సాక్షి, న్యూఢిల్లీ/కాజీపేట రూరల్: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు లభించింది. టెక్స్‌టైల్స్ శాఖ కమిటీలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీలో మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం కల్పిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలు గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్‌గా ఆ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ వ్యవహరించనుండగా, సభ్యునిగా చామలకు అవకాశం దక్కింది.
ఈ కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటు ఎనిమిది మంది లోక్‌సభ, నలుగురు రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి.. మొత్తం 14 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ సంప్రదింపుల కమిటీలో ఎంపీలు మల్లు రవి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్యలకు చోటు దక్కింది. కమిటీకి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏడుగురు చొప్పున 14 మంది, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 16 మంది సభ్యులతో ఈ కమిటీ పని చేయ నున్నట్లు ఆయా మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు కృషి
సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం దక్షిణ మ«ధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.జైన్‌తో తెలంగాణ, కర్ణాటక ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment