MPs
-
ఏపీ ప్రయోజనాలు వదిలేశారు: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: పోలవరం ఏపీకి జీవనాడి అని,పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, గురుమూర్తి, గొల్ల బాబూరావు, మేడ రఘునాథ్‌రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) మీడియాతో మాట్లాడారు.‘150 టీఎంసీల సామర్థ్యం 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపైన దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.ఉద్యోగస్తులందరికీ వెంటనే జీతాలు చెల్లించాలి. స్టీల్ ప్లాంట్‌కు ప్లాంటుకు అవసరమైన గనులు కేటాయించాలి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలు మాట్లాడాలి. వ్యక్తిగతంగా మా పైన, మా పార్టీ అధ్యక్షుడిపైన మాట్లాడడం మానుకోవాలి. మిర్చి రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది. మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ హయాంలో మేము మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నాం’అని వైవీసుబ్బారెడ్డి తెలిపారు.ఎత్తు తగ్గిస్తే బనకచర్లకు నీళ్లు సాధ్యం కాదు: మిథున్రెడ్డిపోలవరం ప్రాజెక్టుకు రూ. 60 వేల కోట్ల ఖర్చు అవుతుందికానీ కేవలం రూ. 30,000 కోట్లతో ముగించాలని చూస్తున్నారుపోలవరం ఎత్తు తగ్గించడం వల్ల బనకచర్లకు నీళ్లు తరలించడం సాధ్యం కాదుఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం 45 మీటర్ల ఎత్తు ఉండాలిరాష్ట్రం నష్టపోతుంటే, టీడీపీ ఎంపీలు చూస్తూ కూర్చుంటున్నారురాష్ట్రంలో మెడికల్ సీట్లను సరెండర్ చేసేలా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందివ్యక్తిగత ఆరోపణలకు పార్లమెంటును వేదికగా మార్చుకోవద్దు సీఎం రమేష్‌పై మిథున్‌రెడ్డి ఫైర్ మద్యం విషయంలో తనపై సీఎం రమేష్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మంగళవారం(ఫిబ్రవరి11) లోక్‌సభలో అన్నారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవాలని చురకంటించారు. మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమపై సీఎం రమేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి కుంభకోణం అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌పై విచారణ జరగాల్సిందేనని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఏపీపై కేంద్రం చిన్నచూపు: పిల్లి సుభాష్చంద్రబోస్బీహార్కు ఇచ్చిన ప్రాధాన్యత ఏపీక ఇవ్వడం లేదుటీడీపీ ఎంపీలు రాజకీయ ద్వేషంతో చేసే వ్యక్తిగత విమర్శల వల్ల ఉపయోగం లేదుపార్లమెంటును రాష్ట్ర ప్రయోజనాల కాపాడేందుకు సద్వినియోగం చేసుకోవాలిటీడీపీ ఎంపీలు పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారుమేము మాట్లాడుతుంటే అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదుపోలవరం ఎత్తు తగ్గింపు రైల్వే జోను ఇతర అంశాలపై ఐక్యంగా పోరాడుదాంఏపీలో వ్యవసాయం సంక్షోభంలో పడిందిరైతులను ఆదుకోవాలని మేము అడుగుతుంటే టీడీపీ వారు సభలో అడ్డుకుంటున్నారురైతులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారు: వైఎస్ అవినాష్రెడ్డివిభజన సమయంలో ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయించడం చంద్రబాబు రాజీ పడ్డారు25 వేలకోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదాను వదిలేశారుపోలవరం ఎత్తును కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించిందిరూ. 57 వేలకోట్లకుగాను 30 వేలకోట్ల రూపాయలకు పోలవరాన్ని పరిమితం చేశారు 27 వేల కోట్ల గ్రాంట్ వదిలేశారు ఫలితంగా అమరావతికి 15000 కోట్ల అప్పు సాధించారు పోలవరం ఎత్తును, కెపాసిటీ తగ్గించి రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారు16 మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు కాపాడడం లేదు చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారుమేము ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్‌ను తీసుకొస్తే చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారుదాని ఫలితంగా ఆయన మహారాష్ట్రకు వెళ్లిపోయి మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారుచంద్రబాబు చర్యల వల్ల యువత రైతులు నష్టపోయారు 9 నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు ఏ వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు రాజీపడుతున్నారుకూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలను మానుకోవాలి:గురుమూర్తితిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడికి పాల్పడ్డారుప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులో ఖూనీ చేశారూఒక్కరే సభ్యులు ఉన్న టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది పార్లమెంట్లో రాష్ట్రం పరువు తీయొద్దుశిఖండి తరహా రాజకీయాలకు పాల్పడవద్దుమాపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడుతున్నారుసంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేస్తున్నారు:గొల్లబాబూరావుసూపర్ సిక్స్ పేరుతో జనం చెవులలో ఊదరగొట్టారుఒక్క హామీ కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారుచంద్రబాబు వల్ల మోసపోయామని జనం అంటున్నారువైఎస్ జగన్ మాటిస్తే వెనక్కి పోరురాష్ట్ర ప్రయోజనాలపై మేము టీడీపీతో కలిసి వస్తాంతమిళనాడు కర్ణాటక ఎంపీల తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలిఏపీకి న్యాయం జరగాలనే మా పోరాటం: మేడ రఘునాథ్రెడ్డితిరుపతి ఐఐటీకి అదనపు నిధులు కావాలితిరుపతిని నూతన రైల్వే డివిజన్ చేయాలని సభలో కోరాపార్లమెంటులో ఏపీ పరువు తీయొద్దుసాధ్యమైనంత ఎక్కువగా ఏపీకి నిధులు వెళ్లేలా మేమే చొరవ తీసుకుంటున్నాంవ్యక్తిగత విమర్శలుమాని, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ఎంపీలు పనిచేయాలి -
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
మరో వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: వెనుకబడిన వర్గాలకు టీడీపీ మరో వెన్నుపోటు పొడిచింది. ముగ్గురు బీసీ రాజ్యసభ సభ్యులు చేత చంద్రబాబు రాజీనామా చేయించారు. రాజ్యసభ అభ్యర్థులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, డిసెంబర్ 20న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయించగా.. మోపిదేవి, ఆర్. కృష్ణయ్యలకు ఆ స్థానాలు ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది.డీల్ కుదుర్చుకున్న బీద మస్తాన్‌రావుకి మాత్రమే టీడీపీ రెన్యూవల్ చేయనుంది. మోపిదేవి, ఆర్ కృష్ణయ్య స్థానాలు బాగా డబ్బున్న వారికే ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ రాజ్యసభ రేస్‌లో సానా సతీష్, గల్లా జయదేవ్, కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్, లింగమనేని రమేష్‌లు పోటీ పడుతుండగా, మూడు స్థానాల్లో ఒక రాజ్యసభ కోసం బీజేపీ పట్టుబడుతోంది.ఇదీ చదవండి: టీడీపీలో పదవుల నైరాశ్యం -
రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధ్ రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు మంగళవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయ భారతిని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎవరెవర్ని అరెస్టు చేశారు, మోపిన కేసుల వివరాలని్నంటినీ ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ అరెస్టులపై తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు.కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు..అనంతరం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం బీఎన్ఎస్ సెక్షన్ 111 పెట్టడం ఘోరమని అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులయిన 57 మందిపై అక్రమ కేసులు పెట్టారని, పోలీసుల వేధింపుల కారణంగా 12 మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. హింసించి, భయపెట్టి వారికి అనుకూలమైన స్టేట్మెంట్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను ఐదు రోజులు అక్రమంగా నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. శాంతియుతంగా ఉన్న తమ కార్యకర్తలు తిరగబడితే ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎక్కడకి వెళతాయో తెలియదని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు. తాము ఇప్పటివరకు డిఫెన్స్ ఆడామని, ఇక అఫెన్స్ మొదలు పెడితే తట్టుకోలేరని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయలేకే ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఎంపీ మేడా రఘునాధ్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు తాము అండగా ఉంటామని, వారిపై జరుగుతున్న వేధింపులను అరికడతామని ఎంపీ డాక్టర్ తనూజరాణి భరోసా ఇచ్చారు. -
కేంద్ర సంప్రదింపుల కమిటీల్లో ఎంపీలకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ/కాజీపేట రూరల్: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు లభించింది. టెక్స్టైల్స్ శాఖ కమిటీలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం కల్పిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలు గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్‌గా ఆ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ వ్యవహరించనుండగా, సభ్యునిగా చామలకు అవకాశం దక్కింది.ఈ కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటు ఎనిమిది మంది లోక్‌సభ, నలుగురు రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి.. మొత్తం 14 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ సంప్రదింపుల కమిటీలో ఎంపీలు మల్లు రవి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్యలకు చోటు దక్కింది. కమిటీకి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏడుగురు చొప్పున 14 మంది, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 16 మంది సభ్యులతో ఈ కమిటీ పని చేయ నున్నట్లు ఆయా మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్మెంట్కు కృషి సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం దక్షిణ మ«ధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.జైన్‌తో తెలంగాణ, కర్ణాటక ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. -
పార్లమెంటరీ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలకు చోటు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గొల్ల బాబురావు, కెమికల్ ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మేడ రఘునాథ్ రెడ్డి.. గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గుమ్మ తనుజారాణి, పెట్రోలియం నాచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గురుమూర్తి, కమ్యూనికేషన్స్ ఐటి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు -
ముగ్గురు ఎంపీలను బాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి
సాక్షి,విజయవాడ:ముగ్గురు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలను సంతలో పశువుల్లాగా కొనుగోలుచేసి వారితో రాజీనామా చేయించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈమేరకు విజయసాయిరెడ్డి మంగళవారం(సెప్టెంబర్24) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.‘చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయి.వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు.మాటలతో గానీ,ప్రవర్తనతో గానీ మంచి వారిని బాధిస్తే నరకం వస్తుందని ధర్మశాస్త్రం చెబుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఇతనిని శిక్షించడా? హిందూ ధర్మశాస్త్రం/కర్మ సిద్ధాంతం చంద్రబాబుకు వర్తించదా? మరి ఇతడు పుట్టిన దగ్గరనుండి ఇతరులను వేధిస్తూనే పెరిగాడు.1/5:. ముగ్గురు వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులను సంతలో పశువుల్లాగా కొనుగోలుచేసి వారిచేత రాజీనామా చేయించిన చరిత్ర హీనుడు చంద్రబాబు. @ncbn 2/5:. చంద్రబాబు అబద్ధాల పొదిలో ఎన్నో విషపు బాణాలుంటాయి. వాటిని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ వావివరుసలు లేకుండా నచ్చని వారిని ఉక్కిరిబిక్కిరి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 202475ఏళ్ళు వచ్చాయి. ఇంకా బాధిస్తూనే వున్నాడు.ఇతని పాపాలను చూసి దేవుడు కూడా దడుచుకున్నాడేమో అనిపిస్తున్నది.ఏది ఏమయినా బాధ పడుతున్నది ప్రజలు..ఎదుటివాళ్ళేగా.చంద్రబాబు బాగానే ఉన్నాడు.ఏ కోర్టులు ఇతడికి శిక్షలు వేయలేవు.చంద్రబాబు లాంటి వాళ్ళ గురించి జంధ్యాల పాపయ్యశాస్త్రీ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికే అత్తరు.మా మొగాన కన్నీరా మీ మొగాల పన్నీరా.కర్మల ప్రతికూల ఫలాలు ఈ జన్మలోనే తప్పక అనుభవిస్తావు చంద్రబాబు!’అని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాకు యూట్యూబ్ ఛానల్ లేదు: ఆర్కే రో జా -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్‌సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్‌గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బుధవారం శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతుంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఈ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదు అని వెల్లడించారు.గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేవీల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10మంది పిల్లలను సిఫార్సు చేయొచ్చు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికి కలిపి 7880 మంది విద్యార్ధులను కేవీల్లో చేర్పించే అధికారం ఉండేది. ఇలా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు కోటాలను కేంద్రం 2022 ఏప్రిల్‌లో రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది. -
పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అయిన కురియన్ కమిటీ
-
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
లోక్‌సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
Parliament Special Session: సభ్యుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: లోక్‌సభ తొలిరోజు సమావేశాల్లో ప్రమాణస్వీకార పర్వం కొనసాగింది. సోమవారం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్యానెల్ స్పీకర్లు రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తేలు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌లో భర్తృహరి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణంచేయించారు. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం అయిన వెంటనే వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. అనంతరం 11:07 గంటలకు ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఎంపీగా హిందీలో ప్రమాణం చేయడంతో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. ప్రధాని తర్వాత ప్యానెల్ స్పీకర్లు రాధామోహన్, కులస్తేలు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రిమండలి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. ముందుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. తర్వాత స్వతంత్ర హోదా ఉన్న సహాయకమంత్రులు తర్వాత సహాయక మంత్రులు ప్రమాణంచేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో ‘నీట్ ఫెయిల్డ్ మినిస్టర్’, నీట్–నెట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. తర్వాత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు కె.సురేశ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ్లు స్పీకర్ప్యానెల్ సభ్యులుగా ప్రమాణంచేయలేదు. ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన దళిత నేత సురేశ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపికచేయనందుకు నిరసన తెలపాలని విపక్షపార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ముగ్గురు ప్యానెల్ స్పీకర్ల పదవులకు దూరంగా ఉండిపోయారు. ప్రమాణస్వీకారం మొదలుకాగానే సురేశ్, టీఆర్ బాలు, సుదీప్‌లు సభ నుంచి వాకౌట్‌చేశారు. ప్యానెల్ సభ్యుల ప్రమాణంవేళ ‘ రాజ్యాంగ ఉల్లంఘన’ అని విపక్షసభ్యులు నినాదాలు చేశారు. తర్వాత అక్షరమాల ప్రకారం రాష్ట్రాలవారీగా సభ్యులు ప్రమాణంచేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.పలు భాషల్లో ప్రమాణాలుప్రమాణస్వీకారం వేళ సభలో భాషా వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణంచేశారు. ఇంగ్లిష్‌తోపాటు సంస్కృతం, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, తదితర భాషల్లో ప్రమాణంచేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, ఖట్టర్ హిందీలో ప్రమాణంచేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి కన్నడలో, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడియాలో, పోర్ట్‌లు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సామీలో, విద్యుత్, పునరుత్పాదక ఇంధన సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ సంస్కృతంలో, పర్యాటకం, పెట్రోలియం మంత్రి సురేష్ గోపి మలయాళంలో సభ్యులుగా ప్రమాణంచేశారు. లోక్‌సభ ప్రారంభానికి శుభసూచకంగా సభ్యులంతా తొలుత లేచి నిలబడి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.తొలి వరుసలో రాహుల్, అఖిలేశ్సభలో విపక్షాలకు కేటాయించిన కుర్చీల్లో మొదటి వరుసలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ, ఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లు కూర్చున్నారు. మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మూడో వరుసలో కూర్చున్నారు. తొలిసారి సభకు ఎన్నికైన దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె భాన్సురీ స్వరాజ్ సభలో అందరినీ పలకరిస్తూ కనిపించారు. సెల్ఫీలు దిగారు. ఎస్పీ సభ్యులు ఎర్రని టోపీలు, ఎర్ర కండువాలు ధరించి హిందీలో ముద్రించిన రాజ్యాంగ ప్రతులను పట్టుకొచ్చారు.సభలో హైలైట్స్→ రైతు నేత, సీపీఐ (ఎం) ఎంపీ ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్‌కు వచ్చారు.→ కొందరు సభ్యులు తమ రాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.→ ‘రేసుగుర్రం’ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ధోతీలో అలరించారు.→ తొలిసారి ఎంపీగా గెలిచిన మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు అనిత నగర్‌సింగ్ చౌహాన్ వేళ్లకు పెద్ద ఉంగరాలు, మెడలో భారీ సంప్రదాయ నగలతో సభకు వచ్చారు. → శ్వేతవర్ణ చీరకట్టులో మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.→ తిహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు. → టీవీ రాముడు అరుణ్ గోవిల్ అందరితో మాట్లాడుతూ కనిపించారు. → మోదీ ప్రమాణం చేసేటపుడు ఎన్డీఏ నేతలంతా జైశ్రీరాం అని నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష సభ్యులంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు. కొందరు సభ్యులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వచ్చారు -
రాజ్యాంగం వర్ధిల్లాలి.. ‘ఇండియా’ ఎంపీల నినాదాలు
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో గాం«దీజీ విగ్రహం ఉన్నచోట విపక్ష ఎంపీలు గుమికూడారు. రాజ్యాంగం ప్రతులను చేతబూని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటూ బిగ్గరగా నినదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం జోలికి రావొద్దు: రాహుల్ పవిత్రమైన మన రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నిస్సిగ్గుగా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష కూటమి సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగంపై ఎవరు దాడికి దిగినా సహించబోమని తేలి్చచెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని టచ్ చేయలేదని తేలి్చచెప్పారు. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల గొంతుకను సభలో వినిపిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి మోదీ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తొలి 15 రోజుల్లో ఎన్నో ఘోరాలు, ప్రమాదాలు జరిగాయని, పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని, ధరలు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు. -
లోక్‌సభ: వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరికొందరు రేపు(మంగళవారం) ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రమాణం చేశారు. ఇంగ్లీషులో పీవీ మిథున్ రెడ్డి, తెలుగులో గురుమూర్తి , హిందీలో డాక్టర్ గుమ్మ తనూజరాణి ఎంపీలుగా ప్రమాణం చేశారు.కాగా, బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.ప్రత్యేక హోదాపై గళం విప్పుతా..: గురుమూర్తి, తిరుపతి ఎంపీవైఎస్ జగన్ ఆశీస్సులు, తిరుపతి ప్రజల మద్దతుతో రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉంది. పులికాటు సరస్సు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తీసుకురావడం నా ప్రాధాన్యత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉన్నా టీడీపీ అడగకపోవడం బాధాకరం. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్లో గళం విప్పుతా.. ఈ ఐదేళ్లు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం వైద్య సదుపాయాలు కోసం కృషి చేస్తా: గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీనాకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు. అరకు పార్లమెంట్లో వైద్య సదుపాయాలు, రోడ్లు మెరుగుపరచడానికి కృషి చేస్తా. వైఎస్సార్సీపీ కండువాతో ప్రమాణ స్వీకారం చేశా. నేను పార్టీ మారి ప్రసక్తే లేదు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ తోనే కలిసి ప్రయాణం చేస్తాం. -
Parliament Session: లోక్‌సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్‌ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్‌సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్‌లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్‌సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ భేటీ
-
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
-
వైఎస్ఆర్ సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం
-
మరికాసేపట్లో YSRCP పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం
-
నా వయసు చిన్నదే.. మళ్లీ అధికారంలోకి వస్తాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు.వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్.. ‘‘గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం... విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లాం. అవినీతికి చోటులేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూనలదిశగా అడుగులు వేశాం. .. భవిష్యత్తు తరాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లిషు మీడియం, టోఫెల్, ఆరో తరగతి నుంచి డిజిటల్ టీవీలు, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులు అందించాం. ఐబీ సిలబస్‌ని కూడా తీసుకు వచ్చాం. ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం. నాణ్యమైన విద్యాను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేదిశగా ఐదేళ్లలో అడుగులు వేశాం. .. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఎప్పుడూ చూడవిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం. ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోంది. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి’’ అని అన్నారారయన.వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్.. ‘‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది. కానీ, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయి. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే… సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుంది... వైఎస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయి. గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి. రానున్న రోజుల్లో ఈ 10శాతం ప్రజలే… మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు. మనలో పోరాటపటిమ తగ్గకూడదు... నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి’’ అని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.‘‘పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటంచేయాలి. 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియదు. ఈసారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి.... పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలి. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి. ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలి. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం.YSRCP పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డిపార్టీ తరఫున పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డి(రాజ్యసభ ఎంపీ) ఎన్నుకుంటున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు’’ అని వైఎస్ జగన్ తెలిపారు. ‘‘అందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలి. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోండి. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి.మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయి. పార్టీకోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ చదవండి: నిబ్బరంతో నిలబడదాం.. భవిత మనదే: వైఎస్ జగన్ -
మోదీ కేబినెట్ లో తెలుగు మంత్రులు
-
కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
సాక్షి, విజయవాడ: కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. ఒక సీనియర్, ఇద్దరు జూనియర్ ఎంపీలకు ఛాన్స్ లభించింది. ఒక బీసీ, ఇద్దరు ఓసీలకు కేబినెట్లో స్థానం లభించింది. కేంద్ర కేబినెట్లో కింజరాపు రామ్మోహన్నాయుడికి స్థానం దక్కగా.. మూడు సార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్ పదవిని రామ్మోహన్ దక్కించుకున్నారు.టీడీపీలో రెండో మంత్రి పదవిని పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని చంద్రశేఖర్.. తొలిసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరి, ఎంపీ సీటును పెమ్మసాని దక్కించుకున్నారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి ఎంపీగా శ్రీనివాస వర్మ ఎన్నికయ్యారు. పురందేశ్వరి, సీఎం రమేష్‌లకు తొలి కేబినెట్లో అవకాశం దక్కలేదు. క్షత్రియ, కమ్మ, కొప్పుల వెలమ సామాజికవర్గాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.శ్రీనివాస్ వర్మ ప్రొఫైల్..క్షత్రియ వర్గానికి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ 1967 ఆగస్టు నాలుగున భూపతి రాజు సూర్యనారాయణరాజు దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఈయన విద్యాపరంగా డబుల్ ఎంఏ చేయడంతో పాటుగా ఎం ఎల్ లిటరేచర్, బిఎల్ కూడా చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యులు. 1991లో బీజేపీ పార్టీలో చేరిన శ్రీనివాస్ వర్మ 95 వరకు బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్‌గా, 95 నుండి 97 వరకు భీమవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్‌గా, 97 నుంచి 99 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా.. 99 నుంచి 2001 వరకు నర్సాపురం పార్లమెంటు కన్వీనర్‌గా, 2001 నుండి 2003 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా, 2003 నుంచి 2009 వరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీగా పోటీ చేసి పరాజయం చెందారు. 2010 నుంచి 2018 వరకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా, 2020 నుండి 2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. భీమవరం మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా, ప్యానల్ చైర్మన్‌గా, డీఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీగా, భూపతి రాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్‌గా, భీమవరం బిల్డర్స్ అసోసియేషన్‌కు గౌరవ ప్రెసిడెంట్‌గా కూడా శ్రీనివాస్ వర్మ సేవలందించారు. -
లోక్ సభ ఎంపీ జీతం ఎంత ?
-
15న లోక్‌సభ తొలి భేటీ!
-
హస్తినకు చేరుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు
-
Lok Sabha Election Results 2024: ఏకంగా 280 కొత్త ముఖాలు
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభలో ఏకంగా 280 మంది ఎంపీలు మొదటిసారిగా దిగువసభకు ఎన్నికైన వారున్నారు. ఇందులో మాజీ సీఎంలు, సినీ తారలు, వారసులు, హైకోర్టు మాజీ జడ్డి తదితరులున్నారు. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 45 కొత్తముఖాలు కనిపించునున్నాయి. వీరిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, జెయింట్ కిల్లర్ కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలుండగా 33 మంది తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. స్కూల్ టీచర్ భాస్కర్ భాగ్రే ఎన్సీపీ (పవార్) తరఫున ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం డిండోరి నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కూడా లోక్‌సభకు రావడం ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే (మహారాష్ట్ర), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), జితిన్‌రామ్ మాంఝి (బిహార్), బస్వరాజ బొమ్మై (కర్నాటక), జగదీశ్ షెట్టర్ (కర్నాటక), చరణ్‌జిత్ సింగ్ చన్నీ (పంజాబ్)లు తొలిసారిగా దిగువసభలో అడుగుపెట్టనున్నారు. సినీ తారల్లో సురేష్ గోపి (త్రిసూర్), కంగనా రనౌత్ (మండి)లు తొలిసారి నెగ్గినవారే. రాజకుటుంబీకుల్లో ఛత్రపతి సాహు (కొల్హాపూర్), యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ (మైసూర్), కీర్తి దేవి దేవ్బర్మన్ (త్రిపుర ఈస్ట్)లు, ఎన్నికలకు ముందు హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పశి్చమబెంగాల్‌లోని తమ్లుక్ నుంచి పోటీ చేసిన గెలిచిన అభిజిత్ గంగోపాధ్యాయ్లు మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారే. ముస్లిం ఎంపీలు 24 మంది నూతన లోక్‌సభకు 24 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (టీఎంసీ), అసదుద్దీన్ ఓవైసీ, అస్సాంలో 10 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌లు ఉన్నారు. ఈసారి మొత్తం 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీచేయగా 24 మంది గెలిచారు. కిందటి లోక్‌సభలో 26 మంది ముస్లిం ఎంపీలు ఉండగా.. ఈసారి వారి సంఖ్య రెండు తగ్గింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికకాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి నలుగురు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ముగ్గురు ముస్లింలు ఎంపీలుగా గెలిచారు. -
పార్లమెంట్లో డిష్యుం.. డిష్యుం
చట్ట సభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. ఒక్కోసారి అవి శ్రుతి మంచి దాడులకు దారి తీసిన దాఖలాలు లేకపోలేదు. అయితే తైవాన్‌లో ఆ పరిస్థితి ముష్టి యుద్ధానికి దారి తీసింది. పార్లమెంట్‌లోనే చట్ట సభ్యులు తన్నుకున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నూతన సంస్కరణలపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.పార్లమెంట్లో తప్పుడు ప్రకటనలు చేసే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేసిన తైవాన్ పార్లమెంట్ చట్టం చేయాలనుకుంది. ఇందుకుగానూ చట్ట సభ్యులకు అధిక అధికారం కట్టబెట్టే చట్ట ప్రాతిపాదనలపై శుక్రవారం చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం డిష్యుం.. డిష్యుంకి దారి తీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. ఇష్టానుసారం తన్నుకున్నారు. รัฐสภาไต้หวันวุ่น นักการเมืองทะเลาะกันนัว หลังไม่มีพรรคใดครองเสียงข้างมากกระทบการลงมติ #ทันโลกกับไทยพีบีเอส #ThaiPBS #ไต้หวัน #taiwan pic.twitter.com/M2Fkmf5f5T— ทันโลกกับThaiPBS (@TanlokeThaiPBS) May 18, 2024 మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగం అయ్యారు. జుట్టు జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. కిందపడి పడి గుద్దులు గుద్దుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఎంపీ అక్కడి బిల్లు సంబంధిత ఫైల్స్‌ను తీసుకుని బయటకు పరిగెత్తడం బాగా వైరల్ అయ్యింది. 🚨🇹🇼#BREAKING: A member of Taiwan's parliament stole a bill and ran off with it to prevent it from being passed.LMFAOOOOOO 😭😭😭pic.twitter.com/CxcmWCusAI— Censored Men (@CensoredMen) May 17, 2024డెమొక్రటిక్ ప్రొగెసివ్ పార్టీ, కువోమింటాంగ్ పార్టీ ఎంపీల మధ్య చర్చ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘర్షణలకు కారణమైంది. మరికొందరు స్పీకర్ కుర్చీ చుట్టు చేరడం, టేబుళ్ల మీద నుంచి దూకడం ఆ వీడియోలలో చూడొచ్చు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ గలాట.. మధ్యాహ్నం దాకా కొనసాగింది. తైవాన్ పార్లమెంట్లో 113 సీట్లు ఉన్నాయి. తైవాన్ నూతన అధ్యక్షుడు లై చింగ్ టె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందే పార్లమెంట్ రణరంగంగా మారడం గమనార్హం. విశేషం ఏంటంటే.. చట్ట సభలో మెజారిటీ లేకున్నా చింగ్ టె అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం.డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో.. టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది. -
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్‌సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్‌లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్‌లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్‌లో 8, బిహార్‌లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువ భారత్‌కు వయసు మళ్లిన ఎంపీలు!
భారత్ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్‌ను యువ దేశం అని పిలుస్తారు. దేశమయితే యువతది కానీ.. పరిపాలిస్తున్నవారు మాత్రం వయసు మల్లినవారు. గత 20 ఏళ్లలో ఎన్నికైన ఎంపీల సగటు వయసును పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.ఇప్పటివరకూ 17 లోక్‌సభలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1999లో 13వ లోక్‌సభ నుంచి 2019లో 17వ లోక్‌సభ వరకూ ఎన్నికైన ఎంపీల సగటు వయసు 50 ఏళ్లు దాటింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీలైనవారి సగటు వయసు అయితే ఏకంగా 55 ఏళ్లకు చేరడం గమనార్హం. ఎంపీగా పోటీ చేయడానికి భారత రాజ్యాంగం నిర్దేశించిన వయసు 25 ఏళ్లే అయినా ఎన్నికవుతున్న ఎంపీల సగటు వయసు 55 ఏళ్లు తాకింది. ఎంత ఎక్కువ మంది వయసు మళ్లినవారు ఎంపీలుగా ఎన్నికవుతున్నారంటే అంత ఎక్కువగా యువత ప్రాతినిధ్యం తగ్గుతోందని అర్థం.17వ లోక్‌సభకు ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడైన ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బార్క్. ఈయన ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక ఇదే లోక్‌సభలో అత్యంత పిన్నయస్కురాలైన ఎంపీ చంద్రాని ముర్ము. ఒడిశాలోని కియోంజార్ స్థానం నుంచి ఈమె గెలుపొందారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతీయ జనాభాలో దాదాపు 11 శాతం మంది 25-30 ఏళ్ల వయస్సులో ఉన్నారు. 2019 లోక్‌సభలో, ఈ వయస్సులో 1.5 శాతం మంది ఎంపీలు కూడా లేరు. 2011 జనాభా గణన కూడా భారతీయ జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది 25-40 ఏళ్ల వయస్సులో ఉన్నారని చెబుతోంది. అయితే ఈ ఏజ్ గ్రూపు 17వ లోక్‌సభలో కేవలం 12 శాతం మాత్రమే. ఈసారి 18వ లోక్‌సభలో అయినా యువత ప్రానిధ్యం మెరుగుపడుతుందేమో చూడాలి. -
AP MP: ఎంపీ సీట్లలో ఎవరికి ఎవరు పోటీ?
-
వైఎస్సార్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం
-
ఎట్టకేలకు ఏపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
సాక్షి, విజయవాడ: లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీ 111 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి ఆరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం,, రాజంపేట, తిరుపతి ఎంపి స్ధానాలకి అభ్యర్ధుల ఖరారయ్యారు. తెలంగాణ నుంచి రెండు ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం తాండ్ర వినోద్ రావులకు టికెట్లు కేటాయించింది. ఏపీ ఎంపీ స్ధానాలకు ఖరారైన పేర్లు అనకాపల్లి- సీఎం రమేష్ అరకు- కొత్తపల్లి గీత రాజమండ్రి- పురందేశ్వరి నరసాపురం- శ్రీనివాస వర్మ రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి- మాజీ ఐఎఎస్ మరియు గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ అసలైన బీజేపీ నేతలకు దక్కని సీట్లు ఇప్పటివరకూ పోటీలో ఉన్న అసలైన బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజులకు కూడా టికెట్లు దక్కలేదు. పొత్తు పేరుతో చంద్రబాబు కొత్త ఎత్తుగడలకు జీవీఎల్, పోము వీర్రాజులకు సీట్లు దక్కలేదు. బీజేపీలో కూడా తమ వాళ్లకే సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం రచించడంతో అసలైన బీజేపీ నేతలను పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీకి సేవ చేసిన నేతలు ఈ జాబితా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు సాన్నిహిత్యంగా ఉన్నవారికి బీజేపీ టికెట్లు కేటాయించడంపై అసలైన బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నర్సాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆశించిన రఘురామకృష్ణం రాజుకు చుక్కదురైంది. రఘురామ కృష్ణం రాజుకు చంద్రబాబు మొండిచేయి చూపించగా, అక్కడ ఎంపీ టికెట్‌ను శ్రీనివాస్ వర్మకు కేటాయించింది బీజేపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా కోసం క్లిక్ చేయండి -
కవిత అరెస్టు కక్ష సాధింపే: బీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి,ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్‌గా బయటపడతామని చెప్పారు. ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు -
బీఆర్ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే..
సాక్షి, హైదరాబాద్: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్ఎస్కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు. దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యరి్థగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. మిగతా నలుగురిపై చర్చ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి బీఆర్ఎస్ నుంచి మరికొందరు ఎంపీలు నిష్క్రమించవచ్చని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత (పెద్దపల్లి) కాంగ్రెస్‌లోకి.. పి.రాములు (నాగర్‌కర్నూల్), బీబీ పాటిల్ (జహీరాబాద్) బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థులుగా బీబీ పాటిల్‌తోపాటు పి.రాములు కుమారుడు భరత్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది కూడా. బీఆర్ఎస్లోని మరో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రంజిత్‌రెడ్డి అంశంపై చర్చ జరుగుతోంది. దీంతో మొత్తంగా ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్‌ల భవితవ్యంపై స్పష్టత వచ్చిట్లయింది. మిగతా నలుగురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), పసునూరు దయాకర్ (వరంగల్), మాలోత్ కవిత (మహబూబాబాద్), మన్నె శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్)ల అడుగులు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. సర్వేల ఫలితాలు, ఎన్నికల ఖర్చును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు నేతలు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరికొందరూ పోటీకి దూరం? ప్రస్తుతం తన కుమారుడి వివాహ వేడుకల ఏర్పాట్లలో ఉన్న నామా నాగేశ్వర్రావు మరోమారు బీఆర్ఎస్ నుంచి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. మిగతా ముగ్గురిలో పసునూరు దయాకర్, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలకు తిరిగి బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ప్రస్తుతానికి నామా నాగేశ్వర్రావు (ఖమ్మం) మినహా మిగతా వారంతా పార్టీకి దూరం కావడమో లేదా పోటీ నుంచి నిష్క్రమించడమో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీలు, కొత్తవారికి పోటీ చాన్స్! వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఈ కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భేటీలు ముగిశాక వారం పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ఉద్దేశంతో కొంత యువ నాయకత్వానికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల వ్యయాన్ని భరించే శక్తి ఉన్న వారికోసం బీఆర్ఎస్ అన్వేషణ సాగిస్తున్నట్టు తెలిసింది. -
బీజేపీతో టచ్‌లో బీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. బీజేపీలోకి వచ్చేందుకు వారు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తామే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరబోతున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని, ఎవరూ పార్టీ వీడకుండా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేర్చుకోలేదని, ఇప్పుడు మునిగిపోయే నావ, ఒక్కసీటు కూడా రాని ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమైన సంజయ్, మలిదశ ప్రజాహిత యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అవినీతిపరులను రానీయం ‘కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు. ఒకవేళ అదే జరిగితే బీజేపీలో సగం మంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనుకాడతారు. కేసీఆర్ వెళ్లి కలిసినా ఎన్డీఏలో చేర్చుకునేది లేదని మోదీ తెగేసి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన బహిరంగంగానే చెప్పారు. బీజేపీకి సొంతంగానే 400 సీట్లు రాబోతున్నాయి. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించే వాళ్లు, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నోళ్లు ఎవరు వచి్చనా పార్టీ లోకి స్వాగతిస్తాం. అవినీతిపరులను మాత్రం రానీయం. ఇది మోదీ విధానం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు బహిష్కరించబోతున్నారు కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. ఈసారి బీజేపీకి ఓటేయాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు..కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు..ఎంఐఎం నేతలున్నరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు. బీఆర్ఎస్ అవినీతిపై కళ్ల ముందు ఇన్ని ఆధారాలున్నా కేసీఆర్, అప్పటి మంత్రులు, బాధ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మాట తప్పుతోంది? సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తేలి్చన తరువాత కూడా సీబీఐతో విచారణను ఎందుకు కోరడం లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ను జైల్లో వేసి, వాళ్ల ఆస్తులు జప్తు చేసే వాళ్లం..’అని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ‘తొలిదశ ప్రజాహిత యాత్రకు మంచి స్పందన లభించింది. ఈనెల 25 నుంచి మలి విడత యాత్రను కొనసాగిస్తాం. మధ్యలో మూడురోజుల పాటు (ఈ నెల 20 నుంచి) రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు బస్సు యాత్రల్లో పాల్గొంటాం. తెలంగాణలో 17కు 17 ఎంపీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ పార్లమెంట్లో బోగస్ ఓట్లు ఏరివేస్తే ఈసారి అక్కడ గెలుపు బీజేపీదే. బీఆర్ఎస్కు ఒక్కసీటు కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది..’అని సంజయ్ చెప్పారు. -
లంచ్ విత్ మోదీ!
న్యూఢిల్లీ: సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. పార్లమెంట్లో వాడీవేడి చర్చలతో అలసి మధ్యాహ్నం భోజనానికి సిద్ధమవుతున్న పలువురు విపక్ష ఎంపీలకు హఠాత్తుగా పిలుపు వచి్చంది. ప్రధాని మోదీ కలవాలనుకుంటున్నారని దాని సారాంశం. అంతా లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా పార్లమెంట్ క్యాంటిన్ వద్ద దిగి విజిటర్స్ లాంజ్‌లో వేచి చూస్తున్నారు. ‘‘పదండి. మీకో శిక్ష విధిస్తాను’ అని చమత్కరిస్తూ వారందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు. 45 నిమిషాలపాటు కబుర్లు చెప్పుకున్నారు. వారిలో బీజేపీ ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు కె.రామ్మోహన్ నాయుడు (టీడీపీ), సస్మిత్ పాత్రా (బీజేడీ), ఎన్కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ), రితేశ్ పాండే (బీఎస్పీ) ఉన్నారు. నిద్ర ఎప్పుడు లేస్తారు? ఆహార అలవాట్లు మొదలుకుని అంతర్జాతీయ వ్యవహారాలదాకా అన్ని అంశాలు అక్కడ చర్చకొచ్చాయి. రోజూ ఎన్నింటికి నిద్ర లేస్తారు బిజీ షెడ్యూల్‌ను ఎలా అలసిపోకుండా నిర్వహిస్తారు వంటి ఎంపీల ప్రశ్నలకు మోదీ సరదాగా సమాధానాలిచ్చారు. ‘‘నేనెప్పుడూ ప్రధానిని అన్న మూడ్‌లో ఉండను. మంచి ఆహారం తినాలనే మూడ్‌లోనూ ఉంటాను’’ అని చమత్కరించారు. కిచిడీ తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు. ఒకే రోజులో వేర్వేరు రాష్ట్రాల పర్యటనలు, విదేశీ ప్రయాణాలు, గుజరాత్ గురించి పట్టింపుల వంటివెన్నో విషయాలు చర్చకొచ్చాయని ఒక ఎంపీ వెల్లడించారు. ప్రాణహాని ఉందంటూ ఎస్పీజీ హెచ్చరించినా 2015లో పాకిస్థాన్‌కు వెళ్లి నాటి పీఎం నవాజ్ షరీఫ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో మోదీ వివరించారు. అందరూ అన్నం, పప్పు, కిచిడీ తిన్నాక రాగి లడ్డూ రుచిచూశారు. తామంతా కూర్చున్నది మోదీతోనేనా అనే అనుమానం ఒక్కసారిగా కల్గిందని ఒక ఎంపీ చెప్పారు. ‘‘ ప్రధానితో కలిసి భోజనం చేయడం అరుదైన అనుభవం. మేం చకచక ప్రశ్నలు అడుగుతుంటే ఆయన టకటక సమాధానాలిస్తున్నారు’’ అని మరో ఎంపీ చెప్పారు. ఇదీ చదవండి.. తాతకు భారతరత్న.. మనవడు ఎన్డీఏ కూటమిలో చేరిక -
PM Narendra Modi: మాకది దిష్టి చుక్క!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల పాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి చుక్కగా అభివర్ణించారు. దేశం అభివృద్ధి తాలూకు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు ధరించిన నల్ల దుస్తులు, ఆ పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ దేశ పురోగతి యాత్రకు దిష్టి తగలకుండా పెట్టిన ‘దిష్టి చుక్క’గా భావించవచ్చని పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారి వీడ్కోలుపై గురువారం సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. దారిచూపే దీపం మన్మోహన్ సింగ్ దేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన ఆరుసార్లు రాజ్యసభ సభ్యులయ్యారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పాటు దేశ ప్రజలకు అందించిన సహకారం, చేసిన మార్గదర్శకత్వం ఎప్పటికీ గుర్తుంటుంది. మన్మోహన్ వంటి విశిష్ట వ్యక్తులు దారి చూపే దీపం లాంటివారు. ఆయన నడవడిక నుండి సభ్యులంతా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి’’ అని సూచించారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో ఓ బిల్లుపై ఓటు వేసేందుకు మన్మోహన్æ చక్రాల కుర్చీలో వచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్ సభ్యుడిగా తన కర్తవ్యాన్ని ఎంత బాధ్యతగా నిర్వహించారో చెప్పడానికి ఇదొక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చారు. ప్రజాస్వామ్యం గురించి ఎక్కడ చర్చ జరిగినా మన్మోహన్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే’’ అని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్‌కు దీర్ఘాయుస్సు కలగాలని, ఆయన ఆరోగ్యప్రదమైన జీవనం సాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న ఇతర సభ్యులు పార్లమెంట్లో నేర్చుకున్న అంశాలను దేశ నిర్మాణం కోసం జరుగుతున్న కృషిని బలోపేతం చేయడానికి ఉపయోగించాలని కోరారు. రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సభ్యులకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన్మోహన్ రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 3న ముగియనుంది. -
విభజన హామీలపై నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్హెచ్ఏఐ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు. త్వరలో అన్ని కార్యక్రమాలకు..! ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. -
ఎల్ఐసీకి ప్రభుత్వ మినహాయింపు
న్యూఢిల్లీ: పబ్లిక్కు కనీస వాటా విషయంలో ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ వెల్లడించింది. దీంతో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కల్పించే అంశంలో పదేళ్ల గడువు లభించినట్లు తెలియజేసింది. 2022 మే నెలలో ఐపీవో ద్వారా ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు)ను విక్రయించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 96.5 శాతంగా కొనసాగుతోంది. నిజానికి ఐపీవో తదుపరి నిర్ధారిత గడువులోగా లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్కు 25 శాతం వాటాను కల్పించవలసి ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ ఒకేసారి పదేళ్లవరకూ మినహాయింపునిచ్చినట్లు ఎల్ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వెరసి 2032 మే వరకూ పబ్లిక్కు 25 శాతం వాటా కల్పించే అంశంలో వెసులుబాటు లభించినట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది(2023) మొదట్లో ప్రభుత్వం బ్యాంకులుసహా లిస్టెడ్ పీఎస్‌యూలు పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో నిబంధనల్లో సవరణలు చేపట్టింది. తద్వారా ప్రైవేటైజేషన్ తదుపరి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంపీఎస్‌ను అమలు చేయవలసిన అవసరాన్ని తప్పించింది. తొలుత పీఎస్‌యూలకు మాత్రమే ఇందుకు వీలుండగా.. ప్రభుత్వ వాటా విక్రయం తదుపరి సైతం వర్తించేలా ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపేందుకు వీలు చిక్కింది. 2021 జూలైలోనే ప్రభుత్వం అన్ని పీఎస్‌యూలకూ ఎంపీఎస్ వర్తించేలా నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
Parliament :సస్పెండెడ్ ఎంపీలు కోల్పోయేవి ఇవే !
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఈ సెషన్లో ఇప్పటివరకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి విపక్షానికి చెందిన 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒక్క లోక్‌సభ నుంచే 95 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌తో సభను అడ్డుకున్నందుకు స్పీకర్ ఎంపీలపై వేటు వేశారు. అయితే సస్పెండ్ అయిన ఎంపీలకు సంబంధించి మంగళవారం లోక్‌సభ సెక్రటేరియట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం సస్పెండెడ్ ఎంపీలు కేవలం సభలోకి రాకుండా ఉండడమే కాక ఎంపీలుగా తమకు సంక్రమించిన మరెన్నో హక్కులను తాత్కాలికంగా కోల్పోతారు. ఆ ఎంపీలకు సభతో పాటు పార్లమెంట్ చాంబర్, లాబీ, గ్యాలరీలకు కూడా ప్రవేశం ఉండదు. సాధారణంగా ఎంపీలు వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిట్టింగ్‌లలో కూర్చునే హక్కునూ సస్పెండెడ్ ఎంపీలు కోల్పోతారు. సస్పెండైన ఎంపీలు ఇచ్చే ఎలాంటి నోటీసులనూ సభలో అనుమతించరు. వారి పేరు మీద ఏ రకమైన బిజినెస్‌ను లిస్ట్ చేయరు. వీటితో పాటు ఆర్థిక పరమైన ప్రభావం కూడా సస్పెండెండ్ ఎంపీల మీద ఉంటుంది. సాధారణంగా ఎంపీలకు చెల్లించే రోజు వారి భత్యాలు కూడా సెషన్ మొత్తం సస్పెండ్ అయిన ఎంపీలకు చెల్లించరని సర్క్యులర్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఇదీచదవండి..కొరియా లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు -
లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు
ఢిల్లీ: పార్లమెంట్లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.. -
పార్లమెంట్లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈరోజు లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన లోక్‌సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU — ANI (@ANI) December 18, 2023 సస్పెన్షన్‌పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG — ANI (@ANI) December 18, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
పార్లమెంట్ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంట్లో అలజడి ఘటన తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్‌ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. పార్లమెంట్లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్‌లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. అయితే..పార్లమెంట్లో ఆగంతుకులు చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో అలజడికి సూత్రదారి? వైరల్ చేయాలని వీడియోలను షేర్ చేసి.. -
ఎంపీ పదవికి 10 మంది రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి బుధవారం రాజీనామా సమరి్పంచారు. ఇటీవల జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఇకపై ఎమ్మెల్యేలుగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 12 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వం వదులుకుంటున్నారు. వీరికి సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. బుధవారం 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాకేశ్ సింగ్, ఉదయప్రతాప్ సింగ్, రితీ పాఠక్, రాజస్తాన్‌కు చెందిన కిరోడీలాల్ మీనా, దియా కుమారి, రాజవర్దన్ సింగ్ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోమతిసాయి, అరుణ్ సావో రాజీనామా సమరి్పంచారు. వీరిలో కిరోడీలాల్ మీనా ఒక్కరే రాజ్యసభ సభ్యుడు. మిగిలినవారంతా లోక్‌సభ సభ్యులు. మరో కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌తోపాటు ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి అతి త్వరలో రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకోనున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రులను బీజేపీ అధిష్టానం ఇంకా నియమించలేదు. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వచ్చిన వారిలో కొందరికి ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించబోతున్నానని తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలో మూడు మంత్రి పదవులు ఖాళీ అవుతున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే ఈ మూడు పదవులను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరేలా ఈ భర్తీ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. -
Lok Sabha: పది మంది బీజేపీ ఎంపీల రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు భారీగా రాజీనామాలు సమర్పించారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల (రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలువురు ఎంపీలను బీజేపీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 10 మంది బీజేపీ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బ్లీర్లాను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. అందులో.. మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. అదేవిధంగా.. రాజస్థాన్ నుంచి రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా, దియా కుమారి, చత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్‌పూర్ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన బీజేపీ నేత ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత తాను లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అదే విధంగా త్వరలో కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. -
బీజేపీ ఎంపీలకు షాక్.. కాంగ్రెస్ ఎంపీలకు జై
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంది. ఓ వైపు అసెంబ్లీలో బీజేపీ స్థానాలు 3 నుంచి రెట్టింపయి 8కి పెరిగే దిశగా ఉండగా మరోవైపు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ హవా నడిచిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలవడం గమనార్హం. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.కోరుట్లలో ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మీద, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ చేతిలో ఓడిపోయారు. ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి గెలుపొందడం విశేషం. బీజేపీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలవడం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, దుబ్బాక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై గెలుపొందారు. -
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు
-
ఎంపీపై దాడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ అన్ని జిల్లా అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిత భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని సర్కులర్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు పై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు కూడా భద్రత పెంచాలని విపక్ష పార్టీల పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. విపక్ష నేతల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్ -
Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఈ నెల 18-22 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా అందరూ హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపాలని తెలిపింది. ఈ పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో ప్రభుత్వం ప్రధానంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదం తెలిపేందుకు అందరు ఎంపీలు రావాలని విప్ జారీ చేసింది. BJP issues a line whip to all party MPs of Lok Sabha to be present in the house from 18th to 22nd September to discuss very important legislative business and support the government's stand. pic.twitter.com/lgtB98KrWb — ANI (@ANI) September 14, 2023 పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో భాగంగా ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మొదటి రోజు గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ ప్రయాణంపై చర్చించనున్నారు. అనంతరం రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల -
ఈసీని కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటలకు సీఈసీని కలవనున్నారు. ఓట్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు.. సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. వాటిలో దాదాపు 30 లక్షల దొంగ ఓటర్లను నాడే వైఎస్సార్సీపీ తొలగించి వేయించింది. 2019 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,98,34,776 కాగా, 2023 మార్చి 31 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,97,96,678. చంద్రబాబు హయాంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గినప్పటికీ, దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దొంగ ఓట్లను తొలగిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు తథ్యమని, హిందూపురంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి అన్నారు. చదవండి: బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు -
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. బయటకు ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లోక్‌సభలోనే ఉన్నా టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. మూజు వాణి ఓటుతో టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బీజేపీకి, విపక్షాలకు కోపం రాకుండా మౌన రాగం వినిపించింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు వాకౌట్ చేయగా, మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. మరో వైపు, ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి అప్రతిష్ఠపాలు చేయడానికి టీడీపీ ఎంపీలు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. చదవండి: ఇదే కదా చంద్రబాబు మార్క్ క్షుద్ర రాజకీయం అలాగే టీడీపీ ఎంపీలకు నిన్న(గురువారం)కూడా భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి ముగించారు. -
ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు
-
ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి ముగించారు. నిన్ననే కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర పాటిల్ టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకం చెల్లింపులు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నప్పుడు అవకతవకలకు ఆస్కారం లేదని కేంద్ర మంత్రి అన్నారు. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. చదవండి: అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు -
అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. అన్ని పనులకు జియో ట్యాగ్గింగ్, పనుల, కూలీల ఫోటోలు ఉంటాయని అధికారులు కూడా చెప్పడంతో టీడీపీ ఎంపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఒకపక్షం వాదనలు విని చర్యలు తీసుకోలేమని మంత్రి తేల్చిచెప్పేశారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి తదుపరి చర్యలు మంత్రి స్పష్టం చేశారు. దాంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలు , ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైబి రాజేంద్రప్రసాద్‌లకు ఏమి చేయలో పాలుపోక అలానే తిరుగుముఖం పట్టారు. చదవండి: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
సరిహద్దు ఎంపీలతో కొరాపుట్ ఎంపీలు భేటీ
కొరాపుట్: సరిహద్దు రాష్ట్రాల ఎంపీలతో ఉమ్మడి కొరాపుట్ జిల్లాల ఎంపీలు శుక్రవారం స్నేహ పూర్వకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకునిగా ఉన్నారు. కొరాపుట్ పార్లమెంటరీ స్థానానికి సరిహద్దుగా ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. అక్కడ కాంగ్రెస్‌కు చెందిన దీపక్ బైజ్ ఎంపీ కొనసాగుతున్నారు. దీపక్‌ను ఏఐసీసీ ఆ రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్షుడిగా అధిస్టానం నియమించింది. దీంతో ఢిల్లీలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క దంపతులను ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకొని, కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నవరంగ్‌పూర్ పార్లమెంట్ సభ్యుడు బీజేడీకి చెందిన రమేష్‌చంద్ర మాఝి తన పార్లమెంటరీ స్థానికి సరిహద్దులో ఉన్న ఖత్తీస్‌గఢ్ లోని మహసముంద్ ఎంపీ చునీలాల్ సాహు, బస్తర్ ఎంపీ దీపక్ బైజ్‌ను స్నేహ పూర్వకంగా కలుసుకున్నారు. -
నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్ స్టిక్’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్ భవన్ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు. హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య ఎన్డీయే పార్టీలు 1. బీజేపీ (394) 2. శివసేన (15) 3. నేషనలిస్టు పీపుల్స్ పార్టీ – మేఘాలయా(2) 4. నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(1) 5. సిక్కిం క్రాంతికారీ మోర్చా(1) 6. జననాయక్ జనతా పార్టీ 7. ఏఐఏడీఎంకే(5) 8. ఐఎంకేఎంకే 9. ఏజేఎస్‌యూ(1) 10. ఆర్పీఐ–అథవాలే(1) 11. మిజో నేషనల్ ఫ్రంట్(2) 12. తమిళ మానిల కాంగ్రెస్(1) 13. ఐటీఎఫ్‌టీ–త్రిపుర 14. బోడో పీపుల్స్ పార్టీ 15. పీఎంకే(1) 16. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 17. ఆప్నా దళ్(2) 18. అస్సాం గణపరిషత్ (1) నాన్–ఎన్డీయే పార్టీలు 1. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (31) 2. తెలుగుదేశం పార్టీ(4) 3. లోక్ జనశక్తి పార్టీ– రామ్ విలాస్ పాశ్వాన్(1) 4. బిజూ జనతాదళ్(21) 5. బీఎస్పీ(10) గైర్హాజరయ్యే పార్టీలు 1. కాంగ్రెస్ (81) 2. డీఎంకే (34) 3. శివసేన–యూబీటీ(7) 4. ఆమ్ ఆద్మీ పార్టీ (11) 5. సమాజ్‌వాదీ పార్టీ (6) 6. సీపీఐ (4) 7. జేఎంఎం (2) 8. కేరళ కాంగ్రెస్–మణి(2) 9. విడుదలై చిరుతైగళ్ కట్చీ(1) 10. రాష్ట్రీయ లోక్‌దళ్ (1) 11. తృణమూల్ కాంగ్రెస్ (35) 12. జేడీ–యూ (21) 13. ఎన్సీపీ (9) 14. సీపీఎం (8) 15. ఆర్జేడీ (6) 16. ఐయూఎంఎల్ (4) 17. నేషనల్ కాన్ఫరెన్స్ (3) 18. ఆర్ఎస్పీ (1) 19. ఎండీఎంకే (1) 20. ఎంఐఎం (2) -
Disqualification: చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై లోకసభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌కి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్లో ఆయన సభ్యత్వంపై వేటు పడింది. అయితే సూరత్ కోర్టు తాజా తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు 30 రోజుల గడువు ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా మళ్లీ రాహుల్ అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. అలా జైలు శిక్షపడి రాహుల్ గాంధీలా చట్ట సభ సభ్యుత్వాన్ని కోల్పోయిన నేతలు అనేకమంది ఉన్నారు. ఇలా గతంలో తమ సభ్యుత్వాన్ని కోల్పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిశీలిస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్: రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2013లో కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లోక్ సభకు అనర్హుడయ్యాడు. ఐతే చట్టసభ సభ్యులను అనర్హత నుంచి రక్షించే నిబంధనను 2013లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత లోక్‌సభ నుంచి మొదటి అనర్హత అతనిది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. జే జయలలిత: 2014లో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడిన మొదటి సీఎంగా నిలిచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. రషీద్ మసూద్: 2013లో, ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అర్హత కోల్పోయారు. ఆజం ఖాన్: అక్టోబర్ 2022లో, 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు యుపి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.ఆ తర్వాత ఆయన్నురాష్ట్ర అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించి..ఎన్నికల సంఘం (ఈసీ) రాంపూర్ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అబ్దుల్లా ఆజం ఖాన్: ఫిబ్రవరి 2023లో, ఆజం ఖాన్ కుమారుడు రాంపూర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి రెండవసారి అనర్హుడయ్యాడు, కోర్టు అతనికి రెండు రోజుల శిక్ష విధించిన తర్వాత మొరాదాబాద్‌లోని ఛజ్‌లెట్ ప్రాంతంలో రోడ్డుకు సంబంధించిన 15 ఏళ్ల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. అదీగాక అంతకుముందు వయసు సంబంధించిన సర్టిఫికేట్ ఫోర్జరీ కేసులో కూడా రాంపూర్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. దీంతో ఫిబ్రవరి 2020లో ఆయనపై మరోసారి అనర్హత వేటు పడింది. అనిల్ కుమార్ సాహ్ని: ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022 అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యారు. ఆయన కుర్హానీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. విక్రమ్ సింగ్ సైనీ: 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ అక్టోబర్ 2022 నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు అనర్హుడయ్యారు. సైనీ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రదీప్ చౌదరి: కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరిపై దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత జనవరి 2021లో హర్యానా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు పడింది. ఆయన కలక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కుల్దీప్ సింగ్ సెంగార్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన కారణంగా కులదీప్ సింగ్ సెంగార్ ఫిబ్రవరి 2020లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఉన్నావ్‌లోని బంగార్మౌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సెంగార్‌ను గతంలో బీజేపీ బహిష్కరించింది. అనంత్ సింగ్: ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన నివాసం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలడంతో జూలై 2022లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుత వేటు పడింది. సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదిలా ఉండగా..వాస్తవానికి సుప్రీం కోర్టు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీ చట్టం)లోని సెక్షన్ 8(4)ని కొట్టివేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి మూడు నెలల తర్వాత పార్లమెంట్ సభ్యుత్వం కోల్పోయి అనర్హత వేటు విధించడం జరుగుతుంది. అలాగే మూడు నెలల వ్యవధిలో సదరు వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. ఐతే ఆసక్తికరంగా 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం దోషులుగా ఉన్న చట్టసభ సభ్యులను సభ నుంచి తక్షణం అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీనే తన సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రికా సమావేశంలో ఆ ఆర్డినెన్స్‌ను చించివేయడం గమనార్హం. (చదవండి: బ్రిటీష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ఎక్కువ ప్రమాదకరం: ఢిల్లీ సీఎం) -
‘మాకొక వందే భారత్ కావలెను’
ఢిల్లీ: వందేభారత్ రైళ్లకు అక్కడ ఫుల్ గిరాకీ ఉంటోంది. ప్రయాణికులతో అనుకునేరు. మా రూట్లలో ఆ రైలు నడపండి మహాప్రభో అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు పలువురు ఎంపీలు. వాళ్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఉండడం గమనార్హం. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో.. భారత్‌లో సెమీ హైస్పీడ్ రైల్‌గా వందే భారత్ పేరొందింది. టికెట్ ధర ఎక్కువే అయినా.. ఫ్లైట్‌లో ఉండేలా అత్యాధునిక వసతులు, త్వరగతిన గమ్యస్థానానికి చేర్చుతుండడంతో వందే భారత్ రైళ్లను తమ నియోజకవర్గాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ ఎంపీలు.. కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి దాదాపు 60 మంది ఎంపీలు.. వందే భారత్ రైళ్లను తమ రూట్లలో నడపాలంటూ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్ 2.0 సూపర్ సక్సెస్ అయ్యింటూ లేఖలో పేర్కొన్నారు వాళ్లు. వీళ్లలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలతో పాటు విపక్షాల నుంచి 14 మంది ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రైల్వేస్‌కు విజ్ఞప్తి చేసినవాళ్లలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లు వివిధ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్-విశాఖపట్నం నడుమ వందే భారత్ రైలు నడుస్తోంది. -
పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్
-
పార్లమెంట్లో టీడీపీ ఎంపీల సెల్ఫ్ గోల్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యల అంశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నించి.. వాళ్లే ఇరుకున పడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు. రైతుల ఆత్మహత్యల విషయాన్నీ ప్రస్తావించి భంగపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల వల్ల 2019 నుంచి ఇప్పటిదాకా రైతుల ఆత్మహత్యలు 25% తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో ప్రకటించిందని లెక్కలతో సహా అసలు విషయాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆ సమాధానం ద్వారా స్పష్టం అయ్యింది కూడా. Self goal by TDP MPs in Parliament. They tried to raise the issue of increasing farmer suicides in AP and just got informed by the Agriculture Minister that the farmer suicide rates have actually come down by nearly 25% since 2019 due to various schemes of @ysjagan garu. pic.twitter.com/fO9zILeMHh — Vijayasai Reddy V (@VSReddy_MP) February 8, 2023 -
ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎన్.రెడ్డప్ప తెలిపారు. వారు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం( క్లోజ్డ్ చాప్టర్) కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ చాఫ్టర్ కాదు: ఎంపీ తలారి రంగయ్య అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ చాఫ్టర్ కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ అది క్లోజ్డ్ చాప్టర్ కాదు.. వాళ్లు ఎన్నిసార్లు హోదా ఇవ్వలేము చెప్పినా మేం అన్నిసార్లు ఇవ్వమని అడుగుతూనే ఉంటాం. విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అంశాలపై కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతాం. అయితే ఇవాళ దానిపై చర్చ ఉన్నా సభ వాయిదా పడటంతో కుదరలేదు. అవకాశం రాగానే మిగతా పార్టీల మద్దుతు కూడగట్టుకుని ఓటింగ్ కి వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే..: సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఏపీ విభజన సందర్భంగా.. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చని పరిస్థితి ఉంది. బడ్జెట్లో మా లాంటి చిన్న రాష్ట్రాలకు చేయూత ఇస్తారని ఆశించాం. ప్రత్యేక హోదా కోరిక నెరవేర్చకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడం వంటివి బాధపెట్టాయి. దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లకు కలిపి రూ.6700 కోట్లు ఇచ్చారు. అమరావతిలోని ఎయిమ్స్ కొత్తగా పెట్టిన ఆస్పత్రి.. వచ్చే ఆ నిధులు ఎందుకూ సరిపోవు.. మరిన్ని నిధులు ఇస్తేగానీ అక్కడ అభివృద్ధి జరగదు. అరకొర నిధులతో ఇంకా కొనసాగిస్తున్నారంటే తీవ్రమైన అన్యాయాన్ని రాష్ట్రానికి చేసినట్లే పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలి. ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుందని ఎంపీ అన్నారు. ప్రత్యేక హోదా రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు: రెడ్డప్ప ఎంపీ ఎన్. రెడ్డప్ప మాట్లాడుతూ, బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపినందున ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది కానీ దేశవ్యాప్తంగా తనకు మనుగడ లేకుండా చేసుకుంది. అనేక సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లుగా మేం పార్లమెంటులో విన్నపాలు చేస్తూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి సుమారు 20 సార్లు ఢిల్లీ వచ్చి హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరారు. ఇంతకాలం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటాలు చేస్తూనే ఉన్నాం...స్పందన లేదు కాబట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. కచ్చితంగా పార్లమెంటులో మా గళాన్ని వినిపించి హోదాను సాధించుకుంటాం. రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబే... ప్రత్యేక హోదా, నిధులు రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు-మళ్లీ ఆయనే మమ్మల్ని తప్పు పడుతున్నారు. ఎంతో అనుభవం ఉందన్న చంద్రబాబు కనీసం కుప్పానికి మంచినీళ్లు కూడా తీసుకురాలేకపోయాడు. కుప్పంలో లోకేశ్‌కు కనీసం వెయ్యి మంది కూడా రావడం లేదు..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయ్యింది లోకేష్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీఎం జగన్ ప్రభంజనం ఉంటుందని రెడ్డప్ప అన్నారు. చదవండి: థ్యాంక్యూ సీఎం జగన్ సార్.. మా కల నెరవేరుస్తున్నారు’ -
Union Budget: కేంద్ర బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎంపీలు ఏమన్నారంటే?
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం హామీల విషయంలో నిరాశ కలిగించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మిథున్‌రెడ్డి స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగిందన్నారు. రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావవించలేదన్నారు. విభజన హామీలపై పార్లమెంటులో లేవనెత్తుతామన్నారు. నిధులు కేటాయింపు ఏదీ: మోపిదేవి ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, ‘‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీని అనేక సార్లు సీఎం కోరారు. చంద్రబాబు స్వార్థంతో పోలవరం తాకట్టు పెట్టారు. ఫిషరీస్ సెక్టార్‌ను సీఎం అభివృద్ధి చేస్తున్నారు. ఆక్వా విషయంలో కేంద్రం ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 6 లక్షల మందికి సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తికి నిధులు కేటాయింపులు చేయాలి’’ అని మోపిదేవి కోరారు. చదవండి: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి స్పందన నిరాశ కలిగించింది: మార్గాని భరత్ ‘‘ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. వీటి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి. పోలవరం నిధులు మెన్షన్ చేయలేదు. ఈ బడ్జెట్ నుంచి ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని’’ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. -
ఎన్డీయేకు గుడ్‌బై చెప్పే యోచనలో బిహార్ సీఎం నితీష్
-
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వైఎస్సార్సీపీ మహిళా ఎంపీలు
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. అంతకుముందు ఆయన నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన వారిలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఉన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, నందిగామ సురేష్ సహా పలువురు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. చదవండి: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న సీఎం జగన్ -
సీఎం జగన్ కు రాఖీలు కట్టిన ఎంపీలు
-
‘క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు ఎలాంటి మినహాయింపు ఉండదు’
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. ‘పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవు.’అని స్పష్టం చేశారు వెంకయ్య. పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను వెల్లడించారు రాజ్యసభ ఛైర్మన్. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ ప్రక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు. ఇదీ చదవండి: Mallikarjun Kharge: ఈడీ విచారణకు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్! -
ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో ధరలు రెండు రెట్లు పెరిగాయి. దిగుమతులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. జీడీపీ తొమ్మిది నుంచి ఏడు శాతానికి పడిపోయింది. చమురు దిగుమతి వల్ల ఎకానమీపై భారం పెరిగింది. అందుకే.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో సోలార్ ఎనర్జీ విషయంలో కేంద్ర తీరు సరికాదు. నదుల అనుసంధానంతో కరెంట్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల పామాయిల్ రెట్లు పెరిగాయి. కానీ వాటి ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతిపై జీఎస్టీ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలని ఎంపీ మార్గాని భరత్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఆదుకోవడం లేదు ధరల పెరుగుదలపై కేంద్రం కారణాలు మాత్రమే చెప్తోందని.. ఎవరిని ఆదుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత తెలిపారు. ప్రజలు కూడా అదే సమస్యలతో బాధపడుతున్నారు. ధరల పెరుగుదలతో తీవ్ర కష్టాలపాలు అవుతున్నారు. మానవతా దృక్పథంతో ప్రజలను ప్రధాని ఆదుకోవాలి. ప్యాకేజీ ఫుడ్ పై జీఎస్టీ వేయడం దారుణం. కష్టాలు ఉన్నా.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేం గడప గడప కార్యక్రమం కింద ప్రజల వద్దకు వెళితే.. ధరల తగ్గించేలా పార్లమెంట్లో మాట్లాడాలని అడుగుతున్నారు అని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. -
పార్లమెంటులో ఎంపీలు తినే ఆహారంలో బొద్దింకలు.. పాకిస్థాన్‌లో దుస్థితి
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా దేశ పార్లమెంటు భవనంలో ఎంపీలు తినే ఆహారంలోనే బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీలు.. రెండు క్యాంటిన్ల నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఇస్లామాబాద్ జిల్లా అధికారులు పార్లమెంటు హౌస్‌లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. మేనేజ్మెంట్ అస్సలు పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు. కిచెన్‌లో ఆహారం పక్కన బొద్దింకలు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే రెండు క్యాంటిన్లను సీజ్ చేశారు. ఈ రెండు క్యాంటిన్లలో నిర్వహణ బాగాలేదని, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఎంపీలు ఆరోపించారు. భోజనం కూడా రుచిగా లేదని ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అందుకే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడమే మానేసినట్లు పేర్కొన్నారు. పాక్ ఎంపీల ఆహారంలో బొద్దింకలు రావడం ఇది కొత్తేం కాదు. 2014లో సాస్ బాటిల్లోనూ బొద్దింకను చూసి ఓ ఎంపీ షాక్ అయ్యారు. అలాగే 2019లో ఇక్కడి క్యాంటిన్లలో ఆహారం బాగాలేదని, పరిశుభ్రత అసలు లేదని స్వయంగా ఎంపీలే నిరసనలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన దుస్థితి తలెత్తింది. చదవండి: Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..? -
శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారు?: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో పోలికలెందుకు? కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని వైఎస్సార్సీపీ ఎంపీల హితవు పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గురజాడ హాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్.రెడ్డప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? ఆర్థిక క్రమశిక్షణ కేంద్రానికీ అవసరమే కదా? అంటూ ప్రశ్నించారు. చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువ. శ్రీలంక జీడీపీ కన్నా, రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ. వాణిజ్య ఎగుమతుల్లోనూ చాలా ముందున్నాం. ఏటేటా వాణిజ్య ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయి సద్వినియోగమవుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా పంపిణీ అవుతుందన్నారు. మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్లు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యయం చేయలేదు. అనుత్పాదక రంగాల్లోనే ఆ ప్రభుత్వం నిధుల వ్యయం. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గుర్తు చేశారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దు’’ అని ఎంపీలు స్పష్టీకరించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే..: శ్రీలంకతో పోల్చడం సరికాదు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. మనది ఒక రాష్టం. శ్రీలంక ఒక దేశం. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయి. అందువల్ల ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చలేం. అక్కడి పరిస్థితులు పూర్తిగా వేరు. ఉదాహరణకు కొన్ని అంశాలు చూస్తే.. గణనీయంగా వాణిజ్య ఎగుమతులు: శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో చూస్తే తగ్గాయి. అదే సమయంలో రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు 2019-20లో 19 బిలియన్ డాలర్లు కాగా, ఆ తర్వాత ఏడాది 2020-21లో అవి 13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2021-22లో 14 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2019-20లో ఇక్కడి నుంచి వాణిజ్య ఎగుమతుల మొత్తం 11 బిలియన్ డాలర్లు కాగా, అవి 2020-21లో 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత ఏడాది 2021-22లో వాణిజ్య ఎగుమతుల మొత్తం ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు 14 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇక దేశ పరిస్థితి చూస్తే 2019-20లో 535 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా, 2020–21లో 500 బిలియన్ డాలర్లు, 2021–22లో దాదాపు 600 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరిగాయి. మన జీఎస్డీపీ బాగా మెరుగు: అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నది వాస్తవం. రాష్ట్ర జీఎస్డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్డీపీ చాలా బాగుంది. శ్రీలంక జీడీపీ 81 బిలియన్ డాలర్లు కాగా, మన జీఎస్డీపీ 160 బిలియన్ డాలర్లు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. కేంద్రం అప్పులు ఎక్కువ: అప్పుల్లో కూడా మన రాష్ట్రానికి, శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదు. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువ. జీడీపీలో అప్పులు (డెట్ టు జీడీపీ) శ్రీలంకలో 101 శాతం ఉంటే, మన రాష్ట్రంలో చూస్తే అది 32.4 శాతం మాత్రమే. అదే కేంద్రంలో చూస్తే.. డెట్ టు జీడీపీ 59 శాతంగా ఉంది. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది?. ఇవాళ కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిది. అందుకే ఇంకా ప్రజలను మభ్య పెట్టొద్దు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. వాస్తవం ఇలా ఉంది కాబట్టే కేంద్ర మంత్రి వ్యాఖ్యలను మిగతా రాష్ట్రాలు కూడా ఖండించాయి. ప్రతి రూపాయికి లెక్క ఉంది: రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అది జరిగింది. అదే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి అనుత్పాదక రంగాలపై ఖర్చు చేసింది. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలను అనేక పథకాల ద్వారా ఆదుకున్నాం. నగదు బదిలీ ద్వారా వారు నిలదొక్కకోగలిగారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఒక్కో కుటుంబానికి కనీసం లక్ష నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు అందింది. అభివృద్ధి -సంక్షేమం: ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోంది. ఇంక నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఆ విధంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. విపక్షం ఇకనైనా విమర్శలు విడనాడాలి పోలవరం బాధ్యత కేంద్రానిదే: పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకే ఆ ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అయితే నిర్మాణ బాధ్యతను గత ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇప్పుడు కూడా నిర్మాణం పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్లానింగ్, డిజైన్ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివే. -
థాక్రేకు మరో షాక్.. షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఉద్ధవ్ థాక్రేను కాదని పలువురు శివసేన ఎంపీలు సైతం రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పది మందికిపైగా శివసేన ఎంపీలు ఎక్నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారు లోక్‌సభలో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీ పెద్దలతో ఎక్నాథ్ షిండే చర్చలు చేపట్టిన క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీకర్‌కు లేఖ.. ముంబయి సౌత్ సెంట్రల్ ఎంపీ రాహుల్ షేవాలే నేతృత్వంలో ప్రత్యేక శివసేన బృందం ఏర్పాటు చేయాలంటూ సోమవారం రాత్రి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు పలువురు ఎంపీలు. ఆ బృందం చీఫ్ విఫ్‌ను సైతం నియమించింది. ఆ బాధ్యతలను యావత్మాల్ ఎంపీ భవన గావ్లీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమెను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించారు ఉద్ధవ్ థాక్రే. అయితే.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్నాథ్ షిండేతో సోమవారం వర్చువల్ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. గత వారం పార్టీ ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్ థాక్రే.. తమ భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు తెంచుకుని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మూకు మద్దతు ప్రకటించారు. దీంతో థాక్రేపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. థాక్రే బంధీఅయ్యారని, ఆయనకు ఎంపీల డిమాండ్‌ను అంగీకరించటం తప్ప ఎలాంటి అవకాశం లేదని ఆరోపించాయి. మరోవైపు.. పలు కేసులపై సుప్రీం కోర్టు తీర్పు కోసం ఇరు వర్గాలు వేచి ఉన్నాయి. ఇదీ చదవండి: Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్.. ‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్ -
CM KCR: తెగించి కొట్లాడండి
సాక్షి, హైదరాబాద్: తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉందని, కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపట్ల అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిపై పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసన గళం వినిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించకుండా కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు కలుపుకుని మొత్తం 16 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్లలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని ప్రశ్నించాలన్నారు. కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని కేంద్రాన్ని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. కేంద్రంపై పోరుకు పార్లమెంటు సరైన వేదిక.. ‘కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో అన్ని రంగాల్లో దేశాభివృద్ధి నిలిచిపోతున్నందున పార్లమెంటు ఉభయ సభలను తెలంగాణ ఎంపీలు పోరాట వేదికగా ఉపయోగించుకోవాలి. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలకు పాల్పడుతూ నిబంధనల పేరిట ఆర్థిక అణచివేతకు పాల్పడుతోంది. 8 ఏళ్లుగా తెలంగాణ క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తుండటంతో ఆర్బీఐ బిడ్ల వేలంలో తెలంగాణ బిడ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దేశంలో 22 రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులను కలిగి ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో ఆ పార్టీ వివరణ ఇవ్వాలి. కేంద్రం, రాష్ట్రాల నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కుట్రపూరిత చర్య. బీజేపీ అనుసరిస్తున్న దిగజారుడు, చవకబారు రాజకీయాలకు ఇది నిదర్శనం’అని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్బీఎంపై మాటమార్చిన కేంద్రం ‘ఏటా కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని ప్రకటించిన తర్వాతే రాష్ట్రాలు బడ్జెట్లు రూపొందించుకుంటాయి. తెలంగాణ ఎఫ్ఆర్బీఎంను రూ. 53 వేల కోట్లుగా ప్రకటించి రూ. 23 వేల కోట్లకు కుదించడం కుట్రపూరితం. ఈ తరహా బీజేపీ దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలను నిలదీసి, వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు అన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులను పార్టీ ఎంపీలు అనుసరించాలి. విద్యుత్ సంస్కరణల పేరిట కావాల్సిన వారి కోసం రాష్ట్రాలపై ఒత్తిడి తేవడాన్ని నిలదీయాలి. నీతి ఆయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేయడాన్ని ప్రశ్నించాలి. తెలంగాణ సహా కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే దేశ జీడీపీకి దోహదం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన నిధుల లెక్కలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేస్తాయి’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా.. పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలసి వచ్చే విపక్ష పార్టీల అధినేతలు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజావ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలని ఎంపీలను ఆదేశించారు. ఎఫ్ఆర్బీఎం విషయంలో కేంద్రం ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ బొగ్గు దిగుమతులు, కేంద్ర ప్రభుత్వ అప్పులపై నిలదీయాలన్నారు. ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ పథకం అమలుపై కుట్రలు, పాతాళంలోకి దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ మూకస్వామ్యంపై నిరసన గళం వినిపించి ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలను సీఎం ఎంపీలకు గుర్తుచేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నారు. -
రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా..
సాక్షి, అమరావతి: భారతదేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నిక అంటే ఓటింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉండడంతో పాటు పార్లమెంటు సభ్యులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉండడం గమనార్హం. పైగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకునే రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్నందున అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో 151 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, 23 మంది టీడీపీకి చెందినవారు కాగా, ఒకరు జనసేనకు చెందిన వారు. ఇక ఎంపీల విషయానికొస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీకి చెందిన ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైస్సార్సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. దేశాధ్యక్షుడి ఎన్నిక ఇతర సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఉంటుంది. ఒక ఎంపీ ఓటు విలువను మొత్తం ఎన్నికైన రాష్ట్ర ఎమ్మెల్యేలు/ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఏపీలో 36 మంది ఎంపీలు (లోక్‌సభ+రాజ్యసభ) ఉండగా వారి మొత్తం ఓటు విలువ 25,488గా ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్జ జనాభా/మొత్తం ఎమ్మెల్యేలు 1000గా (జనాభాను 1971 లెక్కల ప్రాతిపదికగా తీసుకున్నారు) లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా ఉంది. అంటే రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 53,313గా ఉంది. ఇక జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీని రద్దుచేయడంతో ఆ మేరకు ఎంపీ ఓటు విలువ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 708 నుంచి 700కు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పాత్ర వైఎస్సార్సీపీదే.. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్సీపీ 45,957 ఓటు విలువ పంచుకోనుంది. -
రాజ్యసభలో 72మంది సభ్యుల పదవీకాలం పూర్తి
-
అనుభవాన్ని అందరికీ పంచండి!
న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. -
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం (నరేగా) కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పని దినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు పి.వి. మిధున్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీల బృందం మంత్రితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించింది. అపరిష్కృతంగా ఉన్న అంశాలను విజయసాయిరెడ్డి మంత్రికి స్వయంగా వివరించారు. చదవండి: AP: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స బడ్జెట్లో గణనీయంగా తగ్గిన ఉపాధి నిధులు ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులను క్రమేపీ తగ్గించడం పట్ల శ్రీ విజయసాయి రెడ్డి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. 2020-21 బడ్జెట్లో 1 లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకు కేటాయిస్తే 2021-22 బడ్జెట్లో అది 98 వేల కోట్లకు కుదించారు. 2022-23 బడ్జెట్లో ఉపాధి నిధులు 73 వేల కోట్ల రూపాయలకు కుదించారు. ఈ మొత్తంలో పెండింగ్ బకాయిలు 18,350 కోట్ల రూపాయలు తీసేసే మిగిలింది కేవలం 54,650 కోట్ల రూపాయలే...అంటే 2021-22 బడ్జెట్‌తో పోల్చుకుంటే నరేగాకు నిధుల కేటాయింపు 50 శాతానికి కంటే తగ్గిపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 2021-22లో 23.68 కోట్ల పని దినాలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పని దినాలను కల్పించినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు. 26 కోట్ల పనిదినాలు అడిగితే 14 కోట్లే ఇచ్చారు.. ఉపాధి హామీ పని దినాల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో 26 కోట్ల పనిదినాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం కేవలం 14 కోట్ల పని దినాలే కేటాయించారని విజయసాయి రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే 9.68 కోట్ల పని దినాలు తగ్గిపోయాయని అన్నారు. ఇది గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు ఒక కోటి మంది పేదలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 26 కోట్ల పని దినాలు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. 2,828 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయండి.. ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ కాస్ట్, అడ్మిన్ కాస్ట్ కింద రెండో విడత విడుదల చేయవలసిన 2,888.64 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసి రాష్ట్రంలో ఈ పథకం నిరాటంకంగా అమలు చేయడానికి సహకరించాలని కోరారు. కాఫీ తోటల పనులను నరేగా కింద చేర్చండి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 -10 నుంచి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కాఫీ తోటల పెంపకంలో భాగంగా నరేగా కింద వేతనానికి సంబంధించిన గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వంటి పనులు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చులను ఐటీడీఏ, కాఫీ బోర్డు భరిస్తున్నాయి. అయితే నరేగా పనులు కాఫీ తోటల పెంపకంలో నిమగ్నమయ్యే రైతులకు వర్తించవంటూ 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీ రైతులకు వేతనాల చెల్లింపును ఉపసంహరించడం వలన అరకు కాఫీ సాగు కష్టసాధ్యంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాఫీని ప్రభుత్వం వాణిజ్య పంటగా మాత్రమే గుర్తించి నరేగా కింద దానిని పరిగణించడానికి నిరాకరిస్తోంది. కాఫీ తోటలు విరివిగా ఉండే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ సాగు వాణిజ్య పంటగా ఎస్టేట్లలో సాగవుతుంది. కానీ గిరిజన ప్రాంతమైన పాడేరు వంటి ప్రాంతాల్లో కాఫీ సాగు కేవలం గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పనులను నరేగా కింద పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన సాగును అనుమతించాలి కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం రైతులను వారికున్న భూముల విస్తీర్ణాన్ని బట్టి పెద్ద రైతులుగా వర్గీకరించడం జరిగింది. వాస్తవానికి నిరంతర కరవు పరిస్థితులు, నీటి కొరత ఎద్దడి కారణంగా ఆర్థికంగా వెనుకబడిన వారే. సాగు నీరు కొరత, కరువు కారణంగా వారి వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోయాయి. అందువలన కరువు పీడిత ప్రాంతాల్లో భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా 5 ఎకరాలు సాగుకు వీలైన భూమి కలిగి ఉన్న రైతులు నరేగా కింద ఉద్యాన పంటలు సాగు చేసుకోడానికి అనుమతించాలని కోరుతున్నామని చెప్పారు. శ్మశానవాటికల్లో ప్రహరీ నిర్మాణాన్ని నరేగా కింద చేర్చాలి... గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన విపరీతమైన నిర్లక్ష్యానికి గురవుతున్న వాటిలో శ్మశానవాటికలు. శ్మశానాలే అయినప్పటికీ ఈ ప్రదేశాలు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటాయి. పశువులు, పందులు ఇతర జంతువులు యధేచ్ఛగా శ్మశానాల్లో సంచరిస్తున్నందు వలన అవి ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రంగా, అపవిత్రంగా మారుస్తుంటాయి. శ్మశానాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే ఆయా జంతువుల ప్రవేశాన్ని అరికట్టాలి. అందుకోసం వాటి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించాల్సిన తక్షణ అవసరం ఉంది. ప్రహరీ గోడల నిర్మాణం వలన శ్మశాన భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించవచ్చు. కాబట్టి శ్మశానాల్లో ప్రహరీ గోడ నిర్మాణాన్ని నరేగా కింద అనుమతించాలని కోరారు. పీఎంఏవై(జీ) కింద 90 రోజులు పని దినాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడేళ్ళలో 30 లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి అవాస్ యోజన (గ్రామీణ) కింద లబ్ధిదారులు తమ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా 90 రోజుల పనిదినాలు పొందడానికి అర్హులు. నరేగా కింద పొందే 100 రోజుల పని హామీకి అదనంగా లబ్ధిదారులకు 90 రోజులు పని దినాలను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. పీఎంఏవై (జీ) కింద కేంద్ర సాయం పెంచాలి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ఇచ్చే ఆర్థిక సహాయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం, ముడి సరుకుల ధరలు, రవాణా, లేబర్ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నిరుపేద లభ్దిదారులు ఇళ్ళు కట్టుకోవడం సవాలుగా మారింది. అందరికీ ఇళ్ళు అనేది నెరవేరని కలగా మారే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇంటికి ఇంతని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు డ్రిప్, స్ప్రింక్లర్లు కేటాయించాలి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తరచుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటూ కరువు బారిన పడుతుంటాయి. ఈ కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాబట్టి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద ఈ రెండు ప్రాంతాలకు చెందిన ఏడు జిల్లాలకు డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్‌ను కేటాయించి ఆయా జిల్లాల్లో సాగు నీటిని సమర్ధవంతంగా వినియోగించేందుకు సహకరించవలసిందిగా మంత్రిని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందంలో మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్ర శేఖర్, తలారి రంగయ్య, ఆదాల ప్రభాకర రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వైఎస్ అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ ఉన్నారు. -
ప్రధాని మోదీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి ఎంపీలు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
టీడీపీకి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్
సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడే స్థాయి టీడీపీ ఎంపీలకు లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్గాని భరత్ మాట్లాడుతూ, సీఎంపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. చదవండి: సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్‌లోనూ ఏపీ తరహా పథకం.. ‘‘నవరత్నాల పథకాలతో ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలను టీడీపీ ఓర్చుకోలేకపోతోంది. టీడీపీది నవరంధ్రాల నవ రోదనలు. లక్షా 75 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశాం. వాడవాడలా బెల్టు షాపులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని’’ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోరుకోవడం లేదా?. ముఖ్యమంత్రిపై దుర్బాషలాడడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని.. సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు పక్కనపెట్టారు: ఎంపీ గోరంట్ల మాధవ్ గత ఎన్నికలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్ట పోయిందని.. ముగ్గురు టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. చచ్చిన పార్టీని బతికించుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలను మాతో కలిసి రమ్మంటే రాలేదు. ఓటుకు నోటు కేసులో పరారై విజయవాడకు వెళ్లిపోయారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన నీచుడు చంద్రబాబు అని గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. టీడీపీ ఎంపీలు ఏనాడూ కేంద్రంతో పోరాడలేదు: ఎంపీ బెల్లాన టీడీపీ ఎంపీలు ఏనాడూ కేంద్రంతో పోరాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయలేదని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మండిపడ్డారు. విశాఖ పాలన రాజధానిగా వస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని చంద్రశేఖర్ అన్నారు. -
ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలి: మోపిదేవి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి.. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.1509 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దశలవారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.