్టీలో ఇమడలేమంటూ బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూడా పార్టీతో కటీఫ్ చేసుకున్నారు. ప్రజల సెంటిమెంట్లను కాంగ్రెస్ గౌరవించలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్ గత ఏడాది పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది. పంజాబ్ లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది. అధికారాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్‌సభకు ఎన్నికలున్నాయి. కీలకమైన ఈ తరుణంలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నాయి. పార్టీని ఎలా దారిలో పెట్టాలో కూడా కాంగ్రెస్‌కు సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొన్నాళ్లుగా జరిగిన అన్ని ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతుండడం కూడా కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని అంటున్నారు. -బొబ్బిలి శ్రీధరరావు, సాక్షి ప్రతినిధి -
Narinder Batra: మూడు పదవుల నుంచి అవుట్
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. సోమవారం కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. -
లంకకు 20న కొత్త అధ్యక్షుడు
కొలంబో/ఐరాస: కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్లగుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లో సేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు.