వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు
కువైట్: ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ మద్దతు తెలిపింది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్లుగానే మంత్రులు తమ పదవులను తృణ పాయంగా భావించి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఆమరణ దీక్షకు కూర్చున్న ఎంపీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కన్వీనర్ బాలిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన టీడీపీ నాయకుల చేతనే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా నినాదం పలికించారు. వైఎస్ జగన్ వల్లనే నేటికి ప్రత్యేక హోదా సజీవంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం లోక సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన పార్లమెంట్ సభ్యులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యుల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అవసరమని పార్లమెంట్ సాక్షిగా ఒక నాయకుడు అన్నారు. అంతేకాక తిరుపతిలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. నాటకాల రాయుడు సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి 10 సంవత్సరాలు కాదు.. 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని ఆనాడు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉసారవెల్లి రంగులు మార్చినట్లు మాటలు మారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మన రాష్ట్రానికి సీఎం కావడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టమని కో కన్వీనర్లు ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, ఇంఛార్జ్‌లు కె. రమణ యాదవ్, రవీంద్ర నాయడు, సలహాదారుడు నాడిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, యూత్ ఇంచార్జ్ మర్రి కల్యాణ్, ఎస్సీ, ఎస్టీ ఇంచార్జ్ బి.ఎన్ సింహా, కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి, యూత్ సభ్యుడు బాలకృష్ణ రెడ్డి, సేవాదళ్ వైఎస్ ఇంచార్జ్ కె. నాగసుబ్బారెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment